*🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 9 🌹*
*🌻 Chapter - భూలోకంలో మీ ధ్యేయం. 🌻*
*✍️. భావనగరి*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*Q:--భూలోకంలో మీ ధ్యేయం ఏమిటి?*
*A:– మనకే కష్టాలు వచ్చా యని ఇంకెవరికి రాలేదని అంటాం, అవి మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం, మన ఆత్మ గట్టిపడడం కోసం వచ్చాయి అని మనం సదా గుర్తుంచుకోవాలి.*
*భూలోకంలో ప్రతి ఆత్మకు 3 ధ్యేయాలు ఉంటాయి.*
*1) ఆధ్యాత్మికంగా మెరుగవ్వడం.*
*2) నిస్వార్థంగా ఇతరుల కు సేవ చేయడం.*
*3) మన ప్రతిభ నైపుణ్యాలు ఇతరుల ఎదుగుదల కోసం ఉపయోగించడం.*
------------------------------
*🌻. 1) ఆధ్యాత్మికంగా మెరుగవ్వడం:*
*A) ఏలాంటి పరిస్తితి ఎదురైన మంచి దారిలో నడవడం.*
*B) ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జిస్తే మార్పు అంతరం నుండి వస్తుంది,అప్పుడు తప్పు ఒప్పులను వేరు చేసి చూడగలిగే విచక్షణ మనకు లభిస్తుంది.*
*C) సద్గురువు ను ఎంచుకోవాలి,నిజమైన గురువు మన లోపల ఉన్న గురువును అనగా మన అంతర్వాణి గురించి తెలుసుకునేలా చేస్తాడు,ఎవరిపైనా ఆధారపడే లా చేయడు, భవిష్యత్ చెప్తానన్న గురువుల్ని నమ్మకండి,ఆత్మోన్నతికి మొదటి అడుగు జ్ఞానం, రెండవ అడుగు లోపాలను అంగీకరించడం.*
*🌻. 2) రెండవ ధ్యేయం:- నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం:*
*భూలోకంలో వారందరు సేవ అన్న,భక్తి అన్న పూజలు, వ్రతాలు, ఉత్సవాలు, పెద్దమొత్తంలో ఖర్చు పెట్టడం అనుకుంటారు, ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడితే అంత దైవ భక్తి ఉన్నట్లనుకుంటారు. కానీ నిస్వార్ధమైన సేవ, మౌనం అంటే భక్తి, ఆడంబరాలతో ధనాన్ని ఖర్చుపెట్టడం భక్తి కాదు, మరియు మనం సాయం చేసేటప్పుడు ఏమి ఆశించకూడదు, సాయం చేస్తే లాభం వస్తుంది అని అనుకున్న క్షణంలోనే మన ఉద్దేశ్యం అపవిత్రమైపోతుంది.*
*నీవు ఆచరించే కర్మ మరొకరి జీవితంలో మార్పు కోసమై ఉండాలి, కానీ వారి జీవితంలో మార్పు నీవల్ల వస్తే దానికి గర్వం రాకుండా చూసుకోవాలి.*
*🌻. 3వ ధ్యేయం:-- ప్రతిభల్ని ఇతరుల ఎదుగుదలకు ఉపయోగించడం:*
*భూలోకంలో ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉంటుంది, అది ఎన్నో జన్మల నుండి మనం సంపాదించుకుని ఉంటాం, మనం చేసే చేడు కర్మ చెడు ఫలితాల్ని సృష్టిస్తే, మంచి కర్మ మనకు ఆధ్యాత్మిక ప్రతిభగా లభిస్తుంది. singing, dancing, వంట చేయడం, రాయడం,ఆటలాడడం, ఇలా ఏదైనా కావచ్చు,ఇవన్నీ మనకు సత్కర్మ ద్వారా మనం సంపాదించుకున్న ప్రతిభలు.*
*వీటిని మనం మానవాళికి స్వస్థత చేకూర్చడానికి, సంతోష పెట్టడానికి ఉపయోగించాలి, డబ్బులు సంపాదించడానికి ఉపయోగించ కూడదు.*
*భూలోకంలో మన ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చెయ్యకపోతే,మనం ఎంత సాధించిన వ్యర్థం, మన ప్రయాణం పూర్తవదు.*
🌹 🌹 🌹 🌹 🌹

No comments:
Post a Comment