*ఘనమైన (4)నాలుగు*
నలుగురి నాలుగు చేతులూ వెయ్యండి.
నలుగురితో నారాయణ.
నలుగురు పోయే దారిలో నడవాలి.
నలుగురూ నవ్వుతారు...
ఇవీ నిత్యం మనం వినే మాటలు.
అనే కార్థంలో
*‘నలుగురు’*.
మాటను వాడుతుంటాం.
ఇలా జన వ్యవహారంలో నాలుగు సంఖ్య తరచుగా వినిపిస్తుంది.
మనకు సంఖ్యా శాస్త్రం ఉంది.
అంకెలకు సంబంధించి నమ్మకాలు ఉన్నాయి.
కొందరు కొన్ని సంఖ్యల్ని తమకు అదృష్ట సంఖ్యలుగా భావిస్తుంటారు.
కొన్ని ప్రయోజనాలకు తమకు నచ్చిన సంఖ్య రావాలని తపన పడుతుంటారు.
ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలు ఒకదాని కంటే ఒకటి పెద్దదిగా మనం భావించినా సహజంగా అన్ని సంఖ్యలూ వాటికవే విశిష్టమైనవి.
నాలుగు సంఖ్యను చాలామంది ఉత్తమ మైనదిగా పరిగణించరు.
ఎవరి నమ్మకం ఎలా ఉన్నా నాలుగంకెకు ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది.
సృష్టికర్త బ్రహ్మను చతుర్ముఖు డన్నారు. సృష్ట్యాదిలో బ్రహ్మ నలుగురు మానస పుత్రుల్ని సృష్టించాడు.
వారే సనక,
సనందన,
సనత్కుమార,
సనత్సుజాతులు.
వేదాలు నాలుగు.
ధర్మార్థ కామమోక్షాలు నాలుగు.
పురుషార్థాలూ ఆశ్రమ విధానాలు నాలుగింటిని చెప్పారు.
అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం.
చాతుర్వర్ణ వ్యవస్థనూ వేదవాంగ్మయం పేర్కొన్నది.
యుగాలు నాలుగు - కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు.
మానవ జీవిత దశలనూ బాల్య,
యౌవన,
కౌమార,
వార్ధక్యాలనే నాలుగింటిగా విభజించారు.
దిక్కులు నాలుగు. మూలలూ నాలుగే. తూర్పు దిక్కు ఋగ్వేద సంబంధమైనది.
సూర్యోదయానికి ఆధారభూతం గనుక పూజ్యమైనది.
దక్షిణం యజుర్మంత్రాలకు, పశ్చిమం అధర్వ మంత్రాలకు స్వాభావిక మైనవని,
ఉత్తర దిక్కు సామవేద సంబంధి అని తెలిపే శ్రుతి ప్రస్తావనలున్నాయి.
మండూకోపనిషత్తులో నాలుగు అవస్థలు చెప్పారు. జాగృదవస్థలోని అనుభవాలకు కారణం జాగరిణి.
ఈ అవస్థలోని జీవాత్మ విశ్వుడు.
స్వప్నానుభవ కర్త సూక్ష్మ శరీరధారి అయిన జీవుడు.
వాడిని స్వప్నంలో ప్రేరేపించే వాడు తైజసుడు.
గాఢనిద్రను అనుభవించే సుఖజీవిని ప్రాజ్ఞుడంటారు.
ఈ అవస్థకు కారకురాలైన పరమేశ్వరి ప్రాజ్ఞ.
పై మూడు స్థితులకు అతీతమైన స్థితి
‘తుర్య’.
ఈ మూడు అవస్థల్లో లేని స్థితిని పరదేవత కలిగిస్తుందంటారు.
మైత్రి,
కరుణ,
ముదిత,
ఉపేక్ష -
నాలుగు వాసనలు.
ఇవి మనసు,
బుద్ధి,
చిత్తం,
అహంకారం అనే నాలుగు అంతఃకరణలకు సంబంధించినవి.
స్నేహితులతో మైత్రి మనసు లక్షణం.
ఆర్తులపట్ల కరుణ బుద్ధి లక్షణం.
పుణ్య కర్మల్ని ఆనందించడం చిత్త లక్షణం.
సజ్జనుల్ని బాధించడం అహంకార లక్షణం.
వాక్కుకు నాలుగు రూపాలు.
పరా,
పశ్యంతి,
మధ్యమ అనే మూడు అంతరంగంలో ఉండే వాక్కులు;
బహిర్గతమయ్యేది వైఖరి.
మృత్యువు నాలుగు రూపాలని వేదం చెబుతోంది.
అవి సూర్యుడు,
వాయువు,
అగ్ని,
చంద్రుడు.
సూర్యుడు రోజూ ఉదయ సాయంత్రాల ద్వారా ఒకరోజు జీవుల ఆయుర్దాయాన్ని గ్రహిస్తూ,
మృత్యువుకు కారణమవుతాడు.
వాయుసంచారం దేహంలో సరిగ్గా లేనప్పుడు ఊపిరి తిత్తుల వ్యాధుల ద్వారా మరణానికి అవకాశా లెక్కువ.
శరీరంలోని జఠరాగ్ని సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం జీర్ణంకాక ఆకలి దప్పులుండక చనిపోయే అవకాశమూ ఉంది.
చంద్రుడు పంటలకు కారకుడు.
పంటలు పండక పోతే ఆహారం లేక మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది.
మేఘం,
మెరుపు,
పిడుగు,
వృష్టి (వాన)-
నీటికి నాలుగు రూపాలు.
రాజ్యరక్షణకు అవసరమైన చతురంగ బలాలు -
రథ,
గజ,
తురగ,
పదాతి దళాలు.
సాలోక్య,
సామీప్య,
సారూప్య,
సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు.
సామ,
దాన,
భేద,
దండోపాయాలు రాజనీతికి సంబంధించిన చతురోపాయాలు.
ఇలా చెప్పుకొంటూపోతే ఇంకా ఎన్నో...
అందుకే నాలుగంకె (4) ఘనమైనదే!
🌹👏🏾🌷
----------
🙏🤝మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు🙏
🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .
🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు 👋.
🚩🙏🙏🙏🚩
No comments:
Post a Comment