Monday, 28 December 2020

31-12-2020


 音声菩薩像 | 特注の仏像販売・仏像彫刻の専門店の仏像彫刻原田

(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

తల్లి కొడుకుల ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (5)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అయ్యగారు అయ్యగారు 

ఏమిటిరా అట్లా అరుస్తున్నా వు 

నేనో పని చేసానండి 

ఏపని చేసావు నాకు చెప్పకుండా, మీ అమ్మ  గారికి చెప్పకుండా 

ముందుగా క్షమాపణను కోరుచున్నా గదండీ 

సరే ఏపని చేసావో చెప్పు 

అమ్మగారు ఏమను కుంటారో  

ఏమనుకుంటారో చేసేముందు ఆలోచన రావాలి 

ఇప్పు డొస్తే లాభ మేముండదు 

ఏమి లేదండి, ఏమీలేదండి అలా నాన్చాకు 

ఓ అమ్మగారు 

ఆ ... అమ్మగారు పడి పోయారండి 

పడి పోవటమేమిటి 

నిక్షేపంలా ఇప్పటిదాకా నాతొ మాట్లాడింది ఇప్పుడే వంటగదిలో పనుందని వెళ్ళింది 

మణమ్మగారు కదండీ ఎవరో అమ్మగారు "అలా కారుతీసుకొని బస్టాండు దాక చిన్నమ్మాయిని దించామన్నారు కదండీ 

ఆ దించమన్నాను 

తిరిగి వస్తూ ఉంటే ఓ అమ్మగారు నడుస్తూ నా కారు దగ్గర పడిందండి 

ఏ  మిటీ యాక్సిడెంట్ చేసావా 

లేదండీ 

మరి ఏమిటో చెప్పండీ 

అందరూ కలసి కారులో ఎక్కించారు ఇక్కడకు తెచ్చాను 

తెచ్చావా ఎక్కడా 

కారులో ఉంది 

ఉండట మేమిటిరా తీసుకురా 

ఆ ఆ ఆగు ముందు ఆమూలా నవారు మంచం ఉంది దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టు దానిపై దిండు దుప్పటి వేయి 

ఇప్పుడు తీసుకురా 

ఈ చేతుల తోన 

నీవు చేసేపని మంచి ధైతే భయము నీలో ఉండదు వేళ్ళు 

ముస్లావిడిని పువ్వులా పట్టి తీసు కొని వచ్చాడు బంటు  

రామ సీతారామ జానకిరామ జయజయ రామ పట్టాభిరామ అంటూ కలవరిస్తున్నది, నిద్దరిలో జారుకుని 

ఎవరీ పెద్దవిడా అంటూ లోపల నుంచి వస్తూ అడిగింది 

ఏమో నమ్మగారు మనకారు క్రింద పడింది తీసుకొచ్చా 

దెబ్బలేమన్నా తగిలాయా 

లేదమ్మగారు కారు ఆపి ఉంచా కారుదాకా ఎదురువస్తూ ఒక్కసారి కుప్పకూలింది 

సరే ఎవరున్నా చూసారా అందరూ చూసారు 

సరే మంచిపని చేసావు ఇక్కడకు తెచ్చి 

అమ్మా అని పలకరించాడు రామారావు ఆ ఇంటి యజమాని 

అమ్మా అని పిలిచింది జానకి ఆ ఇంటి యజమానురాలు 

అమ్మా అంటూ దండం పెడుతూ నన్ను గుర్తుపట్టారా నీవు పిలిచావే ఆ హనుమంతుణ్ణి 

మిమ్మల్ని చూస్తుంటే నాకు సీతా రామ ఆంజనేయులు వారు గుర్తుకొచ్చారు 

నేనే మీఅందరికీ నమస్కారం పెట్టాలి 

ఎదో రామభజన చేస్తూ అలా కళ్ళు తిరిగి పడిపోయాను 

నాకథ చెప్పాలంటే పెద్దకథ కానీ ఇప్పుడు చెప్పలేను క్లుప్తముగా చెప్పగలను 

ఆ చెప్పండి మీ ఆరోగ్యం బాగుందా 

బాగానే ఉంది మీ అందరి దయవల్ల 

మేము ఏంచేశామని మా దయ అంటున్నారు 

ఎవరో తెలియకుండా ఆశ్రమం కల్పించారు అందులో ఈ కరోనా కాలంలో  "అదిమంచి పనేగా ఉండండి మంచి కాఫీ తీసుకొనివస్తా అందరం త్రాగుతూ మాట్లాడు కుందాం 

 

నాకథ అత్తాకోడళ్ల కథే ఎవరిపంతం వారిది యవ్వన పంతం గెలుస్తుంది, ముసలిపంతం జాలిగా మారుతుంది కానీ గెలవలేదు ఇదే లోకధర్మం అని ఇప్పుడు తెలుసుకున్నా 

    

 ఆనందం, విషాదం... సందర్భం ఏదైనా ఏకాంతంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచనా ముద్ర వహిస్తుంది  దీర్ఘాలోచనతో తన భవిష్యత్‌ జీవితం గురించి కలలు కంటుంది  సానుకూల, వ్యతిరేక ఆలోచనల ప్రభావం మనిషి ఆరోగ్యం పైనా ఆయుర్దాయం మీదా ఎంతగానో ఉంటుంది. వస్త్రంతో వడగట్టడం ద్వారా నీటి మాలిన్యాన్ని శుభ్రపరచినట్లు, ఆలోచనా మాలిన్యాన్ని ధ్యానంతో పరిష్కరించాలని అనుకున్నా. సంసార బంధాలు అన్నీ కూడా వృత్తంలా తిరుగుతాయి మనం ఆశాజీవులం వాటిని తప్పించుకోవటం ఎవరి తరమూ కాదు. కానీ ధ్యానం అన్నింటికీ మూలం మనస్సు శాంత పరుస్తుంది బాహ్య ప్రపంచం జోలికి పోకుండా అంతర హృదయాన్ని వికసింపచేసింది  


మానవ మస్తిష్కం ఆలోచనల భాండాగారం. ఆకాశం నుంచి వానజల్లు లక్షలాది నీటి బిందువులుగా జాలువారినట్లు అది నిత్యం వేల ఆలోచనల్ని మనో క్షేత్రంలో వర్షిస్తుంది. బాహ్య లోచనాలు(కళ్లు) అడుగు అడుసు(బురద)లో పడకుండా రక్షిస్తాయి. ఆలోచనా లోచనాలు జీవితం తడబడకుండా నిలబెడతాయి. ఉత్తమోత్తమ ఆలోచనల్ని చేసే మనిషి జీవితం వర్ణమయం అవుతుంది 

అని కాఫీ త్రాగుతూ చెప్పింది 

అప్పుడే బయటనుండి అమ్మా నన్ను క్షమించు 

అత్తయ్యగారు నన్ను క్షమించు అంటూ కాళ్ళమీద పడ్డారు కొడుకూ కోడలు 

ముందు నాకు కాదు నమస్కరించేది ఆ ఆది దంపతులకు నమస్క రించండి మొహమాట పడకుండా నన్ను మోసుకొచ్చిన ఆ హనుమంతునకు నమస్కరించండి 

మమ్మలి క్షమించండి మేము ఎన్నో తప్పులు చేసాము 

  

ఒకరికొకరుక్షమాపణ చెప్పుకోటం కాదు ఆలోచనతో మనం చేసేది తప్ప ఒప్పా ఒక్క ఘడియ అలోచించి చెయ్యాలి అదే రాయణంలో హనుమ చేసింది. అందరికీ అదే ఆదర్శం. 

మీ అమ్మే నాకుకూడా అమ్మ మేము పూజించే ఆ ఆదిపరాశక్తి ఈ తల్లి ఈ దీవెనలు సర్వజగతికి క్షేమము

ఓం శ్రీ రాం ...  ఓం శ్రీ రాం ... ఓం శ్రీ రాం ... ఓం శ్రీ రాం ... ఓం శ్రీ రాం ...ఓం శ్రీ రాం ...ఓం శ్రీ రాం ...నిశ్శబ్దములో వినబడుతుంది సర్వం రామమయం ...

--(())_-

🙏 *ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు?* 🙏

🍃🌹సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయడపడుతోన్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. 

🍃🌹అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి, ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది. అందుకే ఆంజనేయుని తమలపాకు ప్రీతిపాత్రమైనది.

🍃🌹అది మాత్రమే కాదు. సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ… ఆకాశంలో పయనిస్తూ… గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు కచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయి కళ్లతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు. 

🍃🌹అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు.

🍃🌹హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి. అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి ప్రపంచ వ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరతాయి. 

🍃🌹అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణం చేస్తే సర్వసంపదలూ సుఖసంతోషాలూ వెతుక్కుంటూ వస్తాయి.

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

        *శ్రీ భాగవతం - 95 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 25*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

*మథురలో బలరామకృష్ణులు*

బలరామకృష్ణులు చేసిన గొప్ప చేష్టితములను తెలిసికొనివారైన మధురా నగర వాసులు మేడలమీద నిలబడి వారిని చూస్తున్నారు. ఎంతో ఆనందముగా బలరామ కృష్ణులు మధురా నగరం రాజవీధిలో వెడుతున్నారు. 

కంసుడికి బట్టలు ఉతికే చాకలి వాడు పట్టుబట్టలన్నీ ఉతికి మూటను కట్టుకొని తలమీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు.  కృష్ణుడు అతనిని పిలిచి,  ‘మేము నంద మహారాజుగారి బిడ్డలము. మాకు కూడా ఒక పట్టుపంచె ఇవ్వు. కట్టుకుంటాము’ అన్నాడు. 

అపుడు ఆ చాకలి కృష్ణుడుతో చాలా పొగరుతనంతో మాట్లాడాడు. ‘ఈవిషయం మా కంసమహారాజు గారికి తెలిస్తే ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా? ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు, నేతులు త్రాగి బాగా కొవ్వు పట్టింది. ఇవి సాక్షాత్తు కంసమహారాజు గారు కట్టుకొనే పంచెలు. ఇవి మీకు కావలసి వచ్చాయా!  వెర్రి మాటలు మాట్లాడకండి’ అన్నాడు. 

వాని మాటలు విని కృష్ణుడు బలరాముని వంక చూసి,  ‘అన్నయ్యా, ఇంక ఈ పుర్రె మారదు’ అని పిడికిలి బిగించి ఆ చాకలి వాని నెత్తిమీద ఒక గుద్దు గుద్దాడు. వాడు తలబద్దలై చచ్చిపోయాడు.  

కృష్ణుడు రజకుడిని ఎందుకు చంపాడో మనం తెలుసుకోవాలి.

చాకలి వాని పుర్రె ఇప్పటిది కాదు. అది త్రేతాయుగం నాటి పుర్రె. అప్పుడు సీతాదేవి మీద నిందవేశాడు. ఆ పుర్రె సీతా పరిత్యాగమునకు కారణమయిన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికయినా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనయినా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు. 

ఒక్కొక్కడు అవకాశం వచ్చినా అహంకారముతో నాశనం అయిపోతాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక నోటిమాట వలన చెడిపోతాడు. పొగరుగా మాట్లాడాడు. చచ్చి ఊరుకున్నాడు. 

ఈశ్వరుని క్షమా గుణమును, మనిషి తెంపరితనమును ఈ రజకుని మరణము మనకు ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనస్సును ఉతుక్కోలేకపోయాడు. 

అది దాటి వెళ్ళారు. మరోచోట వృద్ధుడయిన సాలెవాడు ఒకడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకు ఎదురువచ్చి తీసుకు వెళ్ళి,  ‘ఇవి నేను కంసుని కోసం నేస్తున్న మెత్తటి పంచెలు. మహానుభావా, మీరీపంచె కట్టుకుని కనపడితే ఎంతో బావుంటారు. కాబట్టి ఈ పంచె కట్టుకోవలసింది’ అన్నాడు. 

కృష్ణ పరమాత్మ ఆ పంచె కట్టుకొని సాలెవానికి ఇహమునందున్న సమస్త ఐశ్వర్యమును యిచ్చి అంత్యమునందు అతనికి సారూప్యము యిచ్చి తన దగ్గర కూర్చోపెట్టుకొనగలిగిన ఐశ్వర్యమును కటాక్షించాడు.

సుదాముడు అనబడే మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన కంసునికి పుష్పమాలలు కడుతూ ఉంటాడు. ఆ మాలాకారుడు వీరికి ఎదురువచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు.  

‘కృష్ణా! నా జన్మ ధన్యమయింది. ఏమి అదృష్టం! మీరిద్దరూ ఇవాళ నా దగ్గరకు విచ్చేశారు. దయచేసి నేను యిస్తున్న ఈ పుష్పమాలను అలంకారం చేసుకొనవలసింది’ అని పుష్పమాలలు ఇచ్చాడు. అపుడు పరమాత్మ పొంగిపోయి నీకు ఏమి కావాలో అడుగు ఇచ్చేస్తాను’ అన్నాడు. ఆనాడు మాలాకారుడు మనం అందరం పూజలో చెప్పవలసిన దానిని అడిగాడు.

*నీ పాదకమల సేవయు, నీ* *పాదార్చకుల తోడి నెయ్యమును నితాం*

*తాపారభూత దయయునుఁ,* *దాపస మందార! నాకు దయసేయ గదే!!*

కేవలం బ్రతికేయడం కాదు తండ్రీ! ప్రతిక్షణం నీ పాదకమలముల సేవ నేను చేసుకోగలగాలి. ఎవరెవరు నీ పాదములు పట్టి పూజచేసే మహాభక్తులు ఉన్నారో వాళ్ళతో నాకు స్నేహము కావాలి. ఏ పదార్థము చూసినా అది ఈశ్వరుడే అని నేను భావించి ప్రేమించగలగాలి. దానికి ఎల్లలేదు. పూర్ణమై ఉండాలి. ఈశ్వరా, నాకు అటువంటి భక్తిని ప్రసాదించవలసినది’ అని అడిగాడు. 

అపుడు కృష్ణుడు పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యమునిచ్చాడు. 

తదనంతరము ఆ ప్రదేశమును దాటి ముందుకు వెడుతున్నాడు. వెడుతుంటే ఒక కుబ్జ ఎదురువచ్చింది. ఇవి అన్నీ దశమ స్కందములో గొప్ప రహస్యములు. ఇవి మనం తెలుసుకోవలసిన ఘట్టములు. 

ఎదురువచ్చిన కుబ్జ త్రివక్ర. గూని వలన ఆమెకు శరీరంలో మూడు వంకరలు ఉన్నాయి. ఆవిడ ఎదురుచూస్తోంది. కృష్ణ పరమాత్మ ఆవిడ వంకచూశారు. కుబ్జ అందంగా ఉండదు కదా! ఆవిడ కృష్ణుని వంక చూసి,  అయ్యా! నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ త్రివక్ర అని పిలుస్తారు. నీవు చూస్తే చాలా అందంగా ఉన్నావు. నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. నేను గంధపు చెక్కలమీద గంధం తీస్తూ ఉంటాను. పరిమళ ద్రవ్యములు సిద్ధం చేస్తాను. వాటిని కంస మహారాజుకి పట్టుకు వెడతాను. ఆయన వాటిని తన ఒంటికి రాసుకుంటాడు. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నీవు ఈ గంధమును రాసుకుంటే ఈ గంధమునకు అందం వస్తుంది. ఈశ్వరా! కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా!’ అంది. 

కుబ్జ కొద్దిపాటి గంధము యిచ్చినందుకు,  ఈశ్వరుడు ఆమెకు ఎవ్వరికీ దొరకని విచిత్రమయిన సౌఖ్యమును ఇచ్చాడు. కుబ్జ పాదమును తన కుడి పాదముతో తొక్కేడు. తన చేతి రెండు వేళ్ళను కుబ్జ గడ్డం క్రింద పెట్టి పైకి ఎత్తాడు. అలా ఎత్తేసరికి కుబ్జ మూడు వంకరలు పోయాయి. ఆమె అందమయిన సౌందర్యరాశి అయిపొయింది. 

ఇళ్ళు లేని వాళ్ళని పూర్వం పాంథులు అనేవారు. అలాంటి వారందరూ పూర్వం సైరంధ్రి యింట్లో వుండేవారు. సైరంధ్రి,  పురుషులు అడగడమే తడవు వారికి కావలసిన సౌఖ్యమును కూడా కటాక్షిస్తుంది. కుబ్జ సౌందర్య రాశి అయిపోగానే,  ‘నేను సైరంధ్రిని, నాకు యింత సౌందర్యమును ఇచ్చావు. నీవు ఒకసారి మా యింటికి వచ్చి నేను యిచ్చే ఆనందమును అనుభవించు అని ఆయన మీద వున్న ఉత్తరీయమును పట్టుకొని లాగింది. అపుడు కృష్ణ పరమాత్మ తప్పకుండా నేను మీ యింటికి వస్తాను. కాని యిప్పుడు కాదు. కంస సంహారము అయిన తరువాత వస్తాను’ అన్నాడు. 

ఇది మనకు చిత్రంగా తోస్తుంది. త్రివక్రకు కృష్ణ దర్శనం అయిన తరువాత ఆయన పాదంతో తొక్కాక కూడా ఆమెలో యిటువంటి వాంఛ ఉండిపోయిందా అనిపిస్తుంది. 

మీరు భాగవతమును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. *త్రివక్రం అంటే మనసులో ఒకమాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం.* మూడింటియందు మూడు వంకర్లు. ఈ మూడు వంకర్లు తీసివేయడమే కుబ్జ తనమును తీసివేయడం. అవి పోయి ఏకత్వం వచ్చేసిందంటే ఈశ్వర స్పర్శ కలిగిన వాడు ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని అడుగుతాడు. ఆ సేవకి వేళాపాళా ఉండదు. త్రివక్రకు తన వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుని కైకర్యము అడుగుతోంది. అందుకు తన యింటికి రమ్మంటోంది. పరమాత్మ కంసవధ అయిన తరువాత వస్తానంటున్నాడు. అనగా అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. అందుకని అప్పుడు వస్తానని మాట యిచ్చాడు తప్ప ఆమెయందు మీరు దోషమును పట్టకూడదు. 

ఆయన ఒక చిత్రమయిన మాట అన్నాడు *‘నేను పాంథుడను’* అన్నాడు. పాంథుడు అనగా ఇల్లు లేనివాడు. ఆత్మకి యిల్లేమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. కానీ అది అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి ఉంటూ ఉంటుంది. అందుకని అది శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది.  ఈ మాటలు చెప్పి ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాడు. 

ధనుర్యాగం జరిగే చోటును అడిగి తెలుసుకున్నాడు. ఆయాగం జరిగేచోట ఒక పెద్ద ధనుస్సు నిలబెట్టబడి ఉంది. కృష్ణ పరమాత్మ ఆ ధనుస్సును తీసుకొని సంధించారు. అది రెండుగా విరిగిపోయింది. ఆ ధనుస్సు రెండు ముక్కలను బలరామ కృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ వున్న కంసుని సైన్యమునంతటినీ సంహారం చేసి ముందుకు వెడుతుంటే,  కంసుని గుండెలు అదిరిపోయాయి. ఇక కృష్ణుడు తనను చంపివేస్తాడని భావించాడు. 

*కువలయా పీడము* అనే పెద్ద ఏనుగు ఒకటి కంసుని వద్ద ఉంది. ఆ ఏనుగును కృష్ణుని మీదకి తోలించాడు. కృష్ణుడు మరణించేలా దానిని కృష్ణుని మీదకి తోలవలసిందని మావటి వానికి చెప్పాడు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు మావటి కలిసి కృష్ణుని మీదికి ఆ ఏనుగును నడిపించారు. అప్పుడు ఆ ఏనుగు వచ్చి ఆయనను గట్టిగా చుట్టుచుట్టింది. అప్పుడు కృష్ణుడు దాని తొండములో నుండి జారిపోయి నాలుగు కాళ్ళ మధ్యలో దూరాడు. అది తన రెండు కాళ్ళ మధ్యలో తొండం పెట్టి కృష్ణ పరమాత్మ కోసం వెతుకుతోంది. ఆయన దొరకకుండా వెనక కాళ్ళ మధ్యనుండి బయటకు వచ్చి దాని తోక పట్టుకొని దానిని నూరు ధనుస్సుల దూరం వెనక్కి ఈడ్చేశారు. 

సమస్త బ్రహ్మాండములను తన బొజ్జయందు ఉంచుకున్న వాడికి దిక్కుమాలిన ఏనుగును లాగడం పెద్ద కష్టమా! గిరగిర త్రిప్పి విసిరేశాడు. అపుడు మావటి వాడు పరుగెత్తుకు వెళ్ళి ఆ ఏనుగును మరింత ప్రచోదనం చేశాడు. యుద్ధంలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమయినది ఏనుగు. గుఱ్ఱము తనమీద కూర్చున్న వీరుడిని తీసుకుని పరుగెడుతుంది. కానీ యుద్ధమునకు తీసుకువెళ్లేముందు ఏనుగుకు నల్లమందు పెడతారు. దానికింక అస్సలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రు సంహారం చేస్తుంది. ఏనుగు వెళ్ళిపోతూ దానికి అడ్డు వచ్చిన వాళ్ళని తొండముతో లాగి కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అది తొక్కుతుంటే చచ్చిపోతారు. తొండము పెట్టి కొడితే చచ్చిపోతారు. దంతము పెట్టి పొడిస్తే చచ్చిపోతారు. అది ఎవడి మీదయినా పడితే చచ్చిపోతారు. కాబట్టి ఏనుగు అలా యుద్ధం చేయగలదు. అటువంటి ఏనుగును కృష్ణుని మీదికి పురిగొల్పాడు. 

అది చిన్నికృష్ణుని మీదికి పరుగెత్తుకు వస్తోంది. కృష్ణుడు ఒక్కసారి తనకాలితో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు మొర్రో అని ఘీంకరిస్తూ వంగింది. అలా వంగేసరికి కృష్ణుడు దాని రెండు దంతములు ఊడబెరికేశాడు. అరచేత్తో దాని కుంభస్థలం మీద ఒక దెబ్బ కొట్టాడు. దాని కళ్ళల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ కింద పడిపోయింది. అది కింద పడిపోయిన తరువాత దాని దంతములను పెట్టి అక్కడ వున్న యితర వీరులను మావటిని సంహరించాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఏనుగు దంతములు రెండింటిని భుజముల మీద వేసుకున్నాడు. 

మార్గశీర్ష మాసంలో మనవాళ్ళు *తిరుప్పావై* ని చదువుతుంటారు. అందులో నీలాదేవికి మంచం చేయించవలసి వస్తే కువలయా పీడము నుంచి లాగేసిన దంతముల తోటే ఆయన ఆవిడకు మంచమును చేయించాడు. 

ఏనుగుకు కువలయా పీడము అనే పేరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 

‘కు’ అంటే భూమి. ‘వలయము’ అంటే భూమండలము. కువలయా పీడము అనగా భూమండలమును పీడించునది అని అర్థము. పృథివీ వికారమయిన మనము పూజ చేద్దామని భూమి మీద వుండి కూర్చుందామని అనుకుంటే ముందు మనలని దేహాత్మాభిమానము అడ్డుతుంది. ఈ శరీర అహంకారమే మనలను పాడుచేసేస్తుంది. ‘అమ్మో, ఈవేళ అంతసేపు కూర్చోవాలా’ అంటుంది. కువలయా పీడము అనేది దేహమునకు సంబంధించిన అహంకారము. శాస్త్రములో దీనిని ‘అన్న వికారము’ అని పిలుస్తారు. అన్న వికారము అంటే ఈ పృథివిలో పండినవి ఎన్నో తినేశావు. వాటినన్నిటిని తినడం వలన యింత శరీరం తయారయింది. ఈ అన్నవికారమయిన శరీరం ఏమవుతుంది? ఇందులో వున్న రక్తము భూమిలోకి యింకిపోతుంది. యిందులో వున్న మాంసము కాలిపోతుంది. లేదా పురుగులు తినేస్తాయి. శరీరం పృథివిలో కలిసిపోతుంది. వెంట్రుకలు మాత్రం వెళ్ళి చెట్ల మొదళ్ళను పట్టుకుంటాయి. ఈపాటి శరీరమును చూసుకుని మనం ఎంతో పొగరుతో ప్రవర్తిస్తాము. రెచ్చిపోతూ ఉంటాము. అహంకారంతో ప్రవర్తించి లేనిపోని పాపములను మూట కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చిన భ్రాంతి! కాబట్టి దీనిని భాగవతంలో కువలయా పీడము అంటారు. 

జ్ఞానము లేనివాడికి యిది వాడిని వాడు పీడించుకోవడానికి పనికొస్తుంది. పాపం బాగా మూట కట్టుకోవడానికి పనికొస్తుంది. ఒక మహా పురుషునికి యిది పుణ్యం చేయించడానికి, వినయముతో నమస్కారం చేయడానికి ఈశ్వరుని ఆరాధించడానికి తాను యిక్కడ వున్నన్నాళ్ళు హాయిగా వుండి, సంతోషంగా ఉండి గట్టెక్కడానికి పనికివస్తుంది. 

కంసుని యందు వున్న కువలయాపీడము పాడుచేయడానికి పనికివస్తుంది. దానికి లోపల ఆ జ్ఞానము వుంది. ఈ కువలయాపీడము ను కృష్ణుడు సంహరించాలి. కాబట్టి కువలయాపీడమును ఆయన సంహరించాడు.

          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏

🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏


**  (సశేషం.....)

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹


: *ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

        *శ్రీ భాగవతం - 96 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 26*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

కువలయాపీడము అనే ఏనుగును సంహరించిన అనంతరం, శ్రీకృష్ణ బలరాములు మరికొంత లోపలికి వెళ్ళగా *చాణూర ముష్టికులు* ఉన్నారు. 

మనలో ఉన్న కామక్రోధములే *చాణూరముష్టికులు* . 

వాళ్ళు మల్లయుద్ధం చేస్తారు. వాళ్ళు పట్టుకుని, పట్టుకుని,  మనలను పడగొడతారు. ఇప్పుడు కంసుడు చాణూర ముష్టికులను వారిపైకి ప్రయోగించాడు. 

అజ్ఞానము ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడిని, కృష్ణుడితో చాణూరుని వేదకమీద మల్లయుద్ధం చేయమన్నాడు. వారిద్దరూ భయంకరమయిన మల్లులు. బలరామకృష్ణులు చిన్నపిల్లలు. వాళ్ళతో ఈ చిన్నపిల్లలకు యుద్ధం ఏమిటని అక్కడ వున్నవారు ఆశ్చర్యపోతున్నారు. 

వారికి,  వచ్చినవాడు పరాత్పరుడు అని తెలిసిపోతోంది. ఇంతమందిని చంపాడు అని తెలిసిపోతోంది. 

చాణూరముష్టికులు అన్నారు – ‘ఇదేమీ వైకుంఠపురం కాదు, కంసుని సభ. ఇది సంసారమును వదిలి పెట్టేసిన వారి సభ కాదు. ఇది గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది నారదుడు మీటే వీణ కాదు. ఇది కాలదండము లాంటి నా పిడిగుద్దు. ఇది లక్ష్మీదేవితో పరాచికములు ఆడడం కాదు. పిల్లాడా, మాతోటి యుద్ధం చేస్తావా? నీవు ఎక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెలు లేవు – సాగి నీవు నడవడానికి వేదాంత వీధి కాదు. రా, నిన్ను మట్టు పెడతాము’ అన్నారు. 

చాణూరుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు కలియబడ్డారు.

బ్రహ్మాండమైన మల్లయుద్ధం జరిగింది. గరుడుడు పాములను పట్టుకుని ఎగరేసుకు పోయినట్లుగా వాళ్ళిద్దరూ చాణూరముష్టికులను ఇద్దరినీ సంహరించారు. వీళ్ళిద్దరూ మరణించగానే కంసుని గుండె అదిరిపోయింది. సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు వెంటనే కత్తితీసి భటులను పిలిచి,  ‘వసుదేవుని సంహరించండి – ఉగ్రసేనుని సంహరించండి – ఈ గోపాల బాలురను మట్టుబెట్టండి’ అని ఉన్మాదంతో కేకలు వేస్తున్నాడు. 

అప్పుడు కృష్ణుడు సింహాసనం మీదకి ఒక్క దూకు దూకి కంసుని జుట్టు పట్టుకున్నాడు. అంతే కంసుడు పంచత్వమును పొందేశాడు. వాడు చచ్చిపోయాడు. కంసుని మీదకి కత్తి విసరలేదు. 

జరాసంధుడు – కాలయవనుడు – ముచుకుందుడు తరువాత ఒక ముఖ్యమయిన ఘట్టం జరిగింది.

జరాసంధుడు యుద్ధమునకు వచ్చాడు. కంసునికి యిద్దరు భార్యలు. వారు జరాసంధుని కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి ‘కృష్ణుడు మా భర్తను సంహరించాడు మాకు వైధవ్యం వచ్చింది’ అని జరాసంధుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. జరాసంధుడికి కోపం వచ్చి ఇరువది మూడు అక్షౌహిణుల సైన్యమును తెసుకొని శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా పదిహేడు మార్లు వచ్చాడు. పదేహేడు మార్లూ అనేక అక్షౌహిణుల సైన్యమును కృష్ణుడు చంపాడు. 

పదునెనిమిదవ మాటు మరల జరాసంధుడు వస్తున్నాడు.ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమయిన పని చేశాడు. జరాసంధుడు మధురా నగరమును ముట్టడిస్తే అమాయకులైన గోపాల బాలురు మరణిస్తారని, తనకి కొంత చోటును యిస్తే అందులో జలదుర్గము కట్టుకుంటానని సముద్రుడిని చోటు అడిగాడు. సముద్రుడు చోటు యిచ్చాడు. 

ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్రగర్భంలో ద్వారకానగర నిర్మాణం చేశాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమ సత్యమని ఈనాడు బయటపడిన అవశేషాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ ద్వారకా నగరానికి తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు. 

కాలయవనుడు అని ఒకాయన ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది. యాదవులు ఎవరూ కూడా ఆయనను చంపలేరు. ఆయన దగ్గరకు వెళ్ళి నారదుడు ఒకమాట చెప్పాడు ‘ నీవు అందరి మీదికి యుద్ధమునకు వెడుతుంటావు. అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు, ఒకడు ఉన్నాడు. అతనిని కృష్ణుడు అని అంటారు. మధురలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. 

ఆ కాలయవనుడు అతని యవన సైన్యమునంతటినీ తీసుకొని వచ్చాడు. కృష్ణుడితో యుద్ధమునకు శత్రు సైన్యమంతా కోటబయట విడిది చేసింది. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం బయటకు వస్తుందని వారు ఎదురు చూస్తున్నారు. కానీ లోపల సైన్యం ఎవరయినా ఉంటే కదా! లోపల బలరామ కృష్ణులు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా రెండు చేతులు వెనక్కు పెట్టుకొని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరకు వస్తున్నాడు. అలా వస్తున్న వానిని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని గుర్తు పట్టి కృష్ణా, నీకోసమే వచ్చాను ఆగు’ అన్నాడు. కృష్ణుడు పరుగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పారిపోతున్నాడని భావించి కాలయవనుడు గుర్రం మీద కృష్ణుని వెంబడించాడు. కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా పరుగెత్తి పరుగెత్తి ఒక కొండగుహ లోనికి దూరిపోయాడు. గుర్రమును వదిలివేసి కాలయవనుడు కూడా ఆ కొండ గుహలోనికి ప్రవేశించాడు. కొండగుహలో దుప్పటి ముసుగు పెట్టుకొని ఒకాయన పడుకుని వున్నాడు. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నవాడిలా నటిస్తున్నాడని భావించి అతనిని కాలితో ఒక్క తన్ను తన్నాడు. ‘ఎవడురా నన్ను నిద్రలేపిన వాడు’ అని ఆ ముసుగులో పడుకున్న ఆయన లేచాడు. లేచి ఆయన తీవ్రంగా చూసేసరికి కాలయవనుడు కిందపడిపోయి బూడిదయిపోయాడు. 

అపుడు పరీక్షిత్తు ఆ దుప్పటి కప్పుకుని పడుకున్నవాడు ఎవరు?” అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు దానికి జవాబు చెప్పాడు. 

త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు *ముచుకుందుడు* అనేవాడు ఒకడు ఉండేవాడు. అతను మహా తేజోసంపన్నుడు. గొప్ప భక్తుడు. రాక్షససంహారమునకు ఒకసారి దేవేంద్రుడు సహాయం అడిగితే వెళ్ళాడు. కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రింబగళ్ళు యుద్ధం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఆఖరుకి కుమారస్వామి వారికి దేవసేనాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతనిని ఏమి కావాలో కోరుకొనమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు నిద్రపోవాలని ఉంది. నన్ను ఎవరూ నిద్రాభంగం చేయకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి’ అన్నాడు. వాళ్ళు ఈ గుహ చూపించి అందులో పడుకోమన్నారు. ‘నీకు ఎవరయినా నిద్రాభంగం చేస్తే నీవు వాడికేసి చూసిన తక్షణం వాడు బూడిద అయిపోతాడు’ అని చెప్పారు. కృష్ణుడికి ఈ రహస్యం తెలుసు. అందుకని కాలయవనుడిని అక్కడికి తీసుకెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించడు కదా! ఈవిధంగా ముచుకుందుడి వలన కాలయవనుడు మరణించాడు.

ఇపుడు పదునెనిమిదవ సారి జరాసంధుడు వచ్చాడు. బలరామ కృష్ణులిద్దరూ కోటలోనుండి బయటకు వచ్చి మరల పరుగు మొదలుపెట్టారు. జరాసంధుడు వారివెంట పడ్డాడు. ప్రవర్షణ పర్వతమనే పెద్ద పర్వతమును ఎక్కి బలరామకృష్ణులు అక్కడి పొదలలోకి దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షములను ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్లకి బలరామకృష్ణులు కనపడలేదు. అపుడు జరాసంధుడు ఆ పర్వతము నంతటినీ తగల పెట్టెయ్యమని తన సైనికులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతమంతా తగులపెట్టేశారు. అపుడు అగ్నిహోత్రుని కాంతులు ఆకాశమునకు అంటుకున్నాయి. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మీదనుండి సముద్రంలోనికి దూకేసి ఈదుకుంటూ ద్వారకానగరమునకు వెళ్ళిపోయారు. కృష్ణుడు, బలరాముడు యిద్దరూ మరణించి ఉంటారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణబలరాములు మాత్రం క్షేమంగా ఉన్నారు. 

ఇందులో మీరు తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఉంది. ‘సంధి’ అనగా సగము. సంధికాలము వచ్చింది. యుగ సంధి వచ్చింది అంటారు. మనం ఎవరినయినా ఆశీర్వచనం చేస్తే *‘శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి’* అంటూ నూరు సంవత్సరములు జీవించు అంటాము.

నూరు సంవత్సరములలో సగము ఏభై. మీరు ఈశ్వరారాధన ఈ ఏభై లోపల చెయ్యాలి. ఏభై తరువాత చేసే ఆరాధన మానసికమయినది. ఏభై తరువాత అంత కలివిడిగా శరీరముతో ఈశ్వర సేవ చేయడం కష్టం. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ ఏబది సంవత్సరముల వయసు లోపల పూర్తి అవాలి. 

జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాలయవనుడు తరుముతాడు. మృత్యువు వస్తుంది. ఇక్కడ కృష్ణుడు గుహలోకి దూరిపోయాడు. అనగా హృదయగుహలోకి వెళ్ళిపోయాడు. ముచుకుందుడు నిద్రలేచాడు. హృదయంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితి గతుడయిపోయిన వాడికి మరణం ఉండదు. కాలయవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఉండదు. జరాసంధుని నుండి తప్పుకోవడానికి ప్రవర్షణ పర్వతమును ఎక్కాడు. అలా చేయడం అనగా నిరంతరమూ భక్తితో ఉండడం. పరమభక్తితో ఉంటే మృత్యువు మిమ్ములను ఏమీ చేయలేదు. అపుడు యమధర్మరాజు గారు మీ దాపులకు రాడు. పరమభక్తుడయిన వాడిని తీసుకు వెళ్ళడానికి నారాయణుని పార్షదులు వస్తారు. శివుని పార్షదులు వస్తారు. యమదూతలు రారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్రాంతర్గతమయిన ద్వారకను అనగా ఈశ్వర స్థానమునకు చేరుకున్నాడు. ఈవిధంగా లోకమున కంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బ్రతకడం నేర్చుకో అని నిరూపించి చూపించాడు.


          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏

🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏

కాళహస్తీశ్వర శతకం - 47* 🕉

*మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి* *దుర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం* *దమ్ము దైవంబు నవ్వడె రానున్న దురాత్ములెల్ల* *దమత్రోవం బోవరే ఏల చేసెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!*

📍 _*తాత్పర్యం:*_ 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దురాత్ములు సన్మార్గులవలె నటించుచు గతంలో కొందరు ధర్మకర్తలు నిర్మించిన దేవాలయములను నిర్మూలించి తాము మరియొక ధర్మకార్యమును ఆచరింతురు. 

🌹వీరిని వీరిదోషములతో కూడిన ధర్మకార్యములను చూసి, దేవుడు తప్పక నవ్వుకొనును. ఇటువంటివారి వలన లోకమున వాస్తవమగు ధర్మము భ్రష్ఠమగుచున్నది. 

🌹ఈ చెడుపనుల వలన తమకు పుణ్యము లభించునా లేదా అని కాని తమవలన లోకమునకు హాని కలుగునని కాని తమకు పరమున నరకాది లోకములు ప్రాప్తించునని కాని భయపడకున్నారు.

🙏 *ఓం నమః శివాయ* 🙏



🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼



 *పరోపకారం* 

🍁🍁🍁🍁

ప్రకృతిని నిశితంగా గమనిస్తే సర్వత్రా ‘ఇవ్వడమే’ కనిపిస్తుంది. గాలి ప్రాణవాయువై జీవుల్ని బతికిస్తుంది. చెట్లు కమ్మని పళ్లు ఇచ్చి క్షుద్బాధ తీరుస్తాయి. నదులు తియ్యని నీరిచ్చి దాహార్తిని ఉపశమింపజేస్తాయి. ప్రకృతికి వనరులను ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు.

భగవంతుడు వర ప్రదాత. భక్తుల కొంగుబంగారంగా కొలువై ఉంటాడు. మనుషులెప్పుడూ వరగ్రహీతలే! వరప్రదాతలు కావడం గొప్ప సుకృతం.

 అమ్మస్తన్యం తాగడంతో మొదలయ్యే మనిషి జీవితం, చివరి క్షణాల్లో తులసి తీర్థం పోయించుకోవడంతో అంతమవుతుంది. నడిమి జీవితం చాలావరకు పుచ్చుకోవడంతోనే సాగుతుంది. ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కాని తనకున్నదాంట్లో ఇవ్వడానికి మనిషికి మనస్కరించదు.

మన పురాణాలు ‘దానం’ ప్రాశస్త్యాన్ని వీలున్నప్పుడల్లా ఉటంకిస్తాయి. పుణ్యంతో ముడిపెట్టి మనిషిలోని దానగుణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాయి. ఇచ్చే చేయి కలిగి ఉండటం గొప్ప అదృష్టం. చాపే చెయ్యి వెనక సిగ్గుతో ముడుచుకుపోయే హృదయం ఉంటుంది. అది గమనించగలగాలి.

 పాత్రతనెరిగి దానం చెయ్యమంటారు. కొంతమంది తమ అవసరాన్ని వ్యక్తపరచి అడిగి తీసుకుంటారు. మరికొంతమంది అస్సలు మనసు బయటపెట్టరు. అలాంటివారిని కనిపెట్టుకుని ఉండాలి. భగవంతుడు మనిషికి విచక్షణను ఇచ్చింది అందుకే. సృష్టిలోని ఏ జీవీ మరో జీవి మనసును చదవలేదు. అంచనా వేయలేదు. మనిషికే అది సాధ్యం.

నవ విధ భక్తిమార్గాల్లో సేవ ఒకటి. సేవ అంటే మనం చేయగలిగింది చేయడమే, ఇవ్వగలిగింది ఇవ్వడమే.  

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రజలు పెద్దమనసుతో వితరణ చేసి, బాధితుల ముఖాల్లో వెలుగు నింపుతారు. వారి జీవితాన్ని చైతన్యవంతం చేస్తారు.

దానం చేయడానికి తన ఇంట్లో ఏమీ లేక, ఉన్న ఒక్క ఉసిరికాయను దానం చేసింది ఒక నిరుపేదరాలు. చలించిన శంకరాచార్యులవారు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.

అన్నార్తులకు లేదనకుండా అన్నదానం చేసిన దొడ్డ ఇల్లాలు డొక్కా సీతమ్మ.

దానం చేయడానికి మనసుండాలి, చేయి సహకరించాలి. కాలు, చేయి ఆడుతున్నప్పుడే హరి నామ స్మరణ చేస్తూ- తోచినంత దానం చేయగలిగితే ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి అంటారు వేద ప్రియులు. ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో దానం చేసేవారు కొందరైతే, చేతికి ఎముక లేకుండా దానం చేసేవారు మరికొందరు. తమ కోసం ఏమీ మిగుల్చుకోకుండా దానం చేసినవారు అరుదుగా ఉంటారు.

కీర్తి కోసం కాకుండా, కైవల్య ప్రాప్తి కోసం దానం చేసేవారి అడుగు, మోక్షమార్గంపై పడుతుంది.

శుభోదయం.

ఏది మీకు పరమాత్మ నుండి ఒక ప్రసాదంగా ఒసగబడిందో, దాన్ని అనుభవించండి. దాని వలన మీరు ఆయన యెడల కృతజ్ఞతా భావంతో నిండి, నాకు నా యోగ్యత కన్నా ఎక్కువే ఇచ్చావు, ధన్యవాదాలు అని అనగలుగుతారు. మరచిపోయి కూడా పరమాత్మని ఏదీ కోరుకోకూడదు. ఆ కొరికే మీకు, ఆయనకు మధ్య ఒక గోడలా నిలుస్తుంది. దేవుని గుడిలో మీరు చేసే ప్రార్ధనల్లో మీ కోరికలు ఉండకూడదు, మీరు ఆయనకు తెలియజేసే ధన్యవాదాలు ఉండాలి.

ఈ క్షణంలో జీవించడం అంటే గతం నుండి, భవిష్యత్తు నుండి ముక్తుడై జీవించడం. వెనక్కి వెళ్లడం కాదు, ముందుకి వెళ్లడం కాదు, ఈ క్షణంలోనే మెలకువగా జీవించడం. ఎక్కడ గతం లేదో, అక్కడ అహంకారం లేచి నుంచోదు. అహంకారం గతంతో జోడింపబడి ఉంటుంది. అలాగే ఎక్కడ భవిష్యత్తు లేదో, ఎక్కడ ఆకాంక్ష లేదో, ఎక్కడ కోరిక లేదో అక్కడ మీరు కావాలని అనుకున్నా కూడా అహంకారాన్ని నిలబెట్టలేరు.

 హిందూ మతాన్ని హిందూ శాస్త్రాలను జ్యోతిష్యాన్ని విమర్శించే మేధావులకు అంకితం

అంతర్జాల సేకరణ ! 

వారానికి 7 రోజులు ఎందుకు?

రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది??

ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు? మంగళ వారం రావొచ్చుగా??

ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే మందు ప్రతి ఉగాది రోజు పంచాంగం ను, జ్యోతిష్యం ను అవమానించిన వాళ్లకి అంకితం..

మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం..

ప్రపంచంలో ఏ దేశానికి లేని జ్ఞాన సంపద మన సొత్తు..

ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి...

మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే ఏంటో తెలియక ముందే నవ గ్రహలను గుర్తించిన ఘనత మనదే..

ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది?

ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది?

ఎప్పుడు చంద్రగ్రహణం?

ఎప్పుడు సూర్యగ్రహణం?

ఏ కార్తె లో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే.. ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే..

పైన ప్రశ్న కి జవాబు:-

మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది. ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు

ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.

భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR . ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి.. ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి. అవి వరుసగా... (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి.

ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి.. 7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మళ్ళీ మొదటి హోరాకి వస్తుంది.. అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మళ్ళీ శని హోరాకి..

ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు  పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుధ హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది.

ఆతర్వాత హోరా 25వ హోరా. అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.

చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి.

రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే..సో ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి...

ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి? మంగళ వారం రాకూడదా??

రాదు.... ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరా తో ప్రారంభం అయ్యింది కాబట్టి..

ఇది మన భారతీయుల గొప్పతనం.. ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం..

ప్రపంచం లో దేశమయినా మన పద్దతి ఫాలో అవ్వాల్సిందే.. కానీ మనకి మాత్రం మనం అన్నా మన దేశమన్నా లోకువ...

ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది..

--(())--

 శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత చరిత్ర

దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదాపీఠం 36వ పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత చరిత్ర.

Episode - 1

దక్షిణామ్నాయ శృంగేరి శ్రీశారదాపీఠం 36వ పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామివారు. అద్వితీయపాండిత్యం, బహుభాషాకోవిదత్వం, శిష్యులమీద వాత్సల్యం, పీఠం సంప్రదాయములను ఏమాత్రం తూచా తప్పకుండా, ధార్మిక విధివిధానాలకు లోపం జరగకుండా జరపటం, వేదశాస్త్రాలను సంరక్షిస్తూ, పండితులను సత్కరించడం, వంటి అనేకసద్గుణాలు కలిగిన సకలజగద్వంద్యులు జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

విశ్వంలో ఎన్నో మతాలున్నాయి. వాటన్నిటిలో హిందూమతం అని పిలువబడే సనాతన ధర్మం సర్వశ్రేష్ఠమయినది. సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వప్రాణి దయాపరత్వం అనే విస్తృత ప్రాతిపదికమీద నెలకొన్న ఈ ధర్మం ఒక్కటే మానవ సృష్టి ఉన్నంత కాలం ఉండగలిగినది. పరధర్మీయుల అనేక విధములయిన ఆక్రమణలకు తట్టుకొని నిలబడ్డ ఈ ధర్మానికి ఎన్నటికీ చ్యుతి లేదు అని అంటాడు ఒక మహాపురుషుడు.

ఈనాడు అనేకమంది మనస్సులను ఒక సమస్య పీడిస్తున్నది. అదేమిటంటే "ఇప్పటి కాలగతిని చూస్తుంటే జనులలో ధర్మం పట్ల శ్రద్ధ కోల్పోతున్నారు. విధర్మీయుల ప్రచారాలు విస్తృతమౌతున్నాయి. ఇట్టి స్థితిలో సనాతన ధర్మం ఇంక ఎన్నాళ్ళు నిలుస్తుంది” అని. ఈప్రశ్నకు ఆ మహాపురుషుని మాటలలో సమాధానమున్నది. "ऋषीणां पुनराद्यानां वाचमर्थोनुधावति" అని ప్రాచీనులు చెప్పారు. "మహాత్ముల వాక్కు నిశ్చయంగా ఫలిస్తుంది" అని ఆ వాక్యార్థం. పై మాటలు చెప్పినది వేరెవరో కాదు, శ్రీశంకర భగవత్పాదులు స్థాపించిన దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠం 36వ పీఠాధిపతులుగా వెలుగొందుతున్న జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు.

#దివ్యాంశావిర్భావం :- వేదమూర్తులు బ్రహ్మశ్రీ తంగిరాల వెంకటేశ్వర అవధాన్లుగారు ఆంధ్రదేశానికి చెందిన సనాతన ధర్మ పరాయణుడైన ఒక బ్రాహ్మణోత్తముడు.
ఈయన సనాతన వైదిక సంప్రదాయములో అధిక శ్రద్ధకల వంశంలో జన్మించినవారు. వీరిది కుత్సస గోత్రం, ఆపస్తంబ సూత్రం. తంగిరాల సుబ్బయ్యగారు, సుందరమ్మగారు వీరి మాతా పితరులు. బాల్యం నుంచి వీరు అధునిక భోగభాగ్యాల వైపు దృష్టి మరల్చక తమ స్వశాఖ అయిన కృష్ణయజుర్వేద అధ్యయనాసక్తులయ్యారు. వైదిక వృత్తిలో గౌరవాన్వితుడుగా మసలుచూ దురాశకు లోనుగాక నిరాడంబరమైన జీవితం గడుపుతూ వీరు తమ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించేవారు.

వీరు ఆంధ్రప్రదేశ్ లోని మిన్నెకల్లు గ్రామవాస్తవ్యులు, కౌండిన్యస గోత్రులైన బ్రహ్మశ్రీ వేదమూర్తి కోట బ్రహ్మయ్యగారి కుమార్తెయైన శ్రీమతి సౌభాగ్యవతి అనంత లక్ష్మమ్మను వివాహమాడారు. ఈ దంపతులు ఆంధ్రదేశములో గుంటూరుజిల్లాలో పల్నాడు తాలూకాలో నాగులేరు అనే నదీ తీరంలో ఉన్న అలుగుమల్లెపాడు గ్రామంలో నివసించేవారు. శ్రీమతి అనంతలక్ష్మమ్మగారు అతిథి పూజా నిరతురాలైన మహాసాధ్వి. ఆ గ్రామంలో వాళ్ళందరూ ఆ దంపతులయెడ మంచి గౌరవ భావంతో ఉంటూ వారితో ఏదో విధంగా సంబంధం పెట్టుకొనటం తమ భాగ్యమని భావించేవారు. భగవదనుగ్రహం చేత ఆ దంపతులకు నలుగురు కుమార్తెలు జనించారు. కాని "अपुत्रस्य गतिर्नास्ति" (పుత్రులు లేనివారికి ఉత్తర గతులు లేవు) అనే శాస్త్రోక్తిని స్మరిస్తూ ఆ దంపతులు పుత్రుడు కలుగనందుకు దుఃఖితులయ్యేవారు.

ఈ దంపతులు నివసించు గ్రామమునందు భవానీ శంకర దేవాలయం ఉంది. శ్రీ అవధానిగారు ప్రతిరోజూ నాగులేరులో స్నానంచేసి ఈశ్వర దేవాలయానికి వెళ్ళి ఒక సంవత్సరంపాటు ప్రతిరోజూ ఆ శివలింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. శ్రీరుద్రం గొప్ప శక్తిగల మంత్రం. దానితో శ్రద్ధాపూర్వకంగా అభిషేకం చేసే భక్తులను శివుడు తప్పక అనుగ్రహిస్తాడని, శివుడు ఆశుతోషుడని శాస్త్రాలు చెపుతున్నాయి. అవధాని గారు తమ వ్రతం పాటించడం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపలేదు.

కొంతకాలం తరువాత శ్రీ అవధానిగారు తమ నివాసం మచిలీపట్నంకు మార్చారు. అక్కడ అవధానిగారు భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవరాత్రోత్సవం జరిపారు. నాకు కుమారుడు పుడితే వానికి రాములవారి పేరు పెడతానని శ్రీరామునికి మ్రొక్కుకున్నారు. శ్రీమతి అనంతలక్ష్మమ్మ ఆంజనేయుస్వామిని ఆరాధిస్తూ కుమారుడు పుడితే వానికి ఆంజనేయుని పేరు పెడతానని మ్రొక్కుకున్నది.

ఒక రోజు తెల్లవారుజామున ఆమెకు ఆంజనేయస్వామి స్వప్నంలో కనపడి మూడు మామిడి పండ్లు అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు. మరునాడు ఉదయమే ఆమె ఆ ఆనందకరమైన వృత్తాంతం భర్తకు చెప్పింది. ఆ స్వప్న వృత్తాంతం చెప్పగా విన్న ఇతరులకు మూడు మామిడిపండ్లు ఇవ్వడంలోని అంతరార్థం తెలియలేదు. భూలోక, స్వర్గలోక, పాతాళలోకాలను అతిక్రమించగలిగిన మహా పురుషుడు అనంతలక్ష్మమ్మకుపుత్రుడుగా అవతరించనున్నాడని ఆంజనేయుని అభిప్రాయమా? లేదా శివ-రామ- ఆంజనేయుల అనుగ్రహంచేత వైరాగ్యం, ధర్మనిరత, వక్తృత్వం అనే మూడు …
                                                                                                         .................

 మనకెవరికీ తెలియని గొప్ప విషయాలు...

మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది.కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా తయారైంది.

 అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడకు వచ్చిన వారికి ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు ''చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదిలస్తే వారు కూడా వెళ్ళవచ్చు'' అని మరో వరం ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలసి వెళిపోయారు.

 ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా? అంటే చర్మచక్షువులతో చూడలేము. కేవలం జ్ఞానచక్షువులు, వ్యాసాది మహర్షులిచ్చే దివ్యచక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసే వారు ఎక్కువయ్యారు. వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు.దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.
 చాలా మందికి కొన్ని మంచి సందేహాలు కూడా వచ్చాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

 వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

 బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.

 మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

 మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది.

 తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.

 నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది.

 పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండికరణం తరువాత తన ముం దున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.

 దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.

 వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.

 దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.

 మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).

 నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.

 ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.

 ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.

 ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.

 తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.

 పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.

 ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.

 నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.

 కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.

 మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.

 ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.

 ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.

 పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు.

 నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.

 ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.

 వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.

 మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు,సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి,స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

 ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు.

 మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం.

 దివ్యాత్మస్వరూపులారా!

 ఇప్పటి వరకూ స్వధానామసాధన, స్వధాస్తోత్రపఠనం చేసిన సాధకులకు ఇదిసాధనలో రెండో సోపానం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పగా వ్యాసభగవానుడు ప్రసాదించిన దివ్యమైన పితృస్తోత్రం అందిస్తున్నాము.దీన్ని చదువుకున్న వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్తాడు. ఇది మూడు కాలాలలో లేదా రెండు కాలాలలో లేదా కనీసం రోజుకు ఒక సారి అయినా చదువుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయి. సకల కష్టాలూ తొలగిపోతాయి.సర్వకార్యాలలో జయం సిద్ధిస్తుంది.సకల దేవతలూ సంతోషించి సకల కోరికలూ తీరుస్తారు.
🙏  🙏

30-12-2020

 

Top 60+ Best Lord Dattatreya Images | Datta Guru Wallpaper Images (HD)

pranjali prabha     🌹 శుభోదయం 😀
           --------------------
                      తేదీ :- 30.12.2020

🌻 మహనీయుని మాట🙏
         ------------------------

ద్వేషాన్ని దూరం చేయ గలిగేది ప్రేమ ఒక్కటే ద్వేషంతో కానే కాదు.

       --------------------------
🌺 నేటి మంచి మాట🦜
       ---------------------------

ఆత్మగౌరవం,ఆత్మవిశ్వాసం,  అత్మస్థైర్యం, ఈ పదాలు పలకడానికి చాలా భారంగా, బరువుగా అనిపిస్తాయి.        
          
పలకడానికి ఎంత భారంగా ఉన్నాయో ఈ మూడింటితో సహజీవనం చేయడం అంతే కష్టం, ఆచరిస్తే అంతులేని ఆనందం.

                                       


🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒
Image may contain: night and outdoor 


 

(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ ) ప్రాంజలి ప్రభ
శ్రీమతి తో శ్రీవారి ముచ్చట్ల కాఫీ చిన్న కధ (5)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పంతులుగారు బాగున్నారా
ఆ ఆ  బాగున్నా,   ఎలాగయ్యా ఇప్పుడు మీకు సెలవులు వచ్చినట్లున్నాయి
ఎప్పుడూ ఒకరకంగా ఉంటే ఈ గురువులు అసలు గుర్తుకు రారు కదా
అవునవును
ఈ మధ్య ప్రవేటు స్కూల్లో పనిచేసే అధ్యాపకులకు కష్టం గా ఉందట గదండీ
అవును బాబు ఎవరికి చెప్పుకొనేటట్లు లేదు , అధ్యాపకులు బతుకుతెరువు కోసం  ఎదో ఒక పనిచేస్తున్నారు, ప్రభుత్వం వారు మమ్మల్నసలు పట్టించు కోవటం లేదు ఏంచేద్దాం
ఇంటర్నెట్ విద్య నేర్చుకొని విద్య చెప్పక పొయ్యరా    
చూడు ఇది ఒక గురువుది కాదు సమస్య , అందరి గురువులది.  మహమ్మారి రావటం వల్ల అటు విద్యార్థులు, ఇటు గురువులు, తల్లితండ్రులు, బాధ పడుతున్నారు  
బాబు మేము డబ్బు కోసం కాదు పనిచేసేది విద్యావంతులుగా మార్చుటయే మా లక్ష్యం.
దేనికి మా ( గురువుల ) ఆదాయం మాత్రం...  ప్రజల యొక్క జ్ఞానం,  శ్రేయస్సు మరియు
దేశ అభివృద్ధి పెరుగుదలతో .పెరుగుతుంది  అందుకే మేము ఉపాధ్యాయులుగా గర్తిస్తారు ....
పంతుళ్ళం కాదు...    మేం "తరాల" తయారీదారులం...
ఏముంది పంతుళ్ళు... ఏదో వస్తారు ....  పోతారు.నాలుగు మాటలు తోచింది చెప్తారు. *లేకుంటే సెలవులు...  ఇదీ సమాజంలో ........ఉపాధ్యాయులపై చిన్న చూపు.*
మా మెదళ్లను పీల్చి పిప్పి చేసినా, వాళ్ళ మెదళ్లను బాగు చేసి మేధావులను, డాక్టర్లను,
యాక్టర్లను, ఇంజినియర్ లను,పోలీసులను,కలెక్టర్లను,లాయర్లను,టీచర్లను,నాయకులను,
అధికారులను...ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా....
"తరాలు"......., "తరాలు" ......తయారుచేసే నిత్య ఉపాధ్యాయులం  మేము.
*మా పనులు శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు.......
చెమటను సాక్ష్యం గా చూపడానికి......
మా పనులు బురదలోనో, ఖార్ఖానా లో చేసేవి కావు......
అనంత సాగరమైన విద్యను, విజ్ఞానాన్ని మధించి...
అక్షర సేద్యంలో నిరంతరం మానసికంగా అలసిపోయి, అర్థాంతరంగా తనువు చాలిస్తూ,
పదిమందికి బయటకు కనిపించే సాక్ష్యాలు .....
చూపలేని నిస్సహాయులం...
*మమ్మల్ని గౌరవించకున్నా ఫర్వాలేదు...
కించపరచకండి....ప్రతి వృత్తీ లోను....కొందరు పనికిమాలీనోళ్లు .... ఉంటారు.....
వాళ్ళను దృష్టి లో పెట్టుకోని.....మంచిగా పనిచేసే వాళ్ళ ను...మాటలతో... బాధించకండి
మమ్మల్ని పొగడకున్నా ఫర్వాలేదు...తూలనాడకండి...
అవును పంతులుగారు నేడు పరిస్థితి మారింది
అయినా ఇప్పుడు ఆధునిక విద్య అంటూ సెల్లు కొనిపించి ఆన్ లైన్ విద్య అంటూ చెప్పటం  తప్పఁని పరిస్థితి అవునుబాబు
కాలం మారుతున్నది మేము ఎం చేయలేక పోతున్నాం
మాభవిషత్తుకు ఎవరు ఎవరు సహాయపడతారో వేచి చూస్తాను
పంతులుగారు కాఫీ త్రాగుదామా
ఒక శిష్యుడుగా అడుగుతుంటే కాదనటం నేటి స్థితిలో అంత మంచిదికాదు పదా త్రాగుదాం
నోటికి మాస్కు చేతికి వ్యాజలీన్ వ్రాసుకో బాబు
ఏపుట్టలో ఏపామున్నదో ఎవరూ చెప్పఁలేరు అసలే సినిమాలలో మొదటి భాగం రెండవభాగం అంటున్నారు అట్లాగే రోగంలో కూడా మొదటి కరోనా రెండవ కరోనా అంటున్నారు మనజాగర్తలో మనం ఉంటె మంచిది   
మాఇంట్లో కాఫీ త్రాగుదాం అక్కడా ఇక్కడా ఎందుకూ
అట్లాగే పంతులుగారు ...
ఆ ........ ఆ......
--(())--
 

కాంతామణి గోపికమ్మా వచ్చినామమ్మా
మమ్ములను లేపదననే చెప్పితివి గదమ్మా
వేకువ కాలేదని బూకరిస్తివి నీవమ్మా
 మేమే వచ్చినానమ్మా ఇక నీవు లేవమ్మి

మంచి మాట కారివి నీవు గడుసు దానివమ్మా
నాలుకుందని మాట్లాడి సిగ్గును తెలపకమ్మా
కన్నులు తెరచి చూడు మేమసత్యమాడవమ్మా
అభిమానవతివమ్మా ఇక లేచి రావమ్మా

నీవు వేళ్ళే మార్గములో తోట బావుందమ్మా
కళ్ళుమూసి నడిచిన నిన్ను హరించి వేయునమ్మా
కలువలు వికసించె కలువలు మకులించేనమ్మా.
భక్తితో పూజచేయు పరిపూర్ణ జ్ణానివమ్మా

శంఖచక్రములతో ఉన్న కృష్ణుని చూడమ్మా
దీర్ఘబాహువులున్నట్టి కృష్ణుని ప్రేమించమ్మా
పంకజనేత్రుని సేవకు భక్తితో కీర్తించుటకమ్మా
నిత్యకైంకర్యాలకై అనునిత్యం సేవలకమ్మా

మార్గశి నెలలోన మగువల వ్రతముతో గోపికలమ్మా
పుణ్య వతులు చేయు పూజ నేడు చేసి చుండిరామ్మా   
గోదదేవి తెలిపి గోవిందు మహిమను ఈ తరుణమమ్మా  
భక్తి తోడ నిన్ను భజన చేయు సత్య మార్గమమ్మా   

సఖియ లంత జేయ  సౌభాగ్య వ్రతము ఇది యమ్మా  
పూల మాలలన్ని పూజ కొరకు ఏర్పాటు చేసిరామ్మా  
ముక్తి కోరు వారు భక్తితో చేయగ సంతోషపడితిరమ్మా  
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు నిజాయితీలమ్మా  

--(())--



          
       05....     జీవిత పరమార్ధం...!✍️️
                 ➖➖➖

   రుచించక పోయినా ఇదే యదార్థం!

   మూసిన కన్ను తెరవకపోయినా,    తెరిచిన కన్ను మూయకపోయినా,    శ్వాస తీసుకుని వదలకపోయినా,    వదిలిన శ్వాస తీయకపోయినా,    ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి             చూపు!

   మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం     నిర్థాక్ష్యిణ్యంగా   మరచి పోయేలా చేస్తుంది కాలం!

విరోధులైనా, స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం.

ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు!

  ఈ క్షణం మాత్రమే నీది,   మరుక్షణం ఏవరిదో?   ఏమవుతుందో ఎవరికి తెలుసు?

  ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే      అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా   నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో   
  పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు!

  ఈ ప్రపంచాన్ని శాసించేంత   గొప్పవారైనా, సంపన్నులైనా   బలవంతులైనా   అవయవక్షీణం-ఆయుఃక్షీణంను  
  తప్పించుకోజాలరు.   ఈ సృష్టిలో మనమే మొదలు కాదు,   చివర కాదు.

  ఈ దేహంలో మనం అద్దెకు   ఉండటానికి వచ్చాము.   అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు
  మన సామాన్లు మనం తీసుకెళ్లినట్టు   మనం చేసిన కర్మలను మనతో   మోసుకువెళ్లక తప్పదు...!

  చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న     ఆయుర్థాయం కూడా మనకి లేదు.  ఈ భూమ్మీద కాలమనే వాహనంలో   
  ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం.     మనం సహప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు
  అన్నీ భ్రమ, మాయ.

  అశాశ్వతమైన వాటిని   జపధ్యానములతో ఛేధిద్దాం.   అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం    ధ్యానం!

  అందుకే మనుషుల్లా జీవిద్దాం.   మనిషి ఎలా జీవించాలో చెప్పిన   రామాయణ,భారత, భాగవతాదులను  
  ఈ జీవితం ముగిసేలోపు   తెలుసుకుందాం. అందులోని   సంశయాలను తీర్చుకుందాం.

  దీపం ఉండగానే ఇల్లు   చక్కపెట్టుకోవడం అంటే పదవిలో   ఉండగానే సంపాదించుకోమని కాదు.

  భగవంతుడు ఈ శరీరాన్ని   ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు   ఆచరించి ఈ జీవకోటిలో మనిషి
  మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను   ఆచరించాలని పరమార్థం.

  ఓపిక ఉండగానే నిత్యం గురువుని   ఆశ్రయించి ఉపదేశంపొంది   ధర్మాచరణ, కర్మాచరణ చేద్దాం!

   నిరంతరం భగవత్     ధ్యానంతోఉంటూ,సత్యమైన మార్గం    ద్వారా ధనాన్ని ఆర్జించి, తోటి వారికి    ఎంతో కొంతపంచుతూ ఉన్నతంగా    జీవిద్దాం!..✍️️

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

****

06... 🙏 శ్రీమల్లికార్జున సుప్రభాతం 🙏
 
ప్రాతస్స్మరామి గణనాథమనాథబన్ధుం
సిన్దూర పూరపరిశోభితగణ్డయుగ్మమ్ ।
ఉద్దణ్డవిఘ్నపరిఖణ్డనచణ్డదణ్డ-
మాఖణ్డలాదిసురనాయకబృన్దవన్ద్యమ్ ॥ ౧॥

కలాభ్యాం చూడాలఙ్కృతశశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే ।
శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున-
ర్భవాభ్యామానన్దస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ ౨॥

నమస్తే నమస్తే మహాదేవ! శమ్భో!
నమస్తే నమస్తే దయాపూర్ణసిన్ధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబన్ధో!
నమస్తే నమస్తే నమస్తే మహేశ ॥ ౩॥

శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్,
సోమార్ధాఙ్కితమస్తకాం ప్రణమతాం నిస్సీమసమ్పత్ప్రదాం
సుశ్లోకాం భ్రమరామ్బికాం స్మితముఖీం శమ్భోస్సఖీం త్వాం సుమః ॥ ౪॥

మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !
లీలాలవాకులితదైత్యకులాపహారే !
శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ ॥ ౫॥

శమ్భో ! సురేన్ద్రనుత ! శఙ్కర ! శూలపాణే !
చన్ద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !
గఙ్గాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౬॥

విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వమ్భర ! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౭॥

కల్యాణరూప ! కరుణాకర ! కాలకణ్ఠ !
కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదలనోద్యత ! దేవ దేవ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౮॥

గౌరీమనోహర ! గణేశ్వరసేవితాఙ్ఘ్రే !
గన్ధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !
గణ్డావలమ్బిఫణికుణ్డలమణ్డితాస్య !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౯॥

నాగేన్ద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ ।
నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్ ॥ ౧౦॥

సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ !
రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః ।
సంహారశక్తిరపి శఙ్కర ! కిఙ్కరీ తే
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౧౧॥

ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే
నిశ్శఙ్కధీర్వృషభకేతన ! మల్లినాథ !
శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౧౨॥

పాతాలగాఙ్గజలమజ్జననిర్మలాఙ్గాః
భస్మతిపుణ్డ్రసమలఙ్కృతఫాలభాగాః ।
గాయన్తి దేవమునిభక్తజనా భవన్తం
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౧౩॥

సారస్వతామ్బుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుమ్బితకృష్ణవేణ్యాః ।
సోపానమార్గమధిరుహ్య భజన్తి భక్తాః
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౧౪॥

శ్రీ మల్లికార్జున మహేశ్వరసుప్రభాత
స్తోత్రం పఠన్తి భువి యే మనుజాః ప్రభాతే ।
తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీ శామ్భవం పదమవాప్య ముదం లభన్తే ॥ ౧౫॥

ఇతి శ్రీమల్లికార్జునసుప్రభాతం సమ్పూర్ణమ్ ।


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
07... 🌻 రుద్రుని ప్రతి రూపాలే రుద్రాక్ష 🌻

🍃🌼రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము.

🍃🌼రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి.

🍃🌼రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి.

🍃🌼ఎలాంటి కష్టనష్టాలు రావు.

🍃🌼అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష.

🍃🌼ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది.

🍃🌼రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.

🍃🌼తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు.

🍃🌼అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి.

🍃🌼అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది.

…
08... 🙏 ఓం నమః శివాయ 🙏


🍃🌺సమస్త జ్ఞానానికీ మూలమైనవాడు శివుడు. ఆయనే దక్షిణామూర్తి. అమ్మవారితో కలిసి సాంబసదాశివుడు. పదకొండు రుద్రులుగా దేవతలను రక్షించే మహారుద్రుడు. భక్తకింకరుడైన శంకరుడు. దేవతలందరికీ ఆరాధ్యుడైన మహాదేవుడు.

🍃🌺శ్రీమహావిష్ణువు దశావతారాలు ధరిస్తే, పరమశివుడు నూట ఎనిమిది రుద్రావతార లీలల్ని ప్రదర్శించి లోకాలకు శుభాలను ప్రసాదించాడు. జీవుల కర్మదోషాలకు శిక్షలు విధించే నవగ్రహాలకు శివుడే అధిపతి. అందుకే గ్రహబాధల నుంచి రక్షణకు శివారాధన చెయ్యాలంటారు.

🍃🌺పూజ, అర్చన, ఆరాధనలు- వివిధ స్థాయులకు చెందినవి. శివుడికి సంబంధించి అర్చన, ఆరాధన అనే మాటలు ఉపయోగిస్తారు. రుద్రార్చనలో నమక చమక మంత్రాభిషేకం, బిల్వార్చనలు ఉంటాయి. ఆరాధనలో ‘యత్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ అనే సంపూర్ణ శరణాగతి ఉంటుంది. ప్రతి చర్యా ఆయన సేవే అనుకోవాలి.

🍃🌺శివశరణం లభించడమంటే రుద్ర కవచం మనకు దక్కినట్లే. త్రిశూలపాణి మనకు అండగా ఉన్నట్లే. అయితే, వీటిని పొందగల అర్హత మనం ఆర్జించుకోవాలి.

🍃🌺అలా ఆర్జించుకోవాలంటే, రుద్ర నమక మంత్రం ‘సౌమనసశ్చమే’ అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. రుద్ర మంత్రాల ద్వారా మనం అనేక మహత్తరమైన ఆకాంక్షలను శివుడికి విన్నవించుకుంటాం. వాటిని మనకు అనుగ్రహించమని అర్థిస్తాం. అలాంటిదే ‘సౌమనసశ్చమే’. ‘మంచి మనసును నాకు ప్రసాదించు శివా!’ అనేది ఈ మంత్రార్థం.

🍃🌺మనిషి కష్టాలన్నీ మంచి మనసు లేకపోవటం వల్లనే కలుగుతున్నాయి. స్వార్థం, అసూయ, ద్వేషం లాంటి మహాపాషాణ విషాలు మన మనసులో తిష్ఠవేసుకుని ఉంటాయి. క్షీరసాగర మధన వేళ ఉద్భవించిన లోకభీకరమైన మహా వినాశనకారి అయిన హాలాహలాన్ని స్వీకరించిన పరమశివుడు మన మనసులోని పాషాణ విషాలను సైతం హరించివేయాలని మన ప్రార్థన, అభ్యర్థన. అవి తొలగిపోతే కానీ మనసు అమృతీకరణం చెందదు.

🍃🌺 అమృతీకరణం చెందిన మనసు అందరి క్షేమాన్నీ కోరుతుంది. ఉదారంగా, సౌమ్యంగా, సర్వజన ప్రియంగా వ్యవహరిస్తుంది. అప్పుడిక శత్రువులంటూ ఉండరు. శత్రుబాధలు లేనప్పుడు అశాంతి ఉండదు. ఇదే ఆనంద రహస్యం.

🍃🌺భగవంతుడు మనపట్ల ఉదారంగా ఉండాలనుకుంటాం. కానీ మనం ఎవరి పట్లా ఉదారత చూపం. ఆర్తితో అలమటిస్తున్నవారి పట్ల ఉదాసీనంగా ఉంటాం. ఉదారంగా ఉండేందుకు మనస్కరించదు. ఎవరికైనా దానం చేసేటప్పుడు మన దగ్గర ఉన్న అతి చిన్న నాణేన్ని వెతికి వెతికి తీసి మరీ వేస్తాం. అలా ఉంటుంది లోభత్వం.

🍃🌺మూడు రకాల మనుషుల్ని మనం చూస్తుంటాం. శక్తి ఉన్నా పైసా కూడా దానం చెయ్యని పరమ పీనాసులు ఉంటారు. తమ శక్తికి లోబడి సాయం చేసే జాగ్రత్తపరులు కనిపిస్తారు. తమ శక్తికి మించి ఆదుకునే అమృత హృదయులూ ఉంటారు.

🍃🌺భగవంతుడు అలాంటి అమృత హృదయుల్ని అక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే, దయగలవారే దైవ సమానులు. దయామూర్తులే దైవ పరివార సభ్యులు. దీనులకు దైవపరివారమే బంధువులు.

🍃🌺జన్మతః భగవంతుడు అందరికీ మంచి మనసునే ఇస్తాడు. ప్రాపంచిక ప్రలోభాలతో మనసు కలుషితమైపోతుంది. నిత్యం పాత్రలను శుభ్రం చేసుకున్నట్లే మనసునూ శుభ్రం చేసుకోవాలి. అందుకు శివారాధన అత్యుత్తమం.

🍃🌺 శివప్రీతికరమైన మాస శివరాత్రులు, సోమవారాలు, కార్తిక మాసంలో ప్రతి రోజును మనం శివారాధనలో సద్వినియోగం చేసుకుంటే, సౌమనస్కులుగా ఉండగలుగుతాం!


🙏 ఓం నమః శివాయ 🙏

09. 🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం  - 44 & 45 🕉

తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలంగ మహోద్యోగముసేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపాశములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివైచి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!

📍 తాత్పర్యం: 📍


🌹శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను వేడునది ఏమనగా  ’మనస్సు అత్యంత ఆసక్తి తో పరస్త్రీలతో సంగమించి సుఖించ గోరుచున్నది.

🌹పరద్రవ్యములను దొంగిలించవలెనను కొనుచున్నది. అందుకు అధిక ప్రయత్నములు చేయుచున్నది.

🌹నా మనస్సు దొంగయి నాకు తెలియకుండనే ఇట్టి దుష్ప్రయత్నములు చేయుచున్నది. కనుక నీవు ఈ దొంగను పట్టుకొని వైరాగ్యమను పాశములతో బంధించుము.

🌹పిమ్మట ఎచ్చటికి పోనీయక నీ పాదములను స్తంభమునకు కట్టివేయుము. ఆ విధముగ నాకు సంతోషమును ఆనందమును కలిగించుము.


🙏 ఓం నమః శివాయ 🙏
 

 *******

  10. రాముడొచ్చాడు!      (శ్రీరామచంద్రుని లీల)


                       ➖➖➖✍️

{చిన్నప్పుడు పుస్తకాలలో రామదాసుని రామలక్ష్మణులు వచ్చి ఆదుకున్నారని తానిషాకు  అప్పుతీర్చి   రామదాసుని రుణవిముక్తుడ్ని చేసారని చదువుకున్నాం.

కానీ ఈ మధ్య ఓ మిత్రుడు వాట్సాప్ లో ప్రస్తావించిన  ఓ సంఘటన నన్ను దాదాపు కళ్లనీళ్లపర్యంతం చేసింది.

అది మీతో పంచుకోవాలనిపించి ఈ క్రింద పొందుపరుస్తున్నాను.}

      వీధి గదిలో  ఆత్రంగా   అటూ ఇటూ తిరుగుతూ.. .హాల్లోని టీవీ వైపు ఆత్రుతగా చూస్తున్నారు సీతారావమ్మ గారు. అప్పటికే ఆవిడ స్నానం చేసి, మడిగట్టుకుని దేవుడి పూజ ముగించేరు.

ఆవిడ ఆత్రుత గమనించిన కోడలు వాణి, నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయింది. అరుగు మీద ఆడుకుంటున్న   మనవడు రామాన్ని పిలిచి 'టైము తొమ్మిదిన్నర కావొస్తుందేవిట్రా?' అని అడిగితే 'లేదు మామ్మా.. తొమ్మిదింపావు అయ్యింది' అంటూ పెరట్లోకి తుర్రుమన్నాడు.

'ఇంకో పావుగంటే ఉంది... కోడలు టీవీ పెడుతుందో లేదో.. అసలే ఇవ్వాళ సీతా స్వయంవరం కూడా..!పోనీ..నేనే వెళ్లి టీవీ పెట్టమని అడిగితే? ఒద్దులే.. మళ్ళీ ఏదో మాటందంటే బాధపడాలి.. అయినా బాధేముందీ? ఆ రాముణ్ణి చూడ్డం కోసం
ఎన్ని మాటలైనా పడొచ్చు' అనుకుంటూ ఉండగానే 'అత్తయ్యా.. టీవీ పెడుతున్నాను.. మీరు రావొచ్చు' అంటూ కోడలు పిలిచింది.

హమ్మయ్య అనుకుని వంగిన నడుముతో, పరుగులాంటి నడకతో గబగబా హాల్లోకొచ్చి టీవీ ముందు చేతులు జోడించి, ముడుచుక్కూచున్నారు సీతారావమ్మ గారు.

వాణి ఆ డయనోరా టీవీ కవరు పైకెత్తి, టీవీ పెట్టేసరికి 'రామాయణ్ కీ ప్రస్తుత్ కర్తా కోల్గేట్ పామోలివ్' అంటూ అడ్వర్టైజ్మెంటొస్తూంది. 'ఆ హిందీ ఏమో మీకు రాదు.. అయినా చిన్నపిల్లలా టీవీ చూడాలని ఆత్రుతొకటి' అంటూ వాణి విసుక్కుంటున్నా ఆ మాటలు పట్టనట్లు సీతారావమ్మ గారు రామాయణం చూడటంలో మునిగిపోయేరు.

పిఠాపురం పక్కనే ఉన్న కందరాడలో పుట్టిన సీతారావమ్మ గారికి చిన్నప్పటినుంచి శ్రీరాముడంటే విపరీతమైన భక్తి.   ఆవిడ పన్నెండో యేట తాలుకాఫీసులో పనిచేస్తున్న భమిడిపాటి రామానుజం గారితో వివాహం కుదిరినప్పుడు స్నేహితురాళ్ళు ఒకటే ఏడిపించేరు... 'నీ పిచ్చికి తగ్గట్టే మీ ఆయన పేరు కూడా రాముడే' నని.

రాజమాత వీధిలో రామాలయం దగ్గిరే రామానుజం గారిల్లు. సీతారావమ్మ గారు భర్త ఆఫీసుకెళ్ళిన తర్వాత పగలంతా ఇంటి పనులు చేసుకుని, పెరట్లోని పువ్వులు కోసి గుళ్ళోకి మాలలు కట్టడం, పడిపోయిన కొబ్బరి మట్టలు విరగ్గొట్టి వంటచెఱకు చెయ్యడం, రాలిపోయిన బూరుగుకాయల్లోంచి దూది తీసి బొంతలూ, దిళ్ళూ కుట్టడం లాంటి పనులు చేసుకుంటూండంతో గడిపేవారు. సాయంత్రప్పూట      ఇంటి      దగ్గిరున్న రామాలయానికెళ్ళి ఆ రాముడితో ఆ రోజు జరిగినవన్నీ చెప్పుకునేదావిడ.

పురిట్లోనే ఎందరో పిల్లలు పోగా లేకలేక పుట్టిన కొడుకు పురుషోత్తం. వీడి తర్వాత ఇంకొకరు పుడితే మొదట పుట్టిన వాణ్ణి అశ్రద్ధ చేసే ప్రమాదం ఉంది.. మనకొక్కడు చాలన్నారు రామానుజం గారు.

1983 లో    అనుకుంటా   ఎన్టీఆర్ ముఖ్యమంత్రయ్యాడు. వెంటనే గవర్నమెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ యాభై ఐదేళ్లకి తగ్గిస్తూ జి. ఓ ఇచ్చారు .       ఆ తర్వాత  రోజు కి రామానుజం గారికి     యాభై ఐదేళ్ళు నిండుతాయనగా, గుండాగి నూరేళ్ళు నిండిపోయాయి. ఆయన ఉద్యోగం పురుషోత్తం కి వచ్చింది. భర్త పోయిన కొంత కాలానికి కొడుకు పెళ్లి చేసేరు సీతారావమ్మ గారు.

అప్పట్నుంచీ ఆవిడ కష్టాలు మొదలయ్యాయి. గదిలోంచి బయటకొస్తే చాలు 'ఏంకావాలత్తయ్యా.. మీ గదిలోంచి బయటికొచ్చేరు? ' అంటూ కోడలడిగేది. ఏం కావాలి అంటే ఏమని చెబుతుంది.. తన పెళ్లైన తర్వాత నుంచీ తిరిగిన ఇల్లు మరి. అదే మధ్యాహ్నం పెరట్లోకి వెళ్లి పని చేసుకుంటూంటే మటుకు ఏమీ అడిగేది కాదా వాణి.

రామానుజం గారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు రాగానే కొడుకు బజారుకెళ్ళి పాతిక వేలెట్టి డయనోరా టీవీ కొనుక్కొచ్చేడు. 'అదే డబ్బుతో నువ్వు ఓ ఇల్లో, స్ధలమో కొనుక్కునుంటే బావుండేది నాయనా' అని ఆవిడనేసరికి కొడుకు, కోడలు వారం రోజుల పాటు మాటలు మానేసేరు.

ప్రతీ నెలాఖరుకీ తల్లికి పట్టుచీర కట్టి
పెన్షన్ డబ్బలకోసం రిక్షా లో తీసికెళ్ళేవాడు, పెన్షన్ డబ్బులు తీసుకుని కొడుకు చేతిలో పెట్టిన తర్వాత ఆ వైభోగం తీరిపోయేది.

శ్రీ రామనవమి వచ్చిందంటే ఉదయాన్నే పూజ చేసుకుని, ఆ మడి బట్టలతోనే రేడియో ఎదురుగా కూర్చుని సీతారామకళ్యాణం వ్యాఖ్యానం అంతా వినిగానీ ప్రసాదం తినేది కాదావిడ.

రెండుమూడుసార్లు అడిగిందావిడ కొడుకుని 'ఒరేయ్.. ఆ భద్రాచలం రాముడి కళ్యాణం చూడాలనుందిరా' అని. 'చూద్దాంలేవే' అంటూ దాటేసేవాడు. ఓరోజు కోడలంది 'ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలీదత్తయ్యా.. ఆయన్ని భద్రాచలం, తిరుపతి అంటూ ఇబ్బంది పెట్టకండి'.
ఆ తర్వాత ఇంకెప్పుడూ సీతారావమ్మ గారు భద్రాచలం ప్రసక్తి ఎత్తలేదు.

టీవీ లో రామాయణం చూస్తూంటే 'టీవీ మూలంగా కరెంటు వృధా అయిపోతూందని మీ అబ్బాయి బాధ పడుతున్నారు' అనేది వాణి.

దాంతో కోడలు టీవీ పెట్టి, పిలిస్తే చూడ్డం, లేకపోతే ఆ వీధి గదిలో కూర్చుని రాముణ్ణి తల్చుకోవడం.

ఆ ఏడాది పురుషోత్తం అడిగాడు 'నీ కోడలు, మనవడు వేసవిలో ఊటీ వెళ్దామని సరదా పడుతున్నారు.మేము ముగ్గురం వెళ్ళేమనుకో
ఇంట్లో ఒక్కదానివీ ఉండగలవా అమ్మా?'

'నిక్షేపంగా ఉంటారు.. మనం ఉంటే ఇబ్బంది గానీ లేకపోతే మహారాణీ లా ఉంటారు అత్తయ్య గారు ' జోకేసాననుకుని కిసుక్కున నవ్వింది వాణి.

'హాయిగా వెళ్లి రండి నాయనా.. నా గురించి మీరు ఇబ్బంది పడక్కరలేదు' అన్నారు సీతారావమ్మ గారు.

పురుషోత్తం వాళ్ళు    వెళ్ళిన తర్వాత అర్ధమైందావిడకి తను చేసిన తప్పు.
రేడియో కొడుకు గదిలో ఉండిపోయింది.. కోడలు ఆ గదికి తాళం పెట్టుకునెళ్ళిపోయింది. ఎల్లుండి శ్రీ రామనవమి... ఈసారి తన రాముడి కళ్యాణం ఎలా వినాలి?  పోనీ పక్కింటికెళ్తే? వద్దులే.. మళ్ళీ వాళ్ళు తన కొడుకు గురించి తప్పుగా అనుకుంటారు.

ఆవిడలా మధనపడుతూంటే తటాలున వచ్చిందా ఆలోచన.    పోనీ భద్రాచలం వెళ్లిపోతే? అవును.. అక్కడికెళ్ళాలే గానీ ఆ రాముడే తనను చూసుకుంటాడు. వెంటనే గబగబా తన ఒత్తుల డబ్బా వెతికిందావిడ.. డబ్బులెంతున్నాయో చూద్దామని.

అన్నీ కలిపి ఐదు రూపాయలు దొరికాయావిడకి. ఏం చెయ్యాలో తోచలేదు. ముందుగా బస్టాండుకెళ్ళి కనుక్కుందాం.. టిక్కెట్టు ఎంతవుతుందో.. ఏమైనా తను
తన రాముడి కళ్యాణం    చూడ్డానికి వెళ్తూంది.    తనను తీసుకెళ్ళే బాధ్యత
ఆ రాముడిదే అనుకుంది. నాలుగు చీరలు మూట కట్టుకుని, బయటకొచ్చేసి, భర్త కట్టిన ఆ ఇంటికేసోసారి ఆప్యాయంగా చూసి బస్టాండుకి నడుచుకుంటూ వెళ్ళింది.

బస్టాండు లో    కనుక్కుంటే చెప్పారు, భద్రాచలానికి మధ్యాహ్నం రెండింటికి బస్సుందని, యాభై రెండు రూపాయలు టిక్కెట్టనీ. ఏంచెయ్యాలో అర్థం కాలేదావిడకి. ఏదైతే అయ్యింది.. ఆ డ్రైవరు కాళ్ళట్టుకునైనా
వెళ్ళిపోదామనుకుంది.

రెండూపదవుతూండగా బస్సొచ్చింది. ఆశ్చర్యంగా పెద్ద రద్దీగా లేదు. కొంచెం రద్దీగా ఉండుంటే గుంపులో గోవిందలాగా టిక్కెట్టు కొనడం తప్పించుకోవచ్చు. ఇప్పుడు తప్పదు..ఇంకా డ్రైవరూ, కండక్టర్ల కాళ్ళట్టుకోవల్సిందే. వాళ్ళ కాళ్ళట్టుకుంటాను కానీ వాళ్లు ఒప్పుకునేలా చూడు తండ్రీ అని రాముణ్ణి తల్చుకుంది. బస్సెక్కి ఆఖరి సీటులో కిటికీ పక్కన కూర్చుంది.

కాసేపటికి బస్సు బయల్దేరింది. కండక్టర్ తీరిగ్గా అందరి దగ్గిరకీ వెళ్లి టిక్కెట్లు కొడుతున్నాడు. సీతారావమ్మ గారి దగ్గిరకొచ్చి టిక్కెట్టమ్మా అనేసరికి ఆవిడకి నోటమాట రాక ఐదు రూపాయల చిల్లర చూపించి చేతులెత్తి దణ్ణం పెట్టేరు.

కండక్టర్ చిరాగ్గా చూసి 'టిక్కెట్టు డబ్బులివ్వకుండా అలా చేతులెత్తి దణ్ణం పెడితే ఎలాగమ్మా?' అని ఆవిడ కాళ్ళ దగ్గిరున్న చేతిసంచీ తీసుకుని, అందులోనుంచి యాభై నోటూ, ఈవిడ చేతిలోంచి రెండు రూపాయలూ తీసుకుని చేతిలో టిక్కెట్టెట్టి వెళ్ళిపోయేడు.

ఆవిడకి మతోయింది.. ఆ సంచీ నిండా డబ్బులు!  ఈ సంచీ తనది కాదు.. ఎవరి డబ్బో తనకెందుకు? ఆ డ్రైవరు, కండక్టర్లు ఏవైనా దయ తలిస్తే వెళ్దామనుకుంది కానీ ఇంకొకరి డబ్బుతో కాదు.

నిశ్చయించుకుని కండక్టర్ దగ్గిరికెళ్ళి నిజాయితీగా జరిగింది చెప్పి, ఈ సంచీ తనది కాదంది. ఆ కండక్టరు 'భలే వారమ్మా మీరు.. ఇది ఆడాళ్ళ చేతిసంచీ..ప్రస్తుతం ఈ బస్సులో ఉన్న ఆడమనిషి మీరొక్కరే. అలాంటప్పుడు ఇది మీది కాక వేరెవరిదవుతుందీ? ఏవయ్యా.. ఈ సంచీ మీదా?' అని బస్సులో ఉన్న మిగతా పాసింజర్లని అడిగితే వారంతా మాది కాదన్నారు.

డ్రైవరు అన్నాడు 'మీదే అయ్యుంటాదమ్మా.. మీరెళ్ళి హాయిగా ఆ సీట్లో పడుక్కోండి.. భద్రాచలం వచ్చిన తర్వాత లేపుతాం'

ఇంకేం చెయ్యలేక వెళ్లి తన సీట్లో రాముణ్ణి తల్చుకుంటా కూచున్న సీతారావమ్మ గారికి మాగన్నుగా నిద్దరట్టేసింది.

తెలవారుతూండగా కండక్టర్ నిద్ర లేపి 'భద్రాచలం వచ్చేసిందండి.. మీ రాముడి కళ్యణానికెళ్ళండి' అనేసరికి అప్పుడే భద్రాచలం వచ్చిందా.. తన రాముడి ఊరికొచ్చేసేనా.. ప్రభూ అంతా నీ దయ అనుకుంటూ మళ్లీ వెళ్లి ఆ డ్రైవరు, కండక్టర్లతో చెప్పింది 'బాబులూ.. ఈ డబ్బులు నిజంగా నావి కావు.. ఎవరివో ఏంటో మీరే కనుక్కుని ఇచ్చేద్దురూ'

'ఆ డబ్బులు మీవే అయ్యుంటాయమ్మా..మీరెక్కువగా ఆలోచించక మీ రాముడి కళ్యాణం చూసుకోండి' అన్నాడు కండక్టరు.

' ఈ సొమ్ము ఆ రాముడి సొమ్మే అనుకుని హుండీలో వేసేస్తాను.. నన్ను భద్రంగా ఇక్కడికి తీసుకొచ్చిన మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను బాబూ.. మీ పేర్లు? ' అని సీతారావమ్మ గారడిగితే కండక్టరు నవ్వేసి' పెద్ద గొప్ప పేర్లేవీ కాదులెండి.. నా పేరు లక్ష్మణరావు, ఆ డ్రైవరు గారి పేరు రామారావు ' అనేసి ఆ తెల్లవారుజాము చీకట్లో కలిసిపోయారాళ్ళు.

ఇది నిజంగానే జరిగిందా లేక రచయిత కల్పనో తెలియదు కానీ నిజమైతే బాగుండును అన్న ఓ చిన్న ఆశ తో ముగిస్తున్నా. ✍️ 

శుభరాత్రి... ఆనందమస్తు

నేడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి

 శ్రీ దత్తాత్రేయ స్వామివారి సంక్షిప్త చరిత్ర తెలుసుకుందాము.🙏🙏🙏

శ్రీ దత్తాత్రేయ స్వామివారి సంక్షిప్త చరిత్ర

ఆధిభౌతికం,ఆధిదైవికం,ఆధ్యా త్మికం అనే తాపాలను తొలగించుకున్న అత్రి మహర్షుల వారికి,కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించిన అనసూయ మాతకు, కృతయుగంలో ఇప్పుటి నేపాల్‌ ప్రాంతంలోని చిత్రకూట పర్వతం వద్దనున్న అనసూయా పహాడ్ అనేచోట ఒకానొక వైశాఖ బహుళ దశమీ గురువారంనాడు రేవతీ నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంశయందు ‘బ్రహ్మ అంశమున చంద్రుడు,విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసులుగా’ దత్తాత్రేయులవారు జన్మించారు. తర్వాత చంద్రుడు,దుర్వాసుడు తమ తమ అంశములను దత్తునిలో నిక్షిప్తం చేసి తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

బాల్య లీలలు :
————–
ఈ బాలుడు సామాన్యుడు కాదని అఙ్ఞానులను ఙ్ఞానమార్గాన నడిపి కైవల్యము చేర్చే మార్గదర్శకుడని ఙ్ఞానులు ఆయన్ను ప్రసంశించేవారు. దత్తులవారు మాత్రం గురుశుశ్రూష చేయక బాలునిగా, ఉన్మత్తునిగా, పిశాచపీడితునిలా విహరిస్తుండేవారు, అది చూచి సంశయించేవారు ఆయన కృపకి దూరమయ్యేవారు. ఒకసారి ఆశ్రమవాసులు, వయోవృద్ధులు దత్తస్వామిని చేరి గురువై తమను అనుగ్రహించవలసిందని ఆయన్ను కోరారు. దత్తులవారు వారితో ఏమీ మాట్లాడకుండా ఏకాంత నిష్టలో ఉండటానికి బయలుదేరారు, ఆశ్రమవాసులు ఆయన్ను వెంబడించారు. అది గమనించిన దత్తప్రభువు దగ్గరలో వున్న సరోవరంలో దిగి అదృశ్యులయ్యారు.

ఆయన్ను వెంబడిస్తూ వచ్చినవారు ఆయన దర్శనంకోసం అక్కడే వేచివున్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచేవరకు వారి సహనాన్ని, వారి దృఢ సంకల్పాన్ని పరిక్షించిన పిదప దత్తస్వామి వారి నమ్మకాన్ని పరిక్షించదలచి, ఒక స్త్రీని ఎడమతొడపై కూర్చోబెట్టుకుని సరోవరంలోంచి బయటకు వచ్చారు. దత్తులవారు ఈ విధంగా దర్శనమిచ్చినప్పటికీ ఆశ్రమవాసులు దృఢచిత్తులై అక్కడనుండి కదలలేదు. అప్పుడు దత్తులవారు మద్యాన్ని సేవిస్తూ. వెంటతెచ్చిన స్త్రీతో సరసాలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటన కొందరిలో చిత్తచాంచల్యాన్ని కలిగించింది, ఇలా చిత్తం చెదిరినవారు – ఇటువంటి దురాచారుడు, స్త్రీలోలుడు ఆశ్రితులనెలా ఉద్ధరిస్తాడు? అంటూ ఆయన్ని విడిచివెళ్లారు(ఇటువంటివారినే శ్రీసాయి బాబా రాలిపోయే పూతతో పోల్చారు). అక్కడే మిగిలిన అతి కొద్దిమంది మాత్రం అక్కడ జరుగుతున్న చర్యల్ని పట్టించుకోకుండా చిత్తాన్ని కేవలం దత్తప్రభువుపైనే నిలిపివుంచి ఆయన్ని ఇలా స్తుతించారు – ఓ మహానుభావా నీవు యోగీశ్వరుడివి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపూడివి, నిర్గుణుడవైనప్పటికీ భక్తులనుద్ధరించడానికి ఇలా సగుణరూపంలో సంచరిస్తున్నావు. ఇకనైనా ఈ దీనులని పరిక్షించటంమాని, నీ ఆశ్రయం కోరివచ్చిన మమ్ము ఉద్ధరించు ప్రభూ అంటూ స్తుతించగా, వారి ప్రార్ధనను మన్నించిన దత్తప్రభువు ఆ మునులకు తన నిజరూపాన్ని చూపి అనుగ్రహించారు.

ఈ విధంగా ఆశ్రమవాసుల్ని అనుగ్రహించిన తర్వాత దత్తప్రభువు తన తల్లిదండ్రుల చెంతకు వచ్చి, భక్తులను అనుగ్రహించడానికి, ప్రజలను సన్మార్గవర్తనులను చేయడానికి నేను సహ్యాద్రికి వెళ్లాలి నన్ను ఆశీర్వదించమనగా, సర్వఙ్ఞురాలైన ఆ మాత కూడా పుత్రవ్యామోహముతో అంగీకరించక – నా వద్దనే ఉండు,నన్ను విడిచి వెళ్లకని బ్రతిమాలింది. దత్తుల వారు పట్టు విడవకపోవడంతో – నా వల్ల కలిగిన దేహాన్ని నాకు ఇచ్చి నీ ఇచ్ఛ ప్రకారం నడుచుకోమని నిష్టూరమాడింది. దత్తాత్రేయుల వారు నవ్వుతూ తన చర్మాన్ని గోళ్లతో చీల్చి తన దేహాన్ని తల్లికి ప్రసాదించారు. ఆ దృశ్యాన్ని చూచిన అనసూయమాతకు దేహం నాశనమయినప్పటికీ, ఆత్మ శాశ్వతమనే సత్యం స్ఫురించినదై – కుమారా తల్లికి సహజమైన మాతృవ్యామోహంతో నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను, అఙ్ఞానంతో అలమటించే మానవాళికి ఙ్ఞానాన్ని ప్రసాదించే మోక్షమార్గాన్ని అనుగ్రహించు అన్నది.

వ్యామోహం సత్యాన్ని మరుగుపరుస్తుందనే విషయం తెలియజేయడానికే ఈ లీల జరిగిందని మనం గ్రహించాలి.

దత్తప్రభువు దినచర్య :
———————
దిగంబరుడూ,శరీమంతా భస్మం పులుముకొన్నవాడు,ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్టకలవాడూ,ప్రసన్నుడు,నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు –

ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన,స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాల్గువేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా – ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగాగల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు.కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు,నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి. ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల గానం చేస్తూంటే. అప్సరసలు నృత్యం చేస్తూండగా దత్తప్రభువులు ప్రతిదినమూ దర్బార్ నిర్వహిస్తూవుంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి, స్మరించినంత మాత్రానే ఇహ, పర సౌఖ్యాలు కలుగజేస్తుంటాడు.

శ్రీ దత్తుల వారికి అవధూత అనే బిరుదువున్నది – అవదూతోపనిషత్తు ప్రకారం ఆ పదానికి అర్ధం.
జిల్లా
శ్లో II అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్
తత్వమస్యాది లక్ష్యత్వదవదూత ఇతీర్యతే II

తా II నాశరాహిత్యమూ,శ్రేష్టత్వమూ. విదిలించి వేయబడిన సంసారబంధము తత్త్వమసి అనే మహావాక్యానికి లక్షమవ్వడం వలన,అట్టి వారిని అవధూత అని చెబుతారు.

కార్త వీరార్జుని వృత్తాంతం :
————————-
త్రేతాయుగంలో ’హైహయ’ వంశానికి చెందిన కృతవీరుడనే చక్రవర్తి ’మహిష్మతి’ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు. అతని భార్య శీలధారా దేవి. వీరికి ఎంతో మంది సంతానం కలిగినప్పటికీ, చ్యవన మహర్షి శాపం వల్ల ఒక్కరూ బ్రతకడంలేదు. సంతానం నిలబడటానికి ఎన్నో యాగాలు, పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో శీలధారా దేవి ఎంతో మనో వేదనకు గురైంది. ఒకరోజు వారికి యఙ్ఞవల్క్య మహర్షుల వారిని దర్శించే భాగ్యం కలిగింది. మహర్షుల వారి సతీమణి మైత్రేయి మాత వారి వ్యధ విని వారికి అనంత వ్రతం చేయమని చెప్పి, వ్రత విధానం తెలియజేసింది. ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నప్పుడు, దేవగురువు బృహస్పతి వారి ఇంటికి విచ్చేసి వారిని సూర్యభగవానుణ్ని కూడా ఆరాధించమని చెప్పి ఆలా చేస్తే పాపాలు నశించి పుత్ర సంతానం కలుగుతుందని తెలియజేస్తాడు. వారు చెప్పినట్లే ఆచరించిన కొన్ని రోజుల తర్వాత శీలధారా దేవి గర్భం ధరించి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఐతే ఆ బాలుడు చూడ ముచ్చటగా వున్నప్పటికీ, అతని చేతులు వంకర తిరిగి సన్నగా బలహీనంగా వుండి వేలాడుతున్నాయి. అంగ వైకల్యం గల పిల్లవాడు పుట్టేసరికి వారు ఎంతో దుఃఖించారు. అయినప్పటికీ ఆ బాలుణ్ని వారు ఎంతో ముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడికి అర్జునడనే పేరు పెట్టారు. కృతవీర్యుని కొడుకు కావడం వల్ల కార్తవీరార్జునుడయ్యాడు. కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. రాజ్యభారం వహించడానికి కార్తవీరునికి అంగవైకల్యం దృష్ట్యా అర్హత లేకపోవడం వల్ల మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు ద్వారా శక్తులను పొంది రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. గర్గ మహాముని కార్తవీరునికి శ్రీ దత్తాత్రేయుల వారే ఈ వైకల్యాన్ని నివారించగలరని చెప్పి వారిని దర్శించుకోడానికి సహ్యాద్రికి వెళ్లమని రాజుకి చెప్తాడు. దత్తాత్రేయుల వారిని దర్శించినప్పుడు వారు తమ భక్తుల భక్తి శ్రద్ధలను కఠినంగా పరిక్షించి, ఆ తర్వాతే అనుగ్రహిస్తారని చెప్పి దేవేంద్రుడు దత్తుల వారి అనుగ్రహం వల్ల జంభాసురుని ఏ విధంగా వధించాడో తెలియజేస్తారు.

జంభాసురుడు దేవతలని జయించినప్పుడు ఇంద్రుడు దేవ గురువు బృహస్పతిని మార్గం తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి సహ్యాద్రి పై కొలువై ఉన్న దత్త ప్రభువులే ఈ సమస్యని పరిష్కరించగలరని చెప్పి, ఆయన అనుగ్రహం పొందడంలో ఎదురయ్యే ఆటంకాలు జయించిన వారికే ఆయన తన నిజరూప దర్శనమిస్తాడని, దానికి ఎంతో భక్తి, శ్రద్ధలు అవసరమని చెప్తాడు. ఇంద్రుడు సహ్యాద్రికి చేరుకుని దత్తుల వారి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఆయన మగువతో కలిసి మద్యాన్ని పానం చేస్తూ కనిపించారు. ఇలా ఎన్ని పరీక్షలు ఎదురయినా దేవేంద్రుడు ఆయన్ని విడువక సేవిస్తూనే వున్నాడు. కొన్ని రోజులకి ఇంద్రుని భక్తికి ప్రసన్నుడైన దత్త ప్రభువు తన నిజ రూపంలో దర్శనమిచ్చి జంభాసురుని సహ్యాద్రికి వచ్చేలా చెయ్యమని చెప్తాడు. ఇంద్రుడు జంభాసురుని కవ్వించి అతన్ని సహ్యాద్రికి వచ్చేలా చేస్తాడు. జంభాసురుడు తన సైన్యంతో సహా సహ్యాద్రికి రాగానే వాళ్లకి మహాసౌందర్యవతియైన అనఘా దేవి కనిపిస్తుంది. ఆమె సౌందర్యానికి మోహితులై యుద్ధాన్ని చేయడం మాని ఆమెను పల్లకీలో కూర్చోబెట్టారు. ఆమెను ముందుగా ఎవరు పొందాలని వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు దత్తప్రభువు ఇంద్రున్ని పిలిచి రాక్షసులను ఓడించడానికి ఇదే సరైన సమయం అని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వారిని సునాయాసంగా ఓడిస్తాడు. అలా ఇంద్రుడు దత్త ప్రభువుల కృపకు పాత్రుడై తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని పై వృత్తాంతాన్ని గర్గముని, కార్తవీరునికి తెలియజేస్తారు.

కార్తవీరార్జునుడు సహ్యాద్రి చేరి దత్తప్రభువుని దర్శించి, భక్తి శ్రద్ధలతో వారిని సేవించిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసన్నులై అతని వైకల్యాన్ని నివారించారు. అంతేగాక అతనికి వేయి బాహువులను, ఇతరుల మనసులను గ్రహించే శక్తిని అనుగ్రహించి, తనంత వాడి చేతిలో మరణం పొందే వరాన్ని ఇచ్చారు. దత్త ప్రభువు అనుగ్రహ బలం చేత కార్తవీరార్జునుడు రావణాసురుడ్ని యుద్ధంలో ఓడించాడు. అలా చాలా కాలం రాజ్య పాలన చేసిన తర్వాత రాజ్యభోగాల పట్ల విసుగు చెంది సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా కలిగి దత్త ప్రభువుని ఆశ్రయించాడు. లౌకిక శాస్త్రాలు విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి, తత్త్వ శాస్త్రానికి పండితులు తెలియజేసే అర్ధాలు పరస్పర విరుద్ధంగా వుండి సాధకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి అని దత్త ప్రభువుతో చెప్పగా. దత్త ప్రభువు “కార్త వీర్యా ! కొన్ని అర్ధాల్లో బాహ్యంగా బేధాలు కనిపించినా, అవి ఒకే తత్త్వాన్ని భిన్నమైన కోణాల్లోంచి ప్రతిపాదించిన సూత్ర పరిశీలనలు మాత్రమే. ఉత్తమమైనది తత్త్వ శాస్త్రమే. అలా అని ఇతర శాస్త్రాలు లౌకికములు అని వాటిని నిరసించరాదు. శాస్త్రాలన్నీ మంచి మార్గానికి దారి చూపేవే. వాటి ద్వారా కూడా ముక్తి సాధించవచ్చు.” అని చెప్పారు. ఆ తర్వాత అతనికి నిర్వికల్ప సమాధి స్థితి కలుగజేసి, ఆత్మ తత్త్వం విచారణ చేసే పద్ధతులను తెలియజేసి అతన్ని ఆశీర్వదించారు. చివరికి కార్త వీరార్జునుడు తాను పొందిన వరం వల్ల పరశురామ అవతారంగా వచ్చిన భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు.

ఙ్ఞానబోధ :
———-

దత్తాత్రేయుల వారు అలర్కునికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఙ్ఞానబోధ చేసారు.

షోడశ అవతారాలు :
——————-
1.యోగిరాజు 2.అత్రివరదుడు 3.శ్రీ దత్తాత్రేయుడు 4.కాలాగ్ని శమనుడు 5.యోగిజన వల్లభుడు 6.శ్రీ లీలా విశ్వంభరుడు 7.సిద్ధరాజు 8.ఙ్ఞాన సాగరుడు 9.విశ్వంభరావధూత 10.శ్రీ అవధూత 11.మాయాముక్తావధూత 12.ఆది గురువు 13.శివరూపుడు 14.శ్రీ దేవదేవ 15.దిగంబరుడు 16.శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు.

**శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారాలని చెప్పబడింది.ఆయన పరతత్త్వంతో నిత్యం భూలోక నివాసం చేస్తాడు గనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారని మనం గమనించాలి.
ఈ దత్తప్రభువు మానవజాతి నిలిచివున్నంతవరకూ గురురూపంలో మానవాళిని ఉద్ధరించడమే తన కార్యంగా చేసుకుని, వివిధ గురుసంప్రదాయాల ద్వారా అన్నిమతాల్లో, ప్రతియుగంలో 1,25,000 మంది అవధూతలు, మహాత్ముల రూపంలో ఈ భూమిపై తన కార్యం నిర్వహిస్తూవుంటారు. అట్టి గురుపరంపరలో భాగంగా, కలియుగంలో ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గరగా ఉన్న శ్రీ పీఠికాపురం (పిఠాపురం) అనే గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభులుగా దత్తప్రభువు తన ప్రపధమ అవతారాన్ని ప్రకటించారు.

కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః

తా II కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు,ద్వాపర యుగములోకృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలో తెలియజేసారు.

 జై గురుదత్త జై గురుదత్త
pranjali prabhaku pampinavari ki  krutajnatalu
సౌజన్యం...
 శ్రీ చొప్పకట్ల.సత్యనారాయణ
రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్



Saturday, 26 December 2020

29-12-2020


ఉపవాసం

ఉపవాసం పాటిస్తున్న రోజుల్లో తలకు మరియు శరీరానికి నూనె ఎందుకు రాసుకోరాదు?* 🌻

రోజంతా ఉపవాసం లేదా రోజులో కొంతభాగం ఉపవాసమును పాటిసున్న రోజులలో తలకు

మరియు దేహానికి నూనె రాసి స్నానం చేయకూడదు

నూనెను అద్దుకొని స్నానం చేయడం భారతీయులకు సర్వసాధారణమే. మరి ఉపవాస రోజులలో ఎందుకు అలా తగదని చెప్పబడింది దీని వెనుక శాస్త్రీయ కారణం దాగి వుంది

శని గ్రహం శక్తి ప్రభావం వల్ల నూనె ఉత్పన్నమైనట్టుగా భావించడం జరిగింది. తలకు నూనె అంటుకోవడం వల్ల తల చుట్టూ ఓ తేజోవలయం ఏర్పడుతుంది. 

ఈ వలయం ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రసరించే అయస్కాంత తరంగాలను నిరోదిస్తుంది. కానీ ఉపవాసం పాటించు రోజుల్లో ఇది వేరుగా చెప్పబడింది. ఉపవాస దీక్షను పవిత్ర మనస్సు మరియు శరీరముతో ఆచరించడం జరుగుతుంది 

కాబట్టి మన శరీరానికి ఇతర గ్రహాల మరియు నక్షత్రాల నుండి భూమిపైకి ప్రసరించే అయస్కాంత తరంగాల అవసరం ఉంటుంది. 

తలపై రాసిన నూనె ఈ శక్తి తరంగాలను మనలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఇలాంటి నిషేదాన్ని ఉపవాసముండు రోజులలో ఏర్పాటు చేసారు మన పెద్దలు.

--(())--


☘️ *తులసి మొక్క ప్రాధాన్యత* ☘️

తులసి మాత

🍃🌹భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం.

🍃🌹అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?

🍃🌹మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియనివి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

🍃🌹మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి.

🍃🌹కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచి పెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

🍃🌹తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.

🍃🌹అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

🍃🌹తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది.

🍃🌹తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.

🍃🌹తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

🍃🌹తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

🍃🌹ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.

🍃🌹తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట.

🍃🌹అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

🍃🌹తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.

🍃🌹అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

🍃🌹మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

🍃🌹తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం.

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

     *ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

        *శ్రీ భాగవతం - 90 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 20*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

*గోపికా వస్త్రాపహరణం:* 

భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత చేసిన లీలలు అనేకము ఉన్నాయి. అందులో *గోపికా వస్త్రాపహరణ ఘట్టము* పరమ ప్రామాణికమయినది. 

ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల. 

బృందావనంలో వుండే గోపకాంతలు అందరూ కూడా కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఒక విచిత్రమయిన విషయం. 

ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడయిన వరుడు ఒక యింట్లో ఉన్నాడనుకోండి ఆ ఊళ్ళో ఉన్న కన్యలందరూ ఎక్కడైనా అతనిని భర్తగా పొందాలని సామూహిక పూజ చేస్తారా? చేయరు. కానీ ఇక్కడ గోపకాంతలు అటువంటి పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి కృష్ణుడి వ్రతం చేయలేదు. 

ఇది వ్యాసుని సర్వోత్క్రుష్టమయిన ప్రతిపాదన. వారు మార్గశీర్ష మాసములో ఒక వ్రతము చేశారు. యథార్థమునకు *భాగవతంలో గోపకాంతలు మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం.* వీరందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు. 

*కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది కాబట్టి పార్వతీ దేవికి కాత్యాయని అని పేరు.*  పార్వతీదేవిని ఉపాసన చేశారు. 

కృష్ణుడిని ఉపాసన చేసి కృష్ణుని భర్తగా పొందాలి. కానీ మధ్యలో కాత్యాయనీ దేవి పేరుతొ పార్వతీదేవిని ఉపాసన చేస్తే, కృష్ణుడు ఎలా భర్త అవుతాడు? 

ఇందులోనే ఒక చమత్కారం ఉంది. ఇందులోనే ఒక రహస్యం ఉంది. 

*శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణి అని పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ నారాయణి వీరు భార్యాభర్తలు కాదు. అన్నాచెల్లెళ్ళు. అందుకే వీరిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. కృష్ణుడికి కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతలు అందరూ కాత్యాయనీ వ్రతం చేస్తారు.* 

గోపకాంతలు ప్రతిరోజూ ఇసుకతో కాత్యాయనీ దేవి మూర్తిని చేసేవారు. 

*కాత్యాయని మహామాయే మహాయోగి న్యధీశ్వరీ* 

*నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమ!!*

*కం.*

*ఓ కాత్యాయనీ భగవతి*

*నీకున్ మ్రొక్కెదము మేము నెడనుకంపన్*

*మాకిందఱకున్ వైళామ*

*శ్రీకృష్ణుడు మగడుగాగ జేయుము తల్లీ!*

అదీ వాళ్ళు చేసిన సంకల్పం. వారందరూ లౌకికమయిన భర్తను అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యము అవడం కోసమని అమ్మా! నీ అనుగ్రహం కలగాలి. మాకు కృష్ణుడిలో కలిసిపోయే అదృష్టం కలగాలి అని దానిని భార్యాభర్త్రు సంబంధంగా మాట్లాడుతున్నారు. 

ఆ వ్రతమును ముప్పది రోజుల పాటు మార్గశీర్షంలో చేయాలి. ప్రతిరోజూ గోపకాంతలు నిద్రలేచేవారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా యమునా నదీ తటము దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది. కదంబవృక్షం, కడిమి చెట్టు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమయినది. అమ్మవారికి *‘కదంబ వనవాసిని’* అని పేరు. 

అక్కడ సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయడం కోసమని యమునా నదిలోనికి దిగారు. 

ఇంతమంది కలిసి వివస్త్రలై యమునా నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు. వారు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయమును తెలుసుకున్నారు. 

ఇప్పుడు గోపకాంతలు కాత్యాయనీ దేవి ఉపాసన చేసి ఫలితమును అడుగుతున్నారు. ఫలితము ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు. వాళ్ళ భక్తి అంత గొప్పది. 

కానీ వారు చేసిన కర్మయందు తేడా వచ్చింది. ఆ దోషము ఉన్నంత సేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది. ఫలితమును ఇవ్వడం కుదరదు. 

ఈశ్వరానుగ్రహం కలిగితే ఏది ప్రతిబంధకంగా ఉన్నదో దానిని ఈశ్వరుడు తీసివేస్తాడు. ఈ ప్రతిబంధకమును కాత్యాయనీ దేవి తియ్యాలి. కానీ యిక్కడ ప్రతిబంధకమును తొలగించడానికి కృష్ణుడు వస్తున్నాడు. దీనిని బట్టి కాత్యాయని, కృష్ణుడు వేర్వేరు కాదని మనం అర్థం చేసుకోవాలి. కాత్యాయని ఆడది, కృష్ణుడు పురుషుడు అదెలా కుదురుతుంది అని మనకి అనుమానం రావచ్చు. కానీ పరమేశ్వరుడికి రూపం లేదు. ఆయన జ్యోతి స్వరూపము. కంటితో మేము చూడకుండా ఉండలేము అన్నవారి కోసమని ఒక సగుణమయిన రూపం ధరించి పరమాత్మ ఈ భూమిమీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపమా అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఇప్పడు ఇక్కడ అంతటా వున్నవాడు సాకారత్వమును పొంది ఫలితమును యివ్వడానికి కృష్ణుడిగా వస్తున్నాడు. 

కృష్ణుడు గోపాల బాలురందరినీ పిలిచి మీరందరూ నిశ్శబ్దంగా ఇక్కడినుండి వెళ్ళిపొండి అన్నాడు. నిజంగా కృష్ణావతారం స్త్రీల మాన మర్యాదలను పాడుచేసే అవతారం అయితే కృష్ణుడు అలా అని ఉండేవాడు కాదు. కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం వారు అక్కడినుండి వెళ్ళిపోయారు. వారికి వ్యామోహం లేదు. కృష్ణుడు ఏమి చేస్తాడో చూడాలన్న తాపత్రయం లేదు. ఈయన మాత్రం గోపకాంతల వస్త్రముల నన్నిటిని పట్టుకుని కడిమిచెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇపుడు స్త్రీలు అందరూ నీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు అన్నారు 

*కొంటివి మా హృదయంబులు;*

*గొంటివి మానంబు; లజ్జ గొంటివి; వలువల్*

*గొంటి; వికనెట్లు చేసెదొ;* 

*కొంటెవు గద!నిన్ను నెరిఁగికొంటిమి కృష్ణా!!*

ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషము వాళ్లకు తెలియదు. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకు వద్దామని అనుకున్నారు. వస్త్రములు కనపడలేదు. ఏమయినవా అని చూస్తే చెట్టుమీద కృష్ణుడు కనపడ్డాడు. వాళ్ళు అడిగింది సాంసారికమయిన లౌకికమయిన భర్త్రుత్ర్వం కాదు. ఆ వ్రతంలో ఆయనలో ఐక్యమవడాన్ని వారు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమని అంటున్నారు? కొంటె కృష్ణా! ఏమి పనులయ్యా యివి? మేము ఎలా బయటకు వస్తాము? నీవు ఇలాంటి తుంటరి పనులు చేయకూడదు. కాబట్టి మా వస్త్రములు మాకిచ్చేసి ఇక్కడినుండి నీవు వెళ్ళిపో’ అన్నారు.

                   ‌‌‌‌‌‌           (ఇంకాఉంది)


          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏



🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏


**  (సశేషం.....)

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

        *శ్రీ భాగవతం - 91 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 21*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁


*గోపికా వస్త్రాపహరణం:* 


గోపకాంతల వస్త్రములనన్నిటిని పట్టుకుని కడిమి చెట్డు ఎక్కి కూర్చున్నాడు కృష్ణుడు. ఇపుడు స్త్రీలందరూ నీళ్ళల్లో ఉన్నారు.  ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషము వాళ్లకు తెలియదు. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకు వద్దామని అనుకున్నారు. వస్త్రములు కనపడలేదు. ఏమయినవా అని చూస్తే చెట్టుమీద కృష్ణుడు కనపడ్డాడు. వాళ్ళు అడిగింది సాంసారికమయిన లౌకికమయిన భర్త్రుత్ర్వం కాదు. ఆ వ్రతంలో ఆయనలో ఐక్యమవడాన్ని వారు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమని అంటున్నారు? కొంటె కృష్ణా! ఏమి పనులయ్యా యివి? మేము ఎలా బయటకు వస్తాము? నీవు ఇలాంటి తుంటరి పనులు చేయకూడదు. కాబట్టి మా వస్త్రములు మాకిచ్చేసి ఇక్కడి నుండి నీవు వెళ్ళిపో’ అన్నారు.


'మీరు అందరూ వ్రతం చేస్తున్నారు కదా! ఈ వ్రతమును ఏ ఫలితం కోసం చేస్తున్నారు? మీ ప్రవర్తన చూస్తుంటే ఎవడో ఒకడు మీ మనస్సులను హరించాడని తెలుస్తోంది. వాడిని భర్తగా పొందాలని మీరు అందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరికోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి’ అన్నాడు. 


వాళ్ళు అందరూ నవ్విన నవ్వును బట్టి వాళ్ళందరూ తననే తమ భర్తగా కోరుకుంటున్నారని ఆయనకు తెలిసిపోయింది. 


ఆయన అన్నారు – నిజంగా మీరు నా యింటికి దాసీలుగా, భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లుగా నడుచుకుంటామని అంటే నీటి నుండి బయటకు రండి. మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను’ అన్నాడు. 


ఇక్కడ ‘దాసీ’ అనే పదమును చాలా జాగ్రత్తగా చూడాలి. దాని అర్థం – తాను చేసిన ప్రతి పనివలన తన భర్త అభ్యున్నతిని, తన భర్త కీర్తిప్రతిష్ఠలు పెరిగేటట్లుగా ప్రవర్తించడం. అలా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. అటువంటి స్త్రీ తానుచేసిన ప్రతి పనిలో తన భర్త ఔన్నత్యమును నిలబెడుతుంది. అది అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నేను చెప్పిన మాట వినాలని మీరు అనుకుంటే నేనొకమాట చెపుతాను. నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి అన్నారు.  ఆయన ఆడపిల్లల వలువలు ఎత్తుకుపోవడం మదోద్రేకంతో చేసిన పని కాదు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి.


“మీరు నన్ను చూసి సిగ్గు పడతారేమిటి? చిన్నతనం నుండి మనం అందరం కలిసి పెరిగాము. శ్రీకృష్ణుడు బయట ఉన్నవాడు కాదు. ఈ కృష్ణుడు లోనున్న వాడు. అన్ని ప్రాణుల హృదయాంతరముల వున్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను లేని నాడు అది శివము కాదు శవము. నేను వున్నాను కాబట్టి మీరు మంగళప్రదులై ఉన్నారు.  వ్రతమును చేయగలుగుతున్నారు.  మీరు నన్ను భర్తగా పొందాలనుకుంటున్నారు. వ్రతం చేస్తున్నారు. కానీ ఒంటిమీద నూలుపోగు లేకుండా నీళ్ళలోకి దిగి స్నానములు చేస్తున్నారు. అలా దిగంబరంగా స్నానం చేయడం వలన వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయిన వరుణుడి పట్ల అపచారం జరిగింది. వ్రతం చేసేవాళ్ళు వివస్త్రలై స్నానం చేయకూడదు. ఒంటిమీద బట్టతోటే స్నానం చేయాలి. మీరు అపచారం చేశారు. రేపు ఈ వ్రతము పూర్తయిన పిమ్మట కాత్యాయనీ వ్రతం చేశాము కానీ ఫలితం రాలేదని అంటారు. 


ఇప్పుడు ఆయన ఒక ఆజ్ఞ చేశారు. నిజంగా మీరు వ్రత ఫలితమును కోరుకుంటే నన్ను భర్తగా మీరు కావాలని అనుకుంటే నేనొక మాట చెపుతాను మీరు చెయ్యండి. 


30 రోజుల నుండి మీరు వ్రతం చేయడం లేదు. ప్రతిరోజూ వ్రతభంగం చేస్తున్నారు. మీరు చేస్తున్న వ్రత భంగమునకు మీకు శిక్ష వేయాలి. మీకు ఫలితం ఇవ్వకూడదు. కానీ నేను శిక్ష వేయాలని అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్రతంలోని భక్తికి నేను లొంగాను. మీ పొరపాటును దిద్దాలని అనుకుంటున్నాను. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది. మీరందరూ చేతులెత్తి నమస్కారం చెయ్యండి. అపుడు ప్రాయశ్చిత్తం అయిపోతుంది కాబట్టి మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ఆ వలువలు కట్టుకుని కాత్యాయనీ దేవిని ఆరాధించండి. అపుడు నేను మీ భర్తను అవుతాను’ అన్నాడు స్వామి. 


వాళ్ళు వినలేదు. అదీ చిత్రం! వాళ్ళు మేము స్త్రీలం. నువ్వు పురుషుడివి. నీవు చెట్టుమీద కూర్చుని చూస్తుండగా మేము ఒడ్డుకు వచ్చి చేతులు ఎత్తి ఎలా నమస్కరిస్తాము? అలా కుదరదు’ అన్నారు.


భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు. మీరు నా భర్త్రుత్వమును అడుగుతున్నారు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యం. మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడ ఉంటాయి? రెండుగా ఉండిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలని అనుకుంటున్నారా? 


ఒకటి అయిపోవాలి అంటే రెండుగా వున్నవి అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్లిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తమ అస్తిత్వమును నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులెత్తి మ్రొక్కండి. మ్రొక్కి వస్త్రములు తీసుకొనవలసింది’ అని అన్నాడు. 


ముందు కొంతమంది గోపికలు అది కుదరదన్నారు. చాలా అల్లరి చేశారు. కృష్ణుడితో వాదించారు. వాళ్ళు ‘ఆడవాళ్ళం ఎలా వెడతాము? కొంటె కృష్ణుడు ఎన్నయినా చెపుతాడు. మనం వివస్త్రలుగా బయటకు వెళ్ళి చేతులు ఎత్తి నమస్కారములు పెడతామా? మనం స్త్రీలం. అలా చేయడం కుదరదు’ అన్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్ళకుండా అలా కంఠం వరకు నీళ్ళలో మునిగి వుందాము అనుకున్నారు. 


మార్గశీర్ష మాసం. మంచు బాగా కురుస్తోంది. వాళ్ళందరూ నీటిలో గజగజ వణికి పోతున్నారు. ఏమి చేస్తే బాగుంటుందా అని తర్జనభర్జనలు చేస్తున్నారు. 


అప్పుడు అందులో ఒక గోపిక అంది – దేనికి మొహమాటం? ఆయన జగద్భర్త. ఇన్ని లీలలు చేసినవాడు. ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాము. అటువంటప్పుడు మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే మనకి వచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతి చేతనే మనం అన్ని కోట్ల జన్మలను ఎత్తాము. ఇవాళ ఈశ్వరుడే మన ఎదురుగా నిలబడి అలా నమస్కారం చెయ్యండి. మీరు చేసిన దోషము విరిచేస్తాను. మీకు ఫలితం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా వున్న దోషమును ఈశ్వరుడు చెప్పినా సరే ఈశ్వరుడి పేరెత్తనంటే ఆయన చెప్పినది చేయను అని అంటే మనకు ఫలితం ఎక్కడినుండి వస్తుంది? అందుకని నమస్కరించేద్దాము అంది. 


మనము ఒక వ్రతం చేస్తాము. వ్రతం చేసేముందు సంకల్పం చెపుతాము. అలా చేసినప్పటికీ వ్రతఫలితం అందరికీ ఒకేలా రాదు. ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. మనస్సు ఎక్కడికో పోతుంది. ఈశ్వరుడిని స్మరణ చేయదు. అటువంటప్పుడు మీకు వ్రత ఫలితం రాదు. 


క్రతువులో దోషం జరుగుతోంది. వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం జరిగి వుంటే ఈశ్వరుని నామములు చెప్పడం ద్వారా ఆ దోషం విరిగిపోతుంది. నామ స్మరణతో వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకనే ఒకటికి పదిమాట్లు కనీసంలో కనీసం భగవంతుని నామము జపించాలి. పెద్దలు నామమునకు యిచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదు. నామము క్రతువునందు వున్న దోషమును విరుస్తుంది. 


అపుడు గోపికలు అందరూ కలిసి నామమును చెప్పి ఈశ్వరుడు చెప్పినట్లు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని, అందరూ కలిసి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకు వచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్లకి ఇచ్చేశారు. 


ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. 


‘ఓ లక్షణవతులారా! మీరు చేసిన వ్రతము ఏమిటో నాకు అర్థం అయింది. కాత్యాయనీ దేవిని మీరు నోచిన నోము దేనికొరకు చేశారో ఆ ఫలితమును నేను మీకు యిచ్చేస్తున్నాను’. కాత్యాయనీ దేవి నోమునోస్తే ఫలితమును కృష్ణుడు యిస్తున్నాడు. ఇద్దరూ ఒకటేననే తత్త్వమును మనం తెలుసుకోవాలి. తత్త్వము తెలుసుకొనక పొతే మీయందు సంకుచితత్వము వచ్చేస్తుంది. 


ఉన్నది ఒక్కడే. కానీ స్వామి ఎన్నో రూపములలో కనపడుతూ ఉంటాడు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోంది. ‘ఇకమీదట మీరు చేసిన నోముకు ఫలితమును యిచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు’ అన్నాడు. ఈ మాట చాలా పెడసరంగా కర్కశంగా ఉంటుంది. ఈ మాటకు అర్థం మనకు రాసలీలలో తెలుస్తుంది. 


ఇక్కడ రాత్రులందు అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింగోద్భవం అర్థరాత్రి జరిగింది. కృష్ణ జననం అర్థరాత్రి జరిగింది. 


చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించడం అనునది జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మీరు మోక్షం వైపు నడుస్తారనడానికి గుర్తు. ‘అందరూ చీకట్లో ఉంటే, మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అనగా మీకు చీకటి లేదు. మీకు అజ్ఞానము నివృత్తియై ఈశ్వరుని తెలుసుకుంటారు. ఆ జ్ఞానమును మీకు యిస్తున్నాను’ అన్నాడు. ఈ మాటలు విన్న తరువాత గోపికాంతలు ఆనందంతో మంద దగ్గరకు వెళ్ళారు. పశువుల దగ్గరకు వెళ్ళారు. 


‘మంద’ అంటే పశువులతో కూడినది. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మందకడకు వెళ్ళారు అంటే వారు కేవలం ఆవుల దగ్గరకు, దూడల దగ్గరకు వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతిజీవి పశువే. ఇంట్లో వున్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు. ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరి కొన్ని పాశములతో కట్టబడింది. ఆవిడ మరొక పశువు. ఈ పశువుల పాశములను విడిపించగలిగిన వాడు ఎవడు ఉన్నాడో ఆయనే పశుపతి. ‘మీరు పశువులతో కలిసి పశువులలో ఉంటారు. ఎప్పుడూ నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేక కృష్ణ సాయుజ్యమును పొందుతారు. నామము ఏదయినా ఫలితం ఒక్కటే’ అని గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో. కాత్యాయనీ వ్రత ఘట్టంలో యిన్ని రహస్యములు చొప్పించి కృష్ణ పరమాత్మ చేసిన మహోత్కృష్టమయిన లీల ఆ కాత్యాయనీ వ్రతమనే లీల. 


యీలీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏమి చేయాలో మనకు అర్థం అవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. పూజా మంత్రములను చదువుతూ మీ మనస్సు రంజిల్లి పోవాలి. అలా రంజిల్లి పోవాలంటే దానికి రెండే రెండు బాటలు ఉంటాయి. ఒకటి అర్థం తెలియనప్పుడు విశ్వాసము చేత పరమాత్మ నామమును పట్టుకోవాలి. అర్థం తెలిస్తే మీ మనస్సు తనంత తాను రంజిల్లుతుంది. అలా రంజిల్లుతూ నామములు చెపుతూ పూజ చేస్తే ఆ నామము మీ పాపములను దహిస్తుంది. అలా కాకుండా నామము అర్థం తెలియకపోయినా, అది పెద్దలు చెప్పిన నామము, దానిని స్మరించడం వలన ఒక శుభ ఫలితం కలుగుతుంది అని నమ్మి సంతోషంతో మీరు నామము స్మరిస్తూ పూజచేసినా, అప్పుడు కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వాశము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసము లేకపోతే మాత్రం మరీ ప్రమాదం. ఏమీ తెలియకపోయినా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు, తెలిసివున్న వాడి కంటే గొప్పవానిగానే పరిగణింపబడతాడు. 

అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానమయి పోతావు. ఈ విషయమును ఆవిష్కరించిన లీల కాబట్టి ఈ కాత్యాయనీ వ్రత ఘట్టము పరమోత్కృష్టమయిన ఘట్టము.



          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏



🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏


  (సశేషం.....)

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

 *శ్రీ భాగవతం - 93 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 23*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

*శ్రీకృష్ణుని_రాసలీల*

రాసలీలా ఘట్టము విన్నంత మాత్రం చేత మన పాపములన్నిటిని దహించగల శక్తి కలిగినది. రాసలీలను సామాన్యమయిన స్థాయిలో విని, మనస్సును పరిశుద్ధంగా వుంచుకొని అది ఈశ్వరుని లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితమును ఇస్తుంది. దాని లోపల ఉండే అసలైన రహస్యమును తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే అది ఒక దివ్యాతిదివ్యమయిన లీల. అంతకన్న గొప్పలీల సృష్టిలో ఉండదు. 

కాని రాసలీల అనేసరికి కృష్ణుడు చాలామంది కాంతలతో భోగము అనుభవించుట అని అనుకుంటారు. దాని ఉద్దేశము అది కాదు.

శరత్కాలములో పౌర్ణమి వచ్చింది. మంచి వెన్నెలతో కూడిన రాత్రి. ఆ రాత్రి కృష్ణ భగవానుడు యమునా నదీ సైకతమునందు ఒడ్డున నిలబడి ఆయన వేణునాదం చేశారు. 

ఆవేణువు మీద ఒక గొప్ప మోహనగీతము నొకదానిని ఆలాపన చేశారు. అక్కడ అనేకమంది గోపాలురు ఉన్నారు. గోపకాంతలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పాలు తీయడానికి దూడలను విడిచి పెడుతున్నారు. మరికొంతమంది పాలు పితుకుతున్నారు. మరికొంతమంది పితికిన పాలను అగ్నిహోత్రం మీద పెడుతున్నారు. వేరొక యింట్లో చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని జరుగుతోంది. 

ఈలోగా కృష్ణ భగవానుడు ఊదిన ఆ వంశీరవము వినబడింది. వంశీరవం వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుని దర్శనం చేసి, ఇంత గొప్ప వంశీరవమును చేస్తున్న ఆ మోహనరాగము పలుకుతున్న రూపమును చిత్రించుకుని గాఢాలింగనము చేసుకుని ఆ మైమరపుచే పరవశులై యిక్కడే కొందరు గోపకాంతలు శరీరమును వదిలిపెట్టేశారు. 

మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా కృష్ణుడితో రాసలీల చేయాలని ఆయనతో ఆనందం అనుభవించాలని వీళ్ళనందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. 

కృష్ణుడు వీరందరినీ చూసి వేళకాని వేళలో పర పురుషుడి దగ్గరకు స్త్రీలు పరుగెట్టుకు వస్తే మానం మర్యాదలు మంట కలిసిపోవా? ఈ రాత్రివేళ మీరు ఎందుకు వచ్చారు?” అని అడిగాడు. 

వారు కన్నులవెంట నీరు కారుస్తూ ‘కృష్ణా, మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడవరకు వచ్చిన తరువాత నీవలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతావా?” అని అడిగారు. 

ఈవిషయం వినేసరికి పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహములు కలిగాయి. కృష్ణుని అడగటమేమిటి? భగవానుడు ఈ పనులు చేయవచ్చునా? ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతలయందు ఇటువంటి మోహబుద్ధిని జనింపచేయవచ్చునా?’ అని శుకమహర్షిని అడిగాడు. 

అపుడు శుకబ్రహ్మ,  ‘పరీక్షిత్తూ! నీవు తొందర పడకు. రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి. దానిని నీవు తెలుసుకుంటావు’ అన్నారు. 

రాసలీల ఈశ్వరుని లీల. ఈశ్వరుడు చేసే పనియందు యుక్తాయుక్తములను విచారించే అధికారం మనకు ఉండదు. ఆయన జగత్ప్రభువు. ఆయన జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దానిని గురించి విమర్శ చేసే అధికారం మనకి లేదు. శుకుడు కూడా యిదే మాట చెప్పాడు. 

యమునానది ఒడ్డునే వేణువును ఎందుకు ఊదాలి? 

సూర్యునికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమునా. యమునా ప్రవహించి వెళ్ళిపోయే కాలము స్వరూపము. కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నాము అని ఈ శరీరమును చూపించిన జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతుంటారో ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్కపెట్ట గలిగిన వాడు ప్రపంచమునందు ఎవ్వడూ ఉండడు. అది ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకనగా ఆయనే కాల స్వరూపమయి ఉన్నాడు.  యమున కాలప్రవాహమునకు గుర్తు. 

ఇప్పుడు ఆయన తన నిర్హేతుకమయిన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకున్నారు. భావన యందు ఎలా పెట్టుకున్నా సరే వస్తువు అటువంటిది. ఆయన యందు భక్తితో గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళెవరో వాళ్ళని ఆయన ఉద్ధరించాలని అనుకున్నారు. దీనినే ఈశ్వర సంకల్పము అంటారు. 

ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి? 

అలా సంకల్పించడమును ‘నిర్హేతుక కృప’ అని శాస్త్రము పేర్కొంది. శరత్కాలములో ఎందుకు ఊదాలి అంటే శరత్కాలములో ఆకాశములో మబ్బులు ఉండవు. ఆకాశమంతా నిర్మలంగా తెల్లటి వెన్నెలతో కూడి ఉంటుంది. అలాగే జీవి అంతరమునందు రజోగుణము, తమోగుణము బాగా తగ్గిపోయి సత్త్వగుణ ప్రకాశముతో ఉంటాయి. అటువంటి సత్త్వ గుణ ప్రకాశముతో ఉన్న మనస్సులు ఏవి వున్నాయో, 

ఏవి నిరంతరమూ కృష్ణా అను భావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదమును విని పరుగెట్టగలవు.


శబ్దము అందరికీ వినపడుతుంది. ఆ శబ్దము ఉత్తేజితము చేయవలసి వస్తే అది స్త్రీ పురుషులనందరినీ చేస్తుంది తప్ప కేవలము స్త్రీలను మాత్రమే ఉత్తేజితులను చేయడమో, కేవలము పురుషులను ఉత్తేజితులను చేయడమో, ఉండదు. 

మరి కృష్ణుని వేణుగానము కేవలము గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజితులను చేసింది? 

వాళ్లకు కేవలము ఉన్నది కామోద్రేకమే అయితే వేణునాదము విన్న తరువాత మాత్రమే కామోద్రేకముతో ఎందుకు పరుగెత్తాలి? వేరొక సందర్భములో పరుగెత్తవచ్చు కదా! కామాతురత కలిగిన వాడు అందునా పర పురుష సంగమము కోరుతున్న స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురువస్తే త్రోసి అవతలపారేసి నేను పరుగెడతాను అని పరుగెడుతుందా? అది సాధ్యమయే విషయం కాదు. 

కానీ యిక్కడ కొన్ని వేలమంది గోపకాంతలు పరుగెడుతున్నారు. మరి గోపాలురు పరుగెత్తరా?వారిని అడ్డుకోరా? అలా రాసలీలలో ఎందుకు జరుగుతుంది? 

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం వేణునాదమును వింటే గోపకాంతలకు ఏమయినదో తెలుసుకోవాలి. 

వేణు నాదమును వింటే గోపకాంతలకు ‘అనంగవర్ధనము” అయినది అని చెప్పారు. అనంగవర్ధనము అనే మాటను వాడి వ్యాసుల వారు మనందరి మీద సమ్మోహనాస్త్రమును వేశారు. కృష్ణుడు వేయలేదు. ఆయన వేశారు. 

అనంగుడు అనగా శరీరము లేనివాడు - మన్మథుడు. మన్మథవర్ధనం జరిగినది అంటే లోపల కామోద్రేకము కలిగినది. ఇది బాహ్యార్థము. 

రాసలీల అనే శీర్షికను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే ‘అనంగ’ అనగా శరీరము కానిది అనగా ఆత్మ. అనగా ఇపుడు అనంగవర్ధనము అనగా ఆత్మవర్ధనము. 

జీవి ఆత్మాభిముఖుడయినాడు. ఈశ్వరుని పిలుపునకు ఎవడు యోగ్యుడో వాడికి అందినది. 

ఆత్మోన్ముఖులు అయ్యారు అని గోపకాంతలకు మాత్రమే చెపుతారు. పురుషులకు ఎందుకు చెప్పరు? ప్రపంచమునందు మనం అందరం కూడా బాహ్యంలో భార్యభర్త అంటాం. కానీ శాస్త్రమునందు మాత్రము భార్య భర్త ఉండరు. పురుషుడు ఒక్కడే ఉంటాడు. ఆయనే పరమాత్మ. కాబట్టి ప్రపంచంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే పురుషుడు. మిగిలిన వారు అందరూ స్త్రీలే. అందరికీ ఒకడే భర్త. జగద్భర్త. ఆయనే పరమాత్మ. అందరూ ఆయననే పొందాలి.

*పతిం విశ్వశ్యాత్మేశ్వరగ్ఁ శాశ్వతగ్ఁ శివమచ్యుతం’*

వాడు విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు. ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. అటువంటి వాడిని పొందాలి. కాబట్టి ఇపుడు స్త్రీయా? పురుషుడా? పురుషుడిని పొందాలి కాబట్టి స్త్రీగా చెప్తారు. పరమాత్మ పురుషునిగా ఉన్నాడు. మారని వాడు. మారుతున్నది శరీరము. మారుతున్న శరీరమునందు మీరు ఉండి మారని తత్త్వమయిన భగవంతుడిని అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది.  అలా ఎవరికీ ప్రచోదనం అయిందో వారికి కృష్ణ పరమాత్మ వేణునాదము వినపడింది. అనగా వారికి అనంగవర్ధనం అయినది. 

పైకి కథ కామోద్రేకము కలిగినట్లు ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది కామమా లేక మోక్షమా? వారు మోక్షమును అడుగుతున్నారు. వీరందరూ ఆత్మ సుఖమును అభిలషిస్తున్నారు. ఆత్మానందమును వాక్కు చేత చెప్పడం కుదరదు. కాబట్టి దీనిని మధురభక్తితో చెప్పాలి. మధురభక్తిని నాయిక నాయకుల వలన చెపుతారు. జీవ బ్రహ్మైక్య సిద్ధిని ప్రేయసీ ప్రియుల సమాగమముగా చెప్తారు. అందుకే జీవ బ్రహ్మైక్య సిద్ధియే కళ్యాణం. మధుర భక్తిని ఆధారంగా తీసుకొని రాసలీలను వర్ణిస్తున్నారు. 

ఇక్కడ వ్యాసుల వారు మహాపురుషుల స్థితిని చూపిస్తున్నారు. పైకి కథ గోపికలు ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్న జారిణుల కథలా ఉంటుంది రాసలీల. 

మీకు అంతే అర్థం అయినట్లుగా మాట్లాడితే భగవంతుడి పట్ల భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకర అపరాధము చేశారన్నమాట. 

కాబట్టి రాసలీల గురించి తెలిస్తే మాట్లాడాలి. తెలియకపోతే ఊరుకోవాలి. అంతేకాని అందులోని పరమార్థం గ్రహించలేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. 

ఇపుడు గోపికలు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని అన్నారు. *“ఎవరు నీ పాదములు పట్టుకుండున్నారో వాళ్లకి సంసారం భయం పోతోంది”* అన్నారు.

అపుడు కృష్ణ పరమాత్మ అన్నారు – *‘అలా మీరు రానూకూడదు. నన్ను అడుగనూకూడదు. ఇంతరాత్రి వేళ నేను వంశీరవము చేస్తే మీరు మీరు పరుగెట్టుకు వచ్చి నాతో సుఖము అభిలషించి నాతో ఉంటానంటున్నారు. అది చాలా తప్పు. మీరు అందరూ యింటికి వెళ్ళిపోవాలి”* అన్నారు. 

వాళ్ళు అన్నారు, *“ఎన్నో జన్మల తరువాత మేము చేసిన తపస్సు పండితే ఈశ్వరా, నీ పాదముల దగ్గరకు చేరుకున్నాము. మమ్మలి తిరిగి వెళ్ళిపొమ్మంటావా? వాళ్ళు లౌకికమయిన పతులు. అది సంసారమునకు హేతువు. మాకు అది వద్దు. మేము జగత్పతివయిన నిన్ను చేరాలని వచ్చాము. అందుకని మాకు సంసారము వద్దు. మేము తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరకు రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవినీయవలసినది”* అని అన్నారు.

వాళ్ళ మాటలకు పరమాత్మ ప్రీతి చెందాడు. వెళ్ళడం ఒక ఎత్తు. వెళ్ళి నిలబడడం ఒక ఎత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. 

*రాసలీల* పైకి అనేకమంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్లు కనపడుతుంది. అది నిజం కాదు. సంకేతిస్తున్నారు. అలా ఆడడంలో బ్రహ్మానందమును వారు అనుభవిస్తున్నారు. మేఘము మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు.

*అంగనామంగనామంతరే మాధవో* 

*మాధవం మాధవం చాంతరేణాంగనా ||*

*ఇతథి మాకల్పితే మండలేమధగః* *సంజగౌ వేణునా దేవకీ నందనః ||*

గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు. కృష్ణుడు కృష్ణుడు మధ్యలో గోపిక. ఎంతమందయినా ఏకకాలమునందు మోక్షమును పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు రాసక్రీడ ఆడుతున్నాడు. 

మోక్షమును పొందుతున్న వారిని చూసి ఇన్ని జన్మల తరువాత ఈశ్వరునితో ఐక్యమవుతున్నారని దేవతలంతా పొంగిపోతున్నారు. దేవతలు ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. లోపల ఉన్న భావ పరంపరలన్నీ అణిగి పోయి, వాసనలన్నీ అణిగి పోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి, ఇంద్రియములన్నీ పనిచేయడం మానివేసి, సమాధియందు లోపల వున్న జ్యోతి స్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడు. అలా ఉండిపోయినపుడు జీవి అపరిమితమయిన ఆనందమును పొందేస్తాడు. ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంది. ఇప్పుడు తినడం కాని, త్రాగడం కానీ ఉండవు. ఆ ఆనందము ఈ శరీరమును కాపాడుతూ ఉండడం వలన బ్రతికి ఉంటాడు. 

అలా ఆనందమగ్నుడయిపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయిన సమాధి స్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించిన రాసలీల.

యమున ఒడ్డున రాసలీల జరిగింది. వాళ్లకి పట్టిన చమటను పోగొట్టడానికి వాళ్ళు పొందుతున్న ఆనందములో శరీరమునకు పట్టిన బడలికను తీర్చడానికి యమునానది నుండి చల్లటి గాలులు వీచాయి. 

ఆ చల్లటి గాలులచేత వారు బహిర్ముఖులయ్యారు. 

*‘నేను ఆత్మ దర్శనమును పొందాను’* అని ప్రతి గోపికా అనుకుంది. ఆత్మ దర్శనమును పొందిన తరువాత మళ్ళీ ఈ *‘నేను ఎక్కడి నుండి వచ్చింది”* ఆత్మగా ఉన్నాను అనాలి. *నేను* అనుకుంటే మరల జరుగు మెట్లు ఎక్కినట్లే లెక్క. అప్పుడు వారందరూ మేము అందరమూ కృష్ణునితో ఆనందమును అనుభవిస్తున్నాము అన్నారు. వారు అలా అనీ అనడంతోనే కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. 

అనగా వారు తపస్సులో కూర్చున్నప్పుడు సమాధిస్థితి యందు కుదురుకోవడం కుదరడం లేదు. ఇపుడు వీళ్ళకి కృష్ణుడు కావాలి. ఎక్కడ ఉన్నాడని మనుష్యులను అడగడం లేదు వీళ్ళు. రకరకాల చెట్ల దగ్గరకు వెళ్ళి నీవు చూశావా? అని అడుగుతున్నారు.


*నల్లని వాఁడు పద్మ నయనంబుల వాఁడు గృపా రసంబు పైఁ*

*జల్లెడు వాఁడు మౌళిపరిసర్పిత పింఛము వాఁడు నవ్వు రా*

*జిల్లెడు మోము వాఁడొకడు చెల్వల మానధనంబుఁ దెచ్చెనో!* 

*మల్లియలార! మీ పొదల మాటున లేఁడు గదమ్మ! చెప్పరే!!*

వీళ్ళందరూ మల్లె పొదలను అడుగుతున్నారు. నల్లగా ఉంటాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు. పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, నెమలి పింఛము ధరించిన వాడు, ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యమును నిరూపించడానికే నెమలి ఈకను పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీపురుషుల సంభోగం లేకుండా పిల్లలను కనే ఏకైక ప్రాణి నెమలి. దానికి భౌతికమైన సంపర్కం లేదు. ఇదే *రాసలీల* . అందుకే కృష్ణుడు నెమలి ఈకను ధరిస్తాడు. కృష్ణుడు ఆడవారందరితో కలిసి జులాయిగా తిరిగిన వాడు కాదు. ఆయన పరబ్రహ్మయై జీవ బ్రహ్మైక్య సిద్ధిని యిస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొందారు. జలక్రీడలు ఆడారు. దానిని *రాసలీల* అని పిలుస్తారు.

రాసలీల అనేది ధ్యానము చేత తెలుసుకోవలసిన రహస్యము. నీవు ఎంత చెప్పినా నాకు అర్థం కావడం లేదు. ఇలా పరకాంతలతో కలిసి కృష్ణుడు ఎలా ఆడినాడు?” అని పరీక్షిత్తు పలుమార్లు శుకమహర్షిని ప్రశ్నిస్తాడు. 

అపుడు శుకుడు, “ఈశ్వరుడి లీల లోపల ఉండే జ్ఞానమును నీవు అందుకోలేని స్థితి ఆయినా ఒక విషయమును నీవు జ్ఞాపకం పెట్టుకో. 


*అగ్నిహోత్రమును తీసుకువెళ్ళి శవం మీద పెట్టినట్లయితే అది శవమును కాల్చేస్తుంది. శవమును కాల్చిన అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడయినా తలస్నానం చేస్తుందా? చెయ్యదు. శవమును కాల్చిన అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. అగ్నిహోత్రం నీకు వంట చేసి పెట్టింది. అందువలన అగ్నిహోత్రమునకు పుణ్యం రాలేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉంది. మీరు స్వాహా అంటూ హవిస్సును దేవతలకు యిచ్చారు. అందువలన అగ్నిహోత్రమునకు గొప్పతనం ఏమీ రాలేదు. శవమును కాల్చినా అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రం అగ్నిగానే నిలబడుతుంది. వస్తుసంపర్కం అగ్నికి లేదు. కృష్ణుని కూడా అల నీవు భావించగలిగితే రాసలీల నీకు ఏమి యిబ్బంది?”*

అని అడిగాడు. 

ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము. కాబట్టి ఎవరిని ఉద్ధరించాలని అనుకున్నాడో వారిని అలా ఉద్ధరించాడు. ఈశ్వరునికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలి ఈక పెట్టుకున్నాడు. అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టిదోషం తప్ప కృష్ణ దోషం కాదు. నీవు అలా విను. అప్పుడు రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది” అని చెప్పాడు. 

కాబట్టి ఆ రాసలీల అంత పరమ పావనమయిన ఘట్టం. రాసలీల పూర్తయిపోయిన పిమ్మట కృష్ణ పరమాత్మ మరల బృందావనం చేరుకుంటాడు.


          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏


🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

🌸02.....మహాభారతంలో_విదురుని_నీతులు :*🌸 


ఒక సమయంలో ధృతరాష్ట్రుడు విదురుని తో "నా మనసు అశాంతి తో కుమిలిపోతున్నది... అమృతం వంటి నీ మాటలతో నా హృదయానికి శాంతి కలిగించు" అంటాడు..

" మహారాజా..!మీకు నిద్ర పట్టలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.. బలవంతునితో విరోధం తెచ్చుకొన్న బలహీనునికి, ధనం పోగొట్టుకొన్న వానికి, దొంగతనం చేయడానికి ఎటుపోవాలని ఆలోచించే వానికి, కామాసక్తి గలవానికి..... ఈ నలుగురికి నిద్ర పట్టక అశాంతితో కుమిలి పోతుంటారు.... ఈ గుణాలేవీ మీలో లేవనుకొంటాను...! మీరు ఇతరుల సొత్తు అపహరింపదలచారా...? నిద్రరాక కుమిలి పోవడానికి...? నిజమైన కారణమేమిటో చెప్పండి..? అని అడిగాడు.

విదురా..! ధర్మరాజు సంజయునితో ఏమి చెప్పి పంపాడో తెలియక మనసు వికలంగా ఉంది... నాలుగు మంచి మాటలతో నాకు మనశ్శాంతి కలిగించు అని ధృతరాష్ట్రుడు అన్నాడు..

 "మహారాజా..! లోకులు నిందించే పనులేవీ చేయరాదు... పరుల సంపదలను చూసి అసూయ పడరాదు... అందరితోనూ మంచిగా ఉండాలి...  కోపం, పొగడ్తలకు ఉబ్బిపోవడం, గర్వం, అసంతృప్తి, అహంకారం, ఏ పనీ చేయకపోవడం..... ఈ ఆరూ చెడ్డవారి లక్షణాలు.

👉🏻ధనం, విద్య, వంశం అనేవి దుర్మార్గులకు గర్వం కలిగిస్తాయి. మంచివారికి అణకువ, వినయం కలిగిస్తాయి.నేర్పరియైన విలుకాని వాడి బాణం ఎవరికీ తగలకుండా వ్యర్థం కాదు. సమర్థుడైన వాని నీతిమార్గం శత్రురాజును, అతని రాజ్యాన్ని నాశనం చేస్తాయి.

👉🏻తీపి పదార్థాలను ఒకరికి ఇవ్వకుండా తినరాదు. అందరూ నిద్రిస్తున్నప్పుడు తానొక్కడే మేల్కొని ఉండరాదు. ఏ సమస్యనూ ఒంటరిగా నిర్ణయించరాదు. సత్ప్రవర్తనమనే సముద్రం పై ఎట్టి ప్రమాదం లేకుండా ప్రయాణం చేయడానికి సత్యమనే నావకు మించిన సాధనం లేదు.

👉🏻ఓరిమి గలవారిని చూసి లోకులు అశక్తులు అనుకొంటారు. ఓరిమి ఉత్తములకు అలంకారము. ! పరుష వాక్యం పలుకక పోవడం వల్ల, పాప కార్యాలు చేయక పోవడంవల్ల, మనిషి మంచివాడు అనిపించుకొంటాడు. 

👉🏻ఇతరులు తనకు అపకారం చేసినప్పుడు వారికి కీడు చేయగల శక్తి ఉన్నప్పటికీ ఓర్పుతో వ్యవహరించే వారినీ, బీదరికంలో ఉన్నప్పటికీ తనకున్న దానిలోనే అడిగిన వారికిచ్చి సంతోష పరచే వారినీ పుణ్య పురుషులు అంటారు పెద్దలు... న్యాయంగా సంపాధించిన ధనంతో నిజంగా అవసరమున్న వారికి సహాయం చేయడం మంచిది.

👉🏻స్త్రీ వ్యామోహం, జూదం, మద్యపానం, వేట, కఠినంగా మాట్లాడడం, కఠినంగా దండించడం, ధనాన్ని దుబారాగా ఖర్చు పెట్టడం మంచి వారికి కూడని పనులు.

👉🏻తనకు తగిన వేషం దరించడం, తనను తాను పొగడుకొనకుండుట, తనను బాధించిన వారికి కూడా కీడును కోరకుండుట, ఒకరికిచ్చిన దానిని గురించి బాధపడకుండుట  ఎన్ని కష్టాలోచ్చినా నీతిమార్గం వదలకుండుట మంచివారి లక్షణాలు." అని విదురుడు ఉపదేశించాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

03... పాలు చేసిన తపస్సు  ..

(ఒక చిన్న కథ)

ఒకసారి "పాలు" తపస్సు చేసిందట - దేవుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అన్నాడట -

అప్పుడు "పాలు" ఇలా చెప్పిందట. దేవుడా నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగానే ఉంటాను.  అయితే ఈ పాపిష్టి మానవుడు నాకు పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు.

అప్పుడు దేవుడు ఓ నవ్వు నవ్వి "ఓ పాలు" ఇది విను నీవు "పాలలా" జీవించాలి అని ఆశ పడే ముందు ఈ మాటలు విను నీవు

పాలలాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు 

పాలకు పెరుగు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు 

పెరుగుని చిలికితే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు 

మజ్జిగ లోంచి వచ్చిన వెన్న అయితే వారాలు వారాలు అయినా ఏమీ కాదు. 

వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమఘుమలతో  చాలా రోజులు ఉంటావు. అలాగే మందులకు వాడుతారు,

ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు వెలుగువవుతావు....

ఇప్పుడు చెప్పు 

ఒకరోజు పాలగా ఉండి "పాలలాగానే" చస్తావా లేక 

క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు వెలుగువవుతావా అని దేవుడు ప్రశ్నించాడు....

దేవుని మాటకి "పాలు" మూగవోయింది, దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది.  దేవుని ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది..

*******

04.....జై వాసవి,

#ఇంట్లో_ఎవరైనా_మరణిస్తే_ఏడాది_వరకు_పూజలు_చేయకూడదా.....?

బయట వినిపించే మాటల్లో ఇదొకటి.. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు.. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు.., దేవతలందరిని ఒక బట్టలో చుట్టి, అటక మీద పెట్టేస్తారు.. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తారు..

 అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. 

దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభ స్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు... అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు.. 

నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్య ప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు... మనం నిత్యం ఇంతకు ముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు..  కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకు ముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే,సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయ దర్శనం చేయవచ్చు. 

మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా... కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి.

 ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటినన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు...

ఈ విషయంలో పూజలు  చేయవచ్చు అనడం కంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధనం అవుతుంది.!!

హిందూ సనాతన సంప్రదాయాల పాటించండి -- గౌరవించండి..

సర్వేజనా సుఖినోభవంతు...🙏

🌷🌷🌷🌷🌷🌷

05...

ఫ్రెండ్సు నేను శివయ్య ను ఎప్పుడు ఒకటే కోరుకుంటా నాకు కోపమైనా భాదైనా వచ్చినప్పుడు

నా కళ్ళనుండి ఎంతైనా కన్నీరు రానివ్వు పర్లేదు 

కానీ నా నోటి నుండి మాట రానివ్వకు

 నామనసుకి పంతం పట్టింపులు రానివ్వకయ్య అనీ.

ఫ్రెండ్స్ ఎందుకలా అంటారేమో ఇక్కడ ఎన్నాళ్లు ఉంటామో ఎవరికి ఎరుక

రాత రాసిన పరమాత్మకే ఎరుక. అలాంటప్పుడు ఉన్నన్నాళ్లు మన అనే వాళ్ళతో ఆనందంగా ఉండక పంతాలు పట్టింపులు బాధపెట్టుకోంటలు అవసరమా చెప్పండి.

ఇప్పుడు మనతో ఉన్న ఫ్రెండ్స్  చుట్టాలు ఇంకా అన్ని బంధలు ఏ జన్మ బంధల్లో ఎవరికీ ఎరుక ఏదో జన్మలో మనం కోరుకుంటేనే ఈ జన్మలో బంధాలు ఏర్పడతాయి. లేదా మనిషిని చూసినా మాట్లాడినా మన అనీ హృదయం స్పంధీస్తుంది. ఇక్కడ ఇంకో మాట తిగారి తిగారి స్పందన కాదు ఆ స్పందన స్వచ్ఛమైనది పవిత్రమైనది హృదయానికి సంబంధించినది.

కన్నీళ్లు ఎందుకు అంటారేమో.

కన్నీటితో నాలో కలిగిన బాధ కోపం కొంతసేపటికి  పోతుంది కానీ మాట జారితే వారికి బాధ కలుగుతుంది.నాకు ఎంత భాదైనా కోపమైనా తట్టుకునే శక్తి వరం గా నా తండ్రి శివయ్య ఇచ్చాడు

కానీ ఎదుటి వారికి ఆ శక్తి ఉందో లేదో తెలియదు కదా. అందుకే వద్దు తండ్రి వద్దు ఎవరినీ బాధ పెట్టే పరిస్థితి కల్పించకు అనీ ప్రతి నిమిషం కోరుకుంటా.నిజం గా నేను తెలిసి ఎవరిని బాధపెట్టలేదు ఒకవేళ తెలియకుండా బాధపెట్టాను అనీ అనిపిస్తే వేంటనే సారీ చేప్తాను క్షమించమ్మని అడుగుతను.అసలు అందరం ఆనందంగా జీవించడం ఎలానో తెలుసుకుంటే మంచిదని

నా ఆభిప్రాయం.🙏


ఒక జీవుడు ఊహ చెబుతాను చదవండి 🙏

ఉదయం 6 గంటల సమయం.......ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం

చేస్తున్నాను. కానీ......లేవలేకపోతున్నాను.. ఎందుకో ఏమిటో మరి......

" ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను ? " ఒక్క నిమిషం ఆలోచించాను.

నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొట్టినంత

నొప్పి వచ్చింది...స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు

తెలియదు.....

కాఫీ కావాలి నాకు........నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.

ఆఫీసుకు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?

వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు.......ఇంటి బయట చాలా మంది గుంపుగా

ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు......అయ్యో! అది నేనే! దేవుడా!

నేను చనిపోయానా?

బయట చాలా మంది ఏడుస్తున్నారు.....బిగ్గరగా

పిలిచాను........నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి

నా పక్కగదిలోకి తొంగి చూశాను.... నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.

కొడుకును పట్టుకుని.......భార్యను పిలిచాను........తనకు నా మాటలు

వినిపించలేదు........మరో గదిలోకి వెళ్ళి చూశాను......

ఆ గదిలో మా అమ్మ ...నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు

దు;ఖంలో.......

" నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను " అని బిగ్గరగా అరిచాను.......ఎవ్వరూ నన్ను

చూడటం లేదు..

బయటికి పరుగెత్తి వచ్చాను.......అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా

ఏడుస్తున్నాడు.....వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు.......

నా స్నేహితునితో నాకు గొడవవచ్చి...........వాడితో సంవత్సరం నుండి నేను

మాట్లాడ్టం మానేశాను.......ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు.మరి

వాడెందుకు ఏడుస్తున్నాడు.........అవును నేను చనిపోయాను......నిజంగానే

చనిపోయాను.

దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని

ఇవ్వు.....ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ వత్తిడితో నా భార్యను మంచిగా

ప్రేమగా చూసుకోలేకపోయాను.....నువ్వు చాలా అందంగా ఉన్నావనీ..

నువ్వు భార్యగా దొరకడం నా అదృ్ష్టం అని చెప్పలేకపోయాను........

నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను......నేను వచ్చేలోగానే నాబిడ్డ నిద్రపోయేవాడు......

ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నాను.

చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని

వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను." అని బి్గ్గారగా

ఏడుస్తున్నాను......." దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు......నా తల్లి మొహంలో నవ్వును చూడాలి.........నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు

ప్రాణబిక్ష పెట్టు స్వామీ! అని బిగ్గరగా అరుస్తూ  దేవుడిని బతిమిలాడుతున్న.

ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు......కళ్ళు తెరిచి చూశాను.

నా భార్య......" ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.

ఏమైంది మీకు ?" అని అడుగుతోంది.

అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట.

నిజంగానే నాకు ఇది మరుజన్మనే! ఆఫీసుకు టైం అయిందన్న నాభార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి

" నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని.....నీలాంటి అమ్మాయి నాకు

భార్యగా దొరకడం......నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా ఉన్నావో తెలుసా ? " అన్నాను......ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య,,,,,,


చూసేరా ఫ్రెండ్స్  మీకు నాకు  ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇకనైనా ఈగోలను

పక్కనపెట్టి మన కుటుంబాన్ని మన అనుకున్న వాళ్ళను ఆప్యాయంగా స్వచ్ఛంగా ప్రేమిద్దాం .

అన్నీ పోగొట్టుకున్న తర్వాత

బాధపడి ఏమీ లాభం లేదు......కుటుంబంతో గడుపుదాం స్నేహితులతో

మంచిగా ప్రవర్తించూదాం  ఈ జన్మ దేవుడిచ్చినది......ఆనందంగా

జీవించి ఎందరికో ఆదర్శంగా నిలుద్దాం

ఆదర్శంగా నిలవాక పోయిన  కనీసం మన కుటుంబమైనా మన వల్ల ఆనందంగా ఉండెటట్లు చూసుకోవలిసింది ఖచ్చితంగా మనమే.  ఎంతకాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా ఎందరి మనసులకు సంతోషం కలిగించాం అన్నది ముఖ్యం అని నా అభిప్రాయం.

06...హరిఓం   ,                🙏

ఒకసారి ఒక ఊరినుండి ఊరి పెద్దమనుషులు పరమాచార్య స్వామివారి దర్శనానికై శ్రీమఠానికి వచ్చారు. వాళ్ల ఊరిలో ని వినాయకుడి విగ్రహం ఎవరో ఎత్తుకుపోవడం వల్ల ఒక కొత్త విగ్రహం కొసం మీ దగ్గరకు వచ్చామని వారు మహాస్వామితో చెప్పారు.

మహాస్వామి వారు “మీ ఊళ్ళో చెరువు ఉందా?” అని అడిగారు.

“అవును ఉంది పెరియవ”

“అందులో నీళ్ళు ఉన్నాయా?”

వచ్చిన వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుని “గ్రామ పంచాయితి శుభ్రం చెయ్యనందున నీళ్ళు కొన్ని మాత్రమే ఉన్నాయి” అని చెప్పారు.

“చెరువులో నీరు ఎక్కువగా ఉంటే ప్రజలకూ పశువులకూ ఉపయోగమే కదా?” ”అవును పెరియవ”

“సరే ముందు మీరు చెరువులో పూడిక తీసి, బాగా నీరు నిలువ ఉండేటట్టు చెయ్యండి” అని చెప్పి ఇక వారు వెళ్ళవచ్చు అన్నట్టుగా వారికి ప్రసాదమును ఇచ్చారు. వచ్చినవారు చాలా నిరాశపడి, విగ్రహం దొరకదు అని చెప్పినా సంతోషంగా ఉండేది కానీ  మహాస్వామి వారు విగ్రహం గురించి ఏమి మాట్లాడలేదు అని అనుకున్నారు. 

చెరువు పూడిక తీయటం ప్రభుత్వం చేయవలసిన పని. అది మేమెందుకు చేయాలి అని అనుకున్నారు. కానీ  కొంతమంది పెద్దలు “మహాస్వామి వారు మనకు చేయమని చెప్పారు కాబట్టి మనం చేయవలసిందే. వారి మాటలను నిరాకరించి లేని పోని బాధలను ఎందుకు తెచ్చుకోవటం” అని అన్నారు. 

మనము ఏమి చేయలేము. ఇదంతా మనము చేసుకున్నదే. దీన్ని వాయిదా వెయ్యటంకంటే ఇప్పుడు చేసెయ్యడమే మంచిది అని తీర్మానించుకున్నారు.

ఒక రోజు ఊళ్ళో ఉన్న కొంతమంది దృఢకాయులు అందరూ కలిసి పలుగు పార పట్టుకుని చెరువు పూడిక తీసే పని ప్రారంభించారు. కొద్దిసేపటి తరువాత ఒకడు భూమిని కొట్టగా “టంగ్” మన్న శబ్ధం వినిపించింది. అతడు ఇక్కడ ఏదో ఉన్నదని అందరినీ పిలిచాడు. వారు జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక వినాయకుడి విగ్రహం (పోయిన విగ్రహం కాదు). మరి కొద్దిసేపటి తరువాత మళ్ళా “టంగ్” మన్న శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే అది ఒక శివలింగం. తరువాత ఒక్కొక్కటిగా నంది, పార్వతి, దుర్గా, కార్తికేయుడు, బలిపీఠం మొత్తంగా శివ పరివారమే లభించింది. 

అందరూ వెంటనే కాంచీపురానికి బయలుదేరారు. ”మేము మహాస్వామిని వినాయకుని విగ్రహం మాత్రమే అడిగాము. కానీ  మాకు ఇప్పుడు మొత్తం దేవాలయమే దొరికింది” అని వారి ఆనందానికి అవధులు లేవు.

“చెరువు ప్రక్కన ఒక కొట్టం వేసి, ఆ విగ్రాహాలను అక్కడ ఉంచి దీపారధన చేసి పళ్ళు పూలతో రోజూ పూజించండి“ అని మహాస్వామి వారు చెప్పారు.

“మరి దేవాలయం?” అడిగారు ఊరి పెద్దలు. ”వినాయకుడు వచ్చాడు కదా? ఇంకేం అంతా ఆయనే చూసుకుంటాడు” అన్నారు మహాస్వామి......................             -                        🙏🙏                   -                                                    

 07...పంచ పునీతాలు అంటే ఏమిటి?

*మొదటిది.... వాక్కు శుద్ధి*

వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.

*రెండవది….. దేహశుద్ధి:*

మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.

*మూడవది…..భాండ శుద్ధి:*

శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.

*నాలుగవది…….కర్మశుద్ధి:*

అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.

*ఐదవది……….మనశ్శుద్ధి:*

మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్దీ.

†*******

08....శుభోదయం.

మనం రెండు సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జాగృతి, రెండు మౌనము. మనం మేలుకొని ఉంటే ఏదైతే వుందో, దాని అనుభవాన్ని ఇప్పుడే, ఇక్కడే పొందుతాము.  మీరు మౌనంగా ఉంటేనే మెలకువతో వుండగలరు. లేని పక్షంలో మీ ఆలోచనలు మిమ్మల్ని గతంలోకో, భవిష్యత్తులోకో తీసుకుని పోతాయి. 

మారడం కోసం ప్రయత్నం చేయని వాడంటూ ఎవరూ ఉండరు. అయితే తాను ఎక్కడున్నాడో అక్కడ నుంచే మారాలని అనుకుంటాడు. కానీ అది కుదరదు. ఎవరు తాను ఎలావున్నా, తనని తాను స్వీకరించుకోగలడో, అలాంటి వ్యక్తి మాత్రమే మారగలడు.

తామస ప్రవృత్తి కలవారు యజ్ఞాదికలను, రాజస ప్రవృత్తి కలవారు వేదాదులను, సాత్త్విక ప్రవృత్తి కలవారు సద్గురువులను ఎంచుకుంటారు. సద్గురువు లభించే దాకా శాస్త్రం యొక్క అవసరం ఉంటుంది. గురువు లభించాలి అంటే శాస్త్రాన్ని ఎంచుకోవాలి. కర్మకాండని ఎంచుకోకూడదు. శాస్త్రాన్ని అర్ధం చేసుకోవాలి. శాస్త్రమున్నది అర్ధం చేసుకోడానికి, చేయడానికి కాదు. అర్ధం చేసుకోవడం వలన ముక్తి కలుగుతుంది. ఒకవేళ శాస్త్రం కూడా లభించక పోతే, అప్పుడు కర్మకాండ. కర్మకాండ భగవంతుని చివరి ప్రతిధ్వని.

ఒకటే తపస్సు, అది మీరు లేకుండా పోవడం.

ఒకటే యజ్ఞం, అది కూడా మీరు లేకుండా పోవడం.

ఒకటే దానం, మీరు మిమ్మల్ని మీకు దానం చేసుకోవడం.

ఇవన్నీ అయ్యాక ఏది మిగులుతుందో,

కెరటం లేకుండా పోయినప్పుడు, ఏ సముద్రం మిగిలివుంటుందో అదే

ఓం తత్ సత్.

 09...:--* ఈరోజు *మంచి మాటలు 

       నీవు ఎప్పుడైనా ఏమైనా *కోల్పోయినచో* దాని గురించే *ఆలోచిస్తూ* కూర్చుంటే *ఉన్నవాటిని* కూడా కోల్పోవాల్సివస్తుంది . మన  *మిత్రులు* మన *కోర్కెలు* తీర్చలేరేమో కానీ *అవసరాలను* .తప్పక తీరుస్తారు .

        నీవు *ఎక్కువగా* ఎవరిని నమ్మకు *మోసపోతావు* , ఎవరి కోసమూ *ఆలోచించకు* వాళ్ళకే *అలుసైపోతావు* , ఎదుటి వారికి ఎక్కువ *విలువ* ఇవ్వకు నీవు *గౌరవాన్ని* కోల్పోతావు , ఎవరిని *ప్రశ్నించకు శత్రువు* అవుతావు , ముందుగా *నా వాళ్ళు* అని ఆలోచించడం *తగ్గించు* ఎవరి నుంచి ఏం *ఆశించకు* నీ *జీవితం* చాలా బాగుంటుంది .

         మనతో *చనువు* ఎక్కువైతే ఎదుటి వారి నుండి మనకు *చులకన* తప్పదు . ఎదుటి వారు మనకు *దగ్గర* ఎక్కువైతే *దూరం* తప్పదు . మనలో 

*నమ్మకం* ఎక్కువైతే *ద్రోహం* తప్పదు . *ప్రేమ* ఎక్కువైతే *బాధ* తప్పదు . *ఆశ* ఎక్కువైతే 

*దుఃఖం* తప్పదు . ఇదే మన *జీవిత సత్యం* .

        మనల్ని *అర్థం* చేసుకునే 

వారికి మన *రూపంతో* అవసరం లేదు మన *మనస్సుతో* పని . మనల్ని *బాధపెట్టేవారికి* మన *మనస్సుతో* అవసరం లేదు వారి *అవసరంతోనే* పని మన *స్నేహం* కోరేవారికి మన *స్తోమతతో అవసరం లేదు మన వ్యక్తిత్వంతో* పని మనల్ని *దూరం* పెట్టేవారికి మన *ఆలోచనలతో* అవసరం లేదు వారి  *స్వార్థంతోనే* పని .

     సేకరణ ✒️ *మీ ... ప్రాంజలి ప్రభ


10.. తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?

డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ ? ’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.

ఎందుకు ? 

ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 

తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ? 

ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !

కానీ మనం పలకం. 

వంటింటిని......కిచెన్ చేసాం. 

వసారా.....వరండాగా మారింది. 

ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు. 

ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు. 

భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 

అందులో వడ్డించే వన్నీ.......

రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా,  వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం. 

బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి ? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది. 

టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 

వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి. 

అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 

టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 

అది ఏ భాషో మీరే చెప్పండి. 

‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలాసాగుతుంది. 

మరి మన కూరల కు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?

నిన్న మా పక్కింటాయన వచ్చి 

‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. 

మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది ? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?

అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 

అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.

పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం. 

సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. 

ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 

మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి ? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 

ఇతరులు అనుకోవాలన్న భావన.

ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.

అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.


*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

        *శ్రీ భాగవతం - 94 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 24*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁


*అక్రూరుడు బృందావనముకు ఏతెంచుట*


అక్కడ కంసుడు కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడోనని చాలా ఆందోళనలో ఉన్నాడు. 


ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైనదని తెలుసుకున్న నారదుడు వచ్చి,  


‘కంసా! ఇన్నాళ్ళ నుండి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు? నేను చెప్పేస్తున్నాను. 


నిన్ను చంపేవాడు వసుదేవుని కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారము తలుపులు తెరుచుకుంటే కృష్ణుని యమునానదిని దాటించి నందవ్రజంలో నందుని దగ్గర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు అష్టమ గర్భంలో పుట్టాడు’ అని చెప్పాడు. అనగానే,  ‘ముందు ఆ వసుదేవుని చంపేస్తాను అని కత్తి తీశాడు కంసుడు. అపుడు నారదుడు ‘ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి చంపేస్తే నీ మృత్యువు పోదు. ఎందుకు దేవకీ వసుదేవులను చంపడం’ అన్నాడు.


అపుడు కంసుడు దేవకీ వసుదేవులను తెచ్చి చెరసాలలో బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. వారిద్దరినీ తీసుకువచ్చి చెరసాలలో బంధించారు. 


తరువాత నారదుడు ఒకమాట చెప్పాడు,  ‘నీవు బంధువులందరి చేత ఎందుకు ద్వేషింపబడుతున్నావో అందుకు సంబంధించిన నీ జన్మరహస్యం చెప్తాను విను’ అన్నాడు. 


ఈ విషయమును మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ‘మావంశంలో ఒక మహా పురుషుడు పుట్టాలండీ’ అంటూ ఉంటారు. మహాపురుషుడు పుట్టాలని అనుకున్నవాడు, కావలసిన రీతిలో నడవడిని కలిగి ఉండాలి. నారదుడు ఈ రహస్యమును కంసుడితో చెప్తున్నాడు. 


నీవారు నీకు శత్రువులు. ఎందుకో చెప్తాను విను. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటిక యందు విహరిస్తోంది. ఆవిడకి భర్త్రు సమాగమ కాంక్ష కలిగింది. ద్రవిళుడు అనబడే గంధర్వుడు ఇతరుల మనస్సులను కనిపెట్ట గలిగిన వాడు ఆ సమయంలో అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. వానికి ఇతరుల మనస్సు తెలుసు. నీతల్లి మనస్సును గ్రహించాడు. ఉగ్రసేనుడి రూపంలో వచ్చాడు. ఆ వచ్చిన వాడు తన భర్త కాడేమోనని ఆవిడకి అనుమానం వచ్చింది. ఉత్తరక్షణం వాడు తన నిజ స్వరూపంతో నిలబడ్డాడు. ఆవిడ ఆగ్రహించింది. 


అపుడు వాడు ‘ఇది అలోమ సంపర్కము. ఈ అలోమ విధానంలో నేను గంధర్వుడను, నీవు మనుష్యకాంతవు. గంధర్వులు మనుష్య కాంతలతో సుఖము అనుభవించవచ్చు. దానివలన చాలా తేజస్సు కలిగిన కుమారుడు జన్మిస్తాడు.  నేను నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. నీకు గొప్ప పరాక్రమము కలిగిన వాడు బుద్ధి కలిగినవాడు అయిన కుమారుడు జన్మిస్తాడు’ అని యింకా ఏదో చెప్పబోతున్నాడు. అపుడు ఆవిడ,  ‘పరమ దుర్మార్గుడా! నా మనస్సులో భర్త్రు సమాగమ కాంక్ష తెలుసుకుని నా భర్తరూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడకుండా నాకు కొడుకును ఇస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వెయ్యి మంది సుపుత్రులు కలిగే కన్నా స్త్రీకి శీలమే గొప్ప.'


నీవు యిటువంటి దుర్మార్గమయిన పని చేశావు కనుక, అని అంటూ ద్రవిళుడిని శపించబోయింది. తనని శపిస్తుందేమోనని వాడు గజగజలాడుతూ నిలబడ్డాడు. అపుడు ఆమె,  ‘నీ వలన నాకు పుట్టబోవు కొడుకు దుర్మార్గుడు అగుగాక! ఋషులను ద్వేషించుగాక! పరమ కిరాతకుడు అగుగాక! వానిని పదికాలముల పాటు రాక్షసునిగా చెప్పుకొనెదరు గాక’ అంది. 


అపుడు వీడు తానుకూడా శాపిస్తేనే ఆవిడ సంతోష పడుతుందని,  ‘అతడు తనవారి చేత తాను ద్వేషింపబడుగాక’ అని అన్నాడు. అందుకని నీవారి చేత నీవు ద్వేషింపబడతావు. నీతల్లి నీవు పుట్టగానే వరం ఇస్తూనే శపించింది. ద్రవిళుడు కూడా శపించాడు. అందుకే నీ బ్రతుకు ఇలా అయిపొయింది. అందుకే నీవారు అన్నవారు నిన్ను ద్వేషిస్తారు’ అన్నాడు. 


నారదుడు అలా అనగానే కంసుడు తన బంధువులనందరినీ తెచ్చి కారాగారంలో పడేశాడు. ‘వీళ్ళందరూ నన్ను చంపేవాళ్ళే, వీళ్ళని నేను చంపేస్తాను’ అని అక్రూరుని పిలిచాడు. 


‘అక్రూరా! నీకు తెలుసు నేను బ్రతకాలి అనుకుంటున్నాను. కృష్ణుడు నన్ను చంపాలని అనుకుంటున్నాడు. అందుకని నీవు వెంటనే బృందావనం వెళ్ళి కృష్ణుడిని తీసుకురా. నీ మేనమామ కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు. చూడడానికి నీవు బయల్దేరి రావలసింది అని ఆహ్వానించి తీసుకురా. ధనుర్యాగం మిష పెట్టి ఆ పిల్లవాడు మధురా నగరంలోకి రాగానే ఏదోరకంగా చంపేస్తాను. మన దగ్గర *కువలయాపీడము* అనే ఏనుగు ఉంది. ఆ ఏనుగుతో తొక్కించేస్తాను. *చాణూర ముష్టికులు* అనే యిద్దరు మల్లులు ఉన్నారు. వాళ్ళతో మల్లయుద్ధం పెట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేను చంపేస్తాను. కాబట్టి బెంగలేదు. ఎలాగయినా సరే మామయ్యా పిలుస్తున్నాడని తీసుకురా’ అన్నాడు. 


అక్రూరుడు కృష్ణుడి దగ్గరకు బయలుదేరుతున్నాడు.


మధురానగరంలో కంసుని రాజ్యంలో ఉంటున్న అక్రూరుడికి కృష్ణుడి మీద యింత భక్తి ఎలా ఏర్పడింది?


అక్రూరుని తల్లిదండ్రులు గాందిని, శ్వఫల్కుడు. గాందిని తండ్రిగారికి ఒక కోరిక ఉండేది. తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని ఆయన కోరుకునే వాడు. ఆయన ఒక వ్రతం చేశాడు. ఆ వ్రతంలో మూడువందల అరవై అయిదురోజులు ‘ప్రతిరోజూ నేను ఒక ఆవును దానం చేస్తాను’ అని మూడువందల అరవై అయిదు రోజులు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజూ ఒక ఆవు చోపున సంవత్సరం పాటు దానం చేశాడు. ఆ దానం చేసిన ఫలితం చేత ఆయన కుమార్తె అయిన గాందినికి అక్రూరుడు జన్మించాడు. 


ఈ అక్రూరుడు జన్మతః విశేషముగా కృష్ణ భక్తి కలిగినవాడు. ముందుతరం కాక ఆ ముందుతరం వాళ్ళు చేసిన గోదాన ఫలితం నుండి యిటువంటి మహాపురుషుడు పుట్టాడు. అక్రూరుని వంటి మహాపురుషుని వలన ఆ వంశం తరిస్తోంది. పుట్టుకచేత యింతభక్తి గతంలో చేసిన పుణ్య వలన వచ్చింది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనిషి పుణ్యమును చేసి తీరాలి. అలా చేస్తే ఉద్ధరించగలిగిన మహాపురుషుడు ఆ వంశంలో జన్మిస్తాడు అని మనకు అక్రూరుని జీవితం తెలియజేస్తుంది. 


అక్రూరుడు ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ బలరామకృష్ణులను తీసుకురావడానికి వెళ్ళాడు. అందుకే నమస్కారమునకు అక్రూరుని చెపుతారు. అలా వెళ్తూ ఒకసారి భూమిమీదకి చూశాడు. అక్కడ దివ్యరేఖలతో కూడిన చిన్నిచిన్ని పాదముద్రలు కనిపించాయి. అనగా ఆలమందతో కృష్ణుడు అటుగా వెళ్ళి ఉంటాడని భావించాడు. ఆయన కృష్ణుడు నడిచిన భూమి మీద తాను రథం మీద వెళ్ళడమా! అనుకొని ఒక్కసారి రథమును ఆపాడు. ఒళ్ళంతా ఆనందముతో పొంగిపోయింది. కన్నులవెంట భాష్పధారలు కారుతుండగా స్వర్ణదండము రథము నుండి కిందపడిపోతే ఎలా పడిపోతుందో అలా రథమునుండి క్రిందపడిపోయాడు. తన స్వామి నడిచిన చోట తాను క్రింద పడ్డాను అనుకుని దోర్లేశాడు. ఆ ధూళి అంతా ఒంటిమీద పోసేసుకుని నందుడు ఉండే యింటి దగ్గరకు వెళ్ళాడు.


ఆవుల మందలో ఒక ఆవు పొదుగు దగ్గర కూర్చుని అంతటా వ్యాప్తి చెందిన నారాయణ తత్త్వము నందుని యింట్లో పాలు పితుకుతోంది. ‘రాశీభూతమైన పరబ్రహ్మమును నా మాంస నేత్రములతో చూస్తున్నాను. నా జన్మ ధన్యమయిపోయింది’ అనుకుని వెళ్ళి,  కృష్ణుడికి బలరాముడికి నమస్కరించి మానవ జన్మ ఎత్తినందుకు మీ యిద్దరిని చూసి ధన్యత చెందాను’ అన్నాడు.


బలరాముడు అక్రూరుడిని గబగబా తీసుకువెళ్ళి ఉచితాసనం మీద కూర్చోపెట్టారు. కాళ్ళు కడిగి ఆ నీళ్ళని తనపై చల్లుకున్నాడు. అర్ఘ్యం ఇచ్చాడు. పాద్యం ఇచ్చాడు. మంచి భోజనం పెట్టాడు. మధుపర్కం ఇచ్చాడు. ఒక గోవును దానం చేశాడు. తాంబూలం ఇచ్చాడు. 


బలరామకృష్ణులు వచ్చి అక్రూరుని ప్రక్కన కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంత వశుడు అవుతాడో చూడండి!


అక్రూరా! మధురలో అందరు కుశలమా! అని అడగబుద్ధి వేయలేదు. ప్రభువు ధూర్తుడయిన చోట క్షేమం ఎక్కడ ఉంటుంది? 


కంసుడు పరిపాలిస్తుండగా మధురలో ప్రజలు క్షేమంగా ఎలా ఉంటారు? ఏ పనిమీద మీరు యింత దూరము వచ్చినారో చెప్పవలసినది’ అన్నారు. 


అపుడు అక్రూరుడు ‘మహానుభావా, మీకు తెలియని విషయం కాదు. కంసుడు ధనుర్యాగము అనే మిషతో మల్లయుద్ధములను ఏర్పాటు చేశాడు. మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ అంతరమునందు కోర్కె వేరు. మీ యిద్దరిని చంపడం కోసం మధుర పిలుస్తున్నాడు. దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. మీరు దీపముల వంటి వారు. మీమీద పడిన మిడతలు కాలిపోతాయి. కాబట్టి ఈ రీతిగా నయినా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను’ అన్నాడు. 


వెంటనే కృష్ణ పరమాత్మ అక్కడ వున్న పెద్దలను పిలిచి ‘మీ అందరూ కూడా పాలు, వెన్న మొదలయిన భాండములను సిద్ధం చేయండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడితో కలిసి అక్రూరుడితో మధురా నగరమునకు వెడతాము. కంసమామ మమ్మల్ని యాగమునకు పిలిచాడు. వెడతాము’ అన్నారు. 


ఈవార్త బృందావనంలో గుప్పుమంది. కృష్ణునితో గోపకాంతలు విపరీతమయిన అనుబంధం పెంచుకున్నారు. ఇపుడు వారందరి కోపం అక్రూరుడి మీదకు మళ్ళింది. 


ఇతని పేరు అక్రూరుడా! ఇతని పేరు క్రూరుడు. అని కృష్ణుని రథమునకు ఆడ్డుపడ్డారు. దామోదరా! గోవిందా! కేశవా! నువ్వు వెళ్ళడానికి వీలులేదు. నిన్ను మేము విడిచిపెట్టి ఉండలేము. నీవు వెళ్ళిపోతే ప్రాణములు లేని శరీరములులా పడిపోతాము’ అన్నారు. 


పరమాత్మ వాళ్ళతో మాట్లాడలేదు. 


‘వాళ్ళని ప్రక్కకి తొలగమనండి ఇది నా ఆజ్ఞ. నేను మధురకు బయల్దేరుతున్నాను’ అన్నాడు. పక్కకి తొలిగారు. రథము వెళ్ళిపోతోంది. పాపం యశోదాదేవి దుఃఖమునకు అంతేలేదు. ప్రతిక్షణం ఆ కృష్ణుడిని తలుచుకోవడం తప్ప అసలు ఆవిడకి జీవితమే లేదు. అంత ప్రేమించిన తల్లి. అక్కడ కంసుని వలన ఏ ప్రమాదము వస్తుందోనని ఆమె బెంగపెట్టుకుని ఉంది. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనిపించినంతసేపు ఉండి తిరిగి యిళ్ళకు వచ్చేశారు. 


అలా వెళుతుండగా అక్రూరుడు ఒక చిత్రమయిన పని చేశాడు. రథమును యమునా నది ఒడ్డున ఆపి ‘ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను కృష్ణా’ అన్నాడు.


చేసుకురావయ్యా అన్నారు. ఆయన నీటి దగ్గరకు వెళ్ళి ప్రణవమును జపించి ఒకసారి ఆ యమునా నది వంక కళ్ళు విప్పి చూశాడు. యమునా నది నీటిమీద బలరామ కృష్ణులు కనపడ్డారు. ఆశ్చర్యపడ్డాడు. ఇదేమిటి, రథం మీద నుండి దిగి నీటిమీద నిలబడ్డారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు. అలా కనపడడం ఈశ్వరుని దివ్యశక్తి అనుకుని యమునానదీ స్నానం చేద్దామని మునకవేశాడు. ఎవ్వరికీ ఇవ్వని దర్శనము పరమాత్మ అక్రూరునికి యిచ్చాడు. అంతేకాకుండా అక్రూరుడు యమునలో మునిగేటప్పటికి సనక సనందనాది మహర్షులు మొదలగువారు అందరూ స్తోత్రం చేస్తుండగా క్షీరసాగరము నందు ఆదిశేషుని మీద అలవోకగా పవళించిన ఆదితత్త్వమయిన ఆదినారాయణుని దర్శనమును పొందాడు. 


అపుడు అక్రూరుడు పరమాత్మను అద్భుతమయిన స్తోత్రం చేశాడు. 

మనం అటువంటి మూర్తినే తిరుపతిలోని గోవింద రాజస్వామి వారి ఆలయంలో దర్శనం చేస్తాము. గోవిందరాజస్వామి పెద్ద పాముచుట్ట మీద తలవెనుక పెద్ద సోల పెట్టుకొని పడుకుని ఉంటాడు. నాభికమలము నందు చతుర్ముఖ బ్రహ్మగారు, కాళ్ళ దగ్గర శ్రీదేవి, భూదేవి, మధుకైటభులనే రాక్షసులతో సహా మనకి దర్శనం యిస్తారు. ఆయన పొట్టమీద అడ్డంగా తులసిమాలలు వ్రేలాడదీయబడి వుండగా కన్నులు మూసుకుని నిద్రిస్తూ ఉన్నట్లుగా మనకు దర్శనం యిస్తాడు. అపుడు మనము అక్రూరుని మనసులో తలుచుకుని అక్రూరుడు దర్శించిన శ్రీమన్నారాయణ తత్త్వము యిక్కడ కనపడుతోందని గోవింద రాజస్వామిని దర్శించవచ్చు.


అటువంటి దర్శనమును పొంది అక్రూరుడు సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మధురా నగరమును చేరుకున్నాడు. కృష్ణుడిని తన యింటికి వచ్చి ఆనాటి రాత్రి విడిది చేయవలసినదని కోరాడు. 


అపుడు కృష్ణుడు నేను యిప్పుడు రానులే,  రాక్షస సంహారము పూర్తయిపోయి కంసుని సంహరించిన తరువాత యోగ్యమయిన కాలమునందు వచ్చి, నీయింట నేను తప్పకుండా ఆతిథ్యమును స్వీకరిస్తాను’ అని మాట యిచ్చి బలరామకృష్ణులు ఊరిబయట పడుకున్నారు. మరునాటి ఉదయం మధురా నగర ప్రవేశం చేశారు.



          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏



🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏


*నాగ సుబ్బయ్య పైడి*  (సశేషం.....)

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹