Tuesday, 27 July 2021

శ్రవేంకటేశ్వర: 🌻 తిరుమల స్వామి గడ్డం కింద పచ్చకర్పూరం కథ తెలుసుకొందాము 🌻




🍃🌺కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు. ఆ మూర్తిని కొన్ని సెకన్లు దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఆ స్వామిని దర్శించుకుంటారు. తిరుమలలో ప్రతి అడుగు ఒక చరిత్ర. స్వామి దేవాలయంలో ప్రతి అడుగు వెనుక ఎంతో విశిష్టత.

🍃🌺స్వామి ఆర్చితామూర్తి రూపంలో ఎన్నో గాథలు.. విశేషాలు, వింతలు ఉన్నాయి. అలాంటిదొకటి తెలుసుకుందాం… శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం తెలుసా? ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆ విషయాలు…

🍃🌺శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతయ్య (అనంతాళ్వారు). ఆ శ్రీవారికి సేవచేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాళ్వార్. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు.

🍃🌺పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని, మొదలు పెడతాడు.

🍃🌺ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది.

🍃🌺అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.

🍃🌺ఆమె మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది.

🍃🌺దాంతో బాలుడు రూపంలో వచ్చిన వేంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోతాడు.
ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు.

🍃🌺గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు.
తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు.

🍃🌺అప్పటి నుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు.

🍃🌺అదండీ స్వామివారి గడ్డం కింది పచ్చకర్పూరం గాథ. ఈసారి స్వామిని దర్శించుకున్నప్పుడు ఒక్కసారి ఈ గాథను గుర్తుచేసుకోండి.. స్వామి వారికి తన భక్తుల గాథను తల్చుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు.


🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[6:58 am, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🌻 పరమపుణ్యధామమూ..... ఉత్తరద్వారదర్శనము!! 🌻


శ్లో॥ సత్యం సత్యం పునస్సత్యం న దేవో వేంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి, యత్కించిత్ న భూతం న భవిష్యతి. - భవిష్యోత్తర పురాణం


🍃🌺సత్యంగా చెబుతున్న మాట! ఒకసారి కాదు. మళ్లీ మళ్లీ చెబుతున్న సత్యమైన మాట ఇది! ఏమిటా సత్యం. అంటే ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా అటు భూతకాలంలోను ఇటు భవిష్యత్తులోను శ్రీవేంకటేశ్వరునివంటి దేవుడు లేడు. లేనే లేడు. కనపడడు కూడా" అని.

🍃🌺అలాంటి ఆనందనిలయుని దర్శనం కోసం ఇంటి నుంచి బయలు రడం, ఏడుకొండల్లో విహరించడం, బంగారుమేడ ఆనందనిలయాన్ని వీక్షించడం, ఆనందనిలయుని నిలువెత్తు దివ్యమంగళ విగ్రహాన్ని కన్నులారా దర్శించడం... ఇలా వీటన్నింటి వల్ల దివ్యానుభూతులతో ఒక ఆనందాన్ని పరమానందాన్ని పొందడం అద్భుతం పరమాద్భుతం! అయితే!

🍃🌺'అందరూ ఒక ఎత్తు, అగస్త్యుడొక ఎత్తు' అన్నట్లు ఇన్నిన్ని ఆనందాల్ని నిరంతరం పంచుతూ. భక్తులను మైమరపిస్తున్న తిరుమలక్షేత్రాన్ని ఏడాది పొడవునా దర్శించడం ఒక ఎత్తు! కాగా

🍃🌺ప్రత్యేకంగా ధనుర్మాసంలో ఒక నెలరోజుల్లో, ఏ ఒక్క రోజైనా తిరుమలక్షేత్రాన్ని సందర్శించే భాగ్యం కలగడం, ఆనందనిలయుణ్ణి దర్శించి వింత వింత అనుభూతుల్ని ఆనందాన్ని పొందే అదృష్టం కలగడం మాత్రం, మరో ఎత్తు! అందులోను ధనుర్మాసంలో వచ్చే వైకుంఠఏకాదశిపండుగనాడు కలియుగవైకుంఠంలో విహరించడంవల్ల, సందర్శించడంవల్ల భక్తుని మనస్సు ఆనందాల పంటలు పండేపూదోట అవుతుంది.


🌻 వెంకన్న సన్నిధిలో వైకుంఠ ఏకాదశి 🌻


🍃🌺ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే 'ఏకాదశి'ని 'వైకుంఠ ఏకాదశి' అంటారు. తిరుమలక్షేత్రంలో వైకుంఠఏకాదశి, ఆ మరునాడు వైకుంఠద్వాదశి ఇలా ఇది రెండు రోజుల పండుగగా ఎన్నో విశిష్ట సేవలతో నిర్వహింపబడుతుంది.


🌻 వైకుంఠద్వారం తెరవబడుతుంది 🌻


🍃🌺వైకుంఠ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లు మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠఏకాదశినాడు సుప్రభాతసమయంలో బంగారు వాకిళ్లు తెరచినప్పటినుండి మరునాడు వైకుంఠద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకు శ్రీవారి గర్భాలయానికి దగ్గరగా ఆనుకొని ఉన్న “ముక్కోటి ప్రదక్షిణ మార్గం" తెరవబడుతుంది.

🍃🌺ఈ ప్రదక్షిణ మార్గానికి ఉన్న ద్వారాలను వైకుంఠద్వారాలనీ, ఉత్తరద్వారాలనీ అంటారు. ఈ మార్గాన్ని ‘వైకుంఠప్రదక్షిణమార్గం' అనీ అంటారు. ఈ మార్గం విద్యుద్దీపాలతో, సుగంధ, సుమనోహరమైన పులమాలలతో అలంకరింపబడిన ఈ వైకుంఠప్రదక్షిణంలో ప్రవేశించే భాగ్యం ఏడాదిలో ఈ రెండురోజులు మాత్రమే కలుగుతుంది.

🍃🌺వైకుంఠఏకాదశి, ద్వాదశి రోజుల్లో శ్రీ స్వామివారిని దర్శించిన తర్వాత భక్తులకు వైకుంఠప్రదక్షిణంలో ప్రవేశం కలుగుతుంది. ఈ రెండు రోజులూ విమానప్రదక్షిణంలో భక్తులు అనుమతింపబడరు. వైకుంఠ ప్రదక్షిణంలో ప్రవేశించిన భక్తులకు దివ్యానుభూతులతో పాటు, పూర్వసంచిత పాపకర్మలన్నీ నశిస్తాయి. ఇష్టార్థాలన్నీ నెర వేరతాయి.


🌻 స్వర్ణరధోత్సవం 🌻


🍃🌺వైకుంఠ ఏకాదశినాడు సప్తగిరీశునికి మరో విశేష ఉత్సవం జరుగుతుంది. అదే స్వర్ణరథోత్సవం!

🍃🌺వైకుంఠ ఏకాదశినాడు ఉదయం 8 గంటలవేళ కలియుగ వైకుంఠ నాథుడైన కొండలరాయడు శ్రీదేవీ భూదేవేరులతో కలిసి బంగారుతేరుపై పురవీధుల్లో దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి నాటి స్వర్ణరథోత్సవంలో పయనిస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుణ్ణి దర్శిస్తే చాలు.

🍃🌺భక్తుల మనోరథాలు తప్పక తీరతాయి. భక్తుల గోవిందఘోషల మధ్య జరిగే తిరుమల గోవిందుని స్వర్ణరథోత్సవదృశ్యాన్ని వర్ణించడం అక్షరాలకు అందదు. దర్శించి అనుభవించాలి. అంతే!


🌻 శ్రీస్వామిపుష్కరిణీతీర్థ ముక్కోటి ఉత్సవం 🌻


🍃🌺వైకుంఠ ఏకాదశి మరునాడు 'వైకుంఠద్వాదశి'. వీటినే "ముక్కోటి ఏకాదశి”, “ముక్కోటి ద్వాదశి అంటారు. వైకుంఠఏకాదశి మరునాడు వైకుంఠద్వాదశినాడు “శ్రీస్వామిపుష్కరిణీ తీర్థ ముక్కోటి ఉత్సవం” జరుగుతుంది.

ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యా మరుణోదయే ఆయాతి సర్వతీర్థాని స్వామిపుష్కరణీ జలే తత్ర స్నాత్వా నరః సద్యోముక్తి మేతి నసంశయః యస్య జన్మ సహస్రేషు పుణ్య మేవార్జితం పురా

🍃🌺ధనుర్మాసంలో వైకుంఠద్వాదశినాటి అరుణోదయ వేళలో ముక్కోటి తీర్థాలు “శ్రీస్వామి పుష్కరిణి”లో మునకలిడుతాయి. శుభప్రదమైన ఆ వేళలో స్నానం చేసే మహాభాగ్యం అందరికీ కలుగనే కలగదట! ఎవరైతే వేలజన్మల్లో పుణ్యాన్ని ఆర్జించుకొని ఉంటారో, వారికి మాత్రమే ఈ నాడు తిరుమల శ్రీవారి కోనేట్లో స్నానం చేసే భాగ్యం కలుగుతుంది. అలాంటి వారికి సద్యోముక్తి కలుగుతుంది.

🍃🌺అంటే వారు శరీరంతో ఉన్నా, జీవన్ముక్తిని పొందుతారని సారాంశం. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని స్కాందపురాణాంతర్గత వేంకటాచల మాహాత్మ్యం స్పష్టం చేస్తోంది.


🌻 శ్రీవారి చక్రస్నానం 🌻


🍃🌺ఇలాంటి శ్రీస్వామిపుష్కరిణీ తీర్థముక్కోటి శుభఘడియల్లో, అంటే వైకుంఠ ద్వాదశినాటి అరుణోదయవేళలో శ్రీ సూర్య భగవానుడు ఉదయిస్తుండగా తిరుమల శ్రీవారిఆలయం నుండి శ్రీ సుదర్శనభగవానుని ఉత్సవమూర్తి ఊరేగింపుగా వెళతారు. మహాప్రదక్షిణంమార్గంలో దర్శనమిస్తూ ఊరేగింపుగా శ్రీ సుదర్శన భగవానుడు 'శ్రీస్వామి పుష్కరిణి'కి చేరుకొంటారు.

🍃🌺అక్కడ ముందుగా శ్రీసుదర్శన చక్రత్తాళ్వారుకు అర్చన అభిషేకాలు పూర్తి అయినతర్వాత శ్రీస్వామిపుష్కరిణిలో అర్చకస్వాములు మంగళ స్నానం చేయిస్తారు. దీన్నే “చక్రస్నానం” అంటారు. వైకుంఠ ద్వాదశినాటి సూర్యోదయవేళలో శ్రీ స్వామిపుష్కరిణీ తీర్థముక్కోటి శుభఘడిమల్లో ముక్కోటి తీర్థాలు మునిగేవేళ శ్రీ వేంకటేశభగవానుని దివ్యాయుధమైన శ్రీ సుదర్శనునికి జరిగే చక్రస్నానం సమయంలో వేలాదిమంది భక్తులు కోనేట్లో పవిత్రస్నానాలు చేస్తూ పునీతులవుతారు.

🍃🌺ఇది మహాద్భుత ఘట్టం. ఇది సిద్ధించిన భక్తుని అదృష్టం ఏమని చెప్పగలం! ఎంతని చెప్పగలం!!ఎందుకంటే!

శ్లో॥ స్వామిపుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశీవ్రతం చాపి త్రయ మత్యంత దుర్లభమ్

🍃🌺స్వామిపుష్కరిణిలో స్నానం చెయ్యడం, సద్గురువు పాదసేవ దొరకడం, ఏకాదశీవ్రతం ఆచరించడం అనే మూడు పవిత్ర కార్యాల్లో, ఒక్కటంటే ఒక్కటైనా కలగడం ఎంతో అదృష్టం.

🍃🌺ధనుర్మాసం, అందులో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పండుగవేళల్లో, శ్రీస్వామిపుష్కరిణీస్నానం చేసి శ్రీవారిని దర్శించే భాగ్యం కలగడం ఎంతటి వారికో మాత్రమే కలుగుతుంది.


🌻 తిరుమలలో “ధనుర్మాసం” 🌻


🍃🌺'ధనుర్మాసం' నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆరాధనల్లో, అర్చనల్లో, సేవల్లో, ఊరేగింపుల్లో కొన్ని ప్రత్యేకతలు గోచరిస్తాయి.

🍃🌺శ్రీవారి మూలమూర్తిని సాక్షాత్తు శ్రీకృష్ణునిగాను, వక్షఃస్థల శ్రీమహాలక్ష్మిని గోదాదేవిగా భావించి వక్షఃస్థలంలో రెండు వైపులా బంగారు చిలుకను, తమలపాకుల చిలుకను అలంకరిస్తారు. తర్వాత సహస్రనామార్చనలో శ్రీస్వామివారికి బిల్వదళాలను ఉపయోగిస్తారు. పిదప శ్రీవారికి వేడివేడిగా పొంగళ్ళను, బెల్లపు దోసెలను నివేదిస్తారు.

🍃🌺రాత్రి ఏకాంత సేవాసమయంలో ఈ నెలరోజుల పాటు వెన్నముద్ద కృష్ణునికి పట్టెమంచంపై శయనభాగ్యం కలిగిస్తారు, ఆ తెల్లవారుజామున సుప్రభాతసమయంలో గోదాదేవి పాశురాలను ఏకాంతంగా జియ్యంగార్లు, వైష్ణవాచార్యులు పఠిస్తూ మేల్కొల్పుతారు. ఆ తర్వాత చిన్నికృష్ణునికి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించి పొంగళ్లను, బెల్లవుదోసెలను నివేదిస్తారు.


🌻 ముల్లోకాల తీర్థస్నానఫలం 🌻


🍃🌺చిరంజీవి అయిన మార్కండేయమహర్షి పూర్వం బ్రహ్మ దేవుణ్ణి గూర్చి తపస్సుచేశాడు. సమస్తలోకాల్లోని అన్ని తీర్థాల్లో స్నానం చేసేట్లుగా వరం ఇమ్మని అడిగాడు. అది అసాధ్యం! ఎన్నెన్ని లోకాలు ఉన్నాయో నాకే తెలియదు. ఈ బ్రహ్మాండాలు అనంతం. అందువల్ల నీవు వేంకటాచలంలోని “శ్రీస్వామిపుష్కరిణి”లో ధనుర్మాసంలో వైకుంఠఏకాదశి, ద్వాదశిరోజున సూర్యోదయవేళలో స్నానం చేస్తే చాలు.

🍃🌺అన్ని తీర్థాలస్నాన ఫలితం సిద్ధిస్తుంది. ఎందుకంటే సమస్తతీర్థాలు తమ పాపాన్ని పోగొట్టు కోవడం కోసం ధనుర్మాసంలో వైకుంఠద్వాదశి, శ్రీస్వామిపుష్కరిణి తీర్థ ముక్కోటినాటి అరుణోదయవేళలో ఆ కోనేట్లో మునకలు పెడతాయి. అట్లా నీ కోరిక నెరవేరుతుంది అని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. ఇలా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశీ పండుగ రోజుల్లో కలియుగ వైకుంఠమైన తిరుమలను దర్శించి ధన్యులమవుదాం....



🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[6:59 am, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🌻 విష్ణుమూర్తి కూర్మావతారం చాలించడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా? 🌻



🍃🌺పురాణాల ప్రకారం లోకకల్యాణార్థం, ధర్మాన్ని కాపాడటం కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా దశావతారాలలో రెండవ అవతారమే కూర్మావతారం. అయితే విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తడానికి గల కారణం? కూర్మావతారాన్ని చాలించడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం....

🍃🌺పురాణాల ప్రకారం రాక్షసులు దేవతలు అమృతం కోసం సాగర మథనం చేస్తున్న సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని దానిని పాలసముద్రంలో వేస్తే అది బరువుకు సముద్రంలో మునుగుతుంది. దీంతో దేవతలు రాక్షసులు ఏం చేయాలో తెలియక ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు.

🍃🌺దీంతో విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతం కింద ఉండి దాని బరువును మోస్తాడు. ఈ క్రమంలోనే దేవతలు రాక్షసులు దానిని చిలకడానికి ప్రయత్నించగా ఆ పర్వతం కదలలేదు. అప్పుడు దేవతలు రాక్షసులు మరో మారి కుర్మాన్ని ప్రార్థించగా అప్పుడు కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి తన శరీరం నుంచి పదివేల చేతులను మొలిపింప చేసి, ఆ పర్వతాన్ని కదలనీయక పట్టుకోవడంతో క్షీర సాగర మథనం చేయడానికి వెసులుబాటు కల్పిస్తాడు. దీంతో సాగరం నుంచి అమృతం ఉద్భవిస్తుంది.

🍃🌺ఈ విధంగా ఉద్భవించిన అమృతాన్ని సేవించి దేవతలందరూ వెళ్ళిపోయిన తర్వాత కూర్మ రూపునికి, భృగు మహర్షి శాపం పెట్టాడు. శాపం కారణంగా మతిమరపుతో ఎంతో గర్వంతో తన వల్లనే అమృతం లభించిందని, దేవాసుర కన్నాతానే గొప్పవాడని తన పదివేల చేతులతో సముద్రాన్ని అల్లకల్లోలం సృష్టించాడు.

🍃🌺ఈ కూర్మం బీభత్సాన్ని భరించలేక దేవతలు ఆ పరమశివుని ప్రార్థించారు. ఆ కూర్మం గర్వాన్ని అణచి వేయడానికి తన పుత్రులు ఎంతో సమర్థవంతులని భావించిన పరమేశ్వరుడు తన పుత్రులిద్దరిని కూర్మం గర్వం అణచి వేయడానికి వేయడానికి పంపుతాడు.అయితే ఆ కూర్మం బలం మొత్తం తన వీపు పై ఉన్న చిప్పలో ఉందని గ్రహించిన సుబ్రహ్మణ్యుడు దానిని ఒడ్డుకు లాక్కొనివచ్చి వెల్లకిలా వేసాడు.

🍃🌺తరువాత ఒక పెద్ద రోకలి బండతో సహోదరులిద్దరు దానిని చితక బాది, చిప్పనుపేరు చేయడంతో నిజం తెలుసుకున్న విష్ణుమూర్తి కూర్మావతారాన్ని అంతటితో చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు.


🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[7:00 am, 26/06/2021] శ్రవేంకటేశ్వర: దేవీభాగవతం - 54
శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు
చతుర్థ స్కంధము - 14
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
లలితా సహస్రనామ శ్లోకము -53

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ!
మహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్ముడప్రియా!!

శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
 53వ  భాగములో....
నరనారాయణులు అప్సరసలను అనుగ్రహించడం   చదువుకున్నాము.
🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏
అమ్మ దయతో......  ఈ రోజు
భూదేవి మొర  చదువుకుందాం.
🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏

 భూదేవి మొర

జనమేజయా ! అతిమహత్తరమైన కృష్ణ చరిత్రను విశదీకరిస్తాను. తెలుసుకో. నీ సందేహాలకు అన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. అదీకాక ఇది అద్భుతమైన దేవీ చరిత్ర కూడా.

ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ, దీనురాలై, గోరూపం ధరించి త్రివిష్టపానికి (దేవలోకం) వెళ్ళింది. శక్రుడు ఈ దీనావస్థను గమనించి, ఏమ…
[7:53 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🌻 మహా భారతం 🌻

🎈 భాగము 169 🎈

💧 అంతుచిక్కని శ్రీకృష్ణుని ఆనందం 💧


🍃🌺కౌరవ సైన్యం అభ్యర్థన మేరకు కర్ణుడు శక్తిని ప్రయోగించాడు. అది ఘటోత్కచుని బలి తీసుకుంది. దుర్యోధనుడు అందుకు ఎంతగానో సంతోషించాడు. అభినందనగా కర్ణుని గుచ్చి కౌగలించుకున్నాడు.ఘటోత్కచుని మరణం పాండవేయులను పెను విషాదంలోకి నెట్టింది. వారంతా కన్నీటి జాలులతో పరిపరి విధాల శోకించారు. అయితే శ్రీకృష్ణుడు అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఘటోత్కచుని మృతి అతనికెంతో ఆనందాన్ని కలిగించింది.

🍃🌺ఆ ఆనందంలో చేతనున్న పగ్గాలు వదలి, పాంచజన్యాన్ని పూరించాడతను. చిన్న పిల్లాడిలా తన చుట్టూ తాను తిరిగాడు. తర్వాత తననే పరమాశ్చర్యంగా చూస్తోన్న అర్జునుని సమీపించి అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ప్రోత్సాహంగా అతని వీపును చరిచాడు.కృష్ణుని ప్రవర్తన కౌరవ ప్రముఖులకు ఒక పట్టాన అర్థం కాలేదు. అర్జునుడికీ అంతే! దేవదేవుని చేష్ట…
[7:53 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🌺 తాళపత్రం 🌺

🥀 169 వ రోజు 🥀


🌻 స్త్రీలు 'ఓం' కారాన్ని జపించవచ్చా? 🌻


🍃🌹స్త్రీలు 'ఓం' కారాన్ని జపించుటకు సమ్మతించ బడలేదు. ఇందుకు వారి శరీర నిర్మణ వ్యవస్థే కారణం.

🍃🌹'ఓం' కారాన్ని బిగ్గరగా (బయటకు శబ్దం వచ్చునట్లు) జపించుటకై దీర్ఘమైన, క్రమమైన, నెమ్మదైన విధానంలో గాలిని (శ్వాసను) బయటకు విడువ వలసి ఉంటుంది. అలా 'ఓం' న ఉచ్చరించినప్పుడు శరీరం నుండి చుట్టూతా హెచ్చు స్థాయిలో ఉండే శక్తి తరంగాలు వ్యక్తమౌతాయి.

🍃🌹ఇలాంటి శబ్దతరంగాలు ఉత్పన్నమౌతున్న మధ్య భాగంలో గర్భాశయ ఉండటం కారణంగా ఈ శబ్దతరంగాలు గర్భాశయాన్ని విరుద్ధంగా ప్రభావితం చేయడం మరియు మూసుకు పోయోలా చేయడం. జరిగే ప్రమాదం ఉంది. ఐదారు సార్లు 'ఓం' కారాన్ని చేయడం అంత ఇబ్బందికరమైనది కాదు కానీ అలా చాలా సేపు చేయడం ఇబ్బందులకు దారితీస్తుంది.

🍃🌹అది మాత్రమే కాక స్త్రీ అలా చాలా సేపు శ్వాసను క్రమబద్ధీకరించుకుంటూ 'ఓ…
[7:54 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌺 విష్ణు సహస్రనామాలు 🌺


🌀 వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః॥ 🌀


🌹 169. అతీంద్రియః 🌹

🌺 ఓం అతీంద్రియాయ నమః 🌺


🍃🌹అతీతః ఇంద్రియాణి ఇంద్రియములను అతిక్రమించిన వాడు. ఇంద్రియములవలన అనుభవమునకు అందనివాడు. అశబ్ధ మస్పర్శనమ్ ఇత్యాదిశ్రుతిచే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనునవి ఏ మాత్రమును లేనివాడు కావున ఈ పంచ విషయములను గ్రహించగల జ్ఞానేంద్రియ పంచమునకును గోచరము కానివాడు.

🍃🌹శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు లేనిదియు అవ్యయమైనదియు, ఆద్యంతములు లేనిదియు, నిత్యమైనదియు, మహత్తుకు పరమైనదియు నయియున్న దానిని తెలిసికొనినవాడు మృత్యుముఖము నుండి పూర్తిగా విడివడును.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[7:58 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం - 26 🙏

🌻 కేశవుని కధ 🌻


💫🌹పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద వేదంగా పారంగతుడు ,బుద్ధిమాన్ ,స్వధర్మా చరణ నిష్టుడు. పుత్రులు ,పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతున్నాడు. అతిధి పూజలో జన్మ ధన్యం చేసుకొంటున్నాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులా వెలిగి పోతున్నాడు కేశవుడు.

💫🌹కొంత కాలానికి అతని జీవితంలో విషాదం అలముకొంది ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఖం పట్ట శక్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీ నగరం చేరాడు
అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ ,విశ్వేశ్వరున్ని దర్శిస్తూ ,అభిషేకం చేస్తూ ,విశాలాక్షీ దేవి దర్శనంతో ఊరట చెందుతున్నాడు.

💫🌹కొంత కాలం కాశీలో గడిపి ,తర్వాత ప్రయాగ ,గయా మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృ కార్యాలను నిర్వహిస్తూ ,విధ్యుక్త ధర్మాలన్నీ నిర్వహిస్తూ కొన్ని నెల…
[8:19 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌹 ఓం నమో వేంకటేశాయ గ్రూపు సబ్యులకు అందరికీ నమస్కారం.

🌹ప్రస్తుతం గ్రూపులో ఉన్న సభ్యులు కొంతమంది మేసేజ్ లు చూడకుండా కొంతమంది సభ్యులు వున్నారు. వీరికి మెసేజ్ డెలివరీ అవుతుంది. కానీ వాళ్ళు మెసేజ్ చదవడం లేదు. ఇలాంటి వారిని గ్రూపులో నుంచి తొలగించడం జరుగుతుంది.

🌹వీరిని తొలగించడం వలన కొత్తగా కొంతమంది సబ్యులకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

🌹మరొక్క విషయం వ్యక్తి గత కారణంగా అతి త్వరలో ప్రస్తుతం ఉన్న గ్రూపులు అన్నింటినీ డిలీట్ చేసి కొత్తగా ఓం నమో వేంకటేశాయ గ్రూపు మొదలుపెట్టడం జరుగుతుంది.

🌹కొత్త గ్రూపులో యాక్టివ్ గా ఉన్న వారు మాత్రమే జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది.

🌹కొత్తగా గ్రూపు మొదలు పెట్టిన తరువాత ప్రస్తుతం ఉన్న గ్రూపులలో మెసేజ్ లు పంపడం జరగదు గమనించగలరు.

🌹మీ యొక్క
పేరు:
ఊరు:
వర్క్ (ఏమి చేస్తుంటారు): ఈ విషయాలు తెలిపితేనే గ్రూపులో…
[8:40 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌻 తిరుమల సర్వస్వం 🌻


🎈 భాగము 110 (శ్రీవారి సంవత్సర సేవలు) 🎈

💧 ఉగాది ఆస్థానం 💧


🍃🌹తెలుగు లోగిళ్ళలో నూతన సంవత్సరపు తొలిరోజైన ఉగాది నాడు - సందర్భోచితంగా - తెలుగువారి కొంగుబంగార మైన శ్రీవేంకటేశ్వరునికి ఉగాది ఆస్థానం జరుగుతుంది. తిరుమలేశుని వార్షికోత్సవాలు - ఉత్సవాలు అన్నీ ఉగాది తోనే మొదలవుతాయి.

🍃🌹ఉగాది పర్వదినాన ప్రాతఃకాల మందు, నిత్యసేవలైన సుప్రభాతసేవ - తోమాలసేవ యథావిధిగా పూర్తయిన తరువాత; ఉభయ దేవేరుల సమేతుడైన శ్రీమలయప్పస్వామి వారికి, సేనాపతి విష్వక్సేనులవారికి ఏకాంతంగా తిరుమంజనం జరుప బడుతుంది. తరువాత, బంగారువాకిలి ముందున్న మహామణిమంటపంలో గరుడాళ్వార్ కు ఎదురుగా - స్వర్ణకాంతులీనే సర్వభూపాల వాహనం లో శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామి వారిని వేంచేపు చేస్తారు.

🍃🌹పట్టు పీతాంబరాలతో, కిరీటాలతో, సర్వాభరణాలతో, పరిమళ భరితమైన పూలమాలల…

No comments:

Post a Comment