Monday, 20 June 2022

341--345



341 : బాలవినష్టకుని కథ-
పూర్వం ఒక రాజ్యంలో రాచకొలువును చేసే రుద్రశర్మ అనే బ్రాహ్మణునకు ఇద్దరు భార్యలున్నారు. అందులో ఒకామె ఒక కుమారుని గనిన వెంటనే చనిపోయింది. రుద్రశర్మ పుట్టిన శిశువును రెండవ భార్యకిస్తూ 'నీకొడుకుతో పాటు ఈ బాలునికూడా పెంచ'మని అప్పగించాడు. సవతి కొడుకునకామె తీక్ష్ణమైన ఆహారమివ్వటం చేత ఆతని పొట్టపెరిగి ధూసర వర్ణం(బూడిదరంగు) కలవాడయ్యాడు. రుద్రశర్మ భార్యతో 'బాలునీవిధంగా ఎందుకు పెంచుతున్నా'వని అడుగగా ఆమె 'ఇతని పుట్టుకయే ఇట్లాంటి'దని నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చింది. అప్పటినుండి ఆ బాలకునకు బాలవినష్టుకుడనే (బాల్యం కోల్పోయినవాడు) అనే పేరు వచ్చింది.
ఆ బాలకునకు వయసుతో పాటు బుద్ధికూడా పెరగసాగింది. ఆతనికి ఐదేండ్లు వచ్చాయి. ''నా సవతి తల్లి నన్నెప్పుడు ఇబ్బంది పెడుతున్నది. దీనికేమన్నా ప్రతిక్రియ చేయా''లనుకున్నాడు. రాజకొలువునుండి అప్పుడే ఇంటికి వచ్చిన తండ్రితో ఆ బాలుడు తనకిద్దరు తండ్రులున్నారన్నాడు. ఈ విధంగా ప్రతిదినం పలకటంచే తండ్రికి భార్యపై అనుమానం వచ్చి ఆమెతో మాట్లాడటమే కాకుండా తాకటం కూడా మానివేసాడు. దీనితో తల్లికి ఈ బాలవినష్టకుడే ఏదో చేసి ఉంటాడనే సందేహమేర్పడి ఆతనికి మంచి చేసుకొని పెరుగన్నం తినిపించి 'నీతండ్రి అనుమానానానికి కారణమేమి'టని అడిగింది. దానికాతడు ఆమెతో '' నీవు నీపుత్రుని పోషించుకొంటూ నన్నేల ఇబ్బంది పెడతావు. ఇప్పటికైనా నన్ను సరిగా చూసుకోకపోతే ఇంతకంటె ఎక్కువ చేస్తా''నని అనగానే ఆమె ఇం కెప్పుడు ఈ విధంగా చేయనని ఆ బాలకునకు మాట ఇచ్చింది. అప్పుడా బాలకుడు సవతి తల్లితో ''అయితే మా నాయిన ఇంటికి రాగానే అద్దాన్ని  ఆతని ముందుంచే ఏర్పాటు చేయ''మన్నాడు. మరునాడు రుద్రశర్మ ఇంటికి వచ్చే సమయానకు తన చేటిని అద్దాన్ని ఆతని ముందుంచే ఏర్పాటు చేసింది. ఇంటికి వచ్చిన రుద్రశర్మ ప్రతిబింబమద్దంలో ప్రతిఫలించగనే బాలవినష్టకుడు 'తన రెండవ తండ్రి ఇతడే' అని అరవసాగాడు. రుద్రశర్మకు బార్యపై అనుమానం మాసిపోయింది.  అతడు భార్యాపిల్లలతో సుఖంగా ఉన్నాడు. కాబట్టి బాలుడైనా కోపాన్ని పూనినట్లైతే ఎట్టి దోషాన్నైనా ఆరోపిస్తాడు.( ''ఏవముప్తాదయేద్దోషం బాలకోఽపి వికృతిం గత: ''2-6-47శ్లో) కథాసరిత్సాగరం- రెండవలంబకం- ఆరవతరంగం)
******

****

. 342.భక్తుడు: ఏ రూపాన్ని దృష్టిలో ఉంచుకొని ధ్యానం చెయ్యాలి?

శ్రీ రామకృష్ణులు: ఏ రూపం చేత ఎక్కువగా ఆకర్షితుడవవుతావో, ఆ రూపాన్ని మనస్సులో పూర్తిగా నిలుపుకో. అన్ని రూపాలూ పరబ్రహ్మమే అని గ్రహించినవాడు కృతార్థుడవుతాడు. మానవ రూపంలో ఉన్న అవతారాలన్నీ ఆయన నీడలు మాత్రమే అని గ్రహించాలి.

రూప మేలైన మనసును రంగ రించు
పాప లాగదైవము నిన్ను మలుపు తిప్పు
ద్వీప దైవాన్ని మనసులో తీర్చిదిద్ది
దేవుడని మనుషులలోను తృప్తి పరచు

భక్తుడు: భగవంతుణ్ణి మనం కళ్ళతో చూడగలమా?

శ్రీ రామకృష్ణులు: దైవకృప కలిగినప్పుడు దేవుడు దివ్యనేత్రాలు ప్రసాదిస్తాడు. ఈ భౌతికమైన కళ్ళతో చూడలేం. అర్జునునికి కూడా దివ్య చక్షువులు ప్రసాదించి, పిమ్మట తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కృష్ణుడు. రాగభక్తి కలవాడికి దైవకృప తప్పకుండా సిద్ధిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం వీరి స్వభావం.

దైవ కృప కలిగి నపుడు దివ్య నేత్ర
మిచ్చి దివ్య చక్షువులను  పెంచు దేవ
సిద్ది కొరకయే ప్రేమను వ్యక్త పరుచు
ప్రతి ఫలాన్ని కోరక రాగ భక్తి

భక్తుడు: మేమంతా సామాన్యులం. ఎన్నో పాపాలు చేస్తుంటాం మా గతి ఏమవుతుంది?

శ్రీ రామకృష్ణులు: చెట్లను ఆశ్రయించిన పక్షులు రెండు చేతులతో చప్పట్లు కొట్టగానే ఎలా ఎగిరిపోతాయో భగవన్నామం ఉచ్చరించడం వల్ల మానవులు చేసే పాపకర్మలు అలాగే వదలి పోతాయి. భగవన్నామమే చప్పట్లు. పాపాలే పక్షులు. శరీరం చెట్టు లాంటిది. సూర్యరశ్మి వల్ల చెరువులోని నీరు ఆవిరి అయి నట్లు, భగవన్నామ సంకీర్తనం వల్ల పాపాలు ఆవిరి అయిపోతాయి.

చేయి చేయికలిపి శబ్ద చేరువవ్వు    
పాప పుణ్యకర్మలు ఫలం పొందు నువ్వు   
వేడికి జలము ఆవిరి వేగమవ్వు
దైవ పూజలే మనకు దగ్గరవ్వు   

భక్తుడు: దేవుడు మమ్మల్ని ఈ సంసారంలో ఎందుకు దింపాడు?

శ్రీ రామకృష్ణులు: సంసారం కర్మక్షేత్రం. కర్మల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించవచ్చు. చేయదగిన కర్మల, చేయరాని కర్మల గురించి గురువు ఉపదేశిస్తాడు. అంతేగాక నిష్కామకర్మ చేయాల్సిందిగా గురువు శిష్యులకు బోధిస్తాడు. కర్మ చేసేకొద్దీ మనోమాలిన్యం నశిస్తుంది. సమర్ధుడైన వైద్యుడి సలహా మేరకు ఔషధం పుచ్చుకొని రోగాన్ని నయం చేసుకోవడం లాంటిది ఇది.

కర్మచేమనోమాలిన్యం కాటికేవ్వు  
కర్మ లన్ని సంసార మ్ము కడిగి వేయు  
కర్మలజ్ఞానాన్నిసము పార్ది౦చవచ్చు  
కర్మ లు గురువు ఉపదేశ కరువు మార్చు
 
భక్తుడు: భగవంతుడు మమ్మల్ని సంసారం నుండి ఎందుకు విముక్తుల్ని చేయకున్నాడు?

శ్రీ రామకృష్ణులు: ఈ కామినీ కాంచనాల్ని అనుభవించాలన్న కోరిక వదలిపోయినప్పుడు మనల్ని ఆయన సంసారం నుండి విముక్తుణ్ణి చేస్తాడు. ఒకసారి ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకొ న్నాక సదరు వ్యక్తి అక్కడ నుండి ఎక్కడికీ వెళ్ళలేడు. రోగం నయం కానిదే అతడు వెళ్ళడానికి వైద్యుడు అనుమతి ఇవ్వడు.

రోగము నయము కానిదే రాక వుండు
భోగము వలన రోగము బోధ చేయు
యోగ కామిని కాంచన ఎదురు తిరుగు
మూగ అవయవ దోషము మాయ మవును     

--(())--

 
343..*గర్వం ఉన్న వ్యక్తి ఎలా పతనం అవుతాడు?

****


1) *విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు*

గర్వం ఉన్నందు వల్ల మనం పూర్తి గా భౌతిక మనస్సు చెప్పినట్టు వింటాము, భౌతిక మనస్సు కు ఆధ్యాత్మిక నియమాలు తెలియవు, ఇతరులు మన గురించి ఏమనుకోవాలను కుంటామో దాని గురించి ఆలోచించి వారి మెప్పు కోసం పనులు చేస్తూ, అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటాం.

2) *ఆధ్యాత్మికం గా పతనం చెందుతాడు*

గర్వం పెరగడం వల్ల వారు దేవుడున్నడని నమ్మరు, ఉన్నత శక్తి వుండే అవకాశం లేదంటారు, వారి చేష్టల వల్ల వారి ఉప చేతనాత్మక మనస్సు ని నిద్రాణo  చేసుకుంటారు.

3) *తక్కువ స్థాయి స్పందనలు వస్తాయి*

మనం ఏదైనా వ్యతిరేక మయిన పని చేస్తే మన తల చుట్టూ నల్లని మేఘం లా వ్యతిరేక శక్తి కమ్ముకుని వెలుతురిని రానివ్వ కుండా ఒక చక్రం సృష్టింప బడుతుంది, దాని వల్ల మనం బలహీనమై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము.

4) *అసూయ వస్తుంది*

అసూయ వల్ల మనం ఇతరులతో పోల్చు కుంటాం, మనకు జరిగిన మంచి విషయాలను గమనించ కుండా మన కేమి జరగలేదో అవే గుర్తు తెచ్చుకుని బాధ పడుతూ, ఇతరులకు జరిగిన మంచి విషయాలు చూసి సహించ లేరు.

6) *ఎప్పుడు అసంతృప్తి తో ఉంటాడు*

భూ లోకం లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం తృప్తి తో జీవించడం, భౌతిక మనస్సు మాట వినడం వల్ల అహం ఏర్పడుతుంది, అది మనల్ని ఇంకా ఇంకా కోరుకునేలా చేస్తుంది, మనం ఆ కోరికలకు లోబడి పోయి సంపద, అధికారం, కీర్తి, సంపాదిస్తాం, కానీ అవేమి మనకు తృప్తి ని ఇవ్వవు.

7) *శత్రువులు అధికం అవుతారు*

గర్వాన్ని అదుపు లో ఉంచు కోకుండా అనాలోచితం గా మూర్ఖం గా మాట్లాడడం వల్ల శత్రువులు ఏర్పడతారు.

8) *బంధుత్వాలు నష్టపోవడం జరుగుతుంది*

గర్వం వల్ల ఆధిక్యతా భావం వస్తుంది, దీని వల్ల బంధుత్వాలు నిలబడవు.

9) *ఆశలు  ఎక్కువ అవుతాయి*

అహం ఉన్నందు వల్ల ఇది నేనే చెయ్యాలి, ఇది నాకే దక్కాలి, అనుకుంటాం, దీని వల్ల ఆశ , ఆశ వల్ల వత్తిడి, ఆశ వల్ల ఇతరుల నుండి ఏవేవో కావాలనుకుంటారు.

ఏ వ్యక్తి అయితే వీటిని గమనించి అతడు అతని దృష్టి ని మరలుస్తాడో అతను ఆధ్యాత్మికం గా ఎదుగుతాడు.

 ****

 344..అస్తిత్వమన్నది భూమి

 మనిషి అస్తిత్వంతో కలిసి వున్నపుడే సజీవంగా వుంటాడు. మన పునాదులు అస్తిత్వంలో వుంటే మనం సంపూర్ణంగా, ఆరోగ్యంగా వుంటాం.
మనం అస్తిత్వ సంబంధం లేకుండా ఒంటరిగా వుంటే, పునాదులు లేకుంటే ఎట్లాంటి ఎదుగూ బొదుగూ లేకుండా ప్రాణం లేకుండా వుంటాం.
అస్తిత్వమన్నది భూమి, మన బలవర్థకమయిన ఆహారం, మన ఆరోగ్యం, సమజీవితం అంటే విస్ఫోటన మినహా మరేం కాదు. అది మన సజీవత్వానికి సంబంధించిన విస్ఫోటన.
దానినే ప్రేమబంధం అంటారు 

మనకున్నది ఒక్కటే మనసు.  ధ్యాన ప్రయత్నానికి, ఆలోచనలకు కారణం ఆశ అనే గుణం. ఆలోచనలు తెప్పిస్తుంది.  ఉన్నది ఒక్క మనసే కనుక అది అన్ని కోరికలతో పాటు ఏదో సాధించాలన్న కోరికను కూడా ఒక రోజు మర్చిపోతుంది. అలా కోరిక పోయిన క్షణంలో కలిగే దివ్యానుభూతే నిజమైన "ధ్యానం".  అందుకే ఆత్మజ్ఞానులైన పెద్దలంతా 'ధ్యానం చేసేది కాదు, కొనసాగుతున్నదే' అని చెప్తున్నారు. టివి చూసేప్పుడు, పేపర్ చదివేప్పుడు ఇతర ఆలోచనలతోపాటు తాను ఆ పని చేయాలన్న ఆశ కూడా పోతుంది. అందుకే అందులో లీనం కాగలుగుతున్నారు. జపంలో ఎలాగైతే తాను 'రామరామ' అంటున్న విషయం కూడా తెలియకుండానే అనేస్తున్నాడో, ఇక్కడ తాను చేస్తున్న పని తెలియకుండానే దాన్ని అనుభవిస్తున్నాడు. జపంలో అయితే దాన్ని "సమాధిస్థితి" అంటారు. సాధారణ పనుల్లో అయితే దాన్నే తాదాత్మ్యత అంటారు !
మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే! అనగా మనం నిర్వహనాసక్తితో ఏదైనా చదించవచ్చు అని అందరూ తెలుసుకోవాలి.
--(())--

 345.🦌🦌 *కొత్త  యుద్ధం*

 *సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు*

*అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .*

*ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు, తోడేళ్ళను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది.*

*అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.*

*"అవును మాది జింకలవనం " అంది.*

*" ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.*

*" పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది.*

*అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .*

 *సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంత పనయింది .*

*వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకల వనం వైపు పరుగు తీస్తూనే  వుంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .*

 *తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .*

*కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి.* *చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాయి .*

*పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .*

*అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాన నేత్ర. జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మార్గం ఏమిటి " అని అడిగాయి.*

*" జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.*

*ఎటు ఆలోచించినా. . ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది.*

*ఈ సింహం ఆహారం లేకుండా*

*14 రోజులు మాత్రమే బ్రతక గలదు. కానీ మనం 21రోజులు బ్రతకగలం.*

*కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవిత కాలం మరో 14 రోజులు పెంచినట్లే.*

*ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే" అంది.*

*జింకలన్నీ జ్ఞాన నేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.*

*పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది.*

ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్టుగా సరిపోయింది కదా.. 

అందుకే..

*ఇంట్లోనే ఉండండి* 

*కరోనా రక్కసి పనిపట్టండి*

మనం జింకలకన్నా తెలివైనవాళ్ళమేగా

[---

 

kadhalu 346-50




346

పూర్వము ఒకవూరిలో రామ రాజు, భీమ రాజు అనే స్నేహితులు వుండే వారు. రామ రాజుకు ఒక కొడుకు, భీమ రాజుకు ఒక కూతురు వున్నారు. ఒక రోజు రామరాజు భీమ రాజు దగ్గరకు వచ్చి నేను అవసరార్థం నా పొలం అమ్మదలుచుకున్నాను, అది నీవు తీసుకొని నాకు డబ్బు యివ్వు అన్నాడు.సరే అని భీమరాజు ఆ పొలం కొన్నాడు.అందులో విత్తనం వేద్దామని దున్నుతుండగా నాగలికి తగులు కొని ఒక బిందె బయటికి వచ్చింది.
దాని నిండా బంగారు నాణాలు వున్నాయి.భీమ రాజు ఆ బిందె తీసుకొని రామరాజు యింటికి వెళ్లి నీ పొలం దున్నుతుంటే ఈ బిందె దొరికింది. పొలం నీదే కదా ఈ బిందె నీకే చెందుతుంది.అన్నాడు. దానికి రామరాజు
పొలం నీకు అమ్మేశాను కదా! అది నాదెలా అవుతుంది?ఆ బిందె నీదే అవుతుంది అన్నాడు.అందుకు భీమరాజు
నేను నీ పొలానికి మాత్రమె డబ్బు యిచ్చాను.బిందెకి కాదు కదా!అలాంటప్పుడు ఈ బంగారు నాణాల బిందె నీదే అన్నాడు. యిద్దరూ కాసేపు వాదులాడుకొని తర్వాత తీర్పు కోసం ఆ దేశం రాజు గారి దగ్గరకు వెళ్ళారు.
ఇద్దరి  వాదనలను విన్న రాజుగారు వారి ధర్మ నిరతికి ఆశ్చర్య పోయారు. మీ యిద్దరికీ ఒకరికి కూతురూ
ఒకరికి కొడుకు వున్నారు కదా వారిద్దరికీ పెళ్లి చేసి ఆ ధనం వారిద్దరికీ యిచ్చి వేయండి. వారిద్దరూ దానితో ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా వుంటారు. అని తీర్పు చెప్పి భీమరాజుకు కూతురి పెళ్లి చేయటానికి తగిన ధనం యిచ్చి నీ కూతురి పెళ్ళికి యిది నా కానుక అని చెప్పాడు. "ధర్మో రక్షతి రక్షితః "

(చందమామ కథలు)

347
"శ్రీ వేంకటేశ్వరుడి పాద వైభవం "..

ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు.

శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు, బంగారు పాదకవచాలను పక్కకు తీసి- స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట- భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు.

ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట.

శ్రీహరిని అవమానించినవీ పాదములే
సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే
భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే
లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే
సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే

ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే. మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే.. శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన "ఇల" వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే.

ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి.

ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత వున్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు? అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవే. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి వుంటాయి.

శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు.

అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?

అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే. కొండ నుంచి నంబి, గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్రామానుజులు.. ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారట. దీని వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే - నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన.

కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్ని ఉన్నాయి . మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యం .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం.

ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను

ఆ పూజ మందిరంలో పెడతారు .

ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా.. తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ. వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం.

నారాయణ పాదములు

తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో నారాయణ పాదం ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ- ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవనిర్వహణ జరిగేది. వీటినే "నారాయణ పాదములు" అంటారు.

ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ,ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు,ఏకాంగులు, అధికారులు,పరిచారకులు రెండు భూచక్ర  గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను,బంగారు బావి తిర్ద్దాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగులను కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు.ఆఫై ప్రసాద వినియోగం,వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు.

అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది.అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే- ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు

****

348..శ్రాద్ధ భోక్తలు - ఆపస్తంబుని కధ

 యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడు వంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే.  ఈ ఆపస్థంబుడు అనే ఈ మహర్షి గురించి తెలుసుకుందాము.

 ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు  శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలా సేపు వేచి ఉన్నాడు.  భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు.  బాగా ఆకలితో వచ్చాడు.  

కర్త, భోక్త గారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు.

వచ్చిన మిగతాసాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా  భోజనం  చేశాడు.

బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు.  వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు.

కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి  హేళనకి దిగింది. మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్క చెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు.  

అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు.  తనని  అలా ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త.  వండిన పదార్థాలన్నీ అయిపోయి నా ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే కర్తకి కోపం వచ్చేసింది.

దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసేడు. ఇంక తృప్తి అయిందా అని అన్నాడు. (భోక్త భోజనం  అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం సాంప్రదాయం కదా.)
అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు

కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది. ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను  పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు అని కోపం తెచ్చుకున్నాడు.

కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్త గా వచ్చిన బ్రాహ్మణుడిని శపించటానికి చేతిలో జలం తీసుకొని అభి మంత్రించి బ్రాహ్మణుడితలమీద చల్లాడు.

అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద  చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో  అని ఆజ్ఞాపించినట్లుగా ఆగు అని ఆపేసేడు.  

కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కారు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని,  "పూజ్యుడా! మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు" అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పేరు - "నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణుల మీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు.నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో" అన్నారు.

దానికి కర్త 'స్వామీ నా తప్పుని
తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ  పూర్తికాలేదే,   దానికి ఏమి చేసేది? అని అడిగేడు.

దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత పురుషసూక్తాన్ని  పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది
అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.

జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది.

శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది.

ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు.

From fb

****
349-కర్మ - జన్మ
11 వ అధ్యాయం
 రామాయణం - కర్మ సిద్ధాంతం

పూర్వం మయానూనమభీప్సితాని పాపానికర్మాణ్యసకృత్కృతాని
తత్రాయ మద్యాపతితో విపాకో దుఃఖేనదుఃఖం యదహం విశామి
                     --అరణ్య కాండ (63-4)

 భావం:-

తను పూర్వం ఎప్పుడో అనేక పాపకృత్యాలు చేసి ఉంటాడని, , తనకు కలిగే దుఃఖం ఆ పాప కర్మ ఫలమే తప్ప ఇంకోటి కాదని రాముడు విలపిస్తూ అంటాడు.

గుణదోషకృతం జంతుః స్వకర్మఫలహేతుకమ్
అవ్యగ్రస్త దవాప్నోతి సర్వంప్రేత్యశుభాశుభమ్
                 --కిష్కింధా కాండ (21-2)

 భావం:-

 ప్రతీ జీవుడు తన పూర్వ కర్మల ప్రకారం సుఖదుఃఖాలని అనుభవిస్తాడు. సుగ్రీవుడి వల్ల వాలి మరణించాడని బయటకి కనిపించినా, వాలి స్వకర్మ ఫలితంగానే మరణించాడు. వాలి నిమిత్త మాత్రుడు.

నియతిః కారణం లోకే నియతిః కర్మసాధనమ్
నియతిః సర్వభూతానాం నియోగేష్విహ కారణమ్
                     -- కిష్కింధకాండ (24-5)

 భావం:-

ఈ లోకంలో అన్నింటికీ కారణం కాలమే. కాలమే కర్మలకి సాధనం. ఈ లోకంలో సమస్త భూతాలని ప్రేరేపించే కారణం కాలమే.


న కాలస్యాస్తి బన్దుత్వం న హేతుర్న పరాక్రమః
న మిత్రజ్ఞాతి సంబన్ధః కారణం నాత్మనో వశః
                      --కిష్కింధకాండ (24-7)

 భావం:-

కాలానికి పక్షపాతం లేదు. దాన్ని వశం చేసుకొనే సాధనం కాని, జయించే పరాక్రమం కాని ఎవరికీ లేదు. మితృత్వం, జ్ఞాతిత్వం మొదలైన సంబంధాలు కాల ప్రవృత్తికి కారణం కాదు. కాలం ఎవరికీ వశం కాదు.

నియతిః కారణం లోకే నియతిః కర్మ సాధనం
నియతిః సర్వభూతానాం నియోగేష్విహ కారణం
                   --కిష్కింధ కాండ (25-4)

 భావం:-

లోకాలన్నిటికీ కారణం భగవంతుడే. భగవంతుడే సకల కర్మలకు సాధనం. అతడే సకల జీవులని నియమించేవాడు.

నకర్తా కస్యచిత్ నియోగేచాపినేశ్వరః
స్వభావేవర్తతేలోకస్తస్యకాలః పరాయణం
                   -- కిష్కింధ కాండ (25-5)

 భావం:-

లోకంలో ఎవడూ ఏ పనికీ కర్త కాని, ఇంకొకరు చేయడానికి ప్రేరకుడు కాని కాలేరు. లోకమంతా కాలానికి (పూర్వ కర్మ ఫలాలకి) వశమై. కర్మఫలాలు కాలాన్ని అనుసరించే అనుభవంలోకి వస్తాయి.
 

*****

350.. *నెల్సన్ మండేలా డైరీలో ఓ పేజీ:*


‘నేను నా అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తులతో మధ్యాహ్నం భోజనానికి ఒక #హోటల్కివెళ్లాను.
 వేయుటర్ వచ్చి #మాఆర్డర్ తీసుకువెళ్లిన తర్వాత కాసేపటికి మా భోజనం వచ్చింది.
సరదాగా మాట్లాడుకుంటూ,
 మేం తినడం ప్రారంభించేముందు నా #దృష్టి #ఎదురుటేబులలో_ఒంటరిగా_కూర్చున్నవ్యక్తి మీద పడింది.
అతని #భోజనం_ఇంకారాలేదు.
నన్ను అతడు చూడగానే చటుక్కున లేచి #బయటకువెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అతని ఖర్మ కాలి #భోజనంవచ్చింది.
అతను #నిస్సహాయంగా_కూలబడిపోయాడు.

నేనతణ్ని చూసి, పలకరింపుగా నవ్వి,
నాపక్కన కూర్చోమంటూ, కలిసి భోంచేద్దామంటూ ఆహ్వానించాను.

వెయిటర్ కు సైగ చేయగానే, అతడి భోజనం నా పక్కన పెట్టి వెళ్లాడు.
#తప్పనిసరి_పరిస్థితుల్లో ఆ వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు.

మా భోజనం త్వరత్వరగా అవుతోంది. కానీ, #అతనికి_ముద్ద_గొంతుదిగడంలేదు.
*చేతులు వణుకుతున్నాయి.*
దిక్కులు చూస్తూ మాటిమాటికీ నీళ్లు తాగుతూ మొహం తుడుచుకుంటున్నాడు.

మా అందరి భోజనం అయ్యాక అతను      సగం తిండిని కతికినట్టు చేసి వడివడిగా వెళ్లిపోయాడు.

అతనిని గమనించిన నా మిత్రుడు బాగా _అనారోగ్యంగా ఉన్నట్టున్నాడు. అస్సలు తినలేకపోతున్నాడు. వణుకుతున్నాడు..!_" అంటూ ఓ జనాంతిక కామెంట్ వదిలాడు.

_అప్పుడు నేను "లేదురా..! అతను ఆరోగ్యంగానే ఉన్నాడు._
*నేను జైలుశిక్ష అనుభవిస్తున్నప్పుడు నా సెల్ సెంట్రీ* ఇతను
 ప్రతిరోజూ నన్ను విపరీతంగా, అకారణంగా కొడుతూ హింసించేవాడు. హింసవల్ల నొప్పులు, బాధతో అరిచీ అరిచీ
నా గొంతు ఆర్చుకుపోయి _దాహంతో నీళ్లమ్మని అడిగితే,_
_హేళనగానవ్వుతూ నామొహం మీద మూత్రం పోసేవాడు._
*మాఅమ్మ పాలకన్నా ఇతని మూత్రాన్నే ఎక్కువ తాగాను.*

*మా అమ్మ ప్రేమను నేర్పితే, ఇతడు ఓపిక నేర్పాడు.*
_నన్నిప్పుడు ఈ హోదాలో చూసి భయపడి, వణికిపోతున్నాడు._
✨✨✨✨✨✨
 నేను తనమీద ప్రతీకారం
తీర్చుకుంటానేమో,
ఉద్యోగం పీకిస్తానేమో,
జైలులో వేయిస్తానేమో..!

_ముందే_ఊహించి కొని అలా  భయపడుతున్నాడు._
✨✨✨✨
నా వ్యక్తిత్వం, నా నైతికత అది కాదు!
 పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య. 
 గోడలు కడితే, క్షమ ఒక్కటి చేస్తుంది!
 సౌభ్రాతృత్వం శాంతినిస్తుంది కదా..!" అన్నాను.

*~నెల్సన్ మండేలా*.

(దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యాక జరిగిన యధార్ధ సంఘటన.)

నేటి కధలు..351--355



*ఘనమైన (4)నాలుగు*..351

నలుగురి నాలుగు చేతులూ వెయ్యండి.
నలుగురితో నారాయణ.
నలుగురు పోయే దారిలో నడవాలి.
నలుగురూ నవ్వుతారు...
ఇవీ నిత్యం మనం వినే మాటలు.
అనే కార్థంలో
*‘నలుగురు’*.
మాటను వాడుతుంటాం.
ఇలా జన వ్యవహారంలో నాలుగు సంఖ్య తరచుగా వినిపిస్తుంది.
మనకు సంఖ్యా శాస్త్రం ఉంది.
అంకెలకు సంబంధించి నమ్మకాలు ఉన్నాయి.
కొందరు కొన్ని సంఖ్యల్ని తమకు అదృష్ట సంఖ్యలుగా భావిస్తుంటారు.

కొన్ని ప్రయోజనాలకు తమకు నచ్చిన సంఖ్య రావాలని తపన పడుతుంటారు.
ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలు ఒకదాని కంటే ఒకటి పెద్దదిగా మనం భావించినా సహజంగా అన్ని సంఖ్యలూ వాటికవే విశిష్టమైనవి.

నాలుగు సంఖ్యను చాలామంది ఉత్తమ మైనదిగా పరిగణించరు.

ఎవరి నమ్మకం ఎలా ఉన్నా నాలుగంకెకు ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది.

సృష్టికర్త బ్రహ్మను చతుర్ముఖు డన్నారు. సృష్ట్యాదిలో బ్రహ్మ నలుగురు మానస పుత్రుల్ని సృష్టించాడు.

వారే సనక,
సనందన,
సనత్కుమార,
సనత్సుజాతులు.

వేదాలు నాలుగు.
ధర్మార్థ కామమోక్షాలు నాలుగు.

పురుషార్థాలూ ఆశ్రమ విధానాలు నాలుగింటిని చెప్పారు.
అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం.

చాతుర్వర్ణ వ్యవస్థనూ వేదవాంగ్మయం పేర్కొన్నది.
యుగాలు నాలుగు - కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు.
మానవ జీవిత దశలనూ బాల్య,
యౌవన,
కౌమార,
వార్ధక్యాలనే నాలుగింటిగా విభజించారు.

దిక్కులు నాలుగు. మూలలూ నాలుగే. తూర్పు దిక్కు ఋగ్వేద సంబంధమైనది.
సూర్యోదయానికి ఆధారభూతం గనుక పూజ్యమైనది.

దక్షిణం యజుర్మంత్రాలకు, పశ్చిమం అధర్వ మంత్రాలకు స్వాభావిక మైనవని,
ఉత్తర దిక్కు సామవేద సంబంధి అని తెలిపే శ్రుతి ప్రస్తావనలున్నాయి.

మండూకోపనిషత్తులో నాలుగు అవస్థలు చెప్పారు. జాగృదవస్థలోని అనుభవాలకు కారణం జాగరిణి.
ఈ అవస్థలోని జీవాత్మ విశ్వుడు.
స్వప్నానుభవ కర్త సూక్ష్మ శరీరధారి అయిన జీవుడు.
వాడిని స్వప్నంలో ప్రేరేపించే వాడు తైజసుడు.
గాఢనిద్రను అనుభవించే సుఖజీవిని ప్రాజ్ఞుడంటారు.
ఈ అవస్థకు కారకురాలైన పరమేశ్వరి ప్రాజ్ఞ.
పై మూడు స్థితులకు అతీతమైన స్థితి
‘తుర్య’.
ఈ మూడు అవస్థల్లో లేని స్థితిని పరదేవత కలిగిస్తుందంటారు.

మైత్రి,
కరుణ,
ముదిత,
ఉపేక్ష -
నాలుగు వాసనలు.

ఇవి మనసు,
బుద్ధి,
చిత్తం,
అహంకారం అనే నాలుగు అంతఃకరణలకు సంబంధించినవి.

స్నేహితులతో మైత్రి మనసు లక్షణం.
ఆర్తులపట్ల కరుణ బుద్ధి లక్షణం.
పుణ్య కర్మల్ని ఆనందించడం చిత్త లక్షణం.
సజ్జనుల్ని బాధించడం అహంకార లక్షణం.

వాక్కుకు నాలుగు రూపాలు.
పరా,
పశ్యంతి,
మధ్యమ అనే మూడు అంతరంగంలో ఉండే వాక్కులు;
బహిర్గతమయ్యేది వైఖరి.

మృత్యువు నాలుగు రూపాలని వేదం చెబుతోంది.
అవి సూర్యుడు,
వాయువు,
అగ్ని,
చంద్రుడు.
సూర్యుడు రోజూ ఉదయ సాయంత్రాల ద్వారా ఒకరోజు జీవుల ఆయుర్దాయాన్ని గ్రహిస్తూ,
మృత్యువుకు కారణమవుతాడు.

వాయుసంచారం దేహంలో సరిగ్గా లేనప్పుడు ఊపిరి తిత్తుల వ్యాధుల ద్వారా మరణానికి అవకాశా లెక్కువ.

శరీరంలోని జఠరాగ్ని సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం జీర్ణంకాక ఆకలి దప్పులుండక చనిపోయే అవకాశమూ ఉంది.
చంద్రుడు పంటలకు కారకుడు.
పంటలు పండక పోతే ఆహారం లేక మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది.

మేఘం,
మెరుపు,
పిడుగు,
వృష్టి (వాన)-
నీటికి నాలుగు రూపాలు.

రాజ్యరక్షణకు అవసరమైన చతురంగ బలాలు -
రథ,
గజ,
తురగ,
పదాతి దళాలు.

సాలోక్య,
సామీప్య,
సారూప్య,
సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు.
సామ,
దాన,
భేద,
దండోపాయాలు రాజనీతికి సంబంధించిన చతురోపాయాలు.

ఇలా చెప్పుకొంటూపోతే ఇంకా ఎన్నో...
అందుకే నాలుగంకె (4) ఘనమైనదే!

🌹👏🏾🌷
----------


🙏🤝మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు..,352

🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .
🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
 🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
 🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
 🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
 🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు 👋

దాహం....353

ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.

అనేక మైళ్ల దూరం ప్రయాణించిన తరువాత, కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు.  అవి తీవ్రమైన వేసవి నెలలు కావడంతో నీరు ఎక్కడా కనిపించలేదు.  వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది.   పిల్లలు  దాహంతో అలమటిస్తున్నారు,  అతని వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం  లేకపోయింది.  చివరి ప్రత్యామ్నాయంగా  దైవాన్ని ప్రార్థించే సమయం వచ్చింది, "ఓ ప్రభూ!  దయచేసి  ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే ",  అని వేడుకున్నాడు.

వెంటనే, అతను కొంత దూరంలో ధ్యానంలో కూర్చోనిఉన్న ఒక ఋషి ని చూశాడు.  ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు.  ఆ ఋషి, ‘ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో, ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తుంది, మీరు అక్కడకు వెళ్లి మీ దాహం తీర్చుకోవచ్చు’, అని అతనికి తెలియజేశాడు.

ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి, ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు. నడవలేని పరిస్థితిలోఉన్న తన భార్య , పిల్లలను అక్కడే ఉండమని చెప్పి, అతనే  స్వయంగా నది వైపు నీరు తీసుకురావడానికి వెళ్లాడు.

అతను నీటితో తిరిగి వస్తుండగా, దారిలో విపరీతమైన దాహంతో ఉన్న ఐదుగురు వ్యక్తులు కనిపించారు, అతను చాలా ధర్మశీలుడైనందున, వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు,  దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి, తిరిగి నదికి వెళ్లాడు.  అతను తిరిగి వస్తున్నప్పుడు,  మళ్లీ నీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు. మరోసారి, అతను తన నీటిని మొత్తం వారికి ఇచ్చాడు.

అతను మూడవసారి నీరు తీసుకుని  కుటుంబాన్ని చేరే సమయానికి, వారందరూ తీవ్రమైన దాహార్తికి గురై,  అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు.  వారి ముఖాలపై నీరు చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతను తీవ్రంగా ఏడ్చాడు, నిరాశతో ఋషి వద్దకు పరుగెత్తాడు.  అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, “మహర్షీ చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేను ఏపాపం చేసాను? నేను ఆపదలోఉన్నవారికి  సహాయం చేసి, ధర్మబద్ధమైన పని చేసాను.  దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి,” అని వేడుకున్నాడు.

దానికి ఋషి, "ఓ సజ్జనుడా! నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ, దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ పాత్రను ఖాళీ చేసుకున్నావు. దీనివల్ల నువ్వు ఏమి ప్రయోజనం పొందావు చెప్పు?" అని అడిగాడు.

ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, "దాని నుండి నేను పొందే దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు; ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించానని భావించాను."

ఋషి ఇలా అన్నాడు, " మీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, అలాంటి నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి? నీ స్వంత పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా!."

ఆ వ్యక్తి ఆసక్తిగా, "ఎలా మహానుభావా?" అని అడిగాడు.

దానికి ఋషి, "నీ కోసం నేను నీళ్లు ఇవ్వడానికి బదులుగా, నదికి వెళ్లే మార్గాన్ని నీకు చూపించాను. మీరు కూడా, ఆ దారిన వెళ్లే వారందరికీ మార్గం చూపించి, వారిని నదికి నడిపించాల్సింది. ఆ విధంగా, మీ స్వంత కుటుంబంతో సహా అందరి దాహం తీరిఉండేది.  ఇతరుల కోసం ఎవరూ తమ స్వంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు."   అని   ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తన దీవెనలు ఇచ్చి, అదృశ్యమయ్యాడు.

ఆ వ్యక్తి  తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. స్వంత  బాధ్యతలను విస్మరించి, మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.

 మీరు ముందుగా మీ విధులను నిర్వర్తించాలి, తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి  మార్గదర్శనం చేయాలి 

ఎవరికైనా మంచి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, భగవంతుని మార్గాన్ని, సత్య మార్గాన్ని చూపించటమే.

నేటి జీవిత సత్యం. 354

 *ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారుకి వెళ్లాడు. అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది.*  

 *తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసమవ్వడంతో అతను సముద్రంలోకి దూకేశాడు. లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ, తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు. కానీ, ఆ ద్వీపంలో మనుషుల జాడ లేదు. చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడంలేదు.*   

 *అప్పుడా వ్యక్తి "నా జీవితంలో నేను ఎవరికీ చెడు చేయనప్పుడు నాకే ఎందుకిలా జరిగింది అని" బాధపడ్డాడు. ఆ తర్వాత "తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు, తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడని" మనసులో దేవుణ్ణి గట్టిగా విశ్వసించాడు.* 

 *ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు, పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలోని ఆశలు నీరుగారిపోవడం మొదలైంది. కానీ దేవుడిపట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు. దాంతో తన జీవితమంతా ఈ దీవిలో గడపక తప్పదని నిర్ణయించుకుని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఓ గుడిసె నిర్మించుకోవడం ప్రారంభించాడు.* 

 *గుడిసె నిర్మాణం పూర్తవ్వగానే మళ్ళీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. అతని గుడిసెపై పిడుగు పడి గుడిసె కాలిపోసాగింది.* 

 *ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ "దేవుడా! ఎంతవరకు నీకిది న్యాయం, ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోలేదు. నిన్నే నమ్ముకున్నాను. నువ్వెందుకు నాపై దయ ఎందుకు చూపడంలేదు స్వామీ" అంటూ నిరాశనిస్పృహలలో కూరుకుపోయి ఏడవడం ప్రారంభించాడు.* 

 *అంతలో అకస్మాత్తుగా ఒక పడవ ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది.* 

 *పడవలోంచి ఇద్దరు వ్యక్తులు దిగి వచ్చి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు. కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడి ఈ నిర్జనద్వీపంలో  ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. మీరు మీ గుడిసెను కాల్చిఉండకపోతే, ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదని అన్నారు.* 

 *అప్పుడు ఆ వ్యక్తి కళ్లలో నీళ్ళు తెచ్చుకుని ఆ భగవంతుని క్షమాపణలు కోరుతూ "ఓ ప్రభూ! నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో నా గుడిసెను తగలబెట్టావని నేను గ్రహించలేకపోయాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించావు. కానీ, నేనే అందులో విఫలమయ్యాను. నిశ్చయంగా నిన్ను నమ్మినవారిని తప్పకుండా కాపాడతావని నువ్వు నిరూపించుకున్నావు. దయచేసి నన్ను క్షమించు ప్రభూ" అని మనసులోనే నమస్కరించుకున్నాడు.* 

 *ఈ కథలోని నీతి* 

 *“సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, తనను నమ్మినవారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. సహనం కోల్పోయినప్పుడు మనిషికి ఒక్కోసారి దేవుడిపై కోపం వస్తుంది. కానీ, మనిషిపై దేవుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. ఆయన ఎల్లప్పుడు మంచినే చేస్తాడు. జీవితంలో అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మనం, నిరాశతో దేవుడు లేదా విధిపై కోపం తెచ్చుకుంటాము. విశ్వాసాన్ని కోల్పోతాము. దాని కారణంగా మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయే అవకాశముంటుంది. కానీ, ఆ తర్వాత మనకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఆ దేవుడు/విధి చేసింది మంచిదేనని. లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాణ్ణి కాదని.* 

 *కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా, దుఃఖం ఎంత కృంగదీసినా, కరోనాలు కాటు వేయాలని చూసినా, సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా, భగవంతుడిపై భారముంచి, పట్టుదలతో మన పని మనం చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం సాధించి తీరుతాం*

                       *త్రి వక్రం*       ...355            

త్రివక్రం అంటే.

మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి.

ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం.

అవి పోయి ఏకత్వం వచ్చేసి, ఈశ్వర స్పర్శ కలిగినవాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు.

అంతరంగం, ఆలోచన, ప్రవర్తనల్లో ఏదో ఒకదానిలో మనుషులు ఎప్పుడూ పొట్టివారే. ఏదో ఒక లోపం లేకుండా సాధారణంగా ఏ మనిషీ ఉండడు. అలాంటి మరుగుజ్జుతనాన్ని ‘కుబ్జత్వం’ అంటారు.

ఆధ్యాత్మికత, జ్ఞానవృద్ధి, గురుకృప, భగవదనుగ్రహం తదితరాల ఆలంబనతో మనిషి వాటిని దాటి త్రివిక్రముడవుతాడు.

వాటిలో ఏది కావాలన్నా…. తపన, తాదాత్మ్యత, నిర్మల భక్తి, నిబద్ధత కలిగిఉండాలి. ఈ విషయాన్ని వివరించేదే భాగవతంలోని ‘కుబ్జ’ కథ.

కపటబుద్ధితో ధనుర్యాగానికి బలరామ కృష్ణులను ఆహ్వానించాడు కంసుడు. మధురకు బయలుదేరారు అన్నదమ్ములు. దారిలో వారికి ఒక దివ్యాంగురాలు ఎదురైంది. ఆమెకు కృష్ణుణ్ని నఖశిఖ పర్యంతం చూడాలని కోరిక. ఆయన మనోహరమైన చిరునవ్వులొలికే మోమును చూడాలని, వీలైతే తాను సిద్ధం చేసిన శ్రీగంధాన్ని ఆయన మేనుకు అద్ది, ఆ మోహనరూపాన్ని చూడాలని కోరిక. కానీ శరీరం సహకరించని పరిస్థితి ఆమెది. అదీకాక ఆమె కంసుడికి దాసి. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ కృష్ణుడు వచ్చే దారిలో కనీ కనిపించకుండా తచ్చాడుతోంది.

గమనించిన కృష్ణుడు ఆమెమీద జాలిపడ్డాడు. కరుణాసముద్రుడయ్యాడు. ‘సుందరీ’ అని సంబోధించాడు. ఆ పిలుపు విన్న ఆమె ఆశ్చర్యపోయింది. కళ్ల వెంట అశ్రుధారలు కారుతుండగా- గద్గద స్వరంతో ‘స్వామీ! నువ్వు కూడా నన్ను హేళన చేస్తున్నావా?’ అని అడిగింది.

నేను గంధపు చెక్కలమీద గంధం తీసి, పరిమళ ద్రవ్యాలు అద్ది కంసమహారాజుకు ఇస్తూ ఉంటాను. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నీవు ఈ గంధాన్ని రాసుకుంటే ఈ గంధానికే అందం వస్తుంది. ఈశ్వరా, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? నువ్వు నన్ను పిలిచిన పిలుపుతో వచ్చిన ధైర్యంతో ఇలా అడుగుతున్నాను’ అంది.

ఆమె కోరికను మన్నించాడు కృష్ణుడు. ప్రతిగా ఆమె పాదాలను తన కుడిపాదంతో తొక్కి, తనచేతి రెండు వేళ్లను కుబ్జ గడ్డం కింద పెట్టి పైకి ఎత్తాడు. ఆ చర్యతో ఆమె వంకరలు తొలగిపోయి సౌందర్యరాశిగా మారిపోయింది. అప్పుడు ఆమె కృష్ణుడితో ‘నాకు ఇంత సౌందర్యాన్నిచ్చావు. నేను నీకు ఇచ్చే ఆనంద సౌఖ్యాలను అనుభవించి నన్ను తరింపజెయ్యి. అందుకోసం నీవు ఒకసారి మా ఇంటికి రా’ అని అడుగుతూ ఆయన ఉత్తరీయం పట్టుకొని లాగింది.

అప్పుడు కృష్ణపరమాత్మ ‘నేను పాంథుడిని. ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్ళగలను. కాబట్టి తప్పకుండా నేను    మీ ఇంటికి వస్తాను. కాని ఇప్పుడు కాదు. కంస సంహారం అయిన తరవాత’ అన్నాడు.

త్రివక్రం అంటే... మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి. ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం. అవి పోయి ఏకత్వం వచ్చేసి, ఈశ్వర స్పర్శ కలిగినవాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు. త్రివక్రకు తన వంకరలు పోగానే ఆవిడ ఈశ్వరుడి కైంకర్యం (సేవ) చేయాలని కలిగిన కోరికతోనే అలా అడిగింది. అందుకోసం తన ఇంటికి రమ్మంటోంది.

పరమాత్మ కంసవధ అయిన తరవాత వస్తానంటున్నాడు. అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. ‘ఇంకా నీలో అజ్ఞానం ఏమైనా మిగిలిఉంటే అది సమసిపోవాలి’ అని ఆ మాటకు అర్థం.

ఆయన ‘నేను పాంథుడిని’ అనడంలోనూ అంతరార్థముంది. పాంథుడు (బాటసారి) అంటే ఇల్లులేని వాడని అర్థం. దాని భావం ‘ఆత్మ స్వరూపుణ్ని’ అని. ఆత్మకు ఇల్లేమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అది అప్పుడప్పుడు ఏదో ఒక ఇంట్లోకి (శరీరంలోకి) వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అని భావం.

ఆ ఆత్మ స్వరూపుడితో తాదాత్మ్యం చెందాలంటే మానసిక వికృతి పోవాలి. ఇక్కడ జరిగింది అదే. కుబ్జ సౌందర్యవతిగా మారడం అంటే, పరమాత్మ సంపర్కంతో మానవాళి స్వరూపాన్ని పొందడమేనని ఇందులోని అంతరార్థం.

Sunday, 19 June 2022

నేటి కధల356==360


 

 బ్రహ్మ జీవ తత్వాలు

వెన్నెలలొ ఏల కోపము వేకు వగను
మనసు సెగలేల ఎగసిన మూగ వగును
పువ్వులలొ కేల నవ్వుల పువ్వు అగును
ముల్లై గుచ్చియు మమతల మల్లె యగును

కన్నులలొ ఏల కోపము కినుకు యగును
మనసు కణకణ లాడిన మౌన మగును
చూపులలొ కేల కన్నుల చిగురు యగును
చూపు గుచ్చియు నగవు చిందు లగును

నీ పలుకులన్ని భాధించె నా మనసును
నీ కులుకులన్ని వేధించె  నా మనసును
నీ చదువులన్ని మార్పించు నా మనసును
నీ వలపులన్ని చంపేను నా మనసును    

పైట బులిపించు చేదులు పీట లగును
అకట కలహించి కథలేలు ఆట లగును
తరుము కొచ్చేటి మనసైన తీపి యగును
మాట కరువైన వినయమ్ము మనసు యగును


                         *               *               *


శ్రేయో భూయాత్ సకల జనానాం

ఇది జగద్గురు శంకరాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు రాసిన ‘మైత్రీం భజత’ అనే పాట చివరి పాదం. దీని అర్థం ‘ప్రపంచంలోని ప్రతి ప్రాణి ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి’ అని కాంక్షించడం.

1966లో ఐక్యరాజ్య సమితి 50వ వార్షికోత్సవం సందర్భంగా కర్ణాటక సంగీత సమ్రాజ్ఞి, భారతరత్న శ్రీమతి యమ్.యస్. సుబ్బులక్ష్మి గారిని కచేరి ఇవ్వమని ఆహ్వానం పంపారు. ఆమె ఈ విషయం పరమాచార్య స్వామివారికి తెలిపి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినప్పుడు స్వామి వారు సంస్కృతం లో ఈ పాటను రాసిచ్చారు. ప్రపంచ శాంతిని, మత సామరస్యాన్ని ప్రతిబింబించే ఈ పాటను అక్కడ పాడటం ప్రతి భారతీయుడికి గర్వకారాణం.

పరమాచార్య స్వామివారు ఇచ్చిన ఆ పాట దాని భావం    

మైత్రీం భజత, అఖిల హృత్ జైత్రీం |  స్నేహము, వినయంతో ప్రవర్తించి అందరి హృదయాలను గెలువు
ఆత్మవదేవ పరాన్నపి పశ్యత |  అందరినీ నీలాగే(సమానంగా) చూడు
యుద్ధం త్యజత, స్ఫర్ధాం త్యజత |  

యుద్ధాన్ని త్యజించు, అదికారం కోసం పోటీపడడం త్యజించు  
త్యజత పరేషు అక్రమఆక్రమణం || 

వేరేవారి ఆస్తులను ఆక్రమించాలనే దుర్భుద్ధి త్యజించు

జననీ పృథివీ కామదుహాస్తే | కామధేనువు వంటి భూమాత నీ కోరికలన్నీ తీరుస్తుంది
జనకో దేవః సకల దయాళుః |

 భగవంతుడు: మన తండ్రియై అందరిని కరుణిస్తాడు
'దామ్యత, దత్త, దయధ్వం' జనతా | 

నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో;  నీ ఆస్తి పదుగురికి పంచు;

వేరేవారిపట్ల దయతో ఉండు; ప్రపంచ జనులారా!
శ్రేయో భూయాత్ సకల జనానాం || 

ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి
శ్రేయో భూయాత్ సకల జనానాం || 

ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి
శ్రేయో భూయాత్ సకల జనానాం ||

 ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి

సర్వ మానవాళి సంక్షేమమే పరమాచార్య స్వామి వారి లక్ష్యం. ఈ పాటను, ప్రతి పంక్తిని శ్రద్ధగా పరిశీలిస్తే మీకు బోధపడుతుంది. “దామ్యత”, “దత్త”, “దయధ్వం” లోని మూడు “ద”లను మనిషి ఎన్నటికి మరువరాదు.

ప్రపంచ దేశాల ప్రతినిధులందరికి దీన్ని అనువదించి ఇవ్వడం జరిగింది. యమ్.యస్. అమ్మ, ఐక్యరాజ్య సమితిలో ఈ పాట పాడగానే దాని భావానికి అందరి మనస్సులు కరిగిపోయాయి. వారి గాత్ర మాధుర్యానికి తన్యత్వానికి లోనై, సారాన్ని అర్థం చేసుకున్న ఎంతోమంది ప్రతిధులు కళ్ళనీళ్ళు కారుస్తూ ఉండిపోయారు.
 
అరోజు ఆవిడకి గొంతు బాగాలేక సరిగ్గా ఊపిరి కూడా తీయని పరిస్థితిలో ఉన్నారు. కచేరి ఎలా చేయడమొ అని భయపడుతూ పరమాచార్య స్వామిని ప్రార్థించగా, పాడడం ప్రారంభించగానే గొంతు సరిపోయి అత్యంత మాధుర్యంగా కచేరి చేసారు

 --(())--

 స్నేహితుడు, వెండి, బంగారం, జ్ఞానం’- ఈ నాలుగు పేదరికం నుంచి గట్టెక్కడానికి తోడ్పడే ముఖ్యమైన సంపదలు. వీటన్నిటిలోనూ ‘మిత్రుని సహాయమే’ ఎక్కువగా వెల కట్టలేనిది. ‘స్నేహం’ అనేది బాల్యం నుంచే మనిషి జీవితంలో చెరగని ముద్ర వేస్తుంది. అందుకే, ‘మంచి స్నేహితుడు’ లభించడమనేది ఒక వరం వంటిది. స్నేహితుణ్ని ఎంచుకోవడానికి విధిగా పాటించవలసిన జాగ్రత్తలను ‘మహాభారతమే’ మనకు ప్రబోధించింది. ‘మంచి మిత్రుని అండ దొరికిన వారు సమాజంలో గౌరవ సంపదలతో వర్ధిల్లుతుంటారు’ అన్నది ఆర్యోక్తి. అయితే, ‘దరిద్రునికి ధనవంతునితో, విజ్ఞానికి మూర్ఖునితో, నెమ్మదస్తునికి క్రూరునితో, ఉత్తమునికి దుర్మార్గునితో స్నేహమనేది ఎప్పుడూ పొసగదు’ .

‘చదువు, సంపద, నడవడికలలో సమానులకు మాత్రమే మైత్రి పొసగుతుంది’  ‘ఒకే స్వభా వాన్ని కలిగి, అన్యోన్యంగా ఉండే మిత్రులకు ఒకవేళ ఆస్తిపాస్తులు, డబ్బు వంటి విషయాల్లో ఏమైనా అభిప్రాయ భేదాలు ఏర్పడినా, వాటన్నిటినీ పక్కనపెట్టి విలువైన స్నేహం వైపే మొగ్గు చూపుతుండాలి’అన్న ప్రామాణికతను మరిచిపోరాదు. ‘మిత్రునికి అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే తన తెలివితేటలను ఉపయోగించి అయినా అతణ్ని ఆ విపత్తు నుంచి గట్టెక్కించాలి’  ఇదే ‘మిత్రధర్మం’. ‘ఎంతో మేలు చేసి సంపాదించుకున్న మంచి మిత్రుని వల్ల సిద్ధించే ప్రయోజనాలను కాదని అతనిని దూరం చేసుకోవడం ఇరువురికీ క్షేమం కాదు. ఈ ‘మిత్ర సంపద’ మిగతా సంపదలన్నిటి కంటేకూడా ఎంతో గొప్పది’  అలాగే, ‘సమస్యలలో ఉన్నప్పుడు మిత్రుడు తనకు చేసిన మేలును మరిచిపోకుండా, అవసరం వచ్చినప్పుడు తిరిగి అతనికి మేలు చేస్తుండాలి. తమకు సహాయం చేసిన వాళ్ల ఋణాన్ని తీర్చుకోవడానికి తిరిగి సహాయం చేసేవాడే ‘కృతజ్ఞుడు’.

‘మిత్రద్రోహాన్ని’ మించిన పాపం మరొకటి ఉండదు. మిత్రద్రోహులనూ, కృతఘ్నులనూ, గుర్తుపట్టి వారిని ఎప్పుడూ నమ్మకుండా దూరం పెడుతుండాలి’ చేసిన మేలును మరచిపోయి నవారిని, ఆ మేలు చేసిన వారికి కీడు చేసేవారినీ ‘కృతఘ్నులు’ అంటారు. తనకు అంతటి స్థాయి రావడానికి, సంపదలన్నిటినీ సమకూర్చుకోవడానికి, సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించడానికి, జీవితాం తం తనకోసం పాటుపడిన దాతకు అవసరాలన్నీ తీరిన పిమ్మట కీడు చేసే కృతఘ్నుని శవాన్ని తాకడానికి కుక్కలు కూడా అసహ్యించుకుంటాయి’  అందుకే, ‘కృతఘ్నత’ అనేది పనికి రాదనీ, ఇది అనేక అనర్థాలకు దారితీస్తుందనీ మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. ‘మంచివాళ్లతో స్నేహం చేస్తే మంచి జరిగినట్లే, చెడ్డవారితో సహవాసం చేస్తే చెడు ఫలితాలే అనుభవంలోకి వస్తాయి’
ఆరు నెలలు కలిసి ఉంటే వాడు వీడూ, వీడు వాడూ అవుతాడనే నానుడిలోనూ వాస్తవం లేకపోలేదు. అసత్యవాది సాంగత్యంలో ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడవుతాడు. ఎంతో మహిమతో ఉండే విష్ణు సహస్ర నామావళిని బోధించిన భీష్ముడంతటి వాడు కూడా దుర్యోధనుని సాంగత్యం వల్ల గోవులను దొంగిలించడానికి సిద్ధపడ్డాడు. అందుకే ‘దుష్టులతో స్నేహం’ ఎన్నటికీ పనికిరాదని మన సనాతన ధర్మం నొక్కి చెప్తున్నది. స్నేహం చేయడానికి ముందే ఆ వ్యక్తి గుణగణాలనూ, నడవడికనూ చక్కగా బేరీజు వేసుకోవాలి. తమ అవసరాలు తీర్చుకోగానే కీడు చేసేవారిని ఏ మాత్రం దగ్గరకు రానీయకుండా జాగ్రత్త పడుతుండాలి. అప్పుడే, జీవితానికి మేలు, మిత్ర ధర్మానికి సార్థకత చేకూరుతాయి.

--(())--


భాష -ఉచ్చారణ
మునిమాణిక్యం నరసింహారావు గారు వ్రాసిన 'ఉపాధ్యాయ ఉవాచ' లో ఒక విద్యార్థి తండ్రి తన కొడుకు తరుఫున వకాల్తా పుచ్చుకొని ఉపాధ్యాయుడిని యిలా ప్రశ్నించాడు.ఏమిటి మాష్టారూ మా అబ్బాయి 'సింత పండు' అని చదివాడని కోప్పడ్డారట.నా కొడుకు ఎలా పలికితే మీకేమిటి?సింతపండు అంటే దాని పులుపు తగ్గిపోతుందా?అని నిలదీశాడు.అయితే ఇది హాస్యానికి రాసిందే అయినా మనం మాత్రం ఉచ్చారణ మెరుగు పరుచుకోవాల్సిందే.
సీతాన్వేషణ లో భాగంగా తొలిసారిగా ఆంజనేయుడు బ్రాహ్మణ వేషములో వచ్చి రామ లక్ష్మణులను కలిసి
వారిని గురించి ఆరా తీస్తాడు.ఈ సంభాషణ లో రాముడు తమతో మాట్లాడుతున్న వ్యక్తి వ్యాకరణం బాగా తెలిసినవాడిలా వున్నాడు వేదం చదువుకున్నా వాడిలా వున్నాడు అని ఆంజనేయుడిని గురించి అనుకున్నాడు.ఎదుటి వ్యక్తికి
మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి.దీనికి చిన్నతనం నుంచే శిక్షణ యివ్వాలి.


ఆంగ్లం లో ఉచ్చారణ సరిగ్గా లేకపోతె ఒప్పుకుంటున్నారా?ఒక్క స్పెల్లింగులో ఒక అక్షరం లోపించినా తప్పు పడుతున్నారు కదా!స్పెల్లింగు ఎలా వున్నా యిలాగే పలకాలి అంటే అలాగే పలుకుతున్నాము.కదా!. ఉదాహరణకి సైకాలేజీ స్పెల్లింగ్ ఏమిటి?మనం ఎలా పలుకుతున్నాము? ఆలోచించండి.మరి.వూరికే భాషాదినోత్సవాలు జరుపుకుంటే సరిపోదు కదా!  


తెలుగులో కూడా ఉచ్చారణ సరిగ్గా వుండాలి కదా!వార్తలు చదివేటప్పుడు 'ఆశ్చర్యం' అనడానికి బదులుగా 'ఆచ్చర్యం' అని పలుకుతున్నారు.మరి ఎలా ఒప్పుకుంటున్నారు?యింకా ఇలాంటి తప్పులు చాలా చేస్తున్నారు.హిందీ వార్తలు చదివే వాళ్ళు ఎంత విలక్షణంగా చదువుతారు.వినడానికి సొంపుగా
వుంటుంది వార్తలే కాదు వాళ్ళు మాట్లాడినా ఉచ్చారణ బాగుంటుంది.
పాఠశాలలో చదివే టప్పుడే ఉచ్చారణ సరిగ్గా నేర్పించాలి.ఇప్పుడు ఆంగ్లము లో వ్రాసుకొని తెలుగులో చదువుతున్నట్టున్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు.ఇది చాలా బాధాకరమైన విషయం.


ఎదుటి వ్యక్తికి  మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి.దీనికి చిన్నతనం నుండే వాచకాల్లో పాఠా లను బయటికి స్పష్టంగా పలుకుతూ చదవాలి.అప్పుడే పదాలను పలకడం లో స్పష్టత సాధిస్తాం చదివే విధానం ఎలా వుండాలో  ఒక పద్యం లో వివరిస్తాడు 13 వ శతాబ్దికి చెందిన శివదేవయ్య (1250-1300)
వెనుకకు బోక ఈ(హా) యనక వేసట నొందక బంతి బంతిలో పెనుమక కానమిం బ్రెమసి బెగ్గిల కెంతయు మున్ను సూచుచున్ గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేక  చిత్తుడై
యనుపమ భక్తి  తో చదువునాతని వాచకుండండ్రు సద్బుధుల చదవడం ప్రారభించాక చదువుతూ చదువుతూ వాక్యం మధ్యలో వెనక్కి పోగూడదు,ఆ,ఈ వూ అని అనకూడదు.విసుగు చెందకూడదు.ఒక ప్రవాహం లాగా ఆవిరళం గా సాగాలి.అంతేగానీ ముందున్న వాక్యాల్ని చూసి అమ్మో యింత కష్టంగా వుందే మిటని భయపడకుండా తొట్రుపాటు లేకుండా.ఏ అక్షరాన్నీ వదిలి పెట్టకుండా ఏకాగ్రతతో సాటిలేని భక్తీ శ్రద్ధ లతో చదివేవాడిని,మాట్లాడేవాడిని మంచి వాచకుడు అని పండితులు అంటారు
 

ఎలా చదవాలో, సంభాషణ ఎలా చెయ్యాలో ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే తెలుగు కవులు వివరించారంటే మనది ఎంత గొప్ప సంప్రదాయమో అర్థమవుతూంది..ఇప్పటి తరానికి భాషను ఎలా ఉపయోగించాలో కూడా
తెలియదు.చెప్పేవారు కూడా లేరు.ఉపాధ్యాయులు అలాగే వున్నారు,విద్యార్థులూ అలాగే వున్నారు.
 

. 'పురుషార్థ సారం' లోని ఈ పద్యం రాజు కొలువులో లేఖలు,యితర విషయాలు చదివే వాళ్ళని ఉద్దేశించి వ్రాసిందే అయినా అందరికీ వర్తిస్తుంది.అన్ని భాషలకూ వర్తిస్తుంది -(())--

కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తలచుకుంటారు. ప్రార్థిస్తారు. సుఖాలు వచ్చినప్పుడు లౌకిక భోగభాగ్యాల్లో మునిగిపోతారు. భగవంతుడి గురించి ఆలోచించరు. మరికొందరు సుఖాలు కలిగినప్పుడు దేవుణ్ణి స్మరిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు దూషిస్తారు. కష్టాలనూ, సుఖాలనూ దేవుడు ఇచ్చిన బహుమతులుగా స్వీకరించేవారు కోటానుకోట్లమందిలో ఏ ఒక్కరో ఉంటారు. అలాంటి సూఫీ గురువు కథ ఇది.

ఆ గురువు ప్రతిరోజూ ప్రార్థన చేసేటప్పుడు ‘‘ఓ భగవంతుడా! ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నన్ను నువ్వు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటావో ఏమో! ఎంతో కరుణతో నాకు కావలసినవన్నీ ఈ రోజు సమకూర్చి పెట్టావు. నా తల్లికన్నా ఎక్కువ శ్రద్ధతో, జాగ్రత్తతో నన్ను కనిపెట్టి ఉన్నావు. నా కృతజ్ఞతలు ఎలా తెలపాలో, ఏ మాటలు అందుకు సరిపోతాయో నాకు తెలియడం లేదు ప్రభూ’’ అంటూ కన్నీరు కార్చేవాడు.

ఒకసారి ఆయన తన శిష్యులతో కలిసి పొరుగు ఊరుకు వెళ్ళాడు. ఆ ఊరివారెవరూ వాళ్ళను పట్టించుకోలేదు. ఆహారం పెట్టలేదు. దీంతో వాళ్ళందరూ నిరాహారంగానే పడుకున్నారు. ఆ రోజు కూడా సూఫీ గురువు రాత్రి నిద్రపోయే ముందు ఎప్పుడూ చేసే ప్రార్థనే చేశాడు. శిష్యులు ఈ సంగతి గమనించారు. వారంతా ఆ రాత్రంతా ఖాళీ కడుపులతోనే ఉండాల్సి వచ్చింది. రెండో రోజు, మూడో రోజు కూడా ఇలాగే జరిగింది. తినడానికి ఏదీ లేక, ఆకలితో కడుపులు కాలుతూ ఉంటే నిద్ర రాక... ఆ శిష్యులంతా తమ గురువు పక్కనే అసహనంగా దొర్లుతున్నారు.

గురువు ఎప్పటిలానే ‘‘ఓ నా తండ్రీ! కరుణామయుడా! నా మీద నీకు ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ! లోకంలోని ఇన్ని కోటానుకోట్లమందిలో నన్ను గుర్తు పెట్టుకొని, నా మీద అపారమైన నీ దయావృష్టిని కురిపించి కాపాడుతున్నావు. నాకు ఏది అవసరమో కనిపెట్టి, సమయానికి సరిగ్గా సమకూరుస్తున్నావు. తండ్రీ! నీ ఋణాన్ని నేను ఎలా తీర్చుకోగలను’’ అంటూ ఏడ్చాడు.

తాము ఆకలి మంటల్లో కాలిపోతూ ఉంటే గురువు ఈ విధంగా ప్రార్థించడం విన్న శిష్యులకు ఆగ్రహం వచ్చింది. వారిలో ఒకరు కోపం ఆపుకోలేక -

‘‘మహాశయా! అర్థం పర్థం లేని ఆ మాటల్ని ఆపండి. మూడు రోజులుగా తినడానికి తిండీ, నిద్రపోవడానికి వసతీ లేక... ఈ నిర్జన ప్రదేశంలో చెట్లకింద, ఇన్ని నీళ్ళు తాగి పడుకుంటున్నాం. మీరేమో దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ప్రార్థిస్తున్నారు. ఇంతకన్నా పిచ్చి, వెర్రి, అవివేకం ఇంకేం ఉంటుంది?’’ అని ఆవేశంగా అన్నాడు.

ఆ గురువు ప్రశాంత వదనంతో, ‘‘నాయనా! ఎన్నో ఏళ్ళుగా నేను తెలుసుకోలేని ఆ ప్రభువు ఘనతనూ, మహిమనూ ఈ మూడురోజుల ఆకలి, అవమానం, ఆపదల ద్వారా గ్రహించగలిగాను. అవి నా ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరం కాబట్టే ఆ దయామయుడు వాటిని నాకు సమకూర్చాడు. తిండి లేకపోయినా, గూడు లేకపోయినా, ఎన్నెన్నో ఆపదలు చుట్టు ముట్టినా... ఆ భగవంతుడి దయ ఉంటే బతికి ఉండగలమనే పాఠాన్ని గ్రహించాం కదా! నా భగవంతుడు కరుణాసముద్రుడనడానికి ఇంతకన్నా మంచి నిరూపణ ఉంటుందా’’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా కన్నీరు కార్చాడు.

లోకంలో అందరూ భగవంతుడు తమకు ఎంత ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా... అవి సరిపోలేదనీ, ఇంకా కావాలనీ ఏడ్చేవాళ్ళే! ‘జీవించడానికి అత్యవసరమైన ఆహారం ఇవ్వకపోయినా... అంతకన్నా విలువైన జీవితాన్ని ఇచ్చావు’ అంటూ, భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ ఏడ్చేవారు ఎందరుంటారు?
 

.

ఆధ్యాత్మిక తాకు..6స్థానాలు..356

నేను అనే అస్తిత్వపు అనుభూతిని, చైతన్యపు విభూతిని అనంతత్వంలోకి, అమృతత్వంలోకి విస్తరింపజేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. సారభూతంగా ఆ విస్తరణమే శ్రేయస్సు. లౌకిక జీవితంలో దానికి ఉప ఫలంగా కలిగే దుఃఖవిముక్తి, సుఖప్రాప్తియే ప్రేయస్సు. ఆధ్యాత్మికత సగుణం నుంచి నిర్గుణం వైపు, అంటే నామరూపాల పరిమితి నుంచి పరిమితిలేని సచ్చిదానంద పరబ్రహ్మం వైపు సాగే సాధన. ఏ అడ్డూ, ఆపూలేని విశృంఖలమైన సహజాతాలను సమయబద్ధమైన, సందర్భబద్ధమైన విధి నిషేధాల ద్వారా లోకహితకర సంస్కారంగా, సామాజిక సంప్రదాయంగా ప్రవహింపజేయడమే సంస్కృతి. ఆ సంస్కృతి ద్వారా నిరపేక్షానందాన్ని పండించుకునే విశిష్టమైన నిష్ఠ ఆధ్యాత్మికత.

వీరశైవం ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఆరు స్థానాలను పేర్కొన్నారు. వీటిని స్థాయులు, తలాలుగా భావిస్తారు. ఈ ఆరింటినీ కలిపి షట్‌ స్థలాలు అన్నారు. అవి భక్త, మహేశ, ప్రసాది, ప్రాణలింగి, శరణ, ఐక్య స్థలాలు. ఇందులో ప్రారంభ స్థాయి భక్త స్థలం. ఇది మొదటి మెట్టు. నిష్ఠను బలపరచుకునే దృష్టికి, ఆచరణకు సంబంధించింది. నిర్గుణ సచ్చిదానంద సదాశివం పట్ల, దానికి సంకేతంగా ధరించిన ఇష్టలింగం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని, వాటి మధ్య అభేద దృష్టిని కలిగి ఉండటం. అంతేకాదు శివలింగానికి, శివభక్తుడికి అంటే జంగమునికి మధ్య అభేద భావాన్ని అచంచలంగా కలిగి ఉండటం. వారితో ఒక సేవకునిగా, దాసునిగా, భృత్యుడిగా పరమ నిరహంకారంతో వ్యవహరించడమే భక్త స్థలం. రెండో స్థాయి మహేశ స్థలం. సత్యం, అహింస, శుచి, అస్తేయం పాటించడం. పరధనం పట్ల, పరస్త్రీ పట్ల ఎలాంటి కాముకత లేకపోవడం. పరనింద వీడి పరమ శివనిష్ఠతో జీవించడం మహేశ స్థలం.

మూడోమెట్టు ప్రసాది స్థలం. తాను ఇంద్రియాల ద్వారా పొందే ప్రతి విషయాన్నీ, ఏ మినహాయింపూ లేకుండా సమస్తం శివార్పణం చేసి, దానిని శివప్రసాదంగా మాత్రమే స్వీకరించడం. అంటే ఒకరకంగా తన అనుభవాన్నంతా ఈశ్వర ప్రసాద ధారగా చేసుకోవడమే ప్రసాది స్థలం. నాలుగోది ప్రాణలింగి స్థలం. లింగమే తన ప్రాణంగా, తన ప్రాణమే లింగంగా భావించి, అన్ని పరస్పర విరుద్ధ పరిస్థితులలో సమశాంత చిత్తంతో జీవించడం. సుఖమైనా, దుఃఖమైనా శివానుభవంగా మలచుకోవడం. పక్షపాతాలను భ్రాంతిగా విడిచి బతకడమే ప్రాణలింగి స్థలం. ఈ స్థాయిలో జీవితం ఒక శుద్ధ శివప్రవాహం అవుతుంది.

ఐదో మెట్టు శరణ స్థలం. శివలింగాన్నే పతిగా భావించి, దానికి అధీనమైన సతిగా పాతివ్రత్యంతో జీవితం సాగించడం. అంటే తన ఎరుకను పూర్తిగా శివమయంగా చేసుకొని, జీవితాన్ని సంపూర్ణ శివశిల్పంగా మలచుకోవడమే శరణ స్థలం. చివరిది, అత్యున్నమైన ఆరోస్థాయి ఐక్య స్థలం. లౌకికమైన అన్ని కోరికలను పెరికివేసి, అన్ని బంధనాలు రాల్చేసి, అర్చనాది కర్మలనూ వదిలేసి పరమ నిష్కామంతో, నిర్భీతితో జీవన్ముక్తుడిగా ప్రగాఢమైన శివాద్వయస్థితిలో మనడమే శిఖరస్థాయి సమానమైన ఐక్య స్థలం.

ఈ విధంగా సాధకుడు మొదటి స్థాయిలో భక్త స్థలంలో విశ్వాసనిష్ఠను, వినయాన్ని సుస్థాపనం చేసుకుంటాడు. రెండో స్థాయిలో మహేశ స్థలంలో పరిశుద్ధతను, త్యాగనిరతిని ప్రోది చేసుకుంటాడు. మూడోదైన ప్రసాది స్థలంలో కృతజ్ఞతను, శివప్రసాద మాధుర్యతను సొంతం చేసుకుంటాడు. నాలుగో స్థాయి ప్రాణలింగి స్థలంలో సమత్వాన్ని, సమున్నతత్వాన్ని పెంపొందించుకుంటాడు. ఐదోదైన శరణ స్థలంలో శివాత్మీయతతో జీవితాన్నే మహాశివ శిల్పంగా మలచుకుంటాడు. ఆరోస్థాయి అయిన ఐక్య స్థలంలో శివాద్వయానుభూతితో జీవన్ముక్త స్థితిని సిద్ధింపజేసుకుంటాడు.

...........

..జూన్ మూడవ ఆదివారం..357

52దేశాలలో ఫాదర్స్ డే జరుపుతారు.🙏🙏

మనదేశంలో పురాణ కాలం నుండినాన్నకు (తల్లిదండ్రులకు) సముచిత స్ధానం ఇవ్వబడింది. కానీ నేడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో, స్వార్ధపరత్వం వల్ల మనం కూడా ఫాదర్స్ డే జరుపుకోవలసిన పరిస్ధితులలోకి వెళ్లిపోతున్నాం.


🌷ఈరోజు ఒక్కరోజే ఊరికే ఫాదర్స్ డే అని గొప్పగా చెప్పుకొని కానుకలు యిచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంకాదు... తల్లిదండ్రులు దైవసమానులని  మనం మనపిల్లలముందు ప్రవర్తిస్తే భవిష్యత్ లో మనపట్ల మన పిల్లలు కూడా అలానే ప్రవర్తిస్తారు.మనం వృధ్ధాశ్రామాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా మన పిల్లలు  చూస్తారు


🌷పిల్లలకోసం సర్వం త్యాగం చేయగల త్యాగమూర్తి..నాన్న.

అటువంటి తండ్రిని పిల్లలు మరచి పోక నాన్న స్ధానాన్ని గౌరవించ గలిగితే నాన్నకు ప్రతీరోజూ ఫాదర్స్ డేనే. ప్రత్యేకంగా సంవత్సరానికోసారి ఫాదర్స్ డే అవసరం ఉండదు.


🌷పుత్రోత్సాహము తండ్రికి 

పుత్రుడు జన్మించి నపుడే పుట్టదు మరి జనులా 

పుత్రుని గని పొగడగ నాడు 

పుత్రోత్సాహము పొందుర సుమతీ 

అని సుమతి శతక కర్త బద్దెన అంటాడు.


🌷సి నా రె ఒక సినిమా పాటలో  ఓ!నాన్నా నీ మనసే వెన్నా అమృతము కన్నా నీ మనసే మిన్నా  .... అని చెప్పారు.


మనం అటువంటి తండ్రిని భగవంతుడి కంటే మిన్నగా చూసుకోవాలి.


తమ కుటుంబాన్ని ఫిజికల్‌గా, ఆర్ధికంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ కష్టపడే తండ్రులు తమ పిల్లలకు నిజమైన హీరోలు. తండ్రి  పిల్లలకు తొలి హీరో ...


🌷ఫాదర్స్ డే అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్రకు సింబల్‌గా నిలుస్తుంది.  తమను కని పెంచి..బాధ్యతగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతగా, గౌరవంగా కాస్సేపైనా తండ్రితో పిల్లలు ఆనందంగా గడపడమే ఈ రోజు ముఖ్యోద్దేశం.


🌷ఫాదర్స్ డే అనేది ప్రపంచానికి అమెరికా ద్వారా పరిచయమైంది. అమెరికాలో సోనోరా స్మార్ట్ డోడ్ తొలిసారిగా ఫాదర్స్ డేను జరిపి ప్రపంచానికి పరిచయం చేశారని చెబుతారు. సోనోరా తండ్రి విలియమ్ జాక్సన్ స్మార్ట్. అర్కాన్సాస్ నుంచి వచ్చిన అతను ఆరుగురు పిల్లలకు సింగిల్ పేరెంట్. అన్నా జార్విస్ తన తల్లికి గౌరవంగా మదర్స్ డే క్రియేట్ చేసినట్టే తండ్రుల్ని గౌరవించేందుకు ఏదైనా కొత్తగా చేయాల్సి ఉందని చర్చ్ ఫాదర్‌తో సోనోరా చెబుతుంది.            

    🌷   తన తండ్రి కష్టాన్ని గుర్తించేందుకు, తగిన రీతిలో గౌరవం ఇచ్చందుకు, తండ్రులందరికీ ఒక రోజు ఉండాలని విలియమ్స్ పుట్టినరోజైన జూన్ 5న ఫాదర్స్ డే జరపాలని ఆలోచించింది. దీనికోసం చర్చ్ ప్రతినిధుల్ని ఒప్పించింది. అయితే ఆ ప్రయత్నంలో ఫాదర్స్ డే జరిపే తేదీ మారింది. అదే నెలలో మూడవ ఆదివారం జరపాలని నిర్ణయించారు. సోనోరా చెప్పిన తేదీలోగా ఏర్పాట్లు చేయడం కష్టమని భావించి అలా చేశారు. అప్పట్నించి జూన్ నెలలో మూడవ ఆదివారం ఫాదర్స్ డే నిర్వహిస్తున్నారు.

🌷. ఫాధర్స్ డే సందర్భంగా పితృదేవుల్లందరికీ శుభాకాంక్షలు...,

* సంతోషమే ఐశ్వర్యం..కధ.358
*ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.
జీవితం కూడా అంతే...
*ఏంజాయ్ చేసి నా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.

• *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.
• తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.
• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.
• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది.
ఫైనల్ గా చెప్పదేంటంటే...
*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*.
• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?
• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.
• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!
• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.
• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*.
• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*.
• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*.
• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*.
• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*.
• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*.
• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*.
• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*.
• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*.
• ప్రకృతి అందం *ఐశ్వర్యం*. 
• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*.
• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*.
• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*.
• బిడ్డలకొచ్చే చదువు  *ఐశ్వర్యం*.
• భగవంతుడిచ్చిన ఆరోగ్యం  *ఐశ్వర్యం*.
• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*.
• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.
• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*.
• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం*
సంతోషానికి మించిన ఐశ్వర్యం
🙏శ్రేయోభిలాషి మల్లాప్రగడ రామకృష్ణ
ధన్యవాదాలు.....🙏🙏

.........

అచ్చుతుని అభయం కధ....359

శ్రీమద్భాగవతంలో భాసిస్తూ ఉన్న అన్ని కథల కన్నా ఎన్నగ పన్నగశాయి అనన్య భక్తుడైన ప్రహ్లాదుని కథను ఎంతో మిన్నగా విన్నవించాడు తెలుగునాట భక్తకవిగా పేరెన్నికగన్న పోతన్న. బాలప్రహ్లాదుని పాత్రలో భక్తి రసాన్ని పరవళ్లు తొక్కించి భావుక భాగవత భక్త చిత్తాలను మత్తెక్కించి మైమరపింప చేశాడు. సర్వవ్యాపకమైన- అంతటా పరచుకొని ఉన్న నిర్గుణ నిరాకార బ్రహ్మము వలె సగుణ సాకార భగవంతుడు కూడా అణువణువున విస్తరించి భక్తితో పిలిస్తే పలికి వెలికి వచ్చి వరాలు వర్షిస్తాడన్న వాస్తవాన్ని ఇంత సరళంగా, సరసంగా, ముగ్ధమనోహరంగా, స్నిగ్ధ శాస్త్రీయంగా ప్రస్తావించి విస్తారంగా వర్ణించి నిరూపించిన కథ ఇందు తప్ప మరెందునా కనిపించదు.

సత్యవస్తువు- బ్రహ్మము కేవలం నిర్గుణ నిరాకారము కాదు, కేవలం సగుణ సాకారమూ కాదు. నిజానికి అది ఉభయాకారం. ఇలా అనుభవం పొందడమే పూర్ణజ్ఞానం. నిర్గుణ నిరాకార బ్రహ్మము అరణి (కట్టె)లో అవ్యక్తం (అప్రకటితం)గా ఉన్న అగ్ని వంటిది. కళ్లకు కనిపించే వ్యక్తమైన (ప్రకటమైన) కృశానుడు (అగ్ని) సగుణ సాకార బ్రహ్మము. ఈ రెండూ అనిర్వచనీయాలే, అగాధాలే- గూఢములు, గంభీరములే. నిర్గుణ సగుణ బ్రహ్మల కన్నా భగవంతుని నామం మిక్కిలి మహిమోపేతం. నామ జపం వలన ఈ రెండూ సుగమాలు, సులభాలు అవుతాయి. సర్వజీవుల హృదయాలలో సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ కచ్చితంగా కొలువై ఉన్నా జీవులు అతి దీనులుగాను, మతి హీనులుగాను దుఃఖ తతి (పరంపరల)చే సతమతమవుతున్నారుగా!

నామ మహిమను గుర్తించి త్రికరణ శుద్ధిగా జపించడం వలన ఆ పరబ్రహ్మ వ్యక్తం అవుతాడు. రూపుదాల్చిన బ్రహ్మానందమే భక్తలోకానికి అపురూప ఆదర్శమైన ప్రహ్లాదుడు. నవధా- తొమ్మిది విధాలుగా ఉన్న భక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన పరమ భాగవత శిఖామణి బాల ప్రహ్లాదుడు. ‘శ్రవణం, కీర్తణం విష్ణోః స్మరణం..’ ఈ క్రమంలో స్మరణ భక్తి మూడవది. ‘మామనుస్మర యుధ్య చ’- సర్వకాల సర్వావస్థలలో నన్ను స్మరిస్తూ కర్తవ్య నిర్వహణ గావిస్తూ ఉండమని గీతలో భగవానుని ఆదేశం. ‘ప్రహ్లాదః స్మరణే’-

ప్రహ్లాదుడు స్మరణ భక్తికి ప్రతీకం, దృష్టాంతం. ‘హరినామమే నరహరి అనగా నరసింహస్వామి! సమస్త పాప తాపాలకు నిలయమైన కలియుగమే కనక (హిరణ్య) కశిపుడు. హరినామ జపపరులే ప్రహ్లాదులు. నృసింహదేవుడు హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని వరించినట్లు హరినామం కలి కలుషా (పాపా)లను హరించి భక్తులను పరిపరి విధాల పరిపాలిస్తుంది’ అని భక్తకవి వతంసుడు తులసీదాసు తన ‘మానస రామాయణం’లో భవ్యంగా వర్ణించాడు.

రాజసూయ యాగ సందర్భంలో పాండుపుత్రుడైన ధర్మరాజుకు భక్తి విశారుదుడైన నారదుడు ప్రహ్లాద చరిత్రను సభాముఖంగా ఇలా ప్రవచించాడు.

మహారాజా! విరించి (బ్రహ్మదేవుడు) తను వరించిన వరాలన్నీ మారెంచక ప్రసాదించాడనే గౌరవం ఇంచుక కూడా లేకుండా, తన తమ్ముడైన హిరణ్యాక్షుని వధించినందుకు హిరణ్యకశిపుడు మదించి హరిపై అదను చూసి పగ సాధించాలని నిర్ణయించుకున్నాడు. విష్ణువుపై విరోధం పెంచుకున్నాడు. బ్రహ్మదేవుని వరం అసురునికి అమోఘమైన బ్రహ్మాస్త్రమై అలరారింది. ఆ దైత్యవిభుని దురాగతాలు దేవతలకు దుర్భరమైపోయాయి. వరగర్వం వలన కళ్లకు పొరలు కమ్మగా దితి పుత్రుడు దిమ్మదిరిగే పరాక్రమంతో ప్రాణికోటిని పీడించసాగాడు. ఆ దుష్టుని నిరంకుశ నికృష్ట శాసనానికి సృష్టి అంతా భ్రష్టు పట్టింది.

లోకమంతా ఏకాధిపత్యం సాధించి అసురరాజు సురలోకం (స్వర్గం) ఆక్రమించాడు. విధి, విష్ణు, విశ్వేశ్వరులు తప్ప తక్కిన విబుధు (దేవత)లంతా తలలు వంచి అమర విరోధి (అసురుని)కి వశమై అడుగులకు మడుగులొత్తారు. కరుణించమని శరణుకోరారు. భూలోకంలోని ఏ భాగంలో యాగాలు జరిగినా హవిర్భాగాలను హిరణ్యకశిపుడే వచ్చి బలాత్కారంగా హరించుకుపోయేవాడు. యథేచ్ఛగా ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ తృప్తిపడక దృప్తుడై- మదగర్వంతో ధర్మమర్యాద (హద్దు)లను అతిక్రమించాడు. ‘శరాబ్‌ (మద్యం) తాగనివాని దిమాగ్‌ ఖరాబ్‌’ అన్న విధంగా మధువును సేవించి మదించి విందుపొందులతో వినోదించేవాడు. వాని ధాటికి ధరణి- భూమి కూడా దున్నకనే అన్ని పంటలు పండేది. దైత్యరాజు రాజదండానికి భయపడిన దేవతలు దిక్కులన్నిటికీ దిక్కయిన దివ్యమూర్తి దేవదేవునికి రక్షించమని మొక్కుకున్నారు. కంటికి కనిపించకుండా కమలనాభుడు- విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు- ‘అమరులారా! అరమరిక లేక వినండి. మీకు అభయం ఇస్తున్నా. అసుర నాయకుడు చేస్తున్న అశాస్త్రీయ ఆగడాలు నాకు తెలుసు. వాడి పాపం పండి కాలం మూడినప్పుడు వాణ్ని సంహరిస్తా. సాధువులను బాధించేవాడు, విబుధు (దేవత)లను వేధించేవాడు, నిగమా (వేదా)లను నిందించేవాడు, విప్రులకు అప్రియం ఆచరించేవాడు, గోవులను హింసించేవాడు, ధర్మపదవి (మార్గం) తప్పి నాపై పగబూనిన వాడు పెక్కురోజులు నిలువక పతనమైపోతాడు-

నిర్జరులారా! ఈ దుర్జనుడు తన కన్నకొడుకైన ప్రహ్లాదుని, మిగుల సజ్జనుడనీ, శమ దమాది సద్గుణ సంపన్నుడనీ, అజాత శత్రువనీ ఏ మాత్రం ప్రేమ అభిమానాలు లేక ఎప్పుడు బాధిస్తాడో అప్పుడే వాణ్ని వధిస్తా. నేను అన్య (ఇతర)మైనది ఏదైనా సహిస్తాను కానీ, అనన్య భక్తునికి చేసిన ద్రోహాన్ని భరిస్తూ మాత్రం మిన్నకుండలేను. మీకు శుభం కలుగుతుంది. సందేహించక వెళ్లిరండి.’ అచ్యుతుని నుంచి ఇలా అభయం పొంది అమరులు ఆనందిస్తూ తమ ఆవాసాలకు వెళ్లారు.

🔆ఒక అమ్మ కథ🔆360

     """"'''''''''''''''''''''"""""""

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది

మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు

ఆమె ఎక్కడికి  వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది

ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది

ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది

ఇంక అప్పట్నించి చూడండి

”మీ అమ్మ ఒంటి కన్నుది”

అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు

అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే

అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది

ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది

“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను

నువ్వు చచ్చిపో!”

కోపంగా అరిచేసే వాణ్ణి

ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు

నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది

అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది

ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు

ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను

మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది

నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను

అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది

మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు

నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?

మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను

ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను

ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను

పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను

మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను

బాగా డబ్బు సంపాదించాను

మంచి ఇల్లు కొనుక్కున్నాను

మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను

నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా

ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది

ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి

ఇంకెవరు?

మా అమ్మ

ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది

“ఎవరు నువ్వు?

ఎందుకొచ్చావిక్కడికి?

నువ్వెవరో నాకు తెలియదు

నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?

ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”

సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”

ఆమె అదృశ్యమై పోయింది

“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”

భారంగా ఊపిరి పీల్చుకున్నాను

ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను

కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు

వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను

స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను

ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి

మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది

ఆమె చేతిలో ఒక లేఖ

నా కోసమే రాసిపెట్టి ఉంది

దాని సారాంశం

ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను

నేనింక నీవుండే దగ్గరికి రాను

కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!

ఏం చేయమంటావు?

నిన్ను చూడకుండా ఉండలేకున్నాను

కన్నపేగురా

తట్టుకోలేక పోతోంది

నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు

కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే

వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను

ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు

చిన్నా!

నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది

నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా

అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను

నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?

నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు

ఒకటి, రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా!”

అని సరిపెట్టుకున్నాను

చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు

ఉత్తరం తడిసి ముద్దయింది

నాకు ప్రపంచం కనిపించడం లేదు

నవనాడులూ కుంగి పోయాయి

భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను

తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?

మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?

ఎన్ని జన్మలెత్తితే ఆమె ఋణం తీర్చుకోగలను ?


నాస్తి మాతృ సమం దైవం

నాస్తి మాతృ సమః పూజ్యో

నాస్తి మాతృ సమో బంధు

నాస్తిమాతృ సమో గురుః

అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు

తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు

ఆకలేసినా..


ఆనందం వేసినా

దిగులేసినా

దుఃఖం ముంచుకొచ్చినా

పిల్లలకైనా

పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా

గుర్తొచే పదం అమ్మ

తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ

అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి

కనుపాప లా కాపాడండి

బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం

తల్లి ఋణం ఈ జన్మకి తీరదు 

కంట నీరు పెట్టించిన కధ

*చదివినవారికి ధన్యవాదాలు*

    సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ 

నేటి కధలు 361 నుండి 365 వరకు



*పిడుగులు ఎందుకు పడతాయి?..361

 మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?*


ఏటా పిడుగు పాటు కార‌ణంగా దేశంలో వంద‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మూగ జీవాలు చ‌నిపోతున్నాయి.

అయితే, పిడుగులు ఎప్పుడు, ఎక్క‌డ ప‌డ‌తాయో ముందే అంచ‌నా వేయ‌డంతో పాటు, పిడుగుల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌జ‌లు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని చాలా వ‌ర‌కు త‌గ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, పిడుగు అంటే ఏమిటి? అవి ఎలా పుడ‌తాయి? వ‌ంటి విష‌యాలు తెలుసుకోవ‌డం కూడా ముఖ్యం.

పిడుగులు ఎలా పుడతాయి?

ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి.

అయితే, పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత(+) మేఘాలు పైకి వెళ్తాయి.

అధిక బరువుండే రుణావేశిత (ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న) మేఘాలు కిందికి వస్తాయి. అంటే, ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన మబ్బుల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయన్నమాట.

సైన్స్ ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి.

అయితే, ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి.

ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే 'పిడుగు పడటం' అంటారని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగంలో పనిచేస్తున్న నిపుణులు హరి కిరణ్ వివరించారు.

మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు, మెరుపులు పుడతాయని ఆయన తెలిపారు.

భూమి మీదే ఎక్కువ

అలా మేఘాల నుంచి పడే 'పిడుగు'లో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది, అది మనిషిని అక్కడిక్కడే కాల్చి బూడిద చేయగలదు.

ప్రధానంగా ఎండా కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దాంతో ఆ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని నాసా పరిశోధనలో తేలింది.

అందులోనూ సముద్రంలో కంటే భూమిపైనే పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి.

పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది.

అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్‌నెట్ వర్క్‌తో పాటు, ఇస్రో సహకారం తీసుకుంటోంది. ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సర్ల ఏర్పాటు చేశారు.

ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపి అప్రమత్తం చేస్తున్నారు.

దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించొచ్చని హరి కిరణ్ బీబీసీకి చెప్పారు.

పిడుగుల నుంచి తప్పించుకోవడం ఎలా?

ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే. కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం.

పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.

భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.

చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు.

సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు.

ఒకవేళ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించాలి. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువగా పడే అవకాశం ఉంటుంది.

భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి.

ఒకవేళ నీటిలో ఉన్నట్టయితే సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లాలి.

ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.

ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి.

ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే బయటకు వెళ్లకుండా పనులను వాయిదా వేసుకోవాలి.

ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు కడగటం ఆపేస్తే మంచిది. ఎందుకంటే లోహపు పాత్రలు, పైపుల ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది.

పిడుగు బారిన పడినప్పుడు శరీరంపై రెండు చోట్ల గాయాలవుతాయి. ప్రధానంగా విద్యుత్ ప్రవహించిన చోట, మళ్లీ బయటకు వెళ్లిన చోట(ఎక్కువగా అరికాళ్లపై) గాయాలు అవుతాయి.

బాధితులను ముట్టుకుంటే షాక్ తగులుతుందని కొందరు చెబుతుంటారు. కానీ అందులో నిజం లేదు.

బాధితులకు వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.

*సేకరణ :*

*-- మల్లాప్రగడ రామకృష్ణ శర్మ 

'గుంటూరు చరిత్ర'..361

*

(సమాచార సేకరణ : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు)

గుంటూరు అంటే మిరపకాయ బజ్జీలు, జిన్నా టవరు, గోలీ సోడా లేక శంకర్ విలాస్ మాత్రమేనా?

శతాబ్దాల చరిత్ర నా గుంటూరు ....

ధాన్యకటకం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే విశాల సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల చరిత్ర నా గుంటూరు. వీరికి కోటిలింగాల, జున్నూర్ అనే ప్రాంతాలలో కూడా రాజధానులు ఉండేవి.

కవిత్రయంలోని తిక్కన నడయాడిన చరిత్ర నా గుంటూరు.

మాచర్ల చెన్నకేశవుడి ఆశీస్సులతో ౘాపకూడు సిధ్ధాంతం ద్వారా సామాజిక న్యాయం కోసం నిలబడ్డ పల్నాటి బ్రహ్మనాయుడి చరిత్ర నా గుంటూరు.

కృష్ణరాయలుకే కొఱుకుడు పడని కొండవీటి రెడ్డి రాజుల చరిత్ర నా గుంటూరు.

అష్ట దిగ్గజాలకే తలమానికమైన రామకృష్ణ కవి నా గుంటూరు.

'కృష్ణం కలయసఖి సుందరం బాల కృష్ణం కలయసఖి సుందరం' అంటూ 'తరంగాలు' అందించిన నారాయణ దాసు నా గుంటూరు.

జ్యోతిష్యం లో మల్లాప్రగడ లక్ష్మణ రావు,  వ్యాఖ్యానంలో మల్లాప్రగడ రంగారావు, రామారావు 

అమరావతి కేంద్రంగా సుపరిపాలన అందించిన రాజా వాసిరెడ్డి వేంకట్రాది నాయుడు చరిత్ర నా గుంటూరు.

ముచుకుంద మహర్షి తపమాచరించిన గుత్తికొండ బిలం నా గుంటూరు. 

త్రేతాయుగంనాటిదని పేరు గాంచిన సీతానగరం నా గుంటూరు.

శిబి చక్రవర్తి తన తొడను కోసి పావురాన్ని రక్షించిన క్షేత్రం కపోతేశ్వరాలయమున్న చేజెర్ల చరిత్ర నా గుంటూరు.

అక్కరలో ఉన్నవారిని చేదుకునే కోటయ్య వెలసిన పుణ్య క్షేత్రం కోటప్పకొండ చరిత్ర నా గుంటూరు.

పానకాల స్వామిగా వినుతికెక్కిన నృసింహ క్షేత్రం మంగళగిరి నా గుంటూరు.

పంచారామాలలో ఒకటైన అమరావతి చరిత్ర నా గుంటూరు.

వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న పాత గుంటూరు అగస్తేశ్వరాలయం నా గుంటూరు.

ఇరవై నాలుగు అడుగుల ఆంజనేయుడు అండగా నిలబడిన పొన్నూరు నా గుంటూరు.

పేరెన్నికగన్న భావనారాయణుడు కొలువైన బాపట్ల నా గుంటూరు.

అనంతపద్మనాభుడు కొలువైన ఉండవల్లి గుహలు నా గుంటూరు.

సుదూర తీరాలనుండి వచ్చే వలస పక్షలు సంరక్షణ కేంద్రం ఉప్పలపాడు నా గుంటూరు.

ఆంగ్లో-ఫ్రెంచ్ యుధ్ధం జరిగిన ప్రాంతం (నేటి హిందూ కాలేజ్ ఉన్న ప్రాంతం) నా గుంటూరు.

'నీరు పెట్టావా, నారు పోసావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఎందుకు కట్టాలిరా శిస్తు?' అని బ్రిటీషు వారిని ఎదుర్కొని ముప్ఫై ఏళ్ళ ప్రాయంలోనే కన్నెఱ్ఱ చేసి ప్రాణత్యాగం చేసిన కన్నెగంటి హనుమంతు చరిత్ర నా గుంటూరు.

సామాజిక ఆనాచారం వల్ల శివ దర్శనానికి నోచుకోని ఒక అభాగ్యుడి వేదనను 'గబ్బిలం' ద్వారా వినిపించిన మహా కవి జాషువా చరిత్ర నా గుంటూరు.

కొప్పరపు కవుల చరిత్ర నా గుంటూరు.

పువ్వులంటే ముచ్చట పడే మహిళల చేతనే కన్నీరు పెట్టించిన కరుణశ్రీ నా గుంటూరు.

సంస్కృతాంధ్ర భాషల్లో అగ్రగణ్యులైన జమ్మలమడక మాధవరాయశర్మ, శ్రీ కృష్ణాచార్యుల చరిత్ర నా గుంటూరు. 

ప్రవచనాలకు నాంది పలికిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి నా గుంటూరు.

మహా కవులు, రచయితలు అయిన 'తెలుగులెంక' తుమ్మల సీతారామశాస్త్రి,  సత్యం శంకరమంచి, మునిమాణిక్యం నరసింహారావు, కొడవటిగంటి కుటుంబరావు, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి,  రాయప్రోలు సుబ్బారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతారావు, పండిత సత్యదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, ప్రముఖ రచయిత సంజీవ దేవ్, అధరాపురపు తేజోవతి, పాపినేని శివశంకర్, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఓల్గా,  దేవీప్రియ, శార్వరి వంటి వారిని కన్న నేల నా గుంటూరు.


జ్ఞానపీఠ్ ఎవార్డు గ్రహీత రావూరి భరద్వాజను కన్న నేల నా గుంటూరు. 


వేయి వసంతాల మానవ జీవన యానం, చరిత్రకెక్కని స్వాతంత్ర్య సమరయోధుల గురించి వ్రాసి నాకు మార్గదర్శకం చేసిన మా నాన్న గారు స్వర్గీయ విఠల్ రావు గారు నా గుంటూరు చరిత్ర.


మాంటిస్సొరి ఎడ్యుకేషన్ కు నాంది పలికి ఈనాడు మహావృక్షమైన శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్, చేతన, ఉషోదయ, సంధ్యారాగం, రక్ష వంటి సంస్థల వ్యవస్థాపకులు మంగాదేవి గారు నా గుంటూరు.


ఎమ్సెట్ లేని రోజుల్లో మెడికల్ ఎంట్రన్స్ కు కోచింగ్ ఇవ్వడంద్వారా తెలుగునేల అంతా చిరపరిచితమైన సింహం శ్రీ చతుర్వేదుల విశ్వనాధమ్ ఎలియాస్ సివియన్ ధన్ గుంటూరు.


నాటక రంగంలో లబ్దప్రతిష్టులైన స్థానం నరసింహారావు, ఏ.వి. సుబ్బారావు, ఈలపాట రఘురామయ్య, కాళిదాసు కోటేశ్వరరావు, స్థానం వారి తరువాత స్త్రీ పాత్రలలో స్థానం సంపాదించిన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి,  మాడభూషి వేంకట శేషాచారిలను అందించిన నేల నా గుంటూరు.


శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహా సన్నిధానం నా గుంటూరు.


కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిధ్ధేశ్వరానంద భారతి స్వామి నా గుంటూరు.


క్రీస్తు పూర్వం రెండు వందల ఏళ్ళ నాడే అబ్రకాన్ని కనుగొన్న భౌతిక వాది, బౌధ్ధుడు, రసాయనిక శాస్త్రాన్ని ఔపోసన పట్టిన నాగార్జునుడి చరిత్ర నా గుంటూరు.


సూర్య మండలంలో హీలియమ్ గ్యాస్ ను కనుగొన్న చరిత్ర నా గుంటూరు.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూరు వజ్రానికి పుట్టినిల్లు నా గుంటూరు.


బుఱ్ఱకధా పితామహుడు నాజర్ నా గుంటూరు.


బౌధ్ధ భిక్షువులకు ఆలవాలమైన భట్టిప్రోలు చరిత్ర నా గుంటూరు.


బ్రహ్మదేవునికి ఉన్న రెండే రెండు దేవాలయాల్లో ఒకటైన చేబ్రోలు నా గుంటూరు.


చేత వెన్న ముద్ద తో దర్శనమిచ్చే ప్రపంచంలోని ఏకైక శ్రీ కృష్ణ దేవాలయం ఉన్న సొలస గ్రామం నా గుంటూరు.


బ్రిటీషు వారి తుపాకులకు ఎదురొడ్డి నిల్చిన ఆంధ్రకేసరి పుట్టినిల్లు అలనాటి నా అవిభాజ్య గుంటూరు.


కోట్ల విలువైన ఆస్థిని స్వాతంత్ర్యం కోసం దేశానికి ఇచ్చివేసిన దేశభక్త కొండా వెంకటప్పయ్య నా గుంటూరు.


చీరాల-పేరాల ఉద్యమాన్ని నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నా గుంటూరు.


మూడు సార్లు నిషేధానికి గురైన నవల 'మాలపల్లి' రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీ నారాయణ నా గుంటూరు.


బాల వితంతువులను చేరదీసి విద్యాబుధ్ధులు గరిపి గౌరవప్రదమైన బ్రతుకులను ఇచ్చిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ నా గుంటూరు.


నిస్వార్ధ సేవకు నిరుపమానమైన ఉదాహరణ వావిలాల గోపాలకృష్ణయ్య నా గుంటూరు.


దేశంలోనే మొట్టమొదటిసారిగా మునిసిపల్ ఆఫీసుపై మువ్వన్నెల ౙండా ఎగురవేసి బ్రిటీష్ అధికారాన్నే సవాలు చేసిన నడింపల్లి నరసింహారావు నా గుంటూరు.


రైతు లేనిదే దేశం లేదని అహర్నిశలు వారి శ్రేయస్సుకై పాటుబడ్డ గోగినేని రంగనాయకులు (N.G.Ranga) నా గుంటూరు.


ఐదుగురు ముఖ్యమంత్రులను, నలుగురు అసెంబ్లీ స్పీకర్లను అందించిన చరిత్ర నా గుంటూరు.


కేంద్ర కేబినెట్ లో ఒకే సమయంలో ఒకే జిల్లానుండి ఇద్దరు మంత్రులు ఉన్న ఏకైక జిల్లా నా గుంటూరు.


పొగాకు, మిర్చి, పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటలకు నెలవు నా గుంటూరు. 


శాకంబరీదేవీ ప్రసాదం, ఆంధ్రశాకం గోంగూర నా గుంటూరు.


భగభగ మంటలు మండించే మిరప్పళ్ళ కారం నా గుంటూరు.


గలగలా పారే కృష్ణమ్మ కెరటాలతో సస్యశ్యామలమైన కృష్ణా డెల్టా నా గుంటూరు.


విద్యారంగానికి పంచ మాతృకలుగా విరాజిల్లుతున్న 135 సంవత్సరాల ఆంధ్ర క్రైస్థవ కళాశాల, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ కళాశాల, యాభై సంవత్సరాల వయసున్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల, తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమసుందరం కళాశాల, (మునిసిపాలిటీ ఆధ్వర్యంలో మహిళలకు కళాశాల ప్రారంభించి, తరువాత బ్రిటీష్ ప్రభుత్వానికి అంటగట్టిన లౌక్యుడు తెల్లాకుల జాలయ్య గారు) ప్రభుత్వ మహిళా కళాశాలల వైభవంతో Oxford of Andhra అని పేరుగన్నది నా గుంటూరు.


దేశ విదేశాలలో స్థిరపడ్డ తెలుగు వైద్యులలో అధిక శాతం గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్ధులే అన్నది జగమెరిగిన సత్యం. అది నా గుంటూరు.


గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అంటే సామాన్య జనం నుండి కోటీశ్వరుడి వరకు అందరూ కోరుకునేదే.


Guntur is considered as Medical Hub of AP.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ, ప్రొ॥ వాసిరెడ్డి శ్రీ కృష్ణ, ప్రొ॥కె.సచ్చిదానంద మూర్తి, ప్రతి ఇంటా వినిపించే సుందరకాండ ఎమ్మెస్ రామారావు, ప్రవచన కర్త శ్రీ మైలవరపు శ్రీనివాసరావు నా గుంటూరు.


మెడికల్, ఇంజనీరింగ్ .... ఇప్పుడు CA కోచింగ్ లకు పుట్టినిల్లు నా గుంటూరు.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చార్టర్డ్ ఎకౌంటెంట్, ICFAI Founder Governor నండూరి జ్యోతిర్మయి యశస్వి (N J YASASWI) నా గుంటూరు. 


శాస్త్రీయ సంగీత దిగ్గజం మంగళంపల్లి బాల మురళి గారి గురువు, త్యాగరాజ స్వామి శిష్య పరంపరలో ఒకరైన పారుపల్లి రామకృష్ణయ్య, పురాణం పురుషోత్తమ శాస్త్రి, కొమండూరి శేషాద్రి, కర్లపాలెం చంద్రమౌళి మరియు వారి శిష్యులైన నాదస్వర విద్వాంసులు షేక్ సుభానీ, కాలీషా దంపతులు (పద్మశ్రీ అవార్డుల గ్రహీతలు), రాజనాల వేంకట్రామయ్య, వింజమూరి వరదరాజయ్యంగారు,  సంస్కృతాంధ్ర పండితులు శ్రీమాన్ కొమండూరి సీతారామాచార్యులు నా గుంటూరు.


సినీ ప్రముఖులైన చక్రపాణి, వేమూరి గగ్గయ్య, గోవిందరాజుల సుబ్బారావు, నాగయ్య, ముక్కామల, కాంచనమాల, ఛాయా దేవి, సావిత్రి, జమున, కొంగర జగ్గయ్య, శారద, ప్రభ, దివ్యవాణి, జయలలిత, సుమలత, రాగిణి, బాలయ్య, గుమ్మడి, ధూళిపాళ, డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ, ఏవియస్, వీర నరసింహాపుర అగ్రహారీకురాలైన భానుమతి, కొసరాజు రాఘవయ్య, ముదిగొండ లింగమూర్తి, సియస్సార్, వంగర వెంకట సుబ్బయ్య, కె. విశ్వనాధ్, గాన కోకిల ఎస్. జానకి, మాధవపెద్ది సత్యం, గోఖలే, బ్రహ్మానందం, జీవా, ప్రదీప్ శక్తి, బోయపాటి శీను, కొరటాల శివ, పోసాని, సంగీత 'చక్రవర్తి', గాయని సునీత, గాయకుడు మనో, సినీ రచయిత మాడభూషి దివాకర బాబు, సంగీత దర్శకుడు, గేయ రచయిత వోగేటి నాగ వేంకట రమణ మూర్తి (స్వర వీణాపాణి), హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి, సూర్యదేవర రామమోహనరావు, సినీ, టి.వి. సీరియల్ రచయితలు గూడూరు విశ్వనాధ శాస్త్రి, మాడభూషి వేంకటేష్, సినీ రచయితలు, దర్శకులు అయిన బుర్రా సాయి మాధవ్, రాజేంద్ర భరద్వాజ, క్రిష్ జాగర్లమూడి, కే.యస్. రవీంద్ర, బయ్యవరపు వేంకటేశ్వరరావు, గుంటూరు శాస్త్రిగా ప్రసిధ్ధి చెందిన GSRK శాస్త్రి, నాటక, సినీ రచయిత ృశ్నేశ్వరరావు, నాటక రంగ ప్రముఖుడు నాయుడు గోపి నా గుంటూరు.


పారిశ్రామికవేత్తలలో సుప్రసిధ్ధులైన వెలగపూడి రామకృష్ణ ICS నా గుంటూరు.


యువ డాషింగ్ & రెబల్ క్రికెటర్ అంబటి రాయుడు నా గుంటూరు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక నా గుంటూరు.


పిడుగురాళ్ళ, రాగి నిక్షేపాల అగ్నిగుండాల, నరుకుళ్ళపాడు, ఫిరంగిపురం .... ఈ పేర్లు వింటేనే ప్రత్యర్ధికి కాళ్ళు వణుకుతాయి. అదీ నా గుంటూరు.


శిల్పకళకు నెలవు దుర్గి నా గుంటూరు.


విప్లవ నాయకుడు అక్కిరాజు హరగోపాల్ నా గుంటూరు.


మొట్టమొదటగా 1913 లో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించింది నా గుంటూరు ....


గోంగూరంటే ముందుంటాం. మిరప్పళ్ళ కారం మాదేనంటాం.


దేనికైనా ముందుంటాం .... 


మాటలో సూటిదనం, నిక్కచ్చితనం, పొగరు, విగరు ఉన్నదే నా గుంటూరు ....


ఇంతటి ఘన చరిత్ర ఉన్న ప్రాంతాన్ని మీకు పరిచయం చేసిన #అధరాపురపు_మురళీ_కృష్ణ పుట్టి పెరిగిన ఊరు గుంటూరు ....


ఇదీ గుంటూరు అంటే ....


(ఈ సమాచార సేకరణకు సహకరించిన Divakara Babu Madabhushi గారికి, 'గుంటూరు నాటకరంగ చరిత్ర' గురించి తెలియచేసిన శ్రీ కందిమళ్ళ సాంబశివరావుగారికి, వికీపీడియా వారికి, ప్రోత్సహించిన Sai Ram Bulusu గారికి, శ్రీ అచ్యుత్ కు కృతజ్ఞతలు)


(10-11-2021 నాడు మొదలపెట్టిన కధనం 18-06-2022 నాటికి పూర్తయింది).

*🧘‍♂️చిదానంద రూప శివోహం శివోహం🧘‍♀️*362.


వ్యక్తి మనసులో ఏ కాంక్షలు లేకుండా ఉండాలి. మనసు శూన్యంగా మారాలి. నిర్మలత్వంతో నిండిపోవాలి. అప్పుడు అతను అపూర్వ శక్తితో నిండిపోతాడు. అద్భుతమైన చైతన్యం అతన్ని ఆవహిస్తుంది. అతనికి ఆ స్పృహ ఉండదు. అప్పుడు అతనిలో ప్రతీదీ సహజంగా పరివర్తన చెందుతుంది. సూర్యోదయం జరిగినట్లు, చంద్రుడు 🌒 ఉదయించినట్లు, పూలు వికసించినట్లు, నది ప్రవహించినట్లు ప్రతీదీ అప్రయత్నంగా నిర్నిమిత్తంగా జరిగిపోతుంది. అక్కడ అన్ని చలనంలో ఉంటాయి. అన్ని సహజంగా జరుగుతాయి. కానీ వాటన్నిటినీ నిర్వహిస్తున్నాను అన్న అహంకారం అతనికి ఉండదు. 

ఒక ప్రాచీన రోమన్ కథ ఉంది. అది గొప్ప కథ. గొప్ప సత్యాన్ని నిక్షిప్తం చేసుకున్న కథ. ఒక సన్యాసి ఉదాత్తమైన జీవితం గడిపాడు. అతనికి ఎలాంటి స్వార్థ చింతన లేదు. ఏ కోరికలూ లేవు. ఏదో సాధించాలి అని అతను ఎప్పుడూ అనుకోలేదు. నిర్మలంగా , నిశ్చింతగా జీవించాడు. అతని సహజ జీవితం స్వర్గం దాకా వ్యాపించింది. అతను సాధారణంగా జీవించాడు. కానీ లోక దృష్టిలో అది అసాధారణం . కాంక్షలు లేని మనిషిని లోకం విచిత్రంగా చూస్తుంది. ఆ వ్యక్తి జౌన్నత్యానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు. అటువంటి వ్యక్తి కోసం ఏమైనా చేయాలని సంకల్పించారు.

ఒక రోజు దేవతలు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. దేవతలను చూస్తూనే అతను భక్తితో, నమ్రతతో వాళ్ళకు ప్రణమిల్లాడు. “ నాలాంటి సామాన్యుడి పట్ల దయతో మీరు రావడం నా అదృష్టం . మీరు నన్ను ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి " అన్నాడు. దేవతలు " మేం నీకు ఆజ్ఞలివ్వడానికి, ఆదేశాలు జారీ చేయడానికి రాలేదు. నువ్వు నీదంటూ ఏమీ లేనివాడివి! నీ గురించి ఎప్పుడూ ఆలోచించని వాడివి. నిస్వార్థపరుడివి. నిరాడంబరుడివి. అలాంటి నీ కోసం ఏమైనా చేయాలనిపించి మేము వచ్చాం! నీకు ఇష్టమైన కోరికను కోరుకో. నువ్వు ఏమీ అడిగినా ఇస్తాం" అన్నారు దేవతలు! 

దానికి ఆ సన్యాసి " మీరు నా పట్ల ఇంత దయగా ప్రవర్తించినందుకు ధన్యవాదాలు. నాకు సంబంధించిన కోరికలు అంటూ ఏమి లేవు. దైవం ఏది సంకల్పించిందో అదంతా యథాతథంగా జరుగుతోంది. మీరు ఇంతగా అడుగుతున్నారు. కాదంటే బాగుండదు. కానీ నాకు ఏమి అడగాలో తెలియడము  లేదు. నేను ఊహించినవే కాదు. నేను ఊహించనవి కూడా దైవం నాకు ఇచ్చింది" అన్నాడు.

అతని వినమ్రతకు దేవతలు మరింతగా అతన్ని ఇష్టపడ్డారు. కారణం అతను కాంక్షా తీరానికి అతీతంగా ఉన్నాడన్న విషయం వాళ్ళకు తెలిసి వచ్చింది. కానీ అతనికి ఏదో చేయాలన్న తపన వాళ్ళలో పెరిగింది. " నువ్వు వద్దు అంటున్నావు. కానీ మాకు ఏదైనా నీ కోసం చేయాలని ఉంది. కాబట్టి దయచేసి ఏదైనా  కోరుకో. మేం నీకు వరం ఇవ్వనిదే కదలం" అన్నారు.

సన్యాసి సంకటంలో పడ్డాడు. తప్పించుకునే వీలు లేదు. సరే! ఏం కోరాలో నాకయితే తెలియదు. మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ వరం ఇవ్వండి" అన్నాడు. దేవతలు అతను ఒప్పుకున్నందుకు సంతోషించి " నీకు గొప్ప వరం ఇస్తున్నాం. మరణించిన వారిని నువ్వు తాకితే వాళ్ళు బతికి లేచి కూర్చుంటారు" అన్నారు.! ఆ వరంతో సన్యాసి ఆలోచనలో పడ్డాడు. " మీరు అన్యధా భావించకండి. ఇలా చనిపోయిన వాళ్ళను బతికిస్తున్నాను అన్న స్పృహ ఉంటే నాలో అహంకారం పెరుగుతుంది. దయచేసి మీరు ఏ వరం ఇచ్చినా ఆ వరం యొక్క స్పృహ నాకు లేకుండా చేయండి" అని ప్రార్థించాడు.

ఆ మాటలు విని దేవతలు మరింతగా ఆనందించి " నీ నీడ ఎక్కడ పడినా అక్కడ చనిపోయిన అన్నీ తిరిగి బ్రతుకుతాయి" అని వరం ఇచ్చి అదృశ్యం అయ్యారు.

వాళ్ళు వరం ఇచ్చారు.! ఆ వరం యొక్క స్పృహ ఆ సన్యాసికి లేదు. ఆయన తన పనుల్లో తాను ఉండేవాడు. ఆయన నీడ పడిన చోట ఎండిపోయిన పచ్చిక చిగురించేది. చనిపోయిన ప్రాణులు బ్రతికేవి. కానీ ఇదంతా ఆయనకు తెలిసేది కాదు. ఆయన తన దారంటే తాను వెళుతూ ఉండేవాడు. నీడ పడిన చోట నిత్యవసంతం ఉండేది. ఆ సన్యాసి  స్వర్గానికి వెళ్ళినప్పుడు దేవతలు “ మీకిచ్చిన వరం ఎంతవరకూ పని చేసింది? “ అని అడిగారు. అదేమీ తెలియదు - గుర్తించలేదు అన్నాడు తత్వజ్ఞాని. అహంకారం ఉన్నప్పుడు కాంక్షలు ఉంటాయి. అవి ఏమీ లేనప్పుడు సర్వమూ శూన్యంగా ఉంటాడు తత్వవేత్త అయిన జీవన్ముక్తుడు. 

బంధాలు కలిపేది మాటే....

                     బంధాలు తెంచేది మాటే....

                     గాయాలు చేసేది మాటే..... 

                   గాయాలు మాన్పెది మాటే.... 

                      ప్రాణం పోసేది మాటే.....

                      ప్రాణం తీసేది మాటే.....    

                  మాటే నిన్ను గెలిపిస్తుంది.... 

                  మాటే నిన్ను ఓడిస్తుంది..... 

                  మాట్లాడే ముందు జాగ్రత్త...!!!

త్రికరణ శుద్ధితో జీవించు ! 

త్రిగుణాతీతుడవై జీవించు ! 

త్రిగుణరహితుడవై బయలున బయలై ఉండుము ! 

*కర్మలు భక్తి తో చేయవచ్చు. నిష్కామముగా చేస్తే అది, ఫలాపేక్ష లేని కర్మలు చిత్తము శుద్ధమగుటకు ఉపయుక్తమై నిరాకారమైన  పరమాత్మ స్థితిని పొందుటను అనుభూతి చెందుతారు.*

*నిర్విరామముగా నిర్వికారము - నిరాకారము అయిన పరమాత్మ యందు ఏకాగ్రత - అనన్య భక్తి - చిదానంద రూప శివోహం అనెడి స్వరూప జ్ఞానమే లక్ష్యము - లక్షణము - కోహం - సోహం - కట్ట కడపటికి నాహం - అజం - అచలం.*

......

* అగ్నిపధ్ .. 363

కేంద్రం సైన్యం లో చేరాలని దేశ సేవ చేయాలని ఉన్న వారి కోసం అగ్నిపధ్ అనే నియామక ప్రక్రియ నీ తీసుకొని వచ్చింది...మోడీ ఏమీ చేసిన వ్యతిరేకం అనే ప్రతిపక్షాలు దీన్ని కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి...కాంగ్రెస్ దాని తోక పార్టీ లు ఇప్పుడే కాదు కాశ్మీర్ కి ఆర్టికల్ 370d రద్దు చేసి కాశ్మీర్ నీ భారత్ లో కలిపిన కూడా దేశ వ్యాప్తం గా గొడవ లు చేశాయి....

అసలు అగ్నిపధ్ వల్ల ఉపయోగం ఎంటో చూద్దాం...

ఇజ్రాయిల్ లాంటి దేశాల లో 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి సైన్యం లో  మూడు నాలుగు పని చెయ్యాలి.... అలా ఉండటం మూలం గానే ఇజ్రాయిల్ లాంటి దేశాల లో 100 శాతం దేశ భక్తులు ఉంటారు...ఇజ్రాయిల్ చుట్టూ మొత్తం ముస్లిం దేశాలు ఉన్న కూడా ఇజ్రాయిల్ వైపు కన్ను ఎత్తి కూడా చూడలేవు......ఎందుకంటే ఆ దేశం లో ప్రతి వ్యక్తి సైన్యం లో పని చేసి బయటకు రావడం మూలం గా  అందరూ దేశం కోసమే పని చేస్తారు...

ఇప్పుడు మన దేశం లో ప్రవేశ పెట్టిన అగ్ని పద్ కూడా అటువంటిదే...
18 ఏళ్ల నుండి 21 ఏళ్ల యువకులకు సైన్యం లో తీసుకొని ఎంపిక అయిన వారి కి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నెల కు 30000 ల నుండి 40000 రూపాయల జీతం ఇచ్చి 4 ఏళ్ల తరువాత వారి లో సామర్ధ్యం ప్రతిభ నీ బట్టి 25 శాతం మంది  నీ వారు మళ్ళీ అప్లై చేస్తే శాశ్వతం గా సైన్యం లోకి తీసుకుంటారు...4ఏళ్లు నిండిన వారికి 12 లక్షల రూపాయలు సర్టిఫికేట్ ఇచ్చి గౌరవం గా
పంపిస్తారు....
దీని లో కేంద్రం ఉద్దేశం ఎంటి అంటే...


 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల లో ఖాళీ గా ఉండే యువత చెడు దారుల కు వెళ్లకుండా సైన్యం లో చేరితే మంచి వాడు గా ఉంటాడు..దేశ భక్తుడు అవుతాడు...18 ఏళ్ల నుండి 21 ఏళ్ల మధ్యలో మంచి గా సంపాదన పరుడు అవుతాడు బాధ్యత కల పౌరుడు అవుతాడు అనే మంచి ఉద్దేశం తో ఈ పథకం పెట్టారు...జాబ్ లు రాక 30 ఏళ్ల వరకు వేచి చుచే కంటే ఈ పథకం బాగానే ఉంది కదా...అలాగే 4 ఏళ్లు పూర్తి గా సైన్యం లో పని చేసిన వారి నీ  అన్ని ప్రవైట్  కంపెనీ లు తీసుకుంటాయి....లేదా ప్రభుత్వం ఇచ్చే 12 లక్షల తో ఎదైన వ్యాపారం చేసుకోవచ్చు....
 

కాంగ్రెస్ ప్రతిపక్షాల భయం ఎంటి అంటే యువత ఇలా సైన్యం లో జాయిన్ అయితే వారికి ఎవ్వరూ ఓటు వెయ్యరు...వారు ఇచ్చే బీర్ బిర్యానీ కి డబ్బు లకు సైన్యం లో పని చేసిన వచ్చిన వాడు ఎవ్వరూ ఆశ పడి ఓటు ,..అయిన బస్ లు రైల్ లు తగల బెట్టే వారు..ప్రభుత్వ ఆస్తులు తగల Bette వారు సైన్యం లోకి ఎలా వెళ్తారు..దేశ భక్తుడు ఎలా అవుతాడు.....కాంగ్రెస్ కి ఇటువంటివి అన్నీ అలవాటే...రాహుల్ గాంధీ నీ స్కాం లో ED ప్రశ్న లు వేస్తే అలా ఎందుకు పిలుస్తారు అంటూ దేశం మొత్తం గొడవ చేస్తున్నారు అంటే ఎంత సైకోగాల్లో అర్థం అవుతుంది...మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నపుడు ఆ రోజు కేంద్రం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ సీబీఐ తో 10 గంటలు విచారణ చేయించారు..అమిత్ షా నీ కూడా అంతే... అయిన ఆ రోజు బీజేపీ వారు ఎక్కడ గొడవ లు చెయ్యలేదు..విచారణ ఎదురుకొని బయటకు వచ్చారు...కాంగ్రెస్ దేశం లో చాలా మంది నాయకుల పై సీబీఐ కేసు లు పెట్టింది...అంటే కాంగ్రెస్ ఉద్దేశం లో సీబీఐ ed కేసు లు ఉన్న వారు మొత్తం బస్ లు రైల్ లు తగల పెట్టాలి అని ఉద్దేశమా....తప్పు చెయ్యని వారికి విచారణ కు వెళ్లి చెప్పటానికి భయం ఎందుకు...?దేశ వ్యాప్తంగా గొడవ లు చెయ్యటం ఎంటి...? ఇలా చేసే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది.... sekarana vadsp 

___((()))___


* ఓం నమ:శివాయ -- 364

* అర్హ పరమార్ధ యెఱుకయు ఆట కాదు
శివుని ఆజ్ఞ లేనిది ఏది స్థిరము కాదు
జ్ఞానులను చుల కన వల్ల జ్ఞప్తి పోవు
చీమనుంచి బ్రహ్మవరకు చేష్ట లు శివ   
              
’శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు!' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే.    సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం.

శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం.

అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.

* శివ శివాను నాలుక సృష్టి సేతు బంధు  
శివ శివాను కన్నుల రక్తి సిరుల చూపు
శివ శివాను చేతులు శక్తి స్థిరముచేయు
శివ శివాను స్మరణ యుక్తి సేవ కొరకు

శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే…శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు,  శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు..

పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు.

ఓం ఓం ఓం
హరాశంకరా వందనందిగంబరా వందితాపురంధరా
యిందుధరా దురంధరా  హిమాచల గ్రమందిరా

ఓం నుమ::శివాయ -- ఓం నుమ::శివాయ--ఓం నుమ::శివాయ
 
అదే 'శివసిద్ధి'.

అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు.

పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే. శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.

జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.
___((()))___
 

 
* ఇదే లోకమ్ తీరు ---365
                 అన్ని తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు.. చీమలు, పక్షులు, పశువులు..
ఆ చెట్టుకిందకి  నీడ కోసం వస్తాయ్....
            జీవితం కూడా అంతే సమయం వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే.....        
          లైఫ్ లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు.. జీవితంలో ఉన్న వాళ్ళు
శ్వతం అని భావించకు..
           ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు...  నీకు నీవే ధైర్యం కావాలి.....
 నీకు నువ్వే తోడుగా నిలబడాలి...

           లోకులు కాకులు, మనిషిని చూడరు, మనస్సును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు.
  కనిపించింది,  వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు,
   ఒక్కోసారి మన కళ్ళే  మనల్ని మోసం చేస్తాయి  మరొకసారి చెప్పుడు మాటలు                      జీవితాలను  తలకిందులు చేస్తాయి
అబద్దాలతో, మోసాలతో కీర్తి, ప్రతిష్టలను  ఎంత గొప్పగా నిర్మించుకొన్నా..   అవి కుప్పకూలి పోవడానికి  ఒక్క "నిజం"చాలు. అందుకే కష్టమైనా సరే  నీతిగా బ్రతకడమే మనిషికి  ఉత్తమ మార్గం. ఒక చిన్న మొక్కనాటి  ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని  చూడకూడదు.

             ఎందుకంటే అది పెరగాలి  మొక్క వృక్షం కావాలి  పుష్పించాలి, పిందెలు రావాలి
 అవి కాయలై , పండితే తినగలం.  అలాగే నేను ఇది కావాలి  అనే కోరిక కూడా మొలకై
 వృక్షమై ఫలవంతం అవుతుందని తెలిసి   మసలుకోండి సన్నిహితులారా

        జీవితంలో కష్టము, కన్నీళ్ళు, సంతోషము, బాధలు  ఏవి శాశ్వతంగా ఉండవు,
 కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు  ఆనందం, ఆవేదన కూడా అంతే.

              నవ్వులూ, కన్నీళ్ళూ  కలగలసినదే జీవితం  కష్టమూ శాశ్వతం కాదు,
సంతోషమూ శాశ్వతమూ కాదు.                 

                   ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే  జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి
చెడిపోతే ఎలా  బాగుపడాలో? నేర్చుకోవాలి,   గెలుపును ఎలా పట్టుకోవాలో  తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే  గొప్ప వారు నేస్తమా !

              దెబ్బలు తిన్న రాయి  విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది....  ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసిన వాడు  మహనీయుడు అవుతాడు...  ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు   ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు...  డబ్బుతో ఏమైనా   కొనగలం అనుకుంటున్నారా?

             *అయితే కొనలేనివి ఇవి ఉన్నాయి.  మంచం పరుపు కొనవచ్చు  కానీ నిద్ర కాదు గడియారం కొనవచ్చు  కానీ కాలం కాదు, మందులు కొనవచ్చు  కానీ ఆరోగ్యం కాదు, భవనాలు కొనవచ్చు  కానీ ఆత్మీయత  కాదు, పుస్తకాలు కొనవచ్చు  కాని  జ్ఞానం కాదు, పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు  కాని  జీర్ణశక్తిని కాదు
      
ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి, స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి,తలక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,
ఇదే లోకమ్ తీరు