Tuesday, 31 January 2017

Relationship


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


This is something that should be done EVERY DAY...not sometimes. Ladies if your man works hard, takes care of his family and loves you treat him like this EVERY DAY and I promise you will have all his love.:

This explains any relationship where one of the two are always feeling alone, blamed or is always giving and never bring surprised by the other. Always having to chase or apologize. Move on. So many people waste their lives on selfish idiots.:

A-Z of fear







List of phobias:

chart (photo)


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
THIS IS THE MOST BEAUTIFUL THING I'VE EVER SEEN.:

శ్రీ సరస్వతీ దేవి గురించి వివరణ

om sri raam - sri maatre nam:

వసంత పంచమి ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీ దేవి గురించి వివరణ 



హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.

ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.

వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి".

🌷 పరాశక్తి, జ్ఞాన ప్రదాత 🌷

పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.

జ్ఞాన ప్రదాతగా సరస్వతి - కొన్ని గాధలు

పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.

పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రథమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.

మీ అందరికీ ఆ దేవేరి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ....


Saturday, 28 January 2017





వసంత పంచమి సందర్భంగా ప్రబంధాలలోని కొన్ని సరస్వతీ ప్రార్ధనలు మీకోసం

1. వాణిన్  బురాణి పుస్తక
పాణిన్ శుకవాణిఁ గమలభవురాణి గుణ
శ్రేణి నలివేణి నుతగీ 
ర్వాణి గల్యాణిఁ గొల్తు వాక్చాతురికిన్

 ప్రొఢకవి మల్లనార్య "ఏకాదశి మాహత్మ్యము" నుండి
--((*))-- 

ప్రాంజలి ప్రభ. కం 

ప్రబంధాలలోని కొన్ని సరస్వతీ ప్రార్ధనలు మీకోసం
 
2. సింహాసనంబు చారుసిత పుండరీకంబు, చెలికత్తె జిలువారు పలుకుఁ జిలుక
శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు, పసిఁడి కిన్నెరవీణ పలుకుఁదోడు
నలువనెమ్మోముఁ దమ్ములు కేళిగృహములు, తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు, చక్కని రాయంచ యెక్కిరింత

యెవుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్ర చందన మందారసార వర్ణ
శారదాదేవి మామక స్వాంతవీధి
నిండు వేడుక విహరించుచుండు గాత!

శ్రీనాథ మహాకవి "శృంగార నైషధము" నుండి


💢 *నవగ్రహాల తల్లిదండ్రులు & భార్యలు పేర్లు* 💢 

01. *రవి[సూర్యుని]* *తల్లిదండ్రులు అతిది - కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ* 
. 
02. *చంద్రుని - తల్లిదండ్రులు అనసూయ - అత్రి మహర్షి - భార్య రోహిణి*
. 
03. *కుజుని- తల్లిదండ్రులు - భూమి, భరద్వాజుడు - భార్యశక్తి దేవి* 

04. *బుధుని - తల్లిదండ్రులు - తార, చంద్రుడు - భార్య జ్ఞాన శక్తి దేవి* 

05. *గురుని - తల్లిదండ్రులు - తార, అంగీరసుడు - భార్య తారాదేవి* 

06. *శుక్రుని - తల్లిదండ్రులు - ఉష,భ్రుగు - భార్య సుకీర్తి దేవి* 

07. *శని - తల్లిదండ్రులు - ఛాయ, రవి - భార్య జ్యేష్ట దేవి* 

08. *రాహువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య కరాళి దేవి* 

09 *కేతువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య చిత్రా దేవి* 

*నవగ్రహస్తోత్రాన్ని ప్రతిరోజూపఠించడంవలన గ్రహదోషాలుతొలగిపోతాయి* 

🌝 *రవి* 
జపాకుసుమ సంకాశం! కాశ్యపేయం మహాద్యుతిమ్!! 
తమో‌రిం సర్వపాపఘ్నం! 
ప్రణతోస్మి దివాకరం !! 

🌜 *చంద్ర* 
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం 
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం 

🔴 *కుజ* 
-- ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం 
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం 

💚 *బుధ*-- 
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం 
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం 

💛 *గురు* 
- దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం 
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం 

⚪ *శుక్ర* 
-- హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం 
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం 

⚫ *శని* 
- నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్ 
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం 

🐍 *రాహు* - అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం 
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్ 

🐍 *కేతు* 
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్ 
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్.




   
   

PRANJALI PRABHA 🕸🕸🕸🕸🕸🕸

1. *PAN* - permanent account number.
2. *PDF* - portable document format.
3. *SIM* - Subscriber Identity Module.
4. *ATM* - Automated Teller machine.
5. *IFSC* - Indian Financial System Code.
6. *FSSAI(Fssai)* - Food Safety & Standards Authority of India.
7. *Wi-Fi* - Wireless fidelity.
8. *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.
9. *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.
10. *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.
 --((*))--


PRANJALI PRABHA.

11. *COMPUTER* - Common Oriented Machine. Particularly United and used under Technical and Educational Research.
12. *VIRUS* - Vital Information Resources Under Siege.
13. *UMTS* - Universal Mobile Telecommunicati ons System.
14. *AMOLED* - Active-matrix organic light-emitting diode.
15. *OLED* - Organic light-emitting diode.
16. *IMEI* - International Mobile Equipment Identity.
17. *ESN* - Electronic Serial Number.
18. *UPS* - Uninterruptible power supply.
19. *HDMI* - High-Definition Multimedia Interface.
20. *VPN* - Virtual private network.


--((*))--

PRANJALI PRABHA


21. *APN* - Access Point Name.
22. *LED* - Light emitting diode.
23. *DLNA* - Digital Living Network Alliance.
24. *RAM* - Random access memory.
25. *ROM* - Read only memory.
26. *VGA* - Video Graphics Array.
27. *QVGA* - Quarter Video Graphics Array.
28. *WVGA* - Wide video graphics array.
29. *WXGA* - Widescreen Extended Graphics Array.
30. *USB* - Universal serial Bus.
 

--((*))-- 

PRANJALI PRABHA

 31. *WLAN* - Wireless Local Area Network.
32. *PPI* - Pixels Per Inch.
33. *LCD* - Liquid Crystal Display.
34. *HSDPA* - High speed down-link packet access.
35. *HSUPA* - High-Speed Uplink Packet Access.
36. *HSPA* - High Speed Packet Access.
37. *GPRS* - General Packet Radio Service.
38. *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.
39. *NFC* - Near field communication.
40. *OTG* - On-the-go.
--((*))--

PRANJALI PRABHA 🕸🕸🕸🕸🕸🕸
41. *S-LCD* - Super Liquid Crystal Display.
42. *O.S* - Operating system.
43. *SNS* - Social network service.
44. *H.S* - HOTSPOT.
45. *P.O.I* - Point of interest.
46. *GPS* - Global Positioning System.
47. *DVD* - Digital Video Disk.
48. *DTP* - Desk top publishing.
49. *DNSE* - Digital natural sound engine.
50. *OVI* - Ohio Video Intranet.

--((*))--

PRANJALI PRABHA 

51. *CDMA* - Code Division Multiple Access.
52. *WCDMA* - Wide-band Code Division Multiple Access.
53. *GSM* - Global System for Mobile Communications.
54. *DIVX* - Digital internet video access.
55. *APK* - Authenticated public key.
56. *J2ME* - Java 2 micro edition.
57. *SIS* - Installation source.
58. *DELL* - Digital electronic link library.
59. *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.
60. *RSS* - Really simple syndication.

--((*))--

PRANJALI PRABHA 🕸🕸🕸🕸🕸🕸

61. *TFT* - Thin film transistor.
62. *AMR*- Adaptive Multi-Rate.
63. *MPEG* - moving pictures experts group.
64. *IVRS* - Interactive Voice Response System.
65. *HP* - Hewlett Packard.

*Do we know actual full form of some words???*
66. *News paper =*
_North East West South past and present events report._
67. *Chess =*
_Chariot, Horse, Elephant, Soldiers._
68. *Cold =*
_Chronic Obstructive Lung Disease._
69. *Joke =*
_Joy of Kids Entertainment._
70. *Aim =*
_Ambition in Mind._


71. *Date =*
_Day and Time Evolution._
72. *Eat =*
_Energy and Taste._
73. *Tea =*
_Taste and Energy Admitted._
74. *Pen =*
_Power Enriched in Nib._
75. *Smile =*
_Sweet Memories in Lips Expression._
76. *etc. =*
_End of Thinking Capacity_
77. *OK =*
_Objection Killed_
78. *Or =*
_Orl Korec (Greek Word)_
79. *Bye =*
_Be with you Everytime._
*share these meanings as majority of us don't know*

Friday, 27 January 2017

సుందరకాండ విశిష్టత:!

సుందరకాండ విశిష్టత:! 
. 
ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. 
తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. 
శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ. 
. 
. 
భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. 
అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. 
. 
సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. 
హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు. 
. 
ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాడ శ్రీరాముని, సీత మరియు 
హనుమల సౌందర్యాలను దర్శంపచేస్తుంది. 
ఆధ్యాత్మక చింతనతో చూస్తే భగవత్సౌందర్యమును, జీవ సౌందర్యమును,
ఆచార్య సౌందర్యమును సుందరకాండ వర్ణిస్తుంది. 
. 
సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః 
సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం 
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః 
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం? 
. 
.అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. 
సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. 
సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. 
సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. 
సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. 
పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది 
కావున సుందరకాండ. 
. 
:మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, 
హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీమంత్రం"నిక్షేపింపబడినవి. 
ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. 
ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. 
అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందు ఆమె వసించును కావున ఇది సుందరకాండ.మైందని గుంటూరు శేషేంద్ర శర్మ తన ‘షోడశి - రామాయణ రహస్యములు’ అనే పుస్తకాంలో అభిప్రాయపడ్డారు. 
. ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెపుతారు.
సేకరణ అంతర్జాలం 

















Sunday, 22 January 2017

(భర్తృహరిసుభాషితాలు)

🌳రెండు మంచి మాటలు.🌳 
----------------------- 

ఎంతజీవకళవహించుచిత్రంబైన 
జడముకాదెజీవజగతినద్ది 
సుగుణరహితుడైనసుందరునకుదాని 
కించుకంతభేదమెన్నదరమె. 

భా:-ఎంతగా జీవకళ ఉట్టి పడుతున్నా చిత్రం జడపదార్ధమైనట్టే... ఎంత అందంతో మెరిసిపోతున్నవాడైనా గుణంలేని వాడూ జడపదార్ధంతో సమానమే. 

శ్లో:-అర్ధనాశం మనస్థాపం 
గృహేదుశ్చరితానిచ 
వంచంనం చావమానంచ 
మతిమాన్ నప్రకాశతే. 

భా:-బుధ్ధిమంతుడు...ధననష్టాన్ని,విచారాన్ని,ఇంట్లోజరిగినచెడను,తనకుజరిగినమోసాన్ని,అవమానాన్ని..ఇతరులకు చెప్పుకోడు. 

సేకరణ:-అయ్యగారి శ్రీనివాస రావు🌲
ఆత్మీయులందరికి శుభోదయం
🌷రెండు మంచి మాటలు.🌷
--------------------------

చెఱకుగడ వంకరైనను
జెఱకుననేపారు తీపి చెడఁబో,దటులు
ర్వరగుణికురూపియైనను
గొరవడునే వానికున్నగుణగణమనుజా.

భా:- చెరుకుగడ వంకరగావున్నా దాని తీపిగుణానికి ఏలోపం లేనట్టే,గుణవంతుడు అందవిహీనుడైనా వానిగుణాలు తగ్గవు.

శ్లో:-యః పఠతి లిఖితి పశ్యతి
పరిపృఛ్ఛతిపండితానుపాసయతి
తస్యదివాకిరణైర్నలినీదళమివికాశ్యతేబుధ్ధిః.

భా:-చదవడం,రాయడం,సందేహాలుతీర్చకోడం,పండితులని అనుసరించి మెలగడం మొదలైనవి ఆచరించేవానికి "చదువు" సూర్యకిరణాలతోవికసించిన తామర పువ్వులా వికసిస్తుంది.

సేకరణ:-అయ్యగారి శ్రీనివాస రావు.🌷



అహోబిలసార్వభౌమ ||
.
సగము నరునిగ సగము కేసరిగ నుండి
రాజ ఠీవి సటము నలరగ నృసింహ |
పదును కోరల పాపాల పరిహరించు
సర్వసుఖదా యహోబిల సార్వభౌమ ||
.
భావము :
మీ దేహము మనిషిగా, తల సింహముగా ఉంటుంది.
రాజ ఠీవితో మీ జూలు అద్భుతంగా కదులుతూ ఉంటుంది.
పదునైన మీ కోరలతో మా పాపాలు అన్నింటినీ నాశనం చెయ్యండి. అందరికీ అన్ని సుఖములను ప్రసాదించేది మీరే కదా!
అహోబిల క్షేత్రానికి సార్వభౌములు మీరే కదా !
ఈ పద్యంలో 'నృసింహం' అన్న నామాన్ని స్వామి దయతో వాడడం జరిగింది.
(Padmini Priyadarsini కి కృతజ్ఞలతో)
 

ఆత్మీయమిత్రులందరికి శుభోదయం
ప్రాంజలి ప్రభ-( భర్తృహరి సుభాషితాలు)

ధృతిఁగొని రోగముల్ జరయు దేహము నొంపకముందేఇంద్రియ
ప్రతిహతి లేకముందె,తన ప్రాణవిరామము కాకముందె,పం
డితజనుఁ డాచరింపఁదగుఠీవిఁ ప్రయత్నముముక్తికిన్, మహో
ద్ధత శిఖి నిల్లుగాలు తఱిఁదాలిమి నూతులు ద్రవ్వనొప్పునే?

అతిగా రోగాలు,ముసలితనమూ శరీరాన్ని బాధింపక ముం
దే,అవయవాలు పట్లు కోల్పోకముందే,తన ప్రాణము
నశింపకముందే,జ్ఞాని అయినవాడు మోక్షం కోసం
ప్రయత్నం చేయాలి.పెనుమంటల్లో ఇల్లుతగులబడిపోతు
న్న సమయంలో ఉంటే నెమ్మదిగా అప్పుడు బావి తవ్వడం
మొదలుపెడితే ఏమైనా ఉపయోగం వుంటుందా?ఉండదు.
అలాగే వయసులో ఉన్నప్పుడే ముక్తికి కావలసిన చింతన
అలవాటు చేసుకొని,ఆ విధంగా ఆచరించాలి.
 

ఆత్మీయ మిత్రులందరికి గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

ప్రాంజలి ప్రభ - 6 (భర్తృహరి సుభాషితాలు)

ధర ఖర్వాటుఁ డొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడై
త్వరతోడన్ బరువెత్తి చేరి నిలిచెన్ దాళ ద్రుమ చ్ఛాయఁ,ద
చ్ఛిరముం దత్ఫలదాత వేగమున విచ్చెన్ శబ్దయోగంబుగాఁ
బొరి దైవోపహతుండు వోవు కడకుం బోవుం గదా యాపదల్

ఒక బట్టతలవాడు ఎండవేడికి తట్టుకోలేక పరిగెత్తు
కు వెళ్ళి ఒక తాటిచెట్టు నీడలో నిల్చున్నాడట.అదే సమ
యానికి పైనుండి ఒక తాటిపండు అతని తలపై రాలి పడిం
ది.అతని తల ఫటాలున పగిలింది.దైవకృప కోల్పోయినవా
రిని ఆపదలు అలా వెంటాడుతాయి.
 

ప్రాంజలి ప్రభ -5 (భర్తృహరి సుభాషితాలు)

ఒకచో నేలను బవ్వళించు,నొకచో నొప్పారుఁ బూసెజ్జపై
నొకచో శాకము లారగించు నొకచో నుత్క్రష్ట శాల్యోదనం
బొకచోఁ బొంత ధరించు,నొక్కక తఱిన్ యోగ్యాంబర శ్రేణి,లె
క్కకు రానీయడు కార్యసాధకుఁడు దుఃఖంబున్
సుఖంబున్మదిన్.

అసలైన కార్యసాధకుడు సుఖదుఃఖాలన లెక్కచేయడు
తను నెరవేర్చవలసిన పని పూర్తి అయ్యేవరకూ-పూల
పానుపుమీద పడుకొనేవాడు కూడా,అవసరం అయితే
నేలపైన నిద్రిస్తాడు,పంచభక్ష్యపరమాన్నాలు తినేవాడు
కూడా అవసరం అయితే కందమూలాలు తిని ఉంటాడు.
విలువైన వస్త్రాలు ధరించేవాడు కూడా బొంతని
ధరిస్తాడు,పని పూర్తి చేసేవరకూ సుఖాల కోసంవెంపర
లాడడు.
--((*))--
 


Pranjali Praha.com - 5
శుభోదయం

(భర్తృహరి సుభాషితాలు)

ఆరంభింపరు నీచమానవులువిఘ్నయాస
సంత్రస్తులైయ్కారంభించి పరిత్యజింతువిఘ్నాయత్తులై
ధీరుల్ విఘ్న నిహన్యమన్యులగుచున్ధ్నృత్యున్నతోత్సా
హులై
ప్రారబ్ధార్థమలుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

నీచమానవులు ఏపనినీ ప్రారంభించరు;మధ్యములు పని
నిప్రారంభిస్తారు.మధ్యలో ఏవైనా పెను ఆటంకలు తగిలితే
విరమిస్తారు.ఉత్తములు ఎన్ని అడ్డంకులు ఎదురైనా
రెట్టించిన ఉత్సాహంతో-మొదలుపెట్టినపనిని
పూర్తిచేసేవరకూ వదలరు.
 

Pranjali Praha.com - 4
శుభోదయం

(భర్తృహరి సుభాషితాలు)

 అమరుఁజెవి శాస్త్రమునఁ గుండలమునఁ గాదు;
వలయమన నొప్ప దీవిచే వెలయుఁ బాణి;
యురు దయాధ్యుల మేను పరోపకార
కలన రాణించు, గంధంబు వలన గాదు

చెవి శాస్త్రములు వినడం వలన ఒప్పుతుంది కానీ,
కంకణాలు ధరించడంవలన కాదు. అర్థబలం అంగబలం
కలవారి శరీరాలు వారు దయార్ద్రహృదయులై కరుణతో
ఇతరులకు సాయపడటంవలన ప్రకాశిస్తాయి కానీ గంధం
పూసుకోవటం వలన కాదు.
--((*))--

Pranjli Praha - 3
శుభోదయం

తనిసిరే వేల్పులుదధి రత్నములచేత?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత?
విడచిరే యత్న మమృతంబు నొదముదనుక?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు

దేవతలు అమృతంకోసం క్షీరసాగరమధనం
చేసినప్పుడుముందుగా లభించిన కౌస్తుభమణి మొదలైన
రత్నాలతో వారు తృప్తి చెందలేదు,తరువాత వచ్చిన
కాలకూటవిషం వలన భీతి చెందలేదు.అమృతం సాధించే
వరకూ వారు తమ ప్రయత్నాన్ని విరమించలేదు.ఏదైనా
పనిని ప్రారంభిస్తే,ఆపని నెరవేరేవరకూ ధృఢనిశ్చయులమై
ఉండాలి.


PRANJALI PRABHA-2
(భర్తృహరిసుభాషితాలు)-2
అఘము వలన మరల్చు హితార్థ కలితుఁ
జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము
విడువఁడాపన్ను ,లేవడి వేళ నిచ్చు
మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు

ఎవడైతే నిన్ను పాపపు పనులు చేయనీయక అడ్డుపడి
నీకు హితము చేకూర్చుతాడో, నీ రహస్యాలను దాస్తాడో,
నీలో ఉన్న మంచిగుణాలను పెంపొందిస్తాడో, ఆపదలో
నిన్ను విడిచిపోడో,సమయానికి సహాయపడతాడో- అతడే
నిజమైన మిత్రుడు.


నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు,నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు,నా
నీరమె శుక్తిలోఁ బడి మణిత్వముఁ గాంచు సమంచిత ప్రభం
బౌరుష వృత్తు లిట్లధము మధ్యము నుత్తముఁ
గొల్చువారికిన్

నీరు కాలిన ఇనుముపై పడితే ఆవిరైపోతుంది.ఆ నీరే
తామరాకు మీదపడితే ముత్యంలా ప్రకాశిస్తుంది.ఆ నీరే
ముత్యపు చిప్పలో పడి మణి అవుతుంది.నీచులని,మధ్య
ములని ఉత్తములనీ సేవించే వారి జీవనములిలాగే
ఉంటాయి.

( భర్రృహరి సుభాషితములు)