Saturday, 18 March 2023

క్షణిక జ్ఞానానికి ప్రశ్న తొలిమెట్టు special

 



నేటి ఉషోదయ క్షణిక జ్ఞానానికి ప్రశ్న  తొలిమెట్టు నిత్య జీవితాల్లో లఘు కవితా ప్రక్రియ 

కధ కాని జీవితం మలుపులు ఏవి? నాకు మీకు ఉన్న సమస్యలే ఇవి అన్నీ ప్రశ్న జవాబులుగా 


1. నాకు ఏదో లేదు?

జవాబు:-  ఏది ఉన్న పోయేదే కదా.

స్థిరమైనది ఏదీ లేదు కదా.


2. నాకు ప్రేమే లేదు ?

  జవాబు.. ఏది అన్న ప్రేమే కదా.

 నిలకడలేని చలానాన్ని ప్రేమే అంటారుకదా 


3. నాకు అనుబంధం లేదు ?

  జవాబు.. ఏది స్థిరముగా ఉండదు కదా.

నమ్మకం లేనిచోట అనుభందం లేదు కదా 


4. నాకు ఆశ అనేది లేదు ?

   జవాబు... నిలకడలేనది జీవితం కదా

బతికి బతికించాలని జ్యాసే లేనప్పుడు ఆశ ఉండదు కదా 


5. నాకు ఉన్నది పోయింది?

 జవాబు:- పోవడానికే  వచ్చింది. కదా

ఉపయోగం లేనిచోట ఏదీ ఉన్న పోయినట్టే కదా 


6. నాకు ఉన్నది., కానీ తృప్తిగా లేదు..?

 జవాబు:-  తృప్తి దానిలో కాదు,  నీలో లేదు.కదా

బుద్ది నిలకడ లేనిచో తృప్తి ఉండదు కదా 


 7.నాకు కాలేపెనంతో సహవాసం లేదు..?

 జవాబు..నాలో  మటుమాయమై పోతుంది కదా

నిప్పుంటే భయమున్న చోట సహవాసం ఉండదు కదా 


8. నాకు బురదతో పెనవేసు కోవాలని లేదు..?

జవాబు..నాలో మురికిమయమై పోతుంది కదా

పెనవేసుకోవాలని మతి ఉంటే బురద అడ్డు కాదుకదా


9.. తామరాకు తో  స్నేహంచెయ్యాలని లేదు..?

జవాబు.నాలో..ఆణిముత్యమై మెరుస్తుంది కదా

అంటి అంటనట్టు ఉండలేవు కదా 


10....ముత్యపుచిప్పలో చినుకు కావటంలేదు..?

జవాబు..నాలో.చినుకు ముత్యమై పోతుంది కదా

చినుకు విలువ తెలిసే ముత్యపు చిప్పలో చేరవు కదా 


11....సాంగత్యమే మన జీవన మవ్వుటలేదు..?

జవాబు..నాకు కాలగమనంతో జీవనం అవుతుంది కదా

బంధానికి చిక్కి బానిస అవుతావేమో అని భయము కదా 


12...చెప్పేదెవరు? చేసేదెవరు?

జవాబు ।। చెప్పేది, చేసేది మనిషియే కదా

అంతర్యామి ఒకరున్నారని తెలిసే అడుగుతున్నావు కదా 


13... ఆలోచించే దెవరు, ఆచరిచే దెవరు?

జవాబు। భార్య ఆలోచనతో భర్త ఆచరణ కదా

ఆలోచించేది మనసు ఆచరించేది బుద్ది కదా 


14।మనిషి ఎవరు? ఆమనిషి ఎవరు?

జవాబు... మనిషి హృదయం, ఆమనిషి స్పంధనే కదా

మనిషి సుఖము ఆ మనిషి ప్రేమ 


15।।అసలు జ్ణానం అంటే ఏది?

జవాబు... హృదయం అర్ధం ఐతే జ్ణానం కదా

హృదయంలో ఆత్మ ఉంటుందని తెలిస్తే జ్ఞానమే కదా 


16। బానిసత్వం అంటే ఏంది?

జవాబు... ఓర్పుకు పరీక్ష యే కదా

అహంకారానికి లొంగే జీవనం కదా 


17। మనసుకు వారసత్వం ఏది

జవాబు... ప్రేమ ఒక్కటే కదా

సంతృప్తి నిచ్చె కవిత్వం రాజకీయం కదా 


18।।పుట్టుమచ్చ,పచ్చబొట్టు దేనికి?

జవాబు... బిడ్డగా గుర్తింపుకే కదా

రాజ వంశం అని, మనిషిగా గుర్తించేందుకు 


19। అనుభవం  దేనికి?

జవాబు... మనసుకే భారం దేహానికే కదా

చెప్పుకొని కాలక్షేపం చెయ్యటానికి కదా 


20।।। కళ్ళు చూస్తే ఏమంటారు?

జవాబు... దృశ్యతే కదా

ప్రేమ పుట్టుకోస్తుందని అంటారు కదా 


21।।। కళ్ళు మూస్తే ఏమంటారు ?

జవాబు... స్మృతి,అంతర్గత దృష్టే కదా

ప్రాణం లేని జీవి అంటారు కదా 


22।చేనులో ఏముంది?  నామేనులో ఏముంది ?

జవాబు... చేనులో బంగారం, నీ మేనులో సింగారం

చేనులో కదలికలు, నీ మేనులో కౌగిలింతలు 


23-తోటలో ఏముంది ? నా మాటలో ఏముంది ?

జవాబు... తోటలో మల్లియలు, మీమాటలో సరిగమలు 

 తోటలో సువాసనలు, నీ మాటలో నవ్వులు 


24-మబ్బులో ఈముంది ? నామనసులో ఏముంది ?

జవాబు...మబ్బులో పన్నీరు, నీ మనసులో కన్నీరు...

మబ్బులో శబ్దాలు, నీ మనసులో రాగాలు 

***-

కానీ కాని జీవితంలో మలుపులు కధ..(2)


25..దట్టమైన చీకటి ఏది ?

జవాబు : అహంకారంతో అంధకారం కదా

కళ్ళున్నా దగ్గరిది చూడలేకపోవటం చీకటి కాదా 


26..నమ్రత తొలి మెట్టు ఏది ?

జవాబు :: అహంకారము విడనాడుట కదా

ప్రేమ పుట్టి సహనం తోడు ఉండటం కాదా 


27...నిరాశ ఎందుకు వస్తుంది ?

జవాబు:: ధైర్యం, విశ్వాసం సడలినప్పుడు కదా

ప్రేమను చంపేసినప్పుడు కదా 


28...విజయం ఎక్కడుంటుంది ?

జవాబు :జ్ఞానం తెలివి ఉన్నచోట విజయం కదా

ఓర్పు ఓదార్పు ఉన్నచోటు కదా 


29...ముహూర్తం అక్కర లేనిది ఏది ?

 జవాబు :: మంచిపనిచేయడానికి వద్దు కదా

కౌగిలింతలకు అక్కర్లేదు కదా 


30...సహించకూడనిది ఏది ?

జవాబు : న్యాయాన్ని అతిక్రమించే అన్యాయం కదా

సీలాన్ని తాకట్టు పెట్టి ప్రేమ నటించే వారిని కదా 


31...బాధలు లేకపోవుట కారణమేమి?

జవాబు : మనిషిలో ఆశ లేక ఉండుటే కదా 

ప్రపంచాన్ని వదలి ధ్యానన్ని నమ్మితే బాధ లేదుకదా 


32...మాకు మితిమీరిన ఖర్చు అయితే ఏమి ?

జవాబు : మీరు పేదరికం పాలు అవ్వటమే కదా 

అనారోగ్యం నిద్రలేకపోవటమే కదా 


33...మాకు మితిమీరిన పొదుపు అయితే ఏమి ? 

జవాబు : మీరు కష్టాల పాలే అవ్వటమే కదా

దొంగలకు దారి చూపుటయే కదా 


34...మాకు మితిమీరిన సంపాదన ఉంటే ఏమి ?

జవాబు : మనశ్శాంతే  లేకుండుటయే కదా 

మృత్యువుకు దగ్గరగా ఉన్నట్టేకదా 


35...మాకు మతి కర్తవ్యం శోధన అయితే ఏమి ?

జవాబు : భయము శాంతి లేకుండుటే కదా 

అనుమానం లేకుంటే కదా 


36...మాకు క్రమ శిక్షణ ఉంటే ఏమి ? 

జవాబు : రక్త సంబధమె దూరం అవ్వటమే కదా

సుత్తి దెబ్బలు తినటం తేలికంటారు కదా 


37...మాకు బాధ్యతలే ఉంటే ఏమి ?

జవాబు :అప్పులకు నీవు దూరం ఉండటమే కదా 

ఓర్పు సదలకుండా ఉంటే మేలుకదా 


38...మాకు మితిమీరి నట్టి హాస్యము ఉంటే ఏమి ? 

జవాబు : నవ్వుల పాలు అవ్వటమే కదా

కళ్ళంబడి నీటిని తెప్పించడమే కదా 


39...మాకు మితిమీరిన  కోపము ఉంటే ఏమి ?

జవాబు : భయాన్ని  వృద్ధి చెయ్యటమే కదా

తిరుగుబాటుకు దారిచూపటమే కదా 


40...మాకు మితిమీరిన ఆలోచన ఉంటే ఏమి ?

జవాబు : నీ జీవితం దుర్భరం అవ్వటమే కదా

భార్య కూడా దగ్గరకు రానియ్యదు కదా 


41...మాకు వ్యసనాలే అలవాటైన ఏమి ? 

జవాబు : అపమృత్యు పాలవ్వడం కదా  

కాపురాలే కూలిపోవటమే కదా


42...మాకు మితిమీరిన స్వార్ధం ఉంటే ఏమి ?  

జవాబు : అందరిని దూరం చేయుటయే కదా 

గౌరవం పోగొట్టు కోవటమే కదా 


43...మాకు మితిమీరే ప్రేమ ఉంటే ఏమి ?  

జవాబు : నష్టాల పాలే చేయుటయే కదా  

వావి వరుసలు మరువటమే కదా 


44...మాకు మితిమీరె లాభార్జన ఉంటే ఏమి ?

జవాబు : వ్యాపార ఉనికి మోసం అవ్వటమే కదా 

దొంగను పోషించడమే కదా 


45...మాకు వస్తూత్పత్తీ మీరిన  ఉంటే ఏమి ?  

జవాబు : జరుగు నాణ్యత లోపం అవ్వటమేకదా

సంపాదన ఆశ పెరగటమే కదా 


46...మాకు మితి గర్వాహంకారం ఉంటే ఏమి ?

జవాబు : ఆపదలు కొని తెచ్చుకోవటమే కదా

మనుషులను దూరం చేసుకోవటమే కదా 


47...మాకు మితిమీరె అలంకారం ఉంటే ఏమి ?

జవాబు : ఎపుడు వెగటు పుట్టిస్తుంది కదా

కనీసం చూడలేని స్థితికి రావటమే కదా 


48...మాకు మితిమీరిన శృంగారం ఉంటే ఏమి ?

జవాబు : వైరాగ్య0 కలిగిస్తుంది కదా 

జుగుపూసా గుర్తుకొస్తుందికదా 


49...మీరె కామాంధకారం ఉంటే ఏమి ?

జవాబు : జీవచ్చవం చేస్తుంది కదా 

ప్రాణానికి విలువెక్కడుంటుంది కదా 


50...మాకు మితిమీరె దారిద్రయం ఉంటే ఏమి ?

జవాబు : నేరా లనే చేస్తుంది కదా  

తెగించే గుణం వస్తుంది కదా 


51...మీరె అధికార దాహం ఉంటే ఏమి ?

జవాబు : పగను ప్రేరేపిస్తుంది కదా 


52...బలహీను లైనప్పుడు ఏంచెయ్యాలి ?

జవాబు : భగవంతుడి దాస్యం కోరాలి 

బుద్ధిమంతుడితో స్నేహం చెయ్యాలి 


53...బలవంతులవగానే ఏంచెయ్యాలి ?

జవాబు : భగవంతుడి వేషం వెయ్యాలి 

బలహీనులను ఆదుకోవాలి 


కానీ కాని జీవితంలో మలుపులు ఏవి?(3)


54--అద్దం లో చూడవచ్చేది ఏది?

 మాతాపితానుసారిణి (భౌతిక శరీరం) కదా

 చూడ లేని అందం  చూచుటఏ  కదా 


55-  మనం చేసె కర్మలను బట్టి తెలుసేది ఏది? 

మనస్సు ( సమాజానుసారిణి) కదా

సంప్రదాయ సమాజ సేవ కాదా

 

56-  గురువుకు తెలుసేది ఏది?

 కర్మానుసారిణి (బుధ్ధి) కదా

 శిష్యుని కి బోధ చేయటమే కదా  


57 -   ధ్యానంలో దొరుకేది ఏది?

 సర్వాత్మానుసారిణి (ఆత్మ) కదా 

మన:శాంతి సత్యవాక్కులు కదా 


58 -  చూడటానికి ఏమీ లేనిది ఏది?

  అనుసారిణి కాదు,  ఎందుకంటే ఆత్మే సర్వాత్మయే కదా

  సూన్యం లో మనసు కదా 


59 - జ్ఞానానికి నిధి ఎవరు?

అహం లేని పండితుడు కదా

భార్య గురువు తలితండ్రుల దీవెన కదా 


60 - విమర్శ అనగా ఏమి?

సానుకూలం గా మార్చుకొనుటకే కదా

చెప్పలేని మాట చెప్పుట కదా 


61 - మానవునకు ఉత్తమ మైన నిధి ఏది?

ఇచ్ఛాశక్తితో ధ్యానించడం మే కదా

నిగ్రహశక్తి, సత్యవాక్కు ముఖ్యమైనది కదా  


62-  జీవితంలో ఆలోచన ఏది ?

మనిషికి చెట్టు చిగురులాంటిది కదా 

బ్రతుకు సుఖము లాంటిది కదా 


63 -జీవితంలో ఆ చరణ ఏది? 

మనిషికి చెట్టు మొగ్గ లాంటిది కదా 

పిల్లలకనుఒకఇట్టివారుగా చేయటమే కదా 


64 -జీవితంలో ఫలితమనేది ఏది ?

మనిషికి చెట్టు లో కాయ వంటిది కదా 

బిడ్డలు తల్లితండ్రులను గౌరవించుటే కదా 


65 -ఆత్మీయులకు ప్రేమ పంచితే ఏమవుతుంది ?

బాధ సగము, ఆనందం రెట్టింపు కదా 

ఉన్నదంతా దోచుటకు అవకాశము కదా 


66- కళ్ళు ఎవరిని నమ్ముతాయి ?

పేగు బంధాన్ని నమ్ము తాయి కదా 

కనబడనిదైవాన్ని నమ్ముతాయి కదా 


67 -చెవులు ఎవరిని నమ్ముతాయి ? 

ఇతరుల మాటలనుఁ నమ్ముతాయి కదా

విన్నది నాటితే చెప్పండి ఉరుకోవు కదా 


68- మాటకు, ప్రయత్నానికి సంభందం ఏది ? 

మాటకు మనసు కదులు, ప్రయత్నం జయమునిచ్చుకదా 

మాట నమ్మకాన్నిన్ని, ప్రయత్నం విశ్వాసాన్ని ఇచ్చును కదా

  

69- వివేకానికి, సహనానికి తేడా ఏమి ?

వేవేకంగెలవటానికి, సహనం విజయం సాధనకుకదా 

మనిషిగా నిలబడటానికి, సహనం బ్రతికి బ్రతికించడానికి కదా  


70- శ్రద్దగా విని ఏమిచెయ్యాలి ?

మితంగా, హితంగా, ప్రియంగా, జవాబు చెప్పాలికదా 

నుకరించి ఆచరణలో సుఖం పొందాలి కదా 


71- సామర్ద్యమువల్ల ప్రయోజనమేమి ?

సామర్ధ్యమే మనిషిని ఉన్నతస్థానమున ఉంచు కదా 

అందరికి ఉపయోగపడతాడని నమ్మకం ఉండు కదా 


72- మనిషిలో దోషమంటే ఏది ?

తప్పుచెయ్యడం, తప్పును వప్పుకోకపోవడం, మరొకరిపై నెట్టడం కదా 

నిజం చెప్పకపోవడం, అబద్దాన్ని ప్రోత్సహించడం, గౌరవం లేకపోవడం కదా   


73- కృతజ్ఞత అంటే ఏమిటి ?

మనం చూపించేది ఆశించేది కాదు కదా 

నమ్మకాన్ని నిజం చేయు ప్రయత్నమే కదా

 

74- విజ్ఞత అంటే ఏమిటి ?

మెదడుకు చేరే ఆలోచనలలో మంచిని ఎన్నుకోవడం కదా 

అజ్ఞానాని తరిమే జ్ఞానాన్ని పొందడమే కదా 



75- ఎవరిని క్షమించ కూడదు ?

శ్రద్ధ లేనివాడిని కదా...

మోసంచేసేవాడిని కదా 


****


No comments:

Post a Comment