Thursday, 16 November 2023

 మ. కో.ఆదిదేవుని కాలమార్పులు ఆలకించుచు నీవె మా

 వేదమాతగ సర్వ సృష్టిగ వేల్పులే మది భక్తితో

 నీ దయామృతమే మనోమయ నిత్య భక్తియు శక్తియే

 సాధుధర్మము తెల్పుచుంటువి సామరస్య సరస్వతీ..001


మ. కో.కాదు కాదని చెప్పు చుండిరి కాని కాలము ఏమిటో

 చేదుతీపని ఒప్పుతుండెడి  చేటు కాలము దేనికో

 వాద వాదన వల్ల మాలిన వాలు చూపులు యేలనో

 బాధలన్నియు తెల్పుచుండెడి బంధ మమ్మ సరస్వతీ..002


మ. కో.ఆకలేసియు ఆట మాదిరి ఆడు తుండెను యేలనో

 ఆకతాయిగ మాట పల్కుచు హాని తల్చుట దేనికో

యేక మౌచును యవ్వనాంగుల హింస బెట్టుట ఏలనో

కాకి లాగను తిర్గుచుండిరి కాలమౌ న సరస్వతీ..003


మ. కో.మిత్ర సంపద సర్వ శ్రేష్టిగ మీగడే యగు చిత్రమై

శత్రు బాధను యాపగల్గును శాసనమ్ముగ మిత్రమై

ఆత్రమే మది కాల నిర్ణయ ఆశ నేడును నేస్తమై 

 చిత్రమైనది జీవితమ్ముయు చేరి కొల్తు సరస్వతీ. Oo4


మ. కో.తప్త కాంచన దివ్య భౌషణ తల్లి వైతివి పెన్నిదై

ప్రాప్తి బ్రోవుము దాసునైతిని కార రన్యక మాతవై

నాప్త బంధువు నీవు నాకును నాశ తీర్చుము తల్లివై

గుప్త మైనది విద్య యైనది గుర్తు జేయ సరస్వతీ.005


మ. కో. ఉన్నచోటన మంచి నెంచక ఉక్కపోతకు లెందుకో

 కన్నవారికి సేవచేయక కాని దేశము ఎందుకో

నిన్న నేడును ఆశపాశము నీడ లేకయు తిర్గుటే

లెన్ని మాటలు గాలిలో వదిలేను ఏల సరస్వతీ.006


సాహితీ సభ ఆర్య కావ్యము సఖ్య  తేయగు విద్యయే

వాహినీ కళ సర్వు లందున వాక్కు తెల్పెడి దుర్గమై

లాహరీ కళ తెల్గు విద్యయ కాల మవ్వుట మార్గమై

స్నేహమే మది ధర్మరక్షణ శీఘ్ర్ మిమ్ము సరస్వతీ. 007



మ. కో. చక్రమై తిరిగేటి బుద్దియు చాపబత్కగు టేలనో

యాక్రమించిన యాశ చావక యాట చూపుట దేనికో

విక్ర మించుచు కష్ట బెట్టుచు వింత వేషము దేనికో 

సక్ర మార్జన తోన మానస సాగునివ్వు సరస్వతీ..013


మ. కో.ఎన్ని రూకలు పంచె లేకను  ఏల నన్నెడి బుద్దుడై 

సన్ని తుండగు ప్రశ్న లేసెడి సంఘ మందున బద్దుడై

ఎన్ని ఖర్చులు కష్టనష్టము ఏల యై నను శుద్దుడై

చిన్ని మానస బుద్ధి నాదియు చింత మాపు సరస్వతీ.014


మ. కో. సృష్టి దోషము మోహ పాశము శృంగరమ్ముయు ఏలనో

పుష్టి యన్నది ఏమి లేదులె పూజ్య మన్నది ఏదియో

ముష్టి జీవము పెత్తనమ్మగు ముఖ్య సొత్తని ప్రేమయో

నష్ట జాతక వచ్చె సేవయు నమ్మ కమ్ము సరస్వతీ.015


మ.కో.కన్ను లన్నియు చూడు చిత్రము కళ్ళ మాయలు కమ్ముటే

మిన్ను మార్పులు జీవగమ్యము మింగి కళలు నమ్ముటే

మన్ను ఓర్పుయు సర్వ మౌయని మంగళమ్మగు ఒప్పుటే

నన్ను నేనుగ తెల్పు చుంటిని నమ్మ పూజ సరస్వతీ...016



No comments:

Post a Comment