Thursday, 18 July 2019

Image may contain: 1 person, indoor
విష్ణువు వేయి నామములు- 1-1000
1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
3) వషట్కార: - వేద స్వరూపుడు.
4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.
6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.
7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
10) పూతాత్మా - పవిత్రాత్ముడు.
11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.
12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.
13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు.
14) పురుష: - నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు.
15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు.
16) క్షేత్రజ్ఞ: - శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.
17) అక్షర: - నాశరహితుడు.
18) యోగ: - యోగము చే పొందదగిన వాడు.
19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు.
20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత.
21) నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.
22) శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.
23) కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.
24) పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.
25) సర్వ: - సమస్తమును తానై అయినవాడు.
26) శర్వ: - సకల జీవులను సంహరింప జేయువాడు.
27) శివ: - శాశ్వతుడు.
28) స్థాణు: - స్థిరమైనవాడు.
29) భూతాది: - భూతములకు ఆదికారణమైన వాడు.
30) అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.
31) సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.
32) భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.
33) భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.
34) ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.
35) ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.
36) ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.
37) స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.
38) శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.
39) ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.
40) పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.
41) మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.
42) అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.
43) ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.
44) విధాతా - కర్మఫలముల నందించువాడు.
45) ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.
46) అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.
47) హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.
48) పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.
49) అమరప్రభు: - దేవతలకు ప్రభువైనవాడు.
50) విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.
51) మను: - మననము(ఆలోచన) చేయువాడు.
52) త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.
53) స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.
54) స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.
55) అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.
56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.
57) కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.
58) లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.
59) ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.
60) ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.
61) త్రికకుబ్ధామ - ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.
62) పవిత్రం - పరిశుద్ధుడైనవాడు.
63) పరం మంగళం - స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు.
64) ఈశాన: - సర్వ భూతములను శాసించువాడు.
65) ప్రాణద: - ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు.
66) ప్రాణ: - ప్రాణశక్తి స్వరూపమైనవాడు.
67) జ్యేష్ఠ: - వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు)
68) శ్రేష్ఠ: - అత్యంత ప్రశంసాపాత్రుడు.
69) ప్రజాపతి: - సమస్త ప్రజలకు పతి.
70) హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు.
71) భూగర్భ: - భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.
72) మాధవ: - శ్రీదేవికి భర్తయైనవాడు.
73) మధుసూదన: - మధువను రాక్షసుని వధించినవాడు.
74) ఈశ్వర: - సర్వశక్తి సంపన్నుడైనవాడు.
75) విక్రమీ - శౌర్యము గలవాడు.
76) ధన్వీ - ధనస్సును ధరించినవాడు.
77) మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.
78) విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.
79) క్రమ: - నియమానుసారము చరించువాడు.
80) అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.
81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.
82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.
83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
84) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.
85) సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.
86) శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.
87) శర్మ - పరమానంద స్వరూపుడు.
88) విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
89) ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.
90) అహ: - పగలువలె ప్రకాశించు వాడు.
91) సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.
92) వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.
93) ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.
94) సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.
95) అజ: - పుట్టుకలేని వాడు.
96) సర్వేశ్వర: - ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు.
97) సిద్ధ: - పొందవలసిన దంతయు పొందినవాడు.
98) సిద్ధి: - ఫలరూపుడైనవాడు.
99) సర్వాది: - సర్వమునకు మూలమైనవాడు.
100) అచ్యుత: - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు.
101) వృషాకపి: - అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు.
102) అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.
103) సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.
104) వసు: - సర్వ భూతములయందు వశించువాడు.
105) వసుమనా: - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.
106) సత్య: - సత్య స్వరూపుడు.
107) సమాత్మా: - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.
108) సమ్మిత: - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.
109) సమ: - సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు.
110) అమోఘ: - భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.
111) పుండరీకాక్ష: - భక్తుల హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు.
112) వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.
113) వృషాకృతి: - ధర్మమే తన స్వరూపముగా గలవాడు.
114) రుద్ర: - దు:ఖమును లేదా దు:ఖ కారణమును పారద్రోలువాడు.
115) బహుశిరా: - అనేక శిరములు కలవాడు.
116) బభ్రు: - లోకములను భరించువాడు.
117) విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.
118) శుచిశ్రవా: - శుభప్రధమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.
119) అమృత: - మరణము లేనివాడు.
120) శాశ్వతస్థాణు: - నిత్యుడై, నిశ్చలుడైనవాడు.
121) వరారోహ: - జ్ఞానగమ్యమైనవాడు.
122) మహాతపా: - మహాద్భుత జ్ఞానము కలవాడు.
123) సర్వగ: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
124) సర్వవిద్భాను: - సర్వము తెలిసినవాడు.
125) విష్వక్సేన: - అసురుల సేనలను నిర్జించినవాడు. తాను యుద్దమునకు ఉపక్రమించినంతనే అసురసేన యంతయు భీతితో పారిపోవుటచే భగవానుడు విష్వక్సేను డాయెను.
126) జనార్దన: - దు:ఖమును కల్గించువాడు. ఆనందము నొసగూర్చువాడు.
127) వేద: - మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు.
128) వేదవిత్ - వేదజ్ఞానమును అనుభవములో కలిగినవాడు.
129) అవ్యంగ: - ఏ కొఱతయు, లోపము లేనివాడు.
130) వేదాంగ: - వేదములనే అంగములుగా కలిగినవాడు.
131) వేదవిత్ - వేదములను విచారించువాడు.
132) కవి: - సర్వద్రష్ట యైనవాడు.
133) లోకాధ్యక్ష: - లోకములను పరికించువాడు.
134) సురాధ్యక్ష: - దేవతలకు కూడా తానే అధ్యక్షుడైనవాడు.
135) ధర్మాధ్యక్ష: - ధర్మాధర్మములను వీక్షించువాడు.
136) కృతాకృత: - కార్య, కారణ రూపములతో భాసించువాడు.
137) చతురాత్మా - విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు.
138) చతుర్వ్యూహ: - నాలుగు విధముల వ్యూహము నొంది సృష్టి కార్యములను చేయువాడు.
139) చతుర్దుంష్ట్ర: - నాలుగు కోరపండ్లు గలిగినవాడు.
140) చతుర్భుజ: - నాలుగు భుజములు కలిగినవాడు.
141) భ్రాజిష్ణు: - అద్వయ ప్రకాశరూపుడు.
142) భోజన: - భోజ్యరూపమైనవాడు.
143) భోక్తా: - ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు.
144) సహిష్ణు: - భక్తుల అపరాధములను మన్నించి క్షమించ గలిగినవాడు.
145) జగదాదిజ: - సృష్ట్యారంభముననే వ్యక్తమైనవాడు.
146) అనఘ: - పాపరహితుడైనవాడు.
147) విజయ: - ఆత్మజ్ఞానముతో వైరాగ్యసంపన్నుడై, శ్రేష్టమైన జయమునొందువాడు.
148) జేతా: - సదాజయము నొందువాడు.
149) విశ్వయోని: - విశ్వమునకు కారణభూతమైనవాడు.
150) పునర్వసు: - పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధుల నాశ్రయించువాడు.
151) ఉపేంద్ర: - ఇంద్రునికి పై నుండువాడు.
152) వామన: - చక్కగా సేవించదగినవాడు.
153) ప్రాంశు: - ఉన్నతమైన శరీరము గలవాడు.
154) అమోఘ: - వ్యర్ధము కాని పనులు గలవాడు.
155) శుచి: - తన దరిచేరు భక్తులను పవిత్రము చేయువాడు.
156) ఊర్జిత: - మహా బలవంతుడు.
157) అతీంద్ర: - ఇంద్రుని అతిక్రమించినవాడు.
158) సంగ్రహ: - ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటికి సంగ్రహించువాడు.
159) సర్గ: - సృష్టియు, సృష్టికారణమును అయినవాడు.
160) ధృతాత్మా - తనపై తాను ఆధారపడినవాడు.
161) నియమ: - జీవులను వారి వారి కార్యములలో నియమింపజేయువాడు.
162) యమ: - లోపలనుండి నడిపించువాడు.
163) వేద్య: - సర్వులచేత తెలుసుకొనదగినవాడు.
164) వైద్య: - సమస్త విద్యలకు నిలయమైనవాడు.
165) సదాయోగి - నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు.
166) వీరహా - ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు.
167) మాధవ: - అర్హులగువారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు.
168) మధు: - భక్తులకు మధురమైన మకరందము వంటివారు.
169) అతీంద్రయ: - ఇంద్రియములద్వార గ్రహించుటకు వీలులేనివాడు.
170) మహామాయ: - మాయావులకు మాయావియైనవాడు.
171) మహోత్సాహ: - ఉత్సాహవంతుడు.
172) మహాబల: - బలవంతులకంటెను బలవంతుడైనవాడు.
173) మహాబుద్ధి: - బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు.
174) మహావీర్య: - బ్రహ్మాండములను సృష్టించి, పోషించి, లయింపచేయు శక్తిసామర్ధ్యములు కలిగియున్నవాడు.
175) మహాశక్తి: - మహిమాన్విత శక్తిపరుడైనవాడు.
176) మహాద్యుతి: - గొప్ప ప్రకాశము అయినవాడు.
177) అనిర్దేశ్యవపు: - నిర్దేశించుటకు, నిర్ణయించుటకు వీలుకానివాడు.
178) శ్రీమాన్ - శుభప్రదుడు.
179) అమేయాత్మా - ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగినవాడు.
180) మహాద్రిధృక్ - మందర, గోవర్ధన పర్వతములను అవలీలగా ఎత్తినవాడు.
181) మహేష్వాస: - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.
182) మహీభర్తా: - భూదేవికి భర్తయై, రక్షకుడైనవాడు.
183) శ్రీనివాస: - శ్రీమహాలక్ష్మికి నివాస స్థానమైనవాడు.
184) సతాంగతి: - సత్పురుషులకు పరమగతి అయినవాడు.
185) అనిరుద్ధ: - మరొకరు ఎదురించువారు లేనివాడు.
186) సురానంద: - దేవతలకు ఆనందము నొసంగువాడు.
187) గోవింద: - గోవులను రక్షించువాడు.
188) గోవిదాం పతి: - వాగ్విదులు, వేదవిదులైనవారికి ప్రభువైనవాడు.
189) మరీచి: - తేజోవంతులలో తేజోవంతుడైనవాడు.
190) దమన: - తమకప్పగించబడిన బాధ్యతలనుండి తప్పిపోవు వారిని శిక్షించువాడు.
191) హంస: - నేను అతడే (అహం బ్రహ్మస్మి)
192) సుపర్ణ: - అందమైన రెక్కలు గలవాడు.
193) భుజగోత్తమ: - భుజంగములలో ఉత్తముడు.
194) హిరణ్యగర్భ: - బ్రహ్మకు పుట్టుకనిచ్చిన బంగారు బొడ్డుగల సర్వోత్తముడు.
195) సుతపా: - చక్కటి తపమాచరించువాడు.
196) పద్మనాభ: - హృదయపద్మమధ్యమున భాసించువాడు.
197) ప్రజాపతి: - అనంతజీవకోటికి ప్రభువైనవాడు.
198) అమృత్యు: - మరణముగాని, మరణ కారణముగాని లేనివాడు.
199) సర్వదృక్ - తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది,చేయునది అంతయు చూచుచుండువాడు.
200) సింహ: - సింహము. పాపములను నశింపజేయువాడు.
201) సంధాతా - జీవులను కర్మఫలములతో జోడించువాడు.
202) సంధిమాన్ - భక్తులతో సదాకూడియుండువాడు.
203) స్థిర: - సదా ఏకరూపము గలవాడు.
204) అజ: - పుట్టుకలేనివాడు.
205) దుర్మర్షణ: - అసురులకు భరింపశక్యము గానివాడు.
206) శాస్తా - శృతి, స్తృతుల ద్వారా శాసించువాడు.
207) విశ్రుతాత్మా - విశేషముగా శ్రవణము చేయబడినవాడు.
208) సురారిహా - దేవతల శత్రువులను నాశనము చేసినవాడు.
209) గురు: - ఆత్మవిద్యను బోధించువాడు.
210) గురుత్తమ: - గురువులకు గురువైనవాడు.
211) ధామ: - జీవులు చేరవలసిన పరమోత్కృష్ణ స్థానము.
212) సత్య: - సత్య స్వరూపుడు.
213) సత్యపరాక్రమ: - సత్యనిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు.
214) నిమిష: - నేత్రములు మూసుకొనినవాడు.
215) అనిమిష: - సదా మేలికొనియున్న వాడు.
216) స్రగ్వీ - వాడని పూలమాలను ధరించినవాడు.
217) వాచస్పతి రుదారధీ: - విద్యలకు పతియైనవాడు.
218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.
219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.
220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.
221) న్యాయ: - సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు.
222) నేతా - జగత్తు యనెడి యంత్రమును నడుపువాడు.
223) సమీరణ: - ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు.
224) సహస్రమూర్ధా - సహస్ర శిరస్సులు గలవాడు.
225) విశ్వాత్మా - విశ్వమునకు ఆత్మయైనవాడు.
226) సహస్రాక్ష: - సహస్ర నేత్రములు కలవాడు.
227) సహస్రపాత్ - సహస్రపాదములు కలవాడు.
228) ఆవర్తన: - జగత్ చక్రమును లేదా సంసార చక్రమును సదా త్రిప్పుచుండువాడు.
229) నివృత్తాత్మా - ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడు.
230) సంవృత: - అవిద్యారూపమైన మాయచే కప్పబడినవాడు.
231) సంప్రమర్దన: - తమోగుణ ప్రధానులైన అజ్ఞానులను పీడించువాడు.
232) అహస్సంవర్తక: - రోజులను చక్కగా నడిపెడి ఆదిత్యరూపుడు.
233) వహ్ని: - యజ్ఞములందు హోమకుండములలో హవిస్సును మోసెడి అగ్ని.
234) అనిల: - ప్రకృతిలో వాయు రూపమునను, ప్రాణులలో ప్రాణ రూపమునను ఉండువాడు.
235) ధరణీధర: - భూభారమును భరించువాడు.
236) సుప్రసాద: - చక్కని అనుగ్రహము కలవాడు.
237) ప్రసన్నాత్మా - రాగద్వేషాదులతో కలుషితముగాని పరిశుద్ధ అంత:కరణ కలవాడు.
238) విశ్వదృక్ - విశ్వమునంతటిని ధరించినవాడు.
239) విశ్వభుక్ - విశ్వమును భక్షించువాడు.
240) విభు: - బ్రహ్మ మొదలు సకల రూపములలో గోచరించువాడు.
241) సత్కర్తా - సజ్జనులను సత్కరించువాడు.
242) సత్కృత: - పూజ్యులచే పూజింపబడువాడు.
243) సాధు: - ధర్మప్రవర్తన గలవాడు.
244) జుహ్ను: - భక్తులను పరమపదమునకు నడిపించువాడు.
245) నారాయణ: - నరులకు ఆశ్రయమైనవాడు.
246) నర: - జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడుపువాడు.
247) అసంఖ్యేయ: -అనంతమైన నామరూపాదులు కలవాడు.
248) అప్రమేయాత్మా - అప్రమేయమైన స్వరూపము కలవాడు.
249) విశిష్ట: - శ్రేష్ఠతముడు. మిక్కిలి గొప్పవాడు.
250) శిష్టకృత్ - శాసనము చేయువాడు.
251) శుచి: - నిర్మలుడై, నిరంజనుడైనవాడు.
252) సిద్ధార్ధ: - పొందదగినదంతయు పొందినవాడు.
253) సిద్ధసంకల్ప: - నేఱవేరిన సంకల్పములు కలవాడు.
254) సిద్ధిద: - జీవుల కర్మానుసారముగా ఫలముల నందిచువాడు.
255) సిద్దిసాధన: - కార్యసిద్ధి కనుకూలించు సాధన సంపత్తి తానే అయినవాడు.
256) వృషాహీ - అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు.
257) వృషభ: - భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు.
258) విష్ణు: - సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు.
259) వృషపర్వా: - ధర్మమునకు భక్తుల ధర్మ సోపానములను నిర్మించినవాడు.
260) వృషోదర: - ధర్మమును ఉదరమున ధరించువాడు. (ప్రజలను వర్షించునదిగాయున్న ఉదరము గలవాడు.)
261) వర్ధన: - ఆశ్రితులైనవారి శ్రేయములను వృద్ధినొందిచువాడు.
262) వర్ధమాన: - ప్రపంచరూపమున వృద్ధినొందువాడు.
263) వివిక్త: - మాయాస్వరూపమగువాడు.
264) శృతిసాగర: - శృతులకు నిధియైనవాడు.
265) సుభుజ: - జగద్రక్షణము గావించు సుందరమైన భుజములు గలవాడు.
266) దుర్ధర: - లోకములను ధరించి తనను ఒరులు ధరించేందుకు వీలుపడని భూమాతను ధరించినవాడు.
267) వాగ్మీ - వేదజ్ఞానమును వెలువరించినవాడు.
268) మహేంద్ర: - దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు.
269) వసుద: - భక్తుల అవసరములను సకాలములో సమకూర్చువాడు.
270) వసు: - తాను ఇచ్చు ధనము కూడా తానే అయినవాడు.
271) నైకరూప: - ఒక రూపము లేనివాడై, అనేక రూపములు గలవాడు.
272) బృహద్రూప: - బ్రహ్మాండ స్వరూపము గలవాడు.
273) శిపివిష్ట: - సూర్యునియందలి కిరణ ప్రతాపము తానైనవాడు.
274) ప్రకాశన: - సర్వమును ప్రకాశింప చేయువాడు.
275) ఓజస్తేజో ద్యుతిధర: - ఓజస్సు, తేజస్సు, ద్యుతి కలవాడు.
276) ప్రకాశాత్మా - తేజోమయ స్వరూపుడు.
277) ప్రతాపన: - సూర్యాగ్నుల రూపమున భూమిని తపింపచేయువాడు.
278) బుద్ధ: - ధర్మ, జ్ఞాన, వైరాగ్యములకు నిలయమైనవాడు.
279) స్పష్టాక్షర: - ఓం అనెడి దివ్యాక్షరముద్వారా సూచించబడినవాడు.
280) మంత్ర: - వేదమంత్రముల ద్వారా తెలియదగినవాడు.
281) చంద్రాంశు: - చంద్రకిరణముల వంటివాడు.
282) భాస్కరద్యుతి: - సూర్యతేజమువంటివాడు.
283) అమృతాంశూధ్భవ: - చంద్రుని ఆవిర్భావమునకు కారణమైనవాడు.
284) భాను: - స్వప్రకాశ స్వరూపుడు.
285) శశిబిందు: - చంద్రునివలె ప్రజలను పోషించువాడు.
286) సురేశ్వర: - దేవతలకు ప్రభువైనవాడు.
287) ఔషధం - భవరోగహరమగు దివ్యౌషధము తానైనవాడు.
288) జగతస్సేతు: - ప్రపంచమునకు పరమాత్మకు మద్య వంతెనవంటివాడు.
289) సత్యధర్మ పరాక్రమ: - సత్యజ్ఞానాది ధర్మములు, పరాక్రమము కలవాడు.
290) భూతభవ్య భవన్నాద: - జీవులచే మూడుకాలములందు ప్రార్థించబడువాడు.
291) పవన: - సకలమును పవిత్ర మొనర్చువాడు.
292) పావన: - వాయువునందు చలనశక్తి కల్గించువాడు.
293) అనల: - ప్రాణధారణకు అవసరమైన అగ్ని స్వరూపుడు.
294) కామహా - కామములను అంతము చేయువాడు.
295) కామకృత్ - సాత్వికవాంఛలను నెరవేర్చువాడు.
296) కాంత: - అద్భుత రూపవంతుడై, సర్వులచే ఆకర్షింపబడువాడు.
297) కామ: - చతుర్విధ పురుషార్థములను అభిలషించువారిచే కోరబడువాడు.
298) కామప్రద: - భక్తుల కోర్కెలను తీర్చువాడు.
299) ప్రభు: - సర్వోత్కృష్టమైనవాడు.
300) యుగాదికృత్ - కృతాది యుగములను ప్రారంభించినవాడు.
301) యుగావర్త: - యుగములను త్రిప్పువాడు.
302) నైకమాయ: - తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి, ప్రదర్శించువాడు.
303) మహాశన: - సర్వమును కబళించువాడు.
304) అదృశ్య: - దృశ్యము కానివాడు.
305) వ్యక్తరూప: - భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు.
306) సహస్రజిత్ - వేలకొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు.
307) అనంతజిత్ - అనూహ్యమైన శక్తి సామర్ద్యములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించు శక్తి కలవాడు.
308) ఇష్ట: - ప్రియమైనవాడు.
309) అవిశిష్ట: - సర్వాంతర్యామియైనవాడు.
310) శిష్టేష్ట: - బుధజనులైన సాధుమహాత్ములకు ఇష్టుడైనవాడు.
311) శిఖండీ - శిరమున నెమలిపింఛమును ధరించినవాడు.
312) నహుష: - తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు.
313) వృష: - ధర్మస్వరూపుడైనవాడు.
314) క్రోధహా - సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు.
315) క్రోధ కృత్కర్తా - క్రోధాత్ములగువారిని నిర్మూలించువాడు.
316) విశ్వబాహు: - బాహువులు విశ్వమంతట కలవాడు.
317) మహీధర: - భూమిని ధరించినవాడు.
318) అచ్యుత: - ఎట్టి వికారములకు లోనుగానివాడు. ( ఎటువంటి మార్పు పొందనివాడు.)
319) ప్రధిత: - ప్రఖ్యాతి నొందినవాడు.
320) ప్రాణ: - అంతటా చైతన్య స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.
321) ప్రాణద: - ప్రాణ బలము ననుగ్రహించువాడు.
322) వాసవానుజ: - ఇంద్రునకు తమ్ముడు.
323) అపాంనిధి: - సాగరమువలె అనంతుడైనవాడు.
324) అధిష్టానం - సర్వమునకు ఆధారమైనవాడు.
325) అప్రమత్త: - ఏమరు పాటు లేనివాడు.
326) ప్రతిష్ఠిత: - తన మహిమయందే నిలిచియుండువాడు.
327) స్కంద: - అమృత రూపమున స్రవించువాడు.
328) స్కందధర: - ధర్మమార్గమున నిలుపువాడు.
329) ధుర్య: - సర్వ జీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు.
330) వరద: - వరముల నొసగువాడు.
331) వాయువాహన: - సప్త వాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు.
332) వాసుదేవ: - అంతటను నిండియున్నవాడు.
333) బృహద్భాను: - ప్రకాశవంతమగు కిరణతేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు.
334) ఆదిదేవ: - సృష్టి కార్యమును ప్రారంభించినవాడు.
335) పురంధర: - రాక్షసుల పురములను నశింపచేసినవాడు.
336) అశోక: - శోకము లేనివాడు.
337) తారణ: - సంసార సాగరమును దాటించువాడు.
338) తార: - గర్భ, జన్మ, జరా, మృత్యురూపమైన భయమునుండి తరింపజేయువాడు.
339) శూర: - పరాక్రమము గలవాడు.
340) శౌరి: - బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు.
341) జనేశ్వర: - జనులకు ప్రభువు.
342) అనుకూల: - సర్వులకు అనుకూలుడైనవాడు.
343) శతావర్త: - ధర్మ రక్షణార్థము అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు.
344) పద్మీ - పద్మమును చేతియందు ధరించినవాడు.
345) పద్మనిభేక్షణ: - పద్మమువంటి నేత్రములు కలవాడు.
346) పద్మనాభ: - పద్మము నాభియందుండువాడు.
347) అరవిందాక్ష: - కమలరేకులవంటి కన్నులు గలవాడు.
348) పద్మగర్భ: - పద్మగర్భమున నివసించువాడు.
349) శరీరభృత్ - ప్రాణుల శరీరములను పోషించువాడు.
350) మహర్థి: - మహావిభూతులు కలవాడు.
351) బుద్ధ: - ప్రపంచాకారముతో భాసించువాడు.
352) వృద్ధాత్మా - సృష్టికి పూర్వమే ఉన్నవాడు.
353) మహాక్ష: - గొప్ప నేత్రములు గలవాడు.
354) గరుడధ్వజ: - తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు.
355) అతుల: - సాటిలేనివాడు.
356) శరభ: - శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు.
357) భీమ: - భీకరమైన శక్తి సంపన్నుడు.
358) సమయజ్ఞ: - సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు.
359) హవిర్హరి: - యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు.
360) సర్వలక్షణ లక్షణ్య: - సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు.
361) లక్ష్మీవాన్ - సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు.
362) సమితింజయ: - యుద్ధమున జయించినవాడు.
363) విక్షర: - నాశములేనివాడు.
364) రోహిత: - మత్స్యరూపమును ధరించినవాడు.
365) మార్గ: - భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు.
366) హేతు: - సృష్టికి కారణము అయినవాడు.
367) దామోదర: - దమాది సాధనలచేత ఉదారమైన బుద్ధిద్వారా పొందబడువాడు.
368) సహ: - సహనశీలుడు.
369) మహీధర: - భూమిని ధరించినవాడు.
370) మహాభాగ: - భాగ్యవంతుడు.
371) వేగవాన్ - అమితమైన వేగము కలవాడు.
372) అమితాశన: - అపరిమితమైన ఆకలి గలవాడు.
373) ఉద్బవ: - ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.
374) క్షోభణ: - సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.
375) దేవ: - క్రీడించువాడు.
376) శ్రీ గర్భ: - సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.
377) పరమేశ్వర: - ఉత్కృష్ట మైనవాడు.
378) కరణమ్ - జగదుత్పత్తికి సాధనము అయినవాడు.
379) కారణమ్ - జగత్తునకు కారణమైనవాడు.
380) కర్తా - సమస్త కార్యములకు కర్తయైనవాడు.
381) వికర్తా - విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.
382) గహన: - గ్రహించ శక్యముగానివాడు.
383) గుహ: - వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.
384) వ్యవసాయ: - మానవాళి అభ్యున్నతికి తానే కృషిచేయువాడు.
385) వ్యవస్థాన: - సర్వవ్యవహారములను యధావిధిగ నడుపువాడు.
386) సంస్థాన: - జీవులకు గమ్యస్థానమైనవాడు.
387) స్థానద: - వారివారి కర్మానుసారముగా స్థానముల నందించువాడు.
388) ధృవ: - అవినాశియై, స్థిరమైనవాడు.
389) పరర్థి: - ఉత్కృష్టమైన వైభవముకలవాడు.
390) పరమస్పష్ట: - మిక్కిలి స్పష్టముగా తెలియువాడు.
391) తుష్ట: - సంతృప్తుడు.
392) పుష్ట: - పరిపూర్ణుడు
393) శుభేక్షణ: - శుభప్రధమైన దృష్టిగలవాడు.
394) రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.
395) విరామ: - సకలజీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.
396) విరత: - విషయ వాంఛలు లేనివాడు.
397) మార్గ: - మోక్షమునకు మార్గము తానైనవాడు.
398) నేయ: - ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు.
399) నయ: - జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు.
400) అనయ: - తనను నడుపువాడు మరొకడు లేనివాడు.
401) వీర: - పరాక్రమశాలియైనవాడు.
402) శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు.
403) ధర్మ: - ధర్మ స్వరూపుడు.
404) ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు.
405) వైకుంఠ: - సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు.
406) పురుష: - ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు.
407) ప్రాణ: - ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు.
408) ప్రాణద: - ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు.
409) ప్రణవ: - ఓంకార స్వరూపుడు.
410) పృథు: - ప్రపంచరూపమున విస్తరించినవాడు.
411) హిరణ్యగర్భ: - బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు.
412) శత్రుఘ్న: - శత్రువులను సంహరించువాడు.
413) వ్యాప్త: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
414) వాయు: - వాయురూపమున యుండి సకలమును పోషించువాడు.
415) అథోక్షజ: - స్వరూపస్థితి నుండి ఎన్నడును జాఱనివాడు.
416) ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు.
417) సుదర్శన: - భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.
418) కాల: - శతృవులను మృత్యురూపమున త్రోయువాడు.
419) పరమేష్ఠీ - హృదయగుహలో తన మహిమచే ప్రకాశించువాడు.
420) పరిగ్రహ: - గ్రహించువాడు.
421) ఉగ్ర: - ఉగ్రరూపధారి
422) సంవత్సర: - సర్వజీవులకు వాసమైనవాడు.
423) దక్ష: - సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు.
424) విశ్రామ: - జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు.
425) విశ్వదక్షిణ: - అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు.
426) విస్తార: - సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు.
427) స్థావర: స్థాణు: - కదులుట మెదలుట లేనివాడు.
428) ప్రమాణం - సకలమునకు ప్రమాణమైనవాడు.
429) బీజమవ్యయం - క్షయము కాని బీజము.
430) అర్థ: - అందరిచే కోరబడినవాడు.
431) అనర్థ: - తాను ఏదియును కోరనివాడు.
432) మహాకోశ: - అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు.
433) మహాభాగ: - ఆనంద స్వరూపమైన భోగము కలవాడు.
434) మహాధన: - గొప్ప ఐశ్వర్యము కలవాడు.
435) అనిర్విణ్ణ: - వేదన లేనివాడు.
436) స్థవిష్ఠ: - విరాడ్రూపమై భాసించువాడు.
437) అభూ: - పుట్టుక లేనివాడు.
438) ధర్మయూప: - ధర్మము లన్నియు తనయందే ఉన్నవాడు.
439) మహామఖ: - యజ్ఞస్వరూపుడు.
440) నక్షత్రనేమి: - జ్యోతిష చక్రమును ప్రవర్తింపచేయువాడు.
441) నక్షత్రీ - చంద్ర రూపమున భాసించువాడు.
442) క్షమ: - సహనశీలుడు.
443) క్షామ: - సర్వము నశించినను తాను క్షయ మెరుగక మిగిలియుండువాడు.
444) సమీహన: - సర్వ భూతహితమును కోరువాడు.
445) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.
446) ఇజ్య: - యజ్ఞములచే ఆరాధించుబడువాడు.
447) మహేజ్య: - గొప్పగా పూజింపదగినవాడు.
448) క్రతు: - యజ్ఞముగా నున్నవాడు.
449) సత్రమ్ - సజ్జనులను రక్షించువాడు.
450) సతాంగతి: - సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు.
451) సర్వదర్శీ - సకలమును దర్శించువాడు.
452) విముక్తాత్మా - స్వరూపత: ముక్తి నొందినవాడు.
453) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.
454) జ్ఞానముత్తమమ్ - ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు.
455) సువ్రత: - చక్కని వ్రతదీక్ష కలవాడు.
456) సుముఖ: - ప్రసన్న వదనుడు.
457) సూక్ష్మ: - సర్వవ్యాపి.
458) సుఘోష: - చక్కటి ధ్వని గలవాడు.
459) సుఖద: - సుఖమును అనుగ్రహించువాడు.
460) సుహృత్ - ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు.
461) మనోహర: - మనస్సులను హరించువాడు.
462) జితక్రోధ: - క్రోధమును జయించినవాడు.
463) వీరబాహు: - పరాక్రమముగల బాహువులు కలవాడు.
464) విదారణ: - దుష్టులను చీల్చి చెండాడువాడు.
465) స్వాపన: - తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞాన రహితులుగాజేసి నిద్రపుచ్చువాడు.
466) స్వవశ: - సర్వ స్వతంత్రమైనవాడు.
467) వ్యాపీ - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
468) నైకాత్మా - అనేక రూపములలో విరాజిల్లువాడు.
469) నైక కర్మకృత్ - సృష్టి, స్థితి, లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు.
470) వత్సర: - సర్వులకు వాసమైనవాడు.
471) వత్సల: - భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు.
472) వత్సీ - తండ్రి వంటివాడు.
473) రత్నగర్భ: - సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు.
474) ధనేశ్వర: - ధనములకు ప్రభువు.
475) ధర్మగుప్ - ధర్మమును రక్షించువాడు.
476) ధర్మకృత్ - ధర్మము నాచరించువాడు.
477) ధర్మీ - ధర్మమునకు ఆధారమైనవాడు.
478) సత్ - మూడు కాలములలో పరిణామ రహితుడై, నిత్యుడై ఉన్నవాడు.
479) అసత్ - పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు.
480) క్షర: - వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు.
481) అక్షర: - క్షరమగు ప్రపంచమున అవినాశియై భాసిల్లువాడు.
482) అవిజ్ఞాతా - తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు.
483) సహస్రాంశు: - అనంత కిరణములు గలవాడు.
484) విధాతా - సర్వమునకు ఆధారమైనవాడు.
485) కృతలక్షణ: - వేదశాస్త్రములను వెలువరించినవాడు.
486) గభస్తినేమి: - మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు.
487) సత్వస్థ: - అందరిలో నుండువాడు.
488) సింహ: - సింహమువలె పరాక్రమశాలియైనవాడు.
489) భూతమహేశ్వర: - సర్వ భూతములకు ప్రభువైనవాడు.
490) ఆదిదేవ: - తొలి దేవుడు.
491) మహాదేవ: - గొప్ప దేవుడు.
492) దేవేశ: - దేవదేవుడు.
493) దేవభృద్గురు: - దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు.
494) ఉత్తర: - అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.
495) గోపతి: - గోవులను పాలించువాడు.
496) గోప్తా - సర్వులను సంరక్షించువాడు.
497) జ్ఞానగమ్య: - జ్ఞానము చేతనే తెలియబడినవాడు.
498) పురాతన: - సృష్టికి పూర్వమే వున్నవాడు.
499) శరీరభూతభృత్ - శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.
500) భోక్తా - అనుభవించువాడు.
501) కపీంద్ర: - వానరులకు ప్రభువైనవాడు.
502) భూరిదక్షిణ: - యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.
503) సోమప: - యజ్ఞముల యందు యజింపబడిన దేవతలరూపముతో సోమరసమును పానము చేయువాడు.
504) అమృతప: - ఆత్మానందరసమును అనుభవించువాడు.
505) సోమ: - చంద్రరూపమున ఓషధులను పోషించువాడు.
506) పురుజిత్: - ఒక్కడై అనేకమందిని ఎదురించి, జయించగల్గినవాడు.
507) పురుసత్తమ: - ఉత్తములలో ఉత్తముడైనవాడు.
508) వినయ: - దుష్టులను దండించి, వినయము కల్గించువాడు.
509) జయ: - సర్వులను జయించి వశపరుచుకొనువాడు.
510) సత్యసంధ: - సత్యసంకల్పములు, సత్యవాక్కులు గలవాడు.
511) దాశార్హ: - దశార్హుడనువాని వంశమున పుట్టినవాడు.
512) సాత్వతాంపతి: - యదుకులమునకు ప్రభువు.
513) జీవ: - జీవుడు.
514) వినయితా సాక్షీ - భక్తుల యందలి వినయమును గాంచువాడు.
515) ముకుంద: - ముక్తి నొసగువాడు.
516) అమిత విక్రమ: - అమితమైన పరాక్రామము గలవాడు.
517) అంభోనిధి: - దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ నాలుగు వర్గములు అంభశబ్ధార్థములు, అంభస్సులు తనయందే ఇమిడి యున్నవాడు.
518) అనంతాత్మా - అనంతమైన ఆత్మస్వరూపుడు.
519) మహోదధిశయ: - వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు.
520) అంతక: - ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు.
521) అజ: - పుట్టుకలేనివాడు.
522) మహార్హ: - విశేష పూజకు అర్హుడైనవాడు.
523) స్వాభావ్య: - నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు.
524) జితమిత్ర: - శత్రువులను జయించినవాడు.
525) ప్రమోదన: - సదా ఆనందమునందుండువాడు.
526) ఆనంద: - ఆనందమే తన స్వరూపముగా గలవాడు.
527) నందన: - సర్వులకు ఆనందము నొసగువాడు.
528) నంద: - విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు.
529) సత్యధర్మా - సత్య, ధర్మ స్వరూపుడు.
530) త్రివిక్రమ: - మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు.
531) మహర్షి: కపిలాచార్య: - వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు.
532) కృతజ్ఞ: - సృష్టి, సృష్టికర్త రెండును తానైనవాడు.
533) మేదినీపతి: - భూదేవికి భర్తయైనవాడు.
534) త్రిపద: - మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము.
535) త్రిదశాధ్యక్ష: - జీవులనుభవించు జాగ్రుత, స్వప్న, సుషుప్త్య వస్థలకు సాక్షియైనవాడు.
536) మహాశృంగ: - ప్రళయకాల సాగరములోని నావను గొప్పదియైన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళ
☘ *మంచి కధ* ☘

తప్పక చదవండి

👌 *నిజమైన గుర్తింపు సాధనం*👌

👉ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.

రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.

👉కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.

అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.

రాజు చాలా ఆశ్చర్యపోయాడు.

👉అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.

దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.

👉రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.

👉రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది.

అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు.

అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.

👉కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..

రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.

అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.

👉రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది.

ఒక రాణి స్తాయి  వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు....

👉రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు

👉కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు.

ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు.

రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.

రాజుకు చాలా కోపం వచ్చింది.

కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు.

తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు.

మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని.

👉రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు.

👉అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు.

ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు...

☘మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!

🌺 *మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.*🌺

నక్కజిత్తులు

‘ఎవరది’ అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరకు గజాగజా వణుకుతూ చేరింది పిల్లి. ఎవరో వచ్చి తన ఎదురుగా నిలుచున్నారని గ్రహించింది గద్ద.‘‘ఎవరు నువ్వు’’ అడిగింది.

‘‘అయ్యా నా పేరు దీర్ఘకర్ణం. పిల్లిని’’‘‘పిల్లివా? నీకిక్కడేం పని? వెళ్ళిక్కణ్ణుంచి. లేదంటే చంపేస్తాను’’ బెదిరించింది గద్ద.

నేరకపోయి చెట్టెక్కేను. దీనిపాలబడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి.‘‘నాకిక్కడ చాలా పని ఉంది. పని మీదే వచ్చానిక్కడికి. మీరు వెళ్ళిపొమ్మంటున్నారు. వె ళ్ళకపోతేచంపుతానంటున్నారు. ఎలా ఇప్పుడు’’ అంది పిల్లి.

‘‘పనేంటసలు? ఎవరితో పని’’ అడిగింది గద్ద.‘‘మీతోనే పని’’‘‘నాతో నీకేం పని’’‘‘అయ్యా! నేను అన్ని పిల్లుల్లా కాదు. సాధుజంతువుని. శాఖాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజూ అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని. చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను.’

’‘‘ఉంటే’’ అడిగింది గద్ద.‘‘ఇంకేం లేదు. మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిటపట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పట్నుంచీ మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చాను.’’ అంది పిల్లి.

తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి.‘‘మీలాంటి పెద్దలతో మాట్లాడితే నాలుగు మంచి ముక్కలు చెవిన పడతాయి. నీతులూ, ధర్మాలూ తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది.

చంపుతానంటున్నారు.’’ బాధగా అంది పిల్లి.‘‘బాధపడకు! అసలు సంగతి ఏమిటంటే...ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళు ఉన్నాయి. ఆ గూళ్ళలో పిల్లలు ఉన్నాయి. పక్షిపిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా! అందుకు వచ్చావేమోనని అనుమానించాను.’’‘

‘రామ రామ! ఎంతమాట ఎంతమాట! పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటుంటే అందులో మళ్ళీ అన్నెం పున్నెం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకటా!! ఛఛ! ‘అహింస పరమో ధర్మః’ అన్నారు. అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట! భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను, పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా? అది ఊహించడానికే అసహ్యంగా లేదూ’’ అంది పిల్లి.

‘‘అది కాదు దీర్ఘకర్ణా’’ అని గద్ద ఏదో నచ్చజెప్పబోయేంతలో గద్ద మాటను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి.‘‘ఈ పాడుపొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరక్కుండా పోదు. ఆఖరికి నాలుగాకులు తిన్నాకడుపు నిండిపోతుంది. అంతేగాని, చెట్టు మీది పిల్లలను చంపి తింటానా? చేజేతులా నరకాన్ని కోరుకుంటానా? ఎంతమాట ఎంతమాట’’పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద. ‘అయ్యయ్యో, పొరబడ్డానే’ అనుకుంది. పిల్లిని ఇలా ఓదార్చింది.

--((***)))--

నేనో రైల్వే స్టేషన్ని . ఇదేంటి ఓ రైల్వే స్టేషన్ మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? నాకు జీవం లేకపోయినా ఎన్నో జీవితాలని దగ్గరి నుండి చూసిన అనుభవం ఉంది. నాకు ప్రాణం లేకపోయినా ఓ మనసుంది ఆ మనసుని కదిలించే మనుషులూ ఉన్నారు . ఆ మనుషుల కథలు చెప్పడానికే ఈ రోజు మీ ముందుకి వచ్చాను. రోజూ కొన్ని వేలమంది మనుషులని చూస్తుంటాను నేను,ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళు ఎక్కడినుండో వచ్చేవాళ్ళు. కలిసిపోయే మనుషులు విడిపోయే మనసులు. ఇలా ఎన్నో భావోద్యేగాలకి నేను సజీవ సాక్షిని . ఎన్నో కథలు రోజూ నా ఎదురుగా జరుగుతుంటాయి . కానీ ఒకే రోజు నా మనసుకి ఆనందం,భాద,హాయి, సంతోషం ,దుఃఖం ఇలా ఎన్నో రకాల భావాలు కలిగించిన ఐదుగురి జీవితాలను,వాళ్ళ కథలను మీకు చెప్పాలని ఈరోజు ఇలా వచ్చాను .

1.గూటికి చేరిన పక్షి

సమయం ఉదయం 9. 30

నాలుగేళ్ల వయసులో అమాయకంగా అయోమయంగా ఆకలితో అటు ఇటు తిరుగుతూ నా ఒడిలో వచ్చి చేరాడు , రెండు శరీరాలు కలిస్తే పుట్టాడు , ఇద్దరు మనుషులు విడిపోతే వాడు వీధినపడ్డాడు . అందరిలా చదువుకోవాలని వాడికోరిక కానీ వాడి రాత మరోలా ఉంది . కడుపు నింపుకోడానికి రోజంతా మొదటి ప్లాటుఫారంలో కాఫీ టీ లు అమ్ముతుండేవాడు ,రాత్రి చివరి ప్లాటుఫారంలో పడుకునేవాడు, ఐదేళ్లుగా వాడు నా దగ్గరే ఉంటున్నాడు . చదువంటే పిచ్చివాడికి,బాబుగాడికి ఒకటే కోరిక,వాడిలా ఎవరూ లేని పిల్లలకి చదువు చెప్పించాలని ,వాళ్లందరికీ తోడుగా ఉండాలని . ఆరోజు కూడా ఎప్పటిలానే కాఫీ టీ అమ్ముతూ తిరుగుతున్నాడు.ఎవరో ఒకాయన సుమారు 45ఏళ్ల వయసు, బాబుగాడి కోసం వెతుకుతున్నాడు. నిన్న రాత్రి చివరి రైలు కి దిగాడు అతను , ప్లాటుఫారంలో బాబు గాడ్ని వాడి పక్కన ఉన్న పాత పుస్తకాలని చూస్తూ నిలబడ్డాడు చాలాసేపు , తరువాత వెళ్ళిపోయాడు కాసేపటికి, మళ్ళి ఇప్పుడు బాబుకోసం వచ్చాడు. దూరంగా రైలు పెట్టె పక్కన నిల్చున్న బాబుగాడు కనిపించాడు ఆయనకి. ఆయన నిన్నే ఈ ఊరికొచ్చిన కొత్త కలెక్టరు గారంట . వీధిబాలలందరిని హాస్టల్ లో చేర్చి చదువు చెప్పించడం తన మొదటి పనిగాపెట్టుకున్నారట. బాబు గాడి దగ్గరికెళ్లి ఎం బాబు నీకు చదువంటే ఇష్టమా??? బాగా చదూకుంటావా?? నేను చదివిస్తా మరి,నాతో వస్తావా నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అక్కడ. వస్తావా అని అడిగాడు. బాబు గాడి మొహంలోఎప్పుడూ లేని ఆనందం , ఎగిరిగంతేసి మరీ ఒప్పుకున్నాడు,ఆ కలెక్టరు చేయి పట్టుకొని నాకు టాటా చెబుతూ ముందుకి కదిలాడు.

ఆశ కంటే ఆశయం గొప్పది,స్వచ్ఛమైన మనసు ,బలమైన సంకల్పం ఉంటె ప్రపంచమంతా తోడ్పాటునిస్తుంది అని బాబు గాడు రుజువు చేసాడు

గెలిచి నిలిచిన కేశవ్

సమయం ఉదయం 11. 30

కేశవ్ . దాదాపు నాలుగేళ్ల క్రితం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా గొడవపడి మరీ వచ్చేసాడు సినిమా కోసం. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని కేశవ్ కోరిక,మళ్ళీ ఇన్నాళ్ళకి చూసాను,కానీ ఇలా చూస్తానని అసలనుకోలేదు .దూరంగా అయిదో నెంబర్ ప్లాట్ఫారం మీద , బక్కపలచని శరీరం,పీక్కుపోయిన కళ్ళు , చిరిగిపోయిన బట్టలు . ఎవరి దగ్గరినుండో డబ్బులు కాజేసి పరిగెడుతున్నాడు, కేశవ్ ని తరుముతూ ఓ నలుగురు పరిగెడుతున్నారు, పరిగెత్తేఓపిక లేక ఆగిపోయాడు, ఎదురు తిరిగే శక్తి లేక దెబ్బలు తింటున్నాడు . దెబ్బలకి తాళలేక అరుస్తూ ఏడుస్తూ అలాగే సొమ్మసిల్లి పడిపోయాడు , చలనం లేదు ఒంట్లో, ఏమైందో అని కంగారు పడుతుంటే దూరం నుంచి cut .... shot ok .......అంటూ అరిచాడు డైరెక్టరు . చుట్టూ అందరూ చప్పట్లతో అభినందించారు కేశవ్ ని . టక్కున లేచి మానిటర్ దగ్గరికి వెళ్లి షాట్ చూసుకొని తన కల నిజం కాబోతున్నందుకు, త్వరలోనే తన పేరు వెండితెరపైచూడబోతున్నందుకు ఆనందంతో ఉద్వేగంతో చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకుంటూ తరువాతి షాట్ కోసం సిద్ధం అయ్యాడు .

పట్టుదల , ఆత్మ స్థైర్యం , నమ్మకం ఉంటె ఎవరైనా ఎంత గొప్ప లక్ష్యాన్ని అయినా చేరుకోవొచ్చు అని కేశవ్ నిరూపించాడు

మాస్టారి సంపాదన

సమయం సాయంత్రం 6. 00

రామనారాయణ మాస్టారు .. నడి వయసు యువకుడిగా ఉన్నప్పుడు జరిగింది ఆయనతో నా పరిచయం , ఇప్పుడు ఆయనకి ఓ మనవరాలు కూడా ఉంది . ముప్పై ఏళ్లుగా రోజూ ఉదయం ఎక్సప్రెస్ రైలులో ఉద్యోగానికివెళ్లడం,సాయంత్రం ప్యాసింజర్ రైలుకి రావడం .నాకు ఆయనకీ ఎంతో అనుబందం ఉంది . ఎప్పుడు హుషారుగా నవ్వుతూ ఉండేవారు మాస్టారు. కానీ ఈ మధ్య ఆ చలాకీతనం లేదు. ఇవాళ ఎందుకో ఎన్నడూ లేనంత దిగాలుగాఉన్నారు,రోజాటికంటె ఒక అరగంట ముందే వచ్చి మొదటి ప్లాటుఫారం లో నా ఒడిలో కూర్చున్నారు.కళ్ళ నిండా నీళ్లు , ఎదో చెప్పాలని ఉన్నా చెప్పలేక భాదపడుతూ ఉండిపోయారు . కారణం ఏమిటో తెలీదు . రైలు వచ్చిందివెళ్ళిపోయారు. సాయంత్రం ప్యాసింజర్ ఎప్పుడు వొస్తుందా అని ఎదురుచూడసాగాను . సాయంత్రం రైలు వచ్చింది,మాస్టారు దిగి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. చాలా దిగాలుగా ఉన్నారు . కళ్ల నిండా నీళ్లు,ఎదోపోగొట్టుకున్నాననే భాద మోహంలో తెలుస్తోంది,ఎందుకో తెలీని ఆందోళన , వణుకు ఆయన నడకలో తెలుస్తుంది. వేరే పెట్టె లోనుంచి కొంత మంది దిగారు,ఇంకో పెట్టె నుంచి ఇంకొంతమంది పిల్లలు పెద్దలూ కలుపుకొని దాదాపు 70,80మంది దిగి మాస్టారి దగ్గరికి కదిలారు. వాళ్ళని చూడగానే మాస్టారు ఎందుకో మరింత కంగారు పడ్డారు . వాళ్లంతా మాస్టారి దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ చేరి మాస్టార్ని ఓదారుస్తున్నారు . వాళ్ళుకూడా ఒకింత ఉద్వేగానికిలోనవుతున్నారు . వాళ్లంతా రామనారాయణ మాస్టారి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు. ఈ రోజు మాస్టారి రిటైర్మెంట్ . ముప్పై ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మందికి పుస్తకంలోని పాఠాలు, జీవిత పాఠాలు చెప్పారు. మాస్టారుచదువు చెప్పిన మొదటి బ్యాచ్ విద్యార్థులు నుండి ఇప్పుడు చదువుతున్న పిల్లల వరకు అందరూ ఆయనకి ఘనంగా సన్మానం చేసి ఇంట్లో దిగబెట్టడానికి వచ్చారు. అందరూ ఎక్కడెక్కడి నుండో వచ్చారు మాస్టారు కోసం . ఆయనఇన్నేళ్ళలో సంపాదించుకుంది వీళ్లందరి ప్రేమ అభిమానాలే .

నిబద్దత , అంకిత భావం తో పని చేస్తే అమూల్యమైన ఎన్నో జ్ఞాపకాలను . ఎప్పటికి తరగని గౌరవం ప్రేమ,ఆప్యాయతలను పొందవచ్చు అని రామనారాయణ మాస్టారు రుజువు చేసారు

4.రాధామాధవీయం

సమయం సాయంత్రం 8. 15

మూడో నెంబర్ ప్లాట్ఫారం దగ్గర మాధవ్ కోసం ఎదురుచూస్తుంది రాధ . ఆరింటికల్లా మాధవ్ రావాలి కానీ ఇంకా రాలేదు,నిముషాలు యుగాల్లా గడుస్తున్నాయి తనకి,చీకటి పడుతుంది కంగారు పెరిగిపోతుంది.ఇప్పటికే రెండు గంటలుఆలస్యం అయింది . వచ్చిన ప్రతీ లోకల్ రైల్లో వెతుకుతుంది మాధవ్ ఎక్కడా లేడు .సమయం గడిచే కొద్దీ రాధ లో భయం పెరిగిపోతుంది . ఎనమిది గంటలైంది .ప్లాట్ఫారం దగ్గరే బెంచి మీద దిగాలుగా ఏడుస్తూ కూర్చుంది రాధ . వెనకనుంచి ఎవరో మెల్లిగా నడుస్తూ రాధ భుజం మీద చేయి వేశారు . ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది రాధ . చేతిలో ఉన్న తన హ్యాండ్బ్యాగ్ తో అతన్ని దబదబా నాలుగు దెబ్బలు వేసింది . అతను బిగ్గరగా నవ్వుతూ అడ్డుకోబోయాడు. రాధకోపంతో తన చేత్తో కొట్టేసింది . అతని కళ్ళజోడు పడిపోయింది,చేతిలో ఉన్న కర్ర దూరంగా పడింది ,అతను కూడా కింద పడబోతుంటే టక్కున పట్టుకుంది రాధ .. వచ్చింది మాధవ్ . ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత ఆలస్యంచేసినందుకు కోపం తో ఇదంతా చేసింది రాధ

ప్రేమంటే ఏమిటో నాకు రాధ మాధవ్ లని చూసే దాకా తెలీదు .ఇద్దరు మనుషులు ,మనస్తత్వాలు కలిస్తేనే ప్రేమ అనుకునే మనుషులున్న ఈ కాలంలో , ఒకరినొకరు గౌరవిస్తూ, ఒకరికొకరు తోడు నడుస్తూ . ప్రేమంటే శాశ్వతమైనబంధం . అనిర్వచనీయమైన ఆనందం అని తమ ప్రేమకథతో నాకు తెలిసేలా చేసారు . మాధవ్ కి కళ్ళు కనిపించవు. ఓ ప్రమాదం లో తన కంటి చూపు పోయింది. మాధవ్ అద్భుతమైన రచయిత . మాటల్తో మనసుని కదిలించేలాకరిగించేలా రాయగలడు . మాధవ్ కవితలంటే రాధకి పిచ్చి . ఆలా ఒకరికొకరు పరిచయం అయ్యారు . ఆ పరిచయం ప్రణయం ,పరిణయం దాకా వెళ్ళింది. రాధ ఓ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్. మాధవ్ ప్రస్తుతం ఓ సినిమాకి మాటలు ,పాటలు రాస్తున్నాడు,రోజూ రైల్లో సినిమా ఆఫీసుకి వెళ్లి వస్తుంటాడు.సాయంత్రం రాధ మాధవ్ లు కలిసి ఇంటికి వెళ్తుంటారు. ఆలస్యం అయ్యేసరికి భయం తో కంగారుతో మాధవ్ ని ఆలా కొట్టేసింది రాధ .

ఈ ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టిన మనుషులు . రాధకి మాధవే బలం బాధ్యత . మాధవ్ కి రాధే ధైర్యం .

మాధవ్ రాసే కవితలకు కలం తానైతే కాగితం రాధ . ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు . ఒకరులేకపోతే ఇంకొకరు లేరు . అందుకే వాళ్లిద్దరూ 1+1 = 1

పడిలేచిన కెరటం ఫర్జానా

సమయం రాత్రి 9. 00

ఫర్జానా .ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీద మరో అరగంటలో రావాల్సిన రైలు కోసం ఎదురుచూస్తుంది. ఇపుడు నేను చూస్తున్న ఫర్జానా ,మూడు నెలల క్రితం నేను చూసిన ఫర్జానా వేరు . అప్పుడు తనో చలాకి అల్లరి పిల్ల . తన తండ్రి కలనే తన లక్ష్యంగా మార్చుకుంది . ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ ఫర్జానాకి తన తండ్రి అంటే. డాక్టర్ గా తన తండ్రి ముందు నిల్చోవాలని తన పట్టాని తండ్రికి అందివ్వాలని ఎన్నో కలలు కంది .కానీ అనుకున్నవి అన్నీ జరిగితే అని జీవితంఅవ్వదు . సరిగ్గా ఫర్జానా డాక్టర్ పట్టా అందుకున్న రోజునే పూంచ్ సెక్టార్ దగ్గర జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఫర్జానా తండ్రి మొహమ్మద్ నవాజుద్దీన్ వీర మరణం పొందాడు . నవాజ్ పార్థివదేహాన్ని తోటి సైనికులు జమ్మూ నుండితీసుకువచ్చారు . ఇదే మొదటి నెంబర్ ప్లాట్ఫారం మీదే గుండె పగిలేలా ఏడ్చిన ఫర్జానాని చూసి రాయినైన నాకే మనసు చెలించింది . ఏ తండ్రి కోరిక మీద డాక్టర్ అయ్యిందో ఆ తండ్రి నిర్జీవంగా పడి ఉండడం చూసి ఫర్జానా ప్రాణంతల్లడిల్లిపోయింది . తనకి ఇది ఎవరూ తీర్చలేని నష్టం.తను మళ్ళీ మాములు మనిషిగా మారడానికి చాలా సమయం పడుతుందనుకున్నా . కానీ మూడునెలలు కూడా గడవకముందే తనని చూసి ఆశ్చర్యపోవడం నా వంతైంది .ఇప్పుడు తను వెళ్తుంది జమ్మూ కి , అక్కడ ఆర్మీ హాస్పిటల్ లో డాక్టర్ గా తనకి ఉద్యోగం వచ్చింది . ప్రాణాలని లెక్కచేయక పోరాడే సైనికులకు వైద్యం చేయడానికి ఇప్పుడు తను బయల్దేరుతుంది . తండ్రి కోరిక మేరకు డాక్టర్ అయ్యింది. తండ్రి ఆశయం కోసం ఆర్మీ లో చేరింది . నవాజ్ ఎక్కడున్నా ఈరోజు ఫర్జానాని చూసి ఎంతో గర్వపడుతూ ఉంది ఉంటాడు .

తనిప్పుడు డాక్టర్ . ఫర్జానా ఫాతిమా D /o మేజర్. మహమ్మద్ నవాజుద్దీన్

ఇలాంటి మరికొందరి జీవితాలని మీకు పరిచయం చేయడానికి మళ్ళీ వస్తాను అప్పటివరకు సెలవు

– మీ రైల్వే స్టేషన్

Image may contain: outdoor and text

--((***))--

‘‘బాగున్నావా మిత్రమా’’ అడిగింది.ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక.

‘‘మిత్రమా! ఇదెక్కడి పిలుపు’’ అడిగింది.‘‘నువ్వెవరో నాకు తెలియదు. నా జోలికి రాకు’’ అంటూ పరుగెత్తబోయింది.‘

‘ఆగాగు’’ అంది నక్క.

ఆగింది జింక.‘

‘నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. ‘నా’ అన్నవారు నాకెవరూ లేరు. నక్కలన్నీ నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయో వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నయిపోయాను.’’ అన్నది నక్క. కన్నీళ్ళు పెట్టుకుంది.

‘అయ్యో పాపం’ అనిపించింది జింకకి.‘‘తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసొస్తూంది. చావలేక బతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో నా వాళ్ళను చూసినట్టనిపించి ఎక్కడ లేనిఆనందం కలిగింది. దేవుడిలా కనిపించావు.’’ అంది నక్క.

జింక పొంగిపోయింది.‘‘నీకే హానీ చెయ్యను. నన్ను నమ్ము. నా ఒంటరి తనాన్ని పోగొట్టు. దయచేసి నాతో జట్టు కట్టు. ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాం’’ అంది నక్క.

దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా తిరిగి తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు.‘‘సరదాగా మా ఇంటికి రావచ్చుగా’’ అడిగింది జింక.

‘‘రమ్మంటే ఎందుకు రాను? పద’’ అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టుకొమ్మ మీద కూర్చుని జింకతో పాటుగా వస్తూన్న నక్కని చూసింది కాకి.‘‘ఎ..ఎయ్‌...ఎవరది’’ అరిచింది.‘‘నక్క మిత్రమా! సుబుద్ధి అని మంచి నక్కే! పాపం దిక్కూ మొక్కూ లేదంటేనూ, ఒంటరి దాన్నంటేనూ, జాలిపడి తీసుకొచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది.’’ అంది జింక.

నక్కతో స్నేహమా? ఎక్కడయినా విన్నామా! అనుకుంది కాకి.‘‘కొత్తవాళ్ళను నమ్మకూడదు. నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ చూస్తూ నక్కతో స్నేహం ఏమిటి? దాని గుణగుణాలన్నీ అందరికీ తెలిసినవే కదా! జాగ్రత్త! పిల్లిని ఆదరించి ముసలి గద్ద ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే! ఆ కథ గుర్తొస్తూంది’’ అంది కాకి.

‘‘ఆ కథేంటో చెప్పవూ’’ అడిగింది జింక.‘‘చెబుతాను, విను’’ అంటూ కథ చెప్పసాగింది కాకి.గుడ్డిగద్ద కథవెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్విచెట్టు ఉండేది.

దాని తొర్రలో ఓ గుడ్డిగద్ద ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక, చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది. చెట్టు మీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడ్డాయి.

జాలిపడి, రోజూ సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా, ఈ గుడ్డిగద్దకు కూడా కొంచెం పెట్టేవి. పెట్టి-‘‘తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్ళాల్సి వస్తూంది. చీకటి పడితేనే కాని, గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే! అయితే మేమంతా తిండి సంపాదించుకుని, గూటికి చేరే వరకూ పిల్లలకి నువ్వే దిక్కూ మొక్కూ కావాలి. నీకు కళ్ళు కనిపించవు.

నీ కాళ్ళు కదలవు. అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండు. మా పిల్లలకు కాపలాగా ఉండు.’’ అనేవి. అలాగేనంటూ గుడ్డిగద్ద కాపలా కాసేది.

Image may contain: 13 people

260260

3 comments

🌳రెండు కాంతుల మధ్య🌳

🍁నీడ🍁

చంద్ర:-అమ్మోయ్ ఆ గయ్యాళి వచ్చేసిందే

సూ:-ఎవర్రా అది

చంద్ర:-ఇంకెవరు పక్కింటి ఛాయమ్మ 
సూ:-ఆయ్ బాబోయ్ ఈ దొంగ మొహంది ఎందుకు వస్తోంది డబ్బులకా ఇంకేమయినానా
ఛాయ:-అయ్యో అయ్యో అక్కో అక్కా ఎంత ఘోరం జరిగిపోతుంటే అక్కడ ఎక్కడున్నావే అక్కో అక్క..
సూ:-ఛ నోరు ముయ్ ఏమిటా ఏడుపు నువ్వు పాచి మొహందానా
చంద్ర:-అదంతా దొంగ ఏడుపేలే ఆకళ్ళు చూడు ఎక్కడ తడిలేదాయే
అదికాదక్కా నే చెప్పేది వింటే నువ్వు కూడా ఏడుస్తావ్
సూ:-ఏం జరిగిందో చెప్పిచావ్వే ముందు
ఛాయ:-మరి చెప్పాక తిట్టమాకు
చంద్ర:-తిడితే మాత్రం నీకేమైనా సిగ్గా శరమా త్వరగా పోవే బాబూ
సూ:-అబ్బబ్బా ముందు చెప్పవే
ఛాయ:-మరే అక్కా బావ నీకోసవతిని తెస్తున్నాడంట తెలుసా నీకు
సూ:-ఏంటే ఏంకూశావే
ఛాయ:-అవునంటక్కా అందరూ ఇదే మాట అనుకొంటున్నా రు
చంద్ర:-ఇవన్నీ అబద్ధాలు చెబుతోంది నాన్న మార్కెట్ కి వెళ్ళాడు
పంక:-ఒదినా ఓ ఒదినా ఎక్కుడున్నావ్ ఒదినా ఓరి నామతి మండ ఇక్కడే వున్నావా సరలే
సూ:-దీంతోనే ఛస్తుంటే మళ్లీ మధ్యలో ఇదెందుకు వచ్చిందో
పంక:-ఇది ఇక్కడ వుందేమిటి ఒదినా
సూ:-ఆ దాని మొహం అదంతేలే
సూ:-ఆ రావే పంకజం ఏమిటే ఆ హడావిడి
పంక:-ఏంలేదొదినా ఇందాక అన్నయ్య మార్కెట్లో కనిపించిఈ పూల గంప నీకిమ్మని మా పాలేరుకి ఇచ్చాడు అదిద్దామని ఇదిగో నీగంప మిగతా పని చేసుకొని వస్తా అన్నారు
సూ:-అయ్యయ్యో అన్ని పూలు ఎందుకే
పంక:-నాకేంతెలుసొదినా
చంద్ర:-అమ్మా చూడు పూలు ఎంత బాగున్నాయో
ఛాయ:-అంతా అయిపోయిందక్కా ఈ పూలతో వచ్చే దానికి శోభనం జరిపించు వస్తానక్కా
సూ భ:-ఎక్కడికి పోయేది వచ్చిన పని అయిందా బాగా మండలేదుగా అందరూ వచ్చి భోజనం చేసివెళ్ళండి ఈ రోజు మాపెళ్ళిరోజ కదా అందుకు కాంతం ఇదిగో నీపట్టు చీర వడ్డాణం
సూ:-నా మతి మండ ఆరోజు ఈజేనా ఒసే ఛాయా పంకజం రండర్రా త్వరగా కాస్త అన్నీ చక్కపెట్టండే ఏమండీ మీరు కూడా స్నానం చేసి వస్తే వడ్డన మొదలు అవుతుంది మీరంతా త్వరితగతిన రండర్రా అలా నీరసంగా ఉంటే ఎలా సరే పిల్లలు వుంటా మరి...ఈ కాంతం అక్కని మర్చిపోకండిరా నాయనా..

ఏమిటాలోచిస్తున్నావు మిత్రమా’’ అడిగాడు.

‘‘ఏం లేదు మిత్రమా! నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. నొప్పెడుతున్నాయి. మొత్తం వలంతా కొరకడం అంటే కష్టమనిపిస్తోంది. ముందు నిన్ను విడిపించనీ! తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం.’’ అన్నాడు హిరణ్యకుడు.

చిత్రగ్రీవుడుకి హిరణ్యకుడి మాటలు నచ్చినట్టు లేదు. అదోలా చూశాడతన్ని.‘‘మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను. అనుమానం లేదు. కాకపోతే చెప్పానుగా! పళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని. నొప్పి అని. ముందు నిన్ను విడిపించనీ’’ అని చిత్రగ్రీవుడి దగ్గరి వల తాళ్ళను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు.

చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక్కి జరిగాడు. ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు.‘‘నీకు నొప్పి కలగనంత వరకూ నన్ను తప్పించి ఎంత మందిని నువ్వు విడిపించగలిగితే అంత మందినీ ముందు విడిపించు. అందరూ విడుద లయిన తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు. అంతేకాని, నన్ను ముందు విడుదల చేసి, మిగిలిన పావురాల సంగతి తర్వాతంటే భావ్యం కాదు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.

నవ్వాడు హిరణ్యకుడు.‘‘నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా! తనకు మాలిన ధర్మం అంటారే అలా ఉంది నువ్వు మాట్లాడేది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో! తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చు.

అలా కాదు, వారి సంగతే ముందు ఆలోచించాలి, తర్వాతే నా సంగతి అంటావా, అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకుంటాను. రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా, ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది. నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు? నువ్వెవరు?’’ ప్రశ్నించాడు హిరణ్యకుడు.

‘‘నిజమే! కాని, నా వాళ్ళంతా కష్టంలో ఉండడాన్ని నేను భరించలేను. సాటి వారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి. అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పు లేదు. నేనూ వాళ్ళూ ఒకటే! వాళ్ళు లేకుండా నేను లేను. నేను లేకుండా వాళ్ళు లేరు.

ఆపదలో ఉన్న నా వాళ్ళను నేను రక్షించుకోలేనప్పుడు నాకీ రాచరికం ఎందుకు? ఎవర్ని ఉద్ధరించడానికి?’’ అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ గొప్పగా చూశాయి, తమ రాజుని. రాజంటే చిత్రగ్రీవుడనుకున్నాయి.‘‘ఏదో రోజు అందరం పోయే వాళ్ళమే! ఈ శరీరం అశాశ్వితం. అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకునిఉన్న నాలుగు రోజులూ నాలుగు కాలాల పాటు నిలిచే పనులు చెయ్యాలి. తోటివారికి సాయం చెయ్యాలి. అందుకని చెబుతున్నాను. మరోలా అనుకోకు. ముందు నా వాళ్ళను కాపాడు. తర్వాత నీకు వీలయితేనే నన్ను కాపాడు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు. మనసులో జేజేలర్పించాడు.

No photo description available.

56

ఒక రోజు ఆ చెట్టు కిందికి పిల్లి ఒకటి వచ్చింది. చెట్టు మీది గూళ్ళలో పక్షి పిల్లల గోల వినవస్తే, నోరూరుతూంటే, నాలికను పెదాలకు రాసుకుని, ‘లేలేత మాంసం దొరికింది’ అనుకుంటూ చెట్టెక్కింది.

మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతోన్న పిల్లిని చూసి పక్షి పిల్లలు ‘అమ్మో! అయ్యో’ అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ‘‘ఎవరదీ’’ అంటూ గట్టిగా అరిచింది.

ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది. వణికిపోయింది. శరీరం వణకడంతో కాలు జారి కింద పడాల్సిందే! కాని నిలదొక్కుకుంది. చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు పిల్లి. ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద.

తప్పించుకునే అవకాశం లేదు. ఏం చెయ్యను, ఏం చెయ్యననుకుంటూ పరిపరి విధాల ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచనా రూపు కట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది.

పొరపాటు చేశాను. పక్షిపిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే! కాని, తప్పించుకోవాలి. ఎలా? ఎలా అంటే...ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి. దీన్ని నమ్మించాలి. నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి. లేదంటే చావు తప్పదు.గజగజా వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి.

విశ్వ

రూపుని కథ

ధర్మనందనుడు శల్యునుద్దేశించి, ‘‘మహాత్మా! మీరు తీసుకున్న నిర్ణయం ఎంతో సముచితమైంది. చేసిన మంచిపనిని అభినందించి, వారి కోరిక నెరవేర్చడం మహనీయుల సహజ లక్షణం. మీ వాగ్దానానికి భంగం రాకుండా నేను ఒక కోరిక కోరుకుంటాను. తమరు అనుగ్రహించాలి’’ అన్నాడు వినయంగా.

‘‘దానికేమి భాగ్యం నువ్వు అడుగనూ వచ్చు. నాచేతిలో ఉన్నది నేను చెయ్యనూ వచ్చు’’ అన్నాడు శల్యుడు మందహాసంతో.

‘‘శల్యధరణీ నాథా! మా అన్నదమ్ముల మధ్య యుద్ధం అనివార్యమైతే, మాశ్రేయోభిలాషి శ్రీకృష్ణుడు, అర్జునుని రథసారథిగా వ్యవహరిస్తానని మాట యిచ్చాడు. కర్ణుడు సదా కిరీటి పట్ల బద్ధవైరంతో రగులుతూ వుంటాడు. కదనరంగంలో వాసుదేవునికెదురొడ్డి, పగ్గాలు ఝళిపించగల దక్షులు మీరొక్కరే. కనుక మీకు సారథి పదవి రాకమానదు. ఆ సమయంలో మీరు చేయగల సాయం వొకటుంది. కర్ణునికి సార థ్యం వహిస్తూనే శాత్రవుని కీర్తించడం, కర్ణుని ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడం ద్వారా నిరుత్సాహ వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఇది అనుచితమని భావించక, మా కోరిక తీర్చాలని కోరుకుంటున్నాము’’ అన్నాడు ధర్మజుడు.

శల్యుడు వెంటనే, ‘‘ధర్మజా! మీరూహించినట్టు నేను కర్ణుని రథసారథినైతే తప్పక నీ కోరిక తీరుస్తాను. యథాశక్తిగా సవ్యసాచికి సాయపడతాను. కర్ణుని గురి నిలువకుండా మాటలతో అస్తవ్యస్తం చేస్తాను’’ అని మాట యిచ్చాడు.

ధర్మజుడు నమస్కరించి కృతజ్ఞతలు తెల్పాడు. ఒక పెద్ద గండం గట్టెక్కినట్టు హాయిగా నిట్టూర్చాడు.మద్రేశ్వరుడు మరల అందుకుని, ఇదేకాదు మీరు ఏది కోరినా నేను చేస్తాను. నాడు నిండుసభలో ఆ సూత పుత్రుడు ద్రౌపదీ సాధ్విని అవమానపరిచినపడు నేను ఎంతగానో నొచ్చుకున్నాను. అదీగాక, మీరు పడ్డ పాటులెవ్వరి మనసులనైనా నొప్పించక మానవు. మీపట్ల నాకు చెప్పలేని ప్రేమాభిమానాలున్నాయి. ధర్మరాజా, ఇక్కట్లు పడ్డామని బాధపడకు. త్వరలోనే మబ్బులు వీడి, మనోరథాలు ఫలిస్తాయి. అమరేశ్వరుడంత వారికే ఘోరదుర్దశ ఒక్కొక్కపడు తప్పదు. దేవేంద్రుడు శచీదేవితో బాటు అష్టకష్టాలనుభవించలేదా. అమరాధిపతితో పోల్చుకున్నపడు మీ శక్తిసంపన్నతలు ఏపాటి? సాక్షాత్తూ ఆ పరమేశ్వరునికైనా కర్మఫలితం అనుభవించక తప్పదు కదా’’ అన్నాడు గంభీరంగా.

ధర్మపుత్రుడది విని ‘‘శల్యరాజా! ఇంద్రదేవుడు సతీసహితంగా అటువంటి క్లేశాలు అనుభవించడానికి కారణమేమిటి? మీ ముఖతా వినాలని ఉంది’’ అన్నాడు. మద్రపతి స్థిమితంగా కూర్చుని, ‘‘తప్పక చెబుతాను.ఆ పురాతన గాథను మీరు తెలుసుకోవడం చాలా అవసరం’’ అంటూ ఆ వృత్తాంతాన్ని సాకల్యంగా వివరించాడు.

అమరులందరిలోనూ అగ్రగణ్యుడు, పూజనీయుడు అయిన త్వష్ట, ఒకానొకపడు దేవేంద్రునికి అపకారం తలపెట్టాడు. అందుకోసం మూడు శిరస్సులు గల భీకరమూర్తినొకనిని సృష్టించి, వానికి విశ్వరూపుడని పేరు పెట్టాడు. విశ్వరూపుడు ఇంద్రపదవి కోసం, అహోరాత్రులు తీవ్రనిష్ఠతో తపస్సు ప్రారంభించాడు. ఇంద్రునికా సంగతి తెలిసి, తపోభంగానికి ప్రయత్నాలు సాగించాడు. అప్సరసలు అరణ్యానికి దిగి వచ్చారు. విశ్వరూపుడు తపస్సాచరించే పరిసరాలలో వారు వయ్యారాలు వొలకబోస్తూ సంచరించారు. నూపురాల ఘలంఘలలు, మధురగీతికలు, మనోహర నృత్యాలు అడవికాచిన వెన్నెలలైనాయి. పయ్యెదల పలకరింపులు, అచ్చరల క్రీగంటిచూపులు బూడిదలో పోసిన పన్నీరైన వి. దేవేంద్రుడది గమనించి విశ్వరూపుడు తన పదవిని ఆక్రమించగలడని భయపడ్డాడు. భయంతో విచక్షణాజ్ఞానం నశించింది. ఇంద్రుడు తన చేతనున్న వజ్రాయుధాన్ని తపోదీక్షలో వున్న విశ్వరూపునిపై ప్రయోగించాడు. ఆ దెబ్బకు తపస్విశిరస్సులు మూడు తుత్తునియాలైనాయి. తను చేసిన ఘోరహత్య లోకానికి తెలియనీయక, ఇంద్రుడు ఒక రహస్య ప్రదేశంలో మారువేషంలో దాక్కొన్నాడు. అయినా, ఇంద్రుని ఘాతుక కృత్యాన్ని లోకం కోడై కూసింది. ప్రపంచంలోని సమస్త ప్రాణికోటి పలువిధాల దూషించింది. ఇంద్రుడు తన దుశ్చర్యలోకానికి తెలిసిపోయినందుకు విచారించాడు. నింద బాపుకోడానికి దుష్కర వ్రతమొకటి సంకల్పించి, ఆచరించాడు. తనకు చుట్టుకున్న భీకరబ్రహ్మ హత్యాపాతకాన్ని యీ సృష్టిలో గల వృక్షజాతికి, సాగరాలకు, భూమికి, మహిళలకు విభజించి పంచి తను విముక్తుడైనాడు. తిరిగి ఇంద్రుడు మునుపటి వలెనే మచ్చలేని మహానాయకునిగా వెలిగిపోతున్నాడు. దిక్పాలకులు, మునీశ్వరులు ఎప్పటిలాగే ఇంద్రుని పట్ల భయభక్తులతో మెలగసాగారు. త్వష్టకు తన కుమారుడైన విశ్వరూపుని దారుణహత్య గురించి తెలిసింది.

Image may contain: 1 person

Tuesday, 26 February 2019

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్

_*తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో ఆరవది తిరుత్తణి. ఈ క్షేత్రం తమిళనాడు లోని తిరువళ్లూర్ జిల్లాలో అరక్కోణం సమీపంలో పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం మన తిరుపతి కి కూడా కేవలం అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రములైన *“ ఆరు పడై వీడు ”* లో మకుటాయమానమైన క్షేత్రం తిరుత్తణి. ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే మనశ్శాంతి , సుఖములు చేకూరుతాయని ప్రసిద్ధి. సుబ్రహ్మణ్య స్వామి వారు అసురు సంహారం చేసిన తర్వాత ఇక్కడే మొట్ట మొదట పూర్తి ప్రశాంతత పొందారు. ఇక్కడ స్వామి వారిని *“తనికేశన్”* గా కొలుస్తారు. ఈ క్షేత్రములో ఏ భక్తులైతే ఏకాగ్ర చిత్తము , ధృఢ విశ్వాసములతో స్వామి ని ప్రార్ధిస్తారో వారికి క్షణ కాలంలోనే కోరికలు తీరుతాయి అని ప్రతీక. అందువలననే స్వామి వారు కొలువు ఉన్న కొండని *“ క్షణికాచలం “ (తమిళం లో తనికాచలం)* అని పిలుస్తారు.

ఈ క్షేత్రమునకు దగ్గరలో వల్లి మలై ఉంది. అక్కడి నుంచే వల్లి అమ్మని తెచ్చి ఈ క్షేత్రములో వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణము జరిపారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ క్షేత్రములో వీరమూర్తి , జ్ఞాన మూర్తి , ఆచార్య మూర్తి అనే నామములతో కొలుస్తారు.

ఈ క్షేత్రములో ఉన్న వినాయకుడిని *“ ఆపత్ సహాయ వినాయగర్ “* అని పిలుస్తారు. ఎందుకంటే , సుబ్రహ్మణ్యుడి అగ్రజుడు కదా మన లంబోదరుడు , ఆయన తమ్ముడిని వల్లి అమ్మకి ఇచ్చి వివాహం చేయడంలో కీలక పాత్ర వహించారు గణపతి. 

ఇక్కడ క్షేత్రములో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే , ఇక్కడ ఉత్సవ మూర్తులుగా ఉన్న వల్లీ , దేవసేనా , సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము (ఛత్రము) రుద్రాక్షలతో చేసినది. చాలా అందముగా ఉంటుంది. అంతేకాదు , స్వామి వారు ఒక ఆకు పచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి మిల మిల మెరిసి పోతూ ఉంటారు. ఇక్కడ బంగారు బిల్వ పత్రముల మాల తో కూడా స్వామి వారిని అలంకరిస్తారు. 

ఈ క్షేత్రమునకే అనేక పేర్లు కలవు. పూర్ణగిరి , క్షణికాచలం , మూలాద్రి , నీలోత్పల మొదలగు పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయం ఉన్న కొండ ఎక్కాలంటే మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి. ఇవి సంవత్సరములో ప్రతీ రోజుకు సంకేతము. ముందుగా స్వామి వారి దగ్గరకి వెళ్ళేటప్పుడు , కొండ క్రింద భాగములో కుమార తీర్థము ఉంటుంది. దీనినే శరవణ తటాకము ( తమిళం లో శరవణ పోఇగై ) అంటారు. 

*తిరుత్తణి క్షేత్ర స్థల పురాణము:*

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి , వల్లి అమ్మ వారి కళ్యాణం తర్వాత , అమ్మ వారు స్వామి వారిని ఈ తిరుత్తణి క్షేత్ర మాహాత్మ్యము గురించి తెలుపమని కోరగా , ఎవరైతే ఈ తిరుత్తణి క్షేత్రములో త్రికరణశుద్ధిగా ఐదు రోజులు స్వామి వారిని ఆరాధిస్తారో , వారికి ఇహలోకములో కావలసిన వన్నీ సమకూర్చి , పరలోకం లో మోక్షప్రాప్తి కలుగజేస్తానని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి అమ్మ వారితో సెలవిచ్చారు.

త్రేతా యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరం లో ఈశ్వరుడిని ఆరాధిస్తారు. అక్కడ , ఈశ్వరుడి ఆనతి మేరకు , శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రము దర్శించినారు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది.

ద్వాపర యుగములో , మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ , ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచినారు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు , చక్రములను తిరిగి పొందినారు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు).

చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రణవ అర్ధమును చెప్పలేక పోవడం వలన , మన ముద్దులొలికే సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి , ఆయన సృష్టి చేసే సామర్ధ్యం కోల్పోతారు. ఇక్కడ తిరుత్తణి లో ఉన్న బ్రహ్మ తీర్థము లో కార్తికేయుని పూజించి , ఆయన తిరిగి ఆయన శక్తి సామర్ధ్యములను పొందారు.

దేవేంద్రుడు ఈ క్షేత్రములోనే , ఇంద్ర తీర్థములో , “ కరున్ కువలై ” అనే అరుదైన పూల మొక్కను నాటి , ప్రతీ రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు. ఆ తర్వాతనే , ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న *“ సంఘనీతి , పద్మనీతి , చింతామణి ”* మొదలగు దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడు.

అమృతం కోసం దేవతలు , రాక్షసులు పాల సముద్రమును మథనం చేయడానికి వాసుకిని తాడుగా చేసి మథనం చేస్తారు. దాని వలన , అక్కడ వాసుకి శరీరమునకు కలిగిన తీవ్రమైన గాయములు ఈ క్షేత్ర దర్శనము తర్వాత పూర్తిగా నయమౌతాయి. ఈ తిరుత్తణి లోనే , అగస్త్య మహా ముని సుబ్రహ్మణ్యుని ఆరాధించిన తర్వాత తమిళ భాష ఆవిర్భవించినది.
పురాణములలోనే కాకుండా , సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తుడు అరుణగిరినాథర్ ఈ క్షేత్ర మాహాత్మ్యమును ఎంతగానో కీర్తించారు. ఈ కొండ మీదనే ఎంతో మంది ఋషులు దేవతలు తపస్సు చేయడానికి ఇష్టపడతారని , ఇది భూలోకంలోని శివలోకముగా పోల్చారు.

ప్రఖ్యాత వాగ్గేయకారుడు , సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి అవతారముగా కీర్తించబడినవారు , మహానుభావుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారికి ఈ క్షేత్రములోనే స్వామి ఒక వృద్ధుడి రూపంలో వచ్చి వారికి తన యొక్క ప్రసాదం ఇచ్చి వెళ్లారు. అప్పటి నుంచే ముత్తుస్వామి దీక్షితార్ కి అనర్గళమైన కీర్తనలు వారి నోటి నుండి వచ్చాయి. 

*ఈ క్షేత్రమును చేరే మార్గములు:*

తిరుత్తణి తమిళనాడు లోని కుంభకోణం నుంచి తంజావూర్ వెళ్ళే దారిలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

రోడ్ ద్వారా: చెన్నై నుండి 84 Km, తిరుపతి నుండి 68 Km, అరక్కోణం ( కాణిపాకం )నుండి 13 Km దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది. మన APSRTC కూడా తిరుపతి నుంచి అనేక బస్సులు నడుపుతుంది.

*రైలు ద్వారా:* దీనికి దగ్గరలోని రైల్వే స్టేషన్ అరక్కోణం. ఇది ఒక రైల్వే జంక్షన్. అంతేకాక, చెన్నై నుండి తిరుత్తణి కి అనేక లోకల్ రైళ్ళు నడుస్తాయి.

*విమానము ద్వారా:* దగ్గరలో విమానాశ్రయములు చెన్నై  ( 82 Km ), తిరుపతి ( 60 Km ) దూరంలో ఉన్నాయి.

*వసతి సదుపాయము:*

ఇక్కడ స్వామి వారి కొండ క్రిందనే దేవస్థానము వసతి గృహాలు ఉన్నాయి. చాలా చక్కగా , తిరుమలలో లాగా ఉంటాయి. ఇక్కడకి వెళ్ళే ముందు ఆలయం వారికి డీడీ రూపములో డబ్బు పంపవలెను. కాని , రద్దీ తక్కువగా ఉండే సమయములో అప్పటికప్పుడు కూడా వసతి ఇక్కడ దొరుకుతుంది.

--(())--

బ్రాహ్మణుని   తేజస్సు

బ్రాహ్మణుని జననము ---విష్ణు అంశం
బ్రాహ్మణుని బుద్ది -----సర్వసమస్యలకు సమాధానం.     
బ్రాహ్మణుని వాక్చాతుర్యం---------వేద వైభవజ్ఞానం.
బ్రాహ్మణునిదృష్టి---సమభావం.                         

బ్రాహ్మణుని ఆశయం------సర్వలోకక్షేమం
బ్రాహ్మణుని లక్ష్యం------దేశహితం.       
బ్రాహ్మణుని ముఖ్యఉద్దేశం--సర్వసంకటనాశనం.
బ్రాహ్మణుని అనుగ్రహం---భవసాగరసాధనం.

బ్రాహ్మణుని నిత్యానుష్టానం- సర్వలోకక్షేమం.
బ్రాహ్మణుని నిధి---భగవద్సన్నిది.             
బ్రాహ్మణుని దర్శనం--సర్వమంగళకరం. 
బ్రాహ్మణుని ఆశీర్వాదం---వైభవమునకు ఆలవాలము.

బ్రాహ్మణుని  చల్లని చూపు --  చూపు   
బ్రాహ్మణుని అస్త్రం-శాపం.       
బ్రాహ్మణుని శస్త్రం --  నీ జీవితానికి మోక్షం.             
బ్రాహ్మణుని శాస్త్రం---- మనుగడమార్గం.               

బ్రాహ్మణునునికి దానం-సహస్రపాపముల సంహారం.       
బ్రాహ్మణునునికి దక్షిణమ్-సర్వపాపక్షయం.     
బ్రహ్మణునిఘర్జనమ్-సర్వభూతసంహారం.       
బ్రహ్మణునికోపం--సర్వనాశనం.                   

బ్రాహ్మణుని తాపం--నీ జీవిత సంకటం.           
బ్రహ్మణునికిసన్మానం --నీ అభివృద్ధికి సోపానం.           
బ్రహ్మణునునికి అవమానం--నీ అభివృద్ధికి వినాశనం.
బ్రాహ్మణునునికి ద్రోహం --నరకానికి మార్గం.                 

బ్రాహ్మణ అభ్యుదయం --నీ జీవితానికి అభ్యుదయం.     
బ్రాహ్మణుని అనుగ్రహ చూపు --నీ జీవితారోహణకు మార్పు.   
బ్రాహ్మణుని ఆవాసం----సర్వతీర్థముల నివాసం.                           
బ్రాహ్మణుని సాన్నిహిత్యం - నీ జీవితo కాంతివంతం.       

బ్రాహ్మణుని సాంగత్యం----త్రివేణిసంగమసదృశం.       
బ్రాహ్మణక్షేమం--దేశక్షేమం.
బ్రహ్మణహితం-దేశహితం.           

స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతామ్.                   
న్యాయేణ మార్గేణ మహీమ్ మహీశా:               
గోబ్రాహ్మణేభ్య:శుభమస్తు నిత్యం                             
లోకాః సమస్తా: సుఖినోభవంతు.

--((***))--