Monday, 7 June 2021

శ్రీ ఆంజనేయ స్వామి వారి కధలు



సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ

🌻 *అహం అనర్థ హేతువు* 🌻

🥀ఒకప్పుడు పాశుపతాస్త్రం పొందగోరి అర్జునుడు, పరమశివుణ్ణి గూర్చి తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందునిమిత్తం ఒంటరిగా రథంలో బయలుదేరిన అతడు అరణ్య మార్గంలో అనేక మృగాలను వేటాడుతూ ఒక పగటి వేళ రామేశ్వరం చేరుకున్నాడు.

🥀అక్కడ అతడు సముద్రస్నానం చేసి మాధ్యాహ్నికం నిర్వర్తించాడు. ఆ తరువాత గర్వంతో రథాన్ని సముద్ర తీరంలో అటూ ఇటూ సమధికోత్సాహంతో వేగంగా నడిపించాడు.

🥀అప్పుడు అక్కడ అరణ్యంలోని కొండ మీద శ్రీరామభక్త హనుమాన్ తపస్సు చేసుకొంటున్నాడు. 'రామ రామ' అంటూ జపంలో లయించిపోయి ఉన్న ఆంజనేయుని యాదృచ్ఛికంగా అర్జునుడు అక్కడ చూశాడు.

🥀ఆయనను చూసి గర్వంతో అర్జునుడు, "ఏయ్ ముసలి కోతీ! నువ్వు ఎవరు? నీ పేరేమిటి?” అని గద్దిస్తూ అడిగాడు.

🥀అందుకు ఆంజనేయుడు నవ్వుతూ ప్రశాంతంగా, “శ్రీరాముడు బండరాళ్ళతో సేతువు నిర్మించి, లంకకు వెళ్ళి రావణుణ్ణి సంహరించాడు. అంతటి కీర్తిమంతుడైన శ్రీరామునికి దాసుణ్ణి నేను. నన్ను హనుమంతుడనీ, వాయుపుత్రుడనీ పేర్కొంటారు" అని చెప్పాడు.

🥀ఆంజనేయుడు, శ్రీరాముని ఆ విధంగా ప్రశంసిస్తూ చెప్పడం విన్న అర్జునునికి నవ్వాగలేదు. అతడు పరిహాసంగా, “ఓ వానరమా! నీ రాముడు పరాక్రమవంతుడై ఉండి ఉంటే సముద్రం మీద సేతువు నిర్మించే కార్యానికి అనవసరంగా ఎందుకు ఉపక్రమించాడు? ఆయన నిజంగానే మేటి విలుకాడై ఉండే పక్షంలో, తన బాణాలతోనే వంతెన నిర్మించి ఆ కార్యాన్ని స్వయంగా తానే పూర్తి చేసి ఉండకూడదా?" అంటూ, అహంకారంగా ప్రశ్నించాడు.

🥀అంతదాకా ప్రశాంతంగా ఉన్న హనుమంతునికి, అర్జునుడు రాముని గూర్చి అమర్యాదగా మాట్లాడటంతో ఆగ్రహం ముంచుకొచ్చింది. తన గురించి అమర్యాదగా మాట్లాడినా కూడా ఆయన సహించి ఉండేవాడు. శ్రీరాముని ఒకడు పరిహసిస్తూ మాట్లాడితే ఆయన ఎలా సహనంతో ఉండగలడు? అందుకే ఆయన కోపోద్రేకంతో, "అర్జునా! బాణాలచే వారధి నిర్మిస్తే నా వంటి వానర సైన్యంలోని బలిష్టమైన వారి భారం కారణంగా వారధి సముద్రంలో మునిగిపోతుందని రాముడు. బాణాలచే వారధి నిర్మించలేదు. నువ్వు నా రాముని కన్నా గొప్ప విలుకాడవా?" అని అడిగాడు.

🥀'విల్లుకు విజయుడు' అనే ఖ్యాతి అర్జునునికి ఉంది కదా! దాంతో అతడు అహంకారంతో, "ఆంజనేయా! బాణాలచే నిర్మితమైన వారధి కోతుల భారంతో సముద్రంలో మునిగిపోతే, ఇక విలుకాని విలువిద్యకు ఏం మహత్వం ఉంటుంది? నేను ఇప్పుడే నువ్వు చూస్తూ ఉండగానే నీ కళ్ళ ముందే బాణాలచే అద్భుతమైన వారధిని నిర్మిస్తాను. నువ్వు దానిపైకెక్కి నిలబడి నీ ఇష్టం వచ్చినట్లు ఎంతసేపైనా గంతులు వెయ్యి. తరువాత నేను నీ రామునికన్నా గొప్ప విలువిద్యాపారంగతుణ్ణా, కానా అని నువ్వే తెలుసుకో" అని పలికాడు.

🥀అందుకు ఆంజనేయుడు మందహాసం చేస్తూ, "బాణాలచే నువ్వు కొత్తగా నిర్మించే వారధి మీద నేను ఎక్కి గంతులేస్తాను. అప్పుడు అది కుప్పకూలితే నువ్వేం చేస్తావు? నా కాలి బొటనవేలు పడగానే నువ్వు నిర్మించే వారధి కూలి సముద్రంలో మునిగిపోతే అర్జునా! నువ్వు ఏం చేస్తావో చెప్పు?" అన్నాడు ధీమాగా.

🥀ఆ మాటలకు ప్రతిస్పందిస్తూ అర్జునుడు, “ఆంజనేయా! నీ భారం కారణంగా నేను నిర్మించే వారధి కూలి సముద్రంలో మునిగిపోతే, ఇక్కడే అగ్ని రాజేసి అగ్నిప్రవేశం చేసి ప్రాణాలు విడుస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ! వారధి సముద్రంలో మునిగిపోకపోతే నువ్వు ఏం చేస్తావో చెప్పు?" అని ప్రశ్నించాడు.

🥀అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ విని ఆంజనేయుడు, "అర్జునా! నువ్వు నిర్మించే ఆ బాణాల వంతెనను నేను నా కాలి బొటనవేలితో సముద్రంలో ముంచివేస్తాను. ఆ విధంగా జరుగకపోతే నీ రథ పతాకంలో కొలువుదీరి నీకు అవసరమైన అన్ని తోడ్పాట్లు అందిస్తాను” అని జవాబిచ్చాడు.

🥀"ఆహా! అట్లే కానివ్వు!” అంటూ అర్జునుడు, హనుమంతునితో పందానికి ఒప్పుకున్నాడు.

🥀'హనుమంతుడు ఎదురు చూడని విధంగా అనేకరెట్లు పటిష్టతతో కూడుకున్న వారధిని నిర్మిస్తాను' అని మనసులో అనుకొని అర్జునుడు తన గాండీవాన్ని చేతుల్లోకి తీసుకుని బాణాలను ప్రయోగించ నారంభించాడు. కాసేపటికల్లా అర్జునుడు కురిపించిన బాణవర్షంతో చక్కని వారధి నిర్మాణం జరిగింది. తరువాత అతడు సగర్వంగా, “హుం, వారధిని ఆసాంతం పరిశీలించి చూసుకో!" అని హనుమంతుడితో చెప్పాడు.

🥀అప్పుడు హనుమంతుడు 'రామా! నేను నీ దాసుణ్ణి. నన్ను నువ్వు ఎలాగైనా చేసుకో' అని మనస్సులో ప్రార్థించాడు. తరువాత, “రామ్ ! రామ్!" అంటూ అర్జునుడు సముద్రం మీద నూరు యోజనాల దూరానికి నిర్మించిన బాణ వారధిపైకి ఎక్కకుండానే తన కాలి బొటన వేలితో ఒక మూల అదిమి నొక్కాడు. అంతే! మరుక్షణమే ఆయన ఆ విధంగా చెయ్యాలి అని కాచుకున్నట్లుగా ఆ వారధి కుప్పకూలి, వారధి ఉండేదనే ఆనవాలుకూడా లేకుండా సముద్రంలో మునిగిపోయింది. పిల్లలు అట్టలతో కట్టిన ఇల్లు గట్టిగా గాలి వీచినప్పుడు కూలిపోయే రీతిలో వారధి కూలి, సముద్రంలో జాడకూడా తెలియనంతగా మునిగిపోయింది.

🥀ఈ ఘటనతో వీరాధివీరుడైన అర్జునునికి అవమానంతో ముఖం చిన్నబోయింది. అతడు నిశ్చేష్టితుడయ్యాడు. అగ్నిప్రవేశం చేసి మరణించడానికి అతడు ఏమాత్రం సంకోచించలేదు, విచార పడలేదు. 'పాశుపతాస్త్ర సముపార్జనకై వచ్చిన నేను, వచ్చిన మహత్కార్యాన్ని నెరవేర్చలేకపోయానే! నాకు పట్టిన గతి తెలియక, నా సోదరులైన పాండవులు తల్లడిల్లిపోతూ నన్ను వెతుకుతుంటారే!' అని అనుకుంటూ అతడు బాధపడ్డాడు.

🥀[ఎంతో గొప్ప లక్ష్యం కోసం మనం ఏతెంచాం; మహత్కార్యాలు సాధించే స్థితిలో ఉన్నాం. దాన్ని వదలిపెట్టి, అహంకారంతో మనలను మనమే నాశనం చేసుకొంటున్నాం. మన అహంకారమే ఎన్నెన్నో మంచి పనులు జరగడానికి ఆటంకంగా ఉంటున్నది. ఇది గ్రహించి కూడా మన అహంకారాన్ని తొలగించుకోవడానికి మనం సిద్ధంగా లేము. అంతేకాక ఇతరుల దుఃఖానికి కారణమౌతున్నాం. మహత్కార్యాలు సాధింప వచ్చిన మనం, సిగ్గులేకుండా అల్పవిషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకు మనం సిగ్గుపడాలి - ఈ గుణపాఠానికి అర్జునుడి స్థితి అద్దం పడుతున్నది కదా!]

🥀పాపం! అర్జునుడు ఏం చేస్తాడు? అతడి ప్రగల్భాలు తేలిపోయాయి. తన ప్రతిజ్ఞ మేరకు అగ్నిప్రవేశం చేయడానికి ఏర్పాట్లు చేయనారంభించాడు.

🥀అర్జునుణ్ణి అగ్నిప్రవేశం చెయ్యవద్దని ఆంజనేయుడు పరిపరి విధాల బతిమాలుతూ చెప్పాడు. అయినప్పటికీ అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్ప కట్టెలు పేర్చి అగ్ని రాజేశాడు.

🥀చివరగా అర్జునుడు తన ఆప్తమిత్రుడు, గురువు అయిన కృష్ణుణ్ణి తలచుకొని, "కృష్ణా! నన్ను ఇలా వదలిపెట్టావే? చివరికి ఈ దుస్థితికి దిగజారిపోయేలా చేశావే!" అంటూ హృదయం ద్రవించేలా ప్రార్థించాడు. ఇక అతడు అగ్నిప్రవేశం చెయ్యడానికి ఇంకా కొన్ని క్షణాలే ఉన్నాయి.

🥀అర్జునుని ప్రార్థనలకు దిగివచ్చిన కృష్ణుడు ఒక బ్రహ్మచారి రూపంలో అక్కడకు వచ్చాడు. అప్పుడు అతడు, "అరే! నీవు ఖ్యాతి గాంచిన అర్జునుడివి కదా! నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అర్జునుని అడిగాడు.

🥀ఏడుపు ఒక్కటి రావడమే తక్కువ, అర్జునుడు ఆ బ్రహ్మచారికి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.

🥀అంతా సావధానంగా విన్న బ్రహ్మచారి రూపంలోని కృష్ణుడు, "ఆహా! అర్జునా, మహావీరుడవైన నీ కథ చివరికి ఇలాగా అయిపోయింది!" అన్నాడు తెచ్చిపెట్టుకున్న విస్మయంతో...

🥀తరువాత కాసేపు ఏదో ఆలోచించి ఆంజనేయునితోనూ అర్జునునితోనూ ఇలా చెప్పాడు: "మీరిద్దరూ పాల్గొన్న పోటీలో న్యాయం. లేదు. ఎప్పుడైనా సరే పోటీ అంటూ వచ్చినప్పుడు అందుకు సాక్షిగా మధ్యస్థుడు లేక నిర్ణేత అనే ఒక వ్యక్తి ఉండాలి. అదే న్యాయమైన పద్ధతి. మధ్యస్థుడు ఉండి పోటీ ఫలితం ఇది అని తీర్పు ఇవ్వడం సముచితం. మధ్యస్థుడు లేకుండా మీరుగానే పోటీ ఫలితాన్ని తీర్మానించడం సబబు కాదు; దాన్ని పోటీ అని పరిగణించడం కూడా సరికాదు. మీరిద్దరూ మునుపటి మాదిరే మళ్ళీ ఇప్పుడు పోటీ చేయండి. నేను మధ్యస్థుడిగా ఉండి పోటీని పర్యవేక్షించి ఫలితం ప్రకటిస్తాను.”

🥀బ్రహ్మచారి యోచనకు ఇద్దరూ సమ్మతించారు.

🥀అర్జునుడు మొదటి పనిగా, కృష్ణుని సహాయం అర్థిస్తూ చిత్తశుద్ధితో ప్రార్థించాడు. ఆ తరువాత మునుపటిలాగానే బాణప్రయోగంతో వారధిని నిర్మించాడు. సాక్షాత్తూ బ్రహ్మచారి రూపంలోని శ్రీమన్నారాయణుడు తన చక్రాయుధాన్ని వారధి మధ్యలో నిలిపి ఉంచాడు.

🥀ఆంజనేయుడు అప్పటికే ఒకసారి వారధిని సముద్రంలో ముంచివేశాననే గర్వంతో మునుపటి మాదిరే కాలి బొటనవేలితో వారధిని అదిమి నొక్కాడు. కాని వారధి చెక్కుచెదరలేదు! దాంతో విస్తుబోయిన ఆంజనేయుడు వారధినెక్కి తన బలాన్నంతా ప్రదర్శిస్తూ అటూ ఇటూ గెంతసాగాడు. కాని ప్రయోజనం శూన్యం. చివరికి విశ్వరూపం దాల్చి పదేపదే వారధి పైకి దూకాడు. కాని వారధి కించిత్తుకూడా చలించక సుదృఢంగా నిలబడింది.

🥀ఆంజనేయుడు ఇక ఓటమిని ఒప్పుకొనే ఉద్దేశంతో తీరం మీదికి దూకాడు. అదే సమయంలో కృష్ణుడు బ్రహ్మచారి రూపం విడిచి. రాముడుగా కృష్ణుడు దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో ఒకసారి రాముడు, "ద్వాపరయుగంలో కృష్ణుడిగా నీకు దర్శనమిస్తాను" అని మాట ఇవ్వడం ఆంజనేయుడికి చటుక్కున గుర్తుకొచ్చింది. ఆయన అలా అనుకున్న అదే సమయంలో, రాముడు కృష్ణుడిగా మారి ఆంజనేయునికి దర్శనం ఇచ్చాడు.

🥀తనకు వంగి నమస్కరిస్తున్న ఆంజనేయుని కృష్ణుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. తరువాత ఇలా చెప్పాడు: “ఆంజనేయా! నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి. రాముడిగా, కృష్ణుడిగా విభిన్న నామాలతో నన్ను అర్చించే మీ ఇద్దరినీ ఒకే త్రాటి మీదకు చేర్చడానికే ఈ లీల జరిపాను.

🥀అర్జునా! రాముని తక్కువ చేసి మాట్లాడీ, నన్ను మరచిపోయి మొదటిసారి వారధి నిర్మించావు. ఆంజనేయుడు నన్ను మనసారా ప్రార్థిస్తూ పనికి ఉపక్రమించడంతో సాఫల్యం పొందాడు, వారధి కుప్పకూలింది. రెండవసారి నన్ను మనస్సులో తలచుకుని వారధి నిర్మించావు. కాబట్టే ఇప్పుడు విజయం నిన్ను వరించింది.

🥀“ఆంజనేయా! మొదటిసారి నన్ను తలచుకోవడం వలన పోటీలో విజయం పొందిన నువ్వు రెండవసారి నన్ను మరచిపోయావు; అంతేకాక మొదటిసారి గెలుపును తలచుకుని గర్వించి వారధిని కూల్చ ప్రయత్నించావు. నీ ఆ మనోస్థితే నీ ఓటమికి కారణం అయింది."

🥀ఇలా చెప్పి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. వారధి మధ్యలో ఉన్న సుదర్శనచక్రం మళ్ళీ తన ఆవాసానికి తిరిగి వెళ్ళిపోయింది.

🥀ఈ సంఘటన ద్వాపరయుగాంత సమయంలో జరిగినట్లు ఆనందరామాయణంలో చోటుచేసుకొంది.

🥀మహాభారత యుద్ధంలో అర్జునుని రథ పతాకంలో హనుమంతుడు ఆసీనుడై భాసించాడు. ఆ కారణంగా కపిధ్వజుడు అనే పేరు అర్జునునికి కలిగింది.

🥀గర్వం పనికిరాదు, భగవంతునికి పూర్తిగా శరణాగతులం కావాలి. విభిన్న నామాలతో ఒకే భగవంతుడే విరాజిల్లుతున్నాడు. నిజమైన భక్తులకు ఎప్పుడో ఎంతో అరుదుగా గర్వం తలెత్తినా, ఆ గర్వాన్ని తొలగించి. భగవంతుడు అనుగ్రహిస్తాడని మనం పైన చూసిన ఈ కథ చెప్పక చెబుతోంది.

🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

🙏 *శ్రీ ఆంజనేయ మహాత్మ్యం —1* 🙏

🌻 *శ్రీ ఆంజ నేయ మంత్రోప దేశ లక్షణం* 🌻

ఒకప్పుడు పరాశర మహర్షిని మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు ”కలి కాలం లో దుఖాలను దూరం చేసేది ,దారిద్రాన్ని పోగొట్టేది ,వ్యాదులనుండి రక్షించేది ,సర్వదా విజయాలను చేకూర్చేది అయిన మంత్రం ఏదైనా వుంటే తెలియ జేయండి.

దానికి ఆ మహర్షి సంతోషించి ”మైత్రేయా !మంచి ప్రశ్న వేశావు. నీ ద్వారా లోకానికి ఉపయోగ కరమైన మంత్రాన్ని చెప్తాను విను .అది సకల వేద శాస్త్ర ,పురాణాదుల సారమే .వెంటనే ఫలితాన్ని ఇచ్చేదీ నేను ఒక సారి సరయు నది దగ్గర వుండగా ,నా తండ్రి వసిష్టుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు .

శివ ,వైష్ణవ ,శాక్తేయ ,గాణా పత్య మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు .వెంటనే ఫలితమిచ్చే మంత్రాలలో లక్ష్మీ నారాయణ విద్య ,భవానీ శంకర విద్యా ,సీతా రామ మహా విద్యా హనుమన్మహా విద్య చాలా ముఖ్యమైనవి.

వీటి తరువాత నృసింహ విద్య ,బ్రహ్మాస్త్ర విద్య అస్తార్ణ మారుతీ విద్య. ఎనిమిదవది సామ్రాజ్య లక్ష్మీ విద్య ,తొమ్మిది మహా గణపతి విద్య ,పది సౌర విద్య , పదకొండ వది దక్షిణ కాళీ విద్య .పన్నెండవ విద్య చింతామణి విద్య . వీటినే ద్వాదశ విద్యలు అంటారు. 

వీటిలో దక్షిణ కాళికా విద్య ఒక్క రాత్రిలో ఏ ఆచారమూ పాటించక పోయినా ఫలితాన్ని ఇస్తుంది .అస్తార్ణ మారుతీ విద్య ఇంకా తక్కువ సమయం లో ఫలితం చేకూరుస్తుంది .ఇందులో అనులోమ ,ప్రతిలోమంగా యాభై వర్ణాలు వుంటాయి. బాగా జపిస్తే బ్రహ్మాస్త్ర విద్యా మంచి ఫలితాన్నే ఇస్తుంది. నృసింహ విద్య ఇంతకంటే తక్కువ కాలం లో ఫలిస్తుంది .వీటి అన్నిటికంటే గురువు ద్వారా పొందిన ”పంచ వక్త్ర హనుమాన్ మంత్రం ”శీఘ్రం గా శిద్ధి నిస్తుంది.

ఈ జప మహాత్మ్యం వల్లనే అగస్త్యుడు సప్త సముద్రాల నీటిని పుడిసిలి లో పట్టి తాగ గలిగాడు. అర్జునికి,భీమునికి శత్రువులను జయించే శక్తి ,దీని వల్లే కలిగింది .విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీ రామానుగ్రహం తో పొందాడు .

హనుమాన్మంత్రం చేత జయం, గౌరవం, రాజ్యం ,జన వశ్యం అచంచల భాగ్యం కలుగుతాయి .ధర్మార్ధ కామ మోక్షాలు ఆపదలను పోగొట్టు కోవటం శత్రు జయం ,నిగ్రహానుగ్రహ శక్తి దీని వల్ల సాధ్యమవుతుంది .వాక్సిద్ది ,పుత్ర సంతానం ,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి .

అయితే గురు ముఖతా ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది ,గురువును సంతృప్తి పరిచి ధ్యానిస్తే గొప్ప ఫలితం వుంటుంది .పరి శుద్ధ మైన మనసు తో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలి .అన్ని విద్యలకు ఇది ఆధార మైన మంత్రం .పంచ వక్త్ర మహా విద్య గురు కృప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది.

శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని,వెయ్యి శిరస్సులున్న ఆది శేషుడు కూడా వందల సంవత్స రాలు చెప్పినా తరగదు .”అని పరాశర మహర్షి మైత్రేయ మునికి శ్రీ ఆంజనేయ  మంత్ర మాహాత్మ్యాన్ని వర్ణించి చెప్పాడు .

::(())::


🙏 *శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం —2* 🙏

 🌻 *విజయుని చరిత్ర* 🌻

🍃🥀శ్రీ ఆంజనేయ స్వామిని అర్చించి తరించిన భక్తుల చరిత్రలను పరాశర మహర్షి ,మైత్రేయునికి తెలిపాడు .అందులో విజయుని  చరిత్ర ను ముందుగా తెలియ జేస్తున్నాను. త్రేతాయుగం లో” చంద్ర కోణం” అనే ప్రసిద్ధి చెందిన నగరం వుంది .దాన్ని విజయుడు అనే మహారాజు పాలిస్తున్నాడు .అతడు బలశాలి ,శత్రు సంహారకుడు ,సమర్ధుడు .యుద్ధ విద్యలో చేయి తిరిగిన వాడు .

🍃🥀నాలుగు దిక్కుల లో వున్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసు కోవాలనే బల మైన కోర్కె అతనికి కలిగింది .రాజ్యాన్ని కుమారులకు అప్పగించి,పెద్ద సైన్యం తో  ,జైత్ర యాత్రకు బయల్దేరాడు .కొంత ప్రయాణం చేసిన తరు వాత ”గర్గ మహర్షి ”ఆశ్రమం చేరాడు .సైన్యాన్ని దూరం గా వుంచి ,తానొక్కడే మహర్షిని సందర్శించాడు .భక్తీ తో ఆయనకు నమస్కరించి నిలుచున్నాడు .ఆతని శ్రద్ధ  కు భక్తికి సంతోషించిన గార్గుడు కుశల ప్రశ్న లతో  స్వ్వాగతం పలికి ,ఆతిధ్యం ఇచ్చాడు .

🍃🥀గర్గముని- రాజైన విజయుడి తో ”రాజా !స్వాగతం .ఎక్కడి నుంచి బయల్దేరావు ?ఎక్కడి దాకా ప్రయాణం ”?అని అడిగాడు .దానికి రాజు విజయుడు వినయం తో ”మహర్షీ !మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే వుంది .ఇంటి నుంచే బయల్దేరాను .సర్వ దిక్కుల లో వుండే రాజ్యాలన్నీ జయిన్చాలనే కాంక్ష తో దిగ్విజయ యాత్రకు బయల్దేరాను .నా దిగ్విజయ యాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి ,నాకు పని సానుకూలం ఆవటానికి ఇంకా ఏదైనా ఉపాయం వుంటే సెలవివ్వండి ”అని విన్నవించాడు

🍃🥀గర్గమహర్షి సంతోషించి ”నీ కోరిక మంచిదే .అయితే ఏ పని కైనా దైవ అనుగ్రహం కావాలి .అప్పుడే ఆ కోరిక నెర వేరుతుంది .సఫల మనో రాదుడవై ”విజయుడు ‘అనే పేరు సార్ధకం చేసుకో .ఎన్నో మంత్రాలున్నాయి .కాని శీఘ్రం గా ఫలసిద్ధి నిచ్చేది మాత్రం ”హనుమన్మంత్రం ”ఒక్కటే .అది భక్తులకు అందుబాటు లో వుంటుంది .

🍃🥀యుద్ధం లో జయాన్ని నీకు అందిస్తుంది నేను నీకు ఆ మహా మంత్రాన్ని ఉపదేశిస్తాను .దాన్ని త్రికరణ శుద్ధి గా ,భక్తీ ,శ్రద్ధలతో జపించు .నువ్వు అనుకొన్నది సాధించ గలుగుతావు ”అని చెప్పి ,బీజ సహితం గా ,మంత్ర ,ఉద్ధార ,,న్యాస పూర్వకం గా అష్టాక్షరీ హనుమంమంత్రాన్ని గర్గుడు ,విజయునికి ఉపదేశించాడు .

🍃🥀గర్గాశ్రమం లోనే విజయ మహారాజు వుండి ,ఆయన సన్నిధి లోనే మంత్రం మీద ,మంత్ర దైవం అయిన ఆంజనేయుని మీద సమాన భావం తో విశ్వాసము ,గౌరవము చూపించి ,108 సార్లు జపించాడు .శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది ,సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షం అయాడు .ఆనంద బాష్పాలు కారుతుండగా ,విజయుడు ,వాయునందనుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు .

🍃🥀నాలుగు ముఖాలు కల బ్రహ్మ ,ఆరు ముఖాల కుమార స్వామి ,వెయ్యి ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్య పడేట్లు ఒకే ఒక ముఖం గల విజయుడు హనుమను పెక్కు విధాల కేర్తించాడు .అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకొన్నాడు .

హనుమ భగవానుడు సంతృప్తి చెంది ,విజయుని తో ”నీ యడల ప్రసన్నుడిని అయాను నీకు శుభం కలుగు తుంది .ఏదైనా వరం ఇస్తాను కోరుకో” అన్నాడు 

🍃🥀మనసులో సంతోషించి ,దోసిలి ఒగ్గి వాయుసుతునుకి మళ్ళీ నమస్కరించి ”అతి తక్కువ కాలమ్ లోనే నాకు దర్శనం ఇచ్చి ,నన్ను క్రుతార్దుడిని చేశావు మహా బలవంతా ,ఆంజనేయా !నీ దర్శనమే కోరిక లన్నిటినీ తీరుస్తుంది .అయినా నా మీద ప్రేమతో వరం కోరుకో మన్నావు ,తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు .నీ కృప అపారం .నా మనసులో నాలుగు దిశలు జయిన్చాలనే కోరిక వుంది .నీ అనుగ్రహం కావాలి దానిని తీర్చి ,నాకు మేలు చేయి ”అని ప్రార్ధించాడు .

🍃🥀ఆంజనేయుడు అతని వినయ వచనాలకు సంప్రీతుడై ,వాత్చల్యం తో ”రాజా !నాలుగేమిటి ?పది దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్ధకం చేసుకో .అయితే ,ఈ జన్మలో నీ కోరిక తీరదు .రాబోయే ద్వాపర యుగాంతంలో ఈ కోరిక నెర వేరుతుంది .అప్పుడు నువ్వు స్వర్గాది పతి దేవేంద్రుని కుమారుడి వైజన్మిస్తావు .శ్రీ కృష్ణుని సారధిగా చేసు కోని ,అన్ని దిక్కులను జయిస్తావు .

🍃🥀కురు క్షేత్ర సంగ్రామం లో కౌరవులను జయిస్తావు .అప్పుడు నీ రధానికి నేను జెండా పై అధివసించి ,నీ కు విజయం చేకూరుస్తాను .నేను వుండే ఆ జెండాను ”కపిధ్వజం ”అంటారు .నిన్ను ”కపిధ్వజుడు ”అని పిలుస్తారు”అని వరం ప్రదానం చేసి మారుతి అంతర్ధానం అయాడు .

🍃🥀హనుమ చెప్పిన మాట విని ,విజయ మహారాజు తన జైత్ర యాత్రను విరమించు కోని ,గర్గ మహాముని ఆశీస్సులను అందుకొని ,ఆయన కు నమస్కరించి ,,మళ్ళీ రాజా దానికి చేరు కొన్నాడు . .

రాజ్యాన్ని ధర్మ సమ్మతంగా ,ప్రజా క్షేమంగా పరిపాలించి ,చివరికి స్వర్గ లోకం చేరాడు .

🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం –3 🙏

🌻 మైన్దుని కధ 🌻


🍃🥀పూర్వం సుందరి అనే ఒక పట్టణం వుండేది. అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా వర్ధిల్లింది.అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద,శాస్త్రాలన్నీ బాగా చదువు కొన్న వాడు. అతనికి ”హనుమంమంత్రం ”అంటే మహా ప్రీతి.అన్నిటి సారం అందులోనే వుంది అని తెలుసు కొన్నాడు. నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించే వాడు.

🍃🥀మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు. నిష్కాముడుగా జీవించటం నేర్చుకొన్నాడు.
మైన్డుడికి కాశీ వెళ్లి శ్రీ విశ్వనాదున్ని దర్శించాలనీ ,గంగా స్నాంనంతో పులకించాలని అనిపించింది. చాలా ప్రయాస పడి నడిచి వారణాసి చేరాడు. గంగా నదికి దక్షిణ తీరం చేరాడు. ఆ నదీమ తల్లికి భక్తీ తో నమస్కరించాడు నది నిండుగా ప్రవహిస్తోంది. దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు.

🍃🥀కొంత సేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది దానిని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది. తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడి నట్లు గుర్తించారు. నీరు ,దాని ద్వారా పడవ లోకి చేరుతోంది. పడవ బరువెక్కి ,మునిగి పోవటానికి సిద్ధంగా వుంది. భయం వేసిన మైందుడు ,తల మీద వస్త్రాన్ని కప్పు కోని ,భక్తీ తో హనుమంమంత్రాన్ని” పఠిస్తున్నాడు.

🍃🥀హనుమ దీనిని గమనించి ,తన భక్తుని కాపాడాలనే సంకల్పంతో ఒక ”వానర ”రూపం ధరించి ,ఆ పడవను నెత్తినా పెట్టుకొని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకొని వెళ్లి ,అక్కడ మనుష్యులంతా చూస్తుండగా అదృశ్య మైనాడు. దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో నిండి పోయారు. భక్తీతో ,ఆ కోతికి నమస్కరించారు పడవలో నిశ్చల జపంలో వున్న మైన్డుడికి ఇదేమీ తెలీదు. తెల్ల వారి లేచి చూసే సరికి గంగ ఒడ్డున పడవ వుండటం చూసి ఆశ్చర్య పడ్డాడు.

🍃🥀పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరిందో తెలీలేదు. అప్పుడు ఒడ్డున వున్న ఒక మనిషి ఓకే మహా వానరం ఈ పడవను తలమీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్లి పోయిందని చెప్పాడు .

🍃🥀మైన్డుడికి ఆశ్చర్యం వేసి ”మీరు పుణ్యాత్ములు ,వానర రూపంలో హనుమను దర్శించారు. జపం చేస్తూ నేను ఏదీ గమనించ లేక పోయాను. నేను అదృష్ట హీనున్ని హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా గంగ పాలు చేస్తాను ”అని చెప్పి గంగా నదిలోకి దూకటానికి సిద్ధమైనాడు.

🍃🥀అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి ,వాత్సల్యంతో నిజ రూపంతో మైన్డునికి దర్శనం ఇచ్చాడు. హర్ష పులకితుడై మైందుడు హనుమను స్తుతిం
చాడు.

🍃🥀🌼”ఉస్త్రా రూఢ ,సువర్చలా సహచర ,సుగ్రీవ మిత్రాంజనా సూనో ,వాయుకుమార ,కేసరి తనూ ,జా అక్షాది దైత్య కాన్తకా సీతా శోక హరా ,అగ్ని నందనా ,సుమిత్రా సంభావ ,ప్రాణదా –శ్రీ భీమాగ్రాజ ,శంభు పుత్ర ,హనుమాన్ ,పంచాష్య తుభ్యం నమః ”అని చేసిన స్తోత్రానికి ఆనంద పరవశుడై హనుమ భక్తా !మిందా !నువ్వు ఈ లోకం లో భాగాలన్నీ అనుభవించు. నీ దగ్గరే నేను ఉంటాను. జీవితాంతంలో నన్ను పొందుతావు ”అని వరం ఇచ్చి అదృశ్యం అయాడు .

🍃🥀అలాగే మైందుడు భక్తీ తో జీవించి ,సుఖాలు పొంది ,చివరికి హనుమంమంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు.



🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

[7:41 pm, 07/06/2021] +91 94414 08564: శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం –4 🙏

🌻 బ్రహ్మ దేవుని చరిత్రం 🌻


🍃🥀శ్రీ హనుమానుడు సువర్చలా దేవితో గంధ మాదన పర్వతం మీద సుఖంగా వున్నాడు. శ్రీ రామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ ,శ్రీ రామ నామ పానాన్ని అనుభవసిస్తున్నాడు. అయినా ఒక రోజూ ఆయనకు శ్రీ రామ దర్శనం చేయాలనే కోరిక కలిగింది. అంతే వెంటనే బయల్దేరి గంధ మాదనం నుంచి బయల్దేరి అయోధ్యకు చేరాడు. శ్రీ రాముని సందర్శించి భక్తీ ,వినయం తో నమస్కరించి స్తుతి చేసి ,ఆయన మనస్సును గెలిచాడు.

🍃🥀అప్పుడు సీతా రాముడు హనుమను గాడంగా ఆలింగనం చేసుకొన్నాడు. శిరస్సును మూడు సార్లు ముద్దు పెట్టుకొన్నాడు. హనుమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసు కొన్నాడు. ఆంజనేయుడు ”రామా !నువ్వు వుండగా ,కులాసాకు ఏమి కొదవ?నీ పై భక్తీ వున్న వాళ్ళందరికీ క్షేమమే నన్ను ఆలింగనం చేసుకొని  నాకు  పరమానందాన్ని కలిగించావు నాకు ఉక్కిరి బిక్కిరిగా వుంది మాట రావటం లేదు ”అన్నాడు.

🍃🥀హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి ”హనుమా !సీతాదేవి లంకలో వున్న కాలంలో చాలా కస్టాలు అనుభవించింది రావణ సంహారం తర్వాత ,అయోధ్యలో ఉంటున్నా ఆమె ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు. నా వ్రేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మ కోరగా ఆయనకు ఎవరికి తెలియ కుండా ఇచ్చాను. ఆ ముద్రికను చూస్తే కాని జానకి సంతోషించదు నువ్వు బ్రహ్మ లోకానికి వెళ్లి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకొని రావాలి ”అన్నాడు.

🍃🥀అతి వేగంగా హనుమ బ్రహ్మను చేరి ,సనకసనందనాదులు స్వాగతం చెప్పగా ,బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెళ్ళారు .ఆయన అర్ఘ్య ,పాద్యాదులు ఇచ్చి ,కుశల ప్రశ్నలు వేసి ,ఉచిత ఆసనం పై కూర్చో పెట్టాడు. షోడశోప చారాలు చేసి పూజించాడు. హనుమను వచ్చిన కారణం అడిగాడు బ్రహ్మ. హనుమ శ్రీరాముని ఆజ్ఞను తెలియజేశాడు. దానికి బ్రహ్మదేవుడు ”నా ప్రార్ధన విని శ్రీ రాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు.

🍃🥀రోజూ నేను దాన్ని పూజిస్తూ,శ్రీ రాముడిని ధ్యానం చేస్తున్నాను .దాన్ని యెట్లా ఇవ్వమంటావు ?”అన్నాడు .దానికి హనుమ ”సృష్టి కర్తా !నా మాట విను .ఆ ఉంగరం మీదే సీతా సాధ్వి ద్రుష్టి నిలిపి వుంది .రోజూ రోజుకు కృశించి పోతోంది .ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది .వెంటనే తీసుకొని రమ్మని శ్రీ రామాజ్ఞ ”అని తెలిపాడు. అయినా చతుర్ముఖ బ్రహ్మలో మార్పేమీ రాలేదు .

🍃🥀ఇప్పటి వరకు ఎంతో శాంతంగా వున్న హనుమ ఒక్క సారిగా తన తనువును విపరీతం గా పెంచాడు. సత్య లోకం దాటి శరీరం పెరిగి పోయింది. దశ దిశలా ఆక్రమించాడు. బ్రహ్మాండాన్ని బద్దలు చేసేట్లు తయారయాడు. ఆ తేజస్సుకు లోకాలు భస్మం అయేట్లున్నాయి. ప్రళయ కాల మేఘం లాగా విజ్రుమ్భించాడు .ఇరవై చేతులతో ,ఇరవై ఖడ్గాలను ధరించి ,భయంకరమైన ముఖంతో ,తీక్షణమైన కోరలతో ,మహా సింహంలాంటి విశ్వ రూపాన్ని ధరించి ,ప్రళయ కాల గర్జన చేశాడు.

🍃🥀బ్రహ్మ ,మిగిలిన దేవతలు ,మహర్షులు,ఆశ్చర్యంతో భయపడి పోయారు. అందరూ భక్తీ తో రామ నామం జపించారు .సనకస నందనులు బ్రహ్మతో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించమని హితవు చెప్పారు .
అప్పుడు బ్రహ్మ హనుమంతుని భక్తిగా స్తుతించాడు. హను మంతుని విశ్వ రూపాన్ని చూసి విభ్రమం పొందాడు బ్రహ్మ ..బ్రహ్మ ప్రార్ధన విని ,హనుమ తన రూపాన్ని ఉప సంహరించాడు .

🍃🥀అప్పుడు బ్రహ్మ ”హనుమా !అదిగో సరస్సు .దానిలో అనేక రామ ముద్రికలున్నాయి .అంతకు పూర్వం వున్న ,అనంత కల్పాలు ,అందులో రామావతారాలు ,కని పిస్తాయి ..ఆయా అవతారాలలో బ్రహ్మకు ఇచ్చిన రామ ముద్రికలన్నీ కనిపిస్తాయి. వాటిలో ఏది శ్రీ రాముని ముద్రికయో పరీక్షించి తీసుకో ”అన్నాడు.
హనుమ సంతోషంలో ఆ సరస్సులో మునిగాడు.

🍃🥀రామ ముద్రికలు అనేకం కనిపించాయి. ఏమీ పాలు పోలేదు. వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేశాడు .ఆది భౌతిక ,ఆధ్యాత్మిక తాపాలన్నీ తొలగి పోయేట్లుగా ఆ సరస్సు లో స్నానం చేశాడు ఆనందించాడు బ్రహ్మకు నమస్కరించి ,సీతా రామ సన్నిధికి చేరాడు. ఆనందామృత సరస్సులో మునుక లేసి వచ్చిన ఆన్జనేయుడిని శ్రీ రాముడు సాదరంగా స్వాగతించి ‘హనుమా !నువ్వు తెచ్చిన ఆ ముద్రికను ఇవ్వు దాన్ని సీతకు ఇచ్చి సంతోషం కలిగిస్తాను ”అన్నాడు.

🍃🥀ఆంజనేయుడు జంకుతూ వెనుక అడుగు వేస్తున్నాడు. భక్తుని అవస్థను భగవంతుడు గ్రహించాడు .”హనుమా !భక్త శేఖరా !ఎందుకు భయం?నీకు నాకు భేదం లేదు కదా...భయం వదిలి పెట్టి బ్రహ్మ లోకంలో నువ్వు చూసిన వింతలు తెలియ జెయ్యి ”అన్నాడు చాలా ప్రేమగా .

🍃🥀రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమ ”భగవాన్ ! నీకు నమస్కారం సత్య లోకంలో చతుర్ముఖ బ్రహ్మ భార్య సరస్వతీ దేవితో ఆనందం గావున్నారు. అక్కడ బ్రహ్మర్షులు ,వేదాంతులు ,జిత క్రోదులు వున్నారు. వారి భాగ్యమే భాగ్యం అక్కడ అమృత సరస్సు వుంది .అక్కడ నీ ముద్రికలు అనేకంగా కన్పించాయి. వాటిని చూసి నమస్కరించి వచ్చేశా…
[7:42 pm, 07/06/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌻 తిరుమల సర్వస్వం 🌻


🎈 భాగము 91 (ఆనందనిలయ నిర్మాణం) 🎈



🍃🌹శ్రీనివాసుడు ఈలోగా - ఆకాశరాజు తమ్ముడైన తొండమానుని పిలిచి, ఈ ఆరునెలల వ్యవధిలో వేంకటాచలంపై తాము నివసించడానికి ఓ అద్భుతమైన భవనాన్ని వాస్తు ప్రకారం నిర్మించి ఇమ్మని ఆదేశించాడు. ఆ భవనంలో తాము కలియుగాంతం వరకు నివసిస్తామని, తద్వారా తొండమానుని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా శెలవిచ్చాడు.

🍃🌹శ్రీవారి ఆనతిని శిరసావహించిన తొండమానుడు - అత్యంత స్వల్పసమయంలో, తిరుమల క్షేత్రంలో స్వామిపుష్కరిణికి దక్షిణ భాగాన, తూర్పు ముఖంగా, ఆదివరాహుడు శ్రీనివాసునికి ఆవాసనిమిత్తం ఇచ్చిన స్థలంలో, మూడు ప్రాకారాలు - ఏడు ప్రవేశ ద్వారాలు – బంగారు గోపురం - ధ్వజస్తంభ పరివేష్ఠితంగా ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మింపజేశాడు. అదే ఈనాడు తిరుమలలో సర్వాంగ సుందరంగా, నిత్యకళ్యాణం - పచ్చతోరణంగా శోభిల్లే "ఆనందనిలయం" అనబడే ముఖ్యాలయం. అందులోనే శ్రీవారు అర్చామూర్తి రూపంలో, దేవేరులిద్దరితో ఈనాటికీ కొలువై ఉన్నారు.

🍃🌹భవననిర్మాణం పూర్తికాగానే, గృహప్రవేశం చేయవలసిందిగా శ్రీవేంకటేశ్వరునికి వర్తమానం అందింది.


🌻 శ్రీనివాస మంగాపురం- ముక్కోటి 🌻


🍃🌹శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా శ్రీవరాహక్షేత్రానికి బయలుదేరుతూ, అగస్త్యుని ఆతిథ్యానికి సంతుష్టుడై, ఆరునెలల పాటు తాము నివసించిన ఆ ప్రదేశం తమ దంపతు లిరువురి పేరునా, "శ్రీనివాసమంగాపురం" గా ప్రసిద్ధిగాంచు తుందని, అందులో తాను "కళ్యాణ వేంకటేశ్వరుని" గా కొలువై ఉంటానని శెలవిస్తాడు. మనందరికీ సుపరిచితమైన ఈ "శ్రీనివాస మంగాపురం" ఆలయం గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం!

🍃🌹అయితే, స్థానికుల కథనం ప్రకారం - పద్మావతీ శ్రీనివాసులు, ఆ ఆరునెలల్లో పగటిపూట అగస్త్యుని ఆశ్రమంలోను, రాత్రివేళల్లో శ్రీనివాసమంగాపురంలో నున్న మరో ఆశ్రమం లోనూ నివసించేవారట! తిరుపతికి సమీపంలో, సువర్ణముఖి నదీతీరాన, నేటి "తొండవాడ" గ్రామంలో, "ముక్కోటి" గా పిలువబడే దేవాలయమే పద్మావతీ - శ్రీనివాసులు కొలువున్న ఆశ్రమం. ఈ విషయం ఆ ఆలయ కుడ్యాలపై చిత్రించబడి ఉంది. ఈ ఆలయాన్ని నేడు కూడా మనం చూసి తరించవచ్చు.


🌻 శుభమస్తు 🌻


🍃🌹పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టం భక్తిశ్రద్ధలతో ఎవరు విన్నా, చదివినా, పారాయణం చేసినా; వారి వివాహమహోత్సవం ఎవరు జరిపించినా, శ్రీనివాసుని అనుగ్రహంతో వారింట సర్వశుభాలు కలుగుతాయని తరతరాల నమ్మిక.

🍃🌹శుభప్రదము, సర్వమంగళకరము అయిన "పద్మావతి పరిణయం" ఇక్కడితో ముగిసింది. ఆకాశరాజు ఎవరు? తొండమానుని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? త్రేతాయుగం నాటి వేదవతికి - కలియుగపు పద్మావతిదేవికి ఉన్న సంబంధం ఏమిటి? శ్రీనివాసమంగాపురం - ముక్కోటి ఆలయాల పూర్తి వివరాలు - వీటన్నింటినీ విపులంగా తెలుసుకుందాం.



🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🙏 శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం –5 🙏

🌻 నీలుడి కధ 🌻


🍃🥀రావణ వధ తర్వాత ,లంకా రాజ్యానికి విభీషనుడికి పట్టాభిషేకం చేయించాడు. తమ్ముడు లక్ష్మణునితో శ్రీ రాముడు. అతడు ధర్మ బద్ధంగా రాజ్య పాలన చేస్త్రున్నాడు. విభీషణుడి కొడుకు పేరు నీలుడు.ఇతడు గుణము,బలము విద్యలలో మేటి. ఒక సారి నీలుడు ,తండ్రి విభీషణుడి దగ్గరకు చేరి ,నమస్కరించి ఇలా అన్నాడు”తండ్రీ !మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ ,సంతోషాలతో వర్ధిల్లుతున్నారు.

🍃🥀వారికేమీ లోటు లేదు మనకు ధనం సంపదలకు కొదవ కూడా లేదు. అయినా మన రాజ్యమైన లంకలో ”చింతామణి ,కామధేనువు ,కల్పవృక్షం ”లేని లోటు బాగా కన్పిస్తోంది నాకు. మీరు, శ్రీ రాముని పద సన్నిధిని చేరి ,లంక సామ్రాజ్యాన్ని దక్కించుకొన్నా ,వీటిపై మీకు ద్రుష్టి లేదు. వాటిని మీరు ఎందుకు పొందలేక పోయారు?నాకు అనుజ్న ఇస్తే వాటిని సాధించి ,తీసుకొని వచ్చి ,మన లంకలో ఉంచు  తాను”అన్నాడు వినయంగా....

🍃🥀నీలుని మాటలను విన్న తండ్రి విభీషణుడు ”కుమారా,నీలా !నేను శ్రీ రామచంద్ర పాదాబ్జ మకరందాన్ని గ్రోలే తుమ్మెదను .ఆ రామ ప్రభు దివ్యాను గ్రహం వల్ల అన్ని సుఖాలు ,ఆనందాలు ,భోగ ,భాగ్యాలు అనుభవిస్తున్నాను. బ్రహ్మానంద రసాను భూతిని అనుభవిస్తున్నాను. దేవతలకు కూడా సాధ్యం కాని దీర్ఘాయుస్సు ,సామ్రాజ్యము నాకు శ్రీ రామకృప వల్ల లభించాయి.

🍃🥀శ్రీ రాముడే నా చింతామణి ,కామ ధేనువు ,కల్ప వృక్షం .అంత కంటే వేరే ఏమీ నాకు అక్కర లేదు. రాముని కరుణ వల్ల ,ఇంద్రాది అష్ట దిక్పాలకులు ,నా వశంలోనే వున్నారు. కనుక నాకు నువ్వు చెప్పిన ఆ మూడిటి అవసరం లేక పోయింది .అవి లంకలో లేవనే చింత వదిలెయ్యి .శ్రీ రామ పద భక్తితో ధన్యుడవు అయే ప్రయత్నం చెయ్యి ”అని అనునయంగా చెప్పాడు.

🍃🥀తండ్రి మాటలు ,నీలుడికి రుచించ లేదు .కీర్తి కాంక్షతో తహ తహ లాడి పోతున్నాడు. మళ్ళీ తండ్రి తో వాటి అవసరాన్ని తెలియ జేశాడు. చివరికి విభీషణుడు మెత్త బడి ”నీ కోరికను కాదన లేక పోతున్నాను. వాటిని సాధించి ఇక్కడికి తీసుకొని రావటానికి గురువు అనుజ్న చాలా ముఖ్యం.ముందుగా మన కుల గురువు శుక్రాచార్యుల వారి శుశ్రూష చేసి ,అనుగ్రహం సంపాదించి ,అప్పుడు ,ఆయన అనుమతితో ప్రయత్నం చెయ్యి ”అని సలహా ఇచ్చి ,ఆశీర్వదించి నీలుడిని పంపాడు.

🍃🥀తండ్రి అనుమతితో సగం కార్యం తీరింది అని సంతోషించిన నీలుడు గురువు శుక్రాచార్యుల వారిని ,చేరి పూజించి ,నమస్కరించి ,చేతులు జోడించి ”గురుదేవా !మా తండ్రి విభీషణ మహారాజు ఆనతితో మిమ్మల్ని ఆశ్రయించటానికి వచ్చాను.నాకు చింతామణి ,కల్ప వృక్షం,కామధేనువులను సాధించి ,లంకలో వాటిని ఉంచాలి అన్న కోరిక కలిగింది.దీనికి మీ అనుగ్రహం కావాలి.ప్రసాదించండి ‘అని వేడు కొన్నాడు.

🍃🥀నీలుని భక్తీ తత్పరత,వినయం ఆచార్యులకునచ్చి ” కుమారా !ఈ రోజూ మృగశిరా నక్షత్రం.ఈ నక్షత్ర కాలంలో కొత్త మంత్రోపదేశానికి మంచిది. దాన్ని జపిస్తే నీ కోరిక శీఘ్రంగా ఫలిస్తుంది.శ్రీ హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను.శ్రద్ధతో జపించి నీ కోర్కెను సాధించుకో ”అని చెప్పి ,వెంటనే ”పంచ ముఖ ఆంజనేయ మంత్రం ”ఉపదేశించాడు. జగన్నాధ క్షేత్రం చేరి ,దీక్షతో ,ఆ మంత్రాన్ని ,త్రికరణ  శుద్ధి గా, జపించమని చెప్పాడు శుక్రా చార్య గురు వరేన్యుడు .

🍃🥀పంచముఖ ఆంజ నేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు. ”పంచ వక్త్రం ,మహాభీమం ,కపి యూద సమన్వితం బహుభిర్దశ భిర్యుక్తం ,సర్వ కామార్ధ సిద్ధిదం
పూర్వంతు ,వానర వక్త్రం ,కోటి సూర్య సమ ప్రభం-దంస్త్రా కరాల వదనం భ్రుకుటీ కుటి లేక్షణం . ”
”అస్త్వైవ దక్షిణ వక్త్రం ,నారసింహం ,మహాద్భుతం –అత్యుగ్ర తేజో వపుషం ,భీషణం ,భయ నాశనం ”
”పశ్చిమే ,గారుడ వక్త్రం ,వక్ర తుండం ,మహాబలం –సర్వ నాగ ప్రశమనం ,సర్వ భూతాది కృంతనం”
”ఉత్తరే సూకర వక్త్రం ,కృష్ణ దీప్త నభో మయం -పాతాలే సిద్ధ భేతాళ ,జ్వర రోగాది కృంతనం ”
ఊర్ధ్వం హయాననం ,ఘోరం ,దాన వాన్తకరం ,పరం -యేన వక్త్రేనా విప్రేంద్ర తాట కాయా ,మహా హవె ”
దీని భావం తెలుసుకొందాం .

🍃🥀పంచముఖ ఆంజ నేయుడు సర్వ సిద్ధి ప్రదాత .తూర్పు ముఖం’ వానర ముఖం” .కోటి సూర్యుల కాంతితో ,భీకరమైన కోరలతో ,భ్రుకుటి ముడిచి కని పిస్తుంది .దక్షిణ ముఖం ‘నార సింహ ముఖం ”మహాద్భుతంగా ,మృత్యువును తెచ్చే ఉగ్ర రూపం గా ,తేజో వంతంగావుంటుంది. భయ నాశనం చేస్తుంది. పశ్చిమ ముఖం ”గరుడిని ముఖం ”దీనికి వక్ర తుండం వుంటుంది. సర్పాల విషాన్ని నాశనం చేస్తుంది. సర్వ భూతాలను అదుపు లో ఉంచుతుంది.

🍃🥀ఉత్తర ముఖం ”సూకర ముఖం ”.ఈ వరాహ ముఖం నల్లని కాంతి తోవుంటుంది. భేతాళ ప్రయోగాల్ని ,జ్వరం మొదలైన రోగాల్ని నాశనం చేస్తుంది. పై ముఖం ”హయ ముఖం. ఇది మోక్షాన్ని ఇస్తుంది .ఇలాంటి మహా మహిమాన్విత మైన అయిదు ముఖాలకు చెందిన ”బీజాక్షరాలు ”తో భక్తీ గా మంత్రాలను జపిస్తే ,కోరిన కోరిక తీరుతుంది .

🍃🥀గురువు అనుమతి తో నీలుడు ,బయల్దేరి ‘నీలా చల  క్షేత్రమైన పూరి ,జగన్నాధ క్షేత్రాన్ని” చేరాడు .అక్కడ ఒక మహా పర్వతం ,దానికింద పెద్ద అడవి వున్నాయి .ఆ పర్వతం మీదకు చేరి ,అక్కడి జలాశయం దగ్గరున్న కొండ బిలంలో ప్రవేశించి దీర్ఘ తపస్సు చేయటం ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితంగా కోటి సూర్య ప్రభలతో ,ముప్పది మూడు కోట్ల అర్బుదగణంతో” సంజీవ రాయుడు” అయిన ఆంజనేయ స్వామి ,నీలుడికి ప్రత్యక్షమైనాడు.

🍃🥀శంఖ ధ్వని వంటి ధ్వనితో నీలున్ని పిలిచాడు ,వెంటనే మేల్కొన్న నీలుడు ,ఆయన పాదాల పై సభక్తికంగా వాలి పోయాడు కళ్ళ వెంట ఆనంద  బాష్పాలు ధారా పాఠంగా కారి పోతున్నాయి .నీలున్ని బుజం పట్టి పైకి లేపాడు హనుమ. నీలుడు అత్యంత భక్తీ తో స్తోత్రం చేశాడు . దీన్నే ”నీల కృత ఆంజనేయ స్తోత్రం ”అని పేరు .చాలా మహి మాన్విత మైన స్తోత్రం .దానికి విపరీతంగా సంతోషించి హనుమ ”నీలా !నీ తపస్సు ,ధ్యానాలకు మెచ్చాను.

🍃🥀నీ మనోభీష్టం నాకు తెలుసు .త్వర లో ఇంద్రుని జయిస్తావు. చింతామణి వగైరాలను పొందుతావు.దేవతా స్త్రీలలో అందమైనది ”వన సుందరి ”అనే స్త్రీ నీకు భార్య గా లభిస్తుంది .నువ్వు కోరక పోయినా ,బ్రహ్మ దేవుడే నీకు వరాలు అనుగ్రహిస్తాడు .లోకంలో ఎవరైనా సరే ,నీ లాగానా మంత్రాన్ని జపించి ,నా వ్రతాన్ని చేస్తే వారందరి కోరికలు నేను తక్షణమే తీరుస్తాను .నీ తండ్రి విభీషణుడు నాకు మంచి మిత్రుడు.

🍃🥀ఆయనా ,నేను శ్రీరాముని బంటులం.నా దక్షిణ భాగం లో నీకు సుస్తిరమైన స్తానం కల్పిస్తున్నాను .నువ్వు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం ఇక నుంచి ”పురుషోత్తమ క్షేత్రం ”అని పిలువ బడుతుంది.నీ కోరికలు న్యాయ బద్ధమైనవే.త్వరలోనే అవి తీర గలవు ”అని వరదానం చేసి ,పరివారంతో సహా అదృశ్యమైనాడు ఆంజనేయుడు .

🍃🥀శ్రీ హనుమ దర్శనంతో తృప్తి చెంది ,ఆయన వరాలను అందుకొన్ననీలుడు ,అక్కడి నుంచి బయల్దేరి మళ్ళీ గురువు శుక్రాచార్యుల సన్నిధి కి చేరాడు .భార్గవుడు చాలా సంతోషించి,ఆశీర్వ దించి ,తండ్రి విభీషణునికి వివరాలన్నీ తెలియ జేయ వలసినది గా చెప్పి పంపించే శాడు .లంకలో తండ్రి విభీషనుడిని చేరి ,జరిగిన విధానం అంతా పూస గుచ్చి నట్లు తండ్రికివిన్న   వించాడు .కుమారుని అద్భుత తపో వృత్తాంతం ,వర గ్రహణం విన్న విభీషణుడు ,పరమానందం పొందాడు.

🍃🥀నలుణ్ణి ఆశీర్వదించి అంతఃపురం చేరమని పంపాడు .నీలుడు చింతామణి మొదలైన వాటిని ఎలా పొందాడో తరువాతి కధలో తెలుసుకొందాం .


🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

 🙏 శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం – 6 🙏 6* 🙏

🌻 నీలుడి కధ -2 🌻



🍃🥀లంకకు చేరిన నీలుడు కొంత కాలమ్ తర్వాత మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడు .తనలో తాను ఇలా వితర్కించు కొన్నాడు ”రాజు పని వున్నా లేక పోయిన రాజ్యానికి నష్టం లేకుండా శత్రువులను భయ పెట్టాలి .శత్రు మర్దనుడు అనే బిరుదుపొందాలి. ఇలా చేయక పొతే ,శత్రువులకు తేలికై పోతాడు.మా జాతికి శత్రువు స్వర్గ లోకాది పతి ఇంద్రుడే అతని వద్ద నుండి చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువు నేను గ్రహించటం రాజ ధర్మం.

🍃🥀నెమ్మదిగా నయంతో సాధించటానికి ప్రయత్నిస్తా.ఇవ్వకపొతే యుద్ధం చేసి అయినా వాటిని దక్కించుకుంటాను .ఒక దూతను రాయ బారి గా ఇంద్రుడి వద్దకు పంపితే మంచిదని తోస్తోంది .అతని వల్ల సమా చారం తెలుసు కోని ,అప్పుడు మిగిలిన కార్యాన్ని గురించి ఆలో చిస్తా”అని దీర్ఘా లోచన చేశాడు .సమర్ధుడైన దూతను పిల్చాడు .అతనితో తన మనసు లోని మాట ఇలా తెలియ జేశాడు .”నా రాయ బారిగా ఇంద్ర లోకం వెళ్లి ,నేను చెప్పే మాటలు ఇంద్రునికి తెలుపు.

🍃🥀ఇంద్రుడు రాక్షసులకు విరోధి అని ,మనకు కావాల్సిన చింతామణి వగైరా లను మర్యాద గా అప్ప గించి ,సంతోషం కలుగ జేయ మని చెప్పు .లేక పొతే యుద్ధానికి సిద్ధం గా ఉండ మని తెలియ జేయి ”అని వివరం గా చెప్పి పంపాడు దూతను .

🍃🥀దూత ,నీలుడి మాటలను మననం చేసు కొంటు, స్వర్గ లోకం చేరాడు .అక్కడ దేవ సభ లో మహేన్ద్రుని సభకు చేరాడు ..ఇంద్రుడు, భార్య అయిన శచీదేవి తో సింహాసనం పై అధివసించి  వున్నాడు .దేవగురు బృహస్పతి ,దేవ లోక మహర్షులు అందరు ఉచిత ఆసనాలపై ఉపవిస్టు లైనారు.అప్సరసలు నృత్యాలు చేస్తుంటే గంధర్వులు కమ్మగా గానం చేస్తున్నారు.

🍃🥀రాక్షస రాజ కుమారుడు నీలుని దూత సభలో ప్రవేశించి ,మహేన్ద్రునికి నమస్కరించాడు .ఆయనా మర్యాద పూర్వ కం గా కుశల ప్రశ్నలు వేస్తూ స్వాగతించాడు .దూత నీలుడు చెప్పమన్న మాటలను ”సురాదిపా దేవేంద్రా !నేను లంకా రాజ్య పరి పాలకుడు విభీషణ మహా రాజు గారి సేవకుడిని .ఆయన కుమారుడు ,యువ రాజు నీలుని దూతను .శ్రీ మంతుడు ,సర్వ శస్త్రాస్త్ర  సంపన్నుడు ,ధర్మాత్ముడు ,భగవద్ భక్తుడు అయిన నీల మహా రాజు మీకు ఒక సందేశాన్ని ,నా ద్వారా పంపించారు.

🍃🥀సావదానం గా విని ప్రత్యుత్తరం ఇవ్వ వలసినది గా కోరు తున్నాను ”అని చెప్పి ,నీలుడు చెప్పి పంపిన విష యాలనన్నిటినీ ఏకరువు  పెట్టాడు .
అన్నీ విన్న సహస్రాక్షుడు కోపోద్రేకం తో ”నీలుడు అంతటి వాడు అయ్యాడా ?మా వజ్రాయుధం సంగతి మరిచాడా ?మహా బల సంపన్ను లైన పాకాసుర ,జమ్బాసురాది రాక్ష సుల కన్నా పోటు గాడా ?అతని పరాక్రమం ఏమిటో చూద్దాం .అతను అడిగిన వేవీ ఇవ్వం అని చెప్పు” ‘అని చెప్పి దూతను చంప రాదు కనుక ,శిఖ ను కత్తిరింప జేసి ,బయటికి వెడల గొట్టాడు ఇంద్రుడు.

🍃🥀ఇంతలో సభలో అశుభ శకునాలు కని పించాయి ,విని పించాయి .ఏదో ప్రమాదం జరుగ బోతోంది అనే  నేసూచన గమనించాడు ఇంద్రుడు .సభ చాలించి ,అంతః పురం చేరాడు .

🍃🥀ఇంద్ర సభలో జరిగిన పరాభవాన్ని మూట గట్టు కోని ,దూత నీలుని చేరి విషయం అంతా వివరించి చెప్పాడు .నీలుడు దూతకు జరిగిన పరాభవం తనకే జరిగినట్లుగా భావించాడు. తండ్రి విభీషణునితో మంత్రా లోచన చేశాడు .సైన్యాన్ని సమ కూర్చుకొని స్వర్గాన్ని ముట్ట డించటానికి సన్నద్ధుడై బయల్దేరాడు .కొద్ది కాలంలోనే స్వర్గం చేరి దేవ సైన్యం తో యుద్ధం ప్రకటించాడు.

🍃🥀ఇంద్రుడు కూడా సమయా సమయాలు తెలీకుండా ,అహంకార బల గర్వితుడై ,మద మత్స రాలతో ఊగిపోతూ పోరుకు తలపడ్డాడు .భయంకర యుద్ధం సాగింది .ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడి పై ప్రయోగించాడు .నీలుడు దాన్ని చేదించి నిర్వీర్యం చేశాడు .పరాభవంతో రగిలిన దేవేంద్రుడు నీలుడితో ద్వంద్వ యద్ధానికి దిగాడు .

🍃🥀ఇంద్ర నీలు లిద్దరూ బాహా బాహి ముస్టా ముష్టి యుద్ధం చేశారు .కుప్పించి తన్ను కొన్నారు ,కాళ్ళ తో కొట్టు కొంటున్నారు .యెగిరి మాటి మాటికీ బాదు కొన్నారు .క్రమంగా ఇంద్ర బలం క్షీణించి ,రాక్షసుడు అయిన నీలుని బలంపెరిగింది. ఇంద్రుడు కుస్తీ పోటీలో పీటీ దెబ్బ తిని నేల మీద కూలి పోయాడు .నీలుడు అమాంతం కుప్పించి ఎగిసి ఇంద్రుని వక్షస్థలం మీద చేరి పదు నైనఖడ్గం ఇంద్రుని గుండెలు చీల్చ టానికి పైకి ఎత్తాడు .

🍃🥀ఈ ఘోరం చూడ లేక అందరు భయ కంపితు లైనారు .అప్పుడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై నీలున్ని ఆపు చేశాడు .ఇద్దరికీ సంధి చేయటానికి తాను వచ్చానని బ్రహ్మవారిద్దరికీ చెప్పాడు .నీలుడు ఇంద్రుని
గుండెల మీద నుంచి లేచాడు .ఇంద్రుడు నీలుడు ఇద్దరు బ్రహ్మ దేవునికి నమస్కరించారు .భక్తీ తో కీర్తించారు .నీలుడు చేసిన బ్రహ్మ స్తవానికి నాలుగు ముఖాల బ్రహ్మ సంతోషించాడు .

🍃🥀దేవేంద్రునితో బ్రహ్మ ”పాక శాసనా !నీకు బుద్ధి ఇంకా రాలేదా ?ఇప్పుడు నీవు  అనుభవిస్తున్న స్వర్గాది పత్యం ,విభీషణుడి రాజాదికారం అంతా శ్రీ రాముడి దయ చేతనే ననే సంగతి మార్చి పోయావా?నీలుడు కోరిన కోరికలు అతి సాధారణ మైనవే .వాటిని మన్నించి ,అతనికి వాటిని ఇచ్చి వేస్తె మంచిది ”అని చెప్పాడు .

🍃🥀బ్రహ్మ ఇంద్రునికి హితోప దేశం చేస్తూ ”నీలుడు హనుమ భక్తుడు హనుమద్దాసులకు అప జయం లోకంలోవుండదు .చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువు లను ఈనీలునికి  సమర్పించించు .అతని క్షమాపణ కోరి సుఖంగా వుండు .”అని బోధించాడు .బ్రహ్మ వాక్కు లకు సిగ్గు పడి నీలున్న్ని క్షమాపణ కోరి నీలునికి చింతామణి ,కల్ప వృక్షం ,కామధేనువులను
ఒసగి ,సభక్తికంగా నిల బడ్డాడు.

🍃🥀అప్పుడు బ్రహ్మ నీలుని చూసి ”శ్రీ మంతా నీలా !నువ్వు మాకు ఇష్టుడ వైన భక్తుడవు .నా సంతోషం కోసం నీకు  ఒక వరం ఇవ్వా లను కొంటున్నాను.స్వీకరించు .నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశం ఇక నుంచి ”నీలా చలం ”అని నీ పేర పిలువ బడుతుంది .దీన్నే ”పురుషోత్తమ క్షేత్రం ”అనీ పిలుస్తారు .నీకు ”వనసుందరి ”అనే దేవతా స్త్రీ ని ఇస్తున్నాను .ఆమెను వివాహం చేసుకొని ,సర్వ సుఖాలు అనుభవించు.

🍃🥀కాలాంతరంలో నువ్వే ఇక్కడ ”నీలా చలేశ్వరుడు ”అనే పేరు మీద ఈ నీలా చలంలో వెలసి భక్తుల కోర్కెలను తీరుస్తావు .”అని చెప్పి వన సుందరిని ఇచ్చి యుద్ధంలో చని పోయిన వారందరినీ బ్రతికించి బ్రహ్మ లోకం చేరాడు బ్రహ్మ.

🍃🥀ఇంద్ర ,నీలాదులు పరమ సంతోషం పొందారు .ఇద్దరి మధ్య వైరం ఎంత త్వరగా ప్రారంభం అయిందో ,అంత  త్వరగా సమసి పోవటం ఉభయులకు ఆనంద దాయకం అయింది . .కాలం ఎంతటి వారినైనా కలుపు తుంది విడదీస్తుంది .కాల మహిమ ఎవరు తెలుసు కో లేరు .ఈ కధలను పరాశర మహర్షి మైత్రేయునికి వివరిస్తున్నాడని మనం ముందే తెలుసు కొన్నాం కదా.... నీలుడి కధ సమాప్తం


🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

🙏 శ్రీ ఆంజనేయ మహాత్మ్యం — 8 🙏

🌻 దూర్వాస మహర్షి కధ –2 🌻


💫🌹శివామ్షతో జన్మించిన దూర్వాసుడు ,అన్ని విద్యలు నేర్చి ,గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేస్తున్నాడు.అప్పుడు దేవదాసీ తిలోత్తమ ,ఆమె ప్రియుడు సాహసి అనే వాడు ఈ మహర్షిని గమనించకుండా రతి క్రీడలో పాల్గొన్నారు. వారి మాటలు ,చేష్టలు మహర్షి తపస్సుకు భంగం కల్గించాయి.

💫🌹ఆయన కళ్ళు తెరచి వారి కామోద్రేకానికి కినిసి వారిద్దరిని రాక్షసులుగా జన్మించమని శపించాడు. సాహసి ”గర్దభాసురుడు ”గా జన్మించాడు. ఇతడు మహా విష్ణువు చేతిలో మరణం చెండాడు. ఏమైనా భరద్వాజుని ఏకాగ్రత దెబ్బ తిని కామ వికారం కల్గి ,పెళ్లి చేసుకోవాలనే కోర్కె పెరిగింది.

💫🌹అదే సమయంలో చ్యవన మహర్షి కుమారుడు ”ఔర్వుడు ”అనే ఆయన తన కుమార్తె ”కందళి ”తో అక్కడికి వచ్చి మహర్షి మనసులోని ఆట తెలుసు కోని తన కూతురు కందళి నిచ్చి దూర్వాసునికి వివాహం చేశాడు. కందళి గంప గయ్యాళి ఆమెను భరించటం కష్టంగా వుంది. ఆమె కోపాన్ని భరించలేక ఆమెను వదిలి మళ్ళీ తపస్సుకు వెళ్ళాడు.

💫🌹ఆమెకు భర్తను వదలటం ఇష్టంలేక ఆతడిని అనుసరించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత దివ్య రూపంలో వున్న ఒక పిల్లవాడు అక్కడికి వచ్చి మహర్షితో కందలికను విడిచి పెట్ట వద్దనీ ఆమెయే తగిన అర్ధాంగి అవుతుందని చెప్పి వెళ్లి పోయాడు. కందలిక తన పేరు మీద కదళీ వృక్ష జాతిని సృష్టించింది. కందళి కడలిగా రంభగా అరటిగా పేరు మారింది.

💫🌹దూర్వాస మహర్షి గురించిన మూడో కధ.

💫🌹పూర్వం ”నాభాగుడు ”అనే రాజు వుండే వాడు. ఆయన కుమారుడే అంబరీషుడు. అంబరీషుడు విష్ణు భక్తుడు. ఏకాదశీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో చేసేవాడు. ఒక సారి ఏకాదశి ఉపవాసం వుంది ,మర్నాడు ద్వాదశి నాడు పారాయణ చేయటానికి సిద్ధమైన సమయంలో దూర్వాసుడు ఆయనకు అతిధిగా వచ్చి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు.

💫🌹ద్వాదశి ఘడియలు పూర్తి అయింది. సమయం అయినా మహర్షి రాలేదు. అక్కడున్న మార్షుల అనుమతితో  కొద్దిగా జలాన్ని తీర్ధంగా త్రాగాడు. తర్వాత దూర్వాసుడు వచ్చి ,జరిగిన దానికి కోపపడి తన శిరస్సులోని ఒక జడను పీకి దాన్ని పిశాచిగా మార్చి భక్త అంబరీషుని పైకి పంపాడు.

💫🌹అది అతి భయంకరంగా మీదకు రావటం గ్రహించి రాజు శ్రీ హరిని మనసులో ధ్యానించాడు వెంటనే విష్ణు చక్రం ఉద్భవించి పిశాచాన్ని చంపి దుర్వాసుని చంపటానికి మీదకు వెళ్ళింది. భయంతో దుర్వాసుడు పారి పోవటం ప్రారంభించాడు. చక్రం ఆయన్ను వెన్నంటే వెళ్తోంది. మూడు లోకాలూ తిరిగినా ఎవరూ దుర్వాసునికి అభయం ఇవ్వలేదు.

💫🌹చివరికి విష్ణువు ఆజ్ఞతో మళ్ళీ అంబరీశున్నే శరణు వేడాడు. అంబరీషుడు అతన్ని క్షమించాడు. వెంటనే చక్రం అదృశ్యమైంది. భగవంతుని కంటే ,భక్తుడే శక్తి కలవాడు అని ఈ కధ మనకు తెలియజేస్తుంది.

💫🌹ద్వాపర యుగంలో కుంతిభోజుడు అనే రాజు దగ్గరకు దుర్వాసుడు వచ్చాడు. ఆయన కుమార్తె కుంతీ దేవిని చూసి ,ఆమె భక్తికి మెచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఏ దేవుడిని ఉద్దేశించి జపిస్తే ఆయన వల్ల మంచి సంతానం కలుగుతుందని చెప్పాడు. కుంతీ దేవి బుద్ధి చాపల్యంతో ఆమంత్ర ప్రభావాన్ని పరీక్షించాలను కొంది.

💫🌹సూర్యుని గురించి ప్రార్ధించింది. ఆయన వరం వల్ల ఆమెకు కర్ణుడు జన్మించాడు కుంతికి వివాహం అయిన తర్వాత ధర్మ దేవత ,వాయుదేవుడు ,ఇంద్రుడు ,అశ్వినీ దేవతలను దుర్వాసుని మంత్రంతో స్మరించి ,క్రమంగా ధర్మరాజు ,భీముడు ,అర్జునుడు ,నకుల సహదేవులను కన్నది. వీరే పంచ పాండవులు. కర్ణుడిని నదిలో వదిలి పెడితే ఆతడు సూతుదికి దొరికి అక్కడ పెరిగి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో తన సామర్ధ్యం రుజువు చేసుకొని ,దుర్యోధనుని మనసు గెల్చి ,అంగ రాజ్యానికి అభిషిక్తుడై ,కౌరవ పక్షంలో ముఖ్యుడైన సంగతి మనకు తెలిసిందే.

💫🌹దూర్వాసుడు వైష్ణవ, శాక్తేయాది మహా మంత్రాలన్నీ జపించి నప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది. చివరికి ”శ్రీ హనుమత్సంజీవినీ విద్య ”నేర్చి జపించాడు. అప్పుడు హనుమ ఒకే ముఖం తో 18 భుజాలతో దర్శన మిచ్చాడు. దుర్వాసుడు పరవశించి ఆన్జనేయుడిని భక్తితో కీర్తించాడు.చక్కని శ్లోకంతో ఆయన్ను వర్ణించాడు.

”శక్తిం ,పాశం చ కుంతం ,పరశు మపి హలం తోమరం ,ఖేతకం వా
శంఖం చక్రం త్రిశూలం ముసలమపి గడం పట్టాసం ముద్గరం చ
గాండీవం బాణ పద్మం ,ద్వినవ వర భుజైహ్,ఖడ్గ మస్యావదానం
వందేహం వాయుసూనుం ,సురరిపు మధనం ,భక్త రక్షా దురీణం .”

💫🌹ఈ శ్లోకం వినగానే ,ఆంజనేయుడు మిక్కిలి సంతోషించి దుర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి ,అదృశ్యమైనాడు. అప్పటి నుంచి దుర్వాసుడు ఆంజనేయ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధ లతో జపిస్తూ మనశ్శాంతి
ని పొందుతూ ,కోపంలేని వాడై ,గంధమాదన పర్వతం వద్ద నివశిస్తూ ,మహాయోగి అయి శివునివలె నిత్య ప్రాతస్మరనుడు అయాడు.

💫🌹కనుక మానషిక శాంతి లభించాలి అంటే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అని దుర్వాసుని కధల వల్ల మనకు తెలుస్తోంది. దుర్వాసముని కధ సమాప్తం.


🕉️ వైశాఖ పురాణం 27వ అధ్యాయము 🕉️


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||


🌻 కలిధర్మములు - పితృముక్తి 🌻


💫🌹నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి 'మహామునీ! యీ వైశాఖమాసముననుత్తమమలగు తిధులేవి? దానములలో నుత్తమ దానములేవి? వీనిని నెవరు లోకమున వ్యాపింపజేసిరి? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదునని యడిగెను.

💫🌹అప్పుడు శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని యేకాదశినాడు చేసిన పుణ్యకార్యము కోట్లకొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుటవలని ఫలితము, అన్ని తీర్థములయందును స్నానమాడుటవలన వచ్చు పుణ్యము వీనినన్నిటిని వైశాఖ ఏకాదశినాడు స్నానము చేయుటవలన పొందుచున్నాడు.

💫🌹ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్ర్కియలు, హరికథాశ్రవణము యివన్నియును సద్యోముక్తి దాయకములు సుమా. రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందును.

💫🌹పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగానుండి శరీరము బాగున్నను స్నానాదికము చేయక గడపినవారు, గోహత్య, కృతఘ్నత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసికొనుట, మున్నగు వానిని చేసినంత పాపమునందును. శరీరారోగ్యము సరిగలేనిచో శ్రీహరిని మనసున తలపవలెను. వైశాఖమాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్యఫలప్రదము. సజ్జనులును దయావంతులు, ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందురు? ఎవరునుండరని భావము.

💫🌹దరిద్రులు, ధనవంతులు కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు(భార్యలేనివారు), స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్ఠివారు వీరందరును యధాశక్తిగ నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వధర్మకార్యఫలప్రాప్తికిని మూలమైన వైశాఖమాసమున ధర్మకార్యములను స్నానదానాదులను చేయగోరువారు, చేయువారును సర్వోత్తములు.

💫🌹ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖమాస ధర్మముల నాచరింపనివారు సులభముగ నరకలోకములను పాపాత్ములై చేరుదురు సందేహములేదు. పాలను తరచి సారభూతముగ వెన్నను తీసినట్లుగ సర్వపాపములను హరించి సర్వపుణ్యములనిచ్చు తిధిని చెప్పుదును వినుము. మేషరాశియందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిధిని చెప్పుదును.

💫🌹ఆ తిధినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఈ విషయమున సావర్ణిమనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథయొకటి పెద్దలు చెప్పినది కలదు వినుము.

💫🌹ముప్పది కలియుగములు గడచిన తరువాత సర్వధర్మవిహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. ముప్పదియొకటవ కలియుగమున ప్రధమపాదమున ప్రజలందరును వర్ణధర్మములను విడిచి పాపకార్యముల యందాసక్తులైయుండిరి. ఇట్టి పాపపంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కరక్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడచటికి చేరెను.

💫🌹అచటనున్న మునులు కర్మలయందాసక్తి కలవారై యుగమును మెచ్చుచు నిట్లనిరి. కృతయుగమున సంవత్సరకాలమున నియమనిష్ఠలతో భక్తిశ్రద్దలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున నొకమాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున ఒక పక్షము చేసిననంతటి పుణ్యము వచ్చును. కాని దానికి పదిరెట్ల పుణ్యము కలియుగమున శ్రీమహావిష్ణువును స్మరించినవచ్చును.

💫🌹కావున కలియుగమున చేసిన పుణ్యము కోటిగుణితము దయాపుణ్యములు, దానధర్మములులేని యీ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలె పుణ్యలోకములకు పోవుదురు అనియను కొనుచుండిరి.

💫🌹ఆ సమయమున నారదుడచటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిస్నమును మరోక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యము చేయసాగెను. అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని యడుగగా నారదుడిట్లనెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి యానందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము.

💫🌹స్వల్పప్రయాసతో అధికపుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయు వనిన సంతోషము నాపుకొనలేకపోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను. వినుడు శిశ్నమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషనుని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచిజూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము.

💫🌹కలియుగమున భోగాభిలాష తిండిధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిస్నమును, నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను మరియు నిట్లనెను. శిశ్నమును, జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ యీ యుగమున సులభసాధ్యము. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచారవ్యవహార శూన్యమయినది. కావున మీరీదేశమును విడిచి యెచటకైన వెళ్లుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరును తమకిష్టమైన ప్రదేశములకు వెళ్లిరి.

💫🌹ధర్మవర్ణుడును భూమిని విడిచి యరియొకచోట నుండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెననియనిపించెను. తేజశ్శాలియు వ్రత మహితుడును అగు నతడు దండకమండలములను, జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను.

💫🌹భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపముల నాచరించుచు దుష్టులై యుండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరును శూద్రులవలెనైరి. ధేనువులు మేకలైనవి. వేదములు కథాప్రాయములైనవి. శుభక్రియలు సామాన్యక్రియలైనవి. భూతప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి.

💫🌹అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను గూడ విడుచువారై యుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారగునుగను ఉండిరి. మనసునందొకటి మాటయందు మరొకటి పనియందు యింకొకటి అగురీతిలో నుండిరి. విద్యాభ్యాసము పారమార్థికముకాక హేతు ప్రధానముగ భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై యుండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి.

💫🌹అధములు, గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరును గౌరవించుటలేదు. ఆచారవంతులగు బ్రాహ్మణులు దరిద్రులై యుండిరి. విష్ణుభక్తిజనులలో కంపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మవిహీనములై యుండెను. శూద్రులు, ధర్మప్రవక్తలు, జటాధారులు, సన్యాసులనైరి. మానవులు అల్పాయుష్కులై యుండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగానుండిరి. అందరును ధర్మమును చెప్పువారే.

💫🌹అందరు దానమును స్వీకరించువారే. సూర్య గ్రహణాది సమయములనుత్సవముగ దలచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును అందరును తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్దిలోనున్నవారిని జూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రికుమార్తెను తక్కువజాతివారిని కోరుచుండిరి పొందుచుండిరి. అందరును వేశ్యాసక్తులై యుండిరి. సజ్జనులు నవమానించుచుండిరి.

💫🌹పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగ ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను, గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగ జనులు స్వీకరించిరి.

💫🌹జలగస్తనముపై వ్రాలి పాలను త్రాగదు. రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సారహీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములని విడిచినవి. అంతట కరవువుండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు, నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది యుండిరి. వేదవేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా, ధనవంతులు చూచుచుండిరి.

💫🌹విద్యావంతులగు బ్రాహ్మణులు, ధర్మహీనులను సేవించి యాశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమదాంధులను, నీచులును ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా! వేదములయందు చెప్పిన క్రియలను, శ్రాద్దములను శ్రీహరినామములను అందరు విడిచిరి. శృంగారమున నాసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణుసేవ, శాస్త్రచర్చ, యాగ దీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర దానధర్మములు కలియుగమున నెచటను లేవు. ఇది మిక్కిలి చిత్రముగనుండెను.

💫🌹ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరియొక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును జూడబోయెను. అచటనున్న వారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి యేడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డిపరకను పట్టుకొని నూతిలో పడకుండ వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటియుండెను.

💫🌹ఇంతకన్న భయంకర విషయమును చూచెను. ఒక యెలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డిపరకను మూడువంతులు కొరికి వేసెను. గడ్డిపరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన యెలుకగడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి.

💫🌹ధర్మవర్ణుడును దీనులై ,యున్నవారిని జూచి జాలిపడి మీరీనూతియందు యెట్లు పడిరి. యెట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరే వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గమేమయిన నున్నదా నాకు చెప్పుడు. చేతనగు సాయమును చేయుదును అని అడిగెను. అప్పుడు వారు ఓయీ! మేము శ్రీవత్సగోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు, శ్రాద్దములును లేక దీనులమై బాధపడుచున్నాము.

💫🌹మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక యున్నది. మాకు పిండము నిచ్చువారులేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు యీ చీకటికూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి యొకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసికొనక ఒంటరిగ దిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డిపరకను చూచితివా? మా వంశమున నతడొక్కడే మిగులుట వలన నిచటను యిది యొకటే మిగిలినది.

💫🌹మేమును దీనిని బట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశమువాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకముననున్న మాకును యీ గడ్డిపరక యొక్కటే మిగిలినది. అతడు వివాహము చేసికొనక పోవుటచే సంతానము లేకపోవుటవలన యీ గడ్డికి అంకురములులేవు. ఈ యెలుక యీ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ యెలుక మిగిలిన యీ గడ్డిముక్కను తినివేయును.

💫🌹అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది.

💫🌹కావున నాయనా! భూలోకమునకు పోయి మా ధర్మవర్ణునివద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకెదురు చూచుచున్నామని చెప్పి వివాహమాడుట కంగీకరింప జేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు. బలవంతమైన యెలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది. ఆ యెలుకయే కాలము. ఇప్పటికి యీ గడ్డిలో మూడువంతులు పోయినవి. ఒకవంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది.

💫🌹నీవుపేక్షించినచో మావలెనో నీవును మరణించిన తరువాత నిట్లే మాతో బాటు యిందుపడగలవు. కావున గృహస్థ జీవితము నవలంబించి సంతతిని పొంది వంశవృద్దిని చేసి మమ్ము నూతిలోపడకుండ రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువమందిని పొందవలెను. వారిలో నొకడైనను గయకు పోయి పిండప్రదానము చేయును. అశవమేధయాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము, శ్రాద్దము మున్నగువి చేయవచ్చును.

💫🌹ఇందువలన మాకు నరకవిముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగునవకాశమున్నది. మా వంశమువారిలో నెవడైన పాపనాశినియగు విష్ణుకథను విన్నను చెప్పినను మాకు ఉత్తమగతులు కలుగవచ్చును.

💫🌹తండ్రి పాపియైనను పుత్రుడుత్తముడు భక్తుడునైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మవిహీనులగు పుత్రులెక్కువమండి యున్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది యున్ననేమి? పుత్రహీనుడగువానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రునిల పొందవలెను. మాయీ బాధను యీ మాటలను వానికి వరముగ జెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి.

💫🌹ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై యిట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసినవాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారదమహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము, నాలుక అదుపులోనుండవు. విష్ణుభక్తీయుండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో నుండుటకై వివాహమును మానితిని.

💫🌹కలియుగమున పాపభూయిష్ఠులగు జనుల సాంగత్యము యిష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడచినవి. నాలుగవ పాదమున గూడ చాల వరకు గడచినది. నేను మీ బాధనెరుగను. మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన ఋణమును తీర్చలేకపోతిని. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజింపనివాని జన్మ వ్యర్థము. వానియునికి భూమికే భారము.

💫🌹నేను మీ యాజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధకలుగకుండ సంసారబాధలు లేకుండ మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యముల నాజ్ఞాపింపుడని ప్రార్థించెను.

💫🌹ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత యూరటను పొంది నాయనా! నీ పితృదేవతల పరిస్థితిని జూచితివి కదా! సంతానము లేకపోవుటచే గడ్డిపరకను పట్టుకొని యెట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా! విష్ణుకథలయందనురక్తి, స్మరణము, సదాచారసంపన్నత కలవారిని కలిపీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిలగాని, భారతము గాని యింటియందున్నచో కలి వారిని బాధింపడు. వైశాఖవ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీకదీపదానము పాటించువారిని కలి విడుచును.

💫🌹ప్రతి దినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు వున్నయింటిని కలి బాధింపడు. ఇట్టివి లేనిచోట నుండకుము. నాయనా త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలెనని మేషరాశి యందున్నాడు. ఈ నెలలోని ముప్పది తిధులును పుణ్యప్రదములే. ప్రతి తిధియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము నిచ్చును.

💫🌹చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తి నిచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది. విముక్తిని యిచ్చునది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్దము చేయవలయును. జలపూర్ణమగు కలశము నిచ్చి పిండప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి కోటిరెట్లు ఫలితము నిచ్చును. చైత్ర అమావాస్యనాడు శక్తిలేనిచో కూరతోనైన శ్రాద్దము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయనివాడు పితృహత్య చేసినవాడు.

💫🌹ఆనాడు చల్లని పానీయము నిచ్చి శ్రాద్దము చేసినచో పితృదేవతలపై అమృతవర్షము కురియును. ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్దము ప్రశస్తము. కావున నీవు త్వరగ వెళ్లి ఉదకుంభదానమును, శ్రాద్దమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి యుత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరును సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము, అని వారు చెప్పిరి.

💫🌹ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను. చైత్ర బహుళ అమావాస్యనాడు ప్రాతః కాలస్నానము పితృదేవతలు చెప్పినట్లు జలకలశదానము శ్రాద్దము మున్నగు వానిని చేసెను. వివాహము చేసికొని యుత్తమ సంతానమునందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను


వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము

🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

 

 

 

 🕉️ వైశాఖ పురాణం 26 వ అధ్యాయము 🕉️


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||


🌻 వాల్మీకి జన్మ 🌻

💫🌹నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను.

💫🌹తమయెదురుగ నున్న మఱ్ఱిచెట్టు కూలుట దాని తొఱ్ఱనుండి వచ్చిన భయంకరసర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి యాశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి 'ఓయీ! నీవెవరవు? నీకిట్టి దశయేల వచ్చినది. విముక్తియేల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగ జెప్పుమని యడిగెను.

💫🌹శంఖుడిట్లడుగగనే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి యిట్లు చెప్ప నారంభించెను. ఆర్యా! నేను ప్రయాగ క్షేత్రముననుండు బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూపయౌవనములు విద్యా, సంపదలు కలవని గర్వించువాడను. చాలమంది పుత్రులు అహంకారము కలవాడను నాపేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీవ్యాపారము చేయుట నిత్యకృత్యములు.

💫🌹జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్దలేదు. ఇట్లు కొంతకాలము గడచెను.

💫🌹ఒక వైశాఖమాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్నవారికి వైశాఖవ్రతమును, ధర్మములను మున్నగువానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణములవారు అందరును కొన్నివేల మంది వైశాఖ వ్రతము నాచరించుచు ప్రాతఃకాల స్నానము, శ్రీహరిపూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరికథలను మౌనముగ శ్రద్దాసక్తులతో వినుచుండిరి.

💫🌹నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగువానితో విలాసవేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోనివారందరికిని యిబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని.

💫🌹ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని. మరణించితిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోను, సీసముతోను నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి, యెనుబదినాలుగు లక్షల జీవరాశులయందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన యీ మఱ్ఱిచెట్టు తొఱ్ఱలో ఆహారములేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని. దైవికముగ నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాపవిముక్తుడనై దివ్యరూపమునందితిని.

💫🌹నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై యిట్లు నమస్కరించితిని. స్వామీ! మీరు నాకు యే జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును యే విధముగను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా! స్వామీ! సజ్జనులు దయావంతులునగు వారు నిత్యము పరోపకారపరాయణులే కదా! స్వామీ! నాకు సదా ధర్మబుద్ది కలుగునట్లును, విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము.

💫🌹నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచినడవడికగల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగ ప్రార్థించుచు నమస్కరించి యట్లే యుండెను.

💫🌹శంఖమునియు తనకు నమస్కరించి యున్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రునిగావించెను. ధ్యాన స్తిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయీ! వైశాఖమాస మహిమను వినుటవలన శ్రీహరి మహిమను వినుటవలన నీ పాపములన్నియు పోయినవి.

💫🌹నీవు దశార్ణదేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు. వేద శాస్త్రదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందిష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటిని పెక్కుమార్లు చేయగలవు. సుఖదుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై గురుభక్తి, యింద్రియజయము కలవాడై సదా విష్ణుకధాసక్తుడవు కాగలవు.

💫🌹ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా భయపడకుము. నీకు నాయనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగ గాని, భయమునగాని, కోపమువలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమునుచ్చరించిన సర్వపాపములును నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములును శ్రీహరి పదమును చేరుదురు సుమా.

💫🌹ఇట్టి స్థితిలో శ్రద్దాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమునుచ్చరించినవారికి శ్రీహరి పదమేల కలుగదు? శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచినవారైనను శ్రీహరిపదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు పూతనవలె శ్రీహరిస్థానమును చేరుదురు. సజ్జనసహవాసము సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మనా సేవింపవలయును. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తినందుదురు. ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా!

💫🌹శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయౌవనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్తసులభుని దయాళువును విడిచి మరియెవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు, భక్తవత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయనా వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటిని యధాశక్తిగ నాచరింపుము. జగన్నాధుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంఖుడు దివ్యరూపధారి నుద్దేశించి పలికెను.

💫🌹ఆ దివ్య పురుషుడు కిరాతుని జూచి యాశ్చర్యపడి మరల శంఖునితో నిట్లనెను. శంఖమహామునీ! దయాస్వభావముగల నీచే ననుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ యనుగ్రహమున నుత్తమ గతిని పొందగలను. అని పలికి శంఖుని యనుజ్ఞ నంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు నుపచారములను భక్తియుక్తుడై ఆచరించెను.

💫🌹శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్దుడగు కిరాతునకు తారకమగు 'రామా యను రెండక్షరముల మంత్రము నుపదేశించెను.

💫🌹నాయనా! శ్రీహరి యొక్క ఒకొక్క పేరును అన్ని వేదములకంటె నుత్తమము అట్టి భగవన్నామములన్నిటి కంటె సహస్రనామములుత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటియే సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖధర్మములను బ్రదికియున్నంతవరకు నాచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగ జన్మించి వాల్మీకియని భూలోకమున ప్రసిద్దినందగలవు.

💫🌹అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగ ప్రయాణమయ్యెను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారముల నాచరించి కొంతదూరమనుసరించి వెళ్లెను. వెళ్లుచున్న శంఖమునిని విడుచుట  బాధాకరముగ నుండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై యుండెను. అతడు ఆ యడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మముల నాచరించుచుండెను.

💫🌹అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకఱ్ఱలు మున్నగువాని నిచ్చుచు బాటసారుల ననేకవిధములుగ సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవచేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్లు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను.

💫🌹కృష్ణుడను ఒక ముని జితేంద్రయుడై సర్స్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము నాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒకపుట్టగా నయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపము నాచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను.

💫🌹వానిని జూచి నాట్యకత్తెయొకతె మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మబంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది.

💫🌹శ్రుతకీర్తి మహారాజా! వైశాఖమహిమను వింటివా! దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదులను మున్నగువానిని దుర్బుద్ధితో నపహరించియు వైశాఖమహిమవలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు దెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందురు. ముక్తిని పొందుదురు.

💫🌹అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.

వైశాఖ పురాణం ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము

🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

 నమస్కారం ఎవరికి.. ఎలా?
నమస్కారం భారతీయ సంస్కృతి. అది ఉత్తమ సంస్కారం అంటారు పెద్దలు. ఎలా నమస్కారం చేయాలనే కాదు ఎన్నిసార్లు నమస్కారం చేయాలో మన శాస్త్రంలో లెక్క ఉంది. ప్రసన్న వదనంతో రెండు చేతులు జోడించి వాటిని ఛాతీకి ఆనించి నమస్కారం చేయాలి. నమస్కారం ఎవరికి... ఎలా చేయాలో తెలుసుకుందాం...
ఈ భూమి మన తల్లి. మన దినచర్యలో భాగంగా తెలిసో తెలియకో మనం ఎన్నో అపరాధాలు చెస్తున్నాం. అందుకే నిద్ర లేవగానే  తప్పులు మన్నించమని ముందుగా భూమాతకు నమస్కారం చేయాలి. ఆ తరువాత ఇంటిలో తల్లిదండ్రులుంటే వారికి నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం అన్ని వేళలా, అన్ని చోట్లా చేయ నవసరం లేదు. పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలనుకుంటే వక్షస్థలాన్ని నేలకు తాకేలా శిరస్సు నేలపై ఉంచాలి. రెండు చేతులు నమస్కార స్థితిలో సాగదీసి ముందుకు చాపాలి. దేవుడికి ఈ నమస్కారం చేస్తున్నప్పుడు పురుషులు ఛాతి మీద వస్త్రం ఉంచుకోరాదు. అందువలన సాంప్రదాయకంగా దేవునికి, మఠాధిపతులకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నపుడు ఈ నియమం పాటించవచ్చు.
పూర్వకాలంలో అంతవరకు పరిచయం లేని పెద్దలకు నమస్కారం చేస్తున్నప్పుడు తమ వంశం పరంపర, గోత్రం, పేరు చెప్పే ఆచారం ఉండేది. ఆధునిక కాలంలో అది కుదరదు. అయినా నమస్కారం చేస్తూ స్వంత పరిచయం చేసుకోవడం మంచిది. ఒక్కొక్కప్పుడు అవతలి వ్యక్తి హోదాలో పెద్ద, వయస్సులో చిన్న కావచ్చు. వయస్సులో చిన్నవారికి నమస్కారం చెయ్యం కాని హోదాలో పెద్ద కాబట్టి తప్పక నమస్కారం చేయాలి. కొందరు ఉన్నత అధికారులు తమ కన్నా తక్కువ ఉద్యోగంలో ఉన్న పెద్దవారికి ముందుగా నమస్కారం చేసిన ఉదాహరణలున్నాయి.
కొన్ని సందర్భాల్లో వంగి నమస్కరించవలసి వస్తుంది. అప్పుడు వారి పాదాలను చేతితో తాకి ఆ చేతిని మన శిరస్సు మీద ఉంచుకోవాలి. తల్లిదండ్రులకు, తనకన్నా పెద్దవారైన ఇతర కుటుంబ సభ్యులకు ఒకసారి నమస్కారం చేస్తే చాలు. సన్న్యాసులు, మఠాధీశులు, చాతుర్మాస దీక్షలో ఉన్నప్పుడు నాలుగు పర్యాయాలు నమస్కారం చేయాలి. గుడిలోనూ పూజామందిరంలోనూ దేముడి ముందు నమస్కారం చేయాలి. అది ఒక స్థానంలో నిల్చుని అయినా లేదా ఆత్మప్రదక్షిణ చేస్తూనో చేయాలి. అమ్మవారి విషయంలో నాలుగు పర్యాయాలు నమస్కారం చెయ్యాలి. భక్తితో నమస్కరిస్తే అది అనంతకోటి ఫలాలనిస్తుందని శాస్త్రవచనం.
ఇంతవరకు నమస్కారం చేసేవారి ధర్మం గురించి తెలుసుకున్నాం. మరి దానిని స్వీకరించినవారి ధర్మమేమిటి? మనకు పురుషులు నమస్కరిస్తే ‘దీర్ఘ ఆయుష్మాన్‌ భవ’ అని, పుణ్యస్త్రీలు అయితే ‘దీర్ఘ సుమంగళీ భవ’ అనీ ఆశీర్వదించాలి. పిల్లలు నమస్కరిస్తే ‘సువిద్యా పాప్తి రస్తు’ అని, అవివాహితులయిన యువతీ యువకులను శీఘ్రమేవ వివాహ ప్రాప్తి రస్తు’ అని దీవించాలి. సందర్భానుసారంగా వారి కోరికలు సిద్ధించాలని ఆశీర్వదించాలి. భగవంతుడు అభయ ముద్రలోనే ఉంటాడు కాబట్టి ఆయన మన నమస్కారం స్వీకరించేడని సంతృప్తి పడాలి. ఒక శ్లోక భావాన్ని అనుసరించి నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా మనం ఎవరికి నమస్కరించినా అది చివరకు కేశవుడికే చెందుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
–గుమ్మా ప్రసాద రావు
👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
కదిలిపోయేదే కాలం


కష్టాన్ని నిలువరించే సులభోపాయాలేమీ లేవు. అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవు. నష్టం అనగానే కన్నీళ్లు ఉంటాయి. కలతపడటమూ ఉంటుంది. దానికి నివారణోపాయం- మనోధైర్యంతో ఎదుర్కోవడమే. సంయమనంతో సమాధానపడటమే. అప్పుడు స్థిరంగా పాతుకుపోతుందనుకుని భయపడిపోయిన మేరు పర్వతమంత కష్టమైనా కదిలిపోతుంది, ఎగిరిపోతుంది. కష్టం కాలంలాంటిది. కదలడమే దాని లక్షణం. కదిలిపోవడమే దాని స్వభావం. కాలంతోపాటు ఆ కాలంలో సంభవించిన కష్టమూ కదిలిపోతుంది.

జీవితం చాలా విలువైంది. నిజానికి విలువ కట్టలేనిది. జీవితంలోని ప్రతిక్షణం కూడా. ఏ కష్టం దాని విలువను తగ్గించగలదు? మనం లోతుగా ఆలోచించాలి. కష్టాలు, కన్నీళ్లు... ఇవన్నీ అధిగమించగలిగినవి. కాలం అంటే క్షణాల కూర్పు. క్షణాల మార్పు. ఏ శక్తీ ఏ క్షణాన్నీ ఆపలేదు. కరిగిపోయేదాని కోసం, కదిలిపోయే దానికోసం మన ప్రయాణం, మన ప్రగతి ఆగిపోకూడదు.

ఏ కష్టం కోసమైనా సరే జీవితం తాలూకు ఏ క్షణాన్ని పోగొట్టుకోకూడదు. కాలంలో సంభవించిన ఏ కష్టమైనా సరే, దానితోపాటు కదిలిపోతూనే ఉంటుంది. కొత్త క్షణం వస్తుంది. దానితోపాటే కొంత సుఖం రావచ్చు. కొత్త సుఖం రావచ్చు. పోనీ... కనీసం కొత్త కష్టమైనా రావచ్చు. వచ్చి స్థిరపడిపోతుందని భయపెట్టిన కష్టం కంటే కొత్త నష్టం కొంత మేలుకదా? అలవోకగా వచ్చిన కష్టానికి అవగాహనలేక... ఆయాసపడి ఆగిపోతే- లోకంలో భగవంతుడిచ్చిన జీవితాన్ని పూర్ణంగా జీవించేవాడే ఉండేవాడు కాదు. లోకంలో విజేత అనేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు. మార్పు ప్రకృతి సహజం. రుతువులు మారతాయి. రాత్రింబవళ్లు మారతాయి. సూర్యచంద్రులూ. మారనిదేదీ లేదు.
మార్పే జీవితం! జీవితం అంటే కూడా మార్పే. పిల్లలు పిల్లకాలువలో వేసిన కాగితపు పడవలా కాలం కదిలిపోతుంది. మనం పిల్లల్లా వినోదంగా చూడాలి. వాళ్లకు తెలుసు. పడవ చాలా కష్టపడి చేశామని. నీళ్లలో వదిలేస్తే కాసేపటికి మునిగిపోతుందని, తడిసిపోతుందని. అయినా క్రీడావినోదం కావాలంటే ఆ కష్టానికి వెరవకూడదు. ఆ నష్టానికి బెదరకూడదు. సిద్ధపడే ఉండాలి. పిల్లలు మునిగిపోతున్న పడవకేసే చూస్తూ బాధపడుతూ కూర్చోరు. పరుగున వెళ్లి మరో కాగితం తెచ్చుకొని మరో పడవ తయారుచేస్తారు. టైటానిక్‌ చేసినంత ఉత్సాహంతో. మనం పిల్లలపాటి చేయమా? ఆ మాత్రం అనర్థాలను, ఆటంకాలను అధిగమించలేమా? దేవుడు ఈ క్షణాన్ని యథాతథంగా అనుభవించమన్నాడేగానీ క్షణంలోనే స్థిరంగా ఉండిపొమ్మని చెప్పలేదు- అది సుఖమైనా, కష్టమైనా! కష్టాన్ని కదిలిపోతున్న క్షణంతోపాటు మరచిపోవాలి. కదిలిపోతున్న క్షణాన్ని మనం మూర్ఖత్వంతో ఆపివేస్తున్నాం. పదేపదే ఆ క్షణాన్ని, అది ఇచ్చిపోయిన కష్టాన్ని నెమరువేసుకుంటూ అనుభవిస్తున్నాం. అది సరికాదు. మనముందు ఎవరూ ఆపలేని మరో అద్భుత క్షణం ఉంది. మరెన్నో అమృత క్షణాలున్నాయి. వాటికి అవకాశం ఇస్తూ గడిచిపోయిన క్షణాన్ని సంతోషంగా సాగనంపుదాం.
నెమరువేసే అలవాటు పశువులది. మనది కాదు!

******
ఇంద్రుడు వృత్రాసురుని సంహరించుటచే బ్రహ్మహత్యా దోషము సంభవించి వైభవము కోల్పోయాడు .అప్పుడు అతడు నిషాద పర్వతము మీద అజ్ఞాతవాసము చేయుచుండెను.దేవతలు,మునులును స్వర్గము నకు
రాజు లేక అరాచకమై పోయి ఆపదలు వచ్చునని భయపడి అనేక యజ్ఞములు చేసి మహా మహిమాన్వితుడైన నహుషుడి దగ్గరికి వెళ్లి ఇంద్రపదవి స్వీకరించమని కోరిరి.అతడు నాకు యోగ్యత వున్నదా?
అని సందేహించగా,యముడు,వరుణుడు మొదలగు వారు తమ శక్తి ,దర్పము లలో కొంత భాగము అతనికి యిచ్చి అతన్ని ఇంద్రుడిని చేసి స్వర్గమునకు అధిపతిని చేసినారు.భూలోకములో నున్నంత కాలము
మహాత్ముడు,శాంతుడు అని విఖ్యాతి పొందిన నహుషుడు స్వర్గాధి పత్యము రాగానే మారి పోయాడు.
ఇంక నాకేమి తక్కువ అని గర్వముతో తన యిష్టమొచ్చి నటుల ప్రవర్తించ సాగాడు.పరస్త్రీలను కన్నెత్తి
కూడా చూడనివాడు అప్సరసలతో కాలము గడపు తూ కొలువుకు రాకుండా నిర్లక్ష్యముగా ప్రవర్తించ
సాగాడు. అంతే కాకుండా మంచి చెడ్డలు మరిచి త్రిలోక సుందరి యగు శచీదేవిని చూసి మోహించి రమ్మని కబురు పంపెను.ఆమె దేవగురువాగు బృహస్పతిని శరణు కోరింది.దేవతలందరూ కలిసి ఆమెకు
ఒక ఉపాయము చెప్పిరి.ఆమె నహుషుని దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పి నాకు ఒక వ్రతము వుంది,
నీవు పల్లకి ఎక్కి మునుల చేత మోయించుకొని వస్తే నేను నీదాన్నవుతాను అని చెప్పింది.
వెంటనే నహుషుడు సప్తరుషులను పిలిచి మీరు బోయీలై నన్ను పట్టణమంతయు తిప్పవలయును అని ఆజ్ఞాపించెను.అది విని మునులందరూ తెల్లబోయారు.కానీ చేయునది లేక ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి మోయసాగారు.నహుషుడు గర్వముతో వారిని యిష్ట మోచ్చినట్లు మాటాడుతూ అదిలిస్తూ
మెల్లగా నడుస్తే ఊపిరి లేని వాళ్ళ లాగా అదేమీ నడక యని, వేగముగా నడిస్తే, అంత వేగముగా పోతున్నారెందుకు అని 'సర్ప'సర్ప' అంటే నిదానము,నిదానము అనేవాడు .మధ్యాహ్న కాలమైనందున
మునులు పల్లకి దింపి వేదమంత్రములు చెప్పసాగారు.నహషుడు ఆ మంత్రములు చాలించి పల్లకి మోయండి అని గద్దించెను.వేదమత్రములను గురించి యెగతాళి చేసెను.దానితో అగస్త్యునకు కోపము వచ్చి యింత అహంకారము నీకు తగదు,'సర్ప'సర్ప' అని మమ్మల్ని అదిలించినావు కనుక .భూలోకములో పామువై పడి వుండు అని శాప మిస్తాడు.
అప్పుడు నహుషుడి కళ్ళు తెరుచుకుంటాయి అగస్త్యుని కాళ్ళపై బడి క్షమాపణ వేడి శాపవిమోచనం
ప్రసాదించమని వేడుకుంటాడు.అగస్త్యుడు శాంతించి సర్పముగా ఉంటూ అందరినీ ప్రశ్నలు అడుగుతూ వుండు. నీవు వేసిన ప్రశ్నలకు ఎవరు
సరియైన సమాధానము ఎవరు చెప్తారో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు.నహుషుడు వేసిన ప్రశ్నలే 'యక్షప్రశ్నలు' గా ప్రసిద్ధికెక్కాయి.
పాండవులలో నలుగురు యీతని ప్రశ్నలకు సమాధానము చెప్పలేక చనిపోతారు.చివరకు ధర్మరాజు వచ్చి యీతని ప్రశ్నలకు సరియైన సమాధానము యిస్తాడు.అప్పుడు నీకేమి వరము కావలెనో అడుగు అని అడుగుతాడు.అప్పుడు నా నలుగురి తమ్ముళ్ళను బ్రతికించ మని అడుగుతాడు.అప్పుడు
నహుషుడు వీరిలో ఎవరినైనా ఒక్కరిని బ్రతికిస్తాను ఎవరిని బ్రతికించ మంటావో చెప్పు అని అడుగు తాడు.అప్పుడు ధర్మరాజు సహదేవుడిని బ్రతికించ మంటాడు.నహుషుడు ఆశ్చర్యపోయి నీవు బలవంతు లైన నీ సొంత సోదరులను కోరకుండా సవతి తమ్ముడైన సహదేవుడిని కోరుకున్నావు ఎందుకు అని అడిగాడు.అప్పుడు ధర్మరాజు కుంతీ పుత్రులలో జ్యేష్టుడిని నేను బ్రతికి వున్నాను మా పినతల్లి మాద్రి పుత్రులలో కనిష్టుడైన సహదేవుడు బ్రతికి ఉండుట న్యాయము కదా!అందుకనే సహదేవుడిని కోరుకున్నాను అంటాడు.అతని న్యాయ,ధర్మ సంద్రతకు మెచ్చి నలుగురినీ బ్రతికించి తన స్వస్వరూపముతో వెళ్ళిపోతాడు నహుషుడు.ఆ ప్రశ్నలే లోకములో యక్ష ప్రశ్నలు అని ప్రసిద్ధి చెందాయి.
అధికార గర్వముతో పెద్దలను ధిక్కరించి నిందించరాదు అని ఈకథ నీతి.

కదిలిపోయేదే కాలం


కష్టాన్ని నిలువరించే సులభోపాయాలేమీ లేవు. అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవు. నష్టం అనగానే కన్నీళ్లు ఉంటాయి. కలతపడటమూ ఉంటుంది. దానికి నివారణోపాయం- మనోధైర్యంతో ఎదుర్కోవడమే. సంయమనంతో సమాధానపడటమే. అప్పుడు స్థిరంగా పాతుకుపోతుందనుకుని భయపడిపోయిన మేరు పర్వతమంత కష్టమైనా కదిలిపోతుంది, ఎగిరిపోతుంది. కష్టం కాలంలాంటిది. కదలడమే దాని లక్షణం. కదిలిపోవడమే దాని స్వభావం. కాలంతోపాటు ఆ కాలంలో సంభవించిన కష్టమూ కదిలిపోతుంది.

జీవితం చాలా విలువైంది. నిజానికి విలువ కట్టలేనిది. జీవితంలోని ప్రతిక్షణం కూడా. ఏ కష్టం దాని విలువను తగ్గించగలదు? మనం లోతుగా ఆలోచించాలి. కష్టాలు, కన్నీళ్లు... ఇవన్నీ అధిగమించగలిగినవి. కాలం అంటే క్షణాల కూర్పు. క్షణాల మార్పు. ఏ శక్తీ ఏ క్షణాన్నీ ఆపలేదు. కరిగిపోయేదాని కోసం, కదిలిపోయే దానికోసం మన ప్రయాణం, మన ప్రగతి ఆగిపోకూడదు.

ఏ కష్టం కోసమైనా సరే జీవితం తాలూకు ఏ క్షణాన్ని పోగొట్టుకోకూడదు. కాలంలో సంభవించిన ఏ కష్టమైనా సరే, దానితోపాటు కదిలిపోతూనే ఉంటుంది. కొత్త క్షణం వస్తుంది. దానితోపాటే కొంత సుఖం రావచ్చు. కొత్త సుఖం రావచ్చు. పోనీ... కనీసం కొత్త కష్టమైనా రావచ్చు. వచ్చి స్థిరపడిపోతుందని భయపెట్టిన కష్టం కంటే కొత్త నష్టం కొంత మేలుకదా? అలవోకగా వచ్చిన కష్టానికి అవగాహనలేక... ఆయాసపడి ఆగిపోతే- లోకంలో భగవంతుడిచ్చిన జీవితాన్ని పూర్ణంగా జీవించేవాడే ఉండేవాడు కాదు. లోకంలో విజేత అనేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు. మార్పు ప్రకృతి సహజం. రుతువులు మారతాయి. రాత్రింబవళ్లు మారతాయి. సూర్యచంద్రులూ. మారనిదేదీ లేదు.
మార్పే జీవితం! జీవితం అంటే కూడా మార్పే. పిల్లలు పిల్లకాలువలో వేసిన కాగితపు పడవలా కాలం కదిలిపోతుంది. మనం పిల్లల్లా వినోదంగా చూడాలి. వాళ్లకు తెలుసు. పడవ చాలా కష్టపడి చేశామని. నీళ్లలో వదిలేస్తే కాసేపటికి మునిగిపోతుందని, తడిసిపోతుందని. అయినా క్రీడావినోదం కావాలంటే ఆ కష్టానికి వెరవకూడదు. ఆ నష్టానికి బెదరకూడదు. సిద్ధపడే ఉండాలి. పిల్లలు మునిగిపోతున్న పడవకేసే చూస్తూ బాధపడుతూ కూర్చోరు. పరుగున వెళ్లి మరో కాగితం తెచ్చుకొని మరో పడవ తయారుచేస్తారు. టైటానిక్‌ చేసినంత ఉత్సాహంతో. మనం
 పిల్లలపాటి చేయమా? ఆ మాత్రం అనర్థాలను, ఆటంకాలను అధిగమించలేమా? దేవుడు ఈ క్షణాన్ని యథాతథంగా అనుభవించమన్నాడేగానీ క్షణంలోనే స్థిరంగా ఉండిపొమ్మని చెప్పలేదు- అది సుఖమైనా, కష్టమైనా! కష్టాన్ని కదిలిపోతున్న క్షణంతోపాటు మరచిపోవాలి. కదిలిపోతున్న క్షణాన్ని మనం మూర్ఖత్వంతో ఆపివేస్తున్నాం. పదేపదే ఆ క్షణాన్ని, అది ఇచ్చిపోయిన కష్టాన్ని నెమరువేసుకుంటూ అనుభవిస్తున్నాం. అది సరికాదు. మనముందు ఎవరూ ఆపలేని మరో అద్భుత క్షణం ఉంది. మరెన్నో అమృత క్షణాలున్నాయి. వాటికి అవకాశం ఇస్తూ గడిచిపోయిన క్షణాన్ని సంతోషంగా సాగనంపుదాం.
నెమరువేసే అలవాటు పశువులది. మనది కాదు!

Friday, 4 June 2021

 🕉️ *వైశాఖ పురాణం 25వ అధ్యాయము* 🕉️

*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||*

🌻 *భాగవత ధర్మములు* 🌻

💫🌹నారదుడు అంబరీషమహారాజుతో నిట్లు చెప్పుచున్నాడు. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు నిట్లనెను.

💫🌹స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగానున్న జీవులు విభిన్నకర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై యున్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని యడిగెను.

💫🌹అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సత్వరజస్తమో గుణత్రయముననుసరించి జీవులు యేర్పడిరి. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్వికకర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలనుబట్టి సత్వరజస్తమో గుణముల పాళ్లు యెక్కువ తక్కువలగుచుండును. అందువలన వారు యెక్కువ కర్మకు యెక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖదుఃఖముల నందుచుందురు. 

💫🌹ఈ జీవులు తాము చేసిన కర్మలననుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును యింకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకులోబడి యీ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకులోబడి మరల కర్మలను గుణానుకూలముగ చేయు తగిన ఫలితములనందుచున్నారు. 

💫🌹మాయకులోబడి వారి గుణకర్మల వలని మార్పులుచేర్పులు ఆ జీవులకే గాని మాయకేమియు మార్పులేదు. తామసులైన వారు పెక్కు దుఃఖముల ననుభవించుచు తామస ప్రవృత్తి కలవారై యుందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మమొదలుకొని పిశాచ జన్మాంతముగ తామసమార్గమునే చేరుచుందురు.

💫🌹రాజసప్రవృత్తులు మిశ్రమబుద్దితో పుణ్యపాపములను రెండిటిని చేయుచుందురు. పుణ్యము నధికముగ చేసిన స్వర్గమును, పాపమెక్కువయైన నరకమును పొందుచుందురు. కావున నీరు నిశ్చయజ్ఞానము లేనివారై మంద భాగ్యులై సంసారచక్రమున భ్రమించుచుందురు.

💫🌹సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణవిశిష్టులై శ్రద్ద కలిగినవారై యితరులను జూచి అసూయపడనివారై సాత్విక ప్రవృత్తి నాశ్రయించియుందురు. వీరు తేజశ్శాలురై గుణత్రయశక్తిని దాటి నిర్మలులై యుత్తమ లోకములనందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్నకర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు నగుచున్నారు. 

💫🌹ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలననుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు.

💫🌹సంపూర్ణకాముకుడైన శ్రీహరికి భేదబుద్ది దయ స్వభావము లేవు. సృష్టిస్థితి లయములను సమముగనే జీవులగుణకర్మల ననుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరును తాము చేసిన గుణకర్మల ననుసరించియే తగిన ఫలములను, శుభములను - అశుభములను, సుఖమును - దుఃఖమును, మంచిని చెడును పొందుచున్నారు. 

💫🌹తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగ యెత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచటనాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును. పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచట గమనింప వలసిన విషయమొకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో నతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును. 

💫🌹కర్మలు మంచివైనచో నతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కాని మనము ముండ్ల చెట్లమా, పండ్ల చెట్లమా యన్నది మన కర్మలను, గుణములను అనుసరించి యుండును. తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కాని ఆ చెట్ల తీరు వేరుగానుండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా! అని శంఖుడు వివరించెను.

💫🌹కిరాతుడు స్వామీ! సంపూర్ణజ్ఞానసంపద కలవారికి సృష్టిస్థితిలయములలో నెప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని యడిగెను. శంఖుడిట్లనెను. నాలుగువేల యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు నాలుగువేల యుగములకాలమే. ఇట్టి ఒక రాత్రి, ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి పదునైదు దినములోక పక్షము. ఇట్టి రెండు పక్షములోక మాసము. రెండు మాసములొక ఋతువు. మూడు ఋతువులొక ఆయనము. 

💫🌹రెండు ఆయనములోక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయమేర్పడును అని వేదవిదులందురు. మానవులు అందరును నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమానమున నొకదినము గడువగా వచ్చిన ప్రళయము. దినప్రళయము. బ్రహ్మ మానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పిరి. 

💫🌹బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడచినదో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు పదునాలుగు గడచినచో దీనిని దైనందిన ప్రళయమని యందురు.

💫🌹మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు. జలపూర్ణములై యుండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావరజంగమములన్నియు లోకములతో బాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నియు నశించును. ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును.

💫🌹తత్త్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున నున్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతోబాటు నిద్రింతురు. దినకల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువగనే మరల యధాప్రకారముగ జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మసృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను శ్రీహరి యవతారములను సృష్టించును. 

💫🌹ఈ దేవతలు, మునులు బ్రహ్మ కల్పము ముగియు వరకునుందురు. ఆయా రాశులయందున్న దేవతలు, మునులు తమకు విహితములగు వేదధర్మములననుసరించు నాయా గోత్రములయందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు.

💫🌹కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగువారు కలితో కలిసి నరక స్థానమును చేరుదురు. ఆ పిశాచగణముల యందున్నవారు తమ కర్మలననుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు.

💫🌹బ్రహ్మ మున్నగు వారి సృష్టికాలమును ముక్తి కాలమును వినుము. శ్రీమహావిష్ణువు కన్నుమూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పమగును. మరల కనురెప్పపైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలెనను కోరిక కలుగును. అప్పుడు తన యుదరమున సృష్టింపదగినవారు, లింగశరీరులు లింగశరీర భంగమైనవారునగు జీవులనేకులుందురు.

💫🌹శ్రీమహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగ నున్నవారు, అజ్ఞాన దశలోనున్నవారు లింగభంగశరీరులు పిపీలికాదిమానవాంత జీవులు, ముక్తినందినవారు, బ్రహ్మ మొదలు మానవులవరకు నుండు జీవులు వీరందరునుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహడు జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. 

💫🌹కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుజ్యము నిచ్చును. కొందరికి తత్త్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని వారివారికి తగినట్లుగ అనిరుద్ద వ్యూహముననుసరించి వారి వారికి యిచ్చును. ప్రద్యుమ్న వ్యూహముననుసరించి సృష్టి చేయగోరును. మాయజయకృతిశాంతియను నాలుగు శక్తులను, వాసుదేవ అనిరుద్ద ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహములనుండి వరించెను. ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీమహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను.

💫🌹యోగమాయను నాశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి యగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదుల కైనను యెరుగరావు అని శంఖుడు వివరించెను.

💫🌹అప్పుడు కిరాతుడు స్వామీ! శ్రీమహావిష్ణువున కిష్టములగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను. దయయుంచి చెప్పగోరుదునని యడిగెను. అప్పుడు శంఖుడిట్లనెను. చిత్తశుద్దిని కలిగించి సజ్జనులకుపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది శ్రుతిప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్దము కానిదియగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి. 

💫🌹బ్రాహ్మణాది వర్ణములచేత, బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్యనైమిత్తిక కామ్యములని మూడు రీతులుగ విభక్తములైనవి. నాలుగు వర్ణములవారును తమ తమ ధర్మములనాచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచోనవి సాత్విక ధర్మములని యందును. శుభకరములగు భగవంతునికి చెందిన కర్మలనియును సాత్వికములనియనిరి.

💫🌹శ్రీమహావిష్ణువును విడిచి మరియొక దైవము ఇట్టి వీరినే భాగవతులనవలెను. ఎవరి చిత్తము విష్ణువు నందును, నాలుక శ్రీహరి నామోచ్ఛారణయందును హృదయము విష్ణుపాదముల యందును సక్తములై యుండునో వారే భాగవతులు. సదాచారములయందాసక్తి కలిగి అందరికి నుపకారమును చేయుచు, మమకారము లేనివారు భాగవతులు. వీనియందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగాగలవి రాజసధర్మములు. 

💫🌹యక్షులు, రాక్షసులు, పిశాచాదులు యందు దైవములు. వీరిలో కనిష్ఠురులు, హింసాస్వభావులు. వీరి ధర్మములు తామసములు సత్త్వగుణము కలవారు. విష్ణుప్రీతికరములు శుభప్రదములగు ధర్మములను నిష్కామముగజేయుదురు. విష్ణువుపై భక్తి కలిగియుందురో వారు భాగవతులు భక్తులు.

💫🌹వేదశాస్త్రాదులయందు చెప్పబడి శాశ్వతములై విష్ణుప్రీతికరములైన ధర్మముల నాచరించువారు భాగవతులు. అన్ని దేశములయందు తిరుగుట అన్ని అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తిలేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నియు జ్ఞానులకుపయోగింపవు. చంద్రుని జూచి చంద్రకాంత శిలద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును.

💫🌹ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుటవలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును. కోరికలేని జనులను శ్రద్దతో కూడి విష్ణుప్రీతికరములగు పనులను చేయువాడు భాగవతులు. ఇహపరలోకమును కలిగించు విష్ణుప్రీతికరములగు గుణములు సర్వదుఃఖములను నశింపజేయును. పెరుగును మధించి సారభూతముగ వెన్నను స్వీకరించునట్లు అన్ని ధర్మముల సారము వైశాఖధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున నున్నప్పుడు చెప్పెను.

💫🌹బాటసారులకు మార్గమున నీడ నిచ్చునట్టి మండపములను, చలివేంద్రముల నేర్పరుచుట విసనకఱ్ఱలతో విసరుట మరియు నుపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము, దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానమును, పుష్పములను ఇచ్చుట తాంబూల దానము. 

💫🌹ఆవుపాలు మొదలగు వానినిచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగువానిని నిచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట యివన్నియు పాపములను పోగొట్టును. సాయంకాలమున చేరకుగడ నిచ్చుట, దోసపండ్ల నిచ్చుట పండ్లరసములనిచ్చుట పితృదేవతలకు తర్పణలిచ్చుట యివి వైశాఖధర్మములు అన్ని ధర్మములలోనుత్తమములు. 

💫🌹ప్రాతఃకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదుల నాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానముల చేయవలెను. వైశాఖము తలంటిపోసుకొనరాదు. కంచుపాత్రలో భుజింపరాదు. నిషిద్ధములగు ఉల్లి మొదలగువానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను, పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వులపిండి పులికడుగు, చద్దియన్నము, నేతిబీరకాయ మున్నగు వానిని వైశాఖమున నిడువవలెను. 


💫🌹బచ్చలకూర, ములగకాడలు పండని, వండని పదార్థములు, ఉలవలు, చిరుశెనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడినవానిలో దేనిని భుజించినను నూరు మార్లు నీచ జన్మమునందును. తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహములేదు.


💫🌹ఈ విధముగ శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖమాసమంతయు వ్రతము నాచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యధాశక్తి వైభవముగా బ్రాహ్మణునకీయవలెను. వైశాఖ బహుళ ద్వాదశినాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలశమును తాంబూల దక్షిణలను యిచ్చిన యమ ధర్మరాజు సంతసించెను.



శ్లో|| వైశాఖేసితద్వాదశ్యాం దద్యాద్దద్ధ్యన్నమంజసా |

     సోదకుంభంసతాంబూలం సఫలంచసదక్షిణం |

     దదామి ధర్మరాజాయ తేవప్రీణాతువైయమః ||


💫🌹పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి యిచ్చిన పితృదేవతలు సంతసింతురు.



శ్లో|| శీతలోదకదధ్యన్నం కాంస్యపాత్రస్థముత్తమం |

     సదక్షిణంసతాంబూలం సభక్ష్యంచ ఫలాన్వితం ||

     తదామివిష్ణవేతుభ్యం విష్ణులోక జిగిషయా |

     ఇతిదత్వాయధాశక్త్యాగాంచదద్యాత్కుటుంబినే ||


💫🌹చల్లని యుదకమును పెరుగు కలిపిన అన్నమును, కంచుపాత్రలోనుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు నుంచి పిల్లలుగలవానికి/బ్రాహ్మణునకు యిచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండ వైశాఖ మాస వ్రతము నాచరించినచో వాని సర్వపాపములును పోవుటయేకాక, వాని వంశమున నూరుతరములవారు పుణ్యలోకములనందుదురు. వైశాఖవ్రతము నాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరిలోకమును చేరుదురు.


💫🌹అని శంఖముని కిరాతునకు వైశాఖధర్మములను వివరించుచుండగా అయిదు కొమ్మలు గల మఱ్ఱిచెట్టు నేలపై బడెను అందరు ఆశ్చర్యపడిరి. ఆ చెట్టుతొఱ్ఱలో నుండి పెద్దశరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను.


💫🌹అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.



*వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము*


🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏

జీవితం    

బంధం బరువుగా అనుకునే వారికి , బంధాలు తెంచుకున్న వారికి, ఈ రోజు నేను రాసే కొన్ని మాటలు ఆలోచన కలిగిస్తే చాలు

ముందుగా, ఓ బంధం అనేది ఏర్పడటానికి కారణాలు ఎన్నో ఉంటాయి, విడిపోవటానికి కూడా ఉంటాయనుకోండి

కానీ ఓ మనిషికి బ్రతకటానికి డబ్బు తో పాటు బంధాలు కూడా అవసరం

కాలానికి అనుగుణంగా మనం మనతో ప్రేమగా ఉన్న వారితో గడిపిన క్షణాలను కూడా వదిలేస్తుంటాము కొన్ని వృత్తి రిత్యా అవ్వొచ్చు, లేక మాట పట్టింపుల వల్లనో కావచ్చు మౌనంగా దూరంగా ఉండిపోతున్నాం

ఊపిరి పోసుకున్న దగ్గరి నుండి ఊపిరి ఆగేదాక అమ్మ అని , నాన్న అని ,అక్క అన్న అని ఎన్నో బంధాలను పెనవేసుకుంటున్న మనం, స్నేహం-ప్రేమ అనే కారణాల వల్ల బిగువగా అనుబంధాలకు అల్లిక గా సాగిపోతున్నాం.కానీ ద్వేషం, అపార్థం, కోపం, మోసం, స్వార్థం అనే వాటికి చోటు ఇవ్వటం వలన ఎన్నో బంధాలు గతంగానే గతించి పోతున్నాయి. మీరు బాధ పడిన విషయం వలన కూడా కొందరిని దూరంగా ఉంచాల్సి వచ్చిండొచ్చు. ప్రేమ లేకుండా ద్వేషం, ద్వేషం రాకుండా అసహ్యం ఏర్పడదు. ప్రేమంటే అందులో మానవత్వం కూడా ఓ రకం, మనం పెంచుకొన్న నమ్మకం కూడా బంధాలకు పునాది. అప్యాయత లేనిదే బంధం మొదలవ్వదు., అలాంటి ఓ అద్భుతమైన భావానికి అహం అనే అడ్డుగోడలు కట్టి సమాధి చేస్తున్నారు,. ఒకరి లోపం నీకు నచ్చకపోవచ్చు అదే లోపం వల్ల నువ్వు విడిపోయిండొచ్చు, కానీ ఆ లోపాన్ని కూడా ప్రేమ తో సరిచేసుకోవచ్చు అనే ఓ కనిపించని సమాధానం, గుర్తుపట్టలేని ప్రశ్న గా మిగిలిన మీ అనుబంధాన్ని బ్రతికించే ఔషదం అని తెలుసుకుంటే, 

ప్రతి ఒక్కరి జీవితం నాలుగు గోడల మధ్య కాకుండా నలువైపులా అహ్లాదకరంగా ఉంటుంది!! 

కాబట్టి  నేను రాశాను అని కాకుండా, మీరు కష్టపడి ఇంత చదివారని కాకుండా, మీరు ఇష్టపడిన , ఇష్టపడుతున్న వారిని ఈరోజే పలకరించండి మనస్పూర్తిగా... 

గొడవ పడ్డ సంఘటనలను మనసులో దాచుకోవటం వలన ఉపయోగం లేదని తెలుకొని కలవటానికి మనసుతో ప్రయత్నం చేయండి. తప్పు ఎవరిదని లెక్కలేసుకోకుండా, బంధాల విలువ లెక్కలోకి తీసుకొని నేడే మీ వారికి చేరువ అవ్వండి...

ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి. అప్పుడే నిజమైన సంతోషం మన సొంతం అవుతుంది.

రాత్రి అయ్యింది, అంతా చీకటిగా ఉంది ఏమీ కనిపించడం లేదు అని నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది నమ్మకం ఉండాలి. ఏందకంటే ఇది ప్రతి రోజు జరిగేదే అని నీకు చాలా రోజులు గా అనుభవ పూర్వకంగా తేలుసు.

సంతోషం కూడా అలాగే వస్తుంది అని నమ్మకం వుండాలి. అలా కాకుండా రాత్రి, అయిన వెంటనే తెల్లవార లేదు అని బాధ పడకూడదు.

ఎందుకంటే దానికి 12 గంటల సమయం పడుతుంది అలాగే నీకు ఎదురైనా కష్టాలు కానీ, బాధలు కానీ పోవడానికి కొంత సమయం పడుతుంది అయితే చివరికి మాత్రం ఖచ్చితంగా నీకు మంచి జరిగి తీరుతుంది అనే నమ్మకంతో జీవిత గమనాన్ని కొనసాగించాలి.

తెల్లవారే వరకు నిద్ర పోవాలి అలాగే కష్టాలు తీరే వరకు భగవాన్ నామస్మరణ చేయాలి

VvvvvbV


తెలివుండాలి...తెలిసుండాలి

అది అర్ధరాత్రి వేళ. అడవిలో ఒకతను నడుచుకుంటూ పోతున్నాడు. ఇంతలో అనుకోని రీతిలో ఇద్దరొచ్చి  అతనిని కింద పడేసి గొడవకు దిగారు. అతనేమీ భయపడక వారితో గొడవపడ్డాడు. చివరికి ఆ ఇద్దరూ కలిసి అతని చేతి సంచీని లాక్కున్నారు. అందులో ఎంత డబ్బున్నదీ చూశాడు ఒకడు. చాలా కొద్దిమొత్తమే ఉంది. ‘‘ఓరీ వెధవా, నీ దగ్గర ఇంతేనా ఉంది....వీటికోసమే మాతో తలపడ్డావు... ఒకవేళ నీ దగ్గర వంద రూపాయలు గానీ ఉండి వుంటే మమ్మల్నిద్దరినీ చంపడానికి కూడా వెనుకాడి ఉండవు కదా’’అన్నారా దోపిడీ దొంగలు. అప్పటివరకూ నేల మీదే పడున్న అతను నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. తన శరీరానికి అంటుకున్న మట్టినంతా దులుపుకుంటూ చెప్పాడు...

‘‘నేనేమీ ముప్పయి రూపాయల కోసం మీతో తలపవడలేదు అన్నాడు.‘‘అయితే మరెందుకు?’’ అని అడిగారు దోపిడీ దొంగలు. ‘‘అంతకుముందే నా నడుముకి చుట్టుకున్న గుడ్డలో చాలా డబ్బుంది. వాటిని కాపాడుకోవడానికే మీతో గొడవపడ్డాను’’ అన్నాడు. ఈ మాట తర్వాత అక్కడ ఏం జరిగిందో విడిగా చెప్పక్కర్లేదుగా. ఎంత చదువుకుంటేనేం, ఆపద సంభవించేటప్పుడు తెలివిని ఉపయోగించకుంటే వారు ఒట్టి మూఢులేగా. మార్గమధ్యంలో ఎదురుపడే దోపిడీదొంగలతో మౌనంగా ఉండటమే తగిన ఉపదేశం.  అంతకన్నా ఇంకేం చెప్పాలి. దాని మహత్తు తెలుసుకునుంటే అతను మూర్ఖుడిగా ఉండడు. అబద్ధం చెప్పడం వేరు. నిజాన్ని దాచడం వేరు. నిజం మాట్లాడాలనుకున్నవాడు తెలివైనవాడే. నిజాన్ని ఎప్పుడు ఏ సమయంలో మాట్లాడాలి అన్నదీ తెలుసుకునుండాలి. ఈనాటి ప్రపంచంలో మేధావుల కన్నా తెలివైనవారే కావాలి.

  – యామిజాల జగదీశ్‌

Thursday, 3 June 2021

 🕉️ *వైశాఖ పురాణం 24వ అధ్యాయము* 🕉️

*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||*

🌻 *వాయు శాపము* 🌻

💫🌹అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.

💫🌹శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు, ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలిసికొనుటయెట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచేనతడు సంతోషించును? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.

💫🌹శంఖుడును కిరాతుడా! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. 

💫🌹దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవృత్తులన్నియు, నివృత్తులును, పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. 

💫🌹చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. 

💫🌹శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, యితిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని యింద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. 

💫🌹ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.

💫🌹బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి యుండుటచే, ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వండరెట్లు గొప్పవాడు. అట్తి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. 

💫🌹అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు, సప్తర్షులకంటె అగ్ని, అగ్నికంటె సూర్యుడు, సూర్యునికంటె గురువు, గురువుకంటె ప్రాణము, ప్రాణము కంటె యింద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.

💫🌹ఇంద్రునికంటె గిరిజాదేవి, ఆమెకంటె జగద్గురువగు శివుడు, శివునికంటె మహాదేవియగు బుద్ది, బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునండే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. 

💫🌹లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో, ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.

💫🌹అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ/రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. 

💫🌹అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ యింద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుననక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.

💫🌹అప్పుడు శ్రీహరి నవ్వుచు "విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ యీ శరీరమునుండి బయటకు వచ్చిన యీ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.

💫🌹స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి యీవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి యింద్రుడు వెలుపలకు వచ్చెను. 

💫🌹అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము యింద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. 

💫🌹దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. 

💫🌹జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి యిట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.

💫🌹శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. 

💫🌹అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రదికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.

💫🌹ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు, చూడలేదు. 

💫🌹ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.

💫🌹ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. 

💫🌹కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.

💫🌹అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ! బ్రహ్మజ్ఞానీ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.

💫🌹అప్పుడు శంఖమహాముని యిట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. 

💫🌹పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.

💫🌹ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని యిట్లు శపించితివి కావున కణ్వమునీ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. 

💫🌹ఇంకను అడుగవలసినది యున్నచో నదుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.

*వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము*

🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏

https://t.me/teluguvelugu01

జీవితం    

బంధం బరువుగా అనుకునే వారికి , బంధాలు తెంచుకున్న వారికి, ఈ రోజు నేను రాసే కొన్ని మాటలు ఆలోచన కలిగిస్తే చాలు

ముందుగా, ఓ బంధం అనేది ఏర్పడటానికి కారణాలు ఎన్నో ఉంటాయి, విడిపోవటానికి కూడా ఉంటాయనుకోండి

కానీ ఓ మనిషికి బ్రతకటానికి డబ్బు తో పాటు బంధాలు కూడా అవసరం

కాలానికి అనుగుణంగా మనం మనతో ప్రేమగా ఉన్న వారితో గడిపిన క్షణాలను కూడా వదిలేస్తుంటాము కొన్ని వృత్తి రిత్యా అవ్వొచ్చు, లేక మాట పట్టింపుల వల్లనో కావచ్చు మౌనంగా దూరంగా ఉండిపోతున్నాం

ఊపిరి పోసుకున్న దగ్గరి నుండి ఊపిరి ఆగేదాక అమ్మ అని , నాన్న అని ,అక్క అన్న అని ఎన్నో బంధాలను పెనవేసుకుంటున్న మనం, స్నేహం-ప్రేమ అనే కారణాల వల్ల బిగువగా అనుబంధాలకు అల్లిక గా సాగిపోతున్నాం.కానీ ద్వేషం, అపార్థం, కోపం, మోసం, స్వార్థం అనే వాటికి చోటు ఇవ్వటం వలన ఎన్నో బంధాలు గతంగానే గతించి పోతున్నాయి. మీరు బాధ పడిన విషయం వలన కూడా కొందరిని దూరంగా ఉంచాల్సి వచ్చిండొచ్చు. ప్రేమ లేకుండా ద్వేషం, ద్వేషం రాకుండా అసహ్యం ఏర్పడదు. ప్రేమంటే అందులో మానవత్వం కూడా ఓ రకం, మనం పెంచుకొన్న నమ్మకం కూడా బంధాలకు పునాది. అప్యాయత లేనిదే బంధం మొదలవ్వదు., అలాంటి ఓ అద్భుతమైన భావానికి అహం అనే అడ్డుగోడలు కట్టి సమాధి చేస్తున్నారు,. ఒకరి లోపం నీకు నచ్చకపోవచ్చు అదే లోపం వల్ల నువ్వు విడిపోయిండొచ్చు, కానీ ఆ లోపాన్ని కూడా ప్రేమ తో సరిచేసుకోవచ్చు అనే ఓ కనిపించని సమాధానం, గుర్తుపట్టలేని ప్రశ్న గా మిగిలిన మీ అనుబంధాన్ని బ్రతికించే ఔషదం అని తెలుసుకుంటే, 

ప్రతి ఒక్కరి జీవితం నాలుగు గోడల మధ్య కాకుండా నలువైపులా అహ్లాదకరంగా ఉంటుంది!! 

కాబట్టి  నేను రాశాను అని కాకుండా, మీరు కష్టపడి ఇంత చదివారని కాకుండా, మీరు ఇష్టపడిన , ఇష్టపడుతున్న వారిని ఈరోజే పలకరించండి మనస్పూర్తిగా... 

గొడవ పడ్డ సంఘటనలను మనసులో దాచుకోవటం వలన ఉపయోగం లేదని తెలుకొని కలవటానికి మనసుతో ప్రయత్నం చేయండి. తప్పు ఎవరిదని లెక్కలేసుకోకుండా, బంధాల విలువ లెక్కలోకి తీసుకొని నేడే మీ వారికి చేరువ అవ్వండి...

ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి. అప్పుడే నిజమైన సంతోషం మన సొంతం అవుతుంది.

రాత్రి అయ్యింది, అంతా చీకటిగా ఉంది ఏమీ కనిపించడం లేదు అని నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది నమ్మకం ఉండాలి. ఏందకంటే ఇది ప్రతి రోజు జరిగేదే అని నీకు చాలా రోజులు గా అనుభవ పూర్వకంగా తేలుసు.

సంతోషం కూడా అలాగే వస్తుంది అని నమ్మకం వుండాలి. అలా కాకుండా రాత్రి, అయిన వెంటనే తెల్లవార లేదు అని బాధ పడకూడదు.

ఎందుకంటే దానికి 12 గంటల సమయం పడుతుంది అలాగే నీకు ఎదురైనా కష్టాలు కానీ, బాధలు కానీ పోవడానికి కొంత సమయం పడుతుంది అయితే చివరికి మాత్రం ఖచ్చితంగా నీకు మంచి జరిగి తీరుతుంది అనే నమ్మకంతో జీవిత గమనాన్ని కొనసాగించాలి.

తెల్లవారే వరకు నిద్ర పోవాలి అలాగే కష్టాలు తీరే వరకు భగవాన్ నామస్మరణ చేయాలి




🙏🍁🌼అనుబంధాలు🌼🌹🍁


       బంధాలు వాటంతటవే దూరం కావు , వ్యక్తిత్వం వల్లనో ప్రవర్తన వల్లనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరమవుతాయి .


      నిజాలు మాట్లాడే వారు ఎప్పుడూ ఒంటరిగా మిగిలిపోతారూ నిజాయితీగా ప్రేమించే వారి ప్రేమను ఎప్పుటికి పొందలేరూ బంధాలు ప్రేమించే వారు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారూ  కుటుంబం కోసం కష్ట పడేవారినీ ఎప్పటికి సుఖ పడనివ్వరూ . పదిమంది కోసం పాటుపడే వారు నిందలపాలు అవుతూనే ఉంటారు . కానీ మనిషి గా మంచివారి మనస్సులలో శాశ్వతంగా ఉంటారు .


     డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళ గలదు , అందులో ఎటువంటి అనుమానం లేదు , కానీ!.మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బుని తీసుకెళ్ళలేడు ఇందులోను ఎంటువంటి అనుమానం లేదు ! ఐనా మనిషి ఆకలి కోసం చేసే పోరాటం కన్నా పైసలు కోసం చేసే పోరాటమే ఎక్కువైంది. ఇది పచ్చి నిజం🍁🌼🌷


    ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి . ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి . అందుకే గతం మరిచిపోవద్దు నేస్తమా .🌻🌺🌹


     సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనషుల విలువలను కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెకించే వారిని సంపాదించాలి భాదల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి,🌼🌻🌹

   

మన మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు , మన మనసు నొచ్చుకునేలా మాట్లాడే వారు మరికొందరు మనతో మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు మన అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం .🌷🌹


     దైర్యం అంటే ఎవరో నీకు తోడు వున్నానని చెప్పడం కాదు ! ఎవరు లేకున్న నాకు నేను వున్నానని చెప్పుకోవడమే అసలైనా దైర్యం.


    ఈ రోజుల్లో మోయలేనంత డబ్బులు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు కానీ ! చివరికి మనల్ని మోయల్సిన నలుగుర్ని సంపాదించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు ఈ కరోనా వైరస్ వలన .


    మనం దేనినైనా పోగొట్టుకోవడం చాలా సులువు కానీ ! దానిని సంపాదించడమే చాలా కష్టం అది సంపద అయినా ప్రేమ అయినా స్నేహమైనా నమ్మకమైనా . 🌹🌷🙏


     మన చేతిలో ఏది ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు , ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు నేస్తమా !🍀



 🕉️ *వైశాఖ పురాణం 23వ అధ్యాయము* 🕉️

*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||*

🌻 *కిరాతుని పూర్వజన్మ* 🌻

💫🌹నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను.

💫🌹కిరాతుడు శంఖునితో నిట్లనెను. మహామునీ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడితిని. మహాత్ములు, సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా! నీచమైన కిరాతకులమున పుట్టినపాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి? ఇట్టి యాశ్చర్యపరిణామమునకు మహాత్ములగు మీయనుగ్రహమే కారణమని యనుకొనుచున్నాను. 

💫🌹సజ్జనులను, పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా! ఉత్తముడా! నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పినమాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా! సమచిత్తులు, భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అనుభేదముండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను, దుష్టులైనను చెప్పుదురు కదా!

💫🌹గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింప జేయు స్వభావము కలవారు కదా! దయాశాలీ! సజ్జనుడా! నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది, నీకు విధేయుడనగుటవలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయజూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను.

💫🌹శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది యంతయును వైశాఖమహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి యిట్లనెను.

💫🌹కిరాతుడా! నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖధర్మములనాచరింపుము. ఈయెండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు, నీడలేవు. నేనిచటనుండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖమహిమను, నేను చూచిన దానిని, విన్న దానిని నీకు వివరింతును అని పలికెను.

💫🌹అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామీ! యిచటకు కొలది దూరమున స్వచ్చమైన నీరున్న సరస్సుకలదు. అచట మిగుల మగ్గిన వెలగపండ్లతో నిండిన వెలగ చెట్లు యెన్నియో యున్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగనుండును. అచటకు పోవుదము రమ్మని శంఖుని అచటకు గొనిపోయెను. శంఖుడును కిరాతునితో గలసి వెళ్ళి యచట మనోహరమగు సరస్సును జూచెను. 

💫🌹ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురుచెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షము లెక్కువగానుండుటచే తుమ్మెదలు వాలి మధురధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడియుండెను. కలువలు, తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై యుండెను. 

💫🌹వివిధములగు పక్షులచటవ్రాలి మధురముగ కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగ నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగ మనోహరములైయుండెను. అడవి జంతువులును అచట స్వేచ్చగ తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైనసరస్సును జూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను. 

💫🌹పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగ కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల జూచి యిట్లనెను.

💫🌹నాయనా! కిరాతా! ధర్మతత్పరా! నీకేధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశసాధ్యములుగ నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వాని నాచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు, ఆయుష్మికములునగు శుభలాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను.

💫అప్పుడు కిరాతుడు స్వామీ! అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మనాకేల కలిగెను? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని యడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై యుంది యిట్లనెను.

💫🌹ఓయీ! నీవు పూర్వము శాకలనగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. శ్రీవత్ససగోత్రుడవు. వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు  కాంతిమతి. ఆమె సుందరి, యుత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రునివలె నాచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది.

💫🌹ఆమె నీకును నీవుంచుకున్న వేశ్యకును అనేకవిధములగు సేవలను ఓర్పుగా శాంతముగ చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్తకును, భర్తకిష్టురాలగు వేశ్యకును బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగ చాల కాలము గడచినది.

💫🌹ఓయీ కిరాతా! ఒకనాడునీవు బ్రాహ్మణులు భుజించునాహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదెపెరుగు ముల్లంగిదుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారమువలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితోబోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవచేయుచుండెడిది. నీవును పశ్చాత్తపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియు చేయలేకపోతిని. 

💫🌹అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు పదిజన్మలు నపుంసకుడై పుట్టును సుమా! నీవంటి పతివ్రత నవమానించిన నేను పెక్కు నీచ జన్మలనందుదును. అని యనేక విధములుగ నామెతో బలికితివి. ఆమెయు 'నాధా! నీవు దైన్యము వహింపకుము. చేసినదానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగ బాధించును. వానిని సహించినవారుత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును. 

💫🌹దాని ఫలమిదియని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువులనుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగ భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్దలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరిని ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదెపెరుగుతో సమర్పింతును. 

💫🌹గణేశునకు కుడుములను నివేదింతును. పది శనివారములుపవాసమును చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగ చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను.

💫🌹ఒకనాడు దేవలుడను ముని సాయంసమయమున నామె యింటికి వచ్చెను. అప్పుడామె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిధిని పూజించినచో నీకు మంచి కలుగునని యామె తలచెను. నీకు ధర్మకార్యములనిన యిష్టము లేకపోవుటచే నామె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీచేత నామె పానకము నిప్పించెను. 

💫🌹నీయనుజ్ఞతో దానును యిచ్చెను. మరునాటి యుదయమున దేవలముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్యవ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి గాని యిన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలచుకొనలేదు. 

💫🌹పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్భుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను.

💫🌹నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకమునిచ్చుటవలన దేవలుని పాదములను కడుగుట వలన నామెకు శ్రీహరిసాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్ములడుగ వలెనను మంచిబుద్ది కలిగినది. 

💫🌹దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుటచే నీకు నాతో నీవిధముగ సాంగత్యము చేయు నవకాశము కలిగినది. కిరాతా! నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలిసికొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖవ్రత నాచరించుట వలన కలిగినది. నీకింకను యేమి తెలిసికొనవలయునని యున్నదో దానినడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.

💫🌹అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.

*వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము*

🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏

 

మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట
"గాన గంధర్వుడు"  శ్రీ S P బాలసుబ్రహ్మణ్యం గారు
ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి అన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...
పూజ్య గురుదేవులు, వాచస్పతి బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీ S P బాలసుబ్రహ్మణ్యం గారి యశస్సును గురించి చెప్పిన విషయములు "గాన గంధర్వుడు"  శ్రీ S P బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా...
శ్రీపతిపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు లబ్ధప్రతిష్టులైన గాయకులు. వారు దాదాపుగా 40 వేలకు పైగా పాటలు పాడటము, అవికూడా జనరంజకము కావడము, కొన్ని కోట్లమంది ప్రజల హృదయములలో పాట ద్వారా సుస్థిరమైన స్థానము సంపాదించుకోవటము అంత తేలిక అయిన విషయము కాదు. బహుశా వారి నాన్నగారు చేసిన గొప్ప తపస్సు వారిని అంత యశో విరాజితులను చేసిందని నేను వ్యక్తిగతముగా నమ్ముతూ ఉంటాను. బాలసుబ్రహ్మణ్యం గారి నాన్నగారు శ్రీ పండితారాధ్యుల సాంబమూర్తిగారు నెల్లూరులో హరికధలు చెపుతూ ఉండే వారు. 19 సం || పాటు ఊంఛవృత్తి చేసి నెల్లూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేస్తూ ఉండేవారు. మొదటి భిక్ష బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మగారు పెడుతూ ఉండేవారు. అపర త్యాగరాజులాగే 'మనసా ఎటులోర్తునో' కీర్తన పాడుతూ వీధి వీధి తిరిగి భిక్ష స్వీకరించి రామపాద పూజలో తరించే వారు. నెల్లూరు పట్టణానికి ఎందరో సంగీత విద్వాంసులను పిలిపించి సంగీత కార్యక్రమములు నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన యొక్క అపారమైన భక్తి, వారు చేసిన త్యాగరాజ ఆరాధనోత్సవాల ఫలితముగా బహుశా బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు కుమారుడిగా జన్మించారు. ఆయన జీవితము నిజానికి పూలు పరచిన పడక కాదు. చిన్నతనములో ఆయన పడ్డ కష్టములు అన్నీఇన్నీ కావు. ఎన్ని ఊళ్లు మారారో, వాళ్ళ అమ్మగారి చేతికి ఉన్న విసినకర్ర కాడ దెబ్బలు ఎన్నిమాట్లు తిన్నారో! దీపావళి పండగ వస్తే ఒక సిల్కు లాల్చి కోనుక్కోవడము, 10 రూ. పెట్టి దీపావళి సామాను కొనుక్కోవడము ఎంతో కష్టము అయ్యేదో. చిన్నతనములో బాలసుబ్రహ్మణ్యం గారిని వాళ్ళ నాన్నగారి స్నేహితుల దగ్గరకు వెళ్ళి డబ్బు అప్పుగా తీసుకుని రమ్మంటే ఎంతో బిడియ పడుతూ వెళ్ళి తీసుకుని వచ్చేవారని ఆయన వ్రాసుకున్నారు. అన్ని కష్టములు పడి సంగీతము మీద అభిరుచి భగవంతుని యొక్క అనుగ్రహముగా ఏర్పడిన తరవాత వెనక్కి తిరిగి చూడలేదు. ఒకసారి చలనచిత్రములలో నేపథ్య గానము పాడటము ప్రారంభము చేసిన తరవాత ఆయన ఎవరి కంఠము అయినా సరే అంత అద్భుతముగా అనుకరించే వారు. ఆ నటుడే పాడితే ఎలా ఉంటుందో బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే అలా ఉండేది. ఎందరికో నటులకు వారి కంఠమును డబ్బింగ్ కోసమని అద్భుతముగా వెచ్చించారు. ఆయా నటులు అంత లబ్ధప్రతిష్టులు కాగలిగారు అంటే దానిలో బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన సేవ, వారు చూపించిన సౌహార్ద్రము ఎంతో ఉన్నది. ఆయన గొప్ప నటులు, గొప్ప సంగీత విద్వాంసులు. ఎన్నో పాటలు పాడారు. ఆయన గురుముఖతః సంగీతము నేర్చుకోకపోయినా భగవంతుడు ఆయనకు అంత గొప్ప సంగీతవిద్య ఇచ్చారు. ఎన్ని పాటలు పాడారో, ఎంత భావయుక్తముగా పాడారో. ఉచ్ఛారణ గురించి ఎంత జాగ్రత్త తీసుకునేవారో. ఏ పదమైనా శాస్త్రీయముగా ఉచ్ఛరించి, అర్థము చెడిపోకూడదని జాగ్రత్త తీసుకునేవారు. అన్నిటినీ మించి విశాల హృదయము కలిగిన స్నేహశీలి. వారిని అనేక సందర్భములలో కలుసుకోవడము జరిగింది. పెద్దల పట్ల వారి గౌరవము చాలా గొప్పగా ఉండేది. "అంత స్థాయి కలిగిన వ్యక్తి , ఆకాశమంత ఎత్తు ఎదిగిన వ్యక్తి ఇంత వినయముతో ప్రవర్తించడము సాధ్యమవుతుందా?" అనిపించేది. పెద్దలు కనపడితే అంత వినయముతో ప్రవర్తించేవారు. ఎంతో సమయ పరిపాలన చేసేవారు. అందరినీ ఆదుకునేవారు. గొప్ప భక్తి కలిగిన వ్యక్తి. వారికి గోసేవ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. అన్నిటినీ మించి వారిలో ఉన్న చాలా చాలా గొప్ప విషయము ఎక్కడ మంచి ఉన్నా గ్రహించేవారు. ఏ కార్యక్రమమైనా దానిని అడ్డు పెట్టి సమాజానికి మంచిని అందించే ప్రయత్నము చేసేవారు. లబ్ధప్రతిష్టులైన గాయకులు, గాయనీ మణులు తయారు కావాలన్న ఉద్దేశ్యముతో etv లో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమములో వేదికకు ఎందరో గాయకులను పరిచయము చేసారు. స్వరాభిషేకము అన్న పేరుతో ఎప్పుడూ నిత్య నూతనమైన పాటలను పాడుతూ, వెనక ఉన్న నేపథ్యమును, కవి ఏ సందర్భములో పాట వ్రాసారు? నటీ నటులు ఎలా నటించారు ? ఆ దర్శక ప్రతిభ ఏమిటి? పాట వ్రాసిన కవి ఎంత భావ స్ఫూరకముగా ఆ గీతము రచించారు? అన్న విషయములు చెపుతుంటే ఎంతో అద్భుతముగా అనిపించేది. వ్యక్తిగతముగా ఆయన కారణజన్ముడు అనిపిస్తుంది. 74 సం || ల వయసులో అన్ని వేల పాటలు గురువు దగ్గర సంగీత అభ్యాసము లేకుండా పాడగలగడము, అంతమంది నటుల కంఠమునకు సరిపోయేట్టుగా పాడగలగడము , మాటవిరుపు దగ్గర నుంచి మాట్లాడే మాట వరకు అంత గొప్పగా ఉండగలగడము, అంతగా ఒదగగలగడము ఆయనకే చెల్లింది. అంత గొప్పవారు బాలసుబ్రహ్మణ్యం గారు.
ఆయన ఇవ్వాళ శరీరము విడిచి పెట్టి ఉండవచ్చుగాక! కానీ ఆయన ఎప్పటికీ అలాగే శాశ్వతముగా ఉండిపోతారు. ఎందుచేత అనగా సాగరసంగమము చలనచిత్రములో చిట్టచివర విశ్వనాథ్ గారు ఒక శ్లోకము చెప్పిస్తారు. యశః శరీరము కలిగిన మహానుభావులకు జరా-మరణములు ఉండవు. శరీరము ఉన్నంత కాలమే మిగిలిన వారి యొక్క వాణి వినపడుతుంది. ఇటువంటి లబ్ధప్రతిష్టులైన వారి శరీరము కాలగతిలో వెళ్ళిపోయినా, వారి కంఠము వినపడుతూనే ఉంటుంది. ఎన్ని లలిత గీతములు పాడారో, ఎన్ని భక్తి గీతములు పాడారో, ఎన్ని సందేశాత్మకమైన గీతములు పాడారో. ఆయా సభలలో, ఆయా సందర్భములలో, మనసుకి ఉత్సాహము కలగవలసిన సందర్భములలో జనులు నిరంతరముగా పాటలు వింటూనే ఉంటారు. అటువంటి కీర్తి శరీరము కలిగిన బాలసుబ్రహ్మణ్యం గారికి జరా మరణములు ఉంటాయని నేను నమ్మటము లేదు. భర్తృహరి తన నీతిశతకములో చెప్పినట్టు
జయంతితే సుకృతినో రస సిద్దాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం ||
విశ్వనాథ్ గారు ఆయనతో ఎందుకు ఆ శ్లోకము పాడించారో - అది ఆయన విషయములోనే నిజమైంది.
ॐ  🙏Very interesting. Pl see the above video, the  difference in vedic chants chanting  for gayathri mantra

Wednesday, 2 June 2021

 🕉️ *వైశాఖ పురాణం 22వ అధ్యాయము* 🕉️



*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్*

🌻 *దంతిల కోహల శాపవిముక్తి* 🌻

💫🌹నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. 

💫🌹ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.

💫🌹శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి యిట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.

💫🌹పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున నలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.

💫🌹అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును, పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.

💫🌹శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. 

💫🌹వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి యిచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.

💫🌹శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున యిట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.

💫🌹కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి యిచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. 

💫🌹శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల యీ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి యిచ్చి యిట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. 

💫🌹దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను యిట్లు యిచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. 

💫🌹కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా. 

💫🌹శ్రీహరికిష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి యిష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. 

💫🌹తపస్సులు, యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత యిష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు, గంగానదికి ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. 

💫🌹వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి యీ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. 

💫🌹కావుననే యీ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.

💫🌹ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు, గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. 

💫🌹వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.

💫🌹కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి.అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడునని మా పేర్లు. 

💫🌹అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న  మా యిద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి 'నాయనలారా! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. 

💫🌹ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను. 

💫🌹ధర్మవిముఖుడైన పుత్రుని, వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. 

💫🌹కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. 

💫🌹అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. 

💫🌹శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.

💫🌹వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి యిట్లనెను.

💫🌹అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.

*వైశాఖ పురాణం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం*

🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏


[03/06, 6:45 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


🕉 వినాయకుడిని నాగభూషణుడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా ?... 🙏


@ హిందూ పురాణాల ప్రకారం వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావిస్తారు. వినాయకుడికి గణపతి, విగ్నేశ్వరుడు, ఏకదంతుడు, గణనాథుడు, లంబోదరుడు వంటి పేర్లు ఉన్నాయి. ఇవే కాకుండా వినాయకుడిని నాగభూషణడు అని కూడా పిలుస్తారు. అయితే వినాయకుడిని నాగభూషణడు అని ఎందుకు పిలుస్తారో చాలామందికి తెలియకపోవచ్చు. పురాణాల ప్రకారం వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం...


@ వినాయకుడి తమ్ముడు కార్తికేయ వివాహం ఇంద్రుని కుమార్తె దేవసేనతో నిశ్చయమైంది. ఈ క్రమంలోనే పార్వతీదేవి వినాయకుడిని ఉద్దేశించి తమ్ముడికి పెళ్లి నిశ్చయమైంది, తమ్ముడు పెళ్లి జరగాలంటే ముందుగా నీ పెళ్లి జరగాలని, పెళ్లి చేసుకోమని వినాయకుడికి చెబుతుంది. పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు ససేమిరా ఒప్పుకోకుండా అనేక సాకులు చెబుతాడు.పార్వతి దేవి మాత్రం పెళ్లి విషయంలో పట్టుబడటంతో చేసేదేమీ లేక వినాయకుడు తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోతాడు.



@ అలా వెళ్లిన వినాయకుడు తపస్సు కోసం చుట్టూ పుట్టలు ఉండి ఆ పుట్టలో పాము ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. ఆ ప్రదేశంలో తపస్సు చేస్తుండగా పుట్టలో నుంచి పాములు నిటారుగా నిలబడి బుసులు కొడుతూ వినాయకుడి తపస్సుకు భంగం కలగకుండా రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఇంద్రుడు ఎలాగైనా విఘ్నేశ్వరుడి తపస్సు భంగం కలిగించాలని రాక్షసులకు, ‘‘మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్నందర్నీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు. పగతీర్చుకోండి!” అని చెప్పి ఉసిగొల్పాడు.

ఆ విధంగా రాక్షసులు వినాయకుడి పై దాడి చేయగా మహాసర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణిచాయి. అక్కడితో రాక్షసులు అక్కడినుంచి పారిపోతారు.ఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతాపురుషుల్ని, వారితో అప్సరసలను కలిపి పంపుతూ, ‘‘విఘ్నేశ్వరుడికి ఆటంకం కలిగేలాగ మీ ప్రతాపం చూపండి అని వారిని వినాయకుడి పై ఉసి గొలపాడు. వారిపై నాగులు బుసలు కొడుతూ వారిని కాటు వేస్తూ దేవతలను స్వర్గానికి తరిమాయి.ఈ విధంగా వినాయకుడు తపస్సుకు భంగం కలగకుండా పాములు రక్షించినందుకు వినాయకుడు సంతోషించి పాములను ఎత్తుకొని వాటిని ఆభరణాలుగా ధరించి కైలాసానికి వెళ్తాడు. ఈ విధంగానే పాములు వినాయకుడికి ఆభరణాలుగా మారడంతో వినాయకుడు నాగభూషణడు అయ్యాడు. అప్పటినుంచి వినాయకుడిని నాగభూషణడు అనే పేరుతో కూడా పిలుస్తారు.

[03/06, 6:45 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


మంచి విషయాలను దారి మళ్లించాలన్నిది కాదు కానీ, కేవలం దేవుడు, కుల మత ఆచారాలకు ముడి పెట్టడం వల్ల మంచి విషయాలన్నీ మటుమాయమైపోతున్నాయని చిన్న బాధ. దేవుడి గుడికి వచ్చిన తరువాత కాస్సేపు కూర్చుని వెళ్లాలని అంటారు. దాదాపు అందరూ పాటిస్తారు. కొందరు సమయం లేకుంటే, ఇలా కూర్చున్నట్లే కూర్చుని లేచి చక్కాపోతారు. దీని గురించి స్పష్టంగా చెబితేనన్నా కూర్చుంటారేమో?


గుళ్లన్నీ చాలా వరకు కొండపై వుంటాయి. కాకుంటే కాసిన్ని అయినా మెట్లుంటాయి. పైగా లో​ప​లకు వచ్చా​క  గుడిచుట్టూ మూడో, అంతకు పైగానో ప్రదిక్షణలు. ఇవన్నీ అవగానే మళ్లీ వెంటనే మెట్లు దిగడం అంటే అంత మంచిది కాదు. పైగా కొండపైన అంటే ఆక్సిజన్ అంతగా అందదు. అందుకే గుడిపైకి వచ్చి, ప్రదక్షిణలు, దర్శనం చేసాక కాస్సేపు కూర్చోమన్నది. ఎందుకు? కాస్త సేద తీరడానికి. అలుపు తగ్గి గుండె స్పందించే వేగం మళ్లీ మామూలు స్థితికి రావడానికి. ఆపైన మళ్లీ మన ప్రయాణం మనదే. కానీ ఎందుకు కూర్చోవాలో చెప్పకుండా, కూర్చోవాలంతే, అంటూ లాజిక్ లేని కబుర్లు చెబితే కొంత కాలం కాకుంటే, మరికొంత కాలం తరువాత అయినా మటుమాయం అయిపోతాయి.


ఇటీవల గర్భగుడిలో కూడా కొన్ని చోట్ల ప్ర​దక్షిణలు చేయించేస్తున్నారు. పాపం అంతంత మాత్రం తెలిసిన పురోహితులు. నిజానికి గుడిచుట్టూ ప్రదక్షిణ చేసినా, మన వెనుక భాగం దేవుడి వైపు తిరగదు. కానీ గర్భగుడిలో అలా చేయడం సబబు కాదు. అందుకే గర్భగుడిలో ప్రదక్షిణ నిషేధం. అదే విధంగా గుడిలో భగవంతుడికి అభిముఖంగా సాష్టాంగం పడడం కూడా తప్పే. రాముడైనా, శివుడైనా, మరే దేవుడైనా వారి బంటు లేదా వాహనం దేముడికి ఎదురుగా కొలువుతీరి వుంటుంది. ఆంజనేయుడో, గరుడాళ్వారో,నందీశ్వరుడో. దేవుడి ఎదురుగా సాష్టాంగం పడితే మన కాళ్లు వారి వైపు వుంచాల్సి వస్తుంది. అందుకే ఓ పక్కగా సాష్టాంగం చేయాలి.


మహా నైవేద్యం పెట్టేటపుడు పెద్దగా గంట వాయిస్తారు. ఇప్పటికీ అదే వ్యవహారం. కానీ నిజానికి ఇప్పుడు అంత పెద్దగా అవసరం లేదు. పూర్వం గుళ్లో మహాభోగం అయిన తరువాత కానీ, ఊళ్లో జనాలు కావచ్చు. రాజ్యాన్నేలే మహరాజు కావచ్చు, జమిందారు కావచ్చు, భోజనానికి ఉపక్రమించేవారు కాదు. అందుకోసం, మహాభోగం సమయంలో పెద్దగా గంట వాయించేవారు. దాన్ని విని, దేవుడికి నివేదన జరిగింది అని తెలుసుకుని భోజనానికి ఉపక్రమించేవారు.


తీర్థం అంటూ స్వీకరిస్తాం గుడిలో. ఇప్పడు అభిషేక జలమో, పంచామృతాలో తీర్థంగా ఇస్తుంటారు.కొన్ని గుళ్లలో తులసి వేసిన ఉదకం ఇస్తారు. తులసి మంచి చెడ్డలు తెలిసినవేగా. నిజానికి తీర్థం వెనుక వ్యవహారం ఒకటి వుంది. పూజా సమయంలో భగవంతుడికి సమర్పించే అర్ఘ్య పాద్యాలన్నీ ఆయనకు చూపించాక, వేరే పాత్రలో వేయడం పద్దతి. అలా చేరిన జలాన్ని తీర్థంగా స్వీకరించడం విధాయకం. అంటే భగవంతుడికి అర్పించిన జలం అన్నమాట అది. ఇక్కడ ఓ సంగతి చెప్పాలి. ఇళ్లలో పూజ చేసేటపుడు పంచపాత్ర కింద చిన్న పళ్లెం వుంచుతారు. కానీ పక్కన మరో పళ్లెం లేదా చిన్న గ్లాసు వుంచాలి. గుడిలో భగవంతుడికి అర్పించినవి ఓ పాత్రలోవేసినట్లు, ఇక్కడ కూడా ఆ పళ్లెం లేదా, పాత్రలో వేయాలి. ఇలా చేరిన నీటిని, పూజ అనంతంరం ఓ చిటెకడుసేవించడం, మిగిలినది తులసి మొక్కలో పోయడం శ్రేష్టం. ఎందుకంటే మనం భగవంతుడికి అర్పించేవి ఏవైనా నదీ మార్గంలో లేదా ఇలా భూ మార్గంలో. ఇంటిలో నిత్యం చేసే వ్యవహారం కాబట్టి తులసి మొక్కలో పోయడం అన్నది మంచి పద్దతి. అలా పోసే ముందు చేయి అడ్డుపెట్టి పోయాలి. ఇది రెండు విదాల అవసరం. ఒకటి చేయి అడ్డుపెట్టి పోయడం వల్ల మొక్కవేళ్ల కు మంచిది. రెండవది ఆ చేతికి వున్న నైర్మల్య జలం తలపై జల్లుకునే అవకాశం.


నైర్మల్య జలమే కాదు, దేవుని విగ్రహాలు, ఫొటోలమీద నుంచి తీసిన నిన్నటి పూలు, పత్రి వగైరా కూడా తులసి లేదా ఇతర మొక్కల్లో వేయడం ఉభయతారకం. వాటిని ఎవరూ తొక్కకుండా వుంటుంది. అదే సమయంలో అవి కుళ్లి, మొక్కలకు ఎరువుగా మారుతుంది. కుంకుమార్చన సదా చేసేవారి ఇంట బోలెడు పేరుకుంటుంది. ఏం చేయాలి. ఎంతకని ఎందరికని ఇస్తారు. దాన్ని విసర్జించాలన్నా తులసిలోనే వేయడం సులువైన పని. అయితే ఇలా వేసినపుడు కాసిన్ని నీళ్లు పోయాలి. అలా చేస్తే గాలికి ఎగరదు. అన్నట్లు కుంకుమ అంటే గుర్తుకు వచ్చింది. బజారులో అమ్మే పసుపు పూజకే కాదు,నిజానికి తినడానికి అంత మంచివి లభించడం లేదు. గమనించాలి. ముఖ్యంగా ఈ పసుపు పొడిబారి, ఫేస్ పౌడర్ మాదిరిగా ఎగురుతూవుంటుంది. దానికి కారణం యంత్రాల సహాయంతో పసుపులోని తైలాన్ని వేరు చేయడమే. అలా వేరు చేసిన పసుపు మనకు ఏం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందువల్ల పసుపు కొమ్ములు చిన్న ముక్కలు చేసి, ఇంట్లో ఆడుకుని వాడుకోవడం అంత ఉత్తమం మరొకటి లేదు. అదే మాదిరిగా ఇప్పుడు దొరికే చందనపు పొడులు కూడా అంతే. వాటిని వాడినా వాడకున్నా ఒకటే.


సరే ఇక మళ్లీ ఆలయానికి వస్తే, ఇప్పటి కాలరీతులకు అనుగుణంగా చాలా గుళ్లలో కొబ్బరకాయ కొట్టడం, అగరత్తులు, కర్పూరం, పూలు ఇవ్వడం మానేయడమే మంచింది. అదేమిటి దేవుడికి ఇవ్వవద్దని అంటున్నారు అనుకోవద్దు. మనం ఇచ్చేవి సద్వినియోగం, సక్రమ వినియోగం అవుతాయా..కావా అన్నది గమనించి ఇవ్వండి. మూలవిరాట్ వేరు, ఉత్సవ విగ్రహం వేరు. ఆఖరికి కొబ్బరికాయ కొట్టేదగ్గర విగ్రహం, లేదా ఫోటో వేరు. ఎవరో దేవస్థానం ఉద్యోగి కూర్చుని, యాంత్రికంగా కొబ్బరికాయ తీసకుని, కొట్టడం మన చేతిలొ ఓ చిప్ప వుంచడం, పక్కన రెండు గంపలు పెట్టుకుని, ఆ ఊదు వత్తులు, కర్పూరం, పసుపు, కుంకుమ అలా పడేయడం. అవి గంపక కోద్దీ పోగు కావడం. మనకు ఏం తృప్తి వుంటుంది. అంతగా ఇవ్వాలనుకుంటే మన ఇంట్లోనే లేదా స్వయంగా దేవుడికి నైవేద్యం పెట్టే అవకాశం వున్న గుళ్లలోఇవ్వడం ఉత్తమం.


ముఖ్యంగా దేవాదాయ శాఖ వచ్చాక గుళ్లలో పద్దతులు మారిపోయాయి. దాని వల్ల తెలిసి తెలియకుండానే రకరకాల పద్దతులు అమలులోకి వచ్చేస్తున్నాయి. సింహాచలం దేవస్థానంలో కప్ప స్తంభం అని వుంది. దేవుడికి కప్పం కట్టని వారిని, ఆ స్తంభానికి కట్టి మరీ వసూలు చేసేవారని ప్రతీతి. నలభై ఏళ్ల క్రితం సంతానం లేని దంపతులు దాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని ప్రతీతిగా వుండేది. ఇప్పుడు దేవస్థానం కాస్త రుసుం చెల్లించితే, కప్పస్తంభానికి కట్టి, విప్పే పద్దతి తెచ్చింది. ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రచారంలోకి తెచ్చారు. ఇలాంటివన్నీ నమ్మేకన్నా, దేవుడి కోవెలకు నమ్మకంతో వెళ్లాలి. భక్తితో నమస్కరించాలి. ఆర్తితో ప్రార్థించాలి. అప్పుడే మనకు ఆత్మ సంతృప్తే కాదు, ఆత్మశక్తీ కలుగుతుంది. ఆత్మశక్తి వుంటే అన్నీ సమకూరుతాయి. ఆ శక్తినిచ్చేది సూదంటు రాయి లాంటి ఆకర్షణ కలిగిన శిలా రూపంలోని భగవద్ రూపమే. ఆ మూర్తిని దర్శించుకోవడానికే గుడికి వెళ్లాలి.