Wednesday, 11 August 2021

12++08--2021


  

 ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఈ అల్లరి చేతలు  ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా  సాంబశివా సాంబశివా

అలల తోటి గంగ పట్టి  తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా సాంబశివా సాంబశివా

తోలు గట్టి పటకాగా కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా  సాంబశివా సాంబశివా

*******

సృష్టి, ప్రపంచం, దేవుడు, జ్ఞానం, అజ్ఞానం అన్నీ ఆ నేనును ఆశ్రయించుకునే ఉంటాయి !

_మిథ్య అంటే అవేవీ శాశ్వతంగా, స్థిరంగా నిలిచి ఉండేవి కావని, మరోదానిపై ఆధారపడినవనీ దానిఉద్దేశ్యం. "అయమాత్మాబ్రహ్మ" అనే మహా వాఖ్యములో నేను, ఆత్మ బ్రహ్మమేనని చెప్తున్నారు. అంటే జీవుడు, ఈశ్వరుడు అబేధమైన బ్రహ్మమేనని గుర్తించమని ఈ వాక్యం చెప్తుంది. బ్రహ్మమంటే అఖండానంద స్థితి. సత్యం తెలుసుకున్న తర్వాత కలిగే ఈ అఖండానందంలో జీవుడు, దేవుడు లయం అవుతారు. భిన్నభావన ఉండదు. తాను కానిది, తనకు భిన్నమైనది ఏదీ సత్యదృష్టిలో కనిపించదు. ఉదయం లేవగానే మనందరికీ వచ్చే తొలి భావన "నేను" ఆ తలంపు  వచ్చాకే మనకు ఇవన్నీ వస్తున్నాయి, అందుచేత ఈ సృష్టి, ప్రపంచం, దేవుడు, జ్ఞానం, అజ్ఞానం అన్నీ ఆ నేనును ఆశ్రయించుకునే ఉంటాయి ! అది తెలిస్తే అదే సత్యమైన "నేను" ("I am That I am") లేకుంటే అదే"మిధ్యా నేను" ఇహంలోకి తీస్కుపోతుంది.

******


అయోనిజ, కారణజన్మురాలు, పాండవుల పత్ని.
 "అతి రూపవతి భార్యాశతు్రః" అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.
సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది.

ద్రౌపది అయోనిజ. కారణజన్మురాలు. కోకిలాదేవి- పాంచాల ప్రభువు ద్రుపదులకు అగ్నిగుండంలో జన్మించిన పుత్రిక. సహోదరుడే దృష్టద్యుమ్నుడు.
వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్ణం కలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించేది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక కన్య, సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది.
ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య - ఇంద్రసేన. మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు.
రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా పతి అని ఐదుసార్లు కోరింది.
తరువాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు.

ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమె ఆ అయిదుగురు సోదరులనూ
 పెళ్ళి చేసుకోవలసి వచ్చింది.
ఆ తర్వాత వారు పాండుకుమారులని ఆమెకు తెలిసింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రఛ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని,
 శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు.

వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు.
 
అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు
. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవల్సివచ్చింది.
ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు.

పాండవధర్మపత్నిగా జీవితం సాగించింది. "అతిరూపవతీ భార్యా, శతు్రః" అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.
చివరి రోజైన 18వ నాడే దుర్యోధనుడు భీముని గదాఘాతానికి బలయ్యాడు. అశ్వత్థామ కారణంగా తుదకు సుత సోదరమరణశోకమును ద్రౌపది భరించాల్సి వచ్చింది. ఆమె ఉదాత్తగంభీరవ్యక్తిత్వము ఎవరి ద్రుష్టినైనా ఆకర్షించగలవు. ఎంతో మెప్పును పొందగలవు. ధన్యజీవి ద్రౌపది, మహాసాధ్వి!

 

 *గర్వం*

🍁🍁🍁

 🌷🌷ఆహారం🌷🌷
                                             
👏అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు మనలోని జీవశక్తి ని పెంపొందించేది అన్నం. 
           
 అయితే, ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి వడ్డిస్తున్నారన్న విషయం కూడా చాలా ముఖ్యమైనది.

🥀🌹అందు వలననే పూర్వకాలంలో  మడి, ఆచారాల విషయంలో
 ఖచ్చితంగా వుండేవారు.

🌹🌿మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన
దోషాలు నిమిడివున్నాయి.
🥬అర్ధ దోషం ,.                                       🌻 నిమిత్త దోషం.                 
🌺స్ధాన దోషం,                      🌷గుణ దోషం ,             
🌹సంస్కార దోషం.  ఈ ఐదు
దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.

🌸 *అర్ధ దోషం:*

ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు.
భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు . భోజనం చేసి , సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.
ఆ గదిలో నే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది ,
ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద
 సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు మరునాడు పూజా సమయంలో తను చేసిన
పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు. తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్ధం చేసుకున్నాడు. వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు.  శిష్యుడిని   ఎలాటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు.
శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు. "అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బు తో కొన్న పదార్థాలతో , తయారు చేసిన  ఆహారం భుజించడమే అర్ధ దోషం. మనం న్యాయం గా సంపాదించిన దాని తోనే ఆహారం తయారు చేసుకుని , భుజించడం  ముఖ్యం.

*🌸నిమిత్త దోషం🌸*

 మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారైవుఇంటికి వారు సత్యశీలత కలిగి
దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగిన వారిగా వుండాలి. వండిన  ఆహారాన్ని క్రిమికీటకాలు , పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు.

🌹🥀అపరి శుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి
దుష్ట గుణాలు అవతలివారికి  కలుగుతాయి.

🌺 భీష్మాచార్యుల వారు కురు క్షేత్ర యుధ్ధం లో బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య
మీద  ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు.
వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు.

🍁🌾అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది.ఇప్పుడు ఇంత వివేకం గా ఆలోచిస్తున్న భీష్ముడు
ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ,ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది.
🌸🌿ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు 'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో 
వారిచ్చిన ఆహారం భుజిస్తూ  వచ్చాను. నా స్వీయ బుధ్ధిని ఆ ఆ ఆహారం  తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం బిందువులుగా బయటికి పోయి, నేను ఇప్పుడు పవిత్రుడినైనాను నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను. అన్నాడు భీష్ముడు.

🌻🌿చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  తినినందు వలన  మనిషిలోని మంచి గుణములు నశించి
'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది.
*🌸స్ధాన దోషం*
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి
వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది.
యుధ్ధరంగానికి , కోర్టులు ,రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు.

🥬🥀దుర్యోధనుడు  ఒకసారి యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు.
కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణు ని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొట్రుపాటు పడిఅరటి పండుతొక్క  ఒలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని  అందించింది.కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్య వైపు కోపంగా చూశాడు.

కృష్ణుడు,  " విదురా!  నేను ఆప్యాయత తో కూడిన ప్రేమకోసమే ఎదురుచూస్తున్నాను. నిజమైన శ్రధ్ధాభక్తులతో యిచ్చినది అది కాయైనా ,  పండైనా, ఆకైనా,  నీరైనా, ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను.' అని అన్నాడు. మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి.

*🌻గుణ దోషం :*

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి   సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని
కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది. తామస ఆహారం
        🌷సర్వేజనాః సుఖినోభవంతు🌷


 [12/08, 5:00 am] On Sriram**: *🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 76 🌹*

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 

📚. ప్రసాద్ భరద్వాజ 


*🌴. ద్వితీయ అధ్యాయము -  సాంఖ్య యోగము - 29 🌴*


29. ఆశ్చర్యవత్ పశ్యతి కష్చిదేనమ్ ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్య: |

ఆశ్చర్యవచ్చైనమన్య: శ్రుణోతి శ్రుత్వాప్యేనం వేదం న చైవ కశ్చిత్ ||


*🌷. తాత్పర్యం :*

కొందరు ఆత్మను అధ్బుతమైనదానిగా గాంచుదురు. కొందరు దానిని అధ్బుతమైన దానిగా వర్ణింతురు. మరికొందరు దానిని అధ్బుతమైనదానిగా శ్రవణము చేయుదురు. ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏ మాత్రము తెలియకుందురు.


*🌷. భాష్యము :*

అధికపరిమాణ దేహము గల జంతువునందు మరియు ఘనమైన అశ్వత్థవృక్షమునందే గాక, ఒక అంగుళమాత్ర స్థలములో కోట్లాది సంఖ్యలో నుండు సూక్ష్మజీవుల యందును ఆత్మ ఉన్నదనెడు విషయము నిక్కముగా అధ్బుతమైనది. అల్పజ్ఞులు మరియు తపోనిష్ట లేనివారు ఇట్టి ఆత్మ యొక్క అధ్బుతకర్మలను తెలియకున్నారు. విశ్వమునందు తొలిజీవియైన బ్రహ్మదేవునకు సైతము జ్ఞానము ప్రసాదించిన పరమప్రామణికుడైన శ్రీకృష్ణభగవానుడే స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయమును గ్రహింపజాలరు. 


కేవలము భౌతికభావనయే కలిగియుండుట వలన ఎట్లు అణుపరిమాణ ఆత్మ అతిపెద్దదిగా మరియు అతి చిన్నదిగా వర్తింపగలదో ఈ కాలపు జనులు ఊహింపజాలరు. కనుకనే వారు దాని నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అధ్బుతమైనదిగా గాంతురు. భౌతికశక్తిచే మోహమునకు గురియై జనులు ఇంద్రియభోగ విషయములందే అధికముగా రతులగుదురు. 


ఆత్మానుభవమును పొందకున్నచో కర్మలన్నియును జీవనసంఘర్షణలో అంత్యమున ఓటమినే కలుగజేయుననుట వాస్తవమైనను వారు దాని కొరకై సమయమును కేటాయింపరు. ప్రతియొక్కరు ఆత్మను గూర్చి తెలిసికొని తద్ద్వారా భౌతికక్లేశములను పరిష్కారము చూపవలెనని వారు బహుషా తెలిసియుండకపోవచ్చును.


ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సంగమున ప్రవచనములను వినుచుందురు. కాని కొన్నిమార్లు అజ్ఞానవశమున వారు ఆత్మ మరియు పరమాత్మ లిరివురును ఒక్కటే యనియు, వారివురి నడుమ పరిమాణమందును భేదము లేదనియు భావించి తప్పుమార్గమున చనుదురు. ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని, వారి కర్మల, వారి నడుమ గల సంబంధమును, వారికి సంబంధించిన విషయముల నన్నింటిని సంపూర్తిగా తెలిసిన మనుజుడు దుర్లభుడు. 


ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది, ఆత్మ యొక్క స్థానమును వివిధకోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత దుర్లభుడు. కాని ఏదియో ఒక విధముగా ఈ ఆత్మను గుర్చిన విషయమును మనుజుడు అవగతము చేసికొనినచో జన్మ సఫలము కాగలదు.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 76 🌹*

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 

📚. Prasad Bharadwaj 


*🌴 Chapter 2 - Sankhya Yoga - 29 🌴*


29. āścarya-vat paśyati kaścid enam

āścarya-vad vadati tathaiva cānyaḥ

āścarya-vac cainam anyaḥ śṛṇoti

śrutvāpy enaṁ veda na caiva kaścit


*🌻 Translation :*

Some look on the soul as amazing, some describe him as amazing, and some hear of him as amazing, while others, even after hearing about him, cannot understand him at all.


*🌻 Purport :*

The fact that the atomic soul is within the body of a gigantic animal, in the body of a gigantic banyan tree, and also in the microbic germs, millions and billions of which occupy only an inch of space, is certainly very amazing. 


Men with a poor fund of knowledge and men who are not austere cannot understand the wonders of the individual atomic spark of spirit, even though it is explained by the greatest authority of knowledge, who imparted lessons even to Brahmā, the first living being in the universe. 


Owing to a gross material conception of things, most men in this age cannot imagine how such a small particle can become both so great and so small. So men look at the soul proper as wonderful either by constitution or by description.


Illusioned by the material energy, people are so engrossed in subject matters for sense gratification that they have very little time to understand the question of self-understanding, even though it is a fact that without this self-understanding all activities result in ultimate defeat in the struggle for existence. Perhaps they have no idea that one must think of the soul, and thus make a solution to the material miseries.

🌹 🌹 🌹 🌹 🌹

[12/08, 5:00 am] On Sriram**: *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 473 / Vishnu  Sahasranama Contemplation - 473🌹*

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻 473. రత్నగర్భః, रत्नगर्भः, Ratnagarbhaḥ 🌻*


*ఓం రత్నగర్భాయ నమః | ॐ रत्नगर्भाय नमः | OM Ratnagarbhāya namaḥ*



రత్నాని గర్భభూతాని యస్యాబ్ధేస్తత్స్వరూపవాన్ ।

రత్నగర్భ ఇతి ప్రోక్తః సముద్రశయనో హరిః ॥


రత్నములు ఉదరస్థ శిశువులుగా ఈతనికి కలవనే వ్యుత్పత్తి చే సముద్రునకు 'రత్నగర్భః' అని వ్యవహారము. ఈ హేతువు చేతనే రత్నాకరః అనియు సముద్రునకు వాడుక. ఆ సముద్రము - సముద్రశయనుడైన హరియొక్క విభూతియే.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 473🌹*

📚. Prasad Bharadwaj


*🌻 473. Ratnagarbhaḥ 🌻*


*OM Ratnagarbhāya namaḥ*


Ratnāni garbhabhūtāni yasyābdhestatsvarūpavān,

Ratnagarbha iti proktaḥ samudraśayano hariḥ.


रत्नानि गर्भभूतानि यस्याब्धेस्तत्स्वरूपवान् ।

रत्नगर्भ इति प्रोक्तः समुद्रशयनो हरिः ॥


As the ratnās or gems are in it's womb or at its bottom, the ocean is called ratnagarbhaḥ. Such oceans are the manifestations of Lord Hari Himself, who rests on the ocean.


🌻 🌻 🌻 🌻 🌻 

Source Sloka

स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥


స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥


Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

[12/08, 5:00 am] On Sriram**: *🌹 DAILY WISDOM - 151 🌹*

*🍀 📖  The Philosophy of Life 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 30. Consciousness is One 🌻*


Though the objects that are known in consciousness are different and of various kinds, consciousness is one. It is what integrates all sensations and perceptions into a coherent whole. 


If consciousness were a changing phenomenon, such a synthesis of knowledge would be impossible, and there would arise the contingency of introducing different consciousnesses at different times. Such consciousnesses, in order that their existences might be justified, may have to be known by another consciousness, which, after all, we have to admit as the real Self. 


That the Self is one, and not more than one, need not be proved, for no one ever feels that one is divided, that one is two or more. Everyone knows that one’s self cannot be cut or divided into segments but always retains its unity. Even supposing that the Self can be manifold, we would be led to the necessity of asserting a unitary consciousness knowing the difference between the parts assumed in the Self.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

[12/08, 5:00 am] On Sriram**: *🌹. దేవాపి మహర్షి బోధనలు - 125 🌹* 

✍️. సద్గురు కె. పార్వతి కుమార్

 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 


*🌻 102. ఒక సాధన 🌻*


కన్నులు మూసిగాని కన్నులు తెరచిగానీ ఒక రమ్యమగు దృశ్యమును ఊహించి చూచుట నేర్చుడు. అట్లే ఊహించి వినుట నేర్చుడు. ఉదాహరణకు కనులు మూసుకొని కైలాస పర్వతమును చూచుట, తిరుపతి వెంకటేశ్వరుని చూచుట, బెజవాడ కనకదుర్గను చూచుట యిత్యాది దూరపు ప్రాంతముల నున్న మనవారిని చూచుట. ఈ చూచుటలో వివరములు చూచుట కూడ చేయవలెను. 


ఇట్లే వినుట కూడ చేయవచ్చును. పరధ్యానమున కనపడుట, వినపడుట కన్న, నిర్దేశించి చూచుట, వినుట మిన్న అయిన విషయము. మొదటిది జబ్బు. అందు మన సంకల్పమేమీ లేదు. రెండవది దూరదృష్టి, దూరశ్రవణము. ఇట్లు అభ్యాసము గావించుట వలన మీ యందు దూరదృష్టి, దూరశ్రవణము ఏర్పడగలవు. పై విధముగ సూక్ష్మదేహమున నున్న నీ సభ్యులనుగాని, దివ్య దేహముననున్న ఒక దేవతనుగాని చూచుటకు ప్రయత్నించినచో క్రమముగ గురుదర్శనము, దైవదర్శనము కూడ కాగలదు. దీని వలన మీ మనస్సునకు అతీంద్రియ శక్తి పెరుగును. 


అందునకే ధ్యానమున, ఒకే రూపము నెప్పుడునూ చూచు అభ్యాసమీయబడినది. దీని కారణముగ వినపడనివి వినబడుట, కనబడనివి కనపడుట అను మరియొక సిద్ధి కలుగును.  ఇట్టి సాధనలకు ఓర్పు, నిరంతరత్వము చాల ముఖ్యము. శ్రద్ధ కూడ చాల అవసరము. ఈ మూడు గుణములతో సూక్ష్మలోకము, స్టూలలోకమంత నిజమై నిలచును. ఇది ఒక సాధన. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[12/08, 5:00 am] On Sriram**: *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 57 🌹*

✍️.  సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ


*🍀.  మరింత మరింతగా లోపలి తత్వంపై కేంద్రీకరించు. లోపల మరింతగా కాలాన్ని స్థలాన్ని సృష్టించు. అదంతా కేవలం గుర్తించాల్సిన విషయం. మెల్ల మెల్లగా నీ చైతన్యం నీ పక్కకు తిరిగుతుంది.   🍀*


ఎంతగా అహం మార్గాల్ని కనిపెడితే అంతగా స్వేచ్ఛగా వుంటావు. నువ్వు తెలుసుకునే కొద్దీ దాని కుట్రలు పని చెయ్యవు. యిది దృష్టిలో పెట్టుకుని మరింత మరింతగా లోపలి తత్వంపై కేంద్రీకరించు. లోపల మరింతగా కాలాన్ని స్థలాన్ని సృష్టించు. అదంతా కేవలం గుర్తించాల్సిన విషయం. మెల్ల మెల్లగా నీ చైతన్యం నీ పక్కకు తిరిగుతుంది. 


ఎప్పుడయితే నీకు నువ్వు ముఖాముఖి నిల్చుంటావో అప్పుడు నువ్వోక ఉన్నతమయిన విషయాన్ని, అపురూపమైన విషయాన్ని జీవితంలో సౌందర్య భరితమయిన అనుభవాన్ని పొందుతావు. ఆ ఎదుర్కొన్న అనుభవంతో సహజమైన దయ, కాంతివంత కారుణ్యం తొణికిసలాడుతాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

[12/08, 5:00 am] On Sriram**: *🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 300  / Sri Lalitha Chaitanya Vijnanam  - 300 🌹*

*సహస్ర నామముల తత్వ విచారణ*

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।*

*హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀*


*🌻 300. 'నామరూప వివర్జితా' 🌻* 


నామ రూపములను విసర్జించునది శ్రీమాత అని అర్థము. నామము (1). రూపము (2). ఈ రెండునూ జగత్తు రూపములు. అనగా మార్పుచెందు రూపములు. వీనియందు సత్యము

నేతి బీరకాయలోని నేయి వంటిది. భౌతిక వ్యవహారమునకే నామము, రూపము అనుభవించు జీవుడు వీనికి భిన్నముగ నున్నాడు. అట్టి జీవునికన్న భిన్నముగ దైవముండును. 


జీవునికి స్వభావము మొదటి పొర. రూపము రెండవ పొర. నామము మూడవ పొర. రూపమున్న చోట నామ ముండును. రూపము లేనిచోట నామము లేదు. నామము లేక రూపము ఉండవచ్చును. పేరు పెట్టకముందు కూడ శిశువునకు రూపమున్నది కదా! ముందు రూపము, తరువాత నామము సృష్టి క్రమమున ఏర్పడినవి. రూపము, నామము లేకున్ననూ

స్వభావ రూపమున జీవుడుండ గలడు. ఈ స్వభావము దైవీ ఆసురీ మానవ స్వభావములుగ కూడ నుండవచ్చును. 


స్వభావమును దాటుట మూడు పొరలను దాటుట. అపుడుండునది 1) ఉండుట, 2) దాని వెలుగు, 3) దాని ఆనందము. ఈ మూడింటిని సత్ చిత్ ఆనంద అందురు (సచ్చిదానంద). సచ్చిదానందస్థితి సృష్టి యందు శ్రీమాత సహజ స్థితి. రూపమును దాల్చుట, నామమును ధరించుట ఆమె ఆవశ్యకతను బట్టి నిర్వర్తించు చుండును. ఇట్లు శ్రీదేవికి ఐదు రూపములున్నట్లు పెద్దలు తెలుపుదురు. 1) అస్థిత్వము లేక ఉండుట 2) వెలుగు 3) ఆనందము 4) రూపము 5) నామము. 


శ్రీదేవి కేది సహజ స్థితియో జీవుల స్థితి జేరుట సిద్ధి. వారు సామాన్యముగ నామమునందు, రూపమునందు, స్వభావము నందు బద్ధులై యుందురు. శ్రీదేవి నుపాసించుటలో 

తన్మయత్వము చెందగలిగినచో భ్రమర కీటక న్యాయమున వారును సచ్చిదానంద స్థితిని పొందగలరు. నిజమునకు స్వభావ ప్రభావము వీడినచో జీవుడు కూడ సచ్చిదానంద రూపుడే. 


“శ్రీమాత సచ్చిదానంద స్వరూపిణి. ఆమె నామరూపములను విసర్జించి వెలుగై ఆనందముగ నున్నది. నేనునూ సచ్చిదానంద స్వరూపుడనే. నా నామ రూపములు తాత్కాలికములు. నా స్వభావమునే నేర్పరచుకొన్నది. వీరిని విసర్జించి దేవి పద సాన్నిధ్యమున చేరి సచ్చిదానంద రూపుడుగనే ఆమెను ఆరాధింతునుగాక!” అని సంకల్పించుకొని శ్రీమాత నారాధింపుడు. సర్వము శుభంకరము కాగలదు. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 300 🌹*

*1000 Names of Sri Lalitha Devi* 

✍️. Ravi Sarma 

📚. Prasad Bharadwaj


*🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |

hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀*


*🌻 300. Nāma-rūpa-vivarjitā नाम-रूप-विवर्जिता (300) 🌻*


She is without name (nāma) and form (rūpa). Vivarjitā means devoid.  She is beyond names and forms, an exclusive quality of the Brahman.  Every creation has two aspects. One is cit and another a-cit. Cit means the universal consciousness and a-cit means individual consciousness.  Both cit and a-cit are derived from the Supreme Consciousness or the divine consciousness.  Cit is again sub-divided into existence, knowledge and bliss.  The Brahman is the cause for these three.  


A-cit consists of nāma and rūpā (name and form) and this is opposed to cit in the sense, it does not represent the Brahman.  When the union of empirical “I” with the “I” consciousness of Śiva takes place, creation happens.  The derivatives of “I” consciousness of Śiva are existence, knowledge and bliss.  Name and form are the products of empirical consciousness.  Since the nāma says She is beyond nāma and rūpā (name and form), it is implied that She belongs to Cit, the Supreme Consciousness which is also known as the Brahman.  


Chāndogya Upaniṣad (VIII.14.1) says, “That which is described as space manifests names and forms. These names and forms are within Brahman.  Brahman is immortal.  It is the Self”.  Vāc Devi-s utilize every opportunity to mention Her as the Supreme Brahman.  The Brahman can be described either through negations or through affirmations.  Here the quality of the Brahman is described by negation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

 Om Sri Ram


ॐ ఓం నమః శివాయ ॐ 
ఓం శ్రీ మాత్రే నమః  ఓం శ్రీ దుర్గా దేవినే నమః 

 ఆ దుర్గా మాత ఆశీస్సులు మీ అందరికి ఉండాలని ఈ రోజు మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తూ శ్రీ లక్ష్మీ దేవి అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు .

జై దుర్గా మాతా
శుభ శుభోదయ శుభాభివందనములు
"సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే"

దుర్గాస్తోత్రం
----------------

విరాటనగరం రమ్యం - గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువ న్మనసా దేవీం - దుర్గాం త్రిభువనేశ్వరీం
యశోదాగర్భసంభూతాం - నారాయణవరప్రియాం
నందగోపకులే జాతాం మంగళాం కులవర్ధనీం
కంసవిద్రావణకరీం - అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం - ఆకాశం ప్రతి గామినీం
వాసుదేవస్య భగినీం - దివ్యమాల్యావిభూషితాం
దివ్యాంబరదరాం దేవీం - ఖడ్గఖేటక ధారీణీం
భారావతరణే పుణ్యే - యేస్మరంతి సదాశివాం
తా న్వై తారయతే పాపా - త్పంకేగా మివ దుర్బలాం
స్తోతుం ప్రచక్రమే భూయో - వివిధైః స్తోత్రసంభవైః
ఆమంట్ర్య దర్శనాకాంక్షీ - రాజా దేవీం సహానుజః
నమోస్తు వరదే కృష్ణే - కుమారి బ్రహ్మచారిణి!
బాలార్కసదృశాకారే - పూర్ణచంద్రనిభాననే
చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే
మయూరపంఛవలయే కేయూరాంగదధారిణి
భాసి దేవి యథా పద్మా - నారాయణపరిగ్రహః
స్వరూపం బ్రహ్మచర్యం చ - విశదం తవ ఖేచరి
కృష్ణచ్ఛవిసమా కృష్ణా - సంకర్షణసమాననా
బిభ్రతీ విపులై బాహూ - శక్రధ్వజసముచ్ఛ్రయౌ
పాత్రీ చ పంకజీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ యా భువి
పాశం ధను ర్మహాచక్రం వివిధా న్యాయుధాని చ
కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం - కర్ణాభ్యాం చ విభూషితాః!
చంద్రవిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే
ముకుటేన విచిత్రేణ - కేశబంధేన శోభినా
భుజంగాభోగవాసేన - శ్రోణీసూత్రేణ రాజతా
భ్రాజసే చావబద్ధేన - భోగేనే వేహ మందరః
ధ్వజేన శిఖిపింఛానా - ముచ్ఛ్రి తేన విరాజసే
కౌమారం వ్రత మాస్థాయ - త్రిదివం పావితం త్వయా
తేన త్వం స్తూయసే దేవి - త్రిదశైః పూజ్యసే పి చ
త్రైలోక్యరక్షణార్థాయ - మహిషాసురనాశిని
ప్రసన్నా మే సుర జ్యేష్ఠే - దయాం కురు శివా భవ
జయా త్వం విజయా చైవ - సంగ్రామే చ జయప్రదా
మమా పి విజయం దేహి - వరదా త్వం చ సాంప్రతం
వింధ్యే చైవ నగశ్రేష్ఠే - తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి - సీధుమాంసపశుప్రియే
కృపానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణీ
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః
ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి
న తేషాం దుర్లభం కించిత్ - పుత్రతో ధనతో పి వా
దుర్గా త్తారయస్తే దుర్గే త త్త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారే ష్వవసన్నానాం - మగ్నానాం చ మహార్ణవే
దస్యుభి ర్వా నిరుద్ధానాం - త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారే ష్వటవీషు చ
యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తి శ్శ్రీర్ ధృతి స్సిద్ధిః - హ్రీ ర్వి ద్యా సంతతి ర్మతిః
సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా - జ్యోత్స్నాకాంతిః క్షమా దయా
నృణాం చ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సో హం రాజ్యా త్పరిభ్రష్టః - శరణం త్వాం ప్రపన్నవాన్
ప్రణత శ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి - సత్యే సత్యా భవస్వ నః
శరణం భవమే దుర్గే - శరణ్యే భక్తవత్సలే
ఏవం స్తుతా హిసా దేవీ - దర్శయామాస పాండవం
ఉపగమ్య తు రాజాన - మిదం వచన మబ్రవీత్
శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో
భవిష్య త్యచిరా దేవ - సంగ్రామే విజయ స్తవ
మమ ప్రసాదా న్నిర్జిత్య హ్త్వా కౌరవవాహినీం
రాజ్యం నిష్కంటకం కృత్వా - భోక్ష్యసే మేదినీం పునః
భాత్రృభి స్సహితో రాజన్ - ప్రీతిం ప్రాప్స్యసి పుష్కాలాం
మత్ప్రసాదా చ్ఛ తే సౌఖ్య - మారోగ్యం చ భవిష్యతి
యే చ సంకీర్తయిష్యంతి - లోకే విగతకల్మషాః
తేషాం తుష్టా ప్రదాస్యామి - రాజ్య మాయు ర్వపు స్సుతం
ప్రవాసే నగరే చాపి - సంగ్రామే శత్రుసంకటే
అటవ్యాం దుర్గకాంతారే - గహనే జలధౌ గిరౌ
యే స్మరిష్యంతి మాం రాజన్ య థాహం భవతా స్మృతా
న తేషాం దుర్లభం కించి - దస్మిన్ లోకే భవిష్యతి

య ఇదం పరమ స్తోత్రం - శృణుయా ద్వా పఠేత వా
తస్య సర్వాణి కార్యాణి - సిద్ధిం  యాస్యంతి పాండవాః
మత్ప్రసాదా చ్చ వ స్సర్వాన్ - విరాటనగరే స్థితాన్
న ప్రఙ్ఞాస్యంతి కురవో - నరా వా తన్నివాసినః
ఇత్యుక్త్వా వరదా దేవీ - యుధిష్ఠిర మరిందమం
రక్షాం కృత్వా చ పాండూనాం - తత్రై వాంతరధీయత
ఇతి దుర్గా స్తోత్రం సర్వవ్యాధి హరం.

No comments:

Post a Comment