Saturday, 21 March 2020



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:










పుట్టిన రోజు (chandassu)

UIUUIUUU - 8 (PADMAMAALA )







పుట్టినా రోజు పండుగే

నవ్వులా పువ్వు విచ్చెనే

బంధువుల్ స్నేహితుల్

శుభా- కాంక్షలూ తెల్పెవేలగా




మబ్బులూ కమ్మినా వేళా -

వర్షమూ కుర్సినా వేళా

కోర్కలూ వెల్లువై వేళా -

శోభలే చిందులై వేళా































రమ్ము నా కిమ్ము సౌఖ్యమ్మున్

జిమ్మ పీయూషముల్ సొంపై

సొమ్ము లీ జీవితమ్ముల్ బ్రే-

మమ్ముతో నుండఁగా ధాత్రిన్




నీల మేఘమ్ము లీరాత్రిన్

నేల యాకాశమున్ జేరెన్

చాలు నీయాట మాయావీ

పుట్టినా రోజు రావేలా






దివ్య సందేశ కొల్వులే -

త్రాగి నాట్యమూ చేయుటే

సామ రస్యాను సేవలే -

శోభ కల్పించే వెల్గులే




--((*))--










*మహిళ (ఛందస్సు )




మగువ మనసు మధురత

మరులు గొలుపు చతురత

వలపు తెలుపు సముఖత

అవును అనుచు మమత




మహిళ నడక జడ జత

వగలు సెగలుల చిరుత

ముఖము పెదవి సుమలత

కురుల కదలికల మమత




పడచు పరిమళ లలిత

పరుల ఎదుట విముఖత

నయనము వలన కలత

అభిన యనముతొ మమత




చిరు నగవుతొ శుభలత

మరులు గొలుపు మదురిత

మనసు ముడిపడితె జత

వయసు వలపుతొ మమత




అనువనువు అనుకువత

చలి చినుకుల కల లత

కలసి మెలసి ముఖలత

మది తలపు తెలుపు లత

--((*))--




*వచన కవిత (చందస్సు) కొత్తవృత్తము




III-UII-UII-UI -11






1 . గురువు తల్లియు తండ్రియు ప్రేమ

అతిధి సత్యము నిత్యము ప్రేమ

కవియు వ్రాసిన పద్యము ప్రేమ

కధల జీవిత భావము ప్రేమ




2 .చెవికి చెప్పుడు మాటల యింపు

కునుకు గుప్పెడు గుండెకు సొంపు

వణకు తప్పుడు మాటల కంపు

తెలిసి తప్పులు చేయుట ముప్పు




3 .గమన ఆకృతి ప్రకృతి ఇచ్చె

జనత జీవన సుకృతి విచ్చె

సమయ సత్యము జాగృతి పంచె

విషయ వేదము జీవిత మిధ్యే




4.భయము భేదము కల్పన వల్లె

సుఖము శాంతియు నమ్మిక వల్లె

దిగులు భాధలు ఆత్మలు వల్లె

సమయ భావము అర్ధము వల్లె




5.నకలు చూపియు మోసము వద్దు

సెగలు చూపియు వేదన వద్దు

పొగలు బంధము సిద్దము వద్దు

పగలు ఎందుకు పెంచుట వద్దు




6. సతియు సేవలు చేయుట ముద్దు

పతియు ఆశలు తీర్చుట ముద్దు

మతియు ఇచ్చుట పంచుట ముద్దు

గతియు బట్టియు ఉండుట మూడు




7.తనువు తాపము శాపము కాదు

పరువు పోవుట పాపము కాదు

తగువు భోగము వల్లయు కాదు

మనువు కాలము బట్టియు కాదు




8.సుఖము పెంచును నాగరి తీరు

ముఖఃము మార్చును నాధుని తీరు

పరుల ప్రేమను పొందుట తీరు

తరుణ మాధురి సాధన తీరు




9.సహజ ధర్మము తో పని చేయు

పలుకు సత్యము గాపని చేయు

నరులు నిత్యము సాధన చేయు

వనిత కష్టము అంతము చేయు




__((*))__










వచన కవిత -2 (ఛందస్సు)

III-UII-UII-UIU -- 12

1. మనసు జబ్బుల డబ్బుల ఖర్చుయే

అలల తాకిడి సంద్రము ఖర్చుయే

విజయ తాకిడి సాహస ఖర్చుయే

జలము తాకిడి దాహము ఖర్చుయూ




2. నురగ గావెలు గూకల కాన్కుయే

బుడగ లావేరు పూవాలా కాన్కుయే

తడిక లా సమ భాగము కాన్కుయే

కలువ పువ్వులు నీటిలొ కాన్కుయే




3. మనుజ భాద్యత ప్రేమల తీరుయే

మమత భాద్యత శాంతుల తీరుయే

యువత భాద్యత విద్యల తీరుయే

కలత భాద్యత కష్టము తీరుయే




4 .ఎదురు గాలికి వేగము ఆగునా

సదరు ఖర్చులు చేసిన సాగునే

వగరు కాయలు తీపియు వేరునే

పొగరు మాటలు తోచుట వేరునే




5 .పడవ సాగుట నీటికి తెల్సునా

నడక సాగుట కాళ్లకు తెల్సునా

మునక తేలుట జీవికి తెల్సునా

అలక ఏడ్చుట నవ్వుకి తెల్సునా




6. మగువ మాటలు నమ్మిన శోభయే

వనిత వాదన విన్నను శోభయే

మహిళ మాటలు అర్ధము శోభయే

పడచు చేష్టలు ఇష్టము శోభయే




7. మరచి పోవును విన్నవి చెప్పటం

వలచి ప్రేమను పెళ్ళియు ఒప్పటం

సుఖము సత్యము భోదని తెల్పటం

వగచి ధర్మము తప్పక బ్రత్కటం




8 . జగతి కీహిత మాటలు తెల్పుతూ

మనిషి కీసమ శాంతులు తెల్పుతూ

మమత కీమను వాక్యము తెల్పుతూ

చదువు కీ సమ భావము తెల్పుమూ

-((*))--










వచన కవిత (ఛందస్సు )

UI-UI-UI-UII-IIUI -14 (KOTTA VRUTTAMU)







డబ్బు మీద ఆశ జబ్బును కొని తెచ్చు

కష్ట కాల మెప్పు డుండదు గమనించు

నమ్మ కంతొ మూగ జీవిని బతికించు

ఆశ వైపు పోక అర్థమును గ్రహించు




ఒప్పు చెప్పి నీతి వెంట నడవ వచ్చు

తప్పు చేస్తె ముప్పు వెంట నడక తంట

తప్పు ఒప్పు అందరికి తరుణ మంట

తీపి చేదు జీవి తాంతము మణి పూస




మాట మాట ఉంటె జీవితమున ముప్పు

ఆట పాట కల్పితే మనసున ఒప్పు

మాట నేర్పు తెల్పి సేవలు నువు పొందు

శ్రమ శక్తి ఉంటె మానసమున శాంతి




కన్న వారి ఆశ తీర్చుట మన వంతు

ఉన్నవారి కోరిక తీర్చుట మరొ వంతు

చిన్న పెద్ద పంతమే మనసులొ మార్పు

కాల మాయ ఎప్పుడు మనలను చూడు




విన్న నిత్య సత్య భాష ననుకరించు

కంట నీరు పెట్ట కండ అను కరించు

నువ్వు నవ్వు చూపి సంతసమున ఉంచు

శక్తి యుక్తి ముక్తి మార్గ మని తలంచు



--((*))--



s



Thursday, 19 March 2020

*🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 8 🌹*
*🌻 Chapter - ఆత్మహత్య. 🌻*
*✍️. భావనగరి*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*Q:-  మానవులకు సంకల్పస్వేచ్ఛ ఉంది కదా? అలాగే ప్రాణం తీసుకునే స్వేచ్ఛ లేదా?*

*A:-- 1) మన ఆత్మకు ఆరోగ్యకరమైన వాహనంలా ఉండాలని దేవుడు మనకి ఈ దేహమనే వాహనం ఇచ్చాడు. మనం ఆత్మహత్య చేసుకుంటే దేవుని నియమాలు ఉల్లంఘించినట్లవుతుంది, ఆయన సృష్టిలోని వారందరు ఈ నియమాలను పాటించాల్సిందే. ప్రతీ ఆత్మ వాటన్నింటికి లోబడి పనిచేస్తుంది.*

*2) ఆత్మహత్య చేసుకుంటే సృష్టి పరమ ప్రయోజనమైన ప్రాణాన్ని తీసుకున్నట్లవుతుంది. వారు ఒక ఆవరణ మొత్తం కిందికి పడిపోతారు, చెడు కర్మను ఆత్మకు ప్రోగుచేస్తారు. వారు మరల పునర్జన్మ తీసుకుని భూలోకానికి వచ్చి రెట్టింపు తీవ్రతతో అదే పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.*

*3) మనిషి తను బాధలో ఉంటే ఇతరుల గురించి ఆలోచించడు, వీరిని చూసి వీరి ప్రియతములు కూడా అంతే బాధను అనుభవిస్తుంటారు. వీరి వల్ల వారు కూడా బాధ పడతారు కాబట్టి ఆ కర్మ కూడా వీరి ఖాతాలో add ఆవుతుంది.*

*4) ప్రాణం తీసుకోవాలని అనిపించిందంటే మన ఆత్మను శక్తివంతం చేసుకోవాలని అర్థం.ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించండి, అప్పుడే కొన్ని పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయో అర్థం అవుతుంది.*

*కర్మ సిద్ధాంతం తెలుసుకోండి,అప్పుడు ఆ పరిస్థితుల్ని అంగీకరించడం, భరించడం తేలికవుతుంది. భూలోకంలో తమ బాధ్యత, ధ్యేయాన్ని నిర్వర్తించడానికి మనకు ఇచ్చిన ఈ దేహం అనే వాహనాన్ని ధ్వంసం చేసే అధికారం మనకు లేదు.*

*5) తల్లిదండ్రులుకు భయపడో, వత్తిడి వల్లో, పరీక్షలు వల్లో, కొందరి పిల్లలు లైంగిక హింస వల్లో, పిల్లలు ఆత్మహత్య కు ఉపక్రమిస్తున్నారు.*

*తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమను పంచాలి, భయాన్ని కాదు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భోధించాలి, అప్పుడే వారి మనసులో మాటని బయటకు చెప్పగలరు, ఓటమి గెలుపుకి పునాది రాయని నేర్పాలి, ఓటమి తాత్కాలికమని చెప్పాలి.*

*6) మనవల్ల ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే, అది హత్యకు సమానమైన పాపం.*

*7) ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి దృష్టి వారి వైపు తిప్పుకోడానికి ప్రయత్నించిన చాలా కిందికి పడిపోతారు.*
🌹 🌹 🌹 🌹 🌹

Speechi

*🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 9 🌹*
*🌻 Chapter - భూలోకంలో మీ ధ్యేయం. 🌻*
*✍️. భావనగరి*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*Q:--భూలోకంలో మీ ధ్యేయం ఏమిటి?*

*A:– మనకే కష్టాలు వచ్చా యని ఇంకెవరికి రాలేదని అంటాం, అవి మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం, మన ఆత్మ గట్టిపడడం కోసం వచ్చాయి అని మనం సదా గుర్తుంచుకోవాలి.*

*భూలోకంలో ప్రతి ఆత్మకు 3 ధ్యేయాలు ఉంటాయి.*

*1) ఆధ్యాత్మికంగా మెరుగవ్వడం.*
*2) నిస్వార్థంగా ఇతరుల కు సేవ చేయడం.*
*3) మన ప్రతిభ నైపుణ్యాలు ఇతరుల ఎదుగుదల కోసం ఉపయోగించడం.*
------------------------------
*🌻. 1) ఆధ్యాత్మికంగా మెరుగవ్వడం:*

*A) ఏలాంటి పరిస్తితి ఎదురైన మంచి దారిలో నడవడం.*

*B) ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జిస్తే మార్పు అంతరం నుండి వస్తుంది,అప్పుడు తప్పు ఒప్పులను వేరు చేసి చూడగలిగే విచక్షణ మనకు లభిస్తుంది.*

*C)  సద్గురువు ను ఎంచుకోవాలి,నిజమైన గురువు మన లోపల ఉన్న గురువును అనగా మన అంతర్వాణి గురించి తెలుసుకునేలా చేస్తాడు,ఎవరిపైనా ఆధారపడే లా చేయడు, భవిష్యత్ చెప్తానన్న గురువుల్ని నమ్మకండి,ఆత్మోన్నతికి మొదటి అడుగు జ్ఞానం, రెండవ అడుగు లోపాలను అంగీకరించడం.*

*🌻. 2)  రెండవ ధ్యేయం:- నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం:*

*భూలోకంలో వారందరు సేవ అన్న,భక్తి అన్న  పూజలు, వ్రతాలు, ఉత్సవాలు, పెద్దమొత్తంలో ఖర్చు పెట్టడం అనుకుంటారు, ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడితే అంత దైవ భక్తి ఉన్నట్లనుకుంటారు. కానీ నిస్వార్ధమైన సేవ, మౌనం అంటే  భక్తి, ఆడంబరాలతో ధనాన్ని ఖర్చుపెట్టడం భక్తి కాదు, మరియు మనం సాయం చేసేటప్పుడు ఏమి ఆశించకూడదు, సాయం చేస్తే లాభం వస్తుంది అని అనుకున్న క్షణంలోనే మన ఉద్దేశ్యం అపవిత్రమైపోతుంది.*

*నీవు ఆచరించే కర్మ మరొకరి జీవితంలో మార్పు కోసమై ఉండాలి, కానీ వారి జీవితంలో మార్పు నీవల్ల వస్తే దానికి గర్వం రాకుండా చూసుకోవాలి.*

*🌻. 3వ ధ్యేయం:-- ప్రతిభల్ని ఇతరుల ఎదుగుదలకు ఉపయోగించడం:*

*భూలోకంలో ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉంటుంది, అది ఎన్నో జన్మల నుండి మనం సంపాదించుకుని ఉంటాం, మనం చేసే చేడు కర్మ చెడు ఫలితాల్ని సృష్టిస్తే, మంచి కర్మ మనకు ఆధ్యాత్మిక ప్రతిభగా లభిస్తుంది. singing, dancing, వంట చేయడం, రాయడం,ఆటలాడడం, ఇలా ఏదైనా కావచ్చు,ఇవన్నీ మనకు సత్కర్మ ద్వారా మనం సంపాదించుకున్న ప్రతిభలు.*

*వీటిని మనం మానవాళికి స్వస్థత చేకూర్చడానికి, సంతోష పెట్టడానికి ఉపయోగించాలి, డబ్బులు సంపాదించడానికి ఉపయోగించ కూడదు.*

*భూలోకంలో మన ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చెయ్యకపోతే,మనం ఎంత సాధించిన వ్యర్థం, మన ప్రయాణం పూర్తవదు.*
🌹 🌹 🌹 🌹 🌹

Wednesday, 15 January 2020

అమెరికాలో, యూరఫ్, చైనా, భారత్, జపాన్లలో జరిగిన సర్వేలలో మనసు బాగున్న వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుంచి బయటపడడానికి "బలహీనతలు" పెంచుకోవడం, వాటికి బానిసలై "దురలవాట్ల" పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు.

ఇటీవలకాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, "జీవన శైలి"ని సరిదిద్దే పనిలో పడ్డారు.

అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు.

ఇది వరకు తినకూడదన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా
తినమంటున్నారు.

పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు.

ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు "వాకింగ్" ఇష్టపడితే మరికొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు "బ్రిస్క్‌వాక్" చేయాలనుకుంటే, ఇంకొందరు "స్టెయిర్ కేస్ వాక్" చేయాలనుకుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు.

ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోడానికి కారణం సరికొత్త
అధ్యయనాలలో వెలుగుచూస్తున్న అంశాలే కారణం.

ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.

* "మానసిక ఒత్తిడి" వల్ల గ్యాస్ ::

కడుపులో గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి, ముదరడానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట. "మానసిక ఒత్తిడి" వల్ల ఎక్కువ వస్తుందట !

* "ఆవేశ కావేశాల" వల్లే అధిక రక్తపోటు ::

ఉప్పు ఎక్కువగా తినే వారికంటే "ఆవేశ కావేశాలను" అదుపులో పెట్టుకోని వారిలోనే "అధిక రక్తపోటు" ఎక్కువట !

* "అతిబద్ధకం" వల్ల చెడుకోలెస్టరాల్ ::

కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడుకోలెస్టరాల్ ఎక్కువట!

* "మధుమేహం" సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే,

"అధికస్వార్ధం",

"మొండితనం" ఉన్నవారిలోనే ఎక్కువట !

* "అతి విచారం" వల్ల ఆస్త్మా ::

ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట.

* "ప్రశాంతత" లేక గుండెజబ్బులు ::

ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట.

మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు "మూల కారణాలు" తరచి చూస్తే "ఆహార అలవాట్ల" వల్లకాదని లైఫ్‌స్టయిల్ సంబంధమైనవేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం-

* 50% ఆధ్యాత్మికత లోపంవల్ల
* 25% మానసిక కారణాల
వలన
* 15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపంవల్ల,
కొత్తగా సంతరించుకున్న అలవాటు చేసుకొని మార్చుకున్న 10% శారీరక, భౌతిక జీవన శైలి రూపాల కారణాల వల్లనే
అనేకానేక కొత్త కొత్తవి చిత్రవిచిత్రమైన రోగాలు వస్తున్నాయి. అందువల్ల "కడుపు మాడ్చుకుని" ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా,"జీవన శైలి" ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని అనేక దేశాల సామాజిక మానసిక విజ్ఞాన శాస్త్రవేత్తలు తత్వవేత్తలు చెబుతున్నారు.

వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే

- స్వార్ధం,

- కోపం,

- క్రోధం,

- అశాంతి

- అసూయ

- పరుషత్వ భాషణం,

- కాఠిన్యత,

- ద్వేషం,

- శత్రుత్వం,

- వైరం,

- ఆవేశం,

- మొండితనం,

- బద్ధకం,

- తామసాహారం,

- జూదం,

- పానం,

- ఇంద్రియ లోలత్వం,

- విచారం,

- కుంగుబాటు,

వంటి *"ఆత్మ విధ్వంసక వ్యతిరేక భావాలను"* వదిలించుకోవాలి.

- కారుణ్యం,

- అహింస

- సత్య నిరతి,

- త్యాగం,

- శాంతం,

- శ్రమ,

- క్షమ,

- దయ,

- సాధన,

- భూతదయ,

- ప్రేమ,

- నిస్వార్ధం,

- స్నేహభావం,

- సేవాభావం,

- కృతజ్ఞత,

- హాస్య ప్రియత్వం,

- సంతోషం,

- ఇంద్రియ నిగ్రహం,

- సానుకూల దృక్పథాల్ని అలవరచుకోవాలి, జాగ్రత్తగా, సున్నితంగా పెంపొందించుకోవాలి.

🌹🌺🌻😍🙏🙏🙏

Sunday, 22 December 2019

[20/12, 7:24 pm] Kant's Rso: వీడు ఎక్కడున్నా వెతికి పట్టుకోండి.. డిసెంబర్ 31ఎంతో దూరం లేదు
[20/12, 7:24 pm] +91 99490 89108: నిజమే ధర్మారావు గారు, మీరు cellphone కాకుండా అశరీరవాణి పై ఎందుకు ఆధార పడటంలేదు?
[20/12, 7:27 pm] +91 99490 89108: మన ఇంటికి వాస్తు అవసరం
రాకుండా వుండాలంటే... ?
➖➖➖

*హృదయాన్ని (మెదడుని) తాకిన ఓ చక్కని కథ తప్పక మీ అందరితో పంచుకోవాలి అనిపిస్తోంది!* ✍

విశాఖపట్నం కు చెందిన మునుస్వామి వ్యాపార వేత్త, వ్యాపారం లో బాగా సంపాదించి స్థిరపడిన పెద్దమనిషి.

సంపాదించిన ఆస్తి లో కొంత భాగం తో వారు విశాఖపట్నం శివారు పల్లెటూరు లో కొంత భూమి కొని, అక్కడ ఒక
3 అంతస్తుల ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ దొడ్డి వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటితో పాటు అక్కడ ఒక  100 ఏళ్ళ నాటి పెద్ద మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడి చెట్టును చూసి ముచ్చట పడే,ఎందుకంటే ఆయన భార్యకు మామిడి పళ్ళు అంటే చెప్పలేనంత ఇష్టం.

ఆ కొత్త ఇంటికి పనులు చేయిస్తున్న సమయం లో మునుస్వామి గారి శ్రేయోభి లాషులు కొందరు, వాస్తు చూపించుకుని ఇంటికి తగిన మార్పులు చేయించు కోమని వారికి గట్టిగా సలహా ఇచ్చారు.

అయితే వాస్తు పై పెద్దగా నమ్మకం లేని వ్యక్తి మునుస్వామి గారు. అయితే ఆశ్చర్యకరం గా వారి ఆత్మ ప్రభోదం మేరకు వారు ఒక వాస్తు పండితుడ్ని సలహా కొరకు ఆరా తీసి హైదరాబాద్ నుండీ ఒకగొప్పవాస్తు విద్వాన్ ని పిలిపించారు.
ఆ వాస్తు పండితులు వైజాగ్ వచ్చాక భోజనానంతరం మునుస్వామి గారి సొంత డ్రైవింగ్ లో ఇద్దరూ వైజాగ్ శివారు స్వామి గారి తోట కు బయలుదేరారు.
వారు వెళ్తున్న దారిలో మునుస్వామి గారు కారును కొద్దిగా పక్కకు తీసి, వెనుకగా వస్తున్న కొన్ని కార్లకు దారివ్వడం చూసిన వాస్తు పండితుడు చిరునవ్వు తో "స్వామి గారూ! మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది" అన్నారు.

దానికి స్వామి గారు నవ్వుతూ"అయ్యా! వారికి ఏదో అత్యవసర పని అయి ఉండ వచ్చు, అందుకే తొందర లో వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారి ఇవ్వడం మన ధర్మం కదండీ!" అన్నారు.

అక్కడ నుండి కారు చిన గంట్యాడ అనే చిన్న పల్లెటూరు సమీపించింది.అక్కడి వీధులు చిన్నగా ఇరుకు గా ఉండడం తో స్వామి గారు కారు వేగం తగ్గించి స్లోగా నడుపుతున్నారు.

ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా పరుగెత్తాడు. గమనించిన స్వామి గారు అతడ్ని తప్పించి తన కారును మరింత నెమ్మది గా పోనిస్తున్నారు.

అది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంత లోనే మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు.

ఈసారి ఆశ్చర్య పోవడం వాస్తు పండితుని వంతైంది. ఆయన "సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడని మీరెలా ఊహించారు?" అని ప్రశ్నించారు.

స్వామి గారు నవ్వుతూ "పిల్లలెప్పుడూ అంతే కదండి! ఒకరి వెంట మరొకరు వెంట పడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా?" అన్నారు.

ఆ మాట విన్న వాస్తు పండితుడు ఆనందం గా బ్రొటన వేలు పైకెత్తి చూపిస్తూ మీరు దాన్ని ఊహించి నడపడం నిజానికి మీ గొప్ప దనం" అని స్వామి గారిని అభినందించారు.

కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది. కారు లోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా 7,8 పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఎగిరాయి! అది చూసిన స్వామిగారు, పండితుడిని ఆపి, "సర్! మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే ఆగి వెళదాం!ఏమంటారు?"అన్నారు.

"ఏమండీ ఎందుకు?"అన్నారు వాస్తు పండితుడు.

స్వామి గారు నవ్వుతూ.. . "అక్కడ దొడ్డి వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడి పళ్ళు కోస్తున్నట్లుంది.
మనం కనుక హఠాత్తు గా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టు నుండి దూకితే క్రింద పడిపోతారు. ఎందుకండీ అనవసరం గా అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది" అన్నారు.

పండితుడు కొంతసేపు మ్రాన్పడి పోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు.
"ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పు-చేర్పులు అవసరం లేదు !"

ఈసారి ఆశ్చర్య పోవడం స్వామి గారి వంతైంది... "ఏం ఎందుకండి?"

"ఏ ప్రదేశం అయినా, మీ లాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజం గానే అది ఉత్తమ మైన వాస్తు గా దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు." అన్నారు వాస్తు పండితుడు.

🌷🙏🌷

*ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల యొక్క శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో, ఆ ఫలితం లబ్ది పొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది.*

అయితే ప్రత్యేకించి 'ఎల్లప్పుడూ అన్ని
సమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే
మహోన్నతుడు,సత్పురుషుడు గా మారి పోతాడు.'

నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!

*ఇది ఓ గొప్ప వాస్తు విద్వాన్ అభిప్రాయం.

*మరి మీ అందరికీ కూడా ఇకపై మీ ఇంటికి వాస్తు పండితుని అవసరం రాకూడదని ఆశిస్తున్నా!✍

లోకాస్సమస్తా సుఖినోభవన్తు🙏🙏🙏🙏🙏🙏🙏

Tuesday, 17 December 2019

Ooo


*ఘనమైన (4)నాలుగు*

నలుగురి నాలుగు చేతులూ వెయ్యండి.
నలుగురితో నారాయణ.
నలుగురు పోయే దారిలో నడవాలి.
నలుగురూ నవ్వుతారు...
ఇవీ నిత్యం మనం వినే మాటలు.
అనే కార్థంలో
*‘నలుగురు’*.
మాటను వాడుతుంటాం.
ఇలా జన వ్యవహారంలో నాలుగు సంఖ్య తరచుగా వినిపిస్తుంది.
మనకు సంఖ్యా శాస్త్రం ఉంది.
అంకెలకు సంబంధించి నమ్మకాలు ఉన్నాయి.
కొందరు కొన్ని సంఖ్యల్ని తమకు అదృష్ట సంఖ్యలుగా భావిస్తుంటారు.

కొన్ని ప్రయోజనాలకు తమకు నచ్చిన సంఖ్య రావాలని తపన పడుతుంటారు.
ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలు ఒకదాని కంటే ఒకటి పెద్దదిగా మనం భావించినా సహజంగా అన్ని సంఖ్యలూ వాటికవే విశిష్టమైనవి.

నాలుగు సంఖ్యను చాలామంది ఉత్తమ మైనదిగా పరిగణించరు.

ఎవరి నమ్మకం ఎలా ఉన్నా నాలుగంకెకు ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది.

సృష్టికర్త బ్రహ్మను చతుర్ముఖు డన్నారు. సృష్ట్యాదిలో బ్రహ్మ నలుగురు మానస పుత్రుల్ని సృష్టించాడు.

వారే సనక,
సనందన,
సనత్కుమార,
సనత్సుజాతులు.

వేదాలు నాలుగు.
ధర్మార్థ కామమోక్షాలు నాలుగు.

పురుషార్థాలూ ఆశ్రమ విధానాలు నాలుగింటిని చెప్పారు.
అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం.

చాతుర్వర్ణ వ్యవస్థనూ వేదవాంగ్మయం పేర్కొన్నది.
యుగాలు నాలుగు - కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు.
మానవ జీవిత దశలనూ బాల్య,
యౌవన,
కౌమార,
వార్ధక్యాలనే నాలుగింటిగా విభజించారు.

దిక్కులు నాలుగు. మూలలూ నాలుగే. తూర్పు దిక్కు ఋగ్వేద సంబంధమైనది.
సూర్యోదయానికి ఆధారభూతం గనుక పూజ్యమైనది.

దక్షిణం యజుర్మంత్రాలకు, పశ్చిమం అధర్వ మంత్రాలకు స్వాభావిక మైనవని,
ఉత్తర దిక్కు సామవేద సంబంధి అని తెలిపే శ్రుతి ప్రస్తావనలున్నాయి.

మండూకోపనిషత్తులో నాలుగు అవస్థలు చెప్పారు. జాగృదవస్థలోని అనుభవాలకు కారణం జాగరిణి.
ఈ అవస్థలోని జీవాత్మ విశ్వుడు.
స్వప్నానుభవ కర్త సూక్ష్మ శరీరధారి అయిన జీవుడు.
వాడిని స్వప్నంలో ప్రేరేపించే వాడు తైజసుడు.
గాఢనిద్రను అనుభవించే సుఖజీవిని ప్రాజ్ఞుడంటారు.
ఈ అవస్థకు కారకురాలైన పరమేశ్వరి ప్రాజ్ఞ.
పై మూడు స్థితులకు అతీతమైన స్థితి
‘తుర్య’.
ఈ మూడు అవస్థల్లో లేని స్థితిని పరదేవత కలిగిస్తుందంటారు.

మైత్రి,
కరుణ,
ముదిత,
ఉపేక్ష -
నాలుగు వాసనలు.

ఇవి మనసు,
బుద్ధి,
చిత్తం,
అహంకారం అనే నాలుగు అంతఃకరణలకు సంబంధించినవి.

స్నేహితులతో మైత్రి మనసు లక్షణం.
ఆర్తులపట్ల కరుణ బుద్ధి లక్షణం.
పుణ్య కర్మల్ని ఆనందించడం చిత్త లక్షణం.
సజ్జనుల్ని బాధించడం అహంకార లక్షణం.

వాక్కుకు నాలుగు రూపాలు.
పరా,
పశ్యంతి,
మధ్యమ అనే మూడు అంతరంగంలో ఉండే వాక్కులు;
బహిర్గతమయ్యేది వైఖరి.

మృత్యువు నాలుగు రూపాలని వేదం చెబుతోంది.
అవి సూర్యుడు,
వాయువు,
అగ్ని,
చంద్రుడు.
సూర్యుడు రోజూ ఉదయ సాయంత్రాల ద్వారా ఒకరోజు జీవుల ఆయుర్దాయాన్ని గ్రహిస్తూ,
మృత్యువుకు కారణమవుతాడు.

వాయుసంచారం దేహంలో సరిగ్గా లేనప్పుడు ఊపిరి తిత్తుల వ్యాధుల ద్వారా మరణానికి అవకాశా లెక్కువ.

శరీరంలోని జఠరాగ్ని సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం జీర్ణంకాక ఆకలి దప్పులుండక చనిపోయే అవకాశమూ ఉంది.
చంద్రుడు పంటలకు కారకుడు.
పంటలు పండక పోతే ఆహారం లేక మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది.

మేఘం,
మెరుపు,
పిడుగు,
వృష్టి (వాన)-
నీటికి నాలుగు రూపాలు.

రాజ్యరక్షణకు అవసరమైన చతురంగ బలాలు -
రథ,
గజ,
తురగ,
పదాతి దళాలు.

సాలోక్య,
సామీప్య,
సారూప్య,
సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు.
సామ,
దాన,
భేద,
దండోపాయాలు రాజనీతికి సంబంధించిన చతురోపాయాలు.

ఇలా చెప్పుకొంటూపోతే ఇంకా ఎన్నో...
అందుకే నాలుగంకె (4) ఘనమైనదే!

🌹👏🏾🌷
----------


🙏🤝మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు🙏

🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .
🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
 🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
 🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
 🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
 🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు 👋.
🚩🙏🙏🙏🚩