Saturday, 25 September 2021

 Oమధ్యాత్కర విషమ సీస పద్యము

 

 

కళలన్ని చూపేటి మనము

గథలన్ని చెప్పేటి జనము

మనసులో మోహమ్ము కణము

మమతలో మాయల్తొ మనము

ప్రేమించి పోందేటి వనము

సాయమ్ము చేసేదే నిజము

ఆనందం మోందేటి సుఖము

సంతోషం చిందేటి ఫలము


ఆటవెలది

మనము అనుకానుటయు మార్గమే అవ్వును

వనము వల్ల గాలి హాయి గొలుపు

జనము చేయు లీల జాతి నెంచియు నుండు

కణము కణము గలసి జన్మ జరుగు


((()))

[25/09, 10:12 am] విశాఖ: ఫలితం......!!!


చెట్లు నాటలేం చేతికి అందలేదని అదే చేత్తో నరికేస్తాం చేతికాడ్డుగా ఉందని మొక్కలు నాటుతం నీరు పొయ్యలేం నిరీన్కిపోయిందని మొదట్లోనే చంపేస్తాంనీరు కావాలంటే చెట్లే ఆధారం నీరు లేకపోతే జీవితం నిరాధారం పిల్లల్ని కంటాం పెంచి పెద్ద చేస్తాం చదివిస్తాం పెళ్లిళ్లు చేస్తాం

చేతికందిన కొడుకులు చూడలేదని నరకిపెట్టలేం నా సంతానం నేను నా కన్నబిడ్డలని ఫలితం కళ్ల ముందు పెరిగిన కన్న పిల్లలు ప్రాణంతో పెంచుకున్న కుటుంబంఎదుగుతున్న చెట్టు ఎండిపోయినా పట్టించుకోం పచ్చి వృక్షంలో ప్రాణం లేదనిపెరిగే చెట్టూ పెంచుకున్న సంసారం రెండింటికి సమతుల్య సమాధానంచెట్లు పెంచితే  నీడ నీరు రెండు జీవానాధారంఎదిగే కొడుకులు ఎదుగుతున్నకాపురం జాగ్రత్తగా కాపాడుకుంటే నీడ నీటి చుక్కలు రెండు జీవానాధారం నీడ నీరు నిండుగా ఉంటే నిత్యం పొందే సుఖం మంచి ఆరోగ్యంనాటిన మొక్కలునాటుకున్నాయంటే నాలుగు తరాల వరకు పొందే లాభంనాటిన కాపురాంలో అమ్మా నాన్న అనే రెండు స్థంబాలు నలుగురి జీవితంలో నడిపించే నాలుగు దిక్కులుచెట్టే కదా అనీ ఆలోచనతో అడ్డంగా నరికితే అమ్మా అనలేదు కాని చేసే శబ్దంలోనే ఆ పిలుపు ఉంటుంది మన పెద్దల ప్రాణం పోతూ  సృష్టించే శబ్దంలో పిలుపులు వినిపించే విషాదం వినిపిస్తుంది

ఫలితాలు రెండు జీవాలు ప్రాణంతో ఉన్నవే ఒకటి ఓదార్పుకు నోచుకుంటుంది ఇంకొకటి నెలకొరిగిపోతుంది......!!!


కొలచిన రామ జగన్నాధ్

25/09/2021

విశాఖపట్నం

8520005313.

[25/09, 11:39 am] సాహిత్యం (2): 🙏*"కర్మ   కర్మణా   నశ్యతి"* 


గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది... వెంటనే గంగానదినే అడిగాడట.


"అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు.  మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ... అని. 


అందుకా తల్లి  "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను"  అని బదులిచ్చిందట. 


వెంటనే, అయ్యో  అన్ని పుణ్యనదులు ఇంతేకదా... పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని... సముద్రాన్నే అడిగాడు...ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని... దానికా సముద్రుడు 


నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట. 


అరే ... ఎంతో తేలికగా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది... అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు... ఈ పాప భారాన్ని అని అడగగా... అవి పకపకా నవ్వి  'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'...అని బదులివ్వగా...


ఓహో...ఆ పాపాలన్నీ మన  మీద పడి లేదా తాగుతూ, మనమే అనుభవిస్తున్నామన్నమాట. 

కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట.


ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః 

ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే.


పరమశివుడు, పార్వతీదేవి కి ఉపదేశించిన శ్లోకమిది. 

ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు. 

ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?...అని ఈ శ్లోకం అర్థం.

🙏

కర్మ కర్మణా నశ్యతి.... అనగా,  కర్మ కర్మతోనే నశిస్తుంది.🌹

[25/09, 12:23 pm] రామానంద: 🕉️🕉️🕉️                  *🍀అమ్మతో మాట* 

(తప్పక చదువుతూ అనుభూతి పొందేదని అనిపించి forward చేయబడుతోంది) 


ఏంటమ్మా ఇది.. ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా! 

కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా! 

 “ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు. 

చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. 

పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి. అమ్మా! అవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా! 


ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు. 

అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే.. 

పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే.., 

అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా?  అన్నట్టు నీవైపు చూశాడు. 

“పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది. మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న *“స్వాధీనవల్లభ”* వు కదా! 


పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు *సదాశివ పతివ్రతవు*

*కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.* 


మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా! 

మీ  ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి. 

మరి *“మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా”* అని ఊరికే అన్నారా ఆ వసిన్యాది దేవతలు. 


నీ నవ్వులో ఉన్న మధురిమ ముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. *“నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ”* అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది.

 

*మా ఆది శంకరులు* కూడా *సౌందర్య లహరిలో *“విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ”* అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు. 

*సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ*, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట. 


ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా! 

 *“ఓ మహా కామేశ మహిషీ”* అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా! 

ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల *“అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా”* వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. *“మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా* ఉన్నావు. 


నువ్వసలే *“లాస్యప్రియ”వు* కూడానాయే. 

   ఎంతటి *“మహాలావణ్య శేవధి”వి*. *“ఆబ్రహ్మకీటజనని”వి* అయినా, 

నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, *“శివకామేశ్వరాంకస్థా”* అని అనిపించుకోవడమే ఇష్టం.  

 అందుకే మా కాళిదాసు 

*"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”* అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు. 

అసలు *మా కాళిదాసు నీపై వ్రాసిన *“దేవీ అశ్వధాటి”* స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు. 

సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.


*చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ* 

*కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా* 

*పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్* 


ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా? 

*ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి* ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు. 

*“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..”* అంటాడు. 

మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట. 

మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు. 

కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.


అమ్మా! అసలు మీ *అన్న దశావతారాలను* అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను. 

*“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః”* అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది. ఇక్కడే ఇంకొక్క విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో! *“సాగరమేఖలా”* అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో!  

*సముద్రాన్నే వడ్డాణంగా* పెట్టుకున్న దానివంటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట. 


ఈ నీ నామాన్నే 

*మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు* 

*“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..”* అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు. 

*“సాగర మేఖల చుట్టుకొని -  సురగంగ చీరగా మలచుకొని”* అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు. 

అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు. 


ముందుగా మాత్రం నేను *మా మల్లాది రామకృష్ణశాస్త్రి* గారినే చెబుతాను. 

*“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ*

*విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ*

*మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ*

*సుమరదన విధువదన.. దేవి…”* అంటూ ఆయన వ్రాస్తే, 

ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు. 

మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో 

*సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో*, 

*శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో, లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు *మా ఘంటశాల*. ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే.. 

   *“కావ్యాలాప వినోదిని”వి,* 

  *“రసజ్ఞ”వు.* *“కావ్యకాళా”* రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా! 

ఆయనే వ్రాసిన *“శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా”* పాట కూడా మరో మేలిమి ముత్యం! 

   *“జగముల చిరునగవుల పరిపాలించే జననీ*

    *అనయము మము కనికరమున కాపాడే జననీ”* అంటూ.. 

*“అనేకకోటిబ్రహ్మాండజనని”* వైన నిన్ను కీర్తిస్తూ.. 

*“మనసే నీ వశమై స్మరణే జీవనమై*

*మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి”* అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.


ఇక *సముద్రాలగారి* *“జననీ శివకామినీ..”*, *పింగళిగారి *“శివశంకరీ..”* పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.


మా *వేటూరి* గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు. 

*“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి*

 *పాలయమాం గౌరీ*  *పరిపాలయమాం గౌరీ”* అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.

*“శుభగాత్రి గిరిరాజపుత్రి*  

 *అభినేత్రి శర్వార్ధ గాత్రి* 

 *సర్వార్థ సంధాత్రి* 

 *జగదేక జనయిత్రి”* ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట. 

మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి *శర్వార్ధ గాత్రి* అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా!  అలానే *సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక *సర్వార్థ సంధాత్రి* అన్నారు. 


అసలు *శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య*. అదీ మరి మా వేటూరంటే! 

అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే. ఈరోజు  నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను.

 

అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం, శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను. 

వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా! 

ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ, మధ్య మధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను. 

మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు. 


కానీ నీ సంగతి అలా కాదు కదా! 

అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి. 

లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. *“సదా శివ కుటుంబిని”వి.* 

అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను.  *ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ..* 

          *స్వస్తి!*


చాలా బాగుంది కదా! 

*సద్గురు దేవదత్త*

🕉️🍁🍀🍁🍀🕉️

[25/09, 2:37 pm] Mallapragada Sridevi: *" భరతమాతముద్దులతనయుడు ,  "ప్రముఖ సినీనేపథ్యసుమధురగాయకుడు ,గానగంధర్వుడు , సంగీతదర్శకుడు , టెలివిజన్ వ్యాఖ్యాత , నటుడు , నిర్మాత , నవరసాలను తన గళములోఒలికించిన సుస్వరాలమాంత్రికుడు ,స్వరసామ్రాట్టు , అంతకు మించి తన మాటలతో, వినయ సౌశీల్యత తో, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే నానుడికి సజీవ తార్కాణం గా నిలిచి సుమారు నలభైవేలకుపైగా పాటలను ఆలపించి ;  డబ్బింగ్ కళాకారుడిగా అనేకమంది సినీకళాకారులకు గాత్రదానముచేసి ; "పాడుతాతీయగా" , "పాడాలనిఉంది" లాంటి వినూత్న సంగీతకార్యక్రమాలనునిర్వహించి ఎంతోమందిని నూతనగాయనీగాయకులుగాతీర్చిదిద్ది మనందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న పద్మవిభూషణ్ బిరుదాంచితులు మాన్యశ్రీ శ్రీపతిపండితారాధ్యులబాలసుబ్రహ్మణ్యం(ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం) గారి ప్రథమ వర్థంతి-అంజలినివాళులు"!🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

[25/09, 2:39 pm] Mallapragada Sridevi: స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:


పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే.


రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.


 నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే జీవితం.


అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.


మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.


30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది.


మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా..  అందులో తేడా ఏమీ వుండదు.


ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం.


మనం వుండే ఇల్లు మూడొందల  గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే.

నీలోని మనిషికి సంతోషం.. నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు.


నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.


అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం.


జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి:

1. మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా మరియు ఆరోగ్యాంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.

2. ఆహారమే ఔషధం. ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.

3. వంద కారణాలు చూపినా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.

4. మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది.

5. వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే.. కలిసి వెళ్లు.


చివరగా, వీటిని గుర్తుంచుకో:

వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం !


నీ జీవితంలోని ప్రతి మలుపులో వీటిని గుర్తుంచుకో !! 


ఇది అనుభవ పూర్వకంగా తెలుసుకున్న జీవిత సత్యం కదా!

Friday, 17 September 2021

 [17/09, 9:27 am] విశాఖ: 


 *01.  శని శిగ్నాపూర్, మహారాష్ట్ర.*

 మొత్తం గ్రామంలోని అన్ని ఇళ్లు తలుపులు లేకుండా ఉన్నాయి.

 పోలీస్ స్టేషన్ కూడా లేదు.

 దొంగతనాలు లేవు.


 *02.  షెట్‌ఫాల్, మహారాష్ట్ర.*

 గ్రామస్థులు తమ కుటుంబ సభ్యులుగా ప్రతి కుటుంబంలో SNAKES కలిగి ఉంటారు.


 *03.  హైవే బజార్, మహారాష్ట్ర.*

 భారతదేశంలో అత్యంత ధనిక గ్రామం.

 60 మిలియనీర్లు.

 ఎవరూ పేదవారు కాదు

 అత్యధిక GDP.


 *04.  పున్సారి, గుజరాత్.*

 అత్యంత ఆధునిక గ్రామం.

 CCTV & WI-FI ఉన్న అన్ని ఇళ్ళు.

 అన్ని వీధి దీపాలు సౌరశక్తితో ఉంటాయి.


 *05.  జంబూర్, గుజరాత్.*

 గ్రామస్తులందరూ భారతీయులే, ఇంకా అందరూ ఆఫ్రికన్ లాగానే కనిపిస్తారు.

 ఆఫ్రికన్ గ్రామంగా మారుపేరు.


 *06.  కుల్ధార, రాజస్థాన్.*

 హాంటెడ్ గ్రామం.

 అక్కడ ఎవరూ నివసించరు.

 గ్రామస్తులు లేని గ్రామం

 అన్ని ఇళ్లు వదిలివేయబడ్డాయి.


 *07.  కోడిన్హి, కేరెల.*

 TWINS గ్రామం.

 400 కంటే ఎక్కువ కవలలు.


 *08.  మాటూరు, కర్ణాటక.*

 100% సంస్కృతం మాట్లాడే గ్రామస్థులు వారి సాధారణ రోజువారీ సంభాషణలో.


 *09.  బర్వాన్ కాలా, బీహార్.*

 బ్యాచిలర్స్ గ్రామం.

 గత 50 సంవత్సరాల నుండి వివాహం లేదు.


 *10.  మవ్లిన్ నాంగ్, మేఘాలయ.*

 ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామం.

 అలాగే ఒక చిన్న రాతిపై అద్భుతమైన బ్యాలెన్సింగ్ భారీ రాతితో.


 *11.  రాంగ్‌డోయ్, అస్సాం.*

 గ్రామస్తుల నమ్మకాల ప్రకారం, కప్పలు RAINS పొందడానికి వివాహం చేసుకుంటాయి.


 *12 .కోర్లాయ్ గ్రామం, రాయగడ, మహారాష్ట్ర.*

 గ్రామస్తులందరూ పోర్చుగీస్ భాష మాట్లాడే ఏకైక గ్రామం.


 మనలో చాలా మందికి ఈ ప్రదేశాల యొక్క ప్రత్యేకమైన విషయాలు తెలియవు ... !!  కాబట్టి షేర్ చేస్తూ ఉండండి ...!

[17/09, 7:17 pm] Mallapragada Sridevi: 🚩జై శ్రీ కృష్ణా...💐🙏

*ఏమి