Tuesday, 27 July 2021

 🕉️పెళ్లిలో కన్యను గంపలో తెచ్చే ఆచారము కొంత మందికి ఉంటుంది  ఇలా ఎందుకు తేవాలి దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ?

పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి , తెస్తారు?

 ముందుగా అమ్మాయి తో గౌరీ పూజ చేయించి ఆ తరువాత వెదురుతో చేసిన బుట్టలో  కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకి తీసుకొని వస్తారు .

 బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.

సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు.
సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అనగా దైవ రుణం పిత్రు రుణం  ఋషి ఋణం తీరవు .

అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.
ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!

పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.
ఆమెయే ఆతని లక్ష్మి.

అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం.
అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.
అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.
ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది.

ఆమె ‘నిత్యానపాయినీ’.
ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.

శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబు గాఁగ,
విరజానది గౌతమిగా,
వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!


శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.
ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు.
అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.

ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ.
అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది.
ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.

ఇక్కడ లక్ష్మి పుట్టింది.
అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను.
ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది.
అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం.
ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.
ఎంతో ధార్మికంగా సంపాదించాలి.
ఆయనకి సంతానం కలగాలి.
ఆయన సంతోష పడిపోవాలి.
ఆయన తండ్రి కావాలి,
 తాత కావాలి.
ముత్తాత కావాలి.
ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.  ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.
 లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి.

అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం.
ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు.
తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు.
ఈమె నీ లక్ష్మి.

ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోనక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ.
మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది.
బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.
 అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు.
మేనమామలు ప్రేమైక మూర్తులు.

లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది. నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.

అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు.
లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అ…
ऊँ!
----

"శ్రీచక్రరాజనిలయాంప్రగతిప్రదాత్రీం ,

శ్రీపద్మరౌచ్యశుచినీంప్రముదేష్టదాత్రీమ్ !

శ్రీహంసగుహ్యసఫలాప్తశుభేష్టదాత్రీం ,


త్రైమూర్తిరూపపరమార్థగతింనమామి !!!
----
----------------------------------------

                      గురువు....!
                    

అవతార పురుషుడైన రాముడంతటి వానికి వసిష్ఠుడనే మహర్షి గురుస్థానం వహించాడు.

జగద్గురువైన శ్రీ కృష్ణునికి కూడా సాందీపుడు గురువయ్యాడు.

గురు పరంపర ఈ జగత్తులో అనాదిగా ఉంది. ఇక సరైన గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం.

గురువును ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కృతి మనది. అన్నిటికీ దైవమే స్వయంగా రాలేడు. అందుకే ఆయన వివిధ రూపాలలో అంటే తల్లి, తండ్రి, గురువు మొదలైన వారిగా మన శ్రేయస్సును చూస్తూ, ప్రేమను పంచుతూ మన అభ్యుదయానికి తోడ్పడతాడు. అందుకే ఈ ముగ్గురినీ దేవుళ్లుగా అభివర్ణించారు.

గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాను సాక్షాత్‌ పరబ్రహ్మంగానూ పేర్కొన్నారు. గురువు అంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞాన మనే వెలుగును నింపేవాడని స్థూలంగా పేర్కొంటుంటారు. సాధారణంగా గురువుల్లో రెండు రకాల వారిని మనం చూస్తుంటాం. వారిలో కొందరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వారైతే, మరి కొందరు లౌకిక విద్యను నేర్పించేవారు.

అయితే ఏ వ్యక్తి అయినా జీవితంలో గురువును ఆశ్రయించవలసిందే. ఒక్కోసారి మనం గురువును గుర్తించ లేకపోవచ్చు. తాళం చెవి లేకుండా తలుపు తెరవడం సాధ్యం కానట్లు గురువు తర్ఫీదు లేకుండా మనకు గుర్తింపు, జ్ఞానం కలగదని వేమన తన పద్యాలలో వివరించారు.

ఒక్కోసారి ప్రతిభ కలిగిన విద్యార్థుల వల్ల గురువుకు విశేష ఖ్యాతి లభిస్తుంది. కృష్ణుని వల్ల సాందీపునికి ఎవరికీ లభించనంతటి, ఆయన ఊహించనంతటి ప్రయోజనం సిద్ధించింది.

కృష్ణుడు యమలోకానికి వెళ్లి గురు పుత్రుని సజీవుని చేసి తీసుకువచ్చి గరువుగారి ఋణం తీర్చుకున్నాడు. మంచి గురుశిష్యుల సంబంధాన్ని సారవంతమైన నేలపై సకాలంలో సరి పడా పడ్డ వర్షంగా ఒకరు అభివర్ణించారు. ఇక విద్య నేర్వడం అంటే ప్రతి విషయాన్ని మనం తెలునుకునే ప్రయత్నం చేయడం.

వివేకానందుని అభిప్రాయం ప్రకారం జ్ఞానం మనలోనే ఉంది.  మన లోనే విజ్ఞానముంటే విద్య నేర్వాలనే ప్రయత్నం దేనికీ అన్న ప్రశ్న ఉదయిస్తుంది. పాలలోనే నెయ్యి, పెరుగు, వెన్న దాగి ఉన్నాయి. అయితే వాటన్నిటినీ బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తేనే అవి కనబడతాయి, బయటకు వస్తాయి. ప్రయత్నం చేయకపోతే అవి ఉన్నా కనబడవు. మనలోని వివేకాన్ని వెలికి తెచ్చుకునే ప్రయత్నానికి సహాయ భూతుడిగా, సలహా దారుడిగా ఉంటాడు గురువు.

వేమన వంటి భోగి గురువు ఉపదేశం వల్లనే ప్రజా కవి కాగలిగాడు. పూర్వం రాజకుమారులు సైతం గురు కులానికి వెళ్లి గురువుల్ని సేవించేవారు. గురువు ప్రసన్నుడై విద్య నేర్పితే నేర్చుకోవడం, ఆయనను సేవించడం వల్ల విద్య పొందడం, డబ్బు లేదా ఏదైనా ఇచ్చి విద్య నేర్చుకోవడం మినహా విద్య నేర్చుకునేందుకు వేరే ఎటువంటి మార్గాలు లేవు.

గొప్ప గురువు మాత్రమే మన జీవితాల్లో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు.. అని విశ్వ కవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ అన్నారు. మనిషి తన జీవిత కాలంలో ఒక వంతు గురువు ద్వారా, మరొక వంతు తన కృషి వల్ల, ఇంకొక వంతు సహధ్యాయిల సహచర్యం వల్ల, మరొక వంతు పాఠశాలల నుంచి నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకునే ప్రక్రియ లౌకికంగా ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది.

మనిషికి తొలి గురువు తల్లే. ఆమె వెంట ఉండే శిశువు చాలా విషయాలు గ్రహిస్తాడు. శిశువు ప్రపంచాన్ని చూసి చాలా నేర్చుకున్నా, ఎక్కు వగా చూసేది తల్లి కదలికలే కనుక ఆమె నుంచే ఎక్కువ విషయాలు గ్రహిస్తాడు. ఆ తర్వాతే లౌకిక విద్యలు నేర్పే గురువులు, మంత్ర విద్యలు నేర్పే మంత్ర గురువులు బోధనలు చేసే బోధ గురువులు వంటి వారందరూ వస్తారు...
*******

 గురుపౌర్ణమి విశిష్ఠత / వ్యాస పూర్ణిమ
ఓంశ్రీమాత్రే నమః


|| గురువందనం ||
 
శ్లో|| గురవే సర్వ లోకానాం భిషజే భావరోగిణామ్ |
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ: ||


శ్లో|| చిద్ఘనాయ ప్రకాశాయ శృత్యాకాశ విహారిణే |
అద్వైతామృత వర్షాయ శంకరాయ నమోనమ: ||

 
శ్లో|| సదా శివ సమారంభాం శంకరాచార్య మాధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరామ్ ||

 
శ్లో|| ఏకమేవాక్షరమ్ యస్తు గురు: శిష్య: ప్రబోధాయేత్ ||
పృథివ్యామ్ నాస్తి తద్రవ్యమ్ యద్ధత్వా చానృణీ భావేత్ ||

 
గురు పౌర్ణమి విశిష్ఠత:-
 
ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమిని ‘గురుపౌర్ణమి‘ లేదా ‘వ్యాసపౌర్ణమి‘ అని అంటారు.  గురుపౌర్ణమి  సాధారణంగా అన్ని పండుగలను జరుపుకోవడానికి ఒక నిబద్ధత, విధానం ఉంటె, గురుపౌర్ణమికి మాత్రం అలా కాకుండా ఒక ప్రత్యేకత ఉంది. గురు సమానులైన వారందరికీ కృతజ్ఞత ను త…
గురు వందనం

మనకు, ప్రతి ఒక్కరికీ తల్లి తొలి గురువు.

మాతృదేవో భవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
అతిథి దేవోభవ

ప్రకృతి మయమైన, ఈ జగము లో ప్రతి అణువు లోను , నిండిన శక్తి గురు స్వరూపమే.

ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, మనకి పూలు, పండ్లు ఇచ్చే వృక్షాలు, పంచభూతాలు - నేల, నింగి, వాయువు, అగ్ని, నీరు.  మొ.నవి కూడా గురువుతో సమానమైనవి గా చెప్పబడుతున్నది.

భూమి కి భారం కాకుండా, సహజ వనరులను - కలుషితం చేయకుండా, ఒద్దిక గా ప్రతి ఒక్కరు వాడుకుంటే మన వంతు బాథ్యతను, మన సక్రమంగా నిర్వర్తించినట్లే.

సూర్యచంద్రులు, లేనిదే మన మనుగడ సాథ్యపడదు. నిర్ణీత సమయానికి, ప్రతి రోజు ఉదయించడం, అస్తమించడం - దైనిక చర్య గా చేస్తూ, మనకి ఆరోగ్యాన్ని , ఆహారాన్ని ప్రసాదించే, భాస్కరుడు, చంద్రుడు, మనకి గురువులు కాదంటారా?
మనం తొలి సంథ్య వేళ అర్ఘ్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అర్ఘ్యం ఇచ్చి, నమస్కరించిన మాత్రముననే, మన బాగోగులను చూసుకునే గురువులను, మనం విస్మరించకూడదు.

జగత్ కి మాతాపితరులైన ఉమామహేశ్వరులు, జగద్గురువైన కృష్ణ పరమాత్మ, ఎన్నో వనమూలికలను, ఇచ్చే సంజీవని ప్రదాత థన్వంతరి, లౌకిక విద్యలే కాకుండా జ్ఞాన ప్రభోథాన్ని చేసే లక్ష్మీహయగ్రీవ స్వామి, నిత్యస్మరణీయులు, గురుతుల్యులు.

మన అభ్యున్నతి కి కారకులైన, పెద్దలు-పిన్నలు, కూడా  మనకి మార్గదర్శకులే.

ఎందరోమహానుభావులు అందరికీ వందనములు.
🕉
శివాయ గురవే నమః

🙏🙏🙏🙏🙏
THVAMEVAAHAM   త్వమేవాహమ్‌

కన్నతల్లి కడుపులోంచి బయటపడి......
తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......
పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......
ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా
సాగే ప్రస్థానం.......
పేరే......

             నేను =I

ఈ "నేను" ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!

ఊపిరి ఉన్నంతదాకా "నేను" అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....

జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ...ఈ
"నేను" ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...

ఈ "నేను" లోంచే
నాది అనే భావన పుడుతుంది!

ఈ *నాది లోంచే....

1.నా వాళ్ళు,
2.నా భార్య,
3.నా పిల్లలు,
4.నా కుటుంబం,
5.నా ఆస్తి,
6.నా ప్రతిభ,
7.నా ప్రజ్ఞ,
8.నా గొప్ప...

అనేవి పుట్టుకొచ్చి....

చివరికి ఈ "నేను" అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహం గా ప్రజ్వరిల్లుతుంది.

              EGO అహం

అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ  ”నేను", ”నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది.

నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.

1. పంతాలతో
2. పట్టింపులతో,
3. పగలతో,
4. ప్రతీకారాలతో......

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

1 .బాల్య,
2.కౌమార,
3.యౌవన,
4.వార్ధక్య,  

దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ
నేను అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

 సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

 సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ  నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

 మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.

1.నేనే  శాసన కర్తను,

 2.నేనే ఈ సమస్త భూమండలానికి అధిపతిని,

3.నేనే జగజ్జేతను...

అని మహోన్నతంగా భావించిన ఈ నేను
లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా
రోజు మారుతుంది.

ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’ కథ అలా సమాప్తమవుతుంది.

అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”
గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”
“SRIMADBHAGAVATH GEETHA”....

చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం మాత్రమే!

   అది శాశ్వతం కానే కాదు

ఈ నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన
”వైరాగ్యస్థితి” అభిలాషికి సాధ్యమవుతుంది.

వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు.
దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం.

స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం

అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.

ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం.

1. నిజాయితీగా,
2. నిస్వార్థంగా,
3.సద్ప్రవర్తనతో,
4. సచ్ఛీలతతో,
5.భగవత్‌ ధ్యానం

తో జీవించమనేదే
వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి అంటే
అన్నీ నేనే అనే స్థితి నుంచి
త్వమేవాహమ్‌ అంటే నువ్వేనేను అని
భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
మానవ జన్మకు సార్థకత
      🙏 శుభమ్ భూయాత్🙏
గురువె బ్రహ్మ యందు గురువె విష్ణువు గను గురువె ఈశ్వరుడును
గురువె తల్లి తండ్రి గురుతు వల్ల విద్య వైభవమ్ము కలుగు
గురువు నొసగతెరవు గుర్తు బంధమ్ము గ విజయ మార్గ మిచ్చు
గురువె యిలను నాకు గురుతర బాధ్యతే జీవ లక్ష్య మవ్వు

🌻 95. విటమినులు 🌻

ప్రస్తుత కాలమున విటమినులను విపరీతముగ భుజించు చున్నారు. దేహపోషణమునకు అవి అత్యావశ్యకములని వైద్యశాస్త్రము యొక్క నమ్మిక. విటమినుల స్వీకరణము కారణముగ ప్రాణశక్తి (Vital Force) పెరుగునని నమ్మకము. మిటమినుల విషయమున మాదొక
అవగాహన యున్నది. మా అనుభవమున ప్రాణశక్తిని పెంపొందించు విటమినులు జీవుని యందే యున్నవి. జీవునియందలి సద్గుణమలే నిజమగు విటమినులు. సద్గుణములు ప్రాణమును పెంపొందించి నంతగ మిటమినులు పెంపొందింపలేవు.

సద్గుణవంతులు మిక్కుట ముగ ప్రాణశక్తి కలిగి యుందురు. వారహర్నిశలు పనిచేయుచున్నను ప్రాణము నీరసింపదు. తెలివికి సద్గుణంబుల బలిమి గూర్చినచో అంతకు మించిన విటమినులు, టానిక్కులు లేవు. సద్గుణములే సమస్త మిటమినులకు నివాస స్థానము. సద్గుణములు లేనివారికి యీ స్థావరములు మూతబడవు. వారు విటమినులు తినుచున్నను ప్రాణమంతంత మాత్రముగనే యుండును.

సాధారణ మానవునకు విటమినులు పనిచేయపోవుటకు కారణము వారియందు సద్గుణముల కొలుతయే. మా దృష్టిలో విశ్వాసము మొట్టమొదటి సద్గుణము. విశ్వాసము మూఢ నమ్మకము కాదు. అది ఆత్మవిశ్వాసము. తనయందు తనకు నమ్మకమున్న వానికి ఇతరులయందు కూడ నమ్మకముండును.

ఇతరుల యందు అప నమ్మకము తమ యందలి అపనమ్మకము యొక్క ప్రతిబింబమే. అపనమ్మకము ప్రాణమునకు శత్రువు. నమ్మకము ప్రాణమునకు మిత్రుడు. నమ్మినవాడు చెడడని ఆర్యోక్తి. నమ్మి చెడినవాడు లేడని మరియొక ఆర్యోక్తి. అనుమానము,
అపనమ్మకము గలవారు విటమినులుగొనుట నిష్ప్రయోజనము. అట్టివారికి విటమినులు అపాయమని కూడ మా నమ్మకము. విటమినులను గొని అపనమ్మిక శక్తి పెరుగునే కాని ప్రాణము పెరుగదు. అపనమ్మకము, అనుమానములకు సహాయనిరాకరణము (Non-co-operation) తోడైనచో ఇక అట్టివారికి ఔషధములు, విటమినులు పనిచేయుట కష్టము. ఇది తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

ప్రాంజలి ప్రభ  ..1

మన జన్మ సంగ్రహ సంఘర్షణ దైవ విధానముల్
యుగ ధర్మ సంతృప్తి జీవన వేద విధానముల్
యువ శక్తి సద్భావ భోధన సత్య విదానముల్
ప్రతి నిత్య దాంపత్య సంతస సేవ విధానముల్   

నా భావము : దేవుని ప్రేమ మనపై ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు, పుట్టుక అనేది ఘర్షణల వళ్ళ వచ్చే సంగ్రహ విధానములు,  వేదములలో ఉన్న మహాత్య ప్రభావము వళ్ళ, ధర్మాలను అను సరించి సాగు జీవన విధానములు, యువశక్తి ద్వారా అధునాతన విధానములు, అంతర్జాల విధానములు సద్భావముతో చేసే పనులు,  ప్రతిఒక్కరు సుఖ శాంతులతో ఉండుట యే ఒకరికొకరు అర్ధం చేసుకొని బ్రతకట యే ప్రేమ సేవ  విధానములు.


దేశ సౌభాగ్య  ప్రావణ్య సేవ హితమతుల్
ప్రేమ ఔదార్య ప్రాధాన్య అర్ధ హితమతుల్
 ధర్మ ప్రబోధ భాగ్యమ్ము నాకు హితమతుల్
 నాద బ్రహ్మాండ సాహిత్య బోధ హితమతుల్

 
నా భావము : దేశము కొరకు మేధావు లందరు హితవచనములు తెలిపి ప్రపంచములో మనదేశ గుర్తింపు కోసం నీవంతు ప్రావీణ్యత సేవచేస్తూ తెలపాలి హిత వచనాలు, ధనం కోసం ప్రేమ ఔదార్యం, మంచి ప్రావిణ్యం  గుణం ఎప్పటికి వదలొద్దు, నీవీవు చెప్పే హిమవచనాలే ధనంతో సమానము కావాలి, ధర్మాన్ని రక్షించుట నాకు భాగ్యమ్ము అని తలచాలి, నాద బ్రహ్మాండ పురాణాల సాహిత్యమును అర్ధమే మనకు మనసు ప్రశాంత పరిచే హిత వచనాలు.
ప్రేమ భావాల ప్రతీక ధర్మ ప్రభోధమ్ములన్
దేశ కాలాన్ని ప్రబోధ మార్గ మనోనేత్రముల్
వేళ గ్రహించి ప్రచండ కల్ప మనోశాంతముల్
సత్య ధర్మాన్ని పకృతి నిలిపే మనోభావముల్
 
 నా భావన :

ధర్మాన్ని నిలబెట్టుటకు, ప్రతి వక్కరి మనస్సులో ప్రేమను నింపేందుకు, దేశంలో మంచి మార్గాన్ని చూపే ప్రబోధాలను గ్రహించి జీవితము గడపాలని,  మనస్సులో ఉన్న మంచి మార్గాన్ని నలుగురికి చూపి దేశాన్ని కాపాడుటకు మనో నేత్రములతో సహకరించాలని, ఏంతో కష్టము  వచ్చిన, ప్రళయము వచ్చిన, భయముతో వణుకుతున్న ప్రాంతాన్ని ఆదుకొని భయమును తొలగించి మనస్సుతో శాంతిని కల్పించాలని, ప్రకృతి అనుకరించి సత్యము, ధర్మము గ్రహించి మనుష్యుల మనోభావాల ననుసరించి జీవితము సాగించాలి.
*ఇది దశావతార నృసింహ మంత్రము,
 ఈ మంత్రము ఒకసారి చదివి షేర్ చేయండి,
 మీరు ఈరోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు, ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కోక్కటిగా నేరవేరుతాయి.*

"ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |
ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |
ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |

ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |
ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |
ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |
ఓం క్ష్రౌం పరశురామాయ నమః |
ఓం క్ష్రౌం రామాయ నమః |
ఓం క్ష్రౌం బలరామాయ నమః |
ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |
ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |
దివ్యసింహాయ నమః |
స్వయంభువే పురుషాయ నమః |
ఓం క్ష్రౌం ||"

ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు, మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది, కావున కనీసం పదిమందికైనా వి చేసి వారి మంచికి దోహదపడండి, అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతాయి.

. పాత్రత  -1 🌻


తగినవాడు‌ కనిపించినపుడు దానము‌ చేయుము, తగని వారితో కూడా ప్రియముగనే మాట్లాడుము. అంత మాత్రమున అసత్యము మాట్లాడకుము.

ఎవరికిని నీ‌ వలన బాధ కలుగరాదను  ప్రయత్నము నిత్యము కలిగియుండుము. ఈ మార్గమున జీవించినచో నరుడు స్వర్గానికి చేరుదురని నా మతము.

పాత్రునకు దానము చేయుట‌ అనగా బీదవారికిచ్చుట ఒక్కటే కాదు. మనము చేయలేని పని ఇంకొకడు చేయగలవాడు కనిపించినచో మన సహకారము, మన దగ్గరున్న సాధన సంపత్తి వానికి ఇచ్చునట్టి బుద్ధి యండవలెను.

అది లేక పోవుట చేతనే ఉత్తమ ప్రభుత్వము స్థాపించ వలెనను బుద్ధితో ప్రజలు వర్గములై చిలిపోయి క్షుద్రులుగా ప్రవర్తించుట జరుగుచున్నది.

అది లేకపోవుట చేతనే  మహానుభావులైన స్వాముల వార్లు ఆశ్రమములను స్థాపించి హిందూ మతోద్ధరణకై ఎవనికి వాడుగా వేరుగా ప్రయత్నించుట, ఇంకొకని పొడగొట్టకుండుట, చీలిపోవుట జరుగుచున్నది.

దేశమునకు ఉపయోగించు మహానీయునకు ఆరోగ్యము చెడినప్పుడు స్వయముగా పోయి మందిచ్చుట, అతని క్షేమము గూర్చి బాధ్యత స్వీకరించుట పాత్ర దానమగును.

తనకన్నా తక్కువ వాని యందు జాలి, దానబుద్ధి చాలమందికి ఉండును. తనతో‌ సమానుడు, తాను చేయలేని పనులు సాధించువాడు కనిపించునపుడు తాను సహకరించునట్టి దాన బుద్ధి నిజమైన పాత్రత.


దానిని‌ సాధింపవలెనన్నచో ఈర్ష్య మొదలగునవి దాటవలెను...

✍️ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment