Friday, 18 August 2023

చందస్సు


ప్రాంజలి ప్రభ.. పద్య పత్రిక (జనవరి మొదటి వారం )

రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


భూతిలకం.. (భ భ ర స జ జ గ.. యతి 12)


01..దాసుడ గావర వేడుకన్ వరదా మదంబు దొలంగగా

వాసము నామది జేయుచున్ రిపువర్గమున్ దొలగించుమా

బాసల నేర్వని సంస్తుతిన్ మదపాశమున్ హరియించుమా

వాసవ సేవిత శ్రీధరా భవపాశసంహరశ్రీపతీ


02..దాసుడ నైతిని యార్తితో సహ ధర్మచారి సహాయమై

ద్యాసయు భక్తియు మూర్తిపై నిజ దాన ధర్మ సమానమై

కాసులు కోరను బాంధవా సమ కార్యసాధన ప్రేమమై

మూసగ జీవిత లక్ష్యమై జప మూల్యమేమియు కోరనే 


03..కాల మనోభవ రాగయుక్తసకాలమేను జయమ్ముగా

జ్వాల సహాయము నీరుశక్తియుఝాస మయమ్ముగా

నేల సమాధన వృక్ష ముక్తియు నీడ ససే పరమ్ముగా

బేల సుఖమ్ముయు దక్ష రక్తియు బంధ చిత్త సజీవమే


03..ఇంకను ఏమని చెప్ప లేనును యీ శ్వరా సహనమ్ముగా

సంకట మేమది దుష్టబుద్ధియు సామరస్యపు జీవిగా

వంకలు బెట్టను దైవమా సహవాంఛతీర్చ సుబుద్ధి గా

శంకలుతెల్పను ధర్మమా సమసంశయమ్మును తీర్చుమా


05..కాలము నీదయ నిత్య సత్యముగా గురుత్వ పటుత్వమై

శీలమనేదియు సిగ్గుదొంతర శీఘ్రమోన్నతగ తృప్తి కై

బేలల శోభలు సర్వ మౌయగు బంధభావము మొహమై

చేలము తప్తము శీతవర్షము చిన్మయాసొభగన్ సుధీ


06..ప్రేమకు ప్రేమయు ఇచ్చి పుచ్చుట ప్రీతిగన్ను సరాగమై

క్షేమము కోరిసుసంపదేయగు క్షేమమౌ సహనమ్ముగా

జాముల కాలము సమ్మొహమ్మగు సంతసమ్మగుకేళిలో

స్యూమము నాందుచు శాంతి నొందియు సోలిశీతల గాలిగన్


07..మక్కువ జూపవ మానసమ్మున మార్గ మాయను మార్చుమా

చక్కని రూపము నీది నామది చింతనిన్నుగ ప్రార్థనే

ఒక్కరు కాదును యిద్దరమ్మగు ఓర్పుగాను సహాయమే

తక్కువ యెక్కువ నెంచలేనులె తత్త్వమేగతిభక్తిగా


08..భారమునీదెగ కావఁగన్ ననుపర్తివాస సువంద్య సాయీ

నేరములెంచకు నాదునౌ హరినీపదాలుశరణ్యమందున్

నీరజపీఠిని శేషశయ్యనునిద్రనొందు మురారి పత్నీ

సారసుశాస్త్రవిదాంవరా హరిచందనాభ దయాబ్ధిదత్తా !!! "అప్పాజీ గారు )

----


పరామోదః (య స  స జ న మ.. యతి..10)


09..సహాయమ్ము సమాధనమ్ము సమర్ధతకథ నిత్యమ్మున్

ప్రహాసమ్ము ప్రయోజనమ్ము ప్రవర్తనలగు సత్యమ్మున్

విహారమ్ము విమోచనమ్ము వినమ్రతలగు సర్వాళిన్ 

సుహాసంబు సజీవణమ్ము సుఖమ్ము కలుగు శ్రీదేవీ


 010..సమూహంబు సహాయము సంచరింప సతము సౌఖ్యమ్మున్

సుమోదంబయి యెల్లరికిన్ శుభంబు గలుగ ప్రేమంబున్

సమైక్యంబగు శాంతముచే సమాధరమును పొందంగన్

నమోవాక్కులు సంభవమై నిరంతరమగు శ్రీదేవీ


011.. నరుణ్యాలయ సంతసమే క్రమన్ సముచిత సర్వంబున్ 

అరుణ్యా తరుణమ్ముగనే విధిన్ సముఖ విశేషంభో 

సరూప్యా వినయమ్ముగనే సమమ్ జయమగు వేగంబౌ

శ్వరా సేవలుగా జయమే సమం మగుటయె శ్రీదేవీ


012..సుఖం ముత్యము లాంటి యున్నత యోవనము సౌఖ్యమ్మున్ 

సుఖం నిత్యము వ్రాయను కాసులే యగుటయు ప్రేమమ్మున్ 

సుఖం సత్యము నేస్తము త్రాసు యే గమనము సౌమ్యమ్మున్ 

సుఖం గత్యము పాఠ్యము గా సుఖాల మయము శ్రీదేవీ


----

(13) భ  త  య  న  న   న  న  స     - సరసిజ 9    ...17

UII UUI  IUU  III III III  III  IIU

*సోజ్యము చూస్తుండు మనస్సే వినదు కనదు వశము అవదు కనుకా

జాడ్జ్యము నీవెంట తమాషా చెయుచు నిలబడ కనబడ వలదుగా

వాజము  నీతోను సహావాసము చెసిన అనుకరణముపు మదిలో

రాజ్యము నీదేను మురారీ మనసు మమత మనుగడకు తలపులే

*వెన్నెల కాంతుల్లొ ససేవే తహతహలు మది వసమగుటె మదనా 

ఉన్నటి ఆత్మీయ సమా ఊహల సుఖము తెలుపు సహనము చెలియా 

చిన్నది చింతే మరిచేలే చురుకు దనపు చెలి కలయు విధిగా 

మన్నన భావమ్మగు ప్రేమా చరితము కథల మనసగు సుఖమే

*వ్యాకరణ మేలే సకావ్యా విషయ వినయపు వివరముల మనసే

య్యాకుసుమమేలే సహాయం కనుల కదలిక యనెడి సుఖ తలపే 

వ్యాకుల మనేదే ససవ్యా విధి యగుటయు సవరణలగు వలపే 

తేకువయులేకే సుతత్వం సరిగమలు పలుతహతహల సుఖమే

*భాస్కరు డారోగ్యపు శాంతా కిరణములు మన భయముయె తొలగుటే

తస్కరు డాగ్నీ సహ శాంతా సిరులు కలుగుటయె తరము నిలుపుటే

భాస్కర మొక్షాన్కి సుఖంబే స్థిరము సమయ సహన వినయ మగుటే

తస్కర  యీశా మహిమంతా హృదయ విషయ పరమె సమరమగుటే

నేటి ఛందస్సు ... కల్పన..12
రచయత మల్లాప్రగడ

IIUI UIII IIUI UIII.. IIUI UIII II UI UU

అరిటాకు అన్నముయు - కధలౌను ఆకలియు 

కలిసాక సంతసము - విధి రాత కాదా 

విరజాజి పువ్వులకు  - చలనమ్ము వాసనయు
మరుమల్లె నవ్వులలొ  -
విధి రాత కాదా

వినయమ్ము చూపుటయు - కలమాయ మాపుటయు
- బతుకంత వేదనయు - విధి రాత కాదా
చిరునవ్వు పంచుటయు - మది తెల్పి ఆగుటయు
- దరిచేరి వేడుటయు  - విధి రాత కాదా

సకలమ్ము కారణము - మదిలోని మచ్చలుయె
- మనసంత రోదనము - విధి రాత కాదా
పరువాన ఉండుటయు - దరహాస మాడుటయు
- వినసొంపు మాటలయు -  విధి రాత కాదా

చతురత్వ విద్యయును - చతురత్వ భాషయును
చతురత్వ కోపమును - విధి రాత కాదా
మరుజన్మ యన్నదియు - సహజత్వ మాటలయు
అనునిత్య  నాటకము - విధి రాత కాదా

కల మాయ  కోన కధ - గిరి మాయ నీతి కధ
చిరు గాలి  గోలి కధ - విధి గాలి భీతీ
కరి మాయ కోరి కధ - నిధి మాయ వీధి కధ
మది గాలి మౌన కధ - తిధి గాలి  తీపీ
  
దరహాస తీరు దయ - విరజాజి మా రు కృప
- మది తెల్పు  మాయకల - తనువంత బాధా 
కావచ్చు కాలమున - వినవచ్చు శబ్దమున
-కానవచ్చు చీకటిన - మనసంత బాధా      

--(())--


(11) పద్య..సోయగాలు 

మల్లాప్రగడ 


ఆగ్రహం మనసు ను మధించు .... ఉగ్ర రూప మవ్వు

నిగ్రహం మనసు ను రక్షించు  .....  స్వర్గ సీమ నైన

పరికించి పరవశించు లతల్లొ  ......  సిరుల లక్ష్మి నుండు

పరిమళం పారవశ్యం ముగా    .....  పరిపరి విధములుగ 


పరితోషమును పొంది శాంతించి ..... కరుణ చూపి కదులు

పరమాత్ముని తలచి జీవించు  ....... విరిసిన లత వలెను

యవనిలో ఆశలుండుటయేను  ...... అవసరమ్ము యేను

అత్యాశలు పనికి రావులే        ......... నిత్య సత్య పలుక


దేశభక్తి ఘనము నరులకు    ......... పాశ మవ్వు చుండు

భాషలందు తెలుగు వెలుగులు ...... వేష భాష లందు

మట్టి మనిషి ఆకశమ్మునా ... గట్టి పలుకు లాగ  ..

కొనగోట మీటిన జీవిత౦ ... ..కనుమరుగున పడెను 


కలిసి నడిచిన కలంతోను ...  కలలు కంటి నాను  .

కర్పూర వెలుగుల వాసన   ....ఆర్పనులుగ నున్న    ..

కొలువు దీర్చినదేవ పిలుపులు ... కళల మనసునిచ్చు .

కలము సాక్షిగ రెక్కలుకదిలె ...  వాళ్లకు చిక్క కున్న 


భూగోళపు మనిషిగానేను ..... ... భగ్గు మనక ఉన్న 

నింగి నేలను నిండిఉన్నాను ... ఒగ్గి అగ్గి లాగ 

నీ జన్మ దినమున మాకల ..... నిజము తెల్పు చున్న ..

అక్షరాంజలులతో అర్పణ .... శిక్షనిచ్చు దేవ 


ప్రాంజలి ఘటియించి తెల్పితి .. సృజన పలుకు లన్ని 

తెలుగుతనముకు అద్దముగను .. తలచు చున్న కవిని

--(())__

(10) శ్వేని 

..  ర  జ ర ల గ...6


స్వప్రకాశశ్వర రూపిణీ విన

మ్ర ప్రభావ ధీర యీశ్వరీ జయ

మ్ము ప్రధాన దమ్ము మంజరీ క్షమ

మ్ము ప్రసూన గమ్య వర్ణనీ సుధీ


నాసికా పరమ్ము నాళరంధ్రమై

శ్వాసనా స్థిరమ్ము సాయమర్మమై

వీసమెత్తులేని వీర రక్తమై

యీశ్వరా చక్రంబు ఇచ్ఛగాసుధీ 


సానుకూల ప్రాసరశ్యమేవిధీ 

మానుచేయు ప్రేమభాగ్యమేనులే

కానివారు సౌకుమార్యమేనులే

ఆనతీయుని అచ్చెరమ్ముగానులే


నాకు నీవు నీకు నేనులే నిధీ 

ఏకు మేకు సాకు ఏలనో విధీ 

మాకు లాగ చుట్ట మాన సమ్మునా 

తాక మాకు రాకు తాతనో సుధీ 


ఏకమన్ననే సయోధ్యగానులే

శోకమీను బాపు చూపులే గతీ

లోకమేను తీర్పు లోల్లి గాదులే

మాకరమ్ములేను మానసమ్ముగా


లక్ష్యమే వరించు లాహిరీ విధీ

సాక్షిగా సుదీర్ఘ సాధనే మదీ

శిక్షనే ప్రయోగ చంద్రయాణమై

రక్షనే సహాయ మార్గమే సుధీ


కన్నులే ననమ్మి గాతువే మనో

వెన్నలే స్వతల్పవేడుటే జయమ్

మన్ననే సరాగ మౌనమే శుభమ్

బన్నమేనుదొర్కు భద్రమే సుధీ


.....

(9) వృత్త.. న స త గ..6


గురువు నిజ గుర్తే గమ్యమై 

కరుణ కళ కామ్యమ్మే విధీ 

తరుణ ఝష తాత్పర్య మదీ

చరణ సమచాతుర్య సుధీ


జయరామగుణా దీక్షారమా

జయవీరగణా రక్షారమా

జయధీరమదీ రక్తారమా

జయసూరవిధీ విద్యారమా 


మనసి జని మాంగళ్యమ్ముగా 

దనపతి సుధా రుద్రం మ్ముగా 

వినయ నయ విశ్వాసమ్ముగా 

అణుకువయె ఆదర్శమ్ముగా


కలలు సమకాలమ్మే నులే

కళలు యుగకర్తమ్మే నులే

గళము మదిగమ్యమ్మేనులే

పలుకుల ఉపాధ్యాయమ్ములే


ప్రముఖ మది ప్రాధాన్య మ్ము లే

సముఖ సహ సామాన్యమ్ము లే

విమిఖ జయ విశ్వాసమ్ము లే

మమత సుఖ మార్గమ్మేనులే


కథలు కలకాలమ్మేనులే

విధులు సహవిద్యామేలులే

నిధులు జయనిర్వాహమ్ములే

సుధలు సమ సౌందర్యంములే


సమయ నిధి సాధ్యమ్మేనులే

భ్రమల విధి బంధుత్వమ్ము లే

కమల మది కాలంలో కలే

శ్రమల గతి సామర్ధ్యమ్ము గా

ప్రాంజలి ప్రభ పాఠము 

(8) స్రగ్విణీ ... ర  ర  ర  ర....6


జ్ఞాన సద్భాగ్యదాయీ దిశా తేజమై

నిత్య సత్యామహీశా ప్రకాశిత్వమై 

ధర్మమైనిత్య ధ్యానమ్ముగా లక్ష్మిగా

సర్వలోకాలు సత్యమ్ముగాదృష్టియే


ఏమియన్నా సయోధర్మమే నీమదీ 

కామితార్ధమ్ముగా కాల నిర్మాణమే

సామి తీర్ధమ్ము సంసారమే జీవితం

ప్రేమమాధుర్యమే నిత్య సత్యమ్ముగన్


 దివ్య భవ్యా నిధీ రంజనీ పెన్నిదై

సవ్య లక్ష్యాల సౌమ్యమ్ముగా సన్నిధై

నవ్య రంజింప నాట్యాసమానమ్ముగై 

శ్రావ్య శక్తీ స్థితీ స్వేచ్ఛగా ణే సుధీ


ఇంటిలో కోట్లు యిచ్ఛా కలా పాలుగా

పంటిలో గాట్లు ప్రత్యేకమై మంటగా

కంటిలో నల్సు పడ్డాక బాధే విధీ

వంటి ఆరోగ్య పంతమ్ముగా పాట్లుయే


భీకర మ్మైన భేధ్యంముగా పోటీయే

చీకటీ రాత్రులే చెప్పకే వత్తురే

యేకమే డబ్బుయే ఎన్నియోజూపు లే

నాకసమ్మేవినా ట్యంమ్ముయే ధన్యుడౌ

(6) దృత విలంభర... న భ  భ ర.. 6


నడక సాగుట నమ్మక మేనురా

పడక చేర పసందను తేలరా

తడవనేర తపమ్ముగ ఏలరా

మడమతిప్ప మనస్సును ఎంచరా


కడలి పొంగు కథల్లుగ సాగురా

వడలి పోవు వరాలగు ఏలరా

పడవ లాగ ప్రయాణము చేయరా

గడప దాటి గరమ్ముగ వద్దురా


పలకరింపు పెదాలను చూడురా

చిలకరింపు చిరాకుగ ఏలరా

కులుకు మాట కులానికి చేటురా

వలపు ఆట వరాలకు ముద్దురా


చిరుకు గుడ్డ చిరాకును తెచ్చురా

బెరుకు మాటబలమ్మును మార్చురా

పరుగు లాట ప్రమాదము తెచ్చురా

జరుగు వేట జపమ్మును కూల్చురా


కలలు మన్నిక కాలము బట్టిరా 

పలక రింపు ప్రమాదము బట్టిరా

కళలు బుద్ది కథమ్మును బట్టిరా

పులకరింపు పురమ్మున బట్టిరా


గురువు నేర్పగువిద్యలు పొందురా 

ఉరుత మౌనయు చుష్ణుడు నీవురా 

పురహ నాజ్ఞను గాచుచు చూడరా 

స్థిరమ సంపద సాక్షిగ నువ్వురా


***

ప్రాంజలి ప్రభ.. నేటి పాఠము 

(7) తోదక.....న జ జ య..7


సకలజయమ్ము సమస్యలు లున్నా 

వికసిత లక్ష్య వినమ్రత చూపూ

వికటిత భావ నిజమ్మును తెల్పూ

ఒకటొకటే అవ కాసము పొందూ


ఎవరికి ఎవ్వరె ఏమియు చేయా

సవరణ చేయ సహాయము ఏదీ

వివరణ కోర వినమ్రత ఏదీ

అవసర మన్న అనేకము ఏలా


వలదు ననేది వివాదమ్ము మేళా

తలవనిదే పతనమ్మగు ఏలా

పిలవనిదే ది వరించుట ఏలా

అలసినవేళ అనంతము శోభా


అనుభవమేసమమౌనముగానే

అనుకరణే సమలక్ష్యము గానే

అనుమతి సేవ సమంత్రము గానే

అణుయనుహృద్యము శాంతిని కూర్చే


సమయ సమాది సమానము చేసే

సమర సహాయ సశాంతియు మార్చే

యమరిక దైవ యమః కళ కాదా

సుమ మధురం సుధావిధి కాదా


నుచితముయే ననునేకము ఏదీ 

విచలిత భావవి నమ్రత ఏదీ

ప్రచరత లక్ష్య ప్రభావము ఏదీ

రచనల వల్ల రసమ్ముయు కారే

***

ప్రాంజలి ప్రభ.. చందస్సు 


(6) దృత విలంభర... న భ  భ ర.. 6


నడక సాగుట నమ్మక మేనురా

పడక చేర పసందను తేలరా

తడవనేర తపమ్ముగ ఏలరా

మడమతిప్ప మనస్సును ఎంచరా


కడలి పొంగు కథల్లుగ సాగురా

వడలి పోవు వరాలగు ఏలరా

పడవ లాగ ప్రయాణము చేయరా

గడప దాటి గరమ్ముగ వద్దురా


పలకరింపు పెదాలను చూడురా

చిలకరింపు చిరాకుగ ఏలరా

కులుకు మాట కులానికి చేటురా

వలపు ఆట వరాలకు ముద్దురా


చిరుకు గుడ్డ చిరాకును తెచ్చురా

బెరుకు మాటబలమ్మును మార్చురా

పరుగు లాట ప్రమాదము తెచ్చురా

జరుగు వేట జపమ్మును కూల్చురా


కలలు మన్నిక కాలము బట్టిరా 

పలక రింపు ప్రమాదము బట్టిరా

కళలు బుద్ది కథమ్మును బట్టిరా

పులకరింపు పురమ్మున బట్టిరా


గురువు నేర్పగువిద్యలు పొందురా 

ఉరుత మౌనయు చుష్ణుడు నీవురా 

పురహ నాజ్ఞను గాచుచు చూడరా 

స్థిరమ సంపద సాక్షిగ నువ్వురా


***

5.. ఓం శ్రీ రామ.. శ్రీ మాత్రేనమః

మణి భూషణశ్రీ... ర న భ భ ర..9


సానుకూలతయు విద్యసమర్ధత నెంచియే

మానలేవు మదినేస్తము మాటను ఎప్పుడూ

ఆనతీయమని భక్తి అనంతము కోరుటే

ప్రాణమైనకళయుక్తి ప్రభావము పొందుకే


భిన్నమై వికృతి సాధు వినమ్రత లక్ష్యమై 

మన్ననై మహిమ జూప మనోమయి మార్గమై 

చిన్న పెద్ద గురువై విధి ఆటగ నేస్తమై

కన్నులే హృదయ శబ్ద కలోచిత లక్ష్మియై


ఆయుధాలు మనఆశయశాంతికి మూలమై

సాయుధమ్ము బల దేశసహాయమె నుండుటే

చేయువారు కడువృత్తిచరిత్రగ చూపుటే

ప్రాయమే విజయవాంఛ పదాలగు దేశమే 


తప్పు ఒప్పుకల కాల తపస్సుగ మారుటే

చెప్పు కో నలవి కాని చెరిత్రయనే విధి జేరుటే

ముప్పు వచ్చినను సాధ్యము యుక్తిని వాడుటే

మెప్పుకోరుటయు మోసమె నెం చకుమాసుధీ


పాల వారధిన పాఠపదాలగు సంపదే

కాల నీడలగు కావ్య కళమ్మగు సత్యమై

శాలయే మనసు వెంట సమర్ధత నెంచుటే

మాలగా సహనమేను మనస్సు చెంతనే


పర్ణశాల మది మాన ప్రపంచము జీవమై

అర్ణ సంపదగ ఆది అనంతము ప్రేమగా

వర్ణనే సహ సువర్ణ వనాలయ మందిరం

స్వర్ణ సంబరము

(4) మాధవ (నర భభ భర లగ - 13) 


పలుకులే మనోశ్శక్తియు యుక్తియు పంతము సొంతమే యగున్

కళల విద్య నమ్మే స్థితి భుక్తియు కాలము నేర్పుటే మదిన్

తులువ మాటలన్నీ విని దూరము గుండియు నమ్ముకుండుటే

చెలన బుద్దిగానే సహకల్పన చేష్టలు కాలతీర్పులే


మనముగా సహాయమ్ము చరిత్రయు మానస జీవితమ్ముగన్

అణువుగా విశేషాలు భరించియు ఆశ్రయ సౌఖ్యమే విధిన్

చినుకులా చిత్ర విచిత్రము చూపుచు చేరువ నేస్తమేయగున్

అనుకువా గలిగే సహనమ్మును శాంతిని జెర్చియు ధర్మమార్గమున్


పరుల సేవచేయాసహనమ్ముయు పాలన నేస్తమేయగున్

సిరులు కోరుటేబాధలు నెంచుట శీ ఘ్రము జీవితమ్ముగన్

నురుగు జీవితం గాలిన నీరుగ ఊరుట కాలమాయగన్

పరుగు పందెమే నీకును నాకును పాఠము నేర్పు కాలమున్

 .(3) కాంత :: త  జ  జ  లగ  ... 7


సాహిత్య జయమ్ము సహాయ ముగా 

దేహమ్ము బలమ్ము విధానము గా  

దాహమ్ము చరిత్ర ధరావతిగా  

మోహమ్ము విశాల మనస్స గుటే    


ప్రావిన్య తనేది పదాలు సహా 

య విశ్వేశ్వరమ్ము యశస్సు మహా 

భావాల విధాన తరాలు విహా 

ర విధ్యా సకాల రసాల కధా 


రామా కథదీప్తి రకాల నిఖా 

భామా సమపోష భరించ విధీ

శ్యామా లహరీ శశాంతి నిధీ

ప్రేమా లయమ్ముగ సహాయ్ సుధీ


వేవేల జనాల విలాస మదీ 

దేవా సహమిత్ర విచిత్ర విధీ

నీవే గురువర్య ననెమ్మి సుధీ

భావమ్ము సపర్య ప్రధాన నిధీ

కాంత 

దేవానినునేపిలిచేదను లే

రావాననుజేరవనీదయలే

కావుమ్ముమనస్సు వయస్సునులే

చావైననునీనిజ నిరూపణలే

(2) ప్రాంజలి ప్రభ వారి 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ


స  స  స స .....తోటకము.. యతి.8


మికి ష్టమైన అంశం లో


 కరుణా కరుడై వెలుగౌ నతడే

దరిచే రుటకై పదదా సుడనై

 పరిపా లకనా వెతబా పుటకై

కరుణిం చుమయా హరి కంఠనమో 


కమలా కుచచూచుక కుంకుమ తో

విమలంబర చూపువినమ్ర తగా 

సమలంకృత నిత్యము సాధనతో

సముఖం విముఖమ్ము సహాయముగా 

 

తిరువీధిన నీస్థితియే కదిలే

చిరుహాసముచెంతని దానముగా

అరునోదయమేను అనన్యతగా

తరుణం వికసించిత భావముగా


చదవంగసహృద్య జయమ్ముగనే

మదిలోన చలించు మజా తపమై

హృదయంబునభక్తి మృదుత్వముగా 

విధి యాడెడిఆట వినమ్రతగా కదిలే


కలకానిది కానక జెప్పకళే

అలవోకగ సాధన ఒప్పు కళే

కలలోనుకధా ఒకటైన కళే

మలుపే మదియందుమనస్సుకళే


గమనం జరిగేనుగళం తెలిపే

సమయం ఒకటౌనుసమం కదిలే

విముఖం పెరిగేనువినమ్రముగా 

సముఖం పరుగేనుసమం హృదయం


మనసే బరువై మమతే కరువై

తణువే బరువై సతతం సమరం

చినుకే పడినే తిమిరం కదిలే

వణుకే విజయం నవనాడులకే 


రకమే కదిలేను రణం జరిగే 

వికసించుటయేను వినాస్థితిగా 

ఒకరొక్కరుగాను ఒకే మనసే 

సకలం ఒకటౌను సమంసుఖమౌ


సరితూగనులేరు సరాజముగా

విరితావు వినోదవివాదముగా

చరితమ్ము చెకోర జయమ్మనగా

సిరిమావి కలేను శివా యనగా

Ramakrishna Mallapragada 

భుజంగప్రయాతము (18=08=2023)

య య య య  యతి 7


మహేశా!గిరీశా!మహాదేవదేవా!

మహానందమాయెన్ మనస్సెల్లనిండెన్

మహాయోగయోగీ మహాదేవశంభో!

సహాయంబునీవే సదానిన్నుకొల్తున్.


వినాశాపరీక్షా వినంమ్రా సురేశా 

అనంతా సునందా అనర్ధం ఎలాగో

మనమ్మే సహాయం మనస్సే మహేశా 

క్షణమ్మే యుగమ్మే క్షమాలీల సమర్ధం


సకాలం సహాయం సమర్ధం సవేదం 

వికాసం వివాదం వినోదం విమర్శం 

ప్రకోపం ప్రభావం ప్రమాదం ప్రపీఠం 

స్వకామం సమర్ధం సహాయం సుధామ్యం


గుణాలే సుదర్మం గురించేను పూర్తీ

మనమ్మేను విద్యా మహాశక్తి గానే

మనో శక్తి శూన్యం మహా యుక్తి మార్గం

ధ్వనీచేయడం సంద్రఘోషా ప్రయుక్తం


సహాయమ్ము గానే సమర్ధమ్ము జూపే

మ్మహావిద్య సాధ్యమ్ము విశ్వాస యుక్తం 

ప్రహాసమ్ము ఏలా ప్రభావమ్ము గాస్వీ

యహమ్మే వివాదం యశస్సే కోరే



Wednesday, 2 August 2023

*



 **

ప్రాంజలి ప్రభ కధలు

మనిషి ఈ భూమిపైన మరిమరి వూపిరి పోసుకోవటానికి కారణం- కర్మఫలం అనుభవించటానికే. ఆ మాటే నిజమైతే- ఆలోచించటానికి మనసు, ఎలాగైనా జీవించాలన్న ఆలోచన, మనసులో ఏ భావం ఉన్నా దాన్ని కట్టడి చేసి నలుగురు మెచ్చుకునేలా మాట్లాడే వాక్‌చాతుర్యం, కంటితో ప్రత్యక్షంగా చూడగలగడం, చెవితో పరోక్షంగా వినగలగడం- వీటితో పనేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం- కర్మ కోసమే కాకుండా ఈ జన్మలో ఆత్మోన్నతి సాధించటమే ముఖ్యమైన కారణమని చెప్పక తప్పదు. అలాంటి ఉన్నతమైన ఆదర్శం లేకపోతే, మనిషి కావటంకన్నా అడవిలో మానై నిలిచిపోవటం నయం. మనిషిగా పుట్టడమే ఒక గొప్పవరం అయినప్పుడు అది శాపం కాకుండా కాపాడుకుంటూ, జీవితంలో ఉన్నతశిఖరం అందుకోవటం ఎంతో ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతూ, శిఖరాగ్రం చేరుకోవటానికి ఈ శరీరాన్ని, మనసును, అందుబాటులో ఉన్న జీవితావకాశాల్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. అందుకు ఏం చేయాలి? ఇది రెండో ప్రశ్న.
రుషులు, దార్శనికులు ఇందుకు తగ్గ మార్గనిర్దేశం ముందుగానే చేశారు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా, ఆ మార్గదర్శకాలను జీవితంలో అమలుపరచటమే. మనకు శ్రమలేకుండా, వేదవేత్తలు నాలుగు ఆశ్రమధర్మాలను అందజేశారు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం- ఈ నాలుగింటిని శిఖరాగ్రం చేరటానికి మేడమెట్లలా ఉపయోగించుకోవాలి.  మనిషి ఒక జీవితకాలంలో ఇహమైనా పరమైనా సాధించాలనుకుంటే, ఒక లక్ష్యం ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒక పథకం ప్రకారం ఆ లక్ష్యం వైపు సర్దుబాట్లు, దిద్దుబాట్లు చేసుకుంటూ- అడుగు ముందుకు వెయ్యాలి. ఈ పనిని నిర్దుష్టంగా, నిర్దిష్టంగా చేపట్టడానికి బ్రహ్మచర్యాన్ని మించిన అవకాశం లేదు. జిజ్ఞాస, జ్ఞానసముపార్జన, పరిశీలన, విశ్లేషణ... ఇవన్నీ నిర్విఘ్నంగా చేయటానికి ఏ చీకూచింతా లేని బ్రహ్మచర్య ఆశ్రమమే ఆదర్శప్రాయమైన సమయం. గార్హస్థ్యంలో ఒక కుటుంబ యజమానిగా సంసార సాగరం ఈదటంవల్ల జీవితంలోని లోతుపాతులు తెలుసుకోవచ్చు. అంతకుమించి, అనుభవపూర్వకంగా ఇంద్రియాల లాలస, విషయభోగాల స్వభావం గ్రహించవచ్చు. భోగించి యోగించటమే ఉత్తమమైందని, జీవితాన్ని కాచి వడబోసిన వేమన తన వేదంలో చెప్పాడు. అసలైన వైరాగ్యానికి సిసలైన వేదిక గృహస్థ జీవితమే. మూడోదైన వానప్రస్థం మహాప్రస్థానానికి ఒక ఉపోద్ఘాతంగా చెప్పుకోవచ్చు. సహనం దాని సారాంశం. రాజులు రాజర్షులై భర్తృహరిలా సుభాషితాలు, హితబోధకాలైన గ్రంథరచనలు, ధర్మ, న్యాయసూత్రాలు సృష్టించింది ఈ స్థితిలోనే. చరమ పాదమైన సన్యాసం జీవన పరిసమాప్తికోసం నిర్దేశితమైంది. కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కర్తవ్యకర్మ ఆచరించేవాడే నిజమైన సన్యాసి, యోగి అంటోంది గీత. ఒక సమన్వయకర్తగా మనిషి ఎదుగుదలకు నిదర్శనమే సన్యాసం. అలాంటి నిఖార్సయిన సన్యాసి కాషాయం కట్టి, సిగచుట్టి, విభూతిపెట్టి, కమండలం పట్టి వూరూ, వాకిలీ వదిలి వెళ్లవలసిన అవసరం లేదు. మనలాగే మన మధ్యనే ఉంటూ, తామరాకుపైన నీటిచుక్కగా నిలవటమే జీవిత సాఫల్యం. ఈ జీవన్ముక్తి వివేకమే సర్వగమ్య మోక్షానికి సహజమైన మార్గం.
......
*అందరూ అమ్మ కడుపు నుండి ఒకేలా బయటపడుతారు ఎలా జీవించాలి అనేది మనం ఎన్నుకుని జీవించే పద్ధతిలో ఉంటుంది---//-*

*నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడు పొగరుగా, మొండిగానే  ఉంటారు...*

*ఎందుకంటే వాళ్లకు నటిం చడం రాదు కాబట్టి  అలాగే అవసరానికి వాడుకొని వది లేసే గుణం కూడా వారికి ఉండదు...*

*అందరిలో మంచిని మాత్రమే చూస్తారు,దేనికి లొంగరు ప్రేమకి, మంచి వ్యక్తిత్వానికి తప్ప...*

*వారి జీవితానికి వారే  కర్త, కర్మ, క్రియగా జీవిస్తారు...*

*వారి కష్టనష్టాలకి ఒకరిని బాధ్యులను చేయరు...*

*ఎప్పుడు ఆత్మ విశ్యసముతో  ఉంటారు...ఆపనమ్మకం వారి దరిదాపుల్లో ఉండదు!*

*అందరూ అమ్మ కడుపు నుండి ఒకేలా బయటపడుతారు... ఎలా జీవించాలి అనేది మనం ఎన్నుకుని జీవించే పద్ధతిలో ఉంటుంది---//-*
.....
#కార్తీక_మాసంలో "#ఉసిరి"

కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అపుడు కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవ కాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మిక.బావుల్లో ఉసిరి విత్తనాకు పోస్తారు. దీనివల్ల ఆనీరు శుధ్ధి అవుతుందని పూర్వుల నమ్మిక.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు.ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సర్కరించడం ,పూజాదికాలు చేయడం వల్ల పరస్పర స్నేహ భావన, బంధుభావన , రోజువారీ పనినుండీ కాస్తంత సేదతీరడం జరిగేవి.

కార్తికమాసం వచ్చిందంటే చాలు... వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారంతా. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తికంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరిచెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృతబిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళినీ రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. అంతటి మహత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమమైనదో వేరే చెప్పాలా? అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం.

ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అనీ పిలుస్తారు. ఏదో ఆపిల్ మాదిరిగానో అరటిపండులానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే పులుపు దాని ఇంటిపేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. అలాగని ప్రొటీన్లు లేవనుకునేరు... ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువ. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. శీతకాలం నుంచి వేసవివరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాదిపొడవునా వాడతారు. కొందరు పంచదారపాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే.

అయితే ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి, మరొకటి చేదూ తీపీ వగరూ ఘాటూ పులుపూ కలగలిసినట్లుండే ఉసిరి. రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో పండేకాదు, వేరు నుంచి చిగురు వరకూ ప్రతీదీ ఔషధమే.

ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశ యోక్తి కాదు. ఉప్పు లో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ప్రతి ఇంటిలో ఉసిరిని పెంచితే ఆగాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞులమాట. . భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం చెప్తున్నాయి.

ఉసిరి కంటిచూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. జ్వరం వచ్చి పచ్చెం పెట్టే సమయం లో నూ, బాలింతకూ పచ్చం పెట్టేప్పుడూ పాత చింతకాయ పచ్చడితోపాటుగా ఉసిరి కూడా ఎండు మిర్చితో ,ఇంగు వ వేసి చేసి పెడతారు. రక్త శుధ్ధికి ఇది మంచి మందుగా పని చేస్తుంది.

ఆదిశంకరులవారు ఆశువుగా చెప్పిన కనక ధారా స్తవం మనకు ప్రతిరోజూ చదవ దగ్గ స్తోత్రరాజం.శంకరులు బాల బ్రహ్మ చారిగా ఏడెనిమిదేళ్ళ వయస్సులో భిక్షకోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిల్చి ' మాతా బిక్షం దేహి 'అని కేకవేయగా ఆపేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరేవరకూ ధరించిన చిన్న వస్త్రంతో బయ టకు రాలేక తన ఇంట ఉన్న ఒకేఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతి స్తూ ఆబ్రహ్మచారి జోలెలో తన పూరి పాక తలుపు చాటు నుంచీ విసిరివేస్తుంది. శంకరులు ఆమె దారిద్యాన్ని గ్రహించి, అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగ భావంతో తనకు దానం చేసినందుకు సంతసించి ' కనక ధారాస్తవం ' ఆశువుగా చదువుతారు. వెంటనే లక్ష్మి కరుణీంచి ఆమె ఇంట బంగారు ఉసిరి కాయలవాన కురిపిస్తుంది. ఇల్లు నిండిపోతుంది. త్యాగానికి ఋజువు , ఆభావనను గ్రహించి కరుణించిన శంక రులవారి మనస్సూ ఈ కధ ద్వారా మనకు తెలుస్తాయి. అదే కనక ధారా స్తవం 'గా భక్తులు ప్రతిరోజూ చదివి సంపదలు పొందుతారు.
శుభం
......
*కృతజ్ఞత*

“కృతజ్ఞత” అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం.

మనం,
ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో,
ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో,
మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు.

మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు.

వీరికెప్పుడూ,
మనం కృతజ్ఞులమై ఉండాలి.

కృతజ్ఞత అనేది నాగరిక సంస్కారం.

వాల్మీకి, రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ” అన్నాడు.

సీతమ్మను అపహరించు కొనిపోతున్న రావణునితో పోరాడి ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమసంస్కారం చేశాడు.

రావణ సంహారంలో తనకు తోడ్పడిన వానరుల కోసం,

ఈ వానరులు, ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు,
అక్కడి నదులలో నిరంతరం స్వాదుజలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వవలసిందిగా,
రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.

ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.

మహాభారతం లో,

దగ్ధమైన లాక్షాగృహం లోంచి ప్రాణాలతో బయటపడి,

ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో,
తన కుమారులతో తల దాచుకుంటున్న కుంతి,

తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా,
అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో కుంతీదేవి తన ఒక కుమారుడను రాక్షసుడుకు ఆహారముగా పంపడం ద్వారా కృతజ్ఞత తెలియజేసింది.

ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం,

దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం,

వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం అంటుంది ధర్మం.

“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం”
అనే చందంగా కాకుండా,

మన ఉనికికి, ఉన్నతికి కారకులైన వారిపట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి.

ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి ,
విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే,

అతని యందు సకాలంలో,
అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే,
అది కృతఘ్నత ఔతుంది.

ఈ విషయాన్ని మహాభారతం అనుశాసనికపర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.

ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం" తో ఒక మృగాన్ని కొట్టబోయాడు.
అది గురి తప్పి ఒక చెట్టును తాకింది.
పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆ వృక్షం, విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది.

ఆ చెట్టే ఆశ్రయంగా,
దాని తొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం,
దానిని వదలలేక దాని మీదనే ఉండిపోయింది.

దీనిని గమనించిన ఇంద్రుడు మానుషరూపంలో దాని దగ్గరకు వెళ్ళి,

ఓ కీరమా! ఈ వృక్షం బెండువారి పోయింది.

ఫలసంపద గల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా,
ఇంకా దీనినే అంటిపెట్టుకున్నావెందుకు..?
అని అడిగాడు.

అపుడా శుకం,
ఈ చెట్టు తాను మధురఫలాలతో నిండిఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.

ఈవేళ ఇది ఎండిపోయిందని, నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా! అనిమిషనాథా! అంది.

తాను మానుషరూపంలో వచ్చినా
"పురాకృత సంజనిత విశేషము" చేతనే,
ఈ మహాశుకం తనను ఇంద్రునిగా పోల్చుకోగలిగిందని ఆశ్చర్యపోయి,

నీ మాటలకు మెచ్చాను, నీకేం కావాలో కోరుకో,
అన్నాడు ఇంద్రుడు.

అపుడా మహాశుకం,
ఈ వృక్షానికి మేలు చెయ్యి, చాలు. అంది.

ఇంద్రుడు సంతోషించి,
అమృతసేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను, ఫలసంపదను కలుగజేశాడు.

ఈ కథ వల్ల,
ఉత్తములైన ఆశ్రితులు,
ఆశ్రయదాత క్షేమాన్ని కోరుకోవాలని,
కృతజ్ఞత ఉత్తమలక్షణమని తెలుస్తోంది.

సజ్జనులు,
ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు.

🙏 సర్వే జనా సుఖినోభవంతు🙏
A Collection from
Admin
Pranjali prabha
.......
*****  ...........జీవితం.............
యవ్వనంలో ఉన్నప్పుడు *"మొటిమల్ని"* గురించి బాధపడే వాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు  *"ముడతల్ని"*  గురించి బాధపడుతుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు *"ఆమె"* చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురుచూసే వాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి *"చేయి"*  పట్టుకుంటారా....అని ఎదురు చూస్తుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను *"ఒంటరిగా"* వదిలేస్తే బాగుండును...అనుకునేవాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు అందరూ *"ఒంటరిగా"* వదిలేస్తారేమో.... అని బాధపడుతుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే *"చికాకు"* పడేవాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం *"మాట్లాడటం"* లేదే అని బాధపడుతుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు *"అందాన్ని"* ఆస్వాదించే వాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ *"అందాన్ని"* చూసుకుంటుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు నాకు *"చావు"* లేదు అనుకుంటాం!

ముసలితనం వచ్చినప్పుడు .... *"రోజులు దగ్గర పడ్డాయి"* అని బాధపడుతుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో *"ప్రతి క్షణాన్ని"* పండగ చేసుకునే వాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు ఆ *"తీపి జ్ఞాపకాల్ని"*  నెమరు వేసుకుంటుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు *"నిద్రలేవడం"* కష్టంగా ఉండేవాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు *"నిద్రపోవడానికి"* కష్టపడుతుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా *"గుండెల మీద"* పిడిగుద్దులతో  గుద్దుకునే వాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు ఈ *"గుండె ఎప్పుడు ఆగి పోతుందో"*  అని భయపడుతుంటాం!!

కనుక........

జీవితంలో రకరకాల *"ఆటు పోట్లు"* వస్తుంటాయి.
దేనికీ భయపడ కూడదు.

ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం  కావాలి.
అదే నిజమైన *"జీవితానుభవం".*

అది *"యవ్వనంలో"* నైనా.. *"ముసలితనంలో"* నైనా.....అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా *"ప్రశాంతంగా"*  ఉంటుంది.

అందుకే, మిత్రమా....

*యవ్వనంలో..... విర్రవీగకు!*
*వృద్దాప్యంలో..... బాధ పడకు!!*  పరోపకారచింతనతో ప్రశాంతంగా బతికేద్దాం......
......

ప్రభుత్వం మారాలి అంటె ముందు ప్రజలు మారాలి

*ఈ దేశంలొ తప్పు చేసినోడు " బాబా " అవుతాడు
*హత్యలు చేసినోడు " నాయకుడు " అవుతాడు
*అవినీతి చేసినోడు " అధికారి " అవుతాడు
*పంట పండించేవాడు " అడుక్కు " తింటాడు
*కష్టపడి చదివేవాడు " నిరుద్యోగి " అవుతాడు
*న్యాయoగ ఉండేవాడు " నాశనం " అవుతాడు
*నాయకుని బట్టి న్యాయం వాయిదా అధికారి అవుతాడు.
*అవకాశ వక్రబుద్ధి రాజకీయ లబ్ది ఆశ పోరాట నాయకుడౌతాడు.
*ఇదే మన 70 ఏళ్ల స్వాతంత్ర దేశం

*ఇంకా చెప్పాలంటే ఈ దేశంలొ పేదవారు ఉన్నారు కాని " పేద " దేశం కాదు
*అభివృద్ధి ఉంది అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు....కారణాలు ఇవే

* మనం అంబులెన్స్ కి phone చేస్తే దానికంటే ముందు pizza మన ఇంటికి వస్తుంది..

*కారు loan కి వడ్డీ 5% అయితె, చదువుకోవడానికి మాత్రం bank లు వసూలు చేసేది 12% వడ్డి..

*మనం కాళ్లకు వేసుకునె చెప్పులు a/c room లొ కొంటున్నాం,
*అదె తినే ఆహార పదార్థాలు మాత్రం రోడ్డుపైన కొంటున్నాం..

* పర్యావరణం కాలుష్యం చేసె ఫ్యాక్టరీలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం
*కాని అన్నం పండించే రైతన్నకు 7 గంటలు కరెంట్ ఇస్తున్నాం..

*70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలొ నేటికి రూపాయికి కిలో బియ్యం & 5 రూపాయలకు అన్నం కోసం line లొ నిలపడుతున్నారు అంటె నా దేశంలొ పేదరికం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోండి...

*లిక్కర్ కి ఆశపడి మగవాళ్ళు
కుక్కర్ కి ఆశపడి ఆడవాళ్లు ఓట్లు వేస్తె
*చివరికి నిక్కర్ కూడ మిగులకుండ చేస్తారు
ఈ రాజకీయ నాయకులు...
నిజా నిజాలు గమనించే వారు, అమ్ముడుపోకుండా నిస్వార్ధ పరులు, కుల, మత, భాష బేధం చూపేవారిని గమనించి ఓటు వేస్తారని నా భావన.

మీ ప్రాంజలి ప్రభ

ఉద్యోగ ప్రాప్తి కొరకు :*
*$$$$$$$$$$$$$$$$$*

*శ్రీరామ పట్టాభిషేకం :*

*ఉద్యోగం లేని వాళ్ళు,ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు, ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండము నందు మొదటి సర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి.*

*నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |*
*రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||*

*ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |*
*నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||*

*న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |*
*నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||*

*న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |*
*న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||*

*న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |*
*నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||*

*నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |*
*అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||*

*గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |*
*అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||*

*రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |*
*చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||*

*దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |*
*రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||*

*ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |*
*యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||*

*ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |*
*సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||*

👉 చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నంది గ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితో కలిసి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను.

👉 శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో సుఖఃసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు, ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు.

👉 రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు. నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద(మరణ)ములు గాని, వాయు భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో వర్థిల్లుచుందురు.

👉 అనేకములైన అశ్వమేథాదిక్రతువులను, సువర్ణ్క యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి, వాసికెక్కును.

👉 రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.

👉 ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును, ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారి పుత్త్రపౌత్త్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.

*సేకరాణ :*
*_ ప్రాంజలి ప్రభ

 *వైశాఖ పురాణం 4 వ అధ్యాయము* 🕉️
సేకరణ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*
*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*


🌻 *వైశాఖధర్మ ప్రశంస* 🌻
💫🌹నారద మహర్షిని అంబరీష మహారాజు "మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది.
 

💫🌹వినుము, నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటీఅకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము.
 

💫🌹ధనవంతులు - బంగారు, వెండిపాత్రలలోను, సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను.
 

💫🌹వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్రతము పాటించువారు, యెండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమమాసమున గూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగ భావించి వాని పాదములను నీటిచే కడిగి యా పవిత్రజలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నియు పటాపంచలై నశించును.
 

💫🌹ఆ జలమును తలపై జల్లుకొనిన గంగ మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణుప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిదకడుపున బుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును.
 

💫🌹ఆరోగ్యవంతుడై యుండి దృఢశరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును వైశాఖమున బహిస్నానము నదీ/తటాకాదులలో చేయనివాడు వందలమార్లు శునక జన్మమునందును. స్నానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖమాసవ్రత మాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును, అన్నమును దానము చేయనివాడు పాపదుఃఖముల నెట్లు పోగొట్టుకొనును? పోగొట్టుకొనలేడని భావము.
 

💫🌹శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీస్నానము నాచరించినవారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనును. ప్రాతఃకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్నానము నాచరించినచో నేడు జన్మలలో చేసిన పాపములును పోవును. జాహ్నవి, వృద్దగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి యని గంగానది యేడు విధములుగ ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్దినందినది. అట్టి సప్తగంగలలో ప్రాతఃకాలస్నానమున వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనుచున్నారు.
 

💫🌹దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతఃకాలమున చేసినవారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున(లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు) గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాని యందు స్నానమాడవలెను.
 

💫🌹రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగుకంటె నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తికమాసముత్తమము. కార్తికముకంటె మాఘమాసముత్తమము. మాఘముకంటె వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును.
 

💫🌹కావున నిట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను, దరిద్రుడైనను, యధాశక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగ దానమీయవలెను కంద మూలములు, పండ్లు, వ్రేళ్లు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగువానిని నిచ్చినను కలుగు పుణ్యమనంతము. బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని యీ మాసమున వ్రతదానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు.
 

💫🌹దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపముల నాచరించును. అందుచే నరకము నందును. కావున యధాశక్తిగ దానము చేయుట యెట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో నెన్నియలంకారములున్నను పైకప్పులేనిచో ఆ యిల్లు నిరర్ధకమైనట్లు జీవి యెన్ని మాస వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము.
 

💫🌹అన్ని మాసముల వ్రతముల కంటె వైశాఖమాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతియైనను, గుణవంతురాలైనను, భర్త కలిగియున్నదైనను, భర్తను ప్రేమించుచు, భర్తృప్రేమను కలిగియున్నను, వైశాఖవ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని యెరుగుము. అనగా సర్వశుభలాభములనంది యువతులును వైశాఖవ్రతమును చేయనిచో వారికి నున్నవన్నియు నిష్పలములు వ్యర్థములునని భావము.
 

💫🌹గుణములెన్ని యున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్ర్వతము లెన్నిటిని చేసినను వైశాఖమాస వ్రతమును చేయనిచోయన్నియు వ్యర్థములగును సుమా! శాక సూపాదులు(కూర పప్పు) యెంత యుత్తమములైనను, యెంత బాగుగవండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖవ్రతమును చేయనిచో నెన్ని వ్రతములును చేసినను అవియన్నియు వ్యర్థములే యగును సుమా...
 

💫🌹స్త్రీ యెన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే యెన్ని సద్ వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున శ్రీమహావిష్ణువు దయను వైశాఖ వ్రతమునాచరించి పొందవలెను. ఇట్ళు చేయనిచో నరకము తప్పదు.
 

💫🌹వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై వైకుంఠప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినచో వచ్చు ఫలములకంటె వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలమత్యధికము. వైశాఖవ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసినవానికంటె వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను, కాముకుడైనను, యింద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతము నాచరించినచో వైశాఖస్నానమాత్రముననే సర్వదోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసమునకు శ్రీమహావిష్ణువే దైవము.
 

💫🌹వైశాఖమాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీమహావిష్ణువు నిట్లు ప్రార్థింపవలయును.
*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ |*
*ప్రాతః స్నానంకరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ ||*
 

💫🌹పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము నీయవలయును.
*వైశాఖే మేషగేభానౌ ప్రాతః స్నాన పరాయణః |*
*అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన ||*
*గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |*
*ప్ర గృహ్ణీతమయాదత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ ||*
*ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |*
*గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||*


💫🌹అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి/పొడి బట్టలను కట్టుకొని వైశాఖమాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును. వైశాఖమాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను/చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నియు నశించును. ముక్తి లభించును.
 

💫🌹ఇట్లు చేసినవారు భూలోక వాసులైనను స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను యెచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్దించును.
 

💫🌹వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు, శ్రీమహావిష్ణువు సత్కధలను విననివారును, స్నానము, దానము చేయనివారును, నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖస్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు.
 

💫🌹తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన యధీనములోనే యుండి, నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడవీలున్నను, స్నానమాడక నాలుక తన యధీనములో నుండి 'హరి' యను రెండక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమున్నగు లక్షణములు లేని 'శవము' వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని యెట్లైనను సేవింపనివాడు పందిజన్మనెత్తును.
 

💫🌹పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీమహావిష్ణువు నర్చించి విష్ణు కధాశ్రవణము దానము చేసినవారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా....
 

🌺 *వైశాఖ పురాణము నాలుగువ అధ్యాయము సంపూర్ణము* 🌺
 

    🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు*


శుకబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు, కారణజన్ముడు. పరమ విరాగి. దర్బలు చేబూని, ఎల్లప్పుడూ సత్‌కర్మలు చేయుచుండెడివాడు. ఒక సందర్భములో శుకుడు నడిచి వెళుతుండగా, స్నానము చేయు ఆడవారు వివస్తల్రుగా వుండి కూడా, ఆ మహానుభావుని గురించి శంకించలేదు. అంతటి పరబ్రహ్మ స్వరూపుడైన శుక బ్రహ్మ భాగవతం చెప్పడానికి పూనుకొన్నాడు. కడుపులోనే భగవంతుని తేజాన్ని చూచి అటువంటి తేజము ఎక్కడఉందా అని అనుక్షణమూ వెతుకుతూ తన పేరును సార్థకం చేసుకున్న పరీక్షిత్తు ఆ భాగవతాన్ని శుకబ్రహ్మద్వారా విన్నాడు.

శమీక మహాముని తపస్సులో మునిగిన ఉన్నసమయంలో మరణించిన సర్పమును ఆ మహర్షిమెడలో వేసిన శృంగి శాపానికి గురయన పరీక్షిత్తు తన శాపం తనను కబళించేలోపల నేను జన్మసార్థక్యాన్ని పొందడమెలా అని విచారిస్తున్న కాలంలో శుకబ్రహ్మ వలన భాగవతాన్ని శ్రవణం చేశాడు.

అటువంటి భాగవతాన్ని అందరూ చదవాలి. ఎందుకు చదవాలి అంటే భాగవతము ఎల్లవేళలా పఠిస్తే, ఆ ఇంటిలోగాని, ఆ గ్రామంలోగాని, ఆ ఊరిలోగాని శుభ పరంపరలు కలుగుతాయ. భాగవత పఠనముచే జీవునిలో సర్వదోషములు హరించబడుతాయ. భాగవత పఠనముచే దోష నివృత్తి చెంది, సత్‌సంగములు ఏర్పడుతాయ అని పురాణాలు చెబుతున్నాయ.

కానీ భగవంతుని లీలను వినడంతో మనసు రంజిల్లుతుంది. భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమే భక్తిగా పరిణమిస్తుంది. విషయ భోగాలపై విరక్తి ఏర్పడుతుంది. దానివలన మనిషి శుద్ధసత్వగుణస్థుడౌతాడు. ఆ సత్వగుణ ప్రభావంతో అతనిలో ఇతరజీవాల పట్ల ప్రేమకరుణ వృద్ధి అధికవౌతుంది. సర్వప్రాణి కోటిని పరమాత్మస్వరూపంగా ఎంచుతాడు. అట్లాంటి జ్ఞానం ఉద్భవిస్తుంది. తనపర భేదభావాన్ని మరిచి మనసును ఎల్లప్పుడూ భగవంతుని చింతన చేస్తూ మనుషులందరూ ఒక్కటిగా ఉంటారు. అందరూ ఒక్కటేనన్న భావాన్ని కలిగి వ్యత్యాసాలు దూరమవుతాయ. వైషమ్యాలు తొలుగుతాయ. మైత్రీ భావం ఏర్పడుతుంది.

........


గానం-పానం

‘నేను భాగవతాన్ని వింటున్నాను/చదువుతున్నాను’ అని ఎప్పుడూ అనుకోకూడదంటారు. మరేమనాలని అడిగేవారికి ‘పిబత భాగవతం’ (భాగవతాన్ని తాగండి) అనాలని చెబుతారు భాగవతులు. చెవులతో వినేదాన్ని తాగడం ఎలా కుదురుతుంది?


కుదురుతుంది. అలా అనడంలో లోతైన అంతరార్థం ఉంది.


ఏదైనా తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో ఉన్నా ఆ పదార్థాన్ని నోరు నేరుగా కడుపులోకి పంపిస్తుంది. ద్రవంలో సాధారణంగా తీసిపారేసేది ఏదీ ఉండదు. ఆ దృఢమైన నమ్మకంతో రెండో ఆలోచన లేకుండా తాగేస్తాం. ‘భాగవతమూ అలాంటిదే. దాన్ని రచించినప్పుడే అనేక వడపోతలు జరిగిపోయాయి. (భక్తులు, భగవంతుల కథలు కాబట్టి, వాటివల్ల అనేకమందికి మార్గదర్శనం అవుతుంది కాబట్టి) దీనిలో తీసి పారేయవలసింది ఏదీ ఉండదు’ అని వేదాంత ప్రవచనకర్తల మాట. భాగవతంలో భగవంతుడు శబ్దరూపిగా వసించడమే అందుకు కారణం. కాబట్టి భావంతో సంబంధం లేకుండా గా(పా)నం చెయ్యవచ్చు.


‘తెలుగు భాషకు ముగ్గురు మకుటంలేని మహారాజులు ఉన్నారు. వారు వరసగా- త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీరి ముగ్గురి పేర్లలో రాచరికం ఉంది. కానీ వీరు ముగ్గురూ భగవంతుణ్ని సేవించి, ఆ సేవల్లోని మాధుర్యాన్ని గ్రోలి (తాగి), ఆ రుచి మరిగి ‘ఈ రాచరికం వల్ల ఏమీ సుఖంలేదు. కాబట్టి మాకు వద్దు’ అని విడిచిపెట్టేశారు.


ఆ పరంపరలో ఒక రాజు దాసుడయ్యాడు. అతడే రామదాసుగా మారిన గోపరాజు. ఆయన తన కీర్తనల్లో ‘రామజోగి మందు కొనరే...’ అనే కీర్తనలో ‘శ్రీరామ దివ్య నామస్మరణ అనే పానం చెయ్యండి’ అన్నాడు. మరోచోట ‘తారక నామమనే రసాన్ని పానం చేసేవారికి అమృతాన్ని తాగే అవసరం లేదు’ అన్నాడు.


మరో రాజు అయ్య (తండ్రి)గా మారి త్యాగయ్య అయ్యారు. ఆయనా తన కీర్తనల్లో చాలాచోట్ల ‘దైవ నామ పానం చెయ్యండి’ అని ప్రయోగించారు.


పోతరాజు ‘పోతన్న’ పేరుతో అందరికీ అన్న అయ్యారు. ఆయన తన భాగవత అనువాదంలో అనేకచోట్ల నామపానం అనే ప్రయోగం చేశారు. ప్రహ్లాదుడి గురించి చెబుతూ, నారాయణుడి పాదపద్మాల గురించి ఆలోచించడమనే అమృత పానం చేసేవాడు- అని ప్రయోగించారు. ‘మందార మకరంద...’ అనే పద్యంలో విష్ణు పాదాల గురించి ఆలోచనలనే అమృతాన్ని గ్రోలేవాడు అని ప్రయోగించారు.


ఇలా ఆ ముగ్గురూ పరమేశ్వరుడి పాదాల దగ్గర దాస్యాన్నే అభిలషించారు. భక్తి అనే రసం పంచారు. భక్తి సామ్రాజ్యాలను ఏలారు.


సదాశివ బ్రహ్మేంద్రులవారు ‘పిబరే రామరసం’ అంటూ రామ నామమనే రసాన్ని పానం చెయ్యండన్నారు. ఇలా విష్ణునామ సంకీర్తనలు చేసినవారంతా పానం చెయ్యమనే చెప్పారు.వేదాలనే కల్పవృక్షాల శాఖల చిట్టచివర పండిన పళ్లు ఉపనిషత్తులు. అవి జ్ఞాన రసాత్మకమైనవి. దాన్ని చిలక కొరికింది. పండు బాగా పక్వానికొచ్చినప్పుడే చిలక కొరికి రుచి చూస్తుంది. చిలక రుచి చూసిన పండ్లను ఎంగిలిగా భావించరు. ఇక్కడ చిలక ఎవరు? శుకబ్రహ్మ. శుకుడు తన నోటిద్వారా ప్రవచనం చేశారు. అదే భాగవతం. దేనిమీదా ఆపేక్ష లేని మహాపురుషుడు శుకుడు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది కాబట్టి భాగవతం ఎంగిలికాని, మధురమైన పానద్రవ్యం అయింది. అందుకని ఆ భాగవతాన్ని రెండో ఆలోచన లేకుండా తాగెయ్యవచ్చు అంటారు.


నాలుక లాగానే చెవి, కన్ను లాంటి ఇంద్రియాలు సైతం రుచిని ఆస్వాదించగలుగుతాయి. భగవన్నామం అన్నా, విన్నా, కన్నా మధురమే కదా! అంత గొప్పదైన రసాన్ని, అమృతసమమైనదాన్ని గానం చేస్తుంటే, ఆ గానం ఏ అడ్డంకీ లేని పానం కావాలి. కాబట్టి భాగవతాన్ని వినడం అనేకన్నా పానం చెయ్యడం అనడమే అన్నిందాలా సబబు.

- అయ్యగారి శ్రీనివాసరావు

.........


శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు. శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు. పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే 'శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.


శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు. జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.

........


సర్వ సాధారణంగా ఆధ్యాత్మికత అంటే..

సగటు మనిషికి మత సంబంధమైన, ఆరాధన సంబంధమైన ప్రార్థన, భజన, పూజ, జప, ధ్యాన, యోగాలు అని భావిస్తారు. అయితే, అవన్నీ వ్యక్తిలో, సమాజంలో ఆధ్యాత్మికతను పురిగొల్పే సాధన సంబంధ ఉపకరణాలు మాత్రమే! ఆధ్యాత్మికత అన్నది అత్యున్నత సంస్కార విశేషం. ఆధ్యాత్మికత జీవితంలోని అన్ని పార్శాలను అలుముకొని

ప్రభావితం చేసే సంస్కారం. అందుకు ప్రధాన మార్గం శ్రవణం, మననం, నిధి ధ్యాసనం. శాస్ర్తాన్ని అధ్యయనం చేయడం, అధ్యయనం చేస్తున్న దానిలోని విషయాన్ని శాస్త్రీయంగా గ్రహించడం, ఆధ్యాత్మిక బోధలు వినడం.. శ్రవణం. ఈ విధంగా గ్రహించిన విషయాన్ని తరచి తరచి చూచి స్పష్టత ఏర్పర్చుకోవడం మననం. ఆ స్పష్టమైన అవగాహనను హృదయంలో స్థిరపరచుకొని, ఆచరణలోకి అనువదించడం నిధి ధ్యాసనం. ఈ ప్రధాన మార్గానికి పైన పేర్కొన్న ఉపకరణాలు ప్రబల సహాయకారులుగా నిలుస్తాయి.

అవగాహనలో, అనుభూతిలో అనన్యత, అన్యోన్యత, ఆత్మీయత అనంతంగా విస్తరించడమే ఆధ్యాత్మికత. అదే సాధకుడి మార్గాన్ని అనుభవింపజేసే విస్తరణం. అంతిమంగా పొందేది అమృతత్వం. ‘మృత్యోర్మా అమృతం గమయ’ అంటే ఇదే ప్రస్థానం. పరిమితిలో కూరుకుపోయిన అహంకారం రకరకాల ఆధిక్యతా ఆకాంక్షలుగా వ్యక్తమవుతుంది. అది ఇతరులను తొక్కివేయాలన్న భావన

కలిగించవచ్చు. మాయమాటలతో ఆధ్యాత్మిక వేదికను ధనార్జనకు భూమికగా మార్చుకునే ప్రయత్నమూ జరగవచ్చు. అయితే, ఆధిక్యత సాధించాలన్న అభిలాష, ఆశయం తప్పు కాదు. అది లోక క్షేమానికి దారితీయాలి. ఆ మార్గంలో ఉన్న వ్యక్తులు వివేకంతో మసలుకోవాలి. తమ శక్తియుక్తులను సమాజ శ్రేయస్సుకు ధారపోయాలి. ఇలాంటి భావనను విస్తారంగా వినియోగంలోకి

తేవాలన్న ఆధిక్యతాభిలాష ఎప్పుడూ మంచిదే. అదే సాత్వికాధిక్యత. అయితే, పరుల విశిష్టతను, ఉన్నతిని ఓర్వలేక ప్రదర్శించే ఆధిక్యత సరైనది కాదు. ఇలాంటి తామసాధిక్యత సమాజంలో భేదాలకు, ఘర్షణలకు దారితీస్తుంది. మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. సంస్కృతిని దెబ్బతీస్తుంది.


సారభూతంగా నిస్వార్థత, ప్రేమను పెంచడమే నిజమైన ఆధ్యాత్మికత. అటువంటి విధానం వ్యక్తిలో, సమాజంలో, దేశంలో పరివ్యాప్తమై పరిఢవిల్లాలి. అయితే అనేక వికృతులు విస్తరిస్తున్న ఈ కాలంలో ఇది అసాధ్యం అనిపించవచ్చు. కానీ, ఈ మార్గంలో మాత్రమే మానవాళి భవిష్యత్తు క్షేమంగా ఉండగలుగుతుంది. ఇందుకు విరుద్ధమైన విధానం వినాశనాన్ని ఆహ్వానిస్తుందన్నది కూడా

తథ్యం. ప్రస్తుత వినియోగవాద ప్రపంచంలో ఇటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచిపోషించేవి వ్యవస్థలు కాదు. నిష్పక్షపాత దార్శనికత, ధైర్యం కలిగిన బుద్ధిజీవులుగా, మేధావులైన శిష్టజనులు మాత్రమే ఈ పనిని సాకారం చేయగలరు. సమాజంలో వీరి సంఖ్య పరిమితమే కావచ్చు. కానీ, వీరంతా ఒక బలమైన వేదికగా ఏర్పడి, సాఫల్య వైఫల్యాలపై దృష్టిపెట్టక ధర్మనిష్ఠతో

ముందుకుసాగాలి. నిరంతరం ప్రజలకు మార్గదర్శనం చేస్తుండాలి.


శ్రేష్ఠజనుల ఉద్ఘోష , అచంచల ఆచరణే మానవాళికి ప్రేరణ. ఆర్ష వైదిక దర్శనం, ధర్మం, వాఙ్మయం, సంస్కృతి ఈ దిశలోనే సంప్రదాయాన్ని నిర్మించింది. స్వేచ్ఛ పేరుతో అన్ని రంగాలలో స్వార్థం, సంకుచితత్వం పెరుగుతున్న ఆధునిక సమాజంలో ఆర్షవైదిక స్ఫూర్తిని విస్ఫారింపజేయడం అత్యావశ్యకం. సంస్కారకాంతులను అన్ని దిశల నుంచి గ్రహిస్తూ తాము వికసిస్తూ, సమాజాన్నిమేల్కొలిపే శిష్టజనుల పాత్ర ఆధ్యాత్మిక శ్రేయస్సుకు శ్రీరామ రక్ష.

........


ధర్మరాజు, ఆయన తమ్ముళ్లు వనవాసం చేస్తున్నప్పుడు వాళ్లను చూడటానికి లోమశ మహర్షి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత లోమశుడు, ‘ధర్మరాజా! మీరు తీర్థయాత్రలు చెయ్యండి. మనసు కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసుకుంటూ అక్కడి స్థల విశేషాలు తెలుసుకుంటూ కాలక్షేపం చెయ్యండి. కాలం ఇట్టే గడిచిపోతుంది’ అని సలహా ఇచ్చాడు.

లోమశుడి మాట ప్రకారం కొన్నాళ్లకు పాండవులు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్లారు. అలా వెళ్లినప్పుడు వాళ్లకు గంగానది ఒడ్డున రైభ్య మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ పక్కనే భరద్వాజుని ఆశ్రమం ఉంది. భరద్వాజుడు, రైభ్యుడు మంచి స్నేహితులు. ఇద్దరూ బాగా చదువుకున్నారు. నదీ తీరాన పక్కపక్కనే ఆశ్రమాలు ఏర్పర్చుకొని నివసిస్తుండేవారు. రైభ్యుడికి ఇద్దరు కొడుకులు. వారి పేర్లు పరావసు, అర్వావసు. వాళ్లిద్దరూ కూడా చక్కగా వేదం చదువుకొని గొప్ప పండితులుగా పేరు పొందారు. భరద్వాజుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు యవక్రీతుడు. అతనికి రైభ్యుడన్నా, ఆయన కొడుకులన్నా గిట్టేది కాదు. పరావసు, అర్వావసులను చూసి యవక్రీతుడు అసూయపడేవాడు.

పరావసు, అర్వావసుల కన్నా తను గొప్పవాడు కావాలని ఇంద్రుణ్ని గురించి తపస్సు చేశాడు. నిప్పుతో ఒళ్లంతా మండించుకున్నాడు. ఇంద్రుడికి జాలి కలిగింది. భూ లోకానికి వచ్చి, ‘ఎందుకు నాయనా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు?’ అని అడిగాడు. ‘ఎవరూ చదువని వేద విద్యలన్నీ నాకు రావాలి. నేను గొప్ప పండితుణ్ని కావాలి. దానికోసం నేనీ కఠోర తపం చేస్తున్నాను. గురువు గారి దగ్గరికి పోవటం, ఆశ్రమవాసం చేయడం, కొన్నాళ్లు ఆయనకు సేవ చేయటం నాకు కుదరవు. అవేవీ లేకుండా విద్యలన్నీ క్షణాల మీద పొందటానికి ఈ తపస్సు చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి’ అని యవక్రీతుడు వేడుకున్నాడు. అది విని ఇంద్రుడు నవ్వాడు. ‘పిచ్చివాడా! నీ తెలివి అపమార్గం పట్టింది. తక్షణమే వెళ్లి గురువును ఆశ్రయించు. ఆయన దగ్గర శుశ్రూష చేసి వేద విద్యలన్నీ నేర్చుకో. గురువు వద్ద నేర్చుకుంటేనే ఎవరికైనా చదువు అబ్బుతుంది. అది లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు’ అని హితవు పలికాడు.

కానీ, యవక్రీతుడుకి ఇంద్రుడి మాటలు నచ్చలేదు. ఇంకా ఘోరమైన తపస్సుకు పూనుకున్నాడు. ఇంద్రుడు మళ్లీ వచ్చి, ‘నాయనా! మూర్ఖంగా ఏ పనీ చెయ్యకూడదు. నీ తండ్రిగారికి వేదాలు తెలుసు. ఆయన నీకు నేర్పుతారు. వెళ్లి వేదవిద్యలన్నీ నేర్చుకో. ఇలా ఒళ్లు కాల్చుకోవటం మానుకో’ అని చెప్పాడు. యవక్రీతుడికి కోపం వచ్చి, ‘నేను కోరిన వరం కనుక మీరు ఇవ్వకపోతే నా శరీరంలోని అవయవాలన్నిటినీ విరిచి ఈ అగ్నిగుండంలో పడేస్తాను’ అన్నాడు.

అలా ఉండగా ఒకనాడు యవక్రీతుడు గంగానదిలో స్నానం చెయ్యడానికి వెళ్లాడు. అక్కడ ఓ వృద్ధుడు నది ఒడ్డున కూర్చుని పిడికెడు పిడికెడు ఇసుక తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూసి యవక్రీతుడు ‘ఏం చేస్తున్నావు. తాతా?’ అని అడిగాడు. ‘గంగానది దాటడానికి వంతెన కడుతున్నా’ అన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాటలకు యవక్రీతుడు పెద్దగా నవ్వాడు. ‘వేగంగా పోయే ప్రవాహానికి ఇలా ఇసుకతో అడ్డంగా కట్టవేయడం కుదరని పని. వేరే మార్గం చూడు’ అని సలహా ఇచ్చాడు. ‘గురువు లేకుండానే, అసలు చదువకుండానే, కష్ట పడకుండానే విద్య రావాలని కొందరు ఎలా తపస్సు చేస్తున్నారో! అలాగే నేనూ గంగానదికి ఇసుకతో వంతెన కడుతున్నా’ అని వృద్ధుడు బదులు చెప్పాడు.

ఆయన ఎవరో యవక్రీతుడికి అప్పుడు అర్థమైంది! వెంటనే కాళ్లమీద పడ్డాడు. ఇంద్రుడు నవ్వుతూ యవక్రీతుడిని దగ్గరకు తీసుకుని, ‘నీ తండ్రి దగ్గర వేద విద్యలు నేర్చుకో. అనతికాలంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడివి అవుతావు’ అని ఆశీర్వదించాడు.

నాకు అవకాశం, ఆలోచనకు పదును పదవి విరమణ ( విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్, స్కూల్ 

ఎడ్యుకేషన్, హెడ ఆఫ్ ది డిపార్టుమెంటు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్)  ఆయన తర్వాతే దొరికింది: లెక్కలు చెప్పాలా, తెలుగు లో వ్రాయాలా అనే మీమాంస ఏర్పడింది . 9 సంవత్సరాలు లెక్కల మాష్టర్ గాను, గుంటూరు లో అనగా (1981 నుండి 1990) ఆ తదుపరి గ్రూపు 2బి ఎపిపిస్ రావటం హైద్రాబాద్లో స్థిరపడటం జరిగింది వివిధ అకౌంట్స్ బ్రాంచేస్ , ట్రెజరీస్  టైపిస్ట్, సీనియర్  అకౌంటెంట్,  శ్రీ.అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసితిని (03-031990 నుండి 30-06- 2019వరకు ప్డరభుత్వ ఉద్యోగము చేసితి)     అప్పుడే స్మార్టు  ఫోన్  విలువ, మెసేజ్ మేలూ  పంపడం అనేది కొద్దిగా తెలిసింది.   మా తాతగారు, నాన్న పెదనాన్నలు కవులు పండితులు వారి దారిలో నడవాలని, తెలుగుని బ్రతికించాలని సంకల్పంతో 2012 నుండి నేటి వరకు 11 బ్లాగులు, 11 పేస్ బుక్లు , వార్డ్సప్ లు ప్రాఞ్జలిప్రభగా మీకందఱకు తెలిసినదే ఇక           

 *సూన్యం కానీ స్థితి కానీ గగనం లేనీ, గాలి లేనీ వెలుతురూ చేరనీ చీకటి లేనీ, నది లేనీ,
అగ్ని లేనీ, భూమి లేనీ ఆణువణువూ ఖగోళ మేది అనంతానికి భద్రతా ?
 *. ఇది అణువు కథ, మనిజ కథ మనుగడ కథ, మాను కథ, మున్ను కథ, ఇన్ను కథ, ప్రాణి కథ, పరమాణువు కథ,  ప్రకరణ ఇది, చరిత్ర ఇది  

*. శోధన, సాధన చేసిన జ్ఞానం శాశ్వత మైనది నమ్మకం ..
ప్రశ్నించకు నిరంతరం నిజాన్ని అన్వేష ప్రయత్నం  నేను ఏర్పరుచుకున్న ప్రపంచం అవకాశం , సాధనం, సుముఖం  

*. జీవితం నాది, బతుకు నాది, మంచైనా, చెడైనా, సమయమిది కష్టమైనా, సుఖమైనా కానరానిది ...
ఇష్టమైనా, నాకిష్టమైన బతుకంది

 

ఏడు గొప్ప నేర్చుకోవడాలు :- ప్రకృతి సహజ లక్షణాలు.
1.స్త్రీ జాతి నుంచి నేర్చుకోవలసింది సహనంం, స్థిరత, దయ, లాలిత్యం
2. చిన్నవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది నిత్యనూతనత్వం, నిత్య ఉత్సాహం
3. పల్లెవాసుల నుంచి నేర్చుకోవాల్సింది నిరాడంబరత, సరళత
4. జంతు ,వృక్షాల నుంచి నేర్చుకోవలసింది మౌనం, టెలీపతి, ఆకలయినప్పుడు మాత్రమే తినడం
5. చదువులేనివాళ్ళ నుంచి నేర్చుకోవలసింది స్వచ్ఛత,వాక్శుద్ధి
6.ధ్యానుల నుంచి నేర్చుకోవలసింది త్రినేత్రం, అతీంద్రియ శక్తి
7. సూక్ష్మ లోకవాసుల నుంచి నేర్చుకోవలసింది
-

కర్మ ఫలం* ప్రాంజలి ప్రభ. కథలు 

కర్మ తలుచుకుంటే

స్నేహ మాధుర్యం*

*కర్మ ఫలం* ప్రాంజలి ప్రభ.

కర్మ తలుచుకుంటే  మనుషుల పరిస్థితిని ఎలాగైనా మారుస్తుంది

ఒక భార్యాభర్తల జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది .ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే అంతలో ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు. దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది. ఏమీ  అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి
రేపటికి మనకే పనికి వస్తాయి అన్నాడు పిసినారి భర్త. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీద అనేకసార్లు మాట మాట పెరిగి మనస్పర్ధలతో భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోయారు.

ఆ తర్వాత అతడి పరిస్థితి తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెట్టేవారు లేరు . అతను కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు
అయితే భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా జీవితం గడుపుతుంది
ఒకరోజు భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేళ ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం తిందాంలే అన్నాడు
సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త . వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది .దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టిన బిక్షగాడిని అన్నాడు.

మిత్రులారా జీవితం చాలా నేర్పిస్తుంది
నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది .అహంకారం అసలు పనికిరాదు .జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం తీసుకోదు.
ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని
నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.
అలాగే మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది.

***

ప్రాంజలి ప్రభ రోజువారి కథలు

*స్నేహ మాధుర్యం*

మనసులో రేగిన దాహాన్ని మోహం అనుకొంటే,
గుండెల్లో దాగిన దాహాన్ని స్నేహంగా చెప్పుకోవచ్చు. 'స్నేహమంటే ఎదలోని
చిరుగులను కలిపి కుట్టే దారం' అన్నాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి. అది దేవుడిచ్చే వరం. ‘దేవుని చిరునవ్వులోంచి స్నేహం పూసింది... జీవునికది చూడగానె దాహం వేసింది' అన్న రసరాజు కవితా హృదయంలోని ఆంతర్యం అదే. స్నేహానికి- నెయ్యం సఖ్యం చెలిమి కూరిమి... వంటి ఎన్నో పర్యాయ పదాలను సూచిస్తుంది నిఘంటువు. వాస్తవానికి అవన్నీ కలగలిసిందే- స్నేహం! కాబట్టే కృష్ణ నిర్యాణ వార్తను ధర్మజుడికి నివేదిస్తూ భాగవతంలో-‘మన సారథి మన సచివుడు మన వియ్యము మన సఖుండు మన బాంధవుడున్ మన విభుడు, గురువు, దేవర...' అంటూ అర్జునుడు తమ స్నేహబంధంలోని ఎన్నో కోణాలను ప్రస్తావించాడు. 'బ్రతుకునందు పెక్కు బంధాలు విలసిల్లు, శ్రేష్ఠమైనది- అందు స్నేహ నిరతి’ అని తేల్చారు నండూరి రామకృష్ణమాచార్య.
తేల్చారు నండూరి రామకృష్ణమాచార్య. దుర్మార్గుడని లోకం తీర్మానించిన దుర్యోధనుడి స్నేహ నిరతిని సైతం ప్రత్యేకించి 'శీర్ణమేఖల'లో ' ఆయన ప్రస్తుతించారు. ఏకాంతంలో తనతో కించిత్ అనుచితంగా ప్రవర్తించిన కర్ణుడిపై సుయోధనుడి భార్య భానుమతి కోపం తెచ్చుకొంటుంది. ఆ సన్నివేశంలో 'ఆగ్రహం బందిరొ రాణిగారు! క్షమకు అర్హుడు నా ప్రియమిత్రుడు' అంటూ సముదాయిస్తాడు సుయోధనుడు. నిజమైన స్నేహంలో అరమరికలకు, అపార్థాలకు తావు లేదని నిరూపించే ఘట్టమది. పాణిగ్రహణ వేళ వేదమంత్రాల్లో సైతం ప్రతిధ్వనించే గొప్ప మాట సఖ్యం.

ఆలుమగలుగానే కాదు- ప్రాణసఖులుగానూ జీవించమని సప్తపది మంత్రాల్లో వేదం ఆశీర్వదించింది. 'అనుబంధ మరందపు మధురంబు రూపము వహించినట్లు అతిభాసురమై విలసిల్లు స్నేహముల్- ప్రాణసఖులనెడు అని కవులు తీర్మానించారు. 'సృష్టిలో తీయనిది స్నేహమే' అనే మాటలో ఇన్ని అంతరార్ధాలున్నాయి.

'నవ్వునొకడు సఖుల నవ్వించునొక్కడు ముచ్చటాడునొకడు మురియునొకడు' అంటూ భాగవతంలో పోతన ఊరించిన చిలిపి బాల్యం మనలో చాలామందికి చిరస్మరణీయం. అందరి గుండెల్లోనూ అది ఆకుపచ్చని జ్ఞాపకం. అందుకే చిన్ననాటి మిత్రులు ఒకచోట చేరినప్పుడు తిరిగి పసివాళ్లయిపోతుంటారు.

చదరంగం ముగిశాక ఒకే పెట్టెలోకి చేరుకొనే బంటు మంత్రి రాజుల్లా 'హోదాలు దర్పాలు పదవులు ముసుగులు మరపించి మురిపించే..... ఆ అచ్చమైన ఆనందాన్ని జుర్రుకొనే బాల సావాస గాళ్లయిపోతారు. వయసును మరచిపోతారు. రెచ్చిపోతారు. అయితే అలా కూడి, ఎడమయ్యే ఘట్టాల్లో అందరూ పైకి నవ్వుతూనే వీడిపోతుంటారు గాని, ఎద చెలమల్లో తేమ ఊరుతూనే ఉంటుంది. ముఖ్యంగా మనుగడ మలిదశకు చేరుకున్న వయసులో 'మళ్ళీ కలుస్తామో లేదో' అనే బెంగ ఆవరించినప్పటి గుండె మూలుగులకు విశ్వకవి రవీంద్రులు అద్భుతమైన అక్షరాకృతిని ఇచ్చారు. 'నాతో మరింత సమయాన్ని గడిపి ఉండాల్సిందని నేను లేనప్పుడు నీకు తప్పకు అనిపిస్తుంది కదా మిత్రమా! అందుకని ఇప్పుడే మరికాస్సేపు నాతో ఉండరాదా! నేనిక లేనని తెలియగానే నీ కళ్లు విషాదాశ్రువులను స్నేహితులను సైతం ఏవో కారణాల వల్ల మనం అలిగి దూరం చేసుకొంటాం కదా, అప్పుడు 'నేనంటూ నివురైపోయాక నా తప్పులను క్షమిస్తావు ఎలాగూ నీవు! కానీ నాకా సంగతి తెలియదే... ఓ ప్రియమైన నేస్తమా... అదేదో నా ఊపిరి నిలిచేలోగా చేసేయరాదా? " అన్న రవీంద్రుడి కవితలోని అభ్యర్ధనను నెమరేసుకుందాం. మంచి స్నేహితులుగానే ఉందాం... జన్మ కడదాక!
ఈనాడు సంపాదకీయం


పద్యాలు

నేటి యాలోచన పద్యాలు...16/02

మల్లాప్రగడ 


మంచిని జూడక వంచనే

సంచిత భావము లేకనే

నాంచియు తెల్పుట మానకే

కంచయు చేనును మేయుటే


కొవ్వును మార్చియు కోలుకో 

పువ్వుగ శోభను పంచుకో

నవ్వుగా ఊపిరి పెంచుకో

రవ్వున సాగుట నేర్చుకో


మింటిని చేరియు మెప్పగా

అంటక మానస టంచునే 

తుంటరి చేష్టలు తోట్పడే

కంటక వర్షము కాసులే


సింగము వల్లన పోరులే

వెంగిలి యాకుల పోలికే

పొంగుచు పోరెడు ధీరుదే

సంగర ముందున సౌర్యుడే


సౌమ్యపు బుద్ధిగ శిక్షణా 

రమ్యత రాగము రక్షగా

కామ్యత భావము దీక్షగా

గమ్యము తెల్పిడి మోక్షమే


స్పందన హృద్యము లేదుగా

పొందిక లక్ష్యము కాదుగా

అందని ద్రాక్షగ నీవు యే

పొందని వాకిటి యేలనో


తే..ఇచ్ఛ నెరవేర్చుటకు సేవ ఇష్ట మవక

నిచ్చెనయు త్రాడు యున్నను నిమ్మకుండి

పైకి లాగెడి శక్తిగా పైక మన్న

త్వరిత పడకయే మాటల తత్వ బోధ


మోస రాజకీయము వల్ల మోక్ష తీర్పు

అందరూ కలసియు ఒక్క తాడు గాను

కట్టి కదలనీకయు కొట్ట కాల మిదియు

కళ్ళు తెరవకపోదాడి  కల్ల బతుకు


తప్పు చెప్పుత కాదులే తెలివి గొప్ప

చెప్పు విధివిధానము గాను చేప్ప గలరు

ముందు చిత్రాన్ని జూడుము ముఖ్య మైన

విషయమును చెప్ప గలరని విన్న వింపు


తామరాకు పైన తారట్ల నీటిలా 

రీతి గుణము నిజము రిస్కు యేల

భరిత మదియు ప్రభల బ్రాంతి తొలగ లేదు 

శ్యామ సుందరుని కళలు సాక్షి గాను


మానవ మది జన్మ మహిని మాధవలీల

మనకు బీజ ముద్ర మార్గ మగుట 

అనుభవ కళలన్ని అణుకువ గురుకృపా 

కాల మలుపు తెలుపు కావ్య లీల


ముక్తి పొంద ధరణి ముందు సేవల వల్ల

భక్తి తత్పరతల భోగ మదియు 

యుక్తి మనము గనుట యుజ్వలా కాంతిగా 

ముక్తి సంచితములు సుఖము దుఃఖ

నేటి...అటవెలది.. అలాపన..18/02


గౌరవ బ్రతుకైన గట్టి నమ్మకమైన

ప్రజలను నడిపించు ప్రాణమైన

పుడమినొక్క సారి పోగొట్టు కున్నను

చేరరావు మరల చింతలౌను


సజ్జనుల మనసు సహజమ్ము గానులే

కష్ట సమయమందు కఠినమవును

 వింతలు చిగురించి వినయమ్ము మారులే

గాలి కాకు రాలి గాయ పడుట


నిర్మల మగు నట్టి నీటిలో చూడగా

చక్కగ తన రూపు జూడ గల్గు

ఇంద్రియాల కళలు నిగ్రహ పరచుటే

జ్ఞాన నేత్రమగుట జ్ఞాన వీక్ష


మెరయు గీర్తి నిచ్చు మాన్యుల పలుకులు

రాజస మగుటేను రమ్య జీవి

ధరణి లీల గనుము ధర్మము తెలియును

జనన మరణ మున్న జన్మ నందు


ఆకలిగను వున్న యాసగా తినకుమా

అవసరమన వేళ ఆశ వలదు

నేర్పు నున్న నియమ నీడబట్టి కదులు

నిత్య సత్య మగును నీడయందు


నేటి పిల్లలేను నీతి యుక్తపరులు 

జీవిత మగు సంఘ జీవనమ్ము

దారితప్పగలగ దాత్రుత్వమగునులే 

వట్టి మాటలవవు వాడి కలము


ఇంటి వెల్గు లనిన ఇల్లాలి కళలౌను

ఇంటి విలువ లన్ని ఇంతి తలపు

ఇంటి లొసుఖమంత ఇల్లాలి ప్రతిభ తొ

ఇంటి కష్ట నష్ట ఇంతి వలనె


ప్రతిఫలము నడగక ప్రేమను పంచేది

అవనిలోన తృప్తి ఆత్మ లోన

ఋణము తీర్చగలుగు ఋషులకే తల్లిగా

జన్మ నిచ్చి శోభ జనని గాను


బ్రతుకు తెరువు నెంచ బండల రోళ్లులే

బాధ యున్న బంధ బాధ్యతగుట

తరుణి జన్మ కష్ట తత్త్వమ్ము గానులే

కన్న పేగు లాలి కాల మాయ

నేటి ఆటవెలది ఆలాపనా..19/92

మల్లా ప్రగడ 


నడక యెగుడు దిగుడు నడిపించు ప్రకృతియే

తనువు తళుకు బెళుకు తాప బతుకు

కాల మాయ లోన కలసి మెలసి బత్కు

ఆశ పాశ మేను యలక మార్చు 


కారణాన కలువ కలత చెందినహృది

కనులు తిప్పి ఒప్ప కాన లేక

ప్రేమ బాణము గతి ప్రీతి పోందను లేక 

మనసున మకులించ మంత్ర గతియు


నీటి బుడగ బతుకు నిలకడ నెన్నాళ్ళు

ఎన్ని మెరుగు లున్న యేల చెప్ప

కనుల మాయ నుండి కలతలు నెన్నాళ్లు 

చినుకు కోర నున్న చింత యేల


గాలి తాకి నంత గమనమే మారును

మంచులో తడిసిన మమత మారు

హృదయ వాంఛలన్ని హారతి సహజమే

మది తపించ గతియు మరక బతుకు


పగలు రేయి బతుకు బాధ్యతల బరువు

స్థితియు గతియు మతియు స్థిరము యేది

గుప్పెడు హృదయమ్ము గుర్తుగా పంచుటే 

మనసు తపన రక్తి మాయ యేల


ఇష్ట పడక నున్న యీశ్వర లీలన్న

ఇంతి బతుకు కడకు ఇంట చెడును

కంట నీరునున్న కనికరం కరువగు

మనిషి ధర్మమేను మనుగడ గతి


కరుణ హృదయ నిలయ కలకాలమే నీతి

తరుణ మాయ లన్ని తరిమి కొట్టు

పరుగు లెన్ని యున్న పాఠము చెప్పుటే

మరుగు పడ్డ నీతి మనసు చేర 


మాట నందు మెప్పు మాట యిష్ట మగుట 

ఇంతి నందు మాట ఇష్ట చేయు 

పలుకు నదియె గాని వాడు మదము వల్ల 

చేయు  మంచి చెడలు  చెలిమి మారు


ప్రాప్త మున్న కలుగు పాండిత్య వినయము 

పఠన శక్తి పెంచు ప్రాభవమ్ము

పుటక తోటె నొకటి పటిమతో మరొకటి

మానవకళ మేర మనసు తట్టు


మనసు తూటాల మధ్యన మనుగడయగు

కట్టడి యనుట ఎందుకు కాల మందు

మంచి మాట వినని బుద్ది మగని చేష్ట

ఇదియనే సమంజసమనే ఇంతి ఏది

పరవాలేదు. సంచీలో ఉన్నది బయటకు తీయండి. దాంతో కిందపడిందేదో తెలిసిపోతుంది కదా''

ఆ వృద్ద వడ్డీవ్యాపారి కంగారు పడ్డాడు. మింగాలేక, కక్కాలేని పరిస్థితి. లోపల ఉన్నది బయటకు తీస్తే, కింద పడ్డది తెల్ల రాయి అని నిర్ధారించినట్లే. లేదూ నల్లరాయే అంటే, తన మోసం తెల్లారిపోతుంది. ఇక ఏం చేయలేక, ఏడ్వలేక నవ్వుతూ, ఆ దుకాణదారుడి బాకీ మొత్తం రద్దు చేసి వెళ్లిపోయాడు.

నీతి ఏంటంటే.. ''ప్రతీ కష్టసమయాన్ని దాటడానికి ఓ ఉపాయం ఉంటుంది. విభిన్నంగా ఆలోచించడం ద్వారా ఆ ఉపాయం తడుతుంది. పరిస్థితులు కల్పించే అవకాశాలే కాక, మరో అవకాశం మన ఆలోచన వల్ల వస్తుంది.

ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻
సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏

ప్రాంజలి ప్రభ నేటి చందస్సు పాఠము

రచన. మల్లాప్రగడ రామకృష్ణ 


పుస్తకమ్ము పఠన పూజ్యుల వివరణ 

హస్తభూషణమ్ము కాల మార్పు 

పుస్తకమ్ము చదువు పుడమిన బతికించు 

ఙ్ఞాన వినయ మేను జ్ఞప్తి జేయు 


అక్షరాల మెరుపు ఆశయ సాధన

మరువలేని పఠన మస్తకమ్ము 

పదముల కథ  కళలు పాఠము నేర్పుటే 

విషయసంగ్రహమ్ము వినయ చరిత 


అక్షరసేద్యఫలము ఆదర్శ జీవమై 

కాల మార్పు తెల్ప కావ్య మౌను 

చరిత్రపుటల నున్న నిక్షిప్త వేదమే 

సాధనమ్ము మనసు శోధనమ్ము 


అలమటించువారి అలుపు తీర్చగలుగు 

పూజ్యనీయమైన సూత్రమౌను 

జగతి వెలుగు నింపు జాగృతిగానులే 

ప్రణయనాధమౌను ప్రతిభ బట్టి


ఆ. ఆణువణువున నున్న ఆది పురుషలీల

ఆశ పాశ మవుట అర్ధముగను

కాల నిర్ణయమ్ము కళకళ లాడించు 

తనువు లేని వాడు దైవ సముడు


ఆ..అనతి కలిగి అవధి ఆశయమగు వేళ 

సహన ముంచ గలుగు సమయ మందు

మదిమలుపు నెంచ మాయ తరుముటయు 

నియమ నిష్ఠ నెఱుప నేరమగును


తే.నాలుకనలిగి సుఖమని నమ్మ బలుకు

తేలు కుట్టిన ఆరోగ్య తీర్పు యనుచు

మేలు అనుబంధపు కలలు మించి పోవు

వేలు పెట్టి హెచ్చరికయు వింత పలుకు


చం.బతుకుటవేరు జీవికి శుభమ్ము సుఖమ్ము మనస్సు ఆటయే

వెతుకుట మాని నీదయని వేదనమౌను ఉషస్సు వల్లనే

చితికినమానసమ్ము విధి చేష్టలుగాను యశస్సు కోరికే

అతుకుల జీవమార్గము విశాల మయమ్ము తమస్సు తత్త్వమే


శా.విజ్ఞానాంజన చర్చలే విజయం విశ్వాస సాహిత్యమే 

నజ్ఞానమ్మున పాపునట్టివినయా నందమ్ము దాహమ్ముయే 

యజ్ఞానమ్మును బాపు మాత మనసే యానంద సౌలభ్యమే 

యజ్ఞానమ్మను ధ్వాంత దీపిక కథే కాలమ్ము తీర్చేనులే


శా.నీపాదమ్మున సేవగాను తపమై నిత్యమ్ము సంతృప్తినై

నీపాదార్చక నెయ్యమౌను జపమై నిర్వేద దేహమ్ము నై

పాపాలే మటుమాయమౌను దయయై పాలించు వేదపతీ

శాపాలే ఫలమై మనో విజయమై సామర్ధ్య మంతాసుధీ

నేటి ప్రాంజలి ప్రభ పద్యాలు

రచన మల్లాప్రగడ రామకృష్ణ ప్రాంజలిప్రభ

07=08=2023


స్నేహ మాధుర్యమే గతి సేవగనులె

మనసులో రేగినమమతయే మానమనులె

మోహ దాహన్ని తెలుపుటే మోక్ష మనులె

గుండె దాహాన్కి చెలిమియే గురువు పలుకె


చెలిమి యదలోన చిరుగును చింత మాపె

మనసఖుండు సచివుడుగా మనవిభు డుగె 

మన గురువు బంధు దేవర మనుగడ మతె

స్నేహ నిరతి బ్రతుకు నందు గీత పలుకు


స్నేహ మాధుర్యమే గతి సేవగనులె

మనసులో రేగినమమతయే మానమనులె

మోహ దాహన్ని తెలుపుటే మోక్ష మనులె

గుండె దాహాన్కి చెలిమియే గురువు పలుకె


కాలము మనుగడ మరుపుయు

మేలుగదినకార్య ములను మీరక నుండెన్

గాలికి తిరిగెడు మనిషిగ

యే లక్ష్యము లేని వాడె యిష్టము నాకున్


అరువు పొంది జీవితము న ఆశ చుట్టు

పరువు దక్కక భయమున భాధ పెరిగి

బరువు హృదయము తో నున్న భయము చేరి

ఎరువు పొందలేని మనిషి ఏమి చెప్ప


అరవు విద్యఆదు కొనదు నాశ్రయమున

పరువు పోగొట్టు గలదులే పరివిధాల

బరువు కాదు మాతృ తెలుగు బంధమౌను

ఎరువు లేని మొక్క గనుగా ఎదుగు విద్య


చం.అరువు గ భాషయేలయని అర్ధమనస్సు అంగ్లమాయనే

బరువు గ తప్పయీ గతియు భారము గాగ సహాయమే సుధీ

పరువు గ తెల్గు భాషగను పాఠము చెప్ప వినమ్ర విద్యగన్

యెరువు గ మారె నాంద్రకళ ఏమనిచెప్పె ద రామ మాగతీ


అరువే ఆంగ్లము యేల చెప్ప గల ఆరాధ్యమ్ము యేలా సుధీ

బరువే విద్యలు యేలమాకు బాం ధవ్యమ్ము గానే విదీ

పరువే నిల్పని భారతమ్ము కళ ప్రాధాన్యమ్ము చూపే స్థితీ

యెరువే జీవిత నాంద్ర భాషగను ఏమాయో వరించే మదీ


మల్లాప్రగడ రామకృష్ణ..పూరణ

సమస్య:

శ్రీ రామాయణ గాథ వ్రాయగ దగున్ జింతాకుపై బూర్తిగన్

శా.

యారాటం యనుటేలపోరుసలిపే యాశ్చర్య లక్ష్యమ్ముగన్

శ్రీ రామాయణమే మనో మయముగా శ్రీ పాదపూజాసుధీ

ఔరా వత్తిగనేసహాయవెలుగే వైఖ్యాన ముప్పొంగగా 

శ్రీ రామాయణ గాథ వ్రాయగదగున్ జింతాకుపై బూర్తిగన్

నేటి ప్రాంజలి ప్రభ పద్యాలు 6=08=2023

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ ప్రాంజలిప్రభ 

సీస పద్యము


పొగలును గ్రక్కకే పోలిక జేయకే

మగనిలో చూడకే మంద బుద్ది

రగులదుగుండెనే రాజ్యమునేలకే

రవ్వల వెల్గుగా రాతి బుద్ది

మిగులుగహాయివే మీదుగ కక్కకే

జిగురుగా అతికేటి జీవ బుద్ధి

పొగరుగ యాత్రలే పొందిక చూపకే

వెగత పుట్టెడిది వేగ బుద్ధి


గీ. సాహసమ్ముగన్ బ్రతుకునా సానుభూతి

సంతసమ్ముగన్ సమరము  సహన నీతి

పర్వు లెత్తగా వెతలన్ని పడక భీతి

ప్రాంజలి ఘటించి తెలపేద ప్రభల గీత

.....

సీస పద్యము


అడఁకువలేనిదై నాఱడిఁజేయకే 

నత్తమామలజూడు నయన పోరి

బడబడమాటలే భర్తనుఁగూడికే 

నయ్యడవి మృగాల నమ్మ నారి 

యంతట స్వేచ్ఛఁగ సంచరించు మగువ 

పచ్చని కాపురం పాప పోరి 

మాటిమాటికి ఆట మాటలు పొడగించు

జలధూపములువేయు జపము నారి


తే. గీ.భర్త ఆశయ మొప్పక బంధ మనుచు

చిన్నపెద్ద చూడక నుండి చింత జూపి

కనులహింసను చూపుచు కానరాక 

కాంత లాదరణీయలు గారునిజము.


.....

సీస పద్యము


చదువులుజెప్పకే చప్పబడంగనే

లోకమందున జూడు లౌక్య లలన 

విధులనుమానియే వీధికి ఎక్కకే

సమ్మెపేరుగ నీవు సరయు లలన 

కుదురుగనుండకే కూటమి పెట్టకే 

నుండనెట్టుగ లీల నురుగు లలన 

పదునుగసాగుకే భారతమందునే

జూడ సాధ్యము జాడ్య లలన


ఎంత చెప్పినా తక్కువే ఏల లలన

యెవ్వరేమన యదలోన యెరుక లలన

చెప్ప లేనిదీ నీబుద్ధి చేరు లలన

ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత

.....


3-8-2023 (గురువారం)

కవిమిత్రులారా,

ప్రాంజలి ప్రభ నేటి పద్యమాల

రచన. మల్లాప్రగడ రామకృష్ణ

కం. అమ్మను గన్నమ్మ పలుకు

కమ్మని ఊరట పిలుపుగ కావలి నెంచెన్

సమ్మతి విద్యయె సహనము

నెమ్మది హృదయము వాంఛ నీడల విధ్యే


రా. చదువు ప్రగతిగా జపము జాగ్రతి దివ్వె 

సదరు సంకృతి ప్రతిభ సాహిత్య దివ్వె

విధము ఉత్సాహ మనసు విద్యల దివ్వె

కథలు కమనీయ పద్య కావ్యము దివ్వె


తే. గీ.ఎంత చెప్పినా తక్కువ ఏమి ఒప్ప

వంత పలుకుతూ ఒప్పక వాగు విద్య

సొంత మన్నది లేనిది సొమ్ము విద్య

వింత మార్పులు తెచ్చేది వినయ విద్య


ఆ.చరిత తెలుపు కథలు చలనమై కదిలేను

మరులు గొలుపు మహిమ మనసు చేర్చి

తరుణ మందు విద్య తత్త్వమే యగుటయు

అరుణ హృదయ విద్య ఆత్మ తృప్తి


ఆ.కలలు తీర్చగలుగు కనులచూపుల విద్య

అలలు లాగ కదలి అలక మార్చు

సలప రింత తీర్చ సామరశ్యపు విద్య

పలుకు లోన మెరుపు పదవి పొందు


తెలుగు భాష వెలుగు తేటతనము తెల్పు

మలుపు లెన్నియున్న మనసు మార్చు

తలపు వలపు కులుకు తరతరాల మెరుపు

చిలక పలుకు విన్న చింత తొలగు


ఉ.మానసనేర్పుగామగువ మద్యమయుత్తమవిద్య అభ్యర్ధీ

మౌనపు నీడలే మహిళ మోక్షపు ఆశయ సాధ్య సాధ్యమే

ప్రాణము నిల్పుశక్తి సతి పాఠము చెప్పెది యుక్తి శాంతిగా

ఆనతి కోరుబేలయగు ఆత్మను పంచెడి విద్య వాహిణీ


కం.రాత్రంబవలున్ శ్రమయే

దాత్రిన సేవలమనస్సు దాపరిక ముగా

నేత్రాలు కదలిక బ్రతుకు

క్షేత్రాలను దర్శనే నిక్షేపము గానున్


కం.భావాలకు భాష్యముగా

నీ వనుకున్నాసువర్ణ నేస్తము కాదే

అవినా భావపు మానసి

వివరాలే అంకురించ వెన్నెల రాధా


ఉం.కావగనేస్తమేమనసు గర్వముగాచరియించువిద్యయే

పావనమైనవిద్యమది భావనజేయుడునిత్యతృప్తికై

కోవెల తత్వలక్ష్యముయె కోపనినాదముఆపుభక్తికై

శ్రావణమాసవైభవము రమ్యత కోరియు చేయునోములున్


ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాయల కావ్యమ్మునఁ గనరావు రసమ్ముల్”

(లేదా...)

“రాయల కావ్యమందు గనరావు రసోచిత భావసంపదల్”

కం.

మాయలు చేరవు గనుకే

కాయలుకాసే తరువలు మనసే దోచే 

సాయము మాటల బొమ్మల 

రాయల, కావ్యమ్మున గన రావు రసమ్ముల్


ఉ.మాయలు చేరవే గనుక మానస లక్ష్యము పెక్కురీతులన్ 

కాయలు కాసె పువ్వులకు కానుక  ధోరణి లేకయుండుటన్

సాయము చేయగా మనసు చాటున తోడగు తృప్తి భావ మౌ 

రా! యల కావ్యమందు గనరావు రసోచిత భావసంపదల్. 


మల్లాప్రగడ

సమస్య:  నన్ను దయ గనమని వేడె నలువ రాణి

పూరణ


ఆటయే కదరా శివా అలిగి నాను 

ఆటపాఠాల బతుకునా అనతియిది

మగువ మాయయే ప్రేమగా మస్తకమ్ము 

నన్ను దయ గనమని వేడె నలువ రాణి

మల్లాప్రగడ


ద్వికంద గర్భస్త భాస్కరవిలసిత

  వృత్తము

 భ న జ య భ న న స గ

13 యతి


భాగ్యము వలనభరించెడి భాగ్యం బాధ జయముగను భయమును చేర్చున్

యోగ్యత వలన సమంజస యోగ్యం యోని సుఖముగను యనుమతియే వై

రాగ్యము చిరునగవే జప రాగ్యం రమ్యత కలుగును రాకలు గా యా

రోగ్యము సహనము చెంతను రోగం కోపము సతతము సోధన విధ్యే 


కం.1


భాగ్యము వలనభరించెడి

భాగ్యం బాధ జయముగను భయమును చేర్చున్

యోగ్యత వలన సమంజస యోగ్యం యోని సుఖముగను యనుమతియే వై


కం.

రాగ్యము చిరునగవే జప

రాగ్యం రమ్యత కలుగును రాకలు గా యా

రోగ్యము సహనము చెంతను

రోగం కోపము సతతము సోధన విధ్యే

హృదయ పరిశుద్ధత కలిగిన దైవనామ స్మరణ, ప్రార్ధన దేహానికి ఆరోగ్యాన్ని, మనస్సుకు ఆనందాన్ని కలుగ చేయుటే బొమ్మలాట 


శ్రమజీవిగా, పిసినారిగా, భక్తుడిగా, యుక్తుడిగా, క్షేమకా రిగా, సైనికుడుగా, కార్యదక్షుడుగా, సవ్యసాచిగా, బాటసారిగా, అన్నగా, తమ్ముడుగా, తండ్రిగా, తాతగా, చెప్ప బోధలు, చేష్టలు నీవి కావు దేవుడు ఆడించే బొమ్మలాట అందరం నిమిత్తమాతృలమే.


చం.మెదడుకు వేదనమ్ముయు సమోక్షమనేటిది మార్గనేస్తమై 

అదును సకామబుద్దియు సహాయ  సమర్ధత ప్రేమ హృద్యమై 

హృదయనినాద మార్గము సహృద్యపులక్ష్య సుఖార్థ భావమై 

అదిఎవరోధమ్ముయు వినమ్ర విధాన మనస్సు పంచుటే


కాలం నీదైతే నీమాటలు వేదమే కానిచో బూతువాక్కులు సందర్బముగా ప్రవర్తన మనుష్యులను ఆడించే బొమ్మలాట తప్పోప్పులు తెలిపే హక్కు నీకెక్కడిది నీదు యుక్తి శక్తి భక్తి


చం.పెదవులు దేహకవాటము నీలపురంగగు ఆత్మ వాక్కులే 

నిదురకు దేహవాంఛలుసమీప వికర్ష ముకుందతత్వ వాక్కులే 

చదువులు కావు సంబరపు చేష్టల ఆశలు తీర్చ వాక్కులే

మధువును గ్రోలి తుమ్మెద సకామము పంచియు నిద్ర పంజరం


తే. గీ.దూరమే దగ్గరవుటకై స్ఫూర్తి యగుట

నిశ్చయానిశ్చిత పలుకు నీడ యగుట

పుణ్య పాపము విడిపోక పువ్వు లాగ

తృప్తి సంతృప్తి మధ్యన తపన జీవి


ఎవరికి ఎవరు ఏ నిముషాన ఏకమైన ఆనిముషాన అర్ధంకాని ఆవేదనకు లోనవుదురు, ఆదిఎవరివలనన్నా, దే నికన్నా అంతా యిది మార్పుకోరు, విధి విధానమని భావించాలి, దేవుడు ఆడించే బొమ్మలాట

ప్రాంజలి ప్రభ పద్య మాల 01=08=2023

రచన. మల్లాప్రగడ రామకృష్ణ 


*వ్యస్తాక్షరి -58, ఆదివారం తేదీ  జూలై 30, 2023*

*భ వ ప పు క్త త్స మ ల స శ ష ర ర్వే రు*

నా‌ సమాధానం..


*భక్త వత్సల సర్వేశ పరమ పురుష*


నా పద్య ప్రయత్నం..


తే.గీ.

*భక్త వత్సల సర్వేశ పరమ పురుష*

శక్తి నివ్వుమా సుఖదుఃఖ శాసనమగు

రక్తి జనవాంఛ లోలక రమ్య మౌను

యుక్తి మాలో నిలుపు దేవ యోగ్య మోను 


తే. గీ తొలివలపులగా కళలతో మల్లె చెండు  

రజని వెలుగుజాబిలియు రమ్యతగుండు   

తళుకు బెళుకు గాజులతొ తన్మయ ముండు  

నలుపు చీర జాకెట్టు నాణ్యత మెండు


తే. గీ లతలు ఫలములు మెండు తరులకె యివ్వు 

పృథ్వి దాహార్తి తీర్చ పదికాల కళలు 

కాలమిది చిత్రమైన సాక్షిగా గొప్ప 

రాజు పేదగా మార్చ రత్నాల దీవి


కం.వికటకవులనే జాతిది

చకిలం పలుకే కరకర చిరుహాసమనే

ఒకటీ యనకే ఆశలు

సకలమున కళలు కరువగు సాక్షి ప్రకృతియే


కం.ఏమని తెలపద వేకువ  

సముఖము సేవలుగఏల సహనం మంటి వ

శ్వము నే అయితివి విత్తువ

కామత సలుపుట విధిగను కార్యమున శివా


కం.స్నేహము మనసును చూచుట

దేహము అనుకరణ విద్య దీపము వళ్లేన్

ఆహా యను బహుచక్కగ

ఓహో మనమధ్య ప్రేమ ఓర్పును పెంచున్


పాదాంతాక్షరాలుగా  *'వ - వ - వ - వా'*  న్యస్తం చేస్తూ

శివుని స్తుతిస్తూ చంపకమాల పద్యం:


ఉ. ఆధునికం అశ్వపరుగు అమ్మది ఆత్రము నాన్న తొందరే

వేదన విద్యపొంగులగు విశ్వము విస్మయ వింతపోకడే

కాదని చెప్ప లేరెవరు కాసుల మధ్యన చిక్కిపోతిరే

చేదగు విద్య చేరువగు చిన్మయ మొందిన సెప్పలేరులే


ఉ. అక్షర అగ్రమై నిలుపు ఆశయ గౌరవ పండు వెన్నెలే

పక్షిగ సేవలేయగుట పామర బుద్ధిని మార్చగల్గుటన్

ప్రేక్షక హృద్య మవ్వుటయు ప్రీతిని పంచుట సత్యవాక్కుగా

సాక్షిగ జీవితం గడుపు స్థానబలమ్ముయు తెల్ప గల్గుటన్


చం.కరములు పట్ట కోరితిని కోపము చేసితి పాద సేవ వ

త్సరములు నిష్ఠతోడ మనసార ని నామ జపమ్ము చేసి వ

ద్దురయని ఆత్మ ఘోష విధి దోష వినాస కాలమ్ము ఏల వ

జ్జరము ధరించి భూషణము చంద్రకళాధర పాహిమాం శివా


ఓం శ్రీ రామ శ్రీ మాత్రే నమః

రా. రామ నామమే పలుకు రమ్యత చేర్చు

ప్రేమ మార్గమే తెలుపు రాముని ఓర్పు

నామ మేదైన నడక నమ్మకం నేర్పు

సామ దానమే బేధ సంస్కృతి మార్చు 


రా.మధుర సుధలుగా యదన మమతల మాయ

ఎదుట సమ్మతి విముఖ మేలనో ప్రకృతి

పొదల వలపు వసంత పోరుగా వికృతి

ఒదిగి పోయినా మనసు ఓటమే పలుకు 


తే. గీ.తలుపుల వెనుకన అడవి తపనలమది 

తలపుల వెతల ముందున తలుపులగది

వలపుల కులుకుల వరుస వదలని విధి 

మలుపుల కలలు కథలుగా మనసు పరిధి


తే. గీ. నీ భుజాలపై బరువుండె నేస్త మేను 

నీ పెదాలపై చిరునవ్వు ప్రేమ కేను 

నీ సుఖాల విషయంలొ నిజము తెలుపు 

నీదు ఆ కాల చౌకగానేను ఉండు .


తే. గీ.చూపు సైతము చేస్తాయి చురుకు దనము 

గాయమై అప్పుడప్పుడు గాధ తెలుపు 

చూసి కూడాను చెప్పక చూడనట్లు 

ముందుకు తొలగినప్పుడు ముఖ్య మౌను

రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (29)


అచలరూపుడైనా పరమేశ్వరుడు అనేకం అవ్వాలనే సంకల్పంతోటే, చలనరూపుడై చేసిన తాండవమే ఈ ప్రపంచం.


సముద్రమే అనేక కెరటాలుగా లేచి పడుతున్నట్లు -  పరమేశ్వరుడే అనేక జన్మలు ఎత్తి లయిస్తున్నాడు.


తే. గీ.నిప్పు గాలి నీరు ప్రకృతి  నేల ధారి 

సేద్య మొసగు శక్తి నిడుచు జీవ ధారి 

సహన సాక్షిగా సందర్బ చరిత ధారి 

కండ్ల కెదురు నిలచినట్టి కర్మసాక్షి!


ప్రాణులలో అంతరాత్మగా ఉన్న భగవంతుని గుర్తింపక, బాహ్యముగానున్న భేదములను దర్శించు దురభిమాని అనవరతము రాగద్వేష దూషితుడగు చుండును. అందువలన, అతడు ఇతరులను ద్వేషించు చుండును. అట్లొనర్చుట తనలోనున్న భగవంతుని ద్వేషించుటే యగును. అట్టివానికి ఎన్నడును మనశ్శాంతి లభింపదు.

చూపుల తేటగీతి మాల చదవండి.


పాపపుణ్యా లెవరుచేయు ప్రకృతి చూపు 

నిత్య పరమాత్మ చూస్తూనే నీడ చూపు 

చంద్రసూర్యుల నేత్రాలు చెలిమి చూపు 

జలజనాభుడు చూస్తునే జపము చూపు 


చూడలేదెవరని కన్య చూపు కలియు 

నాల్గుగోడల మధ్యన దాగు చూపు 

కర్మ తెలుపేటి చూపుల కంట నీరు

ప్రకృతి రూపుడు చూస్తూనె ప్రతిభ చూపు 

          

అండపిండ బ్రహ్మాండ ఆశ్రయముచూపు 

జీవు లందరి లోననూ గీత చూపు

మెలగుతువెలుగుతూ నుండుమేలు చూపు      

తానుచేసిన కర్మలె తపనచూపు


ధాత్రినెవ్వరు చూడకే ధర్మ చూపు 

మానవుడు పాపములచేయు మౌని చూపు 

జీవితములోన సుఖమనే నిప్పు చూపు 

దుష్టకృత్యములెపుడునూ దూర చూపు


మనసు నేత్రములు కలలు మాయ చూపు 

 ఉదరము కొరకు చూపెడి ఉమ్ము చూపు 

చితికి చేరేవరకు బత్కు చిన్న చూపు

బాధ పెడుతు భయ పెడుతూ బంధ చూపు 

   

ఒకరి జయము అసూయమై ఓర్పు చూపు 

ఒకరి జయము ప్రేరణ చూసి వోడ చూపు 

ఆత్మవిశ్వాసమును పొంది ఆట చూపు 

కాల నిర్ణయానికి మెచ్చు కామ్య చూపు

Friday, 21 July 2023


నేటి ఉదయం ప్రాంజలి పద్యాల మాల...10=08=2023

......

మల్లాప్రగడ రామకృష్ణ పూరణ

దత్తపది: "రోత-పాడు-చెడు-ఏవ"

పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ వేంకటేశ్వరుని దివ్య మంగళరూపాన్ని వర్ణిస్తూ స్వేచ్ఛా ఛందంలో పద్యం 


వేంకటేశ్వరో తన్మయ విద్య లేల?

నీదు మన్ననగా పాడు నియమ మేల?

బ్రోచెడు వరము లిచ్చేడి వేగమేల?

ఏవ గించకుమా మది యేల యనకు?

......


సీస పద్యము 


సర్వ సౌఖ్యము నెంచి సమరకవిత్వము

ఆర్య మన్నన కోర అలలు కవిత

కార్యక్రమం నాది కాపాడు మీరుగా

ధర్మమార్గము నెంచి ధ్యాన కవిత

మర్మము తెలవదు మాయచేయను నేను

వర్ణన తెలిపితి వరద కవిత 

కర్మను బట్టియే కదల కలుగుచుంటి

శర్మగా పయనము శాంతి కవిత


సాధు వైనమనసు శాంతిని వీడడే

మంచి చెడులు కళలు మార్పు రావు

తృణము మండి జలధి తపము పెంచగలేదు

ఆగ్రహంలోన చిత్తము ఆపగలుగు

.....

*మట్టిబండి* 

---------------

పలు వన్నెల సిరి వెన్నెల  పలికేటి బండి 

జిలుగు వెలుగు మరులగూడు గీతల బండి 

కొన కొమ్మలగల చల్లగా నొచ్చెడి బండి 

పల్లకీల నిలుప గలడు పంటల బండి 


 మెత్తని రైతు వెతలన్ని మెచ్చడి బండి 

కతలు కూర్చి కవి తీర్చెడి కలలగు బండి 

మన మనముల మలౘ గల మనసుగా బండి 

నాగభైరవుని నయనాల నాట్యమే బండి 


అదే మయసభ మట్టి బండి 


సహజ కవి.. మల్లాప్రగడ

.....

కం.పర పతి కోరుట వలదే

కరువైన మదీయభావ కామిత బుద్దిన్

చెరువే జూసియు దాహము 

పరువే పోవుటయునీకు బాధయు నాకున్

.....

ఆ. బాలభీమడతడు భాగ్యపరుడతడు 

బడికిపోవదలచి బరువు చదువు

వడివడి నడకలవి వేగకదలికయే

ముద్దు మోమునున్న మూతి మూయ

.....

ద్విపద, ఆ.వె. తే.గీ గర్భస్థ అతి వినయ వృత్తము

న న న న న స  11 యతి


అరుణ భరితమగు కళకళ కథలు మదిలో

కరుణ కనికరము విధి గతిగను తెలిపే

చరణ కమలములు కను చెరితము గనునే 

శరణమని పలుకులగు మనసున  ధరలో


ద్విపద 

అరుణ భరితమగు కళకళ కథలు 

కరుణ కనికరము విధి గతిగను 

చరణ కమలములు కను చెరితము 

శరణమని పలుకులగు మనసున  


ఆ. వె.


అరుణ భరితమగు కళకళ కథలు మది

కరుణ కనికరము విధి గతిగను తెలి

చరణ కమలములు కను చెరితము గను 

శరణమని పలుకులగు మనసున  ధర


తే. గీ.


అరుణ భరితమగు కళకళ కథలు మది 

కరుణ కనికరము విధి గతిగను తెలి

చరణ కమలములు కను చెరితము గను 

శరణమని పలుకులగు మనసున  ధర

....

సీ.మగువకు యాకార మహిమకు మొదలెద్ది?

చిగురాకు చిగురుత చరిత మెద్ది?

సుఖమని గాచిన శాంతి శోధన మెద్ది?

చిలకపలుకుల గా చెలువ మెద్ది?

పనసతొనలు కోరి పరగెడు రుచియెద్ది?

గరుకునేలయనినా గిన్నె యెద్ది?

నయనాలు చిక్కని  ననువైన బలమెద్ధి?

చెలఁగి మానము గాచెడు చెరిత పేరు?


ఉన్న మాటచేప్పదలచా ఉన్నదెద్ది?

కలలు లాగ కరిగి పోవు కాలమెద్ది?

వలకు చిక్కి నలిగి పోవు వాక్కు

ఎద్ధి ?

ప్రాంజలి ఘటించి అడిగెద ఫలము రామ ?


.....


ఇప్పుడే వ్రాసాను నాసమాధానాలు

మగడు, మెరుపు, చలము, కులుకు, కలలు, పలకు గుణము సుఖము

బలుపు, వయసు, గురక, చరిత


మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

తప్పులు తెలపండి

ఓం శ్రీ రామ.. శ్రీ మాత్రేనమః.. శ్రీ కృష్ణాయనమః 


గీ.గురువు గురువార వేళన గుర్తు చేయు

చదువు అమృతఘడియ వేళ చక్క బరుచు

సమయ సంతృప్తి సహనము సమర మైన

దక్షణామూర్తి సేవలు ధర్మ మౌను


గీ.హృదయ పరమేశ్వరునిలీల కృతులు గతులు

అగ్ని సంభవా తీతము ఆశ్రయమగు

కాలమేదాయ లేరులే కామ్యమైన

అభయ అరుణాచలేశ్వర ఆశయమిది


గీ.మనసు సంకల్పము వికల్ప మాయశక్తి

యోగ బలముచే సుఖదుఃఖ యోగ్యతయగు

సర్వవిద్యయు వాగ్దేవి సహన యుక్తి

శుభములనుసమకూర్చుపశుపతి విధియు


గీ.సన్న జాజుల నవ్వులు సమయ తృప్తి

హృదయ వాంఛ వసంతము హాయి గొలుపు

యమున జలము యదను చేరె యతుల మతియు

కృష్ణ మనసున ప్రేమయు కృపయు విధియె


ఆ.ప్రాణికోటికెల్ల బంధంబు మోక్షంబు

చేరుటకు మనసు కారణంబు

విషయసంగి కైన విను బంధ కారి ని

ర్విషయమైన ముక్తి విభవ కారి


కం.తడిపొడి వానలు తడిపే

కడవల నీరును కరువగు కలలగు భవితే

మడుగులు మలుపులు పరుగే

పుడమిన జలములు యిగురుట పుణ్యము గనుమా


కం.కులములు నెంచకముందుకు

కలకలమేలను విశాల కారుణ్య మొదలే

కళలే మార్పులు జెందును

కలవర కాలమునతోడ కథలై మారే


కం. అక్షరము గనే చిన్నది

కక్షలను మానియు ధైర్య కామ్యము జగతిన్

శిక్షణ ఇచ్చుచు నిత్యము

వీక్షణము పైన వేసియు విద్యను పంచెన్


కం. నమ్మకమేద్రోహముగా

కమ్మని మాటలకుచిక్క కాలపు తీర్పే

అమ్మను నమ్మిన వారికి

ఉమ్మడి శక్తిగను మార్చ యుత్తమ లక్ష్యం


కం హాలాహలమే మ్రింగిన 

తలపైన గంగ నెలవంక గనే నుండే

శూలము ఢమరక మొందిన్ 

ఆలికి సౌఖ్యమును పంచి నెలవేమిశివా