Thursday, 6 May 2021

 

May be an image of Lxmn Chry

 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక .. 07-05-2021
 -- ఆరోగ్యం -- ఆధ్యాత్మికం - ఆనందం
కవిత్వం - శుభము లే
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ  
మగువ మనసు వెన్న ముద్దగా మారున్   
తెగువ వలదు  కన్నె  మంచిగా కోరున్    
చిగురు పొగరు ఉన్న పంచు వయ్సస్సున్
వగరు చూపులు  ఎన్ని ఉన్న సర్దు చుండున్      
ఆభరణమే మాకు ఓర్పు అని చెప్పి బత్కున్  
నిబ్బరమే , నమ్మకమ్ము  అని తెల్పి బత్కున్   
శోభనమే  జీవితమ్ము  అని  తెల్పి బత్కున్       
శుభము లే  ప్రేమసొమ్ము అని  పల్కి బత్కున్  
మహిళ పై సహ సహకారమున్ను చూపి బత్కున్
మహిత పై  వినయపు హాసమున్ను  తెల్పి బత్కున్
సహన మే  కలిగియు  వేదమున్ను  తెల్పి బత్కున్
గృహము యే  పదిలపు భావమున్ను తెల్పి బత్కున్
మనసు పై సరియగు  వాదమున్ను  తెల్పి బత్కున్
మనువు పై శుభమగు  ఆశ చూపి  తెల్పి బత్కున్
తనువు   పై తనువును ఉంచి  మాయ తెల్పి బత్కున్
చినుకు  పై  అభినయ మంత చూపి తెల్పి బత్కున్
--(())--
ఖంగు :ధ్వని అనుకరణ
కంగు :చలించు చింత.:::: పై పద్యము
కంగు తిన్నది భర్త మార్పుకు గోల చేయక కాపురం
కంగు దగ్గియు మూతి తిప్పి యు గోప్య ముండియు గొప్పగా
కొంగు చాపక సిగ్గు చూపక కంగరమ్ముగ తిర్గుచూ
కంగు చూపుకు భర్త మారియు గమ్ము గుండియు చేరెనే
--(())-+
వక్క, ముక్క, తొక్క, చెక్క పద్యము
కాల మాయయు వక్కముక్కయును తలచి
కాల మక్కువ ముక్కయు గొంతు తడిపి
కాల గంధపు చెక్కలు గోప్యమవ్వు
కాల మంతయు తొక్కల గోల బతుకు
--(())--
చీపురు మీద పద్యం వ్రాయమంటే
చీపురే ఇక మూలనున్నను జాము జామున సర్వమూ
ఓపి కంతయు చూపి శుబ్రము ఓర్పు చూపితె ఇంటిలో
చూపు కందని దుమ్ము నంతయు యేరి వేసియు యోగమే
తాపి ధర్మము శుభ్ర మంతయు దైవమాయయు వల్లనే
--(())--
ఆశే చావని మనిషి చచ్చినట్లు కనబడ్డా  
కాలం మీరిన పనులు చచ్చినట్లు కనబడ్డా
ప్రపంచానికి ఒకడు చచ్చినట్లు కనబడ్డా
రోగం కారణ మయిన చచ్చినట్లు కరుణాయే  
సహాయము '. మతనికి లోకమ్మే చెప్పింది
వినాశము., సహనము బంధమ్మే చంపింది
సమానము., కలలుగ దైవమ్మే తెల్పింది     
నిజానికి., అతనికి ప్రపంచం చచ్చింది.
--(())--
హద్దు పద్దు వద్దు మొద్దు ఆధారముగా  
మత్తకోకిల    
పద్దులేనిది జీవితమ్మున పొద్దురానిది లేదులే
వద్దు పల్కులొ సర్దుకొమ్మని వేదవాక్కున చెప్పెలే
మొద్దు యైనను కార్యసిద్హికి యంత్రమవ్వును కష్టమే
హద్దులన్నియు సమ్మతమ్ముగ హావభావము తెల్పుటే
రక్ష,పక్ష, శిక్ష, భిక్ష ఆధారముగా  
మత్తకోకిల
పక్షమే ఉపవాసమే సమ పోషణే కధ లాయనే
భిక్షయే దొర కందునే విధి భావమే అని తల్చుటే
శిక్షయే ఇక చేసి నట్టిది శాప కాలము అవ్వుటే
రక్షణే కరు వాయె మౌనము రక్షగా బతుకవ్వుటే
వినోదభావమే వివాద రక్షనే సకాల సే
వనేత్ర శోధనే సహాయ మాత్రమే సమాన కా
లనేత్ర సాధనే మనస్సు భావమే ఉషోదయా  
క్షణాలు వెల్లువే విశాల విశ్వమే ప్రభోధమై  
నేటి సమస్యకు పురాణం పద్యాలు ........
మతమనగ నెల్లవారి సమ్మతమ?కాద?
సతమతము మౌన లక్ష్యమే అయిన కాని
అతి సుఖము బాధ యుక్తమే కనుక కాని
బతుకు టకు మార్గమవ్వునే మనసు దాన్ని
మతమనగ నెల్లవారి సమ్మతము ?కాద?
సుతులు సుకుమార సౌర్యమే సహజ మౌను
కతలు కల లాగ మారుటే వినయమౌను
మతమనగ నెల్లవారి సమ్మతము కాద?
వెతలు కళ తీర్చునే మనో మహిమ కద ?
అతివల మాటలు నమ్మిన
మతియేను పోవుట సుఖాల వలయమందు జరుగు
బతుకున సాగదు మతమన్న
మతమనగ నెల్లవారి సమ్మతము ?కాద?  
--(())--
మధురిమలు                   
నిందించడం తేలిక,
భరించడం కష్టమే
నీతులు పలుకు తేలిక,
ఆచరణలు కష్టమే
అబద్ధం పలుకు తేలిక,
నిజము పలుకు కష్టమే
విజయము పలుకు తేలిక
మాట నిలుపు కష్టమే
ఎక్కువ మరిగించితే
నీళ్లు కూడా ఆవిరి
భరిస్తు బాధ పెడితే
బంధాలన్ని  ఆవిరి
రోగానికి కానివారు
తిండికే అయినవారు
కష్టాలకు రానివారు
ఇష్టంకే తోడైనారు
కనికరమే లేనివారు
ఆప్తులము అనేటి వారు
మాట ముందుండేవారు
పనికి దూరంగుంటారు   
అప్పుల్లొ ఉంచేవారు
సహాయ పడనట్టివారు
అనారోగ్యమైన వారు
ఆసుపత్రికి రాలేరు
ఆలుబిడ్డలు  అయినవారు
అయిన రోగానికి రారు  
రోగాన్నీ పంచుకోరు
దనాన్ని పంచుకుంటారు
సహాయం పొందినవారు
సహకరించక ఉంటారు
వారు కార్చును కన్నీరు
ఎవరికీ పట్టని తీరు
నాకు రక్షణ దిక్కెవరు
మనసు నిద్రనే లేపరు
మౌన బాధను చూపారు
లోకంలొ ఎవరికి వారు
--(())--
సోయగములు
వృత్తి ప్రవృత్తియే జీవితం
క్రాంతి మనసు నందు
నీతియు నియమములన్ని
బ్రాంతి తొలగి ఉంచు
శాంతిని కల్పించి కదులటే  
నీతి రక్ష గుండు
కాలమంతయుసోయగమ్ములు
సిరులేల మణులేల విరులేల
కరుణ పలుకు చాలు
మెరుపులు పవనాల పిలుపులు
మరచి పలుకు లేల
పరమాత్మ లీలలతో నేను
చురుకు జూపగలను
హృదిలోని తృష్ణ లన్ మధురమే
 కనులకు నీరూపు కాన్కయే
కనికరము గ ఉండు
కనుచుండ గ సతము జయముయే
మనసు మమత పెరుగు
విని నంత వేగపరిచెదను
వినయ పూర్వకము గ
తనువు చూపుసోయగములు
--(())__
నీడలు
పుణ్యము పండిన
నాణ్యత పెరిగిన
ధన్యత కలిగిన
అనైక మనసున  రామకృష్ణ
మనుష్య జన్మము  
అనూహ్య దేహము
తనువుల దాహము
అణుకువ మోహము రామకృష్ణ
ఇంకను పండెను
మక్కువ గుండెను
ఎక్కువ కేగెను
తక్కువ  మాగెను రామకృష్ణ
దర్మము నిత్యము
మర్మము మోహము
కర్మయు  దాహము
నిర్మల మార్గము రామకృష్ణ
అనురక్తి కలుగు
అణుయుక్తి జరుగు
వినయమ్ము పెరుగు  
కనలేని మెఱుగు రామకృష్ణ
--(())--
సోయగములు
పగలులేవు పనులు ఎందుకో
సెగలు కక్కు చుండె
వెలుగులేని బతుకు ఎందుకో   
నలిగి పోయె జీవి  
చలిలోను వానలో టెండలో
అలసి పనులు చేసె  
నేడు కరోనాగ సోయగం
నడిచే మరలుఆగి అలసినా
బడుగు జీవి ఆగు
నడి సంద్రమున చిక్కిన పడవ
అడుగు పడక మునుగు
ఆడ బిడ్డల మాన ప్రాణాలు
మడుగునందు మునిగె
రోజులెన్నోతేలి సోయగం
పరుల కష్టం దోచె బతుకులు
పరువు దేవు డెఱుఁగు
మరిగిన హృదయపు వేదన
అరచి మొత్తు కున్న
పరులకేమియు తెలియని విధి
నరము ఉబ్బు చుండె
ఇకకరోనా ఇది సోయగం
--(())--
👌👌👌👌 నేను ద్రాక్ష పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను.
నేను   :    బాబు కిలో ఎంత...?
అతను :  *"కిలో 80 సర్।"*
పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।
నేను అడిగాను :  *" మరి వీటి ఖరీదెంత?"*
పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*
నేను అడిగా : "ఇంత తక్కువగాన..?
పండ్లతను   :    "సర్, అవి కూడా మంచివే..!!
కాని... *కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*
అప్పుడు నాకు అర్థమైంది... *సమాజము,సంఘము*  మరియు *కుటుంబము* నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।
దయ చేసి మీ *కుటుంబము లో ఉండండి.....
  ఈ జన్మకే....
ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...
ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...
ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు, అన్నా తమ్ముళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు, సన్నిహితులు...
ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!
మహా అయితే ఇంకో పదీ..పదిహేను, ఇరవై ..........సంవత్సరాలు !
కుటుంబము లో ఎవరు     తప్పు చేసినా  క్షమిద్దాం ,అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!
పోయాక ఫోటోను ప్రేమించే కన్నా,
ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న
బంధుత్వాలు  తెంచుకోవడం  నిముషం.
అదే  నిలుపుకోవాలంటే  ?
తము గడిపిన  భయంకర  అవస్థలు తమ
పిల్లలకు  రాకూడదని ,  తమ పిల్లలు  కూడా  నలుగురిలో ఉన్నతంగా  బ్రతకాలనే  తాపత్రయంతో
కన్నవాళ్ళు  తను  సామాన్య జీవితాన్ని  గడుపుతూ  ,
ఆస్థులు  కూడ బెట్టి  తమ పిల్లలకు  ఇస్తే ,
తమ  తల్లిదండ్రులు  బతికి  ఉండగానే  కొందరు
తమ  తల్లిదండ్రులు  కాలం  చేసాక  కొందరు
 వివిధ  రకాల  కారణాలతో   రక్త సంబంధీకులందరూ  శాశ్వతంగా   దూరమవుతూ ,
బ్రతికి   ఉండగా  మాట్లాడు కోకుండా ,  మొహాలు  కూడా
చూసుకోకుండా  తమ  జీవితాంతం  వరకు  ఒకరి నొకరు
ద్వేషించుకుంటూ , ఆ ద్వేషాలు  తమ  వారసత్వంగా
తమ  పిల్లలకు  కూడా  బదిలి చేస్తూ  ,  తన అశాంతితో
జీవిస్తూ  తన  వారిని  కూడా  అశాంతి పాలు  చేస్తున్నారు .
ఎవరి  కోసం  ? ఎందు  కోసం ?
దాని  వల్ల  ఒరిగే  ప్రయోజనము  ఏమిటి ?
జీవితాంతం   ఒక  రక్తం  పంచుకున్న  అన్న దమ్ములు ,
అక్క చెల్లెళ్ళు  .  అన్నా  చెల్లెళ్ళు  పరస్పరం
 అశాంతితో  ద్వేషించుకుంటూ ఒకరి నొకరు  చూడకుండా
జీవిస్తూ  శాశ్వతంగా  దూరమయి , ఇంటి లోని ఆనందాన్ని పంచుకోకుండా, వివాహాలకు
కూడా  పిల్చుకోకుండా ,  హాజరుకాకుండా ,
చివరకు  ఎవరో   ఒకరు  కాలం  చేసాక   తట్టుకోలేని
శోకతప్తులై  గుండెలు  బాదుకుని  కుమిలి  కుమిలి
విలపిస్తే  ఆ   చనిపోయిన  వారిని  తిరిగి  పొందగలమా?
ఆ   ఖాళీ  అయిన   స్థానాన్ని  ఎవరూ  భర్తీ  చేయలేరు.
కొంతమంది  తమ  తల్లిదండ్రులను  కూడా           ఈ  ఆస్థిపంపకాల అసంతృప్తితో  దూరం  చేసుకుంటున్నారు.
ఆ  వయసులో  కన్నవారు  పడే  వేదన వర్ణనాతీతం.
మరి  ఈ  సమస్య కు  పరిష్కారము  ?
  పంతాలు  పౌరుషాలు  ప్రక్కన  పెట్టి  అందరూ
కూర్చుని  సామరస్యంగా    ఆవేశాలకు  పోకుండా
మాట్లాడుకుని   పరిష్కరించుకుంటే  అభిమానాలు
కలకాలం  పరిమళిస్తూ   అనుబంధాలు  పెంపొందే
అవకాశం  ఉంటుందేమో  నని  నా  నమ్మకం .
దీనికి  కావల్సింది  సహనంగా  ఆలోచించడం
విచక్షణ  పట్టుదలలు  సడలించు కోవడం .
ఈ విషయములో పెద్దవారు చొరవ తీసుకోవాలి ...
ఓడిన వాడు  కోర్టులోనే  ఏడుస్తాడు
గెలిచిన వాడు  ఇంటికి  వెళ్ళి  ఏడుస్తాడు
రెండిటికీ  తేడా  ఏమీ  ఉండదు.
ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే🙏
--(())--
నేటి సమస్య పూరణ పద్యాలు  .........
బంగారము సాటివచ్చు మోహము గలదే   
శృంగారము సాటివచ్చు బేరము గలదే  
గోంగూరకు సాటి వచ్చు కూరయు గలదే
దొంగాటకు పోటి వచ్చు ఆటయు గలదే
 బొగ్గు లలొ కాల్చు మొక్కజొన్న బొగైనా రుచులు వేరు
మగ్గమున నేసిన ట్టి రుమాలైన నేతయు వేరు     
సిగ్గులతొ రంభ ఊగిన స్త్రీమతి మెఱుపు వేరు
మిర్చి, గోగోర గుంటూరు మించిన ఊరు ఏది
 చెంగున దూకేటి జింకయు
భగ్గున దూకేటి సింగము కలవరపరచెన్
దుంగలు మోసేటి ఏనుగు
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే
రంగస్థలి కైలాసపు
జంగమ దేవరను కనగ చవులూరింపన్
లింగోద్భవ కాలములో
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే
కంగారేలా..మనిషీ ?
బంగారము వంటి కూర వండిన..' భేష్ - భేష్ ' !
రంగారురుచియె సొంతము..
గోంగూరకుసాటివచ్చు కూరయు గలదే !? "
----
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
నేటి కవిత్వం - సర్వ విశ్వధాః!!
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విరి మల్లెలే నిత్య గంధం సతి సౌఖ్య వరప్రభ
సరాగ మాలిక ప్రేమ  నమస్తే  భవ్య మాయగా
సిరి నిచ్చెనే సత్య భావం  పతి విద్య వరప్రభ  
విశాల పాలనా యుక్తి  నమస్తే  నిత్య సేవగా  
గిరి దర్శనా భక్తి లక్ష్యం  ప్రతి ఒక్క వర ప్రభ
సమాన ఏలికా ముక్తి  నమస్తే సత్య లీలగా  
దరి చేరినా వారి కోర్కే విని తీర్చు వర ప్రభ
సహాయ సేవలే శక్తి నమస్తే  విద్య వాదిగా    
అరి భంజకా వీర రుద్రా హర  హాలా హల ప్రభ
సరోజ రాగమే భద్ర నమస్తే  రుద్ర సంహితా   
సరి మార్గమే వీర భద్రా  మది గోల మయ ప్రభ
 విశాల భావమే ప్రజ్ఞా  నమస్తే పార్వతీ పతీ  
కరివస్త్రవిభూషిన్ భోః గిరికన్యా వరప్రద !
మురారివందిత ! ప్రాజ్ఞ నమస్తే సర్వ విశ్వధాః!!!
--(())--
శివ సంకల్ప విహీనుడు
శివ పూజనములను జేసి శ్రేయము గోనునే
భువియే మెచ్చని శటునిన్
శివుడివిది మెచ్చుకొనును జెపుమా నాధా
లోక్ నీతి
విధేయుడు మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సాక్షి గా ఉంటూ,
వర్తమానంలో జీవించడమే సత్యం
భర్త గా ఉంటూ,
బాధ్యతా మానం భావించడమే నిత్యం
భార్య గా ఉంటూ, దాహమేతీర్చీ సేవించడమే భాగ్యం
ప్రేమ గా ఉంటూ,
పిల్లలే ‌తీర్పై ప్రేమించడమే గమ్యం
ధ్యానాన్ని మనం పట్టుకుంటే,
కాసేపు పట్టుకుని వదిలేస్తాము.
వేషాన్ని మనం వేసి ఉంటే,
కాసేపు నాట్యము నటన చేస్తాము
మోసాన్ని మనం చేసి ఉంటే,
కాసేపు భయ్యము దయయు చూప్తాము
సాస్త్రాన్ని నమ్మి శోభ నమ్మే,
కాసేపు ధైర్యము సుఖము చూస్తాము
ధ్యానం మనలను పట్టుకుంటే,  
అది మన అహాన్ని అంతం చేసే వరకూ వదలదు.
స్త్రీ యే మనలను పట్టుకుంటే,
అతి సుఖ అహాన్ని చూపే దోచే వరకు వదలదు
ప్రేమే మునులను పట్టుకుంటే,
సుఖ మణి అహాన్ని దాహం తీర్చే వరకు వదలదు
పుణ్యం మనలను పెట్టుకుంటే,
సహనము యెంచి ధర్మం న్యాయం కడకు వదలదు
--(())--
నేటి పద్యాలు
" ఇందువదనా..( భ జ స న గగ--14/9
శ్రీ చరిత మానసపు పుత్రి సమయత్రి
శ్రీ విషయ వాంచితము ధార్మిక సుభజ్ఞే  
శ్రీ వినయ వాంఛ పలుకే రతి  మురాళే  
శ్రీకృప సహాయ వదనం రుణము పొందే  
శ్రీ సుమసుధా సుగుణ గాత్ర సుమమంత్రి
శ్రీ సరసిజే ! విభవదాయిని ! మనోజ్ఞే !
శ్రీ చరణ పూజ లతలే  హర సుధా ళే
శ్రీ పద పిపాస మనసే జనని వందే
శ్రీ మధుమతీ ! మనసు ధాత్రి ! మనమైత్రి
శ్రీ మనసుయే చరిత రాగిణి రస జ్ఞే  
శ్రీ కరుణ కావ్య తలపే శివ విహాళే
శ్రీరమ సరోజ మెరుపే జనని వందే
----
శ్రీగిరిసుతే ! సుగతిదాత్రి ! భవహంత్రి ,
శ్రీ సరసిజే ! విభవదాయిని ! మనోజ్ఞే !
శ్రీపదకవిత్వవిభవే ! సితమరాళే  ,
శ్రీరుచి శశాంక వదనే ! జనని ! వందే !!!
--(())--
శుక్రవారములక్ష్మి  పూజలు శుభము చేర్చు
శనివార మహిమతో వెంకన్న శోభ చేర్చు
ఆదివారమున ఆదిత్యని అనుకరించు
సోమవారము శివ నామము సౌఖ్యమిచ్చు    
శనినిన్ను వెంటాడక నిజము సెప్పియు  బతుకు
శుక్ర వారము న స్త్రీ దేవత సౌఖ్యము పెంచును     
ఆది అంతము లేనట్టి ఆర్భాట మొద్దు
సొమ్మసిల్లక సోమవారము సరదాగ ఉండు
--(())--
నేటి కధ
"పిల్ల వాక్కు బ్రహ్మ వాక్కు "
ఇక కధ చదవండి
*ఒక స్కూల్లో  చిన్న పిల్లవాడు భోజనసమయంలో తన మిత్రులతో పాటు*
తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న
అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు.
మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు.
కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు.
ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని
ఉన్నాకూడా వాటిని కూడా తినేవాడు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని
ఎగతాళి చేసేవారు. " అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకు కూడా  
వదలకుండా తింటాడు" అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ ఉండేవాడు,
ఒకరోజు తన  మిత్రున్ని ఇలా అడిగాడు.
" నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా
  ఇంత చక్కగా తింటున్నావు కదా!  మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా
  నీకు బాధ అనిపించదా? "  దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం
ఇచ్చాడు.
" ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం బాధలేదు.
  ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా? అలా తినడం అన్నది
 నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం. అమ్మ ఉదయాన్నే
 లేచి నాకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది,
 వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి
తెస్తాడు. ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా నా భోజనంలో ఉంది.
అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!
అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు.
అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా! అందుకే నేను ఎవరు
నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను .అంతేకాదు ఎంతోమందికి
రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది. నా తల్లిదండ్రుల
పుణ్యమా అని. అమ్మ ఎప్పుడూ చెపుతుంది. ఆహారాన్ని వృధా చేయకూడదని "
అని చాలా చక్కగా చెప్పాడు.
అలాగే ఫంక్షన్లలో పెళ్లిళ్లలో ఆహారం ఎంత వృథా చేస్తున్నామో అందరికీ తెలుసు ఇది చిన్న పిల్లలు మాత్రమే నేర్చుకోవాల్సినది కాదు అందరూ నేర్చుకోవాలి పెద్దవాళ్లలో ఉంటే కదా చిన్న పిల్లలకు నేర్పుతారు
 అది ఇప్పుడు చదువుకున్న పెద్దవారిలో కూడా లేదు అందరూ తెలుసుకుని ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా మనలో మార్పు తెచ్చుకుందాం
0
2 Comments
Malireddi Veeraraghavulu
చాలా బాగుందండి
శుభ శుభోదయం
 ·









 


ప్రాంజలి ప్రభ .... 02-05-2021
 - ఆరోగ్యం - ఆధ్యాత్మికం ఆనందం
సీస పద్యము ..
జనులతో అప్పుల జూదము ఆడేను  
చులకన చేసియు జుట్టు పట్టె
అరచేతి బెల్లము  అరువవుగా ఇచ్చి
దోచేటి సలహాలు దగ్గరవ్వు
పలుకల నేర్పుతో  పల్లకి ఎక్కించి  
మనసును దోచేటి  మందు చెప్పు  
చేతికందినదియు చక్కగా  పొందియు   
లేదని అరిచేటి  వారు ఉండు
తేటగీతి
సిగ్గు ఎగ్గయు లేదునూ చింత లేదు
దోచి సిగ్గవిడిచియు శీ ధనము దోచె  
ఆశచూపియు రోగము అంట గట్టి
నంగ నాచిలా జూదపు నటన పుట్టె
**(())**
సోయగములు  
పాలకవర్గాలు పనులను
పాలు నీళ్లు కలుపు
పనులన్ని నత్తనడకలగు
కనులు చెమ్మ గలుగు
దయగల మేధావి కళలుగా
మాయ బయట పెట్టు   
శ్రమజీవుల బతుకు మారదు
అమిత ఉత్త్సాహము లేదును  
సమము యంత్ర మొచ్చె
శ్రామిక శక్తికి అడ్డుయే
భూమి బరువు పెరిగె  
నడకలు నాణ్యత లేవునూ
నడుచు యంత్ర మొచ్చె
మనిషిబదులు యంత్రములు చేయు  
యవ్వన వృద్ధకార్మికులుగా   
నవ్య మార్గ మయ్యె
సవ్యము లేకయే ఇప్పుడు
భవ్య కళలు లేవు
కొంతవిశ్రాంతియు కూర్మియు    
కొంత మార్పు కలుగు
కార్మిక శక్తికి అడ్డులే
--(())--
సీసము
ఆనతి కనుగొని ఆహార మోండెను
వడ్డన చేయుట వనితలొంతు
కొసరి వడ్డించింది కోమలంగాను లే
నడుమున గజ్జెలు నాట్య మాడె
నారగింపుడు తృప్తి తోను అడుగు చుండు
కనుసైగలు కదిలే గల్లు మనగ
వలువల కదలిక వచ్చింది కాబట్టి
కనువిందు శబ్దాలు గులకరింప
ఆటవెలది
నలుడు వండి నాడ వంటకం అంతయు
తినగ కడుపు నిండి తృప్తి గుంది
స్త్రీల హావ భావ వడ్డన అద్భుతం
మనసు శాంతి పొంది మెచ్చె శివుడు
--(())--
ऊँ!
----
"కుసుంభినీవృత్తః ( జ భ స జ గగ--14/9 )
----
సమాన భావపు తరుణా న వేద భావం
సుమారు మాలలు మనసాయె మోహ దేహం
సమర్ధ సద్గురు సహనమ్ము సేవ లక్ష్యం
విమోచనా భవ కళలే విశాల వైనం
సరోజలోచన విలసన్నవాంబుదాభా
మురప్రమర్దన ! జనమోహనాంగ ! స్వామీ
సురేంద్రపూజ్య ! నిగమసూక్తవేద్య ! దేవా
 కరీంద్ర రక్షక! శుభనామతత్త్వదాయీ !!!
--
ద్విపద ..మాలికా గీతం
కలలు రేపగనేల కలువ గుండి  !
పూబాల మనసున మనసును పంచు !
పలకవే చిలకగా నిలపవే జాన !  
శాంతిని కూర్చియు ప్రేమను పంచు !
కళలు చూపగనేల మనసుతో ఇపుడు !   
పూబంతి అనుచునే వత్తుట వలదు !
కలవవే మొలకగా మమతను పంచి  !
కాంతిని హాయిగా వేడుకగాను !
వలపు పండుగవేళ తలపుల లేల !   
ఓహీల  తనువుకు తాపము వలదు !  
కలతలా తగులునా పలుకుల ఏల  !
ఓబ్రాంతి  వదలవే నన్నును చూసి !
కనుల వెల్గులలోన నిజముయే తెల్పు!  
చూపాలి మగువలోని మనసు ఇపుడు  !
తనువుయే తపముగా తరుణికి వలదు !
సేవలే తలుచుటే  ఇప్పుడు ముద్దు  !      
కనుల నే మూసినా కరువాయె నిదుర !
కనగ లేనేలనో కలనొకటయిన !
ఓబ్రాంతి వదలవే సమయమ్ము నీది !
ఓ శాంతి నియ్యవే నడుమున యుండి !
మనమున నిలిచిన మగువ రూపమది !
చెణుకులు విసరుచు చిలిపిగ జూచు !
తనువున తపనేల తరుణమే ఇదియు !
అణువణువును దోచు సందేహ పడకు !
జాజుల నవ్వులా జాబిలి తాను !
తాపము రేపెడి తారక సుమ్మి !
గాజుల సవ్వడి ఆకలి తోను !
మల్లెల మాలతో ముంగిర వుండె !
కోపపు పలుకుల కోకిల యాయె !
పాపము మల్లెలు బాధల మునిగె !
తాపపు నటనలు తప్పవు ఇపుడు !
వేషము మార్చుట తప్పదు అపుడు!
వలపు వాగునతను విరిసిన కలువ !
తలపు వీడననుచు తగవులు నాతొ !
కళలను చూపియు మురిపించు మగువ !
మనసున వేడిని తగ్గించు తెగువ !
పలుకుల తేనెలు పరవశ మొసగ !
కలయిక మధురిమ కావ్యములల్లు !
చినుకుల జల్లులు ఆవేశ పడగ !
ఉరవడి చూపియు చల్లగా చేర్చు !
గజ్జెల ఘలఘల గుండెల మ్రోగ !
నెచ్చెలి నగవులు నిదుర నీయవుగ !
మద్దెల దరువులు ఉండనే ఉండు !
సర్దుకు పోవుటే సమయము నందు !
పచ్చని జంటకు పస్తులేల మరి !
విచ్చిన పున్నమి వెన్నెలేలనిక !
వెచ్చని కొగిలి నలుగుట కధలు !
మచ్చిక వెన్నెల పంచుకొనుటయు !
కనుల నే మూసినా కరువాయె నిదుర !
కనగ లేనేలనో కలనొకటయిన !
వనుకేల భయమేల సహజము ఇదియు !
సృష్టికి మూలము ప్రేమగా ఇదియు !
మనమున నిలిచిన మగువ రూపమది !
చెణుకులు విసరుచు చిలిపిగ జూచు !
తనువును తపముల తాళము ఇదియు !
తనివితీరములను దాటుట పనియు !
విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
--(())--
సోయగములు
నీడగా గొడుగుగా ఉంటాను
తోడు జతను నేను
మడుగులో పువ్వుగా ఉంటాను
అడుగు నీతొ ఉండు
పడగలా నీడగా ఉంటాను
మాడు నీడ గుండు
ఆడుతుసాగు సోయగములు
నీడగా నీకు నే నిలిచాను
తోడు నడచి వచ్చి
కాడిలా బరువును లాగకు
నడి వయసును కాదు
నాడిలా కలసియే ఉండాలి  
వేడి ఆట లొద్దు   
గుండెచప్పడు గ సోయగములు
కనుల లోన నిలిపి చూసితి
కనికరములు లేవు
తనువు అంతయు కళ్ళు ఉన్నాను
కలలు వీగి పోవు
మనసుకు మర్మము తెల్వదు   
చిన్న పెద్ద అడుగు
కనరాని చూపు సోయగములు
--(())--
నేటి సమస్యకు పురాణం పద్యాలు .....
ఇంకుల కల తీర్చి రాత మార్చు దెవరురా
జంకుయు మద మోహ మన్న లేని దెవరురా  
బింకము సుఖ శాంతి లేని భామ కలదురా
పంకజ ముఖి సీతవంటి భామ వలదురా!
వేకువ సుఖ సంతసమ్ము సేవ వలదురా
ఆకలి మన నేర్పు బట్టి తీర్పు కలదురా
చాకిరి మమకార మందు మాయ కలదురా
పంకజ ముఖి సీతవంటి భామ వలదురా!
చీకు చింతవలదు ఎపుడునూ
 తాకులే కలసి తినేటి సొగసును చూడరా
చిక్కులు తెలిసియు తాకురా
పంకజ ముఖి సీతవంటి భామ  వలదురా!
--(())--
సీ.
----
కార్మిక సోదర కళ్యాణ పర్వమ్ము
    నేఁడేయనిజగత్తు నిర్ణయంబు
కార్మికు లకిఁటమం గళమేది..విశ్వాన..?
    రహదారివాసమే మహదుపకృతి ??
పాలకవర్గాలు పనులనులాక్కొని
    వీథిలోపడవైచి వేడ్కఁజూడ
దయగలమేధావిదళమప్డు ముదమార
     ప్రతిభను గుర్తించి రాజుఁజేసె
గీ.
--
బాలతరుణవృద్ధజనులు చాల గలరు
కార్మికులుగ లోకమ్మున పేర్మిలేక
కొంతవిశ్రాంతి నిడవలె కూర్మిఁబంచి
వారినెల్లరు కనవలె భూరిమతిని !!! "
__(())--
సీస పద్యము ...
కంటిలో వెలుగులు కలకాల ముండును
కనతకు నెప్పియు కాన రాదు
కంటినీరు నిలవ కదలియు హృద్యమ్మ
చేరియు బాధయు జాడ్య మవ్వు
కన్ను రెపరెపలు కలకాల ముండియు
కన్నులు రక్షణ కామ్య తగును
కంటి పాపయు సర్వమును చూసి గ్రహించి
మనిషికి నడవడి  మౌన మవ్వు
తేటగీత
కనుల నల్లకలువరెప్ప కాపు కాసి
కంటి నీరుయు ఉడికిన కాటుకాపు
కల్ల చూపుల కలువలు కామితార్ధ
మిచ్చి ఆకర్ష మిచ్చియు ప్రేమచూపు
--(())---
సీస పద్యము ...
కామము మనసుకు గరళము లాంటిది  
గమ్యపు గోచరం క్రోధ మవ్వు
ఆవేశము కలిగి  ఆదుర్ద పెరిగేను  
మనసులోభ మోహమ్ము మనుగడవ్వు  
మదమువిజ్రుంభించి మాత్సర్యము మరచి
శకునిలా బుధ్ధికి శాప మొవ్వు  
పట్టిప పట్టుగ మనసుకు వీరంగ
మంతయు చూపుట  ప్రేమ కొరకు
తేటగీతి
సంయమనము పాటించి న సుఖముండు
వినయము వినమ్రత కలిగి ఓర్పు చూపు
సహజ ఓదార్పు చూపిన సౌమ్య మవ్వు
మనిషి బాగుంటె నడకకు ప్రేమ పుట్టు
**(())**
ప్రాఃజలి ప్రభ.... అంతర్జాల పత్రిక
సీస పద్యము .. ..
విశ్రాంతి సమయమే వీలుగ తల్లీతండ్రి
మనసు ప్రశాంతత పొందు చుండె   
ధీమాగ హాయిగ దర్జాగ ఉండేది
సుఖమును పంచేది స్నేహ మొకటి
రాజసం కలిగించి రమ్యత చెందును   
ఆలోచనల నిద్ర  హాయి గుండు
వచ్చిన బిడ్డలూ వారికి మర్యాద
అలసటల ను తీర్చి హాయి గుండు
తేటగీతి
అమ్మ విశ్రాంతి పొందాక  అలుపు తగ్గు
నాన్న ఆదమరిచి కలలు నడుమ నుండు
గురువు విద్యను బోదించి గుర్తు గుండు  
అందరూ శాంతి కొరకునే అరుగు దెంచు  
**(())**
సీస పద్యము .. ..
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విశ్రాంతి సమయమే వీలుగ తల్లీతండ్రి
మనసు ప్రశాంతత పొందు చుండె   
ధీమాగ హాయిగ దర్జాగ ఉండేది
సుఖమును పంచేది స్నేహ మొకటి
రాజసం కలిగించి రమ్యత చెందును   
ఆలోచనల నిద్ర  హాయి గుండు
వచ్చిన బిడ్డలూ వారికి మర్యాద
అలసటల ను తీర్చి హాయి గుండు
తేటగీతి
అమ్మ విశ్రాంతి పొందాక  అలుపు తగ్గు
నాన్న ఆదమరిచి కలలు నడుమ నుండు
గురువు విద్యను బోదించి గుర్తు గుండు  
అందరూ శాంతి కొరకునే అరుగు దెంచు  
**(())**
సీసపద్యములు
విశ్వాస మనునట్టి విజయమ్ము ఖచ్చితం     
చేరితే  రహస్యము జాగు గుండు        
స్నేహమ నేదియు  సేతులాగను ఉండు    
మంచి తనము తోను  పలుకు సాగు   
వినయ మనునదియే  విజయమ్ము ఖచ్చితం   
సుఖముగా బ్రతకుతూ  శాంతి గుండు           
విజయము కలిగేటి వైనపు ఓర్పుయు
ఓదార్పు కృషితోను  ఒడిసి పట్టు      
తేటగీతి
దయతొ సమసమాజ మనేటి  తలుపు తట్టు        
నిష్క కపటంతొ ఆత్మీయ నీడగుండు  
తల్లి తండ్రుల శ్రేయస్సు తీపి గుండు   
ప్రేమ పంచియు పొందేటి బ్రతుకు మాయ
--(())--       
సీస పద్యము
జనని గా సార్ధక జన్మను అందించి   
బిడ్డల మనసంత  నుండ గలుగు
జననిగా ధర్మాన్ని జాతికి అందించి   
క్రమ శిక్షణగపెంచు గమ్య మొవ్వు
జననిగా భర్తకు  చేదోడు వాదిగా  
కష్టములను తెల్ప కుంచ గలుగు
జననిగా భయమును తరిమేటి  ధైర్యము
ప్రేమతో శాంతిని పంచ గలుగు
తేటగీతి
సర్వ రక్షిత జననియే సహజ మవ్వు  
ధైర్య మిచ్చియు జననిగా ధర్మమవ్వు
మర్మ.మన్నది లేనిప్రే మలను నివ్వు
ధర్మ మార్గము బిడ్డల్ని త్రాసు గుంచు
***(())**
విధేయుడు : మల్లాప్రగఢ శ్రీదేవి రామకృష్ణ  

Wednesday, 5 May 2021

*

 No photo description available.

 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక ... 06-05-2021
 - ఆరోగ్యం - ఆధ్యాత్మికం -  ఆనందం
విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
वसंत तिलकः(వసంతతిలకః ).
శ్రీవత్సదేవ మనసా యువ శక్తి ఇమ్మున్
 శ్రీ లక్ష్మి పార్వతియు వాణి సమాశ్రితాత్మన్
 త్రై లక్ష్య సాధన ఏక పర భాష బోధ
శ్రీవేంకటేశ  తవపాదశరణ్యమీష్టే !!!!
శ్రీ ధర్మ తేజ విజయా పర యుక్తి ఇమ్మున్
శ్రీ శక్తి గౌరియు విద్యతి సమాశ్రితాత్మన్
త్రై కాల వర్తన మనో మయ సత్య బోధ
శ్రీశ్రీనివాస  తవపాదశరణ్యమీష్టే !!!!
శ్రీ భక్తి యుక్తియు ముక్తియు సమాశ్రితాత్మన్
శ్రీ రామ కర్మ జయమే మది ముక్తి ఇమ్మున్
త్రై వేని సంగమ తపో మయ నిత్య బోధ
శ్రీరామసీత తవపాదశరణ్యమీష్టే !!!!
 సత్వ రజో తమోగుణ  సమాశ్రితాత్మన్
త్రై లోక శక్తియు జపో మయ విశ్వ బోధ
శ్రీ కృష్ణ మర్మ మెమియో కళ భక్తి ఇమ్మున్
శ్రీ కృష్ణ రాధ తవపాదశరణ్యమీష్టే !!!!
 శ్రీసత్యదేవ సుజనావన భక్త గామిన్ ,
శ్రీ విష్ణు శంకర విరించి సమాశ్రితాత్మన్ !
త్రైమూర్తి భావ లసితాంతర వేష దేవ ,
శ్రీసత్యదేవ తవపాదశరణ్యమీష్టే !!!!
--(())--
నాది అనుచునే నడిచెడి నరుడు చూడు
నీది నాదిగ అనుభవ నీర జాక్షి
నాది నయనాల సంపద నటన సాగు
నీదు మనసున ప్రేమను నిజము చేయు
చక్ర  - ఉద్ధురమాలా వృత్తము
*
33 అక్షరములు
గణములు- భ,న,న-భ,న,న-భ,న,న-భ,య
ప్రాసయతులు- 2,11,20,29
కాలము మనది ఎపుడు కాల గతియు కదులును
కాలము తిరుగి కదులు కాల గుణ మాయే
కాల రుతువులు పఱుగు కాల గమనపు పుడమి        
కాలమదియు తలపులు కాల మున నేర్పెన్   
అమ్మ పలుకుల మెరుపు అమ్మ తలపుల పలుకు
అమ్మ రిపుగణములను అమ్మ మది మార్చున్
అమ్మ సిరులమలుపులు అమ్మ హృదయతలపులు
అమ్మ కరుణ మెఱుపులు అమ్మ హృదయమ్మున్       
నిత్యమునిజ పలుకులు నిత్యము ఒడిదుడుకులు
నిత్యము జప తపములు నిత్య మది రీతిన్  
నిత్య భయము అభయము నిత్య మనసు వినయము
నిత్య బతుకు చరితము నిత్య కళ మెచ్చున్
సర్వ గెలుపు విజయము సర్వ విషయ విదితము
సర్వ మలుపుల జయము సర్వ విధి మారున్
సర్వ మనుటయు కధలు సర్వ గుణముల కళలు
సర్వ కృపకు సుఖములు సర్వ భయ మాపున్
--(())--
నేటి సోయగాలు
నా నిద్ర నుండి మేల్కొల్పింది
నిన్ను నీవు మెలుకొ
నన్ను నమ్ముము అన్న నా తల్లి
మనసులో న నీవు
నన్ను దోబూచులాడించింది
మౌన మేమి వలదు
జ్ణాపకాలతొ‌ అమ్మ ఆత్రము
విన్నమాటను పట్టి ఉండకు
మన్నుతిన్న పాము
చిన్న వారిని ప్రేమించు  
కన్న వారి మనసు  
అన్న మాటనే నమ్మము
ఉన్న దంత మాయ  
చిన్న నాటి చెలిమి చూపుము
తనువు తాపత్రయము ఉంచు
అన్న పలుకు లోన
తన్నుగొనకయు చూడుము
తనదికాదనుకొని
తనివి తీరుగ కోర్కతీర్చుము
వినయ భావముంచు
మనదేశ రక్షణ మార్గమే
--(())--
ऊँ!
-----
"జలధరమాల..( మ భ స మ --12/9 ).. * పంచపాది *
-----
శ్రీసుబ్రహ్మణ్య ! శుభగరీతిన్ కావన్
శ్రీసూర్యాగ్నిప్రభలకు శీతమ్మౌగా
శ్రీశోభప్రాకటరుచిరేఖాదీప్తిన్
శ్రీసోమేశాత్మజ ! హిమశీతార్ద్రాభా ..
శ్రీశాక్తే యప్రద! కృపఁజేయన్ వేడ్దున్ !!! '
*****"""****
ప్రోత్సాహమ్మె వినయ విమో దమ్మే కాదా
తత్భావమ్మె తనువులు తాపమ్మే కాదా
తాత్పర్యంమ్మె సహనము సంతోషం కాదా
మంత్రోత్సా హ పలుకు మోహమ్మే కాదా
మాత్రోత్సమ్మె మనసులొ మాతృత్వం కాదా
****""""*****
మధుకరిక విలోమ వృత్తపు గణములు - మ/మ/న UU UU - UU III
9 బృహతి 449
==
ధర్మాధర్మమ్మే జీవితము
నిర్మాణాత్మమ్మే జీవితము
సర్వార్ధత్వమ్మే జీవితము
పర్మార్ధత్వమ్మే జీవితము  
మాయామర్మం సమ్మోహముగ
శ్రేయోధర్మం సామాన్యముగ
ప్రాయోచ్చిత్వం వేదాత్మకముగ
సయ్యోజ్యమ్మే సాంఘీకముగ  
ప్రేమే నన్నూ నిన్నూ నడిపె
కామ్యం మంతా దాస్యం గడిపె
సౌమ్యం వల్లే శాంతం గడిచె
ధర్మం వల్లే ధ్యానం గడిపె
దేవీ నిన్నే - దివ్యాభ్రమణి
భావాతీతా - భాషా జనని
కావంగా రా - కావ్యద్యుతిగఁ
ద్రోవల్ చూపన్ - రోచిష్మతీగ  
==
ప్రేమల్ నింపేన్  -  విద్యాకృతులు  
దానమ్ చేసెన్  - ధర్మాసృతులు
ప్రాణమ్ పోసెన్ - ప్రేమాకృతులు
 స్నేహమ్ చేసెన్ - స్నేహాకృతులు   
ఛాయల్ నిండెన్ - సంధ్యాకృతుల
మాయల్ నిండెన్ - మందస్వరుల
శ్రీయై రావా - చిత్తంబలర
వ్రాయంగా నే - వాసిన్ గవిత
==
నిద్రాదేవీ - నిద్రన్ గనుల
ముద్రించంగా - మోదమ్మగును
ఛిద్రమ్మౌ యీ - చిత్తమ్మలరు
భద్రమ్మై నా - బాధల్ తొలఁగు
==
ఎంద రెందరో మనసు ను ఎరిగివుండి
ఎదలొ బాధను ధైర్యము ఎరుక పరచి
కొందరు హితులు మిత్రులు కలలు తీర్చి
బంధము పదిల పరుచుటే ప్రేమ యగును
సమస్యా పూరకము
కుండా తెచ్చి యు పలికెను వండెను కూడున్
మండా మోపి ల కులుకుచు పిల్చెను భర్తన్
వండి వార్చితి తినమనె జాలిని జూపెన్
ముండా రమ్మని పిలిచెను ముద్దుల భార్యన్
కండ కావరబలుపుతొ మోండిగనుండెన్
అడ్డు లేదని పలుకులు బింకము చూపెన్
నడ్డి విర్గి న పరుషపు మాటను పల్కెన్
ముండా రమ్మని పిలిచెను ముద్దుల భార్యన్
 సందర్భాన్ని బట్టి మాత్రమే
పుట్టినప్పుడు పేరు ఉండదు.,  ఊపిరి తప్ప.
పెళ్లి అప్పుడు ఆశ పెర్గును., మాటలు తప్ప.
ప్రేమ ఇప్పుడు పెర్గు చుండును., మౌనము తప్ప.
బిడ్డ లేర్పడి బత్కుయే కల., కోపము తప్ప
పోయినప్పుడు ఊపిరి ఉండదు., పేరు తప్ప.
కాలతిప్పుడు మోనము ఉండదు., ఆశ తప్ప.
ప్రేమ పొందిన దాహము ఉండదు., మార్పు తప్ప
ఆశ మారిన దేహము ఉండదు., తృప్తి తప్ప
ఆధ్యాత్మిక అమృతవాహిని
గ్రంథాన్ని తెరిస్తే ఓ 'పుట' గా (అంశాత్మగా) ఉంటాను.
పాఠాన్ని మరిస్తే ఓ కధ గా ఉంటాను
వేదాన్ని పఠిస్తే ఓ యతి గా ఉంటాను
మార్గాన్ని తెలిస్తే ఓ మనిషై ఉంటాను
గ్రంథాన్ని మూస్తే గ్రంథంగా (పూర్ణాత్మగా) ఉంటాను.
మోహాన్ని మూస్తే మోనంగా ఉంటాను
దాహాన్ని మూస్తే తాపీగా ఉంటాను
ప్రేమల్నె మూస్తే బేధంగా ఉంటాను
సోయగములు
అల్లరి జేయుట ఎందుకు
అలక వలదు ఎపుడు
నల్లని తనువైన మనసున  
తెల్ల వెలుగు లుంచు  
చల్లని చూపులు ఉంచియు
మెల్ల మెల్లఁ గుండు  
పల్లము జారినా నీరులా
ఎల్లలు లేనట్టి హృదయము
మెల్లఁ మెల్ల గుండు
కల్లల మాటలు వలదులే
చిల్ల రణక కుండు  
గిల్లినా ఏడుపు దేనికీ
మల్ల నీకు బతుకు
గొల్లున మాటలు వలదులే
పిల్లన గ్రోవితో నాదమే
కలియు మనసు హాయి
కల్లోల మనసుయే ప్రేమగా
కళ కళములు సాగె
తలపులు ప్రేమలుగా సాగి  
కలవ రింత జరిగె
వలలోన జిక్కె సోయగములు
--(())--  
4. 3. 3. 4.  4.  3 . 3. మూత్రాబధ్ధము ..24
తనువే తపన చెంది యదలో సొదలా కదిలె లీల
మనసే నటన చెంది మనలో రగిలే మెదిలె లీల
వనుకై మరులు చెంది తనవే సెగలై మెరుపు లీల
చినుకై మధువు పొంది మనసే చిగురై మగని లీల
కళయే విలువ నిలిచి బతుకులు అతుకులు కాక ఉండు
కళలే మనసు పరుగు కలలు గ కదిలెను ఏల గుండు
కళగా బతుకు తెరువు వెనక గ వనికెను బుధ్ధి రాక
కలమే కధలు తెలిపి అలసియు మరుగున ఉండి పోయె
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
#  సస్పెండెడ్_కాఫీ అంటే మీకు  తెలుసా ..... ?
నార్వే లో ఒక  రెస్టారెంట్ కౌంటర్ లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ,
"Five coffee, two suspended" అంటూ
ఐదు కాఫీలకి  సరిపడ డబ్బు ఇస్తూ,
మూడు కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది.
మరొకరు వచ్చి,
 "Ten coffee, five suspended",
అని పదికి డబ్బు కట్టి, ఐదు కాఫీలు పట్టుకుపోయాడు.
అలాగే మరొకరు,
"Five meals, two suspended",
అని ఐదు భోజనాలకి డబ్బు కట్టి, మూడు భోజనం ప్లేట్లు తీసుకున్నారు.
ఇదేమిటో అర్థం కాలేదా......?
కాసేపటికి ఒక ముసలాయన,
చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి,
"Any suspended coffee?" అని అడిగాడు.
కౌంటర్ లో ఉన్న మహిళ, "Yes", అని,
వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది.
ఇంకొక కడు పేదవాడు వచ్చి "Any suspended Meals" అని అడిగిన వెంటనే ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో వేడి వేడి అన్నం పార్సెల్ మరియు నీళ్ళ బాటిల్ చితిలో పెట్టాడు.
పేదరికంలో ఉన్న ముక్కు  మొహం కూడా తెలియని మనుషులకు మనసుతో చేసే సహాయం అంటే ...... ఇదే మానవత్వం .
Suspended. దే పెట్టాలని కోకండి
మీకు సరిపడా ఉంచుకొని మిగతాది సహాయం చెయ్యండి మీరు చేసిన దానమే మీకు రక్ష
--(()) - -
0
0 Com

మృదు భాషణం


నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువలుగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు గలగలమంటూ శబ్దాలు చేస్తుంది. నీళ్లతో నిండుగా ఉన్నప్పుడు కుండ తొణికిసలాడదు. ఇలాంటి ఉపమానాలు మనిషికి ఎన్ని చెప్పినా మాట్లాడాలనుకున్నది అతడెప్పుడూ మాట్లాడటం మానడు. భావ వ్యక్తీకరణకోసం భగవంతుడు అతడికిచ్చిన మహత్తరమైన శక్తి- మాట. సృష్టిలో మరేజీవిలోనూ అది కనబడదు. మనసులోంచి వచ్చేదిలా ఆ మాట ఉండాలి. మంచి అభిప్రాయం అనిపించాలి. అందరినీ ఆలోచింపజేయాలి. ప్రయోజనం కలిగించగలదై ఉండాలి.
 

గీతలో భగవంతుడు మనిషికి ఆహ్లాదకరంగా మాట్లాడటం నేర్చుకొమ్మని చెబుతాడు. రెచ్చగొట్టి, ప్రలాపాలుగా అనిపించే మాటలు వద్దన్నాడు. అటువంటి మాటలు తనకు వినిపించిన తక్షణమే స్పందించవద్దన్నాడు. సత్యాన్ని ప్రతిబింబించేవి, ప్రియమైనవి, ఎదుటి వ్యక్తి హితాన్ని కోరేవిలా మాటలుండాలన్నాడు. ఆ విధంగా మాట్లాడగలవాడిని ‘వాక్‌ తపస్వి’ అన్నాడు. మృదుభాషణం మనుషులందరిలో  కనిపించాల్సిన లక్షణంగా శాస్త్రాలన్నీ గుర్తించాయి. వేదాంతి అరిస్టాటిల్‌ విశ్వసనీయత గోచరించేలా మాట్లాడితే అవి మానవ స్వభావాన్నే మార్చగలవంటాడు. పరస్పరం అవిశ్వాసం కలిగించే మాటలే మనుషులొకరినొకరు చూసి భయపడటానికి కారణ మన్నారు గాంధీజీ.

మనిషి తనను తాను సమర్థించుకునేందుకు మాట్లాడు తున్నానని ఎవరికీ అనిపించనీయ కూడదు. అదే ఉద్దేశమైతే అతడు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కొన్ని మాటలు వింటున్నప్పుడు మధురమైనవిగా, సందేశమేదో అందజేస్తున్నవిగా అనిపించినా అందులో అంతర్లీనంగా విషం, వ్యర్థాల వంటివి దాగి ఉండవచ్చు. అనుభవంతో కానీ అర్థంకాని విషయమది. ఆ విధంగా మాట్లాడే మనుషుల్ని నీతిచంద్రిక కర్త చిన్నయసూరి పయోముఖ విషకుంభాలన్నాడు.


ఆచితూచి మాట్లాడటం అందరికీ చేతకాని అభ్యాసం. మాట నేర్పు ఉన్నవారినే మహారాజులు రాయబారులుగా, మహామంత్రులుగా నియమించుకునేవారు. రామాయణంలో హనుమంతుడు, భారతంలో విదురుడు, సంజయుడు, కృష్ణరాయల అమాత్యుడు తిమ్మరుసు... అటువంటి మాటకారులే.
 

మంచి ముత్యాలనిపించే మాటలెప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. అవి పండితులకైనా పామరులకైనా శాశ్వతంగా వినపడతాయి. వ్యక్తులు, వ్యవస్థలను విమర్శించడమొక్కటే లక్ష్యం కాకుండా, ఛలోక్తులతో నర్మగర్భంగా, లోకజ్ఞానాన్ని ప్రస్ఫుటించే పొడుపు కథలు ఉపమానాలతో మాట్లాడిన మాటలు, ఆత్మవిమర్శకు అవకాశమివ్వటమే కాక, కాలపరీక్షకు సైతం నిలబడతాయి. శబ్దాడంబరంతో పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకుంటే పొరపాటే అవుతుంది. వాగ్ధాటితో నిజాన్ని వక్రీకరించేవారు వక్తలనిపించుకోలేరు. నిజాన్ని క్రమబద్ధీకరించేందుకు చెప్పేవైనప్పుడు మాటలు వ్యక్తిత్వానికి వన్నెతెస్తాయి.
భర్తృహరి ‘వాగ్భూషణమే సుభూషణం’ అని నిర్ద్వంద్వంగా చెబుతాడు.
మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకపోవటమూ మహాపరాధమే. ధృతరాష్ట్రుడు అవసరమైనప్పుడు నోరు మెదపకుండా ఉండటం మహాభారత యుద్ధానికి ముఖ్యకారణమని విశ్లేషకుల అభిప్రాయం.
 

వాక్‌ స్వాతంత్య్రంతో మనిషికి వచ్చే స్వతంత్రం ప్రత్యేకమైనదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికే అది ఉన్నదని మనుషులు గ్రహించాలి. మాటకు మంత్రానికుండే ప్రభావం ఉంటుంది. అది వరమిచ్చేదిలా ఉండాలి కానీ శాపమిచ్చేలా ఉండకూడదు. మనుషులను కలపాలి కానీ విడదీయకూడదు. ఆ గ్రహింపు ఉంటే మనుషులంతా మంత్రద్రష్టలవుతారు!

Tuesday, 4 May 2021

May be an image of 1 person

 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక. 05-05-2021
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
 

సోయగాలు.. కొబ్బరి
 

దాహము తీర్చుకొబ్బరి నీళ్ళు
దేహ శాంతి కొరకు
మోహము మార్చు కొబ్బరి నీళ్లు
అహము తుంచి వేయు
సహనము ఉంచు కొబ్బరి నీళ్లు
స్నేహ మవ్వు చుండు
లేలేత కొబ్బరి రుచివేరు
 

కొబ్బరి పాయసం రుచిలోన
పంబ రేగు చుండు
కొబ్బరి అన్నము తిన్నాక
ఉబ్బ సముయు పెరుగు
కొబ్బరి పచ్చడి పెళ్ళిలో
గబ్బు పట్టకుండు
కొబ్బరి మూడు కళ్ళ మహిమ
 

కొబ్బరి మట్టల పందిరి
శుభము కలుగును అని
కొబ్బరి యీనెలు బొమ్మలు
ఉబుకు వయసు చేష్ట
కొబ్బరి పాలు ఆరోగ్యము
శోభ పెంచు చుండు
కొబ్బరి పీచు పానుపుగనుు
 

--(())--


ఉద్ధురమాలవృత్తము చక్రము -
==
సూత్రము - త్రిర్భననముపరి చ వి-దుర్భయుతయగణమవ-
నేర్భవతి లలితపద-గర్భమిహ చక్రే - జయకీర్తి ఛందోనుశాసనము
లయగ్రాహిలో సరి భలములు (UIII) ఇందులో నలలములు (IIIII).
నడక - ఖండగతి (ఐదు మాత్రలు)
==
చక్ర - (భ/న/న)3/భ/య UIII IIIII - UIII IIIII - UIII IIIII - UIII UU (ప్రాసయతి)
==
మందిరము గగన మట - మందిరము వసుధ నట
మందిరము రజని నట - మందిరము వెల్గే
మందిరము శశి వెలుగు - మందిరము నిశి ఘడియ
మందిరము చిరుదివెల - మందిరము నీడే
వేగ పరుగులు జలము - వేగ పరుగు కిరణము   
వేగ తరువుకు లతలు - వేగము యె నష్టం
అందమగు పలుకులు - అందమగు చినుకులు
అందమగు కులుకులు - అందములుచిందే
పూల లొ ఘుమఘుమలు - పూలలొ రకరకములు  
పూలలొ పురుగుపరుగు  -  పులువికసించే
కాలములు జరుగుతునె కాలపు చరితములగు
గోళమువలె తిరుగును గొళ్లుమని  సాగే
నీలమగు గగనమున మేళముల చలనములు
నేలలొ ఘుమ ఘుమలుగ నెల్లరకు పెర్గే
గాలిలొ గమకములుగ గోల లగుట చరితము
చాల సొబగొసగునుట - అల్లికల సొంపై     
తెల్పుల మధురిమలుగ - వేల్పుల సరిగమలుగ   
కాల్పులు ఎకసెగలుగఁ  -  గ్రోలుచును సోంపై
తమవిధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
--(())--
 


 

ఆధారము - వృత్తజాతి సముచ్చయము
ఇతర నామములు - జగత్ప్రముదితా, ధీరలలితా, లలితా, మహిషీ
==
ప్రముదితా - భ/ర/న/ర/న/గ UII UI UIII - UIU IIIU
16 అష్టి 30167
ప్రాణము ఉంది కాలమిది - మానమే మనసితా
మోనము వద్దు దాహమిది - మార్గమే వినశితా
మైనము లాగ కర్గునిది - పాకమేను సఖీ
వైనము చూపి తెల్పునిది - విద్యయే వినుసుతా
 

రాముడు సత్యమే పలుకు - రాధ సత్యము కదా
భీముడు సత్యమే పలుకు - కర్ణ సత్యము కదా
సోముడు వెన్నెలను కురువు - శోభ నింపును కదా
కాముడు నిత్యమూ కులుకు - కామితార్దము కదా
 

దేహములోని తృప్తియును - దేహి యంచనె సఖీ
దాహము తీర్చుటే యుగము - ధర్మ మవ్వును సఖీ    
వాహిని వోలె దాహమిది - పారు చుండెను సఖీ
ఉహల కందకుంటివియు - ఊయలేలను సఖీ
 

ఎందుకు కోపమైతివియు - నిట్టు లుంటివి సఖీ  
ముందుగ సేవచే సితిని  - నింద లెందుకు సఖీ
పొందుకు ముందరొచ్చితిని - నీకు సమ్ముగనుయే
విందుకు తొందరే అవును - యిద్ది నీదుసుఖమే
 

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
==
ఊహల కంద కుంటివిట - నోజగత్ప్రముదితా
వాహినివోలె ప్రేమ యిది - పారుచుండె ముదితా
దాహము దీర్చ వేగముగ - దాపు రమ్ము కలికీ
దేహములోని ప్రత్యణువు - దేహి యంచనె సకీ
==
రాముఁడు సత్యమే పలుకు - రాదసత్యము గదా
భీముఁడు భీషణుండరికి - విక్రమార్కుఁడు సదా
సోముఁడు వెన్నెలన్ గురియు - శోభ నింపు వరమై
నామది నందమై నిలిచె - నాప్రియుండు స్థిరమై
==
ఎందుకు నీవు కోపమున - నిట్టులుంటివి చెలీ
ఎందుకు నీవు తాపముల - నిట్టులిచ్చితివి సకీ
ఎందుకు నీవు చూడవిట - నిట్టులుండ సరియా
ఎందుకు నీవు మౌనవతి - యిద్ది నీదు మురియా
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
నేటి సమస్యా పూరణలు   
 

మైనమేదైనా కర్గు నొక్కటే
మీన వేషాల్నే చేయనొక్కటే
మానరోగాల్నే రక్షనొక్కటే
జన్మమేదైనా ధర్మమొక్కటే
భర్తగా సేవ చేసిననుఁ భారము బోధనతోను దప్పునే
భార్యగా ప్రేమ చూపినను బాధ్యత భావముతోను దప్పునే  
కార్యము ఏది చెప్పిననుఁ కక్కని ప్రార్ధనతోను దప్పునే
కర్ణుని మేన ప్రాణములు కల్గిన పార్థుని చావు దప్పునే
--(())--
 

సోయగములు
కన్నీళ్ళు కనిపించు చుండేను
ఎన్ని నాళ్ళ ఓర్పు
మన్నన గుర్తింపు లేకనే
మన్ను కమ్మి ఉన్న
నిన్నెవరు పలక రించరు
నిన్ను గాజు అనియు
అన్నెము పున్నెము ఎరుగకే
నేర్చింది వాడదు ఎండదు
 

ఆరితేరిఉన్న
పేరులెన్ని పలికినా ఆత్మ
మారకుండఉండు
సుడిగాలిఅయిన నూ వచ్చినా
తడి తగలని విద్య
జన్మమేదైనధర్మమొక్కటే  
ఆశల ఆకులు రాలేను  

  
ఆశ కర్ద మేది
పాశము బంధము అయ్యేను
వీశ మెత్తు లేదు  
జ్ఞానానికి కొల మానం లేదు
జ్ఞాన సూన్యమైన
కాలమే తెల్పుసోయగములు
--(())--
*కుక్కని 🐕 తప్పించ బోయి*
*వెంకట్ బైక్🏍️ కంట్రోల్ తప్పి*
*సైడు కాలువలో పడ్డాడు*
*కష్టపడి బైటికి చేరాడు*
*అటుగా వస్తున్న ఓ అందమైన అమ్మాయి💃🏻 కారు🚘 ఆపి దగ్గర కొచ్చింది.*
*బాగానే వుందా? ఏదైనా ప్రోబ్లమా? అని అడిగింది.*
*లేదు..లేదు..నేను బాగానే వున్నట్టున్నాను. అన్నాడు వెంకట్*
*పరవా లేదు !! రండి.. చెక్ చే‌స్తా !!. మా ఇల్లు🏠 ఇక్కడికి చాలా దగ్గర,.." అందామె.*
*" థేంక్యూ !! కానీ మా ఆవిడకి🙅🏻‍♀️ ఇష్టం వుండదు." అన్నాడతను.*
*"మరోలా అనుకోకండి.  నేను నర్స్ 🤦🏻‍♀️ను. ఏవైనా దెబ్బలు తగిలి వుంటే చూసి ట్రీట్ చేస్తాను. అనుకోడానికేముంది.?" అందామె.*
*ఆమె చాలా అందంగా వుంది.*
*వెంకట్  ' నో ' అనలేక పోయేడు. అయినా అన్నాడు.. మా ఆవిడ అస్సలు ఇష్టపడదు..నేనిలా చెయ్యడం.!*
*అయినా ఆమెను చూస్తూ ఏమీ అనలేక, ఆమె ఇంటికి వెళ్ళారు. చెక్ చేసి పెద్ద ప్రోబ్లమ్స్ యేమీ లేవని కన్ఫర్మ్ చేసిందామె.*
*ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాడు. రెండు రౌండ్స్ అయ్యేక "  మా ఆవిడ ఖచ్చితంగా ఫీలవుతుంది. నేను వెళ్తా.!!" అన్నాడతను.*
*సిల్లీగా వుంది మీరుచెప్పేది.. అసలు ఆవిడ కెలా తెలుస్తుంది ? ఆవిడ ఇంటి దగ్గర వుంటుంది కదా అందామే*
*కాదు. ఆవిడింకా కాలువలోనే వుంది అన్నాడు వెంకట్*
తేటగీతి..కన్ను
మన్ను తిన్నట్టి ‌‌కన్నుగా మోన మొన్న
 కన్ను కన్నీరు కార్చిన కానరాని
వెన్ను కదిలినా కన్నుల వైన మంత
నన్ను వదలక కన్నుయే నన్ను నమ్మె....1
కన్న పుత్రుని కన్నునా కాన లేను
కన్న మమకార కన్నుయై కనబడునులె
కన్న కన్నుయే కన్నీరు కార్చి ఉన్న
కానలేనట్టి కన్నుగా కన్ను మూసె
సోయగములు
కాలము కదులుచూ ఉండును
కలలు మారుచుండు
వేలము జరుగుచూ ఉండును  
గాల మవ్వుచుండు
గోలలు పెరుగుచూ ఉండును
గోళ మవ్వుచుండు
కల్లోలపుమనిషి బతుకులో   
ఆకలి పెరుగుచూ ఉండును
రూక లేక ఉండు
వాకిలి తెరిచియే ఉండును
కాకి కూడ రాదు
చాకిరి పెరుగుచూ ఉండును
బాకి మార కుండు
కల్లోలపుమనిషి బతుకులో   
విజయము ఎప్పుడు నీవెంట
పూజ్య బావ ముంచు
నిజమును తెలిపేటి బతుకున
ఆజ్య మవ్వ కుండు
నీజాతి గౌరవము నిలిపి  
నిజము తెలుపు చుండు  
వాజమ్మ లాగ ఉండకుములే
--(())--
నేటి సమస్యను పూరణ ........
బ్రహ్మచారికి పెండ్లిపై భ్రా0తి గలిగె
స్నేహ మన్నది నిత్యమూ సేతు వగును
సహన మన్నది బతుకుకు సేతు వగును
బ్రహ్మ రాతలు అనుభవ బంధ మగును
బ్రహ్మచారికి పెండ్లిపై భ్రా0తి గలిగె
సత్య వాదికి దారియే ధర్మ మగును
నిత్య బుద్ధికి బోధలే బంధ మగును
బద్ద కానికి బంధనే శ్రావ్య మగును      
బ్రహ్మచారికి పెండ్లిపై భ్రా0తి గలిగె
అహమ్ము విదిలించు చూడుము
సహనము నిత్యమూ సుఖాల మదిలోన మార్గము
స్నేహపు పలుకులు చూడూ
బ్రహ్మచారికి పెండ్లిపై భ్రా0తి గలిగె
--(())--
తేటగీతి పద్యాలు ... మౌనం
 మౌనమే జీవి తానికి పరమ మిత్ర
మౌనముగను ఆత్మ బలము మెరుపు వచ్చు
మౌనముయు అతీంద్రియ ముక్తిని చ్చు
మౌనమేసుఖాన్ని అనుభవమ్ము నిచ్చు
 మౌన శక్తియుక్తులతొ ఉపాయమవ్వు
మౌన మేకాగ్రత పెరిగి మాయ మాపు
మౌన భక్తితో అసలుకు ప్రీతి పెంచు
మౌనమే మాన రక్షణ మతిగ ఉండు
 మౌనము అనగా వ్యర్ధము మరియు మెరుపు
మౌనమే సంకల్పముగా ను మనసుతో ను
మౌనశక్తి మానసిక ప్రభావ మువ్వ
మౌన మే శరీరం మీద పనియె చేయు
మౌనముయె సృష్టి స్థితి లయ ప్రభావ ముండు
మౌనముయె శ్రేష్ట సంకల్ప మగుట జరుగు
మౌనముయె ఇష్ట మగుటకు మైక మవ్వు
మౌనముతో కష్ట నష్టాలు పారిపోవు
సీస పద్యము
సత్యమనసు తెల్పి  సందర్బమునుతెల్పి
దైవమునకు తెల్పె దారి లేక
నిత్య పత్యము చేసి నిలకడ మనసుతో
నామము పఠనము నమ్మి చేయు  
నిత్య పనులనేవి నమ్రత తొ తెలిపి  
బుధ్ధితో పూజలు బతుకు కొరకు
నిత్య నడకలను  నరకము అయినను
దైవదర్శనములు  దారి కొరకు
తేటగీతి
కలత చెందియు ప్రార్ధించు కోరుచుంటి
కాస్త బద్దకమును మాపి కాపు కాయు
కాస్త ఓపిక తో అర్చనలలు చెసితి
వేంకటేశ్వర మమ్ముకాపాడు దేవ
**(())**(
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
చిన్న నాటి కధ
చిన్నతనం అంటే   షుమారు 40 సంవత్సరాలు వెనక్కి  వెడితే ---
ఆ రోజుల్లో  గ్యాస్  లేదు .
వంటంతా కుంపటి , పొట్టు పొయ్యి , కట్టెల మీదే చేసేవారు .
వేడి నీళ్ళకు గీజర్ లు ఉండేవి కావు.
దొడ్లో వెనుక  వైపు  ఇటుకలు పేర్చి  దాని మీద డేగిశా పెట్టి
కొబ్బరి డొప్పలు , కొబ్బరి  మట్టలు  వేసి పొయ్యి  రాజేసి స్నానానికి నీళ్ళు కాచుకునేవారు .
చాలా గ్రామాలకు  కరెంటు సదుపాయం కూడా  ఉండేది కాదు .
సాయంత్రం నాలుగు అయ్యేసరికి  లాంతరు , చిమ్నీలకు  ముందు రోజు పట్టిన మసి  ముగ్గుతో శుభ్రంగా  తుడిచి , వత్తులు  సరి చేసి , వాటి నిండా  కిరోసిన్  పోసి  చీకటి పడక ముందే  వెలిగించటానికి  సిద్ధం చేసుకునేవారు .
మాకు ఊహ తెలిసే నాటికి కరెంటు ఉన్నా  రాత్రి పూట  ప్రైవేటుకు  వెళ్ళే సమయంలో  లాంతరులు పట్టుకు వెళ్ళి  అక్కడ వెలిగించి  ఆ వెలుగులోనే  చదువు కునే వాళ్ళం.
వేసవి కాలం  పరీక్షల సమయంలో మేడ  మీదకు వెళ్ళి చదువుకోవాలనుకునే సమయంలో  మేడ మీద కరెంటు  ఉండేది కాదు .
లాంతరు వెలిగించి  మేడ మీదకు పట్టుకు వెళ్ళి ఆ దీపపు వెలుగులోనే  చదువుకునే వాళ్ళం.
ఈ రోజుల్లో  AC  లు , గది గదికి  ఫానులు , కరెంటు పోతే Invertor లు .
ఈ సదుపాయాలు ఆ రోజుల్లో  ఎక్కడవి ?
శివరాత్రికి  ముందే డాబా మీదకు వెళ్ళి పడుకునే వాళ్ళం.
దాదాపుగా  దసరా  వరకు  మేడ మీదే పడకలు .
ఇప్పటిలా  ఒకరి మీద ఒకరు పడి పోతున్నట్లు  ఆనించేసి ఇళ్ళు కట్టే వారు కాదు.
అపార్ట్ మెంట్  కల్చర్  ఆ రోజుల్లో  లేదు .
దాదాపుగా  అన్నీ పెంకుటిళ్ళు .
మండువా లోగిలి ఇళ్ళు .
అక్కడక్కడ  కలిగిన వాళ్ళకు మాత్రమే ఉండే డాబాలు , రెండతస్థుల మేడలు .
ఇక మేడ మీదకు వెళ్ళి  చాప దిండు వేసుకుని  పడుకుంటే  ప్రాణం ఎటు పోయేదో ?
ప్రతి ఇళ్ళల్లోనూ  చుట్టూరా కొబ్బరి చెట్లు , అరటి చెట్లు ,రకరకాల పూలు మరియు పళ్ళ చెట్లు ఉండేవి .
వాడుకున్న నీళ్ళన్నీ మొక్కల లోకి  వదిలేవారు.
మొక్కలన్నీ ఆ వాడిన నీరు పీల్చుకుని , మరి ప్రత్యేకంగా  నీరు పోయవలసిన అవసరం లేకుండా  ఏపుగా  ఎదిగేవి .
మురుగు లేదు కాబట్టి  దోమలు ఉండేవి కావు.
ఇంక  ఆ చెట్ల నుండి  వీచే  కమ్మని గాలికి  నిద్రపోతున్న ప్రాణం ఎటు
పోయేదో , ఉదయాన సూర్య భగ వానుడు  తన వేడి  వాడి కిరణాలతో చుర్రు చుర్రు మని పించే దాకా  మెలుకువ వచ్చేది కాదు .
ఈ రోజుల్లో  దోమలకు , వాటి వల్ల వచ్చే రోగాలకు  భయపడి , కిటికీలన్నీ తలుపులతో సహా మూసుకుని , Jet లు , All Out లు వెలిగించి ,ఫాన్ మరియు AC కూడా  వేసుకుని  ఆ పొగ మరియు ఈ AC తో  ఉక్కిరిబిక్కిరై  ముక్కులు మూసుకు పోయి , ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ కాలుష్యాల గాలులు పీల్చడం వలన , తల అంతా పట్టుకు పోయి  ఉదయాన్నే ఏ బకరా దొరుకుతాడా  ఎవడి మీద విరుచుకుపోదామా ? అనే  రీతిన   చికాకుగా తయారవుతున్నాము.
ఇంక  భోజనాల విషయం .
కలిగిన వాళ్ళిళ్ళల్లోనే ఉదయాన కాఫీలు , టిఫిన్లు .
అదీ  ఇంటి  యజమాని  యజమానురాలు మాత్రమే  తీసుకునే వారు .
మిగిలిన  వాళ్ళందరికీ  రాత్రి  మిగిలిన చద్దన్నాలు , తర్వాణి  అన్నాలే .
అమ్మమ్మ కాని , బామ్మ కాని  వేసవి శలవులకు వచ్చిన పిల్లలందరినీ  తమ చుట్టూ  కూర్చో పెట్టుకుని , మధ్యలో పెద్ద కంచం పెట్టుకుని ఆ చద్దన్నంలో కొత్తగా  పెట్టిన కొత్తావకాయ బాగా నెయ్యి వేసి కలిపి  ముద్దలు  పెట్టేవారు .
తర్వాత రాత్రి మిగిలిన చారు కాని పులుసు కానీ రాచిప్ప లోనుండి  తీసి  చద్దన్నం లో కలిపి  అందరికీ  ముద్దలు పెట్టేవారు .
అప్పుడు  దాదాపు  అందరిళ్ళల్లో ఆవు ఉండేది .
అందరికీ  సరిపడేలా  శేరున్నర , రెండు శేర్లు పాలు ఇచ్చేది .
వంటంతా అయిపోయాక బొగ్గుల మంట బాగా తగ్గాక మట్టి కుండలో  పాలు పోసి  సన్నని మంటన  ఎర్రగా  దళసరిగా  తొరక కట్టేలా పాలు కాచి , పళ్ళెంలో నీళ్ళు పోసి  బాగా కాచిన పాలకుండ అందులో పెట్టి , పాలు  తోడు వేయటానికి అనువుగా ఉన్న  వేడిలో  పెరుగు బిళ్ళ అందులో వేసి  తోడు పెట్టేవారు .
ఉదయాని కల్లా  ఆ పెరుగు గట్టిగా  జున్ను ముక్కలా తోడు కునేది .
ఉదయాన్నే  ఒక పొడవాటి  కర్రకు పెరుగు చిలికే కవ్వం కట్టి  కొద్ది నీళ్ళు పోసి  కవ్వంతో వెన్న చిలికే వారు .
దాదాపుగా  సవాశేరు అంటే  350 గ్రాముల వెన్న వచ్చేది .
ఆ  వెన్న గట్టిగా   గుండ్రంగా పెద్ద ముద్దలా చేసి , ఆ మజ్జిగ  కుండలోనే వేసే వారు .
మధ్యాహ్నము  దాకా ఆ వెన్న మజ్జిగలోనే  తేలుతుండేది .
అలా  కుండలో చేసిన మజ్జిగతో కాని , లేదా మీగడ పెరుగు వేసి కాని  చద్దన్నంలో  ముద్దలు కలిపి , ఆవకాయ కలిపిన ముక్కలు కంచం అంచులతో  తుంపి  చిన్న చిన్న ముక్కలుగా  చేసి మీగడ పెరుగు అన్నం ముద్దలో  పైన నంచు కోవడానికి పెట్టి , అందరికీ  పెట్టే వారు .
ఆహా !!  ఏమి  రుచి .
వర్ణించ  నా తరమౌనా ?
మళ్ళీ  మరోసారి  ముచ్చటించుకుందాం . సేకరణ...
Ooooooooooooo
ప్రపంచ నవ్వుల దినోత్సవ సందర్భంగా  కొన్ని జోక్స్.1. రాజు గోపితో ఆ సీను గాడు పెళ్లికాకముందు లవర్ పక్కన కూర్చుని చెరువులో  రాళ్లు వేస్తూ మాట్లాడేవాడు పెళ్లి చేసుకున్నాక బియ్యంలో రాళ్లు ఏరుతూ వాడి లో వాడే మాట్లాడు కుంటున్నాడు. రాళ్లకి వాడికి ఏమిటో అవినాభావ సంబంధం.రాళ్లన్ని మళ్ళీ వాడి దగ్గరికే తిరిగి వచ్చాయి.
2. టీచర్:ఒరేయ్ రాము హాస్పిటల్ అంటే అర్థం ఏంటి రా? స్టూడెంట్: భూమి నుండి నరకానికి వెళ్లేటప్పుడు మధ్యలో వచ్చే టోల్ ప్లాజా సార్.
3. టీచర్: ఒరేయ్ రాము పులికీ మేకకీ తేడా ఏంటి? రాము; మొదటిది క్రూర జంతువు రెండోది కూర జంతువు  మేడం.
4. పాప: నాన్న కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారా. తండ్రి: అవునమ్మా.పాప:మరి వాళ్లు వెళ్లిపోవాలంటే?? నాన్న: మీ అమ్మ  అరవాలి.
--(())--

*కృష్ణుడు మరియు ఒక దొంగ కథ*


బ్రాహ్మణుడు  ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్ భాగవతం ప్రసంగిస్తున్నారు.ఆ సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, మూల దాక్కున్నాడు.


భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల ఘట్టం జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము  అని అనుకున్నాడు. దానికోసం బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.


బ్రాహ్మణుడు భయపడి ‘నా దెగ్గర ఏమీ  లేదు ‘ అని అన్నారు.దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ  పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దెగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.


బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దెగ్గరకి రోజూ  ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు.  ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు


దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు   వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లలి దెగ్గిరకి వెళ్ళాడు దొంగ.


బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు.


ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది.అతను వెళ్లి బాల కృష్ణుడి చెయ్యి పట్టుకున్నాడు. కృష్ణుడి స్పర్శ తగల గానే, దొంగ చేసిన పాపములన్నీ  కరిగి పోయాయి. “ఎంత అదృష్టవంతుడో కదా దొంగ ! “బాల కృష్ణుడిని ,ఆ దొంగ అమ్మాయకంగా ,”ఎవరు నువ్వు?” అని అడిగాడు. అమాయకంగా కృష్ణుడు ‘నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది, నన్ను వదిలి వెళ్ళిపో ‘ అన్నాడు. దొంగ, ‘దురాచానాలతో నిండి ఉన్న నా మనస్సు వల్ల నేను నీకు అలా కనిపిస్తున్నాను.  నన్ను వదిలి వెళ్ళిపో అని మాత్రం అనకు ‘ “అని ప్రాతిధేయ పడ్డాడు.అప్పుడు బాల కృష్ణుడు, దొంగకి అతను  వచ్చిన పనిని గుర్తుచేసి, తను వేసుకున్న నగలన్నీ  ఇచ్చాడు. అప్పుడు దొంగ, ‘ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కోప్పడదా ?’అనిఅడిగాడు. దానికి కృష్ణుడు  ‘ఏమి కోప్పడదు , ఎందుకంటే నా దెగ్గర  చాలా నగలు ఉన్నాయి.


 నేను నీకంటే పెద్ద దొంగని. కాని, నీకు నాకు చిన్న తేడా ఉంది. నేను ఎంత దొంగతనం చేసినా , ఎవ్వరు పట్టించు కోరు. నన్ను ప్రేమగా ‘చిత్తచోరా’ అని పిలుస్తారు. నీకు తెలియని విషయం ఇంకోటి ఏమిటి అంటే, నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు దానిని నేను దొంగిలించి తీసుకెళ్తున్నాను “ అని జవ్వాబు చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి మాయమైపోయారు. తరువాత చుస్తే, దొంగ భుజం  మీద నగలు నిండి ఉన్న ఒక మూట  ఉంది. అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.


ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన  చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి  వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని ,నీవు ఒక దొంగని  అనుగ్రహించావు ,కనుక నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని నిరాశతో బాధపడ్డాడు.అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘నీవు భాగవత పురాణమును  కేవలము ఒక కథగా చదివావు, కాని , దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం ,సమ్పపొర్న శరణాగతి ఉన్న చోటే  నేను ఉంటాను.”

నీతి:

పురాణాలను  చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి.

 May be an image of 1 person

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక .. 04-05-2021
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
 "సీ.
----
ఎవ్వానిపదములే యీప్సితగమ్యాల
     ఫలవంతరూపమై పాదుకొనునొ
యెవ్వాని ఢక్కంపుసవ్వళ్ళు నిచ్చెనో
    ' అఇఉణా ' దులసూత్రహారములను
యెవ్వాని యనుకంప యేడుగడయెయంద్రు
     కైవల్య సంధాతృ కామ్యమౌను
యెవ్వాని మౌనమే యేర్పడు వ్యాఖ్యాన
    భావమనితలంత్రు భావవిదులు
గీ.
--
అట్టి పరమకృపాళుని హారసర్ప
ధరుని యాచింతు జ్ఞానాత్తధనముకొఱకు
 ' శంకరాయచ కాలాయ శంభవే చ '
యంచునభిషేకమొనరింతు హరునకెపుడు !!! "
------------
----
"సీ.
----
శ్రీరామ పాదాలు సేవించు పావని
    నిరతమురక్షణ భారమొందు
సాధ్వి జానకిఁదాను శక్తియనితలఁచి
     మాతృరూపిణియని మాన్యతనిడె
సౌమిత్రిభరతులు సహజన్ములనుకొనె
     లోకహితమ్మునే రహిగనెంచి
దుష్టదనుజులనుదునుమాడెవీరుఁడై
       సీతనుపతిచెంతఁ జేర్చెనంత
గీ.
---
దుష్టకంటకజాడ్యాలకష్టహారి
శ్రీరఘుకులుని హృదయాన జేర్చెతాను
అంజనీసుతుమారుతికంజలింతు !
ఎందరోభక్తులఁదలఁతు డెందమందు !!! "
-----------
----
" పద్మవృత్తము..( న భ జ జ జ గ--16/11 )..
----
పరమతత్వమతిదాత ! కృపాళు ! నమోऽస్తుతే ,
చరణయుగ్మమె శరణ్యము కుజాడ్యకుఠారమై
మరణభీతిభవహారియె మాదృశదీనుకున్..
వరమగున్ గద ' మహేశ ' భవానితపోజ్ఞుఁడా !!! "
----
వినయ తత్వము వినమ్రత వేగ సమానమే
మనసు మర్మము సమగ్రత మోహ విమానమే
మనుగడత్వము మనోమయ మాయ ముముక్షమే
 తనువు సమగ్ర విచారణ తేజ సహాయమే
-----
సీసపద్యము
 యెవ్వాని పల్కులే ఎంత మార్పు లగును
         యెవ్వాని చూపులే ఏమి చేయు
యెవ్వాని హృదయము యీప్సితమగునులే
         యెవ్వాని మౌనమే ఎంత మార్పు
యెవ్వాని కళలన్ని యెదురు చూడవలెను
          ప్రేమను పొందియు పంచె కళలు
యెవ్వాని సేవల యెదయు మంచియగును
         సర్వము పంచేటి శ్రేష్టి యగును
అట్టి మహిమాన్వితమైన మనిషి నుండి
జ్ణానపు కళలు సాహిత్య జ్ణానమవ్వు
పుడమి వెలుగులు విరజిమ్ము మహిమతోను
యెవ్వని పలుకు వినయము డెందమందు
--(())--
మనం చిన్నప్పుడు నేర్చుకున్న అ ఆ లు ఒకసారి గుర్తుచేసుకుందాం.
కరోనా గూర్చి వర్ణమాల తో
అ క్కడెక్కడో పుట్టింది
ఆ పదలో పడేసింది
ఇ టలీకి వెళ్ళింది
ఈ జిప్టుకు పాకింది
ఉ ధృతంగా పెరిగింది
ఊ చకోత కోస్తోంది
ఋ క్కులకే లొంగనంది
ఎ ప్పుడు వస్తానో చెప్పనంది
ఏ డిపించుకుతింటోంది
ఐ శ్వర్యానికి లొంగనంది
ఒ క్కోదేశానికి అంటుతోంది
ఓ డలు విమానాలను ఆపేయించింది
ఔ షధాలే లేవంది
అం దరికీ వ్యాపిస్తోంది
అః కఃనః అన్నట్లుంది (అర్థం కానట్టు ఉంది)
క రోనా తన పేరందిి
ఖ నిత్రం లా దిగుతోంది (ఖనిత్రం అంటే గునపం' పలుగు)
గ రిష్ఠంగా పెరుగుతోంది
ఘ నుడుసామాన్యుడని చూడనంది
ఙ వలే తెలియనంది
చ టుక్కునఅంటుకుంటుంది
ఛ రఖాలా తిరుగుతోంది
జ బ్బుల్లో పెద్దదయింది
ఝం డా ఎగరేస్తోంది
ఞ! ఆ! యా! అని వెక్కిరిస్తోంది
ట క్కుడెక్కులు చూపిస్తోంది
ఠ క్కున అంటుకుంటుంది
డ బ్బులకు లొంగనంది
ఢ మరుకం మోగిస్తోంది
ణ లా బుద్ది వంకరది
త నకు ఎదురు లేదంటోంది
ద య్యంలా పీడిస్తోంది
ధ ర్మం న్యాయం తనకు లేవంది
న లుగురు కలిస్తే ఓర్వలేక పోతోంది
ప రుగులు పెట్టిస్తోంది
ఫ లితం లేదంటోంది
బ డులు గుడులు మూయించింది
భ యాన్ని ఇంకా పెంచుతోంది
మ రణమృదంగం మోగిస్తోంది
య ముని దగ్గరకు పంపిస్తోంది
ర క్కసి లా తినేస్తోంది
ల క్షలమందిని కబలిస్తోంది
వ రదలా ముంచేస్తోంది
శ నిలా దాపురించింది
ష ట్కాలాల్లో కూడా తానుంటానంది
స బ్బునురగంటే భయమంటుంది
హ రించుటే తన గుణమంది
ళ ఇలా అంటూ అంటుకుంటోంది('ళ' ను అల అని చదువుతుంటారు)
క్ష మించడం తన డిక్షనరీ లో లేదంది
ఱంపము లా కోసేస్తోంది.  
--(())--
మధుకరికా - విలోమము -
==
వృత్తము ర-జ లేక భ-య గణములతో ఆరంభము కాకున్నప్పుడు ఆ వృత్తమునకు, దాని విలోమమునకు ఎదురు నడక ఉండదు. క్రింద ఒక ఉదాహరణము -
==
మధుకరికా (భుజగశిశుసృతా, భృతా) - న/న/మ IIII IIU UU
9 బృహతి 64
==
కనగ కలలు  రావమ్మా
వినయ తలపు చూపమ్మా
మనసు గెలుపు నీదమ్మా
తనువు తపన ఒద్దమ్మా
అలక మరచి రావమ్మా
వలపు వదలి రాకమ్మా
తలపు మదిలొ చూపమ్మా
తలుపు మరచి రాకమ్మా
భయము వలదు నీకమ్మా
నయము అవును నీకమ్మా
జయము జరుగు నీకమ్మా
ప్రియము అగును నీకమ్మా
తరుణము ఇక నీకమ్మా
మరణము ఇక రాదమ్మా
కరుణయు ఇక ఉంచమ్మా
చరితము ఇక నీదమ్మా
మనసున గల భావమ్మే
నిను బిలిచిన రావమ్మే
ప్రణవపు నుడి వేదమ్మే
ప్రణయపు సడి మోదమ్మే
==
శృతిసుమధురి కా రావా
మతి మధురిమ గా రావా
గతి గమనముగా రావా
ధృతి దమనకగా రావా  
మురిపము మధుగా రావా
చరితపు కధగా రావా
అరమరికలుగా రావా
చరఖగ తీరుగా రావా  
స్వరములు ఇక పాడమ్మా
కరములు ఇక చూపమ్మా
గరముగ ఇక వద్దమ్మా
జ్వరముయు ఇక రాదమ్మా
మధు యను నిధి శాంతమ్మే
 విధి యను తిధి కాంతమ్మే
తిధి యను మది కోరమ్మా
మది యను తలపొద్దమ్మా
మృదు మధుకరికా రావా
మధువును సుధగా నీవా
వ్యధలకు నిఁక యంతమ్మే
సుధ యను నిధి స్వంతమ్మే
==
భుజగశిశుభృతా దేవీ
రుజలను ద్వరగా బాపన్
బ్రజలకు సుగమందీయన్
నిజముగ దయతో రావా
==
--(())--
సందర్భోచిత పద్యాలు
తనువు తాపత్రయము అడ్డు తపము లేక  
అన్న మాటకు లోనయి  ఆర్త్రి చూపి
తన్నుగొనకయు మదిలోన తాపమోద్దు
తనది గాదనుకొని బెట్టు దానమవ్వు
అభయ మొచ్చినా ఆత్రుత అసలు వద్దు
ప్రభల మళ్లెను ఉత్త్సవ పేరు పెరుగు  
లాభ మనుటయు ఆశలు లోభి యగును
లోభ గుణమును వదిలిన లలిత మొవ్వు
భార్య కోరిక తీర్చుట  కారణములు
భర్త కోరిక మార్చుట కారణములు
భూరి విద్యయు శాంతికి కారణములు
భాగ్య మొచ్చుట ప్రేమయే కారణములు
మనకు మనదేశ రక్షణే మార్గ మొవ్వు  
తనివి తీరుగా తెలివితో తాపముంచు  
వినయ భావము చూపుట విద్య అవ్వు  
మనసు తాపము నింద్రియ నిగ్రహంబు
మధ్యాక్కరలు .. మాతృశ్రీ లీల  
*
గణములు- ఇం.ఇం.సూ -ఇం.ఇం.సూ
యతి నాల్గవగణాది యక్షరము
సమరమ్ము జీవితం లోన సౌఖ్యమ్ము చూపేను తల్లి   
వినయమ్ము ప్రేమల లోన విధిరాతను మార్చు తల్లి
తరుణమ్ము కాలము లోన  తాపత్రయము చూపు తల్లి
పరిణమ్ము ఆశల లోన పాలుపంచుకొనేది తల్లి
సత్యము తెల్పుట లోన సామర్ఢ్యమును చూపు తల్లి
నిత్యమూ ప్రార్ధన తోను నిర్ణయం తెలిపేటి తల్లి
ముత్యము మల్లెను వెల్గు మమతల మాణిక్య మల్లి  
పత్యము చేసియు మూల్గి పనులన్ని చేసేటి తల్లి
ప్రార్ధిత ఆశలు లోన  ప్రేమ మనసుతోనె లీల
కామిత కల్పన లోన కామజనకుని లొ లీల  
సేవిత ప్రార్ధన లోన శుద్ధగా వెలిగేటి లీల  
సాద్వితి సహనమ్ము లోన  సంబ్రమాత్యర్యపు లీల
   --(())--
సోయగములు
చక్కదనంబులు యువతిలో
చుక్కగాను మెఱుపు
మక్కువ చూపిన ప్రేమలో
చక్కనమ్మ చూపు
ప్రక్కన ఆకర్షణల వల్ల     
పక్క పక్క చేరు
సుందర సుమధుర ప్రేమయే  
వ్యక్తము చేసిన మనసుకు  
ఒక్క మాట చాలు
వాక్యము లెన్నియు వ్రాసిన
వాక్కు వందనమ్ము
సౌఖ్యము లన్నియు పొందిన
చెక్కు చెదర రూపు
సఖ్యత సౌఖ్య సోయగములు  
చుక్కల మధ్యన చంద్రుడు
చెక్కు చేదర కుండు
అక్కున నుంచెడి తల్లియే
ఆక లంత తీర్చు  
వేకువ బతుకులో మార్పులు
మాకునూతనమ్ము
సకలశోభల సోయగములేలు
--(())--
సీస పద్యము ...  
అమ్మ అనిపిలుపులొ  ఆత్మీయ తయెవుంది  
అనురాగములతోను అమ్మ భాష  
నాన్న అనుటలో ఆరాధ్య ము పెరుగు  
అనురాగ ఆకర్ష మాతృ భాష
తల్లితండ్రుల కళ తేటతెల్లమగను   
భవితవ్యమునుతెల్పు భవ్య భాష     
గురువు నేర్పిన విద్య  గమ్యము తెలిపేను    
పంచునదియు నిత్య పుడమి భాష
తేటగీతి
అంధులుసహితము చూడు ఆంధ్ర భాష   
ఆంద్ర మన్నది మేధస్సు పెంచు భాష
తెలుగు నుడికారము మమత తలపు భష
అందరికి అనుకూలమే అద్భుతమ్ము     
--(())--

మహిత గుణ సంపద


శరీరానికి గుణాలకు ఎంతో అంతరం ఉంది. శరీరం క్షణ భంగురం. గుణాలు ఆకల్పాంతం నిలిచే ఉంటాయి- హితోపదేశంలోని ఒక శ్లోక భావం ఇది గుణాల వల్ల కలిగే కీర్తి చరిత్రలు నాశనం లేనివని అర్ధం సద్గుణ సంపత్తి గలవారి జీవితాలు ఎల్లప్పుడూ సమాజానికి అనుసరణీయమే. మహానుభావుల మంచి గుణాలను, మహిత చైతన్యాన్ని శక్తి మేరకు అనుసరించి ఆ స్ఫూర్తితో జీవించడం ఆవశ్యకమైన లక్షణం. అటువంటి ఆదర్శ జీవన విధానం వల్ల జాతి, దేశం, సంప్రదాయం, సంస్కృతి, జీవనవికాసం సురక్షితమవుతూ ఉంటాయి.


మహాకవులు మహాపురుషుల జీవితాలను ఉజ్వలంగా చిత్రించి భావితరాలకు వెలుగుబాటలు పరిచారు. సంస్కృత సారస్వత ప్రపంచంలో కవికుల గురువు కాళిదాసు. ఆయన కావ్యాల్లో రఘువంశం ప్రసిద్ధమైంది. ధర్మరక్షకులైన రఘువంశ ప్రభువుల చరిత్రల్ని ఉదాత్తంగా చిత్రించి ఆ ఆదర్శ జీవన క్రమాన్ని కాళిదాసు పాఠకులకు బోధించాడు. రఘువంశ రాజుల్లో దిలీపుడి సేవాపరాయణతను, రఘు మహారాజు దాననిరతిని, అజుడి కోమల స్వభావాన్ని, శ్రీరాముడి ఆదర్శ జీవితాన్ని సర్వోత్తమంగా చిత్రించాడు. కావ్యారంభంలో కాళిదాసు రఘువంశీకుల ఉదాత్త గుణాలను పేర్కొని, అవి తనను వారి చరిత్ర రాయడానికి ప్రేరేపించాయని తెలిపాడు. దానం చేయడం కోసం ధనం సంపాదించడం, సత్యం కోసం మితంగా మాట్లాడటం, కీర్తి కోసం శత్రువులను జయించడం పితృరుణ విముక్తికి సాధనమైన సంతానం కోసం వివాహం చేసుకోవడం ఆనే గుణాలు కలిగినవారిగా సూర్యవంశ ప్రభువుల్ని వర్ణిస్తాడు. కాళిదాసు. ఈ లక్షణాలు ఏ కాలంలోనైనా మానవ సమాజానికి


వర్తిస్తాయి మనిషి ధనం సంపాదించాలి కాని అత్యాశతో కాదు కూడబెట్టాలన్న తపనతో కాదు. మన ఆర్డన, వ్యయం రెండూ దర్మబద్ధంగా ఉండాలి. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన ధనం సంపాదించేవారిలో కలగాలి. తమ రాజ్యంలోని పేదలకు కూడు, గుడ్డ, గూడు కల్పించవలసిన బాధ్యత పాలకులపై ఉంది. నేటి అంతర్యామి పాలకులే కాదు, సంపన్నులందరూ ధనం ప్రయోజనం త్యాగమని గుర్తుంచుకోవాలి. ఎంత మితంగా మాట్లాడితే అంత మేలు. సాధారణంగా తక్కువగా మాట్లాడినప్పుడు సత్యమే పలకగలం. మితవాక్యం హితవాక్యం కావాలి. వాచాలత్వం అసత్యాలకు, అనౌచిత్యాలకు నెలవు కావచ్చు.


పూర్వం రాజులు కీర్తికాంక్షతో శత్రువుల్ని జయించేవారు. ఆధునిక ప్రపంచంలోనూ స్పర్థలంటాయి. ఆరోగ్యకరమైన పోటీవల విద్యలు వర్ధిల్లుతాయి. జిజ్ఞాసతో పాండిత్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకొని తనను మించినవారిని గెలవాలనే పట్టుదల వాంఛనీయమే. ఇది కుటిల ప్రయత్నాల వల్ల కాక సక్రమ పద్ధతిలో జరగాలి. కామం ఒక పురుషార్ధం. అది అతి శక్తిమంతమైంది. కామ తృప్తికి వివాహమే ఉత్తమ మార్గం. శారీరక సుఖం కాక సంతానోత్పత్తిని వివాహ పరమార్ధంగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. భారతీయ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది. తన పూర్వీకుల పరంపరను తన ద్వారా మరో తరానికి అందించడం ప్రకృతి ధర్మం. తన వారసత్వంగా ఇంకొక తరాన్ని సృష్టించడం వల్ల పితృ రుణం నుంచి విముక్తులవుతారని రుషుల సందేశం


త్యాగం, సత్యభాషణం, కీర్తి, కాంక్ష, సంతాన సృష్టి అనే ఈ నాలుగు భావనలూ చాలా ఉత్కృష్టమైనవి. మహా కవులు ఎవరికి ఆపాదించి చెప్పినా ఆ గుణాలు లక్షణాలు మొత్తం మానవ జాతికి అనుసరణీయమని వారి దృష్టి క్రాంతదర్చులైన కవుల వాక్కులు సర్వ కాలాలకు, సకల జనులకు శిరోధార్యం. ప్రాచీన వాంగ్మయం అందించే అమృత సందేశం విస్మరించరానిది

"మత్తేభము --


----
ఘనవాతాపినియాదిపూజితుని వక్రంబౌప్రహస్తున్ మదిన్
ఘనహేరంబుని విష్ణువున్ సుముఖు విఘ్నాధ్యక్షునున్ గొల్చెదన్
ఘనరాట్ఫాలవిభూషితున్ కపిలు లగ్నంబౌమనంబందునన్
ఘనదూర్వారసుమాలపత్రముల సౌగంధ్యప్రమోదిన్ సదా !!! "
--
 

Monday, 3 May 2021

May be an image of 2 people


ప్రాంజలి ప్రభ ... 03-05-2021
ఆనందం - ఆరోగ్యం - ఆద్యాత్మికం
సకల లోకంబు లేలును సాధు జనులు
సకల సంపదలొసగును  సమయమందు
సకల రోగములు కలిగి శోకమవ్వు
సకల దైవలీలలు చూపె శెలవులందు
నేటి ప్రపంచం
గుళ్ళకు గుళ్ళనే నిశ్శబ్దంగా మూసేస్తుంది - సమ్మోహం
నీళ్ళకు నీళ్ళనే నిశ్శబ్దంగా కల్షమ్మైంది - ఉన్మాదం
ఇళ్ళకు ఇళ్ళనే నిశ్శబ్దంగా మింగేస్తుంది - ఆరోగ్యం
ఊళ్లకు ఊళ్లనే నిశ్శబ్దంగా మ్రింగేస్తోంది - స్మశానం.
అంత జరిగినా ఏమి ఎరగనట్లే ఉంటుంది -  ప్రపంచం.
ఏమి జరిగినా తెల్సి తెలియనట్లే ఉంటారు - ప్రభావం
అంత తెలిపినా న్యాయ మలుపులన్నీ ఎవ్వారు - ప్రధానం
ఎంత తెలిపినా రోగ కలుపులన్నీ పెర్గేను - ప్రమాదం
--(())--
సందర్భోచిత పద్యాలు
కుమ్మరి ప్రమిదను చేసిన ఏమి
కమ్మని గానుగ నూనెను నింపి
నెమ్మది వెలుగిచ్చు వత్తిని ఉంచి
నమ్ముము వెలుగుకు నటనలు రావు
తేనె తెరలజాడ తేనెటీగ యెఱు౦గు
సుమరసంబు జాడ భ్రమరమెఱుగు
పరమయోగి జాడ భక్తుండెఱుగును
చదరంగమున  చూడ రాజ్య మెఱుగు
పలకయందు దొలుత నక్షర మొవ్వు
నులకమంచ గదుల నక్షర మొవ్వు   
గిలకతాడు గదులు నక్షర మొవ్వు
తొలుత అమ్మ సుడులు నక్షర మొవ్వు
మంచిమాటల యందు మౌనము వలదు
మంచివారి గుణము మచ్చిక చేయి
తీయని మామిడి చిగుళ్లను గుర్తు  
గోయిల కును దక్కు పక్షుల క్కాదు
--(())--
నేటి సమస్యకు పురాణం పద్యాలు  ..
ఛందస్సు వృత్తములు
చెరువులు మాయ మగుగాని నీరును గాదే
బరువులు పెర్గు టకుగాని భారము గాదే
చిరుగుల గుడ్డ తలపాగ ఎండకు గాదే
శిరమును బోడి యగుగాని చిత్తము గాదే.......
మెరుపులు వేడి యగుగాని వైనము గాదే
వరుసకు బేడి పడుగాని దొంగయు గాదే
తరువుకు గాడి యగుగాని గాయము గాదే
శిరమును బోడి యగుగాని చిత్తము గాదే.......
మగువకు మౌన ముసుగేను మోహము గాదే
పగటికి రేయి చెలిమేను పందెము గాదే
నరములు వేడి యగుగాని రక్తము గాదే
శిరమును బోడి యగుగాని చిత్తము గాదే.......
--(())--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ  - నేటి ద్విపద కవిత్వం  
కొత్తగా పెళ్లయిన వారిలో ఉండే భావాలు
కల హంస ఆటలో కను విందు చేసె  
కళ  మంచి మాటలో కామ్యమ్ము చూపె  
కళ మాయ సౌందర్య కప్పును తీసె    
జత గాను సంద్రమ్ము జాగుగా చేరె    
మది పొంది ముద్దాట మేలిమై యగును   
సిరి పొంద గిలిచూపి సిత్రపు చూపు    
చను వంత విందాట చలి కల్గి చనువు   
చిరు హాస వింతాటలో కలి చిత్తు అయ్యె  
అల హాస ఉయ్యాల కలలాగ ఊగె  
చల చల్ల  చిందాట  చిరు నవ్వు చూపె    
తొలి  మల్లె  సయ్యాట తలపులు విప్పె  
మలి మాట ముచ్చట్లు మునిగియు తేలు
లలలాల లల్లేల లోలక కాక  
కల కాత ఒళ్లేల కలకల కేక  
వలచిక్కి జల్లేల వలపుల వాన   
కల కాల మిల్లాలు కేకథ లన్ని  
--(())--
సీస పద్యము ..
జనులతో అప్పుల జూదము ఆడేను  
చులకన చేసియు జుట్టు పట్టె
అరచేతి బెల్లము  అరువవుగా ఇచ్చి
దోచేటి సలహాలు దగ్గరవ్వు
పలుకల నేర్పుతో  పల్లకి ఎక్కించి  
మనసును దోచేటి  మందు చెప్పు  
చేతికందినదియు చక్కగా  పొందియు   
లేదని అరిచేటి  వారు ఉండు
తేటగీతి
సిగ్గు ఎగ్గయు లేదునూ చింత లేదు
దోచి సిగ్గవిడిచియు శీ ధనము దోచె  
ఆశచూపియు రోగము అంట గట్టి
నంగ నాచిలా జూదపు నటన పుట్టె
*(())*
నీడలు
పుణ్యము పండిన
నాణ్యత పెరిగిన
ధన్యత కలిగిన
అనైక మనసున  రామకృష్ణ
మనుష్య జన్మము  
అనూహ్య దేహము
తనువుల దాహము
అణుకువ మోహము రామకృష్ణ
ఇంకను పండెను
మక్కువ గుండెను
ఎక్కువ కేగెను
తక్కువ  మాగెను రామకృష్ణ
దర్మము నిత్యము
మర్మము మోహము
కర్మయు  దాహము
నిర్మల మార్గము రామకృష్ణ
అనురక్తి కలుగు
అణుయుక్తి జరుగు
వినయమ్ము పెరుగు  
కనలేని మెఱుగు రామకృష్ణ
--(())--
సాహితీ మేరు పర్వతాన్ని మరొక్కసారి స్మరించుకుంటూ🙏🙏🙏
"కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ...
 ప్రపంచపు బాధ  అంతా శ్రీ శ్రీ బాధ " అని...
చలం యోగ్యతా పత్రం లో పేర్కొనడం అతిశయోక్తి కాదు .యోగ్యతా పత్రం మహాప్రస్థానం పుస్తకానికి 1940 లో చలం గారు రాసిన పీఠిక .తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికల్లో ఇది ఒకటి.
 ఆ పుస్తకం ఎవరు చదవాలి..? ఎందుకు చదవాలి? ఎలా చదవాలో వివరించే పీఠిక  ఇది.
                     "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల.. షడ్జధ్వానం" విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి." అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక .
                        ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదంపొందారు.
                       మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. తెలుగు సాహిత్యపు ప్రస్థానానికి ఒక దిక్చూచిలా వెలుగొందిన శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం అప్పటికి ..ఇప్పటికీ ..ఎప్పటికి అగ్నికిరణాలే...  ఆధునిక సాహిత్యాన్నీ మహా ప్రస్థానానికి ముందు మహాప్రస్థానం తరువాత అని విభజించడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మహాప్రస్థానం 40 కవితలతో అలరారుతున్న అభ్యుదయ అద్భుత సంపుటి. 1930 దశకం లో  ఆర్థికమాంద్యం వల్ల  నిరుద్యోగ యువకుల జీవితాలు ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలమైన సమయం ఆ కాలాన్ని ఆకలి కాలం  (హంగ్రీ థర్టిస్) అని అన్నారు అంటే ఎంతటి క్షామం ...అది ఎంతటి క్షోభం .తన చుట్టూ జరిగే సంఘటనలనే కవితా వస్తువులు ...
అన్నార్తుల ఆకలి కేకలు కార్మిక కర్షక శ్రామిక గొంతులను.. కష్టాల కన్నీళ్లను తన సిరాలో  నింపుకొని రుధిరాక్షరాలుగా  వ్యక్తీకరించిన మహాప్రస్థానం నిజానికి ఒక మహా ప్రస్థానమే.. దీనిలో మనల్ని మనం వెతుక్కోవచ్చు.
                         కవిత ఓ కవితా కళాఖండం ద్వారా కవితా తాత్వికతను దాని వెనుకనున్న సంఘర్షణను వెల్లడించిన సమూల నైపథ్యంగా తెలుస్తుంది. మొదటి గేయం మహాప్రస్థానం అదొక కవాతు పాట... పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి అంటూ ప్రబోధించే ఈ గేయం హరోం..! హరోం హర !హరోం హర..!హరోం హర !హర! హర! హర! హర !అంటూ యుద్ధ నినాదంతో కదలమనే పిలుపు ఇస్తుంది.
 " ఐ "గేయంలో తాను స్మరిస్తే పద్యం...
 అరిస్తే వాద్యం అని చెప్పుకున్నారు.
 నా మహోద్రేకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు అంటూ తన గురించి తాను వ్రాసుకున్నారు ."జయభేరి "కవిత ద్వారా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను  అంటూ సాగే ఈ గేయం ద్వారా తానే భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అని పేర్కొన్న వ్యక్తిత్వ గీర్వాణం ఒక తార్కాణం. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి  అని ఉవ్వెత్తునత లేచిన అగ్ని తరంగం సాహిత్య లోకంలో సింహం వలె గర్జించేను .ఈ పుస్తకాన్ని 1938లో అకాల మరణం పొందిన శ్రీశ్రీ స్నేహితుడు, సాహిత్యకారుడు కొంపెల్ల జనార్ధనరావుకు
అంకితమిచ్చారు.
                        శ్రీ శ్రీ  వ్యక్తిత్వం ఎన్నో విరుద్ధ భావాల విచిత్రమైన సంఘర్షణల సమాహారం ఆయన బహిర్ముఖ తీవ్ర విమర్శకుడు గా ఓవైపు పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు శ్రీ శ్రీని ఎరిగిన వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడని. . అమాయకుడైనా చురుకైన వాడని.. అహంకారి అయినా తలవంచుకు ఉంటాడని విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతున్నాడని ఆకర్షకుడైనా ఏడిపించనూగలడని అంగీకరిస్తారు.
                  చమత్కార సంభాషణలకు..చణకులకు శ్లేషాప్రయోగాలల్లోనూ  శ్రీ శ్రీ ప్రసిద్ధిగాంచారు.
శబ్దాలంకార చమత్కారాలు తన నాలుక అనే కరవాలంపై నాట్యమాడుతుండేవి.
                        వ్యంగాస్రాల బాణాలే ...కాదు
వివాదాలకు..అలవాలమై.. నిలిచిన తన వ్యక్తిత్వం..విమర్శకులకు..అస్త్రమై నిలిచాయి..
మదరాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించినవారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కుళాయి వాళ్లు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు అని చెప్పుకున్నారు
                       విశ్వనాథ గారు శ్రీశ్రీపై ఇంతగా ఆప్యాయత చూపినా, శ్రీశ్రీకి విశ్వనాథ కవితాశక్తిపై చిన్ననాటి నుంచి ఎంతో అభిమానం (కొన్నేళ్ళు హీరోవర్షిప్) ఉన్నా వారిద్దరి వ్యతిరేక భావాలు విభేదాలు తీసుకుచ్చాయి. భావాలకు మించి విశ్వనాథకున్న కుండబద్దలు గొట్టే మాట, శ్రీశ్రీలోని మాట తూలే లక్షణం మరింత ఆజ్యం పోశాయి. ఎన్ని విభేదాలు సృష్టించినా...ఎన్ని స్పర్థలు..ఎదురైనా..
విమర్శలకు నెరవక..తన సాహిత్యం నిత్య నూతనమై తన అభిమానుల గుండెల్లో చిరస్మరణీయుడై..నిలిచిన శ్రీశ్రీని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డులు వరించి అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగాను..( విరసం )విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు గా కొనసాగారు.ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన పాటలను  సినీ గేయ రచయుతగా...స్ఫూర్తి దాయకమైన
సాహిత్యాన్ని...మరెన్నో యుగళగీతాల మాధుర్యాన్ని సినీ రంగానికి అందించి ఎందరో సాహితీ శ్రోతలను సంపాదించుకొని..అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు.
        .      కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించారు.విశాఖపట్నం
 లోని బీచ్ రోడ్డులో ఆయన గుర్తుగా నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
 అప్పటికి..ఇప్పటికి..ఎప్పటికి...నిలిచిపోయే
విశిష్ట...విష్పష్ట ద్రష్ట..సాహితీ నవ్యతను... రంగరించి...విప్లవ ఉత్తేజాన్ని అణువణువు నింపగలిగే కండ కలిగి ...చేవ కలిగిన..రచనలతో
రచయితలకు సాహితీతృష్ణను రగిలించే..
అగ్నిరవ్వల ఖడ్గ సృష్టి...రచనల విరచిత విధాత..
సాహితీ భావితరంగానికి ఉత్తేజ సంద్రం..
అతడే శ్రీ శ్రీ...ఆతడే శ్రీ శ్రీ..
ఆకలి ప్రేగులే జీవన స్వరాన్ని
అపశృతుల్లో..అలపించే ఈవేళలో..
మానవత్వం మంటకలిపి...
మారణహోమం చేస్తున్న ఈ వేళలో
దేశం  అనేక అరాచకాలల్లో..
కబంధ హస్తమైన ఈవేళలో..
మానవ సంబంధాలన్ని కుళ్ళిపోయి..
కుప్పకూలుతున్న..ఈవేళలో..
యువతరాన్ని..ఉత్తేజితులను
చేయుటకై...రావయ్యా..
రావయ్యా..మరో సారి..శ్రీ శ్రీ...
 నీ రుధిర  బింధువే.... మా కలానికి
సిరా గా మారడానికి రావయ్యా..
కొన్ని వేల మంది శ్రీ శ్రీ ల..కవితా ఘోషవై
విరచించు..వినిపించు..వికసించు..!
శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా...సాహితీ సుమాంజలి సమర్పిస్తూ...🙏🙏🙏💐
సోయగములు
పగలులేవు పనులు ఎందుకో
సెగలు కక్కు చుండె
వెలుగులేని బతుకు ఎందుకో   
నలిగి పోయె జీవి  
చలిలోను వానలో టెండలో
అలసి పనులు చేసె  
నేడు కరోనాగ సోయగం
నడిచే మరలుఆగి అలసినా
బడుగు జీవి ఆగు
నడి సంద్రమున చిక్కిన పడవ
అడుగు పడక మునుగు
ఆడ బిడ్డల మాన ప్రాణాలు
మడుగునందు మునిగె
రోజులెన్నోతేలి సోయగం
పరుల కష్టం దోచె బతుకులు
పరువు దేవు డెఱుఁగు
మరిగిన హృదయపు వేదన
అరచి మొత్తు కున్న
పరులకేమియు తెలియని విధి
నరము ఉబ్బు చుండె
ఇకకరోనా ఇది సోయగం
--(())--
👌👌👌👌 నేను ద్రాక్ష పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను.
నేను   :    బాబు కిలో ఎంత...?
అతను :  *"కిలో 80 సర్।"*
పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।
నేను అడిగాను :  *" మరి వీటి ఖరీదెంత?"*
పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*
నేను అడిగా : "ఇంత తక్కువగాన..?
పండ్లతను   :    "సర్, అవి కూడా మంచివే..!!
కాని... *కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*
అప్పుడు నాకు అర్థమైంది... *సమాజము,సంఘము*  మరియు *కుటుంబము* నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।
దయ చేసి మీ *కుటుంబము లో ఉండండి.....
  ఈ జన్మకే....
ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...
ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...
ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు, అన్నా తమ్ముళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు, సన్నిహితులు...
ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!
మహా అయితే ఇంకో పదీ..పదిహేను, ఇరవై ..........సంవత్సరాలు !
కుటుంబము లో ఎవరు     తప్పు చేసినా  క్షమిద్దాం ,అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!
పోయాక ఫోటోను ప్రేమించే కన్నా,
ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న
బంధుత్వాలు  తెంచుకోవడం  నిముషం.
అదే  నిలుపుకోవాలంటే  ?
తము గడిపిన  భయంకర  అవస్థలు తమ
పిల్లలకు  రాకూడదని ,  తమ పిల్లలు  కూడా  నలుగురిలో ఉన్నతంగా  బ్రతకాలనే  తాపత్రయంతో
కన్నవాళ్ళు  తను  సామాన్య జీవితాన్ని  గడుపుతూ  ,
ఆస్థులు  కూడ బెట్టి  తమ పిల్లలకు  ఇస్తే ,
తమ  తల్లిదండ్రులు  బతికి  ఉండగానే  కొందరు
తమ  తల్లిదండ్రులు  కాలం  చేసాక  కొందరు
 వివిధ  రకాల  కారణాలతో   రక్త సంబంధీకులందరూ  శాశ్వతంగా   దూరమవుతూ ,
బ్రతికి   ఉండగా  మాట్లాడు కోకుండా ,  మొహాలు  కూడా
చూసుకోకుండా  తమ  జీవితాంతం  వరకు  ఒకరి నొకరు
ద్వేషించుకుంటూ , ఆ ద్వేషాలు  తమ  వారసత్వంగా
తమ  పిల్లలకు  కూడా  బదిలి చేస్తూ  ,  తన అశాంతితో
జీవిస్తూ  తన  వారిని  కూడా  అశాంతి పాలు  చేస్తున్నారు .
ఎవరి  కోసం  ? ఎందు  కోసం ?
దాని  వల్ల  ఒరిగే  ప్రయోజనము  ఏమిటి ?
జీవితాంతం   ఒక  రక్తం  పంచుకున్న  అన్న దమ్ములు ,
అక్క చెల్లెళ్ళు  .  అన్నా  చెల్లెళ్ళు  పరస్పరం
 అశాంతితో  ద్వేషించుకుంటూ ఒకరి నొకరు  చూడకుండా
జీవిస్తూ  శాశ్వతంగా  దూరమయి , ఇంటి లోని ఆనందాన్ని పంచుకోకుండా, వివాహాలకు
కూడా  పిల్చుకోకుండా ,  హాజరుకాకుండా ,
చివరకు  ఎవరో   ఒకరు  కాలం  చేసాక   తట్టుకోలేని
శోకతప్తులై  గుండెలు  బాదుకుని  కుమిలి  కుమిలి
విలపిస్తే  ఆ   చనిపోయిన  వారిని  తిరిగి  పొందగలమా?
ఆ   ఖాళీ  అయిన   స్థానాన్ని  ఎవరూ  భర్తీ  చేయలేరు.
కొంతమంది  తమ  తల్లిదండ్రులను  కూడా           ఈ  ఆస్థిపంపకాల అసంతృప్తితో  దూరం  చేసుకుంటున్నారు.
ఆ  వయసులో  కన్నవారు  పడే  వేదన వర్ణనాతీతం.
మరి  ఈ  సమస్య కు  పరిష్కారము  ?
  పంతాలు  పౌరుషాలు  ప్రక్కన  పెట్టి  అందరూ
కూర్చుని  సామరస్యంగా    ఆవేశాలకు  పోకుండా
మాట్లాడుకుని   పరిష్కరించుకుంటే  అభిమానాలు
కలకాలం  పరిమళిస్తూ   అనుబంధాలు  పెంపొందే
అవకాశం  ఉంటుందేమో  నని  నా  నమ్మకం .
దీనికి  కావల్సింది  సహనంగా  ఆలోచించడం
విచక్షణ  పట్టుదలలు  సడలించు కోవడం .
ఈ విషయములో పెద్దవారు చొరవ తీసుకోవాలి ...
ఓడిన వాడు  కోర్టులోనే  ఏడుస్తాడు
గెలిచిన వాడు  ఇంటికి  వెళ్ళి  ఏడుస్తాడు
రెండిటికీ  తేడా  ఏమీ  ఉండదు.
ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే🙏
--(())--
నేటి సమస్య పూరణ పద్యాలు  .........
బంగారము సాటివచ్చు మోహము గలదే   
శృంగారము సాటివచ్చు బేరము గలదే  
గోంగూరకు సాటి వచ్చు కూరయు గలదే
దొంగాటకు పోటి వచ్చు ఆటయు గలదే
 బొగ్గు లలొ కాల్చు మొక్కజొన్న బొగైనా రుచులు వేరు
మగ్గమున నేసిన ట్టి రుమాలైన నేతయు వేరు     
సిగ్గులతొ రంభ ఊగిన స్త్రీమతి మెఱుపు వేరు
మిర్చి, గోగోర గుంటూరు మించిన ఊరు ఏది
 చెంగున దూకేటి జింకయు
భగ్గున దూకేటి సింగము కలవరపరచెన్
దుంగలు మోసేటి ఏనుగు
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే
రంగస్థలి కైలాసపు
జంగమ దేవరను కనగ చవులూరింపన్
లింగోద్భవ కాలములో
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే
కంగారేలా..మనిషీ ?
బంగారము వంటి కూర వండిన..' భేష్ - భేష్ ' !
రంగారురుచియె సొంతము..
గోంగూరకుసాటివచ్చు కూరయు గలదే !? "
----
లోక్ నీతి
విధేయుడు మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సాక్షి గా ఉంటూ,
వర్తమానంలో జీవించడమే సత్యం
భర్త గా ఉంటూ,
బాధ్యతా మానం భావించడమే నిత్యం
భార్య గా ఉంటూ, దాహమేతీర్చీ సేవించడమే భాగ్యం
ప్రేమ గా ఉంటూ,
పిల్లలే ‌తీర్పై ప్రేమించడమే గమ్యం
ధ్యానాన్ని మనం పట్టుకుంటే,
కాసేపు పట్టుకుని వదిలేస్తాము.
వేషాన్ని మనం వేసి ఉంటే,
కాసేపు నాట్యము నటన చేస్తాము
మోసాన్ని మనం చేసి ఉంటే,
కాసేపు భయ్యము దయయు చూప్తాము
సాస్త్రాన్ని నమ్మి శోభ నమ్మే,
కాసేపు ధైర్యము సుఖము చూస్తాము
ధ్యానం మనలను పట్టుకుంటే,  
అది మన అహాన్ని అంతం చేసే వరకూ వదలదు.
స్త్రీ యే మనలను పట్టుకుంటే,
అతి సుఖ అహాన్ని చూపే దోచే వరకు వదలదు
ప్రేమే మునులను పట్టుకుంటే,
సుఖ మణి అహాన్ని దాహం తీర్చే వరకు వదలదు
పుణ్యం మనలను పెట్టుకుంటే,
సహనము యెంచి ధర్మం న్యాయం కడకు వదలదు
--(())--
నేటి పద్యాలు
" ఇందువదనా..( భ జ స న గగ--14/9
శ్రీ చరిత మానసపు పుత్రి సమయత్రి
శ్రీ విషయ వాంచితము ధార్మిక సుభజ్ఞే  
శ్రీ వినయ వాంఛ పలుకే రతి  మురాళే  
శ్రీకృప సహాయ వదనం రుణము పొందే  
శ్రీ సుమసుధా సుగుణ గాత్ర సుమమంత్రి
శ్రీ సరసిజే ! విభవదాయిని ! మనోజ్ఞే !
శ్రీ చరణ పూజ లతలే  హర సుధా ళే
శ్రీ పద పిపాస మనసే జనని వందే
శ్రీ మధుమతీ ! మనసు ధాత్రి ! మనమైత్రి
శ్రీ మనసుయే చరిత రాగిణి రస జ్ఞే  
శ్రీ కరుణ కావ్య తలపే శివ విహాళే
శ్రీరమ సరోజ మెరుపే జనని వందే
----
శ్రీగిరిసుతే ! సుగతిదాత్రి ! భవహంత్రి ,
శ్రీ సరసిజే ! విభవదాయిని ! మనోజ్ఞే !
శ్రీపదకవిత్వవిభవే ! సితమరాళే  ,
శ్రీరుచి శశాంక వదనే ! జనని ! వందే !!!
--(())--
శుక్రవారములక్ష్మి  పూజలు శుభము చేర్చు
శనివార మహిమతో వెంకన్న శోభ చేర్చు
ఆదివారమున ఆదిత్యని అనుకరించు
సోమవారము శివ నామము సౌఖ్యమిచ్చు    
శనినిన్ను వెంటాడక నిజము సెప్పియు  బతుకు
శుక్ర వారము న స్త్రీ దేవత సౌఖ్యము పెంచును     
ఆది అంతము లేనట్టి ఆర్భాట మొద్దు
సొమ్మసిల్లక సోమవారము సరదాగ ఉండు
--(())--



నేటి 

Saturday, 1 May 2021

చెందస్సు

May be an image of 1 person

 

సార్థకనామవృత్తము

గణములు - జ,య,లఘువు,న,త ( IUI IUU IIII UUI )
యతి- 8

సుఖాలు  దు: ఖాలూ మనషిని వెంటాడు
భయమ్ము జయమ్ము మనిషిని మార్చేను
గులాబి జిలేబీ రుచులను చూడాలి
కులాలు మతాలూ మనుషుని ప్రేమించు

అలాగ ఇలాగే కలియుట పంతాలు
ఎ మాయ ఎ రోగం తెలియుట తంతూలె
నసాధ్యము గాకుండ నడుగు నీ సేవ
 అసాధ్యము ఏకంగ సమము చెయ్యాలి
  
సకాలము రాగాలు సుమధు రా లేలు 
ప్రమాణము గానుండు పలుకులే రాల్చు
సమానము గా నుండు సుఖములే పంచు
ప్రయాణము లో సంతసమును పెంచే ను       
                    
 అకాలము మాధుర్య మధుర రాగాలు
వికారము ఏనాడు  కనని  భావాలు 
యుగాలలొ పాఠాలు కళల భాగాలు 
మనుష్యులలో ప్రేమ కలల బంగారు

  


ము       

భయమ్మెది లేకుండఁ బనులఁ జేయించి
జయమ్ముల నీవమ్మ సకలకార్యాల
రయమ్ముగ నిమ్మట్లె లలిత! సద్భక్తిఁ
బ్రియమ్ముగ నేఁ బాడి కృతుల మెప్పింతు

విమోహమునున్‌ బాపి విమల, వాగ్దేవి
ప్రమాణముగానుండు పలుకులే రాల్చ
రమాసతితోఁ గూడ రమణనిప్పించు
ప్రమోదముగాఁ గొన్ని పసిడి నాణేలు

ఎడందను నున్నట్టి యెలమితో నీకుఁ
గడంకను నేఁజేయఁ గలిమితో సేవ
గడించఁగ లేదమ్మ ఘనముగా డబ్బు
కడిన్‌ దినఁగా నేదొ కలదు కొంచెమ్ము

విశేషముగా నేది విధియు నీకున్న
ప్రసాదముగాఁ దల్చి బ్రతుకు సాగింతు
నసాధ్యము గాకుండ నడుగు నీ సేవ
ప్రసిద్ధిగ నాకిమ్ము వలయు ధీశక్తి /ధైర్యమ్ము

హతాశను గాకుండ నడుగువందించి
సతమ్మును దీవించి జతగ నీవున్న
వితానముగా గూర్చి విమల వాక్యాల/వృత్తాల
స్తుతించెదనేనాఁడు శుభదగా నిన్ను



 

ప్రాంజలి ప్రభ .... 02-05-2021
 - ఆరోగ్యం - ఆధ్యాత్మికం ఆనందం
సీస పద్యము ..
జనులతో అప్పుల జూదము ఆడేను  
చులకన చేసియు జుట్టు పట్టె
అరచేతి బెల్లము  అరువవుగా ఇచ్చి
దోచేటి సలహాలు దగ్గరవ్వు
పలుకల నేర్పుతో  పల్లకి ఎక్కించి  
మనసును దోచేటి  మందు చెప్పు  
చేతికందినదియు చక్కగా  పొందియు   
లేదని అరిచేటి  వారు ఉండు
తేటగీతి
సిగ్గు ఎగ్గయు లేదునూ చింత లేదు
దోచి సిగ్గవిడిచియు శీ ధనము దోచె  
ఆశచూపియు రోగము అంట గట్టి
నంగ నాచిలా జూదపు నటన పుట్టె
**(())**


సోయగములు  
పాలకవర్గాలు పనులను
పాలు నీళ్లు కలుపు
పనులన్ని నత్తనడకలగు
కనులు చెమ్మ గలుగు
దయగల మేధావి కళలుగా
మాయ బయట పెట్టు   
శ్రమజీవుల బతుకు మారదు
అమిత ఉత్త్సాహము లేదును  
సమము యంత్ర మొచ్చె
శ్రామిక శక్తికి అడ్డుయే
భూమి బరువు పెరిగె  
నడకలు నాణ్యత లేవునూ
నడుచు యంత్ర మొచ్చె
మనిషిబదులు యంత్రములు చేయు  
యవ్వన వృద్ధకార్మికులుగా   
నవ్య మార్గ మయ్యె
సవ్యము లేకయే ఇప్పుడు
భవ్య కళలు లేవు
కొంతవిశ్రాంతియు కూర్మియు    
కొంత మార్పు కలుగు
కార్మిక శక్తికి అడ్డులే
--(())--
సీసము


ఆనతి కనుగొని ఆహార మోండెను
వడ్డన చేయుట వనితలొంతు
కొసరి వడ్డించింది కోమలంగాను లే
నడుమున గజ్జెలు నాట్య మాడె
నారగింపుడు తృప్తి తోను అడుగు చుండు
కనుసైగలు కదిలే గల్లు మనగ
వలువల కదలిక వచ్చింది కాబట్టి
కనువిందు శబ్దాలు గులకరింప
ఆటవెలది
నలుడు వండి నాడ వంటకం అంతయు
తినగ కడుపు నిండి తృప్తి గుంది
స్త్రీల హావ భావ వడ్డన అద్భుతం
మనసు శాంతి పొంది మెచ్చె శివుడు
--(())--
ऊँ!
----
"కుసుంభినీవృత్తః ( జ భ స జ గగ--14/9 )
----
సమాన భావపు తరుణా న వేద భావం
సుమారు మాలలు మనసాయె మోహ దేహం
సమర్ధ సద్గురు సహనమ్ము సేవ లక్ష్యం
విమోచనా భవ కళలే విశాల వైనం
సరోజలోచన విలసన్నవాంబుదాభా
మురప్రమర్దన ! జనమోహనాంగ ! స్వామీ
సురేంద్రపూజ్య ! నిగమసూక్తవేద్య ! దేవా
 కరీంద్ర రక్షక! శుభనామతత్త్వదాయీ !!!
--
ద్విపద ..మాలికా గీతం
కలలు రేపగనేల కలువ గుండి  !
పూబాల మనసున మనసును పంచు !
పలకవే చిలకగా నిలపవే జాన !  
శాంతిని కూర్చియు ప్రేమను పంచు !
కళలు చూపగనేల మనసుతో ఇపుడు !   
పూబంతి అనుచునే వత్తుట వలదు !
కలవవే మొలకగా మమతను పంచి  !
కాంతిని హాయిగా వేడుకగాను !
వలపు పండుగవేళ తలపుల లేల !   
ఓహీల  తనువుకు తాపము వలదు !  
కలతలా తగులునా పలుకుల ఏల  !
ఓబ్రాంతి  వదలవే నన్నును చూసి !
కనుల వెల్గులలోన నిజముయే తెల్పు!  
చూపాలి మగువలోని మనసు ఇపుడు  !
తనువుయే తపముగా తరుణికి వలదు !
సేవలే తలుచుటే  ఇప్పుడు ముద్దు  !      
కనుల నే మూసినా కరువాయె నిదుర !
కనగ లేనేలనో కలనొకటయిన !
ఓబ్రాంతి వదలవే సమయమ్ము నీది !
ఓ శాంతి నియ్యవే నడుమున యుండి !
మనమున నిలిచిన మగువ రూపమది !
చెణుకులు విసరుచు చిలిపిగ జూచు !
తనువున తపనేల తరుణమే ఇదియు !
అణువణువును దోచు సందేహ పడకు !
జాజుల నవ్వులా జాబిలి తాను !
తాపము రేపెడి తారక సుమ్మి !
గాజుల సవ్వడి ఆకలి తోను !
మల్లెల మాలతో ముంగిర వుండె !
కోపపు పలుకుల కోకిల యాయె !
పాపము మల్లెలు బాధల మునిగె !
తాపపు నటనలు తప్పవు ఇపుడు !
వేషము మార్చుట తప్పదు అపుడు!
వలపు వాగునతను విరిసిన కలువ !
తలపు వీడననుచు తగవులు నాతొ !
కళలను చూపియు మురిపించు మగువ !
మనసున వేడిని తగ్గించు తెగువ !
పలుకుల తేనెలు పరవశ మొసగ !
కలయిక మధురిమ కావ్యములల్లు !
చినుకుల జల్లులు ఆవేశ పడగ !
ఉరవడి చూపియు చల్లగా చేర్చు !
గజ్జెల ఘలఘల గుండెల మ్రోగ !
నెచ్చెలి నగవులు నిదుర నీయవుగ !
మద్దెల దరువులు ఉండనే ఉండు !
సర్దుకు పోవుటే సమయము నందు !
పచ్చని జంటకు పస్తులేల మరి !
విచ్చిన పున్నమి వెన్నెలేలనిక !
వెచ్చని కొగిలి నలుగుట కధలు !
మచ్చిక వెన్నెల పంచుకొనుటయు !
కనుల నే మూసినా కరువాయె నిదుర !
కనగ లేనేలనో కలనొకటయిన !
వనుకేల భయమేల సహజము ఇదియు !
సృష్టికి మూలము ప్రేమగా ఇదియు !
మనమున నిలిచిన మగువ రూపమది !
చెణుకులు విసరుచు చిలిపిగ జూచు !
తనువును తపముల తాళము ఇదియు !
తనివితీరములను దాటుట పనియు !
విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
--(())--
సోయగములు
నీడగా గొడుగుగా ఉంటాను
తోడు జతను నేను
మడుగులో పువ్వుగా ఉంటాను
అడుగు నీతొ ఉండు
పడగలా నీడగా ఉంటాను
మాడు నీడ గుండు
ఆడుతుసాగు సోయగములు
నీడగా నీకు నే నిలిచాను
తోడు నడచి వచ్చి
కాడిలా బరువును లాగకు
నడి వయసును కాదు
నాడిలా కలసియే ఉండాలి  
వేడి ఆట లొద్దు   
గుండెచప్పడు గ సోయగములు
కనుల లోన నిలిపి చూసితి
కనికరములు లేవు
తనువు అంతయు కళ్ళు ఉన్నాను
కలలు వీగి పోవు
మనసుకు మర్మము తెల్వదు   
చిన్న పెద్ద అడుగు
కనరాని చూపు సోయగములు
--(())--
నేటి సమస్యకు పురాణం పద్యాలు .....
ఇంకుల కల తీర్చి రాత మార్చు దెవరురా
జంకుయు మద మోహ మన్న లేని దెవరురా  
బింకము సుఖ శాంతి లేని భామ కలదురా
పంకజ ముఖి సీతవంటి భామ వలదురా!
వేకువ సుఖ సంతసమ్ము సేవ వలదురా
ఆకలి మన నేర్పు బట్టి తీర్పు కలదురా
చాకిరి మమకార మందు మాయ కలదురా
పంకజ ముఖి సీతవంటి భామ వలదురా!
చీకు చింతవలదు ఎపుడునూ
 తాకులే కలసి తినేటి సొగసును చూడరా
చిక్కులు తెలిసియు తాకురా
పంకజ ముఖి సీతవంటి భామ  వలదురా!
--(())--
సీ.
----
కార్మిక సోదర కళ్యాణ పర్వమ్ము
    నేఁడేయనిజగత్తు నిర్ణయంబు
కార్మికు లకిఁటమం గళమేది..విశ్వాన..?
    రహదారివాసమే మహదుపకృతి ??
పాలకవర్గాలు పనులనులాక్కొని
    వీథిలోపడవైచి వేడ్కఁజూడ
దయగలమేధావిదళమప్డు ముదమార
     ప్రతిభను గుర్తించి రాజుఁజేసె
గీ.
--
బాలతరుణవృద్ధజనులు చాల గలరు
కార్మికులుగ లోకమ్మున పేర్మిలేక
కొంతవిశ్రాంతి నిడవలె కూర్మిఁబంచి
వారినెల్లరు కనవలె భూరిమతిని !!! "
__(())--
సీస పద్యము ...
కంటిలో వెలుగులు కలకాల ముండును
కనతకు నెప్పియు కాన రాదు
కంటినీరు నిలవ కదలియు హృద్యమ్మ
చేరియు బాధయు జాడ్య మవ్వు
కన్ను రెపరెపలు కలకాల ముండియు
కన్నులు రక్షణ కామ్య తగును
కంటి పాపయు సర్వమును చూసి గ్రహించి
మనిషికి నడవడి  మౌన మవ్వు
తేటగీత
కనుల నల్లకలువరెప్ప కాపు కాసి
కంటి నీరుయు ఉడికిన కాటుకాపు
కల్ల చూపుల కలువలు కామితార్ధ
మిచ్చి ఆకర్ష మిచ్చియు ప్రేమచూపు
--(())---
సీస పద్యము ...
కామము మనసుకు గరళము లాంటిది  
గమ్యపు గోచరం క్రోధ మవ్వు
ఆవేశము కలిగి  ఆదుర్ద పెరిగేను  
మనసులోభ మోహమ్ము మనుగడవ్వు  
మదమువిజ్రుంభించి మాత్సర్యము మరచి
శకునిలా బుధ్ధికి శాప మొవ్వు  
పట్టిప పట్టుగ మనసుకు వీరంగ
మంతయు చూపుట  ప్రేమ కొరకు
తేటగీతి
సంయమనము పాటించి న సుఖముండు
వినయము వినమ్రత కలిగి ఓర్పు చూపు
సహజ ఓదార్పు చూపిన సౌమ్య మవ్వు
మనిషి బాగుంటె నడకకు ప్రేమ పుట్టు
**(())**
ప్రాఃజలి ప్రభ.... అంతర్జాల పత్రిక
సీస పద్యము .. ..
విశ్రాంతి సమయమే వీలుగ తల్లీతండ్రి
మనసు ప్రశాంతత పొందు చుండె   
ధీమాగ హాయిగ దర్జాగ ఉండేది
సుఖమును పంచేది స్నేహ మొకటి
రాజసం కలిగించి రమ్యత చెందును   
ఆలోచనల నిద్ర  హాయి గుండు
వచ్చిన బిడ్డలూ వారికి మర్యాద
అలసటల ను తీర్చి హాయి గుండు
తేటగీతి
అమ్మ విశ్రాంతి పొందాక  అలుపు తగ్గు
నాన్న ఆదమరిచి కలలు నడుమ నుండు
గురువు విద్యను బోదించి గుర్తు గుండు  
అందరూ శాంతి కొరకునే అరుగు దెంచు  
**(())**
సీస పద్యము .. ..
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విశ్రాంతి సమయమే వీలుగ తల్లీతండ్రి
మనసు ప్రశాంతత పొందు చుండె   
ధీమాగ హాయిగ దర్జాగ ఉండేది
సుఖమును పంచేది స్నేహ మొకటి
రాజసం కలిగించి రమ్యత చెందును   
ఆలోచనల నిద్ర  హాయి గుండు
వచ్చిన బిడ్డలూ వారికి మర్యాద
అలసటల ను తీర్చి హాయి గుండు
తేటగీతి
అమ్మ విశ్రాంతి పొందాక  అలుపు తగ్గు
నాన్న ఆదమరిచి కలలు నడుమ నుండు
గురువు విద్యను బోదించి గుర్తు గుండు  
అందరూ శాంతి కొరకునే అరుగు దెంచు  
**(())**
సీసపద్యములు
విశ్వాస మనునట్టి విజయమ్ము ఖచ్చితం     
చేరితే  రహస్యము జాగు గుండు        
స్నేహమ నేదియు  సేతులాగను ఉండు    
మంచి తనము తోను  పలుకు సాగు   
వినయ మనునదియే  విజయమ్ము ఖచ్చితం   
సుఖముగా బ్రతకుతూ  శాంతి గుండు           
విజయము కలిగేటి వైనపు ఓర్పుయు
ఓదార్పు కృషితోను  ఒడిసి పట్టు      
తేటగీతి
దయతొ సమసమాజ మనేటి  తలుపు తట్టు        
నిష్క కపటంతొ ఆత్మీయ నీడగుండు  
తల్లి తండ్రుల శ్రేయస్సు తీపి గుండు   
ప్రేమ పంచియు పొందేటి బ్రతుకు మాయ
--(())--       
సీస పద్యము
జనని గా సార్ధక జన్మను అందించి   
బిడ్డల మనసంత  నుండ గలుగు
జననిగా ధర్మాన్ని జాతికి అందించి   
క్రమ శిక్షణగపెంచు గమ్య మొవ్వు
జననిగా భర్తకు  చేదోడు వాదిగా  
కష్టములను తెల్ప కుంచ గలుగు
జననిగా భయమును తరిమేటి  ధైర్యము
ప్రేమతో శాంతిని పంచ గలుగు
తేటగీతి
సర్వ రక్షిత జననియే సహజ మవ్వు  
ధైర్య మిచ్చియు జననిగా ధర్మమవ్వు
మర్మ.మన్నది లేనిప్రే మలను నివ్వు
ధర్మ మార్గము బిడ్డల్ని త్రాసు గుంచు
***(())**

No photo description available.
ప్రాంజలి ప్రభు.... 01-05-2021
ఆనందం... ఆరోగ్యం.. ఆధ్యాత్మికం
విధేయుడు.....మల్లాప్రగడ
కార్మిక దినోత్సవ సందర్భముగా అందరికి శుభాకాంక్షలు
 

నేటి సోయగములు
 

ఏమని చెప్పను కార్మిక
విమల చరిత మేది
సమయ మాసన్న మైనదియును
సమము లేని దిక్కు
అమ్మమాటలు అన్ని జరిగేను
వమ్ము కాని బతుకు
కార్మిక చరిత సోయగములు
 

కలలు కన్నాను దేశ భక్తితో
కూలి లేని బతుకు  
కళలను నేర్చాను శక్తితో
కళల పోష నేది
ఆలికి నచ్చిన పనులను
రాలి నట్లు చేసి
గాలిని బేరము పెట్టియు
వాలి లాగ బతుకు
పలక లేనట్టి సోయగములు
 

సత్యమునే నమ్మి బతికాను
నిత్య వెలుగు కొరకు
నిత్యమూ సేవలు చేసాను
ముత్య మైన పలుకు
తత్వపు బోధలు చేసాను   
తత్వ మాయ బతుకు
వ్యత్యాసము గను సోయగములు
--(())--
 

(21-౩౦)  


చదువు లేకయే   
పనులు లేకయే
అన్న౦ లేకయే
కార్మిక కష్టము రామకృష్ణ  ! 


పలికే నీతియు
మారే బుద్ధియు
తెచ్చు ఖ్యాతియు  
వెలుగు జీవమే రామకృష్ణ  !


ఆరోగ్య కరమే  
సౌభాగ్యకరమే
సంతాన పరమే
ఆహ్లాదపరమే రామకృష్ణ  !


ఆలి ప్రేమము  
బంధాల భయము   
బాధలే వరము
బతుకే నరకము రామకృష్ణ  !


కాలమిది ఏన  
నరకమే అఐన
మార్గము లేకన
మాలో చింతన రామకృష్ణ  


ఆటల మలుపులు
వ్యాధితో కథలు
చూసే పెద్దలు
నిత్యము నరకము రామకృష్ణ  !


పెరిగే భారము
తరిగని రోగము
వదలని శాపము
తీరని మొహము  రామకృష్ణ !


తండ్రి మాట విని
తల్లి మాట కని   
మనసే ఎరగని
మమతే పండని రామకృష్ణ !


సత్యము పల్కియు
ధర్మము తెల్పియు   
న్యాయము బతికియు
తిండియే కరువు రామకృష్ణ 


హాస్యమాడితిమి
తస్కరించితిమి
జోలపాడితిమి
నిజము పల్కితిమి రామకృష్ణ !
--(())_- విధేయుడు మల్లాప్రగడ
 

సమస్యకు నా పద్యములు .........
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....

బ్రహ్మ రాతలు అర్ధము అగుట లేదు
బ్రహ్మ బృంగికి  దారియు తెలుప లేదు
బ్రహ్మ బంధము మార్చియు బతక లేదు
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
 

అమ్మ మాటలు పలుకులు అర్దమవగ
భృగు మహర్షుల మాటను పెట్టుకోక
మౌన  ముద్రగా శాంతిని మనకు ఇచ్చె   
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
 

శివుని శాపము బ్రహ్మకు శ్వాస అయ్యె
సత్యమును తెల్ప కుండుట సేవ అయ్యె  
నిత్యము వ్రాత బతుకుట నియమ మయ్యె
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
--(())--
 

జీవితం దృష్టి ప్రధానమైనది. ప్రతి ప్రాణికి చూపు చాలా అవసరమైనదేగాక విలువైనది కూడా! చూపునిచ్చే అవయవం కన్ను. దృష్టి ప్రాముఖ్యాన్ని గుర్తించిన మన పూర్వులు ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. భౌతికమైన ఈ జగత్తును, అందులోని మార్పులను గమనిస్తూ జీవన గమనం సాగించడం ఒకెత్తు. ఆంతరంగికమైన చూపును కలిగి ఉండటం మరొకెత్తు. అదే ‘లోచూపు’.


ఎవరికి వారు తమంతట తామే ఉన్నత మార్గంలో ప్రయాణించేటట్లు చేసేది ఈ లోచూపు. బాహ్య నేత్రాలు సాధారణ దృష్టినిస్తే, జ్ఞాననేత్రాలు ఆంతరంగిక దృష్టిని అందిస్తాయి. మామూలు చూపు కొన్నిసార్లు ఇంద్రియ లౌల్యానికి దారితీస్తుంది. అధోగతికీ లాక్కెళుతుంది. ‘కన్నుల చూచినందెల్లా కడు ఆసల దగిలి’ అని ఓ సంకీర్తనలో అన్నమయ్య చెప్పినట్లుగా, చూసిన ప్రతి విషయంపై ఆసక్తిని పెంచుకుంటే అది దుఃఖాలపాలు చేస్తుంది. ఆముప్పు దాపురించకూడదంటే జ్ఞాననేత్రాలు విప్పారాలి. ఆ కాంతిలో వ్యక్తిత్వం వికసించాలి. మొక్క సూర్యకాంతిని అందుకొని ఎదిగి మహావృక్షమై ప్రాణవాయువును, పుష్పఫలాలను, కలపను అందించి సమాజానికి ఉపయోగపడుతున్న స్పూర్తిని అందుకొని మనమూ వికసించిన వ్యక్తిత్వంతో సమాజసంక్షేమానికి కృషి చేయాలి.

అన్నమయ్య తన సంకీర్తన భాగవతంలో ‘ఎన్ని మార్లు సేవించిననూ కన్నులూ తనియవు’ అంటూ- భగవత్‌ సౌందర్యాన్ని వీక్షించడం నేత్రాలు చేసుకున్న గొప్ప యోగంగా అభివర్ణిస్తారు! ‘తెర తీయగరాదా నాలోని మచ్చరమను తెరతీయగారాదా తిరుపతి వేంకట రమణా’ అంటూ- నిన్ను దర్శించాలంటే పదివేల కన్నులు కావలెనయ్యా అంటారు త్యాగరాజస్వామి!


బాహ్యంగా చూసినదాన్ని విమర్శించడం మానవ సహజ లక్షణం. దీన్ని అధిగమించి లోచూపుతో నిన్ను నీవు విమర్శించుకో! నిన్ను నీవు సరిదిద్దుకో’ అంటారు విజ్ఞులు. ‘చదివితి తొల్లి, చదివేనింకా కొంత... ఎదిరి నన్నెరగను’ అంటారు అన్నమాచార్యులవారు ఓ సంకీర్తనంలో. ఎంతో కొంత చదివాను, ఇక ముందూ చదువుతాను. కాని నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ‘ఒరుల దూషింతు కాని, ఒక మారైన నా దురితకర్మములను దూషించను’ అంటూ బాహ్యదృష్టితో చూసి అందర్నీ తప్పుపడుతున్నాను కాని, అంతరదృష్టి కలిగి నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను అంటూ లోతైన జ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానం అందుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించారు.
లోచూపు సాధనకు ధ్యానం ఎంతో ఉపయుక్తమైనది. ఏకాగ్రమైన భావనతో మనసును కేంద్రీకరించినపుడు జ్ఞాననేత్రాలు విప్పారుతాయి. ధ్యానప్రక్రియ ఉత్తమ ఉపాసనామార్గం. అభ్యాసపూర్వకమైన ధ్యానం తమను తాము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానాజ్ఞాన విచక్షణ ఏర్పడి వివేకదర్శనం కలుగుతుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని నిత్యజీవనంలో ఆచరించేటట్లు చేస్తుంది. బుద్ధి ప్రచోదనం జరిగి మనసు నియంత్రితమై జీవితం సార్థకమయ్యేలా ఆశలు, ఆశయాలతో జీవనం సాగిపోతుంది. మంచి పనులు చేసే జ్ఞానాన్ని లోచూపు అందిస్తుంది. మనలోపల చుక్కానిలా ఉండి మనల్ని చక్కని మార్గంలో నడిపించే గురువే  లోచూపు!

చిన్న కధ
ఒకసారి చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు. అతను అడిగాడు:
'నేను ఎ౦దుకు పేదవాడను?
బుద్ధుడు సమాధానం చెప్పాడు: మీరు ఎ౦దుకు పేదవారు  అంటే మీరు  ఎటువంటి ఔదార్యము  కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు.
నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది? అని ఆ పేదవాడు అడిగాడు.
అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు
మీరు ఇతరులతో ప0చుకోగల ఐదు నిధులను కలిగివున్నారు.
 మొదట మీ ముఖం ఉంది. మీరు ఇతరులతో మీ  ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ... ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ..
రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు .. నిజం.. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు .. వాటిని మంచి అనుభూతిగా చేయండి ..
 

 మూడవది  మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించండి .. వాటిని విలువైనదిగా భావించండి .. ఆనందం మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ..
 నాలుగవది మీకు గుండె ఉంది. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు .. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు..
 మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం .. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ..అవసరమైనవారికి సహాయం చేయగలరు .. సహాయం  చెయ్యడానికి  డబ్బు అవసరం లేదు ..
ఒక చిన్న శ్రద్ధ ,సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు.
భగవంతుడు మనకిచ్చిన జీవితం..
కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !
ప్రతిక్షణం ఆనందంగాఉంటూ, పదిమందికి సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుందాం.
శుభం...
 

శీర్షిక : విషం చిమ్మే కాలం.
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
కాల యముడు విషమును పంచె  
గోల చేయు టేల
కలల పంటను తుంచు టెందుకో
వలలొ చిక్కు టేల   
జాలిలేదును జోలె పట్టినా
గాలి కూడ కరువు
కాలిపోయిన సోయగములేలు  
నిలవాలి ధర్మము ఏలనూ
కళ్ళు చెమ్మ గిల్లె
తెలపాలి బతుకులో న్యాయము  
అలక లెన్ని ఉన్న
కలలన్ని కాటికి చేరాయి
చిలక బతుకు లాగ
నిలబడి లేక సోయగములు
కాలి పొయే కట్టెనైనాను
జాలి చూపు చున్న  
గాలిలో గాలినై వెతికాను
ఆలి మాట పట్టి
తోలుతిత్తులోన నీటిలా
కాలె కడుపు నింపు
ఆకలి తీర్చు సోయగములు
--(())--
 

నేటి హాస్య కధ ..    "  మా అమ్మాయి   కనపడుట లేదు "   
మాయమై పోతున్న తెలుగు అమ్మాయి.
ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగు అమ్మాయిని చూసారా? చూస్తే చెప్పండి. అయ్యా! మీకు పుణ్యం ఉంటుంది.
ఓహో! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదుకదూ! ఆనవాలు చెపుతా, వినండీ.
 మా అమ్మాయి అమాయకంగా ఉంటుంది.
 చేతినిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవి లాగ ఉంటుంది.
 రెండు చేతులకూ గోరింటతో (మెహెంది కాదు), పాదములకు పారాణితో అందంగా ఉంటుంది.
 మా అమ్మాయి నిండుగా పరికిణి కట్టుకుని ఓణి వేసుకుని ఉంటుంది.
 తలకు చమురు రాసుకుని చక్కగా దువ్వి రొండు జడలు వేసుకుంటుంది.
 తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుంటుంది.
 చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిన పావళా కాసంత చంద్రబింబం లాంటి ఎఱ్ఱటి కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది (బొట్టు బిళ్ళ కాదు).
 కాళ్లకు మువ్వల అందెలతో (కాలి పట్టీలు అనకూడదు) ఘల్లుఘల్లు మంటూ ఇల్లంతా సందడిగా తిరుగుతుంది.
 ముద్దబంతి పువ్వులా, చిదిమి దీపము పెట్టుకునే లాగున, ఇంటికి కళగా ఉంటుంది.
 ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా? అగుపించినదా? మాకైతే గత పాతిక సంవత్సారాలుగా కనిపించడం లేదు. పండక్కో, పబ్బానికో, అక్కడ్డక్కడ తళుక్కున మెరిసి మాయమైపోద్ది అంతే !!!
..........
 

దానికి నేను రాసిన సమాధానం ఇది 👇
ఆమె ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగబ్బాయిని వెతుకుతూ వెళ్ళి, ఇంతవరకూ రాలేదు.
తెలుగబ్బాయి ఎవరా అనా?
ఆనవాళ్ళు చెపుతాను.
ధైర్యంగా ముందుకు పోయే తత్వం.
ఠీవిగా, పంచె, లాల్చీ, కండువాలతో ఉంటాడు.
నడిచొచ్చే విష్ణుమూర్తిలా ఉంటాడు.
కోరమీసంతో, కోటేరు ముక్కుతో ఉంటాడు.
అందరినీ వరసలు కలిపి, నవ్వుతూ పలకరిస్తుంటాడు.
తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుతుంటాడు.
చక్కని కుంకుమబొట్టుతో మెరిసిపోతుంటాడు.
తల్లిదండ్రులను అమ్మా నాన్నా అని నోరారా పిలుస్తాడు. అత్తా, మామా,  బాబాయ్ లాంటి భారతీయమైన పిలుపులే వాడుతాడు. అనవసరంగా మ్లేచ్ఛభాష వాడడు.
అడగకుండానే తోటివారికి తోచిన విధంగా సాయం చేస్తుంటాడు.
చూడటానికి రెండు కళ్ళూ, చెప్పటానికి మాటలూ చాలవు అన్నట్టుగా ఉంటాడు.
చూసి చాలా కాలమైంది. తననే వెతుకుతూ వెళ్ళి ఉంటుంది తెలుగమ్మాయి. ఒక్కటి మాత్రం నిజం. వస్తే ఎప్పటికైనా వీళ్ళు కలిసే వస్తారు. రావాలనే ఆశిద్దాం.
--(())--
 

మ్యము సుఖాల గమనం రమణి రాజ్యం
గమ్యము విశాల హృదయం కమల హాసన్
సౌమ్యము వినోద వదనం సకల హృద్యం
కామ్యము వివాహ కమతం కలల బంధం
 

సోయగములు
ఎంత మధురమోను ప్రేమలే    
వింత అనుభవమ్ము
సంత సమ్ముగను ఉండేనులే
కొంతకళల మాయ
మందమారుతము వీచేనులే  
సందడంత చేసి
మందహాసపుముగను సోయగములే
 

మల్లెల తీవియ తొందర
మెల్లగాను సాగు
ఉల్లము జల్లున తొందర
చల్ల గాను సాగు
అల్లము ఘాటున తొందర
జల్లు వాన లాగు
మల్లెలమాలసోయగములు
 

మధుపము సుధకైను చిందులు
విధియె మొహమవ్వు
విధివాద సౌఖ్యపు పొందులు
మదిని గాయ పరుచు   
ఎదలోన భావపు పలుకులు  
ఏది ఎంత వరకు
ఎదలోన మార్పుసోయగములు

--(())--
 

: మనిషి హృదయం
 

చెట్టును చెట్టుగానే చూస్తాడు. చెట్టులో ఏమీ అందం కనిపించదు. పుట్టను మట్టిగా చూస్తాడు. పుట్టలో చీమలు ఉన్నాయా, పాముందా అనేవి అతడికి అనవసరం. మంద్ర స్థాయిలో వీచినా, తీవ్రంగా వీచినా... గాలి గాలే. అందులో ప్రాణవాయువు ఉంటుంది. మనం బతుకుతున్నాం. అది కలుషితం కావడం వల్ల రోగాల పాలవుతున్నాం.
మనిషి గలగల పారే నదిని చూస్తాడు. అందులో నాచు, క్రిమి, కీటకాలు ఉంటాయి. ఆ నీళ్లు నేరుగా వాడకూడదు అంటాడు. సూర్యుడు వస్తాడు. వెళతాడు. అది ఆయన పని.  చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడి బతుకుతాడు. స్వయం ప్రకాశం లేదు. గ్రహాలంటారా? అవి సౌర వ్యవస్థలో ఒక భాగం. అలా తిరుగుతూనే ఉంటాయి. పని లేనివాళ్లు తిరుగుతున్నట్లు... ఇదీ వరస. ఇలా ఉంటాయి ఆ వ్యక్తి ఆలోచనలు... ప్రకృతిలో కలిసి బతుకుతాడు. ప్రకృతితో ఏం సంబంధం లేనట్లే ఉంటాడు. ప్రకృతిని ఒక యాంత్రిక వ్యవస్థగా చూస్తాడు.
సంఘంలో అందరితో కలిసి ఉన్నట్లు కనిపిస్తాడు. కాని అన్నీ వ్యావహారిక వ్యాపార సంబంధాలే నెరపుతుంటాడు. డబ్బు లేకపోతే గౌరవం ఎక్కడ ఉంది? అసలు గౌరవం ఎక్కడ ఉంది? అన్నీ ఇచ్చి పుచ్చుకోవడాలే కదా. కనుక వ్యాపారం లేకపోతే బతుకే లేదంటాడు.
భావాలు, స్పందనలు, సౌందర్య ఆరాధన, లాలిత్యం, సౌకుమార్యం, జీవనం మీద నమ్మకం... అతడిలో మచ్చుకైనా కానరావు.
 

పుట్టాం. బతుకుతున్నాం. చావాలి. దానికోసం ఎదురు చూడాలి. అంతా భౌతికమే. కనిపిస్తున్నవాడే మనల్ని రక్షించడం లేదు. కనపడనివాడు ఏం రక్షిస్తాడు? అదంతా పెద్ద భ్రమ. మాయ. కొంత మంది మనుషులు కూడగట్టుకొని చేస్తున్న గారడి అని తలపోస్తాడు.
ఇలాంటి భావాలతో కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్లనెవరూ కాదనలేరు. వాళ్లు ప్రపంచాన్ని చూసే విధానం భిన్నంగా ఉంటుంది.
 

మనిషి మనిషిలా ఉండాలి. సహజ మానవ స్పందనలను నిగ్రహించుకుని హృదయాన్ని కోల్పోకూడదు. హృదయం లేకపోతే ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే విశ్వ సౌందర్యం తెలియదు. ఈ జగత్తును ఇంత అద్భుతంగా సృష్టించడం వెనక విధాత ఉద్దేశాన్ని ఎప్పటికీ గ్రహించలేం.
 

ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం సృష్టి సూత్రం. అంతా ఒక గొప్ప సంగీత వాయిద్యం మీద పలికించే దివ్య రాగాల ఝరి.
నిమిత్తమాత్రంగా ఉండటం మంచిదే. అది జ్ఞానోదయమై సత్య రహస్యం తెలుసుకున్నప్పుడు ఏర్పడిన దివ్య వైరాగ్య స్థితి. అజ్ఞానంతో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకుని హృదయానికి, మనసుకు ఉన్న లంకెను తెంచుకుని తామరాకు మీద నీటిబొట్టులా బతుకుతున్నానని చెప్పుకోవడం సరి కాదు.
 

సత్యం శివం సుందరం ఏమిటో బోధపడాలంటే మనసులోని యాంత్రికతను తొలగించుకుని, తర్క వితర్కాలతో కూడిన మనసును జీవన తత్వంలో ఉన్న ప్రేమతో అనుసంధానం చేసుకోవాలి. నమ్మకం, అపనమ్మకం మధ్యలో సత్యం నివసిస్తుంది. గొప్ప ఆలోచనలు దాన్ని చూపిస్తాయి.
 

మనిషి మట్టి మనిషే. అతడి హృదయం మాత్రం మట్టి కాదు. ప్రపంచం ఎలా ఉందో అలా చూడాలంటే లోపలికి చూడటం ఒక్కటే మార్గం. అక్కడ మట్టి మీద మొలిచిన మహా సౌందర్యలోకాలు ఎన్నో ఉన్నాయని అంతస్సౌందర్య వీక్షకులైన జ్ఞానులు చెబుతారు!
 

--(())--

 మహిత గుణ సంపద

శరీరానికి గుణాలకు ఎంతో అంతరం ఉంది. శరీరం క్షణ భంగురం. గుణాలు ఆకల్పాంతం నిలిచే ఉంటాయి- హితోపదేశంలోని ఒక శ్లోక భావం ఇది గుణాల వల్ల కలిగే కీర్తి చరిత్రలు నాశనం లేనివని అర్ధం సద్గుణ సంపత్తి గలవారి జీవితాలు ఎల్లప్పుడూ సమాజానికి అనుసరణీయమే. మహానుభావుల మంచి గుణాలను, మహిత చైతన్యాన్ని శక్తి మేరకు అనుసరించి ఆ స్ఫూర్తితో జీవించడం ఆవశ్యకమైన లక్షణం. అటువంటి ఆదర్శ జీవన విధానం వల్ల జాతి, దేశం, సంప్రదాయం, సంస్కృతి, జీవనవికాసం సురక్షితమవుతూ ఉంటాయి.

మహాకవులు మహాపురుషుల జీవితాలను ఉజ్వలంగా చిత్రించి భావితరాలకు వెలుగుబాటలు పరిచారు. సంస్కృత సారస్వత ప్రపంచంలో కవికుల గురువు కాళిదాసు. ఆయన కావ్యాల్లో రఘువంశం ప్రసిద్ధమైంది. ధర్మరక్షకులైన రఘువంశ ప్రభువుల చరిత్రల్ని ఉదాత్తంగా చిత్రించి ఆ ఆదర్శ జీవన క్రమాన్ని కాళిదాసు పాఠకులకు బోధించాడు. రఘువంశ రాజుల్లో దిలీపుడి సేవాపరాయణతను, రఘు మహారాజు దాననిరతిని, అజుడి కోమల స్వభావాన్ని, శ్రీరాముడి ఆదర్శ జీవితాన్ని సర్వోత్తమంగా చిత్రించాడు. కావ్యారంభంలో కాళిదాసు రఘువంశీకుల ఉదాత్త గుణాలను పేర్కొని, అవి తనను వారి చరిత్ర రాయడానికి ప్రేరేపించాయని తెలిపాడు. దానం చేయడం కోసం ధనం సంపాదించడం, సత్యం కోసం మితంగా మాట్లాడటం, కీర్తి కోసం శత్రువులను జయించడం పితృరుణ విముక్తికి సాధనమైన సంతానం కోసం వివాహం చేసుకోవడం ఆనే గుణాలు కలిగినవారిగా సూర్యవంశ ప్రభువుల్ని వర్ణిస్తాడు. కాళిదాసు. ఈ లక్షణాలు ఏ కాలంలోనైనా మానవ సమాజానికి

వర్తిస్తాయి మనిషి ధనం సంపాదించాలి కాని అత్యాశతో కాదు కూడబెట్టాలన్న తపనతో కాదు. మన ఆర్డన, వ్యయం రెండూ దర్మబద్ధంగా ఉండాలి. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన ధనం సంపాదించేవారిలో కలగాలి. తమ రాజ్యంలోని పేదలకు కూడు, గుడ్డ, గూడు కల్పించవలసిన బాధ్యత పాలకులపై ఉంది. నేటి అంతర్యామి పాలకులే కాదు, సంపన్నులందరూ ధనం ప్రయోజనం త్యాగమని గుర్తుంచుకోవాలి. ఎంత మితంగా మాట్లాడితే అంత మేలు. సాధారణంగా తక్కువగా మాట్లాడినప్పుడు సత్యమే పలకగలం. మితవాక్యం హితవాక్యం కావాలి. వాచాలత్వం అసత్యాలకు, అనౌచిత్యాలకు నెలవు కావచ్చు.

పూర్వం రాజులు కీర్తికాంక్షతో శత్రువుల్ని జయించేవారు. ఆధునిక ప్రపంచంలోనూ స్పర్థలంటాయి. ఆరోగ్యకరమైన పోటీవల విద్యలు వర్ధిల్లుతాయి. జిజ్ఞాసతో పాండిత్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకొని తనను మించినవారిని గెలవాలనే పట్టుదల వాంఛనీయమే. ఇది కుటిల ప్రయత్నాల వల్ల కాక సక్రమ పద్ధతిలో జరగాలి. కామం ఒక పురుషార్ధం. అది అతి శక్తిమంతమైంది. కామ తృప్తికి వివాహమే ఉత్తమ మార్గం. శారీరక సుఖం కాక సంతానోత్పత్తిని వివాహ పరమార్ధంగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. భారతీయ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది. తన పూర్వీకుల పరంపరను తన ద్వారా మరో తరానికి అందించడం ప్రకృతి ధర్మం. తన వారసత్వంగా ఇంకొక తరాన్ని సృష్టించడం వల్ల పితృ రుణం నుంచి విముక్తులవుతారని రుషుల సందేశం

త్యాగం, సత్యభాషణం, కీర్తి, కాంక్ష, సంతాన సృష్టి అనే ఈ నాలుగు భావనలూ చాలా ఉత్కృష్టమైనవి. మహా కవులు ఎవరికి ఆపాదించి చెప్పినా ఆ గుణాలు లక్షణాలు మొత్తం మానవ జాతికి అనుసరణీయమని వారి దృష్టి క్రాంతదర్చులైన కవుల వాక్కులు సర్వ కాలాలకు, సకల జనులకు శిరోధార్యం. ప్రాచీన వాంగ్మయం అందించే అమృత సందేశం విస్మరించరానిది

--(())--

మన జీవితంలో ఎదురయ్యే వారంతా  మనకు గురువులే . మంచి వారు పాఠం నేర్పుతారు  చెడ్డవారు గుణ పాఠం నేర్పుతారు . మంచితనం అందరిలో వుండదు , అందరికీ నచ్చదు . అందుకే మంచితనానికి నిందలు ఎక్కువ , నమ్మకం తక్కువ . అనుమానం ఎక్కువ , అభిమానం తక్కువ . అయితే కాలానికి , కర్మకూ జ్ఞాపక శక్తి ఎక్కువ . ఎంతకాలం తరువాతైనా సరే మనం చేసిన మంచి , చెడు లకు ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు . పుట్టుక మనది కాదు , చావు మనది కాదు , భూమి మనది కాదు , ప్రకృతి మనది కాదు , మనదీ అని మిగిలేది విశ్వాసం , నమ్మకం , ప్రేమ , మంచితనం , స్నేహం మాత్రమే . ప్రపంచంలో మనకోసం ఎవరూ లేకపోవచ్చు  కానీ ఎవరికో ఒకరికి మనమే ప్రపంచం లా కనిపించవచ్చు . వయస్సు పెరిగే కొద్ది మనుషులు ఒంటరివారు అవుతుంటారు . కానీ వయస్సు పెరిగే క్రమంలో స్నేహాలు వారి వయసును మరిపించే ఔషధాలు అని మానసిక నిపుణులు చెబుతుంటారు . అది అక్షరాలా నిజం . అందుకే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా , హాయి గా వుండాలంటే అందరితో స్నేహంగా వుండాలి , మంచి స్నేహితులని తరచుగా కలుస్తూ వుండాలి . కాలం , పరిస్థితులు మారుతూ ఉంటాయి కానీ చక్కని బంధం స్వఛ్చమైన స్నేహం ఎప్పటికీ మారదు .
ఇదే జీవిత సత్యం . సర్వే జనా సుఖినోభవంతు.
--(())--


ఆసరా
                                  *
అదో గేటెడ్ కమ్యూనిటీ..లోపల అన్నీ
రిటైర్మెంట్ హోమ్స్...
ఉదయమే ఐదున్నర కల్లా తమ ఇంటినుండి ఉదయపు వ్యాహ్యాళికి బయలుదేరి రెండిళ్ల అవతల ఇంట్లో ఉంటున్న వాసుదేవరావు గారిని కలిసి,  ఒక గంట నడిచి రావడం రామారావు గారి దినచర్య...

ఇప్పుడు ఇటువంటి హోమ్స్ ఎక్కువ వచ్చాయి..
వివిధ కారణాలతో పిల్లలు దూరంగా ఉండి, పని
మనుషులు అందుబాటులో లేక, ఉన్నా భద్రత లేక, ఒంటరిగా అవస్థ పడలేక,  చాలామంది పెద్దలు ఇప్పుడు రిటైర్మెంట్ హోంలలోకి మారుతున్నారు.

రిటైర్మెంట్ హోమ్ లు అన్నీ పక్కపక్కనే   కాటేజెస్ లా ఉంటాయి...ఇక్కడ స్వేచ్ఛగా, గౌరవంగా తమింట్లో తాము వుంటూనే అన్ని  సౌకర్యాలు పొందొచ్చు..
ఇక్కడ అందరివీ సొంత ఇళ్లే..
సొంత ఇల్లు అయినప్పుడు ఎక్కడున్నా ఒక్కటే...పైగా భద్రత సకల సౌకర్యాలు అందించే బాధ్యత కొన్ని సంస్థలు తీసుకుంటాయి...

సకల సౌకర్యాలతో.. వృద్ధ శ్రీమంతుల.ఇళ్ళు అవి...
ఎన్నారై పిల్లలు తమ తల్లితండ్రులకు కొనిపెట్టిన ఇళ్ళు కూడా...

రామారావు గారు వెళ్ళేసరికి ఇంటిముందు వాసుదేవరావు గారు లేరు...
నిద్ర లేవలేదేమో అనుకుని..సర్లే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఆయన ముందుకు వెళ్లిపోయారు...అక్కడ ఇంకో స్నేహితుడు కలవడంతో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్లిపోయారు...

గంట తరువాత తిరిగి వస్తూ చూసేటప్పటికి అప్పటికీ వాసుదేవరావు గారి ఇంటి తలుపులు తెరిచి లేవు...
మళ్లీ బెల్ కొట్టినా  ఎవరూ తలుపు తీయలేదు..
తాళం వేసుకుని బయటికి వెళ్లినా తెలీదు ఈ కొత్త పద్ధతులతో అనుకుని తన ఇంటికి వెళ్లిపోయారు...

ఆ సాయంత్రం వరకూ కూడా కనపడకపోవడం తో ఆఫీస్ కి వెళ్లి అడిగారు..వాసుదేవరావు గారి ఇంటి నెంబర్ చెప్పి..
వాళ్ళు వెంటనే.   వాళ్ళు వెళ్లిపోయారు కదా సర్..నిన్ననే... అని..
మీరు రామారావు గారా..మీకిమ్మని ఈ కవర్ ఇచ్చారు అన్నారు..

ఆయన అదేంటి..?  అనుకుంటూ.. కొంచెం ఆతృతగా
అక్కడే కూర్చుని.. కవర్ ఓపెన్ చేసి చదవడం మొదలెట్టారు...
రామా...!
నువ్వు మా గురించి  ఆందోళన పడతావని తెలుసు...అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను...
మేమిద్దరం బాగున్నాము కంగారు పడకు..
సావధానంగా చదువు...

నేను ఒక నెల క్రితం ఒక న్యూస్ పేపర్ లో ఒక మూల చిన్న ప్రకటన చూసాను...
విచిత్రం అనిపించింది...
వాళ్ళకి ఇద్దరు వయసైన భార్యాభర్తలు తమకి తల్లిదండ్రులు గా ఉండాలని...ఏ బాదరబందీ లేని వాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆరోగ్యం గా ఉన్న భార్యాభర్తలు  కావాలని...కింద నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని...
వెంటనే ఆసక్తిగా ఫోన్ చేసాను...
అతను ఆఫీస్ లో ఉన్నాను....తనే ఫోన్ చేస్తాను అన్నాడు..
నేను మరచి పోయాను...శనివారం అతనికి సెలవు రోజు
అతనే కాల్ చేసాడు నాకు..
అతని పేరు గోకుల కృష్ణ ట...
సాఫ్ట్వేర్ ఇంజినీర్..భార్యా భర్తలు ఉద్యోగస్తులు...ఒక పాప...
తన వివరాలు చెప్పి నా వివరాలు అడిగాడు...
నేను నా గురించి చెప్పాను...
అంతా విన్నాడు...
ఒకసారి వచ్చి కలిసాడు...
నన్ను, రాజేశ్వరి ని..
అతని ద్వారా తెలిసిందేంటంటే ఆ గోకుల కృష్ణ, అతని భార్య మాధురి కూడా అనాధాశ్రమంలో
పెరిగారట...
వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం ట...
వాళ్ళు చదువుకుని ఉద్యాగాలు వచ్చాకా
ఇద్దరూ పెళ్లి చేసుకున్నారట...
ఒక సంవత్సరం పాప ఉందట...
పాపని చూసుకోడానికి ఒక మనిషిని పెట్టుకున్నారట...

అయితే ఎవరైనా పెద్ద వాళ్ళు ఇంట్లో వుండి కనిపెట్టుకుని ఉంటే బాగుంటుందని అనిపించిందిట...
అతని భార్య ఆలోచనట ఇది...మనిద్దరికీ ఎవరూ లేరు...
ఎవరైనా పిల్లలు లేని పెద్దవాళ్ళని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకి అండదండగా ఉంటుంది...
వాళ్ళకీ మన సపోర్ట్ ఉంటుంది...
మన పాపకి తాతా బామ్మల్లా ఉంటారు...
అని ఈ ఐడియా ఇచ్చిందట...

అతనికి నచ్చి ఈ ప్రకటన ఇచ్చాడట...
కానీ మాకు పిల్లలున్నారు కదా...అని సందేహం వ్యక్త పరిచాడు...
మేము మా పరిస్థితి చెప్పాము...
మా పిల్లలు ఒప్పుకోరేమో గొడవలవుతాయేమో అని భయపడ్డాడు...
కానీ మేమిద్దరం నచ్చామని అన్నాడు...అది అతని కళ్ళలో కనపడింది..
మేమిద్దరం ఎడ్యుకేటెడ్, జాబ్స్ చేశాం.. మా ప్రాపకంలో వాళ్ళ పాప చక్కగా పెరుగుతుంది అన్న నమ్మకం కలిగింది అన్నాడు...
నాకూ అతని పద్ధతి, అతని ఆలోచనా తీరు నచ్చింది..
ఇక్కడ  మేము ప్రశాంతంగా జీవిస్తున్నాము..ఒంటరి తనం లేదు
దేనికి లోటు లేదు...
కానీ మాబ్రతుక్కి ఒక అర్ధం ఉండాలనిపించింది...
నెను రాజేశ్వరితో మాట్లాడాను...
తానూ చదువుకుంది కాబట్టి  తనూ ఆలోచించింది...
మేమిద్దరం ఏమనుకున్నాం అంటే..మా పిల్లలా ఇక్కడికి రారు...
మాకు వాళ్ళ దగ్గరికి అన్నేసి గంటలు కూర్చుని ప్రయాణం చేసే ఓపిక లేదు...
ఇలా ఉంటే బాగుంటుందని అనిపించింది...
ఒకరోజు అతను తన భార్యను తీసుకుని వచ్చాడు...
మీ అందరితో నా స్నేహితుడు కొడుకు కోడలు అని చెప్పాను నీకు గుర్తుందో లేదో...
ఆ అమ్మాయి కూడా మంచి పిల్ల...
మాతో మనసు విప్పి మాట్లాడింది...తనకు ఒక కుటుంబం కావాలని...ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే బాగుంటుందని వాళ్ళకి అనిపించిందట..
వాళ్ళ పాప అన్నీ అంటే మన సభ్యత, సంస్కృతి  నేర్చుకునే అవకాశం ఉంటుందని...

ఒక నెల రోజులుగా మేము ఒకరికొకరు బాగా తెలుసుకున్నాకా మా నలుగురికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడ్డాకా...ఒక బాండింగ్ ఏర్పడ్డాకా...
నేను మా పిల్లలతో మాట్లాడాను...

వాళ్ళు షాక్ అయ్యారు... మాట్లాడారు
పోట్లాడారు ...ఇదేంటి అన్నారు...వద్దు అన్నారు..
మీ డబ్బు చూసి వచ్చారేమో అన్నారు...
మేము చెప్పాము వివరంగా...మా పైసా కూడా వాళ్ళు వద్దన్నారని, గోకుల్ వాళ్ళ మొత్తం వివరాలు ఇచ్చాను...

వాళ్ళకి మేము..మాకు వాళ్ళు ఆసరాగా ఉందామని నిర్ణయం తీసుకున్నామని...
మాకు ఇప్పుడు కావలసినవి హంగులతో ఉన్న ఇల్లు, ఫర్నిచర్, సౌకర్యాలు కాదు...
కొంచెం ప్రేమా ఆప్యాయతలు ఇచ్చే మనుషులు కావాలని...

గోకుల్, మాధురి ఇద్దరూ కూడా మీ
బట్టలు తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి...అవి కూడా తీసుకురాకపోయినా పర్వాలేదు అన్నారు...

వాళ్ళది మూడు బెడ్ రూముల ఫ్లాట్...గేటెడ్ కమ్యూనిటీ లో ఉంది...
పొందికైన ఇల్లు...రోజూ పొద్దున ఒక నానీ వచ్చి సాయంత్రం వాళ్ళొచ్చేవరకూ పాపని చూసుకుంటుంది...
మేము  ఆ పాపకి తాతా అమ్మమ్మ లానో తాతా బామ్మలాగో ప్రేమని ఇవ్వాలి...
మాకూ శ్రమ లేదు...

మేము పిల్లలని ఒప్పించాము...
చూద్దాం...మేము అడ్జస్ట్ అవుతామనే నమ్మకం ఉంది..అందుకని ఇక్కడ ఖాళీ చేస్తున్నామని లెటర్ ఇచ్చాము...
ఈ మా ఇల్లు రెంట్ కి ఇచ్చేట్టు మాట్లాడాము...
మా బట్టలు రెండు సూట్ కేస్ ల్లో సర్దుకుని అతనితో కార్ లో పంపించాము...

మిగిలిన ఇంట్లోని ఫర్నిచర్ అంతా అలానే ఉంచాము...
అందరికీ చెప్పకుండా వెళ్ళాము కావాలనే...
ఇవన్నీ అందరికీ తెలియడం ఎందుకని...
వాళ్ళు కూడా వాళ్ళ సర్కిల్ లో వాళ్ళ పేరెంట్స్ గానే చెప్తామన్నారు...
మమ్మల్ని  "మా అమ్మా నాన్నగారు అంటే"... "మా అమ్మా నాన్నగారు"  అని గోకుల్ మాధురి పొట్లాడుకుంటుంటే నిజంగా ముచ్చటేసింది మాకు..రామా...!!

నిన్ను, రామలక్ష్మి గారిని తరువాత వచ్చి కలుస్తాము...
మీరూ మా ఇంటికి వస్తూ ఉండొచ్చు...
మనకి ఫోన్ లు ఎలానూ ఉన్నాయి...
రామా...ఇద్దరం ఉండలేకపోతున్నాం రా...ఇది అందరి సమస్య..అనుకో...
చూద్దాం ఈ దారి కొత్తగా ఉన్నా దేవుడే చూపించాడేమో...
ఈ వయసులో మేము వాళ్ళకి ఉపయోగపడతామో..మాకు వాళ్ళు ఉపయోగపడతారో కాలమే నిర్ణయిస్తుంది...
నువ్వే నాకు దగ్గర అయ్యావు కాబట్టి నీకు చెప్పడం నా బాధ్యత అనిపించింది...
ఉంటాను..
వాసుదేవరావు

ధర్మ నిధులు

ధర్మ స్వరూప నిరూపణం, కర్తవ్య నిర్వహణం, భవబంధ విమోచనం అనే మూడు అంశాలూ మానవ ధర్మానికి మూడు స్కంధాలు. వీటిలో మొదటిదానికి మహాభారతం, రెండోదానికి రామాయణం, మూడోదానికి భాగవతం దర్పణాలుగా పండితులు భావిస్తారు. భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలు, జీవధారలూ అయిన గ్రంథరాజాలు ఇవి. మానవ జాతికి సంస్కారాన్ని అందించే ఈ గ్రంథాల్లో సనాతన ధర్మం ప్రతిష్ఠితమై ఉంది. ఈ మూడు గ్రంథాల గమ్యం వేదప్రతిపాదనం. వేదమనే అంతర్యామితత్త్వానికి దేహేంద్రియ మానసాల్ని కల్పించి మూర్తిమత్వాన్ని పరికల్పించడమే ఈ మూడు గ్రంథాల పరమార్థం. వేదవేద్యుడైన పరమ పురుషుడు నరుడిగా ఎలా ప్రవర్తించాడో తెలిపేది రామాయణం. వేదాన్ని సమగ్రంగా మథనం చేసి ధర్మామృతాన్ని ఇచ్చింది మహాభారతం. భౌతిక జీవితం పొందిన జీవుడు నారాయణుడిగా వెలిగి, వెలిగించడానికి భావైక గమ్యమైన సులభ భక్తి మార్గాన్ని ఉపదేశిస్తుంది భాగవతం. వీటిని ప్రసాదించిన వాల్మీకి, వ్యాస మహర్షులు వేదావతారమూర్తులు.

సమస్త విశ్వంలో వ్యక్తి తాదాత్మ్యం చెందే స్థితిలో రామాయణ మహాకావ్యం ఆదికవి హృదయం నుంచి ఆవిర్భవించింది. తపస్వి వాల్మీకి సర్వమానవ జగత్కల్యాణానికి ఉపకరించే సద్గుణ సముపేతుడైన వ్యక్తి ఉన్నాడని నారదుడి ద్వారా తెలుసుకొని ఆ వ్యక్తి దృక్పథాన్ని ఉదాత్త రీతిలో హృదయాకర్షక కథనంగా చెప్పడానికి సంకల్పించాడు. ఈ భూమ్మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం లోకంలో రామాయణం స్థిరంగా నిలిచి ఉంటుందని బ్రహ్మ వాల్మీకిని ఆశీర్వదించినట్లుగా పండితుల వాక్కు. మంచిచెడుల సంఘర్షణ శ్రీరాముడి ప్రయాణం వెనక అంతర్లీనంగా గోచరిస్తుంది. దైవాంశను తనలోనే దాచుకొని విశ్వప్రేమ సుగంధాన్ని, ప్రేమను, కరుణను చుట్టూ ఉన్న ప్రపంచానికి పంచిపెట్టిన ధీరోదాత్తుడు శ్రీరాముడు. జీవితంలో అన్ని కోణాలకూ వర్తించిన శాశ్వత విలువలు కలిగిన విశ్వకావ్యం రామాయణం.

కృష్ణ ద్వైపాయనుడనే వ్యాసుడు భారతీయ సంస్కృతీ ప్రాసాదానికి మూలస్తంభం. వేదాలు బోధించే ధర్మాధర్మాల్ని సామాన్య మానవులకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసమే కౌరవ పాండవ కథా కథన వ్యాజంతో మహాభారతం రచించాడు. అందుకే భారతం పంచమ వేదంగా ప్రశంసలందుకొంది. మహాభారతం విజ్ఞాన సర్వస్వం. వ్యాసమునీంద్రులు దర్శించిన భారతం భారతీయ తత్వ సమగ్ర దృష్టి. విశ్వవాఙ్మయంలో ఇంతగా మానవ హృదయాన్ని మధించి వివిధ రీతుల్లో విస్తృతంగా చిత్రించిన కావ్యం మరొకటి లేదు. అన్ని కాలాలకు, అన్ని దేశాలకు ఉపయోగించే ధర్మాలు భారతంలో ఉన్నాయి. బహువిధ సంకీర్ణమైన మానవత్వ భావగతుల్ని అద్భుతంగా చిత్రించింది భారతేతిహాసం.

భగవంతుణ్నీ భక్తుణ్నీ సంధానించేది భాగవతం. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక తత్త్వాల స్వరూప స్వభావాల కూడలి, నిరాకారమైన భక్తికి సాకారమైన కథనం భాగవతం. భక్తికి, ముక్తికి ప్రాణాధారమైనది భాగవతం. భాగవత పఠనం మనిషిని శాంతచిత్తుణ్ని  చేస్తుంది. రామాయణం కావ్యమని, భారతం ఇతిహాసమని, భాగవతం పురాణమని స్థూలమైన అవగాహన. ఈ మూడు గ్రంథాలూ మానవ జాతిని అనుగ్రహించడం మొదలుపెట్టి ఎన్ని వేల సంవత్సరాలయిందో! ఈ జాతి వారసత్వ సంపదగా ఈ అక్షర సౌధాలు నిత్య నూతనంగా ప్రకాశిస్తూనే ఉంటాయి.

అని ఉంది...

రామారావు గారు లేచి,  వాళ్ళు ఈ వయసులో ఏది కావాలని వెళ్లారో... అది వాళ్ళకి పుష్కలంగా దొరకాలి దేవుడా.. అని,  మనసులో అనుకుని .. ఆ ఉత్తరం జేబులో పెట్టుకుని,  ముందుకు కదిలారు...
        కధలు సేకరించుట జరిగింది వివిధ మార్గాలు ఆదరిస్తున్న అందరికీ శుభాకాంక్షలు