Friday, 23 April 2021


May be an image of 4 people

 

సోయగాలు ... (10 -12 )


మమతయు సర్వలోక జనత  

సమత యువత జనత  

కమ్మని పాటల తొ వనిత  

మమ్ము చూడు యువత 

నమ్మియు జూపినట్టి మమత  

కమ్మ నైన చరిత 

ఏమన నే సోయ గాలులే 


నీతి యన్నది ఇక్కడ లేదు 

బ్రాంతి ఉంది అంత 

శాంతి కరువుగాను మారేను   

చింత చేరి నంత 

వింత పోకడ ఏలు చుండెను 

సంత గోల నంత 

ఇంత అంత  ప్రేమ మల్లేను  


యవినీతి ఆటలు ఆడేను 

యవని లోన జెప్ప 

యువనీతి వీధిన పడేను 

యువత చెందు బుద్ధి 

యువతీ యువకులజంట ప్రేమ  

యెంత మార్చు జగతి 

ఏమి అన్ననుఇది  ప్రేమయే 


--(())--

పుస్తక దినోత్సవ సందర్భముగా ,... ప్రాంజలి ప్రభ 


పుస్త కమ్ముయే మస్తకమ్మును మార్చు పుడమినందు    

విద్య నేర్చిన బతుకులో సుఖముండు జగతి నందు 

పుట్టి నప్పుడు జీవితాన చదువు మలుపు నందు 

గిట్టి  నప్పుడు పరమాత్మ ధ్యానము తనువు నందు 




ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 

రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(3 )


చింత మాపు నమ్మ - పంతం లేని అమ్మ 

శాంతి చూపు అమ్మ  - కాంతి చూపు అమ్మ 


ఫలములిచ్చు అమ్మ  - కలత తీర్చు అమ్మ 

వెలితి మాపు అమ్మ  - అలక తీర్చు అమ్మ 


పరి పోషణ గ అమ్మ - కరి పై ఉరేగు అమ్మ 

గిరి ఫై వెలిసిన అమ్మ - సిరి పంచేటి అమ్మ 


చింతామణితొ అమ్మ - కాంతా మణిగ అమ్మ 

బ్రాంతి తొలుచు అమ్మ - శాంతి తెలుపు అమ్మ  


రెప్ప పాటున అమ్మ - చెప్పు మాటలొ  అమ్మ 

ఒప్పు ఆటలొ అమ్మ  - తప్పు వేటలొ అమ్మ  


చిరుత చూపుల అమ్మ - చరిత చెప్పిన అమ్మ  

అరువు తీర్చిన అమ్మ - పరువు నిల్పిన అమ్మ 


సుఖధా రిచ్చు నమ్మ - శశిర ఋతువులొ అమ్మ    

లౌఖ్యమ్ము తెల్పు నమ్మ - మముకన్న మాయమ్మ 


కుటిలకచం మమ్మ - కఠినకుచం మమ్మ 

కుందస్మిత మమ్మ   - కాంతి చూపు మమ్మ 


కుంకుమ చ్ఛాయమ్మ - పచ్చని ముఖపు అమ్మ

తఫల మాపు మాయమ్మ - మమ్మేలు మాయమ్మ  


పంచ శరమ్ముల అమ్మ  - శాస్త్ర బోధనా లమ్మ  

ఆచార్యులతొ నమ్మ   - సర్వము దృష్టి వమ్మ 


పాత్ర పోషిత వమ్మ  - కాంచీ వాసవమ్మ 

కుమారి కాంచనమ్మ - మోహయతి వైనవమ్మ 


సులభా చిత్త మమ్మ - ప్రతిభా చిత్త మమ్మ 

కాంచీ నిలయమమ్మ  - మముకన్న మాయమ్మ  


మము కన్న మాయమ్మా  - మము పెంచు మాయమ్మ 


విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--

సోయగములు (7to ౯)


మనసున మల్లెల వాసన 

మనన నెంత కోరె 

తనమన అనక ఘుభాళించి 

తనువు పులక రించి   

తన్మయ పరిచియు చెందియు 

తన్ను తాను మరచు 

మనకు పంచేటి సోయగములే 


వయసున ఉడుకుయే ఉయ్యాల 

న్యాయ మవ్వు చుండు 

ఆయువు చల్లని జంపాల   

నెయ్య మొవ్వు చుండు 

కయ్యపు మాటలు పొంగాల 

వియ్యమవ్వు చుండు  

మనకు పంచేటి సోయగములే 


ధైర్యము ఉంటేనె విజయము

శౌర్య ముంచి కదులు

మర్మము తెలిసిన విషయమే

కర్మ మంచి గుండె

ధర్మము అనుకరించి నడుచు

నిర్మలమ్ము గుండు

సర్వము తెల్పు సోయగములే


విధేయుడు : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


--(())--


ఉషస్సు పొందితి 

వయస్సు పంచితి 

మనస్సు విచ్చెను ప్రేమతోను 


సొగసు పిలుపులో 

వయసు ఉడుకులో 

మనసు పరుగులే ప్రేమతోను 




మనసు లోతు కనుగొనుట  సూత్రము ఉందెక్కడ 

వయసు పెర్గు తెల్సుకొనుట  లుసుకొ సూత్రము ఉందెక్కడ  

సొగసు రూపు మార్చు కొనుట పంచు మనసుకు  సూత్రము ఉందెక్కడ   

తపసు  చేయు మగువకు సూత్రము ఉందెక్కడ  


నయన చుక్క కడలికి సూత్రము ఉందెక్కడ  

మెరుపు వెల్గు పుడమికి సూత్రము ఉందెక్కడ    


కలల అమ్మ మనుగడ సూత్రము ఉందెక్కడ  

కళల తండ్రి పలుకుకు సూత్రము ఉందెక్కడ  

  

ఆత్మకు రూపం, ప్రేమకు అర్ధం 

జీవికి మోక్షం, శ్రమకు సాక్ష్యం 

అమ్మ ఆరాటం, నాన్న పోరాటం 

స్నేహానికి సూత్రము ఉందెక్కడ

ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

-((**))--



ప్రాంజలి ప్రభ 23 -04 -2021

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

పుస్తక దినోత్సవ సందర్భముగా ,... ప్రాంజలి ప్రభ 

పుస్త కమ్ముయే మస్తకమ్మును మార్చు పుడమినందు    

విద్య వైద్య ము బతుకులో సుఖముండు జగతి నందు 

పుట్టి నప్పుడు జీవితాన చదువు మలుపు నందు 

కళల గమనమే పరమాత్మ ధ్యానము తనువు నందు 

--(())--

 అమ్మ ప్రార్ధన

అమ్మవు నీవేను మనసుతో

కమ్మ నైన పిలుపు

సమ్మతి తెలుపుతూ పలుకులే

మమ్ము హాయి గుంచు 

కన్నీరు తడుచేటి అమ్మవీ

ఆన్ని నీ కృప యునె 

చేసెద పనులన్ని ప్రేమతో

అమ్మవు నీవె అయ్యవు నీవె

అమ్మ తనము చూపి

సమ్మోహ పరిచేటి మమతవు

మమ్ము కాపు కాయు 

నీ ప్రేమ పొందేటి మనసుయే

మాకు ఇచ్చు అమ్మ

చేసెద పనులన్ని ప్రేమతో

అమ్మలు గన్నమ్మ వై నీవు

మమ్ము రక్ష చేయు

నమ్మి కొలిచితిమే ఇపుడేను

మేము చేయు తప్పు

ఒప్పులు అన్నింటినీ చూపె

మేము చేయు పూజ

లన్నియు పనులన్ని ప్రేమతో

విధేయుడు మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

-+(())--

నేటి సమస్యకు ....... పద్యాలు .

నమ్మక ముంచియు చేసెదన్ - యుద్ధము ఇపుడున్ 

కమ్మిన మేఘాలు తరిమినా  - జయమునే తలచున్   

ఏమియు శాంతియు వహిస్తె - ఏలయు జయమున్  

రాముడు గర్భము ధరించి రావణు కనియెన్...

రామబాణమునకు అడ్డేది - రాజమెరుపులున్ 

రామ మాటలకును అడ్డేది - రమ్య చరితమున్ 

రామ పత్ని సహనం అడ్డేది - రుధిర తర్పణమున్  

రాముడు గర్భము ధరించి రావణు కనియెన్

అమ్మపలుకులోను ధైర్యము - తొణికిస కనియున్ 

నమ్మక మునుచూపె హనుమయు - నయనసుందరికిన్  

దమ్ముఉంచియు చూసె రామున్ని - పలుకులవలనన్   

రాముడు గర్భము ధరించి రావణు కనియెన్

--(())--

ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---3--- 

మనిషి యవ్వనంలో ఒక విధమైన జిహ్వతాపం ఉద్భవించు. అది పరుగెత్తే గుఱ్ఱంలాగా సాగుతుంది.దాన్ని ఒడిసి పెట్టె విధము గ్రహించగల బుద్ధి సంక్రమించు దానికి తోడు సహాయ సహకారం ఎక్కువగానే ఉండు. అప్పడే మంచి చెప్పినా బుర్రకెక్కదు. తాను చెయ్యాలనుకున్నది చేస్తారు. అది ప్రేమవ్వచ్చు,చదువు అవ్వచ్చు లేదా చేదుఅలావాటులు అవ్వచ్చు.         

అప్పుడే సంకల్పములు అనేవి ప్రవాహము లాగా వస్తూ ఉంటాయి. ప్రవాహములో మునగకుండా గమనిస్తూ ఉండాలి. ప్రవాహములో పడిపోతే అది నిన్ను పట్టుకుపోతుంది. అక్కరలేని తిరుగుళ్లు, తిండి, మాట లేకపోతే అక్కరలేని ఆలోచనలు గూడా రావు.

సముద్రపు ఒడ్డున కూర్చుని అనంతమైన అలలను చూస్తున్నట్లుగా,  మనసులో  కలిగే భావాలను గమనిస్తూ ఉండడమే. ఇదే ధ్యానానికి ప్రాథమికమైన స్థితి. అప్పుడే స్థిరమైన మనస్సు ఏర్పడుతుంది. మూడు గుణములకు లోబడని ప్రజ్ఞగా ఉంటాము. ఉన్న స్థితి నుంచి ఎక్కడికో వెళ్లిపోయిన మనస్సు గుణములకు లోబడినదని అర్ధము.

ఆత్మజ్యోతి తన ప్రకాశాన్ని సర్వత్రా ప్రసరింపజేస్తుంది. మనం దివ్యాత్మ స్వరూపులం. ఆ దివ్యాత్మభావాన్ని విస్తరించవచ్చును.

ఆవయసులో మనిషి  విద్యఅనే  దృష్టిని కోల్పోతే అంతకన్నా దురదృష్టకరం మరొకటి ఉండదు. దివ్యత్వాన్ని ఎవరూ మన నుండి దోచుకోలేరు.

మనస్సులో ఉదయించే మలినాలే ఆ దివ్యత్వాన్ని కప్పివేస్తాయి. ఆ దివ్యత్వ ప్రకాశాన్ని సర్వులలోనూ దర్శించవచ్చు.

మన నిజమైన శత్రువులు ఆ మలినాలే. అవి మన ఆధ్యాత్మిక వారసత్వం నుండి మనల్ని దూరం చేస్తున్నాయి.

కనుక అంతఃశత్రువుల ఎడల అప్రమత్తతను కలిగి ఉండాలి.

1. నీ యందు ధర్మానుష్ఠాన బుద్ధి యున్నదా? లేక పొతే బుద్ధిని మార్చుకో 

2. అవసర సమయమునందు కూడ అధర్మము ప్రోత్సహించ బడదా? నీ ఆలోచన మార్చుకో  

3. గురువునందు, దైవమునందు ఎప్పుడైన సందేహము వచ్చునా, రాదా? సందేహాన్ని తీర్చుకో 

4. నీవు పరనింద చేయుదువా? చేయవా? నిందా అనేది మర్చిపో 

5. అసత్య భాషణమునకు జంకుదువా? జంకవా? అసత్యము దేనికి 

6. సంవత్సరమున అసహనము ఎన్నిసార్లు కలుగును ?  సహనముతోనే ఉండు 

7. మనస్సునకు స్థిరము ఏర్పడినదా? లేక చంచలత్వ మున్నదా? మనస్సు స్థిరపరచు 

8. పనులయందు శ్రద్ధ, భక్తి యున్నదా? లేక అశ్రద్ధ, నిర్లక్ష్యము 

9. నీవు శరీర శ్రమకు సిద్ధమేనా? సిద్ముగా ఉండు 

10. నీకు దైవమన్న భయమా? భయమనవసరం అది మన:శాంతికి దారి అని తెలుసుకో 

సంకల్ప బలం కు దైవ బలం తోడవుతుంది అప్పుడే బుద్ధిబలం వికసించి దేశానికి సహాయపడే మనస్సు అవుతుంది అదే ఎక్కువ ఇవ్వనదశలో 

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--

Pranjali Prabha daily 

అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది.

నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంది.

తాత అనే పిలుపులో తన్మయత్వం ఉంది.

అమ్మమ్మ అనే పిలుపులు అభిమానం ఉంది.

నానమ్మ అనే పిలుపులో నవ్వు ముఖం ఉంది.

అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది.

మామ అనే పిలుపులో మమకారం ఉంది.

బాబాయ్ అనే పిలుపులో బంధుత్వం ఉంది.

చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉంది.

అన్నా అనే పిలుపులో అభయం ఉంది.

చెల్లి అనే పిలుపులో చేయూత ఉంది.

తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉంది.

అక్క అనే పిలుపులో అనురాగం ఉంది.

బావా అనే పిలుపులో బాంధవ్యం ఉంది.

వదినా అనే పిలుపులో ఓర్పు ఉంది.

మరదలు అనే పిలుపులో మర్యాద ఉంది.

మరిది అనే పిలుపులో మానవత్వం ఉంది.

గురువు అనే పిలుపులో గౌరవం ఉంది.

మిత్రులారా! 

నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, 

తినే తిండి అన్ని పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి.

కనీసం పిలుపులో నయినా  

మన అచ్చ తెలుగులో పిలుచుకుందాం 

బంధాలను నిలబెట్టుకుందాం.....!

--(())--

1

నేటి ఛందస్సు పధ్యాలు 

శార్దూలలలిత - మ/స/జ/స/త/స UUU IIU IUI IIU - UUI IIU

భవన నిర్మాణ/అమ్మక సందర్భముగా .పద్యం   

ప్రారంభం వెనకే సమస్త కృషియే -  ప్రోత్సాహ పలుకే 

నిర్మాణం జరిగే నిరంతరముగా - నమ్మే జగతిలో 

కర్తవ్యం వలెనే ప్రభావ పరమై - కష్టాలు జయితే  

సర్వార్ధం అనుకూలమైన ధనమై -  సామర్ధ్య కలదై 

శార్దూలలలితపు విలోమము - న/త/ర - త/స/త III UUI UIU - UUI IIU UUI 27 మాత్రలు 

18 ధృతి 145576 

**   ఆశా పాశం గురించి 

సమయసందర్భ ఆశలే - సమ్మోహ కళలై సంసార 

సమర మందేను జీవితం - శబ్దమ్ము కలిగే బంధమ్ము 

మమత మారేటి పంతమై - మోహమ్ము నలిగే కాలమై 

సమత మానవత్వముయే -  జీవితాన మనోవాంఛలే 

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ

0

ప్రేమతో ... సోయగాలు కొత్త ప్రక్రియ 

*

సత్యమే జయముని నమ్మాలి 

నిత్య మనసు నుంచు  

సత్య వాక్కువలన శాంతియే 

సత్ప్రవర్తనమ్ము 

హితమే మతమని తెలుసుకో  

బతుకు సాగు ఘనము

సంతృప్తి నొందుము ప్రేమతో  ..... 04

నీతిని నమ్మియు బతుకుట 

నీతి నిన్ను నమ్ము 

ఖ్యాతియు చెప్పి ఎపుడు రాదు  

అతిగ ఆశ వలదు 

నీతికో విదులకు ప్రణతులు

జాతి మేలు చూడు 

నీతి పాటించుము ప్రేమతో    .... 05

*

*🧘‍♂️ధర్మరాజ దశమి🧘‍♀️*

          *ధర్మరాజ దశమి లేదా యమ ధర్మరాజ దశమి మరణానికి దేవుడు అయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది.  యమధర్మరాజు అని కూడా పిలువబడే ధర్మరాజు కు అంకితం చేసిన పూజ ఆ రోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10 వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు.* 

          *ప్రాథమికంగా ఈ రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడంపై దృష్టి పెడతాయి.*

  *మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ ఉపనిషత్తులోని యువ నచికేతుల కథ వినడం ఆనందంగా ఉంటుంది*.

              *మరణాన్ని జయించిన నచికేతుడు*

  *ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు. ఆధ్మాత్మిక జ్ఞానంలోని లోతును 'వేదాంతం' అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి. ఉపనిషత్తులో అక్కడక్కడా కొన్ని కథలు కనిపించినా వాటిలో సత్యకామజాబాలి , నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది.  నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామజాబాలి చెబితే , అన్న మాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది*.

 *🧘‍♂️నచికేతుని కథ🧘‍♀️*

          *కఠోపనిషత్తులో కనిపిస్తుంది. పూర్వం గౌతముని వంశానికి చెందిన 'వాజశ్రవసుడు'  అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్‌ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి , వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతాండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి , నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వాజశ్రవసుడు ఆరోగ్యంగానూ ,ధృడంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని… వట్టిపోయిన ముసలి ఆవులనూ , అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవాటినీ దానం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతలివాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ , తన దగ్గర ఉన్నవాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది. పైగా బాల్యచాపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్లి 'ఇలా నీకు పనికిరానివాటన్నింటినీ దానం చేస్తున్నావు సరే ! ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు ?'  అని అడగడం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికీ అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది, 'నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు.'*

      *తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు. తొందరపడి తాను అన్నమాటకు తండ్రి కూడా పశ్చాత్తాపపడ్డాడు. 'ఏదో పొరపాటున అనేశాను. ఊరుకో'  అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞసమయంలో , అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు. 'పొరపాటున అనేశాను' అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యయునికి తనను తాను అర్పించుకునేందుకు బయల్దేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ , సమయం వచ్చినప్పడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో మూడు రోజుల తరువాత నచికేతుని గమనించాడు యముడు.*

 *ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి ? ఇంటికి పో!' అన్నాడు యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా , జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. 'ఏదో తొందరపాటుగా అన్నంతమాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి , నేనే నీకు మూడు వరాలను ఇస్తాను తీసుకో !'  అన్నాడు యముడు , నచికేతుని సత్యనిష్ఠకు ముచ్చటపడి*.

                   *నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా , నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక' అన్నాడు  నచికేతుడు. దానికి యముడు 'తథాస్తు' అన్నాడు. ఇక రెండవ కోరికగా 'ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమ'న్నాడు నచికేతుడు*.   

       *ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది - 'స్వర్గలోకే న భయం కించనాస్తి' అంటాడు నచికేతుడు , అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. దాంతో యముడు 'నచికేత యజ్ఞం' పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక మూడవ కోరికగా 'చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు ?' అని అడుగుతాడు నచికేతుడు. తనంతటివాడు ప్రత్యక్షమై కావల్సిన కోరికలు కోరుకోమంటే 'నా తండ్రి నన్ను అభిమానించాలి , భయాన్ని జయించే స్వర్గం కావాలి , మరణ రహస్యం తెలియాలి' అంటూ ఈ పిల్లవాడు పరమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే 'నువ్వు చిన్నపిల్లవాడివి. అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ఈ జననమరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదన్నా కోరుకో. నీకు ఏం కావాలన్నా వరమిస్తాను.' అని నచికేతునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు యముడు. కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదు. తనకి ఇస్తేగిస్తే ఆ మరణజ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నాడు*.

           *నచికేతుని పట్టుదల , తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. 'సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డివాళ్లని అనుసరించే గుడ్డివాళ్లలాగా , అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక , పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనూలేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే ! దానిని అశాశ్వతమైనవాటితో ఎలా పొందగలరు ?....  అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు*.

    *ఆత్మజ్ఞానం గురించి యముడికీ , నచికేతునికీ జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్యభాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం. 'నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పదిపన్నెండు మంది పిల్లలు ఉంటే , ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను' అంటారు వివేకానంద. అంతేకాదు ఆయన తరచూ స్మరించే 'ఉత్తిష్ఠత జాగ్రత'  (లేవండి , మేలుకోండి) అన్న మాటలు కూడా కఠోపనిషత్తులోనివే !*

--(())--


ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు - మానిని  -
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మా :: కోపము చూపకు కాలము చెప్పకు నీదియు నాదియు మాటలుగా
         లోపము వెద్కుట చేష్టలు కాదులె తీరిక ఉన్నది సేవల కే
          పాపము చేయకు  నిత్యము పల్కకు పాడుప దాలను ఎప్పటికీ      
         దీపము పెట్టుము వేదము పల్కెద హాయిగ ఉండును శాంతముగా
మా ::  అప్పుటి కప్పుడు  తప్పులు చేసిన తెచ్చును తిప్పలు ఏకముగా      
          ఇప్పుటి  కిప్పుడు  చేసిన  ఓర్పుకి  ఇచ్చును సంతస మొచ్చునులే    
          ఎప్పుడు చేయకు  కోపముతో పనె  చేసిన  కష్టము కోరుటయే     
          ఒప్పుకొ  తప్పులు  మంచిని పంచుకొ ఓర్పును చూపియు బత్కుటయే
మా :: గోపతి గోప్యము  ఎప్పుడు నీడగ వెంటనె ఉండును రక్షణగా      
         చూపరి చూపులు చిత్రము ఐనచొ  ఆడది ఆగుతా కష్టమెగా   
         తాపము వచ్చిన  చూపును ముద్రత  ఏదియు కాదని చెప్పదుగా
         జాప్యము లేదులె ఆకలి ఉందిజ  వేగము పెంచితి శీఘ్రముగా
మా ::నిప్పుల జోలికి పోయిన కాటికి చేరిన కాయము లెక్కవలె
        తప్పులు మీదను తప్పులు జాబిత బాధలు వచ్చుట లెక్కవలె
         చెప్పక చెప్పిన సత్యము  నమ్మిన వానికి  వేదము లెక్కవలె
         అప్పులు  ఇచ్చుట అప్పులు తెచ్చుట జీవికి నష్టము లెక్కవలె
                     --(())--
Pranjali Prabha daily 23/04
🦠వైరాలజీ శాస్తంలో ఉన్న ఒక పాఠ సారాంశం
👉 కరోనా అంటే ఏమిటి ?
👉  కరోనా  ఎలా వృధ్ధి
           చెందుతుంది ?  
👉 కరోనా వ్యాధిని ఎలా
         నివారించవచ్చు ?
    కరోనా అనునది  ప్రాణము లేని ఒక అచేతన స్థితిలో ఉన్న  ప్రోటీన్ పదార్థపు కణము.
దీని పైన క్రొవ్వు పదార్థము ఒక పొరలా యేర్పడి ఒక పౌడరులా  వుంటుంది.
ఇతర వాటిలా కాక ఈ  కణము కొంత బరువు కలిగి వుండటంతో గాలిలో యెగురలేదు.
 భూమిపై పడిపోతుంది.
 ఇది ఒక నిర్జీవ కణం.
స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఎలా అయితే 14 రోజులు వుండి,
 వీర్య కణంతో జీవకణంగా మారి, కణ విభజన మొదలవుతుందో.....
అలానే కరోనా నిర్జీవ కణం  కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే వుండి,
ఈ మధ్యలో  ఎప్పుడైతే మానవుని శరీరంలోని
 "చీమిడి" తో సంపర్కమవుతుందో దానిలో కణ విభజన ఆరంభమవుతుంది.
మన ముక్కు లోని చీమిడి లో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం.
మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ,  ముక్కులోని 'చీమిడి' కానీ,  నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షలలో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, ఊపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది.
దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. 😭😭
దీని విస్తరణ కు పడిశాన్ని వుధృతం చేసికుంటుంది.
   రోగిష్టి తుమ్మినపుడూ,  దగ్గినపుడూ, వారి చీమిడి ద్వారా,  కఫము ద్వారా, ఈ రోగ కణాలు ఎచ్చటంటే  అచ్చట పడతాయి.
మనం దగ్గరగా వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే,  ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణం లోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి  అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు.
అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరగి పోయి  నిర్వీర్యమై పోతుంది.
 👉  ఇప్పటి వరకూ
    ఈ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే.
 వేడి తక్కువ ప్రాంతాలు కావటం తో దీనిపై గల
 కొవ్వుపొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేక పోవడం ఒక కారణం....
    ఈ మధ్య సమయం లో వాటిని మనం స్పర్శించినచో  🦠🦠🦠🦠
అవి మనకు అంటుకొన గలవు.
 సర్వ సాధారణంగా మనం మన చేతులతోనే స్పర్శించుతాము కావున మన అరచేతులకు,  వ్రేళ్ళకు అంటుకొనగలవు.
సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్ళను,  ముక్కును,  నోటిని స్పర్శించడం సహజం.  
ఈ విధంగా రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి.
   👉 ఒక్కసారి అవి
            మన
          కంటి కలకను కానీ,
👉 చీమిడిని లేక ముక్కులోని
       పొక్కులను కానీ,
 👉 మన నోటిలోని గళ్ళను
           కానీ చేరాయో......
🚨🚨🚨
       ఇక వాటిని నిరోధించటం
         అసాధ్యం.
ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా  ముఖ్యంగా ముసలి వారిలో  వుంటాయి.
 కళ్ళ కలక ను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది, ముక్కు ప్రక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది.
 🧬🧬🧬
 దీనికి ఇంతవరకూ మందు కనుగొన లేకున్నా,  దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసు
కుని మనలను మనం రక్షించుకోవచ్చు.
దీనికి రక్షక కవచం దీనిపైనున్న కొవ్వు పదార్ధం.
ఈ కొవ్వు పదార్థాన్ని
మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు.  
 సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరిగి పోతుంది.
లేక 'సబ్బు' నురుగుకు కరగి పోతుంది. ♨♨♨
సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డు
 (కొవ్వు పదార్థం)ను తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం.
దీనికి కూడా అంతే.
    మన శరీరాన్ని,  తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో,  రోజుకు 2-3 పర్యాయాలు బాగా తల స్నానం చేయడంతో
 మన శరీర భాగాలను అంటుకున్న ఈ కరోనా కణము పైగల కొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది.
ఆ తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై ఈ రోగకణాలు మరలా పడ్డా,   అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది.
మారు స్నాన శుభ్రత లో వీటిని నిర్వీర్యం చేయవచ్చు.
 వీటి మధ్య లో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు  అంతకన్నా హెచ్చు వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో  నిముషం పాటు శుభ్ర పరచుకుంటే.....
మనం ధరించే వస్త్రాలను,  కర్చీఫులను,
మాస్కులను
శుభ్ర పరచుకుంటే.....
👉👉 ఈ వ్యాధి కణాలపై
      ఉన్న కొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు.
కానీ ఎట్టి పరిస్థితులలో అయినా ఈ కణం మన ముఖానికి చేర కూడదు.
 🛑🛑🛑
కంటి కలక తో కానీ, ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ, నోటి గళ్ళ తో కానీ  సంపర్క మైతే దానిని అడ్డుకొనటం అసాధ్యం.
    ఇదే వైద్యులు  నెత్తి నోరు కొట్టుకొని మనకు చెప్పే సలహాలు, వాటి వెనుక వున్న ఉద్దేశాలు.
   దీనిని మీ వారి కందరికి తెలిపి ఈ వ్యాధి
 నుండి జాగ్రత్త పరచండి.

 

May be an image of 4 people

Tuesday, 20 April 2021

శ్రీ రామనవమి

 21/04, 11:26 am] Mallapragada Sridevi: రఘవంశ మరియు జనక వంశ వంశవృక్షము.

శ్రీరామ నవమిలో "శ్రీ సీతారాముల కల్యాణోత్సవం" సందర్భంగా ఇరువురి వంశ వృక్షాన్ని తెలియచేసారు.

🙏రఘువంశ వర్ణన🙏

(దశరథ మహారాజు పూర్వీకులు)

చతుర్ముఖ బ్రహ్మ

మరీచి --> 

కశ్యపుడు --> 

సూర్యుడు --> 

మనువు --> 

ఇక్ష్వాకుడు --> 

కుక్షి --> 

వికుక్షి -> 

భానుడు --> 

అనరంయుడు --> 

పృథుడు --> 

త్రిశంకువు --> 

దుందుమారుడు -> 

మాంధాత --> 

సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌ 

ధృవసంధి->

భరతుడు --> 

అశితుడు --> 

సగరుడు --> 

అసమంజసుడు --> 

అంశుమంతుడు --> 

దిలీపుడు --> 

భగీరతుడు --> 

కకుత్సుడు --> 

రఘువు --> 

ప్రవృద్ధుడు --> 

శంఖనుడు --> 

సుదర్శనుడు --> 

అగ్నివర్ణుడు --> 

శీఘ్రకుడు --> 

మరువు --> 

ప్రశిశృకుడు --> 

అంబరీశుడు --> 

నహుశుడు --> 

యయాతి --> 

నాభాగుడు --> 

అజుడు --> 

దశరథుడు --> 

రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుడు.

🙏జనక వంశ వర్ణన🙏

(జనక మహారాజు పూర్వీకులు)

నిమి చక్రవర్తి --> 

మిథి --> 

ఉదావసువు --> 

నందివర్దనుడు --> 

సుకేతువు --> 

దేవరాతుడు --> 

బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.

మహావీరుడు --> 

సుదృతి --> 

దృష్టకేతువు --> 

హర్యశృవుడు --> 

మరుడు --> 

ప్రతింధకుడు --> 

కీర్తిరతుడు --> 

దేవమీదుడు --> 

విభుదుడు --> 

మహీద్రకుడు --> 

కీర్తిరాతుడు --> 

మహారోముడు --> 

స్వర్ణరోముడు --> 

హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు. 

జనకుడు --> సీత, ఊర్మిళ 

కుశద్వజుడు --> మాంఢవి, శృతకీర్తి

శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

👏శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. 

వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ, 

నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...

అజ మహారాజ వర్మణః పౌత్రాయ...

దశరథ మహారాజ వర్మణః పుత్రాయ..

శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

👏సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు

ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...

స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం..

హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...

జనక మహారాజ వర్మణః పుత్రీం...

సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

👉ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.

[21/04, 11:28 am] Mallapragada Sridevi: 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

 *శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం.* 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*ఆరాధన ( సీతారాముల విగ్రహాలకు లేదా ఫోటోకు గానీ అభిషేకం, అలంకరణ, పూజ )పూర్తి  అయినా*  *తర్వాత కళ్యాణ సామాగ్రిని* *సమకూర్చుకొని* *సీత* *రామచంద్ర  స్వామిని కళ్యాణ వేదికపై కూర్చోబెట్టి* *ఆచమనము చేయవలెను.* 


 *ఆచమ్య* 

ఓం అచ్యుతాయ నమః

ఓం అనంతాయ నమః 

ఓం గోవిందాయ నమః 


(చేతులు శుద్ధి చేసుకొని)


ఓం కేశవాయ నమః 

ఓం నారాయణాయ నమః 

ఓం మాధవాయ నమః 

ఓం గోవిందాయ నమః 

ఓం విష్ణవే నమః 

ఓం మధుసూదనాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః 

ఓం వామనాయ నమః 

ఓం శ్రీధరాయ నమః 

ఓం హృషీకేశాయ నమః 

ఓం పద్మనాభాయ నమః 

ఓం దామోదరాయ నమః 

ఓం సంకర్షణాయ నమః 

ఓం వాసుదేవాయ నమః 

ఓం ప్రద్యుమ్నాయ నమః 

ఓం అనిరుద్దాయ నమః 

ఓం పురుషోత్తమాయ నమః 

ఓం అధోక్షజాయ నమః 

ఓం నారసింహాయ నమః 

ఓం అచ్యుతాయ నమః 

ఓం జనార్ధనాయ నమః

ఓం ఉపేంద్రాయనమః

ఓం హరయే నమః 

ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః 


 *సంకల్పం:-* 


శ్రీ గోవింద ! గోవింద ! గోవింద ! ఏవంగుణ విశేషణ విశిష్టాయాం

అస్యాం శుభ తిథౌ భగవద్భాగవత ఆచార్య  కైంకర్య రూపేనా శ్రీ సీతా రామచంద్రస్వామి పాణిగ్రహణ కర్మ కరిష్యే.


 *శ్రీ సీతా రామచంద్ర స్వామి పాణిగ్రహణ కర్మణి కంకణ ధారణం కరిష్యే* 


(రెండు దారములతో గాని , ఐదు దారములతో గాని రెండు కంకణములను తయారుచేసి వాటికి మామిడి ఆకులను చుట్టి పసుపుతొ తడిపి వాటికి షోడషోపచార పూజను చేయవలెను )


 *ఓం కంకణ దేవతాయై శ్రియై నమః.* 

ధ్యాయామి. ఆవాహయామి . ఆసనం సమర్పయామి . అర్ఘ్యం సమర్పయామి . పాధ్యం సమర్పయామి . ఆచమనీయం సమర్పయామి.

స్నానం సమర్పయామి.

స్నానాంతరం శుద్దాచమనీయం సమర్పయామి . 

వస్త్ర యుగ్మం సమర్పయామి . 

ఊర్ధ్వ పుండ్రాన్ సమర్పయామి . 

దివ్య శ్రీ చందనం సమర్పయామి . 

పుష్పై పూజయామి. 

ధూప మాఘ్రాపయామి. 

దీపం సందర్శయామి. 

నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మంగళ నీరాంజనం సమర్పయామి.


( రామచంద్ర స్వామి వారి కుడి చేతికి, సీతమ్మ వారి ఎడమ చేతికి ఈ కంకణములను ధరింప చేయాలి.)


శ్రీ రామచంద్ర స్వామినః పాదౌ ప్రక్షాళయామి.


ఆచమనీయం సమర్పయామి.


( స్వామి వారికి పాదప్రక్షాళన చేసి , ఆచమనీయం సమర్పించాలి. )


 *శ్రీ రామచంద్ర స్వామినః* *ఉద్వాహ కర్మణి యజ్ఞోపవీత* *ధారణం కరిష్యే.* 

 

ఓం యజ్ఞోపవీత దేవతాభ్యోనమః ధ్యానవాహనాది షోడషోపచార పూజాం కరిష్యే.


( యజ్ఞోపవీతములకు షోడషోపచారపూజను చేయాలి. )


యజ్ఞోపవీతములకు చందనాదులర్పించి స్వామి వారికి ఎడమ భుజం పైనుంచి కుడిభుజం క్రిందకు వచ్చునట్లు ధరింపచేయాలి.


( శ్రీ రామచంద్ర స్వామి తనకు కన్యను అన్వేషించుమని పంపుతున్నట్లుగా భావించి నలుగురు లేదా ఇద్దరూ లేదా ఒక బ్రాహ్మణునికి దక్షిణతాంబూలం ఇవ్వవలెను.)

( బ్రాహ్మణుడు లేని ఎడల ఒక ఆసనం పైన దక్షిణతాంబూలం సమర్పించి తర్వాత ఎవరైనా బ్రాహ్మణోత్తమునకు సమర్పించవలెను.) 


 *శ్రీ సీతారామచంద్రుల ప్రవరలను అనుసంధించాలి* 


 *శ్రీ రామచంద్రస్వామి ప్రవర :-* 


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు వాషిష్టమైత్రావరుణ కౌడిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ట గోత్రోద్భవస్య నాభాగ మహారాజ వర్మణో నప్రై.


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు వాషిష్టమైత్రావరుణ కౌడిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ట గోత్రోద్భవస్య అజమహారాజవర్మణః పౌత్రాయ.


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు వాషిష్టమైత్రావరుణ కౌడిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ట గోత్రోద్భవాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ.


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు వాషిష్టమైత్రావరుణ కౌడిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ట గోత్రోద్భవాయ 

 *శ్రీ రామచంద్రపరబ్రహ్మణే వరాయ.* 


 *సీతా ప్రవర :-* 


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ఆంగీరస ఆయస్య గౌతమత్రయార్షేయ  ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వరరోమరాజవర్మణో నప్త్రీమ్.


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ఆంగీరస ఆయస్య గౌతమత్రయార్షేయ  ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం హ్రస్వరోమమహారాజ వర్మణో  పౌత్రీమ్.


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ఆంగీరస ఆయస్య గౌతమత్రయార్షేయ  ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం జనకమహారాజ వర్మణో పుత్రీమ్. 

 

చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ఆంగీరస ఆయస్య గౌతమత్రయార్షేయ  ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం

*సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం*         *సీతాదేవి నామ్నీమ్* 

 *మిమామ్ కన్యామ్.* 

 

వృణీధ్వం....వృణీమహే

( అని కర్త ఉచ్చరించాలి. )

 

 *శ్రీ రామచంద్రః ఉద్వాహకర్మణి మధుపర్కం సమర్పయామి.* 

( పెరుగు , తేనె కొబ్బరికుడుకలో కలిపి మూడుసార్లు స్వామి,అమ్మవార్లకు సమర్పించాలి. )

 *అమ్మవారికి ,స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పించాలి* 

తర్వాత కర్త దంపతులు కుడుకదక్షణతో యుక్తంగా దోసిలిలో పట్టుకుని మహాసంకల్పం చదువుతూ నీటిని సన్నగా ధారపోస్తూ కింద ఒక పాత్రలో పడేటట్లు పోయాలి.)


 *మహా సంకల్పం :-* 


"భగవతో మహాపురుషస్య శ్రీ లక్ష్మీ నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యాభ్రియమానస్య అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజౌ వాయ్వాకాశాది ఆవరణైః ఆవృతేస్మిన్ మహతి బ్రహ్మండ ఖండ యేర్మధ్యే ఆధార శక్త్యాది అష్ట దిగ్గజోపరి ప్రతిష్టితే ! అతల వితల సుతల తలాతలాది సప్తలోకానాం అథోభాగే ! ఐరావత పుండరీక వామనాది అష్టదిగ్దంన్తి తుణ్డా దండోత్తంబితే ! ఇంద్రాగ్ని యమాది అష్ట దిక్పాలక పరిపాలితే ! అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజాది అనేక విశేష దేశభాషా భూమిపాలవిచిత్రే !

భాగీరథీ గౌతమీ నర్మదా యమునాది పుణ్య నదీ పవిత్రితే ! అయేథ్యా మథురామాయా కశీ కాంచ్యాది సప్తపుణ్య పురీ విరాజితే ! పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండలే కలియుగే ప్రథమ పాదే ! జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే , గంగాగోదావర్యోః మధ్యదేశే అస్మిన్వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ ప్లవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్ర మాసే శుక్లపక్షే నవమీ తిథౌ సౌమ్య వాసరః వాసరే శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణే , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ కర్కాటక లగ్న సుమూహూర్తే , అభిజిత్ శుభలగ్నే సాలంకృత సహిణ్యోదక కన్యాదాన మహం కరిష్యే."


సీతా నామ్నీమ్ మిమాం కన్యాం సర్వాభరణ శోభితాం ! దాస్యామి విష్ణవే తుభ్యం సర్వలోక హితాయ వై !

భగవతో వరదాభయ హస్తే ప్రదాయ.


 *లోకాచార ప్రకారేణ మంగళాష్టకాని పఠేత్..* 


 *మంగళాష్టకములు :-* 


 *1* ) 

తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ! విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పతే తేజ్ఘ్రియుగం స్మరామి!!

సావధానస్సుముహూర్తే సావధానాస్సులగ్నే సావధానాః!!


 *2* ) 

గంగాసింధు సరస్వతీచ యమునా గోదావరీ నర్మదా !

కృష్ణా భీమరధీచ ఫల్గుసరయూ శ్రీ గండకీ గోమతీ ! కావేరీ కపిలా ప్రయాగ విరజా వేత్రావతీ త్యాదయో ! నాద్య శ్శ్రీహరి పాదపంకజభువాః కుర్వంతునా మంగళమ్ !!


 *3* ) 

శ్రీరామం జనకాత్మజా సురగురుం ప్రత్యజ్ముఖం ప్రాజ్ముఖం ! దోర్భ్యామంజరి మంచితైశ్చ వనితామాపూర్వమూక్తాఫలై ! 

నానారత్న విరాజమాన కలశై రానీయతం సాగరాత్ ! సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యాత్సదా మంగళమ్ !!


 *4* )

శ్రీ మన్నీరజా మనః సరసిజా ప్రాభాత పద్మాకరా బ్రహ్మేద్రాది సురోత్తమాంగమనిశం రాజత్పందాంభోరుహః దైత్యేంద్ర ప్రమదేభరాన్మృగవరః

ప్రహ్లాద సంరక్షకః

శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరీః కుర్యాత్సదా మంగళమ్ !!


పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీసీతారామచంద్రస్వామియోః  పాణీగ్రహణ కర్మణి మాంగళ్య ధారణం కరిష్యే.


( మంగళసూత్రములను తీసుకుని అక్షితల పళ్ళేమునందు ఉంచి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి పసుపు, కుంకుమలతో శ్రీ సూక్త , లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పూజించాలి. )


ఓం మాంగళ్య దేవతాభ్యోనమః , అర్ఘ్యాది షోడశోపచార పూజాం సమర్పయామి.

మాంగళ్య పూజ పూర్తైన తర్వాత మంగళసూత్రాలను తీసుకుని 


 *"మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ హేతునా !* 

 *కంఠే బధ్నామి సుభగే త్వం జీవ ! శరదాం శతం !! "* 


మంగళసూత్రాలను శ్రీరామచంద్రస్వామి వారి హస్తమునకు స్పృశింపచేసి  సీతాదేవికి ధరింపచేయాలి.


ఆచారం కొరకై తలంబ్రాలను కర్తలిరువురూ ఒక్కొక్కరి తరపున తీసుకుని శ్రీసీతారాములకు ధరింపచేయాలి.తర్వాత శ్రీరామచంద్రస్వామి వారి ఉత్తరియపు అంచునందు, అలాగే సీతాదేవి అమ్మవారి కొంగు చివరియందు తాంబూలములను ఉంచి ముడివేయవలెను.


తదుపరి శ్రీసీతారామచంద్ర స్వామి పెరుమాళ్ళకు ఆరగింపు చేసి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ,మహా హారతి ,మంత్రపుష్పం సమర్పించవలెను.


 *మంగళాశాసనం:-* 


లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షాత్ శ్రీవత్స వక్షసే !

క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం !!


శ్రీ యః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం !

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం !!


కమళాకుచకస్తూరి కర్థమాంకిత వక్షసే !

యాదవాద్రి  నివాసాయ సంపత్పుత్రాయ మంగళం !!


నీలాచలనివాసాయ నిత్యాయపరమాత్మనే !

సుభద్రాప్రాణనాథాయ జగన్నాథయ మంగళం !!


స్వోచ్చిష్టమలికా బందగందబందుర జిష్ణవే !

విష్ణచిత్త తనూజాయై గోదాయై నిత్య మంగళం !!


శ్రీనగర్యాం మహాపూర్యాం తామ్రపర్ణ్యూత్తరే తటే !

శ్రీ తింత్రిణీమూలధామ్నే శఠగోపాయ మంగళం !!


శేషోవా సైన్య నాథో వా శ్రీపతిర్వేతి సాత్వికైః !

వితర్క్యాయ మహాప్రాజ్ఞ్యేః

భాష్యకారాయ మంగళం !!


తులామూలావతీర్ణాయ తోషితఖిల సూరయే !

సౌమ్యజామాతృమునయే శేషాంశాయాస్తు మంగళం !!


మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే !

చక్రవర్తి తనూజాయై సార్వభౌమయ మంగళం !!


మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై !

సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్క్రతాయాస్తు మంగళం !!


మా నో హిగ్ంసీజాతవేదో గామశ్వం పురుషం జగత్ !

అభిభ్రదఘ్న ఆగహి శ్రీ య మా పారిపాలయ !!


తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్శంతి సూరయః ! 

దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగ్ం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం !!


పర్యాప్య్తా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహర్భవతి సర్వస్యప్యై సర్వస్య జత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి !!


ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభయ దీమహీ !

తన్నో రామచంద్ర ప్రచోదయాత్ !!


ఓం మహాదేవ్యైచ విద్మహే రామపత్నైచ దీమహి !తన్నో సీతా ప్రచోదయాత్ !!


దేవస్య అనంతభోగోస్తు...

దేవ్యాః అనంతభోగోస్తు....


మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం జనార్దన !

యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే !!

ఉపచారపదేశేన కృతనహరహర్మయా !

అపచారాపదేశేన సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ !!



స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిశాః !

గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం 

లోకాస్సమస్తాః సుఖినోభవంతు !!


కాయేన వాచ మనసేంద్రియైర్వా

బుద్ద్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ !

కరోమి యద్యస్సకలం పరస్మై

నారాయణాయేతి సమర్పయామి !!


తీర్థప్రసాద వినియోగం.

 

*శుభం..భూయాత్...* 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

[21/04, 11:36 am] Mallapragada Sridevi: శ్రీరామనవమి 🙏


శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు ...అది ఆయన పుట్టినరోజు కూడా .

 చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం .

మరి పుట్టినరోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం .

శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా  

నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు ?

నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన 

 చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూలకారకుడు , ఆద్యుడు 

 ఆ దివ్య ముహూర్త రూపకర్త , సృష్టికర్త భక్తరామదాసు .

ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలం లో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం .

రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్తరామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు . అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు . భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు 

అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి .(శ్రీరంగం మాదిరిగా ).

పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహిత లో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా  రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు . అదే చైత్ర శుద్ధ నవమి . అవతార పురుషులు , దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన  ఒక శ్లోకం అయిన ...."ఎస్య  అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్ ". (   పరమ  పురుష సంహిత )

అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం .

రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి అందుకే రాముడి కల్యాణo ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు .

ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం . అందుకు ఆద్యుడు , రూపకర్త , ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు .

వాల్మీకి రామాయణం లో కానీ  , పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడలేదు .

నాడు భద్రాచలం లో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై , చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా 

శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి ....ఆ ముహూర్తనిర్ణయ 

స్థల 

 కేంద్ర బిందువు భద్రాచలం  కాగా , ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు 🙏

భద్రాచలం లో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నం లో  నిర్వహిస్తారు . అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం ....ఇది దోషరహిత ముహూర్త సమయం .....దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు . 

అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం  శ్రీరామనవమి వేడుక 🙏


జై శ్రీరామ్ 

🙏🙏🙏

శ్రీరామనవమి

భారతీయ సంస్కృతిని చాటి చెప్పే మహా గ్రంథాలు రామాయణ, భారత భాగవతాలు. ప్రజల  నిత్య జీవితాలను భారతం ప్రదర్శిస్తే, దివ్యమైన జీవితం ఏ విధంగా గడిపి భగవంతుణ్ణి చేరుకోవచ్చో భాగవతం తెలియజేస్తుంది. మానవుడు ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఎలా గడపాలో రామాయణం మార్గనిర్దేశం చేస్తుంది.

యావత్‌ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే

తావత్‌ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి


‘ఈ భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథ వ్యాప్తిలో ఉంటుంది‘-  ఇది బ్రహ్మవాక్కు. అది ఎప్పటికీ సత్యమే. శ్రీరాముడు... వేదం ప్రవచించిన ధర్మానికి ప్రతిరూపం కావడమే దీనికి కారణం. ‘వేదః ప్రాచేతసాత్‌ ఆసీత్‌ సాక్షాత్‌ రామాయణాత్మనా’ అన్నాడు వాల్మీకి.  శ్రీ మహా విష్ణువు మానవ రూపంలో శ్రీరామునిగా అవతరించాడు. మానవులకు ఉండే సహజ లక్షణాలనే ప్రదర్శించాడు. తాను భగవంతుణ్ణని ఆయనకు తెలిసినా, బ్రహ్మాది దేవతలూ, ఋషులూ ఆ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పినా... తాను మానవుణ్ణనీ, దశరథ కుమారుడిననీ ఆయన ప్రకటించాడు.

మన దేశంలో రామాలయం లేని ఊరు లేదు. వాల్మీకి ఘంటం నుంచి జాలువారిన శ్రీరామ కథా సుధాపానం చేసి తరించినవారు ఎందరో!  రామాయణంలోని ప్రతి శ్లోకం మంత్రాత్మకమైనదే. శ్రీరామ నామ మహిమనూ, రామనామ తత్త్వాన్నీ మేళవించి... శ్రీరాముణ్ణి పురుషోత్తముడు అన్నారు. 

‘వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మని

వేదః ప్రాచేత సదాసీత్‌ 

సాక్షాద్రామాయణాత్మనా’ అన్నాడు వాల్మీకి. వేదాల ద్వారా తెలుసుకోదగిన పరమ పురుషుడే దశరథ తనయునిగా జన్మించాడు. వేదాలే వాల్మీకి ద్వారా శ్రీమద్రామాయణంగా ఆవిర్భవించాయి. శ్రీరామ నామ మహిమ గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. రామ మంత్రంలో... అష్టాక్షరి, పంచాక్షరి మహా మంత్రాల నుంచి ‘రా’, ‘మ’ అనే అక్షరాలు కలిసి రామ నామ తారకమంత్రం రూపొందింది. శివకేశవులు అభిన్నులనే అద్వైత సిద్ధాంతానికి ఇది ప్రతీకగా పెద్దలు చెబుతారు. వశిష్ఠ మహర్షి కూర్చిన ఈ తారక మంత్రాన్ని ఎందరో మహనీయులు జపించి సాఫల్యం పొందారు. 

ప్రకృతి శక్తులను పరిరక్షించే దైవీయ శక్తులను ప్రేరేపించి, తద్వారా లోక కల్యాణాన్ని సాధించడమే భగవత్తత్వం. ఆ తత్త్వాన్ని లోకానికి చాటి చెప్పడానికి రామునిగా విష్ణువు అవతరించాడు. జగద్రక్షణ చేశాడు. ధర్మ ప్రతిష్ఠాపనమే రామాయణంలోని విశిష్టాంశం. రామాయణం ద్వారా మానవ జీవితాలకు ఇహాన్నీ, పరాన్నీ అందించడమే వాల్మీకి సంకల్పం. సాధారణ మానవుడు పరిణతి చెంది, పరిపక్వతను సాధించడానికి దోహదపడే మహా గ్రంథం రామాయణం. అది భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గ్రంథం. దేశ విదేశాల్లో రామాయణానికి అనువాదాలూ, అనుకరణలూ, అనుసృజనలూ అనేకం వచ్చాయి. ప్రజలను ఇంతగా ప్రభావితం చేసిన గ్రంథం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.

తెలుగులోనూ ‘భాస్కర రామాయణం’, ‘మొల్ల రామాయణం’ తదితరాలు ఎంతో ప్రముఖమైనవి. గద్య, పద్య రూపాల్లో అనేక రామాయణాలు ఆవిష్కృతం అయ్యాయి. ‘ముని ఋణము దీర్చ దీని రచింతు’ అంటూ ‘రామాయణ కల్పవృక్షా’న్ని రచించి, తెలుగు సాహితీ నందనవనంలో కల్పవృక్షాన్ని నాటారు విశ్వనాథ సత్యనారాయణ. జానపదుల పాటలకూ రామాయణ కథ ఊపిరి అయింది. రాముని మేలుకొలుపులు, పవళింపులు, ఉర్మిళ నిద్ర, లక్ష్మణ దేవర నవ్వు... ఇలా ఎన్నో పాటలు జానపదుల జీవితాల్లో భాగమయ్యాయి.

రాముడు తమకే కాదు, సర్వ జగత్తుకూ రక్షకుడనే భావన వారి హృదయాల్లో ప్రతిష్ఠితం కావడమే దీనికి కారణం. అలాగే రాజ్య పాలనకు సంబంధించిన ప్రధానమైన విషయాలు అయోధ్య కాండలో... శ్రీరామ, భరతుల సంవాద రూపంలో ఉంటాయి. భరతుణ్ణి రాముడు కుశల ప్రశ్నలు వేస్తూనే ఎన్నో విషయాలు ముచ్చటిస్తాడు. ప్రభుత్వాలు, అధికారులు ఎలా నడచుకోవాలో ఈ కాండలోని నూరవ సర్గ వివరించింది. 

సీతా వియోగం సందర్భంలో... మానవునిగా జీవిస్తున్న రాముడి దీన స్థితిని  ‘సుపధానంతు గచ్ఛంతం తిర్యంతోపి సహాయతే కుపధానంతు గచ్ఛంతం సోదరోసి విముంచతి’ అంటూ వాల్మీకి అద్భుతంగా చెబుతాడు. మంచి మనసున్న మానవుడికి సమాజమే కాదు, ప్రకృతి అంతా వెన్నంటి ఉంటుంది. 

‘రామాయణం’ అంటే ‘రాముని ఆయనం’. రాముడు నడచిన మార్గం. ఆ మార్గం ఆదర్శవంతమైన మార్గం. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలనీ, జీవితాల్లో ధర్మ మార్గాన్ని అనుసరించాలనీ రామాయణం పదే పదే ఉపదేశిస్తుంది. ధర్మం ఎన్నో సూక్ష్మమైన అంశాలతో కూడుకున్నది. లౌకిక, పారలౌకిక విషయాలు రామాయణం నిండా ఉన్నాయి. మానవ సంబంధాలు. కుటుంబ ధర్మాలు, పాలనా ధర్మాలు, మానవీయ అంశాలు ఎన్నో దీనిలో కనిపిస్తాయి.

అలాగే రామాయణంలో ఎన్నో యజ్ఞ రహస్యాలు ఉన్నాయి. మానన సంబంధాలు ఎలా ఉండాలో, సంస్కారవంతమైన వ్యక్తిత్వం ఎలా ఉండాలో శ్రీముని కథ చెబుతుంది. మానవుడిగా శ్రీరాముని ఆదర్శవంతమైన ప్రయాణాన్ని మననం చేసుకొని,  అందరూ అనుసరిస్తే ఉత్తమ మానవ సంబంధాలు నెలకొంటాయి. ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది.

‘రామాయణం’ అంటే ‘రాముని ఆయనం’. రాముడు నడచిన మార్గం. ఆ మార్గం ఆదర్శవంతమైన మార్గం. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలనీ, జీవితాల్లో ధర్మ మార్గాన్ని అనుసరించాలనీ రామాయణం పదే పదే ఉపదేశిస్తుంది. ధర్మం ఎన్నో సూక్ష్మమైన అంశాలతో కూడుకున్నది. లౌకిక, పారలౌకిక విషయాలు రామాయణం నిండా ఉన్నాయి. మానవ సంబంధాలు. కుటుంబ ధర్మాలు, పాలనా ధర్మాలు, మానవీయ అంశాలు ఎన్నో దీనిలో కనిపిస్తాయి.

*తెలుగు ప్రాంజలి ప్రభ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు*

దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. చూసేందుకు మనమే కాదు సకల దేవతలు దివి నుండి భువికి దిగివచ్చి కల్యాణ మహోత్సవాన్ని చూసి పులకించిపోతారట. శ్రీరాముడు సత్యపాలకుడు,ధర్మాచరణం తప్పనివాడు,ఏకపత్నీ వ్రతుడు,పితృ,మాతృ,నిగ్రహం,సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ధ హృదయుడు.అందుకే ప్రతి ఏటా భద్రాద్రిలో జరిగే సీతారామ కళ్యాణాన్ని చూసి తరించిన వారి జన్మ సార్థకం అవుతుందని భక్తుల విశ్వాసం.

 శ్రీరాముడు మనిషిగానే పుట్టాడు, మనిషిగానే కష్టసుఖాలు అనుభవించాడు.. మరి రాముడు దేవుడెలా అయ్యాడు?

రాముడు.. దేవుడనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.. రాముడు ఒక మనిషి. మనిషిగానే పుట్టాడు.. మనిషిగానే పెరిగాడు.. మనిషిగానే కష్ట సుఖాలన్నీ అనుభవించాడు. రాజుగా.. ప్రజల్ని పరిపాలించాడు. మరి.. మనందరికీ ఆదర్శప్రాయుడు ఎలా అయ్యాడు? పురుషోత్తముడిగా ఎలా మారాడు?

శ్రీరాముని జీవితం మొత్తం.. మానవులకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. ఎప్పుడెలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. తోడబుట్టినవాళ్లతో ఎల మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత.. అలాగే సహనం విలువల గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు.. ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలో తెలియజేస్తుంది. కులం, మతం లాంటి సామాజిక అడ్డుకట్టల్ని ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువతో పాటు శత్రువుతో కూడా మిత్రుత్వం ఎలా పొందాలో వివరిస్తుంది శ్రీరాముని జీవనశైలి.

అందుకే.. శ్రీరామచంద్రమూర్తి పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు:

పంచేయాద్రిలపై పూర్తి నియంత్రణ కలిగిన వాడు.. శ్రీరాముడు.. ఆలోచనాపరుడు.. అహంకారం లేని వాడు.. శ్రీరాముడు.. ఆత్మశత్రువుని జయించేవాడు.. శ్రీరాముడు..అందుకే.. శ్రీరామచంద్రమూర్తి పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. కామం, కోపం, అత్యాశ, అసూయ లాంటి అవలక్షణాలున్న రావణాసురిడిని వధించడం ద్వారా.. ఆ లక్షణాలన్నింటిని రాముడు వధించాడని అంటారు. శ్రీరాముని పాద స్పర్శతో.. మన నేల ధన్యమైందని చెబుతుంటారు.

తండ్రి మాట జవదాటలేదు, నిత్యం.. సత్యమే పలికాడు:

శ్రీరాముని గురించి తెలియనివారుండరు. తండ్రి మాట జవదాటడు. నిత్యం.. సత్యమే పలికేవాడు. హిందువులకే కాదు.. ఇతర మతాల వారికి కూడా శ్రీరాముని గొప్పతనం తెలిసే ఉంటుంది. ఆ అయోధ్య రాముడు.. కేవలం ఆధ్యాత్మిక, చారిత్రక మూర్తి మాత్రమే కాదు. మంచితనానికి, దయకి, నమ్మకానికి.. చిహ్నం లాంటివాడు. అందుకే.. శ్రీరాముడు ఆదర్శపురుడయ్యాడు.

రాముడి జీవితం ఈ ప్రపంచానికి ఓ మంచి పుస్తకంలాంటిది:

శ్రీరామచంద్రమూర్తి జీవితం మొత్తం.. ఈ ప్రపంచానికి ఓ మంచి పుస్తకంలాంటిది. మనిషిగా జన్మించాక.. అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి.. ఎలాంటి జీవితాన్ని గడపాలి.. బంధు, మిత్రులతో ఎలా వ్యవహరించాలి.. ప్రజలతో ఎలా మమేకమైపోవాలి.. కష్ట, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలన్న వాటిని ఆచరించి.. చూపించిన వాడు శ్రీరాముడు.

ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అడవులకు:

తల్లిదండ్రుల గారాలపట్టీ అయిన శ్రీరాముడు.. 17 ఏళ్ల వయసులోనే విశ్వామిత్రుడి వెంట అడవులకు వెళ్లమంటే. మరో మాట మాట్లాడకుండా వెళ్లాడు. తల్లిదండ్రులను దైవంగా భావించటానికి.. ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే.. రాజుగా పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గరపడగానే.. పద్నాలుగేళ్లు వనవాసం చేయమంటే.. ఒక్క నిమిషం ఆలోచించకుండా అడవులకు వెళ్లాడు శ్రీరామచంద్రప్రభువు. జననీ.. జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ.. అన్నది కూడా మన అయోధ్య రాముడే. కన్నతల్లి, జన్మభూమి.. స్వర్గంతో సమానమన్నాడు కాబట్టే.. రాముడు ఉత్తమ పురుషుడయ్యాడు.

రాముడు ఏకపత్నీవ్రతుడు:

ఒక అన్నగా.. తమ్ముళ్లపై అపారమైన ప్రేమను కురిపించాడు రాముడు. ఆయన తమ్ముళ్లు కూడా.. అన్న పట్ల అదే రకమైన ప్రేమతో ఉన్నారు. తల్లులు వేరైనా.. ఏనాడూ తమ్ముళ్లతో చిన్న గొడవ పడలేదు. శ్రీరాముని కాలంలో.. రాజులకు ఎంతోమంది భార్యలు ఉండేవారు. అలాంటి సమయంలో కూడా.. రాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరు సంపాదించాడు. దాదాపు 11 వేల ఏళ్లు.. అయోధ్యను పరిపాలించిన శ్రీరామచంద్రప్రభువు.. సీతాదేవిని తప్ప మరో మహిళను వివాహమాడలేదు. ఆనాటి నుంచే.. ఒక భార్యను కలిగి ఉండాలనేది.. కట్టుబాటుగా మారింది. చాలా మంది.. రాముడే ఆదర్శంగా ఒకరినే వివాహమాడారు.

శ్రీరాముడు లోకారాధ్యుడు ఎందుకైనాడు? భగవంతుడనా? పురుషోత్తముడనా? ఎవరి విశ్వాసాలు వారివి. రెండూ సత్యాలే కావచ్చు. నమ్మినవారికి నమ్మినంత. నాణెమునకు బొమ్మా బొరుసు ఉన్నట్లే శ్రీరాముడిలో నారాయణతత్త్వముంది, నరతత్త్వము వుంది.

శ్రీరాముడు మాత్రం తను ఒక సాధారణ మానవుడిగానే గడిపాడనడంలో సందేహమేమాత్రమూ లేదు. రామో విగ్రహవాన్ ధర్మః- ‘రాముడు ధర్మము మూర్త్భీవించినవాడ’ని ఎలా చెప్తామో అతడొక ‘మూర్త్భీవించిన ఆదర్శము’ అని కూడ చెప్పాలి. రాముడు మానవమాత్రుడిగానే తన జీవితకాలంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుంటూ సుఖదుఃఖానుభూతులను పొందుతూ ఒక ఆదర్శమయ జీవనాన్ని కొనసాగించాడు. జాతికి, మానవాళికి అదే ప్రేరణ. స్ఫూర్తి కూడా. అందుకే ఆయనొక ‘జాతీయ మహానాయకుడు’. డా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడ రాజ్యాంగ మూలప్రతిలో రామపట్ట్భాషేకము, రామసేతు వంటి చిత్రాలకు స్థానం కల్పించారు.

శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడు. దైవంగా భావించే ధార్మికులు, ఆధ్యాత్మికులు కూడ దీన్ని అంగీకరిస్తారు. ఏది ధర్మమో దానిని దైవంగా భావించడం హిందూ జీవన పద్ధతి. శ్రీరాముడు మానవుడే అనే విషయాన్ని నారద వాల్మీకులే స్పష్టం చేశారు. తన ఆశ్రమానికి నారదుడు వచ్చినపుడు వాల్మీకి ఆయనతో- ‘మీరు లోక సంచారం చేస్తుంటారు కదా! ఈ లోకంలో ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు, సచ్చరిత్రుడు, సమర్థవంతుడు, సదా ప్రియదర్శనుడు, సర్వ ప్రాణికోటికి హితుడు, తేజోవంతుడు, జితక్రోధుడు, ధైర్యవంతుడు, దేవతలు కూడ భయపడే పరాక్రమవంతుడైన మానవుడెవడైనా ఉన్నాడా? ఉంటే తెలియజేయండి’ అని అడిగినపుడు-

బహవో దుర్లభాశ్ఛైవ యే త్వయా కీర్తితా గుణాః

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుతాః అని..

ఇట్టి సద్గుణ సంపన్నుడైన మానవుడు లభించడం దుర్లభమే. కాని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరాముడు మాత్రం దీనికి మినహాయింపుగా- శ్రీరాముడనే రాకుమారుడు ఉన్నట్టుగా చెప్పాడు. దీనిని బట్టి రాముడు వేసిన ప్రతి అడుగులో ఒక మానవోత్తముడు గోచరిస్తాడు. అతనిని ఆశ్రయించిన సద్గుణ సంపద కారణంగా దైవత్వాన్ని కూడా దర్శించవచ్చు.

శ్రీరాముడు ప్రజాపతులతో, బ్రహ్మతో సమానుడే కాని ప్రజాపతి కాడు, బ్రహ్మకాడు అన్నాడు. శత్రువులను, దుర్మార్గులను చీల్చి చెండాడి జీవకోటిని, ధర్మాన్ని పరిరక్షిస్తాడు, తన ధర్మాన్ని ఆచరిస్తాడు. స్వజనులను రక్షిస్తాడు. వేదవేదాంగాల తత్వాన్నాకళింపు చేసుకొన్నాడు. ధనుర్విద్యలో నిష్ణాతుడు అని శ్రీరాముని గురించి చెప్పాడు. సమస్త సద్గుణములు రాముడి నాశ్రయించి యున్నాయని అర్థం. అందుకే ఆయన పురుషోత్తముడు, మానవోత్తముడు, నరోత్తముడు. రాముని మానవ జీవన విధానాన్ని, కార్యసాధకతను, ఆదర్శాన్ని అడుగడుగునా మనం గమనించవచ్చు.

శ్రీరాముడు దైవీశక్తి సంపన్నుడని రామాయణాది గ్రంథాలు వర్ణించినా రాముడెక్కడా తన జీవితంలో దైవీశక్తిని ఉపయోగించుకోలేదు. ఒక మానవుని వలె తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. తన భుజబలాన్ని, తన మేధస్సును, తన విద్యలను తాను నమ్ముకున్నాడు. 14 ఏళ్ల పాటు వనవాసమంతా కాలి నడకనే సాగింది. సీతానే్వషణ సుగ్రీవుని సహాయము, హనుమంతుని శక్తి సామర్థ్యములతోనే జరిగింది. సముద్రమును దాటవలసి వచ్చినపుడు కూడా వానరుల సహాయంతో సేతువును నిర్మించి దానిమీదుగా లంకకు వెళ్లాడు తప్ప ఎక్కడా మహిమలను, మాయలను ఉపయోగించలేదు. రావణ వధానంతరం అయోధ్యకు బయలుదేరి గంధమాదన పర్వతం దగ్గర దిగి ఋషిమునుల ఆశీస్సులు పొందిన శ్రీరాముడు వేదవేదాంగ విద్యా సంపన్నుడు. పరమ శివభక్తుడైన రావణుని చంపినందువల్ల కలిగే పాపమునకు ప్రాయశ్చిత్తంగా రామేశ్వరంలో సైకత శివలింగ ప్రతిష్ఠ చేశాడు. యుద్ధంలో శత్రువును చంపితే పాపం కలుగదు. కాని రావణుడు పరమశివ భక్తుడనే భావనతో లోక కళ్యాణార్థం రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు. మానవుని హృదయంలో ఎన్ని ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయో శ్రీరాముడి మనస్సులో గూడ అలాగే పరిభ్రమించడంతో అలా వ్యవహరించాడు. అవసరాన్ని బట్టి శక్తిని, యుక్తిని, మేధస్సును ఉపయోగించాడు. 

శ్రీరామునికి గుడి కడుతున్నాం. కట్టాల్సిందే తప్పులేదు. ఎందుకు కట్టాలి? ఆయన సద్గుణములు, ఆదర్శము రాశిపోసిన మానవమూర్తి కాబట్టి. రామాలయం అనగానే రాముని మూర్తి, ఆయన గుణములు ప్రజల మనస్సులోకి రావాలి. అందుకోసం విగ్రహ ప్రతిష్ఠలు. గుడి గోపురాల నిర్మాణం చేయడం భారతీయ సంప్రదాయంగా నెలకొన్నది. దుష్టత్వానికి, దుర్మార్గానికి ప్రతీకలైన వాటికి ఈ భూమిమీద ఆదరణ లేదు. అలాగే ప్రపంచంలో ఏ దేశమూ చెడును ప్రోత్సహించకూడదు. పోషించకూడదు కూడ.

అయితే గుళ్లు, గోపురాలు కట్టి పూజలు చేస్తుంటే సరిపోదు. పూజ చేస్తున్న సమయంలో ఆ సద్గుణాలన్నీ మదిలో మెదులుతుండాలి. రామోభూత్వా రామం యజేత్. రాముడిని పూజిస్తున్నామంటే తాము కూడ అంతటి ఉన్నతులు కావడానికి ప్రయత్నించాలి. ప్రతి మనిషీ రాముడు కావాలి. ప్రతి అణువూ రామతత్త్వమే. అంటే ధర్మతత్త్వమే. మానవత్వమే ధర్మం. అదే దైవము. అదే భారతీయము. అదే హైందవము. సనాతనము కూడ.

రామ కళ్యాణము చేస్తున్నారు, చేయాలి. కళ్యాణము శుభప్రదము. సమాజానికి శుభం కలగాలనే ఆకాంక్షతో కళ్యాణం చేయాలి. శ్రీరాముడు ఏ భేదాలు, వైషమ్యాలు లేని సమరసతా, సమైక్యతా బాటలో నడిచి- మనకు బాట చూపించాడు. అంటరానితనం వంటి దురాచారాలను నిర్మూలించుకుంటూ, కుల విభేదాలను తొలగించుకుంటూ, సంపూర్ణ భారతీయ సమాజం సామూహికంగా రామకళ్యాణం జరుపుకోవడమే జాతికి శ్రేయస్సు.

*ప్రాంజలి ప్రభ కు టుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు*

Hanuman

 

🙏 *సుందరకాండ మహిమ* 🙏

(---చాగంటి వారి ప్రవచనాల నుండి.)


🍃🌺ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో 

అక్కడక్కడ స్వామి హనుమ అందరి కన్నా ముందు వచ్చి కుర్చుంటారు.


🍃🌺ఎక్కడెక్కడ రామ కథ చెప్పడం పూర్తవుతుందో అక్కడ అందరి కన్నా చిట్ట చివర్న బాధపడుతూ, వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తారు. అందుకే, ప్రత్యేకించి సుందరకాండ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడకి హనుమ వస్తారు అని అంటారు. 


🍃🌺కారణం ఏమంటే శ్రీ రామాయణం లో - మిగిలిన ఏ కాండలోనూ లేని అద్భుతం ఒక్క సుందరకాండలోనే వుంది. సుందర కాండలో రామ కథ ఒకటికి పదిమార్లు చెప్పబడుతుంది.


🍃🌺హనుమ చెప్పేటప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎంత రామకథ చెప్పాలో అంతనే చెబుతారు. రామకథ కున్న బలమేమిటో, రామ నామానికున్న బలమేమిటో నిరూపించిన కాండ సుందరాకాండ! 


🍃🌺అందుకే సుందరాకాండ బహుభంగిమల సుందరకాండ.ఎన్ని కోణాలలో చూడండీ, అదంతా సుందరమే!  


🍃🌺ఒక పాత్ర నిండా పాయసం తీసుకొచ్చి అక్కడ పెడితే, అడుగున వున్నది పాయసమా, మధ్యన వున్నది పాయసమా, పైనున్నది పాయసమా 

అని అడిగితే ఏం చెప్పవలసి వుంటుంది? - అంతా పాయసమే. అలాగే, సుందరాకాండ ని ఎటు వైపునించి చూడండి అంతా సౌందర్యమే.


🍃🌺రామాయణం లో ఒక్క సుందరకాండకొచ్చేసరికి, మహర్షి ఒక గొప్ప ప్రయోగం చేసారు. ఇందులో చాలా శ్లోకములు శ్లోకములు కావు. చాలా శ్లోకములు మంత్రములే. అందుచేతనే, అప్పటికీ ఇప్పటికీ సుందరకాండ శక్తి ఏమిటంటే, పిల్ల పెళ్ళవలేదు! - సుందరకాండ చదువుకోండి.


🍃🌺పిల్లాడికి ఉద్యోగం రాలేదు - సుందరకాండ చదువుకోండి.ఆరోగ్యం బాలేదు - సుందరకాండ చదువుకోండి. ఏమిటో భయంగా వుంటోంది - సుందరకాండ చదువుకోండి. భీతి కలిగింది - సుందరకాండ చదువుకోండి. ఏ కష్టం కలగనీండి - సుందరకాండ చదువుకోండి. ఫలితం వుంటుందని నమ్ముతారు భక్తులు. 


🍃🌺ఎందుకంటే - లోకంలో ఇంత శక్తిమంతమైనవి  రెండే రెండు సాహిత్యంలో వున్నాయని చెబుతారు పెద్దలు. ఈ రెండూ కాకుండా మూడో అంకె వేసి చెప్పడానికి ఇంక లేదు.    


🍃🌺ఆ రెండూ ఏమిటంటే ఒకటి సుందరకాండ, రెండు - సౌందర్య లహరి. మూడు ఇక లేదు.

రెండూ సౌందర్యము, సుందరము ఆ పర్యాయ పదాలతోటే వుంటాయి. రామానుగ్రహాన్ని ప్రసాదించే శక్తి సుందరకాండలో వుంది.




🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀


: 🌻 *ఆంజనేయస్వామి గురించి కొన్ని విశేషాలు* 🌻




🍃🌺ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం.


🍃🌺 *పురాణ కథ ప్రకారం*

ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. 


🍃🌺అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.



🌻 *స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:* 🌻


🍃🌺1. తమలపాకుల దండ:

ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.


🍃🌺2. మల్లెలు:

గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.


🍃🌺3. పారిజాతాలు:

స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.


🍃🌺4. తులసి:

తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది


🍃🌺5. కలువలు:

కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.



🌻 *పంచముఖ హనుమాన్:* 🌻



🍃🌺శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.


🍃🌺1. తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.


🍃🌺2. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.


🍃🌺3. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.


🍃🌺4. ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.


🍃🌺5. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.


🌻 *హనుమంతుడి సందేశం ?* 🌻


🍃🌺హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.


🍃🌺హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. 


🍃🌺ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.


🍃🌺‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని.


🍃🌺కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు.


🍃🌺మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.


🍃🌺‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. 


🍃🌺మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు.



🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

 🌻 *ప్రతీ పూజకు ఆవు పాలే ఎందుకు?* 🌻


*శ్లో !! గ్రీవా మస్తక సంధేతు తాసాం గంగా ప్రతిష్ఠితా*

*సర్వదేవ మయోగానః సర్వతీర్థమయాస్తదా !!*


🍃🌺గోవు యొక్క గొంతుక నందు, పొదుగులో, మూత్రములో, గంగా దేవి ఉంది. అంతే కాదు గోవు యొక్క అన్ని అంగములలో కలిపి సర్వ దేవతలు ఉన్నారు అని శాస్త్రములు చెప్పుతున్నాయి. గోవు యొక్క మలముత్రాలులో పెన్సిలిన్ ఉంది అని నిరూపితం అయినది. అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ ప్రకారం చూసినా గోమాత గొప్పదనం అంతా ఇంతా కాదు.


🍃🌺ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు అంటే, వైదిక ధర్మం కావాలని చెప్పుతుంది. పురోహితులు ప్రతీ పూజకు ఆవుపాలు, పెరుగు , నెయ్యి ఖచ్చితంగా కావాలి. శాస్త్రం ఆవుపాలు తప్ప వేరేవి సమ్మతించవు. గోశాలలుకు విరాళం ఉన్నంతలో కొంత మన భాద్యత గా అందించడం మన కర్తవ్యం. స్థలం కేటాయించే దాన గుణ సంపన్నులు , వృత్తితో పాటు అభిరుచి ఉన్నవారు గోసంరక్షణ శాల లో కొంత సమయం కేటాయించడం ఆవశ్యకం.


🍃🌺ఏ ఊరి నందు ఐతే గోశాల ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శని భాదలు ఉండవు అని శాస్త్ర వచనం. విష్ణువుకు గోవులు అంటే ఇష్టం అందుకే ఆవు పాలుతో పూజలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ది ఆయన ఇస్తాడు. గోదాన ఫలం అంతా ఇంతా కాదు, గోదానము చేసిన వారికి సర్వ దోష నివారణ సకల సంపదలు అందుతాయి.



🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

[20/04, 7:07 am] +91 94414 08564: 🙏 *శ్రీ వేంకటేశ్వర శతకము 45* 🙏



🍃🌹పుణ్యులను దూషించడం ఎలా వుంటుందో ఈ పద్యం వివరించింది. 



*ఉ. సర్వజనోపకారములు సల్పెడు పుణ్యులనైన నూరకే*

*యుర్విని దూరుమూఢమతులుందురు కొందరు దుష్టచిత్తులై*

*పర్వము గూర్చి రాత్రి పరిపాలనజేయుచునుండు చంద్రునిన్ దుర్విధి*

*జారబోరు లతిదూషణ జేయరె? వేంకటేశ్వరా!*



🍃🌹శ్రీ వేంకటేశ్వరా! లోకంలో కొందరు మూఢమతి కల్గి మంచివారలను, పరోపకారంచేసే మాన్యులను, పుణ్యాత్ములను, నోటికొచ్చినట్లు తిట్టి దూషిస్తూ వుంటారు. అది తగని పద్దతి. 


🍃🌹అది యెలా వుంటుందంటే మంచి వెన్నెలతో చందమామ రాత్రి శోభాయమానంగా పరిపాలన చేస్తూ వుంటే, ఆచందమామను తప్పుడు పనులు చేసే జారులూ, చోరులూ, అతి దూషణ చేయడం ఎటువంటిదో అటువంటిదవుతుంది.


🍃🌹తిరుగుబోతులకూ, దొంగతనాలు చేసే వాళ్ళకూ, వెన్నెల రాత్రుల వెలుగులు అటంకాన్ని కల్గిస్తాయి. అందుచే చందమామను వారు భయంకరంగా తిడతారు. అది మంచిది కాదుకదా. పుణ్యాత్ములను దుర్మార్గులు దూషించడం కూడ అలాగే వుంటుంది.



🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 🙏 *సుందరకాండ* 🙏



🎈 *భాగము 15* 🎈

🌻 *ఆలోచన* 🌻


🍃🌺చూస్తున్న హనుమంతుని కన్నుల నీరు నిండింది. ఉత్తములయిన కుల, గురు, వృద్ధుల శిక్షణలో పెరిగిన లక్ష్మణుని వంటి-నికి పూజ్యుడూ, గురువూ అయిన రామచంద్రుని భార్యకు యిటువంటి కేశం కలిగిందంటే కాలం ఎంత బలీయమయినదో!

🍃🌺ఈవిడకు రామ లక్ష్మణుల ధీ ధీరశక్తులు పూర్తిగా తెలుసు కనుకనే అంతగా కలతపడడంలేదు. వర్షాకాలపు మేఘాలను చూచి గంగానది క్షోభిస్తుందా!

🍃🌺కుల రూప గుణ శీలాలలో యిద్దరూ సమానులే. అందువల్లనే ఈమెకు ఆయన, ఆయనకు ఈవిడ తగినవారు.ఈ విశాలాక్షి కోసం వాలిని నేలకూల్చాడు రాముడు. రావణసముడయిన కబంధుణ్ణి హతమార్చాడు.

🍃🌺విరాధుడికీ అదే గతి పట్టింది. వాడేం తక్కువవాడా! శంబరాసురు నంతటివాడు. భీకరాకారులయిన ఖర దూషణాదులతో వారి సేన పదునాలుగు వేలు జనస్థానంలో నామ రూపాలు లేకుండా పోయింది యీవిడకోసం.

🍃🌺సర్వవానరేశ్వరు డయిన వాలిని నేలకూల్చి సుగ్రీవునికి పెట్టాభిషేకం జరిపింది యీవిడ కోసమే.నదీ నద సాగరాలు లంఘించి లంకానగరాన్ని నేను చూడగలిగానంటే ఈ యిల్లాలి వల్ల కాదా!

🍃🌺ఈవిడ కోసం రామచంద్రుడు ముల్లోకాలు తలక్రిందులు చేసినా ఆశ్చర్యం లేదు.ఈ జనక రాజనందనతో చూస్తే త్రిలోకాధిపత్యం గడ్డిపరక. దర్మపరుడైన జనకుని పుత్రిక, పతివ్రతా శిరోమణి.

🍃🌺విదేహాధీశుడు యజ్ఞంకోసం నాగలిపట్టి దున్నుతున్నవేళ పద్మపరాగ సమధూళినుండి బైటపడ్డది ఈవిడ.పూజ్యుడూ, పరాక్రమోపేతుడూ అయిన దశరధుని యింటికి కీర్తిని తెచ్చిపెట్టిన పెద్దకోడలు. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఆత్మవేత్త అయిన రాముని ప్రియపత్ని.

🍃🌺అటువంటి నారీమతల్లి ఈ రాక్షసజన మధ్యంలో పడింది. సర్వరాజ భోగాలూ విడిచి భర్తృవాల్లభ్యంతో అరణ్యక్లేశా లనుభవించడానికి ఆయనతో వచ్చిన ఉత్తమురాలు.

🍃🌺కందమూలఫలాలు తింటూ హాయిగా భర్తను సేవించుకున్నది. ఎన్నడూ క్లేశాలు ఎరుగనిది, ఈ నా డింతటి అవస్థ అనుభవిస్తున్నది.

🍃🌺శీలసంపన్నయైన ఈవిడకోసం రాముడు ఎదురు చూస్తున్నాడు. ఈవిడ దొరికితేచాలు భూ మండలమంతా సాధించిన సంతోషం కలుగుతుంది రామునికి.

🍃🌺ఇక్కడ బంధుజనం లేరు, భోగాలు లేవు. అయినా యీవిడ జీవించకలుగుతున్నదంటే రామసమాగమకాంక్ష కాక వేరేమున్నది.

🍃🌺ఈవిడ తన చుట్టూ వున్న రాక్షసగణాన్ని కాని, పూల తీవెలనుకాని చూస్తున్నట్లు లేదు. రామదర్శనమందే ఏకాగ్రమై ఉన్నది, యీవిడ మనస్సు.ఈ పద్మనయనను, సుఖబోగార్హను యీ దశలో చూస్తుంటే నా మనస్సు చింతామయి మవుతున్నది.

🍃🌺రామ లక్ష్మణుల రక్షణలో ఉండవలసిన యీ భూజాత యీ వికృతాకార జన మధ్యంలో ఉన్నది.

🍃🌺మంచు దెబ్బతిని వాడిన పద్మంలా దుఃఖపరంపరతో కృశించి ఉంది. ప్రియుడు దూరమయిన చక్రవాకిలా దీనంగా ఉంది.పూల బరువుతో వంగిన కొమ్మలతో ఉన్న ఈ అశోకం కూడా యీవిడకు సంతోషాన్ని కలిగించడంలేదు. మంచుపొరల అడ్డంలేని శీతకిరణుడు కూడా యీమెకు సుఖం ప్రసాదించలేకపోతున్నాడు, అలా ఆలోచిస్తూ గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో నాజీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.


✍️ బాగా డబ్బు సంపాదించవచ్చు, నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టు కోవచ్చు, కానీ నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చు కోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు. అదే "జీవితం''.


🏵️అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.🌈


🤷‍♀️ మనం వృద్ధాప్యాన్ని సమీపించి నప్పుడు చురుకుగా తయారవుతాం. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.


👉 30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా ఒకే సమయాన్ని సూచిస్తుంది, మన జేబులో 30 డాలర్లు న్నా, 300 డాలర్లున్నా అందులో తేడా ఏమీ వుండదు. ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం. మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే, నీలోని మనిషికి సంతోషం నీ బాహ్య ప్రపంచ వస్తువుల తో రాదు. నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.


💐అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే అదే నిజమైన సంతోషం.


🙏 జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి


👉 (1) మీ పిల్లలకు ధనవంతులుగా వుండటం కంటే సంతోషంగా మరియు ఆరోగ్యాంగా వుండటం నేర్పండి. దాని వల్ల, పెరిగి పెద్దయిన తర్వాత వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.

                                                                             👉 (2) ఆహారమే ఔషధం, ఆహారాన్ని ఔషధంగా వాడండి. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.

                                                                                👉 (3) నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు వంద కారణాలు చూపినా నిన్ను వదిలిపోరు, నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.

                                                                                            👉 (4) మనిషికి, మానవత్వం గల మనిషి కి తేడా వుంది.

                                                                        👉 (5) వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా వెళ్లు,కానీ దూరం వెళ్లాలంటే కలిసి వెళ్లు.


📗చివరగా, వీటిని గుర్తుంచుకో. వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. నీ జీవితంలోని ప్రతి మలుపు లో వీటిని గుర్తుంచుకో  🙏

storiess

 

*🌹. ధ్యానమే పరమాత్మ.... దేహమే  జీవాత్మ. 🌹*


*మనోమాలిన్యం అనునది జన్మజన్మల నుండి మన మనస్సుకు అంటుకొని ఉంటున్నది. దీనిని పూజలచే పునస్కారాలతో పోగొట్టుట అసంభవం. మాలిన్యం అనగా కొన్ని పూలమొక్కలు పుట్టినపుడు లేతగా మృదువ్ఞగా ఉంటుంది. అది పెరిగి పెద్దదైనా, దాని స్వభావం మృదువ్ఞగా ఉంటుంది.*

*అలాగే కంప మొక్క పుట్టి నపుడు లేతగా మృదువ్ఞగా ఉంటుంది.  పెరిగి పెద్దదైనా దాని స్వభావం కఠినంగా ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది.*

*ఈ విధంగా చెడు సంస్కారాలు మన మనస్సుకు అంటుకొని యుండుట వలన, పరమాత్మతత్వం తెలియుట లేదు.*

*కొన్ని సందర్భాలలో మన కంటికి పొర ఏర్ప డుతుంది. ఆ పొర దృశ్యం కనపడకుండా చేస్తుంది. అపుడు ఎంక్వయిరీ చేసి కంటిడాక్టర్‌ ఆపరేషన్‌ ద్వారా కంటికి ఉన్న పొర అనే మాలిన్యం తొల గించుట ద్వారా, స్వచ్ఛమైన దృశ్యాన్ని చూడగలు గుతారు. అలాగే జిజ్ఞాసువ్ఞకు భగవతత్వం తెలి యుట లేదు. అంటే ఒక్క ధ్యానం ద్వారానే మన స్సుకు పట్టిన మాలిన్యం తొలగించుట సంభవం.*

*ఈ ధ్యానం మన జన్మజన్మల చెడు సంస్కా రాలను తుత్తునియలను చేసే బ్రహ్మాస్త్రం.*

*ఈ చెడు సంస్కారాలను బాహ్య పూజల ద్వారా పోగొట్టుట అసంభవం. బాహ్య వస్తువ్ఞకు మాలిన్యం తగిలితే చేతితో పోగొట్టవచ్చును. మనస్సుకు తగిలిన మాలిన్యం, మనస్సు ద్వారానే పోగొట్టాలి. అంటే శ్వాసపై మనస్సు పెట్టాలి.*

*ఇతర మార్గమే లేదు. కాబట్టి మన శరీరావయముల ద్వారా తినగా చేతితోగాని, చెవితో గాని బాహ్య సంబంధమైన వాటి ద్వారా చెడు సంస్కారాలను పోగొట్టలేం.*

*కనపడని మనస్సుకు తగిలిన చెడు సంస్కా రాన్ని కనపడని శ్వాస ద్వారానే చెడు సంస్కారాన్ని పోగొట్టుట సంభవం.*

*నీరు, అగ్ని, భూమి, ఆకాశం, గాలి(శ్వాస) వీటిలో ప్రధాన పాత్ర వహించేది గాలి.*

*మనసు-బుద్ధి-చిత్తం-అహంకారం-జ్ఞానం. వీటిలో ప్రధానపాత్ర వహించేది మనస్సు.*

*ఇకపోతే ఆత్మ. ఈ మూడు కూడా మనకు కనపడనివి. మనస్సు కనపడదు. గాలి కనపడదు. ఆత్మ కనపడదు. కనపడని ఆత్మను పొందాలంటే కనపడని మనస్సును కనపడని (గాలిపై) అనగా శ్వాసపై ఉంచాలి.*

*ఈ విధంగా శ్వాసమీద మనసు ఉంచినట్లయితే మార్గం సుగమమౌతుంది. బహిర్ము ఖముగా పరుగెత్తే మనస్సును అంతర్ముఖం చేసి, మౌనముగా శ్వాసపై మనస్సు ఉంచాలి. ఈ విధంగా చేసే ధ్యానం విధానం వలననే మనస్సు స్వాధీన పడవలెననే గాని ఇతరత్రా కాదు.*

*ఈ విధానమైన ధ్యానం అనగా సర్వ దుఃఖ నివారిణి, రోగాల నుండి విముక్తి కల్గించే మహిమాన్వితమైన అపూర్వ ప్రక్రియ.*

*ఈ విధమైన ధ్యానం ఆదిమద్యాంత రహితంగా సాగే ధ్యానం సంభ్రమాశ్చర్యాలతో సాగుతుంది. తాను చైతన్యమై సమస్తాన్ని చైతన్యపరుస్తూ ఉంటుంది. ప్రతి అనుభవం నిత్యనూతనంగా ఉంటుంది. భౌతిక ప్రపంచంలో మనం చూసేవి అనుభవించేవన్నియు గతంలో అనుభవించినవే.*

*ఈ రకమైన ధ్యానం చేయుట వలన వెరైటీగా ఉంటుంది. మానవ్ఞడు వెరైటీ కొరకు తాపత్రయపడ్తున్నాడు. దృశ్య ప్రపంచంలో వెదుకుతున్నాడు. ఒక సెకను మాత్రం వెరైటీగా అగుపడుతుంది. తర్వాత వెగటు పుడుతుంది. ధ్యానం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.*

*మనం పుట్టినప్పటి నుండి అన్నం, చారు, పాయసం ఇవన్నియు మనం అనుభవించినప్పటికి వాటి రుచిమారుట లేదు. తిన్నవే తింటున్నాం. చూసినవే చూస్తున్నాం. వెరైటీ ఏమియు లేదు.*
*ఉత్కంఠ భరితంగా సాగే ఈ ధ్యానం. సదా సంభ్రమాశ్చర్యాలతో ఎడతెరిపి లేకుండా సాగుతుంది.*

*ఈ ధ్యానమే 14 లోకాలను తన ఆధీనంలో ఉంచుకొని సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు, ఈ గ్రహాలు ఆయా స్థానాల్లో యుండి వాటి యొక్క విధులు నిర్వహించేటట్లు చేస్తూ తన ఆధీనములో ఉంచుకొంటున్నది.*
***

 *దానంతో శాశ్వత కీర్తి*

“అతిధి దేవోభవ !” అన్నది మన సాంప్రదాయం. ఈ ప్రపంచంలో చిన్న చీమ నుంచి అన్ని ప్రాణుల్లో ఉన్నది దైవమే. ఎవ్వరి కడుపు నింపినా, దేవుడు తిన్నట్లే !జాతి, మత, కుల, భేదాలు లేకుండా, ‘ఆకలి’ అన్నవారికి అన్నం పెట్టాలి. ఆకలిగొన్నవాడు ఎవరైనా సరే, చివరికి దొంగ, హంతకుడు అయినా సరే, అన్నం పెట్టాలి. ఆకలి విషయంలో అపాత్రుడు ఎవరూ ఉండరు. అందరూ పాత్రులే !

  ‘నాకంటె వేరుగా ఏదియు లేదు’, ‘సమస్త ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు వెలయుచున్నాడు.’ అను మాటలను కేవలం బుద్ధితో గ్రహించి, నోటితో వల్లించే వారు కాక స్వీయ అనుభవంతో ఆచరించి, తదనుగుణంగా జీవించే వ్యక్తులు మనక ఆదర్శం కావాలి. ఈ సందర్భంగా భాగవతంలోని రంతిదేవుని కథ గుర్తుకొస్తుంది.  ‘జన సేవయే జనార్ధన సేవగా’ భావించిన రంతిదేవుడి కధను చెప్పుకుందాము.

రంతిదేవుడు ఒక మహారాజు. అమిత దానశీలి. రాజ్యాన్ని, సంపదను దానం చేసి, భార్యాపిల్లలతో అడవికి వెళ్ళాడు. దైవికంగా ఏది లభిస్తే దాన్ని తినటమే-అంతకు మించి ఆయన దేన్నీ కోరేవాడు కాడు, భవిష్యత్తవసరాల కొరకు, దేన్నీ దాచుకొనేవాడు కాడు.

ఒకసారి నలభై ఎనిమిది రోజులు తినటానికి గానీ, తాగటానికి గానీ ఏమీ లభించలేదు. నలభై తొమ్మిదవ రోజు ఏదో కొంత ఆహారం లభించింది. దాన్ని తినటానికి తాను, కుటుంబ సభ్యులు కూర్చొన్నారు. అంతలోనే ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. ఆహారాన్ని ఆయనకిచ్చాడు రంతి దేవుడు. అతన్ని ఆశీర్వదించి వెళ్లిపోయాడు అతిథి. మరికొంత సేపటికే ఒక శూద్రుడొచ్చాడు. రంతిదేవుడు ఆతని ఆకలి తీర్చాడు. ఆ శూద్రుడు వెళ్లిన వెంటనే ఒకడు కుక్కలను తీసుకొని వచ్చి తన ఆకలిని, ఆ కుక్కల ఆకలిని తీర్చమని కోరాడు. తన వద్ద మిగిలిన ఆహారంలో రంతిదేవుడు అతనికి, అతని కుక్కలకు ఇచ్చాడు. ఇక కేవలం కొంత పాయసం మాత్రమే మిగిలింది. దాన్ని తాగి ఆకలి మంటను ఆర్పటానికి సిద్ధపడింది ఆ కుటుంబం. అంతలోనే ఎంతో దీనావస్థలో నున్న ఒక చండాలుడొచ్చాడు. వాని పరిస్థితి గమనించిన రంతిదేవుడు తన వద్ద ఉన్న పాయసాన్నంతా అతనికిచ్చివేశాడు ”బ్రహ్మార్పణం” అంటూ. నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటూ, స్పృహ తప్పిపోతాడు రంతిదేవుడు. మరుక్షణమే దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.

నీతి : కుల, మత, జంతు వివక్ష లేకుండా, తాను ఆకలితో ఉన్నా , ప్రాణాలు పోతున్నా లెక్కచెయ్యక రంతిదేవుడు చేసిన త్యాగం చరిత్రలో అతని పేరును శాశ్వతంగా నిలిపింది. దానగుణంతో దైవాన్నే నేలకు దించాడు రంతిదేవుడు. మనం కూడా, అన్నం తినేముందు కనీసం ఒక్కరి ఆకలైనా తీర్చే ప్రయత్నం చెయ్యాలి.

నారదుడు ఎవరు? జన్మరహస్యం ఏంటి?

వీణాతంత్రులు మీటుతూ, నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ త్రిలోక సంచారం చేసే నారదుణ్ని ‘కలహ భోజనుడు’ అని పిలుస్తారు. ఆయన గొప్పతనం, చరిత్ర తెలిస్తే ఎవరూ అలా అనరు. పరమాత్మ గుణానుభవంలో తన్మయత్మం పొంది ఎందరినో భగవద్భక్తులుగా చేసినవాడు నారదుడు. వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి మహా పురుషులను, మహా భక్తులుగా మలచినవాడు నారదుడే.

వ్యాసుడు భాగవత రచన చేయడానికి తన కథను చెప్పి ప్రేరణ కలిగించినవాడు. ‘నేను ఇంతటి వాడిని ఎలా కాగలిగానంటే... గత జన్మలో సన్యాసులు నాకు ఉపదేశించిన జ్ఞానమే. కాబట్టి నువ్వు భగవద్భక్తుల సమాహారమైన భాగవతాన్ని చెప్పగలిగితే విన్నవారు కూడా నాలాగే ఉత్తర జన్మలో మహా జ్ఞానులు, భక్తులు కాగలరు. కాబట్టి నువ్వు భాగవతాన్ని రచించు’ అని తన కథను చెప్పాడు.

నారదుడు పూర్వ జన్మలో దాసీపుత్రుడు. తల్లి ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుడి ఇంటిలో ఊడిగం చేసేది. ఆమె వెంటే యజమాని ఇంటికి వెళ్ళేవాడా బాలుడు. బ్రాహ్మణులు వేద వేదాంగాలను చదువుతూంటే వింటూ ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస్య దీక్ష గడపడానికి ఆ ఇంటికి వచ్చారు. ‘వారికి  సేవలు చేస్తూండ’మని యజమాని నారదుడికి పురమాయించాడు. సన్యాసులు పిల్లవాడైన నారదుడి సేవలకు ముచ్చట పడ్డారు. దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదుణ్ని వాత్సల్యంతో పక్కన కూర్చోబెట్టుకుని ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని, ప్రణవాన్ని ఉపదేశించారు. మాయ, సత్యం తదితరాల గురించి బోధించారు. ఆ బోధనలు నారదుడి మనసులో బలంగా నాటుకున్నాయి.

పాముకాటుతో తల్లి చనిపోయాక ‘లోక సంచారం చేస్తూ ఈశ్వరాన్వేషణ చేస్తూ జీవనం గడిపేస్తాను’ అనుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ క్రూరసర్పాలు, ప్రాణులను చూసినా ‘ఈ లోకమంతటా నిండి ఉండి శాసించే  శ్రీమన్నారాయణుడు అందరికీ అండగా ఉండగా నాకే ఆపదా రాదు. నాకేమిటి భయం?’ అనుకుని ఒక రావిచెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరీ మంత్రాన్ని తదేకంగా జపిస్తున్నాడు. ఆ సమయంలో ఒక మెరుపులా శ్రీమన్నారాయణుడి దర్శనం లీలామాత్రంగా అయింది. అశరీరవాణి ’ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం వల్ల, నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. నీవు చూసిన రూపాన్ని బాగా చూడాలని కోరుకుంటూ, నా గురించే చెబుతూ, పాడుతూ, మాట్లాడుతూ ప్రకృతి ధర్మాన్ననుసరించి ఒకరోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు. ఆ తరవాత నీవు  బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు ’మహతి’ అనే వీణను బహూకరిస్తాను. దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావు’ అన్నాడు శ్రీమన్నారాయణుడు.

ఆయన చెప్పినట్టుగానే కల్పాంతం తరవాత తన కుమారుడిగా నారదుణ్ని సృష్టించాడు బ్రహ్మ. ’మహతి’ అనే వీణను ఇచ్చాడు. ఆ వీణపై నారాయణ నామం చెప్పుకొంటూ లోకమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ వైకుంఠం, సత్యలోకం, కైలాసం... ఇలా ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమాన్ని ఆవిష్కరించేవాడు. భగవంతుడి శక్తి గురించి మాట్లాడేవాడు. దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశాలు చేసేవాడు. అందువల్ల నారదుణ్ని దేవతలు, రాక్షసులు సైతం గౌరవించేవారు. జగత్కల్యాణం కోసం పాటుపడుతూ అన్ని యుగాల్లో, లోకాల్లో, సమాజాల్లో, కార్యాల్లో నిరాటంకంగా ప్రవేశించి పనులు చక్కబెట్టేవాడు. ‘భక్తి సూత్రాలు’ రచించి దాని గొప్పతనాన్ని లోకానికి చాటాడు.

ఆ కథ విన్న వ్యాసుడు పొంగిపోయి ‘నారదా’ మంచిమాట చెప్పావు. ఇప్పుడు నేను భగవంతుడి గురించి, ఆయన విశేషాలు, ఈ బ్రహ్మాండాల ఉత్పత్తి, ఆయన్ను నమ్ముకున్న భాగవతుల గురించి, వారి వెంట నడిచిన భక్తుల వృత్తాంతాల గురించి రచన చేస్తాను. వీటిని చదివిన, విన్నవారు నీలాగే తరించిపోవాలి’ అని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంబించాడు.

సేకరణ-ఈనాడు

[20/04, 6:00 am] తెలుగు1: హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా వివరించపడి ఉంది. హనుమంతుడు వైశాఖమాస కృష్ణపక్షమున శనివారం పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతి యోగమున మధ్యాహ్న సమయమందు కర్కాటక లగ్నాన కౌండిన్య గోత్రమున జన్మించాడు.

‘రామాయణ మహామాలా రత్నం వందే నిహత్మిజం’ అని కీర్తింపపడే హనుమంతుడు, వేదములను అనుష్టించి జీవితములోనికి అనుభవంగా తెచ్చుకున్న మహానుభావుడు. ఆంజనేయస్వామి చతుర్వేదములు, వేదాంగములు, సకల శాస్త్ర పురాణములు ఔపోసన పట్టాడు. యజుర్వేద హృదయము తెలిసిన హనుమ, వ్యాకరణ, గాంధర్వ విద్యలలో ఆరి తేరినవాడు. అందుచేతనే,

“బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్”, హనుమంతుని నామమం తలచినంతనే, బుద్ధికుశలత, బలం, కీర్తి, ధైర్యం, శక్తి, చక్కగా పొందికగా మాట్లాడగల శక్తి మొదలగునవి కలుగుతాయి.

సుందరకాండ విశిష్టత: ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. ఇది రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను “పారాయణ కాండ” అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. బ్రహ్మాండపురాణం ఈ కాండమును “సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః” అని, “బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి” అని, “అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్” అని ప్రశంసించింది.

సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలున్నాయి. తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ. భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు. ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాడ శ్రీరాముని, సీత మరియు హనుమల సౌందర్యాలను దర్శంపచేస్తుంది. ఆధ్యాత్మక చింతనతో చూస్తే భగవత్సౌందర్యమును, జీవ సౌందర్యమును, ఆచార్య సౌందర్యమును సుందరకాండ వర్ణిస్తుంది.


సుందరే సుందరో రామః

సుందరే సుందరీ కథః

సుందరే సుందరీ సీత

సుందరే సుందరం వనం

సుందరే సుందరం కావ్యం

సుందరే సుందరం కపిః

సుందరే సుందరం మంత్రం

సుందరే కిం న సుందరం?

అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ.

మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందు ఆమె వసించును కావున ఇది సుందరకాండ.మైందని గుంటూరు శేషేంద్ర శర్మ తన ‘షోడశి – రామాయణ రహస్యములు’ అనే పుస్తకాంలో అభిప్రాయపడ్డారు.

తతో రావణనీతాయహ్ సీతాయహ్ శత్రుకర్షనహ్

ఇయెష్ట పదమన్వెష్ణుం చారణచిరితె పథి

సుందరకాండ ‘తత్’ అనే పదంతో కూడిన పైపద్యంతో మొదలవుతుంది. తత్ అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసనచేయాలో సుందరకాండ వివరిస్తుంది. అందుకే దీనిని ‘ఉపాసనకాండ‘ అని కూడా అంటారు.

అటువంటి సుందరకాండను పారాయణం చేసే క్రమము:

సంక్షేప రామాయణం, శ్రీరామావతారము, సీతాకళ్యాణము, సీతారామోయోః సుఖజీవనము, నాగపాశము విమోచనము, ఆదిత్య హృదయము, రావణవధ, బ్రహ్మకృత రామస్తుతి, పట్టాభిషేకము. ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెపుతారు

తేటగీతి

పిల్లలకు చేరలేకపోతున్న నీతి కథలు.. 

మనం పిల్లలకు చెప్పే నీతి కథలు వారికి జీవిత పాఠాలని నేర్పే గొప్ప సాధనాలు. ముఖ్యంగా చిన్న పిల్లల పసి హదయాలలో మంచి నడవడిని గురించి, ఐకమత్యం గురించి, మంచి చెడులను గురించి, సమయస్ఫూర్తి గురించి, దేశభక్తి గురించి తెలియచేస్తూ, వారి హదయంలో చెరగని ముద్ర వేస్తాయి ''నీతి కథలు''.

పిల్లలకి కథలంటే ఎంతో ఇష్టం. ''అనగనగా ఒక రాజు...'' అని మనం కథను చెప్పడం ప్రారంభించగానే వారు కథను వింటూ ఊహాలోకంలో విహరిస్తారు. కథలో అంతర్గతంగా నీతి దాగి ఉంటుంది. మనం చెప్పే కథనే ఎంతో ఆసక్తితో వినటం వలన, అందులోని నీతి వారి మనస్సును హత్తుకు పోతుంది. కథను వినేటప్పుడు వారు బయటి ప్రపంచాన్ని మర్చి పోతారు. వాళ్ళ ముఖకవళికలు గమనిస్తూ మనం కూడా మన హావభావాలు మార్చుతూ చెపుతున్నప్పుడు వారిలో కలిగే ఆనందాన్ని వర్ణించలేం.

కానీ నేడు విశ్వవ్యాప్తంగా... అస్తవ్యస్తమైన ఉమ్మడి కుటుంబాలు, తీరిక లేని పనులు, ప్రతి క్షణం డబ్బు కోసం ఆరాటం.. ఇలా జీవితం అంతా ఉరుకులు, పరుగులు. ఈ నేపథ్యంలో పిల్లలు కథలకు దూరం కాకూడదంటే, సాంస్కృతిక వారసత్వంగా వారికి అందుతున్న కథలు కోల్పోకూడదంటే ఆ భాధ్యతను మొదట తల్లిదండ్రులు, తర్వాత పాఠశాలలోని ఉపాధ్యాయులు భుజస్కందాలపై వేసుకోవాల్సిన అవసరం ఉంది

''చూసే'' కథనం కంటే, ''వినే'' కథనంలో పిల్లల ''ఊహాశక్తి'' ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏమవుతుందోననే కుతూహలం వారిని ఆలోచింపచేస్తుంది. వారికి మరింతగా ఊహించే అవకాశం కలుగుతుంది. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు లేదు. కుటుంబ వ్యవస్థలో పిల్లలకు కథలు చెప్పేంత తీరిక ఎవరికీ ఉండడం లేదు. పిల్లలకోసం కేటాయించే సమయం కూడా లెక్క ప్రకారం, రోజుకి ఇంత అని ఇస్తున్న తల్లిదండ్రులున్న ఈ హైటెక్‌ యుగంలో పిల్లలకు అందాల్సినంత ఆప్యాయత అందడం లేదు. ఉన్న తక్కువ సమయములో పిల్లలతో అనుబంధాన్ని పెంచేందుకు కథలు చెప్పడం ఎంతగానో తోడ్పడుతుంది. తల్లిదండ్రులు ముందుగా కథలను విని వాటిని తామే హవభావాలతో చెప్పగలిగితే పిల్లలతో తల్లిదండ్రులకు కూడా ఒక ఆప్యాయతతో కూడిన అనుబంధం పెంచడానికి కథలు చెప్పడం తోడ్పడుతుంది.

విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన మన కథలలో పంచతంత్ర కథలు, పెదరాశి పెద్దమ్మ కథలు, మర్యాద రామన్న కథలు, భట్టి విక్రమార్క కథలు, భేతాల కథలు, కాశీమజిలి కథలు, జానపద కథలు, అంతులేని కథలు ముఖ్యమైనవి.

ప్రాచీన భారతీయ కథకుల యొక్క సృజనాత్మకతకు, ఊహాశక్తికి, కథాకథనాలకు సాటిలేని మేటి ఉదాహరణగా ఎన్నో కథలు నిలిచాయి. శతాబ్దాలుగా భారతీయ సాహిత్యంలో చిత్ర విచిత్ర పాత్రలతో, అద్భుత, ఉత్సాహ భరితంగా సాగే ఈ కథలు కేవలం కుతూహలాన్ని రేకెత్తించే మాత్రమే కాలక్షేప కథలు కావు. నిజానికి ఈ కథలు మానవుల ఊహాశక్తికి తర్కాన్నీ, వివేచననూ పరిచయ చేస్తాయి.

ప్రాచీన భారతీయ కథా కౌశలానికి, భావనా శక్తికి, కల్పనా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచిన కథలనేకం ఖండంతరాలను దాటి ప్రపంచ నలుమూలలా విస్తరించాయి. ''పంచతంత్రం'' కథలను పరిశీలిస్తే ప్రతి జంతువు, ప్రతి పక్షి పాత్రలు పాత్రదారులుగా ఉన్నాయి. కానీ కథలు మాత్రం దేనికదే విడికథగా ఉండి, ప్రతికథకూ ప్రారంభమూ, ముగింపూ వేర్వేరుగా ఉంటాయి. ప్రతి కథలో ఒక నీతి లేదా ఒక మంచి తప్పకుండా ఉంటాయి. పిల్లలకు సులభంగా అర్థమై తక్కువ సమయంలో ముగిసేలా ఉంటాయి. జంతువులతో పక్షులతో మాట్లాడించి కథను కోనసాగించిన విష్ణుశర్మ, చిన్నయసూరి లకు తెలుగు వారందరు రుణపడి ఉన్నారు.

ఉమ్మడి కుటుంబాలుంటే తాతా, నాన్నమ్మ, అమ్మమ్మలు కథలు చెప్పేవారు. ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రులు ఈ బాధ్యతను స్వీకరించాలి. కథలలో వివిధ ప్రాంతాలలో వాడే ప్రత్యేక పదాలు, గ్రామీణ పదాలు, పర్యాయపదాలు, సామెతలు ఉండి చిన్నారులకు భాషపై పట్టు కలిగిస్తాయి.

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అమూల్యమైన గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది ''పిల్లలతో'' ఎక్కువ సమయం గడపడం మాత్రమే అని గుర్తించాలి. కానీ నేడు అదే లేక పోవడం విచారకరం. ప్రతి ఒక్కరూ బిజీ బిజీ అంటూ పిల్లల కోసం కొంత సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. గతంలోకి ఒకసారి వెళ్లి చూస్తే.. పని భారం ఉన్నప్పటికీ, రాత్రి సమయాల్లో తప్పకుండా తలిదండ్రులు తమ పిల్లలకు కథలు చెపుతూ గడిపేవారు. కానీ నేటి యుగంలో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతున్న తల్లిదండ్రులు తాము విన్న అ చిన్ననాటి కథలను జ్ఞాపకం చేసుకొని పిల్లలకు చెప్పే ఓపిక, సమయం లేదనుకోవడం విచారకరం. అ మాట కొస్తే కథలు వినడం చిన్నారులకు ఎంత అవసరమో, చెప్పడం అమ్మా నాన్నలకు అంతే అవసరం. ఎందుకంటే కథలు చెప్పడం మనం ఆపేస్తే, అవి క్రమంగా అంతరించిపోతాయి. అంతరించి పోయిన ఆ కథలతో పాటు మన అస్తిత్వం, మన చరిత్ర అంతరించిపోతుంది. చిన్నపిల్లలకు కథలు చెప్పడం ఎంత ముఖ్యమో ఇంట్లో ఉండే పెద్దవారు గుర్తించాల్సిన అవసరం ఉంది. మన భారతీయ చరిత్ర, పురాణాలు పరిశీలిస్తే చిన్నతనంలో వారి తల్లి చెప్పిన కథల వల్ల ప్రేరణ పొందామని ఎందరో గొప్పవారు తెలియచేశారు.

ప్రతి చిన్నారీ తెలియని అనేక విషయాలు తెలుసు కోవాలంటే, వారిలో సృజనాత్మకత పెరగాలంటే వారికి కథలు చెప్పడం అనేది ఒక అద్భుతమైన విధానం. నేటి పిల్లలకు అటు పాఠశాలల్లో లేదా ఇంట్లో కానీ కథలు వినడానికి అవకాశం లేదు. ఎందుకంటే రెండు సంవత్సరాలు నిండడంతోనే చిన్నారులను పాఠశాలలో చేర్చడం, ర్యాంకుల కోసం పరిగెత్తించడంతోనే జీవితం గడిచిపోతున్నది.

కథలు పిల్లలలో వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంపొందిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి.

తెలుగు సాహిత్యంలో చిత్ర విచిత్రాలైన మలుపులతో, వినోదభరితంగా ఉండి మంచి నడవడికను తెలియచేస్తున్నాయి. కాబట్టి పెద్దలంతా వారి చిన్నారులకు నీతి కథలు నేర్పిస్తూ, వారిని మిగిలిన పిల్లలకు చెప్పేలా ప్రోత్సహిస్తూ చిన్నారుల ఉజ్వల భవిష్యత్‌కు చేయందించాలి. తద్వారా సృజనాత్మక, మానవీయ సమాజానికి పాదులు చేయాలి.

రఘుపతిరావు గడప

 బేలను చుసిన మగండు ఏమని అనకున్ 

కాలము తీరిన పడంతి ఏడ్పుయు మనియెన్

సీలము కోరిన మగండు తెల్పక తెలిపెన్ 

పాలును చూచిన పడంతి  బావురు మనియెన్....

 

 ఆలన లేకయు మగండు లేకయు మనిషై 

ఏలను బత్కును ముగించు కోకయు జలమై 

కాలము బట్టియు ఆడించు దైవము తెలిపెన్ 

పాలును చూచిన పడంతి  బావురు మనియెన్...

 

 గాలము వేసిన మనస్సు ఏమియు చెయకే 

వేళను తృప్తియు మనస్సు కిచ్చియు బతికే

ఏలన  ఆశల మనస్సు బిడ్డ కనకయే  

పాలును చూచిన పడంతి  బావురు మనియెన్.

 

 ఆలికి శాపము తెగించు వేషము సలిపే 

వేలకు తిండియు లెనందు బిడ్డను నలిపే 

పాలకు పాపము తలంచి కోపము తెలిపే 

పాలును చూచిన పడంతి  బావురు మనియెన్.

 


 

సీసము.. కరోణా


నిరుడు లేనిదనేది నేడు చెప్పిన ఏది

మారదు బ్రతుకులో మార్పు రాదు

మనుజలెందరొ నేడు మాయకు చిక్కేను

నెరుగని మాటలు నేడు చిక్కె

ఉడుధుడు కడుగులు ఊట బావులగును

తలపులేని తలము తైల మవ్వు

కాలమందు ను నేడు కాలిపోవు బతుకు

గాలికూడాలేని కాల మయ్యె


వన్నెచిన్నల బ్రతుకులో కష్టాలు వేగమయ్యె

అన్న మన్నది లేకయే బాధలు అల్ప మాయే

చిన్న దన్నది రోగము పెద్దదై చలువ చేయు

మోన మన్నది జనులలో సేవలు మాయ లగును


విధేయుడు మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


--(())--

 సాహిత్యం (2): ऊँ!

-----

"సీ.

-----

స్వర్ణగిరినిఁబోలు శంకరతేజుఁడు

    సూర్యశిష్యుండును శ్రుతినిధియును

అర్ణవలంఘనహనుమంతవీరుఁడు

      సీతమ్మ సన్నిధిఁ జేరెనంత

పూర్ణవిజ్ఞానియు భూరిదేహమువాఁడు

     లంకనుదహియించె గొంకులేక

దుర్ణ( / ర్న ) యదనుజులదునుమాడెదురములో

    రామాజ్ఞఁబాటించి రహినినొసఁగె..

గీ.

--

భావిధాతయు నవవిధభాగ్యదాత

అష్టసిద్ధులమూలుఁడు కష్టహంత

భయదశక్తిసంహరణుఁడు జయవరదుఁడు !

అట్టి సుందరు భజియింతు హర్షహృదిని !!! "

------------

 ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.

క్యాషియర్ ఆమె బ్యాగు లో

ఒక టీవీ రిమోట్ గమనించాడు.

అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..

"మీరు ఏప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?" అని.

ఆమె "లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే.. ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా..."

అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.


#నీతి : మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి ..!

#కథ ఇంతటితో అయిపోలేదు ..!

క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు. 

ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది ..!

"ఏమైంది..!!??" అని క్యాషియర్ని అడిగింది.

అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు...”

#నీతి : మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.

#కథ కొనసాగుతుంది ..!

భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.

 #నీతి : మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..!

#కథ ఇంకా అయిపోలేదు ..!

స్వైప్ చేసిన తర్వాత, ఆ యంత్రం, 

"మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి" అని సూచించింది ..!

 #నీతి : ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత కూడా రక్షిస్తుంది ‌..!

#కథ_కొనసా....గుతుంది ..!

ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను  బయటకు తీసింది.

అది తన భర్త ఫోన్.

ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.

ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసిగించకుండా ఉండేందుకు. చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. 

#నీతి : ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు ..! 

#కథ_కొనసాగుతుంది ..!

ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట ఆమెకు తన భర్త కారు కనిపించ లేదు.

ఒక నోట్ తలుపు మీద అతికించబడి  ఉంది.

అందులో ఇలా రాసి ఉంది ..!

"రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యి ..! అని ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు

#నీతి : మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. 😋😂😆😉😁

#తెలివి_ప్రతిభ_అనేది_ఇకరి_సొత్తు_కాదు 🙈🙈🙈

శుభోదయం ఫ్రెండ్స్..... 😊💐

 రమణుల మహాసమాధి చిత్రాలు(#అరుణాచల శ్రీ  #రమణ_మహర్షి వారు)

1950, ఏప్రియల్ 14, శ్రీ వికృతి నామ సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి నాడు భగవాన్ రమణ మహర్షి భౌతిక దేహాన్ని విడిచి అరుణాచలేశ్వరునిలో ఐక్యమయ్యారు. చైత్ర బహుళ త్రయోదశి, భగవాన్ రమణులు మహాసమాధి చెందిన రోజు, ఆ సందర్భంగా ఉదయం రమాణాశ్రమంలో భగవాన్ ఆరాధానోత్సవాలు నిర్వహిస్తారు.


మహాసమాధి చెందేనాటికి రమణుల దేహం చాలా బలహీనపడింది. అసలు లేవలేకపోయింది. ఆహారం కూడా స్వీకరించలేదు. రాత్రి 8 గంటలకు, తమని కూర్చోబెట్టమని రమణులు అన్నారు. (కూర్చోబెట్టడమంటే దిండుని ఆనుకుని కూర్చోవడమే. శరీరం సహకరించలేదు). మూతపడి ఉన్న కుడి కన్ను నుంచి చెంపైపైకి ఎందుచేతనో నీళ్ళు ధారగా కారసాగాయి. పక్కనే ఉన్న స్వామి సత్యానంద వాటిని తుడుస్తూ ఉన్నారు. భగవాన్ నోటి నుంచి కూడా ఊపిరి గ్రహించటం కష్టంగా ఉంది. ఇంతలో హాలులో కూర్చున్న జనం 'అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలా' అంటూ పాడసాగారు. ఆ నామం వినగానే స్వామి ముఖం దివ్యంగా వెలిగిపోయింది. (తన తండ్రి అరుణాచలేశ్వరుని వద్దకు వెళ్ళిపోతున్నానే ఆనందం ఏమో!) ఇంతలో ఆకాశంలో ఒక దివ్యమైన, ప్రకాశవంతమైన కాంతి పుంజం అద్భుతకాంతులు విరజుమ్ముతూ ఆ చోట (ఆ ఆశ్రమం నుంచే) నుంచి పైకి లేచి, ఈశాన్యం దిశగా అరుణాచాల శిఖరం దిశగా పయనించి వెళ్ళిపోయింది. దీన్ని దేశదేశాల ప్రజలు దర్శించారు. అదే సమయంలో 8-47 నిమిషాలకు (రాత్రి) భగవాన్ దేహం శ్వాస తీసుకోవడం ఆపేసింది. అరుణాచలేశ్వరుడు వెలిగించి జ్ఞానజ్యోతి (భగవాన్ రమణులు) తన సహజ రూపంలో (జ్యోతి రూపంలో) జనులందరూ చూస్తుండగా, వెళ్ళి అరుణాచలేశ్వరునిలో ఐక్యమయ్యారు. అవధూత, అవతారమూర్తి, జీవన్ముత్కుడు, దక్షిణామూర్తి స్వరూపమైన రమణులు భౌతిక దేహాన్ని విసిరివేశారు.


రమణుల మహాసమాధి చిత్రాలను ఫోటో తీసింది హెర్ని కార్టిర్ (1908-2004), ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫోటొగ్రాఫర్, ఆధునిక ఫోటోజనర్లిజం పితామహుడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈయన రమణుల మహాసమాధికి ముందు ఏప్రియల్ 1950 లో అరుణాచలం వచ్చారు. ఆయనే ఈ చిత్రాలను తీసు భద్రపరిచారు. ఈ సృష్టిలో ఏదీ కాకతాళీయం ఉండదు. కార్యముంటే కారణముంటుందని వేదాంతం ప్రకటించింది. బహుసా రమణులే ఈ సమయానికి వీరిని ఇలా ఇక్కడకు రప్పించి, మనలాంటి వారిని అనుగ్రహించడానికి ఈ కార్యం జరిపించారేమో!


ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🙏🙏🙏🙏🙏

[14/04, 10:04 pm] Kant's Rso: *తప్పక చదవండి*🙏

*కోవిడ్ సెకండ్ వేవ్ చాలా తీవ్ర స్ధాయిలో ఉంది*. 

పాజిటివ్ ఉన్నవారికి సిటిలో ఏ పేరున్న కార్పొరేట్ ఆసుపత్రిలోనూ బెడ్ దొరకటానికి కనీసం రెండు మూడు రోజుల వ్యవధి తీసుకుంటూ ఉంది. పరిస్ధితి తీవ్రంగా ఉంది కాబట్టి ప్రభుత్వాలు  పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగులన్నీ కాన్సిల్ చేస్తున్నాయి. న్యూజిలాండ్ ఇండియాను రెడ్ జోన్ గా డిక్లేర్ చేసి రాకపోకలు నిషేధించింది. ప్రస్తుతం ఎవరికి వారు శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి లో‌ మనం ఉన్నాము. దయచేసి, దిగువ తెలిపిన విషయాలను దృష్టిలో పెట్టుకోండి.

1. సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా బలంగా ఉంది. తేలిగ్గా తీసుకోవడానికి లేదు. మాస్క్, సానిటైజర్ తప్పనిసరిగా వాడండి.

2. ఏ పబ్లిక్ ఫంక్షన్స్ కూ వెళ్లకండి, కోవిడ్ చాలా తీవ్రస్థాయిలో ఉంది హైదరాబాదులో, మిగతా చోట్లానూ. పండుగలూ, ప్రయాణాలు మానుకోండి.

3. గొంతునొప్పి, సడన్ గా గొంతు పట్టేసినట్టు ఉండడం, తలనొప్పి,  స్వల్ప జ్వరం, పొడిదగ్గు, జలుబు... దేన్నీ అలక్ష్యం చెయ్యకండి. వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోండి. డాక్టర్ల సలహాతో వైద్యం మొదలు పెట్టండి, జాగ్రత్తగా ఇంట్లో ఒక గదిలో ఉంటూ, మందులు వాడుతూ, మీ‌కుటుంబ సభ్యుల స్ధితిగతులను కూడా గమనిస్తూ ఉండండి.

4. కోవిడ్ ఎలాంటి వ్యాధంటే, దీనికి నాలుగైదు రోజులు అవకాశమిస్తే, ఇది మీ ఊపిరితిత్తులను పాడుచేస్తుంది. ముఖ్యంగా షుగర్, బిపి ఉన్నవారు జ్వరమే కదా అని తాత్సారం చెయ్యవద్దు. అది ప్రాణాంతకంగా మారవచ్చు. క్వారంటైన్ చేస్తారేమో, ఫ్లాట్స్ వారు ఏమైనా అంటారేమో అన్న భయాలొద్దు. సంకోచాల కంటే జీవితాలు చాలా ముఖ్యం.

5.పాజిటివ్ ఉన్నవారు పల్స్ ఆక్సీమీటర్ తో మీ ఆక్సిజన్ లెవెల్స్ ను నిరంతరం మానిటర్ చేసుకోండి. 93% కు తగ్గితే హాస్పిటల్ కు వెళ్లడం తప్పనిసరి‌. 

6. మీ ఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే, మిగతా వారిని చుట్టాలు, ఫ్రెండ్స్ ఇళ్లకు పంపకండి, మీ ఇంటికి అలా ఎవరినీ రానివ్వకండి.సున్నితంగా వారించండి.

7. వీలున్నంత వరకు బయటకు వెళ్లడం, తగ్గించాలి. పాజిటివ్ ఉన్నవారు ఎంత అత్యవసరమైన పనులున్నా బయటకు వెళ్లకుండా ఐసొలేషన్ లో ఉండడం మంచిది.మిగిలిన కుటుంబ సభ్యలు క్వారంటైన్లో ఉండాలి. మొదటిరోజు నుంచి శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా ఫలితం వాటి ఉంది.

8. టీకాలు వేయించుకున్నా కోవిడ్ రాదన్న గారెంటి లేదు, వారికీ వస్తోంది.‌ ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గినా తిరిగి రాదన్న నమ్మకం లేదు. ఇన్ఫెక్షన్ బలంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ వచ్చినా పానిక్ అవకండి, ధైర్యంగా సానుకూల దృక్పథంతో ఉండండి.

9. ట్రీట్ మెంట్ కి ఏ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లినా ఐదు నుంచి పది లక్షల కన్నా తక్కువ కావట్లేదు. ఎంత  డబ్బు, పరపతి ఉన్నా తీవ్రత పెరిగేదాకా ఉంటే ఉపయోగం లేదు.

10. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవసరాలేవో, అత్యవసరాలేవో నిర్ధారించుకుని  తప్పనిసరి అయితే తప్ప ఇల్లు కదలకపోవడం మంచిది. 

*ఇవన్నీ మిమ్మల్ని అలర్ట్ చెయ్యాలని , మీ భద్రత కోసం చెబుతున్నవి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశ వదిలేసుకుని,* *మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ప్రస్తుత పరిస్ధితుల్లో మీ కర్తవ్యం!*

 కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్, బెంగళూరు:

వడివేల్ - వెణ్ పొంగల్

చాలా సంవత్సరాల క్రితం తిరుత్తణి కొండపై బైరవ సుబ్రమణ్య అయ్యర్ ప్రసాదం దుకాణం నిర్వహించేవారు. ఆ దుకాణంలో పనిచేసేవాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణి. విపరీతమైన పని వల్ల నాకు ఒకసారి జ్వరం వచ్చింది. సమయం గడుస్తున్న కొద్దీ జ్వరం చాలా ఎక్కువ అయ్యింది. రాత్రి పదింటికి ఇంటికి చేరుకోగలను అనుకుని చిన్నగా మెట్లు దిగడం మొదలుపెట్టాను. నిదానంగా నడుస్తూ అక్కడక్కడ కూర్చుంటూ ఎలాగైతేనేమి చివరి మెట్టు వద్దకు వచ్చాను.

దేవాలయ పుష్కరిణి వద్ద ఒక మేనా నిలిపి ఉండడం గమనించాను. ఆ వైపు నుండి ఒక వ్యక్తి నాకేసి వస్తున్నాడు. అతను నన్ను “కొండపై నుండి వస్తున్నరా?” అని అడిగాడు. నేను అవునన్నాను. సరే నాతో రండి అని మేనావద్దకు తీసుకునివెళ్ళాడు. నేని కొద్దిగా మేనాలోపలికి తొంగిచూసాను. పరమ శాంత స్వరూపంతో మహాస్వామివారు నాకు దర్శనమిచ్చారు. నన్ను నేను మరచిపోయి భక్తితో చేతులు జోడించి నిలబడిపోయాను. 

“నీవు కొండపైనుండి వచ్చావా? దేవాలయం తెరిచి ఉన్నదా?” అని అమహాస్వామి వారు అడిగారు. చాలా వినయంతో “దేవాలయం మూసివేసారు స్వామి” అని బదులిచ్చాను. “అక్కడ ప్రసాదాల దుకాణం ఉన్నదా?” అని అడిగారు. నేను “అది కూడా మూసివేసారు” అని చెప్పగా వారు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత మహాస్వామి వారు నాతో, “నన్ను మోసిన వీరందరూ ఆకలిగా ఉన్నారు. వారికి పుత్తూరులోను, నగరిలోను అహారం దొరకలేదు. నేను వారికి తిరుత్తణిలో ఖచ్చితంగా ఆహారం దొరుకుతుంది అని చెప్పాను. ఇక్కడికి రాగానే పుష్కరిణి గట్లపై ఉన్న హోటళ్లలో కూడా వారికి ఆహారం దొరకలేదు” అని మహాస్వామివారు చెప్పగా నాకు ఏమి చేయాలో తోచలేదు.

నేను జ్వరంతో బాధపడుతున్నప్పటికి దీని గురించి తరువాత అలోచిద్దాం అనుకుని స్వామివారితో, “మహాస్వామివారు ఆజ్ఞాపిస్తే నేనే స్వయంగా వారికి ఆహారం తయారుచేస్తాను” అని చెప్పాను. స్వామివారు ఆశ్చర్యంతో “ఈ రాత్రప్పుడు నువ్వు ఏమి చెయ్యగలవు?” అని అడిగారు. ”నేను కొండపైనున్న ప్రసాదాల దుకాణంలో పనిచేస్తాను. వాళ్ళకోసం వెణ్ పొంగల్(వెన్న పొంగలి) తయారుచేస్తాను” అని చెప్పాను. మహాస్వామివారు ”అలా అయితే సరే. నేను మెట్లమార్గం గుండా కొండ ఎక్కుతాను. వాళ్ళని మామూలు మార్గం ద్వారా రమ్మని చెప్తాను. నువ్వు వెళ్ళి త్వరగా అహారం సిద్ధం చెయ్యి. వెళ్ళు!!”

స్వామివారు ఆ చివరి పదం “వెళ్ళు” అని అనగానే అప్పటిదాకా ఉన్న జ్వరం, అలసట మాయమయ్యాయి. ఎక్కడాలేని ఉత్సాహం వచ్చేసింది. ఏదో పరుగుపందెంలో పాల్గొంటున్న వాడిలా ఒక్క ఉదుటున వెళ్ళి పైకి చేరుకున్నాను. ఆరోజు మా యజమాని లేరు. నేను విషయమంతా వారి భార్యకు చెప్పాను. ఆ సాధ్వి నాతో, “నువ్వు కిందకు వెళ్ళినది డాక్టరుకు చూపించుకోవాడానికే కదా! ఆ వైద్యనాథుడే నీ జ్వరాన్ని పోగొట్టి నీకు అనుజ్ఞ ఇచ్చిన తరువాత నన్ను అడగడం దేనికి? ఇది మనందరి ఉన్నతి కొరకు జరిగిన సంఘటన. నువ్వు సంతోషంగా వెళ్ళి ఆహారం తయారుచెయ్యి” అని చెప్పారు. వెంటనే నేను పొయ్యి వెలిగించి ఆహారం తయారు చెయ్యడం మొదలుపెట్టాను. అక్కడ పడుకొని ఉన్న అతణ్ణి లేపి ఆహారం, చెక్క తెడ్డు, తినడానికి మందార ఆకులు, పొంగల్ లో నంచుకోవడానికి పులికైచల్ (చింతపండు పులుసు) తీసుకుని వెళ్ళడానికి సహాయం తీసుకుని దేవాలయ ధ్వజస్థంభం దగ్గరకు వెళ్ళాము. 

కొన్ని నిముషాల తరువాత పరమాచార్య స్వామివారు వచ్చారు. మొత్తం దేవాలయ ప్రాకారాలు అన్ని విద్యుత్ వెలుగులతో నిండిపోయాయి. మేళతాళాల మధ్య పూర్ణకుంభంతో దేవస్థానం అధికారి కృష్ణ రెడ్డియార్, ఆలయ పరిపాలనాధికారి కులశేఖర నాయుడు, ఆలయ ఉద్యోగులు, పండితులు మహాస్వామివారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారు చుట్టూ చూసారు. నేను వెళ్ళి వారిముందు చేతులు కట్టుకుని నిలబడ్డాను. 

స్వామివారు “ఆహారం తయారు అయ్యిందా?” అని అడిగారు. నేను, “తయారు చేసి ఇక్కడకు తీసుకుని వచ్చాను” అని బదులిచ్చాను. “సరే నువ్వు వీరికి వడ్డించిన తరువాత లోపలికి రా” అని అన్నారు. నేను మేనా మోసే బోయీలను కూర్చోమని చెప్పి ఆకుల్లో వేడి వెణ్ పొంగలి వడ్డించాను. “ఇది మీకోసమే తయారుచేశాను. నంచుకోవడానికి పులికైచల్ కూడా ఉంది. కడుపునిండుగా తినండి. నేను ఆలయంలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటాను” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను. 

పరమాచార్య స్వామివారు గర్భాలయం వద్ద నిలబడి ఉన్నారు. నేను వారిని దర్శించగనే కళ్ళు నులుముకుని తేరిపారగా చూసాను తనిగైమలై మురుగన్ ఎవరు పరమాచార్య స్వామి ఎవరు అని నిర్ధారించుకోవడానికి. మహాస్వామిని అలా దైవగురువు, జగద్గురువుగా చూడడంతో కళ్ళ నీరు ఆపుకోలేకపోయాను. దర్శనానంతరం స్వామివారు బయటకు వచ్చారు. 

నేను వెళ్ళి వారి ఎదురుగా చేతులుకట్టుకుని నిలబడ్డాను. స్వామివారు నాతో, “వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు రుచిగా బాగా చేశావు. వాళ్ల కడుపు నింపావు” అని అన్నారు. నేను స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసాను. నన్ను చెయ్యెత్తి ఆశీర్వదించారు స్వామివారు. 

”ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రామనామం జపించు” అని చెప్పి నన్ను ఆశీర్వదించినప్పుడు సమయం రాత్రి ఒంటి గంట అయ్యింది.

--- యస్. బలరామ రావు, మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

 #కంచిపరమాచార్యవైభవం

*శుభోదయం*

 -------------------

🌻 *మహానీయుని మాట*🍁

        -------------------------

"మర్యాదగా వినడం,

వివేకంతో సమాధానమివ్వడం,

ప్రశాంతంగా ఆలోచించడం,

నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం

ప్రతి మనిషికీ అవసరం."

       --------------------------

🌹 *నేటీ మంచి మాట* 🌼

      ---------------------------

"ప్రతి చిన్నపనిలో కూడా శ్రద్ధ అలవడితే జీవితమే మధురంగా మారిపోతుంది.

అలాగే మరొకరి వస్తువును ఆశించే లక్షణం తగ్గితే మనసులో స్వార్ధం దూరమవుతుంది."


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

[12/04, 4:43 pm] Sriram: *ఆరు రుచులు ఆరోగ్య రహస్యం* 🌺


ఉగాది అనగానే గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. జీవితంలోని ఆనంద, విషాదాలకు చిహ్నంగా పేర్కొనే ఉగాది పచ్చడికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిలోని షడ్రుచులన్నీ ఆరోగ్యదాయినులని ఆయుర్వేదం చెబుతున్నది. వేపపూవు, బెల్లం, చింతపండు, నెయ్యి, మిరియాలు, లవణ రుచులతో కూడిన ఉగాది పచ్చడి సమతులాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.

మన నాలుక గ్రహించగలిగే ఆరు రుచులను షడ్రుచులు అంటారు. అవి మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు (కారం), తీక్తం (చేదు), కషాయం (వగరు). ఆరోగ్యపరంగా ఒక్కొక్క రుచికి రకరకాల అనారోగ్యాలను హరించే గుణాలున్నాయి.

ఉగాది పచ్చడిలో ఆరోగ్యం..

వేప పూవు ఉగాది పచ్చడిలోని ప్రధాన ద్రవ్యం. దీనికి అనుబంధంగా బెల్లం తదితర రుచులను కలుపుతారు. అవి అందించే ఆరోగ్యం ఏంటో చూద్దాం.


🌸 *తీపి* 🌸


వాత, పిత్త హరిణి. తీపి శరీరానికి అవసరమైన బలాన్ని అందించి పోషిస్తుంది. తల్లి పాలను వృద్ధిపరుస్తుంది. దప్పిక, మూర్ఛలను తగ్గిస్తుంది. మంటలనుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది.


🌺 *పులుపు* 🌺


వాతాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. గుండెకు మేలు చేసే పులుపు పంచేంద్రియాలను పరిపుష్టం చేస్తుంది. శుక్రాన్ని తగ్గిస్తుంది. రుచి కోల్పోయిన నాలుకను ఉత్తేజితం చెందిస్తుంది.


🌸 *ఉప్పు* 🌸


వాతహరిణి. మలబద్ధకాన్ని నివారించి ఆకలిని పెంపొందిస్తుంది. కఫాన్ని, కంటి ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. శుక్రనాశకంగా పనిచేస్తుంది.


🌺 *కారం* 🌺


ద్రవరూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగుల్లోని పురుగులను చంపి ఆకలిని పెంచుతుంది. రుచిని పుట్టిస్తుంది. దురదలను తగ్గిస్తుంది. కాని ఎక్కువగా తీసుకుంటే రస రక్తాది ధాతువులు దెబ్బతింటాయి.


🌸 *చేదు* 🌸


కఫహారం, పిత్తాహారం, క్రిమిహారం, జ్వరహారం. విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. తల్లిపాలలోని దోషాలను తగ్గిస్తుంది. దప్పికను, దురదలను, మంటలను పోగొడుతుంది. చర్మవ్యాధులనుంచి ఉపశమనం కలిగిస్తుంది.


🌺 *వగరు* 🌺


శేలష్మ, రక్త, పిత్తాల బాధను తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది. అధిక స్రావాలను ఆపుతుంది. ఎక్కువగా తీసుకుంటే మాత్రం శుక్రకణాలను నష్టపరుస్తుంది.


🔻 *బెల్లం (తీపి):* జిడ్డు లక్షణం కలిగిన బెల్లం వాతాన్ని తగ్గించి శరీరానికి బలాన్నిస్తుంది. వీర్యవృద్ధి కలిగిస్తుంది.


🔻 *కొత్త చింతపండు (పులుపు):* తేలికగా ఉండే చింతపండు కూడా వాతాన్ని తగ్గిస్తుంది. విరేచనకారకం, వాపును ఐక్యం చేస్తుంది.


🔻 *ఉప్పు:* కఫహారం, విషాహారం, మలమూత్రాలలో ఇబ్బందులను తొలగిస్తుంది.


🔻 *మిరియాలు (కారం):* కఫవాతహారం, ఆకలిని పెంచుతుంది. శుక్రకణ నాశిని.


🔻 *వేపపూవు (చేదు):* కఫ పిత్తాదులను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దగ్గు, వ్రణాలు, జ్వరానికి చాలా మంచిది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది.


🔻 *పచ్చిమామిడి (వగరు):* కషాయరసం కలిగినది. విరేచనాలను తగ్గిస్తుంది. బహుమూత్రత్వాన్ని నిరోధిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.


ఆరోగ్యపరంగా ఇన్ని రకాలుగా ప్రయోజనకారి అయిన ఉగాది పచ్చడి మన సంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా చెప్పవచ్చు. ఈ పచ్చడిని ఇష్టంగా ఆరగించి, నూతన సంవత్సరంతోపాటు నూతనోత్తేజాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం.


🍲 *ఉగాది పచ్చడి తయారీ విధానం...!*🍲


ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం. 

 

బ్రహ్మ దేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. "ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. అలాంటి ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం!

 

*ఉగాది పచ్చడికి కావల్సిన పదార్థాలు:*


వేపపువ్వు- తగినంత 

చిన్న చెరుకు ముక్క - 1 

చిన్న కొబ్బరి ముక్క -1

అరటిపళ్లు- 2

చింతపండు - తగినంత

చిన్న మామిడికాయ- 1

బెల్లం- 100 గ్రాములు

పచ్చి మిరపకాయ - 1

ఉప్పు- తగినంత

నీళ్లు - సరిపడా

 

*తయారీ విధానం:* 🍎🍍🍊

ముందుగా చెరుకు, కొబ్బరి, బెల్లం, మిర్చి, మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని పెట్టుకోవాలి. వేప పువ్వును శుభ్రంగా కడిగి రేకుల్నితీసి పెట్టుకోవాలి. తగినన్నినీళ్లలో చింతపండును బాగా కలిపి వడకట్టిన పులుపు నీళ్లను చిన్న కొత్త కుండలోకి పోయాలి. అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, చెరకు, కొబ్బరి, మిర్చి, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా అరటిపండు ముక్కలు వేయాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ.


🌴🎋🌿 🍃🌾🍃 🌿🎋🌴

[12/04, 4:44 pm] Sriram: 🙏🙏🙏🙏🙏

🌼🌼🌼🌼🌼

శివలింగం గురించి వివరణ ఇవ్వండి?


శివుడిని మనం అనేక రూపాల్లో ఆరాధన చేస్తాం .ఏ దేవతారాదనైనా శాస్త్రం రెండు రకాలుగా విభజించింది.సాకార రూపం ,నిరాకార రూపం అని.సాకారము కానీ,నిరాకారము కానీ ఏకైక స్వరూపం శివ లింగం.అందుకే శివ లింగాన్ని అరూప రూపి లేదా అవ్యక్త వ్యక్తం అన్నారు.శివ అనగా శాంతము(ఇంకా అనేక అర్థాలున్నాయ్ మంగలం, చతుర్దమ్,తాప ఉపశమనం,etc).లింగం అనగా గుర్తు.

శివ లిగం అంటే శాంతికి,మంగలమునకు గుర్తు.

శివ లింగం ఈ సకల సృష్టి కి గుర్తు.అందుకే లింగానికి అభిషేక సమయంలో పఠించే రుద్రాధ్యాయా నికి ముందు ""ఆపాతల నభాస్థలాన్త్ భువన బ్రహ్మాండ మావి స్ఫురత్

జ్యోతి స్పాటిక లింగ""అన్నారు.పాతలం నుండి ఆకాశం వరకు వ్యాపించివున్న జ్యోతి లింగాన్ని ధ్యానం చేస్తాము.అంటే ఈ సర్వ సృష్టి కి గుర్తు లింగం.అందుకే ఈ సృష్టిలో ఏదైనా లింగాకారంగా ఉంటుంది.భూమి,సూర్యుడు,చంద్రుడు,గ్రహాలు,వాటి కక్షలు,పాలపుంతలు,block hole కి ఆకారం కనుక్కుంటే అది,సమస్త సృష్టి లింగాకారంగానే ఉంటుంది.ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే మనలో వుండే జీవుడు కూడా లింగాకారంగా నే ఉంటాడు."అదో నిష్ట్యా వితస్థాన్తి నాభ్య ముపరి తిష్ఠతి జ్వాల మాలకులంబాతి".మన నాభి దగ్గర చిటకన వేలు పెట్టి జానెడు దూరం నాభి పై భాగాస్నా పెడితే మన బొటన వేలు ఎక్కడ తాకుతూ వుంతుందో అక్కడే వడ్ల గింజ కోన భాగంలో 10 వ వంతు , అంత చిన్నగా  జీవుడు దీపం రూపంలో  ఉంటాడు అని వేదం.ఆ జీవుడు కూడా లింగకారియే ఎందుకంటే దీపం లా అని చెప్పింది వేదం క్కబట్టి దీపం ఏ ఆకారంలో వెలుగుతుంది లింగాకారం.i.e jevudu కూడా లింగమే అందుకే వీర శైవ సంప్రదాయంలో అక్కడ (జీవుడు వుండే స్థానంలో)లింగం తాకే లాగా మెడలో వేసుకుంటారు.అలా వేసుకుంటే వారు శివమయం అయ్యారు అని గుర్తు.


శివలింగం అని మాములు గా అంటున్నాం కానీ ఇందులో మూడు భాగాలు నిక్షిప్తం అయి ఉన్నాయి అవి బ్రహ్మ పీఠం,పానవట్టం, లింగము అని.బ్రహ్మ పీఠం అనగా పానవట్టం నిలపడానికి ఉంచే పీఠం.లింగ రూపాన్ని బట్టి (మనకు చాలా రకాలైన లింగాలు ఉన్నాయి)దీనిని బయటకు గాని,లోపలికి గాని ఉంచటం జరుగుతుంది.ఉదహణకు సహస్ర లింగాన్ని పెడితే బ్రహ్మ పీఠం బయటకు ఉండాలి,ఉమ మహేశ్వర లింగం ,నగరేశ్వర లింగం అయితే బ్రహ్మ పీఠం లోపలికి ఉంటుంది.ఈ శివలింగం పెట్టె పీఠం బ్రహ్మకు ప్రతీక.

పానవట్టం విష్ణువు స్వరూపం అని చెప్తారు.కాబట్టే పరమ శివ భక్తుడు విష్ణు ద్వేషి అయిన రావణుడు విష్ణు స్వరూపమైన పానవట్టం లేకుండా ఆరాధన చేసేవాడు అని పురాణోక్తి.ఇప్పటికి కొన్ని పూర్వ వీర శైవ దేవాలయాలు చూస్తే పానవట్టం ఉండదు.ఇకపోతే లింగం సాక్షాత్ గా పరమ శివ స్వరూపం.అంటే మనం శివలింగం అంటే పరమేశ్వరుడు అని ఆరాధన చేస్తున్నాం కానీ ఇందులో బ్రహ్మ ,విష్ణు,మహేశ్వర ఆరాధన జరుగుతుంది.ఏ పూజలోనైన(అర్చకుడు బ్రహ్మ,శివార్చన ఐతే చేసేవాడు విష్ణువు,విష్ణూవు అర్చన అయితే చేసేవాడు శివుడు),ఏ గ్రంధములలో నైనా(రామాయణంలో చూస్తే రాముడు విష్ణువు,హనుమ శివుడు,జాంబవంతుడు బ్రహ్మ),వీరు ముగ్గురు లేకుండా వుండరు.


శివలింగం యొక్క ఇంకొక రహస్యం లింగం పరమేశ్వరుడు,పానవట్టం అమ్మవారు ఇద్దరి కలయిక శివలింగం.అనగా ప్రకృతి పురుషుల కలయిక.


శివలింగంలో లింగం  పదార్థం నకు.పానవట్టం శక్తి కి గుర్తు .పదార్థం శక్తి కలయిక శివలింగం.అంటే సృష్టి మొత్తం పదార్థం (matter)శక్తి(స్థితి శక్తి,గతి శక్తి)(energy)కలయిక.


ఇలా అనేక నిర్వచనాలు ఉన్నాయి.కానీ ఇప్పటికి ఇవి తెలుసుకున్నాం వీటిని బాగా ఆలోచన(తత్వం ఆలోచనామృతం) చేయండి ,ధ్యానం చేయండి ఇంకా అనేకమైన శాస్త్రీయవిషయాలు మీకు  తెలుస్తాయి అన్నింటిని ఇక్కడ పెట్టడం కష్టం.


శివలింగ నిర్మాణం:

శివ లింగ నిర్మాణము ను బట్టి అది ఏ లింగమో చెబుతారు. దాదాపు గా సామాన్య మునుష్యులు(తప శక్తి లేని వారు) ప్రతిష్ట చేసే లింగాలకు బ్రహ్మ పీఠం, పానవట్టం ,లింగం ఒకే ఎత్తులో ఉంటాయ్.

కానీ ఆగమాల్లో ఆ లింగ నిర్మాణాన్ని బట్టి ఆ లింగం ధ్యాన లింగమో, రుద్ర లింగమో,అఘోర లింగమో, అభయ లింగమో(నిల్చినీ అభయహస్తం ఇచ్చే లింగమో),భోగ లింగమో,..నిర్ణయం చేస్తారు.కొన్ని చోట్ల లింగము పానవట్టం కంటే రెండింతలు ఉంటుంది దానిని జ్ఞాన లింగంగా చెప్తారు ఇలా అనేక లింగాలు ఉన్నాయి.మీరు ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్ళినపుడు ఉన్న అనేక లింగాలు గమనించండి.వాటి పేర్లు రాసుకోండి మీకు ఒక అవగాహన వస్తుంది.

ఇవి కాక చేసిన పాపముల ప్రాయశ్చిత్తమునకు ఏవేవీ ఎంత పరిమాణంలో ఉన్న లింగాలను ప్రతిష్ట చేయాలో చెబుతారు.ఇలా అనేక లింగముల నిర్మాణాన్ని శిల్పశాస్త్రం,ఆగమ శాస్త్రాలు నిర్ణయం చేస్తాయి.

ఇవి కాక పంచ భూత లింగలు(పృథ్వీ, జల,వాయు,ఆకాశ, అగ్ని లింగాలు) అని ఉన్నాయి.మాములుగా ఎత్తుగా గుండ్రంగా వుండే లింగాకారం  ,వెడల్పుగా ముక్కోణాకారంగా,పంచకోణాకారంగా,అష్ట కొనాకారంగా ,భగకారంగ(యోని అకృతిలో) అవి పంచ భూత లింగాలు.వీటిని శ్రీశైల దేవాలయం వెనుక భాగాన,శ్రీకాళహస్తి లో చూడవచ్చూ.ఇవి కాక ఇంకా 12 రకాల లింగాలు ఉన్నాయి సహస్ర లింగం,బాణా లింగం వంటివి యెన్నో ఉన్నాయి.

ఈ లింగకార నిర్మాణం అనేది గొప్ప శాస్త్రం మరియు వీటిని తప శక్తి  ద్వారా అర్థం చేసుకోగలం.

వీటి నిర్మాణం ఇలాగే ఎందుకు జరగాలి అనే దానికి కూడా శాస్త్రం సమాధానం చెబుతుంది.మనకు ఆ శాస్త్రీయ దృష్టి లేక తెలుసుకోలేక పోతున్నాము.


సరే శివ లింగ తత్వం, శివ లింగ నిర్మాణం ఎలా వున్నా మనం శివలింగారాధన ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి.ఇక్కడ ఆరాధన మొత్తం చెప్పకున్న ఆరాధనలో వచ్చే లోపాలు మాత్రం వివరిస్తాను.

1.ఇతర దేవతారధనకు లింగారాధనకు ప్రధాన బేధం ఉంది ఇతర ఆరాధన ల వల్ల సాలోక్య(ఎవరిని ఆరాధన చేస్తే వారి లోకం ప్రాప్తించటం ex:విష్ణువు-వైకుంఠం,కృష్ణుడు@రాధ-గోలోకం,సాకార శివుడు- కైలాసం),సారూప్య(ఎవరిని ఆరాధన చేస్తే వారి వంటి వేషం),సామీప్య( ఎవరిని ఆరాధన చేస్తే వారితో కలిసి దగ్గర గా తిరిగే అదృష్టం) స్థితులు లభిస్తాయి.కానీ లింగారాధన చేస్తే సాక్షాత్తుగా తానే శివుడు అవుతాడు .అంతే కాదు ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే శివుడు కానీ వాడు శివుణ్ణి అర్చన చేయలేడు. వాడిలో శివ తేజస్సు ఉంటేనే , వాడు శివార్చన చేయగలడు అని శాస్త్రం"న రుద్రో రద్రమర్చయేత్".

అందుకే మన శాస్త్రం శివార్చన చేసే వారికి నియమోల్లంఘనాన్ని అంగీకరించింది.అంటే మన సంప్రదాయంలో ""కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ:"" అని సన్యాసి కనిపిస్తే ఎవరైనా నమస్కరించవలసిందే అని కానీ శామ్భవ దీక్షలు ,పాశుపత దీక్షలో ఉండి నిరంతర శివార్చన ,శివాభిషేకం చేసే వారు సన్యాసులకు నమస్కారం చేయరు.ఎందుకంటే వారు శివుడే అయి వుంటారు కాబట్టి.


2. మొదట పానవట్టం నకు పూజ చేసిన తర్వాతనే లింగ పూజ చేయాలి


3. శివలింగాభిషేకం చేసేటప్పుడు ఒక్క లింగాన్ని పెట్టి అభిషేకం చేయవద్దు(సాలగ్రామం తో కలిపి అభిషేకం చేయవచ్చూ)


4. శివ లింగం పై ఒక మారేడు దలన్నాయిన,పువ్వునైన,గంధము నైనా పెట్టి మాత్రమే అభిషేకం ప్రారంభిచాలి.

5. అభిషేక జలములకు అమృత ముద్ర ,గరుడ ముద్ర చూపినప్పుడే ఆ జలములు అభిషేకమునకు పనికి వస్తాయి.


6. అభిషేక జలములను మహాన్యాసం కానీ,లఘు న్యాసం కానీ,అర్చకులు మాత్రమే తొక్కవచ్చూ .మిగతా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అభిషేక జలములకు గాని,ఈశ్వర నిర్మాల్యాన్ని గాని తొక్క కూడదు.


7.కనీసం లఘు న్యాసమైన చేసుకోకుండా శివ లింగాభిషేకం చేయకూడదు.


8. పంచామృత అభిషేకం లో ప్రతి ఒక్క పదార్థం తర్వాత శుద్ధ జలములతో అభిషేకం చేయాలి.


9.పానవట్టం నకు  కూడా అభిషేకం చేయాలి(కొందరు మొత్తం లింగం మీద మాత్రమే నీరు పోస్తారు.పానవట్టం పార్వతి అని గుర్తుంచుకోవాలి.


శివలింగం గూర్చి,శివ లింగ నిర్మాణం గురించి ఆగమాల్లో చాలా శాస్త్రీయంగా ,వైజ్ఞానికంగా చెప్పారు.వేదాలు ముఖ్యన్గా రుద్రము(నమక చమకం) శివ తత్వాన్ని వర్ణన చేశాయి.శివాభిషేకం అంటే ఏమిటి? ఎలా చేయాలి?రుద్రాధ్యాయ అంతరార్థం ఏమిటి?మనం తెలియక చేసే పొరపాట్లు ఏమిటి తర్వాత చూద్దాం.

ఇలా శివలింగ తత్వం గురుంచి ఎంతైనా చెప్పుకోవచ్చూ. ఎప్పుడైనా equipment సహకరిస్తే చక్కగా వీడియో చేసి పెడతాను.


శివోహం శివోహం శివోహం

🌼🌼🌼🌼🌼

🙏🙏🙏🙏🙏

 *అర 




చేతిలో ఐదు తీర్థాలు :*

*ైంైంైంైంైంైంైంై*



👉  అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది. ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.


👉  కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి, ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం అని అంటున్నాము. అలా నీటిని

'ఓమ్ కేశవాయస్వాహా, '

'ఓమ్ నారాయణాయస్వాహా, '

'ఓమ్ మాధవాయస్వాహా',

అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. 


👉  ఈ సందర్భంలోని ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.


👉  చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే బ్రహ్మతీర్థం అని అంటారు. 


👉  చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ, ప్రజాపతి తీర్థం అని అంటారు.


👉  అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని దాన్ని అగ్ని తీర్థం అని అంటారు. 


👉  చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు అని అంటారు.


👉  ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.


👉  ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.


👉  సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది. 


👉  పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం పితృతీర్థం అనబడుతున్నది.


👉 ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో...

[14/04, 6:25 am] +91 94917 74979: *బుధవారం గరుడునిని పూజిస్తే నాగదోషం పరార్..*




👉 బుధవారం గరుడాళ్వార్ పూజతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గరుడాళ్వార్ నారాయణ స్వామికి వాహనధారుడు. గరుడ దర్శనంతో సర్వమంగళాలు చేకూరుతాయి. అందుకే బుధవారం పూట గరుడాళ్వార్ను ఆలయంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆలయంలోనే కాకుండా.. ఇంట్లోనూ రోజూ గరుడాళ్వార్ను తలచి పూజ చేస్తే నాగ దోషాలు తొలగిపోతాయి.


👉 చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. వివాహం కాని కన్యలకు పెళ్లి అవుతుంది. సత్ సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పెరుమాళ్ల వారి సన్నిధికి వెళ్లే వారు ముందుగా గరుడుని దర్శించుకోవాలి. తర్వాతే స్వామిని దర్శించుకోవాలి. ఇది వైష్ణవ ఆగమ పద్ధతి. ఆలయంలో కుంభాభిషేకం జరిగేటప్పుడు గరుడాళ్వార్ ఆకాశంలో తిరగడం చేస్తేనే ఆ కుంభాభిషేకం సంపూర్ణం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.


 *గరుడాళ్వార్ దర్శనం:* ఆదివారం చేస్తే వ్యాధులు నయం అవుతాయి. సోమవారం దర్శించుకుంటే.. కుటుంబ సౌఖ్యం, మంగళవారం గరుడ దర్శనంతో ఆరోగ్యం చేకూరుతుంది. బుధవారం శత్రుభయం వుండదు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్రవారం గరుడ దర్శనంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శనివారం గరుడ దర్శనంతో మోక్షం లభిస్తుంది.

[16/04, 7:45 am] +91 94917 74979: *శ్రీ*

॰॰॰॰॰॰॰

*ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?*

>>>>>>> ॐ <<<<<<<


“శ్రీ”  లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. “శ్రీ” కారమున “శవర్ణ”, “రేఫ”, “ఈ” కారములు చేరి, “శ్రీ” అయినది. అందు “శవర్ణ” , “ఈ” కారములకు, “లక్ష్మీ దేవి” ఆధిదేవత, “రేపము” నకు, అగ్ని దేవుడు దేవత.

“శ్రియ మిచ్దేద్దు  తాశనాత్!” అను పురాణ వచనానుసారముగా “అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా “శ్రీ” లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు.

మరియు, “శ” వర్ణమునకు గ్రహము “గురుడు”, “రేఫ “ఈ” కరములకు గ్రహములు “గురుడు”, “శుక్రుడు” గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున “శ్రీ” శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.

నిఘంటువులో, “కమలా శ్రీర్హరి ప్రియా” అని ఉండటంతో, లక్ష్మీ నామలలో “శ్రీ” ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.

ఇన్ని విధాలుగా “శ్రీ” సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, “శ్రీ” కారం తలమానికమై వెలుగొందుచున్నది. “శ్రీ” శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ మతమందైననూ, ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, “శ్రీ” అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.

[16/04, 9:04 am] +91 99850 01339: *🌼 ప్రసాదములు 🌼*


1)కుశలాన్నం =పులగం


2)చిత్రాన్నం=పులిహోర


3)క్షీరాన్నం=పరమాన్నం


4)పాయసం=పాయసం 


5)శర్కరాన్నం= చక్కెరపొంగలి


6)మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాలపొంగలి


7)దధ్యోదనం= పెరుగు అన్నము


8)తిలాన్నం=నువ్వులపొడితో చేసిన అన్నం


9)శాకమిశ్రితాన్నం=కిచిడీ


10)గుడాన్నం = బెల్లపు పరమాన్నం


11)సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం


 (గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు)


12)గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు


13)గుడమిశ్రిత తండులపిష్టం= చలిమిడి


14)మధురపానీయ=పానకం


15)పృథక్=అటుకులు


16)పృథకాపాయస=అటుకుల పాయసం


17)లాజ=పేలాలు


18)భక్ష్యం= పిండివంటలు


19)భోజ్యం= అన్నము మొదలగునవి


20)వ్యంజనం=పచ్చడి


21)అపూపం=అరిసెలు లేదా అప్పములు


22)మాషచక్రం= గారెలు


23)లడ్డుక,= లాడూలు


24)మోదకం= ఉండ్రాళ్ళు


https://chat.whatsapp.com/Fxe5j0yW77O09N95bynLzG


*🌼నివేదనల పేర్లు🌼*


1)చూతఫలం=మామిడిపండు


 2)ఖర్జూర= ఖర్జూరం.          

   

3)నింబ=వేప


4)నారింగ=నారింజ


5)భల్లాతకీ=జీడిపప్పు


6)బదరీ=రేగు


7)అమలక=ఉసిరికాయ


8)శుష్కద్రాక్ష=కిస్మిస్


9)అమృత లేక బీజాపూరం= జామపండు


10)ఇక్షుఖండం=చెఱకుముక్క


11)కదళీఫలం,రంభా ఫలం=అరటిపండు


12)నారికేళం=కొబ్బరికాయ


13)జంభీర= నిమ్మ పండు


14)దాడిమీ=దానిమ్మపండు


15)సీతాఫలం= సీతాఫలం


16)రామఫలం= రామఫలము


17)కపిత్త=వెలగ పండు


18)శ్రీ ఫలం, బిల్వఫలం= మారేడు


19)మాదీ ఫలం=మారేడు పండ్లు


20)జంభూఫలం=నేరేడు


21)వాతాదం= బాదము పప్పు


శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం కొరకు తప్పక చవవలసిన అత్యుత్తమ స్తోత్రం 


ఋగ్వేదం లోని - శ్రీ సూక్తం  


https://youtu.be/ZshKXy1yehw


🌱🌱🌱🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌱🌱🌱

[16/04, 9:31 am] +91 99850 01339: పులిహోర  ఆవకాయ తయారీ విధానం :-


కావలసినవి;

పచ్చి  మామిడి కాయలు  -  2( పెద్దవి),

సాల్ట్ : 75 గ్రాములు,

పసుపు: 1/2 స్పూన్, 

ఆవపిండి  -  125  గ్రాములు . 

కారం   --  75  గ్రాములు.


పులిహోర  ఆవకాయ  లో  పోపునకు కావలసిన పదార్థములు :-


నువ్వులనూనె  - 150గ్రాములు .

ఎండుమిరపకాయలు  -  8

పచ్చిశనగపప్పు   -  రెండు  స్పూన్లు, 

మినపప్పు  -  రెండు  స్పూన్లు, 

ఆవాలు   -  1+1/2 స్పూన్

కరివేపాకు  - గుప్పెడు, 

ఇంగువ  -  పావు  స్పూను.


తయారీ  విధానము :-

ముందుగా  కాయలు కడిగి  గుడ్డతో  శుభ్రంగా  తుడిచి , మధ్యకు  తరిగి  లోపలి టెంక  లేదా   జీడి తీసి వేసి చిన్న ముక్కలు చెక్కు లా తరుగుకోవాలి.

తర్వాత ఒక బేసిన్ లో  తరిగిన ముక్కలు వేసుకుని ,అందులో పసుపు  మరియ ఉప్పు వేసి  చేత్తో  బాగా  కలుపుకుని  ఒక గంట సేపు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి . ఉప్పు తగలగానే ముక్కల నుండి  ఊట వస్తుంది,. 


తర్వాత  స్టౌ  మీద  ఒక  గిన్నె పెట్టి  గ్లాసు  నీళ్ళు  పోసి , నీళ్ళను  బాగా మరగనివ్వాలి .


తర్వాత స్టౌ  ఆపి  ఆ  నీళ్ళలో   ఆవపిండి  మొత్తము  వేసి  గరిటెతో   బాగా  కలిపి  , ఈ మిశ్రమమును  ఒక పళ్ళెంలో  వేసి , ఒక గంటన్నర సేపు ఎర్రని  ఎండలో ఎండ  పెట్టాలి .


ఇప్పుడు  విడిగా  బేసిన్ లో  సిద్ధంగా  ఉంచుకున్న  ముక్కలలో  మొత్తము కారం  వేసి బాగా  కలుపుకోవాలి .


తర్వాత  స్టౌ  మీద మూకుడు పెట్టి  మొత్తము  నువ్వులనూనె  పోసి  నూనెను  బాగా  కాగనివ్వాలి .


ఆ తర్వాత  అందులో  ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఆవాలు , ఇంగువ  మరియు  కరివేపాకు  వేసుకుని  పోపు వేసుకోవాలి .


ఇప్పుడు  ఆ  వేడి వేడి  పోపు ను  కారం  కలిపిన  మామిడి ముక్కలలో  వేసుకుని  గరిటెతో  బాగా  కలుపుకోవాలి .


 ఈ విధముగా  పోపు కూడా వేసి కలిపిన  ముక్కల లోని   వేడి  బాగా  చల్లారిన తర్వాత  విడిగా  ఎండపెట్టిన  ఆవపిండి  ముద్దను  తీసుకుని  వచ్చి  ఈ  పోపు  వేసిన  ముక్కలలో  వేసుకుని , గరిటెతో  బాగా  కలుపుకోవాలి .


బాగా  చల్లారిన  తర్వాత   ఒక  సీసాలో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే 2-3 నెలలు నిల్వ వుంటుంది.


*