Thursday, 12 March 2026


ప్రాంజలి ప్రభ..తెలుగు పద్యం.. భావ సూక్తులు 


(01) : తే.గీ.

నలుగురిని నమ్ము వాక్కే నరుని నిజము

పక్వమగు మాటలే యగు పరమ పూజ

సత్యధర్మములతో బుద్ధి సమయ సాగు

కక్షలేని కలిసిమాట గమ్య జీవి

భావం

నలుగురు నమ్మే వాక్కు మనిషి నిజమైన మహత్తు.

పక్వమైన మాటలు పూజలతో సమానం.

సత్యధర్మాలను బుద్ధితో సమయానుగుణంగా ఆచరించాలి.

కక్షలేకుండా కలసి మాట్లాడగలవాడు జీవన గమ్యాన్ని చేరుతాడు.


: 002..తే. గీ 

లక్షణము లాలి కామ్యము లలిత గుణము;

భిక్ష వేయు కరుణతీరు భేదమాప;

శిక్ష శుద్ధి చేయు జ్ఞాన శ్రేయమగుట;

కక్ష లేనితనము జీవకాల రీతి.

భావం

మంచి లక్షణాలు, లలిత గుణాలు మనిషిని అందంగా తీర్చిదిద్దుతాయి.

భిక్ష లేదా దానం కరుణను చూపి భేదాలను తగ్గిస్తుంది.

శిక్ష దోషాలను సరిచేసి జ్ఞానం ద్వారా శ్రేయస్సును ఇస్తుంది.

కక్షలేని స్వభావం జీవితాన్ని సాఫీగా నడిపించే మార్గం.

🌿

ఈ సూక్తి చెప్పే సారం —

సద్గుణం, కరుణ, శుద్ధి, కక్షలేని హృదయం — ఇవే మానవ జీవన సౌందర్యం.


[003. : ఆ.వె.

రక్షణముగ బ్రతుకు రక్ష రూప్యములేల?

రక్ష ద్రుంచునపుడు రమ్యతేల?

రక్ష చేయునపుడు ప్రీతి నిజూపుము

రక్ష చింతలెక్కు రంగు శిక్ష.

భావం

రక్షణ లేకుండా సంపదలు (రూప్యములు) ఉన్నా జీవితం సురక్షితం కాదు.

రక్షణ లేకపోతే జీవన సౌందర్యం కూడా ఉండదు.

ఎవరినైనా రక్షించే సందర్భంలో నిజమైన ప్రేమ, కరుణ చూపాలి.

రక్షణ గురించి ఆలోచించకపోతే తరువాత వచ్చే ఫలితం శిక్షలాంటిదే.

ప్రత్యేకత

🌿 నీతి భావం

రక్షణ – కరుణ – బాధ్యత అనే మూడు విలువలను సూచిస్తుంది.


: 004. తే. గీ.

స్వచ్ఛతే సంఘజీవికి సత్య సాక్షి;

ఇచ్చ తీర్చు బుద్ధిగనౌను జీవన బల

రచ్చలేని మార్గముమెంచ రమ్య గమ్య

మచ్చలేని జీవనమౌను మానస నిధి.

భావం

స్వచ్ఛత సంఘజీవికి సత్యానికి సాక్షి.

బుద్ధితో అవసరాలు తీర్చుకోవడం జీవన బలం.

కలహరహిత మార్గం రమ్యమైన గమ్యాన్ని ఇస్తుంది.

మచ్చలేని జీవితం మనసుకు నిజమైన నిధి.

ఈ సూక్తి సారం:

స్వచ్ఛత + బుద్ధి + కలహరహిత జీవనం + నిర్దోష జీవితం = మానసిక సంపద.


005... ఆ.వె.

మహిళ దేవతగను మహికి తరువుగాను

ఇంటి వెల్పు ఆమె ఇచ్చ జగతినందు

లోక మనుగడకది లౌక్య సారథిగాను

మానస నిధి జాతి మార్గ మెరుపు.

భావం

మహిళ భూమికి దేవతలాంటి శక్తి.

ఇంటికి వెలుగు ఇచ్చే ఆధారం.

లోకమనుగడను నడిపించే లౌక్యసారథి.

జాతి మార్గాన్ని ప్రకాశింపజేసే మానస నిధి.

ఈ సూక్తి సారం:

స్త్రీ ఇంటి వెలుగు మాత్రమే కాదు; సమాజానికి మార్గదర్శి, జాతికి మెరుపు.


 006.  (ఆ.వె.)**

ఇం తి తన్మయమ్ము శూత్ర జీవన గమ్య

దు రిత ధర్మ మౌనుగరుణ జూపు

మ దన వైరి కాల మహిమ పరంబుగా

తి రము గొలువ తృప్తి దివ్య దీప్తి

భావం

1వ పాదం (ఇం)

ఇంటి జీవితం పట్ల తన్మయత్వం ఉండాలి. అదే జీవన గమ్యానికి ఒక సూత్రంలాంటిది.

2వ పాదం (దు)

దురితాలను తొలగించేది ధర్మం, మౌనం, కరుణ. ఇవే జీవన శాంతికి మార్గాలు.

3వ పాదం (మ)

కామవికారాలను జయించి కాల మహిమను గ్రహించినవాడు ఉన్నతమైన స్థితిని చేరుతాడు.

4వ పాదం (తి)

అలాంటి జీవనంలో చివరకు తృప్తి అనే దివ్యమైన వెలుగు మనసులో నిలుస్తుంది.

✅ సారాంశం:

ఇంటి జీవనాన్ని ధర్మం, కరుణతో నడిపి, కామవికారాలను జయించినవాడికి చివరకు తృప్తి అనే దివ్య ప్రకాశం లభిస్తుంది.

 007. తే. గీ.

కావ్యమై వెలిగె కృషి కాలమందు

త్యాగమై నిలిచె తత్వ జీవనంబు

యత్నమే మనిషి యశస్సు దీపం

నిత్యమై నిలిచె మంచి పేరుగాదె.

భావం (సంక్షిప్తం):

సాధనతో చేసిన కృషి కావ్యంలా వెలుగుతుంది; త్యాగం జీవన తత్వాన్ని నిలబెడుతుంది; యత్నమే యశస్సు వెలిగించే దీపం; మంచి పేరు మాత్రం నిత్యంగా నిలుస్తుంది. ✍️


008..తే. గీ.

కావ్యమై వెలిగె కృషి కాల మార్గ

త్యాగమై నిలిచె నిజ తత్వ జీవ

యత్నమే మనిషి యశస్సు  యాస దీప

నిత్య  మంచియె పేరమే నిలిపె గీత

 – భావం

మనిషి చేసే కృషి కాలమార్గంలో ఒక కావ్యంలా వెలుగుతుంది.

అతని త్యాగం నిజమైన జీవన తత్వంగా నిలుస్తుంది.

యత్నమే మనిషి యశస్సును వెలిగించే దీపం.

అలా జీవించినవారికి మంచి పేరు నిత్యంగా నిలిచే గీతంలా అవుతుంది.

సారం: కృషి, త్యాగం, యత్నం — ఇవే మనిషికి శాశ్వతమైన మంచి పేరును ఇస్తాయి.


009.తే. గీ.

కావ్యమై కృషి వెలిగె లోకంలొ జపము

త్యాగమై తేజము పెరిగె తాప మనసు

యత్నమే యశమై మారె యాకలి యగు

నిత్యమై నిలిచెను మంచి నిర్మలంబు .

– భావం

లోకంలో కృషి ఒక కావ్యంలా ప్రకాశిస్తుంది; అది జపంలా నిరంతరం చేయాల్సింది.

త్యాగం మనసుకు తేజస్సు, తపస్సు వంటి శుద్ధిని ఇస్తుంది.

యత్నం కాలక్రమంలో యశస్సుగా మారుతుంది.

అలా జీవించినవారిలో మంచి నిర్మల స్వభావం నిత్యంగా నిలుస్తుంది.

సారం: కృషి జపంలాంటిది, త్యాగం తపస్సులాంటిది; యత్నం చివరికి యశస్సును ఇస్తుంది.


 010.

కృషియె కావ్యమైన వెలుగు కృపగ కరుణ తీరుగన్

త్యాగతత్వమౌను  నిలుప తక్షణమగు మూర్ఖతన్

యత్న మను యశస్సు దీప యానతి గాను కర్మగాన్ ,

మంచి పేరు నిత్య  నిలుప మానసంబు ధర్మమున్

భావం:

కృషి ఉంటే జీవితం కావ్యంలా వెలుగుతుంది;

కరుణ, కృపలు మనిషి స్వభావాన్ని మృదువుగా చేస్తాయి.

త్యాగ తత్వం ఉంటే మూర్ఖత్వం వెంటనే తొలగిపోతుంది.

యత్నమే యశస్సు వెలిగించే దీపం, అది కర్మరూపంలో ముందుకు నడిపిస్తుంది.

మంచి పేరు మాత్రం ధర్మంతో నిండిన మనసే నిత్యంగా నిలుపుతుంది.

సారం:

కృషి, కరుణ, త్యాగం, యత్నం, ధర్మం — ఇవే మనిషికి శాశ్వతమైన మంచి పేరును ఇస్తాయి. ✍️


011.తే. గీ 

నెగ్గు అనురక్తి ఫలముయే నిజము యెగ్గు 

నిగ్గు తేల్చ జయమునెంచ నెగ్గ ఒగ్గు 

నుగ్గు నుగ్గు మనసుననే నూన్య తగను 

మొగ్గు జూపమంచి విలువ మోక్ష మెరుపు

భావం

అనురక్తి (పట్టుదల) ఉంటేనే విజయం లభిస్తుంది.

సత్యాన్ని స్పష్టంగా గ్రహించి గెలుపు లక్ష్యంగా కృషి చేయాలి.

మనసులోని చిన్న చిన్న బలహీనతలను తొలగించాలి.

మంచిమార్గం వైపు మొగ్గు చూపితే జీవితం విలువైనదై మోక్షసుఖం వంటి ఆనందం కలుగుతుంది.

012.కం.

ప్రహసము కాని చరితమే 

సహనము ఆహరహముకాక శాంతిని సలుపున్ 

మహితలమన్నిక మానస 

*మహిళలదే రాజ్యమయ్య మహిలో జూడన్*!!

భావం:

హాస్యంగా కాకుండా నిజమైన చరిత్రగా నిలిచేది

ఎప్పటికప్పుడు ఉండే సహనం మరియు శాంతి.

ఈ మహీ తలంపై (భూమిపై) మనస్సును నిలబెట్టే గొప్ప శక్తి

చూడగానే తెలుస్తుంది —

అది మహిళలదే రాజ్యం అని.


013.పద్యం :

మానభోగవాంఛ రహిత మచ్చలైన

నమ్మ జేయునట్టివిధము నటన శ్రేష్ఠ

వునికి కర్మ కాల్చబడును వాక్కు మహిమ

డునుచునున్ విధి జ్ఞానాగ్ని తురుము చుండు

భావం

1వ పాదం (మా)

మానవుడు భోగవాంఛలను విడిచిపెట్టి మచ్చలేని స్వభావంతో ఉండాలి.

2వ పాదం (న)

నిజాయితీగా ప్రవర్తిస్తూ ఇతరులకు నమ్మకం కలిగించే విధంగా ప్రవర్తించడం అతని గొప్ప గుణం.

3వ పాదం (వు)

వాక్కులో ఉన్న సత్యం, ధర్మం వలన మనిషి కర్మల ప్రభావం తగ్గుతుంది.

4వ పాదం (డు)

జ్ఞానాగ్ని (జ్ఞానం) ద్వారా విధి బంధాలను కూడా అధిగమించే స్థితి మానవుడికి కలుగుతుంది.

కవితా లక్షణాలు

🌼 


014.#కందము 

మహిళయె జగతికి మూలము

మహిళయె లేనిది పురుషుల మనుగడ కలదా?

మహిళాదినోత్సవంబున  

మహిళా మణులకు శుభములు మాన్యత గూర్చన్


015.తేటగీతి 

స్త్రీలు గౌరవ మొందిన సిరులు నిలుచు 

స్త్రీలు దుఃఖింపబడు చోట సిరి నిలువదు 

స్త్రీని గౌరవించు టెపుడు శ్రీకరంబు

వనిత లెల్లరకు నివియె వందనములు


016.#ఆటవెలది

మహిళ యనగ నెంతొ మాధుర్య భావన 

మమత బంచు నట్టి మాతృ మూర్తి

అమ్మ చెల్లి పుత్రి యాలి యక్కగ నిల

సేవ జేసి‌ యామె చింత దీర్చు


017.#కందము

మహిలో నింటను బయటను

సహన గుణంబు కలిగి కడు శ్రమియించెడి యా

మహిళలు సతతము పూజ్యులు

మహిళా దినమేలనయ్య మగువల కొఱకున్


014. కందము

మహిళయె జగతికి మూలము…

భూమిపై జీవనానికి మూలం మహిళ. మహిళ లేకుండా పురుషుల మనుగడే ఉండదు. అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకు శుభాకాంక్షలు, గౌరవం సమర్పించాలి.

015..2. తేటగీతి

స్త్రీలు గౌరవ మొందిన సిరులు నిలుచు…

స్త్రీలు గౌరవింపబడే చోట సంపద, శుభం నిలుస్తాయి. స్త్రీలు అవమానించబడే చోట శ్రేయస్సు నిలవదు. కాబట్టి స్త్రీని గౌరవించడం శుభప్రదం; అందుకే అన్ని వనితలకు వందనం.

016.3. ఆటవెలది

మహిళ యనగ నెంతో మాధుర్య భావన…

మహిళ మాధుర్యానికి, మమతకు ప్రతిరూపం. ఆమె తల్లి, చెల్లి, కుమార్తె, భార్య, అక్కగా కుటుంబాన్ని కాపాడుతూ సేవ చేస్తుంది; అందరి బాధలను తీరుస్తుంది.

017.4. కందము

మహిలో నింటను బయటను…

ఇంట్లోనూ బయటా మహిళలు సహనంతో కష్టపడుతూ జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. అందుకే వారు ఎల్లప్పుడూ పూజ్యులు. మహిళా దినోత్సవం వారి గౌరవార్థమే.

018.కం.


బంధము నిడునది మనమది

బంధము విడువగ నడుపును వరముగ నీ సం

బంధము నిలచిన గణపతి

బంధము కలుగగ కనుమయ భక్తుని నన్నున్.


సరళ భావం :

మన జీవితం ఒక బంధంతో నడుస్తుంది; అదే దైవబంధం.

ఆ బంధాన్ని వదలకుండా ఉంటే అది మన జీవితాన్ని వరంలా నడిపిస్తుంది.

గణపతితో ఉన్న ఆ పవిత్ర సంబంధం నిలిచినపుడు

ఆయన భక్తుడైన నన్ను తన దయాబంధంతో కాపాడుతాడు.


O19.కందము:

మనమది ధర్మము సత్యము 

మనసును నీడలు గనౌను  మాయల వలయమ్ 

మనిషిప్రవర్తనపలుకు 

మననీయక నిన్నువదిలి మచ్చగమిగులున్ 

సరళ భావం :

మనిషి ధర్మం, సత్యం అనేవి అతని జీవితానికి ఆధారం.

మనసులో మాయల వలయం ఏర్పడితే నిజం నీడలా కనిపిస్తుంది.

మనిషి ప్రవర్తన, మాటలే అతని అసలు స్వరూపాన్ని తెలియజేస్తాయి.

మననీయమైన ధర్మాన్ని వదిలేస్తే చివరకు జీవితంలో మచ్చ మాత్రమే మిగులుతుంది.

సారాంశం :

ధర్మం–సత్యం విడిచిన జీవితం చివరకు అపఖ్యాతి మిగిల్చుతుంది


020.తే.గీ.

మనసు మార్గము మేలుగన్ మనుజుడౌను

నోచు ధర్మమున్ దీపమై నొసగు జ్ఞాన

హరుని హృద్య భావ హితమై హారతిగను

రాజ్య మేలుచు రక్షణ రమ్యతగను

సరళ భావం :

మనసును సన్మార్గంలో నడిపితే మనిషి నిజమైన మనుజుడవుతాడు.

ధర్మాన్ని ఆచరించినవారికి జ్ఞానం దీపంలా వెలుగిస్తుంది.

హరిని స్మరించే హృద్యమైన భావం హారతిలా పవిత్రతను ఇస్తుంది.

అలాంటి ధర్మబుద్ధి రాజ్యానికీ రక్షణగా, శ్రేయస్సుగా నిలుస్తుంది.


నేటి అంశం :

*దత్త పది*


021*అలుగు   పులుగు   కలుగు  వెలుగు*


ఛందస్సు : ఐచ్చికం

తరళము 

అలుగు కామ్యము గమ్యమైననుఁ ఆసరేదియు లేకయున్

కలుగ తీరున కావ్యమైకధగా శుభంబు విమర్శగన్

పులుగు మాటలు భావమై కథ పూజ్య సత్య గుణంబుగన్

వెలుగు జీవన మార్గమేలుగవిద్యలౌను మనస్సుగన్

సరళ భావం :

ఆశయాలు అలుగుతూ గమ్యాన్ని కోరుకున్నా కొన్నిసార్లు ఆధారం లేకపోవచ్చు.

అలాంటి అనుభవాలు కాలక్రమంలో కావ్యంగా, కథగా మారి శుభ–అశుభాలను పరిశీలించే సాధనమవుతాయి.

కొన్నిసార్లు పులుగు (కఠినమైన) మాటలే అయినా లోతైన భావాన్ని కలిగి సత్యగుణాన్ని తెలియజేస్తాయి.

చివరికి విద్యతో నిండిన మనస్సే జీవన మార్గాన్ని వెలుగుగా మార్చుతుంది.


022.పద్యం

మంగళ చరణాలు తలపు మార్గ మందు

నయన కళలన్ని కధలగా నడక సహక

వుల మది పలుకులు తెలుపుచు వులుకు బెరుకు

డుచుల జూడ జూడ విధ ముడుపులు గమన

పద్య భావం

మంగళ చరణాలు తలపు మార్గమందు

– మంగళమైన ఆరంభంతో స్మృతుల మార్గంలో ప్రయాణం మొదలవుతుంది.

నయన కళలన్ని కథలగా నడక సహక

– కళ్లలో కనిపించే అందమైన దృశ్యాలు అన్నీ కథలుగా మారి మన ప్రయాణానికి తోడుగా ఉంటాయి.

కవుల మది పలుకులు తెలుపుచు వులుకు బెరుకు

– కవుల హృదయంలో పుట్టిన మాటలు మనసులో భావోద్వేగాలను, కొంత ఉల్లాసాన్ని మరియు సంకోచాన్ని కలిగిస్తాయి.

జూడ జూడ విధ ముడుపులు గమన

– జీవన ప్రయాణాన్ని గమనిస్తూ చూస్తూ ఉంటే అందులో ఎన్నో మలుపులు, అనుభవాలు కనిపిస్తాయి.

023.తే. గీ 

నెగ్గు అనురక్తి ఫలముయే నిజము యెగ్గు 

నిగ్గు తేల్చ జయమునెంచ నెగ్గ ఒగ్గు 

నుగ్గు నుగ్గు మనసుననే నూన్య తగను 

మొగ్గు జూపమంచి విలువ మోక్ష మెరుపు

భావం

అనురక్తి (పట్టుదల) ఉంటేనే విజయం లభిస్తుంది.

సత్యాన్ని స్పష్టంగా గ్రహించి గెలుపు లక్ష్యంగా కృషి చేయాలి.

మనసులోని చిన్న చిన్న బలహీనతలను తొలగించాలి.

మంచిమార్గం వైపు మొగ్గు చూపితే జీవితం విలువైనదై మోక్షసుఖం వంటి ఆనందం కలుగుతుంది.


024.పద్యం :

స్వచ్ఛత సంఘజీవిగను సాక్షి సమర్ధత సత్య వాసమై

ఇచ్చత తీర్చ బుద్ధి గణనీయ భవంబగు క్షుత్తు తీర్చగన్

రచ్చలు లేని గమ్యమగు రవ్వల కాంతుల మాయ మర్మమున్

మచ్చల జీవనంబు నిధి మానస తృప్తికి ధర్మ మార్గమున్

భావ వివరణ

1వ పాదం

స్వచ్ఛతతో జీవించే సంఘజీవి సత్యంలో నిలబడి సమర్థతతో జీవిస్తాడు.

2వ పాదం

బుద్ధితో అవసరాలను తీర్చుకుంటూ జీవన అవసరమైన ఆకలిని (క్షుత్తు) కూడా సముచితంగా తీర్చుకోవాలి.

3వ పాదం

రచ్చలు, కలహాలు లేని జీవితం నిజమైన గమ్యం.

ప్రపంచంలోని కాంతులు, మెరుపులు మాయలాంటివే.

4వ పాదం

మచ్చలేని జీవితం నిజమైన నిధి.

అది ధర్మమార్గంలో నడిచినప్పుడు మనసుకు తృప్తి ఇస్తుంది.

కవితా లక్షణాలు

🌼

025." ధన్యజీవనం"


అచ్చెరువొంద నేల? పరమాత్ముని సేవన పూజ్యనీయమై

నిచ్చలు సంప్రదాయ గణనీయ పురోగతి మూలమంత్రమై

పచ్చని పంటచేలు జన వార్ధికి నిత్యము క్షుత్తు తీర్చుచో

అచ్చము స్వర్గధామ మమతాలయ పర్వపు నిత్యవాసమౌ.......


( అచ్చెరువు : ఆశ్చర్యము; నిచ్చలు : ఎల్లప్పుడు ;

 వార్ధి : సముద్రము ; క్షుత్తు : ఆకలి)

పద్యం :

నలుగురి నమ్మవాక్కులని నానుడి తీరున సాగు కాలమున్

పలువురి మధ్య మాటలవి పక్వమగాను ఉపాశణంబుగన్

కలిసియు జెప్పు ముచ్చటలు కామ్యపు గమ్యము తీరు గాయగున్

కళలగు సత్యధర్మమును కాలము బట్టియు తీర్చు బుద్ధిగన్

భావ వివరణ

1వ పాదం

కాలం ఎలా మారినా, నానుడులలో చెప్పినట్టు

నలుగురు నమ్మే విధంగా మాట్లాడే వాక్కు ఎంతో విలువైనది.

2వ పాదం

అనేకమంది మధ్య చెప్పే మాటలు పక్వంగా ఉండాలి;

అవి ఒక విధమైన ఉపాసనలాంటివి — జాగ్రత్తగా ఉండాలి.

3వ పాదం

కలిసి మాట్లాడే ముచ్చట్లు సరైన దారిలో ఉంటే

మన ఆశించిన గమ్యాన్ని సాధించడానికి మార్గం అవుతాయి.

4వ పాదం

సత్యం, ధర్మం వంటి కళలను కాలానుగుణంగా

బుద్ధితో ఆచరించాలి.

కవితా లక్షణాలు

🌼

026.పద్యం (ఉ):

లక్షణ సద్గుణం లలిత లాలన పాలన లాలి తత్త్వమే

భిక్ష గ దానమున్ సలుప బీదల బాధలు బోవ వైనమున్

శిక్షణ పొంది దోషముల శుద్ధిగ సంపద మారు నైజమున్

కక్షలు లేని కామ్యమది కాలము హృద్యము ప్రేమ దాహమున్ 

భావం

1వ పాదం – లక్ష

లక్షణసంపన్నమైన సద్గుణాలు మనిషిలో ఉంటే, అతని లాలన-పాలన ప్రేమతో నిండిన తాత్త్విక జీవితం అవుతుంది.

2వ పాదం – భిక్ష

భిక్ష లేదా దానం చేయడం వల్ల బీదల బాధ కొంతైనా తొలగుతుంది; దానం కరుణను పెంచుతుంది.

3వ పాదం – శిక్ష

శిక్షణ లేదా శిక్ష ద్వారా దోషాలు సరిచేసుకుని మనిషి స్వభావం శుద్ధి చెంది సంపదలా మారుతుంది.

4వ పాదం – కక్ష

కక్షలు లేకుండా జీవించడం కాలానుగుణంగా మానవ హృదయానికి హృద్యమైన ప్రేమను నిలబెడుతుంది.

కవితా లక్షణాలు

🌼

027.దత్తపది : లక్ష – భిక్ష – శిక్ష – కక్ష

లక్ష లేనన నమ్ము బల్కుల లాలి లాస్యము తీరగన్

భిక్ష బెట్టిన తృప్తి పొందని బీద బల్కులు నేరుగన్

శిక్షణంబగు దేహదాహము శీఘ్ర మాయల మక్కువన్

కక్ష లేనిది ప్రేమ పొందుట కర్మ భావము కాలమున్

భావం

సంపద (లక్షలు) లేకపోయినా మధురమైన మాటలు మనసుకు ఆనందం ఇస్తాయి.

భిక్ష ఇచ్చినా తృప్తి లేని మనసులు ఉంటాయి; బీదల బాధను గ్రహించాలి.

ఆశలు, దేహదాహాలు మనిషికి ఒక విధమైన శిక్షలా మారుతాయి.

కక్ష లేకుండా ప్రేమతో జీవించడం కాలానుగుణ ధర్మం.

🌿

028.పద్యం :

మాత సుతాదృతీమతియు మానమనే నిధి శాంతి రూపిణీ

మాత సకాలనిర్మలపు మంత్ర వయస్సును విద్య యోగిణీ

మాత సమానయంత్రమగు మానవమానము నిల్పుమంత్రిణీ

మాత దయాసకామ్య శుభమంగళ ధర్మిణి జీవకారిణి

భావం

1వ పాదం

మాత అనేది పిల్లలను ప్రేమతో ఆదరించే దయామూర్తి.

ఆమె మానవ జీవితానికి మానమనే నిధి, శాంతి స్వరూపిణి.

2వ పాదం

మాత సమయాన్ని సక్రమంగా నడిపించే మార్గదర్శి.

ఆమె నిర్మలమైన ఉపదేశంతో పిల్లలకు విద్యను బోధించే యోగిని.

3వ పాదం

మాత కుటుంబాన్ని సమతుల్యంగా నడిపించే యంత్రంలాంటి కేంద్రబలం.

ఆమె మానవ గౌరవాన్ని నిలబెట్టే మంత్రిణి.

4వ పాదం

మాత దయ, మంగళం, ధర్మం కలిగినది.

ఆమె జీవనానికి ఆధారమైన జీవకారిణి


029.పద్యం :

వద్దను వద్దనేవిధము వాక్కగు విశ్వము గాంచ బుద్ధిగన్

పొద్దును పొందపొందికగు పోరు విధానము నిండు కుండగన్

సద్దు మనస్సు శోభలగు సందడి తీరున యాగ మాయగన్

నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్

భావ వివరణ

1వ పాదం:

“వద్దు” అని చెప్పాల్సిన చోట “వద్దు” అని చెప్పగలిగే ధైర్యం, నియంత్రణ వాక్కులో ఉండాలి. అలా మాట్లాడగలిగితే మనిషి ప్రపంచ స్వభావాన్ని బుద్ధితో గ్రహించగలడు.

2వ పాదం:

రోజూ జీవితంలో ఎదురయ్యే పోరాటాలు (సంక్షోభాలు, కష్టాలు) మనలో నిండు కుండలాగ నిలుస్తాయి. అవి అనుభవంగా మన జీవితాన్ని నింపుతాయి.

3వ పాదం:

మనస్సు శాంతంగా ఉండాలి. అప్పుడు బయట కనిపించే సందడి, ఆడంబరం, ఆడబొమ్మల వంటి జీవన మాయలుగా కనిపిస్తాయి.

4వ పాదం:

ఇలాంటి తత్త్వాన్ని గ్రహించి, మనసు ప్రశాంతంగా నిద్రపోయే వాడు (అంతరశాంతి పొందిన వాడు) ఈ భూమిపై గొప్ప కీర్తిని సంపాదించి ఇతరులకంటే పైకి ఎదుగుతాడు.

030. పద్యం:

అవధానంమది తృప్తి మివ్వగలగన్ ఆరాధ్య పద్యంబులన్

నవ విద్యాస్థితి పద్యగద్యభవమున్ నాణ్యత వేదంబుగన్

వివరమ్ముల్ సహకార బృత్యులుగనున్ విశ్వాస తత్త్వంబుగన్

భవ శ్రీభైరవ భాగ్యమే తెలుగుగన్ భావంబు ధన్యంబుగన్

భావం:

అవధానం అనే సాహిత్య సాధన మనసుకు తృప్తి ఇచ్చే ఆరాధ్యమైన పద్యరచనను వెలికి తీస్తుంది.

పద్య–గద్యరూపాల్లో విస్తరించిన నవవిధ విద్యలు దానికి నాణ్యతను ఇచ్చే వేదంలా నిలుస్తాయి.

వివరణలు, సహకారులు, శ్రోతలు అన్నీ కలిసి అవధానంలో సామర్థ్యాన్ని ప్రతిఫలింపజేస్తాయి.

అలా తెలుగు భాషలో వెలసే ఈ సాహిత్యసంపద భైరవ కృపవల్ల కలిగిన భాగ్యంలా భావాన్ని ధన్యంగా చేస్తుంది.


031.పద్యం:

నంద నందనం యానంద నమ్మకంబు

చందన సునంద మకరంద చాక చక్య 

వందన వరాల మదివిధి వాదనంబు

బృంద శుభనంద పందెపు శృతి లయలగు

భావం:

నందనుడి ఆనందంలా విశ్వాసం హృదయాన్ని నింపుతుంది.

చందన సువాసన, పుష్ప మకరందంలా మధురమైన భావాలు మనసులో పరిమళిస్తాయి.

వందనాలు, వరప్రసాదాలు జీవన విధిని సార్థకం చేస్తాయి.

అప్పుడు సమూహంగా వినిపించే శుభానందం సంగీత శృతి–లయలాగా జీవితాన్ని సమతుల్యంగా నడిపిస్తుంది.

32.మానవ ధర్మం - పద్యం

పద్యం :శా..

బాధించున్ విషయంబు బాధ పడకున్ బాధ్యత బంధంబుగన్

వేధించున్ కళ మానవత్వముగనే విశ్వంబు ధర్మంబుగన్

ఛేదించున్ జనులెల్ల రోగముల విచిత్రంబు దాహంబుగన్

పాదంబుల్ విధి వాంఛలేయగుటన్ పాశంబు సంతోషమున్

సరళ భావం :

జీవితంలో ఎన్నో విషయాలు మనిషిని బాధిస్తాయి. కానీ వాటిని ఓర్పుతో భరించడం బాధ్యతగా మారుతుంది. మానవత్వమే ప్రపంచానికి నిజమైన ధర్మం. మనుషులలో ఉండే ఆశలు, దాహాలు, రోగాలు వంటి దోషాలు మనసును క్రమంగా బంధిస్తాయి. వాటిని అధిగమించి విధి మార్గంలో నడిచినప్పుడే నిజమైన సంతోషం లభిస్తుంది.


33.పద్యం :తే. గీ 

నోటు నీడ పట్టు విలువ నొప్పులుగను

గుణము గుడ్డిదౌ ధనమున గుట్టు రట్టు

ఆస్తి చుట్ట నాప్యాయత ఆట పట్టు

నీతి యనుచు వాక్కులమది నేటి నరుడు

సరళ భావం :

ఈ కాలంలో డబ్బుకే ఎక్కువ విలువ ఉంది. డబ్బు కోసం మనుషులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ధనం ముందు గుణం కనిపించకుండా పోతుంది. ఆస్తి చుట్టూ ప్రేమలు, సంబంధాలు కూడా ఆటలా మారుతున్నాయి. అయితే నోటితో మాత్రం నీతి, ధర్మం గురించి మాట్లాడే మనిషి నేటి సమాజంలో కనిపిస్తున్నాడు.


34..తే. గీ.

గురువు లేకవిద్యలు పట్టు గుడ్డి జన్మ

మనసు గుణపంబు గుచ్చిన మాన కర్మ

చెప్ప వాడు లేకబతుకు చెడ్డ జన్మ

మనిషి చెడిపోవ తెలియని మార్గ కర్మ

సరళ భావం:

గురువు లేకుండా విద్యను పొందితే అది మంచి వానికి చూపు లేనట్టే.

మనసులో గుణాలు లేకపోతే మనిషి చేసే పనులు సరిగా ఉండవు.

మంచిదారిని చెప్పేవారు లేకపోతే జీవితం తప్పు దారిలో పడుతుంది.

మార్గం తెలియకపోతే మనిషి చెడిపోవడం సులభం.


35..పద్యము:

అనుకువావిధి గమ్యము ఆశయ మగు

యోగ విద్యల మహిమయే యోగ్యత యగు

నిజము సంస్తుతి భక్తియు నిర్మలంబు

జగతి యేలు విధము రక్ష జంగ మయ్య

సరళ భావం:

వినయం (అనుకువ) మన జీవితానికి సరైన మార్గాన్ని చూపే ఆశయం.

యోగవిద్యల మహిమ మనిషిని యోగ్యుడిగా, సమర్థుడిగా తయారుచేస్తుంది.

నిజం, స్తుతి, భక్తి—all ఇవి నిర్మలమైన మనసును కలిగిస్తాయి.

అలాంటి నిర్మల జీవన విధానమే ఈ జగత్తును నిలబెట్టే రక్షక శక్తిగా మారుతుంది.


36..పద్యం :

పలుకులన్ని తేటగీతి పాఠ్యమగుట మస్తకం

విలువలన్ని తేనెజాతి విశ్వమగుట మోహనం

తలపులన్ని తెలుగు రీతి తత్వమగుట దర్పణం

మలువులన్ని భరత ఖ్యాతి మార్గమవ్వ జీవితం

సరళ భావం :

మన మాటలు తేటతెలుగు గీతంలా మధురంగా ఉండాలి. మన విలువలు తేనెలా మాధుర్యాన్ని పంచుతూ ప్రపంచాన్ని ఆకర్షించాలి. మన ఆలోచనలు తెలుగు సంస్కృతి తత్వాన్ని ప్రతిబింబించే అద్దంలా ఉండాలి. అప్పుడు మన జీవిత మార్గం భారతదేశ మహిమను పెంచే దారిగా మారుతుంది.


37..పద్యం :

ఏ మన్నానులె నేస్తమా సహనమున్ యేమాయ సౌఖ్యమ్మదే

ఏ మాత్రంబది నిత్య సత్యమగుతన్ నెమ్మింద కాలంబుగన్

ఏ మార్గంబన దాహమే విలువలుగన్ యే శక్తి విశ్వాసమున్

నీ మాటల్ గుణ ధర్మమే ముదమునన్ నీ జ్ఞాన నేస్తంబుగన్

సరళ భావం :

సహనం లేకపోతే నిజమైన సుఖం ఉండదు. కాలక్రమంలో నిలిచేది నిజం మాత్రమే. మన జీవిత మార్గాన్ని నిర్ణయించేది మన ఆశలు, విలువలు, విశ్వాసం. మంచి గుణాలు, ధర్మం, జ్ఞానం కలిగిన మాటలే మనిషికి నిజమైన ఆనందాన్ని ఇచ్చే స్నేహితులవంటివి.


38..తే. గీ.

గాలి నిలువ పోసే ప్రాణ మాయ యేది?

మనసు సుడిగాలి ప్రాణాన్ని మాప మేది?

కనబడని మనసున మార్పు గాలి యేది?

కనబడే సుడిగాలి వికాస మేది?

సరళ భావం:

ప్రాణం నిలబెట్టే గాలి ఏది? అది కనిపించని శక్తి.

అలాగే మనసులో వచ్చే ఆలోచనలు కూడా సుడిగాలిలా మన ప్రాణాన్ని కదిలిస్తాయి.

కనబడని మనసులో మార్పు తీసుకొచ్చే ఆ అంతర్గత శక్తి ఏది?

కనబడే సుడిగాలి ప్రకృతిలో ఎలా మార్పు తీసుకువస్తుందో,

మనసులోని ఆలోచనలు కూడా మన జీవన వికాసానికి కారణం అవుతాయి.


39..పద్యము:

అమ్మ బొమ్మ యనుచు వెర్రి మాట యేలనీకుగన్

అమ్మ నమ్మబుద్ధిగాను ఆశ్రితకళ నేస్తమేయగున్

అమ్మసేవ మోనమయిన ఆకలిగను తీర్చు దేవతన్

అమ్మరుధిర తత్వమదియు ఆశ తీర్చకాల మాయగన్

సరళ భావం:

“అమ్మ అంటే కేవలం బొమ్మ” అని చెప్పడం వెర్రి మాట.

అమ్మ అనేది మనకు నమ్మకాన్ని ఇచ్చే జ్ఞానం, ఆశ్రయం ఇచ్చే స్నేహితురాలు.

అమ్మ సేవ అనేది మౌనంగా మన ఆకలిని తీర్చే దేవతలా ఉంటుంది.

అమ్మ రక్తమే మనలో జీవంగా ప్రవహిస్తుంది;

మన ఆశలను, అవసరాలను తీర్చడానికి కాలం పాటు కష్టపడే మహత్తర తత్వం అమ్మ.

040..తా నెవరో తపంబగు  సుధా సుఖ దుఃఖ పురోభి వృద్ధిగన్ 

తానన గౌరవంబు సిరి తాప సుధర్మ ప్రభావ విద్యగన్ 

తానన తoదనా నన విధానము కాలము తీరు మాయగన్ 

తానుగ పోల్చు కోవడము తప్పు సుకష్ట మనస్సు వ్యాధిగన్ 


సరళ భావం :

మనిషి తాను ఎవరో తెలుసుకోవడం తపస్సులాంటిది; జీవితంలో సుఖ–దుఃఖాలు వచ్చి మనసును ఎదగనిస్తాయి. గౌరవం, సంపద, ధర్మం, జ్ఞానం ఇవన్నీ మన జీవనాన్ని ప్రభావితం చేస్తాయి. కాలం మారుతుంటుంది, పరిస్థితులు కూడా మాయలాంటివి. అందుకే మనిషి తనను ఇతరులతో పోల్చుకోవడం తప్పు; అది మనసుకు బాధను కలిగించే వ్యాధిలాంటిది. 🌸


041..బలము నున్న తెలివి సున్న బంధ మన్న తప్పదే

తెలివి యున్న బలము సున్న తెప్ప బతుకు తప్పదే

బలము గెలుపు గొప్ప యన్న బాధ్య తన్న తప్పదే

తెలివి బల నిరంతరంబు తీరుగున్న సఖ్యతే


సరళ భావం :

బలం ఉన్నా తెలివి లేకపోతే బంధాలు, కష్టాలు తప్పవు. తెలివి ఉన్నా బలం లేకపోతే జీవితం పడవలా తేలుతూ కష్టపడుతుంది. కేవలం బలంతో గెలుపు సాధించినా బాధ్యతలు తప్పవు. బలం మరియు తెలివి రెండూ కలిసి సమతూకంగా ఉంటేనే జీవితం సఖ్యతతో సరిగ్గా సాగుతుంది. 🌸


42..పాలు నీళ్ల కళ గనుమా పాశ మాయ 

దపము నిగ్రహ మనసుగా తలపు తీర్చ 

చాక చక్య ప్రభావము జాగు నాపు 

రిథము సఖ్యతా భవమగు రెప రెపలగు

పద్య భావం:

పాలు–నీళ్లలా కలిసిపోయే స్నేహం అనేది నిజమైన బంధం.

అది కేవలం మాయా పాశం కాకుండా పరస్పర నమ్మకం మీద నిలుస్తుంది.

మనసులో దపము (తపస్సు), నిగ్రహం ఉంటే ఆలోచనలు సరిగా ఉంటాయి;

ఆలోచనలు సరిగా ఉంటే జీవితం సంతృప్తి పొందుతుంది.

చాకచక్యంగా, జాగ్రత్తగా వ్యవహరించినప్పుడు

సంబంధాలలో సఖ్యత పెరుగుతుంది.

అప్పుడు జీవితం రెపరెపలాడే రెక్కలలా

సహజంగా, ఆనందంగా ముందుకు సాగుతుంది.

043.శరసిజ వైరి వైరిగను సంబర శబ్దపు గుచ్చ మోహమున్
విరసపు దాహధర్మమని విద్యల వైనము జూప యవ్వనమ్
తరుణము తృప్తినిచ్చెదియు తన్మయ మాయ శుభోదమంజరీ
కరుణ తొ కళ్ళ జూపులగు కామ్య భవంబగు బంధము దాస్య భాగ్యమున్

దత్తపది :--
044.అండ గండ దండ నిండ
అంశం :- భీమ దుర్యోధన యుద్ధం

గండమన్న నుభావబాపగ కాయమందున ధైర్యమున్
అండ దండము రక్షణాయగుదర్పకౌరవ యాగమున్
దండయుద్ధమె పాండకౌరవ ధార్ఢ్యతా బల వేగమున్
దండ భీమ పరాక్రమామది దర్పమేయగు యుద్ధమున్

045.సీస పద్యం
ఏ భాష పలికేది యే తీరు తెలిపేది
ఏ బావ మొలిచేది యేది యేది
ఏ సౌఖ్య ఫలమేది యే వాక్య గతి యేది
ఏ కావ్య పదమేది  యేది యేది
ఏ నవ్వు విధమేది యే పువ్వు కళ యేది
ఏ రవ్వ వెలుగేది యేది యేది
ఏ దేహ తపమేది యే దాహ విలువేది
ఏ మోహ నిజమేది యేది యేది

తే. గీ.
ఏది మనసు కవిత గాన మేది మేది
ఏది వయసు యేమగుతీరు యేది యేది
ఏది జయము యేదపజయ యేది యేది
ఏది నిత్య సత్య పలుకు యేది యేది

046.. పద్యం :
మీ చెలిమి నాకవిత్వ సమీకరంబు
మీ భవంబగు నాకు తోడగు మేలు గాంచ
మీ దయాహృదయము నిన్ను మిన్న గుంచ
మీ ప్రభావము శాంతిగ మిధ్య గాక
సరళ భావం 🌸
మీతో ఉన్న స్నేహం నా కవిత్వాన్ని సమీకరించి, నాకు సహాయంగా నిలుస్తోంది. మీ ఆలోచనలు, మీ సహకారం నాకు మేలు చేస్తోంది. మీ దయగల హృదయం మిమ్మల్ని మరింత గొప్పవారిగా నిలబెడుతోంది. మీ ప్రభావం శాంతిని ప్రసాదిస్తూ ఎప్పటికీ అబద్ధంగా కాకుండా నిజంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను.

047.. చెలిమి మాటల చినుకులు జెప్పలేను
కవుల మార్గమందు కలిసి కావ్య రచన
మనసు మాధుర్యమున్ గతిమారుతమగు
హృదయ సాంగత్య సార్థక శృతి లయలగు

048..తరళము
అభయ మీయగ రాగమున్ సహ ఆలి వేల్పుల నాధుడున్
శుభ మనోమయ యోగ నిద్రల శోభ నిచ్చెడి వాడుగన్
ప్రభగనిన్నును వేడుచుంటిని రమ్యతాభవమార్గమున్
అభయ మన్నది తోడునీడగసామరస్య భవంబుగన్
సరళ భావం 🌸
భయాన్ని తొలగించి కాపాడే దేవుడు, ఆలివేళ్లపుల నాథుడు (విష్ణువు) శుభమైన మనస్సులకు యోగనిద్రలో కాంతిని ప్రసాదించేవాడు. ఆ ప్రభువును నేను ప్రార్థిస్తున్నాను — జీవన మార్గం సుందరంగా ఉండాలని. ఆయన ఇచ్చే అభయం మనకు తోడు నీడలాగా ఉండి, జీవితం సామరస్యంతో నిండాలని కోరుకుంటున్నాను.

049..🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
న్యస్తాక్షరి (నే – టి – తీ – రు) “ఉత్సాహం” భావం

(నే)ల జీవనంబు నిండ నెమ్మది మార్గమేదురా
నీ(టి)తన్మయంబు వలె నిలిచు సత్యముండురా
మాట(తీ)రునందు మాధుర్య మానవత్వముండురా
నోటితీ(రు)జూచి నొచ్చి నొలువకు సాహసించురా
సరళ భావం :
జీవితంలో నిజాయితీ, మాధుర్యమున్న మాటలు ఉండాలి. ఇతరుల మాటల వల్ల నిరుత్సాహ పడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి.

050..*॥ ఉత్సాహమ్ ॥*

సతము వెలుగు లీను గొప్ప
స్వర్ణ భూష లెన్నియో
మితము లేక నీవు దాల్చ
మేని యందు ప్రేమతో
మతులు పోవుచుండ జూచు
మౌని బృంద మెంతయో
నతుల భక్తిని *కనకాంగది*
తగ వేడరే మదిన్

051.సతము వెలుగు లీను గొప్ప
  సద్గుణాల రత్నమో
మితము గాను నీవు దాల్చ
  మేని యందు ప్రేమతో
మతులు మేలుకొనగ జూచు
  మౌని బృంద మెంతయో
నతుల భక్తిని ధర్మదీప
నటన వెలుగు మాయలున్

052..సతత సత్య మార్గమందు
  సాగు జీవనంబుగన్
హితము గాను పలుకు మాట
  హృదయ మందు నిల్వగున్
మతులు గెల్చు మాధురితయు
  మౌని బృంద మెచ్చగన్
నతుల నెత్తిన నిల్చు కీర్తి
  నిత్య ముండు లోకమున్

053..ధైర్య దీపమై నడచు నీవు
  ధర్మ మార్గ మెల్లగా
మౌనమందు మౌల్యమున్న
  మంచి మాట పల్కగా
మతులు మేలుకొనగ జూచు
  మానవ బృంద మెంతయో
నతుల భక్తి నింపు నీవు
  నిజము జీవనంబుగన్
🌼
054..🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
మ. కో.
(నే)టి యాగడ యన్న నేతలె నీడ లేకయు తప్పదా
పో(టి) చేసియు గెల్వలేకయు పోరు నిత్యము తప్పదా
మాట (తీ)రుగ మార కుండగ మాయ జూపు ట తప్పదా
నోటి తీ(రు)గ గొప్పమాటలు నీటి మూటలు దేనికో

🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
055.సరళ భావం : 🌿
నేటి కాలంలో నాయకులు ప్రజలకు నిజంగా అండగా ఉండడం చాలా అరుదుగా కనిపిస్తోంది. వారు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు, కానీ నిజమైన విజయాన్ని సాధించలేక పోరాటాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. మాటల తీరు మారకపోయినా, మాయ మాటలతో ప్రజలను ఆకట్టుకోవడం జరుగుతోంది. చివరికి వారు చెప్పే గొప్ప గొప్ప మాటలు ప్రయోజనం లేని నీటి మూటలలాంటివే అని కవి సూచిస్తున్నారు.
సారం :
పెద్ద మాటలు చెప్పడం కంటే నిజమైన పని చేయడం ముఖ్యము. 🌼

056..మచ్చిక కాల సంపద సమానమనస్సు మహత్యమేయగున్
నిచ్చల గాంచ తృప్తిగను నెందరొ యేక ఫలంబు కోరగన్
పచ్చలహారమేపలుక పాశము తీరగు తెచ్చె బంధమున్
వచ్చిరి తల్లిదండ్రుల వివాహము జూడగ పుత్రులెల్లరున్
తాత్పర్యం : 🌼
కాలానుకూలంగా మారిపోతూ ఉండే సంపదల కంటే మనుషుల మధ్య ఉండే మచ్చిక, పరస్పర గౌరవం, సమానమనస్సు వంటి గుణాలే నిజమైన మహత్తర సంపదలు. మనసు స్థిరంగా ఉండి తృప్తి పొందిన జీవితం చాలా మందికి సాధ్యంకాదు; ఎందుకంటే చాలామంది ఒక్కో ఫలితాన్ని, ఒక్కో లాభాన్ని మాత్రమే ఆశిస్తూ జీవిస్తారు.
వివాహ బంధానికి చిహ్నమైన పచ్చలహారం మాటలకన్నా గొప్పదైన ప్రేమపాశాన్ని సూచిస్తుంది. అది ఇద్దరిని మాత్రమే కాకుండా కుటుంబ బంధాలను కూడ గాఢం చేస్తుంది. అందుకే ఆ దాంపత్య బంధం మహిమను దర్శించుటకు, ఆనందించుటకు పుత్రులు, బంధువులు అందరూ కూడి తల్లిదండ్రుల వివాహాన్ని సంతోషంగా చూస్తారు.

057..తే. గీ.
పాంశ సమయసాధ్య విలువ పలుకు పదము
డమర జీవనమేదీక్ష డమ డమలగు
ఉనికి విశ్వ విజ్ఞానము ఉత్సవమగు
లుక లుకలు తప్పని జగతి సుడులు తిరుగు
పద్య భావం:
పాంశ – సమయానికి తగినట్టు మాట్లాడే మాటకే నిజమైన విలువ ఉంటుంది.
సమయస్ఫూర్తితో పలికిన పదం మనిషి జ్ఞానాన్ని తెలియజేస్తుంది.
డమర – జీవితం డమరుకంలా డమడమలాడుతూ సాగుతుంది;
అంటే మార్పులు, చలనం, సంఘటనలతో నిండిన ప్రయాణం.
ఉనికి – మనిషి ఉనికే విశ్వ విజ్ఞానానికి ఒక ఉత్సవం;
జీవితం అనేది అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందే అవకాశం.
లుక లుకలు – ఈ జగత్తులో గుట్టులు, లోపాలు, మాయలు తప్పవు;
జగతి ఎప్పటికీ సుడులు తిరుగుతూ మార్పులతో కొనసాగుతూనే ఉంటుంది.

No comments:

Post a Comment