Tuesday, 27 December 2016

ఈ వారం పద్యాలు **



 [09/05, 8:34 am] Mallapragada Sridevi: సమత్వా విద్యాప్రాప్తి సుమ దళశోభ తల్లియే పం

చి మంత్రలా చేరీ వినయము చూపి సొంత సొమ్మే

విమర్శే లేకుండే మనసు సమవైభోగమే పం

చి మార్గమ్మే చూపే సహజ మమచింతతీర్చే

[09/05, 8:39 am] సాహిత్యం (2): ऊँ!

----

"సీ.

----

ఏ తల్లి యుగ్గులో యిచ్చెనో యూసులు

     మనుగడ యంతయు ముదమునొసఁగు


ఏ తల్లినీతిని యిచ్చెడి కథలను

      చెప్పెనో శిశువుకు 

నొప్పిలేక


ఏ తల్లి బిడ్డకు నీశ్వరీ తుల్యమై

      బాగోగులనుఁజూచు బాగుగాను


ఏ తల్లి కడదాక విసుగును లేకయే

          పిల్లకనిశము 

పెద్దయౌను


గీ.

--

అట్టి తల్లికర్పింతును హర్షముగను


నిరతనామస్మరణతోడ కరుణఁగోరి


త్రికరణాత్మనా కైమోడ్పు తీపిమదికి


' మాతృదేవోభవ ' యనుచు మరువనెపుడు !!! "

-----------

[09/05, 8:55 am] Mallapragada Sridevi: సీసము


మాతృదేవోభవ.. మాతృదేవత అంటు

మనసుతో తెల్పుతూ మౌనమీడి

మంగళమంటూనె మమతమాధుర్యమ్ము

మాకు దీవెనలిచ్చు మూర్తి అమ్మ

అనురాగ సంగమం అనుబంధ ఆత్మగా

ఆదర్శ జీవిగా ఆదు కొనెను

మాతల్లి కడదాక మమ్మునే మోసియూ

మహిమగల కధలు మాకు తెల్పె


ఆటవెలది


అట్టి అమ్మ మాకు జపతప ప్రధాత

నిత్య సత్య బోధ నిజము తెల్పి

ప్రేమ పంచి వినయ ప్రేమామృతము పంచి

సమయ విలువ తెల్పి సౌఖ్య మిచ్చె


----
హీను దేన్నీ విద్య లిల నభ్యసించిన
ఘనుడుగాడు మొఱకు జనుడెగాని
పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ వినుర వేమ

చిక్కియున్నవేళ సింహంబు నైనను
బక్క కుక్క గఱచి బాధచేయు
బలిమిలేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినుర వేమ

అలసస్య కుతో విద్యా
అవిద్యస్య కుతో ధనం
అధనస్య కుతో మిత్రం
అమిత్రస్య కుతో సుఖం

తా:--సోమరికి విద్య పట్టుబడదు, విద్యలేనివానికి ధనమురాదు, ధనము లేనిచో మిత్రులు దొరకరు, మిత్రులు లేనివారికి సుఖమెక్కడిది?

అనగా జీవితములో సర్వసుఖములూ విద్యవల్ల కలుగుతాయని, అట్టి విద్య నిరంతర పరిశ్రమ వల్లనే సాధ్యమని భావము.

-----------------------------------------

స్త్రీ యో దేవాః స్త్రియః పుణ్యా స్త్రీ య యేవ విభూషణం
స్త్రీ ద్వేషో నైవ కర్తవ్య స్తాస్తు నిందా ప్రహారకమ్

అర్థము:-- స్త్రీలు దేవతలు,పుణ్యమూర్తులు.సమాజానికి అలంకారాలు.వారి ఎన్నడూ ద్వేషించ రాదు, నిందించ రాదు, చేయి చేసుకోరాదు.మగువలు కన్నీరు పెడితే ఆ కుటుంబానికి మంచిది కాదని అంటారు కదా!(కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింత వుండ నొల్లదు")

మగవాళ్ళ తో పోలిస్తే కుటుంబ జీవితం లో యిమిడి పోవడానికి తోలి రోజుల్లో స్త్రీ మానసికంగా ఎక్కువ సంఘర్షణ కు గురి అవుతుంది.ఇల్లు,యింటిలోని వారు అంతా కొత్త ఎలా మెలగాలో భయం భయంగా వుంటుంది.ఆ సమయం లో భర్త ,అతని కుటుంబ సభ్యులు ఆమెకు సహకరించాలి.ఒక మొక్కను తీసుకొని వచ్చి వేరే చోట నాటితే మొదట్లో తల వాలేయటం సహజం.దానికి తగినన్ని నీళ్ళు పోసి జాగ్రత్తగా చూసుకుంటే బాగా ఏపుగా పెరుగుతుంది.పుష్పాలూ,ఫలాలూ యిస్తుంది స్త్రీ కూడా అంతే ప్రేమాభిమానాలు చూపించి ఆమె బాధ పడకుండా చూసుకుంటే జీవితం సుఖమయం గా గడిచి పోతుంది.

వేదమూలమిదం జ్ఞానం
భార్యామూలమిదం గృహం
కృషిమూలమిదం ధాన్యం
ధనమూల మిదం జగత్

అర్థము:జ్ఞానమునకు వేదమే మూలము ; గృహమునకు భార్యయే మూలము; ధాన్యమునకు కృషియే మూలము; జగత్తునకు ధనమే మూలము.

--((*))--

చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీతిబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తి గల్గు చోట ఫలముల తప్పురా
విశ్వదాభిరామ వినుర వేమ

ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను
అంటనియ్యక శని వెంట దిరుగు
భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా
విశ్వదాభిరామ వినుర వేమ

తనుజులనుం గురు వృద్దు ల
జననీజనకులను సాధుజనుల నెవ్వడు దా
ఘనుడయ్యు బ్రోవడో యా
జనుడే జీవన్ మృతుడు జగతి కుమారా

అర్థము:-- ఓ! కుమారా తన కుమారులను,గురువులను,పెద్దవారిని,తల్లిదండ్రులను,సజ్జనులైన వారిని తగిన సమయమున రక్షింపడో అతడు బతికి యున్నను చచ్చిన వానితో సమానము.

(కుమార శతకం)

దానం ప్రియ వాక్సహితం జ్ఞాన
మగర్వం క్షమాన్వితం శౌర్యం
విత్తం చ త్యాగనియుక్తం
దుర్లభ మే తచ్చతు ర్భద్రం

తా:--ప్రియవచనములతో గూడిన దానమున్నూ,గర్వము లేని విద్య యున్నూ, క్షమ గలిగిన శౌర్యము న్నూ, త్యాగముతో గూడిన ధనమున్నూ , ఈ నాలుగూఎక్కడో అరుదుగా వుంటాయి స్కాంద పురాణంలో ఒకచోట ఇలా పేర్కొనబడింది.*

పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్
నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే
తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్
తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే...

ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నోవారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం

ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు. నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

--((**))--

మునిసంఘము పూజింప .. 

---------------------------------- 

సాహితి నూతన వృత్తము 

గణములు - స,స,హ,స,స,హ 



(సలల,త ,సలల,త లేదా సల,యల,సల,యల ) 
(స,స,భ,జ,య,లఘువు) 

యతి (9) లేదా ప్రాసయతి ( 2,10) 

మునిసంఘము పూజింప ముదమొందెడి పూర్వేశి 
వనజేక్షణ శ్రీవాణి ప్రణవాత్మిక వాగ్దేవి 
వినుతింతును నిన్నెప్డుఁ బ్రియమారఁగ నేనాఁడు 
తనియించఁగ నీగుండె తగినట్లుగ గానాల 

అనునిత్యము బాసాడి యలరించెడి నాతల్లి 
కనువిందుగఁ గన్పించి కరుణించఁగ రారాద 
తినఁదిండియు లేకున్నఁ దిరమైనది సంతృప్తి 
మనమందున నిండంగ మఱి తక్కువ కాదేమి 

వసియింపఁగఁ బద్మమ్ము వసివాఁడని డెందమ్ము 
రసవంతము వాక్యమ్ము లలినిచ్చెడి హారమ్ము 
రసనాగ్రమునందుండి రమణీమణి నీవాడఁ 
బ్రసరించెడి తేజమ్ము ప్రభవించెడి పద్యమ్ము 

అసితమ్మగు మోహమ్ము నహమౌనిక నాశమ్ము 
కుశలంబగు యానమ్ము కుదురౌనెద సౌఖ్యమ్ము 
విశదంబయి ప్రేమమ్ము విననింపయి జ్ఞానమ్ము 
వసుధాస్థలి సర్వమ్ము ప్రకటించును మోదమ్ము 

సుప్రభ 

8:02 AM (PST)
పద్యములో పద్యములు -

సీ. వనమంజరుల మధ్య - వనమయూరములాడె
ఘననినాదమ్ములన్ - వినుచు వేగ
మత్తేభములఁ జూచి - మత్తకోకిల పాడె
మత్తహంసిని యాడె - మత్త మగుచు
తరళ నేత్రమ్ములన్ - హరిణీగణమ్ములు
తరుపదమ్ములఁ బర్వెఁ - ద్వరితగతుల
కళికలు విరబూయ - మలయజమ్ముల తావి
లలితలలితముగా - విలసితమయె

తే. వసుమతి మనోజ్ఞమై యుండె - కుసుమవతిగ
భామినీషట్పదుల్ మ్రోఁగెఁ - గామలతల
తేటగీతుల బలు నింపెఁ - దేఁటిబోఁటి
మదనమున త్రాఁగిరి మదిర - ముదిత లెల్ల

శలభలోలా - 

ఆధారము - దుఃఖభంజనకవి "వాగ్వల్లభ" 
వర్గము - భుజంగప్రయాతము 
నడక - ఎదురు నడకగల పంచమాత్రలతో 

శలభలోలా - య/య/జ/స/గ IUU IUU - IUII IUU 
13 అతిజగతి 1866 

ఇదేమో సదా నా - హృదిన్ వెతలు నిండెన్ 
ముదమ్మిందు లేదే - మొగమ్మున నలంతల్ 
బదమ్ముల్ వినంగా - వ్యధాభరిత మయ్యెన్ 
హృదిన్ మాడిపోవన్ - వృథా శలభమైతిన్ 

సువర్ణమ్ము మేడల్ - సుగమ్ములకు చాలా 
భవమ్మందు నీవే - వరమ్మెపుడు గాదా 
నవమ్మైన జీవా-ర్ణవమ్మును దరించన్ 
శివా నీవె నాకున్ - శ్రిఽయాశ్రయము గాదా 

నినున్ దల్చుచుండన్ - నిరంతరము నీకై 
ననున్ నీకె యివ్వన్ - నవమ్మగు తలంపుల్ 
కనన్ నన్ను రావా - కనుల్ గలయఁజూచెన్ 
మనోహారి నీవే - మనమ్మిచట నీదే 

కనన్ స్వప్నమందున్ - గళామయిని గంటిన్ 
మనోవీథియందున్ - మహోజ్జ్వలము తారల్ 
స్వనమ్ముల్ జనించెన్ - పదమ్ములకు తోడై 
అనూహ్యమ్ము మోదం - బవన్ గలయు వీడెన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు




ఈ పద్యముల ఎన్నో పద్యాల పేరులున్నాయి, కనుక్కోండి, చూద్దాం!
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
పాఠాల నేర్పించు ..... 
-------------------------- 

భారతీ గీతి ( నూతన ఛందము ) 

( ద్విపదగా ) 

గణములు - ఇం,ఇం,ఇం,గురువు 
యతి - మూడవ ఇంద్రగణము 

పాఠాల నేర్పించు పంతులమ్మా 
కాఠిన్యమున్‌ జూపఁ గానిదమ్మా 
---ఆటాడ కష్టమౌ నజునికొమ్మా 
---మాటాడఁ దీయఁగా మాన్యమమ్మా 

నామాటలెప్పుడున్‌ నాణ్యమౌనే 
నీమీద నిరతమ్ము నెయ్యమేనే 
---ఎన్నెన్నొ నేవింటినీరీతిగాఁ 
---గన్నమ్మననిబల్కఁ గనరాకయే 

ఏమీయ మోదమౌ నెఱిఁగించవే 
ప్రేమతో నందింతు వేవేగమే 
--- అడిగియున్‌ ఫలమేమి యజునికొమ్మా 
--- గుడిలోని బొమ్మలా కూర్చుండుటే 

పలుకనా నీతోడఁ బద్యాలతోఁ 
జెలిమి నేఁ జూపించి చిన్నమ్మగా 
--- అడుగువందించితే హర్షించఁగాఁ 
--- నడుగఁగా నే మళ్ళి హరసోదరీ 

పనులలో మునిగితిన్‌ బ్రజకోసమై 
వినతులే వినతులు విద్యార్థులై 
--- జేజేలఁ గొనుచుండు జేజెమ్మవే 
--- నేఁ జేయు విన్నపాల్‌ నీకందవా 

వినిపించినాయమ్మ వినకెట్టులే 
సణుగవా వినకున్న సతతమ్మెదన్‌ 
--- వినిగూడ మౌనంగ విధిసుందరీ 
--- పనియన్న సాకుతో వ్యథఁగూర్చుటా 

--- అర్థించ నాకేమి యట్లైనచో 
--- వ్యర్థమేగా కోర వాగ్వాదినీ 
--- కోరికే లేనట్టి కొమ్మనై నే 
--- కూరుచుందును, పొమ్ము గుడిలోనికే

--((***))--

చతుర్విధ కందములు-- చిత్ర కవిత్వము

ఇది యొక విచిత్రమైన కందపద్యం. చతుర్విధ కందమని దీని పేరు. ఉండే దొక్కటే కందపద్యం. దాని రెండవపాదం రెండవ మాటతోమొదలుపెట్టి , మరోపద్యం . మరలాదాని రెండవపాదం రెండవ పదంతో మరోపద్యం. అలాగే మరోమారు ఆవృత్తిని పొందుతుంది. ఆమాటలనే ఆపదాలనే తిప్పితిప్పి సరికొత్తపద్యాలవుతుంటాయి. గణాలుగానీ ,యతిప్రాసలు గానీ , యెక్కడా తప్పవు. పద్యానికి అర్ధమూ భావమూకూడా మారదు. ఈవిధంగా కూర్చిన కందపద్యానికి చతుర్విధ కందమనిపేరు.

ప్రస్తుతం ఇలాంటి ఒకకందాన్ని పరిశీలిద్దాం!

1
కం : " సుర రాజ విభవ, లక్షణ
భరితా, వనజాస్త్రరూప, వరక కవి వినుతా,
: హరిభక్తి యుక్త విలసత్
కరుణా ,దినకర సుతేజ గద్వాలనృపా!"

ఇదీ మొదటి పద్యం! దీనికి అర్ధం తెలిసికొందాం.

హేగద్వాలనృపా- ఓగద్వాల నేలే ప్రభూ! సురరాజ విభవ- దేవేంద్ర వైభవముగలవాడా! ; లక్షణ భరితా- శుభలక్షణసమన్వితా ; వనజాస్త్ర రూప- మన్మధరూపా ; వర కవి వినుతా- సత్కవులచే పొగడబడువాడా ; హరిభక్తితోను కరుణతోను కూడినవాడా ; దినకర సుతేజ- సూర్యతేజమువంటి చక్కని పరాక్రమము గలవాడా ;

భావము: దేవేంద్ర వైభవముగలవాడా ! శుభ లక్షణ సమన్వితా! మన్మధరూపా! సత్కవులచే కీర్తిప బడువాడా! హరిభక్తితోను దయతోను నిండిన మనస్సుగలవాడా! సూర్య సమాన తేజా! మమ్మాదరింపుము.
ఇపుడీ పద్యమే మరో మూడు కందపద్యాలుగా మారబోతోంది. చూడండి!

2 కం: వనజాస్త్రరూప, వరకవి
వినుతా , హరిభక్తి యుక్త విలసత్కరుణా ,
దినకర సుతేజ , గద్వా
ల నృపా ,సురాజ విభవ లక్షణ భరితా!

3 కం: హరిభక్తియుక్త ,విలసత్
కరుణా , దినకర సుతేజ , గద్వాల నృపా !
సుర రాజవిభవ, లక్షణ
భరితా , వనజాస్త్రరూప , వర కవి వినుతా!

పద్యా 4 కం: దినకర సుతేజ, గద్వా
లనృపా , సురాజ విభవ ,లక్షణ భరితా ,
వనజాస్త్ర రూప , వరకవి
వినుతా , హరిభక్తియుక్త , విలసత్కరుణా!

ఇలా ఒకే పద్యం అర్ధంగానీ ,గణాలుగానీ ,యతిప్రాసలు గానీ, మారకుండా చెప్పటం ఆశ్చర్యంగా లేదూ!

బద్వేటి వెంకట కృష్ణయ్య గారు అనే కవి , గద్వాలప్రభువైన శ్రీ సీతారామ భూపాలుని గూర్చి చెప్పన చతుర్విధ కందమిది.. సారస్వతంలో యిలాంటి విచిత్రాలు యెన్నో ఉన్నాయి. తెలిసికోవాలనే ఆశక్తి ఉంటే నాతో పయనం చేస్తూ ఉండండి.

స్వస్తి!




No comments:

Post a Comment