Thursday, 7 July 2022

   


హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము.
===================

1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది.
ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం,
రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం.
దైవమే కాంతి.
ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది.  స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు.
కాంతివి నీవే.
నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి,
మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.

3. ధూపం:
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము.
వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి.
వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి.
విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన
అందరిలో కలుగుతుంది.
ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ
జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి:
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం.
ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని
భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ:
ఈ సేవలో చాలా అర్థం ఉంది.
భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు.
అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది.
ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు.
ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.

6. పూజ:
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు.
కాని భగవంతునికి వీటితో పనిలేదు.
నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు.
కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము):
ఇది త్రిగుణాలతో కూడుకున్నది.
పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము):
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు
అని అర్థం కాదు.
సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం
అని అర్థం.
ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు):
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.
దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు):
భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన
దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు
దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు:
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది.
దానిలో ఉండే నీరు సంస్కారము.
కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి.
అదే నిజమైన నివేదన.
లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం,
హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది.
హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు.
మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.
మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము:
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి.
ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు.
ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము:
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి.
ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది..
అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

🙏🙏🙏🙏🙏

జీవన మాధుర్యం
 

    తెల్లవారింది.నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని
అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి
వెళ్ళాలి.కానీ బద్దకంగా అనిపించింది.
        మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు.ఆయన చనిపోయి రెండేళ్లు
అయింది.కొడుకు....కూతురు అమెరికాలో
స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు
వచ్చేయమంటారు.కానీ నాకే ఇష్టం లేదు.
ఆయన పోయాక నాకు జీవితం మీద
ఆసక్తి పోయింది.నిరాశ...నిస్పృహలతో
కాలం గడుపుతున్నాను.
     కాఫీ తాగాలి అనిపించింది.కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.కాఫీ త్రాగడం ఎప్పటి అలవా టో!
       చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను.బ్రష్
చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను.కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది.వయసు పాతిక ఉంటుంది.
అందంగా...ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.
        నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.
    ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని
గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.
కానీ గుర్తు రాలేదు.మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరు నవ్వుతో
విష్ చేసింది.
       అలా వారం గడిచింది.ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు " సారీ అమ్మా!
నిన్ను గుర్తు పట్టలేక పోయాను!"అన్నాను.
      ఆ యువతి చిన్నగా నవ్వి " మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ!మీరు నన్ను గుర్తు పట్టడానికి" అన్నది.
      నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను.
అప్పుడా అమ్మాయి" విష్ చేయడానికి పరిచయం ఎందుకు?" అన్నది.తన మాటకు
నేను నవ్వేసాను.నేను నవ్వి చాలా కాలం అయింది.ఆ విషయం మనసు గుర్తు చేసింది.
      " నీ పేరు?" అని అడిగాను."స్వప్న.మరి మీ పేరు?" అని అడిగింది."వకుళ" అని చెప్పాను.స్వప్న నన్ను దాటిపోతూ
వెనక్కి తిరిగి "ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది" అన్నది.నాకు మావారు గుర్తుకు వచ్చారు.ఆయన కూడా అదే మాట అనేవారు.గుండెలో సంతోషం పొంగింది.
    మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం...సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి.ఉత్తేజంగా అనిపించేది.
   ఒక రోజు "ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాను.
స్వప్న సరేనంది.ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము.
     "నీకు పెళ్లి అయిందా?" అని అడిగాను.
"అయింది.ఒక బాబు...పాప" అంది స్వప్న.మాటల్లో మావారు పోయిన విషయం...మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను.మావారు పోయినందుకు
సంతాపం తెలియ బరిచింది.
      కొద్ది క్షణాల తరువాత "ఇప్పుడు ఇంటికి
వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?" అని అడిగింది స్వప్న." బ్రెడ్" అని చెప్పాను.
"ప్రతి రోజూ అదేనా?" అని అడిగింది స్వప్న.
"ఒక్కదాన్నే గా!అందుకే!" అన్నాను.
      "ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి.మీ ఆరోగ్యం మీరు కాపాడు కోవాలి" అంది స్వప్న.కొంచెం సేపు ఆగి
తనే" మీవారు..పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు
ఇష్టం అయినవి చేసి పె ట్టి ఉంటారు.ఇప్పుడుమీకు ఇష్టమైనవి చేసుకు
తినండి" అన్నది.ఆ తరువాత మేం విడి
పోయాము.
        ఇంటికి వెళ్ళిన తరువాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి.అందులోని వాస్తవం గుర్తించాను.చాలా కాలం తరువాత
నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను.ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది.
     మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి
జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను.ఎంతో సంతోషించింది."మంచి పని చేశారు" అని అభినందించింది.మాటల్లో జీవితం నిరాసక్తత
గా ఉన్నట్లు చెప్పాను.స్వప్న మౌనం వహించింది.
    నెల తరువాత ఒక రోజు    " వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా!" అని ఆహ్వానించాను.స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను" అని నా సెల్ నంబర్ తీసుకుంది.మా వారు పోయాక నేను
మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న.
      సాయంత్రం నాలుగు గంటలకు  వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది.
నాకు సంతోషం అనిపించింది.
     తనకోసం కాఫీ చేసి ఫ్లాస్క్
లో పోసి ఉంచాను.చెప్పినట్లు సరిగ్గా   
నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది.
వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ  తెచ్చింది.
       "ఎందుకిది " అని అడిగాను."రోజూ దీనికి నీళ్లు పోస్తూ పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!" అంది.
        స్వప్న సోఫాలో కూర్చుంది.కాఫీ అందించాను."మీరు తీసుకోరా?" అని అడిగింది."డయాబెటీస్.అందుకే ఇష్టమైనా
 తీసుకోవడం లేదు" అన్నాను.
        తను కిచెన్ లోకి వెళ్లి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ"జబ్బు కంటే భయమే శరీరం మీద
 ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.ఏం కాదు.హ్యాపీగా త్రాగండి" అంది.నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను.చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది.  అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో..
బ్రూ పౌడర్ కలుపుకు త్రాగినా రుచి అద్భుతంగా ఉంటుంది.అందుకు కొంచెం
మైండ్ సెట్ మార్చుకో వాలి" అన్నది.
         కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక "ఇల్లు చూద్దువు గాని రా!" అని స్వప్నను లోనికి తీసుకు వెళ్ళాను.
   తను పూజా మందిరం చూసి " రోజూ పూజ చేయడం లేదా?" అని అడిగింది." లేదు"
అన్నాను.తను రెండు అగరొత్తులు  తీసి వెలిగించింది.క్షణంలో గది పరిమళ భరితం
అయింది.అప్పుడు స్వప్న "పూజ చేసినప్పుడు
మన మనసూ ఇలా పరిమళ భరితం అవుతుంది" అన్నది.
       " ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో
బాగుంటుంది" అని మనసులో అనుకున్నాను.
         స్వప్న బయలు దేరినప్పుడు " గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు
మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!"
అన్నది."అలానే" అన్నాను.
          గదిలో అలుముకున్న అగరొత్తుల
 పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను
గుర్తు చేస్తూనే ఉంది.
      మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో
లేవలేదు.కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను.కాఫీ చక్కెర లేకుండా త్రాగాను.స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే
బాగుంది అనిపించింది.చాలా కాలం తరువాత
ప్రభాత సమయంలో  ఉత్సాహంగా అనిపించింది.
     వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి
చెప్పాను.సంతోషం వ్యక్తం చేసింది.
     స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను.క్రమేపీ దానితో
అనుబంధం పెరిగింది.ప్రతి రోజూ దాన్ని
శ్రద్ధగా పరిశీలించ సాగాను.మొగ్గ తొడగడం...పువ్వు విచ్చడం...పరిమళం
అద్భుతం అనిపించ సాగింది.
      మావారు ఉన్నప్పుడు పూల కుండీలు
ఉండేవి గాని...వాటి పోషణ ఆయన చూసుకునేవారు.ఇప్పుడు ఇది నాకు సరి
కొత్త అనుభవం.
     మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ నా ఆనందం
పంచుకుంది.
              ఈమధ్య స్వప్న నాతో పాటే వాకింగ్ చేయసాగింది.ఒకరోజువాకింగ్ మధ్యలో " మీకో చిన్న పని చెప్తాను. అలా చేసి
ఎలా ఉందో నాకు చెప్పండి" అంది.
      "ఏమిటది?" అని ఆసక్తిగా అడిగాను.
రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒకదానిలో
బియ్యం గింజలు..ఒకదానిలో నీరు పోసి
మీ పిట్ట గోడ మీద పెట్టండి" అన్నది.
తన భావం గ్రహించి" సరే" అన్నాను.
         అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ...
దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది.
      ఉదయం తాగుతున్న కాఫీ...పూజ...
అగరొత్తుల పరిమళం... పూస్తున్న గులాబీలు...గింజలు తింటున్న పిట్టలు...
నీరు తాగుతున్న పక్షులు....ఇవి చిన్న చిన్న
మార్పులే గానీ నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి.ఒకప్పుడు నిరాశ..నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా...సంతోషంగా ఉంటున్నాను.
నాలోని మార్పుకు స్వప్నే కారణం.
      ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద
వచ్చింది.తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది."వీళ్ళు మా పని మనిషి పిల్లలు.
బాగా చదువుతారు.కానీ వీళ్ళమ్మ వీళ్ళను
చదివించలేక పోతున్నది.అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను.
మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి" అన్నది.
నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసు
కున్నాను.వాళ్లకు సహాయం చేయడం నాకు
ఎంతో తృప్తిని ఇచ్చింది.
      పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామ కాయలు కోసుకున్నారు.స్వప్న నాతో "మీ హాబీస్ ఏమిటి?" అని అడిగింది." ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని" అని చెప్పాను.
" వావ్" అని స్వప్న నన్ను కౌగిలించుకుంది.
"ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి.
నాకోసం ఒకటి డ్రా చేయండి" అని చిన్న పిల్లలా మారాం చేసింది ."వాటి జోలికి వెళ్లి
చాలా కాలం అయింది.వేయగలనో! లేదో!"
అన్నాను."తప్పక వేయగలరు!" అంది స్వప్న.
ఆన డమే కాదు...ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్...పెన్సిల్స్...వాటర్ కలర్స్
తెచ్చి ఇచ్చింది.
      దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.
        ఆలోచించి రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను.మొదట కొంచెం తడబడినా త్వరగానే దారిలోకి వచ్చాను.
పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది.ఆ విషయం స్వప్నకి చెప్పాను.
       ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది.పెయింటింగ్ చుడగానే " "ఎక్సలెంట్ ఆంటీ!" అని నన్ను కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.
నాకు సంతోషం...సిగ్గు రెండూ కలిగాయి.
     " పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్ గా ఇవ్వండి" అని కోరింది.అలానే చేశాను.
      ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. "ఎప్పుడూ మేం చేయడమే గాని,నీవు చేసింది లేదు.ఫస్ట్ టైం నువ్వే చేశావు" అని ఆశ్చర్య పోయింది.క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను." నీ లైఫ్ స్టైల్
మార్చింది .నా అభినందనలు తెలియ జేయి"
అన్నది.
        కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి
ఆహ్వానించింది.తనే వచ్చి స్కూటీ మీద తీసుకు
వెళ్ళింది.ఇంటికి వెళ్లగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ  అందమైన ఫ్రేమ్ లో
కనిపించి కనువిందు చేసింది.నాకు మనసులో  గర్వంగా అనిపించింది.
       స్వప్న నాకు వాళ్ళ అత్త మామ గార్లను
పరిచయం చేసింది.నేను సోఫాలో  కూర్చున్నాను.స్వప్న కాఫీ తేవడానికి లోనికి
వెళ్ళింది.
       స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ..
" మా కోడలు దేవతమ్మా!మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది."అన్నది.అంతలో
స్వప్న కొడుకు...కూతురు మా దగ్గరకు వచ్చారు.నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్...చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు
అక్కడినుంచి వెళ్లి పోయారు.
      అప్పుడు స్వప్న అత్తగారు" ఈ బాబే స్వప్న కొడుకు.ఆ పాప అనాధ.స్వప్న దత్తత తీసుకొని పెంచుకుంటున్నది.అం తే కాదు...
మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.అదేమంటే...మన పిల్లలను మనం పెంచడం ...ప్రేమించడం గొప్ప కాదు.
అనాధకు చేయూత నీయడం గొప్ప అంటుంది.
మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు" అని
చెప్పింది.
      అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు
కలిగాయి.స్వప్న కు అంత చిన్న వయసులోనే
ఎంత పరిపక్వత అనుకున్నాను.కాఫీ తెస్తున్న స్వప్న లో నాకు దేవతా మూర్తి గోచరించింది.
    స్వప్న,అత్తగారితో " మొత్తం చెప్పేసారా?
చెప్ప నిదే ఊరుకోరు కదా!" అంది నవ్వుతూ.
నేను సింపుల్ గా " అభినందనలు స్వప్నా!"
అన్నాను.
          ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు.స్వప్నను చూసాక జీవన మాధుర్యం
బోధ పడింది.ఈరోజు తను చేసిన పని తెలిశాక నా జీవిత గమ్యం బోధ పడింది.
నా దగ్గర బాగానే డబ్బు ఉంది.నా డబ్బు మా పిల్లలు ఆశించరు.ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి ఏం చేయాలో
నిర్ణయం తీసుకున్నాను.అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.
       కొద్ది కాలానికి మా వారి పేరు మీద
ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను.దానికి
సెక్రటరీ గా స్వప్నను ఏర్పాటు చేశాను.
      ఇప్పుడు నాకు జీవితం నిరాశగా... నిస్పృహగా అనిపించడం లేదు.సంతోషంగా...
ఉత్సాహంగా అనిపిస్తున్నది.ఒకప్పుడు సమయం గడవని నాకు ..ఇప్పుడు సమయం చాలడం లేదు.
       వయసులో చిన్నదే అయినా ..నా మనసులో గురువు స్థానం స్వప్నకే
ఇచ్చాను!!
            .....ఎన్.శివ నాగేశ్వర రావు
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
 

🌹🌹 పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు...🌹🌹


🌹1). విలువ లేని చోట మాట్లాడకు. .!
🌹2). గౌరవంలేని చోట నిలబడకు..!
🌹3). ప్రేమ లేని చోట ఆశ పడకు..!
🌹4). నీకు నచ్చని, ఇష్టంలేని విషయాలకి క్షమాపణ చెప్పకు..!
🌹5). నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు..!
🌹6). నిర్లక్ష్యంవున్న చోట ఎదురు చూడకు..!
🌹7). అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు..!
🌹8). వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు..!
🌹9). ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు..!
🌹10). చులకనగా చూసే చోట చొరవ చూపకు..!
🌹11). జాలి పడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు..!
🌹12). భారం అనుకునే చోట భావాలు పంచుకోకు..!
🌹13). దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు..!
🌹14). నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు..!
🌹15). ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు..!
🌹16).
 ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు..!
🌹17). నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు..!


☘️🍁🌱🌺🍂🌴🌸🪴☘️🍁🌱

వివేకజ్ఞానం

మనిషి ధనవంతుడే కావచ్చు, విద్యావంతుడే కావచ్చు, సర్వాంగ సుందరుడే కావచ్చు కాని బుద్ధిమంతుడు కాకపోతే ఆ ధనం, విద్య, సౌందర్యం ఎందుకూ కొరగావు.

బుద్ధిమంతుడు అంటే ఏకసంథాగ్రాహి, మహామేధావి అని కాదు- సద్బుద్ధి కలవాడని అర్థం. సద్బుద్ధి అంటే వివేకంతో కూడిన బుద్ధిశక్తి. మంచీచెడుల మధ్య తేడా తెలియడమే వివేకం. మనిషికి బుద్ధిశక్తి ఉన్నా వివేకం లేకపోతే అది వక్రమార్గం పడుతుంది. మనిషికి గొప్ప తెలివితేటలు లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు కాని దుర్బుద్ధి ఉంటే చాలా ప్రమాదకరం. మనిషి ఎదిగినా, దిగజారినా, పేరు ప్రఖ్యాతులు గడించినా, అపఖ్యాతి మూటకట్టుకున్నా- అదంతా బుద్ధి మహిమే. ఇహపరాలు రెండూ బుద్ధి చేతుల్లోనే ఉంటాయి. సద్బుద్ధి ఉంటే మంచి స్నేహితులు, శీల సంపద, గౌరవ మర్యాదలు, సత్సంబంధాలు, మనోనిర్మలత, ఆత్మవివేచన కలిగి ఉంటారు. దుర్బుద్ధి ఉంటే కపటత్వం, అసూయాద్వేషం, అసహనాలు ఆవరిస్తాయి. మనిషి దేహాంగాలన్నీ దివ్యంగా పనిచేస్తున్నా, బుద్ధి ఒక్కటి వక్రంగా పనిచేస్తే చాలు- జీవితం పతనమవుతుంది.

ఈశ్వరుణ్ని తపస్సుతో మెప్పించి వరాలు పొందిన రావణ విభీషణ కుంభకర్ణులలో, రావణకుంభకర్ణులను ఆ వరాలు రక్షించలేదు. కాని సద్బుద్ధినే వరంగా వేడిన విభీషణుడు మాత్రం చిరంజీవి అయ్యాడు. పూర్వకాలం గురుకుల విద్యలో సద్బుద్ధిని పుట్టించే అంశాలను విశేషంగా బోధించేవారు. గురువులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యాబుద్ధులు రెండూ నేర్పేవారు. నిజానికి విద్య అంటేనే బుద్ధిని మేల్కొల్పేదని అర్థం. దురాలోచనలకు, వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా విద్యార్థులను ఉంచేందుకు నాటి గురువులు తీవ్రంగా శ్రమించేవారు. చిటికెడు ఉప్పు కలిస్తే బిందెడు పాలూ విరిగిపోతాయి. ఒక చెడు స్నేహం చాలు మనిషి పాడయ్యేందుకు. అర్జునుడిపై అసూయతో రగిలే కర్ణుడి స్నేహమే దుర్యోధనుడి పతనానికి కారణమంటారు పెద్దలు. ఒక వస్తువు నాణ్యత దాన్ని ఉత్పత్తిచేసే యంత్రసామర్థ్యంపైనా, దానిలో వినియోగించే ముడిసరకు నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి నాణ్యత (వ్యక్తిత్వం) అతడి అంతరంగంలోని మనోబుద్ధులపై ఆధారపడి ఉంటుంది. మనసు వ్యామోహాలకు, త్రిగుణాలకు, వాంఛలకు, అసూయాద్వేషాలకు, ప్రేమపగలకు, ఇష్టాయిష్టాలకు, సుఖదుఃఖాలకు, భావోద్రేకాలకు స్వస్థానం. బుద్ధి వివేకానికి, విచక్షణకు, తాత్విక తార్కిక ఆలోచనలకు, నిశ్చయాత్మక శక్తికి, క్రియాజ్ఞానశక్తులకు, సంకల్పబలానికి, శ్రద్ధకు మూలస్థానం. మనసు బుద్ధి వేరు వేరు అంశాలయినా లోతుగా అవి అనుసంధానమై ఉండటం వలన ఒకటిగానే మనిషికి స్ఫురిస్తాయి. మనసుకు వశుడై బతికితే ఒకలా, బుద్ధిని ఆశ్రయిస్తే మరోలా మనిషి జీవితం ఉంటుంది.

బుద్ధి మనసుకన్నా శక్తిమంతమైనదైనా, సర్వసాధారణంగా అది మనసు చెప్పినట్లే వింటుంది. మనిషి బుద్ధి శక్తి అనంతమైనది. దాని శక్తియుక్తులకు అవధులు లేవు. సాధనతో బుద్ధిని సూక్ష్మతరం చేయాలని వేదం పదేపదే చెబుతుంది. ధ్యాన, యోగ, పూజ, అనుష్ఠాన అభ్యాసాలన్నీ దీనికోసమే. బుద్ధి సూక్ష్మస్థితిని పొందుతున్నకొద్దీ మనసు తనంతట తానుగా నియంత్రణకు వస్తుంది. సద్బుద్ధి కలుగుతుంది. దాన్ని సారథిగా చేసుకుంటే జీవితం సాఫీగా క్షేమంగా శ్రేయోమార్గంలో సాగుతుంది. మనసు లోకోపకారానికి ఉర్రూతలూగుతుంది. పరోపకారమే జీవిత ధ్యేయమవుతుంది.

- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

ఎంత సేపు పూజ?🙏🌼🌾🌷🌿

పూజ గదిలో - 30 నిమిషాలు

బయట - 23 గంటల 30 నిమిషాలు

1) ఏది పూజ? ఎంత సేపు పూజ?

2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?

3) నిద్ర లేవగానే -
    i) శ్రీహరి గుర్తుకు రావాలి
   ii) భూమికి నమస్కరించాలి
   iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి

4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.

5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.

6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.

7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.

8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.

9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.

10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.

11) పసి పిల్లలను, అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి.

12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.

13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.

14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.

15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప
 కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.

అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.🙏

🔸🔸🕉️ 🕉️🔸🔸


 శ్రవేంకటేశ్వర: తల్లిదండ్రులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి? 🌻


భారతీయులు తమ తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, మహాత్ములకు సాష్టాంగ నమస్కారము చేస్తారు. మనచే నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చేయిని మన తలమీద లేక పైన ఉంచి దీవిస్తారు. ప్రతి రోజు పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు, జన్మదినములు. పండుగలు మొదలగు శుభ సందర్భాలలో కూడా పెద్దలకు నమస్కరించడము జరుగుతుంది.

కొన్ని సంప్రదాయ సమూహాలలో తమ కుటుంబము, సామాజిక హోదా మరియు తమ పరిచయము తెలియచేసే విధముగా ప్రవర తో కూడి) సాష్టాంగ నమస్కారము చేయబడుతుంది. సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?

మానవుడు తన పాదాల ఆధారముగా నిలబడతాడు. సాష్టాంగ నమస్కారములో పెద్దల పాదాలకు నమస్కరించడమనేది వారి వ్యక్తిత్వానికి ఆధారమైన పెద్దరికానికి, పూర్ణత్వానికి, ఉదారతకు, దివ్యత్వానికి మనము ఇచ్చేటటువంటి గౌరవా…
 శ్రీహరి పరాధీనత

భూదేవీ ! బ్రహ్మాది దేవతలారా ! ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాను. నేనే కాదు బ్రహ్మదేవుడూ శివుడు ఇంద్రుడూ దిక్పాలకులు చంద్రుడు సూర్యుడూ అగ్ని - ఎవ్వరూ స్వతంత్రులు కారు.
సృష్టి అంతా యోగమాయావశంవదం. బ్రహ్మాదిస్తంభపర్యంతమూ గుణసూత్ర గ్రథితమై నడుస్తోంది. ఆ మహామాయ తన ఇచ్ఛ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనుకుంటే అలా చేస్తుంది. మనమందరం ఆ మాయాశక్తికి వశులమే.

నేను స్వతంత్రుడినే అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగానూ ఒక తాబేలుగానూ జన్మిస్తానా ? ఆలోచించండి. పశుజన్మలో భోగం ఉందా, కీర్తి ఉందా, సుఖం ఉందా ? పోనీ అంటే, క్షుద్రజంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందంటారా ? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముణ్ణి అయ్యాను. ఎందుకయ్యానంటారు ? ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ - ఎవరైనా ఎన్నడైనా ఇష్టపతారా ? ఇరవైయొక్క సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తురుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం ! ఎంత నీచం ! గర్భస్థ శిశువులనుకూడా సంహరించాను. ఇదంతా ఇష్టపడే చేశానంటారా ? తరవాత దాశరథిగా అవతరించాను. దండకారణ్యాలలో నివసించాను. జటావల్కలాలు ధరించి మునివృత్తిని అవలంబించాను. భీషణ నిర్జనారణ్యాలలో ఒంటరిగా జీవించాను. వేటాడి సంపాదించుకున్న (పచ్చి) మాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడవలసిన విషయమా, సిగ్గు పడవలసిన విషయమా ? మీరే చెప్పండి.

బంగారులేడి కనపడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయాను. దశకంఠుడి ప్రణాళిక అని గుర్తించలేకపోయాను. కుటీరంలో జానకిని ఒంటిరిగా వదిలేసి వెంటబడ్డాను. లక్ష్మణుడుకూడా సీతను అలాగే వదిలేసి వచ్చేశాడు. నామాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు. ప్రాకృత పురుషులం అయిపోయాం. రావణుడు భిక్షురూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు. అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపెడుతోంది. అడవులన్నీ మారుమ్రోగేట్టు విలపించాను. కార్యవశాత్తూ సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకుని ప్రతిజ్ఞచేసి వాలిని అన్యాయంగా సంహరించాను. శపించకుండా వారించాను. వానరుల సహాయంతో లంకను చేరుకున్నాను.

నేనూ నా సోదరుడూ నాగపాశబద్ధులమై మూర్ఛపోయాం. ఇదేమిటని అందరూ ఆశ్చర్య పోయినవారే. అప్పుడు గరుత్మంతుడు దయతలిచి వచ్చాడు కనక సరిపోయింది. నాగపాశ విముక్తులం అయ్యాము. అప్పుడు నేనెంత దిగులుపడ్డానో మీకు తెలుసా ! దైవం ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది. రాజ్యం పోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు, ప్రియ భార్య అపహరించబడింది, కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది. నిర్ధనుడనై అసహాయుడనై పాదచారినై భార్యతో కలిసి పధ్నాలుగేళ్ళు గాఢారణ్యాలలో గడిపాను.

క్షత్రియుడనై పుట్టి బోయవాడుగా జీవించాను. దైవం అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యను తిరిగిపొందాను. ఆ భోగాలు మాత్రం ఎంతకాలం ! లోకాపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను. మళ్ళీ నా దుఃఖం నాదే. భార్యా వియోగ దుఃఖం. వద్దు, పగవారికైనా వద్దు. కడపటికి భూమిని చీల్చుకుని నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది.

రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించండి.

చతుర్వదనా ! నీకు తెలుసును గదా ! నువ్వూ రుద్రుడు ఇంద్రుడూ అందరూ పరతంత్రులే. అందరం ఆ మహామాయకు అధీనులమే.
(అధ్యాయం - 18, శ్లోకాలు - 60)

దేవతలారా ! మనమంతా మాయామోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం. జగద్గురువును స్మరించలేకపోతున్నాం. సచ్చిదానందుడు, అవ్యయుడూ శాంతుడూ అయిన పరమపురుషుడిని మర్చిపోతున్నాం. నేను విష్ణువుని, నేను విరించిని, నేను శివుడను - అని అహంకరించి మోహితులమవుతున్నాం. అతి సనాతనమూ పరాత్పరమూ అయిన వస్తువును తెలుసుకోలేకపోతున్నాం. ఐంద్రజాలికుడి చేతిలో కొయ్యబొమ్మలాగా నేనూ ఇంతే. ఎప్పుడూ మాయామోహితుడినై ప్రవర్తిస్తూంటాను.

పద్మసంభవా ! కల్పారంభంలో నువ్వూ నేనూ శివుడూ కలిసి వెళ్ళి క్షీరసముద్ర మధ్యభాగాన మణిద్వీపంలో మందార తరుచ్ఛాయలో రాసమండలంలో ఆ మహామాయను ఆదిపరాశక్తిని దర్శించాంకదా ! సర్వకామప్రద అయిన ఆ శక్తిని అందరూ కలిసి స్తుతించండి. మనస్సుల్లో స్మరించండి.

శ్రీమహావిష్ణువు ఇలా సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలందరూ సకలభువనేశ్వరిని మనసారా స్మరించారు. ఆదిపరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా ముక్తకంఠంతో స్తుతించారు.

జగన్మాతా ! సాలీడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వల్లాగా ఈ జగత్తు నీనుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తు అంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరీ ! ఓ కరుణాసముద్రమా ! నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోకపోతే భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు సంవిద్రూపవు (జ్ఞాన రూప). దేవీ ! మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మీ ! ఓ మహాశక్తి ! మమ్ము నడిపించు.

ఓ భువనార్తి హారిణీ ! అనుగ్రహించు. మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టుబెట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడం, దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావుకదా ! కంస కేశి సాల్వ జయద్రథాదులు మదోన్మత్తులై భూగోళం మీద వీరవిహారం చేస్తున్నారు. వారినందరినీ సంహరించి భూదేవికి భారం వదిలించు. త్రిమూర్తులకుకూడా లొంగని మహామహాదానవులను నువ్వు ఒక కేళీవిలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు ఏమి చెయ్యలేరుగదా ! అనంతుడు ఈ భూమిని ధరించలేడుగదా ! ఓ చంద్రకళావతంసా ! మా విన్నపం ఆలించి మా దైన్యం తొలగించు - అని బృందగానంగా అందరూ కలిసి స్తుతించారు. అభ్యర్థించారు.

జగన్నాయకీ ! సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతి లేనిదే శివుడు సంహరించలేడు. వారికి ఆ శక్తులను సమకూర్చినదానవు నువ్వేకదా - అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు.

ఓ త్రిలోకీ ! నీ కళావైభవాన్ని మాకు అందించావు కనక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం. ప్రభుత్వం చెలాయిస్తున్నాం. నిజానికి సమస్త విభవేశ్వరివి నువ్వే - అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్ర పాఠానికి ముక్తాయింపు ఘటించాడు.

జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులికించింది. దేవతలారా ! పని ఏమిటో చెప్పండి. ఆందోళన పడకండి. అది ఎంతటి అసాధ్యమైనా సురల కోరిక తీరుస్తాను. మీకుగానీ ఈ భూదేవికిగానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి - అని అడిగింది. అడిగిందే తడవుగా దేవతలు ఏకకంఠంతో విన్నవించారు.

భువనేశ్వరీ ! పాలకులందరూ దుష్టులై పీడిస్తూంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరికి వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సమర్ధురాలవు నువ్వే అని నిన్ను ప్రార్ధించాం. ఇది మా దేవతలందరి అభ్యర్థన. దయచేసి పూనుకొని భూభారం తగ్గించు. దుష్టులను వెంటనే సంహరించు. ఇదివరలో నువ్వు మహిషాసురుడిని సంహరించావు. వాడి సహాయకులను కోట్లాదిగా మట్టుబెట్టావు. శుంభ నిశుంభ రక్తబీజ చండముండ ధూమ్రలోచన దుర్ముఖ దుస్సహ కరాళాది మహాదైత్యవీరులను క్రూరాతిక్రూరులను అవలీలగా అంతమొందించావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది. దేవతా శత్రువులైన దుష్టభూభుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లీ !

దేవతల ప్రార్థనను శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద పెట్టున నవ్వింది. కన్గొసలు ఎరుపెక్కాయి. మేఘగంభీర స్వరంతో పలికింది -

 దుష్టశిక్షణకు జగన్మాత వ్యూహం

దేవతలారా! ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరు అందరూ మీమీ అంశలతో భూలోకంలో జన్మించాలి. భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను.

కశ్యపుడు భార్యాసహితుడై యదువంశంలో అనకదుందుభి గా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగుశాపం ఉంది కనక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడుగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతాకార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణీ గర్భసంజాతుడు అవుతాడు. ఈ ఇద్దరూ నా శక్తితో సర్వ దుష్టసంహారం చేస్తారు. ఇది ఈ ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. వాయుదేవుని అంశతో భీముడూ, అశ్వినీ దేవతల అంశలతో నకులసహదేవులూ, అష్టమవసువుగా (వసు అంశంతో) భీష్ముడూ జన్మించి శత్రుబలాలను క్షీణింపజేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది.

మీరంతా నిమిత్తమాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష్య, తృష్ణ, మమత, జిగీష, మోహమూ, కామమూ మొదలైన దోషాలతోనూ, బ్రాహ్మణశాపం కారణంగానూ యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాపకారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీమీ అంశలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు. అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమతమ నెలవులకు వెళ్ళిపోయారు.

(అధ్యాయం - 19, శ్లోకాలు - 46)


(రేపు.... వ్యాసకృత యోగమాయా ప్రశంస )

 🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే .......‌‌‌‌‌‌‌.🙏
                                  ..... సశేషం

శ్రీ మాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
[7:36 am, 27/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌹 ఓం నమో వేంకటేశాయ గ్రూపు సబ్యులకు అందరికీ నమస్కారం.

🌹ప్రస్తుతం గ్రూపులో ఉన్న సభ్యులు కొంతమంది మేసేజ్ లు చూడకుండా కొంతమంది సభ్యులు వున్నారు. వీరికి మెసేజ్ డెలివరీ అవుతుంది. కానీ వాళ్ళు మెసేజ్ చదవడం లేదు. ఇలాంటి వారిని గ్రూపులో నుంచి తొలగించడం జరుగుతుంది.

🌹వీరిని తొలగించడం వలన కొత్తగా కొంతమంది సబ్యులకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

🌹మరొక్క విషయం వ్యక్తి గత కారణంగా రేపటి నుంచి ప్రస్తుతం ఉన్న గ్రూపులు అన్నింటినీ డిలీట్ చేసి కొత్తగా ఓం నమో వేంకటేశాయ గ్రూపు మొదలుపెట్టడం జరుగుతుంది.

🌹కొత్త గ్రూపులో యాక్టివ్ గా ఉన్న వారు మాత్రమే జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది.

🌹కొత్తగా గ్రూపు మొదలు పెట్టిన తరువాత ప్రస్తుతం ఉన్న గ్రూపులలో మెసేజ్ లు పంపడం జరగదు గమనించగలరు.

🌹మీ యొక్క
పేరు:
ఊరు:
వర్క్ (ఏమి చేస్తుంటారు): ఈ విషయాలు తెలిపితేనే గ్రూపులో జాయిన్ చేయడం జరుగుతుంది.

🌹మీ పేరు ఇలాంటివి తెలపడానికి ఇష్టం లేని వారు గ్రూపులో నుంచి లెఫ్ట్ అవ్వచ్చు.
--
గురుపాదము గొలుచుకొమ్ము
గురుసేవల సలుపుచుండి
కరుణన్ గని సకల జనుల
తరుణమ్మున సాయమిడుము
--
అమలమ్ముగ నుంచి యెడఁద
సమభావముఁ బెంచుకొమ్ము
గమనించుచు సృష్టి రచన
ప్రముదమ్మునఁ బ్రణతులిడుము
--
నిరుపేదల నిరసించకు
ఒరులెవ్వరి దూరఁబోకు
గరిమమ్మిడు గుణముఁ బెంచు
సరసంబగు బాసలాడు
--
అతిగానెటఁ బల్కఁ బోకు
మతినుంచుము మాతనెపుడు
స్తుతిసేయకు దుష్టజనుల
గతిమార్చకు మాశమీఱి
--
ప్రాప్తమైనదానితోడఁ
దృప్తి గలిగి బ్రతుకనగును
ఆప్తవాక్యమంచునెంచి
జ్ఞప్తినుంచ సూక్తి మేలు
--
వెంటరావు కాసులేవి
జంటయగును గర్మమొకటె
మంటలోన బూడిదగుచు
మంటిలోనఁ గలయఁ దనువు
--
పాపభీతిఁ గలిగి యుండు.
ఆపలేని వాఁడననుచు
వేపఁబోకు పెచ్చుమీఱి.
తాపమిడును యముఁడు పిదప
--
మర్మముంచఁబోక మదిని
ధర్మమార్గమందె సాగి
కర్మఫలము విభునికిడుము
వర్మమగును దైవమతఁడె
--
ఆశలెన్ని యున్నఁగాని
నాశనమునుజేయకొరుల.
పాశమెపుడొ తగులుకొనును
క్లేశమొదవ నీకుఁ గూడ
--
మోసగించి బ్రతుకఁబోకు
హాసములను బయికిఁ జిమ్మి
దాసజనము మెచ్చఁబోరు
మాసిపోవునున్న పేరు
--
పిల్లపాపలందఱలర
మెల్లఁగాను దరికిఁ దీసి
చల్లఁగాను గాయుచున్న
నిల్లె స్వర్గమగును జూడ
--
కల్లలాడఁ గాదు ముద్దు
చెల్లదెపుడు దాట హద్దు
అల్లరవఁగ నెమ్మి రద్దు
తల్లి చెప్పుదొకటె కద్దు
--
చల్లనైన తల్లి యగుట
నెల్లరొకటె కనఁగఁ దలికి
నుల్లసిల్లు నేకమయిన
kaalamaay tapp dika
--((***))--
 

 

మనోరమ ముద్దు కోసం... కవిత

మను వాడ గా వచ్చితి నే సహనమ్ము తొ
తను వంత యు తాపము దాహము దేహము
విను మాటలు నచ్చితి వే మన సైనది
కనుక సైగలు చేయుము కాలము నీదియు

అటులే ఇక నాకు యు నీ కును శోభ యె
చిటికేసిన పిల్పు కు వచ్చె ద వెంట నె
కటి నేల ను తాకి యు ఉంటిని ఆశలు
ఇటు తీర్చు ము వేడి కి చల్లగ ఉండును

కళగా ఇచటే కొలువే మనకుందిలె
ఇలలో కలిసే తెలిపే వరసుందిలె
కలలో కదిలే కథలే శుభ కాంక్షలె
వలలో మనమే ఒకటై సుఖముందిలె

తనువే తపనే కలిగే ఇక ఏలిక
మనసే బిగువై వరదై ఇక పొంగులె
మనువే ఇకలే కలలే ఇక తీర్చుకొ
అణువైనవి సేవకులుగా మనకుందిలె

తరుణం ఇదియే శరణం అనుచుంటిని
పరువం మనదీ పదిలం ఇక విదితం
సరళం సుముఖం సహనం మన జంటకు
కరుణా లయమే కథనం చిరు శాంతిగ

0
నేటి ఛందస్సు ...  

కోరు వయసులోన - కొరికే తృప్తిగా  
చేష్టలగను - కలలు తలపు గాను  
సేవ బలము - వర్ణ మవ్వుటే జీవితం  
ప్రేమ బ్లు చూపుటే

చేరు తనువులోన - తాపమే  తృప్తిగా
కష్టములను - కళల వలపు గాను  
కాల మనసు నర్ధ మవ్వుటే జీవితం  
కాల కలలు తీర్చుటే  

అమ్మ పలుకు లోన - బ్రేమయే మానసం
అన్ని తెలుపు - మనసు కదలయయ్యె
కాని పనులు వద్దు - భావమే మానసం
నన్ను మరువటేల నీవు    

వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా
కన్నె మనసు - కలల కవనమయ్యె
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా
నన్ను కనవదేల నీవు

ప్రేమ తలపులోన - బంధ బాంధవ్యమే
ప్రేమ చెలిమి - మాన్సు తలపు గాను
ప్రేమ మనసుచేరి - బ్రేమనే పంచుటే
ప్రేమ అనునదే ఇదీ    
 
కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే
ఇష్ట వయసు - చెలిమి తలపు గాను
నష్ట మనునదేది - చేయకే ఉండుటే
ఇష్ట మనునదే ఇదీ

ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ 

ఓం శ్రీ రామ... శ్రీ మాత్రే నమః 

భగవంతుణ్ని మనం ఏం కోరుకోవాలి? ఇది చాలా సులభంగా కనిపించినా, చాలా కఠినమైన ప్రశ్న. అన్నీ ఆయనే అయి, సమస్తమూ ఇవ్వగల భగవంతుడే కనబడి మనలను కోరుకోమంటే ఏం కోరుకుంటాం? ధనమా! మరణం లేని జీవితమా! ప్రభుత్వమా! శాశ్వత యౌవనమా! పెద్దచిక్కే కదా! ఏది కోరితే శాశ్వతత్వం లభిస్తుందో దాన్ని కోరుకోవడమే సరైనది. ఇంతకీ అది ఏది?

మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎంతోమంది మునులు, రాక్షసులు కఠోరమైన తపస్సు చేసి తీరా భగవంతుడు దర్శనమిచ్చాక ఏం కోరుకోవాలో తెలియక తికమక పడ్డ సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. విచిత్రంగా ఎందరో రాక్షసులు మరణం రావొద్దని, సమస్త విశ్వానికి ఆధిపత్యాన్ని కోరుకొని కోలుకోలేని దెబ్బతిన్నారు. తన సోదరుడైన హిరణ్యాక్షుడిని వధించాడని శ్రీహరిపై పగ పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడిని మెప్పించాడు. విష్ణుమూర్తిని ఎదిరించాలనే లక్ష్యంతో తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని విధాతను కోరాడు. ఆ వరం ఇవ్వడం సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అప్పుడు తనకు మరణం లేకుండా కొన్ని షరతులతో కూడిన వరం అడుగుతాడు హిరణ్యకశిపుడు.


శా॥గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్‌, దిక్కులన్‌,

రేలన్‌, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ

వ్యాళాదిత్య, నరాదిజంతుకలహ వ్యాప్తిన్‌, సమస్తాస్త్ర శ

స్ర్తాళిన్‌, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే.


‘గాలిలో, నేలమీద, నిప్పుతో, నీటిలో, ఆకాశంలో, దిక్కులలో, రాత్రిగానీ, పగలుగానీ, చీకట్లోగానీ, పగలుగానీ, భూచరాలతోగానీ, జలచరాలతోగానీ, పాములతోగానీ, రాక్షసులతోగానీ, దేవతలతోగానీ, మానవులతో గానీ, అస్ర్తాల వల్ల గానీ, శస్ర్తాల వల్ల గానీ మృత్యువు లేకుండా వరం ప్రసాదించమన్నాడు. యుద్ధాల్లో తన ఎదుట ఎవరూ నిలవలేని శౌర్యాన్నీ, లోకాలన్నీ జయించగల శక్తినీ ఇమ్మని కోరుకున్నాడు.

చాలా తెలివిగా చావేలేని వరాలు కోరాననుకున్నాడు కానీ, భగవంతుని ప్రణాళికను ఈ వరాలేవీ అడ్డుకోలేకపోయాయి. ఇందులో ఆశ్చర్యం ఏమంటే తన సోదరుడిని చంపినవాడు, తననూ చంపుతాడేమోనన్న భయం ఒకవంక, తాను కోరినవాటికంటే భిన్నమైన మృత్యుకారక మార్గాలు మరేవీ ఉండవనే అవివేకం మరోవంక హిరణ్యకశిపుడిని మరణానికి దగ్గర చేశాయి. రావణుడు ఇలాగే నరవానరులను వదిలేసి మరెవరిచేత చావు రాకూడదని కోరుకొని మరణించాడు. అంటే, అనివార్యమైన మరణాన్ని ఏ వరాలు ఆపలేవన్నది నిజం. నహుషుడు ఏకంగా ఇంద్రపదవి కోరి తపించి సాధించి అహంకారం నెత్తికెక్కి స్వర్గం నుంచి భూమిపై కొండచిలువగా జారిపడ్డాడు. అలాగే భస్మాసురుడు తానుపొందిన వరంతో తానే భస్మమయ్యాడు.

మనం కోరే కోరిక మనకు మాత్రమే కాదు, సమాజానికీ హితం చేసేదై ఉండాలి. సకల జీవుల సంక్షేమం కోసం దివిజగంగ భువికి రప్పించిన భగీరథుని కోరిక ఉన్నతమైనది. తన శరీరాన్ని దేవతల కోసం అర్పించిన దధీచి త్యాగం అందరికీ ఆదర్శం. కేవలం స్వీయ ఆధిపత్యానికి, మరణాది ప్రకృతి సిద్ధమైన లక్షణాలకు విరుద్ధంగా భగవంతుని కోరే కోరికలన్నీ నిష్ఫలాలే అవుతాయి. నిజానికి భగవంతుని కోరదగింది అనాయాసమైన మరణం, దైన్యంలేని జీవనం, సదాగోవింద స్మరణం అని మన పెద్దలు చెప్పారు. వీటిని కాదని, ఎన్ని ఐశ్వర్యాలను కోరినా అవన్నీ అశాశ్వతాలే అవుతాయి. పరమభక్తుడైనవాడు ఏమి కోరుకోవాలంటే..


నీపాదకమలసేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము నితాం

తాపారభూతదయయును, తాపసమందార నాకు దయసేయగదే!


పోతన చెప్పినట్లు భగవంతుని పాదకమలసేవ, భగవత్‌ భక్తులతో స్నేహం, అంతులేని భూతదయ. ఇవే మనల్ని భగవంతుని దరికి చేర్చే మార్గాలు. ఇవే భగవంతుడిని కోరాల్సిన వరాలు.

.......

‘కృతజ్ఞత ’ అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది మానవ సంస్కారం.

ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమానమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం.

ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి, విధివశాత్తూ కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే –అతని పట్ల సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతజ్ఞత ఎలా ఔతుంది.

మేలు చేసిన సమస్త జీవుల పట్ల కృతజ్ఞత, మేలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పాములు, తేళ్ళు.. ఇలా అన్నింటికి మేలు కలగాలనే భావన ఉండాలి. శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా సరే అందరి మేలును కాంక్షించి కృతజ్ఞత, దయ కలిగి ఉండాలి. ప్రాణులన్నింటికి దుఃఖాలు బాధలు సహజం. కనుక వాటి దుఃఖాన్ని తొలగించటానికి, సుఖాన్ని కలిగించటానికి, అవసర సమయాలలో మేలుచేయటానికి ప్రయత్నించాలి.  

అయితే ఇలా సమస్త జీవుల పట్ల దయ కలగాలన్నా కష్టమే. మనకు మేలు చేసిన వారిపై అనురాగం కృతజ్ఞత ఉంటాయి. కనుక తిరిగి వారికి మేలు చేయాలనిపిస్తుంది. కాని మనకు కీడు చేసిన వారైతేనో వారికి కూడా మేలు చేయాలనుకుంటామా.. అనుకోలేము.

 కాని వారియందు కూడా కృతజ్ఞతాభావం, మేలుచేయాలనే గుణం కలిగి ఉండాలన్నది శాస్త్ర ప్రమాణమని పెద్దలు చెబుతున్నారు.

ఇది వినటానికి బాగానే ఉంది. కాని ఆచరణకు వచ్చేటప్పటికి ఈ నీతి సూత్రాలన్నీ గుర్తుకు రావు. అయితే ఎవరికి సమబుద్ధి ఉంటుందో, అందరిని ఒకేవిధంగా, ఆత్మస్వరూపులుగా, ఒక్కటిగా చూడగలుగుతారో వారే అపకారులకు కూడా ఉపకారంచేస్తూ కృతజ్ఞత చూపగలుగుతారు. మేలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా జీవులకు చేసే హితం, సేవ పరమాత్మకు చేసినట్లే. ఎందుకంటే సమస్త జీవులయందు పరమాత్మే ఉన్నాడు గనుక.

కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది.

అందువలన మనం అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని, కృతజ్ఞతను అలవరచుకోవటానికి ప్రయత్నించాలి. సంతృప్తితో జీవించేవారిని గౌరవించడం నేర్చుకోవాలి.

ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం సహజం. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే అతను తన ఆశకు పరిమితులని ఏర్పరచుకోవాలి.

అన్నీ ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలనుకోవడం వలన అతనికి అనందం లభించదు. సంతృప్తి ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు.

కోరికలను పెరగనిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు. అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు.

తనకు దక్కిన దానితో సంతోషపడటం ప్రతివ్యక్తి నేర్చుకోవాలి. అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు. అక్కడ భౌతిక సంపదలు లేవు. అయితే వారికీ సంతృప్తి అనే సంపద ఉన్నది. అది వారికి ఆనందాన్ని ఇచ్చింది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం. మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది.

.....,

*ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతున్న సమయంలో...*


దొంగలు తుపాకీలు చూపిస్తూ మీరు కదిలితే చంపేస్తాం అని బ్యాంకులో ఉన్న వారిని బెదిరించారు. ఈ డబ్బు ప్రభుత్వానికి సంబంధించినది,

కానీ మీ ప్రాణాలు మీకు సంబంధించినవి. కనుక మీరు ప్రశాంతంగా ఉంటే మా పని మేము చేసుకుని పోతాం అని చెప్పారు.

                                     *"మనసు మార్చే మాటలంటే ఇవే"*


దొంగలను పక్కదారి పట్టించాలని ఒక స్త్రీ అనాగరికంగా ప్రవర్తించడంతో అందులో ఒక దొంగ మేము దొంగతనానికి వచ్చాము. అత్యాచారం చేయడానికి రాలేదు అని ఆమెను భయపెట్టాడు.

      *"దీన్నే అంటారు చేసే పనిలో నిమగ్నత అవసరం అని"*


దొంగలు దొంగతనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. అందులో ఒక దొంగ డబ్బును లెక్కపెడదామని చెప్పడంతో అందులో ఒకడు

ఎందుకు ఎంత డబ్బు పోయిందన్నది

ప్రభుత్వమే ప్రకటిస్తుందిలే అన్నాడు.


*"దీన్నే అంటారు చదువు కన్నా అనుభవం గొప్పది అని"*


బ్యాంక్ అధికారి దొంగతనం జరిగిన విషయాన్ని పోలీసుల కన్నా ముందు అతని పైఅధికారికి చెప్పగా... బ్యాంకులో దొంగతనం జరిగింది మొత్తం రూ.20 కోట్లు. మనం ఇంకో రూ.30 కోట్లు పంచుకుని మొత్తం రూ.50 కోట్లు చోరీ అయిందని చెబుదాం అన్నాడా అధికారి.!

                                          *"దీన్నే అంటారు అసందర్భాన్ని కూడా మనకు ఉపయోగకరంగా (అవకాశంగా) మార్చుకోవడం అని"*


ఇది విన్న ఒక అధికారి ఏటా ఇలాంటి దొంగతనం జరిగితే బాగుంటుంది అని అనుకున్నాడు మనసులో.


*"ఇదే స్వార్థం అంటే"*


✨మరుసటి రోజు షాక్⚡

దొంగతనం జరిగిన ￰మర్నాడు వార్తల్లో...

బ్యాంకులో రూ.100 కోట్లు దొంగతనం జరిగినట్లుగా ఆ రాష్ట ముఖ్యమంత్రి ప్రకటించారు.

అంటే ఆ ముఖ్యమంత్రి వాటా రూ.50 కోట్లన్నమాట._


ఆశ్చర్యపోయిన దొంగలు డబ్బుని లెక్కపెట్టారు. మొత్తం రూ.20 కోట్లు ఉన్నట్టు తేలింది.

అదేంటి మనం రూ.20 కోట్లు దొంగతనం చేస్తే మిగిలిన రూ.80 కోట్లు ఎవరు దొంగతనం చేశారని వారు ఆశ్చర్యపోయారు.!


దొంగలకి విషయం అర్థం అయింది, దొంగల్లో ఒకడికి ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. మనం మన ప్రాణాలు పణంగా పెట్టి రూ.20 కోట్లు దొంగతనం చేస్తే, వీళ్లు మాత్రం దొరల్లా రూ.80 కోట్లు దోచేసుకున్నారు అని.


*"చదువు అవసరం ఇప్పుడు తెలిసింది" అని అన్నాడు*


మన భారతదేశం ఇలాంటి దొంగల చేతుల్లోనూ, అధికారుల మాటల్లోనూ, రాజకీయ నాయకుల పాలనలోనూ నడుస్తున్నది.

                                                ఒక రోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అప్పుడు ఎంపీ కృపాలాని ఎదురై ఇలా అన్నారట.


_కృపాలాని:_ ఏంటి అంబేడ్కర్ ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నారేంటి.?


_అంబేడ్కర్:_ ఈ భారతదేశంలో రాణుల కడుపులో నుంచి రాజులు పుట్టటం చూశాం. కానీ నేను రాణుల కడుపులో నుంచి కాకుండా నా ప్రజల ఓట్లతో ఓట్లపెట్టె నుంచి రాజులు పుట్టేలా ఏర్పాటు చేశాను.. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను.


_కృపాలాని:_ అయితే నీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు..

ఎందుకంటే నీ ప్రజలు పేదవారు, నిస్సహాయులు, అడుక్కునే వాళ్లు, అమ్మడుపోయే వాళ్ళు..

మేము వారి ఓట్లు కొని మా ప్రభుత్వాలు ఏర్పాటుచేసి ప్రజల సొమ్మును దోచుకుని వాళ్లను బిచ్చగాళ్లను చేస్తాం, నువ్ ఏమీ చేయలేవు.


_అంబేడ్కర్:_ నా ప్రజలు పేదలే, నిస్సాహయులే, అడుక్కునే వారే, అమ్ముడుపోయే వారే..

వారి ఓట్లను కొని,

మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చు..

కానీ, ఏ రోజయితే నా ప్రజలు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో అప్పుడు మీకన్నా బిచ్చగాళ్లు ఎవరు ఉండరు, అది గుర్తుంచుకోండి అన్నారు బాబాసాహెబ్.


*_ఇది కథ కాదు.. జరిగిన సంఘటన._*


*నీ ఓటు విలువ నువ్వు గుర్తించే వరకూ ఈ అవినీతిపరుల చేతుల్లో బలవుతూ ఉండాల్సిందే..


💐అందరికి శుభోదయం 💐

.....

ఏవరో మిత్రులు పంపించారు....

వారికి నా అభినందనలు..💐 💐 💐 

*కూరగాయల మనోభావాలు..* 


*గోంగూరకి* ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని...

*తోటకూరకి* వయ్యారం ఏక్కువ ..

ఏందుకంటే నవనవ లాడతానని ...

*పొట్లకాయకి* పొగరు ఎక్కువ.. 

ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని....

*చిక్కుడుకు* చికాకు ఎక్కువ.. 

ఎందుకంటే తనని గోరుతో గోకుతారని....

*కందకి*..వెటకారం ఎక్కువ..

ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....

*చేమకు* చిమచిమలు ఏక్కువ ...

ఏందుకంటే కూర -  పులుసు - fri గా ఉపయోగ పడతానని ...

*పేండలానికి* పేంకితనo ఏక్కువ ....

కత్తిపీటతో తరూగూతారని ...

*మునగకాయకి* మురిపం ఏక్కువ ...

మగవారికి దివ్య ఔషధం అని ...

*వంకాయకి* గర్వమెక్కువ ..

కూరగాయలన్నింటికీ తనే రారాజునని....

*అరటికాయకి* అభిమానం ఏక్కువ ...

శాఖాకూర అయిన తనను మాంసంతో పోల్చి లంకమాంసం అంటారని ..

*బెండకాయకి* ఆనందమెక్కువ..

తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని....

*దొండకాయకి* ఆందోళనెక్కువ.. 

కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని....

*కాకరకాయకి* శాంతమెక్కువ.. 

ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా....

*బంగాళాదుంపకి* సహనమెక్కువ..

కూరలకైనా,చిరుతిండ్లకైనా, పూరీకైనా,పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....

*గుమ్మడికాయకి* గాంభీర్యమెక్కువ.. కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా....

*ఆనపకాయకి* ఆనందం ఏక్కువ ...

యేలాగయినా అన్నిరకాలుగా తనని తింటారని ...

*ఉల్లిపాయకి* టెక్కు ఎక్కున..

తానులేనిదే  ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని....

*మిర్చికి* కోపమెక్కువ..

ముందు నోటినీ,తరువాత కడుపుని మండించేస్తుంది....

*కరివేపాకుకి* మిడిసిపాటు ఎక్కువ..

తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని....

*బీరకాయకి* దిగులెక్కువ..

తనను ఎడాపెడా వాడేస్తారని,పీచుని కూడా వదలరని....

*కారెట్ కి బీట్ రూట్ కి* హంగామా ఎక్కువ..

తమంతటి రంగు ఎవరికీ లేదని....!!

ఆఖరిగా *పనస పొట్టుకి* పరువం ఏక్కువ (గ్లామరు)

ఏలాంటి వాళ్ళనైనా సంత్రుప్తి పరుస్తానని ....

.......

కనువిప్పు కలిగించే యదార్ధ గాథ. 🙏


‘  ఓమ్ భూర్భువస్సువః –తత్సవితు ర్వరేణ్యం


భర్గో దేవస్య థీమహి– థియో యోనః ప్రచోదయాత్-‘


 అని తాతగారి గదిలోంచి వినిపిస్తున్న’ గాయత్రీ మంత్రా’ న్ని విని వినోద్, వనజా  నవ్వుకున్నారు.


“తాతగారికి ! చాదస్తం ఎక్కువలా ఉంది..ఇలా రోజూ మూడు వేళలా మూడు  గంటల సమయం వృధా చేసుకుంటున్నారు.  దీని బదులు వాకింగ్ కానీ, మరేదైనా ఎక్సర్ సైజ్ చేస్తే మేలు కదా!” అన్నాడు వినోద్. వంటగదిలోంచి  వీరి మాటలు వింటున్న బామ్మ భవాని ” ఏరా! తాతగారిని విమర్శించేంత  గొప్పవారా మీరు!  మీకేం తెల్సురా ‘ గాయత్రీ ‘ మాత  ప్రభావం ? “అంది కోపంగా.


“ఏంటర్రా!  పిల్లలూ! మీ బామ్మ ఏదో చెప్తున్నట్లుంది ? ఏదైనా కధా?” అని అడిగాడు తాత  తారకరామయ్య.


“వీరికి కాస్త గాయత్రి గురించి చెప్పండి .’గాయత్రీ మాత ‘మహత్వం తెలీక ఏదో అనుకుంటున్నారు . పైకి అనలేదు కానీ వీరి మనస్సుల్లో ‘ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ?’ అనే సందేహం మాత్రం ఉంది .” అంటూ బామ్మ వంట గదిలోకి  వెళ్ళింది.


తారకరామయ్య తన వాలు కుర్చీలో కూర్చున్నాక,  పిల్లలిద్దరూ  వెళ్ళి ఆయన కిరువైపులా  స్టూల్స్ లాక్కుని కూర్చుని ” తాతగారూ చెప్పరూ! ప్లీజ్ ! ” అని అడిగారు.


ఆయన గొంతు సవరించుకుని చెప్పసాగారు. “ఇది  నిజంగా జరిగిన సంఘటన, కల్పనా కాదు, ఎవరో రాసిన కధా కాదు. యదార్ధగాధ.  అది ఆంగ్లేయులు మన దేశంలో ఉన్నప్పటి విషయం,  అప్పటి ఒక ఆంగ్ల దొర ‘ధామస్ మన్రో ’ అనే ఆయన పేరని గుర్తు. క్యాంప్ మీద కన్నడదేశానికి వచ్చి, ఒక రోజున తన గుఱ్ఱం మీద   తుంగభద్రా నది ఒడ్డున షికారుకు బయల్దేరాడు . ఆయన తోటి షుమారుగా  అరడజను మంది జవాన్లు గుఱ్ఱంతో పాటుగా పక్కనే పరుగెడుతూ  అనుసరించ సాగారు.


” మన గురించీ  ఏమనుకుంటున్నారు జనం?” ధామస్ తన వెంట ఉన్న వారిని అడిగాడు.                                                                         ” “చాలామంచివారనుకుంటున్నారు దొరా!” వారిలో ఒక ముఖ్య సేవకుడు, బాపన్న చెప్పాడు.


” మీరంటే  అందరికీ భయమే దొరా!”  ముఖప్రీతికై మరో జవాన్ చెప్పాడు.


” సరి, సరి.ఈ రోజు విశేషాలేంటి?” ధామస్ మళ్ళీ అడిగాడు.


“ఏమున్నాయ్ దొరా! మీరీ  సమయంలో  షికారుకు వస్తున్నారు కదా ఈ వారంగా ఒక్కపిట్టా ఈ దారంట రాదు.”


“ఓహ్! అక్క డ చాలామంది జనం ఉన్నారు? ఏంటి విశేషం! ” ఆశ్చర్యంగా అడిగాడు ధామస్ .


” దొరా! అక్కడ నది ఒడ్డున ‘ శృంగేరి పీఠాధిపతులు’  కొలువు చేసి ఉన్నారు , ఆయన శిష్యులూ , స్వామి వారి ప్రవచనం ఆలకించను ఊరి జనమూ చేరి ఉన్నారు దొరా!”


“శృంగేరీ పీఠమా! అదేంటీ ఎన్నడూ విన లేదే?”


” దొరా ! మీరిక్కడికి ఎప్పుడూ రాలేదు కదా ! అంచేత విని ఉండరు. ఈ కన్నడదేశంలోని , చిక్క మగళూరు దగ్గరే శృంగేరి ఉంది. ఆది శంకరాచార్యులు  ధర్మ ప్రచారం కోసం మొదటి మఠాన్ని ఇక్కడ శృంగేరీ లో స్థాపించారు.”


” శృంగేరి అంటే అర్ధమేంటి ? దానికా పేరు మఠస్థాపన తర్వాత వచ్చిందా ? లేక ముందు నుంచే ఉందా? “    “శృంగేరి తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది దొరా!. తుంగభద్ర నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం , తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉన్నాయి . శృంగేరి అనే పేరు ‘ఋష్యశృంగగిరి ‘నుండి వచ్చిందని అంటారు దొరా! శృంగేరికి సమీపంలో  ’ శృంగపర్వతం’ ఉన్నది .  విభండక మహర్షి కుమారు డు  ‘ ఋష్యశృంగ ‘ మహర్షి.  ఈ యోగి మహానుభావుడు  ఒకసారి ‘రోమపాదు’ డనే రాజు పాలిస్తున్న ‘అంగ రాజ్యం’ క్షామానికి  గురై , జనం బాధపడసాగారుట. ఆ సమయంలో, ఋష్యశృంగుడు  అడుగు పెట్టగానే  వర్షాలు పడి, క్షామ నివారణ ఐనదని అంటారు . ఈ గ్రామములో శంకరాచార్యులు అద్వైతాన్ని వ్యాప్తి చేయ టానికై  స్థాపించినదే ఈ శృంగేరీ శంకరమఠం. ”


” ఎంతైనా మీ భారతదేశం చాలా గొప్పదోయ్ ! మహాను భావులు ఎంతోమంది ధర్మస్థాపనకై కృషి చేసిన ‘పుణ్యభూమి’ మీది. నాకెంతో ఇష్టం  మీ దేశమంటే , నేనిక్కడ పుట్టకపోతినే అని బాధపడుతుంటాను అప్పుడప్పుడూ.”  ధామస్ మనస్పూర్తిగా అన్నాడు.


“ఔ దొరా! మాదేశం మహా గొప్పది!” మురిసిపోతూ  తన దేశాన్ని గురించీ చెప్పుకున్నాడు మరో జవాన్  రొప్పుతూ వెంట నడుస్తూ.


” శంకరాచార్యుల వారు మఠాన్నిఇక్కడే ఎందుకు  స్థాపించాలనుకున్నారో తెల్సా?” థామస్ అడిగాడు.


“శంకరాచార్యుల వారు, తన పరివార శిష్యులతో ధర్మ ప్రచారం కోసం దేశాటన  జరుపుతూ ఇక్కడ పర్యటిస్తూన్నప్పుడు, ఆయన ఒక చిత్రం చూశారు దొరా! ఒక సర్పం ప్రసవిస్తున్నఒక కప్పకు ఎండ పడకుండా తన పడగ నీడ పడుతున్న దృశ్యం , ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు , ఈ స్థల మహత్యం గొప్పదని గమనించారు .  అంతే కాక ఇక్కడ వరకు వచ్చేసరికి మండన మిశ్రుడి భార్య ఐన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారి పోతుంది. ఆ కధ చాలాపెద్దది ఇంకోమారు చెప్తాను దొరా! ఈ రెండు సంఘటనలు చూసిన  ఆయన  ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మఠాన్ని స్థాపిస్తారు . ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారని చెప్తారు. అంత గొప్ప పుణ్యక్షేత్రం  ఈ శృంగేరి.”


“మరి ఆ మహాపురుషుడేనా ఈయన? ”


” కాదు దొరా అది జరిగి చాలా ఏళ్ళైంది . ఈయన ఆ గురు పరంపరలోనివారే ! వీరంతా బాల్యంలోనే  పీఠాన్ని చేరి వేద వేదాంగాలూ , శంకరాచార్యుల వారు ప్రవచించిన విశేషాలన్నీ అధ్యయనం చేస్తారు దొరా ! వీరంతా బ్రహ్మచారులు, ఎవ్వరూ వారిని ముట్టుకోడం కాదుగదా! దరిదాపులకు వెళ్ళనే ఝడుస్తారు , స్త్రీలైతే బహు దూరం నుంచీ దర్శించవలసినదే! వారు అనుగ్రహ భాషణంలోని ఆధ్యాత్మిక విషయాలు చాలా గొప్పవి దొరా! ఒక్కటి  ఆచరిస్తే  చాలు జన్మ సార్ధకమవుతుంది.”                                                                                                                                   దూరం  నుంచీ ఆ ఆచార్యులను గమనించిన ధామస్ ” ఆహా! ఆ ముఖ వర్చస్సెంత గొప్పగా ఉంది! వెయ్యి వాల్టుల బల్బు వెలుగుతున్నట్లుంది వారి తేజస్సు! మరి బాపన్నా! ఆచార్యుల చెంతగా ఉన్న ఆ స్త్రీ మూర్తి  ఎవరు? స్త్రీలకు ప్రవేశమే లేదన్నట్లు చెప్పావు ? మరి వారికి అంత దగ్గరగా ఉన్న ఆ అందమైన ,  అద్భుతమూర్తి, టీనేజ్ గాళ్  !ఎవరు బాపన్నా! వెళ్ళి తెల్సుకుని వస్తావా? ఈజ్ షీ హిజ్ సిస్టర్ !”                                                                                                                          ” దొరా! మాకక్కడ ఎవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే! మీకెవరు కనిపిస్తున్నారు?”


” అదో బాపన్నా! అంత బాగా కనిపిస్తుంటే లేదంటావేం? వెళ్ళి అడిగిరాపో?” అన్నాడు ధామస్ దొర .


దొర ఆదేశం మేరకు బాపన్న  చేతులు కట్టుకుని  దగ్గరగా వెళ్ళి వినయంగా , ఆచార్య శిష్యులకు తమ దొర సందేహం విన్నవించాడు .


ఆ శిష్యుడు ఆశ్చర్యంగా ”  అక్కడ మాకెవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే ! అసలిక్కడ స్త్రీలకు ప్రవేశమేలేదే?” అన్నాడు.                                                                                                                                                        బాపన్న” ఔ  స్వామీ! మాకూ కనిపించడంలేదు . కానీ మా దొరకు కనిపిస్తున్నదిట! అడిగి వివరం తెల్సుకు రమ్మన్నారు. పీఠాధిపతులకు విన్నవించండి”అన్నాడు.


ఆ శిష్యుడు పీఠాధిపతులను సమీపించి , ఆ దొరగారి సందేహాన్ని  చెప్పగానే  , ఆశ్చర్యంగా ఆయన తలెత్తి దూరంగా గుఱ్ఱం దిగి తననే దీక్షగా చూస్తున్న ఆ దొరను చూసి,” నాయనా! నా సమీపంలో ఉన్నది శారదా మాత! ఆ తల్లి దర్శనం ఎవరికో నిష్టగా గాయత్రి  చేసే వారికి కానీ లభించదు . నేను ఇక్కడ ప్రవచిస్తున్నప్పుడంతా ఆ మాత  నా సమీపంలో ఉండి సద్వాఃక్కులను నా నోట పలికిస్తుంటుంది . నాశిష్యులైన మీరే కాంచలేని  ‘అమ్మ’ను  ఆ దొర దర్శించాడంటే  ఆయన పూర్వజన్మలో భారతదేశంలో జన్మించి , గాయత్రీ జపం సంపూర్ణంగా , నిష్టగా  గావించి  ఏదో ఒక కారణాంతరంవల్ల ఆంగ్లేయుడై , ఆ ప్రాచ్యదేశంలో జన్మిం చాడు. నేను  పీఠాధిపతిని కనుక ఆయనకు నమస్కరించరాదు .  లేనిచో  ఆయన  నమస్కార అర్హుడని వెళ్ళి చెప్పిరా!” అని శృంగేరీ  పీఠాధిపతి  చెప్పిపంపారు. ‘


“అదిరా గాయత్రీ మంత్ర మహత్యం  అర్ధమైందనుకుంటా ! నియమంగా భక్తితో  జపించిన వారికి  ఈ జన్మలోనే కాక మరు జన్మలోనూ రక్షణ నందిస్తుంది.” అని తాతగారు వివరంగా చెప్పారు. .


పిల్లలిద్దరూ ” మన్నించండి  తాతగారూ!! మాకివన్నీతెలీక తేలిగ్గా మాట్లాడాము. మాకూ ’ గాయత్రి’ ఉపదేశించండి.. ఈ వేసవిలో ఇక్కడ ఉన్నన్నాళ్ళూ మీతో పాటు  రోజూ  గాయత్రి  చేస్తాము . మా ఊరువెళ్ళాక వీలున్నంత సేపు నిత్య గాయత్రీ చేసేందుకు ప్రయత్నిస్తాము.”  అన్నారు



విదుర నీతి: నిద్ర పట్టని వాళ్లు ఎవరు?

జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని రుషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.

ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి,  వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.

రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.

సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!

జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.

మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.

‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు. మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు. సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది!

.......


Tuesday, 5 July 2022




కర దండం 


గ్రామాలల్లో సాదారణ ప్రజలు ప్రతివారు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర పట్టుకొని వెళ్లేవారు. వారు ఆ కర్రను అనేకవిధాలుగా వాడేవారు. ఏమైనా విషపురుగులు అంటే పాములు తేళ్లు మొదలైనవి వారి దారిలో కనపడితే వెంటనే ఏది వెతకాల్సిన పనిలేకుండా వాటిని  హతమార్చేవారు. ఇక కుక్కలు లాంటి జంతువులు వారి చేతిలోని కర్రను చూసి వారి జోలికి వచ్చేవే కావు.  మీరు గమనించి ఉండొచ్చు కుక్కలు ఒంటరిగా ఒకమనిషి కనపడితే గుంపులుగా వచ్చి దాడిచేస్తాయి.  ఈ విషయం మనలో కొందరికి అనుభవం కలిగి కూడా ఉండొచ్చు. ముందుగా ఒక కుక్క వచ్చి అరుస్తుంది తరువాత మిగిలిన కుక్కలు ఎక్కడినుండి వస్తాయో తెలియకుండా వచ్చి దాడి చేస్తాయి.  అదే నీ చేతిలో కర్ర ఉంటే మాత్రం అవి నీ జోలికి రావటానికి  వెనకాడతాయి. అధవా నిన్ను చుట్టుముట్టిన వెంటనే నీవు నీ చేతికఱ్ఱతో నిన్ను నీవు కాపాడుకోగలవు. కాబట్టి చేతిలో కర్ర ఉండటం సదా క్షేమకరం. ఇక విషయానికి వస్తే 


సాదాకా రోజు  నీ వెంట ఒక గుంపుగా కుక్కలు దాడి చేస్తున్నాయి. కానీ నీకు ఆ విషయం తెలిసినా కూడా నీవు వాటిని పరిగణలోకి తీసుకోక నీవు నేను రోజు ఆ కుక్కల దాడికి  బలవుతున్నాము. సాధకుడు తన సాధనను ముందుకు సాగాలంటే తప్పకుండా ఈ కుక్కలగూర్చి తెలుసుకోవటమే కాక వాటినుండి ఎట్లా రక్షణ పొందాలో తెలుసుకోవాలి. ఇప్పడికే మీకు నేను దేనినిగూర్చి చెపుతున్నానో తెలిసే ఉంటుంది అదేనండి ఆ కుక్కలు యేవో కావు అవే అరిషడ్వార్గంగా పేరుపొందిన ఆరుగురు శత్రువులు. అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. మన శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను జయించాలి. అవి యేమియనగా కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ప్రతి మనిషి మనస్సును ఈ ఆరు కలిసికాని లేక ఏ ఒక్కటో లేక ఒక్కటి కంటే ఎక్కువో చేరి కలుషితం చేస్తాయి.  వీటిలో ఏ ఒక్కదానికి చిక్కినా సాధకునికి సాధన అస్సలు కుదరదు.  సాధారణంగా మనం ఎవరైనా ఒక ముఖ్యమైన విషయం చేపుతుంటే కొన్ని సందర్భాలలో వాటి మీద నీవు శ్రార్ధ చూపవు ఎందుకురా నేను ఇంతముఖ్యమైన దానిని చెపుతుంటే ఏమి ఆలోచిస్తున్నావు అని నీ మిత్రుడు అడిగితె ఏమిలేదురా ఈవేళ నా మనసెందుకో బాగా లేదని సమాధానం ఇస్తావు.  నిజానికి నీ మనస్సు బాగా లేకపోవటానికి కారణం పైన తెలిపిన ఏదో ఒక శత్రువు దాడి కానీ నీవు ఆ విషయాన్ని గమనించవు.  అదే నీవు గమనిస్తే వాటిని అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేస్తావు. మన పురాణాలలో, ఇతిహాసాలలో ఈ ఆరు శత్రువుల వలన ఎవరు యెట్లా నష్టపోయారా చెప్పారు. కాబట్టి సాధక మేలుకో ఈ ఆరు కుక్కలను నీ మీద దాడి చేయకుండా నిరోధించే ప్రయత్నం చేయి.  అకుంఠిత దీక్షతో తపస్సు సాగిస్తున్న విశ్వామిత్ర మహర్షికి మేనకా సాంగత్యంతో తపోభంగం కలిగిన విషయం మనకు విదితమే.  ఇప్పుడు సాధకుల సాధనను బంగపరచటానికి దేవలోకం నుంచి మేనక దిగి రానవసరం లేదు ఏ సాధారణ స్త్రీ అయినా చాలు.  ఇలా వ్రాస్తున్నందుకు ఏమి అనుకోవలదు.  ఎందుకంటె మనం చేసే సాధన అంతబలహీనంగా వున్నదని నా భావన. 


మరి ఈ ఆరు శత్రువులను పారదోలే దండం ఎక్కడ వున్నది అది నాకు దొరుకుతుందా అని అడగవచ్చు.  అది నీ దగ్గరే వున్నది కానీ నీవు దానిని ఉపయోగించటం లేదు ఏమిటి అది అంటే అది మరేమో కాదు నిత్యం దైవ చింతనం.  ఎప్పుడైతే సాధకుడు దైవచింతనంలో నిమగ్నుడై ఉంటాడో వాని చెంతకు ఈ ఆరు శత్రువులల్లో ఏ ఒక్కటి కూడా దాడి చేయటానికి సాహసించవు.  ఎందుకంటె అన్ని శత్రువులను ఎదుర్కునే కర దండం దైవచింతన మాత్రమే ఇది సత్యం.  అందుకే ప్రతి క్షణం దైవచింతన చేయాలని   దైవఘ్నులు వక్కాణిస్తున్నారు. 


సాధకుడు సదా ఈశ్వర జ్యానంలో ఉంటే ఎట్టి పరిస్థితిలోను మనస్సు అరిషడ్వార్గం మీదికి పోదు.  అధవా పోయిన వెంటనే తన తప్పు తాను తెలుసుకొని దైవత్వం వైపు నడుస్తుంది.  కాబట్టి మిత్రమా ఎల్లప్పుడూ నీ మనస్సును ఆ దేవదేవుని మీదనే వుంచు.  ఆధ్యాత్మిక ప్రగతిని సాధించు.

.,......

*చతుఃషష్టి ఉపచారాలు*


ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.

1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం

2. ఆభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం

3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం

4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం

5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం

6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట

7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట

8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము

9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం

10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం

11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం

12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం

13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం

14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం

15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం

16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము

17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము

18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం

19. దానిపైన చంద్ర శకలం పెట్టడం

20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం

21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం

22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం

23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం

24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం

25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం

26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం

27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము

28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట

29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం

30. పతకం – బంగారు పతకం

31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం

32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం

33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం

34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము

35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)

36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు

37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు

38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము

39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము

40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)

41. పాదకటకం – కాలి అందెలు

42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు

43. పాదంగుళీయములు - మట్టెలు

44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు

45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం

46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు

47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు

48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు

49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం

50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట

51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట

52. ఆచమనీయము – జలమునందించుట

53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)

54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము

55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం

56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట

57. చామరము – అమ్మవారికి చామరము వీచుట

58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట

59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట

60. చందనం – గంధం పమర్పించుట

61. పుష్పం – పుష్పాలను సమర్పించుట

62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట

63. దీపము – దీప దర్శనము చేయించుట

64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట

ఏకాంతము..


🙏సర్వోజనా సుఖినోభావంత్🙏

......

జీవితం ఒక నదిలాంటిది. దాని ఈవలి ఒడ్డు పుట్టుక. పుట్టిన ప్రతి మనిషి  జీవనం సాగించాలి. తరువాత, ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఈ మరణమే ఆవలి ఒడ్డు. అలా ఆవలి వైపుకు చేరుకున్నవారందరూ ఏమయ్యారు.. ఎక్కడికి వెళ్లారు.. తిరిగి మళ్ళీ పుడతారా ఇటువంటి విషయాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి.

సృష్టి.. సృష్టికర్త.. దేవుడు.. పరమాత్మ.. ఆత్మ.. ఆస్తికత్వం.. నాస్తికత్వం.. శాస్త్రీయావగాహన.. హేతుబద్ధత .. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వీటిని బట్టి మన ఆలోచన.. ఆలోచనా విధానం..విశ్వాసం.. నమ్మకం..వైఖరి ఏర్పడి చావు పుట్టుకలను అర్ధం చేసుకుని , వాటిని విశ్లేషించగల శక్తి వస్తుంది.

మృత్యువు అంటే మనకు ఎన్ని విభిన్నమైన అభిప్రాయాలున్నా జనన, మరణాల మధ్య మనం గడపవలసిన.. గడిపే జీవితం పట్ల చాలామంది ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. అరుదుగా లభ్యమైన ఈ జన్మను అర్ధవంతం చేసుకోవాలని తపిస్తారు. సకల ప్రాణరాశిలో ఆలోచనలో.. మేధలో.. తార్కికత లో..నిరంతరం ఎదగగలిగే ఏకైక జీవి మానవుడే.

ఇది గ్రహించాడు కనుకనే ఈ సృష్టి లో తన ఉనికికి ఒక సార్ధకత చేకూర్చాలని ఉవ్విళ్ళురుతాడు. ఇక్కడే అందరూ వర్గ వైరుధ్యాలను.. మత విశ్వాసాలను వీడి ఏకభావనులవుతారు. మనసా.. వాచా.. కర్మణా మంచి చేయటానికి ప్రయత్నిస్తారు. కరుణ, ప్రేమలను చూపుతారు. తాము చేసే పనులకు తమ మనస్సునే సాక్షిని చేసుకుంటారు. తోటివారికి శక్తి మేరకు సహాయం సహకారాలనందిస్తారు.

ఇదే  కేవలం నేను.. నా కుటుంబమే ..నా సంక్షేమమేనన్న సంకుచిత.. స్వార్ధ భావన, చింతనల నుండి మనిషిని వేరుచేసి.. అతణ్ణి ఉన్నతుడుగా.. విశ్వమానవుడిగా చేసి...మనీషి గా.. చేస్తుంది. ఇదే అర్ధవంతమైన జీవితమంటే. మనం కన్ను మూసే లోపు ఆ గొప్ప స్థితి కి చేరాలని.. కనీసం ప్రయత్నం చేయాలన్న సంకల్పం వుండాలి. దాన్ని మరింత బలోపేతం చేసే ధతిని జత చేయాలి. ‘ ఒక అర్ధరహితమైన జీవితాన్ని కన్నా ఒక అర్ధవంతమైన చావును కోరుకుంటాను. ‘ ఒక గొప్ప తాత్వికుడి మాటలు ఎంత అక్షర సత్యాలు!

శరీరంలోని కణం, కణజాలంలోని ప్రాణాధారమైన శక్తి సమూలంగా, సంపూర్ణంగా నశించినపుడే మనిషి చనిపోవడం జరుగుతుంది. ఈ చావును ఒకొక్కరు ఒకొక్క రకంగా భావన చేస్తారు. చూసే వ్యక్తి దృష్టి.. దృక్పధం... అవగాహనా శక్తిని బట్టి అర్ధం గోచరిస్తూ ఉంటుంది. వేదాంతులు చావును ఈ శరీరమనే కారాగారంలోబందీ గా వున్న ఆత్మ స్వేచ్ఛను పొందే ఒక అద్భుత వరంగా చెపుతారు. ఆధ్యాత్మిక పరులు జీవాత్మ, పరమాత్మల కలయికగా అభివర్ణిస్తారు.

శాస్త్రవేత్తలు.. భౌతిక శాస్తవేత్తలు .. నాస్తికులు ఒక సహజపరిణామంగా చూస్తారు. ప్రతి ఒక్కరి పుట్టుక చావుతో అంతం కావాలి. ఇది తప్పనిది. తప్పించుకోలేనిది. చదువుకున్న వాడైనా.. చదువుకోనివాడైనా... ధనవంతుడైనా.. పేదవాడైనా.. జ్ఞానైనా, అజ్ఞానైనా మృత్యువాత పడక తప్పదు. జీవితాన్ని ఎవరెలా ఆస్వాదించారు.. ఉన్నంతలో ఎంత తృప్తిగా జీవించారు.. ఎంత చక్కగా భాషించారు.. పవిత్రమైన మనస్సుతో ఆలోచనలు చేసారు అన్న ఈ వివరాలు ఏ ఒక్కరి జీవితంలో ఉంటాయో ఈ జీవితం గొప్పది. వారే గొప్పవారు.

   కొందరికి చావంటే భయం. ఇది వారికి సహజాతం. ఇది వారిని జీవించనీయదు. దానికి వారిని సమాయత్తం చేయదు. ఈ భయంతో  వారు జీవితాన్ని హాయిగా.. ఆహ్లాదంగా.. ఆనందంగా గడపనేలేరు. ఇది ఆధార రహితమే కాదు అర్ధరహితం  కూడ. ఎందుకని..? వారికి ప్రపంచంలోవారొక్కరే చనిపోతున్నారేమో నన్న ఆలోచన. కాని ప్రతి ఒక్కరూ  మరణిస్తున్నారు కదా! ఇది వారి మనసుకు.. బుద్ధికి తట్టదు. ఒకవేళ  తట్టినా  చావకుండా ఉంటే బావుండునన్న కోరిక. ఎంత అసంబద్ధ మైనది..! ఎంత అసాధ్యమైనది..!

ఎంత మంది మృత్యువు నుండి తప్పించుకునే ప్రయత్నం రకరకాలుగా చేసి... తార్కిక శక్తిని వినియోగించక అసాధ్యమైన కోరికలడిగి ఎలా భంగపడ్డారోచెప్పే ఉదాహరణలు పురాణాలలో ఎన్నో వున్నాయి. ఎవ్వరినీ వదలని మత్యువు తనను విడిచిపెట్టదని, తను చావక తప్పదన్న నిజాన్ని బోధపరచుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. జీవితాన్ని చక్కగా గడపాలి. ఈ సహజ భయానికి తోడు .. మహమ్మారి అంటువ్యాధులు.. విపత్తులు సంభవించిన వేళలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, భయ విహ్వలురై చనిపోయేవారుంటారు. ఇది కూడా కూడదు.

    చావనేది కష్టం కాదు. నష్టమూ కాదు. మనం బతికున్నప్పుడే మనలో ఆలోచనలో చనిపోయేవి.. అంటే మాయమయ్యేవి.. కొన్ని ఉంటాయి. వాటివల్ల మనం ఎన్నో కోల్పోతాం. ఎంతో నష్టపోతాం. ఏమిటవి..? కరుణ.. ప్రేమ.. పరోపకారం.. సహకారం..! వీటివల్ల మానవత్వానికి దూరమవుతాం. నిజానికి దీనికి మనం భయపడాలి.

    జీవితాన్ని గడపటం వేరు. జీవించటం వేరు. మొదటిది యాంత్రికం. రసవిహీనం. ఇది ఒక రకమైన మృత్యువే. ఇక రెండవది జీవించటమంటే ఉన్నంతలో తృప్తిగా, చెడు ఆలోచన మొగ్గలోనే చిదిమేస్తూ చేయగలిగిన సాయం నలుగురికి చేస్తూ, కష్టాలనుండి పాఠాలు నేర్చుకుంటూ, ఆనందంగా ఉండటం. మనిషి ఎలా మరణించాడన్నది ముఖ్యం కాదు. ఎలా జీవించాడన్నది చాలా ముఖ్యం. దీనికి ధనానికి సంబంధమేమి లేదు.

జీవిత వైఖరి.. విలువలు.. మానసిక స్థితి.. ధైర్య, స్థైర్యాలు.. వీటివల్లే మనిషి జీవితం గొప్పదా.. కాదా అన్నది నిర్ణయ మవుతుంది.

   జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని కొందరు.. ఆత్మ ఈ శరీరమనే చెరసాల నుండి స్వేచ్ఛ పొందుతుందని ఇంకొందరు, ఇవేమీ కావని చావు ఒక ఒక సహజ సంఘటనని మరికొందరనచ్చు. ఈ భావనలో భేదాలున్నా జీవితాన్ని ఆదర్శంగా, మంచిగా, విలువైనదిగా చేసుకోవాలన్న విషయంలో అందరిదీ ఒకే అభిప్రాయం. ‘పిరికివాళ్ళు తమ మరణానికి ముందే చాలాసార్లు చనిపోతారు. కాని స్థైర్యవంతుడు ఒక్కసారే మృత్యువును రుచి చూస్తాడు. అన్న షేక్సి్పయర్‌ మాటలు మనస్సులో పెట్టుకుంటే మృత్యువుకు భయపడకుండా జీవితాన్ని ఎలా జీవించాలో వస్తుంది.

   మనం పొందిన ఈ జీవితం అపురూపం. మళ్లీ లభిస్తుందో లేదో తెలియదు. ఇది మరల తిరిగి రాదని కొందరు భావిస్తారు. అందుకే ఈ జీవితాన్ని మంచితనంతో, మంచిపనులతో సుగంధ భరితం చేసుకోవాలి. ఇక్కడ.. సరిగా ఇక్కడే మనిషి తన తెలివితేటలను.. యోచనను..వివేచన విచక్షణలను ఉపయోగించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తను బుద్ధిశాలని నిరూపించుకోవాలి.

......,..


ఒక పనిని ప్రతి రోజూ ఒకే సమయానికి చేస్తుంటే దానిని అలవాటు అంటాం. దానిని సూర్యోదయం, సూర్యాస్తమయాలంత సహజంగా, క్రమం తప్పకుండా చేస్తుంటాం. అలా ఇది మన జీవితంలో, వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. దీనికి అంతర్గత ప్రేరణ ఉంటుంది. అంటే, కొన్ని ఏళ్లుగా తెల్లవారు ఝామునే లేవడాన్ని అలవరచుకుంటే అలారం అవసరం లేకుండా ఆ సమయానికి అప్రయత్నంగా మెలకువ వచ్చేస్తుంది.

ఒకే సమయానికి భోజనం చేయటం, పడుకోవటం కూడ ఇలాంటివే! వీటిని స్థిర అలవాట్లంటాము. సత్పురుషుల సాంగత్యంతో దానగుణం, పరోపకారం, పెద్దవాళ్ళని గౌరవించటం, నిస్సహాయులకు అండగా నిలవటం, చక్కగా సంభాషించటం, సరైన నిర్ణయాధికారం అనే మంచి అలవాట్లను ప్రయత్నపూర్వకంగా అలవరచుకుంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇవి నిలిచిపోతే, వీటి వల్ల వ్యక్తిగత ప్రగతి తద్వారా సమాజ ప్రగతి కలుగుతుంది..

అలవాట్ల మీద నియంత్రణ అవసరం. మంచి అలవాట్లు కూడ ఒక్కోసారి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆహార పానాదులు ఒక నిర్ణీత కాలంలో తీసుకునే మనకు అన్నివేళలా అలా సాధ్యం కాకపోవచ్చు. అందుకనే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రతి మంచి అలవాటు కూడ ఒక చెడ్డ అలవాటే నంటాడు. అలవాట్లను మన అధీనంలో ఉంచుకోవాలి. మన శరీరం మన అధీనం లో ఉండాలి గాని అది చెప్పినట్లు మనం వినకూడదు. దాని వశంలోకి మనం వెళ్ళకూడదు.

శరీరానికి ఏది అలవాటు చేస్తే అదే అలవాటవుతుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నడక, వ్యాయామం చేసే అలవాటున్న వాళ్లకు ఒక్కరోజు చేయకపోయినా ఆ వెలితి తెలుస్తుంది. మంచి అలవాట్లు జీవితానికి ఒక క్రమశిక్షణ నిస్తాయి. బాల్యంలో ఏర్పడిన మంచి అలవాట్ల వల్ల మనం పొందే ప్రయోజనం ఎంతగానో ఉంటుంది. ఇది చాలా కాలం కూడా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల, ఉపాధ్యాయులపాత్ర, బాధ్యత ఎంతో ఉంది.


సాధారణంగా చెడుకి ఆకర్షణ ఎక్కువ. దీనివల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మంచి అలవాట్లు సైతం పోతాయి. చెడు అలవాట్లకు గురైన వ్యక్తుల కుటుంబాలు ఛిన్నాభిన్నమైన ఉదాహరణ లెన్నో! దీనివల్ల సమాజంలో మనిషికి గౌరవం ఉండదు. పైగా సమాజం నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

అలవాట్లనేవి మనిషి జీవితంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. మంచి అలవాట్లతో జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించు కోగలరు. చెడు అలవాట్లతో జీవితమే నాశనం అయిపోతుంది. ఒక మంచి అలవాటు మనిషిని ఉన్నత పథానికి తీసుకెళ్తే, చెడ్డది అధః పాతాళానికి తీసుకెళ్లిపోతుంది. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు కావచ్చు. కాని, అతి ధూమపానం, మద్యపానం, పరస్త్రీ వ్యామోహం, జూదం, దుబారా చేసి అనవసరంగా అప్పులు చేయటం వంటివి చెడు అలవాట్లుగా భావించటంలో ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు.

కొందరికి ప్రతి చిన్ననొప్పికి మాత్రలు వేసుకోవటం అలవాటుగా ఉంటుంది. అవసరమున్నా, లేకపోయినా డాక్టర్ల దగ్గరికి పరుగెడుతూ ఉంటారు. ప్రతి చిన్న బాధను కొంచెమైనా సహనంతో భరించలేక పోతే, విపరీతమైన మందుల వాడకం తదనంతర జీవితం పై దుష్ప్రభావం చూపుతుంది. మన దృష్టి దాని మీద నుండి మరల్చుకోవాలి.

మంచి అలవాట్లు జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తాయి. మంచి ఆరోగ్యానికి పునాది మంచి అలవాట్లే! పూర్వం బైటికి వెళ్లి ఇంటికి వస్తే, వచ్చిన వెంటనే కాళ్ళు, చేతులు కడుక్కుని లోపలికి వెళ్లేవారు. అంత శుభ్రత పాటించేవారు. ఆధునికత, జీవనశైలి అన్న పేరుతో ఇప్పుడు వీటిని వదిలేశాం. పాదరక్షలతోనే లోపలికి వెళ్లిపోతున్నాం. చేతులు కడుక్కోకుండానే భోజనం చేసేస్తున్నాం. వీటివల్ల అనారోగ్యాల పాలవుతున్నాం.

ఇప్పుడు, ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో భయం కొద్దీ పూర్వపు పద్ధతులను ప్రతి ఒక్కరు అనుసరిస్తున్నారు. చేతులు పదే పదే కడుక్కోవడం, కూరగాయలు బజారు నుంచి తెచ్చిన వెంటనే శుభ్రంగా కడగటం వంటివి వంద శాతం చేస్తున్నారు. పూర్వపు శుచి శుభ్రతలకు పూర్ణంగా విలువనిచ్చి పాటిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. మంచి అలవాటు. ఈ క్లిష్ట పరిస్థితి పోయాక కూడ, ఇది ఒక స్థిరమైన అలవాటుగా ఎప్పటికి కొనసాగిస్తే, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అందరూ దోహదం చేసిన వారవుతారు. ఇటువంటి మంచి అలవాట్లను యువత అవసరార్థం నేర్చుకున్నా తదనంతరం కొనసాగించటం మంచిది.

అలవాట్లు పరిశీలన ద్వారా వస్తాయి. మన ప్రస్తుత అలవాట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లే మనిషికి వ్యక్తిగత పెట్టుబడి. ఈ పెట్టుబడి శీలం, వ్యక్తిత్వం అనే లాభాలనిస్తుంది. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి. మనిషి మూడు అలవాట్లను తప్పక చేసుకోవాలని మేధావులు చెపుతారు.

మొదటిది – డబ్బు సంపాదించటం. జీవన గమనం కోసం, ఆర్ధిక భద్రత కోసం డబ్బు చాలా అవసరం.

రెండవది – ఎప్పుడూ తన ప్రవర్తనను తానే విశ్లేషించుకుంటూ, లోపాలను సరి దిద్దుకుంటూ ఆత్మ విమర్శ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి.

మూడవది – ఇష్టమైన రంగంలో సృజనాత్మకత పెంపొదించుకోవటం అలవాటు చేసుకోవాలి. రచయితలు, సంగీత, నృత్య కళాకారులు, క్రీడారంగ నిపుణులు నిరంతర సాధన చేస్తూనే ఉంటారు. పోటీలు ప్రదర్శనలు వున్నప్పుడే కాక ప్రతిరోజూ సాధన చేస్తూ ఉండటం వల్ల వారి విద్వత్తు మరింత ప్రకాశిస్తుంది. వృత్తినైపుణ్యాలు మెరుగవుతాయి. ప్రజ్ఞాపాటవాలు మరింతగా పరిఢవిల్లుతాయి.

మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏదైనా అలవాటు కావటానికి 21రోజులు అవసరమంటారు. ఆ నిర్ణీత కాలంలో నిష్ఠతో ప్రయత్నించటం వల్ల అది అలవాటవుతుంది. దానిని నిలుపుకోవటానికి ప్రతి రోజు ఆ అలవాటును కొనసాగించవలసి ఉంటుంది. శరీరానికి, మనసుకు కూడ మంచి అలవాట్లను అలవాటు చేయాలి. మనసుకు ఎటువంటి క్లిష్ట, విషాద పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండటం అలవాటు చేయాలి.


ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ, చెడు, హానికరం అనిపించినవి వదిలేయటానికి ప్రయత్నిస్తూ, మంచి అలవాట్లను వదలకుండా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూండాలి. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యం వైపు నడిపించేవి అలవాట్లు. 

మంచి అలవాట్లే వ్యక్తిత్వానికి చిరునామా.

అలవాట్లు పరిశీలన ద్వారా వస్తాయి. మన ప్రస్తుత అలవాట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లే మనిషికి వ్యక్తిగత పెట్టుబడి. ఈ పెట్టుబడి శీలం, వ్యక్తిత్వం అనే లాభాలనిస్తుంది. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి.

........

*చాణక్యం*


రాజ్య పాలనలో (రాజ) దండం ప్రధాన పాత్ర వహిస్తుంది. అది పాలకుడి ఆధిపత్యానికి చిహ్నం. దానికి స్వపర భేదం ఉండదు. కాబట్టి రాజనీతికి దండనీతి అని పేరు. దండనీతినే అర్ధనీతి లేదా అర్థశాస్త్రమనే పేరుతో పిలిచేవారని మహాభారతం చెబుతోంది. మనుషుల జీవితాలకు మూలం ధనం (అర్ధం). ఆనాటి ధనం భూమే. భూమిని సంపాదించే, పాలించే ఉపాయాలు, తెలిపే శాస్త్రం కాబట్టి అర్థశాస్త్రం అయింది. దాన్ని రచించిన వాడు చాణక్యుడు..


భూమిని సమకూర్చుకోవడం, రక్షించుకోవడం, వృద్ధి చేసుకోవడం, దాన్ని మంచివారి చేతుల్లో ఉంచడం. సుపరిపాలన జరిగేటట్లు చూడటం... తానే విషయాలు కూలంకషంగా చెప్పినవాడు చాణక్యుడు. స్వయంగా అధ్యాపకుడైన తండ్రి చణకుడి పర్యవేక్షణలో చాణక్యుడు రాజనీతి కోవిదుడిగా, నైతిక బోధకుడిగా, ఆర్ధికవేత్తగా ఎదిగాడు.


"పాలకులు, ప్రతి పౌరుడి యోగ క్షేమాలకు ప్రాధాన్యమిచ్చే పాలనా విధానాన్ని అవలంబించి, శాంతి సౌభాగ్యాలను వర్ధిల్లజేయడానికి అనుసరించవలసిన పద్ధతులను విపులంగా వివరించాడు. "తన మీద తనకుండే నమ్మకం,


శత్రువును భయపెడుతుంది. అపనమ్మకం, శత్రువు బలాన్ని పెంచుతుంది. కాబట్టి పాలకుడు తన శక్తి యుక్తుల మీద నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడే అధర్మాన్ని నాశనం చేయడానికి, ఎటువంటి మార్గాన్నైనా అనుసరించగలదు' అనే మాట పాలకులకే కాకుండా ఇతరులకు సైతం స్ఫూర్తిదాయకమవుతుంది.


కులం అంటే కొంటెతనం, మోసం అనే అర్ధాలున్నాయి. రాజనీతి కోవిదుడు కాబట్టి రాజ్య/ ప్రజా సంరక్షణ కోసం అవసరమైతే కుటిలత్వాన్ని అనుసరించ వచ్చు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, అనుసరించినవాడు కావడంతో చాణక్యున్ని కౌటిల్యుడనీ పిలుస్తారు. విష్ణుగుప్తుడు అనే మరో పేరూ ఉంది

కాలాన్ని వృథా చేసేవారు, సరైన సమయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేనివారు ఎప్పటికీ విజయం సాధించలేరు" అని విజయార్డులకు ఆయన మార్గదర్శనం చేశాడు. కౌటిల్యుడి రచన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇందులో సామాన్య మానవ జీవితానికి సైతం ఉపయోగపడే అనేక అంశాలను పొందుపరచాడు.


"మనిషి పుట్టుకతో కాకుండా, చేసే పనుల ద్వారా గొప్పవాడు అవుతాడు' అని చెప్పిన ఆయనే, 'గతంలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి' అని బోధ చేశాడు.


వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడానికి సామ, దాన, భేద, దండోపాయాలను

అనుసరించడం అనే సంప్రదాయాన్ని ప్రతిపాదించి, ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు


సామాన్యులు సైతం విజయం సాధించడానికి మార్గాలను సరళంగా చెప్పాడు. ఏ పనైనా మొదలు పెట్టే ముందు 'ఈ పని ఎందుకు చేస్తున్నాం. దీని ఫలితమేమిటి, ఇందులో విజయం సాధించగలనా... అనే మూడు ప్రశ్నలు వేసుకోవాలి' అనేది వాటిలో ప్రధానమైనది.


ఆర్ధిక విషయాల గురించి ఆయన చేసిన సూచనలు అనుసరించదగినవి. సుఖమయ జీవితాన్ని పొందాలనుకునే వారు డబ్బు విలువ తప్పనిసరిగా తెలుసుకోవాలి' అని బోధించాడు. దానితోపాటు న్యాయ మార్గంలోనే ధనం సంపాదించాలి' అని హెచ్చరించాడు..


ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ప్రత్యేకంగా ఉండరు. నీ నడవడే నీరు మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుందని ఉద్బోదించింది. చాణక్యుడే - అయ్యగారి శ్రీనివాస రావు

Sunday, 3 July 2022


 ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ 

  *ఆచార్య సద్బోధన: సమయములో  *. నిస్పృహ *

                    ➖➖➖
ప్రపంచములో  మీకు ఎందరో బంధుమిత్రులు, లెక్కలేనన్ని సంపదలు, భూములు ఉండనివ్వండి.. వీటన్నింటి మీద కూడా మీరు భగవంతుడికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇహలోక సంపదలు అన్నీ బంధాలను కలిగించడానికే తప్ప తొలగించడానికి కాదు. దేవుని నిమిత్తము దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడి ఉండాలి.
బాగా ఆలోచించి చూడండి! నేడు కాకున్నా ఇంతకు ముందు  ఎప్పుడో ఒక కష్ట బంధుమిత్రులు ఎవరూ ముందుకు రాని సమయములో సమస్య నుండి ఎట్లా గట్టెక్కారో , ఆ సమస్య నుండి ఎవరు మిమ్మలని కాపాడారో తెలుసుకోండి. ఇక ముందు కూడా జీవితంతో ఒంటరి పోరాటాలు చేయవలసి ఉంటుంది. అప్పుడు కూడా ఆ భగవంతుడే దిక్కు అవుతాడు. కనుక అన్నింటి మీదా ఎప్పుడూ కూడా ఆయనకే ప్రాముఖ్యత ఇవ్వండి.  
 
 

మీలో కొంత మంది సద్గురువు నాహ్వానించి (ధ్యానమున) మీకున్న సమస్తమైనటువంటి బాధల్ని కుండపోతగా వారి ముందు పోస్తూ వుంటారు. చాలా సేవ చేస్తున్నాము కదా! “మా కెందుకీ బాధలు, కష్టాలు” అని ప్రశ్నించెదరు. ఇటువంటి సత్యభామ బుద్ధి (ఆరోపణ బుద్ధి) మానుకోవటము ఉత్తమము. ఆరోపణలు చేయటానికి ఆవాహన మెందుకు? ఎప్పుడూ ఆరోపణలు చేసే వారి దగ్గరికి మీకు వెళ్ళబుద్ధి అవుతుందా? మాకు వెళ్ళ బుద్ధి అవుతుంది. పిలుస్తే వస్తాము, కాని మీ బాధలు ఆరోపణలు మా రాకను గుర్తింపనీయవు.

మీరు బాధలలో నున్నప్పుడు మీరు చేయవలసినదల్లా మేమందించిన బోధనలు చదువుకొనుచు, మనో ప్రశాంతత మనో వైశాల్యతను పొందుచుండవలెను. అట్లుకానిచో క్రమముగ మీకు భక్తి తగ్గును. అనుమానము పెరుగును. మీ చేతన ఘర్షణకు గురి అగును. మేము అనంత ప్రేమను, ఆదరణను ఎప్పుడూ ప్రసరించుచునే యుందుము. 

మీరు యోగమున నిలచి సేవను పెంచుడు. మాతో అనుసంధానము కూడ పెంచుడు. అప్పుడు మీ సమస్యలకు పరిష్కారములు దొరకును. మాతో మీ అనుసంధానమును యిట్టి సమయమున పెంచుకొనవలెను కాని ఆరోపణలతో తెంపుకొనరాదు. ప్రతినిత్యము కత్తిపీట ముందు కూర్చుని ఉల్లిపాయలు కోయుచు ఏడ్చుచున్న వారి వలె మీరు మాకు గోచరించుదురు. దీని వలన ఎట్టి ప్రయోజనము లేదు. పై తెలిపిన సూత్రములను పాటింపుడు. 

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

***

 



చతుఃషష్టి ఉపచారాలు

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. ఆభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం పమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీప దర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము..

🙏సర్వోజనా సుఖినోభావంత్🙏

 ***


 

కర దండం

గ్రామాలల్లో సాదారణ ప్రజలు ప్రతివారు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర పట్టుకొని వెళ్లేవారు. వారు ఆ కర్రను అనేకవిధాలుగా వాడేవారు. ఏమైనా విషపురుగులు అంటే పాములు తేళ్లు మొదలైనవి వారి దారిలో కనపడితే వెంటనే ఏది వెతకాల్సిన పనిలేకుండా వాటిని  హతమార్చేవారు. ఇక కుక్కలు లాంటి జంతువులు వారి చేతిలోని కర్రను చూసి వారి జోలికి వచ్చేవే కావు.  మీరు గమనించి ఉండొచ్చు కుక్కలు ఒంటరిగా ఒకమనిషి కనపడితే గుంపులుగా వచ్చి దాడిచేస్తాయి.  ఈ విషయం మనలో కొందరికి అనుభవం కలిగి కూడా ఉండొచ్చు. ముందుగా ఒక కుక్క వచ్చి అరుస్తుంది తరువాత మిగిలిన కుక్కలు ఎక్కడినుండి వస్తాయో తెలియకుండా వచ్చి దాడి చేస్తాయి.  అదే నీ చేతిలో కర్ర ఉంటే మాత్రం అవి నీ జోలికి రావటానికి  వెనకాడతాయి. అధవా నిన్ను చుట్టుముట్టిన వెంటనే నీవు నీ చేతికఱ్ఱతో నిన్ను నీవు కాపాడుకోగలవు. కాబట్టి చేతిలో కర్ర ఉండటం సదా క్షేమకరం. ఇక విషయానికి వస్తే

సాదాకా రోజు  నీ వెంట ఒక గుంపుగా కుక్కలు దాడి చేస్తున్నాయి. కానీ నీకు ఆ విషయం తెలిసినా కూడా నీవు వాటిని పరిగణలోకి తీసుకోక నీవు నేను రోజు ఆ కుక్కల దాడికి  బలవుతున్నాము. సాధకుడు తన సాధనను ముందుకు సాగాలంటే తప్పకుండా ఈ కుక్కలగూర్చి తెలుసుకోవటమే కాక వాటినుండి ఎట్లా రక్షణ పొందాలో తెలుసుకోవాలి. ఇప్పడికే మీకు నేను దేనినిగూర్చి చెపుతున్నానో తెలిసే ఉంటుంది అదేనండి ఆ కుక్కలు యేవో కావు అవే అరిషడ్వార్గంగా పేరుపొందిన ఆరుగురు శత్రువులు. 

అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. మన శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను జయించాలి. అవి యేమియనగా కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ప్రతి మనిషి మనస్సును ఈ ఆరు కలిసికాని లేక ఏ ఒక్కటో లేక ఒక్కటి కంటే ఎక్కువో చేరి కలుషితం చేస్తాయి.  వీటిలో ఏ ఒక్కదానికి చిక్కినా సాధకునికి సాధన అస్సలు కుదరదు.  

సాధారణంగా మనం ఎవరైనా ఒక ముఖ్యమైన విషయం చేపుతుంటే కొన్ని సందర్భాలలో వాటి మీద నీవు శ్రార్ధ చూపవు ఎందుకురా నేను ఇంతముఖ్యమైన దానిని చెపుతుంటే ఏమి ఆలోచిస్తున్నావు అని నీ మిత్రుడు అడిగితె ఏమిలేదురా ఈవేళ నా మనసెందుకో బాగా లేదని సమాధానం ఇస్తావు.  నిజానికి నీ మనస్సు బాగా లేకపోవటానికి కారణం పైన తెలిపిన ఏదో ఒక శత్రువు దాడి కానీ నీవు ఆ విషయాన్ని గమనించవు.  అదే నీవు గమనిస్తే వాటిని అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేస్తావు. మన పురాణాలలో, ఇతిహాసాలలో ఈ ఆరు శత్రువుల వలన ఎవరు యెట్లా నష్టపోయారా చెప్పారు. కాబట్టి సాధక మేలుకో ఈ ఆరు కుక్కలను నీ మీద దాడి చేయకుండా నిరోధించే ప్రయత్నం చేయి.  అకుంఠిత దీక్షతో తపస్సు సాగిస్తున్న విశ్వామిత్ర మహర్షికి మేనకా సాంగత్యంతో తపోభంగం కలిగిన విషయం మనకు విదితమే.  ఇప్పుడు సాధకుల సాధనను బంగపరచటానికి దేవలోకం నుంచి మేనక దిగి రానవసరం లేదు ఏ సాధారణ స్త్రీ అయినా చాలు.  ఇలా వ్రాస్తున్నందుకు ఏమి అనుకోవలదు.  ఎందుకంటె మనం చేసే సాధన అంతబలహీనంగా వున్నదని నా భావన.

మరి ఈ ఆరు శత్రువులను పారదోలే దండం ఎక్కడ వున్నది అది నాకు దొరుకుతుందా అని అడగవచ్చు.  అది నీ దగ్గరే వున్నది కానీ నీవు దానిని ఉపయోగించటం లేదు ఏమిటి అది అంటే అది మరేమో కాదు నిత్యం దైవ చింతనం.  ఎప్పుడైతే సాధకుడు దైవచింతనంలో నిమగ్నుడై ఉంటాడో వాని చెంతకు ఈ ఆరు శత్రువులల్లో ఏ ఒక్కటి కూడా దాడి చేయటానికి సాహసించవు.  ఎందుకంటె అన్ని శత్రువులను ఎదుర్కునే కర దండం దైవచింతన మాత్రమే ఇది సత్యం.  అందుకే ప్రతి క్షణం దైవచింతన చేయాలని   దైవఘ్నులు వక్కాణిస్తున్నారు.

సాధకుడు సదా ఈశ్వర జ్యానంలో ఉంటే ఎట్టి పరిస్థితిలోను మనస్సు అరిషడ్వార్గం మీదికి పోదు.  అధవా పోయిన వెంటనే తన తప్పు తాను తెలుసుకొని దైవత్వం వైపు నడుస్తుంది.  కాబట్టి మిత్రమా ఎల్లప్పుడూ నీ మనస్సును ఆ దేవదేవుని మీదనే వుంచు.  ఆధ్యాత్మిక ప్రగతిని సాధించు.

___((()))___



మనిషి వృద్ధిలోకి రావడానికి తప్పకుండా నేర్చుకుని తీరవలసినది నీతి శాస్త్రం. ఆ  నీతిని పాటించకపోతే తాను ఒక్కడే పతనమయిపోడు. తనతోపాటూ చుట్టూ ఉండే సమాజం కూడా భ్రష్టుపట్టే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తిన్న అన్నం కొద్దిగా కలుషితం అయితే ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే అనారోగ్యం వస్తుంది. కానీ ఒక ఊరివారందరూ దాహం తీర్చుకునే చెరువు విషపూరితం అయితే ఊరంతా అస్వస్థతకు గురవుతుంది. అయితే నీతి విషయంలో మాత్రం... ఒక వ్యక్తి నీతి తప్పితే కేవలం ఆ వ్యక్తి మాత్రమే పతనమయిపోడు, సమాజంలో ఉన్న అనేకమంది దాని దుష్ప్రభావానికి లోనవుతారు. అంతేకాక అతని తాత్కాలిక సుఖాలను ఆదర్శంగా భావించే అపరిపక్వ మనస్కులూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే చిన్నతనంలోనే నీతి శాస్త్రాలను బాగా చదువుకోవాలి. తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేంత సులభంగా మనకు శతకాలు అందుబాటులో ఉన్నాయి... ఎక్కువకాలం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చక్కటి పద్యాల రూపంలో ఉన్నాయి.

శతకం అంటే నూరు పద్యాలతో ఉన్న గ్రంథం అని. కానీ నూరే ఉండాలన్న నియమం లేదు. శతకం – అంటే ‘నూట ఎనిమిది’ అన్న అర్థం కూడా ఉంది. 108 కానీ, 116 కానీ పద్యాలు ఉండడం సంప్రదాయంగా వస్తోంది. కొన్నిచోట్ల అవి దాటిన శతకాలు కూడా ఉన్నాయి. సంస్కృతంలో లేనిది తెలుగులో మాత్రమే ప్రత్యేకంగా కనిపించేది మకుటం. ప్రతి పద్యం చివర మాటకానీ, చివర పంక్తి కానీ, కొన్నిసార్లు చివరి భాగం కానీ, సీస పద్యాలవంటి వాటిల్లో అయితే చివరి పద్యం కానీ మకుటం అవుతుంది. సుమతీ అనీ, దాశరథీ! కరుణాపయోనిథీ! అనీ, విశ్వదాభిరామ వినురవేమ... అనీ ఉంచారు. వీటిలో భక్తికి సంబంధించినవి, ఆవేదనను వెళ్ళగక్కేవి, ప్రకృతిని వర్ణించేవి ... ఇలా చాలా శతకాలు ఉన్నా తెలుగు భాషలో నీతి శతకాలకు ప్రత్యేక స్థానం ఉన్నది.

పెద్దలు, పరిశోధకుల పరిశీలన ప్రకారం శతక రచన ప్రారంభం అయింది నన్నయతో అంటారు. భారతాన్ని ఆంధ్రభాషలో రచన ప్రారంభం చేసే సమయంలో ఆయన రాసిన కొన్ని పద్యాల చివరన ఆదిశేషుని ఉద్దేశించి ‘..నాకు ప్రసన్నుడయ్యెడున్‌’ అన్న మకుటంతో ముగించారు. ఇది తరువాత కాలంలో శతక రచనకు ప్రేరణనిచ్చాయంటారు వీరు. విద్యార్థులకు సంబంధించినంతవరకు అత్యంత ప్రధానమైనది నీతి శతకం. తెలుగులో ఇలా వచ్చిన మొట్టమొదటి శతకం – సుమతీ శతకం. కాకతి రుద్రమదేవి దగ్గర సామంత రాజుగా ఉన్న భద్ర భూపాలుడు .. బద్దెన అనే పేరుతో అందరికీ పనికి వచ్చే నీతుల సమాహార స్వరూపంగా దీనిని రచించారు. 


కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులు, పౌరులు, సమాజంలోని విభిన్న వర్గాలవారు, చివరకు కవులు కూడా తెలుసుకోవాల్సిన నీతి సూత్రాలను ఇందులో పొందుపరిచారు. ఏవి పాటించాలో, ఏవి పాటించకూడదో, వేటిని మనిషి ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోవాలో దీనిలో ప్రతిపాదించారు. వీటిని కంఠస్థం చేసుకుని ధారణలో ఉంచుకుంటే.. జీవితంలో క్లిష్ట సమస్యల వలయంలో చిక్కుకుని ఏ దారీ కనిపించ నప్పడు ఇవి వాటంతట అవే గుర్తుకు వచ్చి కాపాడతాయి. సుమతీ శతక పద్యాలు ‘సుమతీ’ అన్న మకుటంతో ముగుస్తాయి.

........

‘దేవుణ్ణి మీరు చూశారా..?’ అని ప్రశ్నించాడో యువకుడు ఒక సాధకుణ్ణి. చురుకైన కళ్ళు.. తీక్షణమైన చూపులు. గిరజాల జుట్టు.. దానిలో కొన్ని వంకీలు అతని విశాల ఫాలభాగాన నర్తిస్తుండగా. ‘ఆ“చూసాను’. అన్నాడాయన చిరునవ్వుతో. ‘చూశారా..!?’ అన్నాడా యువకుడు తన అనుమానానికి అపనమ్మకాన్ని జోడిస్తూ. ‘చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా’ అన్నాడాయన మరింత ప్రశాంతంగా నవ్వుతూ.

ఆ మాటలకు ఆ యువకుడు విభ్రాంతుడే అయ్యాడు. ఆ సాధకుడి గొంతులో ధ్వనించిన విశ్వాసం.. నమ్మకం.. సూటిదనం.. అతణ్ణి ఒక నిమిషంపాటు ఆపాదమస్తకాన్ని కంపింప చేసింది. ఇంతకుముందు తను కలసిన సాధకుకులు.. యోగులు.. గురువులు... అందరూ కూడా దేవుణ్ణి చూడలేదనే చెప్పారు. ఆ దేవదేవుని సాక్షాత్కారానికి తపస్సు చేస్తూనే ఉన్నామన్నారు.

    ఒకవేళ ఒకరిద్దరు చూశామని చెప్పినా ఇంత గట్టిగా.. విశ్వాసంతో చెప్పలేదు. ఇందుకే ఆ వంగ దేశీయుడికి ఆ పరమహంస మీద గురి.. ఏర్పడింది. అందుకే ఆయనను గురువుగా అంగీకరించాడు. ఆ పై ఆ గురుశిష్యులిరువురూ ఎంత విశ్వవిఖ్యాతులయ్యారో లోకవిదితమే.

      దేవుణ్ణి చూశామన్న వారెవరైనా ఆయన భావనను, తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారని అర్థం. దేవుడి సర్వాంతర్యామిత్వ భావనను గ్రంథాలనుండి గ్రహించటమే కాదు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ సకల చరాచరసృష్టిలో ప్రతి జీవిలో చూడగలగటం. ప్రత్యక్షంగా చూసి అనుభవంగా చేసుకోవటమే కదా!

ఆ పరమహంస.. నిన్ను చూసినంత బాగా చూశాను’ అని చెప్పటంలో అదే అర్థం. ‘ఇందు గలడందు లేడని సందేహం వలదు..’ అన్న పద్య సారాంశ మదే  కదా. తన ఎదురుగా తను ఆరాధిస్తున్న విగ్రహమే దేముడు.. అయన ఉనికి ఇక్కడే.. ఈ నాలుగు గోడల మధ్యే అన్న ఆలోచనా పరిధి.. పరిమితులనుండి నుండి మనిషి బయటకు రానంతకాలం.. రాకూడదనుకున్నంత కాలం ఆ సర్వాంతర్యామిత్వాన్ని బుద్ధికే పరిమితం చేసుకున్నాడు. అంతే కానీ మనస్సులో ఆ భావనను ప్రతిష్టించుకోలేకపోయాడు. నిజమైన ఆధ్యాత్మికమార్గానికిది పెద్ద అవరోధం. భావన.. అనుభూతి.. దృష్టి ఈ మూడింటిని ఆధ్యాత్మికపథంలో పయనించాలనుకున్న వారు తప్పనిసరిగా అలవరచుకోవలసిన లక్షణాలు.

అనేక శాస్త్రాలు.. కావ్యాలు.. వేదాంత గ్రంథాలు చదివిన ఓ పండితుడు గంగానదిలో స్నానమాచరించి తన పాప ప్రక్షాళన చేసుకోవాలన్న తన జీవితేచ్ఛను జీవిత చరమాంకంలో కాని తీర్చుకోలేకపోయాడు. ‘ఈ గంగానదికి పాపాలను పరిహరించే మహత్తు నిజంగా వుందా..? అన్న అనుమానం మదిలో మొలకె త్తింది. తత్ఫలితంగా సద్గతులు కొంచెం ఆలస్యంగా ప్రాప్తించాయి. కారణం..!? భావన, అనుభూతి. అయితే ఈ పండితుడి పలుకుల మీద విశ్వాసముంచి మామూలు నదిలో స్నానం చేసిన సాధారణ వ్యక్తి ఆ పండితుడికన్నా ముందుగా సద్గతులు పొందాడు.

ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి ఉండవలసిన ప్రథమ లక్షణం భావన.. అనుభూతి.. విశ్వాసం. మన భౌతికావసరాలు, బాధ్యతలు నెరవేర్చటం కోసం ఏదో ఒక వృత్తినో .. ఉద్యోగాన్నో.. పొంది డబ్బు సంపాదించాలి. భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పోషించాలి. ఇది ప్రధాన బాధ్యత. ఇది కాని జీవితం ఇంకేమైనా ఉందా? ఇదే జీవిత పరమార్థమా? మనిషి ఈ చింతన చేయటానికి తన అంతరంగంలోకి చూడగలగాలి.

తన మనస్సును న్యాయాధీశుని చేసుకుని తను చేసే పనుల మంచి చెడులను ప్రశ్నించుకోవాలి. ఆలోచనలను, ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవాలి. తను ఎంతవరకు నిజాయితీగా.. న్యాయబద్ధతతో.. ప్రవర్తిస్తున్నాడు? నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడా..? ఎదుటివారికి చేయగలిగిన మేలు చేస్తున్నానని కీడు చేయటంలేదు కదా..! ఇటువంటి ప్రశ్నలు తానే తన మీద సంధించుకోవాలి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఎవరు పొందగలరో వారు నిస్సందేహంగా చక్కని, ఆదర్శవంతమైన జీవితాన్నే గడుపుతున్నట్టే.

ఈ పరిశీలన.. శోధనకే అంతర్ముఖత్వమని పేరు. ఆధ్యాత్మికతకు ఇదొక ముఖ్యమైన లక్షణమే కాదు కాదు, ఖచ్చితంగా ఉండవలసినది. ఇది ఆస్తికులకైనా, నాస్తికులకైనా.. ఆ మాట కొస్తే మనిషన్న వాడికెవడికైనా వర్తిస్తుంది. ఏ మత విశ్వాసానికైనా అన్వయించుకోతగ్గది, అందరికీ అభిలషణీయమైనదీ మార్గం. ఈ అంతరంగ యానం.. లోచూపు ఎవరైతే అలవరచుకుంటారో వారు జీవితాన్ని సరిగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. సరైన రీతిలో మలచుకుంటున్నారని అర్థం.

ధనం వల్ల ఇహంలో మనం పొందే భౌతికమైన, ఉన్నతస్థితి కాక.. ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరినట్టు. కొందరు భౌతికపరమైన విషయాలను పక్కకు పెట్టి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి అంతర్ముఖులు కాబోతున్నామని ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేయనే చేయరు. మన మనస్సు తీరు.. గతి.. ఆలోచనా పద్ధతి.. మన వ్యక్తిత్వాన్ని ఒక అంచనా వేసుకుని మన జీవితాన్ని, మన ఆలోచనా ప్రవాహన్ని క్రమబద్దీ కరించుకునేందుకు మన మనస్సు చెప్పే సంగతులు తెలుసుకోవాలి. సరిగా లేకుంటే దిద్దుకోవాలి. ఇందుకు అంతర్ముఖత్వం ప్రతి ఒక్కరికీ అవసరం.

మానవ మేధ, శక్తియుక్తులకు పరిధులు, పరిమితులున్నాయని, ఆ మానవాతీత శక్తి భగవంతుడని సర్వశక్తిమంతుడని. సర్వవ్యాపకుడని, అతడివల్లే ఇంతటి సృష్టి జరిగిందని భావించే వారున్నారు. వారు అతడినే కేంద్ర బిందువు చేసుకుని తమ అంతర్ముఖ ప్రయాణపు తొలి.. ఆఖరి అడుగు అతడితోనే ముగిస్తారు. కొందరు ప్రకృతి పరిణామక్రమంలో ఏర్పడ్డదీ సృష్టి అంటూ ఒక మానవాతీత శక్తి వుందని అంటారు. కానీ దాన్ని భగవంతుడుగా భావన చేయరు. వీరిరువురూ కూడ అంతర్ముఖత్వానికి పెద్దపీట వేస్తారు. మనిషి మహాత్ముడు కాకపోయినా మనిషి గా నిలబడటానికి ఇది అవసరమని ఇద్దరూ ఏకీభవిస్తారు. జీవితం అర్థవంతమైనదవ్వాలంటే ఇది అత్యంత అవసరమైనదని ఇద్దరూ అంగీకరిస్తారు.

ఈ ఆధ్యాత్మిక చింతన లేదా అంతర్ముఖత్వం ఒక సత్యాన్వేషణ. ఒక సత్యశోధన. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవటం. జీవితాన్ని అర్థం చేసుకుని, దాని పట్ల ఉన్న భయాందోళనలు తొలగి నిర్భయులమై స్వేచ్ఛానందాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులు కావాలి.

ఆధ్యాత్మిక చింతనంటే కేవలం భక్తి ఒక్కటే కాదు. దానికి భావన..అనుభూతి.. విశ్వాసం.. వీటిని చేర్చాలి. ఆధ్యాత్మికత అంటే పెదవులతో దేవుడి నామాన్ని పలకటమే కాదు. భగవంతుడి రూపాన్ని అన్నిచోట్లా.. అందరిలోనూ చూడగలగటం. మన ఆణువణువునా ఆ భావనను పొందుపరచుకోవటం. అపుడే మనం ఆయన సర్వాంతర్యామిత్వాన్ని  విశ్వసించినట్టు! ఆధ్యాత్మికత అంటే మనం నమ్మిన దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ దశకు చేరు కోవటమంటే నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. ఆధ్యాత్మికత తొలి మెట్టు ఇదే కావాలి.


భగవంతుని తత్వాన్ని మనసులో నిలుపుకుని తోటివారితో ఎవరైతే చక్కగా సంభాషిస్తారో... అభాగ్యుల.. అనాథల మీద కరుణ, ప్రేమ చూపిస్తారో.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారన్న విషయాలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో వారు నిజమైన ఆధ్యాత్మికపరులు.

........


*ఆత్మశోధన*


ప్రపంచంలో అందరూ తమ ప్రజ్ఞ గురించే పొంగిపోతుంటారు. లోపాలను దాచు కుంటారు. వాటిని బయటపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నత్తిని అణచివేస్తూ పట్టిపట్టి మాట్లాడటం, కుటిలత్వాన్ని కప్పి పెడుతూ తేనెపలుకులు పలకడం, అజ్ఞానాన్ని పండిత వేషంలో దాచడం... ప్రపంచ వ్యవహారంలో ఇలాం టివి కోకొల్లలు.


మెరిసిపోయేది నకిలీ బంగారమని, తళతళలాడేది వజ్రంలా భ్రమగొలుపుతున్న గాజుముక్క అని, ఉత్తముడిగా అగుపించేవాడు కుట్రదారుడని తెలిసినప్పుడు నివ్వె రపోతాం. బయటికి, లోపలికి పూర్తి వైరుధ్యం ఉన్నప్పుడు దేన్ని నమ్మాలో అర్ధం కాదు. అందుకే పెద్దలు 'గుడ్డిగా దేన్నీ నమ్మవద్దు' అంటారు. అలాగని దేన్నీ .. నమ్మకుండా జీవించలేం. నమ్మకం కలిగించగల కారణాలను మనం పరిశీలించాలి. నమ్మకం కలిగించి ద్రోహం చేయడం కుట్రదారులకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి, ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, నమ్మకం ప్రదర్శించాలి. అంతరంగంలో అనుమా నంగానే ఉండాలి. నమ్మకద్రోహులు విశ్వాసం నటిస్తూనే విషం వెదజల్లు తారు. భారతంలో శకుని పాత్ర అలాంటిదే శత్రువులతో చేతులు కలిపిన జయచంద్రుడులాంటి చారి త్రక ద్రోహుల గాథా అలాంటిదే. సమాజంలో మనకు నమ్మకద్రో హులు, నయవంచకులు ప్రచ్చ న్నంగా పలురూపాలలో, వేషాలలో కనిపిస్తారు. పాములకు కోరలు, విషం ఉన్నా వాటి రూపాలు వేర నమ్మకద్రోహులూ భిన్నంగా ఉంటారు. విషం లేని పాముల్లాంటి వాళ్లూ ఉంటారు. కానీ, చాలా అరుదు. నమ్మకం అంటే విశ్వసనీయత

ముందు మన ఆత్మకు మనం విశ్వసనీయంగా ఉండాలి. చర్యలన్నీ ఆత్మస్థితుడైన అంతర్యామి మౌనంగా గమనిస్తూ ఉంటాడు. మనం ఇత రుల్ని వంచిస్తున్నామంటే, మనల్ని కూడా మనం మోసం చేసుకుంటున్నట్లే. ఎందు కంటే, శరీరాలు వేరు తప్ప ఆత్మ ఒక్కటే. మన మోసాలన్నీ ఆత్మవంచనలే! ప్రతి ఆత్మవంచనకి ఆపరాధ శిక్షలుంటాయి. వాటిని నవగ్రహాలు కర్మదేవత లుగా అమలు చేస్తాయంటారు. ఆ బాధల నుంచి బయటపడటానికి గ్రహశాం తులు చేస్తుంటారు. అసలు అపరాదమే చేయకపోతే శిక్షలు ఉండవుకదా?


దైవ శాసనాలు ఎంత కఠినంగా ఉంటాయంటే, మనం సునాయాసంగా చెప్పే అబుద్ధమూ శిక్షార్హమైన అపరాధం లేదా పాపం. ఆ విధంగా చూస్తే మనిషి నిత్యా పరాధి! అలాగని మనం బెంబేలు పడాల్సిన పనిలేదు. ఏ రోజు మురికి ఆ రోజు స్నానంతో శుభ్రం చేసుకున్నట్లు ఏ రోజు పాపాలు ఆ రోజే నశింపజేయగల జప, ధ్యాన క్రియలున్నాయి. దానాలు, పరోపకారాలు సైతం పాపాలను క్షాళన చేస్తాయి. ఒక విధంగా దీనజన సేవకే ఎక్కువ మహత్తు ఉంది. ఎందుకంటే, అందరూ ఆత్మస్వరూపులే, అంతర్యామికి కోవెలలే కదా?.


ఆధ్యాత్మిక జీవితంలో మన మనోమాలిన్యాలను ఆత్మశోధన ద్వారా మనకు మనమే శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అద్దం ఏ విధంగా మన రూపురేఖలను వ్యక్త పరుస్తుందో, ఆత్మశోధనా మన వ్యక్తిత్వ లోపాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఆత్మశోధన అంటే ఆత్మను వెతుక్కోవడం కాదు. మనల్ని మనం వెతుక్కుని నేను 'ఎవరు?' అనే ప్రశ్నకు జవాబు రాబట్టడం. వసిష్ఠుడు రాముడికి చేసిన గీతాబోధ. . లోని సారాంశం- ఆత్మశోధన మార్గం. అదే యోగవాసిష్టమైంది. ఇక్కడ రాముడు. ఉపకరణంగా సమస్త ఆస్తికలోకానికి పరమాత్మ ప్రసాదించిన దివ్యబోధ అది. ఆవశ్యం ఆచరణీయమైనది. -

 కె. విజయలక్ష్మి

............


క్రీస్తుశకం ఒకటో శతాబ్ది. రోమ్‌ నగరం. అక్కడ ఒక బాలుడు చిన్నతనంలోనే రోమన్‌ ప్రభుత్వ అధికారికి బానిసగా పట్టుబడ్డాడు. యజమాని అతడిని క్రూరంగా హింసిస్తూ వినోదించేవాడు. ఒకనాడు ఎందుకో కోపం వచ్చి యజమాని ఆ కుర్రవాడి కాలు మెలిపెట్టసాగాడు. బాలుడిలో ప్రతిస్పందన కనిపించలేదు. బాధ లేదు, దుఃఖమూ లేదు. మనసు మాత్రం నిర్వికారంగా ఉంది. అలాగే బాధను ఓర్చుకుంటూ ‘అయ్యా! అలా మెలితిప్పుతూపోతే నా కాలు విరుగుతుంది’ అన్నాడు బాలుడు. యజమాని ఆ మాటలు పట్టించుకోక మరింత మెలితిప్పడంతో బాలుడి కాలు కాస్తా విరుగుతుంది. అయినా, బాలుణ్ని దుఃఖం ఆవరించలేదు. బాధను ఓర్చుకుంటూ ‘అయ్యా! నా కాలు విరుగుతుందని ఇందాకే చెప్పానుకదా!’ అన్నాడు.

కొన్నాళ్లకు ఆ బాలుడు బానిసత్వం నుంచి విముక్తి పొందాడు. బాగా చదువుకొని పెద్ద పండితుడు అయ్యాడు. గురువుగా ఎందరికో విద్యాదానం చేశాడు. కానీ, జీవితాంతం కుంటివాడిగానే మిగిలిపోయాడు. అతనే గ్రీకు తత్వవేత్త ఎపిక్టెటస్‌. ఆయనలాంటి స్థితప్రజ్ఞులు అరుదు. అయితే, ఈ విషయంలో మన భారతీయులు ఎంతో ముందున్నారు. సనాతన ధర్మం పునాదులే స్థితప్రజ్ఞత, వైరాగ్యం, మోక్షం.

‘సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ- సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించడమే స్థితప్రజ్ఞత’ అని గీతాచార్యుడు పేర్కొన్నాడు. స్థితప్రజ్ఞత కన్నా ఉన్నత మానసికస్థితి వైరాగ్యం. స్థితప్రజ్ఞత స్వీయ అనుభవానికి ప్రతిస్పందన. వైరాగ్యం.. బాహ్య వస్తువుల పట్ల, సంఘటన పట్ల విముఖత. రాగద్వేషాలు లేకుండటమే వైరాగ్యం. ఇక మోక్షం అనేది స్థితప్రజ్ఞతను, వైరాగ్యాన్ని మించిన అత్యున్నత మానసికస్థితి. మోక్షం అంటే జన్మ రాహిత్యం అనే ఒక బలీయమైన నమ్మకం. నిజానికి మోక్షం అంటే ఏమిటో మండనమిశ్రునితో జరిగిన వాదనలో ఆదిశంకరాచార్యులు తేల్చిచెప్పాడు. ‘మోక్షం.. శాశ్వతమైన ఆనంద స్వరూపం. ముక్తి అంటే క్రియా రూపులేని పరమతత్వం. మోక్షం ప్రాప్య వస్తువు కాదు. సర్వదా సిద్ధమైనది. తానే ‘పరబ్రహ్మ స్వరూపం’ అన్న దృఢజ్ఞానం కలిగి ఉండటమే మోక్షం. జ్ఞానం వేరుగా, ముక్తి వేరుగా లేవు. జ్ఞానంతో కైవల్యం లభించడం అంటే ఇదే. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాతే మోక్షం కలుగుతుందని వేదాంతాలు బోధిస్తున్నా యి’ అని వివరించాడు శంకరాచార్యులు.

బ్రహ్మజ్ఞానంతో మోక్షాన్ని అనుభవించే సాధకుడు తాను పరబ్రహ్మ స్వరూపం గా మారి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అదే బ్రహ్మీస్థితి. అదే అపరోక్షాను భూతి. ఈ విషయాన్ని అష్టావక్రుడు జనకుడితో…

‘యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్ఠసి

అధునైవ సుఖీ శాన్తః బన్ధముక్తో భవిష్యసి’॥

‘దేహం కంటే ఆత్మ వేరని విచారించి, తెలుసుకుని. ఆత్మలోనే మనసును లగ్నం చేస్తే సుఖశాంతులను పొందవచ్చు. ఎంతవరకు ఈ పరస్పర అధ్యాస (మిథ్యా జ్ఞానం) నాశనం కాదో అంతవరకు జీవుడు బందీగానే ఉంటున్నాడు. అధ్యాస గ్రంథి ఎప్పుడు తొలగిపోతుందో ఆ క్షణమే జీవుడు ముక్తి పొందుతాడు’ అని పై శ్లోకానికి భావం.

మోక్షస్య న హి వాసో‚సి గ్రామాన్తరమేవ వా

అజ్ఞాన హృదయ గ్రంథినాశో మోక్ష ఇతి స్మృతః॥

‘మోక్షమనేది లోకాంతరంలో ఉండేదో లేదా ఇంటి లోపలగాని, గ్రామంలోగాని ఉండేదో కాదు! మరెక్కడ ఉందది? అజ్ఞానంతో నిండిన కర్తృత్వ, భోక్తృత్వ భావన అనే చిత్‌జడ గ్రంథి నాశనమే ముక్తి’ అని తేల్చింది శివగీత. ఇక భగవద్గీత మోక్షసన్యాస యోగంలో ‘ఆత్మను యథార్థ రూపంలో తెలుసుకున్న వాడు వెంటనే మోక్షస్థితిని పొందుతాడు. సమస్త కర్మలను ఆచరిస్తున్నప్పటికీ, ఆత్మను శరణుపొందిన భక్తుడు శాశ్వతమైన, అవ్యయమైన మోక్షాన్ని అనుభ విస్తాడు’ అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అలాంటి నిర్వికార, నిరంజన మనోస్థితే మోక్షం. దానిని అనుభవించేవాడే ముముక్షువు. ఇలాంటివారిలో పాశ్చాత్యుల లో సోక్రటీస్‌, జోర్డానో బ్రూనో లాంటివారు కనిపించగా, భారతీయులలో సనాతన రుషులు మొదలుకుని ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షిలాంటివారు కోకొల్లలు ఉన్నారు.