Tuesday, 26 September 2017

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం




శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

ఓం హ్రీమ్ శ్రీ౦ శ్రీమాత్రే నమ:

శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా    .... 1

శ్రీమాతా                   :"శ్రీ శబ్దము వాక్పరము " కావున వాక్కులను కలుగ చేయుటకు ఈమెతోసమానమైన ఏదేవతలు లేరు కనుక శ్రీ మాతా అని పిలుస్తారు    
శ్రీ మహారాజ్ఞి             : సకల ప్రపంచ పాలనా సామర్ధ్యము కలది కావునా "శ్రీ మహారాజ్ఞి" అని  పిలుస్తారు
శ్రీమత్సింహాసనేశ్వరీ    :బంధమోక్ష స్వరూపాది సకాలమును చూపింప నారభించు" సింహవాహనముగా  గల ఈశ్వరీ "
చిదగ్ని కుండసంభూతా:అగ్నిగుండములో పుట్టి, పూర్తి బ్రహ్మతేజస్సుతో, ఇచ్ఛా తేజస్సుతో శక్తి  రూపముగా ప్రత్యక్షమైన తల్లి
దేవకార్యసముద్యతా   : దేవకార్యార్థము కొరకు ఆవిర్భవించిన తల్లి, శ్రీ చక్రాకారముగా ఆవిర్భవించి  ప్రత్యక్షమైన తల్లి

    అగ్నిగుండములో పుట్టి, పూర్తి బ్రహ్మతేజస్సుతో, ఇచ్ఛా తేజస్సుతో శక్తి  రూపముగా ప్రత్యక్షమైన తల్లివి నీవమ్మా, దేవకార్యార్థము కొరకు ఆవిర్భవించిన తల్లివమ్మా, శ్రీ చక్రాకారముగా ఆవిర్భవించి ప్రజలకు ప్రత్యక్షమైన తల్లివమ్మా, "శ్రీ శబ్దము వాక్పరము " కావున వాక్కులను కలుగ చేయుటకు నీతో సమానమైన ఏదేవతలు లేరు కనుక నిన్ను శ్రీ మాతా అని పిలుస్తారమ్మా , బంధమోక్ష, స్వరూపాది, సకాలమును, చూపింప నారభించు" సింహ వాహనముగా స్థిరముగా ఉండి, సకల ప్రపంచ పాలనా సామర్ధ్యము కలిగి ఉన్నావు  కావునా "శ్రీ మహారాజ్ఞి" అని పిలుస్తారమ్మ, అమ్మామ్మా అమ్మా,  అమ్మలగన్న మాయమ్మకు మా శతకోటి దండములు.  

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా
రాగస్వరూపపాశాడ్యా  క్రోథాకారాంకుశోజ్జ్వలా        .... 2

ఉద్యద్భానుసహస్రాభా : అనేక సూర్యకిరణములుగల రక్తకాంతితో ప్రకాశమంతముగా పరాశక్తిగా మారిన  తల్లి
చతుర్బాహు సమన్వితా : నాలుగు హస్తములు కలిగి ఉన్న "మీదుగా రెండు హస్తాలు క్రిందగా రెండు హస్తములు గల బడదేవతగా ప్రత్యక్షంగా కనబడుతున్న తల్లి
రాగస్వరూపపాశాడ్యా  : సత్యగుణ త్రయము కలిగి బ్రహ్మతేజస్సుతో పాశమున్న తల్లి  
క్రోథాకారాంకుశోజ్జ్వలా : అమ్మవారి క్రోధమే అంకుసాకారము పొందినది, అంకుశముచేత ప్రకాశించు  చున్న హస్తముగల తల్లి

అనేక సూర్య కిరణముల వెలుగులతో, రక్తకాంతి వర్ణముతో,  ప్రకాశమంతముగా, పరాశక్తిగా మారిన తల్లివమ్మా, నాలుగు హస్తములు కలిగి ఉన్న "మీదుగా రెండు హస్తములు, క్రిందగా రెండు హస్తములు గల బడదేవతగా ప్రత్యక్షంగా  కనబడుతున్న తల్లివమ్మా, సత్యగుణ త్రయము కలిగి బ్రహ్మతేజస్సుతో పాశమున్న తల్లివమ్మా,  అమ్మవారి క్రోధమే అంకుశాకారము పొందినది, అంకుశముచేత ప్రకాశించు చున్న హస్తముగల తల్లివమ్మా, అమ్మామ్మాఅమ్మా,  అమ్మలగన్న మాయమ్మకు మా శతకోటి దండములు   

మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా 
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా  ....  3 

మనోరూపేక్షు కోదండా   : శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది  "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి    


పంచతన్మాత్రసాయకా : శ్రీదేవి కుడిభాగము బాహువు యందు  పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.

నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా : శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా 

       శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది  "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి, శ్రీదేవి కుడిభాగము బాహువు యందు  పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా, శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా. ఈ రూపములో అమ్మను ధ్యానించినవారికి సర్వజనావశ్యము, సర్వజగద్వశ్యము తప్పక జరుగునని ఋషులు తెలియ పరిచారు. పంచ భూతములతో ఎర్రని కాతవంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు          
प्रांजलि प्रभ 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా    
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా        ....  4 

 చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా : చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా, 

కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్నతల్లివమ్మా       
   
చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా, కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్నతల్లివమ్మా, ఎర్రని కాతవంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు.
प्रांजलि प्रभ 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా    ........ 5

అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా :  అర్ధచంద్రాకారమైన ఫాలప్రదేశము కల శ్రీ దేవివమ్మా,  
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా : ముఖమనే చంద్ర బింబమునందు కళంకము వంటి కస్తూరీ   తిలకము గల శ్రీదేవివమ్మా 

అర్ధచంద్రాకారమైన ఫాల ప్రదేశము కల శ్రీ దేవివమ్మా, ముఖమనే చంద్ర బింబమునందు కలంకము వంటి కస్తూరీ తిలకము గల శ్రీదేవివమ్మా, ఫాలప్రదేశము అర్ధచంద్రాకారము, ముఖము చంద్రబింబము వలె వెలిగి పోచున్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు. 


प्रांजलि प्रभ 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా     .........6 

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : అమ్మవారి ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా  

వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా  :ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న  మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా  

ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా, ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న  మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా, కనుబొమలు తోరణములు కలిగి, ముత్యములవంటి నేత్రములు కలిగి ఉన్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు    
  
                
   





No comments:

Post a Comment