Saturday, 4 February 2017

*ప్రాయమ్ము (కవిత)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

యోగీశ్వరో మహాసేనః
కార్తికేయోగ్నినందనః౹

స్కందః కుమారః సేనానీః
స్వామీ శంకరసంభవః౹౹


గాంగేయస్తామ్రచూడశ్చ
బ్రహ్మచారీ శిఖిధ్వజః౹
తారకారి‌రుమాపుత్రః
క్రౌంచారిశ్చ షడాననః౹౹


శబ్దబ్రహ్మసముద్రశ్చ
సిద్ధఃసారస్వతో గుహః౹
సనత్కుమారో భగవాన్
భోగమోక్షఫలప్రదః౹౹


శరజన్మా గణాధీశ
పూర్వజో ముక్తిమార్గకృత్౹
సర్వాగమప్రణేతా చ
వాంఛితార్థప్రదర్శనః౹౹


అష్టావింశతి నామాని
మదీయానీతి యః పఠేత్౹
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో
మూకో వాచస్పతిర్భవేత్౹౹


మహామంత్రమయానీతి
మమ నామానుకీర్తనమ్౹
మహాప్రజ్ఞామవాప్నోతి
నాత్ర కార్యా విచారణా౹౹

 
Image may contain: 8 people, people smiling, people sitting and indoor


మేని సొగసులతో కొత్త ఆరాటంగా

వంకర టింకర కొత్త ఆలోచనలతో పిచ్చి
ప్రాయపు టెక్కు బిగువు చూపుగా
వాయలు వాయనాలాతో విరాజిల్లే పిచ్చి 

యోవనంలో పువ్వుల్ని హాత్తు కుంటే
వృద్ధాప్యంలో అవే ముల్లుగా మారుతాయనే పిచ్చి 
మాటల్లోని యదార్ధాన్ని తాత్వికతను
గ్రహిస్తే మనస్సుకు ఎంతో ప్రశాంతత కలిగించని పిచ్చి  

కేళీవిలాసాల మౌళిలా బాటలో
పరువెత్తి శరీరాన్ని పాడుచేసు కొనే పిచ్చి
భవిషత్తు నిర్మాణంలో చేయూత ఇస్తూ
శక్తి సామర్ధ్యాలను దేశం కొరకు పంచే పిచ్చి

ప్రాయమ్ము వరమౌను ప్రాజ్ఞుడౌను
ప్రాయమ్ము అగ్ని, రెచ్చిపోక చల్లగా ఉంచే పిచ్చి
ప్రాయమ్ము సద్వినియోగం సుభంబౌను
ప్రాయమ్ము జీవనకృతుకు సేవగా పంచే పిచ్చి
  --((*))--

వేలుపు వేదన, వేడి వేడి ఆలోచన
కలుపు శోధన, కేళి కేళి ఆలోచన
తలుపు సాధన, కేర్ కేర్ ఆలోచన   
మలుపు మధన, మల్లి మల్లి ఆలోచన
 


చీకటి వెలుగు

నామదిలో నీ ప్రేమను దాచాను, నీకోసం  వేచి ఉన్నాను, వసంతాలు గడచినా మదిలో ఉన్నది.  మాత్రం మాయ మవుట లేదు, అది నీ మాయో లేదా నా ప్రేమో నాకు తెలియుట లేదు,
కాలాలు మారుతున్నాయి, కానీ రోజు వచ్చే గాలి నా యద తాకి నన్ను ఇబ్బంది పెడుతున్నది.
నేను చూడలేని నా కళ్ళల్లో ఎదో మెరుపు మెరుస్తున్నట్లు ఉన్నది. ఎవరో నాకళ్ళను ఆకర్షించుతున్నట్లు ఉన్నది. నా కలలు నెరవేర్చుకునే సమయ మొచ్చి నట్లున్నది.        

వయసు పెరగ కుండా, సమయం మించ కుండా, పెదాలను అందించాలని, మోనం వీడి, మనసు విప్పి, నీ హృదయ తపన తగ్గించాలని, నీ మనస్సుకు ప్రశాంతత కల్పించాలని, పరిమళాల శ్వాసను అందిందించాలని, నవ్వుల సుస్వర రాగాలను అందించాలని,  కని పించని గాలితో, వినలేని కదిలే ఆకులతో, ఆపలేని కదిలే నీరుతో, నిత్యము సంచరించే ఉదయభానునితో మొరపెట్టుకున్నా, నా ఆకలి తీర్చమని.    

చీకటిలో నక్షత్ర వెలుగు, చల్లని పిల్లగాలి, హృదయ తాపము తగ్గించలేక పోతున్నాయి, వంటి మీద వస్త్రం బరువుగా మారుతున్నది, ఆకు సవ్వడికే ఉలిక్కి పడుతున్నాను, ఆలోచనల నుండి తేరుకునే దెప్పుడో, ఆశలు నెరవేరే దెప్పుడో, ఆకలి తీరేదెప్పుడో , ఈ మంచుని కరిగించే వేడిగా రావా, మల్లెతీగలా కరములతో భందించవా, ఈ పువ్వు పరిమాళాలను పొంది అననందం అనుభవించావా, నన్ను కమ్మిన మాయను తొలగించావా, ఈ కళ్ళ కన్నీరు తొలగించి ఆనంద భాపాలుగా మార్చావా, ఆకు పై ఉన్న నీటి బిందువును నేను, ఆవిరి కాకముందే అందుకొనేదెవరో

రచయత మల్లాప్రగడ  రామకృష్ణ
 

Friday, 3 February 2017

*శాంతి (ఛందస్సు )

 

పంజలి ప్రభ

సమయమూ వ్యర్ధమూ - చేయుటే ఎందుకూ
విజయమే స్వర్గమూ   - దైవమే దీవెనా
జయమునే కోరుటే  -  భావమే అర్ధమే
భయమునే వీడుటే - ప్రేమనే పొందుటే    

ధవళ - 
tlacina pani


ఆధారము - హేమచంద్రుడు (ఊర్వశి), జయకీర్తి (కౌముది), దుఃఖభంజనకవి (పరివృఢము) నడక - ఖండగతి 

పరివృఢము (ఊర్వశి, కౌముది) - న/త/త/త/గ IIIU UIU – UIU UIU 
13 అతిజగతి 2344 

రమణుఁడే దూరమై - రాక యిందుండఁగా 
తిమిరమం దుంటి నే - దీధితుల్ వద్దుగా 
భ్రమలలో మున్గి నే - బాధతోఁ దేలితిన్ 
సుమము లింకెందుకే - శోకమే నాదిగా 

అమల పుష్పమ్ములన్ - హారముల్ గ్రుచ్చనా 
కమల నేత్రమ్ములన్ - గావ్యముల్ వ్రాయనా 
విమల నీకివ్వనా - ప్రేమ పీయూషమున్ 
మమత నిండారఁగా - మాటలే రావుగా 

పరివృఢా నీకు నా - వందన మ్మిత్తురా 
వరద నీ రాకతో - పావన మ్మౌదురా 
చరణ రాజీవముల్ - చాలు నా మన్కికిన్ 
సరళ రాగమ్ముతో - స్వామి నేఁ బాడెదన్ 

చిబుకమం దుండెనే - చిన్న యా మచ్చలో 
సొబగులే సోనలై - సుందరీ పారెనో 
కుబుసమం దాడు యా - కోడె నాగమ్ములోఁ 
బ్రబలెఁగా నంద మా - పాము కాటేయునో 


పథ్యా (ప్రథితా, వసుధా, మంజరీ) - 

ఇది కూడ పంచ మాత్రల వృత్తమే. ఇందులో చివరి రెండు గణములు స్రగ్విణిలోవలె ర-గణములు. మొదటి రెండు పంచ మాత్రలు - సల, భలములు. ఇది వృత్తరత్నాకరములో, జయకీర్తి చందోనుశాసనములో పేర్కొనబడినది. క్రింద నా ఉదాహరణములు - 

పథ్యా (ప్రథితా, వసుధా, మంజరీ) - స/జ/స/య/లగ IIUI UIII – UIU UIU 
14 శక్వరి 4844 

రమణీయమైన శుభ - రాత్రిలోఁ బ్రేయసీ 
కమనీయమైన కల - కంఠమున్ బాడుమా 
విమలమ్ము గీతికలు - ప్రేమ గంగా నదుల్ 
సమమిందు దీనికగు - సామ నాదమ్ములే 

కన నిప్పు డీవసుధఁ - గాంచఁగాఁ గాంచన 
మ్మన నౌను పత్రముల - యందమౌ రంగులన్ 
మనమిందుఁ గోరె నిను - మాలతీ మంజరుల్ 
విను మిందుఁ బద్యమున - విచ్చె నా వాక్కులై 

తను విప్డు సన్నగిలెఁ - దప్తమై పథ్యమున్ 
దిన నౌనె కమ్మఁగను - తీవ్ర రూక్షమ్ములో 
ననిశమ్ము దల్తు నిను - నాశతోఁ బ్రేమతోఁ 
గనిపించ దెందులకు - కాంతితోఁ బథ్యముల్ 
(మొదటి పథ్యము జ్వరములో ఇవ్వబడు ఆహారము, రెండవ పథ్యమునకు అర్థము మార్గము) 

వెలిగించు దీపమును - వేగ మీ చీఁకటిన్ 
గలిగించు స్వర్ణమయ - కాంతి చాపమ్ములన్ 
దొలగించు బాధలను - తూర్ణమై నాదు మై 
పులకించు నీ వసుధఁ - బూర్ణ మోదమ్ముతో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

om sri ram- sri matrenama:

*శాంతి లేక (ఛందస్సు )

శాంతి లేదు నిన్ను చూడగా 
బ్రాంతి చెందె నీవు ఉండినా
కాంతి రాదు మానసమ్మునా
వెల్తి నాలో వేద నమ్ముగా

నవ్వు లేక నల్గి పోతినే 
పువ్వు చూసి ముర్సి పోతినే 
ఇవ్వు అన్న ఇవ్వ పోతివే  
కొవ్వు అన్న నోరు విప్పలా

ప్రేమ నీదె సృష్టికిన్ సదా
వాణి నీవే  విధ్యకిన్  సదా
జ్యోతి  నీవే భూతలమ్ము పై
స్వాతి నీవే మబ్బు లమ్మపై

సిద్ది పొంద లేక ఉంటినే
బుద్ధి చిన్న బోయి ఉంటినే   
చద్ది తిన్న భీతి గొంటినే
ఇచ్చి పుచ్చు కుంటే మంచిదే 

వట్టి మాట ఇప్పు డేందుకే
గట్టి మూట పట్టి తీస్తివా
తట్టి లేప నిద్ర రాదులే
మట్టి నమ్మే బ్రత్కు నాదిలో

జ్యోతి నీవె భూతలమ్ముపై
భాతి నిచ్చు భాస్కరా రవీ
హేతువీవె సృష్టికిన్ సదా
చేతనమ్ము జీవితమ్ములో
--((*))--



నేటి కవిత  - ప్రాంజలి ప్రభ  
రచయిత : మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ   
ఓ మనిషీ!  తెలుసుకో   
ఓ మనిషీ!! తెలుసుకొని మసలుకో 

చేష్ట వెనుక చేవ ఎంతో?
ప్రేమ వెనుక ఆశ ఎంతో?
మాట వెనుక భక్తి ఎంతో ?
మంచి వెనుక చెడ్డ ఎంతో ?

సారం వెనుక సాధన ఎంతో?
వేషం వెనుక వేతన ఎంతో ?
మౌనం వెనుక మోసము ఎంతో ?
గానం వెనుక గాత్రము ఎంతో ?

ప్రశంస వెనుక ప్రతిభ ఎంతో?
ప్రలోభ వెనుక ప్రభొధ ఎంతో 
ప్రవేశ వెనుక ప్రభవ మెంతో 
ప్రమాద మెనుక  ప్రజలు ఎంతో   

అందం వెనుక పొందిక ఎంతో?
దాహం వెనుక ఆకలి ఎంతో ?
లాభం  వెనుక నష్టము ఎంతో ? 
స్నేహం వెనుక దానము ఎంతో ? 

పంట వెనుక పరిశ్రమ ఎంతో?
మంట వెనుక ఒకక్రియ ఎంతో 
వంట వెనుక  నిజభృతి  ఎంతో 
గంట వెనుక గనస్రుతి ఎంతో 

కథనం వెనుక మథనం ఎంతో?
మురిపం వెనుక వినయం ఎంతో ?
పరువం వెనుక  నరకం ఎంతో ?
ప్రణయం వెనుక ప్రళయం  ఎంతో ? 

విజయం వెనుక వినియోగం ఎంతో?
ఫలితం వెనుక పనియోగం ఎంతో ?
చరితం వెనుక కధయోగం ఎంతో ?
వినయం వెనుక విధియోగం ఎంతో ?

ప్రగతి వెనుక ప్రయాసం ఎంతో?
ప్రతిన వెనుక  ప్రమాదం ఎంతో 
ప్రజల వెనుక ప్రమోదం ఎంతో 
ప్రతిభ వెనుక ప్రయోగం ఎంతో 

నిజం వెనుక నిజాయితీ ఎంతో?
గళం  వెనుక సరాగమే  ఎంతో ?
దళం వెనుక దయాగుణం ఎంతో ?
భయం వెనుక మనోజవం  ఎంతో ? 

జీవితం వెనుక జీవితార్థం ఎంతో?
కీలకం వెనుక కామితార్ధం ఎంతో 
లోలకం వెనుక లోభితార్ధం ఎంతో 
భొజనం వెనుక ఆశపాశం  ఎంతో 

ఓ మనిషీ!  తెలుసుకో   
ఓ మనిషీ!! తెలుసుకొని మసలుకో 


**** *** *****

*మంటల భావాలు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: 

*మంటల భావాలు 

ఎప్పుడూ ఏదో మండుతూనే వుంటుంది
మంటలు అంటుకుంటూనే వుంటాయి
కోరల నాల్కలు  నమిలి మింగేసి
బూడిద వూసేస్తూ!

వెచ్చదనానికి కరిగిపోయి
చలిమంటేనని ముట్టుకుంటే
చురుక్కుమంటుంది…
మంటనంటించి మంట మాయమవుతుంది!
మంటే మిగులుతుంది

కూరుకున్న బుర్ర బాంబై బద్దలవుతుంది
లేస్తున్న విమానం నిప్పుముద్దవుతుంది
మధ్యవేసిన పచ్చగడ్డి భగ్గుమంటుంది
ఆకలేసిన దూడ అరుస్తుంది

భస్మాసుర హస్తం
అదిమిపట్టిన ఒత్తిడికి
అక్కడో అగ్నిపర్వతం లావా కక్కుతుంది
ఇక్కడో గ్యాసు బావి బ్లో-ఔట్ అవుతుంది
అంటుకున్న అరణ్యాలు అంత తొరగా ఆరవు
ఆర్పడానికి కొంపల్లో నీళ్ళూ వుండవు

ఎక్కడో చమురు కాలుతున్న వాసన…
వంటిల్లే వల్లకాడు!
శవాలకు స్పర్శ తెలీదు
అయినా ఎర్రగా అంతటా ఏడుపు-
అయినా గొంతుకలు మర్యాదగానే నడుచుకుంటాయి
అయినా లేక అందుకే
ఇంకో అగ్గిపుల్ల ముద్దు పెట్టుకోకమానదు.

--((*))--

Thursday, 2 February 2017

*కవిత ఎండు ఆకు (కవిత)

 ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రే నమ:



*కవిత ఎండు ఆకు (కవితా)

పండు టాకులుగ మరి
ఎండు కాయలు డొల్లగా మారి
పండు తాకులు రాలినట్లుగా 
మండు టెండలకు తట్టుకోక విలవిలలాడే 

పూలు పూయుట లేదు
సెలవు పెట్టింది వసంత ఋతువు కాదు
వలకపోసే మనసు లేదు
నులక మంచముమీద నిద్ర రావటము లేదే

తెర వెనుక కధలు
తెరచాప లేని నావలా ఊగిస లాటలు
తరుము తున్న తరంగాలు   
తరుణమంతా ధారపోసిన గుర్తింపు లేదులే

గాలి సెగలకు తట్టుకోలేక
గాలి పటంలా ఎగిరి తెగిన పటములా మారక
అలల అల్లరి చూడలేక
కలల కల్లోలం ఎవ్వరికి చెప్పుకోలేక తికమకే   

వ్యర్ధమైన వాడని పూలలా
స్వార్ధ బుద్ధి లేని దివిటీలా
అర్ధపు మాటలు అర్ధమయ్యేలా
తీర్ధము త్రాగినా దేవుని పిలుపు రాదులే

వృద్దాప్యం ఎండుటాకు సమానము
- అయిన కర్తవ్యం మరువదు వృద్ధాప్యము  

ఒక నెరజాణ యైన వేశ్య ఒక విటుని గురించి తన కూతురి కిని, మనుమరాలికి చెప్తూ అతనితో జాగ్రత్త యని హెచ్చరిస్తూ చూపిన పద్యం.
నగపగతు పగతు పగతుని
పగతుండగు మగధ రాజు బరిమార్చిన యా
జగజ్జెట్టి యన్న తండ్రికి 
దగువాహనమైన యట్టి ధన్యుండితడే


వివరణ:--నగపగతుడు=ఇంద్రుడు (ఇంద్రుడు పర్వతములను ఖండించాడుకదా!)
అతని విరోధి=నరకాసురుడు, వాని విరోధి= కృష్ణుడు, అతని విరోధి =జరాసంధుడు,
అతనిని చంపినవాడు= భీముడు, అతని యన్న=ధర్మరాజు, ధర్మరాజుతండ్రి=యముడు అతని వాహనము =దున్నపోతు. అంటే అతను సరసము తెలియని దున్నపోతు అని అన్యాపదేశంగా హెచ్చరిస్తున్నది.

"తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్ “||
ఇదొక సమస్య

శైశవచాపల్యము! (శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి సౌజన్యముతో)
“లలితాకారు కుమారు షణ్ముఖుని తా లాలించి ౘన్నిచ్చుచో
గళలగ్న గ్రహరత్న దీప్తకళికా గాంభీర్య హేమాంచితో
జ్జ్వల రత్న ప్రతిబింబితాననములన్ శంభుండు వీక్షింపగా
తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్ “||
“పార్వతీదేవి పసిపిల్లవాడైన ఆరుముఖాలున్న కుమారస్వామివారిని లాలిస్తూ,
శైశవమౌగ్ధ్యంతో వెలిగిపోతున్న ముద్దుమోములని ముద్దాడుతూ, నిమురుతూ,
శిశుస్కందులవారికి, ఒక్కొక్క బులిబుల్లినోటికి తన మహనీయస్తన్యాన్ని
మహాభావుకతా పారవశ్యంతో త్రావిస్తోంది. శిశుగుహులవారు స్తన్యం సేవిస్తున్నారు. ఆ
మహాదేవి, తన కంఠసీమలో నవరత్నాల పతకంవున్న అందమైన హారం ధరించింది.
ప్రక్కనేవున్న శంకరదేవులు ఈ ముచ్చటని ప్రీతితో గమనిస్తున్నారు. పాలు త్రాగుతున్న
శిశుషణ్ముఖుని ఆరుముఖాలలోని పసిబుగ్గలు, నవరత్నాల వివిధ వర్ణకాంతి
కిరణ వైభవంతో వెలుగులీనుతూ, కదులుతున్నాయి. ఆ కాంతికిరణాల మహాభాగ్యం
ఏమిటంటే, అవి, బుల్లి అయ్యవారి బుజ్జిబుగ్గలని అమితమైన గారాబంతో తెగ
నిమురుతూ, వదలకుండా ముగ్ధమోహనంగా అలవిమీరి ముద్దులాడేస్తున్నాయి.
ముద్దూ-ముచ్చటా తెలిసినవారు ఎవరుమాత్రం అంతటి అద్భుత అవకాశాన్ని
జారవిడుచుకుంటారు? ఆ సన్నివేశానికి సంబరపడుతూనే నవరసాభినయ ఉద్గమ
ఆస్పదుడైన చిదంబరేశ్వరుడగు మహాశివుడు, ఈ అందాలనుంచి చూపు మరల్చి,
అటు నవరస సంకేతాలైన నవరత్నాలనిపరిశీలిస్తే, తొమ్మిది రత్నాలలోను, ఒక్కొక్క
రత్నంలో ఆరేసి కార్తికేయుడి ముఖాలు వివిధరసస్ఫూర్తితో విరాజిల్లుతున్నాయి.
మొత్తంగా చూస్తే, 6×9=54 ముఖాలు లెక్కకొచ్చేయి.
శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి
“చాటుపద్య రత్నాకరము“లో ఈ సమస్య ప్రస్తావించబడింది. మనకి సుపరిచితులైన, శ్రీ
మోచర్ల వెంకన్నగారు ఈ సమస్యని పూర్తిచేసేరు. నెల్లూరుసీమకిచెందిన వెంకటగిరి
రాజావారైన, శ్రీ వెలుగోటి యాచేంద్ర గారి ఆస్థానంలో, ఆయన సమక్షంలో
పూరించబడినట్లుగా ఐతిహ్యంద్వారా తెలుస్తోంది.
డా:R.V.కుమార్, రసజ్ఙభారతి సౌజన్యంతో--
-----

Wednesday, 1 February 2017

kavitalu


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: 

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


* వేంకటేశా  * వేంకటేశా  * వేంకటేశా
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ 


కవితను వ్రాద్దామను
కున్నాను వేంకటేశా
నా ప్రేరణ నీవేకదా,
నీ రుచులు అభిరుచులు తెలుపవా

గాత్రం తో పాడుదామను
 కున్నాను వెంకటేశా
నీ నిద్ర భంగం చేయలేను,
అయిన ఏ రాగంలో పాడాలో తెలుపవా

ప్రేమ తపన నన్ను
ఆవరిస్తున్నది వేంకటేశా
కోరిక ఇదని చెప్పలేను,
అయిన అనుభవశాలివి నీవే తెలుపవా

దాహం తీర్చాలని
తపిస్తున్నాను వేంకటేశా
దాహం తీర్చలేను,
అయిన దాహం తీర్చే దారి తెలుపవా

దూరం భయం నన్ను
వెంబడిస్తుంది  వేంకటేశా
అది నీపై కోరికని చెప్పలేను,
అయిన దగ్గిర మార్గం తెలుపవా

నీ స్నేహం కోసం
అర్ధిస్తున్నాను వేంకటేశా    
సరస్వం నీకే అర్పిస్తున్నాను,
అయిన మనస్సుకు శాంతి తెలుపవా

ఆశలు నన్ను తరుము
తున్నాయి వేంకటేశా
కావ్యాన్ని వ్రాయలనుకున్నాను,
 అయిన ఎలా వ్రాయాలో తెలుపవా 

ద్యాస అంతా నీ దగ్గరే
 ఉంది వేంకటేశా
ధ్యానం చేస్తున్నాను,
అయిన నీపై ఏకాగ్ర దృష్టి ఎలాగో తెలుపవా

శ్రావ్యంగా గానం చేయాలను
కున్నాను వేంకటేశా
లక్ష్యాలను అధికమిస్తున్నాను,
 అయిన లక్ష్యానికి దారి చూపలేవా

దాన, ధర్మాలు
చేస్తున్నాను వేంకటేశా
అనురాగభంధలో ఉన్నాను,
అయిన భందాలకు విముక్తి తెలుపవా

చీకటిలో ఏమిచేయాలో
తెలియకున్నాను వెంకటేశా
వెలుగు చూడలేకున్నాను
 అయిన నా మస్తకమునందు వెలుగు నింపలేవా

బంధానికి అతీతుడనై
ఉండ లేకున్నాను వేంకటేశా
భక్తి  భావనలో ఉన్నాను,
అయిన భాగ్యం కలిగించే మనస్సు అందించవా

జగత్తు కోసం ఏమి చేయాలో
 తెలపాలి వేంకటేశా
అభినయించ గలను,
 అయిన నటనా సూత్రధారివి కదా ఎలాగో తెలుపవా

భంగిమలా బ్రతకాలను
కున్నాను వెంకటేశా
నాట్యం చేయాలనుకున్నాను,
 అయిన వశీకరణం  ఎలాగో తెలుపవా

ఉచ్వాస వద్దన్నా
వెంబడిస్తున్నది వేంకటేశా
నిశ్వాస ఎలా చేయగలను,
అయిన ప్రకృతిలో ఎలా బ్రతకాలో తెలుపవా

తనువంతా నీకే
అర్పిస్తున్నాను వేంకటేశా
ప్రాణాలను నీదగ్గరే ఉంచుతున్నాను,
 అయిన నీలో ఇక్యమార్గం తెలుపవా 

ఓం శ్రీ రామ వేంకటేశా
ఓం శ్రీ కృష్ణ వేంకటేశా
ఓం కార వేంకటేశా     
నమో నమ: నమోనమ: నమోనమ:
--((*))--


*ప్రస్థానం ( భగవానుడు)

పట్టు పీతాంబరముల.. చుట్టుకొనువాడు..
పసిడి కట్ల పిల్లoగ్రోవి ధరియించువాడు ..
కాటుక తో అందగించు కనులవాడు
శిఖిని పింఛమమరిన. చిన్నవాడు.

వెలుగు విరజిమ్ము మోమువాడు
నీలి జలదంపు మేని వన్నె వాడు
సాధు జనులను రక్షించు వాడు
ప్రేమతో పిలిస్తే ప్రత్యక్షమయ్యె వాడు

ఆకాశం లో శాంతి నెలకొను వాడు
భూమండలం లో శాంతి నెలకొనువాడు
సముద్రజలం లో శాంతి నెలకొనువాడు
సమస్త ప్రాణులలో శాంతి నెలకొనువాడు

పాడ మంజీరా రవళుల పడుచువాడు
కరుణ సారించు దృక్కుల కన్నయ్యవాడు
వేణు నాదమ్ము జగము లూగించువాడు
సకల జీవుల ఉల్ల మలరించువాడు.

భక్తి, రక్తిని బోధించ అవతారమొందినాడు
భక్త కోటిని బ్రోచిన భాగవతుడు.. వాడు.
ఇహమునకు .పరమునకు ఈప్సితమునకు
ముక్తి.. మార్గమ్ము జూపెడి.గీతాచార్యుడతడు.

ప్రకృతి పరిధిని, మించి రక్షించు వాడు
పరిమితులను దాటి ధర్మాని కాపాడేవాడు
ఏదో దేహంలో మనుష్యు ల్లో దేవుడై ఉంటాడు
లీలలను ప్రదర్శిస్తూ ఆగమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు
--((*))__



వెనుకనున్నవిలువ
మనిషీ! ఓ మనిషీ!!
చేష్ట వెనుక
చేవ ఎంతో?

అందం వెనుక
పొందిక ఎంతో?
కథనం వెనుక
మథనం ఎంతో?
విజయం వెనుక
వినియోగం ఎంతో?
సారం వెనుక
సాధన ఎంతో?
ప్రశంస వెనుక
ప్రతిభ ఎంతో?
పంట వెనుక
పరిశ్రమ ఎంతో?
ప్రగతి వెనుక
ప్రయాసం ఎంతో?
నిజం వెనుక
నిజాయితీ ఎంతో?
మనిషీ! ఓ మనిషీ!!
జీవితం వెనుక
జీవితార్థం ఎంతో?
**** *** *****