గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా...గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా...
చిత్రం : ముకుంద (2014) సంగీతం : మిక్కీ జె. మేయర్ సాహిత్యం : సిరివెన్నెల గానం : చిత్ర, కోరస్ గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా.. పరదాలే తీయకా పరుపే దిగనీయకా పవళింపా ఇంతగా మేలా.. కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినకా గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలక కలికీ ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనీ నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీకోసమనీ గగనమే భువిపైకి దిగివచ్చెననీ ఆ రూపాన్నీ చూపుతో అల్లుకుపో సౌదామినీ జంకేలా జాగేలా సంకోచాలా జవ్వనీ బింకాలూ బిడియాలూ ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ.. అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా ఆఆ..ఆఆఅ..ఆఆఆ.ఆఆఆఆఅ...ఆఆ.ఆఆఆఆఆ. ఏడే అల్లరి వనమాలీ నను వీడే మనసున దయమానీ నందకుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే లీలాకృష్ణా కొలనిలో కమలములా కన్నెమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నదీ అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇదీ అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నదీ విన్నావా చిన్నారీ ఏమందో ప్రతిగోపికా చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారకా వదిలావో వయ్యారీ బృందావిహారి దొరకడమ్మ గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా https://www.youtube.com/watch? | ||
|
సొగసు చూడ హాయి హాయిలే...తెలిసినేదో వింత హాయి… హాయి చిత్రం: ధర్మచక్రం గానం: బాలు, చిత్ర సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: చంద్రబోస్ సొగసు చూడ హాయి హాయిలే తెలిసినేదో వింత హాయి… హాయి చెలియ చూపు నీకు హాయిలే చెలిమిలోన ఉంది హాయి… హాయి అందాలు చూడ జన్మ చాలునా అందించగానే ఆశ తీరునా అహో ఇదెంత వింత మోహమో నువ్వంటే నేనంటూ నేనంటే నువ్వంటూ నీవెంట నేనుండనా నీ నవ్వే ముద్దంటూ ఇంకేమీ వద్దంటూ ముడిపడనా నీకోసం పుట్టాను నీ దారే పట్టాను నీమీదే ఒట్టేయనా నా చేత చెయ్యెట్టు నన్నిట్టా జోకొట్టు ఒడిలోన చెట్టాపట్టా కట్టేదెట్టో ఇట్టే చెప్పెయ్యాలమ్మా చెట్టూపుట్టా చూసే వేళ తప్పేదెట్టయ్యా కుమారి చెంపకెన్ని కెంపులో వరించు కళ్లకెన్ని రంగులో అహో ఇదెంత వింత మోహమో నాపాలబుగ్గల్లో దీపాల సిగ్గుల్లో నీ పాలు పంచివ్వనా ఈ వెండి వెన్నెల్లో నీ గుండె చప్పుళ్లు వినలేనా హద్దుల్నే దాటాలి వద్దన్నా చూడాలి నీ కన్నె కవ్వింపులు కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి పదనిసలు నిన్నా మొన్నా లేనే లేని వైనం ఎంతో బాగుంది వన్నె చిన్నె ఊరించాకే ప్రాణం లాగింది సయ్యాటలాడ ఎంత తొందరో వయ్యారి ఈడుకెన్ని చిందులో సుఖాలతీరమెంత దూరమో | |||||||||||||||||||||

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియా
వయసుడిగే స్వగతంలో అనుబంధం ఆనందమానందం
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
మరుజన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం
చెలియా ఇతరులకై కను జారే కన్నీరే ఆనందమానందం
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
చిత్రం : భారతీయుడు!
ఈ సినీ కథనం గురించి మీ అభిప్రాయాన్ని తెలుపవచ్చును!
నేలమ్మా నింగమ్మా నీరమ్మా నిప్పమ్మా గాలమ్మా కనరమ్మా సంబరం
చిత్రం : ఆడదే ఆధారం
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : శంకర్ గణేష్
గానం : SP. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి :
నేలమ్మా నింగమ్మా నీరమ్మా నిప్పమ్మా
గాలమ్మా కనరమ్మా సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం… సంగమం..
చరణం : 1
అవని అందము కుదురు లేనిది
ఏడాదికొక్కటే వసంతమున్నది
ఋతువు మారినా చెదిరిపోనిది
అమ్మాయి మేనిలో అందాల పెన్నిధి
తుళ్ళకే అలా గంగ వెల్లువా
సొగసు పొంగులో ఈమె సాటివా
వయ్యారి వంపులు నీ ఒంటికున్నవా
చరణం : 2
కలికి కళ్ళలో కలల మెరుపుతో
నువు తెల్లబోదువే నీలాల గగనమా
చిలక సొంపులో అంత మైకమా
చిరుగాలి నువ్వలా స్తంభించిపోకుమా
చెలియ తనువులో వేడి తాకితే
చలికి వణకవా సూర్యబింబమా
ఆ మంచు మంటతో జాబిలిగ మారవా
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో...ఒక పూటలోనె రాలు పూవులెన్నో
చిత్రం : సుందరకాండ (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : చిత్ర
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : చిత్ర
పల్లవి :
ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలొనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలొనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల?
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
కన్నీటి మీద నావసాగనేల?
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
చరణం 1 :
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరూ
మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరూ
మమతానురాగ స్వాగతాలు పాడ
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరూ
మమతానురాగ స్వాగతాలు పాడ
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
చరణం 2 :
ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి
జన్మబంధమూ ప్రేమ బంధమూ.. పూటే చాలులే
పంజరమై బ్రతుకు మిగులూ.. పావురమే బైటికెగురూ
జన్మబంధమూ ప్రేమ బంధమూ.. పూటే చాలులే
పంజరమై బ్రతుకు మిగులూ.. పావురమే బైటికెగురూ
మైనా క్షణమైనా పలికిందే భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
చిత్రం : తులసి
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
గానం : సాగర్, చిత్ర
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
గానం : సాగర్, చిత్ర
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం

అడుగునవుతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరి దాకా
గొడుగునవుతాను ఇకపైన నేను వానలో నిన్నీలా తడవనీక
నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా
నీ లేత చెక్కిళ్ళ వాకీళ్ళలోనే తొలి సిగ్గు నేనవ్వనా
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం
గొడుగునవుతాను ఇకపైన నేను వానలో నిన్నీలా తడవనీక
నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా
నీ లేత చెక్కిళ్ళ వాకీళ్ళలోనే తొలి సిగ్గు నేనవ్వనా
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం
వెన్నెలవుతాను ప్రతి రేయి నేను చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరవుతాను నీలోన నేను ఎన్నడు నీజతే వదల కుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా
చిరు చెమట పడుతుంటే నీ నుదురు పైనా వస్తాను చిరుగాలి లా
ఊపిరవుతాను నీలోన నేను ఎన్నడు నీజతే వదల కుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా
చిరు చెమట పడుతుంటే నీ నుదురు పైనా వస్తాను చిరుగాలి లా
ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..కృష్ణయ్యా వచ్చేదీనాడే.. చిత్రం : తేనెమనసులు 1987 సాహిత్యం : వేటూరి సంగీతం : బప్పీలహరి గానం : పి. సుశీల ఓఓఓ... ఆలారే..ఆలారే.. ముకుందా మురారే.. కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా.. ఆలారే..ఆలారే.. ముకుందా మురారే.. కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా.. ఓఓఓ..ఓ.ఓ పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో.. తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. విందులే.. చేయనా.. పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో.. తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. విందులే.. చేయనా.. వేణూ గానాలెన్నో ఈ రాధా గుండెల్లో.. మౌన గాథలెన్నో ఈ పేద గుండెల్లో.. పాడనా.. ఊపిరై.. రాధాలోలా.. ఆలారే..ఆలారే.. ముకుందా మురారే.. కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా.. ఓఓఓ.. ప్రేమ కుటీరం మాదీ పేద కుటీరం.. కృష్ణ సంగీతం మదిలో బృందావిహారం.. ప్రేమే నా... ప్రాణమూ.. ప్రేమ కుటీరం మాదీ పేద కుటీరం.. కృష్ణ సంగీతం మదిలో బృందావిహారం.. ప్రేమే నా... ప్రాణమూ.. ప్రేమే ఆతిధ్యమ్.. నీకూ ప్రేమే ఆహ్వానం.. ప్రేమే నా జీవం.. కృష్ణ ప్రేమే నాదైవం.. స్నేహమే....ఏ.. ప్రాణమూ.. రాధాలోలా.. ఆలారే ఆలారే.. ముకుందా మురారే.. కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా.. ఆలారే ఆలారే.. ముకుందా మురారే.. కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా.. |
om
ReplyDelete