Wednesday, 9 October 2019

చైతన్య గీతం
రచయిత మల్లాపూర్ రెండు శ్రీదేవి రామకృష్ణ

ఇల్లే ఇలలో స్వర్గమని
ఇల్లాలే ఇంటికి దేవత యని ఇం
యజమాని ఈశ్వరుడేని
ఇంటికి పిల్లలు ప్రేమ తీపి గుర్తులని

మనసు కలిగి మనిన ఇంట
మమత నిండి బ్రతుకంతా పంట
ప్రేమ పరిమ ళించి పరవసించిన ఇంట
స్వర్గము తో సమానమని
నేనంట
ఓర్పు, నేర్పు, సహనము ఉన్న చోట
ఆప్యాయతతో అనురాగాల పంట

ప్రేమ మాట తీరులోనే
చేరువై చెలి మే దైవమంట
నోరుజారి నంతలోనే దైవము మాయ మవునంట

ఏది జరిగిన అది మన అదృష్టమే పంట
మనం చేసేది అందరి మంచికి తోడ్పలా లంట

ఇల్లే ఇలలో స్వర్గమని
ఇల్లాలే ఇంటికి దేవత యని
ఇంటికి యజమాని ఈశ్వరుడే నని
ఇంటికి పిల్లలు ప్రేమ తీపి గుర్తు లని

--(())--


గాంధీ 150వ జయించి సందర్భముగా
రచయిత మల్లాపూర్ రెండు శ్రీదేవి రామకృష్ణ

నిరాడంబర జీవితంతో
నిర్మల హృదయంతో
నిముషము కూడా వ్యర్ధ
పరచని మహాత్ముడు

సమాజసేవ లక్ష్యం తో
సమానత్వం భావాలతో
సామ్యవాద సిద్ధాంతాలతో
సమానత్వాన్ని ప్రబోధించిన
నిత్యస్మరనీయుడు

కార్యసాధన నీతి సూత్రం తో
కరుణ అనే ఆయుధముతో
కొళ్ళాయి వస్త్రముతో
కళ సాకారం చయుటకు
ఉద్యమించిన మహనీయుడు

అవమానాలన్నీ ఓదార్చుతూ
అంటరానితనాన్ని రూపుమాపుతూ
ఆశయసాధనలన్నీ నెరవేర్చుతూ
అహింసా మార్గంలో ప్రయాణం చేసి
అందర్నీ అనుకరించిన మహితాత్ముడు

స్వదేశీ వస్తువులే వాడాలని
స్వరాజ్యం కోసం ఏకమవ్వాలని
భారతీయులందరిని ఒక్కత్రాటిపై
నడిపించిన మనిషి గాంధీ మహాత్ముడు





No comments:

Post a Comment