Monday, 14 December 2020

16--12--3020


 


. Mallapragada: _*గోదాదేవి అసలు కథ*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు *‘కోదై’* అంటే - పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ , తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా , ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.

ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు , వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు , తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై !

ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ , విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి , విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

[15/12, 11:19 am] . Mallapragada: *_16 నుండి ధనుర్మాసం ప్రారంభం     గోదాదేవి ఎవరు ?  పాశురాలు అంటే ఏమిటి ?   వాటి పరమార్ధం ఏమిటి ?_* 


గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది.


తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే

కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై.


*పాశురాల పరమార్ధం*


తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.


తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.


చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.

 Mallapragada: ✍️.....నేటి చిట్టికథ


🦅🦚🦜🦢🦅🦚🦜🦢🦅🦚🦜


 ఒక అడవిలో🌳 ఓ చెట్టు మీద గూడు కట్టుకుని ఒక కాకి సుఖంగా ఉండేది. 🦅


ఒక రోజున ఓ సరస్సు మీదగుండా ఎగిరి వెళ్తూ కిందన ఒక చక్కని పక్షిని చూసింది.


 సన్నటి పొడుగాటి నాజూకైన మెడ, విశాలమైన రెక్కలు, అంతకంటే విశాలమైన పాదాలు - తెల్లగా వెన్నముద్దలా ఉంది. దాని నడకలో రాచ ఠీవి ఉంది. అది గాలిలోకి ఎగురుతున్నప్పుడు కూడా చూసింది కాకి. మెడ ముందుకు సాచి రెక్కల్ని విసనకర్రల్లా ఆడిస్తూ ఏమి వయ్యారాలు పోయిందో! కిందకు దిగి చూసింది. ఎవరో కాదది రాజహంస.🦢



 ‘అది అంత తెల్లగా ఉంటే, నేను చూడు ఎలా ఉన్నానో నల్లగా’ అనుకుంది కాకి. బాధపడింది.🦅



 ప్రపంచంలోని పక్షులన్నిట్లోకి హంస అదృష్టవంతురాలనుకుంటూ హంస దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంది. హంసకు అభినందనలు తెలిపింది.👏👏


 ‘అవును, ఇన్నాళ్లూ నేనూ నా అంత అదృష్టవంతు రాలు లేదనుకున్నాను. నిన్న ఓ చిలకను🦜 చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఆ చిలక ఎంత బాగుందో! చిత్రంగా అది రెండు రంగులతో ఉంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది. సృష్టిలోకెల్లా అదే అందమైన పక్షి. సందేహం లేదు’ అంది హంస.


 కాకి 🦅ఎగురుకుంటూ పోయి చిలక ముందు వాలింది.🦜


కాకి దాన్ని చూస్తూ ‘ఏమందమే చిలకా నీది’ అంది.


 ‘ఔను. నేనూ అలాగే అనుకున్నాను. కానీ

నిన్ననే ఓ నెమలిని 🦚చూశాను. దాన్ని చూశాక నాదీ ఒక అందమే అనిపించింది. దాని నడక, దాని హొయలు, దాని అందం... ఆహాహా... ఏమని చెప్పను.  నాకున్నవి రెండే రంగులు.

 దానికి ఒళ్లంతా ‘రంగులే’ అంది.



 కాకికి 🦅కాలు నిలవలేదు. రివ్వున ఎగురుకుంటూ  నెమలిని వెతుక్కుంటూ వెళ్లింది. 


ఒకచోట నీలం, ఆకుపచ్చ, ఎరుపు, బంగారం ఇలా ఎన్నెన్నో రంగులతో మెరిసిపోతూ కనిపించింది నెమలి.🦚 అప్పుడది పురి కూడా విప్పి ఉందేమో. ఇంద్రధనస్సులా కాంతులీనుతూ ఉంది.


 కళ్లు చెదురుతున్నాయి. కాని, నెమలి అందచందాలను ఆస్వాదిస్తూ నెమలి దగ్గరకు వెళ్లి ‘ఎంత అందంగా ఉన్నావో! చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. నిన్ను చూసేందుకు రోజూ ఇంత మంది వస్తున్నారంటేనే నువ్వెంత అందగత్తెవో అర్థమౌతోంది. నేనూ ఉన్నాను. జనాభా లెక్కకి. నన్ను చూస్తూనే విదిలించి కొడతారందరూ’ అని వాపోయింది.🦅



 🦚నెమలి విరక్తిగా నవ్వింది. ‘నా అందమే నాకు శాపం. అద్భుత రూప లావణ్యంతో ఉన్నాను కనుకే నన్ను బంధిస్తారు.

నీలా కాకిలా పుట్టి ఉంటే ఎంత స్వేచ్ఛో గదా అనుకుంటున్నాను. 

నాకా అదృష్టం లేదు. ఈ జన్మంతా బానిస బతుకే’ అని కన్నీళ్లు పెట్టుకుంది.


 నెమలి బాధ విన్నాక కాకికి తెలివొచ్చింది. 

మనందరి సమస్య కూడా ఇదే. ఎవరెవరితోనో పోల్చుకుని బాధపడుతుంటాం. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడటం తెలీదు మనకు. అసంతృప్తే అన్ని దుఃఖాలకు కారణం. మనకు ఏవి లేవో వాటిని తలచుకుని పొర్లి పొర్లి ఏడ్చే బదులు, ఏవి ఉన్నాయో వాటితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. 


ప్రపంచమన్నాక హెచ్చు తగ్గులెప్పుడూ ఉంటాయి. ఉన్న వాటిని హాయిగా స్వేచ్ఛగా తృప్తిగా అన భవించే వాడి బతుకే బతుకు. వాడు నిత్య సంతోషి.


🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ఈ రోజు నుండి 30 రోజులు తిరుప్పావై పాశురాలు పారాయణం చేసుకుందాం:*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*


*తిరుప్పావై మొదటిరోజు పాశురం: 16 / 12 / 2020 బుధవారము:*

*********************


*1. పాశురము :*

********************


మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱై దరువాన్

పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !


*భావము :—* సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.


*తిరుప్పావైగీతమాలిక*

ంంంంంంంంంంంం

*అవతారిక:*

వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.


*1 వ మాలిక*


(రేగుప్తి రాగము -ఆదితాళము)


ప.. శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!

భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!


అ.ప.. మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!

మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!


1. చ.. ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని

యశోదమ్మ యొడి యాడెడు - ఆ బాల సింహుని

నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని

నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి


2. ఛ. ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము

పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము

లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము

మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.


🙏 *ఓం నమో  నారాయణాయ*🙏


*-- వరలేఖరి.నరసింహశర్మ.*

[15/12, 9:49 pm] +91 79810 02699: *తిరుప్పావై ప్రవచనం - 1 వ రోజు: 16 / 12 / 2020 బుధవారము:*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*


*భగవంతుని మొదటి స్థానం నారాయణ తత్వం:*

********************

*పాశురము:*

********************

*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్*

*నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్*

*శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్*

*కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్*

*ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్*

*కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్*

*నారాయణనే నమక్కే పఱై దరువాన్*

*పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !*


*నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం*

ంంంంంంంంంంంం


*"మార్గళి త్తింగళ్"* మార్గశిర్షం మంచి మాసం , ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే , అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షిణాయణం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంకు మారుతాడు , అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. *"మది నిఱైంద నన్నాళాల్"* చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం , చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. *"నీరాడ ప్పోదువీర్ పోదుమినో"* స్నానం చేయటానికి వెల్దాం ! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. *"నేరిళైయీర్"* భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే. 


*"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి"* పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని *"చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్"* సంపన్నులైన గోప పిల్లల్లా , మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం.


ఏ భయమూ అవసరం లేదు. *"కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్"* పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ , ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా ! 


*"ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం"* మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందంచే పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. *"కార్మేని"* నల్లని మేఘంలాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కల్గి , *"చ్చెంగణ్ "* వాత్సల్యం కల్గినవాడు. *"కదిర్మదియం పోల్ ముగత్తాన్"* చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గినవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు. 


*"నారాయణనే నమక్కే పఱైతరువాన్"* నారాయణ అనే మత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా *"పారోర్ పుగళప్పడింద్"* ఫలం సాక్షాత్తు పరమాత్మే , ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.


*నారాయణ మంత్రం*

ంంంంంంంంంంంం


ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా , సాగరంలో జలానికి అంతంలేనట్టుగా , మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయనగుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా , అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం. 


ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి *"విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ".* విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు - ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు , ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనుక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది , వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది , ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది , ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది. 


నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం , నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం , విడ దీస్తే ఉత్తర - అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాన్ని అర్థం ఆధారం. ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు , లోపల - బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు , ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి , చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు , పైన కూడా ఉంటాడు కనక అయన పరుడు - అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు , వారిలోని దోశాలనను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు , దోశాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోశాలను తొలగించే శక్తి కూదా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది , సౌశీల్యం ఉంది , వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది , వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది , తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది , ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది. 


అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్య మంత్రంగా అందించింది. 


ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుండి. శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు , శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి , కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి , దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి , నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది , దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.


*--...........


.

సర్వం పరవశం దుఃఖం సర్వం ఆత్మవశం సుఖం


ఏతత్విద్యా త్సమానేన లక్షణం సుఖదుఃఖయోః


 


మనదే అయినా, ఇతరులు గనుక తీసుకుంటే, ఇక అది దుఃఖాన్నే కలిగిస్తుంది. మనకు దక్కింది మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. సుఖదుఃఖాలను ఇలాగే నిర్వచించుకోవాలి. అంటే, మనవద్ద లేనివాటికోసం దిగులు పడకూడదని, ఉన్నవాటితో సంతృప్తిగా ఉండాలని భావం.


🌳🌳🌳🌳🌳🌳🌳🌳

 👍🙏👌


ఇది నిజంగా రోమాలు 

నిక్క పొడుచుకొనేలా చేసే

నిజ జీవితంలోని 

జరిగిన సంఘటన...


చరిత్రలో నిలిచిన కథ.


 నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు, 


ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. 


ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, 

అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని 

ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు. 


ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కూడా 

పరమ శివుడు కనిపించాడు. 


నిజంగా అద్బుతమైన శివుని లీల ఇది. 


ఈమె భార్యది మరియు ఈయనది నిజంగా అదృష్టమే.


 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు,

“ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్ 

అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. 


ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. .


కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. 


ఆమె పేరు మేరీ. 


ఇలా కొన్ని రోజుల గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. 


అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదానికి గురి అయింది. 


ఎప్పుడు భయంతో, భాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది. 


ఆమె రాత్రి పగల్లు తన భర్త కోసం తపిస్తూ బాధ పడుతూ ఎదురు చూడసాగింది. 


అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైధ్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేద మంత్రాలు విని, వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది. 


అక్కడ పూజారులు 

మహా శివుణ్ణి పూజించడం ఈమె గమనించింది. 


ఆ పూజారులు 

“ఈమె మనసులో ఏదో బాధలో ఉందని” 

గ్రహించి పలకరించారు.


ఆ పూజారులు 

“ఏమైంది తల్లి నీకు అని అడగగనే, 

వెంటనే ఆమె భర్త 

‘కల్నల్ గురించి చెప్పి, 

భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని, 

వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. 


ఆ పూజా రులు ఆమెని ఓదారుస్తూ 


“మహా శివునికి తన భాధని చెప్పుకోమని అన్నారు.


ఆమె గుడిలో 

మహా శివునికి మొక్కీ ఇంటికి వెళ్లింది తర్వాత ఆమె శివున్ని భక్తితో కొలుస్తూ 

“లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది. 


భక్తితో ఆరాధిస్తూ ఆమె “తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకు వస్తే, బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది.


11 రోజుల జపం చేసిన తర్వాత, 

ఆమె కి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. 


ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయట పడినట్లు చెప్పాడు. 


పతాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, 

ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని. 


అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ 

ఒక భారతదేశపు 

మహా యోగి వెలుగుతూ కనిపించాడని. 


ఆయన పులి చర్మం ధరించి, 

మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, 

ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. 


ఆయన శక్తికి, 

తేజస్సుకి పతాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కోన్నాడు. 


ఈ యోగి వల్లే మేము విజయం సాధించమని అన్నాడు. 


ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, 

ఆ మహా యోగి కల్నల్ తో మాట్లాడాడని చెప్తూ, 

నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు.


కొన్ని వారాల తర్వాత,

కల్నల్ ఇంటికి చేరుకున్నారు. 


తర్వాత కల్నల్ మరియు మేరీ భైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. 


కల్నల్ గుడిలో ఉన్న 

మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఈయనే అని అన్నాడు. 


అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ 

“మహా శివునికి” అపార భక్తులు అయ్యారు. 


ఆ తర్వాత బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. 


జన్మ ధన్యం చేసుకున్నారు. 


ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్ద రి పేర్లు ఉన్నాయి. 


బ్రిటిష్ వాళ్ళు కట్టిన 

ఒకే ఒక్క గుడి ఇదే. 


ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది...


👍👏👌

ఓ తండ్రి ఆవేదన...తన మాటల్లోనే....


నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. నాకు 4గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం...ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.

చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.పోయిన దీపావళికి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు.. అవి బాగా పాతబడిపోయాయి.పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.

ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది.

చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది.అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి..నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.


4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు...బస్ దిగగానే నా చిన్నకొడలు నాకోసం స్కూటీ తెచ్చింది...నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' అని అడిగింది...బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది...పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.

'సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.


దారి మధ్యలో ఇలా అంది.

'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు...ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'


పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను... స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.


అన్నదే తడవుగా ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.

కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు...ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...

' నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'

'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.

అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను...నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...

'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!' అంది.

కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...

'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది...నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!

ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు...నాకు మరొక దైవం...💐💐💐💐


పెద్దవారు పసిపిల్లలతో సమానం.. వారికి ఆకలి వేసి

అడిగేదాకా చూడకండి...పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!

పెద్దవారు మనకు మార్గదర్శనం.


.....

👍🙏👌


ఇది నిజంగా రోమాలు 

నిక్క పొడుచుకొనేలా చేసే

నిజ జీవితంలోని 

జరిగిన సంఘటన...


చరిత్రలో నిలిచిన కథ.


 నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు, 


ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. 


ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, 

అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని 

ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు. 


ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కూడా 

పరమ శివుడు కనిపించాడు. 


నిజంగా అద్బుతమైన శివుని లీల ఇది. 


ఈమె భార్యది మరియు ఈయనది నిజంగా అదృష్టమే.


 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు,

“ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్ 

అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. 


ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. .


కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. 


ఆమె పేరు మేరీ. 


ఇలా కొన్ని రోజుల గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. 


అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదానికి గురి అయింది. 


ఎప్పుడు భయంతో, భాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది. 


ఆమె రాత్రి పగల్లు తన భర్త కోసం తపిస్తూ బాధ పడుతూ ఎదురు చూడసాగింది. 


అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైధ్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేద మంత్రాలు విని, వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది. 


అక్కడ పూజారులు 

మహా శివుణ్ణి పూజించడం ఈమె గమనించింది. 


ఆ పూజారులు 

“ఈమె మనసులో ఏదో బాధలో ఉందని” 

గ్రహించి పలకరించారు.


ఆ పూజారులు 

“ఏమైంది తల్లి నీకు అని అడగగనే, 

వెంటనే ఆమె భర్త 

‘కల్నల్ గురించి చెప్పి, 

భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని, 

వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. 


ఆ పూజా రులు ఆమెని ఓదారుస్తూ 


“మహా శివునికి తన భాధని చెప్పుకోమని అన్నారు.


ఆమె గుడిలో 

మహా శివునికి మొక్కీ ఇంటికి వెళ్లింది తర్వాత ఆమె శివున్ని భక్తితో కొలుస్తూ 

“లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది. 


భక్తితో ఆరాధిస్తూ ఆమె “తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకు వస్తే, బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది.


11 రోజుల జపం చేసిన తర్వాత, 

ఆమె కి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. 


ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయట పడినట్లు చెప్పాడు. 


పతాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, 

ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని. 


అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ 

ఒక భారతదేశపు 

మహా యోగి వెలుగుతూ కనిపించాడని. 


ఆయన పులి చర్మం ధరించి, 

మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, 

ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. 


ఆయన శక్తికి, 

తేజస్సుకి పతాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కోన్నాడు. 


ఈ యోగి వల్లే మేము విజయం సాధించమని అన్నాడు. 


ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, 

ఆ మహా యోగి కల్నల్ తో మాట్లాడాడని చెప్తూ, 

నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు.


కొన్ని వారాల తర్వాత,

కల్నల్ ఇంటికి చేరుకున్నారు. 


తర్వాత కల్నల్ మరియు మేరీ భైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. 


కల్నల్ గుడిలో ఉన్న 

మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఈయనే అని అన్నాడు. 


అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ 

“మహా శివునికి” అపార భక్తులు అయ్యారు. 


ఆ తర్వాత బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. 


జన్మ ధన్యం చేసుకున్నారు. 


ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్ద రి పేర్లు ఉన్నాయి. 


బ్రిటిష్ వాళ్ళు కట్టిన 

ఒకే ఒక్క గుడి ఇదే. 


ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది...


👍👏👌


15-12-2020




దేవుడున్నాడు హృదయంలో... కధ

కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు.

"స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా?" కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను.

సాధువు తల ఎత్తి అతని వంక చూసి,.ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు.

"దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా?" పరిహాసంగా అడిగాడు అతను.

అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు.

"నీకో కధ చెప్తా విను. అది నీ సందేహం తీర్చచ్ఛు.

పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను". చెప్పిందా పిల్ల.

"ఎవర్ని చేసుకుంటావయితే?" ప్రశ్నించింది తల్లి.


"మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు?" ఆడిగిందా అమ్మాయి.


"మన ఊళ్ళో ఏం ఖర్మ? మన దేశం.లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు" చెప్పాడు తండ్రి.


"అయితే ఇంకేం? ఆయన్నే చేసుకుంటాను." చెప్పిందా పిల్ల.

అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి.

తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక 'సరే' అన్నాడు.


ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు. 'నన్ను పెళ్లి చేసుకో ' అని అడగబోతుండగా, ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది. ' ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు?' అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది.. 

అతని దగ్గరకు వెళ్లి.ఆ.విషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది. ' ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప. చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి' అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కక్కి అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా, ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే".

కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు.

"మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది.

దేవుడికోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. 

సేకరణ....దేవిని సంకల్పం

.........

సమ్మోహాలు .. కలువ   (851-860) 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


లోకంలో స్త్రీలే 

స్త్రీలే దీపాలే 

దీపాలు కుటుంబానికి వెలుగు ఈశ్వరా


భర్త కళల వృధ్ధే

వృద్ధి తరుణి బుద్ధే 

బుద్ధి తో సమయతృప్తి ఇచ్చేది ఈశ్వరా 

  

కళ్ళలో కన్నీరు 

కన్నీరు పన్నీరు 

పన్నీరు పంచేది స్త్రీలే ఈశ్వరా 

  

చెలిమి చలవ ఒప్పే 

ఒప్పు తరుణ మెప్పే  

మెప్పు చుక్కనిలా స్త్రీలు ఉండు ఈశ్వరా 


ప్రీతి యన్న దేదీ 

ఏది అంటె బందీ 

బందీ లో సుఖము స్త్రీపురుషులు ఈశ్వరా 

 

ప్రేయసి కళ ఓర్పే

ఓర్పు కలసి తీర్పే 

తీర్పు ధర్మబద్దముగా ఉండు ఈశ్వరా 


కన్నులు కదులు తీరు 

తీరు తో కన్నీరు 

కన్నీరు మనసుకదలికలేను ఈశ్వరా 


చిరునగవు కన్నీరు 

కన్నీరు సెలయేరు 

సెలయేరగును  స్త్రీల కన్నీరు ఈశ్వరా 


విషయవాంఛల తీరు 

తీరు మారిన ఏరు 

ఏరు వాకసాగరము స్త్రీలకు ఈశ్వరా 


చీకటి వెలుగు తీరు 

తీరు బతుకు నీరు 

నీరు కన్నీరు నిత్య వేదన ఈశ్వరా   


--(())--

[15/12, 5:18 am] . Mallapragada: ప్రాంజలి ప్రభ ... ఆరోగ్య ప్రభ 

✍️చలికాలం - ఆహార జాగ్రత్తలు!


👉చలి కాలంలో ఆకలి ఎక్కువ వేస్తుంది. తరచు ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది. జీర్ణశక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. నిజానికి చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా తింటాం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడతాయి. కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు, బద్దకంగా, నిస్తేజంగా ఉండడం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చలికాలంలో ఇందుకే వస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో మీ కోసం వివరిస్తున్నాము.


👉చలికాలంలో బాదం పప్పు, జీడిపప్పు, అంజీర, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దాంతో పాటు మన శరీరానికి అవసరమైన వేడికూడా ఈ పదార్థాల వల్ల లభిస్తుంది.


👉మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అవాలు, ఉల్లిపాయలు ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోవాలి. వీటి వాడకం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉండడంతో పాటు పొట్టలో గ్యాస్ సమస్య ఉండదు.


👉ఆహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. పైగా తగిన శ్రమ ఉండదు కాబట్టి మునగ, కాకర, అరటి వంటి కూరగాయలు, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. వీటి వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.


👉మొలకెత్తిన గింజలు ఈ సీజన్‌లో బెస్ట్. వాటిని తీసుకోవడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది. పైగా పొట్ట బరువుగా అనిపించదు.


👉ఓ గ్లాసు వేడి పాలలో కాస్త పసుపు, మిరియాలు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.


👉నిల్వ ఉంచిన, చల్లారిపోయిన ఆహారం ఈ సీజన్‌లో అసలే తీసుకోకూడదు. వేడి వేడి, తాజా ఆహారం ఎంజైమ్స్‌ను వృద్ధి చేస్తాయి.


👉శారీరక శ్రమ తగ్గిపోతుంది కాబట్టి మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవు. అందుకోసం ఆరంజ్, నిమ్మ వంటి విటమిన్- సి ఉన్న పండ్లు తీసుకోవాలి.


👉వారంలో ఒకపూట నిరాహారంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి. శరీరానికి నవ చైతన్యం సమకూరుతుంది.


👉వయోధికులు చన్నీటి స్నానాలు వదిలేయాలి. ఒకవేళ చేయాల్సి వస్తే కాస్త ఎండ వచ్చిన తరువాత స్నానం చేయడం మంచిది.


👉కొందరు ఈ కాలంలో ఆస్తమా, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు. దీనికితోడు ఏ పని చేయలేక చాలా బద్ధకంగా ఉంటుంది. అలాంటి వారు కొంత సమయం ఎండలో నడవడం మంచిది. 


👉పొద్దుకుంగిన వెంటనే ఇంటి కిటికీలన్నీ మూసేయాలి. కర్టెన్లు కూడా వేసేయడం ద్వారా ఇల్లు లేదా నిద్రించే గది వేడిగా ఉండేలా చూసుకోవాలి.


👉వృద్ధులు, చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఈ జాగ్రత్తలు తప్పని సరి. లేకుంటే చలి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.


👉పడుకొనే ముందు గోరువెచ్చని నీటితో చేతులు, కాళ్లు, ముఖం శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ వంటివి రాసుకొని పడుకోవడం వల్ల చర్మం పాడు కాకుండా ఉంటుంది. 


👉ఈ కాలంలో శరీరం పొడిబారడం, కాళ్ళు పగుళ్లు లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు రాత్రిపూట కొబ్బరినూనెను వేడిచేసి దానికి చెంచా పసుపు కలిపి కాళ్లకు రాసి మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 


👉తెల్లవారుజామున లేవాల్సిన అవసరం ఉన్న వారు చెవులకు తప్పని సరిగా మఫ్లర్ లేదా మంకీ క్యాప్ వంటివి తప్పని సరిగా వేసుకొనే బయటకు వెళ్లాలి. 


✍️సమస్య ఏదైనా ఒకసారి మాకు తెలపండి. తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకుండా అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే ప్రయత్నం 100% జరుగుతుంది. మా వద్ద మందులు తీసికుని వాడిన మరియూ వాడుతున్న మిత్రులు అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.


 మిత్రులందరికీ  మా నుండి ఒక విన్నపం.. ఈ పేజీ చాలా విలువైన ఆరోగ్య విషయాలను అందరికి ఉచితంగా అందించాలనీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో చేయడం జరిగింది. ఈ పేజీ ప్రతి ఒక్కరికి చేరేలా మిత్రులు అందరికి షేర్ చేసి సహకరించగలరని విజ్ఞప్తి.  మీ మనసుకి ఇష్టమై మీకు బాగుంది అనిపిస్తే దయచేసి ఈ పేజీని లైక్, ఫాలో చేసి మరియు షేర్ చేయగలరని మనవి..

                             మీ ఆయుర్వేద అమృతం💐🙏

[15/12, 5:44 am] . Mallapragada: UU  U UII IIUU


లోకంలో ప్రాంత కళల వృధ్ధే

సౌఖ్యంగా సేవ సమయ బుధ్ధే

చక్రంలా తిర్గు వినయ శుధ్ధే

శ్రీ కారం తెల్పె మనిషి శక్తే


లోకంలో ప్రేమ పరుగు నిప్పే

సక్యత్వం వల్ల చలువ ఒప్ఫే

వక్కానిచ్చే తరుణము మెప్పే

చుక్కానిచ్చే మలుపుల యుక్తే


లోకంలో ప్రేయసి కళ ఓర్పే

చీకూచింతా కళ నిజ మార్పే

చీకట్లే మార్చు వెలగు నేర్పే

వాకిట్లో కల్సి బతుకు తీర్పే


లోకంలో ప్రీతి యనున దేదీ

లేకుండే కాని మన సనేదే

ఏకంగా ప్రేమ కలలు కాలం 

ఈ కొద్దీ స్నేహ మధుర మయ్యే


సమ్మోహమ్మే సమయతలంపే 

సద్భావమ్మే  మనసున శక్తే   

సందర్భమ్మే కరుణతొ  యుక్తే  

సౌందర్యమ్మే వయసున రక్తే

[15/12, 5:53 am] . Mallapragada: నేటి పద్యాలు 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


ఇంద్రకీలాద్రి వనవాసినిగను అమ్మ

సింహివాహిని చారు రూపిణిగ అమ్మ

మందహాసిని రాజమాతంగి అమ్మ

దండధారిని శారదా దివ్య ధాత్రి


తనువు అంతయు ప్రమిదగా విస్థరించి 

హృదయ మనసునే  తైలమ్మగాను మార్చి

బుధ్ధి అనునది వత్తులుగాను చేర్చి

గుణము అందర్కి కార్తీకదీప మయ్యె


ఎల్లలోకాలు నల్లా నల్వని కృష్ణుడు  

కృష్ణుడు చల్వని వాడె గోపాల కృష్ణుడు

కృష్ణుడు మెల్లగా ఉండు గోపికా కృష్ణుడు

కృష్ణుడే జగమంత తానై యున్నవాడు


మనిషికే జీవన గతినే మార్చు తలపులు

తలపులు చేరువయ్యే వరకునే వలపులు

వలపులు నిరంతరం ప్రవాహాలై కళలు

కళలు అన్నీ భవిష్యత్తు వైపు ఉరుకలు


మనసును తట్టుతూ భావోద్వేగాల కళ

కళతో కళ్ళనే గుంభనంగ కమ్ము వేళ

వేళలో మనసున మాతృభూమి సేవకళ

కళ తల్లిదండ్రులు ప్రేమను పంచు వేళ


తొలి తొలి తొలి చూపులు నా మనసునే చేరి

చేరి గిలి గిలి గింతలు పెట్టి తనువు కోరి

కోరి చిరు చిరు నవ్వులతో నాట్యమయూరి

మయూరి చెక చెక సంధించే పూలబణము


నా మదిలోని కళలను ఇక నీప్రేమకే

ప్రేమకే పెదవి వనికినే నీపిలుపుకే

పిలుపు హృదయములోన ప్రణయ పాఠముకే

పాఠములతో క్షణము క్షణము  ప్రేమలకే


గోపాల పరమప్రియము ఇప్పుడు మాకిక 

మాకిక పరమ పాదములే చూపు మాకిక

మాకిక ధరిత్ర అనంతసౌఖ్యము మాకిక

మాకిక సుఖశాంతుల నిలయమే గోపాల


--(())--

సమయానుకూలంగా వెళ్దాం..  లేకపోతే ???


 ``1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్‌లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు.. కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది .. కోడాక్ దివాళా తీసింది మరియు అతని ఉద్యోగులందరూ రోడ్డుపైకి వెళ్లారు..


 HMT (చూడండి)

 బజాజ్ (స్కూటర్)

 డైనోరా (టీవీ)

 మర్ఫీ (రేడియో)

 నోకియా (మొబైల్)

 రాజ్‌డూట్ (బైక్)

 అంబాస్డోర్ (కార్)


 మిత్రులారా,

 వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి !!

 కారణం ???

 కాలక్రమేణా అవి మారలేదు. !!


 రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా..


 నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం…


 ఉబెర్ కేవలం ఒక సాఫ్ట్‌వేర్.  సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అతను ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.


 సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్‌బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.


 Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి.


 యుఎస్‌లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు, ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్‌వేర్ క్షణంలో మంచి న్యాయ సలహా ఇస్తుంది.  రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు.. 10% ఆదా చేసే వారు.. వారు సూపర్ స్పెషలిస్టులు అవుతారు.


 వాట్సన్ అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు ఎక్కువ చేస్తుంది.  2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా తెలివైనవి.


 రాబోయే పదేళ్లలో, 90% కార్లు ప్రపంచంలోని రోడ్ల నుండి అదృశ్యమవుతాయి.. సేవ్ చేయబడేవి ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ అవుతాయి.. రోడ్లు ఖాళీగా ఉంటాయి, పెట్రోల్ వినియోగం 90% తగ్గుతుంది, అన్ని అరబ్ దేశాలు దివాళా తీస్తాయి  .


 మీరు ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతారు మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది.. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.


 కార్లు డ్రైవర్ లేని కారణంగా 99% ప్రమాదాలు ఆగిపోతాయి.. ఇది కార్ ఇన్సూరెన్స్ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.


 డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై ఉండదు.  నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు స్వయంచాలకంగా అదృశ్యమవుతాయి ... ఎందుకంటే ఒక కారు ఈ రోజు 20 కార్లకు సమానంగా ఉంటుంది.


 5 లేదా 10 సంవత్సరాల క్రితం, పిసిఓ లేని చోట అలాంటి స్థలం లేదు.  అప్పుడు అందరి జేబులో మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు, అప్పుడు పిసిఓ మూసివేయడం ప్రారంభించింది .. అప్పుడు ఆ పిసిఓ ప్రజలందరూ ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు.  ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది.


 మీరు ఎప్పుడైనా గమనించారా ..?


 ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణంలో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి.

 అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.


 ఇప్పుడు అంతా పేటీఎమ్‌తో పూర్తయింది.. ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు .. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్‌ను ప్లాస్టిక్ మనీతో ముందే మార్చారు, ఇప్పుడు అది డిజిటల్‌గా మారింది.  ఒక లావాదేవీ.


 ప్రపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు తెరిచి ఉంచండి, లేకపోతే మీరు వెనుకబడిపోతారు..


 కాలక్రమేణా మార్చడానికి సిద్ధం.


 అందువల్ల ...

 ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు అతని స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి.

 

 "టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్"


 సమయంతో కదిలి విజయం సాధించండి. ''


,........

*🔊ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు*


*🔶ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ పంపిణీ*


*🔷ముందుగల రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే వ్యాక్సిన్*


*🔶ఏ సెంటర్‌‌‌‌కు పోవాల్నో ముందే మెసేజ్ వస్తది*


*🔷గుర్తింపు కార్డు ఉంటేనే సెంటర్‌‌‌‌లోకి ఎంట్రీ*


*📜రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్*


*🍥 దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ల పంపిణీకి ఏర్పాట్లు షురూ అయ్యాయి. పోలింగ్ సెంటర్ల తరహాలోనే వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీకి సంబంధించిన అన్ని విషయాలనూ వివరిస్తూ గైడ్ లైన్స్ జారీ చేసింది. తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు, ఆ తర్వాత రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్ల(పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఆర్మీ, హోంగార్డులు, జైళ్ల శాఖ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిబ్బంది)కు, మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 50 ఏండ్ల వయసు దాటిన వారికి, 50 ఏండ్ల కంటే తక్కువ వయసుండి ఇతర జబ్బులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది. వీరు దేశవ్యాప్తంగా27 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల్లోని వివరాల ఆధారంగా 50 ఏండ్లు దాటినవారిని గుర్తించి, వివరాలను సేకరించాలని చెప్పింది. ఈ మూడు కేటగిరీల వారికి కొవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించింది.*


*💥రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే..*


*🌀రిజిస్ర్టేషన్ సమయంలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని, నేరుగా సెంటర్ల వద్దకు వచ్చినవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఏదైనా నెగెటివ్ రియాక్షన్ వస్తే వెంటనే కొవిన్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలని చెప్పింది. వాళ్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందించేందుకు డాక్టర్లు, మెడికల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సిద్ధంగా ఉంచాలని వివరించింది.*


*💥ఒక సెషన్ లో వంద మందికే..*


*💠ఉదయం 9  నుంచి సాయంత్రం 5  వరకూ వ్యాక్సిన్ లు వేయాలని కేంద్రం సూచించింది. హెల్త్ స్టాఫ్​కు ప్రైమరీ హెల్త్ సెంటర్లు, దవాఖాన్లలోనే వ్యాక్సిన్ వేయాలని తెలిపింది. వీరి డేటాను ఇప్పటికే ఆరోగ్యశాఖ సేకరించింది. ఫ్రంట్ లైన్ వర్కర్ల డేటాను ఆయా శాఖల నుంచి సేకరించి, ఆరోగ్య సిబ్బంది రిజిస్ర్టేషన్ చేయనున్నారు. ఓటర్ లిస్ట్ ద్వారా వృద్ధులను, రోగులను గుర్తించనున్నారు. వీరికి వ్యాక్సిన్ వేయడానికి హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు, ఆఫీసులు, స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లను వాడుకోవచ్చని తెలిపింది. ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెయిటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెరిఫికేషన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ్యాక్సినేషన్ హాల్, వెయిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపల్సరీగా ఉండాలని చెప్పింది. ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వంద మందికి మాత్రమే వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయాల్సి ఉంటుంది. ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఒక వ్యాక్సినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నలుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లు ఉండాలి. వ్యాక్సినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డాక్టర్ లేదా నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లేదా ఇంజక్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించిన వారు ఎవరైనా ఉండొచ్చు. వీరికి ముందుగానే ఆరోగ్యశాఖ ట్రైనింగ్ ఇవ్వాలి. వ్యాక్సినేషన్ లో మొత్తం 23 డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల సిబ్బందికి డ్యూటీలు వేయాలని, ఏయే డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏయే పనులు చేయాలో గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్రం పేర్కొంది.*


*💥వ్యాక్సిన్ వేస్కోవాలంటే ఇదీ ప్రాసెస్*


*♦️వ్యాక్సిన్ కోసం ఆరోగ్య శాఖ వద్ద లేదా కొవిడ్  (www.cowin.gov.in ) వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.*


*♦️ఏయే వ్యాక్సిన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఎవరికి వ్యాక్సిన్ వేస్తారో ముందుగానే లబ్ధిదారులకు సమాచారం ఇస్తారు.*


*♦️ఉదయం 9 నుంచి సాయంత్రం 5 లోపు ఏదైనా ఒక గుర్తింపు కార్డు(ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓటర్ కార్డు వంటివి) తీసుకుని సూచించిన వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలి.*


*♦️వ్యాక్సినేషన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి ఆ కార్డు చూపించి, వెయిట్ చేయాలి.*


*♦️తర్వాత మరో ఆఫీసర్ వద్దకు వెళ్లి రిజిస్ర్టేషన్ చేసుకున్నట్టు వచ్చిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుర్తింపు కార్డు చూపాలి. ఆఫీసర్లు కోవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ర్టేషన్ వివరాలను వెరిఫై చేసిన తర్వాతే వ్యాక్సిన్ వేస్తారు.*


*♦️వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అరగంట పాటు అక్కడే ఉండాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే అక్కడున్న డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పాలి.*


*♦️ఈ ప్రక్రియ పూర్తయ్యాక వ్యాక్సిన్ వేసుకున్నట్టు కో–విన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసిన కార్డు ఇస్తారు. లబ్ధిదారు మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్ రూపంలో లింక్ వస్తుంది. ఇందులో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివన్నీ ఉంటాయి. అలాగే, సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు? ఎక్కడ వేస్తారు? అన్న సమాచారం కూడా ఉంటుంది. సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ కార్డు తప్పకుండా తీసుకు రావాల్సి ఉంటుంది.*

[14/12, 9:11 pm] +91 99633 02905: మీ చిన్నతనం గుర్తు రావాలంటే విజయవాడ రేడియో స్తెషన్ వారి భక్తిరంజని ప్రోగ్రామ్ లోని స్తోత్రాలన్ని ఉన్నాయి వినండి.  మీకూ నచ్చుతాయాని పోస్ట్ చేస్తున్నాన


https://www.youtube.com/playlist?list=PLgFOpEoSgN0G4cgO2yqitY4IxqD1NBl7P

††**********

కేంద్రం ప్రవేశపెట్టిన  కొత్త వ్యవసాయ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది ఇప్పుడు చట్టంగా మారింది.  

*ఈ అగ్రికల్చర్ బిల్లు -2020 లో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం


ఎంతసేపూ వాళ్ళూ వీళ్లు చెప్పింది వినడమే కాకుండా ఈ బిల్లు రైతులకు లాభం చేస్తుందా నష్టం చేసేలా ఉందా అని ప్రతి ఒక్క రైతు కూడా సొంతంగా ఆలోచించుకోవాలి. 

 

 ఈ కొత్త వ్యవసాయ బిల్లు గురించి పూర్తిగా అవగాహన పొందండి

 

🚫నిన్నటిదాకా ఉన్న రూల్స్ ప్రకారం రైతులు ధాన్యం తప్పనిసరిగా అయితే మార్కెటు కమిటీల అమ్మాలి లేకుంటె వాళ్ళ మండల పరిథిలో లేదా అదే జిల్లా పరిథిలో ఉండే ప్రయివేటు లేదా ప్రభుత్వ యార్డుల్లో మత్రమే  అమ్ముకోవాలి అని చెప్తుండే . కానీ ఇప్పుడు అలాంటి రూల్స్ ఏం లేవు.

  

🚫 రైతులు పండించిన ధాన్యం మన రాష్ట్రం దాటద్దు , పక్క రాష్ట్రాలకు తీసుకుపోయేదుంటే మా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి, మధ్య మధ్యలో వచ్చే చెక్ పోస్టులు తప్పిచుకోడానికి వాల్లకు వీళ్లకు చేతులు తడపాలి అనే బాధల నుండి రైతులు ఇప్పుడు బయటపడ్డారు.

 

కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకి ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం:- 

 

✅ కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం ఇకపై రైతులు తమ పంటలను ఎక్కడ నచ్చితే అక్కడ అమ్ముకోవచ్చు.  

 

✅ మార్కెటు కమిటీ ల మంచి రేటు ఉంటే మర్కెట్ ల అమ్ముకోవచ్చు (లేదా) ప్రయివేటు సేటు ఎక్కువ రేటు ఇస్తా అంటే సేటు కి అమ్మొచ్చు , (లేకుంటె) పక్కన ఇటు మహారాష్ట్రల - అటు కర్ణాటకల ఎక్కడ ఎక్కువ ధర ఉంది అంటే అక్కడికి ఒక పది మంది రైతులు జమ అయి ధాన్యం పట్టుకుపోయి మంచి రేటుకి అమ్ముకోవచ్చు.  

 

✅ నీ పంటను నువ్ వేరే రాష్ట్రం తీసుకొనిపోయి అమ్మలేవు అనుకుందాము. అలాంటప్పుడు ఎలెక్ట్రానిక్ విధానములో నువ్ నీ పంట ఫొటొ తీసి ఆన్ -లైన్ లో పెట్టి  నాణ్యమయిన ఫలానా రకానికి చెందిన ఫలానా పంట నాదగ్గర ఇన్ని క్వింటాళ్లు రెడీగా ఉన్నయ్. క్వింటాలుకు ఈ రేటుకి అమ్ముతా అని ఆన్ -లైన్ లో పెడితే నువ్ పెట్టిన రేటు దేశం మొత్తం మీద ఎందరో చూస్తారు. నువ్ చెప్పిన ధర ఎవరికి తక్కువ రేటులా అనిపిస్తె వాళ్ళే మనదగ్గరికొచ్చి కొనుక్కుని వెళ్తారు. ఇది కూడా రైతుకి లాభమే కదా.... 

 

✅ నీ పంట నాణ్యత నచ్చితే రిలయన్స్ ఫ్రెష్ , వాల్ మార్ట్, హెరిటేజ్ లాంటి కంపెనీలు సైతం నేరుగా నీ పొలం వద్దకే వచ్చి నగద్ పైసలతో నీ ధాన్యం , నీ పండ్లు ఫలాలు,కూరగాయలను కొనుక్కుని పోతాయ్. నువ్ పండించే పంట నాణ్యత చాలా బాగా ఉంటున్నాయి అని అనిపిస్తే అవే కంపెనీలు రాబోయే పంటను మాకే అమ్మాలి అనో లేదా ఇన్ని క్వింటాళ్ల పంట మేము కొంటాం అని నీతో  ముందస్తుగానే  అగ్రీమెంటు చే  సుకోడానికి కూడా ఇష్టపడతాయి. అంటే నువ్ పంట పండించే కంటే ముందే నీకు మంచి రేటు దొరికినట్టే కదా....  

 

📌 ఇక్కడ కొంతమంది రైతులని తప్పుదోవ పట్టించడానికి ఎం చెపుతున్నారంటే ప్రయివేటు కంపెనీలతో ముందస్తుగా అగ్రీమెంటు చేసుకుంటే భవిష్యత్తులో బయట మార్కెట్లో మద్దతు ధర బాగా ఎక్కువగా ఉన్నా కూడా అగ్రీమెంటు చేసుకున్న రైతులు యే రేటుకి ఇస్తం అన్నారో అదే రేటుకి పంట అమ్మి నష్టపోతారు అని రైతులను భయ పెడుతున్నారు. కానీ నిజానికి అలా మోసం చేయడానికి ప్రయివేటు కంపెనీలకు ఆస్కారం లేదు. అగ్రిమెంటు రాసుకునే  సమయంలోనే అగ్రిమెంటులో మేము పంట కొనే  సమయానికి ఉన్న మద్దతుధర లేదా  అగ్రీమెంటు లో రాయబడిన ధరలలో ఏది ఎక్కువగా వుంటే ఆ ధర చెల్లించి మీ దగ్గర ఇన్ని క్వింటాళ్ల పంట కొంటాము అని కంపెనీలతో అగ్రీమెంటు చేసుకోవచ్చు.  

 

📌 ఇంకొకటి ఏం చెబుతారంటే ప్రయివేటు కంపెనీలు మీకు పెట్టబడి ఇచ్చి మీతో  ఎక్కువగా పంట తీయించడానికి ఎక్కువగా ఎరువులు క్రిమిసంహారకాలు వాడించి మీ భూములలో సారాన్ని పీల్చి పిప్పి చేస్తాయి అని భయపెడతారు. రైతుసోదరులు గమనించాలి , ఏ కంపెనీ అయినా సరే రైతులకి పెట్టబడి ఇచ్చి ఇన్ని క్వింటాళ్ల పంట కొంటాము అంటాయి, లేదా నీకు ఇచ్చిన పెట్టబడి డబ్బులను నువ్ అమ్మే పంటల డబ్బులో పట్టుకుని నీకు మిగతా డబ్బులు ఇస్తాయి. అంతే కానీ కంపెనీలే నీకు కొంత డబ్బులు ఇచ్చేసి నీ భూమిలో వాళ్ళు వ్యవసాయం చేసి వాళ్ళ పంటలు  వాళ్ళు పండించుకునే విదానం ఉండదు. ఒకవేళ అలాంటి కంపెనీయే  ఉండి పొరపాటున వాల్లే  నీ దగ్గరికి వస్తే కూడా నువ్ ఇయ్యకు కదా వాళ్లకి. నీ భూమి నీ ఇష్టం . నువ్ కంపల్సరీ ఇయ్యాలని కండిషన్ ఎం లేదు కదా..... 

 

📌 కొంత మంది చెపుతున్నట్టుగా ఈ బిల్లులో మార్కెట్ కమిటీలను మూసివేయాలి అనో లేదా మద్దతు ధర ప్రకటించడం బంద్ అయితదనో ఏం లేదు. దేశ వ్యప్తంగా ఏ పంటకు ఎంత మద్దతు ధర (MSP) ఉందో కేంద్రం ప్రకటిస్తూనే ఉంటది, ఆ రేటు నచ్చిన రైతులు ఆ రేటుకే అమ్ముకోవాలి అనుకుంటే మార్కెటు కమిటీలలో అమ్ముకొనే అవకాశం కూడా ఉంటది. ఈ ఫెసిలిటీని తొలగించడంలేదు. ఒకవేల మార్కెటు కమిటీలో ఉన్న మద్దతుధర నాకు నచ్చలేదు, నా పంట ను నేను పక్క జిల్లాలొ లేదా పక్క రాష్ట్రంలో  అమ్ముకుంటా అనే వాళ్ళు  మార్కేట్ కమిటీకి పోకుండా బయటికి పోయి దారిలో ఎవ్వరికి రుపాయి చలానా కట్టకుండా పంట అమ్ముకుని పైసలు తెచ్చుకునే ఛాన్స్ రైతులకి కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

†*************

*1). కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.*


*2). కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.*


*3). కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.*


*4). కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.*


*5). ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.*


*6). పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.*


*7). పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.*


*8). పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.*


*9). పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.*


*10). పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.*


            *డా.నయీమ్ ఖాన్*

 ********

*ఓ రైతు తన గాడిదను ఎప్పటిలాగే రాత్రి ఓ చెట్టుకు కట్టివేశాడు... రాత్రిపూట ఓ దెయ్యం చూసి, జాలిపడి తాళ్లు విప్పి వదిలేసింది... 

గాడిద కదా, దానికేం తెలుసు..? వెంటనే ఓ పొలంలో పడింది... తినేంత కాడికి తిన్నది, మిగతాది ధ్వంసం చేసింది... 

ఆ పొలం రైతు భార్యకు తిక్కరేగి, ఆ గాడిదను నరికి చంపేసింది... నా గాడిదను చంపేస్తావా అని గాడిద యజమాని ఆగ్రహంతో ఆమెను చంపేశాడు... నా భార్యను చంపుతావా అని ఆమె భర్త ఈ గాడిద యజమానిని ఖతం చేశాడు... నా భర్తను చంపుతావా అని కోపంతో గాడిద యజమాని భార్య సదరు రైతు ఇంటికి నిప్పు పెడుతుంది... నా ఇంటినే కాలబెడతావా అంటూ ఆ రైతు ప్రతీకారంగా ఆమెను, పిల్లల్ని చంపేస్తాడు... 

ఈలోపు తనకు దెయ్యం కనిపిస్తుంది, తనే గాడిద కట్లు విప్పానని, ఈ అరిష్టాలు ఊహించలేదని చెబుతుంది... నీ కళ్లు చల్లబడ్డాయా అని దెయ్యాన్ని రైతు నిందిస్తాడు... 

ఒరే మూర్ఖుడా..? నేనేం చేశానురా, కేవలం గాడిద తాళ్లు విప్పాను... అంతే... మీరే మీలోని అసలు దెయ్యాల్ని బయటికి తీశారు... చంపుకున్నారు... ఇక నోర్మూసుకో అని వెళ్లిపోయింది ఆ దెయ్యం... 

తరువాతకాలంలో ఆ దెయ్యపు సంతానమే ఇండియన్ మీడియాగా అవతరించింది... రోజుకొక గాడిదను, అంటే ఏదో ఓ వివాదాన్ని తాళ్లు విప్పి వదులుతుంది ఈ సంతానం... 

ఇక ప్రజలు వాదనలతో, తిట్లతో, డిబేట్లతో, దాడులతో చంపేసుకుంటున్నారు... స్నేహితుల్లేరు, పెద్దాచిన్నా లేదు... పక్కింటివారని లేదు, చుట్టాలని చూసేది లేదు... తన్నుకోవడమే... 

(ఓ ఆంగ్ల పోస్టుకు నా స్వేచ్చానువాదం ఇది...)

............

*ప్రతీ ఒక్కరు చదివి తీరాల్సిన...విషయం*




* ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం  నేర్చుకున్నాడు  


15 ఏళ్లకే  మందు తాగడం నేర్చుకున్నాడు 


ఎలాగోలా స్కూల్  చదువు నుండి కాలేజీ కి వచ్చాడు 


అక్కడ పేకాట  పడుచుపిల్లల్తో  ఆటలు నేర్చుకున్నాడు. 


దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.


20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.


అది సరిపోక  హత్యలు చేయడము  మొదలెట్టాడు.


దొంగ ఎన్ని రోజులో  దొరలాగా  తిరగలేడు కదా...


ఒకరోజు దొరికిపోయాడు.


మూడేళ్ళ విచారణ  తరువాత అతనికి ఉరిశిక్ష  పడింది.


మళ్ళీ ఎన్ని అప్పీళ్లు  పెట్టుకున్న అవన్నీ  కొట్టేసి  ఉరిశిక్షనే ఖరారూ చేసీ ఆ    రోజును చెప్పేసారు


చివరగా  అతని కోరిక ఏమని అడగగా


 తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు  


అతని కోరిక మేరకు వారిని పిలిపించారు  


*కన్నవాళ్ళు...కన్నపిల్లలు రాక్షసులైన  ప్రేమిస్తారు*


పోలీసులు  లాయర్లు  సాక్షులు  అందరూ మోసం చేసి నీ ఉరికి  కారణమయ్యారని  ఏడ్చారు తల్లి తండ్రులు 


అప్పుడు అతను వారు కాదు *నా మరణానికి  కారణం మీరే అని చెప్పాడు* 👇


 నా పదేళ్ల వయసులో అల్లరి చేసినందుకు ఉపాధ్యాయుడు    మండలించాడని చెప్పగానే బంధువులతో కలిసి టీచర్ ని తిడుతూ కొట్టి అతన్ని నిందించారు. 14 ఏళ్ల వయసు లో హోమ్ వర్క్ చేయకుండా, చదవకుండా ఉపాధ్యాయుని గేలి చేసి తిట్టనందుకు ఉపాధ్యాయులు ఒక దెబ్బ కొడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను వెనకేసుకు వచ్చారు.

అమ్మాయిల్ని ఏడిపించానని ఎందరో చెప్పినా నన్ను మందలించి తప్పు అని చెప్పలేదు.


అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం 


ఈరోజు ఉరితాడు  నా మెడకు  రావడానికి  కారణం మీరే అని కంటతడి పెట్టాడు 


 *చిన్నప్పుడు తప్పు చేయగానే  ఉపాధ్యాయుడు శిక్షించకపోతే,మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు*


👉చిన్న తప్పులే కదా అని *వెనుకేసుకురాకండి* అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..


👉పిల్లల్ని చిన్నతనంలోనే మంచిమార్గం లోకి తీసుకురావాలి.. లేదంటే వారు పెద్దయ్యాక తల్లిదండ్రులను కూడా వారి *అవసరాల కోసం ,డబ్బుకోసం హత్యలకి వెనుకాడరు.*..

Sunday, 13 December 2020

60,65 సంవత్సరాలు దాటిన ఆడ,మగ పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు .
*********
1) మీరు బాత్రూంలో  వున్నప్పుడు లోపల గడియ పెట్టుకో వద్దు.మీరు లోపల వున్నట్లు తెలియటానికి మీకు వస్తే ఏదైనా కూని రాగాలు పాడుతుండడమో లేకుంటే మీ మొబైల్ తీసుకెళ్లి దాంట్లో  ఏదైనా పాట పెట్టుకోవడమో చేయండి.
2) తడిగాఉన్న నేలపై నడువ వద్దు. ఇప్పడు కట్టే అన్ని ఇండ్లలో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ , టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనపడవు. అందవల్ల కాలు పెడితే జారడం ఖాయం.
3) ఫ్యాన్ లు,ఫోటోలు తుడచడానికి గానీ , రిపేరు చేయటానికి గానీ , గుడ్డలు ఆరవేయటానికి గానీ            స్టూళ్ళు , కుర్చీలు, బెంచీలు ఎక్కడం మానుకోండి .
4) కారు గానీ , స్కూటర్  గానీ మీరు ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఎవరో ఒకరిని తోడుగా పిలుచుకుని వెళ్ళండి.
5) మీరు వేసుకునే మందులు ఏమైనా వుంటే డాక్టర్ చెప్పిన ప్రకారం టయానికి మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటికంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం.
6)మిమ్మల్ని సంతోషపరిచే విషయాలలో గానీ,ఆనందపరిచే విషయాలలో గానీ ,
మనశ్శాంతిగా వుండే  విషయాలలో గానీ వేరే వాళ్ళ ఆలోచనలతో రాజీపడవద్దు.
7) మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే బ్యాంకుకు వెళ్లినా , మార్కెట్టుకు వెళ్ళినా, షాపింగ్ కి  వెళ్ళినా ఇంక ఎక్కడకి వెళ్ళినా మీ సహధర్మచారిణిని (భార్యను)తీసుకవెళ్ళండి.
వాళ్ళూ సంతోష పడతారు. మీకు నిజమై తోడు వాళ్ళే.
8) ఇంట్లో మీరు ఒక్కరు వున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి.     వీలైనంత త్వరగా  మాట్లాడి పంపించేయండి.జాగ్రత్తగా ఉండండి.
9) ఎప్పుడూ ఇంటి తాళాలు రెండు మెయింటేన్ చేయండి. ఒకటి మీ దగ్గర ,రెండోది మీ భార్య దగ్గర.
10) మీ బెడ్ రూంలో బెడ్ ప్రక్కనే ఒక కాలింగ్ బెల్ అరేంజ్ చేసుకోండి.ఎప్పుడైనా అవసరం రావచ్చు.
11) ఇంట్లో వారితోను , బయటి వారితోను
మాట్లాడేటప్పుడు మర్యాదగా , మృదువుగా మాట్లాడండి . కోపంగాను , రాష్ గాను మాట్లాడుతే మీ మీద గౌరవం పోయి అసహ్యించుకుంటారు.
12) ఎప్పుడు కూడా జరిగిపోయినదాని గురించి గానీ , జరిగేదాని గురించి గానీ, జరుగబోయేదాని గురించి గానీ ఆలోచించ వద్దు. జరిగేది జరుగక మానదు.
13) ఈ వయసులో  మనశ్శాంతి,మంచి ఆరోగ్యం,మంచి బంధుత్వం + మంచి స్నేహితం చాలా ముఖ్యం.
Note = మీరు వీలు చేసుకుని  + ఓపిక చేసుకుని మీకు తెలిసిన పెద్ద వారికి అందరికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి.

 

  పోలి అమావాశ్య నాడు దీపములను అరటి దొప్పలలో వదులుతూ చదవవలసిన శ్లోకం

 

కార్తీక దామోదరా గయా దామోదరా 

ఆత్మ దామోదరా లింగ దామోదరా

మోక్ష దామోదరా కృత్తికా మహాలక్ష్మీ

నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో

నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు

లక్ష్మీ దామోదరా రాధా దామోదరా

గోరంత పసుపు కుంకుమ తీసుకొని

కొండంత పసుపు కుంకుమ మాకీయవమ్మ !

...............

*పోలి స్వర్గం కథ ఇదీ* 🥀

కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.

అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.

కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.

ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.

 ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.

తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.  ఈ  అమావాస్య సోమవారం కనుక మంగళవారంనాడు   పోలి దీపాలను వెలిగించుకోవాలి. 

ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

..........


*1.మహాంధ్రోదయం,రుద్రవీణ పలకరింపు' అగ్నిధార'కవెవరు.

2.దున్నడం పదంనుతొలిగా ప్రస్తావించిన వేదబ్రాహ్మణమేది.

3.సుఖాంతప్రేమకథ'యాజ్ యులైక్ఇట్'నాటకకర్త.

4.మధురభక్తిస్త్రీవాదజ్ఞానం,ఆండాళ్ కథకావ్యకర్త.

5.15శతాబ్దం మానవతాధర్మం 'నానాటిబతుకునాటకం'సంకీర్తనెవరిది.

6.1947లోతాత్వికచింతన నాటకం'పురూరవ'వ్రాసందెవరు

7.అష్టదిగ్గజాలలోరాయలప్రీతికర విశిష్టశైవకవి.

8.హరివంశం,నృసింహపురాణం కావ్యకర్త.

9.1930లోపిఠాపురంనుండి4సంపుటాల'వర్ణనరత్నాకరం'కర్త

10.'దిషార్ట్,దిలాంగ్ అండ్ దిటాల్'12కథలసంపుటికర్త.

11.పద్యం,కొత్తతరంమథనం'పాఠకమిత్రవ్యాఖ్య'రూపకర్త.

12.రాజరిక సిద్ధాంతంను వివరించిన వేదగ్రంధం.

13.విఖ్యాతసంపాదకులు,రచయిత 'వీరాజీ'అసలుపేరు.

14.యానాం సాహిత్యకేతనం డా.శిఖామణి అసలుపేరు.

15.లలితసుగుణజాల తెలుగుబాలన్న'కరుణశ్రీ'పేరు.

16.'కవిత్వంమాట్లాడేచిత్రం,చిత్రలేఖనంమౌనకవిత్వం'అన్నది.

17.విశిష్టకవిసమీక్షకులు,వ్యాఖ్యాత'సుధామ'పేరు.

18.స్త్రీవాదరచనోద్యమశీలి 'ఓల్గా'పేరు.

19.చతుషష్టికళల్లో సమాహారకళని దేనినంటారు.

20.ప్రఖ్యాతసాహిత్యవేత్తఅక్కిరాజు రమాపతిరావు కలంపేరు

21.ఆర్గురుదిగంబరకవుల్లో'అగ్నిశ్వాస'నిఖిలేశ్వర్ అసలుపేరు

22.విఖ్యాత'ఎల్లోరా'గొడవర్తిభాస్కరరావు,మరి'అజంతా'పేరు.

23.త్రిపురాసురసంహారం,ద్రాక్షారామమహాత్యంగల'శ్రీనాథ'రచన.

24.నేత్రావథాని,యాజ్ఞి,పిఠాపుర రాజాస్థానకవి,సోమయాజి .

25.దుర్యోధనఘోషయాత్ర,'సౌమిత్ర్యుపాఖ్యానం

......


🕉️ *చెమటలు పట్టే విగ్రహం ఎక్కడుందో తెలుసా..!*

శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్..అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు. 

108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. 

ఆ వివరాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.. 

ఎక్కడ ఉంది?

తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో వున్న తిరునాయూర్ అనే క్షేత్రంలో ఉత్సవమూర్తిగా వున్న గరుత్మంతుని విగ్రహం ఊరేగింపుసమయంలో వివిధ రకాల బరువులతో ఉండటం జరుతుంది. 

ఈ క్షేత్రానికి నాచ్చియార్ కోవెల్ అనే పేరుగూడా వున్నది.

ఈ క్షేత్రంలో వెలసిన మహావిష్ణువుకి సంవత్సరానికి 2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. 

ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపుగా వెళుతూ వుండగా స్వామివారు గరుడవాహనంమీద అమ్మవారి వెనక వెళుతూవుంటారు.

స్వామి వారు ఈ సమయంలో ..

ఒక చిక్కుపరిస్థితిలో పడతారు..

అదేమిటంటే గరుడవాహనం యొక్క వేగం హంసవాహనం కన్నా అధికం.

తానెక్కిన గరుడ వాహనం వెళితే అమ్మవారు వెనక బడిపోతుంది.

గరుత్మంతుడు స్వామితో ఇలా అంటాడు..

నేను అమ్మవారు ఎక్కిన హంస వాహనంకన్నా 

ముందుకి వెళ్లను.

తగిన వేగంతో వెళ్తూ హంసవాహనం వెనకాలే వెళతాను.

ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది.

అదేంటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడవాహనం ఎక్కినప్పుడు అది తేలికగావుండి కేవలం నలుగురు మనుషులు మోస్తే కదులుతుంది.

అలా ముందుకు వచ్చిన గరుడవాహనం ఆ తరువాత ఉన్న 5ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు జామితీయ పద్ధతిలో పెరుగుతుంది.

2 వ ప్రాకారాన్ని దాటుతున్న గరుడవాహనాన్ని 8మంది మోయాల్సుంటుంది.

3వ ప్రకారం దాటేటప్పుడు 16మంది మోయాల్సుంటుంది.4వ ప్రకారాన్ని దాటేటప్పుడు 32మంది మోయాల్సుంటుంది.

5 వ ప్రాకారాన్ని దాటే ముందు 64 మంది మాయాల్సుంటుంది.

5ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడవాహనం బరువు విపరీతంగా పెరిగిపోయు 120మంది మోయాల్సొస్తుంది. 

ప్రధానవీధుల్లోకొచ్చే సరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందు వెళుతూ వుండగా దాని వెనకాల 128మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూ వుంటుంది.

ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ వూరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతు ఉత్సవ విగ్రహంపైన చెమటలు కనిపిస్తాయి.

గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువు వుండి క్రమంగా పెంచుకుంటూ పోయేసరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు.

అన్నట్టు ఈ గరుత్మంతుని తమిళనాడులో వున్న ఈ క్షేత్రంలో కాలగారుడన్ అని పిలుస్తారు.

ఈ అద్భుతఊరేగింపు దృశ్యం సంవత్సరానికి 2సార్లు జరుగుతుంది.

మహాశక్తి వంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని తన ఆభరణాలుగా ఏవిధంగా ధరిస్తాడో తెలుసుకుందాం.

ఆదిశేషుడు – తన కంకణంగా

కర్కోటకుడు – తాను ధరించే పూలదండగా

పద్మనాభుడు – తన కుడిచెవి ఆభరణంగా

మహా పద్ముడు – ఎడమచేతి ఆభరణంగా

శంఖపాలుడు – తన కిరీటం ఆభరణంగా

గుళికుడు – కుడి చేయి గాజులాగా

తక్షకుడు – వడ్డాణంగా

వాసుకి – జంధ్యంగా

ఇక 9వ సర్పం..ఆయన యొక్క కంఠానికి అలంకరణగా చుట్టుకుని వుంటుంది.

🙏🔔🙏🔔🙏🔔

🔹 గ్యాస్ వినియోగదారులకు శుభవార్త 🔹*

*🔹 ఇక సెకన్లలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ కూడా చేయక్కర్లేదు. గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ఫోన్ కాల్ చేస్తున్నారా ? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఫోన్ చేయాల్సిన పని లేకుండానే సులభంగానే సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.*

*🔹ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కస్టమర్లకు వాట్సాప్ ద్వారానే సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. భారత్ గ్యాస్ సిలిండర్, ఇండేన్ గ్యాస్ సిలిండర్, హెచ్‌పీ గ్యాస్ ఇలా మీరు ఏ సిలిండర్ వాడుతున్నా కూడా వాట్సాప్ ద్వారా క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.*

*🔹 వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా మీ గ్యాస్ సిలిండర్ కంపెనీ నంబరును మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి. సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ అయిపోతుంది. మీకు మళ్లీ రిప్లే కూడా వస్తుంది.*

*🔹 భారత్ గ్యాస్ ఉపయోగించే వారు 1800224344  నెంబర్‌ను వారి మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి హాయ్ లేదా హెలో అని మెసేజ్ పెట్టాలి. తర్వాత మీకు రిప్లే వస్తుంది. తర్వాత మీరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.*

*🔹 అదే మీరు ఇండెన్ గ్యాస్ వాడితే. +917588888824 అనే నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ లోకి వెళ్లాలి. ఇప్పుడు రీఫిల్ బుకింగ్ అని మెసేజ్ పెట్టాలి. క్షణాల్లోనే మీ సిలిండర్ బుక్ అవుతుంది*.

*🔹హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ వాడే వారు +919222201122 నెంబర్ ద్వారా వాట్సాప్‌లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.* 

*🔹 ఇకపోతే వాట్సాప్ ప్రొఫైల్‌లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా చేయాలనే వివరాలు కూడా ఉంటాయి. వినియోగదారులు వాటిని ఫాలో అయితే సరిపోతుంది.*

*ఒక చిన్న గదిలో* *నాలుగు  మైనపు దీపాలు* *వెలుగుతూ ఉన్నాయి.* 

 *ఇంతలో పెద్దగా గాలి💨 రావడం  మొదలయింది.*  

*ప్రశాంతత అనే మైనం:- 

ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని  బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.* 

*ప్రేమ అనే మైనం:- కూడా 

ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను నేను* *ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.*   

*తెలివి అనే దీపం:- 

నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూఆ గాలికి ఆగిపోయింది.* 

 *నాలుగో దీపం మాత్రం:- 

నేను ఎలాగైనా ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి* *ఆరిపోకూడదు అని తన  వంతు ప్రయత్నం తాను చేసింది.   ఆ గాలిని ఎదిరించి వెలిగింది.*  

 *దీపాలు ఉన్న గదిలోకి  చిన్న పిల్లవాడు  వచ్చి అయ్యో మూడు  దీపాలు* *ఆరిపోయాయే అని బాధ పడ్డాడు.* 

 *బాధ పడుతున్న అబ్బాయిని  చూసి దీపం ఇలా చెప్పింది.* 

*బాధపడకు నేను ఉన్న కదా నా నుండి ఆ మూడు దీపాలు వెలిగించుకో*  *అన్నదట...* 

 *సంతోషంతో  ఆ పిల్లవాడు  ఆ నాలుగో దీపాన్ని  నీ పేరేంటి  అని అడిగాడు.* 

 *నా పేరు నమ్మకంఅని చెప్పింది... ఆ దీపం.* 


*అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటె చాలు  పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం*


🙏 *ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. 

ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.*


*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. 

నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...

ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..

మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.*


*ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!*


*రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా* *ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే!    రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.*

*పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"*

*రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా!* *ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"*

*రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!*


*పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.*. 

*కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...*


*కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి..  మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.*


 *ప్రతి ఒక్కరి కథా కంచికి చేరుతుంది. ఆలోపునే మనం మనుషులుగా ఎదగాలి* 



*ఒక చిన్న గదిలో* *నాలుగు  మైనపు దీపాలు* *వెలుగుతూ ఉన్నాయి.* 

 *ఇంతలో పెద్దగా గాలి💨 రావడం  మొదలయింది.*  

,...............

*ప్రశాంతత అనే మైనం:- 

ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని  బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.* 


*ప్రేమ అనే మైనం:- కూడా 

ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను నేను* *ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.*   


*తెలివి అనే దీపం:- 

నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూఆ గాలికి ఆగిపోయింది.* 


 *నాలుగో దీపం మాత్రం:- 

నేను ఎలాగైనా ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి* *ఆరిపోకూడదు అని తన  వంతు ప్రయత్నం తాను చేసింది.   ఆ గాలిని ఎదిరించి వెలిగింది.*  


 *దీపాలు ఉన్న గదిలోకి  చిన్న పిల్లవాడు  వచ్చి అయ్యో మూడు  దీపాలు* *ఆరిపోయాయే అని బాధ పడ్డాడు.* 


 *బాధ పడుతున్న అబ్బాయిని  చూసి దీపం ఇలా చెప్పింది.* 


*బాధపడకు నేను ఉన్న కదా నా నుండి ఆ మూడు దీపాలు వెలిగించుకో*  *అన్నదట...* 


 *సంతోషంతో  ఆ పిల్లవాడు  ఆ నాలుగో దీపాన్ని  నీ పేరేంటి  అని అడిగాడు.* 

 *నా పేరు నమ్మకంఅని చెప్పింది... ఆ దీపం.* 


*అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటె చాలు  పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం*


🙏 *ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. 

ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.*


*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. 

నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...

ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..

మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.*


*ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!*


*రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా* *ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే!    రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.*

*పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"*

*రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా!* *ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"*

*రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!*


*పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.*. 

*కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...*

*కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి..  మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.*

 *ప్రతి ఒక్కరి కథా కంచికి చేరుతుంది. ఆలోపునే మనం మనుషులుగా ఎదగాలి* 

,,....,...


ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సంభాషణ ఇలా సాగుతోంది... 

ఆమెనడిగాడు... మీది ఏ కులం?

ఆమె సమాధానం "మహిళ"గా చెప్పాలా "అమ్మ"గా చెప్పాలా? 

రెండిటినీ  కూర్చి చెప్పండి, అన్నాడతడు. 

పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పింది... "తల్లి కాగానే స్త్రీ కులాతీతురాలౌతుంది"!

అదెలా సాధ్యం! ఆశ్చర్యపోతూ అడిగాడతడు... 

ఆమె సమాధానం...  

తల్లి తన పిల్లల మలమూత్రాదులను శుభ్రపరచేటప్పుడు తల్లిది శూద్ర జాతి 

పిల్లలు పెద్దవాళ్ళైయ్యే తరుణంలో వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆమె క్షత్రియ వనిత 

పిల్లల ఎదుగుదలతోపాటు ఆమె కులం కూడా మారుతుంది. వారికి విలువలు నేర్పిస్తుంది, సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించి బ్రాహ్మణ వనిత అవుతుంది. 

చివరగా...   

పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చి సంపాదనపరులైన తరువాత, తల్లి వారికి ధనం యొక్క విలువను, ఆదా చేయడాన్ని నేర్పించి వైశ్య ధర్మాన్ని ఆచరిస్తుంది. 

ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారనుకుంటాను... స్త్రీ కులాతీతురాలని!

గౌరవంతో, వినమ్రతాభావంతో నిశ్చేష్టుడై అలా చూస్తుండిపోయాడతడు... 

మాతృమూర్తులందరికి అంకితం


ప్రతి నిత్యం మన జీవితాలని ఉత్సహంగా మలిచే అమ్మ కి🙏

,,............


*🔊ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు*


*🔶ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ పంపిణీ*


*🔷ముందుగల రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే వ్యాక్సిన్*


*🔶ఏ సెంటర్‌‌‌‌కు పోవాల్నో ముందే మెసేజ్ వస్తది*


*🔷గుర్తింపు కార్డు ఉంటేనే సెంటర్‌‌‌‌లోకి ఎంట్రీ*


*📜రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్*


*🍥హైదరాబాద్, వెలుగు:  దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ల పంపిణీకి ఏర్పాట్లు షురూ అయ్యాయి. పోలింగ్ సెంటర్ల తరహాలోనే వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీకి సంబంధించిన అన్ని విషయాలనూ వివరిస్తూ గైడ్ లైన్స్ జారీ చేసింది. తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు, ఆ తర్వాత రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్ల(పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఆర్మీ, హోంగార్డులు, జైళ్ల శాఖ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిబ్బంది)కు, మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 50 ఏండ్ల వయసు దాటిన వారికి, 50 ఏండ్ల కంటే తక్కువ వయసుండి ఇతర జబ్బులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది. వీరు దేశవ్యాప్తంగా27 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల్లోని వివరాల ఆధారంగా 50 ఏండ్లు దాటినవారిని గుర్తించి, వివరాలను సేకరించాలని చెప్పింది. ఈ మూడు కేటగిరీల వారికి కొవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించింది.*


*💥రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే..*


*🌀రిజిస్ర్టేషన్ సమయంలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని, నేరుగా సెంటర్ల వద్దకు వచ్చినవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఏదైనా నెగెటివ్ రియాక్షన్ వస్తే వెంటనే కొవిన్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలని చెప్పింది. వాళ్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందించేందుకు డాక్టర్లు, మెడికల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సిద్ధంగా ఉంచాలని వివరించింది.*


*💥ఒక సెషన్ లో వంద మందికే..*


*💠ఉదయం 9  నుంచి సాయంత్రం 5  వరకూ వ్యాక్సిన్ లు వేయాలని కేంద్రం సూచించింది. హెల్త్ స్టాఫ్​కు ప్రైమరీ హెల్త్ సెంటర్లు, దవాఖాన్లలోనే వ్యాక్సిన్ వేయాలని తెలిపింది. వీరి డేటాను ఇప్పటికే ఆరోగ్యశాఖ సేకరించింది. ఫ్రంట్ లైన్ వర్కర్ల డేటాను ఆయా శాఖల నుంచి సేకరించి, ఆరోగ్య సిబ్బంది రిజిస్ర్టేషన్ చేయనున్నారు. ఓటర్ లిస్ట్ ద్వారా వృద్ధులను, రోగులను గుర్తించనున్నారు. వీరికి వ్యాక్సిన్ వేయడానికి హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు, ఆఫీసులు, స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లను వాడుకోవచ్చని తెలిపింది. ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెయిటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెరిఫికేషన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ్యాక్సినేషన్ హాల్, వెయిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపల్సరీగా ఉండాలని చెప్పింది. ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వంద మందికి మాత్రమే వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయాల్సి ఉంటుంది. ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఒక వ్యాక్సినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నలుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లు ఉండాలి. వ్యాక్సినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డాక్టర్ లేదా నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లేదా ఇంజక్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించిన వారు ఎవరైనా ఉండొచ్చు. వీరికి ముందుగానే ఆరోగ్యశాఖ ట్రైనింగ్ ఇవ్వాలి. వ్యాక్సినేషన్ లో మొత్తం 23 డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల సిబ్బందికి డ్యూటీలు వేయాలని, ఏయే డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏయే పనులు చేయాలో గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్రం పేర్కొంది.*


*💥వ్యాక్సిన్ వేస్కోవాలంటే ఇదీ ప్రాసెస్*


*♦️వ్యాక్సిన్ కోసం ఆరోగ్యశాఖ వద్ద లేదా కొవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (www.cowin.gov.in ) వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.*


*♦️ఏయే వ్యాక్సిన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవరికి వ్యాక్సిన్ వేస్తారో ముందుగానే లబ్ధిదారులకు సమాచారం ఇస్తారు.*


*♦️ఉదయం 9 నుంచి సాయంత్రం 5 లోపు ఏదైనా ఒక గుర్తింపు కార్డు(ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓటర్ కార్డు వంటివి) తీసుకుని సూచించిన వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలి.*


*♦️వ్యాక్సినేషన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి ఆ కార్డు చూపించి, వెయిట్ చేయాలి.*


*♦️తర్వాత మరో ఆఫీసర్ వద్దకు వెళ్లి రిజిస్ర్టేషన్ చేసుకున్నట్టు వచ్చిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుర్తింపు కార్డు చూపాలి. ఆఫీసర్లు కోవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ర్టేషన్ వివరాలను వెరిఫై చేసిన తర్వాతే వ్యాక్సిన్ వేస్తారు.*


*♦️వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అరగంట పాటు అక్కడే ఉండాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే అక్కడున్న డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పాలి.*


*♦️ఈ ప్రక్రియ పూర్తయ్యాక వ్యాక్సిన్ వేసుకున్నట్టు కో–విన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసిన కార్డు ఇస్తారు. లబ్ధిదారు మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్ రూపంలో లింక్ వస్తుంది. ఇందులో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివన్నీ ఉంటాయి. అలాగే, సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు? ఎక్కడ వేస్తారు? అన్న సమాచారం కూడా ఉంటుంది. సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోస్ వ్యాక్సిన్*   *తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ* *కార్డు తప్పకుండా తీసుకురావాల్సి*

*ఉంటుంది.*