Tuesday, 26 September 2017

Om Sri Ram ' Sri Matrenama '

om sri raam - sri maatrenama:

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఇదేమి రాజకీయమో

ఒక వైపు ధన ఖర్చుతో
పెంచుతున్నారు హరిత వనం
మరోవైపు వనాలు నరికి
కడుతున్నారు కొత్త భవనాలు

ఒక వైపు భోదిస్తున్నారు
ఉచిత ఆరోగ్య సూత్రాలు
మరోవైపు పంట స్థలాలో
పెడుతున్నారు పరిశ్రమలు

ఒక వైపు నిత్యావసర వస్తువులు
కల్తీ లేకుండా పరీక్షలు
మరోవైపు అధికారులతో
వ్యాపారుల మధ్య బేరాలు

ఒక వైపు స్త్రీల రక్షణకు
ఏర్పాట్లు ముమ్మరం
మరోవైపు అమానుష ప్రవర్తనకు
వేస్తున్నారు కమిటీలు

ఒకవైపు ధనంతో బోనాల సంబరాలు
మరోవైపు ధరలతో బతుకు భారాలు 
ఒకవైపు విదేశీ మైత్రి పర్యటనలు
మరోవైపు ఐక్యం లేక అంతర్యుద్దాలు

ఒకవైపు దేశపరిశ్రమ వస్తువుల
నాణ్యత తెలుసుకొని తప్పక వాడాలి
మరోవైపు విదేశీ పెట్టుబడులు తగ్గాలి
స్వదేశీ పెట్టుబడులు పెరగాలి     

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))_-

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

అక్షరాలను ఆరాధించు
భావాలను ఆస్వాదించు
నీలో మనసును ప్రకటించు
మానవత్వాన్ని బ్రతికించు

యదలో పదాలను రచించు
రచనలద్వారా అమృతం పంచు
కవిత్వంతో అనుమానం తుంచు
సహజత్వంతో భావాన్ని పంచు

బీజాన్ని పృద్విలో నాటి శ్రమించు
కవిత్వాలతో నారు, నీరు పోసి శ్రమించు
కథలతో సేద్యం చేసి పంట పండించు   
మనసనే పకృతితో సంతోష పరుచు

విద్యార్థుల భవితకు బాట చూపించు  
సంసారులకు సంస్కరణలను పంచు
వృద్ధులకు పురాణాల కధలు వినిపించు
దేశభవిషత్తుకు కవిత్వాన్ని పండించు     

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో


ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

నాడు- నేడు

రోగిమీద వైద్యునికి సేవాధర్మం
వైధ్యునికి రోగిపై ధన కాంక్ష మర్మం
ఆలు మగల బంధం పవిత్రం
ఆలు మగల సంపదతో యుద్ధం

పల్లె ప్రజల్లో ఆత్మీయ అభిమానం
ప్రజలే అధికార దాహానికి చిక్కి మౌనం
గ్రంధాలు విద్యార్థులకు మార్గదర్శకాలు
అర చేతిలో అంతర్జాల సమాచారాలు    

శ్రద్ధ, నిబద్ధత, ఆత్మసౌందర్యం
ఖటినం, కల్ముషం, కర్ణ కఠోరం
జీవిత సర్వస్వము తాగ్యామ్  
త్యాగమనేది తెలపలేని జీవితం

అడవిలో మృగాలు ఉండేవి
నగరములో మృగాలు కనబడుతున్నాయి
కాలాన్ని బట్టి ఎండా, చలి, వానలుండేవి
ప్రకృతి మానవుల్ని భయంలో ముంచివేస్తున్నది

ఉపాద్యాయుల్ని విద్యార్థులు గౌరవించేవారు  
విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు భయపడుతున్నారు
తల్లి తండ్రులు తమ పిల్లలను ప్రేమించారు
పిల్లలను చూసి తల్లి తండ్రులు భయపడుతున్నారు

నాయకులను ప్రజలు అభిమానించేవారు
ప్రజలే నాయకుల్ని అనుమానంగా చూస్తున్నారు
తల్లి తండ్రుల మాటకు కట్టుబడి ఉండేది కుటుంబం 
బిడ్డల వద్ద నేర్చుకొనే పరిస్థితి ఏర్పడుట శోచనీయం

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
 --((*))--


ప్రాంజలి ప్రభ
అమ్మా ప్రేమంటే ఏమిటి ?
ప్రేమ ఎలా పొందాలమ్మా

మొదట అందరినీ ప్రేమించటం నేర్చుకో
అనుకున్నది సాధించుటలో సహకారమే ప్రేమ
ప్రేమ ఇచ్చి పుచ్చుకోవటంలో ఉంటుంది అదృష్టం
ప్రేమను అర్ధం చేసుకోవాలంటే ఇది ఒక అనంతం

ఇది విశ్వ మంతా వ్యాపించి నడిపే ఇంధనం
నాటకీయంగా నిజా నిజాల మధ్య నలిగే బంధం
ప్రేమ ఇచ్చి పుచ్చుకోవటంలో ఉండాలి ధైర్యం
ఎన్ని కోపాతాపాలు వచ్చిన వదలలేనిది ప్రేమ

ఇష్ట అయిష్టాల మధ్య సమరం కల్పించేదే ప్రేమ
రాగబంధాలను సమ్మేళనం కల్పించేదే ప్రేమ
చూపలేని గౌరవ మర్యాదలను కల్పించేదే ప్రేమ
అంతులేని అపార్ధం, స్వార్దం కల్పించేదే ప్రేమ

గమనం ఉన్న గమ్య లేని జీవితానికి ప్రేమ
విప్పిచెప్పలేని సృష్టి రహస్య మౌన ప్రేమ
ఆకాశం అందుతుందని ఆశలు రేపే ప్రేమ
ఆశయాలు ఫలిస్తాయని అనుభవాల ప్రేమ

ప్రేమ అనేది నిర్వచించలేని నేస్తం
ప్రేమకు ప్రేమే ద్వేషం, ప్రేమకు ప్రేమే సౌఖ్యం
ప్రేమ అనేది భాషకు అందని మహా కావ్యం
పేమ ప్రేమగా అందుకోవటమే నిజమైన ప్రేమ
       
ప్రేమంటే ఏమిటో కొంత తెలిసిందమ్మా
ప్రేమించి ప్రేమను పొందటమే నా కర్తవ్యం

--((*))--

ప్రాంజలి ప్రభ

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

దేశభవితవ్యం నేటి పౌరులపై ఉంది
పౌరుల భవితవ్యం అధ్యాపకులపై ఉంది
అధ్యాపకుల పోషణ రాజ్యాధికారులపై ఉంది
రాజ్యాధికారులకు ప్రాధమిక విద్యపై పట్టు ఉంది

ప్రాధమిక విద్యను నిర్లక్ష్యం చేయక సక్రమంగా ఉన్నది  
అధ్యాపకుని ప్రయత్నం విద్యార్థి అభ్యాసం నెరవేరుతున్నది
విద్యార్థుల్లో నైపుణ్యం, విద్యాఘంధం, దేశంలో విస్తరిస్తున్నది
విద్యాబోధలో ఆధునిక పరిజ్ఞానమ్ విస్తారం చెందుతున్నది

ఆధునిక పరిజ్ఞానం గూగుల్ ద్వారా పొందగలుగు తున్నది
అధ్యాపకుడు విద్యార్థికి ధైర్యము  చెప్పఁవలసియున్నది
మాధ్యమిక దశలోనే నైపుణ్యాభివృద్ధి కోర్సులు నడుపుతున్నది
విద్యార్థులను సమర్ధ మానవ వరులుగా మలచాలన్న లక్ష్యమున్నది

ప్రజా ప్రభుత్వాలు కంకణ భద్దమైతే మాతృవిద్యా భోధన ఎక్కువ అవుతుంది
విద్యార్థులను సొంత కాళ్ళపై నిలబెట్టే విద్య, అధ్యాపకుల లక్ష్యం గా ఉన్నది  

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

నింగిలోని మేఘపు పొరలు
గాలి తెరలు తెరలుగా వచ్చి వర్షము కుర్పించు
సూర్యుని కమ్మిన గ్రహణపు పొరలు
తెరలు తెరలుగా పొరలు తరిమి కిరణాలు ఉద్భవించు

భూమి పకృతి కదలికకు విచ్చే పొరలు
విత్తనాలు చేరి తెరలు తెరలుగా వృక్షాలు ఉద్భవించు
వాతావరణముతో కప్పిన ఉదయపు పొరలు
కళ్ళకు కప్పిన తెరలు తొలిగి తేజస్సు ఉద్భవించు

చీకటిలో ఏర్పడే చల్ల చల్లని పొరలు
మనసుకు తాకి తెరలు సృష్టికి జీవం అంకురించు
సంకుచితమైన మనసుకు కమ్మిన పొరలు
కన్నవారని చూడక తెరలు కదిలినట్లు వేదించు

స్త్రీల ఆకర్షణ వళ్ళ కమ్మిన పొరలు
ఇంద్రియాలను తెరలుగా నిగ్రహించుకొని జీవించు
వర్తమానంలో చేసే పని పొరలు
రేపటి తరం తెరపై ప్రభవించి సంతృప్తి కలిగించు

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--

ఓ మనిషి తెలుకో
తెలుసుకొని మసలుకో
(బొంబాయిలో జరిగిన సంఘటన బట్టి )

రైలు వేగములా ప్రయాణికుల వేగం
నన్ను నేనుగా నడవనీయక
నడమంత్రపు సిరిలా వర్షం
నలతకు చిక్కి గమ్యం లేని ప్రజా
నేనంటే నేను అని తొందరపాటు చర్య
బలిగొన్నది కొందరి ప్రాణాలు

నెట్టేసి తోసేసి బలాఢ్యులు ఉండుట వళ్ళ
ప్రాణాల రక్షణకోసం ఆర్తనాదాలు పెట్టి
రక్షణ విభాగము కరువై ఆత్మరక్షణకు దూకే
మృత్యువు ఎలావస్తుందో ఎవ్వరు చెప్పలేరు

ఓర్పుతో క్రమశిక్షణతో ఉన్నట్లైతే ఇట్లా జరిగేది కాదు
ఏది ఏమైనా క్షతగాత్రులకు సహాయము చేయుట
తక్షణమే తగుచర్యలు తీసుకోని జాగర్త పడుట
ప్రకృతి శిక్షించే శక్తి లేదుకాని మానవుని రక్షించే శక్తి మనది          

ఓ మనిషి తెలుకో
తెలుసుకొని మసలుకో 
--((*))--
ఓ  మనిషి  తెలుసుకో
తెలుసుకొని మసలుకో

నిత్యం నేర్చుకో సరి కొత్త పాఠం
అక్షరములను మేధస్సుకు పంపే గురువు పాఠం
ప్రపంచాన్ని గ్రహించుటే వయసులో నేర్చే పాఠం
ఇంద్రియాలను తృప్తి పరుచుటకే పెళ్లి పాఠం

తుప్తి అందించి సంతృప్తి పడుటే స్త్రీ పాఠం  
ప్రకృతిని బట్టి అందరు నేర్చుకొనే పాఠం
మనుష్యుల మాటలను బట్టి నేర్చే పాఠం
అనుభవించి సహకరించుటే ఆదర్శ పాఠం 

విషయ విపులీకరణం అనుభవ పాఠం
ఆపదలో ఆదుకోవటం ఆదర్శ పాఠం  
భవిషత్తు తెలిపేదే ఆశయాల పాఠం
పరిస్థిని అర్ధం చేసుకోవటమే జీవిత పాఠం

పేమించే ప్రేమను పొందటమే ప్రేమ పాఠం
సుఖదుఃఖాలలో నలిగి వెలుగే సంసారి పాఠం
ప్రేమ పవిత్రబంధం అగుటే మాతృత్వ పాఠం
ప్రేమను ప్రేమగా బ్రతికించటమే పితృ పాఠం  

ఓ  మనిషి  తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని  మసలుకో

అబ్బా ఎంత అందముగా ఉన్నది
ముట్టుకుంటే రెపరెపలాడుతూ రాలిపోతుంది
ముళ్ళతో ఉన్న మక్కువచూపి వంగుతుంది
గాలికి కదులుతూ మనసును హత్తుకొనేవే

పదితలలతో రావణుడు సీతను కామించాడు  
పదిగుణాలు గల మానవుడు ప్రేమిస్తున్నాడు
నవరత్నాల వెలుగులతో సమాన మైనవాడు
రాత్రియందు సువాసనతో మత్తుని పంచువాడు

స్త్రీలకు కష్టాలు ఎప్పుడో వస్తాయి నాకు రోజు వస్తాయి
ఈ పూలు గంగి రెద్దులతో యుద్ధ0 చేస్తున్నాయి
కొమ్మకు కొమ్మకు పుడుతూ అశువులు బాస్తున్నాయి
కలియుగంలో ఇనుప గులాబీలు ఆకర్షించుతాయేమో  

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని  మసలుకో

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

తరువులా తపించి సహాయపడు
తరుణం వ్యర్ధమచేయక జీవించు
పువ్వులా పరిమళాలతో సహాయపడు 
నిర్మలమైన మనస్సును పంచి జీవించు

ఉషస్సులా సంచరిస్తూ సహాయపడు
తేజజస్సుతో ధర్మాన్ని భోదిస్తూ జీవించు
నెలవంకలా చల్లబరుస్తు సహాయపడు
నేత్రద్వయంతో సంతోషాన్ని పంచి జీవించు

పుడమిలా ఓర్పుతో సహాయపడు
దేశపురోభివృద్ధికి సహకరిస్తూ జీవించు
కడలిలా సమస్తము గ్రహించి సహాయపడు
కన్నవారిని ప్రేమతో పూజిస్తూ జీవించు

నదిలా ప్రశాంతముగా ఉంటూ సహాయపడు
నా వారు, పరాయివారు అనుకోకుండా జీవించు
తీర్పు లా ఆశయ సాధకులకు సహాయపడు
తీవ్ర కష్ట మొచ్చిన దేవుణ్ణి ప్రార్ధిస్తూ జీవించు 

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

గీత దాటితే అప్పక వస్తాయి కష్టాలు
రామాయణం లో చెప్పింది లక్ష్మణ రేఖ
నైతిక విలువను దాటితే వస్తాయి కష్టాలు
తప్పుచేస్తే వద్దని హెచ్చరికే మన:సాక్షి
   
చట్టాలు అతిక్రమిస్తే వస్తాయా కష్టాలు 
కళ్ళకు గంతలున్నమాత్రాన తెల్పు ధర్మపీఠం
స్వప్రయోజనాలకు ప్రభుత్వసొమ్ము వాడితే కష్టాలు 
రోజులన్నీ మనవి కావు చూపుతుంది ప్రక్రుతి తీర్పు

రాజ్యాంగ వ్యవస్థ సక్రమముగా లేకున్నా వస్తాయి కష్టాలు 
పరిరక్షణ, క్రమశిక్షణ, ధనాకాంక్ష పెరిగిన ఉంటాడు సాక్షి
సాంప్రదాయ ప్రమాణాలు ఉల్లంఘన చూస్తే వస్తాయి కష్టాలు
ఓర్పు, నేర్పు, కూర్పు తో పాటు శక్తి ఉన్నా దోహదమే కాలం

రావణాసురుడు కామం అనే గీతలో చిక్కి నాశనమయ్యాడు
హిరణ్యకశిపుడు మోక్షం అనే గీతలో చిక్కినాశనమయ్యాడు
మహిషాసురుడు ఆడదాన్నీ చులకనచేసి నాశనమయ్యాడు  
శిశుపాలుడు ఆరామ్నుడని ౧౦౦ మాటలు తూలి నాశనమయ్యాడు 

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

1 comment: