ఆరాధ్య లీల - యేది..(1)
శ్రీ శ్రీ గారి 41 వ వర్ధంతి 15-06-2024 సందర్భముగా
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మనసు లోతు తెలుప సూత్ర మార్గ మేది
వయసు మార్పు తెలుపసూత్ర వాక్కు యేది
సొగసు పంచు మనసు సూత్ర సొమ్ము యేది
తపసు చేయు మగువ సూత్ర తత్వ మేది
నయన చుక్కల సూత్ర నాట్య మేది
మెరుపు వెల్గు పుడమి సూత్ర మేలు యేది
కలల అమ్మ మనుసు సూత్ర కావ్య మేది
కళల తండ్రి పలుకు సూత్ర కాల మేది
ఆత్మలకు రూప ము నిజమా ఆశ యేది
ప్రేమలో అర్ధము గనుమా ప్రీతి యేది
జీవనమున మోక్షంమ్మగు జీత మేది
శ్రమకు సాక్ష్యమ్ము లక్ష్యమ్ము శాంతి యేది
అమ్మ ఆరాట పోరాట అలక యేది
నాన్న పోరాట జీవితం నాంది యేది
స్నేహ వలయసూత్రము నకు సేతు వేది
వేణు గోపాల ప్రేమకు వేల్పులేవి
-((**))--
ఆరాధ్య లీల (2)... దేవి
రచన.. మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ
నెట్టుల నేర్తును నిల్చితి దేవి
ఒట్టును పెట్టుచు ఓర్పుగా దేవి
పట్టుగా పూజలు భావము దేవి
కట్టుగా బానిస కాలము దేవి
దీవెనలందగ దేవరా దేవి
సేవల చేయగా స్వీకరి దేవి
కోవెల నుండిన కోరిన దేవి
పావుల మేమగు పాఠ్యము దేవి
నాదర మొప్పగ నమ్మిత దేవి
వేదము పలకులు విశ్వము దేవి
పాదము పూజల పద్యము దేవి
వాదము కాదులే వాక్కులు దేవి
గూఢత తత్త్వము గుర్తుగా దేవి
మూఢత తొల్గెడి ముఖ్యము దేవి
గాఢత ధర్మము గమ్యము దేవి
తాఢత తప్పదు తన్మయ దేవి
కొండక పాపము కోర్కెలు దేవి
అండగ నుండిన ఆశలు దేవి
పండగ చేసెద పాఠ్యము దేవి
సంగడి కాడిగ సన్నిధి దేవి
జాలిని చూపవా జాతర దేవి
చాలును చేరితీ సాగిలి దేవి
కాలము నందున సోలితి దేవి
గాలము వేసియు కాపాడు దేవి
సాగిలి మ్రాక్కితి గాంచుము దేవి
వేగిర వచ్చితి వీలుగా దేవి
యోగిని కాదులే యోగము దేవి
సాగిన బంధము సాక్షిగ దేవి
దోషము సల్పిన తోడుగా దేవి
తోషము నిండిన కోపము దేవి
వేషము యేవిధి వేల్పుల దేవి
పోషణ లేకయు పోరున దేవి
ధర్మముఁ దెల్పెడి ధ్యానము దేవి
మర్మము తెల్పిన మార్గము దేవి
కర్మల భారము కాలము దేవి
నిర్మల యొజ్జవు నీవని దేవి
****
ఆరాధ్యలీల.. (3) ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
రాధిక మరుతువా - రమ్యత చూపవా
మదిలోని కధలివే - మమతలు పంచవా
బాధలు తొలచవా - బంధము పంచవా
యదలోని వెతలివే.. ఎల్లలు తెలపవా
కారణం వలదుగా - కామ్యము చూపవా
మనసౌను మనముగా - మార్గము తెలపవా
ధైర్యము కలపగా - ధర్మమ్ము నిలపవా
సుఖమాయె మనసేను - సూత్రము కలపవా
వాదము వలదులే - వాక్కులు యాపవా
సరిలేని తరుణమే - సమయమే పూడ్చవా
వేదము పలుకులే - వేకువ నిల్పవా
మతిమాయ సుమములే - మనసున కల్పవా
కావ్యము కధలులే - కాలము మార్చవా
సుమమాల నీకును -సుగుణమే పంచవా
ప్రేమము కలుపవా - ప్రీతిణీ పంచవా
నవమోహన సువిధా - నవనాడి పంచవా
స్థానము మెరుపులే - సాధన తెలపవా
కలలోని విషయాలు - కతలులే మలచవా
భారము లేదులే - బరువులే మలచవా
కళ కోస పరువమే - కథలుగా తెలపవా
నేత్రాల పిలుపులే - నీడలు కలపవా
సుమమాల వదువువే - సుకుమార నిలపవా
దేహము కలుపగా - ధ్యేయము పలుకువా
మనసాయె మందిరం - మనుగడే నిలపవా
***
ఆరాధ్య లీల (4) ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
ఆదికాలంబునుండియు ఆశ లేల
అంధకారపు ఛాయలు నాన్య లేల
తిమిరమంతయునిండిన తిష్ట లేల
అగ్నిగోళమ్ము గా మారి ఆట లేల
తీక్షణంబైన కిరణాల దివిటి లేల
వెలుగులను నింపి లోకాల చీకటేల
కోటి దండాలు గొనుచున్న కోప మేల
నిత్య శ్రామికనాయకా నిత్య మేల
కష్ట మైనా నిలబడేట్లు కాల మేల
నష్ట మైనా నిలబడేట్లు నటన యేల
ఇష్ట మైనా నిలబడేట్లు ఇచ్ఛ యేల
దృష్టి యైనా నిలబడేట్లు శృతులు యేల
నారికేళరసము సాధనలగు లీల
వీరి కవనము సెలయేటి వినయ లీల
తీయదనము పలుకులగు తీవ్ర లీల
హృదయ జలపాత కళలని శృతుల లీల
బడిన చదువు చదవకయే పలుకు లేల
పువ్వు గుడి జడ చేరక స్ఫూర్తి యేల
ఎదుటి మనసు గెలువలేని నవ్వు యేల
రంగులన్ని కలగలిపె పొంగు యేల
తెలుపు,లోన నలుపులోన పొరలేల
జనన మరణమధ్యనసాగు జాతరేల
ఊడిపోయె కిరీటాల ఉలుకు లేల
పరుగు కెరటాలు వెనకకు పంత మేల
నీరు పల్లము వైపున పారు టేల
నిప్పు పైకిసెగల పొగ నీడ లేల
స్థితి గతులకు మురిసిపోయి శీఘ్రమేల
ఒకరు ముందెనుకాస్థితి ఓర్పు లేల
మెప్పు గొప్పలకో కాలమోక్ష మేల
అక్షరముల అజ్ఞానము ఆట యేల
చీకటి పొరల చీల్చని గీత యేల
కాల వెలుగెందుకు కదులు గమ్య మేల
ఆరాధ్య లీల (5)
ప్రాంజలి ప్రభ - ఉపేంద్రవ్రజ
IUI UUI IUI UU ..యతి..7
సుశీల కల్పించు సుఖాల ప్రేమ
సమాన సౌందర్య సరాగ లక్ష్యం
సమోన్నతా గాన సదృస్య ప్రేమ
మనస్సు వీరంగ మదమ్ము లక్ష్యం
సరాగ రాగాల సమాన ప్రేమ
వినోద విశ్వాస విపంచి లక్ష్యం
వితండ భావాల వివక్ష ప్రేమ
సుఖాల భావాల సుదర్శ లక్ష్యం
తరించు తాపమ్ము తపో మయమ్మే
జ్వలించు యోగమ్ము జతా మయమ్మే
నటించు కాలమ్ము నశించు మాయే
చలించు చాపల్య చమత్క రమ్మే
పదాల వైనమ్ము ప్రభోధ మయ్యే
పెదాల సాహిత్య ప్రమోద మయ్యే
ప్రశాంతి కాలమ్ము ప్రకాశ మయ్యే
గుమాన గూటమ్ము గ్రహీత లయ్యే
నమస్తే చెప్పేది నమో వరమ్మే
పిలిస్తే పల్కేది పనీ పరమ్మే
సమస్య తీర్చేది సతీ నిజమ్మే
మనస్సు మార్చేది మహీ నిజమ్మే
--(())--
ఆరాధ్య లీల (6) ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
నే నడిగింది నాకు అందెల చెయ్యి
నేను అడగంది నాకు ఇస్తావేమయ్యా
మా నాన్నగా నన్నును బతక నియ్యి
నాలో ఆశలు రేపి అల్లాడిస్తావ్ ఎందుకయ్యా
జేబు ఖాళీ అయిన అడగలేని చేయి
అప్పు కోసం పొమ్మని ఎందుకు ప్రోత్సహిస్తావయ్యా
త్యాగ గుణంతో సహకరించిన చేయి
నడ మంత్రపు సిరి కోసం యుండమంటావేమయ్యా
తారలను నా దోసిలిలో నింపుకోలేని చేయి
మెరుపుని నా కళ్ళలో బంధించాలని ఆశయ్యా
ఎంత ఎగిరినా మేఘాలను తాకలేని చేయి
కురిసిన వాన చినుకులని ఆస్వాదించాలనుందయ్యా
హరివిల్లు ను కళ్ళతో చూసి పట్టలేని చేయి
దాని రంగులు నా కళలకు నిదర్శనాలు కదయ్యా
సీతాకోకచిలకలా స్వేచ్చగా ఎగరలేను పట్టని చేయి
దాని రెక్కలు నా ఊహలకు మార్గదర్శకాలు చూపేనయ్యా
దూరంగా ఉన్న నిన్ను చేరలేను నా స్థితి చేయి
పదిలపరుచుకున్ననీ జ్ఞాపకాల మరువలేనయ్యా
కునుకురాని ప్రతిరేయి కధలాగే సాగు చేయి
కన్నీటితో కనులకొక్క వ్యధలాగె మిగుల్చావయ్యా
కలవాలని అనుక్షణం కలవలేక కలత చేయి
కాలమంత కరిగిపోని కలలాగే కదుల నిచ్చావయ్యా
మనసెందుకు మాటవినక మారాములు చేస్తున్న చేయి
ప్రేమలో మత్తేమిటో మాయలాగె మభ్యపెడుతుందయ్యా
నిప్పులాగె కాలుతుంది నీరులాగె జారి పోవు చేయి
యుగళంగా అలజడులతొ పాటలాగె పాడుతుందయ్యా
ప్రేమన్నది అతిధిలాగ విజయములే ఇచ్చు చేయి
చెరిసగమై చేరువైతె మధువులాగె మారుతుండెదయ్యా
కాలం కలిసొచ్చేదాకా నిరీక్షణ తో కష్టపడే చేయి
నమ్మకమే ఆయుధమే నని నమ్మి బతకాలన్నావయ్యా
పితృదినోత్సవ సందర్భంగా సమూహ సమస్తసభ్యులకు శుభాకాంక్షలు శుభాభినందనలు
మల్లాప్రగడ రామకృష్ణ
ఆరాధ్య లీల.. (7) ప్రాంజలి ప్రభ సీసగీత మాలిక..
తాతకు వందనం ధర్మప్రవర్తన
నేర్పుతండ్రియగుట నీడ బ్రతుకు
కాతరభావము కట్టడిచేయుచు
మంచిమార్గముగాను మమత బ్రతుకు
ప్రీతిగ బోధలే ప్రేమనుపంచెడు
మార్గదర్శిగనులే మాయ బ్రతుకు
నేతరమైనజీవి నెప్పుడు సద్గురు
నీజగమ్మునకళ నియమ బ్రతుకు
మార్గసుదర్శనై మానస,జాగృతి
నందజేయుచువిధి నటన బ్రతుకు
నీతిప్రబోధక నిత్య మనస్సుగా
పాప,పుణ్యములగా పలుకు బ్రతుకు
దుర్గములను త్రిప్ప దూరాలు చేరువ
శాస్త్రశోధనకళ సమయ బ్రతుకు
స్వర్గసువర్ణము స్వర్గపుసీమలు
జూపుతండ్రిగప్రేమ చూపు బ్రతుకు
కొండ,గుట్టలుగాను కొల్లలుగూడుగు
కాంతిరేఖలుగాను కాల బ్రతుకు
మానసమ్మునసేవ మార్గము మహిమగా
ప్రజ్వలితమ్ముగ ప్రభల బతుకు
తన్మయమొందెడి తండ్రిగన్ నిత్యము
కాంతిపుంజములుగా కావ్య బ్రతుకు
ప్రేమబంధము పంచ ప్రతిభను జూపెడి
ప్రేమసఖ్యత తోను ప్రీతి బ్రతుకు
తే.. కర్మయోగిత కళలగు గౌరవమ్ము
కష్టజీవికిన్! సుఖమగు కామితమ్ము
దీవెనల పొంద గలతండ్రి దీక్ష తమ్ము
ప్రాంజలి ఘటించి తండ్రిగా ప్రభల గీత
****
ఆరాధ్య లీల (8) ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
ఆనతీ ఇవ్వ రా.. ఆరాధనలు చేయ
ఆక లీ తీర్చ రా.. ఆకాంక్ష నీ దయ
అర్ధ మే పంచు రా.. ఆశ్రితా నధ్యేయ
ఆర్తి గా ఉండె రా.ఆనందము సహాయ
ఆంధ్ర యే నీది రా .. ఆత్మయే నిల్పవా
ఆజ్ణ యే ఇవ్వు రా.. పాలనా తేల్చవా
అందరం కల్సె రా... అక్కర గుండవా
నిండుగా చేయరా.. నీడగా నుండవా
మాధవా నీవు రా .. మానసమ్మున నీవె
మాధురీ రూపమై... మంగళమ్మున నీవె
శ్రీ ధరా నీవు రా... చిత్రమ్ము గనునీవె
చిత్ర మనో లీనమై.. చిన్మాయ చూపవె
మాయనే మార్చ రా.. మమ్మునే కావరా
మంత్రమే వేయరా.. మచ్చనే మార్చురా
లోక మే నీది రా ... కోపమే తీర్చురా
లోకమే మార్చ రా.. దోషమే యాపరా
వేద మీ భూమి లో... ప్రేమ యే ప్రీతి రా
పాద మే పట్టి తీ ..... ప్రేమ నే పంచరా
ఆశ యం తీర్చ రా.. ఆదరించుమ్ము రా
ఆలనా పాలనా..నీది యే చూడు రా
మించి నే నమ్ము రా... మోనమే వీడురా
కీడు యే వద్దు రా .. కిక్కు యే నీదిరా
దోపి డీ వద్దు రా.. దోషమే అవ్వు రా
మేలు యే చేయు రా.... మోక్షమే వచ్చురా
కాలమే పర్గురా.. కష్టమే వచ్చెరా
తాపమే పెర్గె రా ... తప్పు యే దుర్గె రా
పాపమే నుండె రా... పంతమే పెర్గె రా
కోపమే పెచ్చు రా.. గోప్యమే లేదురా
నిన్న నే నెక్క డో.. నేడు రే పెక్కడో
నేడు నే పిల్చె రా... నన్ను నే కొట్ట రా
నాది యే నీది రా... నీది యే. నాదిరా
వెన్న నీ డెందమో వేణుగో పాలకా
****
ఆరాధ్య లీల (9) ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
నిదుర పోరా మువ్వ గోపాలా
ఎదురు చూసి కనులు కాయలు కాసేనురా
అదురు చెందకు బెదురు వద్దురా
సదరు సేవలో హాయిగా నిదురపో గోపాలా
చక్కగా నెలరాజు కొలువు దీరాడు
చుక్కలన్నీ మెరుపుల తోనులె మెరిసాయి
దిక్కులు గా తెలియ పరిచి ఉన్నాయి
మోక్కిన వారికి మోక్షము ఇచ్చే గోపాలా....ని
పాలు తాగిన దూడ నిదుర పోయింది
వేలు పట్టీ చీకి నిదురపోరా నాతండ్రి
ఆలు బిడ్డలు ఇంక నిదుర పోలేదు
గోల చేయకు అన్నీ ముద్దు లిచ్చెద గోపాలా...ని
పాట పాడిన పడుచులు వెల్లారు
ఆటలాడిన పిల్లలు అలసి పొయ్యారు
బాట లన్ని చూపు పరమాత్మ
తోటలో పూలన్ని నీకే నిదురపో గోపాలా..ని
గిలక్కాయలు చూస్తూ హాయిగా నుండురా
కాలగజ్జలు పెట్తాను నవ్వుతూ హాయిగా నిదురపో
అల్లిబిల్లి ఆటలు ఆడావు గదురా
అలక చూపక కలలు తీర్చు గోపాలా.....ని
నిదుర పోరా మువ్వ గోపాలా
ఎదురు చూసి కనులు కాయలు కాసేనురా
అదురు చెందకు బెదురు వద్దురా
సదరు సేవలో హాయిగా నిదురపో గోపాలా
***
ఆరాధ్య లీల (10) ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
నాది యన్నది ఏది లేదు, నాది కానిది ఏది లేదు,
నాది నాది ఈ జగతి, ధర్మ మార్గాన తీవ్ర ప్రతిభ స్థితి గతి
చేర సాల్లో పుట్టా, తల్లిదండ్రులకు దూరమయ్యా
రాజ్య భోగం వదిలిపెట్టా, మధురకు దూరంగా పెరిగా
పసితనంలో రాక్షసులను పనిపట్టా, గోవులతో గోపికలతో ఆడా
స్వలాభం లేకుండా, ఎన్నో సందర్భాలలో నిందలు భరించా.. నా
అక్షరాల ఔన్నత్యం అర్థం అయ్యేటట్లుగా
అనుభవాల సారాంశం ఆసరాగా నిలిచే టట్లుగా
ఆశయాల గొప్పతనం ఆచరణలో ఫలించేటట్లుగా
మార్గాల నదులన్నీ మానవత్వపు సముద్రములో మమేకమై కలిసే టట్లుగా... నా సార్ధకత... నా l
రుచులు భిన్నమైనా శుచిగా ఉండే టట్లుగా
భేదాలెన్నున్నాగానీ మోదంగా కలిసే టట్లుగా
కాలానిర్ణయానికి కట్టుబడి నుండేటట్లుగా
వైవిధ్యం ఎంతున్నాగానీ వసుధైక భావనే —సార్థకత అయ్యేటట్లుగా
మనిషిలో మనిషినై మనుగడలో మమతనై
మానవత్వానికి నాందినై ప్రేమకు ప్రీతి పాత్రుడునై
ప్రేమే నా ఆశ, ప్రేమే నా విశ్వాస, ప్రేమే నా ఉఛ్వాస
ప్రేమే నా ధ్యాన, ప్రేమే నా సత్య, ప్రేమే నా న్యాయ
ప్రేమే నా శక్తి, ప్రేమే నా యుక్తి, ప్రేమే నా రక్తి
ప్రేమే నా లక్ష్య, ప్రేమే నా లబ్ది, ప్రేమే నా లౌక్య
నాది యన్నది ఏది లేదు, నాది కానిది ఏది లేదు,
నాది నాది ఈ జగతి, ధర్మ మార్గాన తీవ్ర ప్రతిభ స్థితి గతి
****
No comments:
Post a Comment