"
పదిహేనేళ్ళ క్రితం
పండగకి వచ్చిన పూర్ణమ్మ ఇద్దరు కూతుళ్లు తన దగ్గరకి అంటే తన దగ్గరకి రమ్మంటూ గొడవ పెట్టారు.
అప్పటికే పూర్ణమ్మ కొడుకు పోయి ఏడాది దాటింది. స్వరూప తన భర్త ఉన్నపుడు ఆడపడుచులకు ఎలా మర్యాద చేసేదో అలానే చేసేది అయన లేకపోయినా కూడా.
సరే... కొన్నాళ్ళు కూతుళ్ళ దగ్గర ఉండి వద్దామని వెళ్ళింది పూర్ణమ్మ.వెళ్లిన నాలుగో రోజే... అడిగింది పెద్ద కూతురు అమ్మని. అమ్మా ! ఎలాగూ నువ్వు బంగారం వేసుకోవట్లేదు కదా.. ఎప్పుడో ఇచ్చేదేదో మాకు ఇప్పుడే ఇచ్చేస్తే మేమైనా వేసుకుంటాం కదా! చెల్లిది కూడా అదే అభిప్రాయం. కావాలంటే మాట్లాడు అని ఫోన్ కలిపి ఇచ్చింది.
చిన్న కూతురు " అమ్మా ! నీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తావు. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే గా.. అక్క చెప్పింది కరెక్టే..వదినకి ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగం ఉంది కనుక ఇల్లు మా ఇద్దరికీ ఇస్తే మా దగ్గరే ఉండొచ్చు నువ్వు చివరి వరకు. కోడలి దగ్గర కన్నా కూతురి దగ్గరే బాగుంటుంది నీ జీవితం.. నిన్ను చూడడానికి మాకేం అభ్యంతరం లేదు మేము చెప్పినట్టు చేస్తే ! " అని ముక్తాయింపు ఇచ్చింది.
మరునిమిషమే...
పూర్ణమ్మ లోనికి వెళ్లి తన పెట్టె తెచ్చుకుని వచ్చేసింది కోడలి దగ్గరకి.
తరువాత పెద్ద కూతురు పూర్ణమ్మ ఇంటికి వచ్చి మరీ స్వరూప ని నానా మాటలు అనింది. నీ మాయ మాటలతో మా అమ్మని మోసం చేస్తున్నావు అంటూ.
పూర్ణమ్మ " నా కోడలిని మనవడిని వదిలే ప్రసక్తి లేదు. నా కొడుకుని వీళ్ళలో నే చూసుకుంటున్నాను. నా ఓపిక ఉన్నంత వరకు నా కొడుకు బాధ్యత నేను నెరవేర్చుతాను. మీరు అడిగినట్టు మీకు కావాల్సిన బంగారం ఇచ్చేస్తాను.. నువ్వు వెళ్లొచ్చు " అని మొహం మీద తలుపేసేసింది.
అత్తగారే తనకి కొండంత అండ అనుకుంది స్వరూప చెమ్మగిల్లిన కళ్ళతో...
********************************************
ప్రస్తుతం
నాన్న చనిపోతే అమ్మా, నాయనమ్మ తనని ఏ లోటు లేకుండా ఎలా పెంచారో గుర్తుకొస్తూనే ఉంది శశికి.
పొద్దునే శశి " నాయనమ్మా !! నీ మనవడికి పిల్లని వెతికే బాధ్యత నీ మీద ఉండగా హాయిగా నిద్ర పోతున్నావా.. " అంటూ ఆవిడని లేపుతుంటే అయోమయంగా చూస్తున్నారు పూర్ణమ్మ, స్వరూప.
ఫోన్ లో రికార్డు అయిన కాల్ వినిపించాడు వారికి
" ఉషా ! నిన్ను బాధపెడుతున్నందుకు క్షమించు. కానీ నువ్వు చెప్పినట్టు అందరినీ వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటే బాధ పడేది నేను !! కన్న తల్లి ప్రేమను, పెంచిన నాయనమ్మ ప్రేమను వదిలేయగలిన నాకు.. రేపు భార్య ప్రేమను కూడా వదిలేయగలిగేలా నా మనసు మారిపోతుందేమో !! ఆ రోజున నా లాంటి వాడివల్ల నువ్వే బాధపడతావు. నీ ప్రేమ కోసం నా వారి ప్రేమను త్యజించగలిగే త్యాగశీలిని కాదు నేను. నాతో పాటు నా కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించగలిగితేనే నాకు నీతో పెళ్ళికి అంగీకారం !! ".
కాల్ ముగిసింది... అత్తాకోడళ్ళ కళ్ళల్లో ఆనందబాష్పాలు !!!
"మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండమ్మా " అంటూ వారి పాదాలపై పడ్డాడు శశి.
బంధాలను కలుపుకుంటూ వెళ్ళాలి గానీ బదిలీ చేసుకుంటూ కాదు.
.
[10/08, 7:35 pm] +91 94408 91745: 👨🏫 *చాలా మంది పెన్షనర్లు* బ్యాంక్‌లో ఫారమ్ 16 పై సంతకం చేయడం ద్వారా సీనియర్ సిటిజన్‌షిప్ రిబేట్‌ని క్లెయిమ్ చేసుకొని ఐటీ రిటర్న్స్ దాఖలు చేయరు. కానీ వారు గ్రహించని విషయం ఏమిటంటే, సున్నా పన్ను రిటర్న్‌లను దాఖలు చేయకపోవడం ద్వారా వారు ఒక ప్రధాన సదుపాయాన్ని కోల్పోతారు, ఈ సమాచారం మాక్స్ పెన్షనర్‌లతో భాగస్వామ్యం చేయబడుతుందని ఆశిస్తున్నాము కాబట్టి వారు ఈ ప్రయోజనాన్ని కోల్పోరు
శ్రీ ఎన్ వి నాగరాజ్ నుండి నా నుండి ఒక లాయర్ ఎన్ ఎక్స్ బ్యాంకర్. అతని సమాచారానికి ధన్యవాదాలు.
*పెన్షనర్ ప్రమాద మరణం*
చాలా మంది పెన్షనర్లు రిటర్నులు దాఖలు చేయడానికి వెనుకాడతారు, అయితే, పెన్షనర్ ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు IT రిటర్నులు దాఖలు చేయడం వలన పెన్షనర్ల కుటుంబానికి గొప్ప ప్రయోజనం ఉంటుందని చూపించే ముఖ్యమైన సమాచారం ఇక్కడ ఉంది.
మోటార్ వాహన చట్టం, 1988 లోని సెక్షన్ 166 ప్రకారం (2013 యొక్క సివిల్ అప్పీల్ నం. 9858 కింద సుప్రీంకోర్టు తీర్పు, 2008 ఎస్‌ఎల్‌పి (సి) నంబర్ 1056 నుండి 31 అక్టోబర్ 2013 తేదీన ఉద్భవించింది),
ప్రమాదంలో మరణించిన పెన్షనర్ కుటుంబానికి గత మూడు సంవత్సరాల సగటు ఆదాయానికి 10 రెట్లు అర్హత ఉంది, అతను లేదా ఆమె గత మూడు సంవత్సరాలుగా IT రిటర్న్స్ దాఖలు చేసినట్లయితే.
ఉదాహరణకు, పెన్షనర్ యొక్క నెలవారీ పెన్షన్ 25000 /- అయితే, అతని వార్షిక ఆదాయం 3,00,000. మూడు సంవత్సరాల పాటు అతని సగటు ఆదాయం కూడా, సులభంగా లెక్కలు చెప్పాలంటే 3,00,000, అప్పుడు అతని కుటుంబానికి ప్రభుత్వం నుండి 3 లక్షలు - 30, 00, 000 రూపాయలు 10 రెట్లు లభిస్తాయి. ఐటీ రిటర్నులు మినహా ఇతర రుజువులను కూడా కోర్టు అంగీకరించదు. కాబట్టి, పెన్షనర్ క్రమం తప్పకుండా ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయడం వలన, ప్రమాదవశాత్తు మరణించినప్పుడు అతని / ఆమె మరణించిన పెన్షనర్ కుటుంబానికి పెద్ద ఆర్థిక ఉపశమనం అందించడంలో చాలా దూరం వెళ్తుంది.
ఈ ప్రయోజనం గురించి సమాచారం లేకపోవడం వలన IT రిటర్న్స్ దాఖలు చేయడంలో వైఫల్యం అతని మరణంతో పెన్షనర్ కుటుంబానికి భారీ నష్టానికి దారితీస్తుంది
*(మూలం: పెన్షనర్ కి అవాజ్)*
🙏 *హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి*🙏
👌 *1.ఎవరిని / దేనిని ఆశ్రయించావు?*
ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు.
అపారమైన శివ భక్తుడు.అయినా పరకాంతల యందు..పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు.చివరకు రాముని ఒక్క బాణం తో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మ మూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి….ఆయన బాట యందు నడిచిన “స్వామి హనుమ” చిరంజీవి గా మిగిలిపోయారు.చరిత్రలో నిలిచిపోయారు.
“జీవితం లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో ….దేన్ని విడిచిపెట్టలో తెలియాలి.సరైన మార్గాన్ని తెలుసుకోవాలి.తెలియడం కాదు…పాటించే దమ్ము కూడా ఉండాలి.”
👌 *2. మైత్రి యొక్క విలువ!*
వంచన తో..బలం తో..భార్యను,భూమిని, బలగాన్ని తనవైపు తిప్పుకున్న వాలి కి మంత్రిగా
హనుమ ఒక్క నాటికి లేరు.
తన దారి తానూ చూసుకోలేదు.న్యాయం వైపు గా..సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి…ఉన్నారు.
“జీవితం లో కస్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం.నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు…వాళ్ళని ఎన్ని కాష్టాలొచ్చినా విడిచిపెట్టకండి.”
👌 *3. అహం బ్రహ్మాస్మి*-నేనే గొప్ప అని అనకు!
నాదేం లేదు…అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి!
లంకకు వెళ్ళే ముందు…హనుమ ఇలా అంటారు..!
నేను తలచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకో గలను…అంత బలం ఉంది…
కాని నేను ఎలా వెళ్తానో తెలుసా?
“నా స్వామి రామ చంద్రమూర్తి యొక్క కుడిచేత్తో
తన భుజం వెనుకనున్న అక్షయ బాణ తూనీరం
లో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలోనున్న బంగారు వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళుతుందో ” అలా దూసుకెళతాను…
అది నా శక్తి కాదు…!రాముడి చే విడవబడితే…
రాముడి శక్తి ఆ బాణం లో కెళ్ళి బాణం వెళుతుంది!అటువంటి రామ బాణం లా వెళతాను!”
-నేను…నా వల్ల ,నా బలం..ఇదంతా నేనె చేసాను.. అని హనుమ ఒక్క సారి కూడా అనలేదు!
👌 *4. నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు!*
కొన్ని లక్షల వానర సేన!
నూరు యోజనముల సముద్రం!
జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు!
తలచుకుంటే కాని పని కాదు!కాని రాముడు నమ్మింది …అందరూ సూచించింది “హనుమనే”!
“నిన్ను నమ్మి పని అప్పగించి ….గుండెల పై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతుకు!”
👌 *5. మోసం చేసేవాళ్ళు ఉంటారు.నువ్వు మోసపోకు…ఆగిపోకు..ముందుకు మరో అడుగేసి సాగిపో!*
హనుమ సముద్రం దాటుతూ ఉండగా….ఒక అందమైన బంగారు పర్వతం…పైకి లేచింది!
“స్వామి…మీరు చాలా దూరం ప్రయాణం చేసి
అలసి ఉన్నట్టు కనబడుతున్నారు..!కాసేపు నా ఈ పర్వతం పై కూర్చుని….విస్రాంతి తీసుకుని,ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తిని
వెళ్ళండి “అని అంటుంది.
హనుమ…”సముద్రం లో బంగారు పర్వతమా?మాయ లా ఉంది?ఇది నాకు విఘ్నమని” ఆలోచించి…ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి,లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు.
“చేసే పనిలో ….గమ్యాన్ని చేరుకోడం లో..ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ
చేసుకున్న ప్రమాణం.”
👌 *6. లక్ష్యం తప్ప మరేదీ కనబడకూడదు.*
హనుమ,లంకలో సీతమ్మకోసం వెతుక్కుంటూ
రావణ అసురుని అంత: మందిరం లోనికి ప్రవేశించగా
కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలు గా, సురా పానం చేసి…మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా…పడి ఉన్నారు… లెక్కలేనన్ని పళ్ళు…మధుర…పానియాలు నేలపై పది పారుతూ ఉన్నాయి.వారి ఒంటి మీద బంగారు నగలు…నేలంతా పడి ఉన్నాయి…
ఇవన్నీ చూస్తున్నా…..
హనుమ ఒక్కింత కూడా చలించలేదు…ఆతని మనసులో ఉన్నది ఒక్కటే!నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందొ?ఎన్ని కస్టాలు పడుతోందో అని…!
మురుగు కాలువ దాటినట్టు ఆ స్థలాన్ని దాటి
సీతమ్మ ను వెతుక్కుంటూ వెళ్లారూ హనుమ.
“లక్ష్యం సాధించడం లో గురి…
చేసే పని లో పట్టుదల…
పడే శ్రమలో తపన ఉంటె….మన చుట్టూ ఏమున్నా కనపడవు.”
👌 *7. పెద్దరికాన్ని గౌరవించు*
రావణుడు హనుమను బంధించి తీసుకు రమ్మన్నపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించి
చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు.
నిజానికి బ్రహ్మాస్త్రం హనుమను ఆపలేదు.
హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడ్డారు!
రావణ సభలో అంతే సులువు గా ఆ తాళ్లను విడిపించుకున్నారు.
“పెద్దలకి…నువ్విచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్నే పెంచుతుంది”
–———–
*హనుమ కథ లో*…వెతుక్కుంటూ పొతే మన జీవితానికి కావలిసిన పాఠాలు ఎన్నో దొరుకుతాయి.ప్రతి ఊరి పొలిమేరల్లో గద పట్టుకుని నిలబడి….”ఏం భయం లేదు రా...నీకు తోడుగా నేనున్నానులే……పద “..అని తెలిపే ఆంజనేయ విగ్రహాలే...
🌹🌹🌷🌷🌷🌹🌹
[10/08, 7:59 pm] Prathyusha: *తప్పకుండా చదవండి...*
🌀 జననం ధర్మమని, మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు.
🌀 ఖాళీ చేతులతో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం, తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానంతెలియదు.
🌀 నీగురించి నీవు ఎక్కువ మాట్లాడు తున్నావ్ అంటే నీకు ౼ నేను అన్నది పోలేదన్నమాట...
🌀 జ్ఞానమున్న వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది కాని అజ్ఞానునితో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు...
🌀 ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు....
అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది...
🌀 మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్లమే, కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది..
🌀 బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు..
🌀 ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు, అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది..
🌀 మన దగ్గర డబ్బులేకుంటే మన రక్తసంబంధంలోనే విలువుండదు, _అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది._,
_ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు, ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు...
🌀 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు...
🌀 నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం,
_ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం.._
🌀 మన వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే...? వారిస్థానం ఎప్పుడు మన వెనుకే...
🌀అతివేగం ప్రమాదాలకు దారితీస్తుంది..
🕉️☪️✝️🙏🪴💐
[11/08, 4:51 am] On Sriram**: *🌹. గీతోపనిషత్తు -238 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 19-1
*🍀 18-1. నిద్ర - మెలకువ - ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. ప్రతి మెలకువ మరియొక నిద్రవరకే. ప్రతి జననము రాబోవు మరణము వరకే. మేల్కాంచుట యనగా అవ్యక్తము నుండి వ్యక్తము లోనికి వచ్చుట. నిద్రించుట యనగా వ్యక్తము నుండి అవ్యక్తము లోనికి చనుట. వ్యక్తము నందు జ్ఞానము కలుగుట, అవ్యక్తమున జ్ఞానము కోల్పోవుట, మరల వ్యక్తమున జ్ఞానము కలుగుట అనంతముగ జరుగుచున్నది. 🍀*
భూత గ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే2 వశః పార్థ ప్రభవ త్యహరాగమే || 19
తాత్పర్యము : ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. బ్రహ్మపగలు యందు కూడ ప్రాణి సమూహము అట్లే అవశులై పుట్టుచు చచ్చుచు, మరల పుట్టుచు జీవించి బ్రహ్మరాత్రి యందు లయమందు చున్నది.
వివరణము : బ్రహ్మపగలు, బ్రహ్మరాత్రి సుదీర్ఘ కాల పరిమాణము. అందు బ్రహ్మపగలు యందు జీవులు లక్షలాది జన్మలెత్తుచు నుందురు. అందు మానవులు కలియుగమున వంద సంవత్సరముల ఆయుఃపరిమాణము గలవారు. వారు పుట్టి, పెరిగి, జీవించి, మరల చనిపోవుచు యుందురు. ఈ మానవ జన్మ పరిమాణము వంద సంవత్సరములు.
జన్మించి మరణించు లోపల అనేకమార్లు నిద్రలోనికి చనుట, మరల మెలకువలోనికి వచ్చుట జరుగుచుండును. ప్రతి మెలకువ మరియొక నిద్రవరకే. ప్రతి జననము రాబోవు మరణము వరకే. ప్రతి బ్రహ్మపగలు, బ్రహ్మరాత్రి వరకే. అట్లే ప్రతి సృష్టి మరల లయము వరకు. లయము చెందిన సృష్టి మరల పుట్టును. బ్రహ్మరాత్రికి మరల పగలేర్పడును. ప్రతి మరణించిన జీవికి మరల పుట్టుక ఏర్పడును. నిద్రించిన ప్రతి జీవి మరల మేల్కాంచును. కాల పరిమాణము చిన్నదియైనను పెద్దదియైనను, మేల్కాంచుట నిద్రించుట గోచరించుచునే యున్నది.
మేల్కాంచుట యనగా అవ్యక్తము నుండి వ్యక్తము లోనికి వచ్చుట. నిద్రించుట యనగా వ్యక్తము నుండి అవ్యక్తము లోనికి చనుట. వ్యక్తము నందు జ్ఞానము కలుగుట, అవ్యక్తమున జ్ఞానము కోల్పోవుట, మరల వ్యక్తమున జ్ఞానము కలుగుట జీవులకు ఒక దినమునందు, ఒక జనన మరణమందు, ఒక బ్రహ్మ పగలు రాత్రియందు, ఒక సృష్టి ఆరంభ అంతము లందు అనంతముగ జరుగుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[11/08, 4:51 am] On Sriram**: *🌹 . శ్రీ శివ మహా పురాణము - 437🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 27
*🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 4 🌻*
బ్రాహ్మణుడిట్లు పలికెను-
ఆయన వద్ద ధనమున్నచో దిగంబరుడై ఉండనేల? ఎద్దు ఆయనకు వాహనము. ఆయన వద్ద సామగ్రి ఏమియూ లేదు (31). వరులయందలి ఏయే గుణములు స్త్రీలకు సుఖమునిచ్చునవి చెప్పబడినవో, వాటిలో ఒక్క గుణమైననూ ఆ ముక్కంటి యందు లేదు (32). నీకు అప్తుడగు మన్మథుని ఆ హరుడు దహించివేసినాడు. మరియు ఆయన చూపిన అనాదరమును నీవు ఎరుగుదువు. ఆయన నిన్ను విడిచి ఎక్కడికో వెళ్లినాడు (33).
ఆయనకు జాతిగాని, విద్యగాని జ్ఞానముగాని ఉన్నట్లు కానరాదు. ఆయనకు పిశాచములు తోడు కంఠములో విషము స్పష్టముగా కనబడుచుండును (34). ఆయన సర్వదా ఒంటరిగా నుండును. ఆయన నిత్యవైరాగ్యము దృఢముగా గలవాడు. కావున నీవు శివుని మనస్సులో కోరుకొనుట ఎంతయూ తగని విషయము (35) నీ హారమెక్కడ; ఆయన యొక్క నరకపాలములమాల యెక్కడ? నీ దివ్యమగు శరీరలేపనమెక్కడ? ఆయన శరీరమందలి చితాభస్మము ఎక్కడ? (36)
ఓ దేవీ! నీకు శివునకు రూపము మొదలగు వాటియందు సర్వమునందు విరోధము గలదు. కావున నాకీ వివాహము నచ్చుబాటు అగుటలేదు. నీకు తోచినట్లు చేయుము(37). నీవు ఈ సృష్టిలోని చెడు వస్తువుల నన్నిటినీ పొందగోరుచున్నావు. మనస్సును శివునినుండి మళ్ళించుము. లేనిచో, నీకు తోచినట్లు చేసుకొనుము(38)
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆ భ్రాహ్మణుని ఈ మాటలను విని మనస్సులో క్రోధమును పొందిన పార్వతి శివుని నిందించుటలో ఉత్సాహముగల బ్రాహ్మణునితో నిట్లనెను (39)
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో బ్రహ్మచారి మోసపు మాటలను వర్ణించే ఇరువది ఏడవ అద్యాయము ముగిసినది (27).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[11/08, 4:51 am] On Sriram**: *🌹. వివేక చూడామణి - 114 / Viveka Chudamani - 114🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 1 🍀*
380. బుద్దిని స్థిరముగా ఆత్మపై ఉంచినప్పుడు అది శాశ్వతముగా ప్రకాశమును వెదజల్లుతూ స్వయం ప్రకాశమైన సాక్షిగా అన్నింటిని దర్శిస్తుంది. ఈ ఆత్మ అసత్య వస్తు సముదాయము కంటే వేరుగా ఉంటూ, లక్ష్యమును చేరుటకు ఆత్మపై ధ్యానము చేయుము. ఇతర ఆలోచనలను వదలివేయుము.
381. నిరంతరముగా ఆత్మపై స్పందిస్తూ ఏవిధమైన ఇతర ఆలోచనలు మధ్యలో అడ్డుపడకుండా, ప్రతి వ్యక్తి ఖచ్చితముగా బ్రహ్మామే తన నిజమైన ఆత్మ అని తెలుసుకోవాలి.
382. ప్రతి వ్యక్తి తన గుర్తింపును ఆత్మతో జోడించి, అహమును ఇతర భౌతిక వస్తువులను వదలి, వాటితో ఎట్టి సంబంధమును పెట్టుకోకుండా, (ఎందువలనంటే అవి చిక్కులతో కూడినవి, పగిలిన కుండ ముక్కల వంటివి.) అలా ఆత్మను దర్శించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹
[11/08, 4:51 am] On Sriram**: *🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 65 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. సప్త స్వరములు - సప్త వర్ణములు 🌻*
అక్షరములుచ్చరించు నపుడు ధ్యానమున రంగులు పుట్టును. ఆ రంగుల నుండియే నారాయణుని రూపము దిగి వచ్చెను.
యజ్ఞమున అక్షరములు ఉచ్చరించుట వలన రంగులు వ్యక్తమగుట సుప్రసిద్ధము.
ఏడు స్వరములలో అక్షరములు ఉచ్చరించునపుడు ఏడు రంగులు పుట్టును. వానిని మూడు స్థాయిలలో ఉచ్చరించునపుడు ఇరువది యొక్క వెలుగులు పుట్టును.
కనుకనే వేదోచ్చారణమున వర్ణములు అను పదము పుట్టెను. వర్ణమనగా అక్షరము లేక రంగు.
ఋక్కు అను పదమున రెండర్థములును కలవు.
దీనిని బట్టియే దేవుని రూపము సువర్ణమయ విగ్రహమని అగమశాస్త్రము తెలుపును. తరువాతి కాలమున సువర్ణమనగా బంగారమని అర్థము వచ్చెను.
అప్పటి నుండి దేవాలయములలో బంగారు విగ్రహములు ప్రతిష్ఠ చేయబడుటయు, దొంగల భయమేర్పడుటయు వచ్చి యజ్ఞశాలలు దేవాలయములుగా మారినవి.
✍🏼 *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹 🌹
[🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 114 / Sri Lalita Sahasranamavali - Meaning - 114 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా |*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ‖ 114 ‖ 🍀*
🍀 559. తాంబూల పూరితముఖీ -
తాంబూలము చేత నిండి పండిన నోరు కలది.
🍀 560. దాడిమీ కుసుమప్రభా -
దానిమ్మపువ్వు ప్రభతో విరాజిల్లునది.
🍀 561. మృగాక్షీ -
ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలుగల కళ్ళు కలది.
🍀 562. మోహినీ -
మోహనమును కలుగజేయునది.
🍀 563. ముఖ్యా -
ముఖ్యురాలు.
🍀 564. మృడానీ -
మృడుని పత్ని.
🍀 565. మిత్రరూపిణీ - మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 114 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 114. tāmbūla-pūrita-mukhī dāḍimī-kusuma-prabhā |*
*mṛgākṣī mohinī mukhyā mṛḍānī mitrarūpiṇī || 114 || 🌻*
🌻 560 ) Dhadimi kusuma prabha -
She whose colour is like the pomegranate bud
🌻 561 ) Mrgakshi -
She who has eyes like deer
🌻 562 ) Mohini -
She who bewitches
🌻 563 ) Mukhya -
She who is the chief
Ooooo
ఆనందం అంటే ఏమిటి?
ఆనందం అంటే ఏమిటి మరియు దానిలో ఏమి ఉంటుంది?
ప్రస్తుత ఆధునిక ప్రపంచం యొక్క అభివృద్ధితో ఉన్న చాలా అసంతృప్తి కారణంగా, ఆనందాన్ని అధ్యయనం చేసే శాస్త్రం గొప్ప ప్రాముఖ్యతను పొందింది ఎందుకంటే ఎవరు సంతోషంగా ఉండటానికి ఇష్టపడరు?
సృష్టి ప్రారంభమైనప్పటి నుండి, తత్వవేత్తలు, మత పెద్దలు, రచయితలు మరియు అరిస్టాటిల్ వంటి ప్రసిద్ధ ఆలోచనాపరులు ఈ ప్రశ్నను తమను తాము అడిగారు, వారు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు.
సమకాలీన మనస్తత్వశాస్త్రంలోఈ భావన మరింత విస్తృతంగా పరిశీలిస్తే ఒక వ్యక్తి అతని కోసం, ఆనందాన్ని ఆహ్లాదకరమైన, అర్ధవంతమైన మరియు నిబద్ధత గల జీవితంగా అర్థం చేసుకోవడంతో పాటు, ఒక వ్యక్తి కలిగి ఉన్న నాణ్యమైన సంబంధాలతో పాటు తన విజయాలు మరియు ఆనందాన్ని నిలబెట్టుకుంటాయనే ఆలోచనలను కూడా పొందుపరుస్తాడు.
మన జన్యువులు 50% మన ఆనందాన్ని నిర్ణయిస్తాయి.
మరోవైపు, 10% మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా నిర్ణయించబడుతుంది.
మరియు మిగిలిన 40% మనం రోజువారీ చేసే కార్యకలాపాల ద్వారా ప్రేరేపించబడతాయి ఆనందం మన జీవితం మన అవసరాలను పూర్తిగా తీర్చినప్పుడు. అంటే, మనకు సంతృప్తిగా, నెరవేరినప్పుడు అది వస్తుంది. ఇది సంతృప్తి యొక్క అనుభూతి, దీనిలో జీవితం ఎలా ఉండాలో అనిపిస్తుంది. మన అవసరాలన్నీ పూర్తిగా నెరవేరినప్పుడు పరిపూర్ణ ఆనందం, జ్ఞానోదయం వస్తుంది.
మీరు చాలా ఉన్నతిలొ ఉన్నా, అన్ని సదుపాయాలు ఉన్నా, ఏది కావాలంటే అది చేయగలిగినా, ఏది కొరుకుంటే అది పొందగలిగిన వాళ్లని అడిగి చూడండి. నూటికి 95 % మంది ఆనందంగా ఉండటం లేదు.అదే కనీస సదుపాయాలు కూడా లేని వాళ్లు నూటికి 35 % ఆనందంగా ఉన్నామని చెపుతున్నారు. ఆంటే సుఖం ఆనందాన్ని ఇవ్వడం లేదా ? దానికి ప్రధాన కారణం కోరికలని నేననుకుంటున్నాను. కోరికలు మనకి ఆనందం లేకుండా చేస్తున్నాయా?... ఆలోచించండి. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. మనలో చాలామంది సుఖాల కోసం ఆనందాన్ని వదిలేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం.
సంతోషం/ఆనందం అనేది 50 శాతం జన్యుపరంగా ఉంటుంది. 40 శాతం మనిషి అంతర్గత ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మిగిలిన 10 శాతం అతడి జీవన పరిస్థితుల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. జన్యుపరమైన సమస్యపై చేయగలిగిందేమీ లేదు. మంచి ఆరోగ్యం, ఇతరులతో సత్సంబంధాలు, మూల ఆదాయం, అర్థవంతమైన పని, నేర్పరితనం, ప్రకృతితో మమేకం కావడం, ఆర్థిక, సామాజిక సమానత, దాతృత్వం వంటి అంశాలపై ఆధారపడి ఆనందాన్ని నిర్వచించాలి. ఒక వ్యక్తికి ఇంట్లో ఉండే ఆనందం పని ప్రదేశానికి వెళ్లాక.. నిమిష నిమిషానికి తగ్గిపోతోంది. అందువల్ల ఆదాయం కంటే మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి. మన జన్యుశాస్త్రం, మనం పెరిగిన విధానం మరియు మన జీవిత అనుభవాల ఆధారంగా మన వ్యక్తిగత అవసరాలు మారుతూ ఉంటాయి. ఈ సంక్లిష్ట కలయిక మనలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైనదిగా చేస్తుంది, మన ఖచ్చితమైన అవసరాలలో మరియు ఈ రోజు మనం ఉన్న వ్యక్తిని తయారుచేసే అన్ని ఇతర అంశాలలోమనలో ప్రతి ఒక్కరూ చాలా సంక్లిష్టంగా మారవచ్చు, కాని మనమందరం మనుషులం మరియు ఇది మన అవసరమైన మానవ అవసరాలను కనుగొనగల పునాదిని అందిస్తుంది.
సమస్య ఏమిటంటే, మన చుట్టూ ఉన్న అన్ని వస్తువులు మరియు ప్రజలు, సాధించిన విజయాలు మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ఇవన్నీ మన ఇంద్రియాలను తాత్కాలికంగా ఆహ్లాదపరుస్తాయి, మన అహాన్ని రంజింపజేస్తాయి, మన స్థితిని పెంచుతాయి. ప్రతిదీ తాత్కాలికం. నిజమైన ఆనందం ఈ బాహ్య కారకాలపై ఆధారపడి ఉండదు.
ఆనందం అనేది మనస్సు యొక్క స్థితి. ఒక వ్యక్తి సంతోషంగా ఎలా ఉండాలో తెలియకపోతే, అతనికి ఏమీ సహాయం చేయదు (డబ్బు, లేదా ఒకరి దృష్టి, లేదా కీర్తి కాదు). మీరు ఎన్నడూ సంతోషంగా లేకుంటే లేదా ఈ భావన ఏమిటో ఇప్పటికే మరచిపోకపోతే, మీరు మళ్ళీ సంతోషంగా ఉండటానికి నేర్చుకోవాలి. అన్నింటిలో మొదటిది, ఆనందం యొక్క మార్గంలో, మన పాత్రను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా వ్యక్తిత్వ లక్షణాలు సంతోషంగా ఉండగల సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి. అసూయ, కోపం, చిరాకు, ఆగ్రహం, దురదృష్టం, పనిలేకుండా మాట్లాడటం, వెన్నుపోటు నుండి బయటపడటం అవసరం. చెడు నుండి మన ఆలోచనలు మరియు మాటలను బయట పడేయాలి. మీ స్వంత చర్యలపై దృష్టి పెట్టండి, ఇతరులు కాదు. విమర్శలను వదిలించుకోండి. సంతోషంగా ఉన్న వ్యక్తిగతంతో భాధ పడడు, వర్తమానం గురించి ఆందోళన చెందడు, భవిష్యత్తు గురించి భయపడడు. దీని అర్థం బాధాకరమైన, కష్టమైన జ్ఞాపకాలు ఉంటే, అవి ఇకపై అతుక్కుపోకుండా ఉండటానికి మానసికంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఆనందం అనేది మనస్సు యొక్క స్థితి. ఇది నాస్తికులకు సంబంధించినది కాదని దీని అర్థం. ఒక వ్యక్తికి ఖచ్చితంగా కాంతి, శక్తివంతమైన వాటిపై నమ్మకం ఉండాలి: దేవుడిలో, అధిక శక్తులు, శక్తులు, ప్రకృతి, విధి. విశ్వాసం మరియు ఉన్నతమైన వాటిపై నమ్మకం ద్వారా మాత్రమే మనం వర్తమానంలో శాంతిని, భవిష్యత్తులో విశ్వాసాన్ని పొందగలం. ఒక వ్యక్తి పంచుకున్నది అతనికి మూడుసార్లు తిరిగి ఇవ్వబడుతుంది. అంటే, ఆనందం, మంచి మానసిక స్థితి, అభినందనలు, సహాయం పంచుకోవడం ప్రారంభించండి మరియు మీ దృక్పథం ఎలా మారుతుందో మీరు గమనించవచ్చు.
మరి ఆనందం ఎందులో ఉంటుంది ?
కోట్లకు కోట్లు డబ్బు సంపాదిస్తే ఆనందం వస్తుందా......కాదనే చెప్పాలి. పెద్ద ఇల్లు, కీర్తి, చుట్టాలు, స్నేహితులు ఉంటే వస్తుందా.......కాదనే చెప్పాలి. 2018 లో ప్రపంచ వ్యాప్తంగా జరిపిన ఆనంద నగరాల సర్వేలో వెల్లడైన విషయాలు
25 % మంది తెలియదు.. చెప్పలేం అన్నారు.
40 % మంది సుఖంగా ఉండటమే ఆనందం అన్నారు.
25% మంది ఏది తలుచుకుంటే అది చేయగలగడమే ఆనందం అన్నారు.
10 % మంది కళలు, దేవుడు... వీటికి దగ్గరగా ఉండటమే ఆనందం అన్నారు.
మరి మీ దృష్టిలో ఆనందం అంటే ఎమిటో అలోచించండి...
మీరు ఆనందంగా ఉన్నారా ? ఉంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆనందంగా ఉన్నారో లెక్కపెట్టగలరా ?
ఒకవేళ మీరు ఆనందంగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులు. ఆదే ఆనందంగా లేకపొతే ... ఎందుకు ఆనందాన్ని మిస్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు.. ఎంత ఆనందంగా జీవించామన్నది ముఖ్యం. మనం బ్రతికి ఉండే ప్రతి నిమిషాన్నీ ఆనందించగలిగితే ఎంత బాగుంటుంది. అది మీ చేతిలోనే ఉంది. సమయాన్ని జారవిడుచుకోకండి. ఆనందంగా ఉన్నారా.. ఉంటే ఎంత % ఆనందంగా ఉన్నారు.. ఏం చేస్తే మీ ఆనందం 100 % అవుతుంది...
ఆనందంగా ఉన్న వారికి ఆయుర్ధాయం పెరుగుతుందని మీకు తెలుసా ? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆనందం గురించి అలోచిస్తే కొన్ని ప్రశ్నలు వచ్చాయి. పోటీ చదువులు, కంప్యూటర్లు , వీడియో గేంలు ఇవన్నీ పిల్లల్లో సహజమైన ఆనందాన్ని దూరం చేస్తున్నాయి. ఈ కార్పొరేట్ ప్రపంచం వచ్చాక, 24 గంటలు పనిచేసే ఆఫీసులు , ప్రతి నెలా మారే షిఫ్టులు, ఒక మొక్క కూడా పెంచుకోలేని అపార్టుమెంటులు, దేవుడితో బిజినెస్ చేసే మనుషులు....... ఇవన్నీ ఆనందాన్ని ఇస్తున్నాయా ? ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. దైవత్వం, మానవత్వం, పశుతత్వం... మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఏది ఎంత % మీలో ఉంది అనేదాన్ని బట్టి మీ అనందం ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
గమనిక: నాకు ఆనందం అంటే ఏదో తెలుసని ఈ పొస్ట్ రాయలేదు. నా లాగే ఇంక ఎవరైనా తెలియని వాళ్లు ఉంటే వాళ్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారెమో అని.
OooooooO
అగస్త్యమహర్షి తన శిష్యులకు నలుగురు మహామునులను గురించి వివరించి, ఆ నలుగురే పువ్వుల పుణ్యగుణాలను లోకానికి తెలియజేసినవారని పేర్కొన్నారు.
ఆ నలుగురు మహామునులే తాము ఎల్లప్పుడూ దక్షిణాభిముఖంగా దైవ చరణాల వద్ద కొలువైన నలుగురు సనకాది మహర్షులు. సనకుడు, సనాతనుడు, సనత్‌కుమారుడు, దక్షిణా మూర్తి స్వామివారి చరణాల వద్ద కొలువై వెలుగొందుతుండటానికి పువ్వులతో ఆరాధించారు.
ఈ నలుగురు మునుపు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మనశ్శాంతి కోసం మార్గం చెప్పండంటూ ప్రార్థించారు. మహామునులకు మనశ్శాంతి లేకుండా ఉంటుందా? అయినా భూలోకవాసులకు తెలియజేసేందుకు వీలుగా ప్రశ్నోత్తరాల రూపంలో సందేశాలను అందించారు. బ్రహ్మదేవుడు కూడా వారిని శంకరనారాయణమూర్తిని లోకానికి చూపెట్టిన గోమతిమాతను ఆరాధించి తరించమని చెబుతారు.
సనకాది మునులు కూడా గోమతి మాతకు పలు రకాల పూజలు చేశారు. కావళ్లు మోసి పలు రకాల తపములనాచరించి, ఎన్నోపూజా పునస్కారాలు, పలు అభిషేకారాధనలు నిర్వహించారు. ఇవన్నీ ఉత్తమై దైవీక స్థితులను అందించగలవి. గోమతి మాత పాదాలను చందనంతో తాపడం చేసి కదంబ పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మాయిలకు రక్షణశక్తిని అందించే ఆరాధన ఇది.
ఆదికాలంలో చెట్లు, కొమ్మలు ఆకులు మాత్రమే ఉండేవి. తర్వాత కాయలు కాసి పండ్లుగా మారుతుండేవి. పువ్వులేవీ ఉండేవి కావు. ఇప్పుడు కూడా పూవులు లేకుండానే కాయలు కాసే అత్తి వంటి చెట్లు ఉన్నాయి. కనుకనే 'అత్తి పూసినట్లు' అనే సామెత లోకప్రసిద్ధమైంది.
సనకాది మునులు ఇలా భక్తిప్రపత్తులతో పూజలు చేస్తున్నప్పుడు గోమతి మాత పరవశించి వీరి ఎదుట ప్రత్యక్షమై చంద్రుడి అమృత తారల ద్వారా భూలోకానికి ఏతెంచిన పువ్వులను గురించి వివరిస్తుంది. ఈ మునులు మరింతగా చేసిన తపస్సుల కారణంగా ఆ అమ్మవారి నుండే అరుదైన తపఃఫలాలను సైతం పొందారు.
ముక్తి, మోక్షం పొందిన మహామునులైనప్పటికీ వారంతా తమకోసం ఏవీ కోరుకోరు. ఒక వేళ ఏవైనా కోరి పొందినా వాటిని తమ వద్ద ఉంచుకోరు సర్వం కృష్ణార్పణమంటూ సమర్పించి ఇతర జీవుల సంక్షేమం కోసం అంకితమైపోతారు.
తపము, యోగం, ధ్యానం పూజలు, ధానధర్మాలు వల్ల మానవులు కూడా వరాలు పొందగలరని ఆ మహామునులు లోకానికి చాటిచెప్పారు. గోమతి అమ్మవారు నుడివినట్లు భూలోకానికి వచ్చిన తొలి పువ్వుల ద్వారానే ఆమెను పూజించారు. వాటికి గోమతి పుష్పం అని పేరు. అంబికాదేవి సైతం ఆదిమూల పుష్ప పూజను స్వీకరించడానికి ముందు తనకు గోమతి అని పేరొచ్చేందుకు కారణమైన అన్ని దేవతామూర్తులు కొలువైన గోవును తొలిపూజను సమర్పించారు. ఇలా భూలోకానికి వచ్చిన తొలి పుష్పం ద్వారా పూజలందుకున్నది గోమాతే! ఆ తర్వాత ఆ నలుగురు మునులూ దక్షిణామూర్తిని, అటుపై గోమతి అమ్మవారిని పువ్వులతో అర్చించి సత్ఫలితాలను పొందారు. ఆ పుష్ప ఆరాధనల వల్ల అనతి కాలంలోనే వారు దక్షిణామూర్తి దర్శనమూ పొందగలిగారు.
🌻 564 ) Mridani -
She who gives pleasure
🌻 565 ) Mithra roopini -
She who is of the form of Sun
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment