Tuesday, 17 August 2021

 

  

 


🌻. శ్లోకం 171.

దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా
కౌలినీకేవలా నర్ఘ్య కైవల్యపదదాయినీ

920. దక్షిణా : దాక్షిణ్యము కలిగినది
921. దక్షిణారాధ్యా :దక్షిణాచారముచే పొజింపబదుచున్నది
922. దరస్మేరముఖాంబుజా :చిరునవ్వుతొ కూదిన ముఖపద్మము కలిగినది
923. కౌళినీ : కౌళమార్గమున ఉపాసించబదుచున్నది
924. కేవలా :సమస్తమునకు తాను ఒక్కటియే మూలమైనది
925. అనర్ఘ్య కైవల్యపదదాయినీ :  అత్యుత్తమమైన మోక్షము ప్రసాదించును

తేట గీతి
మోక్షమును ఇచ్చు దాక్షిణ్యము కలిగినది
దక్షిణాచార్యు నిచె పూజ చేయు చున్న
హాస్య ముఖపద్మ కలిగిన కౌళినీ యె
తాను ఒక్కటి మూలమైన మోక్ష మిచ్చు......1.7.1.  

--(())--

🌻. శ్లోకం 172.
స్తోత్రప్రియా స్తుతిమతే శ్రుతిసంస్తుతవైభవా
మనస్వినీ మానవతీ మహేశే మంగాళాకృతి:

926. స్తోత్రప్రియా : స్తోత్రములు అనిన ఇస్టము కలిగినది
927. స్తుతిమతే : స్తుతించుట అనిన ఇస్టము కలిగినది
928. శ్రుతిసంస్తుతవైభవా : వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది
929. మనస్వినీ : మనస్సు కలిగినది
930. మానవతీ : అభిమానము కలిగినది
931. మహేశే : మహేశ్వర శక్తి

తేట గీతి
వేదములచేత వైభవము కలిగినది  
అభి మహేశ్వర శక్తిని కలిగి యుండె   
స్తోత్రములు అని నను  ఇస్ట ము కలిగినది
ఇష్ట ముకలిగి అభిమాన మ0త చూపు

--(())--

🌻. శ్లోకం 173.
విశ్వమాతా జద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ
ప్రగల్భా పరమోదారా మరామోదా మనోమయీ

933. విశ్వమాతా : విశ్వమునకు తల్లి
934. జద్ధాత్రీ : జగత్తును రక్షించునది
935. విశాలాక్షీ : విశాలమైన కన్నులు కలది
936. విరాగిణీ : దేనిథోనూ అనుభందము లేనిది
937. ప్రగల్భా : సర్వసమర్ధురాలు
938. పరమోదారా : మిక్కిలి ఉదారస్వభావము కలిగినది
939. మరామోదా : పరమానందము కలిగినది
940. మనోమయీ : మనశ్శే రూపముగా కలిగినది

తేటగీత
విశ్వమునకు తల్లి జగతి రక్ష చేయు
కన్నులు విశాల ముగనుండి లోక దృష్టి
చేయుచూ దేని తోను భంధములు లేని
సర్వ మానందము సమర్ధతను తెలుపు..173

🌻. శ్లోకం 174.
 వ్యోమకెశే విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ
పంచయఙ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ

941. వ్యోమకెశే : అంతరిక్షమే కేశముగా కలది
942. విమానస్థా : విమానము (సహస్రారము) నందు ఉండునది
943. వజ్రిణీ : వజ్రము ఆయుధముగా కలిగినది
944. వామకేశ్వరీ  : వామకేశ్వరుని శక్తి
945. పంచయఙ్ఞప్రియా : నిత్యము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది
946. పంచప్రేతమంచాధిశాయినీ :  పంచప్రేతములచే ఏరడిన మంచముపై కూర్చుని ఉండునది.

తేటగీత
అంత రిక్షమే కేశముగా గలిగి మనసు
రూపముగలిగి వజ్రము ఆయుధము గ
వామ కేశ్వరుని శక్తిగ అంత రిక్ష
వాహనమనందు సంచారి ప్రీతి గొలుపు .....174

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
 


🌻. శ్లోకం 175.

పంచమే పంచభూతేశే పంచసంఖ్యోపచారిణి
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ

947. పంచమే : పంచకృత్యపరాయణి
948. పంచభూతేశే : పంచభూతములను ఆఙ్ఞాపించునది
949. పంచసంఖ్యోపచారిణి :  శ్రీవిద్యోపాసకులచే 5 విధములుగా ఆరధింపబడునది
950. శాశ్వతీ : శాశ్వతముగా ఉండునది
951. శాశ్వతైశ్వర్యా : శాశ్వతమైన ఐశ్వర్యము కలది
952. శర్మదా : ఓర్పు ను ఇచ్చునది
953. శంభుమోహినీ : ఈశ్వరుని మోహింపజేయునది

శాశ్వితమ్ము గాను ఐశ్వర్యము కలదు
ఓర్పు ఇచ్చు నదియు పంచభూత
ములను ఆజ్ఞ చేయు పంచకృత్యపరాయ
ణిగను ఈశ్వర శక్తి నీ వె నమ్మ  
   --(())--

🌻. శ్లోకం 176.
 
ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా

954. ధరా : ధరించునది
955. ధరసుతా : సమస్త జీవులను తన సంతానముగా కలిగినది
956. ధన్యా : పవిత్రమైనది
957. ధర్మిణీ : ధర్మస్వరూపిణి
958. ధర్మవర్ధినీ : ధమమును వర్ధిల్ల చేయునది
959. లోకాతీతా : లోకమునకు అతీతమైనది
960. గుణాతీతా : గుణములకు అతీతమైనది
961. సర్వాతీతా : అన్నిటికీ అతీతురాలు
962. శమాత్మికా : క్షమాగుణము కలిగినది

తేటగీత
ధర్మ వర్ధినీ ధర్మిణీ కలిగి ఉన్న
గుణముల అతీత మైనట్టి మహిమ ఉన్న
అన్నికళల అతీతు రాలు గున్న
లోక జీవులు సంతాన ముగను కలిగె

--(())--
     

శ్రీ లలితా సహస్ర నామములు - 92 / Sri Lalita Sahasranamavali - Meaning - 92 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻.. తేటగీత/ఆటవెలది పద్యాలు  
🌹

🌻. శ్లోకం 177.
బంధూకకుసుమప్రఖ్యా బాలాలీలావినోదినీ
సుమంగళి సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ

964. బంధూకకుసుమప్రఖ్యా :  మంకెనపూలవంటి కాంతి కలిగినది
965. బాలా : 12 సంవత్సరముల లోపు బాలిక,,,,బాల
966. లీలావినోదినీ : బ్రహ్మాండములను సృస్టించు అను లీల యందు వినోదమును కలిగినది
967. సుమంగళి :  మంగళకరమైన రూపము కలిగినది
968. సుఖకరీ : సుఖమును కలిగించునది
969. సువేషాఢ్యా : మంచి వేషము కలిగినది
970. సువాసినీ : సుమంగళి

ఆటవెలది :
మంచి వేషము కలిగించు రూపధారి
సుఖము ఇచ్చు మనసు నీది నమ్మ
లోక సృష్టి గాన  హాస్యపు చూపున్న
బాలి కగను కాంతి నిచ్చు తల్లి           

🌻. శ్లోకం 178.

సువాసిన్యర్చనప్రీతా శోభనా శుద్ధమానసా
బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా

971. సువాసిన్యర్చనప్రీతా : సువాసినులు చేయు అర్చన యెందు ప్రీతి కలిగినది
972. శోభనా  : శోభ కలిగినది
973. శుద్ధమానసా : మంచి మనస్సు కలిగినది
974. బిందుతర్పణ సంతుష్టా : అమృత బిందు తర్పణము చే సంతృప్తి పొందినది
975. పూర్వజా : అనాదిగా ఉన్నది
976. త్రిపురాంబికా :  త్రిపురములందు ఉండు అమ్మ

ఆటవెలది
అమృత బిందు తర్పణముచేను స0తృప్తి
తృప్తి పొంది త్రిపుర ము0దు ఉండు అమ్మ    
శోభ కలిగి మంచి మనసు  సుమంగళి
అర్చ నందు ప్రీతి కలిగు తల్లి
 
సశేషం...
 

*

 నమస్కారం.

ఒకసారి ఓ వ్యక్తి ఒక పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పండితునకు తెలుసు.., తనను ఆశ్రయించిన వ్యక్తికి శివుడు అంటే పడదని.. శివకేశవ అభేదమును గూర్చిన అద్వైతము అతనికి తెలియదని..

ఆయన అలాగే నంటూ ఒక కాగితం మీద ఒక శ్లోకం వ్రాసి ఇచ్చినాడు.. ఆ వ్యక్తి చదివి నివ్వెర పోయినాడు. ఆ శ్లోకము ఈ క్రింది విధముగా వుంది..

గవీశపాత్రో నగజార్తిహారీ

కుమారతాతః శశిఖండమౌళిః।

లంకేశ సంపూజిత పాదపద్మః

పాయాదనాదిః పరమేశ్వరో నః॥

చదవగానే ఆశ్చర్యపోయాడు... ఆ శ్లోకము యొక్క అర్థము యథాతథముగా చదివితే ఏమి అర్థము వస్తుందో చూడండి..

గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం.. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పర్వత పుత్రిక.., అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాద పద్మములు కలవాడూ..
అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆది మధ్యాన్త రహితుడు అయినవాడూ, అటువంటి పరమేశ్వరః నః పాయాత్ ....
వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింపబడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం..

మీకు విష్ణువును గూర్చి వ్రాసేది రాకుంటే ఆ మాటే నాకు చెప్పవచ్చును కదా అని అతడు ఆ పండితుని పై కోపగించుకొన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "నీకు సంస్కృతము సమగ్రముగా తెలియక పొరబడినావు. "అది విష్ణువును కీర్తించే శ్లోకమే..!" అని చెప్పి అతనికి ఆ శ్లోకార్థమును ఈ విధముగా వివరించినాడు.

 " నేను చివరలో వాడిన అనాది అన్న మాటకు అర్థమును నీవు తీసుకోవలసిన విధముగా తీసుకోనలేదు.

 న+ఆది.., అంటే మొదటి అక్షరము తీసి చదువుకొమ్మన్నాను అని అర్థము ఈ క్రింది విధముగా వివరించినాడు."

గవీశపాత్రః ... లో గ తీసివేస్తే వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధము. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు,

గరుడుని చేత గౌరవింప బడువాడు, ... అంటే గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసివేస్తే గజార్తి హారీ ... గజేంద్రుని ఆర్తిని దూరము చేసినవాడు విష్ణువు..

కుమార తాతః .... 'కు' తీసివేస్తే మార తాతః అంటే మన్మధుని తండ్రి అయిన విష్ణువు. (మదనో మన్మదో మారః... అమరము)

శశిఖండ మౌళి: ... 'శ' తీసివేస్తే శిఖండమౌళిః. నెమలి పింఛము ధరించినవాడు.. కృష్ణుడు., అనగా విష్ణువు.

లంకేశ సంపూజిత పాద పద్మ: .. మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: .

క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు . అంటే బ్రహ్మ రుద్రాదులు పూజించు పాదపద్మములు కలవాడు.. విష్ణువు.

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు.. .

ఇక 'ప' తీసివేస్తే రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా..! విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

అడిగినతడు సిగ్గుతో తలవంచుకొన్నాడు..

గణిత, ఖగోళ, జ్యోతిష, జీవ, జంతు, భౌతిక, రసాయనాది ఏ శాస్త్రమున కైనా మహనీయులు వ్రాసిన రామాయణ, భారత, భాగవత, రఘువంశాది గ్రంధములకైనా సుసంపన్నమైన భాష సంస్కృతము.

 ఇప్పటికయినా మేలుకొని పిల్లలకు సంస్కృతము, ఆ భాషకు అనుంగు బిడ్డ అయిన తెలుగు నేర్పించండి....

ఆపై ఏ భాష నేర్చుకోదలచినా అవలీలగా వస్తుంది... 


 అత్యంత విలువైన సమాచారం ..

కస్తూరీ మృగం అంటే ఒక రకమైన జింక, సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది, అది మంచి మదపువాసనగా ఉంటుంది, అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా ..? అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది, ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నది అని అది గ్రహించలేదు, ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది, ప్రాణాలు కోల్పోతుంది ...

మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు, పుణ్యక్షేత్రాలనీ, తీర్ధయాత్రలనీ, అనవసరంగా తిరిగి కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు ..

పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ శ్రీకృష్ణుణ్ణి కూడా తమతో తోడుగా రమ్మని పిలుస్తారు ..

ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి, నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి అని చెబుతాడు, వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు, అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి, వారికి వడ్డింపచేస్తాడు శ్రీకృష్ణుడు, ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది ..

ఇది చేదు దోసకాయ ..  కటికవిషంలాగా ఉంది ..
ఇలాంటి వంటకం చేయించావేమిటి ..? అని/పాండవులు అడుగుతారు, శ్రీకృష్ణుడు నవ్వి, ఎన్ని గంగలలో మునిగినా, ఈ దోసకాయ చేదు పోలేదు,  ఎన్ని తీర్ధయాత్రలు చేసినా, మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని శ్రీకృష్ణుడు, ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు, ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం ..

మనిషి ప్రయాణం బయటకు కాదు, లోపలకు జరగాలి, యాత్ర అనేది బయట కాదు, అంతరికంగా యాత్రను మనిషి చెయ్యాలి, ఈ ప్రపంచమంతా మనిషి తిరిగినా, తనలో మార్పు రాని పక్షంలో, ఏమీ సాధించలేడు, అదే తనలోనికి, తాను ప్రయాణం చేస్తే, ఉన్న గదిలో నుంచి కదలకుండా కూడా జ్ఞానాన్ని పొందవచ్చు, మహర్షులు, మునులు ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేసి జ్ఞానసిద్ధిని పొందారు, కేవలం గ్రంథాలను,  ఇంట్లో పెట్టుకోవడం వలన లాభం శూన్యం, చదవి తర్వాత, ఆచరణలో తీసుకుని వస్తే శుభం కలుగుతుంది ..


 అహం - భావం

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు.... ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేకపోయేవారు.
ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.
ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ! ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego] నింపాయి.
ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి... ఆయన ఇలా అనుకొన్నాడు : ' నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తాను.
కాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను, మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కివుంచుతాను...
అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక  వెళ్ళిపోతుంది.
నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు ... ' అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు.

మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది..., శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు.
దేవత వెతుకుతూ వస్తోంది, ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి...
ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు , శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది,  ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేక పోయింది.
ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వేల్లిపోవలనుకొని  వెనుతిరిగింది.
శిల్పి ఆనందనాకి అవధులు లేవు, తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు...
 ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! అంది.

'' అంతే ! మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది, తన కెరీర్ లో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరుకూడా వంక పెట్టలేదు, అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు.
వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో  '' ఏది ? ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది, ఏ తప్పూ లేదు ! '' అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ , " నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని, కానీ నిన్ను గుర్తించడానికి  చెప్పానంతే, నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు !  ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది, అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది."

మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది.
అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు , ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది.
నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము.
స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం.
'' అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం '. అంటే ' అర్థం'. అర్థమైతే అనర్థం జరగదు...

          🔥శుభమస్తు🔥
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
[08:40, 17/08/2021] Mallapragada Sridevi: 🌹🌺🌿🌿💐🌴🪴🍀✍️

భారతీయ సంస్కృతికి ఆకరములు అనదగిన మహాభారత, రామాయణాది కావ్యాలలో రామాయణం ఒక విశిష్ట గ్రంథం. హిందువులకు భగవద్గీత మాదిరి ఇది కూడా ఒక ప్రమాణ గ్రంథం. చతుర్విధ పురుషార్థాలను బోధిస్తుంది కనుక దీనిని ఇతిహాసం అనీ, వాల్మీకి చేత వ్రాయబడింది కనుక ఆదికావ్యమనీ అంటారు. ఈ గ్రంథం శ్రీరాముని చరిత్రను చెబుతున్నది కనుక రామాయణం అనీ, సీత చరిత్రను వర్ణిస్తుంది కనుక సీతాయాశ్చరితమని, రావణుని వధ గురించి చెబుతున్నది కనుక పౌలస్త్యవధ అనీ పిలువబడుతున్నది. ఈ కావ్యంలో అనేక దేవ, మానవ, వానర, రాక్షస పాత్రలు ఉన్నాయి. వాటిలోని స్త్రీ పాత్రలకు సంబంధించిన వివరాలు:

అంజన - కుంజరుని కుమారై వానర స్త్రీ. కేసరి భార్య. ఆంజనేయుని తల్లి.

అనసూయ - అత్రి మహర్షి భార్య. సీతకు పతివ్రతాధర్మాలను బోధించింది.

అరుంధతి- వశిష్ట మహర్షి భార్య.

అహల్య - గౌతముని భార్య. పతివ్రత. రాముని పాదము సోకగానే శాప విముక్త అయ్యింది.

ఊర్మిళ - లక్ష్మణుని భార్య, జనక మహారాజు జ్యేష్ట పుత్రిక. భర్త లక్ష్మణుడు అన్న రాముని వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఈమె తపస్సాధనలో ఉన్నది.

కైకసి- రావణుడు, కుంభకర్ణు, విభీషణుల తల్లి.

కైకేయి - దశరథుని మూడవ భార్య. భరతుని తల్లి.

కౌసల్య - దశరథుని మొదటి భార్య. రాముని తల్లి.

ఛాయాగ్రాహిణి - హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.

జంఝాట

*తాటకి *- మారీచ, సుబాహువుల తల్లి. రాక్షసి.

తార - వాలి భార్య. అంగదుని తల్లి.

*త్రిజట *- రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించినప్పుడు ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఒకతె.

ధాన్యమాలిని - రావణుని రెండవ భార్య. అతికాయుని తల్లి.

అనల- విభీషణుని కుమార్తె.

మండోదరి - రావణుడి భార్య. ఇంద్రజిత్తు, తల్లి.

మంథర - కైకేయి చెలికత్తె. కైకేయికి దుర్బోద చేసి రాముడు అరణ్యవాసం చేయడానికి కారకురాలు అయ్యింది.

మాండవి - కుశధ్వజుని కుమార్తె. భరతుని భార్య.

రేణుకాదేవి - జమదగ్ని భార్య. పరశురాముని తల్లి.

లంకిణి - లంకను కాపలాగా ఉన్న ఒక రాక్షసి .

వేదవతి - సీత పూర్వజన్మపు పతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.

*శబరి *- రాముని భక్తురాలు. సిద్ధయోగిని. మతంగమహర్షి శిష్యురాలు. రాముని రాకకై ఎదురు చూసిన వృద్ధురాలు.

శాంత - దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.

శూర్పణఖ - రావణుని చెల్లెలు. రాముని వనవాస కాలంలో అతనిపై మోజుపడింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు, పెదాలు కోసివేశాడు.

*శ్రుతకీర్తి *- కుశద్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య.

సరమ- విభీషణుని భార్య.

సింహిక- హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.

సునయన - జనక మహారాజు భార్య.

*సుమిత్ర *- దశరథుని భార్య. లక్ష్మణ,శత్రుఘ్నుల తల్లి.

సురస - నాగమాత. హనుమంతునిచే ఓటమి పాలయ్యింది.

సులోచన - ఇంద్రజిత్తు భార్య

*సీత *- జనకుడు యాగం చేసి భూమిని దున్నుతుండగా నాగేటి చాలులో లభించింది. రాముని భార్య.
🌹🌺🏵️🌿💐🌴🪴🍀✍️
[08:43, 17/08/2021] Mallapragada Sridevi: అగరుబత్తి (పరిమళం)

     కొత్తగా పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చి, కొన్ని రోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లేటపుడు తన తండ్రి కూతురుకు ఒక అగరుబత్తి డబ్బాను కానుకగా ఇచ్చాడు..
 
  అది చూసిన తల్లి ముఖం చీదరించుకుని.., మీ నాన్న ఎప్పుడూ ఇంతే, మహా పిసినారి.. అంటూ లోపలికి వెళ్లి మంచి బ్లౌస్ పీసులు రెండు మరియు దానిపైన డబ్బులతో ఉన్న ఒక కవరును పెట్టి కూతురుకు ఇచ్చి అత్తారింటికి పంపించింది.. తను కూడా ఏమి అనకుండా అత్తారింటికి వెళ్లిపోయింది.

     మరుసటిరోజు అత్తారింట్లో ఉదయమే దేవుని ఇంట్లోకి వెళ్లి దీపం పెట్టి తండ్రి ఇచ్చిన అగరుబత్తిని వెలిగించింది..
డబ్బాలో నుండి అగరుబత్తిని తీసేటప్పుడు అందులో నుంచి ఒక కాగితపు చీటి బయటపడింది..
అది తీసి చూస్తే తండ్రి చేతిరాతతో రాసిన ఒక సందేశం కనిపించింది. అది చదివి తను ఒక్కసారిగా బిక్కి బిక్కి ఏడవడం మొదలుపెట్టింది.. తను ఏడవటం చూసి ఒక్కసారిగా అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.. ఏమైందీ.. ఏమైందీ అంటూ అడగసాగారు.. తను తన చేతిలో ఉన్న చీటిని అత్త చేతిలో పెట్టింది..

    ఆ చీటిలోని 'సందేశం' ఇలా ఉంది..

      అమ్మా.. నీవు పెళ్ళయిన  తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చి.. తిరిగి వెళుతున్నప్పుడు,  నీ తండ్రిగా నీకు ఏమి కానుక ఇవ్వాలని చాలా ఆలోచించాను..

     దేవుని దయవలన నీ మనస్సుకు తగిన భర్త , అంతఃకరణం చూపించే అత్తమామలు నీకు లభించారు..
ఇప్పుడు నేను నీకు ఒక సుగంధభరితమైన అగరుబత్తి డబ్బాను నీకు కానుకగా ఇస్తున్నాను... ఇదేమిటి అని ఆశ్చర్యం కలిగింది కదూ.. మీ నాన్న బాగా కంజూస్ అనుకుంటున్నావ్ కదా..
కాదు.. కాదు..

     మీ అమ్మ, పెళ్ళి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు అందరినీ ఎలా కలుపుకుని పోయి ఏ విధంగా వ్యవహరించిందో.. నువ్వు కూడా అదే రీతిగా అందరినీ కలుపుకుపోవాలి..

    ఏ విధంగా ఐతే అగరుబత్తి కాలుతూ, తాను బూడిద ఐనా పరవాలేదు తన సుగంధాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుందో. . అదే విధంగా నువ్వు కూడా అందరి మన్ననలు పొందుతూ , నీ ఇంట్లో మాత్రమే కాదు, చుట్టు పక్కల ఇండ్లలో కూడా మంచి పేరు తీసుకురావాలి.. ఈ నా చిన్న కానుక ఎల్లప్పుడు నీకు గుర్తుండాలి.. నీ జీవితం సాఫీగా సాగాలి...ఇది మీ నాన్న కోరిక..

     ఇది చదివి అత్త కళ్ళు చెమ్మగిల్లాయి.. కోడలిని కౌగలించుకుని, ఇటువంటి సంస్కారవంతమైన ఇంటి నుండి మాకు కోడలు రావడం , ఇటువంటి మంచి సంబంధికులను పొందడం.. నిజంగా మేము ధన్యులం... 🙏

                  _శ్రీనివాసరావు ఊట్కూరు
   
         🙏సర్వేజనాః సుఖినోభవంతుః🙏
[08:52, 17/08/2021] Mallapragada Sridevi: క్రీ.శ. 1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి. ఆ చట్టంప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు స్వాధీనపరుచుకోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో రాఘవేంద్రస్వామి దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా దారాళమైన ఆంగ్లంలో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి బృందావనం సాదారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంట.తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృధువుగా పలికినా శాసించే స్వరం, దారాళమైన ఆంగ్లం మాట్లాడారు" అని వ్రాసుకున్నారంట.

గండి లోయలో వాయుదేవుడు ధ్యానంలో ఉండగా, సీతమ్మవారిని వెతుకుతూ శ్రీరాముడు అటుగా వచ్చాడు. వాయుదేవుడు తన ఆతిధ్యం స్వీకరించమని కోరగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడు రామయ్య. లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు తిరుగు ప్రయాణంలో అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా లోయపైన ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు. ఆ తోరణం ఇప్పటికీ పవిత్రాత్మ కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తోరణం కనిపించినవారికి మరుజన్మ ఉండదని ప్రశస్తి.

థామస్ మన్రో మద్రాసు గవర్నర్‌గా తన పదవీకాలం ముగుస్తుండగా చివరిసారి అన్ని ప్రాంతాలనూ దర్శించటానికి బయలుదేరినప్పుడు గండి క్షేత్రంలో లోయగుండా గుర్రాలపై సాగుతున్నాడు. హఠాత్తుగా తల ఎత్తి చూస్తే ఎత్తులో బంగారుతోరణం కనిపించింది. "ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?" అని తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. వారిలో ఒక ముసలి సేవకుడు మాత్రం అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని చెప్పాడు. కానీ దానిని చూసినవారు కొద్దిరోజుల్లోనే మరణిస్తారని చెప్పాడు. మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆరునెలలలోపే కలరాతో మరణించారు.

చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు. ఒక ఆంగ్లేయునికి మనదేశంలో ఇన్నివిధాలుగా దేవుని తార్కాణాలు లభించినా ఈ సంఘటనలకు మనం సరైన ప్రచారం కల్పించటంలో విఫలమయ్యామేమో అనిపిస్తుంది

సేకరణ:-

Friday, 13 August 2021

14--08--2021

 శ్రీమద్భగవద్గీత 





*🌴. ద్వితీయ అధ్యాయము -  సాంఖ్య యోగము - 30 🌴*


30. దేహీ నిత్య మవధ్యోయం దేహేసర్వస్య భారత |

తస్మాత్ సర్వాణి భూతాణి న త్వం శోచితుమర్హసి ||


🌷. తాత్పర్యం :

*ఓ భరతవంశీయుడా!  దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖించుట తగదు.*


🌷. భాష్యము :

అవధ్యమైన ఆత్మను గూర్చిన ఉపదేశము శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ముగించుచున్నాడు. అమరమైన ఆత్మను గూర్చి అనేక విధములుగా వివరించుచు అది నిత్యమైనదియు, దేహము శాశ్వతము కానిదనియు భగవానుడు నిర్దారించెను. కావున పితామహుడైన భీష్ముడు మరియు గురువైన ద్రోణుడు యుద్ధమున మరణింతురనెడి భీతితో క్షత్రియుడైన అర్జునుడు యుద్దమును త్యజింపరాదు. శ్రీకృష్ణుని ప్రామణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతియెక్కరు విశ్వసింపవలెను. 


ఆత్మ యనునది లేదనియు లేదా రసాయనముల కలయికతో ఒకానొక స్థితిలో జీవము పుట్టుననియు భావించరాదు. ఆత్మ నిత్యమైనను హింస ఎన్నడును ప్రోత్సహనీయము కాదు. కాని యుద్ధసమయమున దాని నిజమైన అవసరము కలిగినపడు మాత్రము దానిని తజించరాదు. అట్టి అవసరము భగవానుని ఆదేశము పైననే సమర్థింపవలెను గాని తోచినరీతిగా కాదు. 

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 77 🌹*

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 

📚. Prasad Bharadwaj 


*🌴 Chapter 2 - Sankhya Yoga - 30 🌴*


30. dehī nityam avadhyo ’yaṁ

dehe sarvasya bhārata

tasmāt sarvāṇi bhūtāni

na tvaṁ śocitum arhasi


🌻 Translation :

*O descendant of Bharata, he who dwells in the body can never be slain. Therefore you need not grieve for any living being.*


🌻 Purport :

The Lord now concludes the chapter of instruction on the immutable spirit soul. In describing the immortal soul in various ways, Lord Kṛṣṇa establishes that the soul is immortal and the body is temporary. 


Therefore Arjuna as a kṣatriya should not abandon his duty out of fear that his grandfather and teacher – Bhīṣma and Droṇa – will die in the battle. On the authority of Śrī Kṛṣṇa, one has to believe that there is a soul different from the material body, not that there is no such thing as soul, or that living symptoms develop at a certain stage of material maturity resulting from the interaction of chemicals. 


Though the soul is immortal, violence is not encouraged, but at the time of war it is not discouraged when there is actual need for it. That need must be justified in terms of the sanction of the Lord, and not capriciously.

🌹🌹🌹🌹🌹

[14/08, 4:48 am] On Sriram**: *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 474 / Vishnu  Sahasranama Contemplation - 474 🌹*

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻 474. ధనేశ్వరః, धनेश्वरः, Dhaneśvaraḥ 🌻*


*ఓం ధనేశ్వరాయ నమః | ॐ धनेश्वराय नमः | OM Dhaneśvarāya namaḥ*


ధనానామీశ్వరో విష్ణుర్ధనేశ్వర ఇతీర్యతే 


ధనములకు అధిపతిగావున ఆ విష్ణుదేవుని ధనేశ్వరః అని కీర్తించెదరు.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 474🌹*

📚. Prasad Bharadwaj


*🌻 474. Dhaneśvaraḥ 🌻*


*OM Dhaneśvarāya namaḥ*


Dhanānāmīśvaro viṣṇurdhaneśvara itīryate / धनानामीश्वरो विष्णुर्धनेश्वर इतीर्यते 


Since Viṣṇu is the Lord of wealth, He is called Dhaneśvaraḥ.


🌻 🌻 🌻 🌻 🌻 

Source Sloka

स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥


స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥


Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

[14/08, 4:48 am] On Sriram**: *🌹 DAILY WISDOM - 152 🌹*

*🍀 📖  The Philosophy of Life 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 31. The Absolute is Beyond Thought 🌻*


Appearances have reality in them, but reality is different from appearances. Appearances do not exist in the Absolute even as its adjectives, for it can have no adjectives other than itself. Qualities have a meaning only in the sense world. 


There is no quality without relations, and all relations are empirical. A relational Absolute must be perishable, for, here, its very essence is said to include distinction, and all distinction presupposes individuality. The two terms of a relation are really separated by an unbridgeable gulf, and no stretch of imagination can intelligibly bring out their connection. 


If the two terms are identical, there is no relation, for there will then be no two things to be related. But if the two terms are different from each other, they can bear no relation. The Absolute has no qualities or relations, for it is beyond thought. The proof of its existence is itself.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

[14/08, 4:48 am] On Sriram**: *🌹. దేవాపి మహర్షి బోధనలు - 126 🌹* 

✍️. సద్గురు కె. పార్వతి కుమార్

 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 


*🌻 103. బహుముఖత్వము 🌻*


మరియొక సాధన చెప్పుచున్నాను. మీరొక చేయితో పనిచేయు చున్నప్పుడు రెండవ చేతితో మరియొక పని చేయుగలరా? సామాన్య ముగ చేయలేరు. రెండు చేతులతో రెండు భిన్నమైన పనులను చేయుట ప్రయత్నింపుడు. అట్లే ఒకే సమయమున రెండు భిన్నమైన ఉత్తరములు, చెప్పుటకు ప్రయత్నింపుడు. ఇద్దరు వ్యక్తులతో ఒకేసారి (Alterna-tingగా) మాట్లాడుటకు ప్రయత్నింపుడు. అట్లే వాహనము నడుపుచు మాట్లాడుటకు ప్రయత్నింపుడు. మీరు వాదన చేయుచున్నప్పుడు, ఎదుటి వ్యక్తి అసహనమునకు గురి అగుచున్నచో చటుక్కున వాదన మార్గమును మార్చుడు. 


పై విధముగ చేయుటలో మీచేతనను ఒకే సమయమున రెండు విధములుగ ప్రవహింపచేయు అలవాటేర్పడును. అట్లు చేయుటలో చేతన ప్రవాహము సన్నగిల్లరాదు. ఒకే చైతన్యము రెండు రకములుగ ప్రవహించుటచే సృష్టి ఏర్పడుచున్నది. మీ నుండి కూడ సృష్టి జరుగుట కిదియొక ప్రక్రియ. ఉదాహరణకు, మా ప్రియశిష్యుడు జ్వాలా కూలుడు ఒకే సమయమున రెండు కాదు, మూడు పనులు చేయుట నేర్చెను. అతడు హిమాలయములలో నివసించుచు అదే సమయమున జర్మనీలోను, అమెరికాలోను కూడ పనిచేసి చూపించెను. 


ఏకోన్ముఖ కార్యము కలియుగ నైజము. బహుముఖ కార్యములు దివ్యస్థితి. ఇది మేమందరము శ్రీకృష్ణుని వద్ద నేర్చినాము. అతడు యోగేశ్వరుడు. ఒకే సమయమున పదిచోట్ల పది పనులు గావించెడి వాడు. అతడు ఒకే సమయమున తన ఎనిమిద మంది భార్యలతో ఎనిమిది అంతఃపురములలో కలిసియుండుట చూపించి నారద మహర్షినే అబ్బుర పరచినాడు. సాధన నుండి యిట్టి సిద్ధులు పొంద వచ్చును. తీరిక సమయములలో దీనికి సంబంధించిన కసరత్తులు చేయుట తప్పుకాదు. ఇట్టి సాధనల వలన చైతన్యము బహు ముఖములుగ వికసించగలదు. పశువులు కూడ ఏకోన్ముఖత కలిగి యున్నవి.  మానవులంతకన్న చాల శక్తివంతులు. ఇది తెలియుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[14/08, 4:48 am] On Sriram**: *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 58 🌹*

✍️.  సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ


*🍀.  ఉదయానికి చీకటి రాత్రి గర్భం. వ్యక్తి చీకటి మార్గం గుండా సాగాలి. లేకుంటే వుదయం వుండదు.  చీకట్లో వెళుతున్నపుడు నీకు గురువు అవసరం. నీ సొంత కాంతిని దర్శించాకా గురువు అవసరముండదు.  🍀*


మనిషి తనలో చిన్ని జ్వాలతో జన్మించాడు. అది దైవస్పర్శ. కాని ఆ జ్వాల అనంతమైన చీకటి పొరల కింద వుంది. కాబట్టి వ్యక్తి తనలోకి వెళ్ళినపుడు అంధకార అరణ్యాల గుండా సాగాలి. అది చాలా మందిని భయపెడుతుంది. చాలా మంది లోపలికి వెళ్ళి ఆ చీకటి చూసి భయపడి వెనక్కి వచ్చేస్తారు. ఆ చీకటి మరణంలా భయపెడుతుంది. 


మార్మికులు 'ఆత్మకు సంబంధించిన చీకటి రాత్రి' అని సరైన పేరిచ్చారు. కానీ వ్యక్తి చీకటి మార్గం గుండా సాగాలి. లేకుంటే వుదయం వుండదు. ఉదయానికి చీకటి రాత్రి గర్భం. చీకట్లో వెళుతున్నపుడు నీకు గురువు అవసరం. నీ సొంత కాంతిని దర్శించాకా గురువు అవసరముండదు. నువ్వు గురువు పట్ల కృతజ్ఞత ప్రకటించు. యింటి కొచ్చావు. ప్రయాణం పూర్తయ్యింది. 


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

 [14/08, 5:37 am] . Mallapragada: విను వారుండగ చెప్పుటే గుణము యవ్వా రమ్ము  సమానమ్ముగన్ 

శునకమ్ముల్ గన బువ్వులయ్యెను గదా చోద్యమ్మె ముమ్మాటికిన్

ఘనుడా కాలము మారెనే మనసులో ఘీకారమ్మెయేటికిన్

చూపులే ఉండుట వల్లనే కధలు లేచెప్పే విదానమ్మున్


కాదు అనియు అవును గళము విప్పేవాడు

శిద్ధు లెన్ని నున్న ఫలము లేదు

అదుపు తప్పె పలుకు ఆదర్శ మగుటేల

చదువు కొన్న వాడు చవట యగును

[14/08, 6:16 am] . Mallapragada: నిలుచు యున్నగాని నడుచు చున్నగాని నియమ నిష్ఠ గాను

మూల కూర్చుండి న మంత్ర జపము చేయు మహిమ గానవచ్చు

పలుకు చునే యున్న పక్కమీద నున్న రతియు జరుపు చున్న

పలుకు ఆంజనేయ ఫలము పొందవచ్చు   అనుట నిత్య నిజము

[14/08, 7:02 am] . Mallapragada: జారడు బండ జారే ధ్యాస

బారెడు పొద్దు లేచే ధ్యాస

కోరిన వన్ని పొందే ధ్యాస

వేరుగఉండి బత్కే ద్యాస...లేదు లేదు


అమ్మ చేతి మురుకులు ధ్యాస

అమ్మ మాట చదువులు ధ్యాస

అమ్మ బాట పరుగుల ధ్యాస

అమ్మ చూపు కళలతొ ధ్యాస


బువ్వ లాట ఇంటి యందే ధ్యాస

గవ్వ లాట ఆడు చుండేే ధ్యాస

కుప్పిగంతు లాట ఉండే ధ్యాస

కళ్ళ గంత కట్టి ఆడే ధ్యాస


గచ్చ కాయ మచ్చు ఆడే ధ్యాస 

చింత పిక్క లెక్క ఆడే ధ్యాస

పాము పఠమునే ఆడే ధ్యాస

బంతి పూలు పట్టి ఆడే ధ్యాస


కొబ్బరి చిప్ప కొరుకుడు ధ్యాస

కొండముచ్చుని కెలుకుడు ధ్యాస

కోతి వెంట పంట ఉరుకుడు ధ్యాస

కుక్క లాగా ఉండి  మోరుగుడు ధ్యాస


దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె


బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు


మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు


ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు


ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే


రేపటి సంగతి దేవుడి ధ్యాస

నేటి బాలలకు తప్పని ధ్యాస

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని ధ్యాస

[14/08, 7:16 am] Prathyusha: హరిఓం  ,  

మనం నిత్యమూ ఆనందం, సుఖ సంతోషాలు కలుగాలని కోరుకుంటాము...

కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాము...

మనలోనే ఉండిన వీటికోసం ఎక్కడెక్కడికో తిరుగుతున్నాము...

రోగము వలన కలిగే బాధలు ఎక్కడ నుండి వచ్చాయి? కాశీ నుండా? రామేశ్వరం నుండా?! 

అవి మన నుండియే వచ్చాయి కదా!!!

బాధలు మన నుండియే వచ్చినపుడు సుఖ సంతోషాలు కూడా మన నుండియే రావాలి కానీ ఎక్కడో బయట నుండి ఎలా వస్తాయి!??  


కాలికి ముల్లు గుచ్చుకుంటె బాధ అంటున్నాం. 

అదే రోడ్ మీద ఐదు వందల నోటు దొరికితే సంతోషిస్తున్నాము...

 అంటే సుఖ దుఃఖాలు దొరికే వస్తువు బట్టి మనలో నుండియే వస్తున్నాయి కదా! 

అంటే బాధలు, సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయి. 

మరి మనలో ఉండిన వాటికోసం బయట ఎందుకు వెతకడం?! 


ఇది కేవలము భ్రమ, నిజమునకు మనలో లేనిదేది బయట లేదు. 

పాలలో అంతరముగా ఉన్న వెన్న రావాలంటే కవ్వం పెట్టి చిలకాలి. 

అలానే మనస్సును భగవన్నామము అనే కవ్వం పెట్టి చిలికితే అపుడు అనందమనే వెన్న రావడం జరుగుతుంది. 


లోపల సాధన చేయనిదే బయట తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటే ఏమొస్తుంది?!.


"మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనోమూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది."

దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని

లోపల ఆత్మయే దైవం.  


భగవంతుడ్ని చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు.


 దీనిని బట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనకి కానరావడం

లేదు. 

ఎందుకనీ?

మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన.!

మనలో ఉన్న దేవుడు కనబడకపోవడానికి ప్రధాన

కారణాలు రెండే రెండు తలంపులు!


మొదటిది ' నేను' అనే తలంపు.

రెండవది ' నాది' అన్న తలంపు. 


మొదటిది అహంకారం, రెండవది మమకారం! 

ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.


 మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని

పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి..

ఎలా?


ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి

చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమును నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి.

(కర్తృత్వ భావనను తొలగించుకోవాలి).


మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరుఅడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.


సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదవగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.


మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియా

లను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే, మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.


మనలో అనేక బలహీనతలుంటాయి. అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.



 హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా దానిని

గురించి ఆలోచించం. 


ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వక ముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. 


మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ఒకటి ప్రేమ, రెండుజ్ఞానం. ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది ..................                           -                                                       -     🙏.....  వి . లక్ష్మి శేఖర్  ......   14.08.20021.

[14/08, 7:19 am] Prathyusha: *హిందూ ఋషులు జాబితా*


అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు


*అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ -* *అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ -* *త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ* *- శ - ష - స - హ - ళ - క్ష*


*దేవర్షి*    దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.


*బ్రహ్మర్షి*  ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.


*మహర్షి*  సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.


*రాజర్షి*   రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.


*అ*

అగ్ని మహర్షి

అగస్త్య మహర్షి

అంగీరస మహర్షి

అంగిరో మహర్షి

అత్రి మహర్షి

అర్వరీవత మహర్షి

అభినామన మహర్షి

అగ్నివేశ మహర్షి

అరుణి మహర్షి

అష్టావక్ర మహర్షి

అష్టిక మహర్షి

అథర్వణ మహర్షి

ఆత్రేయ మహర్షి

అథర్వాకృతి‎

అమహీయుడు

అజామిళ్హుడు‎

అప్రతిరథుడు‎

అయాస్యుడు‎

అవస్యుడు

అంబరీషుడు


*ఇ*

ఇరింబిఠి‎


*ఉ*

ఉపమన్యు మహర్షి

ఉత్తమ మహర్షి

ఉన్మోచన

ఉపరిబభ్రవుడు

ఉద్దాలకుడు‎

ఉశనసుడు

ఉత్కీలుడు


*ఊ*

ఊర్ఝ మహర్షి

ఊర్ద్వబాహు మహర్షి


*ఋ*

ఋచీక మహర్షి

ఋషభ మహర్షి

ఋష్యశృంగ మహర్షి

ఋషి


*ఔ*

ఔపమన్యవ మహర్షి

ఔరవ మహర్షి


*క*

కపిల మహర్షి

కశ్యప మహర్షి

క్రతు మహర్షి

కౌకుండి మహర్షి

కురుండి మహర్షి

కావ్య మహర్షి

కాంభోజ మహర్షి

కంబ స్వాయంభువ మహర్షి

కాండ్వ మహర్షి

కణ్వ మహర్షి

కాణ్వ మహర్షి

కిందమ మహర్షి

కుత్స మహర్షి

కౌరుపథి‎

కౌశికుడు‎

కురువు

కాణుడు‎

కలి

కాంకాయనుడు

కపింజలుడు‎

కుసీదుడు


*గ*

గౌతమ మహర్షి

గర్గ మహర్షి

గృత్సమద మహర్షి

గృత్సదుడు‎

గోపథుడు‎

గోతముడు

గౌరీవీతి

గోపవనుడు

గయుడు


*చ*

చ్యవన మహర్షి

చైత్ర మహర్షి

చాతనుడు‎


*జ*

జమదగ్ని మహర్షి

జైమిని మహర్షి

జ్యోతిర్ధామ మహర్షి

జాహ్న మహర్షి

జగద్బీజ

జాటికాయనుడు‎


*త*

తండి మహర్షి

తిత్తిరి మహర్షి

త్రితుడు

తృణపాణి


*ద*

దధీచి మహర్షి

దుర్వాస మహర్షి

దేవల మహర్షి

దత్తోలి మహర్షి

దాలయ మహర్షి

దీర్ఘతమ మహర్షి

ద్రవిణోదస్సు‎


*న*

నచికేత మహర్షి

నారద మహర్షి

నిశ్ఛర మహర్షి

సుమేధా మహర్షి

నోధా

నృమేధుడు


*ప*

పరశురాముడు

పరాశర మహర్షి

పరిజన్య మహర్షి

పులస్త్య మహర్షి

ప్రాచేతస మహర్షి

పులహ మహర్షి

ప్రాణ మహర్షి

ప్రవహిత మహర్షి

పృథు మహర్షి

పివర మహర్షి

పిప్పలాద మహర్షి

ప్రత్య్సంగిరసుడు

పతివేదనుడు

ప్రమోచన‎

ప్రశోచనుడు‎

ప్రియమేథుడు

పార్వతుడు

పురుహన్మ‎

ప్రస్కణ్వుడు

ప్రాగాథుడు

ప్రాచీనబర్హి

ప్రయోగుడు

పూరుడు

పాయు


*బ*

భరద్వాజ మహర్షి

భృగు మహర్షి

భృంగి మహర్షి

బ్రహ్మర్షి మహర్షి

బభ్రుపింగళుడు

భార్గవవైదర్భి‎

భాగలి

భృగ్వంగిరాబ్రహ్మ

బ్రహ్మస్కందుడు‎

భగుడు‎

బ్రహ్మర్షి

బృహత్కీర్తి‎

బృహజ్జ్యోతి‎

భర్గుడు


*మ*

మరీచి మహర్షి

మార్కండేయ మహర్షి

మిత మహర్షి

మృకండు మహర్షి

మహాముని మహర్షి

మధు మహర్షి

మాండవ్య మహర్షి

మాయు

మృగారుడు‎

మాతృనామ‎

మయోభువు‎

మేధాతిథి

మధుచ్ఛందుడు

మనువు

మారీచుడు

మైత్రేయ


*య*

యాజ్ఞవల్క మహర్షి

యయాతి‎


*ర*

రురు మహర్షి

రాజర్షి మహర్షి

రేభుడు


*వ*

వశిష్ట మహర్షి

వాలఖిల్యులు

వాల్మీకి మహర్షి

విశ్వామిత్ర మహర్షి

వ్యాస మహర్షి

విభాండక ఋషి

వాదుల మహర్షి

వాణక మహర్షి

వేదశ్రీ మహర్షి

వేదబాహు మహర్షి

విరాజా మహర్షి

వైశేషిక మహర్షి

వైశంపాయన మహర్షి

వర్తంతు మహర్షి

వృషాకపి

విరూపుడు‎

వత్సుడు‎

వేనుడు

వామదేవుడు‎

వత్సప్రి

విందుడు


*శ*

శంఖ మహర్షి

శంకృతి మహర్షి

శతానంద మహర్షి

శుక మహర్షి

శుక్ర మహర్షి

శృంగి ఋషి

శశికర్ణుడు

శంభు‎

శౌనకుడు

శంయువు‎

శ్రుతకక్షుడు


*స*

సమ్మిత మహర్షి

సనత్కుమారులు

సప్తర్షులు

స్థంభ మహర్షి

సుధామ మహర్షి

సహిష్ణు మహర్షి

సాంఖ్య మహర్షి

సాందీపణి మహర్షి

సావిత్రీసూర్య

సుశబ్దుడు‎

సుతకక్షుడు‎

సుకక్షుడు‎

సౌభరి

సుకీర్తి‎

సవితామహర్షి సామావేదానికి మూలము.

సింధుద్వీపుడు

శునఃశేపుడు

సుదీతి


*హ*

హవిష్మంత మహర్షి

హిరణ్యరోమ మహర్షి.                          *శుభమస్తు*

..........................................

[14/08, 7:20 am] Prathyusha: *🌸"నేను" అదృశ్యమయ్యే కొద్దీ ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది !!*🌸


జ్ఞానం అంటే ఉన్నది తెలియడమే. ఉన్నది అంటే కనిపించేదాని వెనుక ఉన్నదేదో తెలియడం. నేను అంటే మనసే. మనసంటే ఆలోచనలే. ఇది అర్ధమైతే ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగ్గితే నేను తగ్గుతుంది. నేను అదృశ్యమయ్యే కొద్ది ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది. సుఖం కోసం, సౌఖ్యం కోసం మరో దానిపై ఆధారపడే కొద్దీ నేను పెరుగుతుంది. నేను పెరిగే కొద్దీ అజ్ఞానం పెరుగుతుంది. ఆధునికత పేరుతో మనిషి సాంకేతికపై ఆధారపడటమే ప్రస్తుత అజ్ఞానానికి కారణం. అంటే సాంకేతికత వద్దని కాదు. దాని అతివినియోగం, దుర్వినియోగం వద్దని భావం. ప్రాపంచిక విషయాలపై కాకుండా పరిపూర్ణ విశ్వాసంతో పరమాత్మను నమ్మితే, అహంకారంతో కూడిన నేను పోయి జ్ఞానం అంకురిస్తుంది. నేను అస్తమించడమే జ్ఞానం ఉదయించడం !


ఆత్మజ్ఞానం భగవంతుడు బహుమతి గా ఇచ్చేదే కానీ, మనం

అడిగి తీసుకునేది కాదు.


జ్ఞానం పొందాలంటే సుఖపడాలనే కాంక్ష పోవాలి. సుఖపడే రోజులు రావడం లేదు అనేది ఒక ఆపేక్ష. నీవు అనుకున్నా అనుకోక పోయినా జరిగేది జరిగి తీరుతుంది.


కలియుగంలో ఎవరిని ఎలా హింసించాలనే ఆలోచనలు ఉంటాయి. మనకు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం ఉండాలి.


అందరినీ ఆయనే చూసుకుంటు న్నాడు. ఎవరిని హింసించినా భగవంతుని హింసిస్తున్నాము అనే భావన రావాలి.


ఈ దేహం ఎందుకు వచ్చిందో ఆ పనులు పూర్తి అయ్యేవరకు అది ఈ భూమి మీద తిరుగాడుతూనే ఉంటుంది. దేనికీ ఆందోళన వద్దు.


Wednesday, 11 August 2021



కర్మ- భోగము💐💐

 మనకు పూర్వ జన్మ కర్మల వలననే ఈ జన్మలో, తల్లి, తండ్రి,అన్న, అక్క, భార్య, భర్త , ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు, శత్రువులు మిగతా సంభంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి. ఎందుకంటే మనం వీళ్లకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును.

 # మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు

 మనకు పూర్వ జన్మలో సంబంధం వున్న వాళ్ళే ఈజన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు, అవ్వే మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు...

 # ఋణానుబంధం:- గత జన్మలో మనం ఎవరి వడ్డయినా రుణం తీసుకుని వుండచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండచ్చు. అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపం లో వచ్చి మీ వద్ద వున్న పూర్తి ధనం 

ఖర్చు అయ్యే వరకూ వుండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యేవరకు మనతోనే వుంటారు.

 # శత్రువులు - పుత్రులు:- మన పూర్వ జన్మలో శత్రువులు మన పై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపం లో తిరిగి పుడతారు. అలా పుట్టితల్లి తండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, నానా గొడవలూ చేస్తారు. జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే వుంటారు. ఎల్లప్పుడును తల్లితండ్రులను నా నా యాతనా పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితునలు చేస్తూ ఆనందపడుతూంటారు.

 # తటస్థ పుత్రులు :- వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు...మరో వైపుసుఖంగా కూడా వుంచరు, వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు. వాళ్ళ వివాహానంతరం తల్లి తండ్రులకు దూరంగా జరిగి పోతారు.

 # సేవా తత్పరత వున్న పుత్రులు:- గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవచేసి వుండవచ్చును, ఆ రుణాన్ని తీర్చుకోవటానికి కొడుకు లేదా కుతూరు రూపంలో ఈ జన్మలో వస్తారు. అలా వచ్చి బాగా సేవను చేస్తారు. మీరు గతం లో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది. మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే, ఈ జన్మలో మన ముదుసలి తనం లో మనకు సేవ చేస్తారు. లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసే వారుకూడా మనవద్ద వుండరు.

ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది అని అనుకోవద్దు. ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్టవచ్చును. ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును. ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్యాకుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా కూతురు గా మీ ఇంట పుడతారు. లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీ తో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు.

అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు,చెడు చెయ్యవద్దు. ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం ఎక్కువ చేసి అనుభవంలో కి తెస్తుంది.  మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతా లో నూరు రూపాయలు గా జమ చెయ్య బడతాయి. ఒకవేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాత నుంచి నూరు రూపాయలు తీసివేయబడతాయి.(అనగా పాప పుణ్యాలు)

కొద్దిగా ఆలోచించండి " మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు, మళ్లి  ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు ?.ఇప్పటివరకు పొయినవాళ్లు ఎంత బంగారం, వెండి పట్టికుపోయారు ? మీరు పోయె ముందు మీ బ్యాంకు లోఉన్న నగా, నట్ర, డబ్బు మూలుగుతుందో అదిపూర్తిగా పనికి రాని సంపాదన కదా. ఒకవేళ మీ మీ సంతానం సమర్ధులైతే మీరు వదిలిన డబ్బు దస్కం వాళ్లకు అనవసర వస్తువు కదా. వాటి అవసరం వాళ్లకు లేదు కదా. వొక వేళ వాళ్ళు ఆ డబ్బు దస్కం వాడుకున్నట్లయితే వాళ్ళు ఎందుకూ కొరగాని వాళ్ళుగా, చేతకాని వాళ్ళుగా అయిపోతారు కదా. వాళ్ళు సదరు డబ్బు, నగా నట్రా వాడుకుని కొద్ది రోజుల్లోనే వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుని తీరుతారు. ఆ తర్వాతే వాళ్లకు శాంతి లభిస్తుంది.

నేను, నాది, మీది అన్నది అంతా ఇక్కడికి ఇక్కడే పనికి రాకుండా పోతుంది. ఏది కూడా వెంట రాదు. ఒకవేళ మీ వెంటవస్తే గిస్తే మీ పుణ్య ఫలం వెంట వస్తుంది. కావున ఎంత వీలయితే అంత మంచికర్మలు చెయ్యండి.

*మాటలే ఆభరణాలు!*

 *మానవ సంబంధాల్లో    మాటలు కీలకపాత్ర పోషిస్తాయి. జ్ఞానం, విజ్ఞత, వ్యవహారశైలి- మాటల ద్వారానే తేటతెల్లమవుతాయి.* 

*శ్రీరాముడి తొలిదర్శనంలోనే ఆంజనేయుడి మాటల తీరు ఆకట్టుకునేలా చేసింది. ఆ విషయాన్ని దాచుకోలేని దాశరథి మారుతి వాక్చాతుర్యం గురించి లక్ష్మణుడికి చెబుతాడు.* 

*ఇది రామాయణానికే పరిమితం కాదు. సార్వకాలీన సత్యం.* 

*కొందరు స్పష్టత లేకుండా, సందర్భానికి విరుద్ధంగా పెద్దగొంతుతో, అవహేళన స్వరంతో మాట్లాడతారు. మరికొందరు ముభావంగా, మొహం ముడుచుకుని పది మాటలకు ఒక మాట మాట్లాడతారు. ఇంకొందరు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. పైగా ‘యథార్థవాదీ లోక విరోధి’ అంటూ తమను తాము సమర్థించుకుంటారు. ఎదుటివారు ముందుగా మాట్లాడితేగానీ కొందరు స్పందించరు. అంతవరకు చూపులు తిప్పుకొని, పరిచయస్తుల్ని కూడా ఎవరో తెలియనట్టు నటిస్తారు. మరికొందరు అతిగా మాట్లాడి ఇబ్బందిపెడతారు.* 

*వాక్కులు సరస్వతీదేవి ప్రసాదాలు. వాటిని అంత పవిత్రంగా, గౌరవంగా వినియోగించాలి. మాటలు మిత్ర శత్రుబంధాలను తారుమారు చెయ్యగలవు.*

*ఇంటిగుట్టు ఎవరికీ చెప్పరాదనేది ప్రాథమికసూత్రం. ఎక్కువగా మాట్లాడేవారు ఎప్పటికప్పుడు మనసు కడిగేసుకుంటున్నట్టు- కనిపించిన వాళ్లందరికీ ఏకరువు పెడుతుంటారు. ఆ మాటల్లో ఇతరుల మీద విమర్శలూ ఉంటాయి.  నేరుగా     అంటే పెద్దగా పట్టించుకోని వాళ్లు, ఇతరుల ద్వారా విన్నప్పుడు మండిపడతారు. *

*వేదాలు బ్రహ్మవాక్కులు. అందుకే వాటిని మహర్షులు మాత్రమే వినగలిగారు. అవే శ్రుతులు. పండితులు పొల్లుమాట దొర్లకుండా వాక్కుల్ని నిగ్రహిస్తారు. కవులు పదాలను రసార్ణవం చేస్తారు. ప్రతి కావ్యం ఒక తేనెపట్టులాంటిదే. లాఘవంగా మాధుర్యాన్ని ఆస్వాదించగలగాలి.*

*మనసులో స్వచ్ఛత, ప్రేమ, సమభావన ఉన్నవారి మాటలు కోయిలగానంలా, వెన్నెల విడిదిలా శ్రోతలను అలరింపజేస్తాయి.* 

*సిరి సంపదలు లేకపోయినా మధురభాషణలే, అమూల్య భూషణాలుగా ఉండేవారికి సర్వత్రా గౌరవ మర్యాదలు లభిస్తాయి.*

*భగవంతుడు స్త్రీలకు మధురస్వరం ఇచ్చాడు. వారి మాటలు మధురాతి మధురంగా ఉండాలని ఆయన ఆకాంక్ష.* 

*సంగీతం మగువల గొంతులో ఎంతో మధురంగా ధ్వనిస్తుంది. అందుకే వాణి వాక్కులరాణి అయింది.*

*మన మాటలే వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటల్ని గుణాత్మకంగా, ఎంతో అర్థవంతంగా ఉపయోగించాలి.* 

*ఇతరుల మాటలు ఎలా ఉండాలని ఆశిస్తామో మనం అలాగే మాట్లాడేందుకు ప్రయత్నించాలి.* 

*‘ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి’ అనే సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది.* 

*మందహాసం మొహాన్ని అందంగా మారుస్తుంది. ఎన్ని చీకాకులు వేధిస్తున్నా వాటిని చిరునవ్వు వెనక దాచుకోవచ్చు.* 

*రాముడికి ‘పూర్వభాషి’ (ముందుగా తానే పలకరించే తత్వం) అనే లక్షణం ఉంది. ఇది మానవ సంబంధాల్లో అద్భుతమైన విజయాలను చేతికందిస్తుంది.* 

*కలివిడిగా అందరితో కలిసిపోవడంతో పాటు పొందికగా పొదుపుగా మాట్లాడటం వల్ల మనల్ని అందరూ ఇష్టపడతారు.*

*బంగారు ఆభరణాలు ఎన్ని ధరించినా రాని గౌరవాన్ని, మంచి మాటల ద్వారా పొందవచ్చు. అందుకే మాటల్ని వాగ్భూషణాలు అంటారు.*

.....

. గీతోపనిషత్తు  -239 🌹*

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము  📚*

శ్లోకము 19-2

 *🍀 18-2. నిద్ర - మెలకువ -  నిద్రించుటయు, మేల్కాంచుటయు జీవులకు అవశమై యున్నది. నిద్ర  మెలకువ వచ్చుటయే గాని తెప్పించు కొనలేము. ఇది అవశస్థితి. అట్లే జన్మించుట, మరణించుట కూడ. అట్లే సృష్టి, ప్రళయము కూడ.  ఈ చక్రము నుండి జీవులు బయల్పడుట ప్రయత్న పూర్వకముగ చేయవలెను. ఈ చక్రగతి దాటుటకు చక్రమును త్రిప్పుచున్న తత్త్వముతో ముడిపడవలెను. చక్రము నందుండుట ఒక ఎత్తు, చక్రమును త్రిప్పు తత్త్యముతో యుండుట మరియొక ఎత్తు. పరబ్రహ్మ యోగమున ఇది సాధ్యపడునని భగవానుని ఉపదేశము.  🍀*

భూత గ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |

రాత్ర్యాగమే2 వశః పార్థ ప్రభవ త్యహరాగమే || 19

తాత్పర్యము : ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. బ్రహ్మపగలు యందు కూడ ప్రాణి సమూహము అట్లే అవశులై పుట్టుచు చచ్చుచు, మరల పుట్టుచు జీవించి బ్రహ్మరాత్రి యందు లయమందు చున్నది. 

జీవులు మేల్కొనక ముందు తామున్నామని తెలిసి యుండరు. మేల్కొనినంతనే తెలియును. ఆ తెలివి నిద్రవరకే. నిద్రయందు తెలివి అవ్యక్తము లోనికి చనును. మరల మెలకువ కలిగినంతనే ఏర్పడును. నిద్రించుటయు, మేల్కాంచుటయు జీవులకు అవశమై యున్నది. నిద్ర వచ్చుటయేగాని, నిద్రను తెప్పించుకొనలేము. మెలకువ వచ్చుటయేగాని, మెలకువను తెప్పించుకొనలేము. ఇది అవశస్థితి. అట్లే జన్మించుట, మరణించుట కూడ. అట్లే సృష్టి, ప్రళయము కూడ. 

ఈ చక్రము నుండి జీవులు బయల్పడుట ప్రయత్న పూర్వకముగ చేయవలెను. ఆ ఉపాయము తరువాత శ్లోకమున పరమాత్మ తెలియజేయు చున్నాడు. సృష్టి లయములకు, జనన మరణములకు, మెలకువ నిద్ర లకు అతీతమైన, అక్షరమైన పరతత్త్వమును గుర్తించి, దానితో ముడిపడుటయే మార్గమని తెలియచేయును. సృష్టిచక్రము, జనన మరణ చక్రము, అహోరాత్ర చక్రము, జీవులను శుక్ల కృష్ణ గతులలో అనంతము త్రిప్పుచునే యుండును. 

ఈ చక్రగతి దాటుటకు చక్రమును త్రిప్పుచున్న తత్త్వముతో ముడిపడవలెను. చక్రము నందుండుట ఒక ఎత్తు, చక్రమును త్రిప్పు తత్త్యముతో యుండుట మరియొక ఎత్తు. పరబ్రహ్మ యోగమున ఇది సాధ్యపడునని భగవానుని ఉపదేశము. 

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[ . శ్రీ శివ మహా పురాణము - 438🌹* 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః  🌴* 

అధ్యాయము - 28

*🌻. శివుని సాక్షాత్కారము  - 1 🌻*

పార్వతి ఇట్లు పలికెను-

ఎవరో ఒక మహాత్ముడు వచ్చినాడని మాత్రమే నేను తలంచితిని, ఇపుడు విషయమంతయూ తెలిసినది. పైగా నీవు పవిత్రమగు బ్రాహ్మణుడు (1). ఓ దేవా! నీవు చెప్పినది నాకు తెలిసినది. అది అసత్యమే గాని సత్యము కాదు. సర్వము తెలియునని నీవు చెప్పిన మాట సత్యమే అయినచో, నీవు ఇట్లు విరుద్ధముగా మాటలాడియుండవు (2). 

పరబ్రహ్మ, తన ఇచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడునగు మహేశ్వరుడు అప్పుడప్పుడు తన లీలచే అట్టి వేషమును ధరించి కానవచ్చును (3). నీవు బ్రహ్మచారి వేషముతో నన్ను మోసగించుటకు వచ్చి కుయుక్తులు పన్ని మోసపూరితములగు మాటలను పలికితివి (4).

నేను శంకరుని స్వరూపమును ప్రత్యేకించి ఎరుంగుదును. శివతత్త్వము నెరుంగుదును. కావున నా యోగ్యతకను గుణముగా బాగుగా విమర్శించి చెప్పుచున్నాను (5). శివుడు స్వరూప దృష్ట్యా నిర్గుణ బ్రహ్మ. కాని కారణమగు ప్రకృతితో గూడి సగుణుడైనాడు. నిర్గుణుడు, గుణ స్వరూపుడునగు ఆయనకు జాతి ఎట్లుండును? (6) 

ఆ సదాశివుడు విద్యలన్నింటికీ నిధానము. పూర్ణపరమాత్ముడగు ఆ శివునకు విద్యతో పనియేమి? (7)ఆ శంభుడు కల్పప్రారంభములో వేదములను ఉచ్ఛ్వాస రూపముగా పూర్వము విష్ణువునకు ఇచ్చెను. ఆయనతో సమమగు గొప్ప ప్రభువు మరియొకడు లేడు (8).

సర్వప్రాణులకు ఆదియందున్న సద్ఘనుడగు పరమేశ్వరునకు వయస్సు యొక్క లెక్క ఎక్కడిది? ప్రకృతి ఆయన నుండి పుట్టినది. ఆయన యొక్క శక్తికి కారణమేమి ఉండును? (9) శక్తికి ప్రభువు, అవ్యయుడు అగు ఆ శంకరుని ఎవడైతే సర్వదా ప్రేమతో సేవించునో, అట్టివానికి ఆ శంభుడు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులను ఇచ్చును (10). 

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[ వివేక చూడామణి - 115 / Viveka Chudamani - 115🌹*

✍️  రచన : *పేర్నేటి గంగాధర రావు*

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 


*🍀. 26. ఆత్మ మార్పులేనిది  - 2 🍀*

383. స్వచ్ఛమైన మనస్సును ఆత్మపై స్థిరపర్చి తమ ఖచ్చిమైన ఆత్మ విజ్ఞానమును పొందుతూ, నిదానముగా అట్టి స్థితిపై మనస్సును నిల్పిన అట్టి వ్యక్తి తన శాశ్వతమైన ఆత్మను తాను తెలుసుకొనగలడు. 

384. ప్రతి వ్యక్తి తన ఆత్మను తాను దర్శించవలెను. అది విభజించుటకు వీలులేని, శాశ్వతమైనది. అన్ని పరిమితులకు అతీతమైనది. అది శరీరము, శరీర భాగాలు, ప్రాణాలు, అహమును తన యొక్క అజ్ఞానము వలన సృష్టించబడినవని గ్రహించి, అవన్నీ ఆకాశముతో నిండి యున్నవని తెలుసుకోవాలి. 

385. ఆకాశము వందలకొలది పరిమిత వస్తు సముదాయమును తనలో నింపుకొని; అవి కుండ, జాడి, పార, సూది మొదలగునవి; తాను ఒకటిగా, అనేకముగా కాకుండా ఉన్నది. అదే విధముగా పవిత్రమైన బ్రహ్మము కూడా అహాన్ని ఇతరమైన వాటిని తనలో లేకుండా చేసి ఒకటిగానే తోచుచున్నది. 

 సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 66 🌹*

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. భక్తి మార్గము 🌻*

పూర్వము బ్రహ్మ దేవుడు వేదమును తన మనస్సున ముమ్మారు పరామర్శించెను.  ధర్మముల రూపముగా నొకమారు , జీవిత సమన్వయముగా నొకమారు,  పరిశుద్ధ జ్ఞానముగా నొకమారు అధ్యయనము చేసెను.  అటుపై నొక నిర్ణయమునకు వచ్చెను.

*భక్తి మార్గమున తప్ప మరియొక మార్గమున మోక్షము లేదు.*

ఇట్లు నిర్ణయించుకొని విష్ణుమూర్తిని తన స్వరూపము గల వానినిగా  ధ్యానము చేసెను.  (దానితో తన  అస్తిత్వము  విష్ణువు నందు అర్పణము చేసెను. ఇదియే సన్న్యాసము.). తత్ఫలితముగా తన వికారము నుండి విమోచనము పొందెను. 

అపుడు విష్ణువు మార్గములే తన మార్గములుగా గోచరించినవి.  (దానితో సృష్టి సామర్థ్యము గూడ తన నుండి ప్రసరించెను.)

✍🏼 *మాస్టర్ ఇ.కె.*

భాగవతము 2-35

. శ్రీ లలితా సహస్ర నామములు - 115  / Sri Lalita Sahasranamavali - Meaning - 115 🌹*

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ |*

*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ‖ 115 ‖ 🍀*


🍀 566. నిత్యతృప్తా - 

నిత్యసంతుష్టి స్వభావము కలది.


🍀 567. భక్తనిధిః - 

భక్తులకు నిధి వంటిది.


🍀 568. నియంత్రీ - 

సర్వమును నియమించునది. 


🍀 569. నిఖిలేశ్వరీ - 

సమస్తమునకు ఈశ్వరి.


🍀 570. మైత్ర్యాది వాసనాలభ్యా - 

మైత్రి మొదలైన వాసనా చతుష్టయము గలవారిచే పొందబడునది.


🍀 571. మహాప్రళయ సాక్షిణీ - 

మహాప్రళయ స్థితియందు సాక్షి భూతురాలుగా ఉండునది.


సశేషం....

అనగనగా ఓ కథ 

ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట  నివసిస్తూ ఉండేది. అక్కడ  ఎటువంటి పచ్చదనమూ లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది. 

ఒక రోజున నారదుడు అటు పోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను  చూసి చాలా జాలి పడ్డాడు.  ఆ పక్షి దగ్గరకు వెళ్ళి ,” ఓ చిన్ని పక్షి ! ఇంత మండే  ఎడారిలో నీవు ఏమి చేస్తున్నావు?  నీకు ఏమైనా సహాయం చేయనా ?అని అడిగాడు. 

ఆ చిన్ని పక్షి,” నాకు నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది.  కాని ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతున్నాను. నా పాదాలు రెండు కాలిపోతున్నాయి.  ఇక్కడ ఒక చెట్టు ఉంటే, ఈ ఎండ,  వేడిని కొంచము తట్టుకుని  హాయిగా, సంతోషంగా ఉండగలను." అని చెప్పింది . 

“ఇటువంటి  ఎడారిలో చెట్టు మొలవటం అంటే, నా ఊహకి అందకుండా ఉన్నది. అయినా నేను పరమాత్మ దగ్గరకి వెళ్లి  నీ కోరిక  నెరవేర్చమని అయనను అడుగుతాను”, అన్నారు. 

శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్లి ఆ పిట్టకి సహాయం చేయమని ఆయనకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు ఆయన  "నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలా చేయగలను.  కానీ ఆ పిట్ట విధి రాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను. కానీ, ఎండ నుంచి ఉపశమనము కోసము ఒక ఉపాయం చెబుతాను. ఎప్పుడూ ఏదో ఒక కాలి  పైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి  కొంత విశ్రాంతి దొరికి, ఉపశమనం కలుగుతుంది. వెళ్లి ఆ పక్షి తో ఇలా నేను  చెప్పానని చెప్పు"  అన్నారు పరమాత్మ.  

నారదుడు మళ్ళీ ఎడారి లో ఉన్న  పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పక్షికి  భగవానుని పై ఎంతో నమ్మకము.   ఈ ఉపాయం విని చాలా సంతోషించింది.   నారద మహర్షికి ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఈయనకు అర్థం కాలేదు "ఇందులో ఇంత సంతోషించటానికి ఏముందో. అడిగిన చెట్టు మొలిపించలేదు సరి కదా, ఒంటి కాలి  మీద నడువు" అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి  వెంటనే అమలు లో పెట్టటం మొదలు పెట్టింది.  

మహర్షికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. కొన్నాళ్లకు మళ్ళీ అక్కడికి వెళ్లి చూద్దామని ఆ  దారిలో వెళుతూ ఆ పక్షిని చూశాడు. అది హాయిగా ఆ  ఎడారి మధ్యలో ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య  కూర్చుని ఉంది.  పక్షి సుఖంగా హాయిగా ఉండటం చూసి ఈయనకి  ఆనందం కలిగింది, అయినా పరమాత్మ చెప్పక పోయినా చెట్టేలా వచ్చిందనే  విషయం బోధ పడలేదు.  మళ్ళీ  దేవుడి దగ్గరకి వెళ్ళి  ఆయనతో  ఈ  పక్షి గురించి తాను చూసిందంతా చెప్పాడు. 

అందుకు శ్రీమహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు:" నేను చెప్పినట్లే జరిగింది.  పక్షి తల రాతలో  చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పక్షికి  నా సందేశం వినిపించిన తరువాత, భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని, అర్థము చేసికొని ఆచరించింది.  అంతే కాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయముతో తనకు లభించిన  భగవత్ప్రసాదమును  స్వచ్ఛమైన అంతఃకరణతో అమలులో పెట్టింది.  ఆ పక్షి  చూపించిన ఈ భక్తి  శ్రద్ధలకు , నా అనుగ్రహము మేరకు తల రాతను మార్చేసి, అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను" అన్నారు.  

 🍁🍁🍁🍁🍁     

                                                                                                                                                                             

అందిన అనుగ్రహాన్ని ఆచరించాలి, ఆ పూటకు దొరికిన  దాన్ని ప్రసాదముగా భావించాలి. ఈ మాత్రము అందుకోగలిగినందుకు ఆయన పట్ల కృతజ్ఞత చూపాలి. మనకేమి కావాలో ఆవి యిస్తారు, మనం కోరుకున్నవన్నీ మనకు సుఖ శాంతులు అందించలేకపోవచ్చు. అందువలన ఇది కావాలి అది కావాలి అని కోరుకునే కంటే, మనకేది అవసరమో ఆయనే ఇచ్చేటట్లు ధన్యవాదములు తెలియచేసుకోవాలి, భగవంతుని ఆశీస్సులను పొందే ప్రయత్నం చేయాలి. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతా భావం, విశ్వాసం- వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది.🙏

మాధుర్యం

            .....ఎన్.శివ నాగేశ్వర రావు

**

  తెల్లవారింది.నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని

అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి

వెళ్ళాలి.కానీ బద్దకంగా అనిపించింది.

        మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు.ఆయన చనిపోయి రెండేళ్లు

అయింది.కొడుకు....కూతురు అమెరికాలో

స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు 

వచ్చేయమంటారు.కానీ నాకే ఇష్టం లేదు.

ఆయన పోయాక నాకు జీవితం మీద

ఆసక్తి పోయింది.నిరాశ...నిస్పృహలతో

కాలం గడుపుతున్నాను.

     కాఫీ తాగాలి అనిపించింది.కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.కాఫీ త్రాగడం ఎప్పటి అలవా టో!

       చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను.బ్రష్

చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను.కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది.వయసు పాతిక ఉంటుంది.

అందంగా...ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.

        నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.

    ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని 

గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.

కానీ గుర్తు రాలేదు.మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరు నవ్వుతో

విష్ చేసింది.

       అలా వారం గడిచింది.ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు " సారీ అమ్మా!

నిన్ను గుర్తు పట్టలేక పోయాను!"అన్నాను.

      ఆ యువతి చిన్నగా నవ్వి " మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ!మీరు నన్ను గుర్తు పట్టడానికి" అన్నది.

      నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను.

అప్పుడా అమ్మాయి" విష్ చేయడానికి పరిచయం ఎందుకు?" అన్నది.తన మాటకు

నేను నవ్వేసాను.నేను నవ్వి చాలా కాలం అయింది.ఆ విషయం మనసు గుర్తు చేసింది.

      " నీ పేరు?" అని అడిగాను."స్వప్న.మరి మీ పేరు?" అని అడిగింది."వకుళ" అని చెప్పాను.స్వప్న నన్ను దాటిపోతూ 

వెనక్కి తిరిగి "ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది" అన్నది.నాకు మావారు గుర్తుకు వచ్చారు.ఆయన కూడా అదే మాట అనేవారు.గుండెలో సంతోషం పొంగింది.

    మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం...సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి.ఉత్తేజంగా అనిపించేది.

   ఒక రోజు "ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాను.

స్వప్న సరేనంది.ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము.

     "నీకు పెళ్లి అయిందా?" అని అడిగాను.

"అయింది.ఒక బాబు...పాప" అంది స్వప్న.మాటల్లో మావారు పోయిన విషయం...మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను.మావారు పోయినందుకు

సంతాపం తెలియ బరిచింది.

      కొద్ది క్షణాల తరువాత "ఇప్పుడు ఇంటికి

వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?" అని అడిగింది స్వప్న." బ్రెడ్" అని చెప్పాను.

"ప్రతి రోజూ అదేనా?" అని అడిగింది స్వప్న.

"ఒక్కదాన్నే గా!అందుకే!" అన్నాను.

      "ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి.మీ ఆరోగ్యం మీరు కాపాడు కోవాలి" అంది స్వప్న.కొంచెం సేపు ఆగి

తనే" మీవారు..పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు

ఇష్టం అయినవి చేసి పె ట్టి ఉంటారు.ఇప్పుడుమీకు ఇష్టమైనవి చేసుకు

తినండి" అన్నది.ఆ తరువాత మేం విడి 

పోయాము.

        ఇంటికి వెళ్ళిన తరువాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి.అందులోని వాస్తవం గుర్తించాను.చాలా కాలం తరువాత

నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను.ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది.

     మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి

జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను.ఎంతో సంతోషించింది."మంచి పని చేశారు" అని అభినందించింది.మాటల్లో జీవితం నిరాసక్తత

గా ఉన్నట్లు చెప్పాను.స్వప్న మౌనం వహించింది.

    నెల తరువాత ఒక రోజు    " వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా!" అని ఆహ్వానించాను.స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను" అని నా సెల్ నంబర్ తీసుకుంది.మా వారు పోయాక నేను

మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న.

      సాయంత్రం నాలుగు గంటలకు  వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది.

నాకు సంతోషం అనిపించింది.

     తనకోసం కాఫీ చేసి ఫ్లాస్క్ 

లో పోసి ఉంచాను.చెప్పినట్లు సరిగ్గా   

నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది.

వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ  తెచ్చింది.

       "ఎందుకిది " అని అడిగాను."రోజూ దీనికి నీళ్లు పోస్తూ పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!" అంది.

        స్వప్న సోఫాలో కూర్చుంది.కాఫీ అందించాను."మీరు తీసుకోరా?" అని అడిగింది."డయాబెటీస్.అందుకే ఇష్టమైనా

 తీసుకోవడం లేదు" అన్నాను.

        తను కిచెన్ లోకి వెళ్లి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ"జబ్బు కంటే భయమే శరీరం మీద

 ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.ఏం కాదు.హ్యాపీగా త్రాగండి" అంది.నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను.చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది.  అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో..

బ్రూ పౌడర్ కలుపుకు త్రాగినా రుచి అద్భుతంగా ఉంటుంది.అందుకు కొంచెం

మైండ్ సెట్ మార్చుకో వాలి" అన్నది.

         కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక "ఇల్లు చూద్దువు గాని రా!" అని స్వప్నను లోనికి తీసుకు వెళ్ళాను.

   తను పూజా మందిరం చూసి " రోజూ పూజ చేయడం లేదా?" అని అడిగింది." లేదు"

అన్నాను.తను రెండు అగరొత్తులు  తీసి వెలిగించింది.క్షణంలో గది పరిమళ భరితం

అయింది.అప్పుడు స్వప్న "పూజ చేసినప్పుడు

మన మనసూ ఇలా పరిమళ భరితం అవుతుంది" అన్నది.

       " ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో

బాగుంటుంది" అని మనసులో అనుకున్నాను.

         స్వప్న బయలు దేరినప్పుడు " గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు 

మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!"

అన్నది."అలానే" అన్నాను.

          గదిలో అలుముకున్న అగరొత్తుల

 పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను

గుర్తు చేస్తూనే ఉంది.

      మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో

లేవలేదు.కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను.కాఫీ చక్కెర లేకుండా త్రాగాను.స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే

బాగుంది అనిపించింది.చాలా కాలం తరువాత

ప్రభాత సమయంలో  ఉత్సాహంగా అనిపించింది.

     వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి 

చెప్పాను.సంతోషం వ్యక్తం చేసింది.

     స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను.క్రమేపీ దానితో

అనుబంధం పెరిగింది.ప్రతి రోజూ దాన్ని 

శ్రద్ధగా పరిశీలించ సాగాను.మొగ్గ తొడగడం...పువ్వు విచ్చడం...పరిమళం

అద్భుతం అనిపించ సాగింది.

      మావారు ఉన్నప్పుడు పూల కుండీలు

ఉండేవి గాని...వాటి పోషణ ఆయన చూసుకునేవారు.ఇప్పుడు ఇది నాకు సరి 

కొత్త అనుభవం.

     మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ నా ఆనందం

పంచుకుంది.

              ఈమధ్య స్వప్న నాతో పాటే వాకింగ్ చేయసాగింది.ఒకరోజువాకింగ్ మధ్యలో " మీకో చిన్న పని చెప్తాను. అలా చేసి 

ఎలా ఉందో నాకు చెప్పండి" అంది.

      "ఏమిటది?" అని ఆసక్తిగా అడిగాను.

రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒకదానిలో

బియ్యం గింజలు..ఒకదానిలో నీరు పోసి

మీ పిట్ట గోడ మీద పెట్టండి" అన్నది.

తన భావం గ్రహించి" సరే" అన్నాను.

         అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ...

దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది.

      ఉదయం తాగుతున్న కాఫీ...పూజ...

అగరొత్తుల పరిమళం... పూస్తున్న గులాబీలు...గింజలు తింటున్న పిట్టలు...

నీరు తాగుతున్న పక్షులు....ఇవి చిన్న చిన్న

మార్పులే గానీ నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి.ఒకప్పుడు నిరాశ..నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా...సంతోషంగా ఉంటున్నాను.

నాలోని మార్పుకు స్వప్నే కారణం.

      ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద

వచ్చింది.తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది."వీళ్ళు మా పని మనిషి పిల్లలు.

బాగా చదువుతారు.కానీ వీళ్ళమ్మ వీళ్ళను

చదివించలేక పోతున్నది.అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను.

మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి" అన్నది.

నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసు

కున్నాను.వాళ్లకు సహాయం చేయడం నాకు

ఎంతో తృప్తిని ఇచ్చింది.

      పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామ కాయలు కోసుకున్నారు.స్వప్న నాతో "మీ హాబీస్ ఏమిటి?" అని అడిగింది." ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని" అని చెప్పాను.

" వావ్" అని స్వప్న నన్ను కౌగిలించుకుంది.

"ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి.

నాకోసం ఒకటి డ్రా చేయండి" అని చిన్న పిల్లలా మారాం చేసింది ."వాటి జోలికి వెళ్లి

చాలా కాలం అయింది.వేయగలనో! లేదో!"

అన్నాను."తప్పక వేయగలరు!" అంది స్వప్న.

ఆన డమే కాదు...ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్...పెన్సిల్స్...వాటర్ కలర్స్

తెచ్చి ఇచ్చింది.

      దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.

        ఆలోచించి రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను.మొదట కొంచెం తడబడినా త్వరగానే దారిలోకి వచ్చాను.

పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది.ఆ విషయం స్వప్నకి చెప్పాను.

       ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది.పెయింటింగ్ చుడగానే " "ఎక్సలెంట్ ఆంటీ!" అని నన్ను కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.

నాకు సంతోషం...సిగ్గు రెండూ కలిగాయి.

     " పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్ గా ఇవ్వండి" అని కోరింది.అలానే చేశాను.

      ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. "ఎప్పుడూ మేం చేయడమే గాని,నీవు చేసింది లేదు.ఫస్ట్ టైం నువ్వే చేశావు" అని ఆశ్చర్య పోయింది.క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను." నీ లైఫ్ స్టైల్ 

మార్చింది .నా అభినందనలు తెలియ జేయి"

అన్నది.

        కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి 

ఆహ్వానించింది.తనే వచ్చి స్కూటీ మీద తీసుకు

వెళ్ళింది.ఇంటికి వెళ్లగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ  అందమైన ఫ్రేమ్ లో

కనిపించి కనువిందు చేసింది.నాకు మనసులో  గర్వంగా అనిపించింది.

       స్వప్న నాకు వాళ్ళ అత్త మామ గార్లను

పరిచయం చేసింది.నేను సోఫాలో  కూర్చున్నాను.స్వప్న కాఫీ తేవడానికి లోనికి

వెళ్ళింది.

       స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ..

" మా కోడలు దేవతమ్మా!మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది."అన్నది.అంతలో

స్వప్న కొడుకు...కూతురు మా దగ్గరకు వచ్చారు.నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్...చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు 

అక్కడినుంచి వెళ్లి పోయారు.

      అప్పుడు స్వప్న అత్తగారు" ఈ బాబే స్వప్న కొడుకు.ఆ పాప అనాధ.స్వప్న దత్తత తీసుకొని పెంచుకుంటున్నది.అం తే కాదు...

మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.అదేమంటే...మన పిల్లలను మనం పెంచడం ...ప్రేమించడం గొప్ప కాదు.

అనాధకు చేయూత నీయడం గొప్ప అంటుంది.

మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు" అని

చెప్పింది.

      అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు

కలిగాయి.స్వప్న కు అంత చిన్న వయసులోనే

ఎంత పరిపక్వత అనుకున్నాను.కాఫీ తెస్తున్న స్వప్న లో నాకు దేవతా మూర్తి గోచరించింది.

    స్వప్న,అత్తగారితో " మొత్తం చెప్పేసారా?

చెప్ప నిదే ఊరుకోరు కదా!" అంది నవ్వుతూ.

నేను సింపుల్ గా " అభినందనలు స్వప్నా!"

అన్నాను.

          ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు.స్వప్నను చూసాక జీవన మాధుర్యం

బోధ పడింది.ఈరోజు తను చేసిన పని తెలిశాక నా జీవిత గమ్యం బోధ పడింది.

నా దగ్గర బాగానే డబ్బు ఉంది.నా డబ్బు మా పిల్లలు ఆశించరు.ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి ఏం చేయాలో

నిర్ణయం తీసుకున్నాను.అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.

       కొద్ది కాలానికి మా వారి పేరు మీద

ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను.దానికి

సెక్రటరీ గా స్వప్నను ఏర్పాటు చేశాను.

      ఇప్పుడు నాకు జీవితం నిరాశగా... నిస్పృహగా అనిపించడం లేదు.సంతోషంగా...

ఉత్సాహంగా అనిపిస్తున్నది.ఒకప్పుడు సమయం గడవని నాకు ..ఇప్పుడు సమయం చాలడం లేదు.

       వయసులో చిన్నదే అయినా ..నా మనసులో గురువు స్థానం స్వప్నకే

ఇచ్చాను!!

*****

ఓ హిందువులారా గోమాత యొక్క గొప్ప తనము తెలుసుకొని గోవును రక్షించుకోవాలని తెలుసుకోండి.

ఆవు వెన్నుముకలో సూర్యకేతు నాడి ఉంటుంది.  ఈ నాడి సూర్యుని ప్రకాశంతో మరింత ఇనుమడిస్తుంది. ఈ నాడి చేతన పొందిన క్షణంలో పచ్చని ద్రవాన్ని వదిలిస్తుంది. అందుకే ఆవు పాలు పచ్చగా ఉంటాయి. విషాన్ని హరించే శక్తి ఆ పాలకు ఉంటుంది. ఆవు నెయ్యి, బియ్యం రెండు కలిపి వేడి చేస్తే శక్తివంతమైన గ్యాస్‌లు, ఇథలిన్ ఆక్సైడ్, ప్రోపలీన్ ఆక్సైడ్ ఉత్పన్నమవుతాయి. ఈ ఆక్సైడ్‌లు జీవన రక్షణగా ఉపయోగపడతాయి. కృతిమ వర్షాన్ని కురిపించడం కోసం ప్రోపలీన్ ఆక్సైడ్ ఆధారం అని విజ్ఞానవేత్తలు సూచించారు.

గంగి గోవు అన్ని రకాల ఔషధ మొక్కలు మాత్రమే తింటుంది . అందుకే గంగి గోవు ఓంకార స్వరూపమై సర్వదేవతా స్వరూపమయి ప్రతి పూజకు ఆవు ప్రధానమయినది. పంచామ్రుతములో ఆవు పాలు ,ఆవు పెరుగు ,ఆవు నెయ్యి , అరటి , తేనె లేనిదే చేయకూడదు . ఆవు పేడ ,ఆవు పంచితం తోనే ఎవరైనా ఇంటిలో శుచి ,శుబ్రం చేయుచున్నారు ., మన ప్రాచీన శాస్త్రాలు మేనరికల్లో పిల్లలు సరిగా పుట్టారని చెబుతూనే మన ప్రాచీన మూపురంగులగంగి గోవు పాల పెరుగును తల్లులకు 3 వ నెల నుండి 9 వ నెల వరకు రోజూ తినిపిస్తే మన కన్న అందమైన ,బలమైన ,ఆరోగ్య మైయిన ,సంపూర్ణ సౌష్టవం గల పిల్లలు సందేహమే లేకుండా కల్గుతారని వరమిచ్చినాయి . ఆవు చుట్టూ రోజు తిరిగే వారికి ఆరోగ్యం బాగా వుంటుంది.

ప్రకృతిని పూజించండి. వెధయుక్త ,జ్ఞాన ,శాస్త్రీయమైన, మనప్రాచీన సంప్రదాయ మన కన్న తల్లి వంటిది నేడున్న విద్యుతు , పరిశ్రమలు , కంప్యూటర్స్ మన బిడ్డల వంటివి. బిడ్డలున్నారని కన్న తల్లిదండ్రులను వదిలేస్తామా.

సృష్టికి అన్నం పెడుతున్న ఆవులనూ కాపాడుదాం. గ్రామ దేవతలైన గోవులను రక్షిద్దాం. గోమాతను రక్షించుకొందాం కోట్ల మంది నమ్మకాన్ని నిలబెడదాం.

సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాము, పూజిద్దాము సకల శుభాలను పొందుదాము.

(గోవు సకల దేవతా

స్వరూపము.)

****

12++08--2021


  

 ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఈ అల్లరి చేతలు  ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా  సాంబశివా సాంబశివా

అలల తోటి గంగ పట్టి  తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా సాంబశివా సాంబశివా

తోలు గట్టి పటకాగా కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా  సాంబశివా సాంబశివా

*******

సృష్టి, ప్రపంచం, దేవుడు, జ్ఞానం, అజ్ఞానం అన్నీ ఆ నేనును ఆశ్రయించుకునే ఉంటాయి !

_మిథ్య అంటే అవేవీ శాశ్వతంగా, స్థిరంగా నిలిచి ఉండేవి కావని, మరోదానిపై ఆధారపడినవనీ దానిఉద్దేశ్యం. "అయమాత్మాబ్రహ్మ" అనే మహా వాఖ్యములో నేను, ఆత్మ బ్రహ్మమేనని చెప్తున్నారు. అంటే జీవుడు, ఈశ్వరుడు అబేధమైన బ్రహ్మమేనని గుర్తించమని ఈ వాక్యం చెప్తుంది. బ్రహ్మమంటే అఖండానంద స్థితి. సత్యం తెలుసుకున్న తర్వాత కలిగే ఈ అఖండానందంలో జీవుడు, దేవుడు లయం అవుతారు. భిన్నభావన ఉండదు. తాను కానిది, తనకు భిన్నమైనది ఏదీ సత్యదృష్టిలో కనిపించదు. ఉదయం లేవగానే మనందరికీ వచ్చే తొలి భావన "నేను" ఆ తలంపు  వచ్చాకే మనకు ఇవన్నీ వస్తున్నాయి, అందుచేత ఈ సృష్టి, ప్రపంచం, దేవుడు, జ్ఞానం, అజ్ఞానం అన్నీ ఆ నేనును ఆశ్రయించుకునే ఉంటాయి ! అది తెలిస్తే అదే సత్యమైన "నేను" ("I am That I am") లేకుంటే అదే"మిధ్యా నేను" ఇహంలోకి తీస్కుపోతుంది.

******


అయోనిజ, కారణజన్మురాలు, పాండవుల పత్ని.
 "అతి రూపవతి భార్యాశతు్రః" అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.
సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది.

ద్రౌపది అయోనిజ. కారణజన్మురాలు. కోకిలాదేవి- పాంచాల ప్రభువు ద్రుపదులకు అగ్నిగుండంలో జన్మించిన పుత్రిక. సహోదరుడే దృష్టద్యుమ్నుడు.
వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్ణం కలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించేది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక కన్య, సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది.
ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య - ఇంద్రసేన. మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు.
రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా పతి అని ఐదుసార్లు కోరింది.
తరువాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు.

ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమె ఆ అయిదుగురు సోదరులనూ
 పెళ్ళి చేసుకోవలసి వచ్చింది.
ఆ తర్వాత వారు పాండుకుమారులని ఆమెకు తెలిసింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రఛ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని,
 శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు.

వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు.
 
అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు
. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవల్సివచ్చింది.
ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు.

పాండవధర్మపత్నిగా జీవితం సాగించింది. "అతిరూపవతీ భార్యా, శతు్రః" అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.
చివరి రోజైన 18వ నాడే దుర్యోధనుడు భీముని గదాఘాతానికి బలయ్యాడు. అశ్వత్థామ కారణంగా తుదకు సుత సోదరమరణశోకమును ద్రౌపది భరించాల్సి వచ్చింది. ఆమె ఉదాత్తగంభీరవ్యక్తిత్వము ఎవరి ద్రుష్టినైనా ఆకర్షించగలవు. ఎంతో మెప్పును పొందగలవు. ధన్యజీవి ద్రౌపది, మహాసాధ్వి!

 

 *గర్వం*

🍁🍁🍁

 🌷🌷ఆహారం🌷🌷
                                             
👏అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు మనలోని జీవశక్తి ని పెంపొందించేది అన్నం. 
           
 అయితే, ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి వడ్డిస్తున్నారన్న విషయం కూడా చాలా ముఖ్యమైనది.

🥀🌹అందు వలననే పూర్వకాలంలో  మడి, ఆచారాల విషయంలో
 ఖచ్చితంగా వుండేవారు.

🌹🌿మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన
దోషాలు నిమిడివున్నాయి.
🥬అర్ధ దోషం ,.                                       🌻 నిమిత్త దోషం.                 
🌺స్ధాన దోషం,                      🌷గుణ దోషం ,             
🌹సంస్కార దోషం.  ఈ ఐదు
దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.

🌸 *అర్ధ దోషం:*

ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు.
భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు . భోజనం చేసి , సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.
ఆ గదిలో నే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది ,
ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద
 సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు మరునాడు పూజా సమయంలో తను చేసిన
పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు. తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్ధం చేసుకున్నాడు. వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు.  శిష్యుడిని   ఎలాటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు.
శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు. "అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బు తో కొన్న పదార్థాలతో , తయారు చేసిన  ఆహారం భుజించడమే అర్ధ దోషం. మనం న్యాయం గా సంపాదించిన దాని తోనే ఆహారం తయారు చేసుకుని , భుజించడం  ముఖ్యం.

*🌸నిమిత్త దోషం🌸*

 మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారైవుఇంటికి వారు సత్యశీలత కలిగి
దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగిన వారిగా వుండాలి. వండిన  ఆహారాన్ని క్రిమికీటకాలు , పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు.

🌹🥀అపరి శుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి
దుష్ట గుణాలు అవతలివారికి  కలుగుతాయి.

🌺 భీష్మాచార్యుల వారు కురు క్షేత్ర యుధ్ధం లో బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య
మీద  ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు.
వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు.

🍁🌾అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది.ఇప్పుడు ఇంత వివేకం గా ఆలోచిస్తున్న భీష్ముడు
ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ,ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది.
🌸🌿ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు 'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో 
వారిచ్చిన ఆహారం భుజిస్తూ  వచ్చాను. నా స్వీయ బుధ్ధిని ఆ ఆ ఆహారం  తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం బిందువులుగా బయటికి పోయి, నేను ఇప్పుడు పవిత్రుడినైనాను నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను. అన్నాడు భీష్ముడు.

🌻🌿చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  తినినందు వలన  మనిషిలోని మంచి గుణములు నశించి
'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది.
*🌸స్ధాన దోషం*
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి
వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది.
యుధ్ధరంగానికి , కోర్టులు ,రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు.

🥬🥀దుర్యోధనుడు  ఒకసారి యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు.
కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణు ని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొట్రుపాటు పడిఅరటి పండుతొక్క  ఒలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని  అందించింది.కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్య వైపు కోపంగా చూశాడు.

కృష్ణుడు,  " విదురా!  నేను ఆప్యాయత తో కూడిన ప్రేమకోసమే ఎదురుచూస్తున్నాను. నిజమైన శ్రధ్ధాభక్తులతో యిచ్చినది అది కాయైనా ,  పండైనా, ఆకైనా,  నీరైనా, ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను.' అని అన్నాడు. మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి.

*🌻గుణ దోషం :*

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి   సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని
కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది. తామస ఆహారం
        🌷సర్వేజనాః సుఖినోభవంతు🌷


 [12/08, 5:00 am] On Sriram**: *🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 76 🌹*

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 

📚. ప్రసాద్ భరద్వాజ 


*🌴. ద్వితీయ అధ్యాయము -  సాంఖ్య యోగము - 29 🌴*


29. ఆశ్చర్యవత్ పశ్యతి కష్చిదేనమ్ ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్య: |

ఆశ్చర్యవచ్చైనమన్య: శ్రుణోతి శ్రుత్వాప్యేనం వేదం న చైవ కశ్చిత్ ||


*🌷. తాత్పర్యం :*

కొందరు ఆత్మను అధ్బుతమైనదానిగా గాంచుదురు. కొందరు దానిని అధ్బుతమైన దానిగా వర్ణింతురు. మరికొందరు దానిని అధ్బుతమైనదానిగా శ్రవణము చేయుదురు. ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏ మాత్రము తెలియకుందురు.


*🌷. భాష్యము :*

అధికపరిమాణ దేహము గల జంతువునందు మరియు ఘనమైన అశ్వత్థవృక్షమునందే గాక, ఒక అంగుళమాత్ర స్థలములో కోట్లాది సంఖ్యలో నుండు సూక్ష్మజీవుల యందును ఆత్మ ఉన్నదనెడు విషయము నిక్కముగా అధ్బుతమైనది. అల్పజ్ఞులు మరియు తపోనిష్ట లేనివారు ఇట్టి ఆత్మ యొక్క అధ్బుతకర్మలను తెలియకున్నారు. విశ్వమునందు తొలిజీవియైన బ్రహ్మదేవునకు సైతము జ్ఞానము ప్రసాదించిన పరమప్రామణికుడైన శ్రీకృష్ణభగవానుడే స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయమును గ్రహింపజాలరు. 


కేవలము భౌతికభావనయే కలిగియుండుట వలన ఎట్లు అణుపరిమాణ ఆత్మ అతిపెద్దదిగా మరియు అతి చిన్నదిగా వర్తింపగలదో ఈ కాలపు జనులు ఊహింపజాలరు. కనుకనే వారు దాని నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అధ్బుతమైనదిగా గాంతురు. భౌతికశక్తిచే మోహమునకు గురియై జనులు ఇంద్రియభోగ విషయములందే అధికముగా రతులగుదురు. 


ఆత్మానుభవమును పొందకున్నచో కర్మలన్నియును జీవనసంఘర్షణలో అంత్యమున ఓటమినే కలుగజేయుననుట వాస్తవమైనను వారు దాని కొరకై సమయమును కేటాయింపరు. ప్రతియొక్కరు ఆత్మను గూర్చి తెలిసికొని తద్ద్వారా భౌతికక్లేశములను పరిష్కారము చూపవలెనని వారు బహుషా తెలిసియుండకపోవచ్చును.


ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సంగమున ప్రవచనములను వినుచుందురు. కాని కొన్నిమార్లు అజ్ఞానవశమున వారు ఆత్మ మరియు పరమాత్మ లిరివురును ఒక్కటే యనియు, వారివురి నడుమ పరిమాణమందును భేదము లేదనియు భావించి తప్పుమార్గమున చనుదురు. ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని, వారి కర్మల, వారి నడుమ గల సంబంధమును, వారికి సంబంధించిన విషయముల నన్నింటిని సంపూర్తిగా తెలిసిన మనుజుడు దుర్లభుడు. 


ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది, ఆత్మ యొక్క స్థానమును వివిధకోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత దుర్లభుడు. కాని ఏదియో ఒక విధముగా ఈ ఆత్మను గుర్చిన విషయమును మనుజుడు అవగతము చేసికొనినచో జన్మ సఫలము కాగలదు.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 76 🌹*

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 

📚. Prasad Bharadwaj 


*🌴 Chapter 2 - Sankhya Yoga - 29 🌴*


29. āścarya-vat paśyati kaścid enam

āścarya-vad vadati tathaiva cānyaḥ

āścarya-vac cainam anyaḥ śṛṇoti

śrutvāpy enaṁ veda na caiva kaścit


*🌻 Translation :*

Some look on the soul as amazing, some describe him as amazing, and some hear of him as amazing, while others, even after hearing about him, cannot understand him at all.


*🌻 Purport :*

The fact that the atomic soul is within the body of a gigantic animal, in the body of a gigantic banyan tree, and also in the microbic germs, millions and billions of which occupy only an inch of space, is certainly very amazing. 


Men with a poor fund of knowledge and men who are not austere cannot understand the wonders of the individual atomic spark of spirit, even though it is explained by the greatest authority of knowledge, who imparted lessons even to Brahmā, the first living being in the universe. 


Owing to a gross material conception of things, most men in this age cannot imagine how such a small particle can become both so great and so small. So men look at the soul proper as wonderful either by constitution or by description.


Illusioned by the material energy, people are so engrossed in subject matters for sense gratification that they have very little time to understand the question of self-understanding, even though it is a fact that without this self-understanding all activities result in ultimate defeat in the struggle for existence. Perhaps they have no idea that one must think of the soul, and thus make a solution to the material miseries.

🌹 🌹 🌹 🌹 🌹

[12/08, 5:00 am] On Sriram**: *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 473 / Vishnu  Sahasranama Contemplation - 473🌹*

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻 473. రత్నగర్భః, रत्नगर्भः, Ratnagarbhaḥ 🌻*


*ఓం రత్నగర్భాయ నమః | ॐ रत्नगर्भाय नमः | OM Ratnagarbhāya namaḥ*



రత్నాని గర్భభూతాని యస్యాబ్ధేస్తత్స్వరూపవాన్ ।

రత్నగర్భ ఇతి ప్రోక్తః సముద్రశయనో హరిః ॥


రత్నములు ఉదరస్థ శిశువులుగా ఈతనికి కలవనే వ్యుత్పత్తి చే సముద్రునకు 'రత్నగర్భః' అని వ్యవహారము. ఈ హేతువు చేతనే రత్నాకరః అనియు సముద్రునకు వాడుక. ఆ సముద్రము - సముద్రశయనుడైన హరియొక్క విభూతియే.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 473🌹*

📚. Prasad Bharadwaj


*🌻 473. Ratnagarbhaḥ 🌻*


*OM Ratnagarbhāya namaḥ*


Ratnāni garbhabhūtāni yasyābdhestatsvarūpavān,

Ratnagarbha iti proktaḥ samudraśayano hariḥ.


रत्नानि गर्भभूतानि यस्याब्धेस्तत्स्वरूपवान् ।

रत्नगर्भ इति प्रोक्तः समुद्रशयनो हरिः ॥


As the ratnās or gems are in it's womb or at its bottom, the ocean is called ratnagarbhaḥ. Such oceans are the manifestations of Lord Hari Himself, who rests on the ocean.


🌻 🌻 🌻 🌻 🌻 

Source Sloka

स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥


స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥


Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

[12/08, 5:00 am] On Sriram**: *🌹 DAILY WISDOM - 151 🌹*

*🍀 📖  The Philosophy of Life 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 30. Consciousness is One 🌻*


Though the objects that are known in consciousness are different and of various kinds, consciousness is one. It is what integrates all sensations and perceptions into a coherent whole. 


If consciousness were a changing phenomenon, such a synthesis of knowledge would be impossible, and there would arise the contingency of introducing different consciousnesses at different times. Such consciousnesses, in order that their existences might be justified, may have to be known by another consciousness, which, after all, we have to admit as the real Self. 


That the Self is one, and not more than one, need not be proved, for no one ever feels that one is divided, that one is two or more. Everyone knows that one’s self cannot be cut or divided into segments but always retains its unity. Even supposing that the Self can be manifold, we would be led to the necessity of asserting a unitary consciousness knowing the difference between the parts assumed in the Self.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

[12/08, 5:00 am] On Sriram**: *🌹. దేవాపి మహర్షి బోధనలు - 125 🌹* 

✍️. సద్గురు కె. పార్వతి కుమార్

 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 


*🌻 102. ఒక సాధన 🌻*


కన్నులు మూసిగాని కన్నులు తెరచిగానీ ఒక రమ్యమగు దృశ్యమును ఊహించి చూచుట నేర్చుడు. అట్లే ఊహించి వినుట నేర్చుడు. ఉదాహరణకు కనులు మూసుకొని కైలాస పర్వతమును చూచుట, తిరుపతి వెంకటేశ్వరుని చూచుట, బెజవాడ కనకదుర్గను చూచుట యిత్యాది దూరపు ప్రాంతముల నున్న మనవారిని చూచుట. ఈ చూచుటలో వివరములు చూచుట కూడ చేయవలెను. 


ఇట్లే వినుట కూడ చేయవచ్చును. పరధ్యానమున కనపడుట, వినపడుట కన్న, నిర్దేశించి చూచుట, వినుట మిన్న అయిన విషయము. మొదటిది జబ్బు. అందు మన సంకల్పమేమీ లేదు. రెండవది దూరదృష్టి, దూరశ్రవణము. ఇట్లు అభ్యాసము గావించుట వలన మీ యందు దూరదృష్టి, దూరశ్రవణము ఏర్పడగలవు. పై విధముగ సూక్ష్మదేహమున నున్న నీ సభ్యులనుగాని, దివ్య దేహముననున్న ఒక దేవతనుగాని చూచుటకు ప్రయత్నించినచో క్రమముగ గురుదర్శనము, దైవదర్శనము కూడ కాగలదు. దీని వలన మీ మనస్సునకు అతీంద్రియ శక్తి పెరుగును. 


అందునకే ధ్యానమున, ఒకే రూపము నెప్పుడునూ చూచు అభ్యాసమీయబడినది. దీని కారణముగ వినపడనివి వినబడుట, కనబడనివి కనపడుట అను మరియొక సిద్ధి కలుగును.  ఇట్టి సాధనలకు ఓర్పు, నిరంతరత్వము చాల ముఖ్యము. శ్రద్ధ కూడ చాల అవసరము. ఈ మూడు గుణములతో సూక్ష్మలోకము, స్టూలలోకమంత నిజమై నిలచును. ఇది ఒక సాధన. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[12/08, 5:00 am] On Sriram**: *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 57 🌹*

✍️.  సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ


*🍀.  మరింత మరింతగా లోపలి తత్వంపై కేంద్రీకరించు. లోపల మరింతగా కాలాన్ని స్థలాన్ని సృష్టించు. అదంతా కేవలం గుర్తించాల్సిన విషయం. మెల్ల మెల్లగా నీ చైతన్యం నీ పక్కకు తిరిగుతుంది.   🍀*


ఎంతగా అహం మార్గాల్ని కనిపెడితే అంతగా స్వేచ్ఛగా వుంటావు. నువ్వు తెలుసుకునే కొద్దీ దాని కుట్రలు పని చెయ్యవు. యిది దృష్టిలో పెట్టుకుని మరింత మరింతగా లోపలి తత్వంపై కేంద్రీకరించు. లోపల మరింతగా కాలాన్ని స్థలాన్ని సృష్టించు. అదంతా కేవలం గుర్తించాల్సిన విషయం. మెల్ల మెల్లగా నీ చైతన్యం నీ పక్కకు తిరిగుతుంది. 


ఎప్పుడయితే నీకు నువ్వు ముఖాముఖి నిల్చుంటావో అప్పుడు నువ్వోక ఉన్నతమయిన విషయాన్ని, అపురూపమైన విషయాన్ని జీవితంలో సౌందర్య భరితమయిన అనుభవాన్ని పొందుతావు. ఆ ఎదుర్కొన్న అనుభవంతో సహజమైన దయ, కాంతివంత కారుణ్యం తొణికిసలాడుతాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

[12/08, 5:00 am] On Sriram**: *🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 300  / Sri Lalitha Chaitanya Vijnanam  - 300 🌹*

*సహస్ర నామముల తత్వ విచారణ*

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।*

*హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀*


*🌻 300. 'నామరూప వివర్జితా' 🌻* 


నామ రూపములను విసర్జించునది శ్రీమాత అని అర్థము. నామము (1). రూపము (2). ఈ రెండునూ జగత్తు రూపములు. అనగా మార్పుచెందు రూపములు. వీనియందు సత్యము

నేతి బీరకాయలోని నేయి వంటిది. భౌతిక వ్యవహారమునకే నామము, రూపము అనుభవించు జీవుడు వీనికి భిన్నముగ నున్నాడు. అట్టి జీవునికన్న భిన్నముగ దైవముండును. 


జీవునికి స్వభావము మొదటి పొర. రూపము రెండవ పొర. నామము మూడవ పొర. రూపమున్న చోట నామ ముండును. రూపము లేనిచోట నామము లేదు. నామము లేక రూపము ఉండవచ్చును. పేరు పెట్టకముందు కూడ శిశువునకు రూపమున్నది కదా! ముందు రూపము, తరువాత నామము సృష్టి క్రమమున ఏర్పడినవి. రూపము, నామము లేకున్ననూ

స్వభావ రూపమున జీవుడుండ గలడు. ఈ స్వభావము దైవీ ఆసురీ మానవ స్వభావములుగ కూడ నుండవచ్చును. 


స్వభావమును దాటుట మూడు పొరలను దాటుట. అపుడుండునది 1) ఉండుట, 2) దాని వెలుగు, 3) దాని ఆనందము. ఈ మూడింటిని సత్ చిత్ ఆనంద అందురు (సచ్చిదానంద). సచ్చిదానందస్థితి సృష్టి యందు శ్రీమాత సహజ స్థితి. రూపమును దాల్చుట, నామమును ధరించుట ఆమె ఆవశ్యకతను బట్టి నిర్వర్తించు చుండును. ఇట్లు శ్రీదేవికి ఐదు రూపములున్నట్లు పెద్దలు తెలుపుదురు. 1) అస్థిత్వము లేక ఉండుట 2) వెలుగు 3) ఆనందము 4) రూపము 5) నామము. 


శ్రీదేవి కేది సహజ స్థితియో జీవుల స్థితి జేరుట సిద్ధి. వారు సామాన్యముగ నామమునందు, రూపమునందు, స్వభావము నందు బద్ధులై యుందురు. శ్రీదేవి నుపాసించుటలో 

తన్మయత్వము చెందగలిగినచో భ్రమర కీటక న్యాయమున వారును సచ్చిదానంద స్థితిని పొందగలరు. నిజమునకు స్వభావ ప్రభావము వీడినచో జీవుడు కూడ సచ్చిదానంద రూపుడే. 


“శ్రీమాత సచ్చిదానంద స్వరూపిణి. ఆమె నామరూపములను విసర్జించి వెలుగై ఆనందముగ నున్నది. నేనునూ సచ్చిదానంద స్వరూపుడనే. నా నామ రూపములు తాత్కాలికములు. నా స్వభావమునే నేర్పరచుకొన్నది. వీరిని విసర్జించి దేవి పద సాన్నిధ్యమున చేరి సచ్చిదానంద రూపుడుగనే ఆమెను ఆరాధింతునుగాక!” అని సంకల్పించుకొని శ్రీమాత నారాధింపుడు. సర్వము శుభంకరము కాగలదు. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 300 🌹*

*1000 Names of Sri Lalitha Devi* 

✍️. Ravi Sarma 

📚. Prasad Bharadwaj


*🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |

hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀*


*🌻 300. Nāma-rūpa-vivarjitā नाम-रूप-विवर्जिता (300) 🌻*


She is without name (nāma) and form (rūpa). Vivarjitā means devoid.  She is beyond names and forms, an exclusive quality of the Brahman.  Every creation has two aspects. One is cit and another a-cit. Cit means the universal consciousness and a-cit means individual consciousness.  Both cit and a-cit are derived from the Supreme Consciousness or the divine consciousness.  Cit is again sub-divided into existence, knowledge and bliss.  The Brahman is the cause for these three.  


A-cit consists of nāma and rūpā (name and form) and this is opposed to cit in the sense, it does not represent the Brahman.  When the union of empirical “I” with the “I” consciousness of Śiva takes place, creation happens.  The derivatives of “I” consciousness of Śiva are existence, knowledge and bliss.  Name and form are the products of empirical consciousness.  Since the nāma says She is beyond nāma and rūpā (name and form), it is implied that She belongs to Cit, the Supreme Consciousness which is also known as the Brahman.  


Chāndogya Upaniṣad (VIII.14.1) says, “That which is described as space manifests names and forms. These names and forms are within Brahman.  Brahman is immortal.  It is the Self”.  Vāc Devi-s utilize every opportunity to mention Her as the Supreme Brahman.  The Brahman can be described either through negations or through affirmations.  Here the quality of the Brahman is described by negation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

 Om Sri Ram


ॐ ఓం నమః శివాయ ॐ 
ఓం శ్రీ మాత్రే నమః  ఓం శ్రీ దుర్గా దేవినే నమః 

 ఆ దుర్గా మాత ఆశీస్సులు మీ అందరికి ఉండాలని ఈ రోజు మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తూ శ్రీ లక్ష్మీ దేవి అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు .

జై దుర్గా మాతా
శుభ శుభోదయ శుభాభివందనములు
"సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే"

దుర్గాస్తోత్రం
----------------

విరాటనగరం రమ్యం - గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువ న్మనసా దేవీం - దుర్గాం త్రిభువనేశ్వరీం
యశోదాగర్భసంభూతాం - నారాయణవరప్రియాం
నందగోపకులే జాతాం మంగళాం కులవర్ధనీం
కంసవిద్రావణకరీం - అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం - ఆకాశం ప్రతి గామినీం
వాసుదేవస్య భగినీం - దివ్యమాల్యావిభూషితాం
దివ్యాంబరదరాం దేవీం - ఖడ్గఖేటక ధారీణీం
భారావతరణే పుణ్యే - యేస్మరంతి సదాశివాం
తా న్వై తారయతే పాపా - త్పంకేగా మివ దుర్బలాం
స్తోతుం ప్రచక్రమే భూయో - వివిధైః స్తోత్రసంభవైః
ఆమంట్ర్య దర్శనాకాంక్షీ - రాజా దేవీం సహానుజః
నమోస్తు వరదే కృష్ణే - కుమారి బ్రహ్మచారిణి!
బాలార్కసదృశాకారే - పూర్ణచంద్రనిభాననే
చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే
మయూరపంఛవలయే కేయూరాంగదధారిణి
భాసి దేవి యథా పద్మా - నారాయణపరిగ్రహః
స్వరూపం బ్రహ్మచర్యం చ - విశదం తవ ఖేచరి
కృష్ణచ్ఛవిసమా కృష్ణా - సంకర్షణసమాననా
బిభ్రతీ విపులై బాహూ - శక్రధ్వజసముచ్ఛ్రయౌ
పాత్రీ చ పంకజీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ యా భువి
పాశం ధను ర్మహాచక్రం వివిధా న్యాయుధాని చ
కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం - కర్ణాభ్యాం చ విభూషితాః!
చంద్రవిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే
ముకుటేన విచిత్రేణ - కేశబంధేన శోభినా
భుజంగాభోగవాసేన - శ్రోణీసూత్రేణ రాజతా
భ్రాజసే చావబద్ధేన - భోగేనే వేహ మందరః
ధ్వజేన శిఖిపింఛానా - ముచ్ఛ్రి తేన విరాజసే
కౌమారం వ్రత మాస్థాయ - త్రిదివం పావితం త్వయా
తేన త్వం స్తూయసే దేవి - త్రిదశైః పూజ్యసే పి చ
త్రైలోక్యరక్షణార్థాయ - మహిషాసురనాశిని
ప్రసన్నా మే సుర జ్యేష్ఠే - దయాం కురు శివా భవ
జయా త్వం విజయా చైవ - సంగ్రామే చ జయప్రదా
మమా పి విజయం దేహి - వరదా త్వం చ సాంప్రతం
వింధ్యే చైవ నగశ్రేష్ఠే - తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి - సీధుమాంసపశుప్రియే
కృపానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణీ
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః
ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి
న తేషాం దుర్లభం కించిత్ - పుత్రతో ధనతో పి వా
దుర్గా త్తారయస్తే దుర్గే త త్త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారే ష్వవసన్నానాం - మగ్నానాం చ మహార్ణవే
దస్యుభి ర్వా నిరుద్ధానాం - త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారే ష్వటవీషు చ
యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తి శ్శ్రీర్ ధృతి స్సిద్ధిః - హ్రీ ర్వి ద్యా సంతతి ర్మతిః
సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా - జ్యోత్స్నాకాంతిః క్షమా దయా
నృణాం చ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సో హం రాజ్యా త్పరిభ్రష్టః - శరణం త్వాం ప్రపన్నవాన్
ప్రణత శ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి - సత్యే సత్యా భవస్వ నః
శరణం భవమే దుర్గే - శరణ్యే భక్తవత్సలే
ఏవం స్తుతా హిసా దేవీ - దర్శయామాస పాండవం
ఉపగమ్య తు రాజాన - మిదం వచన మబ్రవీత్
శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో
భవిష్య త్యచిరా దేవ - సంగ్రామే విజయ స్తవ
మమ ప్రసాదా న్నిర్జిత్య హ్త్వా కౌరవవాహినీం
రాజ్యం నిష్కంటకం కృత్వా - భోక్ష్యసే మేదినీం పునః
భాత్రృభి స్సహితో రాజన్ - ప్రీతిం ప్రాప్స్యసి పుష్కాలాం
మత్ప్రసాదా చ్ఛ తే సౌఖ్య - మారోగ్యం చ భవిష్యతి
యే చ సంకీర్తయిష్యంతి - లోకే విగతకల్మషాః
తేషాం తుష్టా ప్రదాస్యామి - రాజ్య మాయు ర్వపు స్సుతం
ప్రవాసే నగరే చాపి - సంగ్రామే శత్రుసంకటే
అటవ్యాం దుర్గకాంతారే - గహనే జలధౌ గిరౌ
యే స్మరిష్యంతి మాం రాజన్ య థాహం భవతా స్మృతా
న తేషాం దుర్లభం కించి - దస్మిన్ లోకే భవిష్యతి

య ఇదం పరమ స్తోత్రం - శృణుయా ద్వా పఠేత వా
తస్య సర్వాణి కార్యాణి - సిద్ధిం  యాస్యంతి పాండవాః
మత్ప్రసాదా చ్చ వ స్సర్వాన్ - విరాటనగరే స్థితాన్
న ప్రఙ్ఞాస్యంతి కురవో - నరా వా తన్నివాసినః
ఇత్యుక్త్వా వరదా దేవీ - యుధిష్ఠిర మరిందమం
రక్షాం కృత్వా చ పాండూనాం - తత్రై వాంతరధీయత
ఇతి దుర్గా స్తోత్రం సర్వవ్యాధి హరం.