Sunday, 19 February 2017

ఓం శ్రీరాం - శ్రీ మత్రేనమ:

ఓం శ్రీరాం   - శ్రీ మత్రేనమ:


 Image may contain: 1 person, standing
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 
శ్రీ ఆదిశంకర విరచిత సౌందర్యలహరి (సంస్కృత) మాధారముగా
తెలుగులో పద్య రూపములో వ్రాయుట ప్రయత్నం చేయు చున్నాను
నాకున్న పరిజ్ఞానం ఆజగజ్జననీ బలంతో తెలియ పరుస్తున్నాను
      
పద్య రచన: మల్లాప్రగడ రామకృష్ణ (1 )



*లహరి -1

శా : సందర్భం కలిగే  మహేశ్వరుడు కాచ్చాఈణి  చేరంగ ఆ
      నందం పొందగ సంతసంతో శివుడే వీరంగ మాడేను లే
      విద్యాశ్రీణి పూల దళముల తో పూజింప సదా నీవు ఆ
      రాధ్యా నేను అశక్తుడే నిను సెవింపార్దాలె  నా రావులే



లహరి  -2


శా !! లోకా లన్నిట దర్శనం చరణ ధూళి స్వీకరిం చేదుకే
        లోకా ధీశులు శ్రీహరే శివుడు బ్రహ్మ ధూళి పొందే కదా
        స్వీకారా మనసే మనందరినీ కాపాడే మనోనేత్రి - ఆ
        శక్తియే సు విశాల తత్వమును బోధించే అపర్ణే  కదా      

లహరి  -3


శా!! మూర్ఖత్వం మటు మాయ మయ్యే ఉదయం సూర్యునిలా ధూళితో 
       సర్వేకం  మకరందమే జడులకే జ్ఞానం కల్గించే సదా 
      ఆరంభం లొని దారిద్రం మటుమయం చేసే గుణాన్ని సదా
       మార్గాల్లో నడిపించే భూమిని ఉద్దరించే వరాహం కదా
-- లహరి -4


శా:  లోకాల్నీ అభయం కలే అభి నయించే దేవత భావమే
      లోకాల్లోని భయం పొగొట్టు టయు యంతో ప్రేమ లందించెయే
      లోకైక జ్జననీ సమర్ధతను చూపే పాద ధూలీ కదా
       ఏకైక జ్జననీ సుఖాల కరునే అందించి యుండే కదా
  
లహరి -5 

శా :  సౌభాగ్యం కలిగే అనేక తప మాచారాల వల్లే కదా
        ప్రభావం హరి అర్చనే మహిళగా మహాశివుణ్ణే ప్రేమతో
        ప్రాభవం మనసే రతీ నియమములే సర్వాంతరా ప్రేమ భా
        వాబోదే సకలం మదీయమున తన్మ య్య త్వ భావం కదా
 
లహరి    -6

శా : జుంకారం సమరేఖవిల్లు సుకుమార పుష్ప బాణాలు వే
      శే కార్యో న్ముఖుడే వసంతుడుగ సామీప్యంగ సామంతుడే      
      వీక్షిణ్యం నశరీరు డేను జగమేలే నీ కటాక్షం మె గా
      శక్తీ యె జ్జననీ వివేక కరుణా జాలీ సమాంతర్య మే

లహరి-7

శా !! మాతాశ్రీ చిరు గజ్జలే నడుము చుట్టూ శబ్ద తన్మాయమే
         మా తల్లీ నడుమే సితార సమ వక్షోజాలు వం గేనుగా
         సొంతంగా ధనువూ ధరించి ముఖమే చంద్రా బింబ సంతోషమే
          మా తల్లీ సహకారమే శివుని కీ ఆనంద తేజో మయం

లహరి - 8

శా!! సంద్రంలో మ ణి దీపదివ్య భవ ణం  కల్పా వనం మధ్య ఆ
      నందం పొందు కళే మనోహరము రూపంమంచమే జ్ఞాన మా
       త్రం దేవీ సుఖ భావ అంకము  శివ నందామృత  త్రికోణమే
       స్వేదానంద మదీయ దర్శనముగా స్వభావ ఆనంద మే     

లహరి   -9

శా:: మూలాధా రవిశు ద్దప్రాణ మణిపూర స్వా ధి కారం వలే
      భూలాస్యం కొరకే సమాన జల అగ్ని వాయు ఆకాశ భం
      ధాలే నువ్వు సుషుష్మ మార్గ సహనం ఏకాంత పద్మాల లో
      తల్లీ తత్వముగా మనస్సు పతి దేవు న్నుండి సంతోషమే 

లహరి   -10

శా:: స్వరూపీ తప:వి ద్యరూపిణి గుణా ఆనంద అమృత మే
       ఆరాధ్యా నవనీత పాద యుగళం విస్వాస ప్రాణాల ఓం
        కారం చంద్ర ద్రవా సమస్త తడి మూలా ధార చేర్చుటలో
        సర్పామ్గ శయనంను చేరి తనువే ఆధార మార్గాలు లే

లహరి -11

శా:: శ్రీమాతా శివ శ క్తి ప్రేమ కలిగే కోణాల తో తొమ్మి దే   
       శ్రీమాల సమ మార్గ అష్ట దశ షోడా శాల చే శ్రీక రే
       శ్రీతత్వా మము దయ చూచినట్టి సమరూపంమాకు దర్శన మే      
       శ్రీచక్రం శివ మూడు రేఖల తొ సంబంధమైన సత్యము గా


లహరి - 12

శా ::మాతాశ్రీ కవులే శ్రమించు లతలే సామ్యానికే కల్పనే
       ఆత్యంతం మనసే తపస్సు కలలే సౌందర్య సానిత్యమే
       వ్యత్యాసం శువునీ సాహిత్య భవదీ సాయుజ్య సందర్స మే
       మాతామీ వలె ఎవ్వరూ తెలుప లేనీ భాగ్య మిచ్చుట యే       

 లహరి -13

శా:: నీదృష్టే పడితే ఎలాగు అయినా కామాన్ని తట్టూకొ కా
      వృద్ధుడే సరసా లవల్లె  తలపే స్త్రీలోల మారేను గా 
      సందర్భో చితమే  ఎలాగు మనసే శృంగార భావాల తో
      సౌందర్యం వలనే కుచాల తలపే ఆకర్ష ఆనంద మే

లహరి -14

       అమ్మా  నీ చరణ కమలాలు  రాజిల్లు తున్నాయి
       అమ్మా  పృద్వీ తత్వం లో యాభై ఆరు
       అమ్మా  జల  తత్వం లో యాభై రెండు
       అమ్మా  అగ్ని తత్త్వం లో అరవై రెండు
       అమ్మా  వాయు తత్త్వం లో ఏభై  నాలుగు
       అమ్మా  ఆకాశ తత్త్వం లో డెబ్భై  రెండూ
        అమ్మా  మనస్తత్వం లో అరవై నాలుగు
        ప్రకాశాలు తేజరిల్లుతూ ఉంటాయి


లహరి -15

శా!! సంపూర్ణా ర్ధమునే శుబ్రంగ సమసౌఖ్యంబేను వెన్నేల లో
       ప్రపూర్ణా మకుటం తెజస్సె నెలవం కాజూట రూపాల లో
       ఆపాదం ప్రణమిల్లుటే మనసే సు వాస్తవాలనే తేల్చేందు కే
       సంప్రాప్తి అభయం సమస్త సుఖమే మాతృత్వం హస్తాల లో

లహరి  -16

శా ::సేవించే వికసింప జేయ కమలం బాబాస్క రేతస్సు గా
       కావ్యాన్ద్రా కధలే మనస్సు తలపే అమ్మా ని సాహిత్య మే
       శ్రీవాణీ తరుణం విధాత మలుపుణ్ శృంగార గంభీర మే
       నీవల్లే మదిలో ససత్పు రుషులే ఆద్యంత శ్రీ రంజ నమ్     
    
లహరి -17

శా :: ఓమాతా మమతా వివేక శశిరేఖా శోభ నీవల్ల నే
        ఓమాయా మనసున్ నమామి మధుకావ్యాలే రచించేను లే
        నామాధుర్య మిదే అనేది కవిగా వాగ్దేవి శక్తీ ని పం
        చాలమ్మా   స్థిరమున్ గమనం సమస్య ల్తీర్చేదయా మాతవే    

లహరి -18

శా:: అమ్మానీ నయనాల వెల్గు కొలిచే శక్తేవ్వరి కీలేదు లే
      నమ్మున్ శక్యముగానిలీల వశమే ప్రభాస్కరా కాంతు లే
      భూమ్యాకాశములో  అనంత కళలే దేహాల వేల్పులు లో
      కమ్ములో కళలే నిజం చెసుకొనే స్త్రీపుర్ష లల్లోను లే


లహరి -19

శా:: స్త్రీ శారీరములో బొడ్డున ఎగువే వక్షస్థనా వెల్గులే
      స్త్రీ శారీరములో బొడ్డున దిగివా భాగం లొ త్రికోణ మే
      స్త్రీ శారీ సుఖమున్ సమర్ధ కళనే శ్రీఘ్రముగాచూపునే
      కేశాలా మెరుపే కుచాలూ పురుషంకారాన్ని హెచ్చించునే      

లహరి -20

శా:: ద్వివ్యాంగా లలనా బహిర్గతమవున్ రూపాల జాలాన్ని సా
       నవ్వులూ వెదజల్లు చుండె హృదయంలో ధ్యాన మాధుర్యమే
      పువ్వులా వెలుగూ మనోహరముల్ నీ చంద్ర వెన్నేలు లే
      గర్వాన్ని అణచీ నిజామృతముచే సంతృప్తి నీ దృస్టె లే 

లహరి 21

శా :: యోగాస్త్రం మయమే అనంత మరుపే సూర్యాగ్ని తగ్గేను లే
        భాగాల్లో సమయం సమంత తలపే చంద్రాగ్ని పెంచేను లే
        యాగాల్లో మనసే సశుద్ధ తరుణం పద్మాల రూపాల లో
        వేగాల్లో మనసే మహాత్మ వరుసే చేస్తున్న ఆనంది వే



లహరి -
శా:: పాతివ్రత్యమే కీర్తికిందొడవు తల్పంగా సదాకొమ్ము కున్ 
       పాతివ్రత్యమే సర్వకల్ముడికై వల్యంబు జేకూర్చెడిన్
       పాతివ్రత్య వ్రతంబు బూన నఘముల్ భస్మంబులౌ వేగమే
        పాతివ్రత్య మహత్యమున్ బొగడఁగా బ్రహ్మాదులున్ దక్షులే   

లహరి- 22

శా::  భూమధ్యా స్థిరమే స్తుతింప మనసే ప్రార్ధింప శ్రీఘ్రము గా
       మమ్మానందముగా దృష్టింస కరుణా అందించు శ్రీవాణి వే
       మమ్మేకం కలిపే స్పృజించె చరణా సాయుజ్య సమ్మేళ మే
       ముమ్మారు సహనం వహించి మనసే అమ్మపై ఉంచాను లే    

లహరి - 23

శా:: సర్వస్వమ్ కిరణా మయంగ శివతత్వాలే కిరీటంవ లే
శ్రీరమ్యమ్ అరుణా శివమ్ యె సతియే వామాంగమై తృప్తిగా
భారంతో తరుణం గతాన్ని మరిచే దాక్షిణ్య చూపించుటే   
కారుణ్యం  మెరుపే  గ్రహించి దక్షిణాం నీకూమహేశ్వర మే    

లహరి - 

శా:: లోకంబుల్ దెగ లోకు  లీల్గణవళన్ లోలాయ మానంబు గా
      శోకానందము లింత లేకభువిలో శోభిల్లు నెవ్వాడు ద
       స్చ్రీకారుణ్యుని పాపసంహారుని నే సేవించి సద్బక్తి తో
       నాకీ భాద దొలంగఁ సేయు కొరకై  నాయాత్మలో వేడెదన్   

Monday, 13 February 2017

శ్రీ లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రము


        శ్రీ లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రము

    1. శ్లో :    శ్రీ మతృ యోనిధి నికేతన ! చక్రపాణే !

        భోగీంద్ర భోగ మణి రంజిత పుణ్య మూర్తే!

        యోగీశ శాశ్వత శరణ్య ! భవాబ్ది పోత !

        లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలంబమ్ !
       

    2.. శ్లో :    బ్రహ్మేంద్ర రుద్ర మరు దగ్ని కిరీట కోటి

        సంఘట్టితాంఘ్రి కమలామల కాంతి కాంత !

        లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస !

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్ !
       

    3. శ్లో :    సంసార ఘోర గహనే చరతో మురారే !

        మారోగ్ర భీకర మృగప్రవరార్దితస్య

        ఆర్తస్య మత్స్సర నిదాఘ నిపీడితస్య

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్ !
       

    4. శ్లో :    సంసార సాగర విశాల కరాళ కాల

        నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య

        వ్యగ్రస్య రాగ రసనోర్మి నిపీడితస్య

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    5. శ్లో :    సంసార కూప మతిఘోర మగాధ మూలమ్

        సంప్రాప్య దు:ఖశత సర్ప సమాకులస్య

        దీనస్య దేవకృపయా శరాణాగతస్య

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    6 శ్లో :    సంసార భీకర కరీంద్ర కరాభిఘాత

        నిష్పీడ్య మాన ఫప్లుష: సకలార్దితస్య

        ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    7. శ్లో :    సంసారసర్ప ఘన వక్ర భయోగ్రతీవ్ర

        దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్ట మూర్తే :

        నాగారివాహన సుదాబ్ది నివాస శౌ రే

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    8. శ్లో :    సంసార జాల పతితన్య జగన్నివాస

        సర్వేంద్రి యార్ధ బడిశాగ్ర జుషోపమస్య

        ప్రోత్ఖండిత ప్రచుర తాలుక మస్తకస్య

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    9. శ్లో :    సంసార వృక్ష మఘ బీజ మనన్తకర్మ

        శాఖాశతం కరణ పత్ర మనంగ పుష్పం

        ఆరుహ్య దు:ఖ ఫలితం పతితో దయాళో !

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    10. శ్లో :    సంసార దావ దహనాకుల భీకరోగ్ర

        జ్వాలావలీభి రతిదగ్ద తనూరుహస్య

        త్వద్పాదపద్మ సరసీం శరణా గతస్య

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్


    11. శ్లో :    సంసార సాగర నిమజ్జన ముహ్యమానం

        దీనం విలోకయ విభో ! కరుణా నిధే ! మాం

        ప్రహ్లాద ఖేద పరిహార వరావతార

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్


    12. శ్లో :    సంసార యూధ గజసంహతి సింహ దంష్ట్రా

        భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ

        ప్రాణ ప్రయాణ భవ భీతి నివారణేన

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    13. శ్లో :    సంసార యొగసకలేప్సిత నిత్యకర్మ

        సంప్రాప్య దు:ఖ సకలేంద్రియ మృత్యు నాశ

        సంకల్ప సింధు తనయాకుచకుంకుమాంక !

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    14. శ్లో :    భధ్వా కశైర్యమభటా భాహుభర్తుయన్తి

        కర్షంతి యత్ర పథిపాశశతై ద్యధామామ్

        ఏకాకినం పరవశం చాకితం దయాళో !

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    15 శ్లో :    అంధస్య మే హ్రుతవివేక మహాధనస్య

        చోరైర్మ హాబలిభి రింద్రియ నామధేయో :

        మొహంద కార కుహరే వినిపాతితస్య

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    16 శ్లో :    లక్ష్మీపతే! కమలనాభ! సురేశ! విష్ణో !

        యజ్ఞేశ ! యజ్ఞ ! మధుసూదన! విశ్వరూప!

        బ్రహ్మణ్య ! కేశవ! జనార్ధన! వాసుదేవ!

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    17 శ్లో :    ప్రహ్లాద నారద పరాశర పుండరీక

        వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస !

        భక్తానురక్త పరిపాలన పారిజాత

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    18 శ్లో :    ఏకన చక్రమపరేణ కరీణ శంఖం

        అన్వేన సింధు తర్యా మవలంబ్యతిష్ఠన్

        వామేతరేణ వరదా భయహస్తముద్రాం

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    19 శ్లో :    ఆద్యంత శూన్య మజ మన్యయ మప్రమేయం

        ఆదిత్య రుద్ర నిగమాది నుత ప్రభావం

        త్వా మబ్ధి జాస్య మధులోలుప మత్తబృంగం

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    20 శ్లో :    వారాహ రామ నరసింహ రమాదికాన్తా

        క్రిదావిలోల విధి సూలి సురప్రవంద్య

        హంసాత్మకా పరమహంస విహార లీల

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    21 శ్లో :    మాతా నృసింహశ్చ పితా నృసింహ:

        బ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ:

        విద్యా నృసింహొ ద్రవిణం నృసింహ:

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
       

    22 శ్లో :    ప్రహ్లాద మానస సరోజ విహార బృంగ !

        గంగా తరంగా ధవళాంగ రమాస్థితాంక !

        శృంగార సుందర కిరీట లసద్వ రాంగ !

        లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
   

    23 శ్లో :    శ్రీశంకరాచార్య రచితం సతతం మనుష్య:

        స్తోత్రం పటేదిహతు సర్వ గుణప్రసన్నమ్

        సద్యో విముక్త కలుషో మునివర్య గణ్యో

        లక్ష్మీ పతే: పద ముపైతి సనిర్మలాత్మా:
       

    24 శ్లో :    యన్మాయ యర్జిత వాపు: ప్రచుర ప్రవాహ

        మగ్నార్తమర్త్య నివహేషు కరావలంబం

        లక్ష్మినృసింహ చరనాబ్జ మధువ్రతేన

        స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ
       

    25 శ్లో :    శ్రీమనృసింహ విభవే గరుడధ్వజాయ

        తాపత్ర యొపశమనాయ భవోషధాయ

        త్రుష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ

        క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తు
--((*))--

మేఘం
 

కృష్ణ మేఘమా రావే, రావే,, 
దాశి  మేఘమా రావే, రావే !
శ్వేత మేఘమా రావే, రావే,,

పువ్వుల మేఘమా రావే, రావే !
 

నీళి  మేఘమా రావే, రావే, 
పింజ  మేఘమా రావే, రావే !
చమటను ఊడ్చి దిమ్మరిమ్పవే,

 కుండపోతగా కురువవే !
 

జల మేఘమా రావే, రావే,
 కొంచము జలము విడిచి పెట్టవే !
పిడుగుల శబ్దంతో ఒక మెరుపు 

మెరిసి గగనమును కప్పినావే !
 

తొలకరి వానలు కురిపించి,
 పంటలు పండటానికి సహకరిమ్చినావే !
మీఘమా దాహార్తులకు 

దాహము తీర్చి ధన్యు డ వేనావే !
నీకొరకు ఓ ప్రాణి విలపిస్తున్నాడని

 తపించి తపన తీర్చవే మేఘమా 
--((*))--

Sunday, 5 February 2017

*ప్రస్థానం ( భగవానుడు)

లలిత శృంగార సాహిత్యం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

నను నమ్మవే సతీ - నను చూడవే గతీ
- నను కావవే మతీ - నను తాకవే రతీ       
చిరునామ చెప్పఁవే - చిరునవ్వు చూపవే
-చిరుహాస పంచవే - మురిపాలు ఇవ్వవే

కలకాదులే వతీ - నిజమాయలే జతా
- మన మాయలే పతీ - మానతాపమే రతీ
మన సంఘమే గతీ - మన కామమే యతీ
కళ కాదులే  పతీ - ప్రకృ తీ కళ ఇదీ

వయసే కదా మడీ - మనసే కదా బడీ
వలపే కదా వడీ  - సొగసే కదా సడీ
తలపే కదా జడీ - పరువే కదా తడీ
చిగురు కదా చడీ - చమటే కదా పడీ

మనసుందిలే ప్రియా - మమతుందిలే ప్రియా                 
భయమెందుకే ప్రియా - దడుపెందుకే ప్రియా
చనువుందిలే ప్రియా -  మది పంచుతా ప్రియా
నవనవ్వులే ప్రియా -  పవళింపులే  ప్రియా

--((***))--


లయాలయ - స/జ/భ/ర/జ/జ/ర/స/య, రెండేసి పాదములకు ప్రాసయతి
IIUI UIU - IIUI UIU - IIUI UIU - IIUI UU

27 భూః 23778732


లలిత శృంగార సాహిత్యం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కలవాలి కోర్కతో - నడవాలి ఆశతో -
 తడవాలి తృప్తిగా - చిరుగాలి వేడితో 
పరువంలొ పండగే - తరుణంలొ దప్పికే
- ప్రణయంలొ సేవలే - వినయంలొ  సందడే 

విధిరాత వింతలే - వినయాన మోతలే
-  మదిలోన మాటలే - కదలల్లె అల్లెనే 
జతకూడి జాతరే - జపతాప తగ్గుటే
- సమయాన ఇష్టమే - సమజోడి చిందులే
 
 
ఓం శ్రీ రామ్ -శ్రీ మాత్రే నమ:

1. శరీరం కూలింది- విరి చూస్తోంది
2. జడివాన కురుస్తోంది- గుడి మెఱుస్తోంది
3. గుడిపైన పక్షులు- గంట ఊగింది
4. పాకింది పచ్చిక- పల్లె మెఱుస్తోంది
5. మెఱిసింది మెఱుపు- శరత్తు కమ్మింది
6. పూచాయి పువ్వులు- స్త్రీలు కలిశారు
7. పడుకుంది పాము- చీమలు పట్టాయి
8. కొమ్మపై కోయిల- ఱాయి చూస్తోంది
9. రాత్రిలో నడక- వెన్నెల కొట్టింది
10. నీటిలో నీడలు- చేప బెదిరింది
11. దీపాలు వెలిగాయి- నిశి నిలుచుంది
12. కొలనులో నెల నీడ- విరి కదిలింది
(నెల=జాబిల్లి)
 

ఓం కార వేంకటేశా

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


No automatic alt text available.* వేంకటేశా  * వేంకటేశా  * వేంకటేశా
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ 


కవితను వ్రాద్దామను
కున్నాను వేంకటేశా
నా ప్రేరణ నీవేకదా,
నీ రుచులు అభిరుచులు తెలుపవా

గాత్రం తో పాడుదామను
 కున్నాను వెంకటేశా
నీ నిద్ర భంగం చేయలేను,
అయిన ఏ రాగంలో పాడాలో తెలుపవా

ప్రేమ తపన నన్ను
ఆవరిస్తున్నది వేంకటేశా
కోరిక ఇదని చెప్పలేను,
అయిన అనుభవశాలివి నీవే తెలుపవా

దాహం తీర్చాలని
తపిస్తున్నాను వేంకటేశా
దాహం తీర్చలేను,
అయిన దాహం తీర్చే దారి తెలుపవా

దూరం భయం నన్ను
వెంబడిస్తుంది  వేంకటేశా
అది నీపై కోరికని చెప్పలేను,
అయిన దగ్గిర మార్గం తెలుపవా

నీ స్నేహం కోసం
అర్ధిస్తున్నాను వేంకటేశా    
సరస్వం నీకే అర్పిస్తున్నాను,
అయిన మనస్సుకు శాంతి తెలుపవా

ఆశలు నన్ను తరుము
తున్నాయి వేంకటేశా
కావ్యాన్ని వ్రాయలనుకున్నాను,
 అయిన ఎలా వ్రాయాలో తెలుపవా 

ద్యాస అంతా నీ దగ్గరే
 ఉంది వేంకటేశా
ధ్యానం చేస్తున్నాను,
అయిన నీపై ఏకాగ్ర దృష్టి ఎలాగో తెలుపవా

శ్రావ్యంగా గానం చేయాలను
కున్నాను వేంకటేశా
లక్ష్యాలను అధికమిస్తున్నాను,
 అయిన లక్ష్యానికి దారి చూపలేవా

దాన, ధర్మాలు
చేస్తున్నాను వేంకటేశా
అనురాగభంధలో ఉన్నాను,
అయిన భందాలకు విముక్తి తెలుపవా

చీకటిలో ఏమిచేయాలో
తెలియకున్నాను వెంకటేశా
వెలుగు చూడలేకున్నాను
 అయిన నా మస్తకమునందు వెలుగు నింపలేవా

బంధానికి అతీతుడనై
ఉండ లేకున్నాను వేంకటేశా
భక్తి  భావనలో ఉన్నాను,
అయిన భాగ్యం కలిగించే మనస్సు అందించవా

జగత్తు కోసం ఏమి చేయాలో
 తెలపాలి వేంకటేశా
అభినయించ గలను,
 అయిన నటనా సూత్రధారివి కదా ఎలాగో తెలుపవా

భంగిమలా బ్రతకాలను
కున్నాను వెంకటేశా
నాట్యం చేయాలనుకున్నాను,
 అయిన వశీకరణం  ఎలాగో తెలుపవా

ఉచ్వాస వద్దన్నా
వెంబడిస్తున్నది వేంకటేశా
నిశ్వాస ఎలా చేయగలను,
అయిన ప్రకృతిలో ఎలా బ్రతకాలో తెలుపవా

తనువంతా నీకే
అర్పిస్తున్నాను వేంకటేశా
ప్రాణాలను నీదగ్గరే ఉంచుతున్నాను,
 అయిన నీలో ఇక్యమార్గం తెలుపవా 

ఓం శ్రీ రామ వేంకటేశా
ఓం శ్రీ కృష్ణ వేంకటేశా
ఓం కార వేంకటేశా     
నమో నమ: నమోనమ: నమోనమ:
--((*))--

Saturday, 4 February 2017

*ప్రాయమ్ము (కవిత)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

యోగీశ్వరో మహాసేనః
కార్తికేయోగ్నినందనః౹

స్కందః కుమారః సేనానీః
స్వామీ శంకరసంభవః౹౹


గాంగేయస్తామ్రచూడశ్చ
బ్రహ్మచారీ శిఖిధ్వజః౹
తారకారి‌రుమాపుత్రః
క్రౌంచారిశ్చ షడాననః౹౹


శబ్దబ్రహ్మసముద్రశ్చ
సిద్ధఃసారస్వతో గుహః౹
సనత్కుమారో భగవాన్
భోగమోక్షఫలప్రదః౹౹


శరజన్మా గణాధీశ
పూర్వజో ముక్తిమార్గకృత్౹
సర్వాగమప్రణేతా చ
వాంఛితార్థప్రదర్శనః౹౹


అష్టావింశతి నామాని
మదీయానీతి యః పఠేత్౹
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో
మూకో వాచస్పతిర్భవేత్౹౹


మహామంత్రమయానీతి
మమ నామానుకీర్తనమ్౹
మహాప్రజ్ఞామవాప్నోతి
నాత్ర కార్యా విచారణా౹౹

 
Image may contain: 8 people, people smiling, people sitting and indoor


మేని సొగసులతో కొత్త ఆరాటంగా

వంకర టింకర కొత్త ఆలోచనలతో పిచ్చి
ప్రాయపు టెక్కు బిగువు చూపుగా
వాయలు వాయనాలాతో విరాజిల్లే పిచ్చి 

యోవనంలో పువ్వుల్ని హాత్తు కుంటే
వృద్ధాప్యంలో అవే ముల్లుగా మారుతాయనే పిచ్చి 
మాటల్లోని యదార్ధాన్ని తాత్వికతను
గ్రహిస్తే మనస్సుకు ఎంతో ప్రశాంతత కలిగించని పిచ్చి  

కేళీవిలాసాల మౌళిలా బాటలో
పరువెత్తి శరీరాన్ని పాడుచేసు కొనే పిచ్చి
భవిషత్తు నిర్మాణంలో చేయూత ఇస్తూ
శక్తి సామర్ధ్యాలను దేశం కొరకు పంచే పిచ్చి

ప్రాయమ్ము వరమౌను ప్రాజ్ఞుడౌను
ప్రాయమ్ము అగ్ని, రెచ్చిపోక చల్లగా ఉంచే పిచ్చి
ప్రాయమ్ము సద్వినియోగం సుభంబౌను
ప్రాయమ్ము జీవనకృతుకు సేవగా పంచే పిచ్చి
  --((*))--

వేలుపు వేదన, వేడి వేడి ఆలోచన
కలుపు శోధన, కేళి కేళి ఆలోచన
తలుపు సాధన, కేర్ కేర్ ఆలోచన   
మలుపు మధన, మల్లి మల్లి ఆలోచన
 


చీకటి వెలుగు

నామదిలో నీ ప్రేమను దాచాను, నీకోసం  వేచి ఉన్నాను, వసంతాలు గడచినా మదిలో ఉన్నది.  మాత్రం మాయ మవుట లేదు, అది నీ మాయో లేదా నా ప్రేమో నాకు తెలియుట లేదు,
కాలాలు మారుతున్నాయి, కానీ రోజు వచ్చే గాలి నా యద తాకి నన్ను ఇబ్బంది పెడుతున్నది.
నేను చూడలేని నా కళ్ళల్లో ఎదో మెరుపు మెరుస్తున్నట్లు ఉన్నది. ఎవరో నాకళ్ళను ఆకర్షించుతున్నట్లు ఉన్నది. నా కలలు నెరవేర్చుకునే సమయ మొచ్చి నట్లున్నది.        

వయసు పెరగ కుండా, సమయం మించ కుండా, పెదాలను అందించాలని, మోనం వీడి, మనసు విప్పి, నీ హృదయ తపన తగ్గించాలని, నీ మనస్సుకు ప్రశాంతత కల్పించాలని, పరిమళాల శ్వాసను అందిందించాలని, నవ్వుల సుస్వర రాగాలను అందించాలని,  కని పించని గాలితో, వినలేని కదిలే ఆకులతో, ఆపలేని కదిలే నీరుతో, నిత్యము సంచరించే ఉదయభానునితో మొరపెట్టుకున్నా, నా ఆకలి తీర్చమని.    

చీకటిలో నక్షత్ర వెలుగు, చల్లని పిల్లగాలి, హృదయ తాపము తగ్గించలేక పోతున్నాయి, వంటి మీద వస్త్రం బరువుగా మారుతున్నది, ఆకు సవ్వడికే ఉలిక్కి పడుతున్నాను, ఆలోచనల నుండి తేరుకునే దెప్పుడో, ఆశలు నెరవేరే దెప్పుడో, ఆకలి తీరేదెప్పుడో , ఈ మంచుని కరిగించే వేడిగా రావా, మల్లెతీగలా కరములతో భందించవా, ఈ పువ్వు పరిమాళాలను పొంది అననందం అనుభవించావా, నన్ను కమ్మిన మాయను తొలగించావా, ఈ కళ్ళ కన్నీరు తొలగించి ఆనంద భాపాలుగా మార్చావా, ఆకు పై ఉన్న నీటి బిందువును నేను, ఆవిరి కాకముందే అందుకొనేదెవరో

రచయత మల్లాప్రగడ  రామకృష్ణ
 

Friday, 3 February 2017

*శాంతి (ఛందస్సు )

 

పంజలి ప్రభ

సమయమూ వ్యర్ధమూ - చేయుటే ఎందుకూ
విజయమే స్వర్గమూ   - దైవమే దీవెనా
జయమునే కోరుటే  -  భావమే అర్ధమే
భయమునే వీడుటే - ప్రేమనే పొందుటే    

ధవళ - 
tlacina pani


ఆధారము - హేమచంద్రుడు (ఊర్వశి), జయకీర్తి (కౌముది), దుఃఖభంజనకవి (పరివృఢము) నడక - ఖండగతి 

పరివృఢము (ఊర్వశి, కౌముది) - న/త/త/త/గ IIIU UIU – UIU UIU 
13 అతిజగతి 2344 

రమణుఁడే దూరమై - రాక యిందుండఁగా 
తిమిరమం దుంటి నే - దీధితుల్ వద్దుగా 
భ్రమలలో మున్గి నే - బాధతోఁ దేలితిన్ 
సుమము లింకెందుకే - శోకమే నాదిగా 

అమల పుష్పమ్ములన్ - హారముల్ గ్రుచ్చనా 
కమల నేత్రమ్ములన్ - గావ్యముల్ వ్రాయనా 
విమల నీకివ్వనా - ప్రేమ పీయూషమున్ 
మమత నిండారఁగా - మాటలే రావుగా 

పరివృఢా నీకు నా - వందన మ్మిత్తురా 
వరద నీ రాకతో - పావన మ్మౌదురా 
చరణ రాజీవముల్ - చాలు నా మన్కికిన్ 
సరళ రాగమ్ముతో - స్వామి నేఁ బాడెదన్ 

చిబుకమం దుండెనే - చిన్న యా మచ్చలో 
సొబగులే సోనలై - సుందరీ పారెనో 
కుబుసమం దాడు యా - కోడె నాగమ్ములోఁ 
బ్రబలెఁగా నంద మా - పాము కాటేయునో 


పథ్యా (ప్రథితా, వసుధా, మంజరీ) - 

ఇది కూడ పంచ మాత్రల వృత్తమే. ఇందులో చివరి రెండు గణములు స్రగ్విణిలోవలె ర-గణములు. మొదటి రెండు పంచ మాత్రలు - సల, భలములు. ఇది వృత్తరత్నాకరములో, జయకీర్తి చందోనుశాసనములో పేర్కొనబడినది. క్రింద నా ఉదాహరణములు - 

పథ్యా (ప్రథితా, వసుధా, మంజరీ) - స/జ/స/య/లగ IIUI UIII – UIU UIU 
14 శక్వరి 4844 

రమణీయమైన శుభ - రాత్రిలోఁ బ్రేయసీ 
కమనీయమైన కల - కంఠమున్ బాడుమా 
విమలమ్ము గీతికలు - ప్రేమ గంగా నదుల్ 
సమమిందు దీనికగు - సామ నాదమ్ములే 

కన నిప్పు డీవసుధఁ - గాంచఁగాఁ గాంచన 
మ్మన నౌను పత్రముల - యందమౌ రంగులన్ 
మనమిందుఁ గోరె నిను - మాలతీ మంజరుల్ 
విను మిందుఁ బద్యమున - విచ్చె నా వాక్కులై 

తను విప్డు సన్నగిలెఁ - దప్తమై పథ్యమున్ 
దిన నౌనె కమ్మఁగను - తీవ్ర రూక్షమ్ములో 
ననిశమ్ము దల్తు నిను - నాశతోఁ బ్రేమతోఁ 
గనిపించ దెందులకు - కాంతితోఁ బథ్యముల్ 
(మొదటి పథ్యము జ్వరములో ఇవ్వబడు ఆహారము, రెండవ పథ్యమునకు అర్థము మార్గము) 

వెలిగించు దీపమును - వేగ మీ చీఁకటిన్ 
గలిగించు స్వర్ణమయ - కాంతి చాపమ్ములన్ 
దొలగించు బాధలను - తూర్ణమై నాదు మై 
పులకించు నీ వసుధఁ - బూర్ణ మోదమ్ముతో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

om sri ram- sri matrenama:

*శాంతి లేక (ఛందస్సు )

శాంతి లేదు నిన్ను చూడగా 
బ్రాంతి చెందె నీవు ఉండినా
కాంతి రాదు మానసమ్మునా
వెల్తి నాలో వేద నమ్ముగా

నవ్వు లేక నల్గి పోతినే 
పువ్వు చూసి ముర్సి పోతినే 
ఇవ్వు అన్న ఇవ్వ పోతివే  
కొవ్వు అన్న నోరు విప్పలా

ప్రేమ నీదె సృష్టికిన్ సదా
వాణి నీవే  విధ్యకిన్  సదా
జ్యోతి  నీవే భూతలమ్ము పై
స్వాతి నీవే మబ్బు లమ్మపై

సిద్ది పొంద లేక ఉంటినే
బుద్ధి చిన్న బోయి ఉంటినే   
చద్ది తిన్న భీతి గొంటినే
ఇచ్చి పుచ్చు కుంటే మంచిదే 

వట్టి మాట ఇప్పు డేందుకే
గట్టి మూట పట్టి తీస్తివా
తట్టి లేప నిద్ర రాదులే
మట్టి నమ్మే బ్రత్కు నాదిలో

జ్యోతి నీవె భూతలమ్ముపై
భాతి నిచ్చు భాస్కరా రవీ
హేతువీవె సృష్టికిన్ సదా
చేతనమ్ము జీవితమ్ములో
--((*))--



నేటి కవిత  - ప్రాంజలి ప్రభ  
రచయిత : మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ   
ఓ మనిషీ!  తెలుసుకో   
ఓ మనిషీ!! తెలుసుకొని మసలుకో 

చేష్ట వెనుక చేవ ఎంతో?
ప్రేమ వెనుక ఆశ ఎంతో?
మాట వెనుక భక్తి ఎంతో ?
మంచి వెనుక చెడ్డ ఎంతో ?

సారం వెనుక సాధన ఎంతో?
వేషం వెనుక వేతన ఎంతో ?
మౌనం వెనుక మోసము ఎంతో ?
గానం వెనుక గాత్రము ఎంతో ?

ప్రశంస వెనుక ప్రతిభ ఎంతో?
ప్రలోభ వెనుక ప్రభొధ ఎంతో 
ప్రవేశ వెనుక ప్రభవ మెంతో 
ప్రమాద మెనుక  ప్రజలు ఎంతో   

అందం వెనుక పొందిక ఎంతో?
దాహం వెనుక ఆకలి ఎంతో ?
లాభం  వెనుక నష్టము ఎంతో ? 
స్నేహం వెనుక దానము ఎంతో ? 

పంట వెనుక పరిశ్రమ ఎంతో?
మంట వెనుక ఒకక్రియ ఎంతో 
వంట వెనుక  నిజభృతి  ఎంతో 
గంట వెనుక గనస్రుతి ఎంతో 

కథనం వెనుక మథనం ఎంతో?
మురిపం వెనుక వినయం ఎంతో ?
పరువం వెనుక  నరకం ఎంతో ?
ప్రణయం వెనుక ప్రళయం  ఎంతో ? 

విజయం వెనుక వినియోగం ఎంతో?
ఫలితం వెనుక పనియోగం ఎంతో ?
చరితం వెనుక కధయోగం ఎంతో ?
వినయం వెనుక విధియోగం ఎంతో ?

ప్రగతి వెనుక ప్రయాసం ఎంతో?
ప్రతిన వెనుక  ప్రమాదం ఎంతో 
ప్రజల వెనుక ప్రమోదం ఎంతో 
ప్రతిభ వెనుక ప్రయోగం ఎంతో 

నిజం వెనుక నిజాయితీ ఎంతో?
గళం  వెనుక సరాగమే  ఎంతో ?
దళం వెనుక దయాగుణం ఎంతో ?
భయం వెనుక మనోజవం  ఎంతో ? 

జీవితం వెనుక జీవితార్థం ఎంతో?
కీలకం వెనుక కామితార్ధం ఎంతో 
లోలకం వెనుక లోభితార్ధం ఎంతో 
భొజనం వెనుక ఆశపాశం  ఎంతో 

ఓ మనిషీ!  తెలుసుకో   
ఓ మనిషీ!! తెలుసుకొని మసలుకో 


**** *** *****

*మంటల భావాలు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: 

*మంటల భావాలు 

ఎప్పుడూ ఏదో మండుతూనే వుంటుంది
మంటలు అంటుకుంటూనే వుంటాయి
కోరల నాల్కలు  నమిలి మింగేసి
బూడిద వూసేస్తూ!

వెచ్చదనానికి కరిగిపోయి
చలిమంటేనని ముట్టుకుంటే
చురుక్కుమంటుంది…
మంటనంటించి మంట మాయమవుతుంది!
మంటే మిగులుతుంది

కూరుకున్న బుర్ర బాంబై బద్దలవుతుంది
లేస్తున్న విమానం నిప్పుముద్దవుతుంది
మధ్యవేసిన పచ్చగడ్డి భగ్గుమంటుంది
ఆకలేసిన దూడ అరుస్తుంది

భస్మాసుర హస్తం
అదిమిపట్టిన ఒత్తిడికి
అక్కడో అగ్నిపర్వతం లావా కక్కుతుంది
ఇక్కడో గ్యాసు బావి బ్లో-ఔట్ అవుతుంది
అంటుకున్న అరణ్యాలు అంత తొరగా ఆరవు
ఆర్పడానికి కొంపల్లో నీళ్ళూ వుండవు

ఎక్కడో చమురు కాలుతున్న వాసన…
వంటిల్లే వల్లకాడు!
శవాలకు స్పర్శ తెలీదు
అయినా ఎర్రగా అంతటా ఏడుపు-
అయినా గొంతుకలు మర్యాదగానే నడుచుకుంటాయి
అయినా లేక అందుకే
ఇంకో అగ్గిపుల్ల ముద్దు పెట్టుకోకమానదు.

--((*))--

Thursday, 2 February 2017

*కవిత ఎండు ఆకు (కవిత)

 ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రే నమ:



*కవిత ఎండు ఆకు (కవితా)

పండు టాకులుగ మరి
ఎండు కాయలు డొల్లగా మారి
పండు తాకులు రాలినట్లుగా 
మండు టెండలకు తట్టుకోక విలవిలలాడే 

పూలు పూయుట లేదు
సెలవు పెట్టింది వసంత ఋతువు కాదు
వలకపోసే మనసు లేదు
నులక మంచముమీద నిద్ర రావటము లేదే

తెర వెనుక కధలు
తెరచాప లేని నావలా ఊగిస లాటలు
తరుము తున్న తరంగాలు   
తరుణమంతా ధారపోసిన గుర్తింపు లేదులే

గాలి సెగలకు తట్టుకోలేక
గాలి పటంలా ఎగిరి తెగిన పటములా మారక
అలల అల్లరి చూడలేక
కలల కల్లోలం ఎవ్వరికి చెప్పుకోలేక తికమకే   

వ్యర్ధమైన వాడని పూలలా
స్వార్ధ బుద్ధి లేని దివిటీలా
అర్ధపు మాటలు అర్ధమయ్యేలా
తీర్ధము త్రాగినా దేవుని పిలుపు రాదులే

వృద్దాప్యం ఎండుటాకు సమానము
- అయిన కర్తవ్యం మరువదు వృద్ధాప్యము  

ఒక నెరజాణ యైన వేశ్య ఒక విటుని గురించి తన కూతురి కిని, మనుమరాలికి చెప్తూ అతనితో జాగ్రత్త యని హెచ్చరిస్తూ చూపిన పద్యం.
నగపగతు పగతు పగతుని
పగతుండగు మగధ రాజు బరిమార్చిన యా
జగజ్జెట్టి యన్న తండ్రికి 
దగువాహనమైన యట్టి ధన్యుండితడే


వివరణ:--నగపగతుడు=ఇంద్రుడు (ఇంద్రుడు పర్వతములను ఖండించాడుకదా!)
అతని విరోధి=నరకాసురుడు, వాని విరోధి= కృష్ణుడు, అతని విరోధి =జరాసంధుడు,
అతనిని చంపినవాడు= భీముడు, అతని యన్న=ధర్మరాజు, ధర్మరాజుతండ్రి=యముడు అతని వాహనము =దున్నపోతు. అంటే అతను సరసము తెలియని దున్నపోతు అని అన్యాపదేశంగా హెచ్చరిస్తున్నది.

"తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్ “||
ఇదొక సమస్య

శైశవచాపల్యము! (శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి సౌజన్యముతో)
“లలితాకారు కుమారు షణ్ముఖుని తా లాలించి ౘన్నిచ్చుచో
గళలగ్న గ్రహరత్న దీప్తకళికా గాంభీర్య హేమాంచితో
జ్జ్వల రత్న ప్రతిబింబితాననములన్ శంభుండు వీక్షింపగా
తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్ “||
“పార్వతీదేవి పసిపిల్లవాడైన ఆరుముఖాలున్న కుమారస్వామివారిని లాలిస్తూ,
శైశవమౌగ్ధ్యంతో వెలిగిపోతున్న ముద్దుమోములని ముద్దాడుతూ, నిమురుతూ,
శిశుస్కందులవారికి, ఒక్కొక్క బులిబుల్లినోటికి తన మహనీయస్తన్యాన్ని
మహాభావుకతా పారవశ్యంతో త్రావిస్తోంది. శిశుగుహులవారు స్తన్యం సేవిస్తున్నారు. ఆ
మహాదేవి, తన కంఠసీమలో నవరత్నాల పతకంవున్న అందమైన హారం ధరించింది.
ప్రక్కనేవున్న శంకరదేవులు ఈ ముచ్చటని ప్రీతితో గమనిస్తున్నారు. పాలు త్రాగుతున్న
శిశుషణ్ముఖుని ఆరుముఖాలలోని పసిబుగ్గలు, నవరత్నాల వివిధ వర్ణకాంతి
కిరణ వైభవంతో వెలుగులీనుతూ, కదులుతున్నాయి. ఆ కాంతికిరణాల మహాభాగ్యం
ఏమిటంటే, అవి, బుల్లి అయ్యవారి బుజ్జిబుగ్గలని అమితమైన గారాబంతో తెగ
నిమురుతూ, వదలకుండా ముగ్ధమోహనంగా అలవిమీరి ముద్దులాడేస్తున్నాయి.
ముద్దూ-ముచ్చటా తెలిసినవారు ఎవరుమాత్రం అంతటి అద్భుత అవకాశాన్ని
జారవిడుచుకుంటారు? ఆ సన్నివేశానికి సంబరపడుతూనే నవరసాభినయ ఉద్గమ
ఆస్పదుడైన చిదంబరేశ్వరుడగు మహాశివుడు, ఈ అందాలనుంచి చూపు మరల్చి,
అటు నవరస సంకేతాలైన నవరత్నాలనిపరిశీలిస్తే, తొమ్మిది రత్నాలలోను, ఒక్కొక్క
రత్నంలో ఆరేసి కార్తికేయుడి ముఖాలు వివిధరసస్ఫూర్తితో విరాజిల్లుతున్నాయి.
మొత్తంగా చూస్తే, 6×9=54 ముఖాలు లెక్కకొచ్చేయి.
శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి
“చాటుపద్య రత్నాకరము“లో ఈ సమస్య ప్రస్తావించబడింది. మనకి సుపరిచితులైన, శ్రీ
మోచర్ల వెంకన్నగారు ఈ సమస్యని పూర్తిచేసేరు. నెల్లూరుసీమకిచెందిన వెంకటగిరి
రాజావారైన, శ్రీ వెలుగోటి యాచేంద్ర గారి ఆస్థానంలో, ఆయన సమక్షంలో
పూరించబడినట్లుగా ఐతిహ్యంద్వారా తెలుస్తోంది.
డా:R.V.కుమార్, రసజ్ఙభారతి సౌజన్యంతో--
-----

Wednesday, 1 February 2017

kavitalu


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: 

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


* వేంకటేశా  * వేంకటేశా  * వేంకటేశా
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ 


కవితను వ్రాద్దామను
కున్నాను వేంకటేశా
నా ప్రేరణ నీవేకదా,
నీ రుచులు అభిరుచులు తెలుపవా

గాత్రం తో పాడుదామను
 కున్నాను వెంకటేశా
నీ నిద్ర భంగం చేయలేను,
అయిన ఏ రాగంలో పాడాలో తెలుపవా

ప్రేమ తపన నన్ను
ఆవరిస్తున్నది వేంకటేశా
కోరిక ఇదని చెప్పలేను,
అయిన అనుభవశాలివి నీవే తెలుపవా

దాహం తీర్చాలని
తపిస్తున్నాను వేంకటేశా
దాహం తీర్చలేను,
అయిన దాహం తీర్చే దారి తెలుపవా

దూరం భయం నన్ను
వెంబడిస్తుంది  వేంకటేశా
అది నీపై కోరికని చెప్పలేను,
అయిన దగ్గిర మార్గం తెలుపవా

నీ స్నేహం కోసం
అర్ధిస్తున్నాను వేంకటేశా    
సరస్వం నీకే అర్పిస్తున్నాను,
అయిన మనస్సుకు శాంతి తెలుపవా

ఆశలు నన్ను తరుము
తున్నాయి వేంకటేశా
కావ్యాన్ని వ్రాయలనుకున్నాను,
 అయిన ఎలా వ్రాయాలో తెలుపవా 

ద్యాస అంతా నీ దగ్గరే
 ఉంది వేంకటేశా
ధ్యానం చేస్తున్నాను,
అయిన నీపై ఏకాగ్ర దృష్టి ఎలాగో తెలుపవా

శ్రావ్యంగా గానం చేయాలను
కున్నాను వేంకటేశా
లక్ష్యాలను అధికమిస్తున్నాను,
 అయిన లక్ష్యానికి దారి చూపలేవా

దాన, ధర్మాలు
చేస్తున్నాను వేంకటేశా
అనురాగభంధలో ఉన్నాను,
అయిన భందాలకు విముక్తి తెలుపవా

చీకటిలో ఏమిచేయాలో
తెలియకున్నాను వెంకటేశా
వెలుగు చూడలేకున్నాను
 అయిన నా మస్తకమునందు వెలుగు నింపలేవా

బంధానికి అతీతుడనై
ఉండ లేకున్నాను వేంకటేశా
భక్తి  భావనలో ఉన్నాను,
అయిన భాగ్యం కలిగించే మనస్సు అందించవా

జగత్తు కోసం ఏమి చేయాలో
 తెలపాలి వేంకటేశా
అభినయించ గలను,
 అయిన నటనా సూత్రధారివి కదా ఎలాగో తెలుపవా

భంగిమలా బ్రతకాలను
కున్నాను వెంకటేశా
నాట్యం చేయాలనుకున్నాను,
 అయిన వశీకరణం  ఎలాగో తెలుపవా

ఉచ్వాస వద్దన్నా
వెంబడిస్తున్నది వేంకటేశా
నిశ్వాస ఎలా చేయగలను,
అయిన ప్రకృతిలో ఎలా బ్రతకాలో తెలుపవా

తనువంతా నీకే
అర్పిస్తున్నాను వేంకటేశా
ప్రాణాలను నీదగ్గరే ఉంచుతున్నాను,
 అయిన నీలో ఇక్యమార్గం తెలుపవా 

ఓం శ్రీ రామ వేంకటేశా
ఓం శ్రీ కృష్ణ వేంకటేశా
ఓం కార వేంకటేశా     
నమో నమ: నమోనమ: నమోనమ:
--((*))--


*ప్రస్థానం ( భగవానుడు)

పట్టు పీతాంబరముల.. చుట్టుకొనువాడు..
పసిడి కట్ల పిల్లoగ్రోవి ధరియించువాడు ..
కాటుక తో అందగించు కనులవాడు
శిఖిని పింఛమమరిన. చిన్నవాడు.

వెలుగు విరజిమ్ము మోమువాడు
నీలి జలదంపు మేని వన్నె వాడు
సాధు జనులను రక్షించు వాడు
ప్రేమతో పిలిస్తే ప్రత్యక్షమయ్యె వాడు

ఆకాశం లో శాంతి నెలకొను వాడు
భూమండలం లో శాంతి నెలకొనువాడు
సముద్రజలం లో శాంతి నెలకొనువాడు
సమస్త ప్రాణులలో శాంతి నెలకొనువాడు

పాడ మంజీరా రవళుల పడుచువాడు
కరుణ సారించు దృక్కుల కన్నయ్యవాడు
వేణు నాదమ్ము జగము లూగించువాడు
సకల జీవుల ఉల్ల మలరించువాడు.

భక్తి, రక్తిని బోధించ అవతారమొందినాడు
భక్త కోటిని బ్రోచిన భాగవతుడు.. వాడు.
ఇహమునకు .పరమునకు ఈప్సితమునకు
ముక్తి.. మార్గమ్ము జూపెడి.గీతాచార్యుడతడు.

ప్రకృతి పరిధిని, మించి రక్షించు వాడు
పరిమితులను దాటి ధర్మాని కాపాడేవాడు
ఏదో దేహంలో మనుష్యు ల్లో దేవుడై ఉంటాడు
లీలలను ప్రదర్శిస్తూ ఆగమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు
--((*))__



వెనుకనున్నవిలువ
మనిషీ! ఓ మనిషీ!!
చేష్ట వెనుక
చేవ ఎంతో?

అందం వెనుక
పొందిక ఎంతో?
కథనం వెనుక
మథనం ఎంతో?
విజయం వెనుక
వినియోగం ఎంతో?
సారం వెనుక
సాధన ఎంతో?
ప్రశంస వెనుక
ప్రతిభ ఎంతో?
పంట వెనుక
పరిశ్రమ ఎంతో?
ప్రగతి వెనుక
ప్రయాసం ఎంతో?
నిజం వెనుక
నిజాయితీ ఎంతో?
మనిషీ! ఓ మనిషీ!!
జీవితం వెనుక
జీవితార్థం ఎంతో?
**** *** *****