Tuesday, 27 August 2024

పద్యాలు.. 3

 

*"" చేత వెన్న ముద్ద – చెంగల్వ పూదండ*
*బంగారు మొలత్రాడు – పట్టుదట్టి*
*సందిట తాయత్తులు – సిరిమువ్వ గజ్జెలు*
*చిన్ని కృష్ణా నిన్ను – చేరి కొలుతు...""*

కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ. దేవాదిదేవుని కన్నది దేవకీమాతయితే, దేవాదిదేవుని దివ్యలీలలను కాంచినది యశోదమాత. యశోదమాత కాంచిన దివ్యదర్శనములలో ఒకటి -

ఓ దినం ఎప్పటిలాగే కృష్ణుడు, బలరామ గోపబాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోపబాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించగా -...

అమ్మా! మన్ను దినంగా నేశిశువునో? యా కొంటినో? వెఱ్ఱినో?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్, నన్నీవు గొట్టంగా వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగం
ధమ్మాఘ్రాణముసేసి నా వచనముల్ దప్పైన దండింపవే

అని నోరు తెరిచి చూపగా చిన్నికృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోద.

234.మ.అభిమానించుము నమ్మకమ్ముకళ ఆనందమ్ముయేక ల్గుటన్ 

ఉభయానందము నిత్యనేస్తమగు యూహాతీత భావమ్ముగన్ 

ప్రభలేలేటివయస్సుగానుమది ప్రాధాన్యమ్ము ధర్మమ్ముగన్ 

అభయమ్మేవిధియాటలేలుకథ ఆత్మనంద విశ్వాసమున్


235.ఉ.సేవలలోతరించగల సీతల తత్త్వము ప్రేమనందునన్ 

భావభవమ్ముగా గ్రహము బాధ్యత నుంచుట సంఘముందునన్ 

సావధనమ్ముగాకదలె సాధ్య కుటుంబము సంస్కృతీమదిన్

జీవన లక్ష్యమేనుకళ చేష్టలు సర్వము సంతసమ్ముగన్


236.మ.శుభరాత్రిస్వరలీలయేగమన శీ ఘ్రమ్మేను నిద్రాననే 

ఉభయానందసకాలరీతిగను ఉత్చా హమ్ము రీతౌనునే 

ప్రభలేలేనిసమాధనమ్మగుట ప్రవీణ్యాల నేస్తమ్ములే 

అభయమ్మేకళరీతినౌనువిధి యాటౌ నేల విశ్వేశ్వరా


237.ఉ.దిష్టిగ బొమ్మబెట్టిఫల దీకరణమ్ముయు చేయనేంచగన్

 దృష్టియు మార్చదాల్చియు విశ్రాంతని చెప్పుట నొక్కమాయగన్

పుష్టిగ మేతమేసియు సపూజ్యమనేవిధి యాటయేలగన్

ముష్టిగ జీవనమ్ముయది మృత్యువు వెంటన యేలయీశ్వరా


238.చం.మనిషిగనవ్వులేలుటయు మార్గముగొప్పగనేస్తమేయగన్

చణువొక గీతభావముయుభాను కళేలు సకామ్యనేయగున్ 

ఆణువణువే కరమ్ముకళ ఆటయు పట్టునునెంచివృత్తిగన్ 

క్షణమొకరీతిమానవునిక్షేమప్రవృత్తి ససౌఖ్య మీశ్వరా


239.శా.వైరుధ్యాన్నివిరోధిగానుతలపే వై ఫల్య మేయేలగన్ 

సారూప్యమ్ముగనేభవమ్ముమలుపే సామర్ధ్య విశ్వాసమున్ 

వైరుద్యమ్ముగనేలుశిద్దిప్రకృతే కైవల్య సంభావమున్ 

వీరత్వమ్ముగనేజయమ్ముపరమై విద్యా విశేషమ్ముగన్


240.ఉ.మారని లోకమే యిదియు మానస వేదన మంత్రమాయయే

తీరని బుద్దిమందగతి తీవ్రము శిక్షణ తంత్రమాయయే

ఆరని మంటలేగతియు యాశల మధ్యన యంత్రమాయయే

కోరిన కోర్కెలే మనసుపోరగు ఎందుకు పార్వతీపతీ 


241.ఉ.చెప్పుడు మాటలేవినిన చేష్టశుభేద్యముగాను యేలనో

చెప్పిన దాన్నిచెప్పినను చిన్నతనం మగుటేనుయేలనో

గొప్పకు జత్తురే కవులుత్రోవను జూపక యుండుటేలనో

జెప్పెడివారులే తలపుజేయును బ్రహ్మగ పార్వతీపతీ


242.ఉ.బిందువులోన దాగినది సింధువు పంతమతన్మయత్వమై

పొందిక స్పర్శకోరుమది పోరుమహత్యము ప్రోద్బలమ్ముయే

విందుల దేహమౌనగతి వేదిక విద్యల మైదునమ్ముయే

సందడి వంపుసోంపులగు సఖ్యత నేస్తము పార్వతీపతీ


243.ఉ.భారము లేనిబంధమున భాగ్యమనస్సగు భవ్య జీవిగన్ 

ధారణ నేస్తమై పలుకు ధ్యానమనోమయ నిత్య విద్యగన్ 

కారణమేదియన్నను సకామ్య సమర్ధత చూపగల్గియున్ 

కారము లేని భోజనము కాంతకు

ముఖ్యము నెంచి చూడగన్


244.మ.ఇదినాయిల్లనిపల్కులేలను సనీతే తెల్ప చట్టాలుగన్ 

విధియేనన్నుగగుర్తుచేయకయు విశ్వాసమ్ము లేదేందుకున్

మదితీర్పేగతియేకదావిధిగ మాం దవ్యమ్ము చిందేందుకన్ 

కథలేలేజగతీయిదీ కనుము కర్తవ్యమ్ము గాయీశ్వరా


245.మ.చిరునవ్వేమదితిప్పుటేసహజ చిన్మాయేను నేస్తమ్ముగన్ 

ధరయేలేనిది సాధ్యనవ్వులగు దాంపత్యమ్ము సౌఖ్యమ్ముగన్ 

పరమానందముపొందశక్తిగను పాఠ్యమ్మౌను హాస్యమ్ముగన్ 

తరుణానందము సేవలక్ష్యమగు ధాత్రుత్వమ్ముగా యీశ్వరా


246.ఉ.బుద్దిగశిద్దిపొందియు సభుక్తియు పొందుట గీతబంధువున్ 

యుద్ధము చేయుధీరుని సయోధ్యత విద్యలేయగున్ 

ముద్దర లక్ష్యసాధనగు ముందర సంపద బట్టిసాగుటన్ 

సిద్ధికి ధైర్యమేబలము శిక్షణ రక్షణ గాను యీశ్వరా


247.చం.నిశితపుయోచనేవిధియునిర్ణ యమౌనుసమర్ధతానుగన్ 

పసితనమౌనుసంతసముపాశముగాను నిజమ్ము లీలగన్ 

రుసరసభావమేయగుటబుద్ధి గుణమ్ముయు గీతభావమున్ 

కశియగు దైవపూజగను కాల మనస్సుయు తోడునీడగన్


248.ఉ.పద్యకవిత్వమైజగతి పాఠము బోధల దిట్టగాకవిన్ 

విద్యగవాక్కుదీప్తిగను విశ్వమతమ్మును బోధచేయగన్ 

గద్యముతెల్పపల్కులగు గమ్యము జీవిత లక్ష్యమేయగున్ 

సాధ్యభిమానమేచరిత సామ్యము తెల్పెడి నిత్య సత్యమున్


249.ఉ.ఎవ్వరితోనుపోల్చకసయోధ్యతయే మది శాంతికే యగున్ 

నవ్వుల పాలుచెందకయు నమ్మిన నేస్తము పోల్చితెల్సుకో 

పువ్వుల జీవితమ్మిది సపూజ్యత భావము పంచగల్గగన్ 

సవ్వడిచేయకేబ్రతుకు సఖ్యత చూపుసమర్ధతే యగున్


250.ఉ.చిన్నగ మాటలేహృదయ చిత్తము చేరి మహాభవమ్ముగన్ 

అన్నవలేసహాయమగు ఆద్యమనేమది పొందగల్గగన్ 

మిన్నమనస్సుయేసహన మిచ్చుట తృప్తియు మిధ్యయేయగున్

వెన్నల కర్గు జీవితము వేదపు వాక్కుల పర్వమేయగున్


251.ఉ.తేరుకొ నే సహాయమగు తీవ్రత తగ్గుట ఖచ్చితమ్ముగన్ 

కోరుకొనేదిభక్తికళ కోపమయమ్ముయు కాకయుండుటన్ 

పోరును కోరుబుద్ధియు యుపోద్ఘత మేమియు లేకయుండుటన్ 

జోరును చూపగల్గుటయు జ్యోతిగ కాంతులు యందజేయుటన్


252.ఉ.చక్కగపుచ్చకాయ యది చెక్కెను తాజమహల్ గ రూపమై 

చుక్కలమధ్యచంద్రకళ చూపుల యేలుట కొత్తవెల్గుగన్ 

మక్కువరంగుయందమగు మచ్చల మాదిరి శిల్ప మోముయున్ 

దక్కెను తృప్తితిండిగను ధన్యత పొందెను తిండికాయగన్


253.కాముని లీలగాగతియు కాలపు మత్తుకు చిక్కి యుండగన్

ప్రేమయు జూపలేకయు ప్రీతిగ నుండక జిత్తముంచియున్

క్షేమమనేదిలేదు మరి క్షామమె నీడగ వుంది యేలనో 

నామది నర్పజాలనిజ నానుడి తెల్వక తెల్పెను సుస్వరంబుతో


254.మ.ధనధాన్యమ్ముగనేను శాంతిగను దానమ్మేను చేసే భాగ్యమ్ముగన్ 

ఋణమేతీర్చమనస్సుగావినయ భు క్తేపంచ సేవా లక్ష్యమ్ముగన్ 

తృణమైవైద్యముగాను సేవలగు తృప్తీ సహాయమ్ముగన్

ప్రణతీభావము సర్వవేళలగు ప్రాధాన్యమే జీవిగన్


255.ఉ.అక్కడ దొడ్డిదారిగను ఆశల నిచ్చెన ఎక్కి యాటగన్ 

ఇక్కడ నమ్మబల్కులగు యిష్టమనే నటనేల గొప్పగన్ 

ఎక్కడ చూసినావికృతియే విధియేయని చెప్ప నీతిగన్ 

మక్కువ చూపకే మనిషి మానస రోగిగ జీవమేళనన్


256.శా.ఉన్నావాసమభావమేది సహనమ్మాయే మనస్సేదియున్ 

కన్నావాకడుదుష్ట బుద్ధులనేకాకుల్ల పోరౌనులే 

అన్నావాపలుకేయశస్సనుటే ఆరాట అర్భాటమే 

తిన్నావాధనమెంగిలేకథగా తిష్టేసి లోకమ్మునన్


257.ఉ.నిత్యమనోమయమ్ము కళ నిర్మల మేయగు ఆధిపత్యమున్ 

సత్యముతోడునీడగుట సాధ్య యుపాసణ సర్వ వేళగన్ 

పత్యము తప్పదే వయసు పాఠము నేర్పుకు కొన్ని వేళలన్ 

ముత్యము మల్లెనుండగల యున్నత భావము తెల్పగల్గుటన్


258.ఉ.దానమనేదియిచ్చుటయు దాతగ నేతగ పుచ్చుకోకయున్ 

ప్రాణము నిల్పసేవలగు యానతి యున్నను లేకపోయినన్ 

మానము యర్పనమ్మగుట ధార్మిక లక్ష్యము గాను జాలిగన్ 

దానము శాపమయ్యెగద దాతకు నీ భువిలోనగంటివే


259.శా.సంభంధమ్ముగనౌనుజీవపయణంసాధ్యా సమర్ధమ్ముగన్ 

సంభావ్యమ్మునుపొందజీవచరితం సంతృప్తి యుద్యోగమున్ 

సౌబాతృత్వముచిత్తలక్ష్యమువిధీ సౌసీల్య సంఘమ్మున్ 

సంభంధంకళగాను సత్యమదిగా సమ్మోహనం యీశ్వరా


అనుకోని విధముగా మరలా ఫేస్బుక్ వారు అనుమతిచ్చారు నేడు వ్రాసిన పద్యాలు పొందుపరిచా ఆదరిస్తే వ్రాస్తా నిరకరిస్తే నా బ్లాగులో ప్రాంజలి ప్రభలో వ్రాసుకుంటా 

తెలుగును బ్రతికించాలనే ప్రయత్నం మాత్రం మానను 

ఆదరించేవారు చాలు అందరికీ ధన్యవాదములు.

ऊँ! "ఆంధ్రభాషాయోషామతల్లిరో.. జయహో !!! "


260.శా.సీతా రాముల జంట విశ్వ మయమై సేవించు సంతోషమై

సీతా రాముల లక్ష్యమే సహనమై సేవాభ్యు సాహిత్యమై

సీతారాములుయే వనాల  వనవాసేతృప్తి ప్రేమమ్మువై

సీతారాములు గా సహాయము గనే సేద్యమ్మె సన్మానమై


261.మ.నినుచూస్తూ కదిలావసంతమున నిత్యాసత్యమై కాంతిగన్ 

విను నేస్తమ్ము విధీబలమ్మగుట విశ్వాసమ్ముగా నేనుగన్ 

తణువేసంతసభాగ్యమై హృదయ తత్త్వంమౌను సత్యమ్ముగన్ 

మనసేపువ్వగునిన్ను చేరగల మార్గంమౌను ధర్మమ్ముగన్


262.విలువలు తెల్పతల్లియగు విద్దెలు ఆంగ్లముయైన కష్టమే 

తెలుగును తెల్పలేనిగతినేడును అమ్మ యనేది మర్చిరే 

థలుకుధనమ్మె కోరియు కథేమదిగానులె యాస భావమే 

కలువలకాలమేను సమధైర్యము సంపదగాను నేస్తమై


263.మ.సమరమ్మైనది శబ్దసౌష్టవముతో సామాన్య లేబాధగా 

సముఖమ్మైనది వింతమార్గమగు సామర్థ్య మేప్రశ్నగా 

సమతావాదములేక కర్మమను సంఘమ్ము నేజీవిగా 

మమతా మానసమేదిలేక గతి మంటౌనులే నిక్కమౌ


264.ఉ.పెద్దల నెంచనేవలదు పిన్నలు యేవిధ మైన పల్ 

విద్దెలు నేర్చియున్నమది విజ్ణులగా విలసిల్లి నిత్య ము 

ప్పొద్దులనేవగించుకొని పోరును సల్పుట ధర్మ మేదియో 

సద్దుకునే విధమ్ముననె శాంతియు సౌఖ్యము పొంద గల్గుటన్


265.చం.విరచితమౌన భాషగనుతెల్గు మనస్సునుదోచె యెప్పుడో 

మరువకమాట వేదమగు నిత్యము సత్యముగాను నేస్తమై 

తరుణము కావ్య కాంతుల సుధా మధురమ్ము గానులే 

కరుణతొ శాంతిపర్చెది సకామ్యము పొందెడి భాష తెల్గు యే


265.చం.తెలుగును వద్దు ఆంగ్లము ముద్దు యననేమియు కష్ట మొచ్చెనో 

వెలుగునుమర్చి చీకటినిచేరిన వారి కిగమ్య మేదియో 

కలుగును పడ్డవేళగతి చెప్పక ఒప్పక నుండుటేలనో 

మలుపులు యాసపాశమున చిక్కియు బాధలుపొంద జీవమై


266.ఉ.తానుగ చెప్పదల్చినది తత్త్వపు గాధను నొప్పిగున్ననూ 

మేనును వంచి చేసెది విమోచన లక్ష్యము తెల్పగల్గగన్ 

మానుగ జీవమేయిదియు మచ్చల వల్లన బాధవోర్పుగన్ 

నేను సమానమన్నను సనేత్రము పోటులు ఒప్పుకూడికన్


267.ఉ. మాధవ లీలలేకనుమ మానస చోరడు మోహచిత్తుడై 

వేదన చూపివింతగ వివేకము మాటలు కూడియుండగా 

రాధిక పారవశ్యమున; రంభను కౌగిట జేర్చె వింతగన్

రోదన నవ్వులుకలయు కోరిక తోడున వేష ధారణా


ఇతర వృత్తము 

268.చెప్పేను తెలుగు తెలుపు చేష్టలు పలుకు లొలుకు పాఠమై 

 విప్పేను వినయ మలుపువింతగ ఋషులకథలు భాష్యమై 

 తప్పేను సిరుల మదము తన్నుకొనెడి తలపులు చిత్తమై 

 ఒప్పేను గనుము నృహరి ఓర్పు జగతిన తెలుగు దైవమై


269.ఉ.మేలిమి పుత్తడేతెలుగు మేలుగ వాక్కుల పర్వమేయగున్ 

ఆలికి అర్ధమేయగుట ఆశయ భాషయు తెల్గు మాత్రమున్ 

మాలిగ వ్రాతలేయగుట మార్గపు విద్దెల నేస్తమేయగున్ 

జాలిగ చూపుభావములు జాగృతి మాదిరి అర్ధమూలమున్


270.మాత్రంగా బతికేను మాతృ తెలుగే మాయల్లు కమ్మేనులే 

ఆత్రంగాచదువేనుమార్పులగనే అర్భాట ఆంగ్లముగున్ 

నేత్రంగాకళసొంతభాషతెలుగే నిత్యమ్ము యానందమున్ 

సూత్రంగాతెలుగౌనుయందరికీ భుక్తౌను సంపాదనే


271.ఏమిచెప్పెద కొండపైనను యద్భుతమ్మది చూడుమా 

స్వామి లీలలు కొన్ని బత్కులు సాగుచుండెను చూడుమా 

నామ మాత్రము గాలి యంచున నమ్మకమ్మగు చూడుమా 

యేమి సృష్టియు చెట్టుకొమ్మలు యెట్లు పెర్గెను చూడుమా 

నమ్మకమ్మగు వింతశోభలు నాట్యమే యివి యీశ్వరా


272.నాకింతలేదు ఫలమందే కోరిక పార్ధ!అంతయు కాదుయుసుమా 

ఏకొంత వల్ల మనసిచ్చేమార్గము పార్ధ! పంతము లేదుయు సుమా 

మైకపు మత్తు కదలికలు, యేకామ పరమ్ము పట్టకే ధర్మ ఫలమ్ 

తాకవు కర్మ ఫలితములు, యేకర్త యెరుంగు నంటదే కర్మ ఫలమ్


273. నాకింతలేదు ఫలమందే కోరిక పార్ధ!అంతయు కాదుయుసుమా 

ఏకొంత వల్ల మనసిచ్చేమార్గము పార్ధ! పంతము లేదుయు సుమా 

మైకపు మత్తు కదలికలు, యేకామ పరమ్ము పట్టకే ధర్మ ఫలమ్ 

తాకవు కర్మ ఫలితములు, యేకర్త యెరుంగు నంటదే కర్మ ఫలమ్


274. చం.వనమున పువ్వు జీవనము వాంఛను తీర్చ ఫలమ్ము నివ్వగన్ 

మనమున నవ్వు భావముయు మార్గముతెల్ప సమమ్ము జీవమున్ 

క్షణమున యిచ్చిపుచ్చుటయు కామ్యము వల్లను సంతసమ్ముగన్ 

ప్రణయము సర్వ వేళలగు ప్రాభవమేను సహాయ కాలమున్


275.వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే

వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే వాత్సల్యచిత్తంబుచే

యర్థధ్యానముచే మహాభ్రమతచే హాస్యప్రసంగాలచే

స్వార్థంబే పరమార్థమై చెడుదు రీ స్వార్థప్రజల్ శంకరా! 


276.సంగతి తెల్పవాక్కులగు సామియు చూడుము ఎట్టి వాడునో 

అంగన గర్వమే యనచ ఆత్రుత గుండు సగమ్ము మీసమున్ 

మంగళ వాడు నీ మగడుమానిని రుక్మిణి యెంచిచూడుమా 

రంగపు కార్యమేయిది స ర మ్యత నౌనులె పల్కె రుక్మిణీ


277.యీమదమేనులేసుఖము యిచ్ఛగ మారిన భుక్తి కష్టమున్ 

యీ మనిషేనుయాసలకు చిక్కియు భత్యము లేక 

బాధయున్ 

యీ మనసేను నమ్మకము యిoతియు మిత్ర మనోమయమ్ముగన్ 

యీమమకారమే మమత యిచ్ఛకు లొంగుట శోభయేయగున్


278.వార్ధక్యంబు జయమ్ముగానుమనసే వాక్కుగ బోధసత్యమున్ 

వ్యర్థంబే యవకే సమర్ధమనసే వాత్సల్య మేశాంతిగన్ 

యర్ధధ్యానముగానుయుక్తిపరమై హాస్య ప్రసంగాలు ని 

స్వార్ధంబే పరమార్ధమై జపముగా సాధ్యంబు సేవార్పణమ్


279.మ.ఎదిరిస్తేబ్రతుకేమదీభయపు ధ్యేయంమ్మేను ప్రశ్నౌనులే 

బెదిరిస్తేయవకాశమేకదలి భిక్షమ్మేను జీవమ్ముగన్ 

వదిలేస్తేసహకారమేమరుపు వా త్సల్యమ్ము మాయేనగున్ 

మదిభావమ్ముగనేగతీమయము మానమ్మేను విద్దెలుగన్


280.ఉ.హత్తుకునే మనస్సు యిదిహాయిగ మాటల పందిరేయగున్

మొత్తుకునే వయస్సు యిది మోక్షము పొందిక నిచ్చకోకయున్ 

మెత్తని జీవనమ్ము మది మేలును కోరుటయే ప్రయాణమున్

సత్తువకొద్దిసేవలగు సాధన లక్ష్యము ప్రేమముంగిటన్


281.ఉ.గుండిగ గుండ్లుగా కదలు గుమ్మట ఊపులు చూడ లేమయా 

మొండిగచూపురత్నమది మోహపు రాట్నము కళ్ల కైపులున్ 

దండిగదంచుకోమనియు దారిని చూపెటి దాన మోహినీ 

బండగ మారియే ధనము బాడుగ దేహము అర్పనే యగున్


282.భగవద్గీత మనోమయమ్ముకళబంధుత్వమ్ము సేవార్దిగన్ 

భగవద్గీతయె సంఘతృప్తిగను బ్రహ్మారణ్య సర్వార్ధమున్ 

భగవద్గీతయె భానుమంతుడుగ బ్రాహ్మణ్యమ్ము భాగ్యమ్ముగన్ 

భగవద్గీతయెభూతయజ్ఞముగ బ్రహ్మాండమ్ము కృష్ణమ్ముగన్ 


283.పాశము కష్టమందునన పల్కులు లేకయు వర్షమందునా 

ఆశలు తారుమారగుట శాంతికి దూరభయమ్ము చెంతనే 

మోసముకాదువర్షముయు ముంచెను యిల్లుయు శోక బాధయే 

శాసన మించిగా విలయ శాపము బెట్టెను యేమి పాపమో


284.మకో. వీలుగొచ్చెను వానలేని చిందు పంకము వీధులన్!

వాలు చెప్పెను యాదుకోగల వాక్కు గావిధి రక్షగన్

వీలుచింతన, సేవ వల్లన వేగ కష్టము తప్పెనే 

 జాలిగాభువి,రాజ్యమేలెను జాతి సేవలు సంపదల్!!


285.పం.సమస్య లెన్నియున్న జీవితమ్ము గానుసాగటే 

సమర్ధతేబలమ్ముగాసహాయమేనిజమ్ముగా 

సమాజమేమదీయదేశపాలనేవిధమ్ముగా 

విమర్శలేనియోగమేవిధానమేప్రభోదమే 


286.తాడుగ లోకమే కదలు తన్మయతాపము చుట్టు గుండ్రమై 

తోడుగ వచ్చు నీడఫల తోడ్పడు సూన్యము గాను దర్పమై 

నీడగ ప్రేమయుండుకల నిన్నును నన్నును మాయ కాలమై 

బాడుగ జీవితమ్మగుట బంధము సౌఖ్యము ప్రశ్నగా


287.సుఖమేకాక సహాయమేఘటన సూత్రమ్మేను సేవా కధా 

ఒకటై తాతలు తండ్రులే కలసి ఓదార్పేను శాంతమ్ముగా 

నకలైమామలు గుంభణమ్మగట నాత్రమ్మేను తోడ్పాటుగా 

సకలంపాపలు సంతసమ్మగుట సంతోషమ్ము దేశమ్మునా


288.గుప్పెడు యన్నమేమనిషి గుర్తుగ మార్చును లోకనీతిగన్ 

గుప్పిట పట్టియాపదను గువ్వల ప్రేమను యాపలేకయున్ 

చెప్పియు వోర్పుగాగనవు చోరుని బుద్ధులు మాన్చ లేవుగన్ 

కప్పిణ నొప్పులై సహన కాలము బంధము మానవత్వమే


289.ఏదైనా మనదే మనల్ని కలిపే యే ర్పాటు సంఘమ్ముగన్ 

ఏదైనా మనదవ్వకేకదులుటే యెo తైన మేలేయగున్ 

ఏదైనా వెలకట్టలేని మనిషే యేదైన సంతృప్తిగన్ 

ఏదైనా విలువైన వస్తువుగనే యేమాయ బంధమ్ముగన్


290.బాధనువోర్చుకో మనసుబాధ్యత గమ్యము నేర్పుగాయగున్ 

సాధన తోనుసాగుటయు సాధ్యము బట్టియు బంధమేయగున్ 

శోధన యేలజీవితము సోకుల చుట్టును సాగుచుండుటన్ 

బోధలు వల్లతృప్తిగను భుక్తికి నిత్యము సంతసమ్ముగన్


291.ఆకాశంబున సూర్యుడే లయగా కాలంబు రూపంబుగా 

ఏకాంతంబున చంద్రుడే లయగా వెన్నెళ్ల దీపంబుగా 

భూకాంతామది విష్ణువే లయగా భూకంపనేస్తమ్ముగా 

 శ్రీ కర్మా విధి రుద్రుడే లయగా శ్రీకార శీఘ్రమ్ము గా 


292.అరవిందమ్మువిలాసమందిరము యానందమ్ము  సౌఖ్యమ్ముగన్ 

తరుణీరత్నము మానసమ్ముసుఖ తత్త్వంమేను ప్రేమమ్ముగన్ 

స్వరమేకాంతముసద్భవమ్మగు సుస్వామీప్రేమ పొందెందుకన్ 

విరజాజుల్లమహీమతీమనసు విశ్వాసమ్ము దేహమ్ముగన్ 


293.ఆధునికమ్ముకామ్యమగు ఆసల పల్లకి నీడగాయగున్ 

ఆదుకొనేమనస్సుగను ఆశయ ధోరణి తోడుగాయగున్ 

సాధుగుణమ్ముగామమత సాధన సఖ్యత సంభవమ్ముగన్

చేదుయు తీపిదుఃఖమగుచేరువ సౌఖ్యము ప్రేమబంధమున్


294.అన్నీయున్ననుయెన్ని యాసలుగా ఆత్రమ్ము తగ్గేదిలే 

చన్నీళ్లన్న సుఖమ్ముగానుకథే చాతుర్య వాసంతమే 

కన్నీరైనను ధైర్య సంపదగనే కాలమ్ము నేస్తమ్ముయే 

పన్నీరైనను కార్యసాధనలుగా పాఠ్యమ్ము సర్వమ్ముగన్


295.వస్తున్నా విధి కార్యమేనులె సువర్ణమ్మేను సౌఖ్యమ్ముగా 

వ్రాస్తున్నాను కుటుంబమేనుసమయావాంఛార్ధ జీవమ్ముగా 

చేస్తున్నా సహనేస్తమై పనులుగా చేయూత విశ్వాసమే 

చూస్తున్నా వినయమ్ముబుద్ధిగనుచూ సూత్రమ్ము తెల్పేనులే


296.ఉప్పొంగేనులెగంగకాలమహిమన్ చూపేను లెక్కేయకే 

ముప్పేవచ్చెనుయాంద్రమంతయులే ముఖ్యమ్ముగా గంగయే 

చెప్పేవారునుచూచువారునువీచేగాలి కేతోడుగన్ 

ముప్పొద్దే భయమైజనమ్ముకళే సూత్రమ్ము కన్నీరుగన్


297.ఉ.వారికి రాజకీయమగు వాక్కుల పర్వము సేవ బాధ్యతే 

వీరుగ దానకర్ణలగు విశ్వమనోభవ నేస్తమవ్వుటే 

వీరికి వట్టివాదనలె వేకువ పోరులు బుర్దచల్లుటే 

నేరుగ కంటనీరుతుడిచేవిధి మార్గము ముఖ్య మంత్రిగా


298.ఎవరేతెంచిరొచూడుమా ప్రకృతి యేమైనాది విశ్వాసమా

అవనీజాతము గాయిదీ సమయ సామర్థ్యమ్ము తెల్పాలిగా

భువిరాజ్యమగుయేలనో విధియు పూర్ణార్ధము తెల్పేను సా 

దువు నేస్తమ్ముగ నిత్యమై కళలు దూతాయు పాధ్యాయగా


299.శా.వర్షించేకళవానరూపముగనే వాశ్చల్య భూతమ్ముగన్ 

వర్షించేజలమేనుయిచ్ఛసుఖం యానంద రూమ్ముగన్ 

హర్షించే ప్రకృతీసమమ్ముగనే ఆశ్చర్య పూర్ణమ్ముగన్ 

హర్షంచే విధినాటకమ్మగనేబందించి హింసించగన్


300.కృష్ణా వెన్ననుతిందువా సమయమే  కానుంది నీయిష్టమే 

కృష్ణా చూపులు తిప్పకే హృదయమే సారూప్య ప్రేమమ్ముయే 

కృష్ణా మాటలు తెల్పుసంబరముగా కావ్యమ్ము నేవ్రాసెదా 

కృష్ణామాయయిదేసులోచనలుగా కారుణ్య భావమ్ముగన్


301.గాలమేబ్రతుకౌనునిత్యము కామి తార్ధము యర్జునా 

జ్వాలగాజవసత్యమేమది జడ్యమేయగు ఫల్గుణా 

కాలతీర్పని యాగిపోవుట కర్మయోగికి ధర్మమా 

కాలు వెట్టక యుద్ధమున్ విడ క్షత్రియోచిత ధర్మమౌ?

No comments:

Post a Comment