Friday, 26 May 2023

చందస్సు

..



ప్రాంజలి ప్రభ (జనవరి మూడవ వారం ) పద్యాలు 

రచన మల్లాప్రగడ రామకృష్ణ 


సర్వపర్వమగు వాసిగ చక్కగ నిల్పనా?

గర్వహీనుఁడన నన్నిఁక కాంచవ చక్కగా

నిర్వివాదమగు నీ కృప నీవెను కాంచుమా,

సర్వరక్షణయు భారము సన్నుతి  నీదయన్


భోగి భోగములు ప్రీతిగపొందుట సత్యమున్

యోగ సంబరము నెంచియు యోగ్యత సందడిన్

మూగగానయ నుభూతులు ముఖ్యము నిత్యమున్

భాగ్యమే మనసు నందున బంధపు తత్త్వమే


చక్కనైన కళ యూపుల చెంచల మెల్లగన్

చుక్కలై చరితమేయన చూపుల చల్లగన్

మక్కువై మనసు యాటలు మాయల వెల్లువన్

చిక్కులే తొలగి సర్వము శీఘ్రము కాంతిగన్


భోగభాగ్య ములు కమ్మని కాంతుల చిత్తరుల్

రాగ పల్లవిలు మెప్పుగ రమ్యత  గప్పుచున్

యోగ నిష్ఠలగ  నేత్రలు యెప్పగ దాల్చియున్

స్వాగతమ్మగుట పిల్పుల సాక్షిగ యుంటిరే


జీవితమ్ము విధి వాకిట చిత్తము పంచుటే

భావవేదముయు నిత్యము భాగ్యము కోరుటే

సేవ లక్ష్యమగు బంధము సత్యము పల్కుటే

నీవుగా నిజము తెల్పియు నీడగ యుండుటే


పంజరాన్ని వదిలే యిక పండుగ యేచెలీ 

మంజులా మహిమ జూపవె మానసమే గిళీ

శృంజనా భవము చక్కని సందడి యే చెలీ 

రంజనా సుఖము పొందుట రమ్యత యే విధీ


నవ్వులై నటన నానుడి నాట్యము యేలనో

పువ్వులై పుడమి చెంతన పూజ్యము యేలనో

మువ్వలై కదల చూపులు ముచ్చట యేలనో

గువ్వలై కలయు కాలము గుర్తులు యేలనో


 భోగి, భోగమన భోక్తకు భోజ్యము ఇష్టమై 

త్యాగ మూర్తులను , పెద్దల దారిన పండుగై 

రాగ భారతిగ సంతస రమ్యత జూపులై

వేగ హృద్యమున పౌరుల సేవల రాజ్యమే


వానవెల్లువగు మబ్బుల వాహిని వాకిటౌ

మానుపోరు కళ మానస మార్గము మక్కుఔ

మేను యాశ లగుతుల్యమ మేకము మోక్షమౌ

తాను నే ననుట సంభవ తన్మయ భావమే


01..మాణిబూషణశ్రీ వృత్తము (ర న భ భ ర.. యతి 10)

చక్కటి పద్యము వ్రాయగలరు... Pranjali🌹ప్రభ

🙏🙏🙏🙏🙏🙏🚷🚷🚷🚷🚷🚷💚💚💚💚💚💚🛑🛑🛑🛑🛑♣️♣️♣️♣️♣️♣️♣️♣️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💙💙💙💙💙💙💙🏵️🏵️🏵️✅🏵️

సమస్యను పరిష్కరించడం

కన్న కుమారునిం మగనిగా గనె
         సజ్జనులెల్ల  మెచ్చగన్

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🕉️🕉️🕉️♣️♣️♣️♣️♣️♣️♣️♣️♣️✅✅✅✅✅✅🛑🛑🛑🛑🛑🛑🛑💚💚💚💚💚💚💚💚🚷🚷🚷🚷🚷🟢🚷🚷🚷

అన్ని విధంబులన్ దగిన యర్హ తలున్న వటంచునెంచి సం
పన్నుడు,బుద్దిమంతుడును బా హు బలుండును,నందగాడు బల్
వన్నెలు చిన్నెలున్ గలిగి భాసిలినట్టి మనోజ్ఞ మూర్తి వెం
కన్న, కుమారునిం మగనిగా గనె సజ్జనులెల్ల మెచ్చగన్

అంజయ్య గౌడ్
.......
అన్నమనో బలం యిదియు ఆశ్రిత సుందర భావమేయగన్
యున్న వినోదమే మనకు ఉజ్వల మవ్వుట నిత్యసత్యమున్
మన్నన లేక కాదు మది మాయయు  చేరియు సత్య మూర్తి వేం
కన్న కుమారునిం మగనిగా గనె సజ్జను లెల్ల మెచ్చగన్
సుభాషితం - 538
---------------
🌺యది సంతి గణాః పుంసాం
     ఏక సంత్యేవ తే స్వయం౹
     న హి కస్తూరికామోదః
     శపథేన విభావ్యతే ౹౹ 🌺
     సద్గుణాలు ఉన్న ప్రజల్లో ఉంటే అవి స్వతః తమకు తామే ప్రకాశిస్తాయి.కస్తూరిలో ఉన్న సుగంధం ఎవరూ చెప్పకుండానే బయటకు వెదజల్లుతుంది కదా అలాగే మనలో ఉన్న మంచి అందరికీ ఎవరూ చెప్పకుండా వెలుగుకు వస్తాయి.
🌺✍🏼ప్రభ,మైసూరు.
           27-5-2023.
.....
జ  ర  జ ర జ గ..10.. చామరం

సకామ బుద్ధి సిద్ధి శుద్ధి సేవలే సహాయమై
వికాస శక్తి యుక్తి రక్తి వెళ్లువే సమానమై
అకాల వాన ఎండ మంచు ఆకలే విహారమై
ప్రకాశ వంత మైన వెల్గు ప్రాభవం సుపూజితం
దినవహి సత్యవతి: సమస్యా పూరణ
********
ఉ.
కన్నడి లీలలన్ యెరిగి కన్నియ రుక్మిణి యుల్లమందునన్,
ఎన్నియొ యాశలే విరియ, యెం చెను  కృష్ణునె   స్వామిగా హృదిన్,
అన్నుల మిన్నయే వలచి యాదవ వీరుని, సాధ్వి దేవకీ
*కన్న కుమారునిం మగనిగా గనె సజ్జనులెల్ల మెచ్చగన్*

..

న్యస్తాక్షరి......

వి
ద్యా

యం

పద్య పాదాది న రావాలి

🟢🟢🟢
విన్న వించు సహన మయ్యి విద్య నేర్పు
ద్వార వివివిధ సమయములు దారి కొచ్చి
లయలు మార్పు చేర్పుల కళ లహరిగ విన
యం బునా కదలగలుగు యతిగ గతియు
.......
దినవహి సత్యవతి: న్యస్తాక్షరి
*విద్యాలయం*
*******
ఆ.వె.
*వి* ద్య, బుద్ధి పెరుగు విజ్ఞతయు, కొలువ వి
*ద్యా* ధరిని మనసున యహరహములు,
*ల* క్షణముగ విద్యలను నేర్చి, ప్రజకు సా
*యం* బు చేసి పొందు యశము మించి!
.....
🙏పూవు -పిందె-కాయ -పండు 🙏

   పువ్వు ఆయుష్సు ఇచ్చింది కాబట్టి పిందె, పిందెఆయుష్సు పోసుకొని కాయ, కాయ ఆయుష్సు పోసుకొని పండు  తయారు అవుతున్నాయి. మరి  చెట్టుకి మనం ఆయు
ష్సు  ఇస్తేనే అవన్నీ మనకు దొరుకుతాయ్.

     !!తే!గీ!!

    పూవు లాయుష్సు నీయగా  పుట్టు పిందె.
    పిందె లాయుష్సు నీయగా పెరుగు కాయ.
    కాయ  లాయుష్సు నీయగా కలుగు పండ్లు.
     చెట్ల కాయుష్సు  నరులీయ  చిక్కు నవియు.

🙏చెట్ల ను నరక వద్దని చెప్పడం ఉద్దేశ్యం 🙏
.......
దత్తపది..........

పూలు
పిందెలు
కాయలు
పండ్లు

⚫⚫
పూల మకరంద మాధుర్య పూజ్య మౌను
పిందెల కులుకు లు ఎగసి పడుట ఏను
కాయల సొగసు సొంపులు కాల మేను
పండ్ల రసములు జుర్రుటే పలుకు గాను
.....
దినవహి సత్యవతి:సమస్యా పూరణ
****
కం.
ఎందరు చెప్పినను వినక
అందిన భక్ష్యము వలదని యతిశయ పడియున్,
మందుకు మరిగిన వాడై
పందే నాకిష్టమనుచు బాపడు బలికెన్.
......

🙏🙏🙏

సమస్యను పరిష్కరించడం.....

పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్

🚷🚷🚷♠️🚷🚷♠️♠️🚷

మందే ప్రాణం నాకును
కందాతింటిని మనుగడ కంపుగ మారేన్
చిందే ప్రేమను పట్టా
పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్
(మల్లాప్రగడ రామకృష్ణ )

ప్రాంజలి ప్రభ
తేదీ 14-5-23
అంశము : నిషిద్ధాక్షరి
ప్రక్రియ : వచనము
రచన : ఎస్ ఎల్ రాజేష్ హైదరాబాద్
శ్రీ రాముని వర్ణన , మ కారము నిషిద్ధము

తండ్రి ఇచ్చిన బాస కోసం అడవులకేగెను రాఘవుడు.
పాద స్పర్శతో రాతిని నాతిగా చేసె దాశరథి.
వాయుపుత్రుని గుండెలో నిలిచే సీతాపతి.
వానర సేనతో వారధి కట్టి లంకకు చేరి
రావణుని సంహరించే రణ రంగ ధీరుడు.
కరుణాంతరంగడు, జగద్రక్షకుడాతడు.
🙏🙏🙏

వర్ణన........

కాఫీ......వర్ణన.
మనం నిత్యం.త్రాగే కాఫీని వర్ణించండి.
అభినందనలు.
----
" కం.
--
పొగలనుఁగ్రక్కెడి ' కాఫీ '
సెగలువిడుచుచును మఱింత చేదుగ నదియున్
భుగభుగ సిగ్రెట్ కాల్చఁగ
నగవే లేనిమొగము గృహిణంతనాకిడి వెళ్ళెన్ .."
----
( చేదుగ ..అర్థాత్..శర్కరరహిత..)
----

గుడ గుడా యని శబ్దమాయెను గుర్తు రాకయు వాసనై
మడత రంబగు సేవతల్పుట మంచి చేయుట బాధ్యతౌ
మడమతిప్పక కాఫి నిచ్చియు మేలు చేయట దారిగన్
విడువ లేను నిను నేను సవిస్తరేమది ఈశ్వరా
(మల్లాప్రగడ రామకృష్ణ )
..
దినవహి సత్యవతి: కాఫీ వర్ణన
*******
తేటగీతి:
పరగడుపున సేవింపగ పరవశమిడు,
మధురము సుగంధ భరితమౌ మంచి కాఫి,
విశ్వమంతయు మెచ్చిన వింత ద్రావ
కమిది, కాఫీని మించియు కలదె భువిని!

🙏🙏🙏

నిషి ద్దాక్షరి.........

శ్రీరాముని వర్ణన.....

మకారము నిషిద్దము.....
పద్యంలో మ,  కారము లేకుండా
శ్రీరాముని వర్ణించండి.
మీకు యిష్టమైన పద్యంలో.....

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

భూతలా సుశాంతి సుఖదా భుక్తి దాత
కళలు నభినుతించి కరుణ గతి యగుటయే
తరుణ విధి శక్తుల నివేదిత సహ శీలి
చిరునగవుల చింతలు బాపు చేరు భక్తి
.....
వలపు వల విసెరెను విధి వాలకమగు
వేటు వేయు గతియు వికట వలపు
చెలులచాటు తలపు చింతలె లొలుకుట
కాల నిర్ణయంబు కథలు తెలుపు
.....
ధ్రువ కోకిల

కళలు నేర్పెడి సర్వ సృష్టికి కార్య దక్ష  దలంచి నే
కళలు శాస్విత సేవ దృక్పద కావ్య సంపద కర్తగా
కళలు శాంతికి తోడుయే యగు కారణం విధి భుక్తిగా
కళలు గాంచ వినోద యుక్తియు కర్తకారణ కర్మయే
......
దినవహి సత్యవతి: మ కార రహిత శ్రీ రాముని వర్ణన
*******
తేటగీతి:
రాఘ వేంద్ర యిక్ష్వాకుల రాయడీవు,
శివధనువు విరిచిన నిను సీత వలచె,
రావణాసురు  జంపిన  రాజు వీవు,
కావగదె నను కరుణతో కౌసలేయ
🙏🙏🙏

న్యస్తాక్షరి..........


హా
ప్ర
భో

పద్య పాదాది న రావాలి

🟢🟢🟢
.
మనసు మనసు మధ్యన కల్గు మాట పరుగు
హాయి గొలుపు వేళ కథలు హృదయ మందు
ప్రతిభ కలిగినా దోషుల ప్రభల వల్ల
భోగ భాగ్యలు ప్రశ్నలై వోడి పోవు
....
ఆ. మంచి మనసు తృప్తి మనుగడ సంతృప్తి
హాయి గొలుపు బుద్ధి హారతగుట
ప్రభల మెరుపు లన్ని ప్రతిభకు నాందియే
బోధ చేయు వేళ పోరు యగుట

20=05=2023

🙏🙏🙏🙏


దినవహి సత్యవతి: 20/5/23

*విమానము వర్ణన*

*******

తేటగీతి:

రెక్క లాడించకుండనే రిక్క దారి

యెగురు గాలి రథము వింత ఖగము జూడ,

చాటె గాలి మోటరు యన్న  రైటు ప్రతిభ, 

దూరములకు త్వరగ జేర్చు ధోరణమదె 

******

ధోరణము = యానము

.....

దత్తపది.. సిరి..పురి..గిరి.. వరి 


సిరి మనసుతట్టు సుఖ మివ్వ సిత్ర మాయె

పురి పురులు విస్తరణయె ముగియ గుండు

గిరిజ దీవెనలన్నియు కీడు కావు

వరి వదలక పాంటయు పండు వదల లేదు

.....


వర్ణన........


గాలి మోటరు.  (విమానము)  ను

వర్ణించండి.


✅✅✅✅✅✅✅✅✅

సీస పద్యము

సమయాను కూలమై సహజసంపద జనం

గాలిలో పయనము గమ్య మాయె

దూర సుదూరము నూగుపోగుళ వెళ్ళు

గగన పక్షి యదియు గమ్యమాయె

కలియుగ పుష్పమై కాలమార్పు కదులు

గలగల శబ్దము గమ్య మాయె

గాలివాటపు యంత్ర కాలనిర్దయయాత్ర

గమన వాహనముయే గమ్య మాయె


కన్ను తెరచి చూడ కథలన్ని కదలి వెళ్ళు 

గగన సీమవిమానము గమ్య మాయె

గరుడ పక్షిలా కదులుతూ కార్య సిద్ది

కొరకు అనుకూల యంత్రము కోర్కె తీర్చు

....


🙏విమానము వర్ణన 🙏


                 🙏సీసపద్యము 🙏


        పేదవారందరూ పెద్దగా పిల్చినా

                        ఆగకుండగ పోవు నంబరాన!

       కలిగిన కుర్రోడు కనుసైగ సేయంగ

                 ఇంటి ముంగిలి వాలు నింత లోన!

      వాయువేగంబుతో పయనించు పైపైన

                    రంభలందుండగా రాత్రి పవలు!

       పల్లె టూరు లనగ పట్టించు కోదురా

                రైటు సోదరులదా రాత యదియె!


        !!తే!!గీ!!


          ఆర్యు లందరు లోహ విహంగమనెడి.

          మధ్య తరగతి వారు విమానమనెడి.

          బలుపు గలవారు డంబాన ప్లైటుయనెడి.

          ఎక్క లేనివారి  కనుల  కెండ మావి!!!

🙏🕉️🕉️


సమస్యను పరిష్కరించడం.......21=05=2023


మదగజ యానకుం రవిక

      మాత్రమె చాలును చీర యేటికిన్ 


⚫⚫⚫


కథ మొదలైన భావముయె కాల మనో విధి కావ్య రూపమై

విధి వినయమ్ము లక్ష్యమగు వేల్పు సహాయ సుతా విధానమై

మదమలుపేమనస్సగును మార్గ వరించు విధాన వెళ్లువే

మదగజ యానకుం రవిక మాత్రమె చాలున యేటికిన్

.....

[20/05, 1:40 pm] . Mallapragada: 🙏విమానము వర్ణన 🙏


                 🙏సీసపద్యము 🙏


        పేదవారందరూ పెద్దగా పిల్చినా

                        ఆగకుండగ పోవు నంబరాన!

       కలిగిన కుర్రోడు కనుసైగ సేయంగ

                 ఇంటి ముంగిలి వాలు నింత లోన!

      వాయువేగంబుతో పయనించు పైపైన

                    రంభలందుండగా రాత్రి పవలు!

       పల్లె టూరు లనగ పట్టించు కోదురా

                రైటు సోదరులదా రాత యదియె!


        !!తే!!గీ!!


          ఆర్యు లందరు లోహ విహంగమనెడి.

          మధ్య తరగతి వారు విమానమనెడి.

          బలుపు గలవారు డంబాన ప్లైటుయనెడి.

          ఎక్క లేనివారి  కనుల  కెండ మావి!!!

[21/05, 9:41 am] . Mallapragada: 🙏🙏సమస్య 🙏🙏


       🙏మదగజ యానకున్ ""రవిక""మాత్రమె 

               చాలును చీర యేటికిన్ 🙏


     మన శుభ కార్యాలలో కలశం అనే పూర్ణ

    కుంభం పెట్టి దానిమీద రవికల గుడ్డ పెడతారు

    దాంట్లో సర్వ దేవతలతో పాటు పుణ్యనదులు

    ఉంటాయి. త్రి మాతలు వుంటారు. అప్పుడు

   ఆ కలశం ""మద గజ యాన""ఆమెకి రవిక

    చాలు కదా!!ఇది నా వైదిక దేశ భక్తి 🙏🙏🙏


        వదలవు దేశ భక్తి. మన వైదిక వేదము

                                        శాస్త్రమంత్రముల్.

        కదలరె. సర్వ దేవతలు గంగ సరస్వతి

                                          పుణ్య తీర్థముల్.

        పదపద మంచు రాగ ."సిరి, భారతి,

                                శక్తులు ""పూర్ణ కుంభమౌ

       మదగజ యానకున్. ""రవిక""మాత్రమె

             చాలును చీరయేటికిన్ 🙏🙏

No comments:

Post a Comment