దృష్టి పూతం న్యసేత్పాదం
వస్త్ర పూతం జలం పిబేత్1
సత్య పూతం వదే ద్వాచం
మన: పూతం సమాచరేత్11
భావం: కళ్ళతో చూసి అడుగులు వేయాలి. వస్త్రంతో వడపోసిన తరువాత నీళ్ళు త్రాగాలి. నిజంతో కూడిన శుద్ధమైన మాటలు మాట్లాడాలి. మంచి మనసుతో పవిత్రమైన పనులు చేయాలి.
తేటగీతి:
కనులతో చూసి యడుగులు కదపవలయు,
బాగ వడపోసి నీటిని త్రాగవలయు,
అతి నిజపు మాటలే మాటలాడవలయు,
శ్రేష్ఠ మనముతో పనులను చేయవలయు.
****
ఆ..కనుల చూపు లన్ని కదలి మారగలుగు
మాట లాడవలయు మంచి మాట
వస్త్ర పూత బట్టి వడపోసి త్రాగుట
శ్రేష్ఠ మనము తోన చేయ పనులు
***
యీ చిత్రానికి స్పందిస్తూ వర్ణన, చక్కని పద్యం గాని కవితగాని ప్రాంజలి ప్రభలో ఉన్నవారు వ్రాయగలరు
దయచేసి చిత్రాలు పెట్టవద్దు పెట్టినా తొలగించబడును ఇది కేవలం తెలుగు భాష అభివృద్ది పరుచుటకు మాత్రమే మీ మల్లాప్రగడ
న హి వైరేణ వైరాణి సామ్యాతీత కదాచన1
అవైరాణైవశ్యామంతి ఏష ధర్మ: సనాతన:11
భావం: శతృత్వంతో శతృత్వం ఎప్పటికీ శాంతించదు. అవైరత్వం అంటే ప్రేమతో మాత్రమే శతృత్వం దూరమౌతుంది. ఇదే మన సనాతన ధర్మం.
తేటగీతి:
ప్రబల వైరమెప్పుడును వైరమ్ముతోడ
సమసిపోవుట జరుగదు జగతియందు
వైరమనునది ప్రేమచే దూరమగును
మన సనాతన ధర్మంబు ననగ నిద్ది.
ఆ.. శత్రువు చెంత యెపుడు శాంతి పొందను లేవు
మిత్రుని పలుకు వింత మిధ్య యగుట
సమయ ధర్మమేను సమసిపోయే కర్మ
ప్రేమనునది వైర చేష్ట మార్చు
ప్రాంజలి ప్రభ..01/03
*నాస్థాన నిహితా కాచిత్ క్రియా ఫలవతి భవేత్ ౹
న వ్యాపారశతేనాపి శుకవత్పాఠ్యతే బకః ౹౹
సరియైన స్థానములో సరియైన రీతిలో ప్రయత్నం చేయకపోతే ఏ పనియైనా సరిగ్గా జరగదు.కొంగకు ఎంత నేర్పినా అది చిలుకలా మాట్లాడలేదు.
ఆ..పనులు యెన్ని యున్న పనితనమే మిన్న
ఎవరు యేమి యన్న యెదను తట్టు
చిలక పలుకు రాదు చిక్కిన కొంగకు
జన్మ విలువ బట్టి జయము కూర్చు
ప్రాంజలి ప్రభ,
No comments:
Post a Comment