Friday, 16 December 2016

చందస్సు పాఠము

చెందస్సు పాఠము.. (2) 15-01-2025

చం.సరిగమపల్కు సారధిగ సాహితివై కళలాయె శారదా
 సరి సరి కాలమేయిదియు సాహసజీవపుదాత భారతీ
పరిపరి నేర్పు పాఠముయు భాషితభూషణమాత శాంభవీ
స్మరణముసేతునిత్యముయు సద్గుణమీయదెసర్వ మీశ్వరీ 

*నీలమేఘ శ్యాముడైన శ్రీరాముండు*
*శివుని విల్లు విరియ జనకు సభన*
*చేతిలోని పూల హారంను సీతమ్మ*
*చిరునగవుతొ  రాము మెడను వేసె*

*నీల  మేఘ శ్యాము* 
UI         UI      UI
హ         హ      హ
సూర్య   సూర్య  సూర్య 
*డైనశ్రీ    రాముండు*
UIU      UII
   ర        భ
ఇంద్ర      ఇంద్ర

*శివుని విల్లు విరియ జనకు*
 III       UI       III            III  
న         హ         న           హ
సూర్య   సూర్య సూర్య  సూర్య 
 *సభన*
   III
సూర్య 

*చేతి  లోని పూల హారంను*
UI     UI    UI      UUI
హ    హ     హ         త
సూర్య సూర్య సూర్య  ఇంద్ర  
*సీతమ్మ*
UUI
 త
ఇంద్ర 

*చిరున  గవుతొ  రాము*
III          III         UI
న            న        హ
సూర్య     సూర్య  సూర్య 
 *మెడను    వేసె*
III               UI
న                హ
సూర్య        సూర్య

తెలుగు లోగిల్ల  సంక్రాంతి వెలుగుజేరి
III           UUI      UUI         III UI
న          త            త          స హ
దాన్య లక్ష్మితో పాటుగన్ ధనము దెచ్చె
UU       UIU      UIU         III        UI
హ         ర            ర           న       హ
ఇంటి యాలిమె డలమరింపెండు నగలు
UI        UII         IIIU          UI      III
హ         భ         నల         హ     న
పల్లె నిండ్లలో ధనలక్ష్మి పాలుపెరిగె
UI     UIU       IIUI         UI       III
హ       ర         సల         హ       న
మీరు వ్రాయండి 

*కాల కనుక యిది కరువు కమ్మ నైన కాలమున్*

 చదివే వారు నేర్చుకునే వారు అభిప్రాయాలు పంపండి


ఇంతకీ మేమెవరమో మీరే చెప్పండి -( 6  )
రచన : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


ప్రాంజలి  ప్రభ - పొడుపుకథల కవిత 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

గుండుకన్నా నున్నగా గుండ్రంగా ఉంటా
ఆకలివేస్తే గాలి నింపు కుంటా
కళ్ళే లేకుండా పరుగెడుతూ ఉంటా
రెక్కలు లేకుండా ఎగురుతూ ఉంటా
ఇంతకీ నే నెవర్నో చెప్పఁమం టా

తినకోసమే నేనునుంటా
కానీ నన్నెవ్వరూ తినలేరంటా 
రోజూ మెరుస్తూనే ఉంటా   
ఇంతకీ నే నెవర్నో చెప్పఁమం టా

ఉంచినచోట కదలకుండా ఉంటా
నాపైన కాలు వేస్తె చాలంటా
 పైపైకి తీసుకువెళ్తూ ఉంటా 
ఇంతకీ నే నెవర్నో చెప్పఁమం టా

--((***))--

బంతి , కంచం , నిచ్చెన 

 ప్రాంజలి ప్రభ - పొడుపుకథ 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
*ఇంతకీ మేమెవరం  మీరే చెప్పండి


1. కలప దిరుగవేసి కడురమ్యమైనట్టి
    నల్లబల్ల పై  తెల్ల  సుద్ద  వ్రాయునట్టి
    అక్షరాబ్యాసముకు ఉపయోగించునట్టి
     అక్షరమాలను తెల్పుటకు ఉపయోగించెదేది? 

2. కాళ్ళు చేతులుండి కాళ్ళు చేతులు లేని
    జీవి నోట జిక్కి జీవమడుగు
    వానిఁజూచి శిరవిహీనుండు తెగనవ్వె
    ఇందులో ఉన్న మూడు ప్రాణుల పేర్లుఏవి?

3.  కాళ్ళు చేతులు తలా గలిగి వెల్గులవేళ
    వెంట వత్తు తమరి బంటు వోలె
    దాన్ని చూసి పిల్లలు ఆడుకొందురు
    కూర్చున్న మాయమవును అది ఏది ?

4. కాళ్లు నాలుగు ఉండు మంచము కాదు
    కరములు రెండు ఉండు నరుడు కాదు
    పిలిచి సేద తీర్చు కోమని చెపుతుంది
    ఇంతకీ నేనెవర్నో మీరేచెప్పండి ?

సమాధానములు : 1. పలక  2.  కప్పు పాము, ఎండ్రి  3.  నీడ 4.  కుర్చీ  
--((*))--



ఇంతకీ మేమెవరమో మీరే చెప్పండి -( 5  )
రచన : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


1. ఒంటి కన్ను ఉంటుంది కానీ కాకి కాదు
    లేచి పడును కడలి వీచి కాదు
    కన్నమందు దూరు పన్నాగము కాదు
    వస్త్రాన్ని కలుపుటకు వాడునది, దీని పేరు ఏది ?

2.  కాలాన్ని బట్టి కదులుతాను  
      కదులుతూ దిశను చూపూతాను 
      సముద్ర ప్రయానీకులకు నేనే దిక్కును
      మీటరు మాత్రం కాదు మారినేనెవర్నీ 
     
3,. ఒకరు పట్టుకోగా ఇద్దరు కదులు
        బరువు తగ్గ ద్రవ్యమును ఇస్తాను
       న్యాయ స్థానము నందు ఉంచుతారు
       ఎన్నికల గుర్తు  కూడా  మరి  నేనెవర్ని?

4.   కడుపునిండా నీరు కంఠమునందున గోళి
       మట్టికాయ బెట్ట మొత్తుకొనుచు
       తనివితీరా నెండ దాహార్తి తీర్చును
       తిన్న  తిండి ఆరగించును, మారి నేనెవర్ని

సమాధానాలు : ౧. సూది   ౨. దీక్సూచి త్రీ. త్రాసు ౪. గోళీషోడా  
 


1.  ఇళ్ళు  లేని యూళ్ళు, నీళ్లు లేని నదులు 
     రాళ్లు లేని కొండలు, వరదలు లేని సముద్రాలు
     ప్రాణులు లేని దేశాలు, పైరు లేని పొలాల హద్దులు
     తెలుసుకోవిషయయలు ఎన్నోఉంటాయి అది ఏమిటి ?

2. పుట్టంగా తేరుకుంటాయ్, గిట్టినా మూతబడతాయి 
    మూసి తెరచు మూతలు కప్పు బడి ఉన్నాయి 
    కష్టాలకు కడలి నీరు పొంగి పొర్లుతూ ఉంటాయి 
    వీటికి చిక్కనివారు  ఉండరు, అవి ఏవి ?

3. ఇంపు లోలకు నన్ను నింగ్లీషు లిపిలోన 
     వ్రాసి చదువుచు దిరిగేసి చదువు
    ప్రపంచ భాషలలో ఇది ఒక భాష  
    మరి  ఏ భాష , నౌర నేనెవర్ని ?


4. ఎవరి తోడైన హెచ్చించి వచ్చిన
    ఫలిత మొక్క చోట గలిపి చూడ 
    తిరిగి నేనె వత్తు, దీపింప మీ లక్కు 
     దీని భావ మెఱసి తెలుపు మోయి 

సమాధానములు : 1. మ్యాప్  2. నయనాలు 3. MALAYALAM  4. '9'


ఇంతకీ మేమెవరమో మీరే చెప్పండి -( 3  )

రచన : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


1/3 1.. ఇంపులొలుకు తున్న తెలుగు లిపిలోన
      వ్రాసి చదువుచు దిరిగేసి చదువు
      నాపేరుకు ముందు ఊరు పేరుంది
      మరి నట్టి కవి ఎవరో- మీరే చెప్పండి?

2.. కేశముల విడదీసి, సరిచేయుచుండు
      అడవిలో పుట్టి నూఱుపండ్లుతో ఉండు
      జీవుల పట్టుకు చిక్కి మారకుండు     
      నన్ను వాడకపోతే చిక్కే- నేనెవర్ని?

3.. ఆకు ఱంగు కన్నా ఎక్కువ మెరుపు
       కిల్లి వేసు కోకుండా నే నోరు ఎరుపు
       మాటలు నేర్చుకొని అరచు చుండు
       కొందరి బ్రతుకుతెరువు - నేనెవర్ని?

4.  ఆలి కోసం అధర్మాన్ని అణచిన
      పంతం కోసం ధర్మాన్ని రక్షించిన
      ద్వాపరయుగం వరకు ధర్మం పంచిన
      పై మూడు పురాణాలు- ఏవో చేప్పండి ?


సమాధానాలు

 1. వికటకవి 2. దువ్వెన 3. చిలక 4. రామాయణము ,భారతము ,భాగవతము
 --((*))--

 
1/2

1. అమ్మ అనగా ఒక్కటై హత్తుకొను  
    నాన్న అనగా దూరముగా జరుగుతూను
    పండిన దొండ పండు రంగును కలిగి ఉంటాను
    రుచి చూస్తే గాని వాని విలువలు తెలియు అవి ఏవి  ?

2 .అందంకోసం వంటిని అంటి పెట్టుకొని ఉంటా
    మొగవాళ్లకు నన్ను ధరిస్తే హుందా తనంగా ఉంటా
    కొందరికి జీవనాధారముగా పనికొస్తూ ఉంటా
    నన్ను ధరించకుండా బాయఁటకు రారు, నేనెవర్ని?

3. ఆకాశమున నూగు అరుదైన మేడ
      గదికి ఒక్క భటుడు, నోట బల్లెంబు ఉండు
      సర్వరోగులకు ఇది సహాయ పడుతుండు
      సెగపెట్ట భటులు పోయి అమృతం కారు, ఎవర్ని ?

4.  ఆకాశము జూచు రాకాసి ఆకులతో
     మెడ చుట్టూ తలలు, తలల నిండా జలము ళూరు
     జలము త్రాగన ప్రజలకు నిషా  వచ్చు          
     పూరిళ్లు కట్టుకొనుకు ఉపయోగపడ్తా నేనెవర్ని ?


సమాధానాలు
 1. పెదాలు 2. షర్టు ప్యాంటు 3. తేనె తుట్టె 4. తాడి చెట్టు   
    
--((*))--
 1/1
 1  మూడు అడుగులుండు కానీ నడవలేదు
    వస్త్ర వ్యాపారాలు నన్ను  మరువలేదు  . 
    నేను లేనిదే లెక్క   ఎప్పటికి కదలదు
    ఇంతకీ  నే నెవర్నో ఆలోచించండి

2. ప్రపంచమంతా సంచారము తప్పదు నాకు
    క్షణము ఆగిన జీవులు నేలరాలక తప్పదు
    వాసనను అందచేసి ఆనందపరచక తప్పదు
     ఆంజనేయుని తండ్రిగా ప్రాణులకు సహకరిస్తా

3. అన్నీ ఇళ్లల్లో తిరుగుట దాని కలవాటు
       దొరికిన గుడ్డలు కొట్టుట మన గ్రహపాటు
       దురదతో కాళ్ళను కూడా కోరుకు అలవాటు
        పిల్లికి ఆహారము అవటం బ్రహ్మ రాత ట 
 
4 .    అడవిలో పుట్టి అందరిళ్ళల్లో ఉంటా
        తిరిగి తిరిగి దుమ్ము దులుపుతూ ఉంటా
      . నేలను నాకి మూలాన నిలుచొని ఉంటా
        అవసరానికి బాధిత పూజకు పనికొస్తూఉంటా

. సమాధానాలు : 1 గజం బద్ద  2   గాలి  3.ఎలుక 4. చీపురు 
  

No comments:

Post a Comment