Monday, 13 April 2020




 నేటి గీతం -కరోనా గీతం

వద్దు వద్దంటే ఇంగ్లీష్ లో చదివావు
మాలో ఆశలు పెంచి దూరమెళ్ళావు
ఉద్యోగం ఊడింద ని తెల్పావు
మాతృభూమి లో మాతృభాష లో
చదివితే ఈ కష్టాలు వచ్చేవి కావు

మూతికి గుడ్డ లే కరువాయై
ముప్పూటల తిండి లేదాయే
ఖాళీ రోడ్డు లా బతుకాయే
కదిలి ఆకలి తీర్చు కుందామంటే
రక్షక భటులు దెబ్బ లాయే

ఏల బతి కేది మేము, మాకు రక్షణ ఏది

నిదరేమో రాక భయమాయే
కాల నిర్ణయం తెలియదియే

ఉడుకెంతో ఆవిరాయే
చెమటలలో చిందాయే
భయము గుప్పిటాయే
ముప్పేమో ముందాయే
దోమలకేమో విందాయే

ఎలా బతికేది మేము మాకు రక్షణ ఏది

మనసు మనది కాదాయే
బతుకంతా వేటాయే
మందేమో బందాయే
అడిగే దిక్కు లేదాయే

ఆశేమో పోదాయే
పనిచేద్దామంటే లేదాయే
పైసేమో దొర్క దాయే

తల్లి తండ్రులారా తెలుగు భాష ను
గౌరవించండి, మనది కాని భాషలో
చదివించి ఇప్పుడు బాధ పడితే
ప్రయోజనం లేదండి
అన్నీ రోజులు మనవి కావండి

ఎలా బతికేది మాకు రక్షణ ఏది

--(())++
 
 102

📣🛎️🔔*ఒక ముఖ్య ప్రకటన* 🔔🛎️📢
-------------------
కరోనా రక్కసి విశ్వ వ్యాప్తంగా విజృంభించి, వికటాట్టహాసం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం సర్వ జన విదితమే.
ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి తమ వంతుగా *మహిళా సంఘాలన్నీ* ఒక్కటై ఏక కంఠంతో గృహ నిర్వహణకు సంబంధించి ఈ క్రింద తెలిపిన *నిర్ణయాలను* తీసుకున్నాయి.
1. ఇహ నుండి అత్యవసర సేవలకు మాత్రమే వంటగది తెరవడం జరుగుతుంది.
ఇంటి సభ్యులు *మాటి మాటికి తీసి తినుబండారాలకోసం వెతక రాదు*.
వంటగది *నిర్వహణ కమిటీ చైర్మన్* కి మాత్రమే వంట గదిని తీసే అధికారం ఉంది.  (ఇది *ఏక సభ్య కమిటీ*. దీనికి గృహ *యజమానురాలు* చైర్మన్ గా ఉంటుంది).

*అత్యవసర సేవలనగా*......,,,

అ) ఉదయం *అల్పాహారం*
 (పూరీలు, చపాతీలు, గారెలు, వడలు, దోశలు, పునుగులు వంటి నూనె వంటకాలు *నిషిద్దం*.
--- సభ్యుల *ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని*......ఇడ్లీ, ఉప్మా, టొమాటో బాత్, కట్టె పొంగలి వంటి *తేలిక గా జీర్ణమయ్యే* వాటిని మాత్రమే అందించడం జరుగుతుంది).

ఆ) మధ్యాహ్నం *లంచ్*
 (ఒక పప్పు కూర, కూరగాయల లభ్యతను బట్టి మరో కూర/ గుడ్డు, మజ్జిగ. పాలకు ఇబ్బంది లేకపోతే *పరిస్థితులను బట్టి పెరుగు* ను అందించే అవకాశం లేకపోలేదు).
 ఇ) రాత్రి *డిన్నర్* :
ఇది చాలా *తేలిక* (light) గా వుంటుంది (సభ్యులకు physical work ఎక్కువగా ఉండదు కనుక).
*అల్పాహారం లో ఉటంకించినవి* లేదా *పండ్లు* (రెండూ కాదు. *ఏవో ఒకటే*). పరిస్థితులను బట్టి ఒక్కోసారి డిన్నర్ *skip* చేసే అవకాశం కూడా ఉంది.
(పైవన్నియు *పరిమిత పరిమాణాల్లో* మాత్రమే అందించ బడతాయి.

ఈ) *ఇంత క్రితంలా* సాయంత్రం 4 గం. లకు శ్నాక్స్ సర్వ్ చేయబడవు. చిన్న పిల్లలకు *బిస్కెట్స్* మాత్రమే ఇవ్వబడతాయి (పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, కేక్ లు *బంద్*)

ఉ) *కాఫీ/ టీ లు* రోజుకు రెండు సార్లు మాత్రమే(అల్పాహారం తర్వాత ఒకసారి, సాయంత్రం ఒకసారి).

*ముఖ్య గమనిక*:
ఈ లాక్ డౌన్ మరికొన్ని వారాలు *పొడిగించిన* పక్షంలో పై సేవలలో కొన్నింటిని పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ *రద్దుచేసే* అవకాశం ఉంది. 
2. భోజన సమయం లో ఆయా వంటకాలకు సంబంధించి రుచి, నాణ్యత మరియు పరిమాణాల వంటి అంశాలకు సంబంధించి *ఎలాంటి చర్చలు అనుమతించబడవు*.

3. ఏ విషయంలో నైనా *తుది నిర్ణయం కమిటీ చైర్మన్ దే*. సభ్యులు ఎలాంటి సూచనలు ఇచ్చినా వాటిని పరిగణించే అవకాశం చాలా తక్కువ. కనుక భేషజాలకు పోకుండా *(నీలగకుండా)* సభ్యులు సహకరించ గలరు.

4. ఈ నిర్ణయాలన్నీ *తక్షణమే అమలు* లోకి వస్తాయి.
మీ (మన) క్షేమమే మా ధ్యేయం మరియు తక్షణ అవసరం.

ఇట్లు
*ప్రపంచ గృహ/వంట గది నిర్వహణ సంఘం* 🙏🏼🙏🏼
                    😃😃😃😃😃

101


మ
మహా మహులను అందరినీ ఒక్క నిముషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి  కథ:
 మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది. తన పేరు బర్బరీకుడు. బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి. తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు. వాళ్ల కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు మురు బిడ్డ మౌర్విని (అహిలావతి) పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు. నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని. అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లాయి. తను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు. దేవీ ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది. ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అంటారు. పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక, భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ, బర్బరీకుడు ఆ యుద్దాన్ని చూడాలని కోరుకుంటాడు. వెళ్లే ముందు తల్లికి ఓ మాట ఇస్తాడు. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను. ఓడిపోయేవారిని గెలిపిస్తాను అని. తర్వాత తన ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడినీ శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు? ఇదీ ప్రశ్న. 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు. ఇలా తలా ఓ రకంగా చెబుతారు. దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు శ్రీకృష్ణుడు. ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా? అని అడుగుతాడు. నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఒక్కక్షణం దిగ్భాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు. నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని, వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది. (టార్గెట్స్ ను ఐడెంటిఫై చేస్తుంది. రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది. మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి, మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు. నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవరూ దీన్ని నమ్మరు, నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు. చాలా సులభం అంటాడు బర్బరీకుడు. చేసి చూపించు అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది. అందుకే అదక్కడకు వచ్చింది. నీ పాదం తీసివేయి. లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు. తప్పనిసరై పాదం తీసేస్తాడు. మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. (రక్షింపబడాల్సినవి). తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు. బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవపక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేననీ గుర్తించి కలవరపడతాడు. ఒకవేళ భీముడి మనమడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్యదృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకుని ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు. ఏమోయీ, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా? అని అడుగుతాడు. నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను. పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు. అంటే పాండవులే బలహీనులు కదా. అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు. కౌరవులు బలహీనులు అవుతారు కదా. అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దాని వల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా. మరేం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ. విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది. శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా. ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా. ఇంత భారీ జనహనన యుద్దాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి? ఇంతమంది యోధులు ఉండగా. పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. బర్బరీకా నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి శ్రీమహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నోచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలి.  అంతేకాదు నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్దాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు. వత్సా! ఈ మొత్తం యుద్దంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే, నువ్వు చెప్పు ఏం గమనించావో? స్వామీ! ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే. యుద్ద కారకులు, యుద్ధకర్తలు, మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్ష రూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ. 🙏🙏🙏

Saturday, 21 March 2020



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:










పుట్టిన రోజు (chandassu)

UIUUIUUU - 8 (PADMAMAALA )







పుట్టినా రోజు పండుగే

నవ్వులా పువ్వు విచ్చెనే

బంధువుల్ స్నేహితుల్

శుభా- కాంక్షలూ తెల్పెవేలగా




మబ్బులూ కమ్మినా వేళా -

వర్షమూ కుర్సినా వేళా

కోర్కలూ వెల్లువై వేళా -

శోభలే చిందులై వేళా































రమ్ము నా కిమ్ము సౌఖ్యమ్మున్

జిమ్మ పీయూషముల్ సొంపై

సొమ్ము లీ జీవితమ్ముల్ బ్రే-

మమ్ముతో నుండఁగా ధాత్రిన్




నీల మేఘమ్ము లీరాత్రిన్

నేల యాకాశమున్ జేరెన్

చాలు నీయాట మాయావీ

పుట్టినా రోజు రావేలా






దివ్య సందేశ కొల్వులే -

త్రాగి నాట్యమూ చేయుటే

సామ రస్యాను సేవలే -

శోభ కల్పించే వెల్గులే




--((*))--










*మహిళ (ఛందస్సు )




మగువ మనసు మధురత

మరులు గొలుపు చతురత

వలపు తెలుపు సముఖత

అవును అనుచు మమత




మహిళ నడక జడ జత

వగలు సెగలుల చిరుత

ముఖము పెదవి సుమలత

కురుల కదలికల మమత




పడచు పరిమళ లలిత

పరుల ఎదుట విముఖత

నయనము వలన కలత

అభిన యనముతొ మమత




చిరు నగవుతొ శుభలత

మరులు గొలుపు మదురిత

మనసు ముడిపడితె జత

వయసు వలపుతొ మమత




అనువనువు అనుకువత

చలి చినుకుల కల లత

కలసి మెలసి ముఖలత

మది తలపు తెలుపు లత

--((*))--




*వచన కవిత (చందస్సు) కొత్తవృత్తము




III-UII-UII-UI -11






1 . గురువు తల్లియు తండ్రియు ప్రేమ

అతిధి సత్యము నిత్యము ప్రేమ

కవియు వ్రాసిన పద్యము ప్రేమ

కధల జీవిత భావము ప్రేమ




2 .చెవికి చెప్పుడు మాటల యింపు

కునుకు గుప్పెడు గుండెకు సొంపు

వణకు తప్పుడు మాటల కంపు

తెలిసి తప్పులు చేయుట ముప్పు




3 .గమన ఆకృతి ప్రకృతి ఇచ్చె

జనత జీవన సుకృతి విచ్చె

సమయ సత్యము జాగృతి పంచె

విషయ వేదము జీవిత మిధ్యే




4.భయము భేదము కల్పన వల్లె

సుఖము శాంతియు నమ్మిక వల్లె

దిగులు భాధలు ఆత్మలు వల్లె

సమయ భావము అర్ధము వల్లె




5.నకలు చూపియు మోసము వద్దు

సెగలు చూపియు వేదన వద్దు

పొగలు బంధము సిద్దము వద్దు

పగలు ఎందుకు పెంచుట వద్దు




6. సతియు సేవలు చేయుట ముద్దు

పతియు ఆశలు తీర్చుట ముద్దు

మతియు ఇచ్చుట పంచుట ముద్దు

గతియు బట్టియు ఉండుట మూడు




7.తనువు తాపము శాపము కాదు

పరువు పోవుట పాపము కాదు

తగువు భోగము వల్లయు కాదు

మనువు కాలము బట్టియు కాదు




8.సుఖము పెంచును నాగరి తీరు

ముఖఃము మార్చును నాధుని తీరు

పరుల ప్రేమను పొందుట తీరు

తరుణ మాధురి సాధన తీరు




9.సహజ ధర్మము తో పని చేయు

పలుకు సత్యము గాపని చేయు

నరులు నిత్యము సాధన చేయు

వనిత కష్టము అంతము చేయు




__((*))__










వచన కవిత -2 (ఛందస్సు)

III-UII-UII-UIU -- 12

1. మనసు జబ్బుల డబ్బుల ఖర్చుయే

అలల తాకిడి సంద్రము ఖర్చుయే

విజయ తాకిడి సాహస ఖర్చుయే

జలము తాకిడి దాహము ఖర్చుయూ




2. నురగ గావెలు గూకల కాన్కుయే

బుడగ లావేరు పూవాలా కాన్కుయే

తడిక లా సమ భాగము కాన్కుయే

కలువ పువ్వులు నీటిలొ కాన్కుయే




3. మనుజ భాద్యత ప్రేమల తీరుయే

మమత భాద్యత శాంతుల తీరుయే

యువత భాద్యత విద్యల తీరుయే

కలత భాద్యత కష్టము తీరుయే




4 .ఎదురు గాలికి వేగము ఆగునా

సదరు ఖర్చులు చేసిన సాగునే

వగరు కాయలు తీపియు వేరునే

పొగరు మాటలు తోచుట వేరునే




5 .పడవ సాగుట నీటికి తెల్సునా

నడక సాగుట కాళ్లకు తెల్సునా

మునక తేలుట జీవికి తెల్సునా

అలక ఏడ్చుట నవ్వుకి తెల్సునా




6. మగువ మాటలు నమ్మిన శోభయే

వనిత వాదన విన్నను శోభయే

మహిళ మాటలు అర్ధము శోభయే

పడచు చేష్టలు ఇష్టము శోభయే




7. మరచి పోవును విన్నవి చెప్పటం

వలచి ప్రేమను పెళ్ళియు ఒప్పటం

సుఖము సత్యము భోదని తెల్పటం

వగచి ధర్మము తప్పక బ్రత్కటం




8 . జగతి కీహిత మాటలు తెల్పుతూ

మనిషి కీసమ శాంతులు తెల్పుతూ

మమత కీమను వాక్యము తెల్పుతూ

చదువు కీ సమ భావము తెల్పుమూ

-((*))--










వచన కవిత (ఛందస్సు )

UI-UI-UI-UII-IIUI -14 (KOTTA VRUTTAMU)







డబ్బు మీద ఆశ జబ్బును కొని తెచ్చు

కష్ట కాల మెప్పు డుండదు గమనించు

నమ్మ కంతొ మూగ జీవిని బతికించు

ఆశ వైపు పోక అర్థమును గ్రహించు




ఒప్పు చెప్పి నీతి వెంట నడవ వచ్చు

తప్పు చేస్తె ముప్పు వెంట నడక తంట

తప్పు ఒప్పు అందరికి తరుణ మంట

తీపి చేదు జీవి తాంతము మణి పూస




మాట మాట ఉంటె జీవితమున ముప్పు

ఆట పాట కల్పితే మనసున ఒప్పు

మాట నేర్పు తెల్పి సేవలు నువు పొందు

శ్రమ శక్తి ఉంటె మానసమున శాంతి




కన్న వారి ఆశ తీర్చుట మన వంతు

ఉన్నవారి కోరిక తీర్చుట మరొ వంతు

చిన్న పెద్ద పంతమే మనసులొ మార్పు

కాల మాయ ఎప్పుడు మనలను చూడు




విన్న నిత్య సత్య భాష ననుకరించు

కంట నీరు పెట్ట కండ అను కరించు

నువ్వు నవ్వు చూపి సంతసమున ఉంచు

శక్తి యుక్తి ముక్తి మార్గ మని తలంచు



--((*))--



s



Thursday, 19 March 2020

*🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 8 🌹*
*🌻 Chapter - ఆత్మహత్య. 🌻*
*✍️. భావనగరి*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*Q:-  మానవులకు సంకల్పస్వేచ్ఛ ఉంది కదా? అలాగే ప్రాణం తీసుకునే స్వేచ్ఛ లేదా?*

*A:-- 1) మన ఆత్మకు ఆరోగ్యకరమైన వాహనంలా ఉండాలని దేవుడు మనకి ఈ దేహమనే వాహనం ఇచ్చాడు. మనం ఆత్మహత్య చేసుకుంటే దేవుని నియమాలు ఉల్లంఘించినట్లవుతుంది, ఆయన సృష్టిలోని వారందరు ఈ నియమాలను పాటించాల్సిందే. ప్రతీ ఆత్మ వాటన్నింటికి లోబడి పనిచేస్తుంది.*

*2) ఆత్మహత్య చేసుకుంటే సృష్టి పరమ ప్రయోజనమైన ప్రాణాన్ని తీసుకున్నట్లవుతుంది. వారు ఒక ఆవరణ మొత్తం కిందికి పడిపోతారు, చెడు కర్మను ఆత్మకు ప్రోగుచేస్తారు. వారు మరల పునర్జన్మ తీసుకుని భూలోకానికి వచ్చి రెట్టింపు తీవ్రతతో అదే పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.*

*3) మనిషి తను బాధలో ఉంటే ఇతరుల గురించి ఆలోచించడు, వీరిని చూసి వీరి ప్రియతములు కూడా అంతే బాధను అనుభవిస్తుంటారు. వీరి వల్ల వారు కూడా బాధ పడతారు కాబట్టి ఆ కర్మ కూడా వీరి ఖాతాలో add ఆవుతుంది.*

*4) ప్రాణం తీసుకోవాలని అనిపించిందంటే మన ఆత్మను శక్తివంతం చేసుకోవాలని అర్థం.ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించండి, అప్పుడే కొన్ని పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయో అర్థం అవుతుంది.*

*కర్మ సిద్ధాంతం తెలుసుకోండి,అప్పుడు ఆ పరిస్థితుల్ని అంగీకరించడం, భరించడం తేలికవుతుంది. భూలోకంలో తమ బాధ్యత, ధ్యేయాన్ని నిర్వర్తించడానికి మనకు ఇచ్చిన ఈ దేహం అనే వాహనాన్ని ధ్వంసం చేసే అధికారం మనకు లేదు.*

*5) తల్లిదండ్రులుకు భయపడో, వత్తిడి వల్లో, పరీక్షలు వల్లో, కొందరి పిల్లలు లైంగిక హింస వల్లో, పిల్లలు ఆత్మహత్య కు ఉపక్రమిస్తున్నారు.*

*తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమను పంచాలి, భయాన్ని కాదు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భోధించాలి, అప్పుడే వారి మనసులో మాటని బయటకు చెప్పగలరు, ఓటమి గెలుపుకి పునాది రాయని నేర్పాలి, ఓటమి తాత్కాలికమని చెప్పాలి.*

*6) మనవల్ల ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే, అది హత్యకు సమానమైన పాపం.*

*7) ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి దృష్టి వారి వైపు తిప్పుకోడానికి ప్రయత్నించిన చాలా కిందికి పడిపోతారు.*
🌹 🌹 🌹 🌹 🌹

Speechi

*🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 9 🌹*
*🌻 Chapter - భూలోకంలో మీ ధ్యేయం. 🌻*
*✍️. భావనగరి*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*Q:--భూలోకంలో మీ ధ్యేయం ఏమిటి?*

*A:– మనకే కష్టాలు వచ్చా యని ఇంకెవరికి రాలేదని అంటాం, అవి మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం, మన ఆత్మ గట్టిపడడం కోసం వచ్చాయి అని మనం సదా గుర్తుంచుకోవాలి.*

*భూలోకంలో ప్రతి ఆత్మకు 3 ధ్యేయాలు ఉంటాయి.*

*1) ఆధ్యాత్మికంగా మెరుగవ్వడం.*
*2) నిస్వార్థంగా ఇతరుల కు సేవ చేయడం.*
*3) మన ప్రతిభ నైపుణ్యాలు ఇతరుల ఎదుగుదల కోసం ఉపయోగించడం.*
------------------------------
*🌻. 1) ఆధ్యాత్మికంగా మెరుగవ్వడం:*

*A) ఏలాంటి పరిస్తితి ఎదురైన మంచి దారిలో నడవడం.*

*B) ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జిస్తే మార్పు అంతరం నుండి వస్తుంది,అప్పుడు తప్పు ఒప్పులను వేరు చేసి చూడగలిగే విచక్షణ మనకు లభిస్తుంది.*

*C)  సద్గురువు ను ఎంచుకోవాలి,నిజమైన గురువు మన లోపల ఉన్న గురువును అనగా మన అంతర్వాణి గురించి తెలుసుకునేలా చేస్తాడు,ఎవరిపైనా ఆధారపడే లా చేయడు, భవిష్యత్ చెప్తానన్న గురువుల్ని నమ్మకండి,ఆత్మోన్నతికి మొదటి అడుగు జ్ఞానం, రెండవ అడుగు లోపాలను అంగీకరించడం.*

*🌻. 2)  రెండవ ధ్యేయం:- నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం:*

*భూలోకంలో వారందరు సేవ అన్న,భక్తి అన్న  పూజలు, వ్రతాలు, ఉత్సవాలు, పెద్దమొత్తంలో ఖర్చు పెట్టడం అనుకుంటారు, ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడితే అంత దైవ భక్తి ఉన్నట్లనుకుంటారు. కానీ నిస్వార్ధమైన సేవ, మౌనం అంటే  భక్తి, ఆడంబరాలతో ధనాన్ని ఖర్చుపెట్టడం భక్తి కాదు, మరియు మనం సాయం చేసేటప్పుడు ఏమి ఆశించకూడదు, సాయం చేస్తే లాభం వస్తుంది అని అనుకున్న క్షణంలోనే మన ఉద్దేశ్యం అపవిత్రమైపోతుంది.*

*నీవు ఆచరించే కర్మ మరొకరి జీవితంలో మార్పు కోసమై ఉండాలి, కానీ వారి జీవితంలో మార్పు నీవల్ల వస్తే దానికి గర్వం రాకుండా చూసుకోవాలి.*

*🌻. 3వ ధ్యేయం:-- ప్రతిభల్ని ఇతరుల ఎదుగుదలకు ఉపయోగించడం:*

*భూలోకంలో ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉంటుంది, అది ఎన్నో జన్మల నుండి మనం సంపాదించుకుని ఉంటాం, మనం చేసే చేడు కర్మ చెడు ఫలితాల్ని సృష్టిస్తే, మంచి కర్మ మనకు ఆధ్యాత్మిక ప్రతిభగా లభిస్తుంది. singing, dancing, వంట చేయడం, రాయడం,ఆటలాడడం, ఇలా ఏదైనా కావచ్చు,ఇవన్నీ మనకు సత్కర్మ ద్వారా మనం సంపాదించుకున్న ప్రతిభలు.*

*వీటిని మనం మానవాళికి స్వస్థత చేకూర్చడానికి, సంతోష పెట్టడానికి ఉపయోగించాలి, డబ్బులు సంపాదించడానికి ఉపయోగించ కూడదు.*

*భూలోకంలో మన ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చెయ్యకపోతే,మనం ఎంత సాధించిన వ్యర్థం, మన ప్రయాణం పూర్తవదు.*
🌹 🌹 🌹 🌹 🌹

Wednesday, 15 January 2020

అమెరికాలో, యూరఫ్, చైనా, భారత్, జపాన్లలో జరిగిన సర్వేలలో మనసు బాగున్న వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుంచి బయటపడడానికి "బలహీనతలు" పెంచుకోవడం, వాటికి బానిసలై "దురలవాట్ల" పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు.

ఇటీవలకాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, "జీవన శైలి"ని సరిదిద్దే పనిలో పడ్డారు.

అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు.

ఇది వరకు తినకూడదన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా
తినమంటున్నారు.

పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు.

ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు "వాకింగ్" ఇష్టపడితే మరికొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు "బ్రిస్క్‌వాక్" చేయాలనుకుంటే, ఇంకొందరు "స్టెయిర్ కేస్ వాక్" చేయాలనుకుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు.

ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోడానికి కారణం సరికొత్త
అధ్యయనాలలో వెలుగుచూస్తున్న అంశాలే కారణం.

ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.

* "మానసిక ఒత్తిడి" వల్ల గ్యాస్ ::

కడుపులో గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి, ముదరడానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట. "మానసిక ఒత్తిడి" వల్ల ఎక్కువ వస్తుందట !

* "ఆవేశ కావేశాల" వల్లే అధిక రక్తపోటు ::

ఉప్పు ఎక్కువగా తినే వారికంటే "ఆవేశ కావేశాలను" అదుపులో పెట్టుకోని వారిలోనే "అధిక రక్తపోటు" ఎక్కువట !

* "అతిబద్ధకం" వల్ల చెడుకోలెస్టరాల్ ::

కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడుకోలెస్టరాల్ ఎక్కువట!

* "మధుమేహం" సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే,

"అధికస్వార్ధం",

"మొండితనం" ఉన్నవారిలోనే ఎక్కువట !

* "అతి విచారం" వల్ల ఆస్త్మా ::

ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట.

* "ప్రశాంతత" లేక గుండెజబ్బులు ::

ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట.

మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు "మూల కారణాలు" తరచి చూస్తే "ఆహార అలవాట్ల" వల్లకాదని లైఫ్‌స్టయిల్ సంబంధమైనవేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం-

* 50% ఆధ్యాత్మికత లోపంవల్ల
* 25% మానసిక కారణాల
వలన
* 15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపంవల్ల,
కొత్తగా సంతరించుకున్న అలవాటు చేసుకొని మార్చుకున్న 10% శారీరక, భౌతిక జీవన శైలి రూపాల కారణాల వల్లనే
అనేకానేక కొత్త కొత్తవి చిత్రవిచిత్రమైన రోగాలు వస్తున్నాయి. అందువల్ల "కడుపు మాడ్చుకుని" ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా,"జీవన శైలి" ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని అనేక దేశాల సామాజిక మానసిక విజ్ఞాన శాస్త్రవేత్తలు తత్వవేత్తలు చెబుతున్నారు.

వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే

- స్వార్ధం,

- కోపం,

- క్రోధం,

- అశాంతి

- అసూయ

- పరుషత్వ భాషణం,

- కాఠిన్యత,

- ద్వేషం,

- శత్రుత్వం,

- వైరం,

- ఆవేశం,

- మొండితనం,

- బద్ధకం,

- తామసాహారం,

- జూదం,

- పానం,

- ఇంద్రియ లోలత్వం,

- విచారం,

- కుంగుబాటు,

వంటి *"ఆత్మ విధ్వంసక వ్యతిరేక భావాలను"* వదిలించుకోవాలి.

- కారుణ్యం,

- అహింస

- సత్య నిరతి,

- త్యాగం,

- శాంతం,

- శ్రమ,

- క్షమ,

- దయ,

- సాధన,

- భూతదయ,

- ప్రేమ,

- నిస్వార్ధం,

- స్నేహభావం,

- సేవాభావం,

- కృతజ్ఞత,

- హాస్య ప్రియత్వం,

- సంతోషం,

- ఇంద్రియ నిగ్రహం,

- సానుకూల దృక్పథాల్ని అలవరచుకోవాలి, జాగ్రత్తగా, సున్నితంగా పెంపొందించుకోవాలి.

🌹🌺🌻😍🙏🙏🙏

Sunday, 22 December 2019

[20/12, 7:24 pm] Kant's Rso: వీడు ఎక్కడున్నా వెతికి పట్టుకోండి.. డిసెంబర్ 31ఎంతో దూరం లేదు
[20/12, 7:24 pm] +91 99490 89108: నిజమే ధర్మారావు గారు, మీరు cellphone కాకుండా అశరీరవాణి పై ఎందుకు ఆధార పడటంలేదు?
[20/12, 7:27 pm] +91 99490 89108: మన ఇంటికి వాస్తు అవసరం
రాకుండా వుండాలంటే... ?
➖➖➖

*హృదయాన్ని (మెదడుని) తాకిన ఓ చక్కని కథ తప్పక మీ అందరితో పంచుకోవాలి అనిపిస్తోంది!* ✍

విశాఖపట్నం కు చెందిన మునుస్వామి వ్యాపార వేత్త, వ్యాపారం లో బాగా సంపాదించి స్థిరపడిన పెద్దమనిషి.

సంపాదించిన ఆస్తి లో కొంత భాగం తో వారు విశాఖపట్నం శివారు పల్లెటూరు లో కొంత భూమి కొని, అక్కడ ఒక
3 అంతస్తుల ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ దొడ్డి వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటితో పాటు అక్కడ ఒక  100 ఏళ్ళ నాటి పెద్ద మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడి చెట్టును చూసి ముచ్చట పడే,ఎందుకంటే ఆయన భార్యకు మామిడి పళ్ళు అంటే చెప్పలేనంత ఇష్టం.

ఆ కొత్త ఇంటికి పనులు చేయిస్తున్న సమయం లో మునుస్వామి గారి శ్రేయోభి లాషులు కొందరు, వాస్తు చూపించుకుని ఇంటికి తగిన మార్పులు చేయించు కోమని వారికి గట్టిగా సలహా ఇచ్చారు.

అయితే వాస్తు పై పెద్దగా నమ్మకం లేని వ్యక్తి మునుస్వామి గారు. అయితే ఆశ్చర్యకరం గా వారి ఆత్మ ప్రభోదం మేరకు వారు ఒక వాస్తు పండితుడ్ని సలహా కొరకు ఆరా తీసి హైదరాబాద్ నుండీ ఒకగొప్పవాస్తు విద్వాన్ ని పిలిపించారు.
ఆ వాస్తు పండితులు వైజాగ్ వచ్చాక భోజనానంతరం మునుస్వామి గారి సొంత డ్రైవింగ్ లో ఇద్దరూ వైజాగ్ శివారు స్వామి గారి తోట కు బయలుదేరారు.
వారు వెళ్తున్న దారిలో మునుస్వామి గారు కారును కొద్దిగా పక్కకు తీసి, వెనుకగా వస్తున్న కొన్ని కార్లకు దారివ్వడం చూసిన వాస్తు పండితుడు చిరునవ్వు తో "స్వామి గారూ! మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది" అన్నారు.

దానికి స్వామి గారు నవ్వుతూ"అయ్యా! వారికి ఏదో అత్యవసర పని అయి ఉండ వచ్చు, అందుకే తొందర లో వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారి ఇవ్వడం మన ధర్మం కదండీ!" అన్నారు.

అక్కడ నుండి కారు చిన గంట్యాడ అనే చిన్న పల్లెటూరు సమీపించింది.అక్కడి వీధులు చిన్నగా ఇరుకు గా ఉండడం తో స్వామి గారు కారు వేగం తగ్గించి స్లోగా నడుపుతున్నారు.

ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా పరుగెత్తాడు. గమనించిన స్వామి గారు అతడ్ని తప్పించి తన కారును మరింత నెమ్మది గా పోనిస్తున్నారు.

అది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంత లోనే మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు.

ఈసారి ఆశ్చర్య పోవడం వాస్తు పండితుని వంతైంది. ఆయన "సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడని మీరెలా ఊహించారు?" అని ప్రశ్నించారు.

స్వామి గారు నవ్వుతూ "పిల్లలెప్పుడూ అంతే కదండి! ఒకరి వెంట మరొకరు వెంట పడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా?" అన్నారు.

ఆ మాట విన్న వాస్తు పండితుడు ఆనందం గా బ్రొటన వేలు పైకెత్తి చూపిస్తూ మీరు దాన్ని ఊహించి నడపడం నిజానికి మీ గొప్ప దనం" అని స్వామి గారిని అభినందించారు.

కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది. కారు లోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా 7,8 పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఎగిరాయి! అది చూసిన స్వామిగారు, పండితుడిని ఆపి, "సర్! మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే ఆగి వెళదాం!ఏమంటారు?"అన్నారు.

"ఏమండీ ఎందుకు?"అన్నారు వాస్తు పండితుడు.

స్వామి గారు నవ్వుతూ.. . "అక్కడ దొడ్డి వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడి పళ్ళు కోస్తున్నట్లుంది.
మనం కనుక హఠాత్తు గా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టు నుండి దూకితే క్రింద పడిపోతారు. ఎందుకండీ అనవసరం గా అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది" అన్నారు.

పండితుడు కొంతసేపు మ్రాన్పడి పోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు.
"ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పు-చేర్పులు అవసరం లేదు !"

ఈసారి ఆశ్చర్య పోవడం స్వామి గారి వంతైంది... "ఏం ఎందుకండి?"

"ఏ ప్రదేశం అయినా, మీ లాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజం గానే అది ఉత్తమ మైన వాస్తు గా దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు." అన్నారు వాస్తు పండితుడు.

🌷🙏🌷

*ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల యొక్క శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో, ఆ ఫలితం లబ్ది పొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది.*

అయితే ప్రత్యేకించి 'ఎల్లప్పుడూ అన్ని
సమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే
మహోన్నతుడు,సత్పురుషుడు గా మారి పోతాడు.'

నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!

*ఇది ఓ గొప్ప వాస్తు విద్వాన్ అభిప్రాయం.

*మరి మీ అందరికీ కూడా ఇకపై మీ ఇంటికి వాస్తు పండితుని అవసరం రాకూడదని ఆశిస్తున్నా!✍

లోకాస్సమస్తా సుఖినోభవన్తు🙏🙏🙏🙏🙏🙏🙏