Sunday, 30 July 2017

रामायनम


रामायनम 
1వ దినము, బాలకాండ
వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు.

మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడుచెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులనిచూశారు.అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆమగపక్షిచుట్టూఆడపక్షిఏడుస్తూతిరుగుతుంది.



అయ్యప్ప 18 నమస్కార శ్లోకాలు

Om sri ram

అయ్యప్ప 18 నమస్కార శ్లోకాలు 

1. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం !!
 
ఓం స్వామియే శరణమయ్యప్ప
 
2. విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభు ప్రియం సుతం
క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం !!
 
3. మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం !!
 
4. అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం !!
 
5. పాండ్యేశవంశ తిలకం భారతేకేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం !!
 
6. పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !!
 
7. త్రియంబక పూరాదీశం గణాధిప సమన్వితం
 గజారూడ మహం వందే శాస్తరం కుల దైవతం
 
8. యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః
త్వం శాస్తార మహం వందే మహావైద్యం దయానిధిం !!
 
9. అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!
 
10. చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!
 
11. వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!
 
12. కింకిణోద్యాన భూతేశం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం
 
13. భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం !!
 
14. శ్రీహరిశ పుత్రం దేవం శ్రీహరి శంకరాత్మజం
శబరీ గిర్రిశ్వరం దేవం నమామి భూతనాయకం
 
15. జగత్ ప్రియం జగన్నాథం జగదానంద దాయకం
జగదీశం కృపా పూర్ణం నమామి భూతనాయకం
 
16. భూతేశం తారక బ్రహ్మం గిరీశం గిరిజాత్మజం 
పరమేశాత్మజం దేవం నమామి పాపనాశనం
 
17. జనార్ధన సుతం దేవం వాసవేశం మనోహరం
వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం
 
18. పాలనేత్ర సుతం దేవం కలిదోష నివారణం
బాలరూపం లోకనాధం నమామి శభరీశ్వరం
 
ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వ భూత దయాపర
రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచా స్తోత్రం

Om Sri Ram

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచా స్తోత్రం
-----------------------------------------
నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ
సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు
య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
శ్రీ వేంకటేశ్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ||

Mangala Gowri Vratam



మంగళ గౌరీవ్రతము-Mangala Gowri Vratam

మంగళ గౌరీవ్రతము

మంగళ గౌరీవ్రతము

శ్రావణమాసం అనగానే వివాహితలకు చెప్పలేని హడావుడి. అందులో కొత్తగా పెళ్లైన ఆడవారికి మరీను! ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమే గానీ, మంగళ, శుక్రవారాలంటే మరింత పవిత్రమని భావిస్తారు. జగన్మాతలైన ఉమ, రమలిద్దరికీ ఇష్టకరమైనదీ మాసం. కాబట్టి వారి పతులైన శివకేశవులకు కూడా ప్రీతికరమైనదే. అందులో విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే ఆది కేశవునికి మరీ ఇష్టం. అందుకే ఈ మాసం వైష్ణవాలయాలు విశేషమైన పూజలతో అలరారుతుంటాయి. ఈ మాసమంతా శివకేశవులిద్దరికీ అభిషేకం జరిపిస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. అంతేకాదు, గ్రహపీడల నుంచీ కూడా ఉపశమనం కలుగుతుంది. సర్వసంపదలకు లక్ష్మీదేవి ఆవాసమైతే, ఐదోతనానికీ, సౌభాగ్యానికి ఆవాసం పార్వతీదేవి. ఈ ఇద్దరి కరుణాకటాక్షాలు సమృద్ధ్ధిగా తమ జీవితాలపై సుస్థిరంగా ఉండేలా చెయ్యమని వివాహితలందరూ ఆదిపరాశక్తులైన ఆ జగన్మాతలను భక్తిశ్రద్ధలతో పూజించే వారాలే పవిత్రమైన మంగళ, శుక్రవారాలు.

పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన. అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు.

పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా ... పసువు , కుంకుమ , పూలు , సగుంధాది మంళ ద్రవ్యాలలోను , ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది .

మొదట శౌనకాది మహర్షులకు మంగళగౌరీ మహాత్యాన్ని సూతులవారు వివరించారు .

నారదమహర్షి ఈ వ్రత మహత్యాన్ని సావిత్రీదేవికి ప్పదేశించారు ,

శ్రీకృష్ణుడు వ్రత విధాన్ని , వ్రత మహాత్యాన్ని ద్రౌపది కి వివరించాడు .

ఇక్కడ శ్రీ్కృ ష్ణులు వారు ద్రౌపది కి భోదించిం కదావిధానము ఈ విధం గా ఉన్నది .->

ఒకప్పుడు త్రిపురాసురుణ్ణి సంహరించే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించారు . అందువల్లనే విజయాన్ని అందుకోగలిగేరు .

మంగళ గౌరీని పూజించడము వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు .

మనువంశానికి చెందిన " మండు " డనే మహారాజు గౌరీదేవి వ్రతప్రభావము తో చాలాకాలము భూలోకం లో సర్వసంపదలతో రాజ్యము ఏలసాగేడు .

"ఓ ! ద్రపదీ ! గౌరీదేవిని పూజించి , వైధవ్యాన్ని తొలగించుకున్న ఓ అద్రుస్టవంతురాలైన యువతి కథ చెబుతాను విను " అంటూ శ్రీ కృష్ణులు వారు ఇలా చెప్పసాగేరు .

వ్రత కథ :

చాలాకాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు . భోగభాగ్యాలు ఎన్ని ఉంటే నేం ఆయనకు సంతానము కలుగలేదు . ఆ దంపతులకు అదే దిగులు .. ఎన్ని నోకులు నోచినా , ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము .. చివరికి పరమేస్వరునికి ఆ మహారాజు దంపతుల పై కరుణ కలిగినది ... పరమశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి " భవతీ భిక్షాందేహి " అనేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు . జయపాలుి భార్య పెం లో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు . ఇలా మూడు రోజులు జరిగింది . జరిగినదంతా భర్తకు వివరించింది . రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధం గా ఉండమని భర్ర్యతో చెప్పాడా రాజు .

మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భ్క్ష వేయబోవడం జరిగింది . ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక ... సంతానము లేని నీచేతిభిక్ష నేను స్వీకరించనని పలికేసరికి ... అయితే మహాత్మా ! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశైంచండి " అని వేడుకోగా .. ఆ సన్యాసి రూపము లో ఉన్న ఈశ్వరుడు " అమ్మా నేను చెప్పబోయేది నీ భర్త కు తెలియజేయి . నీల వస్త్రాలను ధరించి , నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి , ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను . అక్కడ అరణ్యం లో అతని నీలాశ్వం ఎక్కడ అలసట తో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను . ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది . ఆ స్వర్ణదేవాలయం లో ఉండె అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది ". అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు . ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు . స్వర్ణదేవాలయం లో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు . జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు . నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు .. అప్పుడు అమ్మవారు " వైధవ్యము గల కన్య కావలెనా? దీర్ఘాయుష్మంతుడు , సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు " . అప్పుడు రాజు పిత్రుదేవతల్ను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు . అప్పుడాదేవి ఆ రాజుని ' తన పార్శమున ఉన్న గణపతినాభియందడుగు వైచి , చెంతనే ఉన్న చూతవృక్షఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను . జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసేసరికి గణపతికి కోపము వచ్చింది . " ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని " శపిస్తాడు .

ఈ విందంబుగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది . ఆ కుర్రవాడికి వయసొచ్చింది . వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్త తో అన్నది . కాశీవిశ్వెశ్వరుడుని దర్శించి వచ్చాక వివాహము చేదాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామ తో కాశీకి పంపించారు . త్రోవలో వారు పతిస్టానపురం చేరారు . అక్కడ వారిద్దరూ ఓ సత్రం లోకి ప్రవేశించారు . అక్కడ కొందరు కన్యలు ఆడుకొంటున్నారు . వరిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను " ముండ , రండ " అంటూ కోపం తో దుర్భాషలాడింది . అప్పుడు సుశీల " మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది " కాబట్టి మాకుటుంబము లో ఎవరూ ముండలు , రండలు - ఉండరు అంది కోపం తో . జయపాలుడు కుమారుడు -శివుడు అంతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు . తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు . " మా ఇంట్లో ముండలు , రండలు ఎవరు ఉండరు . మా అమ్మ శ్రావణ మంగళ గౌరీవ్రతం చేస్తుంటుంది ." అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది . సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు . మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ..ధ్యానము లో ఉన్న సుశీల తల్లిదండ్రుల దగ్గరగా చేరి శివుడనే బాలుడు నీకూతురు కి తగిన భర్త అని దేవుని వాక్యము గా చాటుగా అంటాడు . దాంతో సుశీల .. శివుడు ల వివాహము జరిగిఫోతుంది .

పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు . మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలఓ కనబడి " నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రి తో ఆతని ఆయువు చెల్లింది . ఈ దోషము నకు మార్గము చెపుతాను విను " అని ఈవిధంగా చెప్పెను . " కొద్ది సేపట్లో ఒక కృష్న సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది . వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు ... అప్పుడ పాము ఆ ఘటం లోకి పవేశించాక వస్త్రము తో ఆకుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు ". దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది " అని అంతర్ధానమయ్యెను . శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తిచేసుకొని తిరుగు ప్రయాణములొ భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు . విషయము తెలుసుకొందామని శివుడు .. సుశీలను తన ఆయువు ఎలా? పెరిగినదని అడుగగ " అంతా శ్రావణ మంగళ గౌరీ్వ్రతం ప్రభావమని చెప్పినది . ఈ విదముగా శ్రికృష్నుడు ఈ కథను ద్రౌపది కి చెప్పెను .

పూజావిధానం : ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశంప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజగావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజ లో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా....ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తయిదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరు నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి, పూజార్ధం

పునరాగమ నాయచః అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి, మళ్లీ పూజకి మమ్మల్ని అను గ్రహించు అని అర్ధం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం 'మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు .

శ్రావణమాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా వరలక్ష్మీవ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది. సోమ, శుక్రవారం.. లక్ష్మేదేవికి ఇష్టమైన రోజులు. ఆ రోజుల్లో పొద్దున, సాయంత్రం దీపారాధన చేయడం దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి తిథులు లక్ష్మీపూజకు శ్రేష్టమైనవని

భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలోముఖ్యమయినవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రవణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి “అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప” మని అడగ్గా, శ్రీ కృష్ణుడు వెంటనే “మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు – అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?

శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.

మంగళగౌరీ వ్రత నియమాలు

తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.

వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.

వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.

వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును)

ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.

ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.

పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.

మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు :

పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.

మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం :

వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి.మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి.

పైన చెప్పినటువంటివే ప్రస్తుతం “మంగళగౌరీ” విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటో ని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.

మంగళగౌరీ వ్రత విధానం :

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)

విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః

ఋషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః

అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః

ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చ
...

Tuesday, 18 July 2017

నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం.....ఉజ్జ‌యిని

Om sri ram - sri maatrenama:

నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం.....ఉజ్జ‌యిని
మన దేశంలో ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం ఒకటుందని మీకు తెలుసా….?
అవును ….. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం .
ఆ ఆలయం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది.


హిందూ ధ‌ర్మంలో పాముల‌ను ఆరాధించే సంస్కృతి అనాదిగా వస్తోంది.
హిందూ ధ‌ర్మంలో స‌ర్పాల‌ను దేవ‌త‌ల ఆభ‌ర‌ణంగా భావిస్తారు.


మ‌న‌దేశంలో ఎన్నో నాగ దేవాల‌యాలున్నాయి.
అందులో ప్ర‌ముఖమైంది, ఇత‌ర ఆల‌యాల‌కంటే భిన్న‌మైంది ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం.
ఉజ్జ‌యినిలోని మ‌హాకాల్ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం కొలువై ఉంది.
ఈ కోవెల సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే అది కూడా శ్రావ‌ణ శుక్ల పంచ‌మి రోజు మాత్ర‌మే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్ర‌మే భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. ఆల‌యం తెరిచి ఉండే ఈ ఒక్క‌రోజున స‌ర్ప‌రాజుగా భావించే త‌క్ష‌కుడు ఆల‌యంలోనే ఉంటాడ‌ట‌. 


నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో 11 వ శతాబ్దానికి చెందిన అద్భుత‌మైన ప్ర‌తిమ ఉంది. ఇందులో ప‌డ‌గ విప్పి ఉండే పామునే ఆస‌నంగా చేసుకొని కూర్చొని ఉన్న శివ‌పార్వ‌తులుంటారు.¬ ఈ ప్ర‌తిమ‌ను నేపాల్ నుంచి తెప్పించార‌ని చెబుతుంటారు. ఉజ్జ‌యినిలో త‌ప్ప ఇలాంటి ప్ర‌తిమ ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా ఉండ‌ద‌ట‌.


సాధార‌ణంగా అయితే స‌ర్పంపైన విష్ణు భ‌గ‌వానుడు మాత్ర‌మే శ‌యనిస్తాడు. కానీ ప‌ర‌మ‌శివుడు శయ‌నించిన దాఖ‌లాలు ఎప్పుడూ విన‌లేదు. కానీ ప్ర‌పంచంలో మ‌ర‌కెక్క‌డా లేని విధంగా ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో భోళాశంకరుడు శ‌య‌నించి ఉండ‌డం విశేషం. ఈ ప్ర‌తిమ‌లో శివ‌పార్వ‌తుల‌తో పాటు వారి ముద్దుల త‌న‌యుడు వినాయ‌కుడు కూడా కొలువై ఉన్న అద్భుత దృశ్యం చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలోస‌ర్పంపైన ప‌ర‌మ‌శివుడు శయ‌నించి ఉండ‌డం వెన‌క ఒక క‌థ ప్ర‌చారంలో ఉంది. 


స‌ర్ప‌రాజు త‌క్ష‌కుడు ప‌ర‌మేశ్వ‌రుడి అనుగ్ర‌హం కోసం కఠోర‌మైన త‌పస్సు చేశాడ‌ట‌. ప్ర‌స‌న్న‌మైన శివుడు త‌క్ష‌కుడికి అమ‌ర‌త్వాన్ని ప్ర‌సాదించాడ‌ట‌. ఇక అప్పటి నుంచి త‌క్ష‌కుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడ‌ని చెబుతారు. నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యానికి శతాబ్దాల చ‌రిత్ర ఉంది. 


1050 లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయ‌న త‌ర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మ‌హ‌రాజ్ 1732 లో ఆల‌య జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టాడు. ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు స‌ర్‌యదోషాల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. అందుకే నాగ‌పంచ‌మి రోజు ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తుతారు. నాగ‌చంద్రేశ్వ‌రుడి ద‌ర్శించుకొని పునీతుల‌వుతారు. ఈ ఒక్క‌రోజే దాదాపు రెండు ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శించుకోవ‌డం విశేషం.