Sunday, 24 September 2017

వాహిక - 4


లోక సూక్తులు (ఛందస్సు)

UUII - UIUI - UIIU - IIUU


విజ్ఞానము వింత శోభ అర్ధముచే కనుగోటం 
అజ్ఞానము తన్ను తాను అల్పుడనే అనుకోటం
సామర్ధ్యము నాది నాకే తెల్సుననే దియుగర్వం
వాచాలత తోడు నీడ గా కలవా లని సత్యం

సంకల్పము ఉంటె ఎంతొ దివ్య బలం మనవెంటే
ఆకర్ష ణ ఉంటె ఏం తొ     ప్రేమ బలం మనసంతా
సంఘర్షణ ఉంటె కల్లోలం మమతే మనచుట్టూ
వికర్షణ ఉంటె శాంతి లేక ఉండే భ్రమ సృష్టే 

దివ్యత్వము సామ దాన భేదములే నవజీవం
సాకారము  ప్రేమ శక్తి కామములే  నవరూపం
ప్రామాణిక సేవా భావ తత్వములే నవదీపం
జ్ఞానం మన ప్రేమ తత్వ నిర్మలమే నవదీక్ష

సందేహము ఎప్పుడూ మనస్సు వేధించుట కాదా
ఆనందము ఎప్పుడూ మనస్సు కేశాంతము కాదా
దేవాలయ ప్రాంగణం మనస్సుకే వేదము కాదా
సాహిత్యము ప్రాణ భాష ప్రేరణగా కధ  కాదా 

--((*))--



 *అక్షర  గీతి (కవిత )

మదిర నీకేలరా - మధువు నేనిత్తు - మానసమ్మిత్తు
వ్యధలు నీకేలరా - వనిత నేనుండ - వలపుతో నిండ

తక్కువ చేయనురా - తాపము చూడుమురా - తమకం విడుమురా 
భాధలు ఎందుకురా - భద్యత నాదియురా - భారము నాదియురా

ఆకలి అణకురా - అసలు నీకేనురా - అంతయు పొందుమురా
దాహము తీర్చుకోరా  - దాపరికం వద్దురా  - దావాలనం తగ్గునురా       

సుఖాలు మనవిరా  - సంతోషాలు మనవిరా  - సంబరం మనదిరా
కోపాలు మరువురా - కోలాట ఆదుమురా  - కోరిక తీరునురా

మదిర నీకేలరా - మధువు నేనిత్తు - మానసమ్మిత్తు
వ్యధలు నీకేలరా - వనిత నేనుండ - వలపుతో నిండ

పక్క చూపు నీకేలరా - పరువం నేనిత్తు - వలపు అందిస్థా
లేదని అనుకోకురా - లోకాన్ని చూడరా - లోకులను గమనించారా   

కలవరింపు ఎందుకు - కనులముందు ఉండగా - కనువిందు చేస్తుండగా
పలకరింపు చూపరా - పక్కను మరువకురా - పదిలంగా ఉందాంరా

పోగొట్టుకొంటిరా - పొగమంచులోనఁ - బొదరింటిలోన
నాగవేషణ యెల్ల - నన్ను కన్గొనుట - నగుచు నే మనుట

సాన పట్టుమురా - సతతము కలవరా - సరిగమ అనరా
వేషము వద్దురా - వేగిర రమ్మురా - వెతలు తీరునురా

రాగవీణను మీటె - రమణి రంజిల్ల - రవము రాజిల్ల
యోగ మేమిటొ నాది - యురికి యొప్పారె - నురము విప్పారె

రామకీర్తన పాడే - రవళి రంగరించి - రసము శోభిల్లే
వేగము మరిచా - వేకువ చేరితి - వేదన తీర్చితి

--((***))--



ప్రాంజలి ప్రభ 

సుప్రభాత వేళకే సుందర స్వరూపాన్ని 
సుమదళాల సుధా స్వరూపాలంకారాన్ని   
సుజలాం సుఫలాం సుమధుర ప్రభావాన్ని  
సుగుణ సుసంపన్నాన్ని అందించే దైవాన్ని  
నిత్యం పూజించి తరించండి 
- 

ప్రేమాభిమాన సేవా సహాయ సామీప్య సంఘమే 
సంతోష సేవ సాహిత్య ప్రేమతత్వాల సంఘమే 
శ్రీరామ రక్ష బాంధవ్య బంధ సౌభాగ్య సంఘమే 
ప్రారబ్ధ విద్య సంసార పోషణే సత్య సంఘమే 
సంఘాన్ని గౌరవించండి శాంతిని పొందండి      


ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ

ప్రేమ జూపి మహాత్మ కంట నీరున్ గార్చున్ 
దైవ మాయ తెల్వక  కంట నీరున్ గార్చున్
భార్య భర్త సహాయ  సేవ నీరున్ గార్చున్   
"నేలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్"

సహాయం నీరుకార్చిన ఫలితమ్ అధికం
--((**))--

ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ

సరస సంగీత సాహిత్య వెల్లువ
సమయ సారూప్య సంతోష వెల్లువ
తరుణ మాదిత్య సంభావ వెల్లువ
సహన మాధుర్య సద్భోధ వెల్లువ
  సప్తస్వరాల నిలయం 

కలలు కల్లలు కలయు కళ  


ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రే నమ:

వర్ణ వివక్షత  రాదు 
వర్గ విలక్షణ అసలు రాదు
దుష్ట గణము మనమధ్యకు రాదు
ఉత్సాస నిస్వాసాలు ఒక్కటే నేస్తమా
మనమధ్య ఉన్నది ప్రేమ మాత్రమే

వడిలో ఉండి ఓదారుస్తావు నేస్తమా     
      

మరువలేని అంటావు నేస్తమా
అలసి సొలసిన కాలానికి
అనంత ఆలోచన తరుణానికి
అమృత ఘడియల ఆనందానికి
పరమానందాన్ని పంచావు నేస్తమా    

ప్రేమకి ప్రేమే దాసోహం
  
మనమధ్య ఉన్నది ప్రేమ
ప్రేమను పంచి జీవిద్దాము నేస్తమా 


శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్

హే స్వామి నాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్

దేవాది దేవసుత దేవగణాధినాథ 

దేవేంద్రవంధ్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారదమునీంద్ర సుగీత కీర్తే
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహరిన్
తస్మాత్ ప్రదాన పరిపూరాత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్

క్రౌంచ సురేంద్ర మదఖండన శక్తిశూల
చాపాది పాశాది శస్ర్త పరమండిత దివ్యపాణే
శ్రీకుండలీశ దృతతుండ శిఖీంద్ర వాహ
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్

దేవాది దేవ రథమండల మధ్యమేత్య
దేవేంద్ర పీఠ నగరం దృఢచాప హస్తం
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్

హారాదిరత్న మణియుక్త కిరీటహార
కేయూర కుండల లసత్కవచాభిరామ
హేవీర తారక జయామర బృంద వంద్య
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్

పంచాక్షరాది మను మంత్రిత గాంగతోయై:
పంచామృతై: ప్రముదితేంద్ర ముఖై ర్మునీంద్రై:
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం
సిక్త్వాతు మా మవ కళాధర కాంతి కాంత్యా
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్త మా:
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతం:
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాత: రుత్థాయ య:పఠేత్
కోటి జన్మ కృతం పాపం తత్ క్షణా దేవనశ్యతి



ప్రాంజలి ప్రభ.
అమెరికాలో సంగీత విభాగంలో తుపాకీతో కాల్చటం
అమానుషం (కొందరు అక్కడికక్కడే మరణం)

చనిపోయిన వారికుటుంబాలకు సానుభూతి
తెలియపరుస్తున్నాను

సంగీత సాహిత్య కళాకారుల ప్రభంజనం
సంగీత సమ్మేళనంలో ప్రజా సమ్మోహం
కని విని ఎరుగని మూర్ఖుని వీరతడవం
ఒకరు చేతిలో తుపాకిని ధరించి పేల్చటం 

తక్షణ సమయంలో కొందరు మృత్యువాత
గాయాలతో ఉన్న వారికి చికిత్స చేయుట  
గూడాచారులు పేల్చిన వారిని గుర్తించుట
తక్షణ చర్యలు అధికారులు ఏర్పాటుచేయుట

కాల నిర్ణయాన్ని ఎవ్వరు ఏమి చెప్పలేరు
మేధావులందరూ ఉన్నా జరిగేవి చెప్పలేరు
భగవాన్ లీలాతత్వాన్ని ఎవరూ చెప్పలేరు
క్షతగాత్రులకు సహాయమం అందించటమే మనిషి విధి
--((*))--  



వాహిక - 4


ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో ....... 1

మొగాడు నచ్చితే ప్రేమిస్తాడు 
ఆడది నమ్మితే ప్రేమిస్తుంది 
మొగవాని ప్రేమ అనంతము 
ఆడదాని ప్రేమ బిడ్డకు సొంతము 

ప్రేమంటే తీసుకోవటం కాదు 
జీవితాంతము ప్రేమను పంచటమే 
ప్రేమున్న హృదయంలో మరుపుండదు
ప్రేమ లేనివారికి నిద్ర అసలుండదు 

పెళ్ళైన కొత్తలో జన్మజన్మల బంధం 
కొన్నాళ్ళకు పిల్లల పోషణతో బంధం 
మరికొన్నాళ్ళకు ఒకరికి ఒకరైన బంధం 
ఇంకొన్నాళ్ళకు ఆరోగ్యం సహకరించని బంధం 

కాలం నీదైతే తప్పు ఒప్పవుతుంది
కాలం నీదికాకపొతే ఒప్పు తప్పవుతుంది   
ఒకరికి తొమ్మిది సంఖ్య అదృష్ట మవుతుంది 
మరొకరికి ఉల్టా ఆరు సంఖ్య అదృష్ట మవుతుంది

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో 
--((*))--  

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో ...... 2

రెండు ఊర్ధ రేఖలమధ్య సమాంతరాలు 
మనిషిగా ఎదుగుదలకు అవి సోపానాలు 
తరాలు, కాలాలు మారిన అవే సోపానాలు
అవే భవిషత్ మార్గదర్శం చూపే నిచ్చెనలు

ఉచ్చ నీచ భేదాలు లేని మార్గాలు 
ధనిక బీదవారని పట్టించుకోని బద్దలు 
పై పైకి ఎక్కితే పొందుతావు ఫలితాలు    
పోటీయుగంలో ఉండు సహచరులు 

గమ్యం చూపే సోపానమా వందనములు 
లక్ష్యం చూపే సోపానమా అభినందనలు 
మా ఎదుగుదలకు కృతజ్ఞతాభినందనలు 
తల్లితండ్రుల కళ్ళమాటలే మాకు దీవెనలు   

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో
--((*))--

ఓ మనిషి తెలుసుకో 
తెలుకొని మసలుకో ...... 3

హృదయం పలుకుతుందీ..
ఆ ముదిత మూగ నయనాలలో
సమయం వణుకుతుందీ
ఆ సరిత యోగ సమయాలలో

వలయం తిరుగుతుంది
ఆ నదిలొ గుండ సమయాలలో
తరుణం అడుగుతుంది
ఆ పనిలొ ప్రేమ అడుగులలో    

భూమికి బరువు పెరుగుతుంది 
ఆధునిక కట్టడాలు పెరుగుటలో
ప్రకృతి మనుష్యులను వణికిస్తుంది
తుఫాన్, భూకంపాలు పెరుగుటలో   

మానవత్వం వణుకుతుంది 
భయానక దృశ్యాలు జరుగుటలో 
ప్రేమ తత్త్వం పెరుగు తుంది 
ప్రేమించిన ప్రేమ దూరమగుటలో 

ఓ మనిషి తెలుసుకో 
తెలుకొని మసలుకో 
--((*))--

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో ..... 4

మనిషిki  రంగులో లేదు
రంగులను మార్చే ముఖంములో ఉంది
పుటేటప్పుడు ఏరంగో తెలియదు
అంతా పెరిగాక బుద్ధి రంగులు మారుతుంది

మనిషి సంపాదనలో రంగు లేదు
దాపరికంలో అనేక రంగులు మారుతుంది
మనిషి ప్రేమలో ఎటువంటి భేదం లేదు
ఎదుటువారిని చూసి ప్రేమ రంగు మారుతుంది

వర్షం పడ్డప్పుడు ఇంద్రధనస్సుకు రంగు లేదు
ఎందుకో సప్తవర్ణాలతో కనిపించి మాయమవుతుంది
భాషలో భావం లో ఎటువంటి రంగు లేదు
మాట్లాడే మాటలలోనే రంగులమయమౌతున్నది

తెల్లడబ్బుకు నల్లడబ్బుకు భేద రంగు లేదు
నీతికి అవినీతికి, స్నేహానికి దర్పానికి రంగులు మారుస్తుంది
అందం నుండి బ్రహ్మాన్డమంతా రంగులమయం
భూమి,ఆకాశాన్ని ప్రశాంతముగాను ఉండనీకుండా చేస్తున్నది
   
దయచేసి నేను వ్రాసేవి మీకు నచ్చితే షేర్ గాని లైక్ గాని చేయండి
స్నేహంతో తెలుగు భాషకు  రంగులు మారకుండా జాగర్త పడదాం

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో...... 5

తలచిన పని తనువు తపనలకు సరియగు సమయమే
విరిసిన పవన వలయములతొ మనసును చెరుచుటయే
మదితలపులు ముదమున మనుగడకు ఒకటి ఆగుటయే
తలవని తమకము తొ తరుణికి సుఖము దొరుకుటయే

ప్రతి దినము పరువముల పదనిసలు వయసు నుడికరమే
మదితలపుల మదన కుహరముల వలపులతొ గుణ కరమే
మరులు గొలుపు మధురగతుల సిరులు కొలుచు సుడికరమే
వయసు చలి గిలి చమకముల తమకముల తరుణ మిదే    

తెలియ వలసినవి తెలియక యతుల తిక మక పడునా
తెలిసియు తెలపక తహ తహ తొ పతులు చలి చలి అనునా
సమరము విరహము సమ వడిలొ పరువము ఫలమగునా
కనివిని ఎరుగని సుఖమును తెలుపు  సమయము ఇది అగునా

దయచేసి నేను వ్రాసేవి మీకు నచ్చితే షేర్ గాని లైక్ గాని చేయండి
స్నేహంతో తెలుగు భాషకు  రంగులు మారకుండా జాగర్త పడదాం

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో  ..... 6

కమనీయ దృశ్యమే - కమనీయ కావ్యమే
కమనీయ భాష్యమే - కమనీయ మంత్రం

కనువిందు సిద్ధియే - కనువిందు సఖ్యతే
కనువిందు ధర్మమే  - కనువిందు మార్గం

విధిరాత కయ్యమే - విధిరాత నెయ్యమే
విధిరాత వియ్యమే - విధిలేని  కాలం

కనుపాప అద్దమే - కనుపాప రక్షణే
కనుపాప చూఫులే - కనుపాప లీలా

మహిలోన పుట్టుటే - మహిలోన జచ్చుటే
మహిలోన మంటలే  - మదిలోన భీతీ

నిముషంలొ మార్పులే - నిముషం లొ తీర్పులే
నిముషం లొ కూర్పులే - సమయం లొ  మార్పే

మరుగేల ఓరమా - మరుగేల  ఓ ఉషా
మరుగేల ఓసిరీ - మరుగేల నీతో

మదిలోని కాంతియే - మదిలోన మాయయే
మదిలోన ప్రేమయే - మదిలోని  ప్రియం

సువిధేయ శ్రీమతీ - సువిధేయ శ్రీపతీ
సువిధేయ నెయ్యమే - సువిధాతా లీలా    

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో


--((*))--  

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో  .... 7

ఐదు వేళ్ళలో ప్రాధాన్యం అంగుష్టానికి 
నేను నీకోసం ఉన్నానని చెప్పటానికి 
నన్ను ఎక్కించుకుంటారా అడగటానికి 
దాహం అవుతున్నది అని చెప్పటానికి

బల్లెం బలంగా విసరటానికి 
బాణం గురిచూసి కొట్టటానికి 
తుపాకీతో ట్రిగ్గర్ నొక్కటానికి 
సంతకం బదులు వేలిముద్రవేయటానికి 

వానరుడినుండి నరుడుగా మారటానికి 
కంఠం బట్టి కధలు వ్రాయటానికి
విద్యుత్ హాజరు పట్టిక గుర్తించటానికి
స్నేహ సంభంధం  కలుపుకోవటానికి 

ఆకాశంలో ఎగరటానికి 
సంద్రంలో పడవ నడపటానికి
భూమిపై వాహనాన్ని నడపటానికి 
రిమోట్, సెల్ వాడటానికి 
వేలు అవసరం 

అందుకేనేమో ఆనాడు 
అర్జునిని ఆకాశంలో ఎత్తటానికి
ద్రోణుడు ఎకలవ్యన్నీ కోరాడు అంగుష్టాన్ని 
అంగుష్ట ముద్రలు రాతలు మారుస్తున్నాయి         

ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చిన 
బొటనవేలు పనిచేయనిదే ఏది కదలదు 
ఓమనిషి చేతివేళ్లకు బలం పెంచుకో
ప్రతిపనికి అవేమూలమని గ్రహించు 

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో 

--((*))--

ఓ మనిషి తెలుసుకో 
తెలుకొని మసలుకో  ..... 8

చేతిలో కధల పుస్తకం మాయం
చేతిలో ప్రస్తుతం సెల్ ఖాయం 
చెవిలో ఇంపుగా పాటలు వినటం
మెదడులో బూజు దులపటంఖాయం

ప్రపంచాన్ని అరచేతిలో చూపటం విజయం 
చూడాల్సినవి చూడలేనివి చూడటం ఖాయం 
ప్రపంచ విజ్ఞానంతో మేధాశక్తి పెరగటం ఖాయం 
వాడటం తెలియకపోతే డబ్బులు వదలటం ఖాయం  

సెల్లులో చూపుతుంది స్వర్గం నరకం 
మరియు చూపుతుంది త్రిశంక స్వర్గం 
సెల్లులో మనుష్యుల మాటల్తో చూడటం  
ఇది నిజాలు అభద్దాలు మోయటం ఖాయం

మనలో శక్తిసామర్ద్యాలను హరించటం ఖాయం 
వాహనాల్లో సెల్లుతో మాట్లాడితే మరణం ఖాయం
సెల్ అదేపనిగా వాడితే మనసు హరించటం ఖాయం
అతిగా వాడినా పిచ్చి వారిగా మారటం ఖాయం 
  
ఓ మనిషి తెలుసుకో 
తెలుకొని మసలుకో
--((*))-

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో   ... 9
కానరావు 
మెరుపుల్లో తళుకులు 
తలపుల్లో తలుపులు 
కలుపుల్లో పురుగులు 
వలపుల్లో వయసులు 
కానరావు 
కవితల్లో గాధలు 
మమతల్లో మాయలు
వనితల్లో ఆశలు 
పతితల్లో ప్రేమలు 
కానరావు 
పువ్వుల్లో తేనియలు 
నవ్వుల్లో సరిగమలు 
కొవ్వుల్లో  కోరికలు
చెవ్వుల్లో గుబిలిలు
కానరావు 
యువతల్లో వేడుకలు 
చిరుతల్లో పరుగులు
చరితల్లో  విషయాలు 
గణితంలో కిటుకులు 

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో
--((*))--     


ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

దేశాన్ని, ప్రజల్ని కాపాడేది సైనిక ధర్మం
తల్లి తండ్రులను ఆదరించటం పుత్ర ధర్మం 
బిడ్డలను ప్రయోజకులుగా చేయడం తండ్రి ధర్మం
ఉన్న, కన్న వారింటికి పేరు తేవడం బిడ్డల ధర్మం

తనవృత్తిలో ఉన్న ధర్మాన్ని గౌరవించడమే వృత్తి ధర్మం
సంపాదనలో కొంత దానంచేసి కాపాడటం సంసార ధర్మం
అసహాయములను కాపాడటం ప్రతి మానవుని ధర్మం
భార్య, పిల్లల సమస్యలను పరిష్కరించటమే వివాహ ధర్మం 

నమ్మినవారికి అపకారము చేయక ఉండుటయే స్నేహ ధర్మం
ధైర్యంగా ఉండి సోమరి తనం లేకపోవడమే పురుష ధర్మం
సంపాదన కోసం వేదించక భర్తమాటలను గౌరవించి భార్య ధర్మం
చిప్పిన మాటను మరువక  నిలబెట్టు కోవటమే సత్య ధర్మం   

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 


No comments:

Post a Comment