Thursday, 1 October 2026

 ప్రతి భారతీయుడు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఈ రెండు మహనీయ ఘట్టాలను తప్పక స్మరించుకోవాలి. ఒకటి, అహింసా మార్గాన్ని కచ్చితంగా అనుసరించి, సంపూర్ణ స్వావలంబన, మత సామరస్యం, సామాజిక సమానత్వం కోసం నిలబడి మనకు 'స్వాతంత్య్రం' సాధించిపెట్టిన మహాత్మా గాంధీగారి అవతరణ. మరొకటి, మహాత్మా గాంధీగారి చే గాఢంగా ప్రభావితులైన లాల్ బహదూర్ శాస్త్రి (దేశ రెండవ ప్రధానమంత్రి) గారి ఆదర్శ జన్మ కారణం. ఆయన సంపూర్ణ నిజాయితీ, నిర్మల నిరాడంబరత, అచంచలమైన జాతీయ స్వయం సమృద్ధికి  శాశ్వత ప్రతీకగా నిలిచారు. తీవ్రమైన పరిస్థితుల సంక్షోభాల నుండి ఒక దేశాన్ని నిశ్చల సంకల్పం, నైతిక ధైర్యం మాత్రమే నడిపించగలవని ఆయన నాయకత్వం నిరూపించింది. స్వాతంత్ర్య భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడానికి ఆయన సమర్థించిన కొన్ని ప్రమాణ సిద్ధాంతాలు-ప్రశంసనీయమూ, అనుసరణీయమూనూ.     జై జవాన్, జై కిసాన్, జై భారత్. – రాజశేఖరు సామల.