Friday, 28 October 2022

Kanda padyaalu


నమో నమో నరాయణాయ నమః 




శ్రీ మాత్రేనమః.. ఓం నమ: శివాయ.9


మంగళ కరమగు నీ పద

సాంగత్యము నామజపము చలుపును వేళల్

ప్రాంగణమగుట భక్తిన్

యోగ బలుమగుటయు నిత్య యోచన దేవా


తలచిన క్షణమే కరుణా

తలపులు తికమక యగుటయు  తమరిని చూచే

కలలన్నియు తీరికయగు

మలుపులు సహజమ్ము విధిగ  మనసగు దేవా


ఏ నామస్మరణమ్మున

ప్రాణమ్ము నిలపగ యెంచ ప్రార్ధన వేళల్

జ్ఞానమ్మును పెంచ గలుగు

ధ్యానమ్మగు వినయమేను దాతవు దేవా


ముమ్మరమగుశక్తి భక్తి

నమ్మకమేస్థితి గతియగు నాటక బతుకున్

అమ్మని తలపులు నిజమగు

గమ్మని నీపాదమేను గమ్యము దేవా


ఓంకారాతత్త్వరూప

శంకలు విడనాడినీకు సేవలు చెసెదా

శంకటమోచన భక్తిగ

వంకలు పెట్టము మనసున వరమగు దేవా


దివ్యజ్ఞానత్మా నీ

భవ్య వినయమే గతియగు భాగ్యమ్మేయున్

సవ్య సమయపాలనయగు

ద్రవ్య సహాయ మనస్సగు ధర్మము దేవా


మోహాది సహా మనసగు

దేహా భవమగుటయేను దేవాది భవా

దాహము నుండుట సహజము

త్రాహియనెడి మాకు నీవె ధాత్రివి దేవా


కలిమిని లేమని సుఖములు

చెలిమిని సలిపిడి సమయము చింతలు మాపే

మెలుకువను మిమ్ము వీడని

తలపుల తహతహ మనసగు తన్మయ దేవా


ముక్తిని పొందగలచియే

 శక్తియు యుక్తి గణ పూజ శాంతిని కోరే

 భుక్తి నినుజేర నా స

ద్భక్తిని మాకిమ్మి సామి దాతవు దేవా

నమో నమో నరాయణాయ నమః 

శ్రీ మాత్రేనమః.. ఓం నమ: శివాయ.18


ముందర హృద్యము పిలుపగు 

స్పందన మలుపుయు దిరిగిన చపలత యేలన్ 

పొందిక తృప్తిన బతుకున

కందళ మెరియదె సుఖమగు కామ్యము దేవా 


చపలత=తబ్బిబ్బు,కందళము=బంగారము}


ఇచ్చిన బుద్దిని మరువక 

అచ్చపు సహనపు గుణమును యదియును భక్తిన్ 

హెచ్చగుటయు తక్కువగుట 

ముచ్చట వినయపు పలుకులు  ముదమగు దేవా


అప్పులు తప్పని బతుకులు 

ఒప్పగు నమ్మితి  నిజమును ఓటమి గెలుపున్ 

తప్పుల మనసగు విధిగన్ 

చెప్పుడు మాటలు వినుటయు  చెడుపగు దేవా


కాలము మారిన మనసగు 

పాలన లాలన కనగను పాటవ మగుటన్ 

మేలగు నీదు భజణలుగా 

మాలలు కట్టియు యలంక మార్గము దేవా


అందరు అరుదగు పలుకులు

కొందరి చూపులు తికమక కోరిక యగుటన్

మందర బుద్ధులు కావే 

సుందరవదనము నడుమున సుంతయు దేవా


చీటికి మాటికి పిలుపగు 

బాటగ భక్తిగ తొడుగులు భారము గాగన్

ఆటయగు బతుకు పాలన

మాటల నడుమున మునిగెడి మానస దేవా


జీవన పోరాటమ్మే

భవిత సమాగం మనసున భాగ్యమ్మగుటన్

భావ వసంతము కమ్మే

భవ భవ్యహృదయమగువేళ బంధము దేవా


లేఖగ పిలుపుల మనగను

లేకను యున్నను మనిషిగ లెస్సగ గనగన్

సూకర బుద్దిగుణమగుట 

పోకడ రాకడ విధియును పొసగదు దేవా


స్వేదము జిందుచు భక్తియు 

వాదమె నిలుపుతు మనసిడి వరుసగ యుక్తిన్ 

నాదము నిరతము మరువక 

మోదము ఒకటియె కలిగియు మోనము దేవా

చీరలనెంచెడి కార్యము

నారీమణులందరికిని నచ్చెడిది  కదా              

యోరిమి తప్పని సమయము

నారాయణి మనసుఁ దెలిసి నడయాడు శివా 


ధన దాహంబును విడువుము 

ధనమెప్పుడు శాశ్వతమన ధరణిన కాదే

అనయము సద్భుద్ది కలిగి

మనసున ధర్మయుతమగుట మార్గము దేవా


సుదతీస్తనములు జూచిన

మదమెక్కమనిషిగబుద్ధి మాధ్యమగుటయే

మధురంభని చొళ్లు పెదవి

మదిమాంసమని తలచుటయె మోహము దేవా


కలిమిని లేమని సుఖములు

చెలిమిని సలిపిడి సమయము చింతలు మాపే

మెలుకువను మిమ్ము వీడని

తలపుల తహతహ మనసగు తన్మయ దేవా


భజియించుము హరి హరులను

భజియించు బ్రతుకు దినములు బంధము దేవా

భజియించు మరణ సమయము

భజియించుహృదయము జూడు భాగ్యము దేవా


చిలిపిగ చూపుల తోమది

చలిగాలికదలికగాను చెలిమిగ పిలుపై

గిలిగింతలుపెట్టుటయే

చలి రగ్గుగ యగ్నిదరికి చేరుగ దేవా


కరుణామయ లీలలవే

చిరుహాసపు పలుకులన్ని చింతలు మాపే

వరదైవంప్రేమగనుమ

పరుల సహాయమును చేయపాఠము దేవా


ముక్తిని పొందగలచియే

 శక్తియు యుక్తి గణ పూజ శాంతిని కోరే

 భుక్తి నినుజేర నా స

ద్భక్తిని మాకిమ్మి సామి దాతవు దేవా

Friday, 2 September 2022

దత్తపది

 





కం!! 
హరి భక్తి  యె మోక్షకరము 
హరి భక్తి  యె పాప జాల! హరము  సదా శ్రీ
హరి భక్తి లేని జన్మము
పరికింపఁగ నిష్ఫలమ్ము ! పసుతుల్యంబో

పెరుఁగుదలయు లేదు .. 
------------------------------

--- 

సీ. 

పెరుఁగుదలయు లేదు విరుగుదలయులేదు 
కరుణ నాది తిరము చిరము గూడ 
వెఱపుఁ బాపు గుణము విరియఁజేయు మనము 
తరగనట్టి సిరులు వరములవియు 
నరులపయిన గాని యొరుల పయినగాని 
కురియుచుందుఁ గృపనె శరణుఁ గోర 
భరము మాపఁగలను వెరవుఁ జూపగలను 
పరమునీయఁగలను హరుసమవఁగ 

ఆ.వె 

హరిహరులకునయిన విరియించికయినను 
నిరతమిడుచు శక్తి వరలఁజేతు 
మఱచి పోను వినతి మఱువ సేవల నైన 
నిరతిఁ గొలుచుకున్న దరికిఁ జేర్తు 

సురలు మునులు గొలుచు శుద్ధతత్త్వము నేను 
ఎఱుఁగ వీలు కాని గరిమ నాది 
అరయ వచ్చు హృదిని ధ్యాననిష్ఠను వెల్గు 
గురువు కృపనుఁ గలిగి విరియ మనము 

స్వరము లిచ్చు వాణి సిరుల నొసఁగు లక్ష్మి 
తఱచి చూడ నేనె మఱువఁ బోకు 
కురియుచుందు నన్ని కోరి కొల్వఁగ నన్ను 
గొఱఁత జేయ కెపుడు కొలది యైన/ 
సరళ మార్గమందు సాగుచుండి 

మెఱపు తీగలందు, మింటి మబ్బుల యందు 
ఝరులు, గిరులు, తరులు విరుల నుందు 
తిరుగు గ్రహములందు చిరుతనవ్వులయందు 
స్వరములందు నటులె శబ్దమందు 

నరయ నేను లేని దావంతయును లేదు 
తెఱచి కనుల సృష్టి తెఱఁగుఁ జూడ 
జరుగనీక వృథగ సమయమ్ము ధరలోన 
నెఱుక నొంద మదిని హితము సతము 
--((*))--

 

[న్యస్తాక్షరి........
వీ  ర  బ్ర  హ్మ పద్య పాదాది న రావాలి.

వీణ నాదము వీనుల విందు వినయ  
రమ్యత తరుణ శోభలు రంగ రించు    
బ్రతుకు పాటల మాటలు బంధ పరబ్ర    
హ్మముగను విధిగా విశ్వము హాయి గొలుపు
......
సమస్య:  కుందేటిని కోడిపిల్ల గుతకున తినియెన్

కాదిది మానస భయమే
చేదును తీపని యనుతయు చేరువ కళలే
వాదము కాదును నిజముయు
కుందేటిని కోడిపిల్ల గుతకున తినియెన్

 

16/04, 6:53 am] +91 73493 92037: సుభాషితం - 503

-----------------

🌺రోహతే సాయకైర్విద్దం

     వనం పరశునా హతం ౹

     వాచా దురుక్తం బీభత్సం

     న సంరోహతి వాక్ క్షతమ్ ౹౹🌺

        బాణములతో అయిన గాయాలు సరిపోతాయి.కొడవలితో కొట్టిన అడవి మళ్ళీ చిగురుతుంది.అయితే చెడ్డ మాటలవల్ల కలిగిన గాయం బీభత్సమైనది.అది గుణం అవ్వదు.

🌺✍🏼ప్రభ,మైసూరు.

           16-4-2023.

[16/04, 7:29 am] జి. రామిరెడ్డి: ♣️♣️♣️♣️♣️♣️🙏🙏🙏🙏🙏✳️✳️✳️✳️✳️✳️🛑🛑🛑🛑🛑🛑💚💚💚💚💚💚🚨🚨🚨🚨🚨✅✅✅✅✅✅💞💞💞


వర్ణన.........


అంబేద్కర్  వర్ణన


🟢🟢🟢🟢🟢⚫⚫⚫⚫⚫🔴🔴🔴🔴🔴🔴🔴😈😈😈😈😈😈♣️♣️♣️♣️♣️♣️♣️🛑🛑🛑🛑🛑💚💚🛑💚💚

[16/04, 9:03 am] . Mallapragada: వసంతకోకిల.. తకధిమి.. తకధిమి

చతుష్పాద


మహామనిషి మహిమకాదులే

మహోజ్వలమ్ముగా వెల్గుచుండెనులే

రాజ్యాంగస్థితి  విధివిధానములే

మానవహక్కుల పరిరక్షణలే


రాజ్యాంగపాలనా న్యాయచట్టములే

సర్వోన్నతికోరి  సమయసందర్భ తీర్పులే

విద్య వైద్య సహాయ సహకారములే

అంబేత్కర్ రచనా రాజ్యాంగ విజయములే

[16/04, 10:01 am] సాహిత్యం (2): 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లో* 𝕝𝕝


*దశ ధర్మం న జానంతి ధృతరాష్ట్ర నిబోధ తాన్।*

*మత్తః ప్రమత్త ఉన్మత్తః శ్రాంతః క్రుద్ధో బుభుక్షితః॥* 

*త్వరమాణశ్చ భీరుశ్చ లుబ్ధః కామీ చ తే దశ।*

*తస్మాదేతేషు భావేషు న ప్రసజ్జేత పండితః॥*


  - _*విదుర నీతి*_-


*భావం: ధృతరాష్ట్ర మహారాజా! ధర్మం తెలియని వారు (లేక ఆచరించని వారు) పది రకాలుగా ఉంటారు – మత్తులో ఉన్నవారు, శ్రద్దలేనివారు, పిచ్చివారు, అలసటతో ఉన్నవారు, కోపంతో ఉన్నవారు, ఆకలితో అలమటించేవారు, తొందరపాటు మనుషులు, భయాందోళనలు గలవారు లేక పిరికివారు, దురాశాపరులు లేక పిసినారులు, మరియు కామాంధులు*. *అందుకే పండితులు వీళ్లందరితో సాన్నిహిత్యాన్ని తగ్గించుకోవాలి*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏

🛑💙💙💙💙💙💙💙💙


న్యస్తాక్షరి......


సం

కీ

ర్ణ

ము


పద్య పాదాది న రావాలి 



🛑🛑🛑🛑🛑🛑🛑🛑💙💙💙💙💙💙💙💙💙✳️


సంబరము, మనో మందిర సాగు చేయ

కీర్తన పలుక వినయమ్ము గీత శృతి వ

ర్ణచరితమ్ముగా కదిలెను రవ్వ రవళి

ముఖ్యమేయగు మనసుకు ముక్తి కలుగు

దత్తపది...........


హరి

ఉరి

బరి

కరి



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️✅✅✅✅✅✅

దినవహి సత్యవతి: 14/4/23 సమస్యాపూరణ: దత్తపది

*కరి,బరి,ఉరి,హరి*

**********

తేటగీతి:

*కరి* ని బ్రోచె మొసలినుండి కంబుపాణి,

సీత దాటి లక్ష్మణ *బరి* చిక్కులబడె,

*ఉరి* యె చట్ట ప్రకారము యుచ్ఛ శిక్ష,

ఆపదల గాచు దైవము *హరి* యె భువిని.

***********

బరి = రేఖ

కంబుపాణి = విష్ణువు


ఎవరు గొప్ప ఉరి చెలిమి ఎరుక పరచి

గతియు బరిలోన దిగినాక గళము విప్పి

హరి హర యనుచు కరిలాగ హావ భావ

ఫలిత వీరస్వర్గ మవునా పాడు బుద్ధి

........


కరి జలమున చేరి విలువ కళలు జూప

బరి తెగించెడి జలచరా లు కదలికగ

ఉరికి సిద్ధమై జలపుష్ప ఊయ లగుట

హరి హర యనుచు ఆరాధ్య ఆశయ మగు


ఏనుగుని రక్షించిన వాడు, భీష్ముని చంపడానికి రధం మీద నుంచి ఉరికిన వాడు, కలిని సంహారించడానికి బ్రాహ్మణ రూపం లో వచ్చేవాడు, కోతిని లంకకు పంపిన వాడు ఒక్కడే!!ఆ ఒక్కడే   హరి 🙏🙏

"కరి "ని రక్షింప పర్వెత్తి కదలె నెవడు?

"ఉరి "కి భీష్ముని జంపంగ నుర్వి కెవడు?

"బరి "తె గించెడి నరులకు బాప డెవడు?

"హరి "ని లంకకు పంపిన హరి య తండు!!🙏


: ❤️❤️❤️❤️❤️
*****************
ప్రాంజలి ప్తభ వారి
దత్తపది పూరించండి

విశ్వ  విజయ వినయ వాణి

ఇచ్చా చందస్సు

*********************
🌹🌹🌹🌹🌹

"తేటగీతి..
--
జయతుజయతుసాయీశ్వర సకలశుభద!
పాహి పాహి పరంధామ పర్తివాస !
రక్ష రక్షభక్తవశుఁడ రాగవేది !
వందనములివేగైకొమ్ము భక్తవరద !!! "
----

ఘోరం జరిపే వయసుకు
దూరం దగ్గరయు లేదు దూర్త గుణముకే
వైరం అలవడి బ్రతుకే
కారమ్మే తీయనయ్య గదభక్తులకున్

విజయమ్మే ఇదియు నేటి పూజలకు  విశ్వమ్మే  సహాయమ్ముగన్
భజనేలే మదిన సేవ దృక్పము భాగ్యమ్మే ను కాలమ్ము నన్
సృజనమ్మే  కలలు పొందు సమ్మతి యు సౌజన్యం సుఖ లా స్య మున్
గజనీ ముద్దులు పంచి శంకరుని
         నాకర్షింపు పూసెజ్జకున్

నేరము చేసినా విధియు
నేటికి కష్టము కల్గపర్చ కున్
దారియు మారకే మనసు దాతను తల్చుట ఏల నాకునన్
సారము ఏది వెంట పడి సాధన  మార్గము ధర్మమవ్వుటన్
కారము తీయనై సుఖముగా మురిపించెను భక్త బృందమున్

సమస్యా పూరణ :దత్తపది:
*విశ్వ వియజ వినయ వాణి*
*వినయ* వర్తనుండు వినుతి పొందదగలడు,
*వాణి* కృపకునెపుడు పాత్రుడౌను, టైపు
విజ్ఞుడైన వాడు *విశ్వ* మంత గెలిచి,
*విజయ* పథమునందు వెడలగలడు

కాకతీయ పద్యకవితా వేదిక;4191
15-9-2022
సమస్య:-
కారమ్మే తీయనయ్యెగద భక్తులకున్
కం//
భారమ్మే పోతీరగ
సారమ్మేనెదనెదలకు సాకారముగా
ద్వారమ్మే తీసెను యోం
కారమ్మే తీయనయ్యెగద భక్తులకున్
సమస్య:-
కారమ్మే తీయనై సుఖముగా మురిపించెను భక్త బృందమున్
ఉ//
భారము తీరగా మిగుల మాతను గొల్చిరి  విశ్వవీధులన్
చేరను బిల్వగా సమర జోదుడు కాళన బాటమీదుగా
ధారవినాయకున్జదివి ధర్మము తప్పిన తాళలేక ధి
క్కారము తీయనై సుఖముగా మురిపించెను భక్త బృందమున్
( మోసగించే నాయకుల నుద్దేశించి నాయక లక్షణాలు లేని వినాయకులు వారిపై పోరాడిన కాళన్న బాటపై)


: ❤️❤️❤️❤️❤️
*****************
ప్రాంజలి ప్తభ వారి
దత్తపది పూరించండి

సబ్బు, గబ్బు, మబ్బు, డబ్బు

ఇచ్చా చందస్సు

*********************
🌹🌹🌹🌹🌹

రాజకీయ సబ్బును రుద్ది ❤️రంగు మార్చి ❤️
గబ్బు మొహముతో ఓటుకు గాల మేసి
మబ్బులా  వర్ష  వాక్కుతో  మనసు దోచి
డబ్బు పంచియు మంత్రిగా ❤️డప్పు కొట్టె

🙏🙏🙏🙏🙏🙏✅✅🔴✅❤️❤️❤️❤️🖤🖤🖤🖤🟢🟢🟢🟢🟢♥️♥️♥️♥️♥️♥️😀😀😀👌👌👌👌♠️♠️♠️♠️♠️♠️👌

న్యస్తాక్షరి.......


ల్లూ

ము

🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑💚💚💚💚💚💚💚💚💚💚⚫⚫⚫⚫⚫⚫⚫💚🛑✳️✳️✳️✳️✳️✳️✳️🍅🍅🍅🍅🍅🍅

*బంధ తీర్పుల వల్లనే బాధ్యతయు జ
ల్లూ  కురుయు టేను తప్పవు లు కలుకలు లె
కలలు తీర్చిననూ బుద్ధి కాని దగుట
ముంపు వచ్చినా డబ్బుయే ముఖ్య మగుటె*
*"*

" కం.
--
సడిచేయుచుకష్టములవి..

ऊँ!
----
"లక్ష్మీ( लक्ष्मी )వృత్తః -- భ స త త గ..13/8.
--
శ్రీసురనరశిష్టప్రీతికారిన్ కపే..
భాసురమతివేదప్రాజ్ఞ ,
ధైర్యప్రద ..
భాసితశుభరౌచ్యప్రాభవాంశాత్మక..
భాషితపదవాగ్ధీభాస వందేऽనిశమ్ !!! "
----

వడిగాచేరుచునువచ్చె వల్లీనాధా

కుడియెడమలఁగాచుమయా

సుడివీడెడిరక్షణనిడు 'సుబ్రహ్మణ్యా' !!! "
సమస్యా పూరణ: దత్తపది
*సబ్బు, గబ్బు, మబ్బు, డబ్బు*
****************
*సబ్బు* లు సరిపడవెన్నియు
*గబ్బు* పడిన రాజకీయ కసువును కడుగన్,
*మబ్బు* లు ఓటరులవగా
*డబ్బు* లతో పదవులనుకొని డాబుగ మనియెన్.
"తేటగీతి..
--
దాశరథిదయేపెన్నిధి తారకమును
అభయసంధాతకోదండహస్తధారి ..
జనకజాజానిశ్రీరామశరణుఁగోర్తు
వందనములనర్పణమిత్తు భక్తితోడ !!! "
----

గుండె గూటిలోనున్నావు గుల్ల యనకు  

పక్షిలాగ తెల్లని హంస ప్రతిభ నందు   

భావ మల్లియై నా ముందు భాధ తీర్చు 

పరిమళాల్ని జల్లి మనసు చల్ల బరుచు 


తెమలని ప్రయాణంలోను తెలివి రాదు     

చీమలవలె బారులు యందు చెమ్మ చేరు 

సోమరితన మెరుగనిదే సీమ బ్రతుకు  

ప్రేమ వల్లనే శ్రామిక వీర లగుటె 


మంచి రూపగుణము ఏను మనుగడకుయె 

జనుల పలుకులాలన చూసి జయము నివ్వు 

మాటతో మనసున చేరి మమత పంచు    

మరుచి పోరులే చేసిన మేలు ఎపుడు 


ప్రేయసి చిలిపి చేష్టలు ప్రేమ పెంచు 

ముంగురుల సవరింపుల ముఖ్య కేళి 

వ్రేళ్ళు అనురాగ తీగల్ని మీటె నపుడు 

పలికె సప్తస్వరాల్నిలే పడక నందు

   [09/09, 7:12 am] . Mallapragada: సమస్య:

రతిభావాంబుధి నోలలాడితె కవీ రమ్యావధానంబునన

మ.

మతితో సల్పెడి సాహితీ సభన సామాన్యంబునౌ కైతలే

స్తుతితో జెప్పెడి వారలే మిగులగా,తూర్పారాలతో జెప్పుచున్

అతివాదంబున పీడనల్ దొలగ సౌహార్థ్రంబుతో వ్రా‌సి,భా

రతి భావాంబుధి నోలలాడితె కవీ రమ్యావధానంబునన్

[09/09, 10:32 am] . Mallapragada: గుండె గూటిలోనున్నావు గుల్ల యనకు  

పక్షిలాగ తెల్లని హంస ప్రతిభ నందు   

భావ మల్లియై నా ముందు భాధ తీర్చు 

పరిమళాల్ని జల్లి మనసు చల్ల బరుచు 


తెమలని ప్రయాణంలోను తెలివి రాదు     

చీమలవలె బారులు యందు చెమ్మ చేరు 

సోమరితన మెరుగనిదే సీమ బ్రతుకు  

ప్రేమ వల్లనే శ్రామిక వీర లగుటె 


మంచి రూపగుణము ఏను మనుగడకుయె 

జనుల పలుకులాలన చూసి జయము నివ్వు 

మాటతో మనసున చేరి మమత పంచు    

మరుచి పోరులే చేసిన మేలు ఎపుడు 


ప్రేయసి చిలిపి చేష్టలు ప్రేమ పెంచు 

ముంగురుల సవరింపుల ముఖ్య కేళి 

వ్రేళ్ళు అనురాగ తీగల్ని మీటె నపుడు 

పలికె సప్తస్వరాల్నిలే పడక నందు

[10/09, 4:32 pm] . Mallapragada: [10/09, 6:18 am] Rama Krishna: : +***************

*****************

ప్రాంజలి ప్తభ వారి 

దత్తపది పూరించండి


అన్న, యున్న,  నాన్న,  మిన్న 


ఇచ్చా చందస్సు


*********************

********************

[10/09, 6:31 am] Rama Krishna: చెల్లి కోరుకుంటూ నుండు చేరి యున్న

అన్న వదినల ప్రేమను ఆశ తోను

నాన్న పంచిన ఆస్తియు నాది మీకు

మిన్న యైనను మీ ప్రేమ మిన్న కుండె


వానలు లోన తడ్సినను వాక్కును మార్చక ప్రేమ పంచుటన్

మేముమానస వీణ మార్చకయు మాపటి రేపటి చెప్పుకుండు టన్ 

వేణువు శబ్దమై మనసు వేగిర పర్చెను సంతసమ్ముగన్

మానవతీ లలామ కభిమానమె చాలును చీర యేటికిన్

       చ

"""***'''


సమస్యా పూరణ: దత్తపది

*అన్న, యున్న, నాన్న, మిన్న*

**************

ఆ.వె.

*అన్న* మాట పైన అటలుడై నిలబడి

*ఉన్న* వాడె మహిని మన్ననొందు,

*నాన్న* చూపు ప్రేమ కన్న నీకుగలదె,

*మిన్న* యైన సంపదన్నదిలను


🙏🙏🙏

వర్ణణ.......

గణపతి.....వినాయకుడు ....హేరంభుడు
వివిధ పేర్లుగల  విఘ్నాధిపతి వర్ణణ...

మీకు యిష్టం వచ్చిన పద్యం లో
.....

విన్న పాలు 🌹తెల్పేద ఘన విఘ్ణ దేవ
గణపతి మ్రోక్కు 🌹తీర్చేద ఘనము గాను
విధివలన నేను నిత్యమూ విజయ వాంఛ
మనిషిగా చేయు సేవలు 😍 మనసు పెట్టి 😍

ఆర్యావృత్తః ..
--
శ్రీజయాం హేమమాలినీం ,
శ్రీపద్మాసనస్థాం పద్మనేత్రీమ్..
శ్రీశార్ఙ్గధరభామినీం ,
శ్రీ మాతరం వైభవదాత్రీం వందే !!! "
----

చెంద్రిక.. పద్యం

కారణ జన్మ యే కర్మ 🌹సాధనగా గణపతి  స్ఫూర్తీ
మా రణహోమమై  మంచి బతుకు కోరె వక్ర తుండ దేవ
చేర  మంత్రాలయ  చేష్ట లుడి కేనులె జీవ సౌభాగ్యం
దారుణ మైనదీ ధర్మ రాజ్యమ్మే   సిరులకే గణపతి

సమస్యా పూరణ: వినాయకుడి ప్రార్థన
**********
ఆ.వె.
విఘ్న నాయకుడికి, వినయముతో గజా,
ననుకు, గణపతికిని నమములిడుదు,
శ్రీ గణేశ పూజ చేసిన నిత్యము,
శూర్ప కర్ణుడొసగు శుభములెపుడు.
*********
సమస్యా పూరణ: దత్తపది
*మన్ను, దున్ను,, మిన్ను కన్ను*
ఇచ్చా చందస్సు
************
ఆ.వె.
*మన్ను* లోన పండు మంచి ముత్యములును,
*దున్ను* నేర్పు రైతుకున్న చాలు,
*మిన్ను* నంటు ముదము మించి ఫలముపొంద,
*కన్ను* లకును పండుగా దినంబె


ऊँ!

----

" గభస్తిమాలినే , పూష్ణే ,

  ప్రహ్లాదోదయకారిణే...

  విశ్వద్యుతిసందాత్రే , చ, 

  జయభద్రాయతేనమః !!! "

----

సుభాషితం

🌺వివేకాలంకృతం చేతో

     రూపం గుణవివర్థితం౹

     సుహృద్భoధువృతా లక్ష్మీ

     ర్లక్షణం పుణ్యకర్మణామ్ ౹౹🌺

     వివేకంతో సంభూషితమైన మనస్సు,గుణములతో నిండి సమృద్ధిగా ఉన్న రూపం,మిత్రువులతో మరియు బంధువులతో చుట్టుకున్న శ్రీమంతతనము పుణ్యవంతులైన వారి మంచి లక్షణము.

🌺✍🏽ప్రభ,

          4-9-2022.

సీ//

భాస్కరా భవరూప భానుతేజ ముదయ

బంగరు కాంతులభాగ్యధాత!


నీలమేఘపుఛాయనిరతంబునిను

దాయ

కార్యసురీడువే కాల మహిత!


పొద్దున పుడమికీ ముద్దులునిత్తువే

కనకపు జలతారు కాంతులొలికి!


అమరోదయాళువు సమరాంగ శోభవు

బ్రమియింప భువికిని తిమిరనాశ!


ఆ॥వె

కవిత పొంగుకమలకన్నులు వెలుగుతూ

సవిత భానుతేజ భవిత ప్రభవు

ఉదయ బ్రహ్మ రూపుమధ్యాహ్న

పరమాత్మ

సాంబశివము గావ సాయ సంధ్య!!


💐🙏🙏🙏💐


ఊరు మారిన కష్టాలు ఊట పెరుగు
పేరు మార్చిన మాటల ప్రేమ మునుగు
ఇల్లు ఏదైన ఇల్లాలు ఇష్ట మనుటె
ముల్లు గుచ్చి తృల్లి పడీన ముంపు కలుగు

ప్రేమ కొరకు అప్పును చేయు ప్రియుడు కుళలు
తప్పనిది తప్ప యన్నను తహతహలులె
ఒప్పు కొళుటయే నిత్యము ఓర్పు యగును
చెప్పు చెప్శక పోయినా చేత చూపు
సమస్యా పూరణ..దత్తపది
*ఊరు, పేరు, ఇల్లు, ముల్లు*
***************
ఆ.వె.
*ఊరు* కొనగనేల ఓటమి పాలైన
*పేరు* నిలుపుకొనగ పోరు సలుపు
*ఇల్లు*  స్వర్గ సీమ ఇహమున కాంచగ,
*ముల్లు* వంటి మాట ముప్పు తెచ్చు
కంద పద్యము

ఊరున్యాయము కవిగా
పేరును మార్చితెలిపేను పోరుయు వచ్చెన్
మారుట తప్పదు ఇల్లును
తీరు పలుకులే ను ముల్లు తీరుగ గుచ్చెన్
...

అప్పు చేసి యున్న ఆశతీర దెపుడు
తప్పు యైన తీర్పు తామసమగు
ఒప్పు కొన్న మాట ఓర్పుతో చేయుట
చెప్పు కొనెడి నేర్పు చేత నగును
.....
నల్లని తెల్లని - నయనాల వారును
దృడకాయ పొడగరి - ధ్రువము వలెను
తేజేవంతులు వైన - తేయస్త్రీ లోలురు      
భూషణ దారులు - బుద్ధి మెరుపు
నరహంతకులు నిశా - నరభక్షకులుగాను
విచ్చల విడిగాను - ఉండువారు
విహరించేవారు - వింతగుండెడివారు
కనకమణిమయమ్ము - కాంత ప్రియులు

ధనుధారులు ఖడ్గ - ధారులగుట 
ఏకకర్ణులు గుండి - ఏకాక్షలు గలిగి
లంబోదరులు గుండి - వికృత రూపులు 
కవచధారుల గుండి - కనుల వెలుగు
అస్త్రశస్త్ర ములతో - ఆడుకొనెడివారు
వీరవిహారంతొ - విర్రవీగు
యజ్ఞదీక్షులు కామ - యవ్వన రూపులు
ముండిత ధారులు - ముఖ్య మగుట
     
మదిలోన మరిపించు - మాయ కామిని లీల
రసలీల రమణులు - రమ్య పరచు
దిశమొల గాస్త్రీలు - దశదిశలుండిరి  
శయనించు చూ స్త్రీలు - శ్రమను మరిచి
పరవశమొందియు - పడక రాత్రి
మోహనాంగుల కళ - మైమరిపించేను    
కామక్రీడ సలిపి - కామ్య నిద్ర
భక్తియె మార్గమౌను,తగు పావన చిత్తముతోడ నిక్కమౌ
శక్తిని కూడగట్టి ఘన సాధన జేసిన వాడె యోగ్యుడౌ
ముక్తిని బొందగన్; విషయమోహమె కారణమౌను సంయమీ
శక్తిని గోలుపోయి సుఖశాంతుల జీవనమొంద శక్యమే
ऊँ !
----
" తేటగీతి..
--
* ఊరు * మంచిదౌనుమనదౌనోఁటిమాట్కి
* పేరు *కలుఁగుచక్కగనున్న భీతిలేక
* ఇల్లు * -  స్వర్గమే  యిల్లాలు యీశయైన
* ముల్లు * వంటియిడుముఁద్రుంచు మోదమిచ్చు !!! "
----
( ఊరు , పేరు , ఇల్లు , ముల్లు..అనే పదాలతో పద్యపూరణము )
----------------------------------------
ऊँ !
----
" తేటగీతి..
--
పగతురనుగెల్వఁదలఁచుము వనజనయన ..
వగపు స్థైర్యమునణఁచును పార్థివేంద్ర
ఖగచరకులరత్నమరామ నగుమొగమున
జగతిఁబ్రోచుము శాంతితో శత్రుహంత !!! "
----
( ఇందులో..పగ , వగ , ఖగ , జగ.. అనే పదాలతో పద్యపూరణము )
----------------------------------------

ऊँ!

----

" కం.

--

శుభకర ! ధీవర  ! ఆర్ముగ ..

విభువనినమ్మితి మనమున పీయూషాత్మా ..

శుభఫలములనొసఁగుమయా..

శుభవదనశశిధరపుత్ర 'సుబ్రహ్మణ్యా' !!! "

----

మాత్రాభధ్ధము


మకిలంగల జలము త్రాగ మందమతియుగన్

తకిలీ తిరుగు టయుకాల తంత్రము యగుటన్

నకిలీ మనిషి యు వినోద నాట్యము జరిపెన్

బకమున్ వడి తినుచు నున్న బల్లిం గనుమా!

 ***


తే..నారు తామస బుధ్ధి తో వాద మాఢె

వీరు వికటాట్ట హాసము వేగ పరిచె

కారుఅను మూర్ఖ భావమే కాని దగుట

వేరు చేయుట లక్షణం వేగ మవదు

***

సీ//

రామ భక్త  హనుమ  సోమశివశంకరా

కామ విజయ ఘన శ్యామలమువు!


క్షేమమధురదామ   భీమపరంధామ   

హేమసుందరశివ  ప్రేమ మయము!


వామనంభరమువే  రోమంబు పులకింత

మామ చందురునివే మారుతీశ!


హోమధునివిరామ ధూమపరిమళంబు 

కోటినామజపమ కోమలమువు!


ఆ॥వె॥

తామసపుమనంబు తప్పింప జేయుచూ

రామ నామమధుర ధామమనుచు

హేమ కాంతి పంచి ప్రేమయే నింపుతూ

క్షేమ చరిత విశ్వచామర మువు!

***

సమస్యను పరిష్కరించడం ........


బకమున్ వడి తినుచు నున్న బల్లిం గనుమా!


♣️♣️♣️

ఒకటైననులే కతగా 

వికటాట్టహాసమేను వినయమ్ముగనే

సకలమ్మేఆటలుగా

బకమున్ వడి తినుచు నున్న బల్లిం గనుమా!


♣️♣️♣️


వర్ణణ........


గురువును గూర్చి వర్ణించండి.

మీ కిష్టమైన పద్యం లో

కంద పద్యము

గురువే దైవము తండ్రియు

ప్రారంభము గాను విద్య ప్రకృతీ పరమై

ప్రేరణ బుధ్ధికి మూలము

తరుణాన సహాయ మేను తధ్యము చదువే


విద్య లేని మనిషి మాట వింత గుండు

 విద్య యున్న మనిషి తీరు వేరు గుండు

విద్య దేశ సేవకు మూల వేకువగుట

విద్య గురువు సమ ksha మ్ము వినయ ముం chuu


సీస పద్యము


    మూర్ఖవేగపు విద్య.. ముందర కష్టమే

 సంచరించియు ఫొందు సగము విద్య 

ఏ మహత్యమ్ముయు ఏవిద్యకును లేదు  

కాలనిర్ణయ మేను కలిపె విద్య

సమయతృప్తయగుటే సందర్భ సుఖముయే

  సజ్జనులుదరిద్ర సరయు విద్య

 కాలినడకలోన కనుల తీర్పుతెలుపు

 గౌరవం ఉంటుంది. గమ్య విద్య


కాకులు వరుస శిఖరాన కాలుమోపి

 ఇసుకలోన నడిచివెళ్ళు ఇష్ట విద్య

 సహనమందు నేర్చిన విద్య సమయ తృప్తి

సమర మందు నేర్చిన విద్య  సర్వ సుఖము

ऊँ !

----

" తేటగీతి ( షట్పాది )..

--

ఒజ్జయేమాతపితలుగనోర్పుతోడ

విద్యఁగఱపెడి నిధియను వేదసూక్తి

చదువు సంస్కారమునునేర్పు ఛాత్రులకును

ఛాత్రులేబిడ్డలనుకొని యాత్రపడుచు

సతము శిష్యశుభముఁగోరు శాస్తయతఁడు

అట్టి దేశికుఁగొలిచెదహర్షమొదవ !!! "

----

సమస్యాపూరణం... గురువు వర్ణన

ఆ.వె.

నేర్పు విద్య గురువు నేర్పును బుద్ధియు,

మంచి చెడుల భేదమనగ తెలుపు, నీళ్ళు

లక్ష్య సాధనకును శిక్షణ యొసగును,

గురువు బోధలెపుడు మరువ రాదు



 .పండిన బ్రతుకు సేవ కళ పంతమనన్యము సత్యవాక్కుగన్

బండల నేటి బంధువుల భాద్యత సంపద చుట్టుసాగుటన్

గుండెలు పిండిఅవ్వుటయు గుర్తుమనస్సుయు తల్లితండ్రులున్

వాడిన పువ్వులే యనుట వాదము తీర్పులు ఏల ఇప్పుడున్


న్యస్తాక్షరి.........

వి
స్సా

ము

పద్య పాదాదిన రావాలి.

🚷

విశ్వ వాణి పలుకులు గా వినయ తీర్పు

స్సారముగనేమనిషి చేయు సామ దాన

రమ్య పరచు కళలు జూపు రాత్రి పగలు

ముచ్చటగను కాపురముయే ముఖ్య మగుటె

......


ఆ. విశ్వ వాణి వినతి విజయ వాంఛ కళలు
స్సార మగుట మాయ సాక్షి యగుటె
రమ్యమైన ప్రకృతి రసరమ్య పరుచుటే
ముందర భవిష్యత్తు ముద్దు తలపు

కంద పద్యము
సిరివెన్నెల పొందుటయే
స్సారి సముఖాన వసించు సాక్షి బ్రతుకు వీ
ర రసము భోజ్యమ్ముయగున్
మురిపం కలిగించుటేను ముఖ్యమ్ముయగున్

ఏమత్తకోకిల

విఖ్యమో మది వాంఛ లెల్లను వింత మార్గము కోరుటే
స్సాఖ్య హాస్యము సాహసమ్ముయు సాక్ష్య మవ్వుట ఏలనో
రఖ్య రంజని రమ్య పర్చుట రవ్వ వెల్గుయు మాత్రమే
ముఖ్యమైనది భక్తి యవ్వుటె ముక్తి కోరుట మోక్షమే

సమస్యా పూరణ.... న్యస్తాక్షరి
వి స్సా ర ము
ఆ.వె.
*వి* డక వాన కురియ తడిసెను పుడమి, ని
*స్సా* ర నేల సస్య శ్యామలమయె,
** మయె యింట చేర, రైతు  గణపతికి,
*ము* దము మీర భక్తి పూజ సలిపె.
********
రమ = లక్ష్మీ లేదా భాగ్యము

ऊँ !
-----
" తేటగీతి
--
* బ్రాహ్మణుఁ *డుబ్రహ్మరూపుఁడు పండితోక్తి
  * క్షత్రియుఁడే *శస్త్రవిదుఁడంద్రు గారవముగ
* వైశ్యుఁ * డుజగతి గొప్పఁగవణిజుఁడౌగ
* శూద్రుఁ* డుభువనక్షేమంపు శోభలిడును !!! "
--
( ఇందులో.. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ,శూద్ర.. పదాలతో పద్యపూరణము )
----

....

 మారిన భ్రతుకే మెరుపై

విరజాజుల కల మనస్సు విరిసిన ఋధ్ధీ

కరుణా తరంగ మగుటే

మీరి, సముద్రమును దాటి మెరుపున వచ్చెన్ 


***

 సాహిత్యం (2): ऊँ !

----

"  వేంకటనాయకం , భూపం ,

   సంకటహరణం , శుభమ్..

    కైంకర్యపుష్పసంసేవ్యం ,

  వందే శ్యామల మోహనమ్ !!! " 

----

కంద.

మదిలో మెదిలె కదలె

విదిగా జరిగే కాలవేగమపు భ్రతుకే

సాదనశోదన మనిషే

మీది, సముద్రమును దాటి మెరుపున వచ్చెన్


✅✅✅✅✅✅✅✅✅🙏🙏🙏🙏🙏🙏🙏🙏💙💙💙💙♣️♣️♣️♣️♣️♣️♣️♣️♣️🕉️🕉️🕉️🕉️🕉️🖤🖤🖤🖤🖤💚💚


దత్తపది.........


బ్రాహ్మణ

క్షత్రియ

వైశ్య

శూద్ర


బ్రాహ్మణ కళలు నిత్యమూ 

భాద్య తగుటె

క్షత్రియుల దైర్య సాహసం క్షమయు జయమె

వైశ్య విద్యయు వ్యాపార వైనధనము

శూద్రకర్తుత్వ లక్షమే శుభము భ్రతుకు

ఆ. బ్రాహ్యణ కళ విద్య  భాద్యత భోధయే

***


క్షత్రయ కళ దైర్య క్షమయు బలిమి

వైశ్య కళలు విద్య వసతి వ్యాపారము


సమస్యా పూరణ: దత్తపది

*బ్రాహ్మణ , క్షత్రియ, వైశ్య, శూద్ర*

**************

ఆ.వె.

*బ్రాహ్మ* ణులకు  ప్రీతి పంచాంగ పఠనము,

*క్ష్రత్రి* యులకు యెరుక ఖడ్గ విద్య,

*వైశ్య* జాతి వాడు వ్యాపార దక్షుడు,

*శూద్రు* డనుచు చిన్న చూపు తగదు

శూద్ర కళలు నిత్య శుద్ది భుద్ది.


మమమమమ





Tuesday, 2 August 2022

🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅✅✅✅✅✅✅✅♣️♣️♣️♣️♣️♣️😄😄😄😄😄😄🔴🔴🔴🔴🈯🈯🈯🈯🈯🈯🈯🈯🈯
న్యస్తాక్షరి ....

కృ
ష్ణం 
రా
జు

పద్య పాడాదిన రావాలి.......

🈯🈯🈯🈯🈯🈯🔴🔴🔴🔴🔴🔴🔴😄😄😄😄😄😄😄♣️♣️♣️♣️♣️♣️♣️✅✅✅✅🙏🙏🙏🙏🙏😁😁😁😁

సుభాషితం
🌺ఏకేనా రాజహంసేన యా
     శోభా సరసోసభవత్ ౹
     న సా బకసహస్రేణ పరితః
     తిరవాసినా ౹౹🌺
   ఒకే ఒక రాజహంసవల్ల సరోవరానికి శోభ కలుగుతుందే కానీ తీరం చుట్టూ కూర్చున్న కొంగలు పక్షులవల్ల కాదు.
🌺✍🏽ప్రభ,మైసూరు.
           11-9-2022.

కృపయు కమనీయ పలుకుతో  కనికరం  కృ
ష్ణం జగతి మేటి నటుడు కృష్ణం రాజు
రాజకీయము పట్టుతో రాటు తేలి
జుర్రు తేన లాంటి మనసు  చురుకు లేదు

చిలక గోరింక నటుడుగా చిత్ర మగుటె
కృష్ణ వేణి గా ❤️ కన్నప్ప కృషి యె అమర
దీప మాయే కృష్ణంరాజు దివ్య వెలుగు
కటకటాల రుద్రయ్య యే కానరాడు

భుక్తి లేకున్న బతుకుము ముష్టి యెత్తి!
శక్తి లేకున్న పోరాడు శక్తి కొలది!
ముక్తి లేకున్న మరుజన్మ పుట్ట వచ్చు
యుక్తి యున్న నరులకు   కుయుక్తు లేల?

ప్రాంజలి ప్రభ దత్తపది.

ఆ.వె.యుక్తితోడ జీవి యుగములు పాలించె
        యువత భుక్తికోరి ఉడత భక్తి 
        శక్తి యుక్తి కలిగి శాతము పొందును
        ముక్తివల్ల మనిషి ముందు కురికె.
ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.
11-9-2022.

నేటి సమస్యను పరిష్కరించడం.....
గుండ్రాతికి కాళ్లు వచ్చి గునగున నడిచెన్
ప్రాస కాఠిన్యము

* ఉండ్రాళ్లను గణనాధుని
చండ్రా చెలిమీ వలననె చంద్రుని కళలై
తాం డ్రా వలెనులె  కదిలే  
గుండ్రాతికి కాళ్లు వచ్చి గునగున నడిచెన్

*ఉండ్రాళ్ళ సామి గణపతి,
గుండ్రని ఉండ్రాళ్ళు ముదము గొని తిని బంటౌ
గుండ్రాయిని కరుణించన్
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
 
* ఉండ్రాలవలే నుండే   
గుండ్రాలవలేనువెన్న ముద్దలు దొర్లే   
గుండ్రంగా తిరిగే కళ
గుండ్రాతికి కాళ్లువచ్చి గునగున నడిచెన్
 
* ఎందుకయాసాంబశివా
పొందిక గా నెలవంక పోరే గంగా
అందముగా సర్పము యే
వందన దాసానుదాస వాక్కులు గనుమా
 
* ఆత్మ సమర్పణ దేవర
ఆత్మానుభూతి వలన నె ఆ ద్యంతము గా
ఆత్మ నిగ్రహం మ్ము కలిగే
ఆత్మీయత భావము గాను ఆదర్శముయే
" వనమయూరః -- భ జ స న గ గ ..14/9
--
శ్రీ గజ ముఖంసుభగశేవధిబుధేశం ,
నాగవిలసద్వసననాగధరపుత్రమ్..
శ్రీగిరిసుతార్ద్రసువిశేషకరుణాత్తం ,
శ్రీగణపతింవరదసిద్ధిమనునౌమి !!! "
-

ఇక చదవండి 💐💐💐💐💐 (4)

మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి..

1. మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది.

2. మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు  కిడ్నీలు  గాయపడతాయి.

3. మీరు 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా  గాల్ బ్లాడర్ గాయపడుతుంది.

4. మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు గాయపడుతుంది.

5. మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు  పెద్ద ప్రేగులు గాయపడతాయి.

6. మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు
లంగ్స్ గాయపడతాయి.

7. మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు లివర్ గాయపడుతుంది.

8. మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్‌తో మీ భోజనం తిన్నప్పుడు గుండె గాయపడుతుంది.

9. మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు ప్యాంక్రియాస్ గాయపడుతుంది. ఎందుకంటే అవి రుచికరమైనవి.

10. మీరు చీకటిలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి.

11. మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది.

---- ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు.

కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి.

నీ దేహం దేవుని ఆలయం..

ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు..

కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు..

హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో..

ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో..

అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది..

దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా???

సర్వేజనా సుఖినోభవంతు 💐

03/08/2022 (3)
ఇక మొదలు పెట్టండి :-

రామాయణం లో ని ఎక్కువ ప్రాచుర్యం లోకి రాని ఘట్టాలు..
రావణ వధ జరిగింది.రావణుడు అచేతన స్థితిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు.ఇంకా ప్రాణం పోలేదు.రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి
" లక్ష్మణా , రావణుడు సకల విద్యా సంపన్నుడు.గొప్ప శివ భక్తుడు.సంగీతం లో కూడా ప్రవేశం ఉన్నవాడు.చివరి నిమిషంలో ఆయన వద్ద కూడా జ్ఞానం పొంది రా " అని పంపాడు.
లక్ష్మణుడు రావణుని దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు.రావణుడు చూసాడు కానీ ఏమీ మాట్లాడలేదు.లక్ష్మణుడు కొద్దిసేపు వేచి చూసి వచ్చేశాడు.
రాముడు " లక్ష్మణా ఏదైనా విషయం గురువు దగ్గర నేర్చుకోవాలనుకుంటే వారి పాదాల దగ్గర నిలబడాలి.నువ్వు రావణుడి తల వైపుకు నిలబడ్డావు అందుకే రావణుడు మాట్లాడలేదు .ఇప్పుడు పాదాల వద్ద నిలబడి జ్ఞానం అర్ధించు " అని మళ్ళీ పంపాడు.
ఇప్పుడు లక్ష్మణుడు రావణుడి పాదాల దగ్గర ప్రణమిల్లాడు రావణుడు కళ్ళు తెరిచి ఏం కావాలని అడిగాడు. లక్ష్మణుడు
" చివరి నిమిషంలో చెప్పే వాక్యాల్లో జీవితానుభవమూ వేదాంతమూ ఉంటాయని అన్న గారు మీ వద్దకు పంపారు " అన్నాడు..
అప్పుడు రావణుడు..
" లక్ష్మణా..ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకో..
1..వాట్సాప్ లో వచ్చిన ప్రతీ కథకు అంతగా కనెక్ట్ అయిపోకు..అన్నీ ఉత్తివే..

2. 3.MB కన్నా ఎక్కువ మెమరీ ఉన్న వీడియోలు ఎవరికీ షేర్ చెయ్యకు.మెమరీ అందరికీ అవసరమే
.
3. ఫేస్బుక్ లో వాట్సాప్ లో మతపరమైన రాజకీయ చర్చల్లో ఆవేశపడిపోయి స్నేహితులను దూరం చేసుకోకు.

4. చివరిది నిర్మల సీతా రామన్ బడ్జెట్ గురించి ఏమీ మాట్లాడకు.అందులో నీకు నాకు ఎవరికీ సంబంధించి0ది ఏదీ లేదు..

రావణుడు...హరీ..
Mallaprgada Ramakrishna


 

chinna kadha - 2

ఒక ట్రక్ డ్రైవర్ ఒక పిచ్చాస్పత్రికి సరుకు రవాణా చేసి వస్తుండగా ట్రక్ టైర్ ఒకటి పంక్చర్ అయింది. రోడ్డు పక్కన ట్రక్కును ఆపుకొని కొత్త టైర్ బిగించడానికి సిద్ధం అయ్యాడు అంతలో చేతిలో ఉన్న నాలుగు బోల్టులు జారి కాలవలో పడిపోయాయి. అవి దొరికే పరిస్థితి లేదు.

 
ఏం తోచక తలపట్టుకు కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక రోగి అటు పోతూ డ్రైవర్ను ‘ఏమైంది’ అని అడిగాడు. ‘సమస్యను ఎవరికైనా చెప్పుకుంటే బాధ తీరుతుంది కదా’ అని రోగికి ”బోల్టులు టైరుకు బిగించేప్పుడు కాలవలో పడిపోయాయి అని నిస్సహాయంగా చెప్పాడు.

రోగి ఒక్కసారిగా ఫక్కున నవ్వి, “ఇంత చిన్న సమస్య పరిష్కరించుకోలేకపోతే ఎప్పటికీ ట్రక్ డ్రైవర్ గానే ఉండి పోతావ్. మిగిలిన మూడు టైర్లలోనుండి ఒక్కొక్క బోల్టు తీసి ఈ టైరుకు బిగించు.

ఆ తరవాత దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్కి వెళ్లి కొత్తవి బిగించుకోవచ్చు.” డ్రైవర్ ముగ్ధుడై, “ఇంత తెలివైన వాడివి పిచ్చాస్పత్రిలో ఎందుకున్నావ్” అన్నాడు. “నేను వెర్రివాడినేమో కానీ, తెలివితక్కువ వాడిని కాను.”

 
మన చుట్టూ ఉండేవాళ్ళను తెలివితక్కువవాళ్ళుగా భావించకూడదు. అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు. మన తెలివికి అందని ప్రశ్నలకు చాలా మంది మంచి
పరిష్కారాలు చూపించగలుగుతారు. ఒక వ్యక్తి రూపురేఖలు, వస్త్రధారణ, స్థాయి, స్తోమత, విద్యార్హతలు చూసి తక్కువగా అంచనా వేయకూడదు.

సేకరణ – ప్రాంజలి ప్రభ

చిన్న కధలు ( 1)
మనస్సు నీటి మడుగు లాంటిది అని కూడా అన్నారు .
మడుగులో నీరు బురద బురదగా ఉంటే ఆ మడుగులో ఏమి ఉన్నాయో తెలియదు. ఎలాంటి మొక్కలున్నాయి, అడుగున ఏమైనా ముళ్ళూ రాళ్ళూ ఉన్నాయా, ఎలాంటి జలచరాలు ఉన్నాయి. ప్రాణాలు తీసే పాములు పట్టి మింగే మొసళ్ళు... ఏమి ఉన్నాయి, అసలు దాని లోతు ఎంత.. ఇవేవీ మనం తెలుసుకోలేం. అలాగే మన మనస్సు అకుశల (చెడ్డ) భావాలతో, ద్వేషం, మోసం, రాగం, మోహం, కామం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయల్లాంటి దుర్గుణాలతో నిండి ఉంటే, ఆ మనసు కూడా మురికిగా ఉన్న మడుగులాంటిదే. దానివల్ల నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, ఆవేదనలు, భయాలూ, అశాంతి అలముకుంటాయి. అవి ఆ మురికిలో పడి కనిపించకుండా కష్టాలు తెచ్చిపెడతాయి. మనల్ని అథోగతి పాలు చేస్తాయి.

మరి, ఆ మడుగులోని నీరు తేటగా స్వచ్ఛంగా ఉంటే, అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. మడుగు అడుగున ఉన్న ముళ్ళూ, రాళ్ళూ, మొక్కలూ తెలుస్తాయి. పాములూ, మొసళ్ళూ కనిపిస్తాయి. ఆ మడుగులోతు ఎంతో తెలుస్తుంది. కాబట్టి అలాంటి మడుగువల్ల ఎలాంటి ఆపదలు రావు. అలాగే మనస్సు కూడా నిర్మలంగా ఉంటే కామ, రాగ, మోహ, ఈర్ష్య పగలకు దూరంగా ఉంటాం. అప్పుడు మనస్సులో శాంతి ఉదయిస్తుంది. కుశల కర్మలు విప్పారుకుంటాయి. దుఃఖం లోతులు తెలుస్తాయి.


* సమస్య. పూరించింది మల్లాప్రగడ రామకృష్ణ :  03-08-2022
చతురాస్యున్ సృజియించె వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్
 

మత్తేభము.
మతిసాధ్యాసమయమ్ము గా కమల లక్ష్మీదేవి పొందే సుఖం
గతిసాధ్యా కళల న్నిఏ సుఖము ధైర్యమ్మేను పంచే సుఖం      
సతి సాధ్యాసహనమ్ముయే విజయ  మాధుర్యంను పొందే సుఖం
చతురాస్యున్ సృజియించె వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్
డా.పల్లేరు వీరాస్వామి పూరణ
 

సమస్య:
చతురాస్యున్ సృజియించె వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్
మత్తేభము.
హితమౌ రీతిగ సృష్టిజేయ హరి సాహిత్యానుశీలుండునౌ
చతురాస్యున్ సృజియించె; వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్
పతిగా పొందెను;విష్ణుమూర్తి పదమున్ బట్టెన్ మహాలక్ష్మియున్
సతియే వేడెను నీలకందరుని కోసం తాను సన్యాసియై

౦౩/౦8/౨౦౨౨

Friday, 29 July 2022

 

 *🧘‍♂️నాడీ విజ్ఞానం🧘‍♀️*


*శరీరంలో గల సూక్ష్మనాడులు:-*


      *మానవ శరీరంలో కోట్లాది నాడులలో, 72000 నాడులు ముఖ్యమైనవి. ఇవి కాకుండా మరి కొన్ని సూక్ష్మమైన నాడులు.*

    *నాడి అనగా ప్రవాహమని అర్థం. ఏ ప్రవాహము? చైతన్య ప్రవాహము. శక్తి ప్రవాహము. నాడులనేవి, కేవలం శరీరంలో ఉండే మాంసమైన నాడులు కావు. అవి చైతన్యాన్ని, శరీరమంతా ప్రవహింజేసే శక్తి వాహినులు. ప్రాణ శక్తి, మనో శక్తి ఈ నాడీ వాహినుల ద్వారానే ప్రవహిస్తాయి. కొన్ని నాడులు మనోశక్తిని ప్రవహింపజేసే నాడులైతే, మరికొన్ని ప్రాణ శక్తిని, వైశ్విక చైతన్యాన్ని కూడా ప్రవహింపజేసే నాడులు.*

*1. గాంధారి నాడి :- ఎడమ కన్ను యొక్క ఒక మూల నుండి, ఉదర ప్రాంతం వైపు ప్రవహిస్తూ, ఎడమ కాలి బొటన వ్రేలి వద్ద అంతమౌతుంది. ఈ నాడి, ఇడా నాడికి వెనుక వైపున ఉంటూ...కొన్ని పనులు చేస్తోంది. ఈ గాంధారీ నాడి, శరీరం యొక్క క్రింది భాగాల నుండి... మనో శక్తిని...ఆజ్ఞా చక్రం వైపు తీసుకు వెళుతుంది. దీనియొక్క పరి పూరక నాడి "హస్తి జిహ్వ " నాడి.*


*2. హస్తి జిహ్వ నాడి :- ఈ నాడి ఏనుగు నాలుక లాంటి స్వభావము గల నాడి. ఈ నాడి కుడి కన్ను యొక్క ఒక మూల నుండి ప్రారంభమై...నాభి ప్రాంతం వరకు ప్రవహిస్తూ, కుడి పాదము యొక్క బొటన వ్రేలి వద్ద అంతమౌతుంది. ఈ హస్తి జిహ్వ నాడి, శరీరము యొక్క క్రింది ప్రాంతాల నుండి మనో శక్తిని ఆజ్ఞా చక్రం వైపు తీసుకుని వెళ్తుంది. దీని యొక్క పరి పూరక నాడి గాంధారి నాడి. అంటే గాంధారి నాడి, హస్తి జిహ్వ నాడి ఒక దానికొకటి పరి పూరకాలు.*


*3. యశస్విని నాడి :- యశస్విని నాడి అనే ఈ అద్భుతమైన నాడి....కుడి పాదం యొక్క బొటన వ్రేలు నుండి ప్రారంభమై...ఎడమ చెవి వద్ద అంతం అవుతుంది. ఈ యశస్విని నాడి యొక్క పరి పూరక నాడి "పూషా నాడి".*


*4. పూషా నాడి :- ఈ పూషా నాడి పోష కర్త నాడి. ఈ నాడి పోషణ చేస్తుంది. ఈ నాడి ఎడమ కాలి బొటన వ్రేలు నుండి, నాభి వరకు వ్యాపిస్తూ...కుడి చెవి వద్ద అంతం అవుతుంది. దీని పరిపూరక నాడి "యశస్విని నాడి".*


*5. అలంబుస నాడి :-  ఈ నాడి శక్తివంతమైన నాడి. ఈ నాడి మార్మికంగా ఉంటుంది. మనిషి యొక్క ముడ్డి ప్రాంతంలో ప్రారంభమై ...నాభి ద్వారా వెళుతూ...నోటి కుహరం వద్ద అంతం అవుతుంది.*


*6. కుహు నాడి :- ఈ నాడి పున్నమి చంద్రుడు ఎంత శక్తివంతమైన వాడో...ఈ నాడి అంత శక్తి వంతమైనది. ఈ నాడి గొంతు వద్ద ప్రారంభమై...జననేంద్రియాల ప్రాంతంలో...అంతమౌతుంది. తంత్ర సాధనల్లో, ఉన్నతమైన లైంగిక శక్తి, బిందువు (శుక్రము)...ఈ జననేంద్రియ ప్రాంతం నుండి ఉత్పత్తి జరిగి, సోమ చక్రము వైపు ప్రవహిస్తుంది. అలా జరగడం వలన ఒక యోగి "ఊర్థ్వ రేతస్కుడు" అవుతున్నాడు. అంటే...లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మారుస్తున్నాడన్నమాట. అందుకే బ్రహ్మచర్య పాలన శ్రేయస్కరం అంటారు, యోగి జనులు. ఈ నాడి మల దోషాలను కూడా నియంత్రణ చేస్తుంది.*


*7. శంఖిణి నాడి :- ఈ నాడి గొంతులో ప్రారంభమై...పురీషము యొక్క ప్రాంతంలో అంతం అవుతుంది. దీని శక్తి సరస్వతీ నాడి - గాంధారి నాడుల మధ్య ప్రవహిస్తుంది. అశ్వనీ ముద్రల సతత అభ్యాసం ద్వారా ఈ నాడిని చైతన్య వంతం చేయవచ్చును. ఈ నాడి, మనం తినే ఆహార సారాన్ని ప్రవహింపజేస్తుంది కూడా.....*


*8. సరస్వతి నాడి :- సరస్వతి నాడి, మానవుడి నాలుకలో ఉంటుంది. ఎవరైననూ... చక్కగా భాషించేవారికి, మంచి పాండిత్యం గలవారికి ఈ సరస్వతి నాడి చైతన్యవంతంగా ఉంటుంది.*


*9. పయస్విని నాడి :- ఈ పయస్విని నాడి, పూషా మరియూ సరస్వతి నాడులకు కుడి వైపున ప్రవహిస్తుంది. ఒకరకమైన యోగ మార్గంలో ఉన్న యోగులు, తమ చెవులకు పెద్దవైన చెవి పోగులు ధరించడం ద్వారా...ఈ పయస్విని నాడిని చైతన్యవంతం చేస్తారు.*


*10. విశ్వోదరి నాడి :- ఈ విశ్వోదరి నాడి నాభి ప్రాంతంలో వసిస్తూ ఉండి, కుహూ నాడి - హస్తి జిహ్వ నాడుల మధ్య ప్రవహిస్తుంది. ఇది అడ్రినల్ గ్రంథులతో సంబంధం కలిగియుంటుంది.*


*11. కౌశికి నాడి :- ఈ నాడి రెండు పాదాల బొటన వ్రేళ్ళ వద్ద అంతం అవుతుంది.*


*12. విశ్వోదరి నాడి :- ఈ విశ్వోదరి నాడి నాభి ప్రాంతంలో వసిస్తూ ఉండి, కుహూ నాడి - హస్తి జిహ్వ నాడుల మధ్య ప్రవహిస్తుంది. ఇది అడ్రినల గ్రంథులతో సంబంధం కలిగియుంటుంది.*


*13. కూర్మ నాడి :- ఈ నాడి శరీరానికి, మనస్సుకి మధ్య  సమన్వయం చేస్తూ...ఆయా సంబంధాలను స్థిరీకరిస్తుంది.*


*14. రాకా నాడి :- ఈ నాడి ఆకలిని, దాహాన్ని కలిగిస్తూ, శ్లేష్మాన్ని  గ్రహిస్తుంది.*


*15. సురా నాడి :- ఈ నాడి రెండు కను బొమల మధ్య ఉంటుంది.*


*16. వారుణి నాడి :- ఈ వారుణీ నాడి కటి ప్రాంతం యొక్క క్రింది భాగంలో, కుహు నాడితో కలసి...ఈ ప్రాంతపు మల దోషాలను శుభ్రం చేస్తుంది. ఈ నాడి శరీరమంతా ప్రవహిస్తుంది. ఈ నాడి మూత్ర విసర్జనకు సహాయ పడుతుంది. ఇది ముడ్డి ప్రాంతంలో అంతం అవుతుంది. బస్తి మొదలగు క్రియల ద్వారా ఈ నాడి చైతన్యవంతం అవుతుంది. ఈ నాడి యశస్విని - కుహు నాడుల మధ్య ఉంటుంది.*


🕉️🌞🌏🌙🌟🚩

*ఎక్కడ ప్రశాంతత?*


'మానవ జీవితం పుట్టుక మొదలుకొని మరణం వరకు నిత్య సంగ్రామంగానే సాగుతుంది. పుట్టిన వెంటనే పసిగుడ్డుకు సైతం ఆకలి బాధ తప్పదు. శైశవదశ దాటే సమయంలో చాలారిష్టాల రూపంలో అనారోగ్యాల కష్టాలు చుట్టుముడతాయి. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సమస్యలు ముసురుతాయి. కష్టాల కడలిని దాటేలోగానే వృద్ధాప్యం ముంచుకొస్తుంది. ఆ తరువాత దైహిక, మానసిక బాధలు వర్ణనాతీతం. ఏ సమస్యా మనిషిని ప్రశాంతంగా ఉండనీయదు. ఒకదాని తరువాత మరొకటిగా కడలి కెరటాల్లా సమస్యలు విరుచుకొని పడుతుంటాయి. వేదాంతులు మానవ సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. కష్టాలను కెరటాలతో సమానంగా భావిస్తారు. సమస్యలు లేని మనిషి ఈ భూ ప్రపంచంలో లేడనేది పరమసత్యం,


మనిషి చీకటిని చీల్చుకొని వెలుగుకోసం వెదికినట్లు ఆశాంతిలో నుంచే ప్రశాంతతను రాబట్టుకోవాలి. కష్టాలు నిప్పు కణికల్లాంటివి. వాటిలోంచే చల్లదనాన్ని పొందడానికి ప్రయ తించాలి. వేసవికాలంలో సూర్యుడి కారణంగా లోకమంతా తపించిపోతుంది. వేసవి ముగిసిన తరువాత చల్లని జల్లులు కురిసే వర్షాకాలం వస్తుంది. వేసవికి కారణమైన సూర్యుడే వర్షానికి కారణభూతుడు. సూర్యుడి వేడిమితో సముద్రజలాలు వేడెక్కి, ఆవిరి పైకి ఎగసిన తరువాతే కదా ఆకాశంలో మేఘాలు ఉత్పన్నమై వర్షాలు కురుస్తాయి. కనుక సమస్యలోనే సమాధానం కూడా ఉంటుందనేది. ప్రకృతి చెప్పే ఉపదేశం!


మనిషి తనకు తానుగా ఆందోళనలను సృష్టించుకొంటూ అశాంతికి గురవుతుంటాడు. గంధర్వ నగరాలను సృష్టించుకొని పగటికలలు కంటాడు. అందని ద్రాక్షపండ్ల కోసం అర్రులు చాస్తుంటాడు. ఏవో ఊహించుకొని గాలిలో తేలిపోతూ, గాలిమేడలు కడతాడు. వీటివల్లనే మానసిక ప్రశాంతతకు దూరమై అల్లాడుతుంటాడు. తన ఉనికిని మరచిపోతే మనిషికి అశాంతి గాక మరేమి లభిస్తుంది.


ప్రకృతి మనిషికి అన్ని వనరులనూ పుష్కలంగా అందించింది. వాటిని రక్షించుకోలేని అసమర్థుడిగా మనిషి మిగిలిపోకూడదు. పంచభూతాలు మనిషి ప్రశాంత జీవనానికి ఆధారాలు, వాటిని కలుషితం చేయడం ద్వారా ప్రపంచాన్ని ఒక చెత్తకుండీలా మార్చివేస్తున్నాడు మనిషి చెట్లను విచక్షణారహితంగా నరికివేసిన పాపం, కాలుష్యపు ఉద్గారాలతో ప్రాణవాయువును విషపూరితం చేసిన శాపం మనిషికి మరణశాసనమై ప్రపంచాన్ని వీడిస్తోంది. ధ్వనికాలుష్యం గుండెలను చిద్రం చేస్తుంటే మనిషి ఆరోగ్యం మంటగలిసిపోతోంది. లక్షల ఏళ్లనాటి హిమ ఖండాలు కరిగిపోతూ, జలప్రళయాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయంటే పుడమిని వేడెక్కించిన మనిషి తప్పిదాల తీవ్రత స్పష్టమవుతుంది. మనిషి తన కుటుంబ జీవనంలోనూ ఎన్నో తప్పటడుగులు వేస్తున్నాడు. పెద్దలపై గౌరవం లేకపోవడం, వ్యక్తుల మధ్య ఆత్మీయతలు దూరం కావడం, పరస్పర స్నేహ సహకార భావాలకు తిలోదకాలివ్వడం... మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. మానవతా బంధాలను

బందిఖానాలోకి నెట్టేస్తున్నాడు. సమైక్యజీవనం, సమభావం కొరవడుతున్నాయి. అన్నింటినీ పోగొట్టుకొనే మనిషికి ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది। తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనలోనే నిక్షిప్తమై ఉన్న ప్రసన్నతను, ప్రశాంతతను శోధించి, పట్టుకోవాలి.

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ


రెండు డైరీలు - భార్య...భర్త...07-12-2023

తమ వివాహ వార్షికోత్సవ  సందర్భాన, భార్యాభర్తలు ఇద్దరూ  కలిసి  కూర్చుని  టీ  తాగుతూ  కబుర్లు చెప్పుకుంటున్నారు.  ప్రపంచానికి, వారొక ఆదర్శమైన జంట.  నిజానికి  వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది, కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి.

వారి సంభాషణలో.......భార్య ఒక ప్రతిపాదన చేసింది, “నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసమొకరికి సమయం దొరకడం లేదు. అందుకే నేను రెండు డైరీలు కొన్నాను. ఈ సంవత్సరం  మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి  ఉన్న వాటిని వీటిలో రాద్దాం. 

వచ్చే ఏడాది పెళ్లి రోజున, మన లోపాలను తెలుసుకోవడం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుదాం, వాటిని  సరిదిద్దుకోడానికి  కలిసి  ప్రయత్నిద్దాం,”  ఆలోచన నచ్చి భర్త వెంటనే దానికి అంగీకరించాడు. 

 ఇద్దరూ తమ తమ డైరీలు  తీసుకున్నారు.

 ఒక  సంవత్సరం వేగంగా  గడిచిపోయింది.  మరుసటి  సంవత్సరం  వివాహవార్షికోత్సవం  సందర్భంగా, భార్యాభర్తలిద్దరూ  ముందుగా నిర్ణయించుకున్న విధంగా  తమ  డైరీలను  మార్చుకున్నారు.

మొదట.......భార్య  తనను  ఉద్దేశించి  వ్రాసిన  డైరీని భర్త  చదవడం  ప్రారంభించాడు.

మొదటి పేజీలో, "ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం.  మీరు  నాకు  మంచి బహుమతి ఇవ్వలేదు" అని,

రెండవ పేజీలో - "మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్ కి తీసుకెళ్లలేదు."

మూడవ పేజీలో - "నన్ను సినిమాకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణంలో రద్దు చేసారు."

 " నా తరఫు బంధువులు వచ్చారు  కానీ మీరు వారితో సరిగ్గా మాట్లాడలేదు."

"చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నా కొక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ ది !"

 ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు  ఆమె తన డైరీలో రాసుకుంది. అది చదవడం పూర్తికాగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.

 భర్త, “ఓ  ప్రియా, నన్ను క్షమించు!  ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు తెలియదు.  భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.” అని చెప్పాడు.

 ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదివడం భార్య వంతు...........


 మొదటి పేజీ - ఖాళీ

 రెండవ పేజీ - ఖాళీ

 మూడవ పేజీ - ఖాళీ

 ... ఖాళీ

 భార్య 50-60 పేజీలు తిరిగేసింది, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి!  

భార్య కలత చెంది, “నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసు.  నా మనసులో ఉన్నదంతా వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను కోరుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారు!" అని వాపోయింది.

భర్త చిరునవ్వు నవ్వి, “చివరి పేజీలో అంతా రాశాను ప్రియా” అన్నాడు.

 భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది. 

అందులో ఇలా ఉంది - “ ఎదురుగా ఉండి ఎంత  కసురుకున్నా, ఇన్నాళ్లూ నువ్వు నాకు, నా కుటుంబానికి అందించిన అపరిమితమైన ప్రేమ ముందు, ఈ డైరీలో వ్రాయడానికి నీలోని ఏ లోపాన్ని నేను గుర్తించలేకపోయాను.  

అలాగని నీలో ఏమి లేవని కాదు. కానీ నీప్రేమ, అంకితభావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి.  

నాలో లెక్కలేనన్ని క్షమించరాని  తప్పులు  ఉన్నప్పటికీ, నా  జీవితంలోని  ప్రతి దశలో నాకు నీడలా  ఉన్నావు.  ఆ నీడలో లోపాన్ని ఎలా కనుగొనగలను?!" అని వ్రాసాడు.

అది చదివిన భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి.  ఆమె తన భర్త చేతిలో నుండి తన డైరీని తీసుకొని, రెండు డైరీల తో పాటు తన విభేదాలు , ఫిర్యాదులను మంటల్లో కాల్చివేసింది..  మళ్లీ వారి జీవితాలు కొత్తగా పెళ్లయిన జంటలా ప్రేమతో వికసించాయి!

 వివాహం మనందరికీ ఎదగడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి, ప్రేమించడం నేర్చుకోడానికి అవకాశం ఇస్తుంది.  మనం ప్రయాణానికి కట్టుబడి ఉంటే, మరింత ఎక్కువగా ఇవ్వడం గురించి వివాహం మనకు నేర్పుతుంది. 🙏🙏🙏🙏


🌼🌼


Saturday, 16 July 2022


ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది.

ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ  ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం.

తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి.

జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం.

ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..!

సా.. ధ.. న  అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు.

అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు.

     సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు  విచక్షణ,

వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి.

కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు.

ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు.

  ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే.

    నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు.

     భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి.


ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని  ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి.

అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు.

సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం!

సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన  చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత  శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా  చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు.


వినయానికున్న విలువ


సత్య భామ శ్రీకృష్ణునితో ఒకసారి’ స్వామీ ! రామావతారంలో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా’ అని అడిగింది.

ఆ సమయంలో అక్కడే ఉన్న గరుడుడు “ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా”అన్నాడు. పక్కనే ఉన్న సుదర్శనుడు (సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా! అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.నాతో సరితూగు వారెవరు స్వామీ అన్నాడు. ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.


దీర్ఘంగా ఆలోచించిన నారాయణుడు..

సత్యా, నువ్వు సీతగా మారిపో…నేను రాముణ్నవుతాను. గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతారాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా. చక్రమా !నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు, అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు.


గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. హనుమ ఆనందంతో పుల కించిపోతూ ‘నేను నీ వెనుకే వస్తాను. నువ్వు పద’ అని గరుత్మంతుని సాగనంపుతాడు. ఈ ముసలి వానరం రావడానికి ఎంతకాలమవుతుందో కదా అనుకుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు. కానీ.. ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు. ఇంతలో..’హనుమా’ అన్నపిలుపుతో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. ’లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా’అని అడగ్గా..

హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.ఎన్ని చెప్పినా వినక పోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’ అన్నాడు.


సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానంతో నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై పడి ‘స్వామీ !మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది.

అలా కృష్ణపరమాత్ముడు ముగ్గురిలోనూ మొగ్గతొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలువేమిటో తెలియ చెప్పాడు.

................


వ్యక్తి తన వ్యక్తిత్వానికి అతీతంగా వస్తుతత్త్వానికి, ఉన్న విషయానికి మాలిమి అవాలి. అనుకోవడం నుంచి తెలుసుకోవడానికి పయనించాలి. అభిప్రాయం నుండి అవగాహనలోకీ చేరాలి. అనుకోవడం అంటేనే తెలివిడిలేనితనం. ‘ఇది నా అభిప్రాయం‘ అనడం ఒక మనిషి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తూంటుంది. విషయం, వాస్తవం, సత్యం ఇవి మనిషి మనిషికీ మారవు. అభిప్రాయాలే వేర్వేరుగానూ, రకరకాలుగానూ ఉంటాయి. ఒక విషయం గురించి ఏదో అనుకోవడం ఏమిటి? విషయాల్ని తెలుసుకోవడం లేదా తటస్థంగా ఉండడం అన్నదే సరైనది.

లోకంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం గొప్ప అనుకుంటూంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 67% మధ్యతరగతి వ్యక్తులు అభిప్రాయపడుతూ బతుకుతూంటారు. అభిప్రాయాలు మనిషి అశక్తతకు, తెలివిడిలేనితనానికి వ్యక్తీకరణలు. అభిప్రాయపడడం అన్నది మధ్యతరగతి మాంద్యంగానూ, జాడ్యంగానూ ఉంది. అందువల్ల గందరగోళం తప్పితే మరొకటి ఉండదు. ఉపిరి పీల్చుకోవడం తరువాత ఒక వ్యక్తి తప్పకుండా చేసే పని అభిప్రాయపడడమే. మనుషులకు తప్పితే ఏ జంతువుకూ అభిప్రాయాలుండవు. అందుకే జంతువుల్లో లేని అశాంతి మనుషుల్లో మాత్రమే ఉంది.

‘ఇది నా అభిప్రాయం’, ‘నేను ఏమనుకుంటున్నానంటే‘,

‘నేను చెప్పేదేమిటంటే’...

అనే స్థితి నుండీ, స్థాయి నుండీ మధ్య తరగతి మనిషి ఇంకా ఎదగలేదు.

మనిషి అవగాహనకూ అతీతంగా తన అభిప్రాయాల వల్లా,  ఏదో అనుకోవడం వల్లా తన ఎదుగుదలకు తానే అడ్డుపడుతున్నాడు.

ఒక కుటుంబంలోని వ్యక్తుల అభిప్రాయాల వల్లా, ఏదేదో అనుకోవడం వల్లా ఆ కుటుంబాలు ఛిద్రమైన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అభిప్రాయపడడం, అనుకోవడం ఒక మానసిక బలహీనత.

హిట్లర్‌ అభిప్రాయాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం మానవాళికి పెనుహాని జరిగింది.

అభిప్రాయపడడం కూడా మూర్ఖత్వంలాగే అపాయకరమైనదే! కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంలాగా కీడు చేసేదే! నా అభిప్రాయం మేరకు అనేది ప్రపంచానికి మేలు చేసినది కాకపోగా అనర్థాల్ని కలిగించింది, మనుషుల మధ్య అంతరాల్ని పెంచింది. మనస్పర్థలను సృష్టించింది. ఈ చింతనతో ఎన్నో దశాబ్దుల క్రితం నుండీ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచానికీ, మానవాళికీ అత్యవసరమయ్యే ఎన్నో ఉత్పాదనల్ని ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చాయి, సగటు మనిషికి హితాన్ని చేకూర్చాయి.

చూడడం, వినడం, అవగతం చేసుకోవడం, చెప్పడం ఇవి మనిషికి సరిగ్గా అలవడలేదు. వ్యక్తిగత అభిప్రాయాలూ, ఉద్దేశాల వల్ల సాటి మనిషికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. అభిప్రాయాలు, ఉద్దేశాలు, అనుకోవడం ఇవి కాదు ఎరుక, అవగాహన, విజ్ఞతలే కావాలి. ఒకరి ఎరుక, అవగాహన మరొకరికీ, సమాజానికీ ఉపయోగపడతాయి. ఈ ప్రపంచానికి మేలు చేసినవన్నీ అవగాహనలే, వాస్తవాలే, సత్యాలే.

ఒక వైద్యుడి చదువు లేదా ఎరుక మాత్రమే రోగికి అవసరమవుతుంది. ఒక అధ్యాపకుడికి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి సరైన విద్య వస్తుంది. ’రెండు రెళ్లు నాలుగు’ అన్న ఎఱుకను మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి అందజెయ్యాలి. అదే విద్యార్థికి కావాల్సింది. ఆ రెండురెళ్లు నాలుగు అన్నది అవగాహన. ఆ అవగాహనే ఒక వ్యక్తి జీవనానికి తోడ్పడేది.

ఇలా ఏ విషయంలోనైనా ఎరుకవల్ల వచ్చే లేదా వచ్చిన అవగాహన మాత్రమే మేలు చేస్తుంది.

అభిప్రాయం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అభిప్రాయాలు సార్వత్రికమైనవి కావు అపై సార్వజనీనమైనవీ కావు. మనం సరిగ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది అభిప్రాయాలు కాదు అవగాహనలు. బతకడం అంటే అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండిపోవడమా? కాదు. బతకడం అంటే తెలుసుకుని అవగాహనతో సాగడం.

అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి.  తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం ఉంటే ఆ గాయకుడి సామర్థ్యాన్ని, గాయకుడి వ్యాప్తిని, తరువాతి తరం వాళ్లపై ఆ గాయకుడి ప్రభావాన్ని, పరిశీలించగలిగితే ఆ గాయకుడు గొప్ప గాయకుడు అన్న  అభిప్రాయం సరైనదా కాదా అనేది తెలిసిపోతుంది.

విజ్ఞానశాస్త్రవేత్తల ఆవిష్కరణలను పరిశీలిస్తే మనకు అవగాహన అన్నది ఏమిటో అర్థమై పోతుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయంతోనో, ఏదో ఒకటనుకునో  మొదలుపెడతారు. ప్రయోగాలు, ఆలోచనలు, పరిశీలనలు చేస్తూ, చేస్తూ తమను తాము మార్చుకుంటూ, సరిచేసుకుంటూ ఒక దశలో వాళ్లు సరైన ఆవిష్కరణలు చెయ్యగలుతారు. ఆ ఆవిష్కరణ జరిగాక అది అవగాహన అవుతుంది. ఆ అవగాహనే లోకానికి ఉపయోగ పడేదవుతుంది.

అవగాహన మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. సాటి మనిషికి, సమాజానికి మేలు చేస్తుంది. శాంతిని ఇస్తుంది. ఈ సత్యాన్ని బుద్ధిలోకి తీసుకుందాం. అభిప్రాయాలకు అతీతంగా ‘బతకడం’ నేర్చుకుందాం.

అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి.


         *తెలుగు సంవత్సరాల పేర్లు...*

                   *వాటి అర్థాలు*

                    ➖➖➖✍️


*1. ప్రభవ అంటే... ప్రభవించునది!అంటే... పుట్టుక.*


*2. విభవ - వైభవంగా ఉండేది.*


*3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.*


*4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.*


*5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.*


*6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.*


*7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.*


*8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.*


*9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.*


*10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.*


*11. ఈశ్వర... పరమేశ్వరుడు.*


*12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.*


*13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.*


*14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.*


*15. వృష ... చర్మం.*


*16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.*


*17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం!*

*18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.*


*19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.*


*20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.*


*21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.*


*22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.*


*23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.*


*24. వికృతి... వికృతమైనటువంటిది.*


*25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.*


*26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.*


*27. విజయ... విశేషమైన జయం కలిగినది.*


*28. జయ.... జయాన్ని కలిగించేది. *


*29. మన్మథ... మనస్సును మధించేది.*


*30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.*


*31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.*


*32. విలంబి... సాగదీయడం.*


*33. వికారి.... వికారం కలిగినది.*


*34. శార్వరి... రాత్రి.*


*35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.*


*36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.*


*37. శోభకృత్... శోభను కలిగించేది.*


*38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.*


*39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.*


*40. పరాభవ ... అవమానం.*


*41. ప్లవంగ... కోతి, కప్ప.*


*42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.*


*43. సౌమ్య... మృదుత్వం.*


*44. సాధారణ... సామాన్యం.*


*45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.*


*46. పరీధావి... భయకారకం.*


*47. ప్రమాదీచ... ప్రమాద కారకం.*


*48. ఆనంద... ఆనందమయం.*


*49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.*


*50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.*


*51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.*


*52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.*


*53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.*


*54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.*


*55. దుర్మతి... దుష్ట బుద్ధి.*


*56. దుందుభి ... వరుణుడు.*


*57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.*


*58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.*


*59. క్రోదన... కోప స్వభావం కలది.*


*60. అక్షయ... నశించనిది.*

,...................


*

Friday, 15 July 2022

*జీవిత సూత్రం*ప్రాంజలి ప్రభ 

               

*మనిషి జీవితం కేవలం తాత్కాలికం. అటువంటి జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తూ, జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంటారు.*


*ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ మహాభారతం మనిషి జీవితానికి ఎంతో అర్థాన్ని కూడా వివరించింది. అయితే ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన ఆ నాలుగు మంత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…*


*“సర్వే క్షయాంత నిచాయంః పతనంతఃసమ్రుశ్ఛాయః”* 

*“సంయోగ విప్రయోగంత మారాతంత చ జీవితమ్”*


*ఈ నాలుగు మంత్రాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.*


*వీటి అర్థం పరమార్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…*


*1. సర్వే క్షయాంత నిచాయంః*


*ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతి ఒక్క వస్తువు చివరికి నాశనం కావాల్సిందే. అటువంటి వాటి కోసం కొందరు జీవితాంతం కష్టపడి సంపాదిస్తూ ఉంటారు.*


*వారు ఎలాంటి పనిచేసినా చివరకు మిగిలేది వారు చేసిన మంచి, చెడు మాత్రమేనని మనకు మహాభారతం తెలియజేస్తుంది.*


*కాబట్టి దురాశతో ఎక్కువ సంపాదనలో మునిగిపోవడం కాకుండా అవసరమైనంత మేరకు డబ్బును సంపాదించుకోవాలని తెలియజేస్తుంది.*


*2. పతనంతః సమ్రుశ్ఛాయః*


*ఈ మంత్రం అర్థం మనం జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ, గొప్పలకు పోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక వ్యక్తి గొప్పగా ఎదిగితే తన కింద ఉన్న వ్యక్తులను ఆదరించేందుకు కృషి చేయాలి.*


*3. సంయోగ విప్రయోగంత:*


*ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంయోగం ఉంటే అందుకు తగ్గ వియోగం కూడా ఉంటుంది. అనుకోకుండా కొంత అదృష్టం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో సంబరపడతాము.*


*అలాగే దూరం అయినప్పుడు బాధపడతాము. మన జీవితంలో సంయోగం, వినియోగం ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.*


*4. మారాతంత జీవితమ్*


*దీని అర్థం   పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. వ్యక్తుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలి కానీ, చనిపోయినప్పుడు పశ్చాత్తాపడకూడదు.*


*ఈ విశ్వంలో జననం, మరణం మాత్రమే వాస్తవమైనవి.*

*మిగిలినవన్నీ మన జీవితంలో ఏర్పడే తాత్కాలికమైన సంఘటనలు మాత్రమే.*


*మనిషి ఈ నాలుగు స్తోత్రాలను పఠించి, పాటించడం ద్వారా ఏ వ్యక్తి జీవితంలోనూ ఎటువంటి కష్ట,నష్టాలు ఉండవని మనకు మహాభారతం తెలియ చేస్తుంది*

*మార్పు మన నుండే మొదలవ్వాలి....!*

*-----*

: *మోసం చేసే  మనిషి  ముందు.....   మాంసం  తినే   పులి.....  క్రూరత్వం .. చిన్నబోతుంది*

ప్రజల సొమ్మును దానం చేసే మనిషి ముందు... మృగరాజు సింహం చిన్నబోతుంది


       _* ఒక మంచి వాడు పతనం అయ్యాడు అంటే....._*

*_ఎంతోమంది చెడ్డ వాళ్ళు ఒక్కటై ఉండాలి....._*


* ఒక మంచి వాడు తాగుబోతు డయ్యాడంటే *

* ప్రభుత్వ ధనాన్ని పెంచే మనిషై ఉండాలి*


*_అవసరాన్ని బట్టి భజన,_*

*_అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు,_*

*_మన చుట్టూ బోలెడు మంది ఉంటారు.._*


*ధనాన్ని బట్టి భజన* *అవకాశాన్ని బట్టి పార్టీ మార్చేవాడు*


 *పెత్తనం కోరుకునేవాడు* ,_*

*_బానిసత్వంను వృద్ధి చేస్తాడు.._*


*మాటల గారడీ చేసేవాడు నాయకుడౌతాడు*

*బలహీనులను బలవంతులు గా బానిసలుగా మారుస్తాడు*


*_అధికారంను కామించేవాడు,_*

 *భజనబృందంను బలోపేతం చేసుకుంటాడు..*


*మానవత్వం ఉన్న వాడు మనసు పంచి బ్రతుకు తాడు*


_****

: #నేను నేను #నేను నేను #నేను - ఈ భావనను వదిలివేయండి. 


1) నేను చాలా మొత్తాన్ని ,చాలా సార్లు విరాళం ఇచ్చాను 

2) నేను చాలా దేవాలయాలను సందర్శించాను 

3) నేను చాలా మందికి సహాయం చేసాను 

4) నేను చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాను 

5) నేను అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాను 

6) నేను రక్తదానం చేశాను 

7) నేను చాలా చెట్లను నాటాను

8) నేను అరుణాచలం, తిరుపతి, కాశీకి చాలాసార్లు వెళ్ళాను 

9) నేను చాలా దీక్షలను తీసుకున్నాను (అయ్యప్ప, హనుమాన్, భవానీ, శివ) 

10) నేను చాలా సార్లు అన్నదానం చేశాను 

11) నేను చాలా పక్షులను, జంతువులను పోషించాను

12) నేను సమాజానికి చాలా చేశాను 

13) నేను చాలా భక్తితో జీవిస్తున్నాను 

14) నేను అన్ని ధర్మాలను అనుసరిస్తున్నాను 

15) నేను గోషాలాలను నడుపుతున్నాను, గౌ సేవా కూడా చేస్తాను 

16) నేను రోజూ భజనలు చేస్తాను 

17) నేను చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాను

18) నేను చాలా మందికి ఆశ్రయం ఇచ్చాను

19) నా దగ్గర కోట్లు, కోట్లు ఆస్తి ఉన్నాయి


చివరగా, మీరు మీ స్వంత శక్తితో ఇవన్నీ చేశారని మీకు అనిపిస్తే, 

అది పూర్తిగా వ్యర్థం.


#నేను నేను #నేను నేను #నేను - ఈ భావనను వదిలివేయండి.


 మీరు చేసారు ఎందుకంటే, 

ఈశ్వరుడు ఈ పనులు చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు.

ఇది మీ క్రెడిట్ కాదు, 

ఇది శివుడి క్రెడిట్.  

మీరు కేవలం ఆటగాడు మాత్రమే 

మరియు  

హీరో, స్క్రీన్ ప్లే, కథ రచయిత, నిర్మాత ,దర్శకుడు శివుడు మాత్రమే.


 మీ మనస్సులో ఈ భావన ఉంటే, 

అప్పుడు మీరు గొప్ప వ్యక్తిగా పరిగణించబడతారు. 


మీరు ఈ రోజు గొప్ప వ్యక్తి, 

మీరు ఏమి చేసినా, 

శివుడు మీ వెనుక ఉన్నాడు.

దీన్ని ఎప్పటికీ మరచిపోకండి.

 శివుడు సహాయం, మద్దతు లేకుండా మీరు ఒక్క పని కూడా చేయలేరు.🙏

[16/07, 1:01 pm] Prathyusha: 🌞🌞🌞 *ఉషోదయ ఉషస్సు*🌞🌞🌞 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్*

*"వేద .. యోగ" వ్యాఖ్యానం*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


🌻 *"విష్ణు సహస్రనామ స్తోత్రం" - "వేదార్థం - యోగార్థం"* 🌻


                   *పార్ట్ - 39*


*అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ౹*

*సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ౹౹*


🌼 *వేదార్ధం :* ఓ పరంధామా! అతుల్యుడవైన నీతో *(అతులః)* సమంగా తులతూగేవారు

సమస్త చరాచర సృష్టిలో ఎవ్వరూ లేరు. జీవుల శరీరాలలో *(శరభో)* నివసించే నీవు..

అధర్మ మార్గంలో పయనించే వారిలో భయాన్ని *(భీమ)* కలుగజేస్తావు. సృష్టి అనే

మహాయజ్ఞాన్ని (సృజన - పోషణ- విధ్వంసం) సమయానుకూలంగా నిర్వహించే

యజ్ఞకర్తా *(సమయజ్ఞా)!* నీవు వివిధ లోకాలలో జరిగే యజ్ఞ క్రతువులలో సమర్పించే

హవిస్సును ప్రీతితో స్వీకరించే హరివి *(హవిర్హరిః).*


సకల జ్ఞానసంపన్నుడవైన *(సర్వలక్షణ)* నీవు బ్రహ్మజ్ఞానాన్ని *(లక్షణ్య)*

బ్రహ్మజిజ్ఞాసువులకు అందజేస్తావు. భక్తులకు లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించే *లక్ష్మీపతివై*

ఆమెను నీ హృదయ పద్మంలో ధారణ చేసినవాడవు. యుద్ధాలలో సదా విజయుడిగా

నిలిచే ఓ *సమితింజయా!* నీకు నా నమస్సుమాంజలి.


🌼 *యోగార్థం :* ఓపరంధామా! దేహమే దేవాలయమని విశ్వసిస్తున్న యోగులు.. ఆత్మనే దైవంగా

కొలుస్తారు. *సాధన ద్వారా మృత్యు భయాన్ని జయించిన వీరు..* *ఆత్మోన్నతికై నిరంతరం*

*తపిస్తూ.. జీవన యజ్ఞాన్ని* *పూర్తి జాగరూకతతో* *కొనసాగిస్తూ.. సమయానుకూలంగా*

*స్పందిస్తారు. జీవుల దుఃఖానికి మూలమైన* *అవిద్యను రూపుమాపటానికై..*

*జ్ఞానయజ్ఞాన్ని*

*చేబట్టి.. ఆత్మజ్ఞానాన్ని పంచుతూ.. జీవులను కర్మపాశాల నుండి* *విముక్తులను చేస్తారు.*


     ఆత్మజ్ఞానం పొందిన సాధకుల నేత్రాల నుండి వెలువడే ఆనందపు వెలుగులకు

(శ్రీ) ప్రీతిచెంది.. ఆనందతరంగపు కెరటాలనే సృష్టిస్తారు. అతుల్యమైన అలాంటి

యోగులకు నా యోగసుమాంజలి.


                   *- శ్రీమతి గుత్తా లక్ష్మీ*


🧘‍♀🌏💦🔥💨🎇🌞🌛🌟🌈

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

 కందిపప్పు రేటు విని గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు.

డెత్ సర్టిఫికెట్లొ చావు కారణం ఇలా వ్రాసారు " పల్స్ రేటు ఎక్కువయి "

ఒక గుడిలో ఒక గాడిద ఉండేది ... జనాలు దేవుడికి పూజలు చేయడం చూసి ఇది కూడా మొదలెట్టింది ....

దీని పుజలకి మెచ్చి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు ..

దేవుడు : ఎమ్ కావాలో కోరుకో ?

గాడిద : తర్వాత జన్మలో కూడా నన్ను గాడిద లానే పుట్టించు సామీ .....

దేవుడు : రెండు జన్మల్లో ఒకేలా పుట్టించడమ్ కుదరదు ..ఇంకేదైనా కోరుకో ...

గాడిద : సరే నన్ను ' భర్త ' గా పుట్టించు....

దేవుడు : ఎదవ తెలివితేటలు చూపించమాకు నా దగ్గర ... ఒకేలా రెండు సార్లు పుట్టించడమ్ కుదరదని చెప్పానా........

😊😊😊😊😊😊😊😊😊

నెలరోజుల కోసం పుట్టింటికెళ్లిన రమ్య మూడ్రోజుల్లోనే తిరిగొచ్చి తలుపు తట్టింది..

తలుపు తీసిన భర్త సుబ్బారావు..పకపకా నవ్వుతుండడం చూసి ఆశ్చర్యంగా అడిగింది.

"దేనికలా నవ్వుతున్నావ్..?"

"ఏం లేదు..మన పెద్దలు చెబుతుంటారుగా..భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నవ్వుతూ ఎదురెళ్ళాలని..అందుకే."

వైఫ్ షాక్..హస్బెండ్ రాక్..

😊😊😊😊😊😊😊😊

ఓ వ్యక్తి ఓ రోజు భార్యతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ అమ్మాయి అతన్ని చూసి హల్లో చెప్పింది.

అప్పుడు భార్యాభర్తల మధ్య సంభాషణ ఇలా సాగింది.

భార్య: ఆమె ఎవరు...

భర్త: మాట్లాడకు.. వింటే ఇబ్బంది.. ఆమె కూడా అదే ప్రశ్న వేస్తుంది..

😊😊😊😊😊😊😊😊

అత్త "శివగామి" Vs కొత్త కోడలు"దేవ సేన"

అత్త "శివగామి".... ఇంట్లో వాళ్ల అలవాట్లూ .. జాగ్రత్తలు కొత్తకోడలుకి .... చెబుతోంది

"ఇదిగో చూడు కోడలా.... పకోడీలు వేసేటప్పుడు.... ఒక్కొక్క పకోడీ వేసి వేయించాలి .... అప్పుడే మీ మావ గారికి ఇష్టం!!!

" బెండకాయలు తరిగే ముందు.... ఒక్కొక్క బెండకాయా బాగా కడగాలి.... అప్పుడే కూర బాగుంటుంది !!! "

" కొత్తిమీర ... ఒక్కొక్క ఆకూ కోసాక ... బాగా కడిగి ... వెయ్యాలి ... అప్పుడు కూర రుచిగా వుంటుంది "

అలా రెండు మోడు రోజులు కోడలు ... ఈ అత్త నసని‌ ఓపికగా విన్నది .... ఓపిక పట్టింది!!!

నాలుగో రోజు...

"అత్తా....కొంచెం కూర చూస్తూ వుండండి ... తలస్నానం చేసి వస్తాను" అని బాత్రూమ్ లోకి దూరింది !!

కూర తయారయ్యింది ......

సాంబార్ తయారయ్యింది .....

చట్నీ చెయ్యడం తయారయ్యింది .....

కానీ కోడలు "దేవసేన" మటుకు ఇంకా బాత్ రూమ్ నుండి బయటకు రాలేదు!!!

అత్త "శివగామి" లో సహనం చచ్చిపోయింది!!!

బాత్రూమ్ దగ్గరకు వెళ్లి....

"ఎం!? ఇంకా స్నానం చేస్తున్నావా .... లేక నిద్ద్రోతున్నావా? " అంటూ గట్టిగా ఓ అరుపు అరిచింది!!

కోడలు దేవసేన అమాయకంగానూ వినయంగానూ "అయ్యో రామా ... స్నానం చేస్తున్నాను అత్తయ్యా ... తలమీద ... ప్రతి వెంట్రుకా జాగర్తగా విడదీసి తీసి .... షాంపూ పెడుతున్నాను ... ఇలా స్నానం చేస్తే మంచిదని .... మీ అబ్బాయి చెప్పారు మరి"!!

అత్త షాక్‌ ...కోడలు రాక్‌...

😊😊😊😊😊😊😊😊

బ్యాంక్ లో గోడకి ఒక సూచన తగిలించారు ...

" వేలిముద్ర వేసేవాళ్లు , ముద్ర వేసిన తరువాత ఆ సిరా ను తుడుచుకోవడానికి గోడను ఉపయోగించరాదు " అని ...

అక్కడ నాలాంటి తింగరోడు ప్రతిస్పందన ...

" ఓరి సన్నాసుల్లారా ‌..! అది చదవడమే వస్తే , వేలిముద్రలు ఎందుకు వేస్తార్రా ..!? " అని ...

" Point to be noted " కదా ...

😊😊😊😊😊😊😊😊😊

పేషంట్ః ‘’ డాక్టరు గారూ,నేనుఎప్పుడూ అతి సంతోషంతో ఉంటాను.నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది.అన్ని పనులూ చాలా శ్రధ్ధగా మనసు పెట్టి చేస్తుంటాను. మిగతా వాళ్ళను చూస్తుంటాను.అందరూ ఏ పని చెయ్యాలన్నా ఎంతో ఆదుర్దా పడిపోతుంటారు.అనవసర భయాలు పడుతుంటారు.

నేను మాత్రం ఎటువంటి ఆందోళనా పడను. ఎంతో ఉత్సాహంగా ఉంటాను. నేనే ఎందుకలా ఉంటాను?ఇదేమీ జబ్బు కాదు కదా? ‘’

డాక్టరుః’’మీ పరిస్థితి అర్ధం చేసుకున్నాను.మీకు జీవితంలో విటమిన్ ‘’SHE’’ తక్కువైంది. అది పడితే మీరూ మిగతావాళ్లలాగే నార్మల్ అయిపోతారు.

😊😊😊😊😊😊😊😊😊

ప్రతీది వాట్సాప్ లో పోస్ట్ చేయడం కామెంట్స్ కోసం ఎదురు చూడడం ఫ్యాషన్ అయిపోయింది........

ఆ మధ్య ఒకాయన ఓ పోస్టుపెట్టి కాసేపటితర్వాత ''డిలీట్''చేసాడు.కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆయన పెట్టిన పోస్టు ఏమిటో తెలుసా?

''గత నెలలో వారింట్లో జరిగిన రెండు తద్దినాల తాలూకు ఫోటోలు''

ఓ గంట తర్వాత వచ్చిన కామెంట్స్ చూసి చిర్రెత్తు కొచ్చి పోస్టు తొలగించేశాడు. ఏం కామెంట్స్ వచ్చాయో ఓ సారి చూద్దాం.

1.హేపీ తద్దినం.

2.తద్దినం శుభాకాంక్షలు.

3.నిత్యం మీ ఇల్లు తద్దినాల తో కళకళలాడాలనిఆకాంక్షిస్తున్నా.

4.మీ ఇంట్లో తద్దినం మా కెంతో ఆనందం.

ఇవన్నీ చూసి చిరాకుతో పోస్టు తొలగించేశాడు.

😊😊😊😊😊😊😊😊😊



ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి ప్రముక సైకియాట్రిస్ట్ విచ్చేసారు ఓక వార్డ్ లోకి వెళ్ళారు.

అక్తడ ఓక పేషేంట్ చిరిగిన బట్టలు, చింపిరిజుట్టుతో ''ప్రియా!! ప్రియా!! అని అరుస్తున్నాడు..

డాక్టర్ తన అసిస్టెంట్ తో అడిగారు

ఇతని ప్రాబ్లం ఏంటి అని

అసిస్టెంట్ > సార్ ఇతను ప్రియా అనే అమ్మాయి ప్రేమించుకున్నారు.

కాని ప్రియ కి వేరేవాడితో పెళ్ళయ్యింది అందుకే పిచ్చోడై ఇలా అరుస్తున్నాడు..

మల్లీ డాక్టర్ ఇంకో వార్డ్ లోకి వెళ్ళారు

అక్కడ ఇంకో పేషేంట్ చిరిగిన బట్టలు చింపిరిజుట్టుతో

''ప్రియా!! ప్రియా!! అని అరుస్తున్నాడు..

.

డాక్టర్ > ఇదేంటి తనూ ప్రియా అనే అరుస్తున్నాడు.

.

అసిస్టెంట్> ప్రియని పెళ్ళి చేసుకుంది ఇతనే సార్..

😊😊😊😊😊😊😊😊

ఒక చోట ఆడవాళ్లంతా లైన్లో నుంచుని ఓ ముష్టివాడికి అన్నం, డబ్బులు వేస్తూ అతనికి ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు.

అటుగా వెళ్తున్న సోము.. ఆ లైన్లో తన భార్య కూడా ఉండటం చూసి, ఏం జరుగుతుందే అక్కడ అని భార్య వాసవిని అడిగాడు.

వాసవి : అబ్బే, ఏం లేదండి.. ఈ రోజు దానం చేసేవాడికి మన ముష్టేషు కొత్త పథకం పెట్టాడు.

సోము : ముష్టివాడు కొత్త పథకం ఏమిటే, మతి పోయిందా?

వాసవి : అవునండి, మనం ముష్టి వేసి.. ఫోన్ నెంబరు ఇస్తే,

రేపు లక్కీ డ్రా తీస్తాడట. అందులో ఎవరు ఫోన్ నెంబరు వస్తుందో వారికి రైస్

కుక్కర్ బహుమతిగా ఇస్తాడట.

సోము : అ!!!

😊😊😊😊😊😊మాధ్యాహ్నిక శుభాకాంక్షలతో...💐🥱🤣😜🤔

 *నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం.*

ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం


 *అమ్మ అరగంట కనబడ కుంటేనే అల్లాడిపోయిన మనం..* 

అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం..


 *నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...* 

నేనే హీరో”...  నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం..


 *నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లు స్నేహితులతో పంచుకున్న మనం...* 

చిల్లరబుద్ధులతో,సంపాదనలో, అవే చిల్లర కూడా, .....తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచు కుంటున్నాం..


 *చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం..* 

ఇప్పుడు వస్తుంటే భయపడుతున్నాం...


 *బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటిపడుతూ ఒకే కుటుంబంగా పెరిగిన మనం..* 

ఇప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక కుటుంబాన్ని చిన్నదిగా మల్చు కుంటున్నాం..


 *చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం...* 

ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం..!


*మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి.., కొన్నాళ్ళు మనిషిలానే పెరుగు తున్నాం.*..

కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం...


 *మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం..!* 

మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం.!!


*నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం.!!!*

ఎందుకంటే... 

మనం ఎదుగుతున్నాం..!


మనం మనకే అందనంతగా...

మనం ఎదుగుతున్నాం..!


మనం,మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం అని కూడా తెలియనంతగా...


నిజంగా మనం ఎదుగుతున్నామా?...


........ ఆలోచన చేయండి.....


*