Saturday, 16 December 2023



నా మీదే నీ మాయా ప్రభవము సహాయమ్ము సహనమే

 ఏమైనా యీ చర్యా భవహర సయోధ్యమ్ము సమయమే

 నా మాటా యీపూటా విధిపర యనేకమ్ము ప్రణయమే

 నీ మాటే నా స్ఫూర్తీ మనసుగట నీ భక్తి పశుపతీ..4


ఉరుములుగాను మెర్పులగు ఊయలవానలు సాగుటే గతీ

తరుముకు వచ్చు తప్పులగు తామస మాటల యాటలై విదీ

పరుగున మాయ చొచ్చుటయు పామర బుద్ధికి సేవలే సుధీ

మరుగున పడ్డ మాటలివి మానస మంతయు భక్తి యీ శ్వరా...5


నీ పాదమ్మె మదీ యభావ మగుటే నీద్యాస సంపూర్తి యే

నీ పాదార్చకునే వినమ్ర మనసే నీన్యాయ మార్గమ్ము యే

నీ ప్రాభవ్యముగా ను నిత్య జపమే నీ సేవ భాగ్యమ్ముయే

యీప్రాధాన్యతయే సహాయ మదిగా నే విశ్వ విశ్వేశ్వరా..6


దుర్మిల వృత్తము స స స స స స సస...9,13,21

కనునాదము తెల్పెద గామనతో గణ నాదము నిత్యము భక్తిగనే

వినుమా మదిమాయల చిక్కులుగా విజయమ్ము గనే సహ శిక్షణనే

నిను కొల్చెద సత్యము నెమ్మికతో సహనమ్ముగనే విధినీడగనే

తణువే తపమై స్థితి తాహతుగా సరితీరుగ నీయర యీశ్వరుడై..7



No comments:

Post a Comment