ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కాలాన్ని ఎదిరించి బతకలేని సంగతి
మానాన్ని విడిచి పలుకులు రాని సంగతి
నయనాల్ని నయనాలే చూడలేని సంగతి
మాటల్ని సార్ధకము చేసుకోలేని సంగతి
మౌనాన్ని ఆత్మీయత పంచు కోలేని సంగతి
దైవాన్ని ప్రేమను గ్రహించ లేవని సంగతి
పాలపొంగుల్ని నీవు నిలుపలేని సంగతి
బుద్ధుల్ని నీవు మార్చని ధ్యాసలేని సంగతి
మనసుల్ని బంధాలను వీడలేని సంగతి
నిన్ను మార్చెది ప్రేమ కధలేనని సంగతి
వేదనల్ని భరించేది భార్యేనని సంగతి
వేదాల్ని పఠించేది బ్రహ్మయేనని సంగతి
తెలుసుకొని మసలుకో
మసలుకొని ఏలుకో
ఏలుకొని కొలుచుకో
కొలుచుకుంటే మన:శాంతి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
No comments:
Post a Comment