Wednesday, 4 February 2026

 


_*


🚩మాఘ పురాణం - 9 వ అధ్యాయము🚩*_

*గంగా జలం మహిమ*

ఓ కార్తవీర్యార్జునా ! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి , వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి , మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంచలను తీర్చుకొనిరి. కనుక , పూజదు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా , గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు , శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని , *"గంగ గంగ గంగ"* అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక , మాఘమాసములో అంగాస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుదు వివరించెను.

కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండీరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను , బ్రాహ్మణ కన్యలాయువకుని అందము చూచి , మోహించి , అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా , ఆ విధ్యార్థియూ , మీరుకూడ పిశచులగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి , అందరిని బాదించి , ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి.

కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా పిశాచముల తల్లి దండ్రులు , తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగావారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు , గంధర్వులకు కూడ పవిత్రమైనది.

ఓక మాఘమాసములో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విస్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విస్వామిత్రుని , పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *"విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

🙏

Oooo

_*మాఘ పురాణం - 10 వ అధ్యాయము*_

*ఋక్ష కయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము*

పూర్వము భృగుమహాముని వంశమునందు ఋక్షకయను కన్య జన్మించి, దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు, పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి, విరక్తితో ఇల్లువిడిచి గంగానది తీరమునకుపోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుటవలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠమందేవుండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి "తిలోత్తమ" అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై "ఓయీ! మీకేమి  కావలయునో కోరుకొనుము" అని అనగా, "స్వామీ మాకు ఇతరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము" అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యెను.

బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులును మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాదిక్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి, ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి, దేవతలందరినీ తరిమివేసిరి, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని "మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి నానాభీబత్సము జేతుచున్నారు. కాన వారి మరణమునకు యేదైనా ఉపాయమాలోచించు" మని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి  "అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు ఇతరులెవరి వల్లను మరణము గలుగదని వరము నిచ్చియున్నాను. వారు వర గర్వముతో చాల అల్లకల్లోలము చేయుమన్నారు. కాన, నీవుపోయి నీచాకచక్యముతో వారికి మరణము కలుగునటుల ప్రయత్నించుము" అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు వున్న యరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమునూ విని ఆ దానవసోదరులు అటు నిటు తిరుగునట్లామెననుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండీరి, నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసురులారా! మిమ్ములను పెండ్ళియాడుట నాకు యిష్టమే. మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరియెడల సమాన ప్రేమతోనున్నాను. కాని ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కాని నాకోరిక యొకటి యున్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను  స్వంతముకాగలను అని చెప్పెను.

ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడననగా నేను బలవంతునని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి, గ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి, ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి, మద్దరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధము చేసిరి గదాయుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరిఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలూ తెగి క్రిందపడినవి, ఇద్దరూ చనిపోయిరి.

తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినందా తెలియపర్చగా బ్రహ్మ సంతోషించి,"తిలోత్తమా! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన, నీవు దేవలోకమునకు వెళ్ళుము, దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు"వని పంపెను.

Oooo

_* భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 

మాఘ పురాణం - 11 వ అధ్యాయము*_

*భీముని ఏకాదశివ్రతము*

సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నదిలేనిచోట తటాకమందుగాని, తటాకము కూడా అందుబాటులో లేనియెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునానదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.

అతడు చిన్నతనములో గడుసరి, పెంకివాడు, అతడు తల్లితండ్రుల భయభక్తులవలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను, తనకున్న ధనమును తాను తినడు, యితరులకు పెట్టడు, ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. "అయ్యో! నేనెంతటి పాత్ముడనైతిని ధనము, శరీరబలము వున్నదను మనోగర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా" అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనమూ, బంగారమూ యెత్తుకొని పోయిరి.

అనంతుడు నిద్రనుండి లేచి చూడగా, అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలనీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి సానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసిపోవుచూ 'నారాయణా' అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను, అని వశిష్టుడు తెలియజేసెను.

పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు యేకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతోయుండెను. అదేమందువా! "ఏకాదశీనాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా! అని విచారించి, తన పురోహితుని కడకు బోయి, ఓయీ పురోహితుడా అన్ని దినములకంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి", అని భీముడు అడిగెను.

అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు "అవును భీమసేనా! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక, అన్ని జాతులవారును యేకాదశీ వ్రతము చేయవచ్చును" అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని, "విప్రోత్తమా! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగధ్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున, యేకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము", అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి "రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనేకార్యము చేసినను కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహాశ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశిరోజు పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు యిరువదినాలుగు ఏకాదశులలో మాఘశుద్ద ఏకాదశి మహాపర్వదినముగాన, ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన, ఓ భీమ సేనా! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు" అని వివరించెను.


ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని "భీమ ఏకాదశి" అని పిలుతురు. అంతియేగాక, ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజుతో నిటులపలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైనదినమో, అదేవిధముగా మాఘ చతుర్దశి అనగా, శివచతుర్దశి. దీనినే 'శివరాత్రీ యని అందురు. అది యీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందురోజున వచ్చెడి దీనినే 'మహాశివరాత్రి" అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది.

Ooooo

_*మాఘ పురాణం - 12 వ అధ్యాయము

*శూద్ర దంపతుల కథ*

వశిష్ఠమహర్షి దిలీపునితో మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు , వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించ లేకపోవు చున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. *"అమ్మా నేను బాటసారిని అలసినవాడను , చలి , చీకటి మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే  వెళ్లిపోదునని"* ఇంట నున్న కుముదను అడిగెను. ఆమెయు వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో ఆ బ్రాహ్మణుని యదృష్టమో యజమానియగు సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒక చోట బాగుచేసి కంబళిమున్నగు వానినిచ్చి , పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలపాడుచుండెను.

కుముద *"ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు యెచటికి పోవుచున్నావని యడిగెను. అప్పుడా విప్రుడు "తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును , అందులకై ఇట్లు వచ్చితిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను , కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెను. తన అభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు , అనారోగ్యమునకు , ధనవ్యయమగును వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి. నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు ఇంటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసికొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి.*


అప్పుడామె విష్ణుదూతలారా ! నామాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు  అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగ నరకమునకు పోవలసియున్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు నీ కిష్టము కాకున్నను , భయమువలన గాని , పతిభక్తి వలన గాని నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నొందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడామే నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా !  మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీటమునిగి లేచెను కదా ! బలవంతముగ చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా ! ఆవిధముగా జూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.


అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని పట్టికలో నన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీజలమున పడుట , నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున , నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన నితడు ఇష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి.రాజా ! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి , విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి , యిష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని , యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.


మానవుడు తెలిసికాని , తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పని సరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయును , తన పనులను నూరింటినైనను వదలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లుకాక స్నానము , పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా , పురాణశ్రవణము , దానము యధాశక్తి గా పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి , కృష్ణవేణి , నర్మద , తుంగభద్ర , సరస్వతి , గోకర్ణ , ప్రభాస , కోణభద్ర , గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను , కూడ ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరును వారెట్టి వారయినను మాఘస్నానము పూజ , పురాణశ్రవణము , దానము వీనినన్నిటినిగాని , కొన్నిటిని యధాశక్తిగ చేయుటయే వారికి పాపతరణోపాయము , మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠమహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.

🙏

.......

*MAAGHA PURANAM -- 13**13వ అధ్యాయం*

శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట

వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలముతో దిలీపుడు -

“మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినాలి అన్న కోరిక కలుగుతున్నది. ఇంకా చెప్పవలసినద” ని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను.

పూర్వము పార్వతీదేవికి శివుడు, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్యము గురించి చెప్పి ఉన్నారు. శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు ప్రమథగణములు సేవిస్తు ఉండగా , నానారత్న విభూషితమైన కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జనని పార్వతీదేవి వచ్చి, భర్త పాదములకు నమస్కరించి “స్వామీ! మీవలన అనేక పుణ్య సంగతులు తెలుసుకున్నాను. ప్రయాగ క్షేత్ర మహాత్యమును, మాఘమాస మహాత్యమును వినవలెనని కోరిక ఉన్నది. ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాన” ని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసముతో -

దేవీ! నీ అభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము. సూర్యుడు మకరరాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఏ మనుష్యుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే గాక జన్మాంతమందు మోక్షమును పొందును. మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగుతుంది. జీవనది ఉన్నా లేకున్నా పాదము మునుగునంత నీరు ఉన్నచోట గాని, తటాకమందు గాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలమును ఇచ్చుటయే గాక సమస్తపాపములు తీరి పోతాయి. రెండవరోజు స్నానం చేసిన విష్ణులోకమునకు వెళ్ళగలరు. మూడవ నాటి స్నానం వలన విష్ణుదర్శనము కలుగుతుంది. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుష్యునకు మరుజన్మ ఉండదు.

దేవీ! మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకరరాశియందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా – నదిగానీ, చెరువుగానీ, నుయ్యి గానీ, కాలువ గానీ, లేక పాదము మునుగునంత నీరున్నచోట గానీ ప్రాతఃకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని, విష్ణ్వాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం చెప్పనలవి కాదు.

ఏ మానవునకైననూ తన శరీరంలో శక్తిలేక, నడువలేనటువంటి వాడు, గోవుపాదం మునుగునంత నీరున్న ఏ సెలయేరునందైనను, బావియందైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవిస్తున్నా వాని కష్టములు మేఘమువలె విడిపోయి విముక్తుడవుతాడు. ఎవరైనను తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నాన మాచరించిన యెడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కుతుంది. మాఘమాసమంతట ప్రాతఃకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున దీపం వెలిగించి ప్రసాదం సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక ఎన్నటికి పునర్జన్మ కలుగదు. ఒక్క పురుషులే గాక స్త్రీలు కూడా ఇది ఆచరించవచ్చును. మానవుడు నరజన్మము ఎత్తిన తరువాత మరల ఘోరపాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీస్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తిపొందుట శ్రేయస్కరము. ఇది మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం. ఓ పార్వతీ! ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టి వాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరిస్తాను సావధానురాలివై ఆలకించు.


నేను తెలియచేసిన విధముగా ఏ మనుష్యుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున జపముగానీ, విష్ణుపూజ గానీ, యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టి వాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవిస్తాడు. కుంభీ నరకములో పడద్రోయబడి, అగ్నిలో కాల్చబడును. రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడి సలసల కాగు తైలములో వేయబడి భయంకర యమకింకరులచే పీడింపబడతాడు. ఏ స్త్రీ వేకువ ఝాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి, తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామలకు సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీకి అయిదవతనం వర్ధిల్లి, ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తుంది. ఇది ముమ్మాటికీ నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో, అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క మొదలైన జన్మములు ఎత్తి హీనస్థితి పొందుతుంది. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైనను, జవ్వనియైనను, మాఘస్నానము ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో ఉన్న కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది.

```

          `ఘ పురాణం*14 వ అధ్యాయం

మాఘ పురాణం   పదునాల్గవ  అధ్యాయములో….        పూర్వం, గంగానది ఒడ్డున నివసించిన ఒక బ్రాహ్మణుడు, సంతానం లేని లోటుతో బాధపడుతూ, శ్రీహరిని పూజించి వరం కోరుకున్నాడు. అతని నిష్టకు మెచ్చిన శ్రీహరి, కుమారుడిని వరంగా ఇచ్చాడు. కానీ, ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నారదుడి ద్వారా కుమారుడు పన్నెండేళ్లకే మృతి చెందుతాడని తెలుసుకున్న బ్రాహ్మణుడు, భార్యతో కలిసి విచార సముద్రంలో మునిగిపోయాడు. అయితే, భార్య ధైర్యం చెప్పి, మరణం తప్పనిదని, శోకించడం వ్యర్థమని చెప్పింది. తన భక్తి నిజమని నిరూపించాలని బ్రాహ్మణుడు మళ్లీ శ్రీహరిని ఆరాధించాడు.

అతని భక్తికి మెచ్చిన శ్రీహరి, కుమారుడికి సుదీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు. ఈ కథ, ధైర్యం, భక్తి యొక్క ఫలితాలను చాటిచెప్పడమే కాకుండా, మాఘమాస వ్రతం యొక్క మహిమను కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే, ఈ వ్రతం ద్వారా ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు కలుగుతాయని పూర్వకాలపు ఋషులు చెప్పేవారు. అంతేకాకుండా, ఈ వ్రతం మనసుకు శాంతిని, ఆత్మకు తృప్తిని కలిగించి, జీవితంలోని కష్టాలను దాటే శక్తినిస్తుంది. ..

*విప్రుని పుత్ర ప్రాప్తి:*```

గృతృనమద మహర్షిని చూసి జహ్నముని యిట్లనెను. “మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా?, నా సందేహమును తీర్చుమ”ని అడుగగా మహర్షి ఇట్లు చెప్పెను. 

“జహ్నమునీ! వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు, పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును, అందు వల్ల సంతుష్టుడైన మానవుడు ఇంకను హరి ప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞానియై సత్కర్మల నాచరించి ముక్తినందును. అటువంటి కథని ఓక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను..

‘పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. అతడు వేద వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయజ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారిరువురికి  సంతానము లేదను లోటు తప్ప మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచార పడుచున్న ఆ బ్రాహ్మణుడు ఓక నాడు భార్యతో “గుణవంతుడు అయిన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను”. 

అప్పుడు ఆమె ‘నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదు అని అనుకొందును’ అని సమాధానము ఇచ్చెను. 

అప్పుడు ఆ  బ్రాహ్మణుడు ‘ప్రియా కష్టతరమైన తపమును ఆచరించి  అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టి పరచెదను. పుత్ర వరమును కోరుదు’నని చెప్పెను. 

కష్టతరమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్ర వరమును కోరెదననియు పలికెను. 

ఆ దంపతులు ఇరువురు తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరి.

బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరినిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. 

కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణి భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితోనుండెను. శాంత భూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగ ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీసమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను.

తనను గమనించక తీవ్రతరమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వుతో  “విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని” అని పలికెను. ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. 

అతనికి ఎట్టి వరమునైన ఈయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనంద పరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లు స్తుతించెను.```      

*విప్ర కృత విష్ణు స్తుతి:*

నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |

నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||

గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |

కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||

లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |

అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||

యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |

జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||

సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |

కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||

నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |

విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||

సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |

హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||

పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |

ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||

జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |

వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||

జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |

ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||

నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |

గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||

కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |

కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||

సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |

భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||

నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |

నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||```

శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము.

జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతిస్తూ ఆనంద పరవశుమై  నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొనమనెను.

శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు “స్వామీ! నీ పదములనందు నాకు నిశ్చలమైన భక్తిని ఇమ్ము, ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమని కోరెను. 

శ్రీహరి “నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదు”నని పలికి యంతర్థానయ్యెను. 

బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కిలి  లాభము అందినవానివలె సంతసింసించు తన ఇంటికి చేరెను. 

కొంత కాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.

కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములేయని చెప్పి తన దారిని తాను పోయెను. 

ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విశచుచుండెను. విచార వదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. “నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితిని చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్ర శోకము నెట్లు సహింపగలను?” అని భర్తతో పలికెను.

ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు నామెనోదార్చి నిశ్చయించెను. ఆమె నూరడించుచు యిట్లనెను. ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయేట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా! మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కాని మృత్యువునకు లేదు కదా. కావున నీవును శోకింపకుము జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు.

అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపుము” అని ఆమెను ఊరడించెను మరియు నిరర్థకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ ఉండుము” అని పలికి మరల గంగా తీరమున చేరి నియమ నిష్ఠలతో శ్రీహరిని సర్వ ఉపచారములతో పూజించుచుండెను. 

శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. 

శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను.✍️```

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

---*MAAGHA PURANAM -- 15*

*15వ అధ్యాయము*

*శిష్యుడు పశ్చాత్తాపము పొందుట*

సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించారని శివుడు పార్వతికి తెలియచేసాడు.

నీలకంఠుని పార్వతీ దేవి -

“నాధా! సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియచెప్పారు. సుబుద్ధి శిష్యుడు సుమిత్రుడు ఏమైనాడు? అతడు ఏ స్థితిలో ఉన్నాడు? వినకుతుహలముగా ఉన్నద” ని కోరగా శివుడు ఈ విధముగా చెప్పసాగాడు.

“సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగక్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపము కలిగింది. తాను చేసిన పాపమునకు ఫలితము అనుభస్తున్నాన’ ని పశ్చాత్తాప మనస్కుడై గురువు గారి వద్దకు పోయి పాదములపై పడి “గురువర్యా! నేను మహా పాపిని అయ్యాను. క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోబడి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని. అది నాదోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి వెళుతుండగా దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుకుంటూ నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నావెంట వచ్చి, నేను అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టుక్రింద విశ్రమించగా మెల్లగా నాచెంత చేరి నన్ను మంచిమాటలతో వంచించి తన కామవాంఛ తెలియచేసింది. నేను అందుకు ఒప్పుకోలేదు. నన్ను బలవంత పెట్టినది. నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభం లేదని “నాతో నీవు క్రీడించపోతే నీ ఎదుటనే ప్రాణత్యాగము చేస్తాన” ని చెప్పేసరికి నాకు భయము కలిగి నిజముగా ఆమె ప్రాణత్యాగము చేసుకున్నచో మీరు నన్ను దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీ లేదు. అయినను నేను మహాపాపము అనుభవిస్తున్నాను. నేను ఎటుల పాపరహితుడను కాగలనో సెలవిమ్మ” ని బ్రతిమాలాడు.

శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వశించి తన కుమార్తె వలె తన శిష్యుని గూడ పాపరహితుని చేయాలని ఎంచి “సుమిత్రా! నీపాప కర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నువ్వు మావలె పాపరహితుడవు కాగలవు. నువ్వు గంగానదీ తీరమునకు వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరములు తపస్సు చెయ్యి. ఆ తపస్సుచే కలుగు ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినట్లు నశించిపోతుంద” ని శిష్యునికి చెప్పాడు.

“ధన్యోస్మి ధన్యోస్మి” మీ ఆజ్ఞ ప్రకారము నేనిప్పుడే ప్రయాణము అవుతున్నాను” అని గురువుగారికి నమస్కారము చేసి గంగానదీ తీరమునకు ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్ళు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెళ్ళాడు. అక్కడ మనోహరమైన ఆహ్లాదము ఒనరించు దృశ్యములు కనిపించినవి. కౄరమృగములు, సాధుజంతువులు కలసిమెలసి తిరుగుతున్నాయి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి. పరస్పర వైరుధ్యములు ఏ మాత్రము కనిపించలేదు. ప్రకృతి రమణీయత మనస్సునకు ఆనందము కలిగిస్తున్నది. ఆ ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొనుటకు ఒక వటవృక్షము క్రింద విశ్రమించి నలుదిశల పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది. వెంటనే లేచి ఆశ్రమం వద్దకు వచ్చి తొంగిచూడగా ఆ ఆశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ వస్త్రములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనము చేస్తున్నారు. మధ్యమధ్య శ్రీహరి విగ్రహము పై అక్షతలు వేసి “హరిహరీ”యని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేస్తున్నారు. ఆ దృశ్యమంతటినీ సుమిత్రుడు కనులార చూసాడు. పూజ పూర్తయిన తరువాత అందరూ ప్రసాదం సేవించారు. బైట కూర్చుని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదము ఇచ్చారు అతడు - “స్వామీ! మీరు ఆచరించిన వ్రతము ఏమిటి ? దీనివలన ఏమి ఫలితము కలుగుతుంది ? మనుష్యుడు పాపరహితుడు అవుతాడా ? నా సందేహములను తీర్చవలసిందని వేడుకొంటున్నాను” అని వినయముగా ఆ మునిసత్తములను అడిగాడు.

పాపముచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అక్కడ ఉన్న వారు మాఘమాసమందు ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు వారిలో ఒకరిని నియమించారు. ఆ మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యమును ఇట్లు వివరించెను. “విద్యార్థీ! మేము చేసినది మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేసిన పాపములన్నింటినీ నశింపచేయును. రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అవి అన్ని పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా, పాపము లన్నియు నశించిపోతాయి. మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు స్నానం చేయు మనుష్యుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీస్నానము ఒనర్చువారు వైకుంఠ వాసులు అవుతారు. అలాగ చేయనివాడు, అసత్యములు పలికేవాడు, పెద్దలను, గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్వము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు. ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జన సమర్ధము ఉండు చోట మలమూత్రములను విడచుట, గుర్రములను, పశువులను, కన్యలను ఇతరులకమ్ముట, మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసినవారితో సమానము.

-

*మాఘ పురాణం - 16 వ అధ్యాయము*

*విద్యాధర పుత్రిక కథ*

*రాజా!మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని మరల యిట్లు పలికెను, పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగాతీరమున తపము చేయుచుండెను, నియమవంతుడై భక్తి శ్రద్దలతో చిరకాలము తపమాచరించెను, అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను, పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను,అప్పుడు బ్రహ్మ "నయనా!నీకు పుత్ర సంతానయోగము లేదు అయినను నీ తపముకై మెచ్చి పుత్రిక ననుగ్రహించుచున్నానని"* *అంతర్దానమునందెను, ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని,తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను, విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను,వివాహము చేసినను అల్లుని కూడ నా యింటనే యుంచుకొందునని  నిశ్చయించుకొనెను, ఒకనాడొక రాక్షసుడామెను చూచెను,ఆ రక్షసుడు దేవీ భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను,కోరిన రూపము ధరింపగల  శక్తిని కూడ సంపాదించెను,           ఆ రక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను, ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను,ఆ రక్షసుడు మిక్కిలి శక్తిమంతుదు, శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను,శివుడును వానికి శూలమునిచ్చుచు"ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని"చెప్పి యిచ్చెను,వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై యెవరిని లెక్కచేయక ప్రవర్తించుచుండెను.*

------------------------------------

*అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి"సుందరీ! నన్ను వరించుమని యడిగెను,ఆమెయు               నా తండ్రినడుగుమని చెప్పెను,రాక్షసుడును విద్యాధరుని వద్దకు         పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను, విద్యాధరుడు వానికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను, రాక్షసుడు చేయునది లేక మరల వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగ సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను.న, శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను, విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను,             ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను,రాక్షసుడు అందుకు అంగీకరించెను, అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును,        ఈలోపున నిన్నేమియు బాదింపను,నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా నామెయేమియు మాటలాడలేదు,రాక్షసుడు మరల మరల నడుగగా* *'నాకిప్పుడేమి అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది, దర్శించి పూజించుటకు శివలింగమెచటనున్నదో చూపూ మని అడిగెను,        ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను,విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి* *సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను, ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను, అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను,* *ఆశ్చర్యపడి'అమ్మాయి! నీవిచటనున్నావేమని అడిగెను,ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను, రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.*

---------------------------------------

*నారదుడామె చెప్పినదంతయును వినెను,అమ్మాయీ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును,అతడే నీ భర్త విచారింపకుము,                నా మాటను నమ్ముము, నీకొక ఉపాయమును చెప్పెదను వినుము,ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు, మాఘమాసమున నీవీ సరస్సు స్నానమాచరింపుము గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము, మాఘమాసమంతయు ఇట్లు చేయుము,ఇట్లు చేసిన వారు కోరినది లభించును, శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును, మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును,         నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.*

---------------------------------------

*విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను, మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను,నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను, మాఘమాసమును వ్రతముతో గడపెను, నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను, ఆరాజు సర్వకాల సర్వా వస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును, అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును,వారిని హరీయని ఆహ్వానించును, విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును, శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును, దామోదరాయనుచు భుజించును, కేశవాయనుచు నిద్రించును, నరసింహాయని స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు తిరుగును,ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును,ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారదమహర్షి వెళ్లెను.*

---------------------------------------

*హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను,నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు,                                      ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి,సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను,                   ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును        అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను, హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను,నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను,హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను,ఆ సమయమున రాక్షసుడింట లేడు,అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను అతడు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను, రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను, రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను,ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను,రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను,                     ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను,వానిని భర్తగా వరించెను, హరిద్రధుడును ఆమెను వివాహమాడెను,                 ఆ దంపతులును విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి, చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి,                          అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.*                                    --------------------------------------

No comments:

Post a Comment