పద్మ రూపము హస్త పద్మము పాద పద్మము చెందగా
పద్మ మౌఖ్యము కన్నులన్నియు పద్మ హస్తము ముక్తిగా
పద్మ రేఖలు వాసికెక్కిన పద్మజా ప్రియ మైనదై
పద్మ గంధము పద్మశ్రీ గతి పద్మ పుష్పము యీశ్వరీ
మోఘమేయిది మోహ హృధ్యము మోహ భావన నేర్పుగన్
ఆఘ నీలిమ మోహబంధము నాద వీక్షణ జర్గుటన్
మేఘ వీధుల వెన్నెలేవిధి మీగడే సిరి నీడగన్
మేఘ మాలిక కాన రాకయు మోహ దేహము యీశ్వరీ
నిగమ వర్ణ నిగమాంత సిద్ధియు నిత్య శుద్ధియు కల్గుటే
సుగుణ మే సక లార్ధ సంపద శుద్ధ తత్త్వము పొందుటే
గుణగణాల మహత్య భావము కూ రిమే యగు లక్ష్యమై
పగలు రేయి వరేణ్య తీర్పుల పండగే యగు యీశ్వరీ
ఉప్పె నేయిది తాండవమ్ముయు నూర్ధ్వమౌఖ్యము జూడగా
కప్పురమ్ముయు చందమౌనును గాంతు జిందుచు జూడగా
నిప్పురవ్వల నేత్ర మొక్కటి నీలి వర్ణపు గంఠమున్
తిప్ప లున్నను దక్ష జూపియు దీను డైతిని యీశ్వరీ
లక్షణాలము నూరి పోయిట లాస్య మేల సహాయమై
శిక్షనే యది వేయి రెట్లగు శీఘ్ర బుద్దిని మార్చుటే
కక్ష లేకయు కోటి సంపద కాల మందున పొందుటే
రక్ష ఏదియ లక్షయున్నను రక్తమేగతి యీశ్వరీ
జీవలక్ష్యము తప్పు ఏలను చెయ్య నెంచిన చెయ్యుటే
జీవితమ్మున కోరుకున్నవి చిక్క వచ్చును బంధమై
నీవె కాదన నీడ మాత్రము నీవు ఔ నన సత్యమై
నీవె నేస్తము నీవె పెద్దవు నీవె చిన్నవు యీశ్వరీ
గరళమైనను మ్రింగవచ్చు ను,కామమున్ విడనాడియున్
వరయతీంద్రుగనుండవచ్చును,
బాధలన్ భరియింపుచున్
వరగుణాఢ్యుగ పేరుగాంచుచు వాసికెక్కగవచ్చు,దు
స్తరము మూర్ఖుని మార్చు టన్నను,ధాత్రిపైనను ఈశ్వరీ
గతమునే మననంబుజేయుచు కాలమున్ దరలింపకో
వెతలవెప్పుడు వచ్చిపోవును భీతిజెందకు ధీయుతన్
సతతమున్ ధర మంచి యో చన సల్పినన్ విజయంబగున్
స్తుతమతిన్ ధరముందుకేగుమి
శూరుడీవగు యీశ్వరీ
కనుల చూపులు శుష్క వాద వికాస లక్ష్యమనో మయమ్
ఘనత కెక్కుకృపాబ్ది నెంచుట గమ్య ధారి సహాయమే
చినుకు అక్షయ మే మనోబల చిత్తమార్పుకు వెల్గు లై
తనువు రాగము గౌరవమ్మగు తత్వ బోధ జనార్ధనా
సర్వ సహాయ భామినికి సాధ్య విశేష వదాన్య మదీయభావమున్
నిర్వి ధులైన శాంతికళ నీడల సాయము జేయు సత్రినిన్
దర్వినియోగకార్యమది దాగదు నిత్య కృపా సముద్రమున్
సర్వ చరాచరావళికి శాంతి నొసంగు ము పార్వతీ పతీ
అప్పుల రాజ్యమే యిదియు ఆశ్రిత మేనను రాజకీయమే
చిప్పలు బట్టి ఆటలివి చేష్టల నాటక రాజ నీతియే
తప్పులు చేయ గొప్పలగు తొత్తుల నమ్మియు సర్వ భక్షమే
ఒప్పులు ఓట్లకోసమను ఓర్పును చూపును పార్వతీ పతీ
ధర్మము తెల్సియే ప్రకృతి ధారిగ దృవ్యము ఇచ్చి పుచ్చుటే
మర్మము మాయకమ్మి మది మాన్యత మార్పులు నెంచ లేకయే
కర్మల నిర్ణయమ్మదియు కామ్యత లక్ష్యము బుద్దినేంచుటే
శర్మ మనోహరా విధియు శాసన పర్వము పార్వతీపతీ
క్రూరతన్ మది ధ్రుంచివేయుము కూప మయ్యడి బుద్దియే
భారమే విధి బంధ తత్త్వము భాగ్య మవ్వుట ఏలనో
ద్వారబంధ షడాస్య భద్రత దాస్యమే యగు జీవితం
పోరు తప్పదు నిత్య సత్యము ప్రో ద్బ లమ్ముయు యీశ్వరా
పాంచభౌతిక దేహతత్త్వము ద్వారమున్ బరి కింపుటే
ఎంచ యోగులు తోలుతిత్తియు ఎల్ల వేళలు దేహమై
వాంఛ యున్నను కామినీ కళ కాముకేయగు మానమై
పంచ జూపును మాంస ఖండము పాలదేహము ఈశ్వరా
కాల నిర్ణయ సర్వ సృష్టికి కామ్య మార్గము చూపిటే
కాల మన్నది సత్యమార్గము కావ్య తృప్తిని పెంచుటే
కాల లక్ష్యము ధర్మబద్దము కార్యమేయగు ఇప్పుడే
కాల సద్వినియోగ నీ అవ కాసపు పృథ్వియే
ధ్రువకోకిల
గనులు, త్రవ్వుచు,చెట్లు గొట్టుచు,కర్కశంబగు కార్యముల్
ఘనముగా నొనరింపుచుండిరి కాసుమూటలకై వడిన్
పనికిమాలిన చేష్టలెన్నియొ భావ్యమంచునొనర్చు దు
ర్జనులు మూగక దప్పునే చెఱసాలలోన సుధీమణీ!!47
స్నేహ మాధుర్యమే గతి సేవగనులె
మనసులో రేగినమమతయే మానమనులె
మోహ దాహన్ని తెలుపుటే మోక్ష మనులె
గుండె దాహాన్కి చెలిమియే గురువు పలుకె
చెలిమి యదలోన చిరుగును చింత మాపె
మనసఖుండు సచివుడుగా మనవిభు డుగె
మన గురువు బంధు దేవర మనుగడ మతె
స్నేహ నిరతి బ్రతుకు నందు గీత పలుకు
స్నేహ మాధుర్యమే గతి సేవగనులె
మనసులో రేగినమమతయే మానమనులె
మోహ దాహన్ని తెలుపుటే మోక్ష మనులె
గుండె దాహాన్కి చెలిమియే గురువు పలుకె
కాలము మనుగడ మరుపుయు
మేలుగదినకార్య ములను మీరక నుండెన్
గాలికి తిరిగెడు మనిషిగ
యే లక్ష్యము లేని వాడె యిష్టము నాకున్
అరువు పొంది జీవితము న ఆశ చుట్టు
పరువు దక్కక భయమున భాధ పెరిగి
బరువు హృదయము తో నున్న భయము చేరి
ఎరువు పొందలేని మనిషి ఏమి చెప్ప
అరవు విద్యఆదు కొనదు నాశ్రయమున
పరువు పోగొట్టు గలదులే పరివిధాల
బరువు కాదు మాతృ తెలుగు బంధమౌను
ఎరువు లేని మొక్క గనుగా ఎదుగు విద్య
చం.అరువు గ భాషయేలయని అర్ధమనస్సు అంగ్లమాయనే
బరువు గ తప్పయీ గతియు భారము గాగ సహాయమే సుధీ
పరువు గ తెల్గు భాషగను పాఠము చెప్ప వినమ్ర విద్యగన్
యెరువు గ మారె నాంద్రకళ ఏమనిచెప్పె ద రామ మాగతీ
అరువే ఆంగ్లము యేల చెప్ప గల ఆరాధ్యమ్ము యేలా సుధీ
బరువే విద్యలు యేలమాకు బాం ధవ్యమ్ము గానే విదీ
పరువే నిల్పని భారతమ్ము కళ ప్రాధాన్యమ్ము చూపే స్థితీ
యెరువే జీవిత నాంద్ర భాషగను ఏమాయో వరించే మదీ
మల్లాప్రగడ రామకృష్ణ..పూరణ
సమస్య:
శ్రీ రామాయణ గాథ వ్రాయగ దగున్ జింతాకుపై బూర్తిగన్
శా.
యారాటం యనుటేలపోరుసలిపే యాశ్చర్య లక్ష్యమ్ముగన్
శ్రీ రామాయణమే మనో మయముగా శ్రీ పాదపూజాసుధీ
ఔరా వత్తిగనేసహాయవెలుగే వైఖ్యాన ముప్పొంగగా
శ్రీ రామాయణ గాథ వ్రాయగదగున్ జింతాకుపై బూర్తిగన్
ధ్రువకోకిల
గహనమందు చరింపుచున్నను,
కాలమున్ గణియించినన్
విహగమట్టుల క్రిందుమీదకు వేడ్కగా బయనించి, ని
గ్రహముచే వర బ్రహ్మచారిగ,
లక్షణంబుగనున్ననో
గ్రహపు శాంతులవీడరేమది, కారణంబొ, సుధీమణీ!!48
No comments:
Post a Comment