Friday, 19 May 2017

సంగీతం


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

* ఓ దేవుడా

గుండెకు తోడుగా ఊరట నిచ్చావు
ఎండకు నీడగా  తరువు నిచ్చావు
మంటకు తోడుగా చలిని ఇచ్చావు
జంటకు తోడుగా బిడ్డను ఇచ్చావు

మాటకు తోడుగా ఏడుపు పంచావు
పాటకు తోడుగా నాట్యము నేర్పావు
ఆటకు తోడుగా నేర్పరి  చూపావు
బాటను నీటుగా చేయుట తెల్పావు       


కోపము తోడుగా ఆకలి కల్పించావు
శాంతము తోడుగా సుఖాన్ని కల్పించావు  
వేషము తోడుగా ఆకర్ష నందించావు
భాషకు తోడుగా కవిత్వ మందించావు 
 
చీకటి తోడుగా వెలుగు నందించావు 
భాధకు తోడుగా సంతోషం ఇచ్చావు
బంధము తోడుగా భాద్యత నిశ్చావు
ప్రేమకు తోడుగా సేవలందించావు 

--((*))--

భగవంతుడా అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటే మరీ ఇంత చల్లగా చూడాలా స్వామి. మీకు ఇలా అర్థం అయిందా స్వామి. ఇక చాలు స్వామి చలితో వణికిపోతున్నాం.
-------------------------------------
హీను దేన్నీ విద్య లిల నభ్యసించిన
ఘనుడుగాడు మొఱకు జనుడెగాని 
పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ వినుర వేమ
చిక్కియున్నవేళ సింహంబు నైనను
బక్క కుక్క గఱచి బాధచేయు
బలిమిలేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినుర వేమ
అలసస్య కుతో విద్యా
అవిద్యస్య కుతో ధనం
అధనస్య కుతో మిత్రం
అమిత్రస్య కుతో సుఖం
తా:--సోమరికి విద్య పట్టుబడదు, విద్యలేనివానికి ధనమురాదు, ధనము లేనిచో మిత్రులు దొరకరు, మిత్రులు లేనివారికి సుఖమెక్కడిది?
అనగా జీవితములో సర్వసుఖములూ
విద్యవల్ల కలుగుతాయని, అట్టి విద్య నిరంతర పరిశ్రమ వల్లనే సాధ్యమని భావము.
-----------------------------------------

స్త్రీ యో దేవాః స్త్రియః పుణ్యా స్త్రీ య యేవ విభూషణం
స్త్రీ ద్వేషో నైవ కర్తవ్య స్తాస్తు నిందా ప్రహారకమ్

అర్థము:-- స్త్రీలు దేవతలు,పుణ్యమూర్తులు.సమాజానికి అలంకారాలు.వారి ఎన్నడూ ద్వేషించ రాదు, నిందించ రాదు, చేయి చేసుకోరాదు.మగువలు కన్నీరు పెడితే ఆ కుటుంబానికి మంచిది కాదని అంటారు కదా! (కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింత వుండ నొల్లదు") 

మగవాళ్ళ తో పోలిస్తే కుటుంబ జీవితం లో యిమిడి పోవడానికి తోలి రోజుల్లో స్త్రీ మానసికంగా ఎక్కువ సంఘర్షణ కు గురి అవుతుంది.ఇల్లు,యింటిలోని వారు అంతా కొత్త ఎలా మెలగాలో భయం భయంగా వుంటుంది.ఆ సమయం లో భర్త ,అతని కుటుంబ సభ్యులు ఆమెకు సహకరించాలి.ఒక మొక్కను తీసుకొని వచ్చి వేరే చోట నాటితే మొదట్లో తల వాలేయటం సహజం.దానికి తగినన్ని నీళ్ళు పోసి జాగ్రత్తగా చూసుకుంటే బాగా ఏపుగా పెరుగుతుంది.పుష్పాలూ,ఫలాలూ యిస్తుంది స్త్రీ కూడా అంతే ప్రేమాభిమానాలు చూపించి ఆమె బాధ పడకుండా చూసుకుంటే జీవితం సుఖమయం గా గడిచి పోతుంది.
వేదమూలమిదం జ్ఞానం
భార్యామూలమిదం గృహం
కృషిమూలమిదం ధాన్యం
ధనమూల మిదం జగత్
అర్థము:జ్ఞానమునకు వేదమే మూలము ;గృహమునకు భార్యయే మూలము;
ధాన్యమునకు కృషియే మూలము; జగత్తునకు ధనమే మూలము. సేకరించినది


సంగీతం
ఆరోహణ   :  స   రి   గ   మ   ప   ద   ని   స
అవరోహణ :  స   ని   ద   ప   మ   గ   రి   స


1)   స రి గ మ  |  ప ద  |  ని స ||
        స ని ద ప   | మ గ   |  రి స  ||
2)   స రి గ మ  | స రి   | గ  మ ||
 స రి గ మ  | ప ద  | ని  స  ||
 స ని ద ప  | స ని  | ద ప   ||
 స ని ద ప  | మ గ  | రి స   ||

3)   స రి గ మ  | స రి | స రి  ||
        స రి గ మ  | ప ద | ని స  ||
స ని ద ప  | స ని | స ని  ||
స ని ద ప  | మ గ | రి స  ||

4)    స రి గ  స | రి గ | స రి  ||
స రి గ మ | ప ద | ని స ||
స ని ద స | ని ద | స ని ||
స ని ద ప | మ గ | రి స ||

5)   స రి గ మ |  పా  |  పా   ||
     స రి గ మ | ప ద | ని స ||
     స ని ద ప |  మా  |  మా ||
     స ని ద ప | మ గ | రి స ||

6)   స రి గ మ | ప మ | గ రి ||
     స రి గ మ | ప ద | ని స ||
     స ని ద ప | మ ప | ద ని ||
         స ని ద ప | మ గ | రి స  ||
Lesson 1 : SARALI SWARAMULU
PART – 2

స ర ళీ  స్వ ర ము లు

7)    స రి గ మ | ప మ | ద ప ||
స రి గ మ | ప ద  | ని స ||
̇స ని ద ప | మ ప | గ మ ||
̇స ని ద ప | మ గ | రి స ||

8)    స రి గ మ | రి గ | మ ప ||
స రి గ మ | ప ద | ని స ||
̇స ని ద ప | ని ద | ప మ ||
̇స ని ద ప | మ గ | రి స ||

9)    స రి గ మ | స మ | గ రి ||
స రి గ మ | ప ద | ని స ||
̇స ని ద ప | స ప | ద ని ||
̇స ని ద ప | మ గ | రి స ||

10)   స రి స మ | గ మ | రి గ ||
స రి గ మ | ప ద | ని స ||
̇స ని స  ప | ద ప | ని ద ||
̇స ని ద ప | మ గ | రి స ||

11)   ̇సా ని ద | నీ | ద ప ||
దా ప మ | పా | పా ||
గ మ ప ద | ని ద | ప మ ||
గ మ ప గ | మ గ | రి స ||

12)   ̇స ̇స ని ద | ని ని | ద ప ||
ద ద ప మ | పా | పా ||
గ మ ప ద | ని ద | ప మ ||

గ మ ప గ | మ గ | రి స ||

Com

 
2)  చతురస్ర జాతి రూపక తాళం
     (ఒక ధృతం - ఒక లఘువు)

స రి  | స రి గ మ  ||
రి గ   | రి గ మ ప  ||
గ మ | గ మ ప ద ||
మ ప| మ ప ద ని ||
ప ద  | ప ద ని ̇స  ||
̇స ని  | ̇స ని ద ప  ||
ని ద  |  ని ద ప మ||
ద ప  | ద ప మ  గ||
ప మ | ప మ గ రి ||
మ గ | మ గ రి స  ||



No comments:

Post a Comment