Wednesday, 2 October 2024

 కోట్లగా సిరియున్నలేమియు కోర్కెలెత్తని వ్యర్థమై 

 పాట్లు లెన్నన కోతినైనను పట్టి తెచ్చిరి బుద్ధిగన్ 

గాట్లు నిద్రయు పట్టకేయగు గాడి తప్పిన నీతిగన్ 

 మాట్లు వేయ మనోవ్యధావిధి మార్గమేయగు జీవమున్


యౌవనమౌనుజీవగతి యౌవన శక్తియు బంధసంతసన్ 

దావతు సంపదే సహజ దానము గానునె చేయగల్గగన్ 

సావధనమ్ముయర్ధమగు సాధ్యమునిత్యమె సత్యమగున్ 

భావవివేకమేగతియు నాల్గుయుయేకముధైర్య కర్మయున్


చూపేసూటిగనౌను చాటుయనకే చూపుల్లొయర్థమ్ము నా 

చూపే మాయగనేటి లక్ష్యముగనే సూత్రమ్ము చేకూర్చ నా 

చూపేహాస్యముగానుయేడ్పుగనుటేసూన్యమ్ము దాహమ్మునా 

చూపే మోహముగాను దేహముగనేపూజ్యమ్ము సంధా యినీ


గంగాసాగుటసంద్రమేవిధిగనే గమ్యమ్ము తాపమ్ముగన్ 

రంగాలన్నియుయేకమేకలసినా రమ్యత్వ సౌఖ్యమ్ముగన్ 

శృంగారమ్ముగనేసుఖమ్ముయువిధీ శృంగాగ యాస్వాదమున్ 

బంగారమ్ముగదాహమే హృదయమై బాం ధవ్య బంధమ్ముగన్

*****

అనురాగమ్ముగనౌను సంపదయు ప్రా యంమ్మౌను దేహమ్ముగన్ 

క్షణప్రేమా మధురానుభూతులుగ వీక్షించ్చేను వ్యక్తీకరిన్ 

తృణమైజ్ఞప్తియు సంతసమ్ముగను సంతృప్తీ సహాయమ్ముగన్ 

మనసేబంధము తన్మయత్వమగు యీమాతృత్వ యానందమున్

***

మార్జాలా నడకౌను యువతీ మాధుర్య వయ్యారమున్

దర్జాగాకదిలే కళ్ళుకలిగే తన్మాయ మోహమ్ముగన్ 

మార్జాలా కనుచూపుకాపుకలలే మార్గమ్ము దాహమ్ముగన్

దర్జాగాను సమాజ సేవయువతీ ధాత్రుత్వ సేవళ్ళుగన్


గంగాసాగుటసంద్రమేవిధిగనే గమ్యమ్ము తాపమ్ముగన్ 

రంగాలన్నియుయేకమేకలసినా రమ్యత్వ సౌఖ్యమ్ముగన్ 

శృంగారమ్ముగనేసుఖమ్ముయువిధీ శృంగాగ యాస్వాదమున్ 

బంగారమ్ముగదాహమే హృదయమై బాం ధవ్య బంధమ్ముగన్

****-

*స్నేహమ్మున్ యవకాశమేను జయమే క్షేమమ్ము ప్రాణమ్ముగన్ 

స్నేహమ్మున్ గ నిజాయితీ విలువగా చేయూత లక్ష్యమ్ముగన్ 

స్నేహమ్మున్ వదిలేయలేని సమచూపేతీర్పు విశ్వాసమున్ 

స్నేహమ్మున్ విధివాక్కుగాను సహజ మ్మైయున్న భూమ్మీదగన్


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅✅✅✅✅✅✅✅✅✅✅☸️☸️☸️☸️☸️☸️☸️☸️🛕🛕☸️


సమస్యను పరిష్కరించడం.....

స్త్రీ పురుషుల లో గొప్పవారెవరు చూడ

****

స్త్రీ హృదయమేను సహనమ్ము శీఘ్ర మౌను 

స్త్రీ పురుషుల యేకముగాను చిత్ర మౌను 

స్త్రీల శక్తి పురుషతోడు శ్రీకరమ్ము 

స్త్రీ పురుషులలో గొప్పవారెవరు చూడ

****

కం.యుక్తా యుక్త విచక్షణ 

శక్తియె యాయుధముగాను సమరమ్ముసుధీ 

రక్తానికి రక్తమనుచు 

యుక్తి భగతసింగ్ గ పోరు యురికంబముగా

****

*పోలిక వద్దు సోమరులతో చెలిమే యనవద్దు ఎప్పుడూ 

ఏలికహద్దు గుర్తుకళ యల్లరు మెచ్చడి వ్యక్తిగా మదీ 

యాలిని ముద్దు చేయగుణ యానతి మీర పరంపరా విధీ 

 జాలి గుణంబుయే మనసుగా ఒకరొక్కరు జీవనమ్ముగన్

****

మంచియనే విషయమ్మున్ 

సంచిత భావము గనౌను సందడి కొరకై 

ఎంచిన లక్ష్యము వదలక

మంచి పనిగనేను శాంతి మార్గము చూపే

****

అలక లేల పర్యటనలో అణుకువ మది 

పలక సర్వ శాంతిని కోరు పలక రింపు 

చిలక నీవేల చింతను చెలిమి చేయ 

మొలక దినదినాభిగ వృద్ధి మేలు మనకు

****

మీ విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ

నేనను నమ్మక ముంచుము 

నేను మనములో ఒకడిని నీడలు నివ్వా 

మనమేకమ్మునడకగను 

తనమన బేధమనకుండు తన్మయ విధిగా

*---

ఎవ్వాని స్వరమేజగత్ స్థిరముగన్ చేసేది యేపారుగన్ 

ఎవ్వాపొక్కిటమే విధిన్ స్థితిగతిన్ నేస్తమ్ము యేతీరుగన్ 

ఎవ్వాభవ్యముయే గతిన్ స్థలముగన్ నేమమ్ము యేమూలమున్ 

ఎవ్వా ద్రవ్యముగాను వాణి మయమున్ నెమ్మేటి బ్రహ్మాండమున్

****

చల్లచల్లనీశుభోదయమ్ముగాను యవ్వనమ్ము గానులే 

మెల్లమెల్లగానుపువ్వువిచ్చిశోభ

సత్వరమ్ము గానులే 

కళ్ళలాడుబుద్ధిగానువిద్యయైన కష్టమేను తోడులే 

ముల్లులున్నలోకమేనుసత్వరమ్ముయిష్టమేను నీడలా

*****

*నింత బ్రతుక్కు నొక్కటగు నిర్మల మానస బుద్ధి గొల్వగన్ 

 సంతసమేనుగానసిరి సంబర వాక్కులు సత్యమేయగున్ 

వింతల జీవనమ్ముగను వీనుల విందుగ దృశ్య మాలిగన్ 

చింతనె విడలేకసుఖ చిన్మయ యాకలి తీర్చ బత్కుగన్

****

జాతియంతరించిపోవడం జనమ్ము కారణాలు గానులే 

ఖ్యాతి తగ్గిపోవడమ్ముగాకలమ్ము వ్రాయలేక పోవుటే 

నాతినమ్మియేమనస్సుగా నయాన బంధమేమదీయతన్ 

రాతిలో నయంతులేనిదై రమా మనో మయమ్ము గానులే

****

*నాయకుడే మనల్ని కథ నాయకులే యనమాయబుద్ధిగన్ 

చేయగ గోరయున్నదని చీమల నల్పియు పిండిచేయగన్ 

కాయము వోటుకే యనుచు కార్యము చక్కగ చేయగల్గగన్ 

ధ్యేయము స్వర్గమే ననియు దీనపు మాటలు నేటి నాయకన్

***

ప్రకృతి యనేది జీవులకు పాఠ్యముగాను వసించు నిత్యమున్ 

ప్రకృతినిగాంచ తన్మయపు పాలనగాను గ్రహించు విద్యగన్ 

ప్రకృతి సుఖాలకష్టములు పాశపు బంధ భవించు నేస్తమున్ 

ప్రకృతి ప్రభావ మేపరమ పావ నమౌను యిసృష్టి యోగిగన్

****

ఎవరు యంతట నన్ను చూచుచు యేమి ఏమన కుండగన్ 

ఎవరు లన్నిట నన్ను చూచుచు యేమి తృప్తియు పొందగన్ 

ఎవరు నన్నుగనే మనస్సుణు నెంచ గల్గియు నుండు న

న్నెవరు హృద్యమునందు నుంచిన యుద్ధరింతును నిత్యమున్

****

మీ విధేయుడు.. మల్లప్రగడ రామకృష్ణ

నా ఫేస్బుక్ ఆపటం దేనికో తెలియదు తెలుగు మాభాష గౌరవించటం, ఆదరించటం నేర్చుకోవాలని ఫేస్బుక్ వారిని ఆర్ధిస్తున్నాను ఆంగ్లమే లోకంకాదు 


ఓం శ్రీరామ.. ఓంనమః శివాయ 

మల్లాప్రగడ వారి....సత్యం శివం సుందరం      


రాకపోకలేల జీవనమ్మురాసి పెట్టె బ్రహ్మముందుగన్ 

చాకచక్యమౌను నాటకమ్ము చర్మ చక్షు తీర్పునందునన్ 

ఏకమయ్యెనాడి శంకటమ్ము యెల్ల లన్ని మార్పు చెందగన్ 

పాకమైన పక్వమేమదీయ పాశబంధమేను నిత్యమున్ 

*****

యోగీశ్వర వాణి 6/40


దుఃఖము నెంచయేలయన భుక్తిగ యోగము సాధకుందుగన్ 

దుఃఖము మాయ లోకమున దూరము నుంచియు గాయమేలనున్ 

దుఃఖము జీవితమ్మనకు దుష్టల నేస్తము కొంతమూలమున్ 

దుఃఖము యోగమైకదల దూరము తగ్గియు నన్నునేకోరున్

****

మ.మదిలో వేదన పొంగుపొర్లె యల సామర్ధ్యమ్ము కన్నీరుగన్ 

కదిలేకాలము కావ్యమేయగుట యీకల్లోల జీవమ్ముగన్ 

విధిరాతేయన భాషసాధ్యమగు వైవిద్యమ్ము నేస్తమ్ముగన్ 

యిదియాంతర్యము యర్ధమేప్రతిభ యీనాడు యారోగ్యమున్


సమస్యను పరిష్కరించడం........

జారులు పిల్తురమ్మ గిరిజాపతి

          కావగ రమ్మటంచుచున్ 


దారులు చూపపార్వతి నిదానమనస్సును తెల్పగల్గగన్ 

బారులు తీరభక్తులగు బంధము తెల్పుచు నిశ్చమoదునన్ 

చారులు యీశ్వరాకళలు జాతర మాదిరి చేయగల్గగన్ 

జారులు పిల్తురమ్మ గిరిజాపతి కావగ రమ్మటంచుచున్


సమస్యను పరిష్కరించడం...

రావణ కుంభకర్ణులకురాముడు పుట్టె గుణాభిరాముడై

****

శ్రావణమౌనువింతగను రావణ మార్పుకు నేర్పుయేయగున్ 

భావన కాదు సత్యముయు బానిస మార్పుకు మూలమేయగున్ 

కావర భక్తియోగమున కాలమనస్సుగ దైర్య రాముడున్

రావణ కుంభకర్ణులకురాముడు పుట్టె గుణాభిరాముడై


మీ విధేయుడు 

మల్లాప్రగడ రామకృష్ణ

సందర్భం; అక్టోబర్...1... అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

శీర్షిక;

"" వృద్ధో రక్షతి  రక్షిత : ""


సాగరానికి పొంగుయెక్కువ సానుకూలత తక్కువే 

పేగుబంధము ఎల్లవేళల నేస్తమేయగు ధర్మమే 

జాగు చేయుచు వృద్ధజన్మయు జాతరేయగు కాలమై 

యోగమాయయు యోగ్యతేయగు యోగ ధర్మము నిత్యమై

****

ఏక కాలము విద్యలన్నియు యెల్ల వేళల తెల్పగా 

నేక మార్గము వత్తిడున్నను నీడనిచ్చుట నిష్ఠమై 

కాక యున్నను వోపికేమది కళ్ళు తిర్గిన నేర్పుగా 

కేకలున్నను కోలుకోకయు గేలిచేసిన నేస్తమే

****

జీవనమ్ము విజేతగా మది జీవయాత్రలు చేయగా

భావసంపద పంచి యిచ్చియు బాధ్యతేయగు బంధమై 

కేవలమ్ము వయస్సుపెర్గిన నేటి వృద్ధుని కర్మలే 

సేవ చేయతరమ్ముయేయిది సేద తీర్చెడి బోధయే

****

తిండి యావయు పెర్గియున్నను తిప్పలెన్ని కలేయగున్ 

మొండివాదన పెర్గి పోవుట మోక్షమే నని వాదనన్ 

పండు టాకుగ మారిపోయిన పంతముండును దేనికిన్ 

దండ మాదిరి వాసనిచ్చియు దారిచూపిన నేస్తమున్

****

భాను తీవ్రత ఎల్లవేళల బంధమేయగు తీరుగా 

జ్ఞానవెన్నెల నిత్య సత్యము చల్లగామది మార్చుటే 

ధ్యాన సంపద పెద్దలందరు ధ్యాసజూపుట ధర్మమే 

వాన వచ్చిన పంట పెంచుట వాక్కు ధారిగ నేస్తమున్ 

****

చక్క జేయచు బూనుకొన్నను సారమెక్కుచు కంతకున్

పెక్కసంకటములున్నవోర్పుగ భీతినొందక ధైర్యమున్ 

దక్కు దానిని పొందగల్గుట దార్ఢ్యమేర్పడు యుక్తిగన్  

జక్క సిద్దిని నొందెగల్గుట సాధనమ్ముయు నేస్తమున్ 

****

కొత్త యోగి వింత యనిన కొంతగాను జనులటన్

చిత్తమందు హాయిగలిగి చిద్విలాసమొదవిరే

ఉత్తదన్న వద్దు యనగ యుల్లసాలు వికలమై

ఉత్త మాయ లోన ప్రగతి యుత్తదయ్యె నేస్తమున్ 

****

కాలములో కళ్ళలుగా కానిదియే తెల్పుటయే 

 గాలమునే చిక్కినదా గాయమునే తెల్పకయే 

జ్వాలలుగా నున్నదిలే జాతరగా పాలనయే 

 గోలలుగా జీవితమే గోప్యముగా ప్రాణముయే 

****

 సాధువుగా జీవముయే సంతసమే కూర్చుటయే 

వ్యాధులలో కష్టముచే వ్యాపకమే మర్చుటయే 

గాధల నేనెట్టులనో కాంచుటయో

ధ్యానముయే 

బాధలతో వ్యక్తులను పాడుటయే ప్రాణముయే 

****

 వీధులలో దుమ్ము కదా వేదనలో మిన్నగయే 

 ఆదరణే కర్వుకదా ఆశయమే ప్రశ్నగయే 

చేదు గనే కాలముయే చిన్మయమే చిత్రముయే 

 వాదముగా వేదముయే వాక్కులుగా విస్మయమే

****

జీవితమంతా పరుగే జీతము కోరే పలుకే

 జావను త్రాగే బ్రతుకే జాతర కోరే మదికే 

 నావలు గానే కదిలే  నాన్యత లేకే చితికే 

 భావమతెల్పే విధిగా బాధ్యత బంధమ్ము సుదీ 

****


మీ విధేయుడు...

మల్లాప్రగడ రామకృష్ణ

*స్వాతంత్ర్య పోరాట యోధులు భారత కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహానుభావులు శ్రీ మహాత్మా గాంధీజీ, శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి, గార్ల జయంతి సందర్భంగా ప్రాంజలి ప్రభ అందరికీ శుభాకాంక్షలు 


స్వార్థము లేని ధర్మ పద సామ్యము సేవల దేశమే యి ని 

స్వార్ధ నిజాయితీ కళలు సాధ్యము  గానిధి జాతి కంతకే 

గార్ధభ దుష్టచేష్టలను కారణ జన్మల మార్పు కోరగన్ 

ప్రార్ధన జన్మభూమిగను పాఠ్యము తెల్పిన గాంధిజీవనమ్

****

పితురుల సంస్మరించుట వివేక విహీనుల కార్యమే కదా 

ప్రతి హతమైన వాక్కులవి పాఠము సర్వముగాను యేలనో 

గతి విధి యైన పెద్దలను ఘాతమొ నర్చిన ఒప్పు యేలనో 

పితురులవాక్కు ధర్మముయు బిడ్డల సంపద గాను సత్యమౌ

****

సమస్యను పరిష్కరించడం.

కాంతుని మోము చూడదట గౌరి, యదెంత విచిత్రమో గదా!

        

వంతులు కాని సేవలగు వ్యక్తికి గౌరవ మిచ్చి వాక్కు సా 

మంతుని ధైర్యాసంపదను మంచిని  నెంచియు ధర్మ కార్యమున్ 

శాంతిని కోరు బుద్ధిగను సాధన చేయుచు దైవ పూజ యే 

కాంతుని మోము చూడతట గౌరి యదేంత విచిత్రమో గదా

*****

ఖ్యాతిగ యిష్టభార్య కళ కామప్రవర్తన భూతలంబుగన్ 

ఖ్యాతిగ యిష్టసంపదయు కాలమనేసతి లీల జీవమున్ 

ఖ్యాతిగ బిడ్డలేచదువు గమ్యము చూపెడి సత్యధర్మమున్ 

ఖ్యాతిగ నేస్తమే మనసు కానుక గావిధి సర్వ వేళలన్

*****

ఆకృతి యానతీకొరకు యాశల వెల్లువ తీరు వేళ చా 

పాకృతి దాహయూపులగు పాశము బట్టియు లాగ బాణ దే 

హాకృతి సర్వవేళల సహాయ ప్రవర్తన కాల నీడ ధ

ర్మాకృతి మానవత్వమిట రమ్యత రక్షణ రాశిగాసుధీ

*****

No comments:

Post a Comment