Friday, 29 July 2022

 

 *🧘‍♂️నాడీ విజ్ఞానం🧘‍♀️*


*శరీరంలో గల సూక్ష్మనాడులు:-*


      *మానవ శరీరంలో కోట్లాది నాడులలో, 72000 నాడులు ముఖ్యమైనవి. ఇవి కాకుండా మరి కొన్ని సూక్ష్మమైన నాడులు.*

    *నాడి అనగా ప్రవాహమని అర్థం. ఏ ప్రవాహము? చైతన్య ప్రవాహము. శక్తి ప్రవాహము. నాడులనేవి, కేవలం శరీరంలో ఉండే మాంసమైన నాడులు కావు. అవి చైతన్యాన్ని, శరీరమంతా ప్రవహింజేసే శక్తి వాహినులు. ప్రాణ శక్తి, మనో శక్తి ఈ నాడీ వాహినుల ద్వారానే ప్రవహిస్తాయి. కొన్ని నాడులు మనోశక్తిని ప్రవహింపజేసే నాడులైతే, మరికొన్ని ప్రాణ శక్తిని, వైశ్విక చైతన్యాన్ని కూడా ప్రవహింపజేసే నాడులు.*

*1. గాంధారి నాడి :- ఎడమ కన్ను యొక్క ఒక మూల నుండి, ఉదర ప్రాంతం వైపు ప్రవహిస్తూ, ఎడమ కాలి బొటన వ్రేలి వద్ద అంతమౌతుంది. ఈ నాడి, ఇడా నాడికి వెనుక వైపున ఉంటూ...కొన్ని పనులు చేస్తోంది. ఈ గాంధారీ నాడి, శరీరం యొక్క క్రింది భాగాల నుండి... మనో శక్తిని...ఆజ్ఞా చక్రం వైపు తీసుకు వెళుతుంది. దీనియొక్క పరి పూరక నాడి "హస్తి జిహ్వ " నాడి.*


*2. హస్తి జిహ్వ నాడి :- ఈ నాడి ఏనుగు నాలుక లాంటి స్వభావము గల నాడి. ఈ నాడి కుడి కన్ను యొక్క ఒక మూల నుండి ప్రారంభమై...నాభి ప్రాంతం వరకు ప్రవహిస్తూ, కుడి పాదము యొక్క బొటన వ్రేలి వద్ద అంతమౌతుంది. ఈ హస్తి జిహ్వ నాడి, శరీరము యొక్క క్రింది ప్రాంతాల నుండి మనో శక్తిని ఆజ్ఞా చక్రం వైపు తీసుకుని వెళ్తుంది. దీని యొక్క పరి పూరక నాడి గాంధారి నాడి. అంటే గాంధారి నాడి, హస్తి జిహ్వ నాడి ఒక దానికొకటి పరి పూరకాలు.*


*3. యశస్విని నాడి :- యశస్విని నాడి అనే ఈ అద్భుతమైన నాడి....కుడి పాదం యొక్క బొటన వ్రేలు నుండి ప్రారంభమై...ఎడమ చెవి వద్ద అంతం అవుతుంది. ఈ యశస్విని నాడి యొక్క పరి పూరక నాడి "పూషా నాడి".*


*4. పూషా నాడి :- ఈ పూషా నాడి పోష కర్త నాడి. ఈ నాడి పోషణ చేస్తుంది. ఈ నాడి ఎడమ కాలి బొటన వ్రేలు నుండి, నాభి వరకు వ్యాపిస్తూ...కుడి చెవి వద్ద అంతం అవుతుంది. దీని పరిపూరక నాడి "యశస్విని నాడి".*


*5. అలంబుస నాడి :-  ఈ నాడి శక్తివంతమైన నాడి. ఈ నాడి మార్మికంగా ఉంటుంది. మనిషి యొక్క ముడ్డి ప్రాంతంలో ప్రారంభమై ...నాభి ద్వారా వెళుతూ...నోటి కుహరం వద్ద అంతం అవుతుంది.*


*6. కుహు నాడి :- ఈ నాడి పున్నమి చంద్రుడు ఎంత శక్తివంతమైన వాడో...ఈ నాడి అంత శక్తి వంతమైనది. ఈ నాడి గొంతు వద్ద ప్రారంభమై...జననేంద్రియాల ప్రాంతంలో...అంతమౌతుంది. తంత్ర సాధనల్లో, ఉన్నతమైన లైంగిక శక్తి, బిందువు (శుక్రము)...ఈ జననేంద్రియ ప్రాంతం నుండి ఉత్పత్తి జరిగి, సోమ చక్రము వైపు ప్రవహిస్తుంది. అలా జరగడం వలన ఒక యోగి "ఊర్థ్వ రేతస్కుడు" అవుతున్నాడు. అంటే...లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మారుస్తున్నాడన్నమాట. అందుకే బ్రహ్మచర్య పాలన శ్రేయస్కరం అంటారు, యోగి జనులు. ఈ నాడి మల దోషాలను కూడా నియంత్రణ చేస్తుంది.*


*7. శంఖిణి నాడి :- ఈ నాడి గొంతులో ప్రారంభమై...పురీషము యొక్క ప్రాంతంలో అంతం అవుతుంది. దీని శక్తి సరస్వతీ నాడి - గాంధారి నాడుల మధ్య ప్రవహిస్తుంది. అశ్వనీ ముద్రల సతత అభ్యాసం ద్వారా ఈ నాడిని చైతన్య వంతం చేయవచ్చును. ఈ నాడి, మనం తినే ఆహార సారాన్ని ప్రవహింపజేస్తుంది కూడా.....*


*8. సరస్వతి నాడి :- సరస్వతి నాడి, మానవుడి నాలుకలో ఉంటుంది. ఎవరైననూ... చక్కగా భాషించేవారికి, మంచి పాండిత్యం గలవారికి ఈ సరస్వతి నాడి చైతన్యవంతంగా ఉంటుంది.*


*9. పయస్విని నాడి :- ఈ పయస్విని నాడి, పూషా మరియూ సరస్వతి నాడులకు కుడి వైపున ప్రవహిస్తుంది. ఒకరకమైన యోగ మార్గంలో ఉన్న యోగులు, తమ చెవులకు పెద్దవైన చెవి పోగులు ధరించడం ద్వారా...ఈ పయస్విని నాడిని చైతన్యవంతం చేస్తారు.*


*10. విశ్వోదరి నాడి :- ఈ విశ్వోదరి నాడి నాభి ప్రాంతంలో వసిస్తూ ఉండి, కుహూ నాడి - హస్తి జిహ్వ నాడుల మధ్య ప్రవహిస్తుంది. ఇది అడ్రినల్ గ్రంథులతో సంబంధం కలిగియుంటుంది.*


*11. కౌశికి నాడి :- ఈ నాడి రెండు పాదాల బొటన వ్రేళ్ళ వద్ద అంతం అవుతుంది.*


*12. విశ్వోదరి నాడి :- ఈ విశ్వోదరి నాడి నాభి ప్రాంతంలో వసిస్తూ ఉండి, కుహూ నాడి - హస్తి జిహ్వ నాడుల మధ్య ప్రవహిస్తుంది. ఇది అడ్రినల గ్రంథులతో సంబంధం కలిగియుంటుంది.*


*13. కూర్మ నాడి :- ఈ నాడి శరీరానికి, మనస్సుకి మధ్య  సమన్వయం చేస్తూ...ఆయా సంబంధాలను స్థిరీకరిస్తుంది.*


*14. రాకా నాడి :- ఈ నాడి ఆకలిని, దాహాన్ని కలిగిస్తూ, శ్లేష్మాన్ని  గ్రహిస్తుంది.*


*15. సురా నాడి :- ఈ నాడి రెండు కను బొమల మధ్య ఉంటుంది.*


*16. వారుణి నాడి :- ఈ వారుణీ నాడి కటి ప్రాంతం యొక్క క్రింది భాగంలో, కుహు నాడితో కలసి...ఈ ప్రాంతపు మల దోషాలను శుభ్రం చేస్తుంది. ఈ నాడి శరీరమంతా ప్రవహిస్తుంది. ఈ నాడి మూత్ర విసర్జనకు సహాయ పడుతుంది. ఇది ముడ్డి ప్రాంతంలో అంతం అవుతుంది. బస్తి మొదలగు క్రియల ద్వారా ఈ నాడి చైతన్యవంతం అవుతుంది. ఈ నాడి యశస్విని - కుహు నాడుల మధ్య ఉంటుంది.*


🕉️🌞🌏🌙🌟🚩

*ఎక్కడ ప్రశాంతత?*


'మానవ జీవితం పుట్టుక మొదలుకొని మరణం వరకు నిత్య సంగ్రామంగానే సాగుతుంది. పుట్టిన వెంటనే పసిగుడ్డుకు సైతం ఆకలి బాధ తప్పదు. శైశవదశ దాటే సమయంలో చాలారిష్టాల రూపంలో అనారోగ్యాల కష్టాలు చుట్టుముడతాయి. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సమస్యలు ముసురుతాయి. కష్టాల కడలిని దాటేలోగానే వృద్ధాప్యం ముంచుకొస్తుంది. ఆ తరువాత దైహిక, మానసిక బాధలు వర్ణనాతీతం. ఏ సమస్యా మనిషిని ప్రశాంతంగా ఉండనీయదు. ఒకదాని తరువాత మరొకటిగా కడలి కెరటాల్లా సమస్యలు విరుచుకొని పడుతుంటాయి. వేదాంతులు మానవ సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. కష్టాలను కెరటాలతో సమానంగా భావిస్తారు. సమస్యలు లేని మనిషి ఈ భూ ప్రపంచంలో లేడనేది పరమసత్యం,


మనిషి చీకటిని చీల్చుకొని వెలుగుకోసం వెదికినట్లు ఆశాంతిలో నుంచే ప్రశాంతతను రాబట్టుకోవాలి. కష్టాలు నిప్పు కణికల్లాంటివి. వాటిలోంచే చల్లదనాన్ని పొందడానికి ప్రయ తించాలి. వేసవికాలంలో సూర్యుడి కారణంగా లోకమంతా తపించిపోతుంది. వేసవి ముగిసిన తరువాత చల్లని జల్లులు కురిసే వర్షాకాలం వస్తుంది. వేసవికి కారణమైన సూర్యుడే వర్షానికి కారణభూతుడు. సూర్యుడి వేడిమితో సముద్రజలాలు వేడెక్కి, ఆవిరి పైకి ఎగసిన తరువాతే కదా ఆకాశంలో మేఘాలు ఉత్పన్నమై వర్షాలు కురుస్తాయి. కనుక సమస్యలోనే సమాధానం కూడా ఉంటుందనేది. ప్రకృతి చెప్పే ఉపదేశం!


మనిషి తనకు తానుగా ఆందోళనలను సృష్టించుకొంటూ అశాంతికి గురవుతుంటాడు. గంధర్వ నగరాలను సృష్టించుకొని పగటికలలు కంటాడు. అందని ద్రాక్షపండ్ల కోసం అర్రులు చాస్తుంటాడు. ఏవో ఊహించుకొని గాలిలో తేలిపోతూ, గాలిమేడలు కడతాడు. వీటివల్లనే మానసిక ప్రశాంతతకు దూరమై అల్లాడుతుంటాడు. తన ఉనికిని మరచిపోతే మనిషికి అశాంతి గాక మరేమి లభిస్తుంది.


ప్రకృతి మనిషికి అన్ని వనరులనూ పుష్కలంగా అందించింది. వాటిని రక్షించుకోలేని అసమర్థుడిగా మనిషి మిగిలిపోకూడదు. పంచభూతాలు మనిషి ప్రశాంత జీవనానికి ఆధారాలు, వాటిని కలుషితం చేయడం ద్వారా ప్రపంచాన్ని ఒక చెత్తకుండీలా మార్చివేస్తున్నాడు మనిషి చెట్లను విచక్షణారహితంగా నరికివేసిన పాపం, కాలుష్యపు ఉద్గారాలతో ప్రాణవాయువును విషపూరితం చేసిన శాపం మనిషికి మరణశాసనమై ప్రపంచాన్ని వీడిస్తోంది. ధ్వనికాలుష్యం గుండెలను చిద్రం చేస్తుంటే మనిషి ఆరోగ్యం మంటగలిసిపోతోంది. లక్షల ఏళ్లనాటి హిమ ఖండాలు కరిగిపోతూ, జలప్రళయాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయంటే పుడమిని వేడెక్కించిన మనిషి తప్పిదాల తీవ్రత స్పష్టమవుతుంది. మనిషి తన కుటుంబ జీవనంలోనూ ఎన్నో తప్పటడుగులు వేస్తున్నాడు. పెద్దలపై గౌరవం లేకపోవడం, వ్యక్తుల మధ్య ఆత్మీయతలు దూరం కావడం, పరస్పర స్నేహ సహకార భావాలకు తిలోదకాలివ్వడం... మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. మానవతా బంధాలను

బందిఖానాలోకి నెట్టేస్తున్నాడు. సమైక్యజీవనం, సమభావం కొరవడుతున్నాయి. అన్నింటినీ పోగొట్టుకొనే మనిషికి ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది। తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనలోనే నిక్షిప్తమై ఉన్న ప్రసన్నతను, ప్రశాంతతను శోధించి, పట్టుకోవాలి.

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ


రెండు డైరీలు - భార్య...భర్త...07-12-2023

తమ వివాహ వార్షికోత్సవ  సందర్భాన, భార్యాభర్తలు ఇద్దరూ  కలిసి  కూర్చుని  టీ  తాగుతూ  కబుర్లు చెప్పుకుంటున్నారు.  ప్రపంచానికి, వారొక ఆదర్శమైన జంట.  నిజానికి  వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది, కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి.

వారి సంభాషణలో.......భార్య ఒక ప్రతిపాదన చేసింది, “నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసమొకరికి సమయం దొరకడం లేదు. అందుకే నేను రెండు డైరీలు కొన్నాను. ఈ సంవత్సరం  మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి  ఉన్న వాటిని వీటిలో రాద్దాం. 

వచ్చే ఏడాది పెళ్లి రోజున, మన లోపాలను తెలుసుకోవడం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుదాం, వాటిని  సరిదిద్దుకోడానికి  కలిసి  ప్రయత్నిద్దాం,”  ఆలోచన నచ్చి భర్త వెంటనే దానికి అంగీకరించాడు. 

 ఇద్దరూ తమ తమ డైరీలు  తీసుకున్నారు.

 ఒక  సంవత్సరం వేగంగా  గడిచిపోయింది.  మరుసటి  సంవత్సరం  వివాహవార్షికోత్సవం  సందర్భంగా, భార్యాభర్తలిద్దరూ  ముందుగా నిర్ణయించుకున్న విధంగా  తమ  డైరీలను  మార్చుకున్నారు.

మొదట.......భార్య  తనను  ఉద్దేశించి  వ్రాసిన  డైరీని భర్త  చదవడం  ప్రారంభించాడు.

మొదటి పేజీలో, "ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం.  మీరు  నాకు  మంచి బహుమతి ఇవ్వలేదు" అని,

రెండవ పేజీలో - "మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్ కి తీసుకెళ్లలేదు."

మూడవ పేజీలో - "నన్ను సినిమాకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణంలో రద్దు చేసారు."

 " నా తరఫు బంధువులు వచ్చారు  కానీ మీరు వారితో సరిగ్గా మాట్లాడలేదు."

"చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నా కొక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ ది !"

 ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు  ఆమె తన డైరీలో రాసుకుంది. అది చదవడం పూర్తికాగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.

 భర్త, “ఓ  ప్రియా, నన్ను క్షమించు!  ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు తెలియదు.  భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.” అని చెప్పాడు.

 ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదివడం భార్య వంతు...........


 మొదటి పేజీ - ఖాళీ

 రెండవ పేజీ - ఖాళీ

 మూడవ పేజీ - ఖాళీ

 ... ఖాళీ

 భార్య 50-60 పేజీలు తిరిగేసింది, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి!  

భార్య కలత చెంది, “నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసు.  నా మనసులో ఉన్నదంతా వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను కోరుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారు!" అని వాపోయింది.

భర్త చిరునవ్వు నవ్వి, “చివరి పేజీలో అంతా రాశాను ప్రియా” అన్నాడు.

 భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది. 

అందులో ఇలా ఉంది - “ ఎదురుగా ఉండి ఎంత  కసురుకున్నా, ఇన్నాళ్లూ నువ్వు నాకు, నా కుటుంబానికి అందించిన అపరిమితమైన ప్రేమ ముందు, ఈ డైరీలో వ్రాయడానికి నీలోని ఏ లోపాన్ని నేను గుర్తించలేకపోయాను.  

అలాగని నీలో ఏమి లేవని కాదు. కానీ నీప్రేమ, అంకితభావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి.  

నాలో లెక్కలేనన్ని క్షమించరాని  తప్పులు  ఉన్నప్పటికీ, నా  జీవితంలోని  ప్రతి దశలో నాకు నీడలా  ఉన్నావు.  ఆ నీడలో లోపాన్ని ఎలా కనుగొనగలను?!" అని వ్రాసాడు.

అది చదివిన భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి.  ఆమె తన భర్త చేతిలో నుండి తన డైరీని తీసుకొని, రెండు డైరీల తో పాటు తన విభేదాలు , ఫిర్యాదులను మంటల్లో కాల్చివేసింది..  మళ్లీ వారి జీవితాలు కొత్తగా పెళ్లయిన జంటలా ప్రేమతో వికసించాయి!

 వివాహం మనందరికీ ఎదగడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి, ప్రేమించడం నేర్చుకోడానికి అవకాశం ఇస్తుంది.  మనం ప్రయాణానికి కట్టుబడి ఉంటే, మరింత ఎక్కువగా ఇవ్వడం గురించి వివాహం మనకు నేర్పుతుంది. 🙏🙏🙏🙏


🌼🌼


Saturday, 16 July 2022


ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది.

ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ  ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం.

తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి.

జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం.

ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..!

సా.. ధ.. న  అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు.

అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు.

     సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు  విచక్షణ,

వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి.

కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు.

ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు.

  ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే.

    నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు.

     భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి.


ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని  ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి.

అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు.

సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం!

సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన  చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత  శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా  చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు.


వినయానికున్న విలువ


సత్య భామ శ్రీకృష్ణునితో ఒకసారి’ స్వామీ ! రామావతారంలో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా’ అని అడిగింది.

ఆ సమయంలో అక్కడే ఉన్న గరుడుడు “ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా”అన్నాడు. పక్కనే ఉన్న సుదర్శనుడు (సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా! అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.నాతో సరితూగు వారెవరు స్వామీ అన్నాడు. ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.


దీర్ఘంగా ఆలోచించిన నారాయణుడు..

సత్యా, నువ్వు సీతగా మారిపో…నేను రాముణ్నవుతాను. గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతారాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా. చక్రమా !నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు, అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు.


గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. హనుమ ఆనందంతో పుల కించిపోతూ ‘నేను నీ వెనుకే వస్తాను. నువ్వు పద’ అని గరుత్మంతుని సాగనంపుతాడు. ఈ ముసలి వానరం రావడానికి ఎంతకాలమవుతుందో కదా అనుకుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు. కానీ.. ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు. ఇంతలో..’హనుమా’ అన్నపిలుపుతో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. ’లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా’అని అడగ్గా..

హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.ఎన్ని చెప్పినా వినక పోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’ అన్నాడు.


సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానంతో నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై పడి ‘స్వామీ !మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది.

అలా కృష్ణపరమాత్ముడు ముగ్గురిలోనూ మొగ్గతొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలువేమిటో తెలియ చెప్పాడు.

................


వ్యక్తి తన వ్యక్తిత్వానికి అతీతంగా వస్తుతత్త్వానికి, ఉన్న విషయానికి మాలిమి అవాలి. అనుకోవడం నుంచి తెలుసుకోవడానికి పయనించాలి. అభిప్రాయం నుండి అవగాహనలోకీ చేరాలి. అనుకోవడం అంటేనే తెలివిడిలేనితనం. ‘ఇది నా అభిప్రాయం‘ అనడం ఒక మనిషి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తూంటుంది. విషయం, వాస్తవం, సత్యం ఇవి మనిషి మనిషికీ మారవు. అభిప్రాయాలే వేర్వేరుగానూ, రకరకాలుగానూ ఉంటాయి. ఒక విషయం గురించి ఏదో అనుకోవడం ఏమిటి? విషయాల్ని తెలుసుకోవడం లేదా తటస్థంగా ఉండడం అన్నదే సరైనది.

లోకంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం గొప్ప అనుకుంటూంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 67% మధ్యతరగతి వ్యక్తులు అభిప్రాయపడుతూ బతుకుతూంటారు. అభిప్రాయాలు మనిషి అశక్తతకు, తెలివిడిలేనితనానికి వ్యక్తీకరణలు. అభిప్రాయపడడం అన్నది మధ్యతరగతి మాంద్యంగానూ, జాడ్యంగానూ ఉంది. అందువల్ల గందరగోళం తప్పితే మరొకటి ఉండదు. ఉపిరి పీల్చుకోవడం తరువాత ఒక వ్యక్తి తప్పకుండా చేసే పని అభిప్రాయపడడమే. మనుషులకు తప్పితే ఏ జంతువుకూ అభిప్రాయాలుండవు. అందుకే జంతువుల్లో లేని అశాంతి మనుషుల్లో మాత్రమే ఉంది.

‘ఇది నా అభిప్రాయం’, ‘నేను ఏమనుకుంటున్నానంటే‘,

‘నేను చెప్పేదేమిటంటే’...

అనే స్థితి నుండీ, స్థాయి నుండీ మధ్య తరగతి మనిషి ఇంకా ఎదగలేదు.

మనిషి అవగాహనకూ అతీతంగా తన అభిప్రాయాల వల్లా,  ఏదో అనుకోవడం వల్లా తన ఎదుగుదలకు తానే అడ్డుపడుతున్నాడు.

ఒక కుటుంబంలోని వ్యక్తుల అభిప్రాయాల వల్లా, ఏదేదో అనుకోవడం వల్లా ఆ కుటుంబాలు ఛిద్రమైన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అభిప్రాయపడడం, అనుకోవడం ఒక మానసిక బలహీనత.

హిట్లర్‌ అభిప్రాయాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం మానవాళికి పెనుహాని జరిగింది.

అభిప్రాయపడడం కూడా మూర్ఖత్వంలాగే అపాయకరమైనదే! కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంలాగా కీడు చేసేదే! నా అభిప్రాయం మేరకు అనేది ప్రపంచానికి మేలు చేసినది కాకపోగా అనర్థాల్ని కలిగించింది, మనుషుల మధ్య అంతరాల్ని పెంచింది. మనస్పర్థలను సృష్టించింది. ఈ చింతనతో ఎన్నో దశాబ్దుల క్రితం నుండీ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచానికీ, మానవాళికీ అత్యవసరమయ్యే ఎన్నో ఉత్పాదనల్ని ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చాయి, సగటు మనిషికి హితాన్ని చేకూర్చాయి.

చూడడం, వినడం, అవగతం చేసుకోవడం, చెప్పడం ఇవి మనిషికి సరిగ్గా అలవడలేదు. వ్యక్తిగత అభిప్రాయాలూ, ఉద్దేశాల వల్ల సాటి మనిషికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. అభిప్రాయాలు, ఉద్దేశాలు, అనుకోవడం ఇవి కాదు ఎరుక, అవగాహన, విజ్ఞతలే కావాలి. ఒకరి ఎరుక, అవగాహన మరొకరికీ, సమాజానికీ ఉపయోగపడతాయి. ఈ ప్రపంచానికి మేలు చేసినవన్నీ అవగాహనలే, వాస్తవాలే, సత్యాలే.

ఒక వైద్యుడి చదువు లేదా ఎరుక మాత్రమే రోగికి అవసరమవుతుంది. ఒక అధ్యాపకుడికి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి సరైన విద్య వస్తుంది. ’రెండు రెళ్లు నాలుగు’ అన్న ఎఱుకను మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి అందజెయ్యాలి. అదే విద్యార్థికి కావాల్సింది. ఆ రెండురెళ్లు నాలుగు అన్నది అవగాహన. ఆ అవగాహనే ఒక వ్యక్తి జీవనానికి తోడ్పడేది.

ఇలా ఏ విషయంలోనైనా ఎరుకవల్ల వచ్చే లేదా వచ్చిన అవగాహన మాత్రమే మేలు చేస్తుంది.

అభిప్రాయం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అభిప్రాయాలు సార్వత్రికమైనవి కావు అపై సార్వజనీనమైనవీ కావు. మనం సరిగ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది అభిప్రాయాలు కాదు అవగాహనలు. బతకడం అంటే అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండిపోవడమా? కాదు. బతకడం అంటే తెలుసుకుని అవగాహనతో సాగడం.

అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి.  తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం ఉంటే ఆ గాయకుడి సామర్థ్యాన్ని, గాయకుడి వ్యాప్తిని, తరువాతి తరం వాళ్లపై ఆ గాయకుడి ప్రభావాన్ని, పరిశీలించగలిగితే ఆ గాయకుడు గొప్ప గాయకుడు అన్న  అభిప్రాయం సరైనదా కాదా అనేది తెలిసిపోతుంది.

విజ్ఞానశాస్త్రవేత్తల ఆవిష్కరణలను పరిశీలిస్తే మనకు అవగాహన అన్నది ఏమిటో అర్థమై పోతుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయంతోనో, ఏదో ఒకటనుకునో  మొదలుపెడతారు. ప్రయోగాలు, ఆలోచనలు, పరిశీలనలు చేస్తూ, చేస్తూ తమను తాము మార్చుకుంటూ, సరిచేసుకుంటూ ఒక దశలో వాళ్లు సరైన ఆవిష్కరణలు చెయ్యగలుతారు. ఆ ఆవిష్కరణ జరిగాక అది అవగాహన అవుతుంది. ఆ అవగాహనే లోకానికి ఉపయోగ పడేదవుతుంది.

అవగాహన మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. సాటి మనిషికి, సమాజానికి మేలు చేస్తుంది. శాంతిని ఇస్తుంది. ఈ సత్యాన్ని బుద్ధిలోకి తీసుకుందాం. అభిప్రాయాలకు అతీతంగా ‘బతకడం’ నేర్చుకుందాం.

అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి.


         *తెలుగు సంవత్సరాల పేర్లు...*

                   *వాటి అర్థాలు*

                    ➖➖➖✍️


*1. ప్రభవ అంటే... ప్రభవించునది!అంటే... పుట్టుక.*


*2. విభవ - వైభవంగా ఉండేది.*


*3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.*


*4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.*


*5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.*


*6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.*


*7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.*


*8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.*


*9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.*


*10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.*


*11. ఈశ్వర... పరమేశ్వరుడు.*


*12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.*


*13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.*


*14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.*


*15. వృష ... చర్మం.*


*16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.*


*17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం!*

*18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.*


*19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.*


*20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.*


*21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.*


*22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.*


*23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.*


*24. వికృతి... వికృతమైనటువంటిది.*


*25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.*


*26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.*


*27. విజయ... విశేషమైన జయం కలిగినది.*


*28. జయ.... జయాన్ని కలిగించేది. *


*29. మన్మథ... మనస్సును మధించేది.*


*30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.*


*31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.*


*32. విలంబి... సాగదీయడం.*


*33. వికారి.... వికారం కలిగినది.*


*34. శార్వరి... రాత్రి.*


*35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.*


*36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.*


*37. శోభకృత్... శోభను కలిగించేది.*


*38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.*


*39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.*


*40. పరాభవ ... అవమానం.*


*41. ప్లవంగ... కోతి, కప్ప.*


*42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.*


*43. సౌమ్య... మృదుత్వం.*


*44. సాధారణ... సామాన్యం.*


*45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.*


*46. పరీధావి... భయకారకం.*


*47. ప్రమాదీచ... ప్రమాద కారకం.*


*48. ఆనంద... ఆనందమయం.*


*49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.*


*50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.*


*51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.*


*52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.*


*53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.*


*54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.*


*55. దుర్మతి... దుష్ట బుద్ధి.*


*56. దుందుభి ... వరుణుడు.*


*57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.*


*58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.*


*59. క్రోదన... కోప స్వభావం కలది.*


*60. అక్షయ... నశించనిది.*

,...................


*

Friday, 15 July 2022

*జీవిత సూత్రం*ప్రాంజలి ప్రభ 

               

*మనిషి జీవితం కేవలం తాత్కాలికం. అటువంటి జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తూ, జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంటారు.*


*ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ మహాభారతం మనిషి జీవితానికి ఎంతో అర్థాన్ని కూడా వివరించింది. అయితే ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన ఆ నాలుగు మంత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…*


*“సర్వే క్షయాంత నిచాయంః పతనంతఃసమ్రుశ్ఛాయః”* 

*“సంయోగ విప్రయోగంత మారాతంత చ జీవితమ్”*


*ఈ నాలుగు మంత్రాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.*


*వీటి అర్థం పరమార్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…*


*1. సర్వే క్షయాంత నిచాయంః*


*ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతి ఒక్క వస్తువు చివరికి నాశనం కావాల్సిందే. అటువంటి వాటి కోసం కొందరు జీవితాంతం కష్టపడి సంపాదిస్తూ ఉంటారు.*


*వారు ఎలాంటి పనిచేసినా చివరకు మిగిలేది వారు చేసిన మంచి, చెడు మాత్రమేనని మనకు మహాభారతం తెలియజేస్తుంది.*


*కాబట్టి దురాశతో ఎక్కువ సంపాదనలో మునిగిపోవడం కాకుండా అవసరమైనంత మేరకు డబ్బును సంపాదించుకోవాలని తెలియజేస్తుంది.*


*2. పతనంతః సమ్రుశ్ఛాయః*


*ఈ మంత్రం అర్థం మనం జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ, గొప్పలకు పోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక వ్యక్తి గొప్పగా ఎదిగితే తన కింద ఉన్న వ్యక్తులను ఆదరించేందుకు కృషి చేయాలి.*


*3. సంయోగ విప్రయోగంత:*


*ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంయోగం ఉంటే అందుకు తగ్గ వియోగం కూడా ఉంటుంది. అనుకోకుండా కొంత అదృష్టం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో సంబరపడతాము.*


*అలాగే దూరం అయినప్పుడు బాధపడతాము. మన జీవితంలో సంయోగం, వినియోగం ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.*


*4. మారాతంత జీవితమ్*


*దీని అర్థం   పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. వ్యక్తుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలి కానీ, చనిపోయినప్పుడు పశ్చాత్తాపడకూడదు.*


*ఈ విశ్వంలో జననం, మరణం మాత్రమే వాస్తవమైనవి.*

*మిగిలినవన్నీ మన జీవితంలో ఏర్పడే తాత్కాలికమైన సంఘటనలు మాత్రమే.*


*మనిషి ఈ నాలుగు స్తోత్రాలను పఠించి, పాటించడం ద్వారా ఏ వ్యక్తి జీవితంలోనూ ఎటువంటి కష్ట,నష్టాలు ఉండవని మనకు మహాభారతం తెలియ చేస్తుంది*

*మార్పు మన నుండే మొదలవ్వాలి....!*

*-----*

: *మోసం చేసే  మనిషి  ముందు.....   మాంసం  తినే   పులి.....  క్రూరత్వం .. చిన్నబోతుంది*

ప్రజల సొమ్మును దానం చేసే మనిషి ముందు... మృగరాజు సింహం చిన్నబోతుంది


       _* ఒక మంచి వాడు పతనం అయ్యాడు అంటే....._*

*_ఎంతోమంది చెడ్డ వాళ్ళు ఒక్కటై ఉండాలి....._*


* ఒక మంచి వాడు తాగుబోతు డయ్యాడంటే *

* ప్రభుత్వ ధనాన్ని పెంచే మనిషై ఉండాలి*


*_అవసరాన్ని బట్టి భజన,_*

*_అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు,_*

*_మన చుట్టూ బోలెడు మంది ఉంటారు.._*


*ధనాన్ని బట్టి భజన* *అవకాశాన్ని బట్టి పార్టీ మార్చేవాడు*


 *పెత్తనం కోరుకునేవాడు* ,_*

*_బానిసత్వంను వృద్ధి చేస్తాడు.._*


*మాటల గారడీ చేసేవాడు నాయకుడౌతాడు*

*బలహీనులను బలవంతులు గా బానిసలుగా మారుస్తాడు*


*_అధికారంను కామించేవాడు,_*

 *భజనబృందంను బలోపేతం చేసుకుంటాడు..*


*మానవత్వం ఉన్న వాడు మనసు పంచి బ్రతుకు తాడు*


_****

: #నేను నేను #నేను నేను #నేను - ఈ భావనను వదిలివేయండి. 


1) నేను చాలా మొత్తాన్ని ,చాలా సార్లు విరాళం ఇచ్చాను 

2) నేను చాలా దేవాలయాలను సందర్శించాను 

3) నేను చాలా మందికి సహాయం చేసాను 

4) నేను చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాను 

5) నేను అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాను 

6) నేను రక్తదానం చేశాను 

7) నేను చాలా చెట్లను నాటాను

8) నేను అరుణాచలం, తిరుపతి, కాశీకి చాలాసార్లు వెళ్ళాను 

9) నేను చాలా దీక్షలను తీసుకున్నాను (అయ్యప్ప, హనుమాన్, భవానీ, శివ) 

10) నేను చాలా సార్లు అన్నదానం చేశాను 

11) నేను చాలా పక్షులను, జంతువులను పోషించాను

12) నేను సమాజానికి చాలా చేశాను 

13) నేను చాలా భక్తితో జీవిస్తున్నాను 

14) నేను అన్ని ధర్మాలను అనుసరిస్తున్నాను 

15) నేను గోషాలాలను నడుపుతున్నాను, గౌ సేవా కూడా చేస్తాను 

16) నేను రోజూ భజనలు చేస్తాను 

17) నేను చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాను

18) నేను చాలా మందికి ఆశ్రయం ఇచ్చాను

19) నా దగ్గర కోట్లు, కోట్లు ఆస్తి ఉన్నాయి


చివరగా, మీరు మీ స్వంత శక్తితో ఇవన్నీ చేశారని మీకు అనిపిస్తే, 

అది పూర్తిగా వ్యర్థం.


#నేను నేను #నేను నేను #నేను - ఈ భావనను వదిలివేయండి.


 మీరు చేసారు ఎందుకంటే, 

ఈశ్వరుడు ఈ పనులు చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు.

ఇది మీ క్రెడిట్ కాదు, 

ఇది శివుడి క్రెడిట్.  

మీరు కేవలం ఆటగాడు మాత్రమే 

మరియు  

హీరో, స్క్రీన్ ప్లే, కథ రచయిత, నిర్మాత ,దర్శకుడు శివుడు మాత్రమే.


 మీ మనస్సులో ఈ భావన ఉంటే, 

అప్పుడు మీరు గొప్ప వ్యక్తిగా పరిగణించబడతారు. 


మీరు ఈ రోజు గొప్ప వ్యక్తి, 

మీరు ఏమి చేసినా, 

శివుడు మీ వెనుక ఉన్నాడు.

దీన్ని ఎప్పటికీ మరచిపోకండి.

 శివుడు సహాయం, మద్దతు లేకుండా మీరు ఒక్క పని కూడా చేయలేరు.🙏

[16/07, 1:01 pm] Prathyusha: 🌞🌞🌞 *ఉషోదయ ఉషస్సు*🌞🌞🌞 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్*

*"వేద .. యోగ" వ్యాఖ్యానం*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


🌻 *"విష్ణు సహస్రనామ స్తోత్రం" - "వేదార్థం - యోగార్థం"* 🌻


                   *పార్ట్ - 39*


*అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ౹*

*సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ౹౹*


🌼 *వేదార్ధం :* ఓ పరంధామా! అతుల్యుడవైన నీతో *(అతులః)* సమంగా తులతూగేవారు

సమస్త చరాచర సృష్టిలో ఎవ్వరూ లేరు. జీవుల శరీరాలలో *(శరభో)* నివసించే నీవు..

అధర్మ మార్గంలో పయనించే వారిలో భయాన్ని *(భీమ)* కలుగజేస్తావు. సృష్టి అనే

మహాయజ్ఞాన్ని (సృజన - పోషణ- విధ్వంసం) సమయానుకూలంగా నిర్వహించే

యజ్ఞకర్తా *(సమయజ్ఞా)!* నీవు వివిధ లోకాలలో జరిగే యజ్ఞ క్రతువులలో సమర్పించే

హవిస్సును ప్రీతితో స్వీకరించే హరివి *(హవిర్హరిః).*


సకల జ్ఞానసంపన్నుడవైన *(సర్వలక్షణ)* నీవు బ్రహ్మజ్ఞానాన్ని *(లక్షణ్య)*

బ్రహ్మజిజ్ఞాసువులకు అందజేస్తావు. భక్తులకు లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించే *లక్ష్మీపతివై*

ఆమెను నీ హృదయ పద్మంలో ధారణ చేసినవాడవు. యుద్ధాలలో సదా విజయుడిగా

నిలిచే ఓ *సమితింజయా!* నీకు నా నమస్సుమాంజలి.


🌼 *యోగార్థం :* ఓపరంధామా! దేహమే దేవాలయమని విశ్వసిస్తున్న యోగులు.. ఆత్మనే దైవంగా

కొలుస్తారు. *సాధన ద్వారా మృత్యు భయాన్ని జయించిన వీరు..* *ఆత్మోన్నతికై నిరంతరం*

*తపిస్తూ.. జీవన యజ్ఞాన్ని* *పూర్తి జాగరూకతతో* *కొనసాగిస్తూ.. సమయానుకూలంగా*

*స్పందిస్తారు. జీవుల దుఃఖానికి మూలమైన* *అవిద్యను రూపుమాపటానికై..*

*జ్ఞానయజ్ఞాన్ని*

*చేబట్టి.. ఆత్మజ్ఞానాన్ని పంచుతూ.. జీవులను కర్మపాశాల నుండి* *విముక్తులను చేస్తారు.*


     ఆత్మజ్ఞానం పొందిన సాధకుల నేత్రాల నుండి వెలువడే ఆనందపు వెలుగులకు

(శ్రీ) ప్రీతిచెంది.. ఆనందతరంగపు కెరటాలనే సృష్టిస్తారు. అతుల్యమైన అలాంటి

యోగులకు నా యోగసుమాంజలి.


                   *- శ్రీమతి గుత్తా లక్ష్మీ*


🧘‍♀🌏💦🔥💨🎇🌞🌛🌟🌈

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

 కందిపప్పు రేటు విని గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు.

డెత్ సర్టిఫికెట్లొ చావు కారణం ఇలా వ్రాసారు " పల్స్ రేటు ఎక్కువయి "

ఒక గుడిలో ఒక గాడిద ఉండేది ... జనాలు దేవుడికి పూజలు చేయడం చూసి ఇది కూడా మొదలెట్టింది ....

దీని పుజలకి మెచ్చి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు ..

దేవుడు : ఎమ్ కావాలో కోరుకో ?

గాడిద : తర్వాత జన్మలో కూడా నన్ను గాడిద లానే పుట్టించు సామీ .....

దేవుడు : రెండు జన్మల్లో ఒకేలా పుట్టించడమ్ కుదరదు ..ఇంకేదైనా కోరుకో ...

గాడిద : సరే నన్ను ' భర్త ' గా పుట్టించు....

దేవుడు : ఎదవ తెలివితేటలు చూపించమాకు నా దగ్గర ... ఒకేలా రెండు సార్లు పుట్టించడమ్ కుదరదని చెప్పానా........

😊😊😊😊😊😊😊😊😊

నెలరోజుల కోసం పుట్టింటికెళ్లిన రమ్య మూడ్రోజుల్లోనే తిరిగొచ్చి తలుపు తట్టింది..

తలుపు తీసిన భర్త సుబ్బారావు..పకపకా నవ్వుతుండడం చూసి ఆశ్చర్యంగా అడిగింది.

"దేనికలా నవ్వుతున్నావ్..?"

"ఏం లేదు..మన పెద్దలు చెబుతుంటారుగా..భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నవ్వుతూ ఎదురెళ్ళాలని..అందుకే."

వైఫ్ షాక్..హస్బెండ్ రాక్..

😊😊😊😊😊😊😊😊

ఓ వ్యక్తి ఓ రోజు భార్యతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ అమ్మాయి అతన్ని చూసి హల్లో చెప్పింది.

అప్పుడు భార్యాభర్తల మధ్య సంభాషణ ఇలా సాగింది.

భార్య: ఆమె ఎవరు...

భర్త: మాట్లాడకు.. వింటే ఇబ్బంది.. ఆమె కూడా అదే ప్రశ్న వేస్తుంది..

😊😊😊😊😊😊😊😊

అత్త "శివగామి" Vs కొత్త కోడలు"దేవ సేన"

అత్త "శివగామి".... ఇంట్లో వాళ్ల అలవాట్లూ .. జాగ్రత్తలు కొత్తకోడలుకి .... చెబుతోంది

"ఇదిగో చూడు కోడలా.... పకోడీలు వేసేటప్పుడు.... ఒక్కొక్క పకోడీ వేసి వేయించాలి .... అప్పుడే మీ మావ గారికి ఇష్టం!!!

" బెండకాయలు తరిగే ముందు.... ఒక్కొక్క బెండకాయా బాగా కడగాలి.... అప్పుడే కూర బాగుంటుంది !!! "

" కొత్తిమీర ... ఒక్కొక్క ఆకూ కోసాక ... బాగా కడిగి ... వెయ్యాలి ... అప్పుడు కూర రుచిగా వుంటుంది "

అలా రెండు మోడు రోజులు కోడలు ... ఈ అత్త నసని‌ ఓపికగా విన్నది .... ఓపిక పట్టింది!!!

నాలుగో రోజు...

"అత్తా....కొంచెం కూర చూస్తూ వుండండి ... తలస్నానం చేసి వస్తాను" అని బాత్రూమ్ లోకి దూరింది !!

కూర తయారయ్యింది ......

సాంబార్ తయారయ్యింది .....

చట్నీ చెయ్యడం తయారయ్యింది .....

కానీ కోడలు "దేవసేన" మటుకు ఇంకా బాత్ రూమ్ నుండి బయటకు రాలేదు!!!

అత్త "శివగామి" లో సహనం చచ్చిపోయింది!!!

బాత్రూమ్ దగ్గరకు వెళ్లి....

"ఎం!? ఇంకా స్నానం చేస్తున్నావా .... లేక నిద్ద్రోతున్నావా? " అంటూ గట్టిగా ఓ అరుపు అరిచింది!!

కోడలు దేవసేన అమాయకంగానూ వినయంగానూ "అయ్యో రామా ... స్నానం చేస్తున్నాను అత్తయ్యా ... తలమీద ... ప్రతి వెంట్రుకా జాగర్తగా విడదీసి తీసి .... షాంపూ పెడుతున్నాను ... ఇలా స్నానం చేస్తే మంచిదని .... మీ అబ్బాయి చెప్పారు మరి"!!

అత్త షాక్‌ ...కోడలు రాక్‌...

😊😊😊😊😊😊😊😊

బ్యాంక్ లో గోడకి ఒక సూచన తగిలించారు ...

" వేలిముద్ర వేసేవాళ్లు , ముద్ర వేసిన తరువాత ఆ సిరా ను తుడుచుకోవడానికి గోడను ఉపయోగించరాదు " అని ...

అక్కడ నాలాంటి తింగరోడు ప్రతిస్పందన ...

" ఓరి సన్నాసుల్లారా ‌..! అది చదవడమే వస్తే , వేలిముద్రలు ఎందుకు వేస్తార్రా ..!? " అని ...

" Point to be noted " కదా ...

😊😊😊😊😊😊😊😊😊

పేషంట్ః ‘’ డాక్టరు గారూ,నేనుఎప్పుడూ అతి సంతోషంతో ఉంటాను.నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది.అన్ని పనులూ చాలా శ్రధ్ధగా మనసు పెట్టి చేస్తుంటాను. మిగతా వాళ్ళను చూస్తుంటాను.అందరూ ఏ పని చెయ్యాలన్నా ఎంతో ఆదుర్దా పడిపోతుంటారు.అనవసర భయాలు పడుతుంటారు.

నేను మాత్రం ఎటువంటి ఆందోళనా పడను. ఎంతో ఉత్సాహంగా ఉంటాను. నేనే ఎందుకలా ఉంటాను?ఇదేమీ జబ్బు కాదు కదా? ‘’

డాక్టరుః’’మీ పరిస్థితి అర్ధం చేసుకున్నాను.మీకు జీవితంలో విటమిన్ ‘’SHE’’ తక్కువైంది. అది పడితే మీరూ మిగతావాళ్లలాగే నార్మల్ అయిపోతారు.

😊😊😊😊😊😊😊😊😊

ప్రతీది వాట్సాప్ లో పోస్ట్ చేయడం కామెంట్స్ కోసం ఎదురు చూడడం ఫ్యాషన్ అయిపోయింది........

ఆ మధ్య ఒకాయన ఓ పోస్టుపెట్టి కాసేపటితర్వాత ''డిలీట్''చేసాడు.కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆయన పెట్టిన పోస్టు ఏమిటో తెలుసా?

''గత నెలలో వారింట్లో జరిగిన రెండు తద్దినాల తాలూకు ఫోటోలు''

ఓ గంట తర్వాత వచ్చిన కామెంట్స్ చూసి చిర్రెత్తు కొచ్చి పోస్టు తొలగించేశాడు. ఏం కామెంట్స్ వచ్చాయో ఓ సారి చూద్దాం.

1.హేపీ తద్దినం.

2.తద్దినం శుభాకాంక్షలు.

3.నిత్యం మీ ఇల్లు తద్దినాల తో కళకళలాడాలనిఆకాంక్షిస్తున్నా.

4.మీ ఇంట్లో తద్దినం మా కెంతో ఆనందం.

ఇవన్నీ చూసి చిరాకుతో పోస్టు తొలగించేశాడు.

😊😊😊😊😊😊😊😊😊



ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి ప్రముక సైకియాట్రిస్ట్ విచ్చేసారు ఓక వార్డ్ లోకి వెళ్ళారు.

అక్తడ ఓక పేషేంట్ చిరిగిన బట్టలు, చింపిరిజుట్టుతో ''ప్రియా!! ప్రియా!! అని అరుస్తున్నాడు..

డాక్టర్ తన అసిస్టెంట్ తో అడిగారు

ఇతని ప్రాబ్లం ఏంటి అని

అసిస్టెంట్ > సార్ ఇతను ప్రియా అనే అమ్మాయి ప్రేమించుకున్నారు.

కాని ప్రియ కి వేరేవాడితో పెళ్ళయ్యింది అందుకే పిచ్చోడై ఇలా అరుస్తున్నాడు..

మల్లీ డాక్టర్ ఇంకో వార్డ్ లోకి వెళ్ళారు

అక్కడ ఇంకో పేషేంట్ చిరిగిన బట్టలు చింపిరిజుట్టుతో

''ప్రియా!! ప్రియా!! అని అరుస్తున్నాడు..

.

డాక్టర్ > ఇదేంటి తనూ ప్రియా అనే అరుస్తున్నాడు.

.

అసిస్టెంట్> ప్రియని పెళ్ళి చేసుకుంది ఇతనే సార్..

😊😊😊😊😊😊😊😊

ఒక చోట ఆడవాళ్లంతా లైన్లో నుంచుని ఓ ముష్టివాడికి అన్నం, డబ్బులు వేస్తూ అతనికి ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు.

అటుగా వెళ్తున్న సోము.. ఆ లైన్లో తన భార్య కూడా ఉండటం చూసి, ఏం జరుగుతుందే అక్కడ అని భార్య వాసవిని అడిగాడు.

వాసవి : అబ్బే, ఏం లేదండి.. ఈ రోజు దానం చేసేవాడికి మన ముష్టేషు కొత్త పథకం పెట్టాడు.

సోము : ముష్టివాడు కొత్త పథకం ఏమిటే, మతి పోయిందా?

వాసవి : అవునండి, మనం ముష్టి వేసి.. ఫోన్ నెంబరు ఇస్తే,

రేపు లక్కీ డ్రా తీస్తాడట. అందులో ఎవరు ఫోన్ నెంబరు వస్తుందో వారికి రైస్

కుక్కర్ బహుమతిగా ఇస్తాడట.

సోము : అ!!!

😊😊😊😊😊😊మాధ్యాహ్నిక శుభాకాంక్షలతో...💐🥱🤣😜🤔

 *నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం.*

ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం


 *అమ్మ అరగంట కనబడ కుంటేనే అల్లాడిపోయిన మనం..* 

అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం..


 *నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...* 

నేనే హీరో”...  నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం..


 *నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లు స్నేహితులతో పంచుకున్న మనం...* 

చిల్లరబుద్ధులతో,సంపాదనలో, అవే చిల్లర కూడా, .....తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచు కుంటున్నాం..


 *చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం..* 

ఇప్పుడు వస్తుంటే భయపడుతున్నాం...


 *బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటిపడుతూ ఒకే కుటుంబంగా పెరిగిన మనం..* 

ఇప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక కుటుంబాన్ని చిన్నదిగా మల్చు కుంటున్నాం..


 *చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం...* 

ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం..!


*మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి.., కొన్నాళ్ళు మనిషిలానే పెరుగు తున్నాం.*..

కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం...


 *మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం..!* 

మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం.!!


*నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం.!!!*

ఎందుకంటే... 

మనం ఎదుగుతున్నాం..!


మనం మనకే అందనంతగా...

మనం ఎదుగుతున్నాం..!


మనం,మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం అని కూడా తెలియనంతగా...


నిజంగా మనం ఎదుగుతున్నామా?...


........ ఆలోచన చేయండి.....


*

Tuesday, 12 July 2022

గురు పౌర్ణమి

*👣శ్రీఆదిశంకరాచార్య విరచితం  శ్రీ గురుపాదుకా స్తోత్రం👣*   

                      

ఓంశ్రీమాత్రే నమః



*శ్రీ గురుపాదుకా స్తోత్రం-తాత్పర్యం*

*ॐॐॐॐॐॐॐॐ*


*1) అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |*


*వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||*



*2) కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ |*


*దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||*



*3) నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |*


*మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||*



*4) నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ |*


*నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||*



*5) నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ |*


*నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||*



*6) పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యామ్ |*


*జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||*



*7) శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యామ్ |*


*రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||*



*8) స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్ |*


*స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||*



*9)కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్ |*


*బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||*


1)అనంత సంసార సముద్ర తార

నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం

వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం!!


అనంత - అంతు లేని

సంసార - ప్రపంచం అనే

సముద్ర - కడలి (ని)

తార - దాటించే

నౌకాయితాభ్యాం - నౌకల వంటివి

గురుభక్తిదాభ్యాం - గురువు పట్ల భక్తిని ఇచ్చేటివి

వైరాగ్య - వైరాగ్యం అనే

సామ్రాజ్యద - సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకు

పూజనాభ్యాం - పూజించదగినవాటికి

శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళదాయకమైన గురువు పాదుకలకు

నమో నమః - నమస్సులు

గురుపాదుకలు అంతులేని సంసారం అనే కడలిని దాటించే నౌకలు. అవి గురువు పైన భక్తిని కలిగించి నిలుపుతాయి. అవి (నిస్సారమైన ప్రపంచం పై) వైరాగ్యం అనే సామ్రాజ్యాన్ని పొందడానికి పూజించదగినవి. వాటికి నా నమస్కారములు.



2)కవిత్వ వారాశి నిశాకరాభ్యాం

దౌర్భాగ్య దావాంబుదమాలికాభ్యాం

దూరీకృతానమ్ర విపత్తతిభ్యాం 

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం!!


కవిత్వ - కవిత్వం (అనే)

వారాశి - కడలి (కి)

నిశాకరాభ్యాం - చంద్రుడి వంటివి (వన్నె తెచ్చెడివి)

దౌర్భాగ్య - దురదృష్టం (అనే)

దావ - మంట (కు)

అంబుద మాలికాభ్యాం - నీటి మాలల (కుండపోత వర్షం) వంటివి

దూరీకృత - దూరం చెసినవి

ఆనమ్ర - మొక్కెడి వారికి

విపత్ తతిభ్యాం - ఆపదల వరుసను

శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు

నమో నమః - నమస్సులు

గురు పాదుకలు కడలికి చంద్రుడి వలె విద్యకు వన్నె తెచ్చెడివి. దురదృష్టం అనే మంటను ఆర్పేటి జడివానలు. మొక్కెడి వారికి వచ్చిన ఆపదలను అన్నింటినీ తొలగించెడివి. వాటికి నమస్సులు.



3)నతా యయో శ్రీపతితాం సమీయుః

కదాచిదప్యాశు దరిద్రవర్యాః

మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం!!


యయోః - వేటికైతే

కదాచిత్ - ఎప్పుడో ఒక సారి మాత్రమే

నతా - మొక్కిన వారు

అపి - అయినా

హి - కచ్చితంగా

ఆశు - వెంటనే

దరిద్రవర్యాః - అత్యంత దరిద్రంలో ఉన్న వారు

శ్రీపతితాం - సిరులకు నెలవు

చ - మరియు

మూకాః - మూగవారు

వాచస్పతితాం - మాటలకు నెలవు (దేవ గురువు బృహస్పతి)

సమీయుః - వలే ఐనారో

తాభ్యాం - వాటికి

శ్రీ గురుపాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు

నమో నమః - నమస్సులు.


ఎప్పుడో ఒక సారి మాత్రమే మొక్కినప్పటికీ వెంటనే దరిద్రులను నారాయణునితో (లక్ష్మీ దేవి భర్త), మూగవారిని బృహస్పతితో సమానంగా కచ్చితంగా చెయ్యగల గురువు పాదుకలకు నమస్సులు.     



  4)నాళీక నీకాశ పదాహృతాభ్యాం

నానా విమోహాది నివారికాభ్యాం

నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం!!


నాళీక - తామర పువ్వు

నీకాశ - వలె కనిపించు

పద ఆహృతాభ్యాం - పాదములను అంటిపెట్టుకునేవి

నానా - రకరకాల

విమోహ ఆది - వ్యామోహాలు మొదలైనవి

నివారికాభ్యాం - తొలగించేవి

నమత్ - నమస్కరించే

జన - జనుల

అభీష్ట తతి - కోర్కెలను అన్నింటినీ

ప్రదాభ్యాం - ప్రసాదించేవి

శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు

నమో నమః - నమస్సులు


తామర పువ్వుల వంటి గురువు పాదాలను అంటిపెట్టుకున్న పాదుకలు రకరకాల వ్యామోహాలను తొలగిస్తాయి. నమస్కరించిన వారి కోర్కెలను అన్నింటినీ నెరవేర్చేవి. వాటికి నమస్సులు.



 5)నృపాళి మౌళి వ్రజ రత్న కాంతి

సరిద్విరాజత్ ఝష కన్యకాభ్యాం

నృపత్వదాభ్యాం నత లోక పంక్తేః

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం!!


నృప ఆళి - అనేక రాజుల

మౌళి - కిరీటాల

వ్రజ - గుంపు (యొక్క)

రత్న కాంతి - రత్నాల కాంతి (యొక్క)

సరిత్ - నది (లో)

విరాజత్ - మెరిసేటి

ఝష కన్యకాభ్యాం - అందమైన చేపల వంటివి

నత - నమస్కరించిన వారికి

లోక పంక్తేః - లోకాలు అన్నింటికీ

నృపత్వదాభ్యాం - ఆధిపత్యం ఇచ్చేటివి

శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు

నమో నమః - నమస్సులు.


అనేకమంది రాజుల కిరీటాలను ఒక చోట చేర్చగా వాటిలో ఉన్న రత్నాల వెలుగంతా ఒక నదిగా మారితే అంతటి వెలుగులో కూడా మెరిసేటి చేపల వంటివి గురువు పాదుకలు. అంటే ఎంతటి సిరులు, అధికారం కూడా గురువు చెప్పుల పాటి చెయ్యవు. ఆ గురువు పాదుకలకు నమస్కరించిన వారికి అనేక లోకాల ఆధిపత్యాన్ని ప్రసాదించగలిగిన శక్తి కలిగినవి గురువు పాదాలు. వాటికి నమస్సులు.   



 6)పాపాంధకారార్క పరంపరాభ్యాం

తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం

జాడ్యాబ్ధి సంశోషణబాడబాభ్యాం

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం!!


పాప - పాపము (అనెడి)

అంధకార - చీకటి (కి)

అర్క - సూర్యుల

పరంపరాభ్యాం - వరుస వంటివి

తాపత్రయ - తాపత్రయము (అనెడి)

అహి + ఇంద్ర - అత్యంత శక్తివంతమైన పాముకు

ఖ + గ + ఈశ్వరాభ్యాం - ఆకాశంలో సంచరించే వాటికి (పక్షులకు) అధిపతి (గరుత్మంతుడు - గెద్ద) వంటివి

జాడ్య + అబ్ధి - అజ్ఞానం అనే సముద్రాన్ని

సంశోషణ - ఎండబెట్టేటి

బాడబాభ్యాం - భయంకరమైన నిప్పు వంటి వాటికి

శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు

నమో నమః - నమస్సులు.


గురువు పాదుకలు పాపము అనే చీకటిని మొత్తంగా నాశనం చేసేటి వేలాది సూర్యులతో సమానం. అవి తాపత్రయాలు అనే పాముని చంపేటి గెద్ద వంటివి. అజ్ఞానం అనే కడలిని ఎండబెట్టేటి బలమైన నిప్పు వంటివి. వాటికి నమస్సులు.



7) శమాది షట్క ప్రద వైభవాభ్యాం

సమాధి దాన వ్రత దీక్షితాభ్యాం

రమా ధవాంఘ్రి స్థిర భక్తిదాభ్యాం

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం!!


శమాది షట్క ప్రద - శమము మొదలుగా గల ఆరు లక్షణాలను ఇచ్చే

వైభవాభ్యాం - మహత్తు కలిగినవి

సమాధి - బ్రహ్మంతో ఐక్యత

దాన - ఇవ్వడం (అనే)

వ్రత - వ్రతాన్ని

దీక్షితాభ్యాం - దీక్షగా తీసుకున్నవి

రమా - లక్ష్మీ దేవి

ధవ - భర్త

అంఘ్రి - పాదాలు

స్థిర - నిలకడగా

భక్తిదాభ్యాం - భక్తిని ప్రసాదించేటి వాటికి

శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు

నమో నమః - నమస్సులు.


గురు పాదుకలు (వివేక చూడామణిలో చెప్పబడిన) శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనే మోక్షప్రదమైన గుణాలను ప్రసాదించే మహత్తు కలిగినవి. శ్రద్ధగా ఉన్న వారికి బ్రహ్మపదాన్ని అందించడమే కర్తవ్యంగా ఉన్నవి. నారాయణుని పాదాల పట్ల భక్తిని నిలకడగా ఉంచగలిగినవి. వాటికి నమస్సులు.


   

8)స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం

స్వాహాసహాయాక్ష ధురంధరాభ్యాం

స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం


స్వ - వాటిని

అర్చ - మొక్కడమే

పరాణాం - తమ కర్తవ్యంగా కలవారికి

అఖిల - అన్ని

ఇష్టదాభ్యాం - ఇష్టాలనూ నెరవేర్చేవి

స్వాహా - స్వాహా దేవి (కి)

సహాయః - తోడుగా ఉండెడి వాడిని (అగ్ని: ఆయన భార్య స్వాహా దేవి)

అక్ష - కన్నుగా కలవాడికి (శివుడికి)

ధురంధరాభ్యాం - సమానమైన శక్తి కలవాటికి

స్వాంత - హృదయం

అచ్ఛ - శుద్ధి

భావ - స్థితి

ప్రద - ఇచ్చేందుకు

పూజనాభ్యాం - పూజించదగినవి

శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు

నమో నమః - నమస్సులు.


వేటిని అర్చించడంలో మునిగిన వారికి అన్ని కోర్కెలూ నెరవేరుతాయో, శివుడికి ఉన్నంత శక్తి వేటికి కలదో, వేటిని పూజిస్తే మనస్సు నిర్మలమౌతుందో - ఆ గురువు పాదుకలకు నమస్సులు.



9)కామాది సర్ప వ్రజ భఙ్జకాభ్యాం

వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం

బోధప్రదాభ్యాం ద్రుత మోక్షదాభ్యాం 

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం!!


కామ + ఆది - కామము మొదలైన

సర్ప వ్రజ - పాముల వరుస

భఙ్జకాభ్యాం - త్రుంచేవి

వివేక - ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే తెలివి

వైరాగ్య - అశాశ్వతమైన వాటి పైన కోరిక లేకుండుట

నిధి ప్రదాభ్యాం - (వివేకము, వైరాగ్యము అనే) నిధులను ప్రసాదించెడివి

బోధప్రదాభ్యాం - జ్ఞానాన్ని బోధించేవి

ద్రుత - వేగంగా

మోక్షదాభ్యాం - మోక్షాన్ని కలిగించేవి 

శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు

నమో నమః - నమస్సులు.


గురు పాదుకలు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే ఆరు పాములను (అరిషడ్వర్గం) నాశనం చేస్తాయి. వివేకం, వైరాగ్యం అనే గొప్ప సిరులను ప్రసాదిస్తాయి. జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, త్వరగా మోక్షాన్ని ఇస్తాయి. వాటికి నమస్సులు.


శ్రీ గురు పాదుకాభ్యాం నమః!!

చాతుర్మాస్య వ్రతం హిందువులు ఆచరించే ఒక వ్రతం.🍁

చాతుర్మాస్య వ్రతం


⭐చాతుర్మాస్య వ్రతం హిందువులు ఆచరించే ఒక వ్రతం. ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు. ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధచాతుర్మాస్యం అనే పేరుతో చేస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ, పురుష భేదం గానీ, జాతి భేదం గానీ లేదు. వితంతువులు, యోగినులు మొదలైనవారెవరైనా చేయవచ్చును. ఇది హిందువులతో పాటు జైన, బౌద్ధ మతస్థులు ఉండే సమాజములోను ఆచరణలో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గానీ, వీలుకాకపోతే కటక సంక్రాంతి, కాకపొతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలని చెప్తారు.


చాతుర్మాస్యం చరిత్ర

⭐ఈ చాతుర్మాస వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య, స్కాంద పురాణాలలోని కథనాల వలన అవగతమవుతుంది. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలలుపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట. అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారాయి. తొలినాళ్ళలో వర్ష, హేమంత, వసంత - అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువుతోనే సంవత్సరము ఆరంభామవుతూ ఉండేది. ఈ కారణం వల్ల సంవత్సరానికి " వర్షం" అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలములో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు.


⭐ ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుండి సాకమేద యజ్ఞం, ఫాల్గుణ పూర్ణిమ నుండి వైశ్వ దేవయజ్ఞము చేస్తూ ఉండేవారు. ఆ నాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాస్య వ్రతము గా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది - మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాఙ్మయం వివరిస్తోంది.


ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్

వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్

దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః


వ్రత నియమాలు

చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస) వారు పాటించవచ్చు. కుల, వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ మొదటి నెలలో కూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ మాసం లో పప్పు దినుసులూ తినకూడదు. భాగవతం వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు.


⭐ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు. ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం. వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి. ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. యోగసాధన చేయడం శ్రేయస్కరం.దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.


వ్రత వృత్తాంతము

⭐చతుర్మాసాలు అంటే, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు. ఆషాఢ, శ్రావణ, బాధ్రపద, ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాట, ఆవనూనెల సేవనం మానివేయటం, నిరంతర జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపటం, రోజూ ఒకే పూట భోజనం చేయటం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం, క్షురకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. శ్రావణ, బాధ్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలుపుతోంది. బాధ్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు.


⭐ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంటారు. హరిశ్చంద్ర మహారాజు సత్యం, ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదని, చివరికి విజయం చేకూరిందని చెబుతారు. చాతుర్మాస్య దీక్షలో గోపద్మ వ్రతం గురించి మూడు పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి.


⭐పరోపకారం, సేవాభావం, పరులను గౌరవించడం, చాతుర్మాస్య నియమాలు పాటించడం - మానవాళికి ఎంతో శుభం, ఆనందం చేకూరుస్తాయని అందరి నమ్మకం.

............

 *గురు అక్షరమాల స్తుతి*


*అ - అద్వైతమూర్తి - గురువు*

*ఆ - ఆనందస్ఫూర్తి - గురువు*

*ఇ - ఇలదైవం - గురువు*

*ఈ - ఈశ్వరరూపము - గురువు*

*ఉ - ఉద్ధరించువాడు - గురువు*

*ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు*

*ఋ - ఋజువర్తనుడు - గురువు*

*ౠ - ఋణము లేనివాడు - గురువు*

*ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు*

*ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు*

*ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు*

*ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు*

*ఓ - ఓంకార రూపము - గురువు*

*ఔ - ఔదార్య మేరువు - గురువు*

*అం - అందరూ సేవించేది - గురువు*

*అః - అహంకార రహితుడు - గురువు*

*క - కళంకము లేనివాడు - గురువు*

*ఖ - ఖండరహితుడు - గురువు*

*గ - గుణాతీతుడు - గురువు*

*ఘ - ఘనస్వరూపము - గురువు*

*ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు*

*చ - చక్రవర్తి - గురువు*

*ఛ - ఛత్రము వంటి వాడు - గురువు*

*జ - జనన మరణములు లేని వాడు - గురువు*

*ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు*

*ఞ - జ్ఞానస్వరూపము - గురువు*

*ట - నిష్కపటుడు - గురువు*

*ఠ - నిష్ఠకలవాడు - గురువు*

*డ - డంబము లేనివాడు - గురువు*

*ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు*

*ణ -  తూష్ణీభావము కలవాడు - గురువు*

*త - తత్త్వోపదేశికుడు - గురువు*

*థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు*

*ద - దయాస్వరూపము - గురువు*

*ధ - దండించి బోధించువాడు - గురువు*

*న - నవికారుడు - గురువు*

*ప - పంచేంద్రియాతీతుడు - గురువు*

*ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు*

*బ - బంధము లేనివాడు - గురువు*

*భ - భయరహితుడు - గురువు*

*మ - మహావాక్యబోధకుడు - గురువు*

*య - యమము కలవాడు - గురువు*

*ర - రాగద్వేష రహితుడు - గురువు*

*ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు*

*వ - వశీకరణశక్తి కలవాడు - గురువు*

*శ - శమము కలవాడు - గురువు*

*ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు*

*స - సహనశీలి - గురువు*

*హ - హరిహర రూపుడు - గురువు*

*ళ - నిష్కళంకుడు - గురువు*

*క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు*

*ఱ-ఎఱుకతో ఉన్నవాడు - 

గురువు* *లందరికి 

గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🙏*

..........

శ్రీ వేదవ్యాస అష్టోత్తరశతనామ స్తోత్రం.....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


ఓం వేదవ్యాసాయ నమః | 

ఓం విష్ణురూపాయ నమః | 

ఓం పారాశర్యాయ నమః | 

ఓం తపోనిధయే నమః | 

ఓం సత్యసన్ధాయ నమః | 

ఓం ప్రశాన్తాత్మనే నమః | 

ఓం వాగ్మినే నమః | 

ఓం సత్యవతీసుతాయ నమః | 

ఓం కృష్ణద్వైపాయనాయ నమః |  | 


 

ఓం దాన్తాయ నమః | 

ఓం బాదరాయణసంజ్ఞితాయ నమః | 

ఓం బ్రహ్మసూత్రగ్రథితవతే నమః | 

ఓం భగవతే నమః | 

ఓం జ్ఞానభాస్కరాయ నమః | 

ఓం సర్వవేదాన్తతత్త్వజ్ఞాయ నమః | 

ఓం సర్వజ్ఞాయ నమః | 

ఓం వేదమూర్తిమతే నమః | 

ఓం వేదశాఖావ్యసనకృతే నమః |  | 

 


ఓం కృతకృత్యాయ నమః | 

ఓం మహామునయే నమః | 

ఓం మహాబుద్ధయే నమః | 

ఓం మహాసిద్ధయే నమః | 

ఓం మహాశక్తయే నమః | 

ఓం మహాద్యుతయే నమః | 

ఓం మహాకర్మణే నమః | 

ఓం మహాధర్మణే నమః | 

ఓం మహాభారతకల్పకాయ నమః |  | 

 


ఓం మహాపురాణకృతే నమః | 

ఓం జ్ఞానినే నమః | 

ఓం జ్ఞానవిజ్ఞానభాజనాయ నమః | 

ఓం చిరఞ్జీవినే నమః | 

ఓం చిదాకారాయ నమః | 

ఓం చిత్తదోషవినాశకాయ నమః | 

ఓం వాసిష్ఠాయ నమః | 

ఓం శక్తిపౌత్రాయ నమః | 

ఓం శుకదేవగురవే నమః | | 

 


ఓం గురవే నమః | 

ఓం ఆషాఢపూర్ణిమాపూజ్యాయ నమః | 

ఓం పూర్ణచన్ద్రనిభాననాయ నమః | 

ఓం విశ్వనాథస్తుతికరాయ నమః | 

ఓం విశ్వవన్ద్యాయ నమః | 

ఓం జగద్గురవే నమః | 

ఓం జితేన్ద్రియాయ నమః | 

ఓం జితక్రోధాయ నమః | 

ఓం వైరాగ్యనిరతాయ నమః | | 

 


ఓం శుచయే నమః | 

ఓం జైమిన్యాదిసదాచార్యాయ నమః | 

ఓం సదాచారసదాస్థితాయ నమః | 

ఓం స్థితప్రజ్ఞాయ నమః | 

ఓం స్థిరమతయే నమః | 

ఓం సమాధిసంస్థితాశయాయ నమః | 

ఓం ప్రశాన్తిదాయ నమః | 

ఓం ప్రసన్నాత్మనే నమః | 

ఓం శఙ్కరార్యప్రసాదకృతే నమః |  | 

 


ఓం నారాయణాత్మకాయ నమః | 

ఓం స్తవ్యాయ నమః | 

ఓం సర్వలోకహితే రతాయ నమః | 

ఓం అచతుర్వదనబ్రహ్మణే నమః | 

ఓం ద్విభుజాపరకేశవాయ నమః | 

ఓం అఫాలలోచనశివాయ నమః | 

ఓం పరబ్రహ్మస్వరూపకాయ నమః | 

ఓం బ్రహ్మణ్యాయ నమః | 

ఓం బ్రాహ్మణాయ నమః | | 

 


ఓం బ్రహ్మిణే నమః | 

ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః | 

ఓం బ్రహ్మాత్మైకత్వవిజ్ఞాత్రే నమః | 

ఓం బ్రహ్మభూతాయ నమః | 

ఓం సుఖాత్మకాయ నమః | 

ఓం వేదాబ్జభాస్కరాయ నమః | 

ఓం విదుషే నమః | 

ఓం వేదవేదాన్తపారగాయ నమః | 

ఓం అపాన్తరతమోనామ్నే నమః |  | 

ఓం వేదాచార్యాయ నమః | 

 


ఓం విచారవతే నమః | 

ఓం అజ్ఞానసుప్తిబుద్ధాత్మనే నమః | 

ఓం ప్రసుప్తానాం ప్రబోధకాయ నమః | 

ఓం అప్రమత్తాయ నమః | 

ఓం అప్రమేయాత్మనే నమః | 

ఓం మౌనినే నమః | 

ఓం బ్రహ్మపదే రతాయ నమః | 

ఓం పూతాత్మనే నమః |  | 

 


ఓం సర్వభూతాత్మనే నమః | 

ఓం భూతిమతే నమః | 

ఓం భూమిపావనాయ నమః | 

ఓం భూతభవ్యభవజ్జ్ఞాత్రే నమః | 

ఓం భూమసంస్థితమానసాయ నమః | 

ఓం ఉత్ఫుల్లపుణ్డరీకాక్షాయ నమః | 

ఓం పుణ్డరీకాక్షవిగ్రహాయ నమః | 

ఓం నవగ్రహస్తుతికరాయ నమః | 

ఓం పరిగ్రహవివర్జితాయ నమః | | 

 


ఓం ఏకాన్తవాససుప్రీతాయ నమః | 

ఓం శమాదినిలాయాయ నమః | 

ఓం మునయే నమః | 

ఓం ఏకదన్తస్వరూపేణ లిపికారిణే నమః | 

ఓం బృహస్పతయే నమః | 

ఓం భస్మరేఖావిలిప్తాఙ్గాయ నమః | 

ఓం రుద్రాక్షావలిభూషితాయ నమః | 

ఓం జ్ఞానముద్రాలసత్పాణయే నమః | 

ఓం స్మితవక్త్రాయ నమః |  | 

 


ఓం జటాధరాయ నమః | 

ఓం గభీరాత్మనే నమః | 

ఓం సుధీరాత్మనే నమః | 

ఓం స్వాత్మారామాయ నమః | 

ఓం రమాపతయే నమః | 

ఓం మహాత్మనే నమః | 

ఓం కరుణాసిన్ధవే నమః | 

ఓం అనిర్దేశ్యాయ నమః | 

ఓం స్వరాజితాయ నమః |  |


 శ్రీ వేదవ్యాస అష్టోత్తరశతనామ స్తోత్రం సంపూర్ణం...

Sunday, 10 July 2022

*


ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ. దయచేసి సాంతం  చదవగలరు ......
" అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో." చిన్నకోడలు  పెద్దకోడలితో అంది.
" ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు. విషయమేంటి? " అని అడిగింది పెద్దకోడలు.
" ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది కదా. అప్పట్లో  మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ చేస్తున్నాము.  
మనకూ  పిల్లలు, సంసారం ఉన్నాయి. మామగారిని
ఎన్ని రోజులని చూడగలం. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంది చిన్నకోడలు. " ఏంటది అడిగింది పెద్దకోడలు.
మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో
చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో ప్రశాంతంగా  ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం మన పిల్లలతో హయిగా ఉండవచ్చు అనింది  చిన్నకోడలు.
" దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు. మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం అంది చిన్నకోడలు.
ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు. తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకుని చూసుకోవలని వారి ఉద్దేశ్యం.
కానీ రోజూ భార్యల నస భరించలేక ఇద్దరు కొడుకులు తండ్రితో ఇలా చెప్పారు. " నాన్నా! ఈ పిల్లల గొడవతో మీకు సమయానికి ఏవీ అందించలేక పోతున్నాం.
మీకు కూడా వయస్సు అయింది. అమ్మ ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి చూసుకునేది. దగ్గరిలోనే మంచి ఆశ్రమం ఉంది. మిమ్మల్ని అక్కడ
చేరుద్దామని అనుకుంటున్నాము. మీరేమంటారు? "
" నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎన్ని రోజులని మీరు నన్ను చూసుకుంటారు. మంచి విషయం చెప్పారు. పెట్టే, బేడా సర్ధుకుని బయలు దేరండి ఇద్దరూ!? అన్నారు తండ్రి కొడుకులతో. షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు నాన్న అలా అనేసరికి.
" అదేంటి నాన్నా ! అలా అనేశారు. మేము వెళ్ళడం ఏంటి? బయట బాడుగలు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి. ఆస్తిని మాకే కదా ఇవ్వాలి. ఆలోచించండి ఒకసారి."
" నిజమే! మీకే ఇవ్వాలి నా ఆస్తిని. కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది. ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ చాలా సంతోషంగా ఉన్నాం. ఆమెను తలచుకుంటు నేను ఈ ఇంట్లోనే కన్నుమూయాలి.
నా తదనంతరం మాత్రమే ఈ ఇల్లు మీకు. పైన ఇంటి బాడుగతో,నాకు వచ్చే పెన్షన్ తో ఎలాగోలా బ్రతికేస్తాను. బయలుదేరండి త్వరగా" అన్నాడు తండ్రి.
" అదేంటి మామగారూ! వూర్లో్ జనాలు ఏమను కుంటారు?  బయటికివెళ్ళి
అరకొర జీతాలతో ఎలా బ్రతకాలి మేము ఆలోచించండి" అన్నారు కోడళ్ళు.
నా గురించి ఆలోచించని మీరు జనాల గురించి ఆలోచిస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈ ఆలోచన మీదేనని నాకు తెలుసు. మరోదారిలేదు. మీరు ఇక్కడినుండి వేరే కాపురానికి వెళ్ళడమే మంచిది. బయలుదేరండి." అంటూ తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళి పోయాడు. షాక్ తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకూ...... కోడళ్ళకు.
తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు. వారు మిమ్మల్ని బాధపెట్టకుండా
ఆశ్రమాలకు వెళ్లి పోతున్నారు. కానీ  ఇలా తిరగబడితే తప్ప గౌరవంగా బ్రతకలేరు. ఏమీ లేనివారి పరిస్థితి సరే! ఆధారం,  ఆస్తి పాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాధ శరణాలల్లో ఉంటున్నారు.
 తల్లిదండ్రులను బిడ్డల్లా కాపాడండి. చివరి దశలో వారిని చిత్రవధ చేయకండి. వారికంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి.
ఓపిగ్గా చదివిన మీకు ధన్యవాదములు .......
ప్రముదితా -
==


*..భగవంతుని లీలలు.... మనుషులకు అర్దం కావు 

  వీధులు ఊడ్చేవాడు..... ఒకరోజు దేవుడితో మొర పెట్టుకున్నాడు.

 "రోజూ హాయిగా నీవు పూజలందుకుంటూ ఉంటావు.

 నా బతుకు చూడు. ఎంత కష్టమో.

 ఒక్క రోజు... ఒకే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా," 

అని సవాలు విసిరాడు. 

 దేవుడు విని.... 'సరే' నన్నాడు.  

"అయితే ఒక్క షరతు. ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. 

నోరు మెదపకూడదు."అన్నాడు దేవుడు. 

"సరే" అన్నాడు మనోడు. 

 తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. 

 కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. 

"దేవా ... నేను కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" 

అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. 

అప్పుడు జేబులోని పర్సు కింద పడిపోయింది. 

అతను చూడకుండా వెళ్లిపోయాడు. 

 మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు.

 కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.

 ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.

 "దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" 

అంటూ మోకరిల్లాడు.

 కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.

 "ఇలా దయ చూపించావా తండ్రీ" 

అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.  

"ఒరేయ్ దొంగా.... " 

అని అరుద్దామనుకున్నాడు మనోడు. 

కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. 

ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు. 

 "దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ" 

అన్నాడు.  

అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చి... 

"నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు.పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.

 "ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు." 

అని అరిచేశాడు. 

దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.

ఇచ్చిన ఒక్క రోజు గడువు అయి పోవడంతో... 

సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. 

దేవుడు కూడా తన అసలు డ్యూటీకి వచ్చేశాడు. 

"దేవా... ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా... నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాలని. ఒక దోషిని అరెస్టు చేయించాను." 

అన్నాడు మనోడు సంతోషంగా! 

దేవుడు "ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా... ఎందుకలా చేశావు." 

అన్నాడు నిష్ఠూరంగా.

 "అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావను కున్నాను."అన్నాడు మనోడు బాథగా! 

అప్పుడు దేవుడు అసలు విషయం బయట పెట్టాడు..... 

 "ధనవంతుడు మహాపాపాత్ముడు. 

వాడు అందరినీ దోచుకుంటాడు. 

వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు.

 ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. 

వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు.

 ఇప్పుడు చూడు... పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు...

 అన్నాడు దేవుడు. 

 దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు. 

కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు. 

ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

 అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ఆ భగవంతుడిని ధ్యానించండి..

     *నవ్వు నాలుగువిధాలా చేటు!*

నవ్వు అన్ని సమయాలలో ముఖానికి అందమూ మనసుకు ఆహ్లాదము కలిగించవు. నవ్వుల వల్ల కలిగిన ఎన్నో అనర్ధాల గురించి మన పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడ్డాయి. అలాటి కొన్ని సంఘటనలు చూద్దాము…సీతాకళ్యాణ సమయంలో సీతారాములను ఆశీర్వదించడానికి శివపార్వతులు కూడా విచ్చేసారు.  సీతాదేవిని తనకు పెళ్ళికానుకగా ఏమి కావాలో కోరుకోమన్నాడు పరమేశ్వరుడు.

సీత దీర్ఘదృష్టితో తనకు భవిష్యత్తులో ఏది ప్రయోజనకరమో త్రికాలజ్ఞుడైన త్రినేత్రునికే బాగా తెలుసని అటువంటిదానినే తనకు కానుకగా ఇవ్వమని కోరింది.

పరమశివుడు ఆలోచించాడు. గతంలో త్రిపురాసురులను తన క్రోధపూరితమైన నవ్వుతోనే భస్మంచేశాడు. అటువంటి నవ్వును సమయానుకూలంగా ఉపయోగించుకోమని సీతాదేవికి కానుకగా ఇచ్చాడు. ఆ నవ్వును సీతాదేవి తన మనసులో భద్రంగా పదిలపరుచుకున్నది.

రావణాసురునిచే లంకలోని అశోకవనంలో చెఱపట్టబడి వున్నప్పుడు సీతాదేవిని చూడడానికి హనుమంతుడు వచ్ఛాడు. మాటల సందర్భంలో రావణునిపట్ల గల కసిని క్రోధపూరితమైన నవ్వుగా వ్రెళ్ళగక్కింది. అది చూసిన హనుమంతుడు ఆవేశం చెందాడు. లంకా దహనం చేశాడు. నిజానికి ఆనాటి లంకా దహనం జరిగింది హనుమంతుని వలన కాదు. పరమేశ్వరుడు కానుకగా ఇచ్చిన నవ్వును సీతాదేవి ఈసందర్భంలో ఉపయోగించు కున్నది. మహాసాధ్వియైన సీతాదేవి రౌద్రం వలన కలిగిన నవ్వువలనే లంక దహించబడిందని ఒక  రామాయణ గ్రంధ వివరణ.

అలాగే రామాయణంలో జరిగిన మరో సంఘటన…

రావణ సంహారం అనంతరం అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం మహావైభవంగా సాగింది. శ్రీరాముడు తనకు సహాయం చేసిన వానర ప్రముఖులతో సహా అందరినీ సత్కరించి సంతోషపరుస్తున్నాడు.

ఆ సమయంలో పక్కనే వున్న లక్ష్మణుడు ఉన్నట్టుండి ఫకాలున నవ్వాడు. లక్ష్మణస్వామి ఎందుకు నవ్వాడో ఎవరికీ అర్ధంకాలేదు. శ్రీరాముడు , సీత , భరతుడు , సుగ్రీవుడు , హనుమంతుడు అందరూ ఎవరికివారే తమలోని ఏదో లోపాన్ని చూసే లక్ష్మణుడు నవ్వాడాని అతనిపై ఆగ్రహించారు. వారిని శాంతింపజేయడానికి వారికి క్షమాపణలు చెపుతూ తన నవ్వుకు గల కారణం గురించి లక్ష్మణుడు ఇలా చెప్పాడు…

సీతారాములతో పధ్నాలుగేళ్ళపాటు వనవాసంలో గడిపిన తను ఏ ఒక్కరాత్రి పగలు కూడా  ఒక్క క్షణమైనా నిద్రపోకుండా సీతారాముల కాపలాలో గడిపానని ఆ సమయంలో ఒక్క రెప్పపాటు సమయంలో కూడా నిద్రాదేవి ఆవహించలేదు. కానీ ఈ సంతోష సమయంలో యింతమంది ప్రముఖుల సమక్షంలో వున్న నన్ను నిద్రాదేవి ఆవహించిందని  తన ఈ దురవస్థకు ఆపుకోలేని నవ్వు వచ్చిందని లక్ష్మణుడు సంజాయిషి చెప్పుకున్నాక కానీ ఆ సభలోని వారి అనుమానం , కోపం తగ్గలేదు. అందరికీ తెలిసిన మరో నవ్వు …పాంచాలి నవ్వు..!

మహాభారతంలో మయసభ ఘట్టంలో దుర్యోధనుని చూసి ద్రౌపది  నవ్విన నవ్వువలన ఎన్ని అనర్ధాలు , ఎన్ని దుష్పరిణామాలు, ఎన్ని ఘాతుకాలు , ఎంతటి మహా సంగ్రామం జరిగి కుఱువంశం నాశనమైపోయిందో అందరికీ తెలిసిందే!

అందువలన పదిమందిలో వున్నప్పుడు అకారణంగా నవ్వి నవ్వులపాలు కాకూడదు.

............

*దుఃఖించి  ప్రయోజనం లేదు*

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు

 

పూర్వం నముచి అనే రాక్షసరాజు సంపదలన్నీ పోగొట్టుకుని చీకూచింతా లేనివాడై ఒక మూల విశ్రాంతి తీసుకుంటున్నాడు.  

ఇంద్రుడు అతడి వద్దకు వెళ్లి  “ రాక్షసరాజా ! నీకిప్పుడు బంధు మిత్రులు లేరు. పరివారం లేదు. ఈ హీనస్థితికి ఎంతగా బాధపడుతున్నావో అనిపిస్తోంది” అన్నాడు.


 నముచి “దేవేంద్రా ! దుఃఖం వల్ల ప్రయోజనమేమీ లేదు. దుఃఖించినంత మాత్రాన కోరుకున్నవన్నీ లభిస్తాయా ? అవేవీ నెరవేరక పోవడమే కాకుండా శరీరాన్ని , మనస్సును కష్టపెట్టుకోవడం తప్ప ప్రయోజనం లేదు. అంతేకాకుండా అలా చేయడం వల్ల  ధర్మహాని  కలుగుతుంది. ఇవన్నీ ఆలోచించి  దుఃఖం లేకుండా ప్రశాంతుడనై ఉన్నాను” అని బదులివ్వడమే కాకుండా కొనసాగింపుగా మరికొన్ని మాటలు చెప్పాడు.


‘ సృష్టినంతటినీ పరిపాలించే వాడు ఒకడున్నాడు. ఏ ప్రాణికి ఏది ఏర్పాటు చెయ్యాలో ఆయనే చూసుకుంటాడు. నీరు పల్లానికి ప్రవహించినంత సులభంగా  ప్రయత్నం లేకుండానే వారికది వచ్చి చేరేటట్టు చేస్తాడు. నాకిలా కావలసి ఉందని విధాత నిర్ణయించాడు కాబట్టి అట్లా జరిగిందన్న దృఢ నిశ్చయం గల యోగ్యుడికి ఆనందం, దుఃఖం , సంపత్తి , దరిద్రం వంటి ద్వంద్వాలేవీ  ఉండవు.

అంతేకాదు విధాత ఇతడికి ఇవి చెందకూడదని నిర్ణయిస్తే ఆ మానవుడి ధైర్య సాహసాల వలన గానీ , భుజ బల పరాక్రమాల వలన గానీ పొందలేడు.  ఆ సత్యం గ్రహిస్తే సజ్జనుడికి భయం ఉండదు.

జీవితంలో మేలు, కీడు అనేవి కాలవశాన మానవుడికి తప్పకుండా సంభవిస్తాయి.  వాటిని తోసేస్తే తొలగిపోవు. కౌగిలించుకుంటే దగ్గరకి రావు. కనుక  వాటి గురించి ఆలోచించడం మంచిది కాదు’  

నముచి  మాట్లాడిన మాటలు విన్న దేవేంద్రుడు అతడిని మెచ్చుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు.

కర్ణుడి కృతజ్ఞత


హస్తినాపురంలో రాయబార వ్యవహారం ముగిశాక కర్ర, భీష్మాదులతో కలిసి మేనత్త కుంతి దగ్గరకు వెళ్లాడు శ్రీకృష్ణుడు ఆమెను పరామర్శించి, రాయబార విశేషాలు వివరించాడు. అనక పాండవులకు కుంతీదేవి ఇచ్చిన సందేశాన్ని తీసుకుని భీషు, సంజయులతో సహా వెనుతిరిగాడు. అందర్నీ తమ తమ మందిరాలకు పంపించి, కర్ణుణ్ణి మాత్రం రథంపై కూర్చోబెట్టుకొని, బయల్దేరాడు. రధం కొంత దూరం వెళ్లాక 'రాచేయా! నువ్వు దర్మశాస్త్ర 'రహస్యాలు బాగా తెలిసినవాడివి. నీకు కొత్తగా చెప్పేవేమీ లేదు. నిజానికి మా మేనత్తకు ప్రథమ పుత్రుడివి. కనుక రాజ్యాధికారం నీవే దుర్యోధనుణ్ణి వదిలి. నాతో వచ్చి పాండుపుత్రుల వైపు చేరు. అన్నగా నీకు బ్రహ్మరధం పడతారు' రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తారు. అందుకు కుంతీమాత కూడా ఆనందిస్తుంది. అన్నాడు. గోవిందుకు.


కర్ణుడు మందహాసంచేసి 'కేశవా! నీ వాత్సల్యానికి కృతజ్ఞుణ్ణి ధర్మానుసారం పాండుపుత్రుణ్ణి అనే విషయం ఎప్పుడో తెలుసు నాకు. కానీ కుంతీదేవి నన్ను నదిలో పడేసినప్పుడు అతిరథుడు, రాచ నన్ను చేరదీశారు. ప్రాణప్రదంగా పెంచిన ఆ ప్రేమమూర్తుల రుణం ఎలా తీర్చుకోగలను! మరోవైపు ఏ ఆశ్రయం దొరక్క అవమానాలు పొందుతున్న వేళ దుర్యోధనుడు నన్ను ఆదరించి రాజ్యభాగాన్నిచ్చి, రాజును చేశారు. సొంత సోదరుడిలా ఆదరించాడు. దుర్యోధనుడు నన్ను నమ్ముకునే ఈ కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. నాకు తెలుసు, ధర్మవర్తనులైన పాండవులే గెలుస్తారు. కానీ తల్లిదండ్రుల ప్రేమకు, మైత్రీబంధానికి ద్రోహం చేయలేను. సమస్త భూమండలం రాసిచ్చినా, బంగారు రాశులు కురిపించినా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లతో అనుబంధాన్ని తెంచుకోలేను' అన్నాడు. కర్ణుడి కృతజ్ఞతకు కృష్ణభగవానుడే కదిలిపోయాడు. అందుకే మహాభారతం ఉద్యోగపర్వంలో విదురుడు ఒకరి పోషణతో ఉన్నత స్థానానికి చేరి, ఎందులోనూ కొరత లేకుండా జీవిస్తూ, ఆతంచ సంపదను అర్జించి, చివరికి ఆ రాత నమ్మకాన్నే వమ్ముచేసి అపకారం చేసేవారి పార్థివ దేహాన్ని పక్కలు కూడా ఇష్టపడవు' అన్నాడు దృతరాష్ట్రుడితో. చైతన్య

........

జ్ఞానాన్ని పొందడానికి 

*ముఖ్యమైన మూడు లక్షణాలను, ఆ జ్ఞానము పొందిన తరువాత కలిగే లాభాన్ని* వివరించాడు పరమాత్మ. 


*1. శ్రద్ధ..*


ఏ కార్యం చేయాలన్నా శ్రద్ధ ముఖ్యం. ఒక్క జ్ఞానం సంపాదించడానికే కాదు ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి. ఏ కార్యము చేసినా శ్రద్ధతో చేస్తే ఫలితం చక్కగా వస్తుంది. పూజ చేసినా, విద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తున్నా, ఆఫీసులో పని చేసినా, వ్యాపారం చేస్తున్నా, వృత్తిపని చేస్తున్నా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ పనికి అయినా శ్రద్ధ ముఖ్యము. పైగా చేసే పని మీద నమ్మకము విశ్వాసము ఉండాలి. అంతే కానీ అయితే అవుతుంది లేకపోతే లేదు అనే నిర్లక్ష్యం పనికిరాదు. వస్తుందో రాదో అనే సందేహము కూడా ఉండకూడదు. తప్పక సిద్ధిస్తుంది అనే నమ్మకంతో చేసే పని పరిపూర్ణము అవుతుంది. కాబట్టి శ్రద్ధ అంటే కేవలం చేసి పని మీద కుతూహలము కాదు. నేను చేసే పని నాకు మేలు చేస్తుంది. నా ఉన్నతికి తోడ్పడుతుంది. నా భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తుంది అనే నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు.


*2. తత్వరః..*


తత్వరః అంటే తదేకనిష్ట ఏకాగ్రత, పట్టుదల, నిశ్చయాత్మక బుద్ధి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగాచేయాలి. ఒకటి చెప్పి ఒకటి చేయడంవలన విరుద్ధ ఫలితాలు వస్తాయి ఎవరూ మనల్ని నమ్మరు. మనసు నిర్మలంగా ఉండాలి అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మానవులు ఏ పని చేపట్టినా ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రతతో ఏ పని చేసినా అఖండమైన శక్తి లభిస్తుంది. అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. కాబట్టి మనసును బయట ప్రపంచంలో ఉన్న విషయాల నుండి మరల్చి ఆత్మవిచారణవైపు తిప్పితే, ఆత్మజ్ఞానము సిద్ధిస్తుంది.


విద్యార్థులు చాలా మందికి చదివే చదువు మీద నిష్ఠ ఉండదు. ఏకాగ్రత ఉండదు. ఎదురుగా టివి. పక్కనే సెల్ఫోను. ( పురాణ కాలాల్లో ఋషుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి రంభ, ఊర్వశి మొదలగు అప్సరసలను పంపేవాడని విన్నాము. ఈ రోజుల్లో, మానవుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి ఇంద్రుడు స్మార్ట్ఫోన్ ను కనిపెట్టి మన మీదికి వదిలాడు.) అందులో facebook,whatsapp, instagraam, youtube etc.. ఇన్నిటి మధ్య ఏకాగ్రత కుదిరే అవకాశం లేదు. అందుకని ఇవి అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదివితే పాసు, ర్యాంక్ ఖాయం. కాని ఈ రహస్యం తెలుసుకోలేక క్వశ్చన్ బాంకుల మీద వేలకువేల ట్యూషన్లమీద ఆధారపడుతుంటారు. క్లాసురూములో చెప్పే పాఠం శ్రద్ధగా విని, ఇంటికి రాగానే దానిని ఏకాగ్రతతో మననం చేస్తే, తెలియని విషయాలను మరునాడు టీచరును కానీ లెక్చరరును గానీ అడిగి చెప్పించుకుంటే, అది మెదడులో శాశ్వతంగా రికార్డు అవుతుంది. పరీక్షలలో ఎంతో సాయపడుతుంది. మీ గురువులకు మీకు ఇంకా ఇంకా బోధించాలనే ఉత్సుకత కలుగుతుంది. అందుకే అందరికీ నిష్ఠ, ఏకాగ్రత అవసరం.


*3. ఇంద్రియ నిగ్రహము..*


ఇంద్రియములు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తుంటాయి. ప్రాపంచిక విషయాలలో లీనం అయి ఉంటాయి. ఇంద్రియాలు చూసిన వాటి గురించి మనసు ఆలోచిస్తుంది. అప్పుడు మనసులో కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి మరలా ప్రయత్నం మొదలవుతుంది. మనసు చంచలం అవుతుంది. అటువంటప్పుడు ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియ నిగ్రహము లేకపోతే ఆత్మజ్ఞానము అలవడదు. సాధకుడికి ఇంద్రియములు ప్రబల శత్రువులు. వాటిని నిగ్రహిస్తేనే గానీ సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు.


ఈ ప్రకారంగా శ్రద్ధ, తదేకనిష్ఠ, ఇంద్రియనిగ్రహం అవలంబించి ఆత్మజ్ఞానము పొందితే కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చేది ఒకటే సమాధానం, పరమశాంతి. ఈ రోజుల్లో మానవులకు లేనిది, కావాల్సింది అదే. ఎంత ధనం, భోగభాగ్యాలు, పదవులు ఉన్నా మానవునికి మనశ్శాంతి కరువయింది. అటువంటి వారు ఆత్మజ్ఞానంకోసం ప్రయత్నించాలి. పైవిధంగా ప్రయత్నిస్తే ఆత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లభించిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అందుకే అచిరేణ అనే పదం వాడారు. అంటే అచిరకాలంలోనే పరమశాంతి లభిస్తుంది అని అర్థం. కాబట్టి బాహ్యప్రపంచంలో దొరికే వస్తువులతో కొంచెం సుఖం అనంతమైన దుఃఖం తప్ప మరేమీ దొరకదు. ఆత్మజ్ఞానం కలిగితే పరమశాంతి దొరుకుతుంది అని బోధించాడు పరమాత్మ.


🙏 *కృష్ణం వందే జగద్గురూమ్* 🙏

))--

 ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రాం      ఓం శ్రీ రామ్

ప్రాంజలి ప్రభ

 ధర్మరాజు

సర్వేజనా సుఖినోభవంతు   

ధర్మజు ని రక్తం ఎన్ని బొట్లు నేల‌మీద ప‌డ‌తాయో అన్ని సంవ‌త్స‌రాలు ఇక్క‌డ అనావృష్టి క‌లుగుతుంది.!

యుద్ధంలో జ‌యం పొందిన విరాట‌రాజు, అంత‌కుముందే త‌న ప‌ట్ట‌ణానికి తిరిగి వచ్చాడు. విప్రులు, వ‌నితామ‌ణులు సేన‌లు జ‌ల్లుతూండ‌గా తాను, పాండువులు, బంధువులు రాజ‌మందిరం ప్ర‌వేశించారు. విరాటుడు సింహాస‌న మ‌ధిష్టించాడు. త‌న విజ‌యాన్ని మెచ్చుకోవ‌డానికి వ‌స్తున్న వాళ్లంద‌ర్నీ అభినందిస్తున్నాడు.ఉత్త‌రుడు క‌న‌బ‌డ‌క‌పోయే స‌రికి ఎక్క‌డున్నాడు ? అని అడిగాడు. దుర్యోధ‌నుడు, భీష్ముడు, ద్రోణుడు, క‌ర్ణుడు, కృపుడు, అశ్వ‌త్థామ మున్న‌గు కురువీరులు. సైన్యంతో వ‌చ్చి ఉత్త‌రిదిక్కున గోగ్ర‌హ‌ణం చేసార‌నీ అందుచేత ఉత్త‌రుడు, బృహ‌న్న‌ల ర‌ధసార‌ధిగా చేసుకొని ఒక్క‌డే యుద్ధానికి వెళ్లాడ‌నీ, విరాట‌రాజు తెలుసుకుని దుఃఖంతో కుంగిపోయాడు. మంత్రులు మొగాలు చూసాడు.

కుర్ర‌త‌నం చేత క్రిందూమీదూ కాన‌కుండా రోషావేశంతో ప‌శువుల‌ను కాపాడ్డానికి వెళ్లాడుట ! ప‌సివాడు ! కౌర‌వ సైన్యం ఎక్క‌డ ? వీడు ఒంటిర‌గా వెళ్ల‌డం ఎక్క‌డ ? నాకిది మ‌హాదుఃఖం క‌లిగిస్తోంది. అతివ‌డిగా సైన్యాన్ని అత‌నికి తోడు పంపాలి. చాలినన్ని వేగంగా పంపండి అన్నాడు ఆదుర్దాతో.

అక్క‌డ‌కు వ‌చ్చి సుశ‌ర్మ ఓడిపోయాడు. క‌నుక ఇక్క‌డ వీరికి జ‌య‌మ‌వుతుంది. భ‌య‌ప‌డ‌న‌క్క‌ర్లేదు. యుద్ధానికి ఉత్త‌రుడు ఒక్క‌డే వెళ్లాడ‌నుకోవ‌ద్దు. అత‌నికి బృహ‌న్న‌ల సార‌ధి క‌నుక దేవ‌త‌ల్నైనా జ‌యించుకొస్తారు అన్నాడు కంకుడు. విరాటుని ఆరాటం కొంచెం త‌గ్గింది.

మ‌హారాజా ! కౌర‌సైన్యాన్ని జ‌యించి, మ‌న‌గోవుల్ని మ‌ళ్లించి ఉత్త‌రుడూ, సార‌ధీ వ‌స్తున్నారు. చివ‌ర‌కు ర‌ధానికైనా ఈష‌ణ్మాత్రంకూడా ప్ర‌మాదం లేకుండా సుర‌క్షింత‌గా ఉన్నారు. మ‌మ్మ‌ల్ని పిలిచి మీరువ‌డిగా పోయి పురంలో ప్ర‌క‌టించండి అంటే వచ్చాం అన్నారు, వారు.

విరాట‌రాజు హృద‌యాంత‌రాళాల నుండి పొంగిపొర్లిన ఆనందం ఆశ్రువుల‌రూపంలో అత‌ని నేత్రాల‌నుండి ధారాపాతంగా ప్ర‌వ‌హించిన‌ది. అత‌ని ఒడ‌లు పుల‌కాంకిత‌మైంది. ఏమిటేమిటి ? అంటూ గొల్ల‌వాళ్ల‌చేత ప‌దేప‌దే చెప్పించుకొన్నాఆ శుభ‌వార్త‌. మంత్రుల మొగ‌ములు స‌గ‌ర్వంగా చూచాడు.

అత్యాచ్చ‌ర‌క‌మైన ఈ అమోఘ విజ‌యం, నాకొడుకు జ‌యం, గంట‌లు మ్రోగిస్తూ ఏనుగుల‌మీద వీధివీధికి వెళ్లి చాటించమ‌నండి. మేళ‌తాళాల‌తో, మంగ‌తూర్యాల‌తో, బ్రాహ్మ‌ణ‌శ్రేష్ఠుల‌తో, పుణ్య‌స్త్రీల‌తో వారికి ఎదురువెళ్లి తీసుకు రావాలి...మా అమ్మాయి ఉత్త‌ర మున్నగు ఉత్త‌మ క‌న్య‌లంతా సుగంధ ద్ర‌వ్యాల‌తో నా కొడుకుకు ఎదురు వెళ్లి తీసుకు వ‌చ్చే యేర్పాట్లు చేయించండి, అని ఆజ్ఞ‌లిచ్చాడు.

గొల్ల‌వాళ్ల‌కు నూతన వ‌స్త్రాలు ఇప్పించాడు. కంకుభ‌ట్టును చూచాడు. నేస్తం ! ఒక ఆట వేద్దామా ? అన్నాడు, ప‌ట్ట‌లేని సంతోషంతో .

నువ్వు సంతోష‌ప‌రావ‌శ్యంతో ఉన్న‌వు. ఈ వేళ‌నీతో ఆడిగెల‌వ‌డం క‌ష్టం. అందుచేత భ‌య‌ప‌డుతున్నాను. అన్నాడు, కంకుడు.

విరాటుడు న‌వ్వినాడు. ఈ ప‌రిస‌రంలో ఉన్న సైరంధ్రిని పాచిక‌లు తెమ్మ‌న్నాడు. ముందుకు దిగినాడు, ఇక్క‌డకురా అని కంకుణ్ణి పిలిచినాడు.

జూదం ఏమంత మంచిది ? ధ‌ర్మ‌రాజు జూద‌మాడి రాజ్యాన్ని, త‌మ్ముళ్ల‌ను, భార్య‌ను, పందెంవొడ్డి నానా క‌ష్టాలుప‌డ్డాడు క‌దా ? దీనివ‌ల్ల‌వ‌చ్చేకీడు అటువంటిది, అంటూనే జూదం ఆడ‌నారంభించాడు కంకుడు.

విరాట‌రాజు ఆనందోత్సాహం ప‌ట్ట‌లేక‌పోతున్నాడు. చూశావా నా కొడుకు ఉత్త‌రుడి బాహుబ‌లం శౌర్యం ఎంతుఉదాత్త‌మైన‌వో ! కౌర‌వ సైన్యాన్ని ముట్టడించి, గెల్చి, గోవుల్ని తెచ్చాడు ! ఇంత ఘ‌న‌కార్యం ఎప్పుడైనా, ఎవ‌రైనా, ఎక్క‌డైనా చేశారా ! అన్నాడు పాచికలు వేస్తూ.

గెల‌వ‌డం బ్ర‌హ్మ‌వ‌శంకూడా కాదు గ‌దా ! అంటూ అత‌డు తొంద‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఉత్త‌రుడు పంపించిన గొల్ల‌వాళ్ళు అక్క‌డికి వ‌చ్చారు.

భీష్మ‌, క‌ర్ణ‌, దుర్యోద‌న‌, ద్రోణ‌, కృపామున్న‌గు యోధుల్ని ఉత్త‌రుడు ఒక్క‌డే జ‌యించ‌గ‌లిగి నట్ల‌యితే, ఇంత‌క‌న్న ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం లోకంలో ఉంటుందా ? ప్ర‌పంచంలో ప్ర‌సిద్ధి కెక్కుతాడు అన్నాడు , కంకుడు.

కంకుడి మాట‌లు విరాటుని బాధించాయి. అత‌డు క‌ట‌క‌ట ప‌డినాడు.

నువ్వు ఇలాగ‌మాట్లాడ‌డంలో అంత‌రార్థం నా కొడుకు విజ‌యం సందేహ‌మ‌నేనా ? నువ్వు క‌నుక ఇంత‌మ‌ట్టుకు ఓపిక ప‌ట్టాను. ఇంకఇటువంటి మాట‌లు అన‌కు, అన్నాడు, కోసంగా. అత‌ని చెక్కిళ్లు అదిరిన‌వి. క‌ళ్ళు కెంపెక్కిన‌వి. మూతిముడుచుకొని ఆడుతున్నాడు. కాని కంకుడా త‌ణ్ణి లెక్క‌చేయ‌లేదు.

కౌర‌వ‌సైన్యాన్నే అన్న‌మాటేమిటి ? దేవ‌తలూ, రాక్ష‌సులూ క‌లిసి వ‌చ్చినా గెలుస్తాడు, ఉత్త‌రుడు, శ‌త్రుసైన్యాల‌కు జ‌డుపుపుట్టే ఆ బృహ‌న్న‌ల‌ర‌ధం మీద ఉండాలిగాని అన్నాడు.

విరాటుడి కోపం రెట్టించింది. మొహం వికృత‌మైంది.

నీవ‌ల్ల చాలాచాలా వింత‌లు వింటున్నాం ! ఇంత‌కు ముందు ఎప్పుడూ సార‌ధుల్ని చూడ‌లుద‌నుకుంటున్నావు కాబోలు. అబ్బో ! లోకంలో మ‌హామ‌హా వీరుల్నే చూశాం అత‌ని క‌న్నులు నిప్పులు కురుస్తున్న‌వి. నాకొడుకుని గురించి పోటు మాట‌లు నీకెందుకు ? సంతోషంగా ఆడ‌లేవా ? పిచ్చిపిచ్చిమాట‌లు క‌ట్టిపెట్టు. అటువంటివి మేం స‌హించ‌లేం, బ్రాహ్మ‌డా, అన్నాడు, విరాట‌రాజు.

ధ‌ర్మ‌రాజు ప‌ట్టువ‌ద‌ల్లేదు. చిరునవ్వు న‌వ్వి.

యుద్ధం చేయాల‌ని వేడుక‌ప‌డి, అతి సాహ‌సుడై, బృహ‌న్న‌ల ఉత్త‌రుణ్ణి సార‌ధిగా చేసుకొని కౌర‌వ‌సేన‌ల‌ను జ‌యించి, ఒక్క ప‌శువైనా పోకుండా అన్నిటినీ తెచ్చి ఉంటాడు. నా మాట నిజం అవుతుందోకాదో చూస్తూండు, అన్నాడు కంకుడు. అంత‌టితో ఆగ‌క బృహ‌న్న‌ల విజ‌యం పురంలో చాటించు అన్నాడారాజు మొగం చూస్తూ.

విరాటుడు రౌద్రుడుయాడు. బుస‌కొట్టాడు. పేడిని పొగ‌డ‌డం మాన‌మంటే మాన‌వేం ? అంటూ పాచిక‌ను కంకుడి మొహానికేసి కొట్టాడు.

ఈ విధంగా దెబ్బ‌తినినా, ధ‌ర్మారాజుకు కోపంరాలేదు. ద్రౌప‌ది వైపు చూచి ఊరుకున్నాడు. ద్రౌప‌ది గ‌బ‌గ‌బ పరుగెత్తి అత‌ని నొస‌టి దెబ్బ‌నుండి కారుతున్న రక్తాన్ని త‌న ప‌మిట చెంగుతో అద్ది, ఆ చేరువ‌లోనున్న బంగారు క‌ల‌శ‌లోని నీళ్ల‌తో చేతులు త‌డుపుకొని గాయాన్ని నెమ్మ‌దిగా తుడుస్తున్న‌ది.

రక్తాన్ని చీర చెంగుతో అద్దుతున్నావేం ? అని విరాటుడు సైరంధ్రిని అడిగినాడు.

నిర్మ‌ల‌మైన‌వంశంలో పుట్టిన ఈ పుణ్యాత్ముని నెత్తురు ఎన్ని బొట్లు నేల‌మీద ప‌డ‌తాయో అన్ని సంవ‌త్స‌రాలు ఇక్క‌డ అనావృష్టి క‌లుగుతుంది. ఉత్త‌మ బ్రాహ్మ‌ణుడికి హాని చేయడంవ‌ల్ల క‌లిగే పాపం ఎట్లాగూ కీడు క‌లిగిస్తుంది. క‌నుక నీకు హాని రాకుండా ఉండాలని ఇలాగ చేశాను. అంటూ ఆమె అత‌ని గాయాన్నుండి కారుతున్న నెత్తురు తుడుస్తున్న‌ది.

ఉత్త‌రుడొక్క‌డూ లోప‌లికి వ‌చ్చినాడు. తండ్రిపాదాల‌కు మోక‌రిల్లాడు. విరాటుడు ఆనంద‌బాష్పాలు కార్చి, కొడుకును గ‌ట్టిగా గుండెల‌క‌దుముకొన్నాడు. ఉత్త‌రుడు తండ్రికి పునః ప్ర‌ణామాలు చేశాడు. పిమ్మ‌ట కంకుడికి స‌గౌర‌వంగా న‌మ‌స్క‌రించాడు. ఆత‌ని నుదుట‌ను ఉన్న‌గాయం చూచి ఇదేమి ? అన్నాడారుద్దాగా.

నాయానా ! నేను నీ విజ‌యాన్ని పొగ‌డుతూంటే అత‌డు పేడివాణ్ణి పొగ‌డాడు. దాంతో, నేను కోపం ఆపుకోలేక‌పోయాను. అప్పుడు నాచేతిలో ఉన్న పాచిక‌పుచ్చుకొని కొట్టాడు, అన్నాడు విరాటుడు.

ఉత్త‌రుడు భ‌య‌మూ, సంభ్ర‌మ‌మూప‌డినాడు.

అయ్య‌య్యో ! నాన్నా ! గొప్ప‌త‌ప్పుచేశావు. నీవు ఇలాగ చేయ‌వ‌చ్చా ? వారు ఏం చెపుతే అద‌ల్లా మ‌నం అంగీక‌రించాలిగాని, ఇలాగ‌, కాదు, కూడ‌దు అంటూ నిషేదించ‌వచ్చా ? వారిని స‌విన‌యంగా బ్ర‌తిమాలుకోండి. ప‌విత్ర‌చ‌రిత్రులైన ప‌ర‌మ‌ద్విజుల్నికోపించి అవ‌మానించిన పరిపాల‌కుల‌కు ఆయువు, సిరి క‌లుగుతాయా ? అన్నాడు, ఉత్త‌రుడు, అత్యాద‌రంతో.

ఉత్త‌రుని మాట‌లు పాటిగా బట్టి, విరాటుడు ధ‌ర్మ‌రాజును భ‌య‌భ‌క్తుల‌తో వేడుకొన్నాడు క్ష‌మించ‌మ‌ని. ధ‌ర్మ‌రాజు నాకేం కోపంలేదు. నీ తండ్రి చెడుమార్గ‌న న‌డిచేవాడు కాదు. ఈ దిన‌ము అటువంటిది హాని క‌లిగింది అని నవ్వుతూ ఉత్త‌రుడితో అన్నాడు. అప్పుడు తండ్రి, కొడుకులు సంతోషించారు.