[23/04, 5:09 am] . Mallapragada: ప్రతిరోజు
మాతృభాష, మాతృభూమి, మాతృశ్రీ మరువద్దు
🌹🌹🌹🌹🌹🌹తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*మాతృశ్రీ *..ఇచ్ఛా.. చందస్సు, లో పద్యం, కవిత, చిన్న కధ
- 23/04
*కలువ , కలత , తులువ, తులము*
🙏🙏🙏🙏🙏🙏🙏
[23/04, 5:31 am] . Mallapragada: కలువ కదలిక కనుచూపు కలలు తీరు
కలత తొలగించు కరుణతో గాధ తెలుపు
తులువ లోచ్చియు తికమక దూత లైరి
తులము లేని ప్రేమను జూ తేజమేరు॥
కలువ పువ్వు కదిలినట్టు మృదువైన తల్లి చూపు మన కలలను ఆకారంలోకి తీసుకువస్తుంది. ఆమె కరుణ మనసులోని కలతలను తొలగించి జీవితానికి దారి చూపుతుంది. కుత్సిత స్వభావం (తులువ) కలిగినవారు కూడా తికమక పడుతూ మార్పు వైపు మళ్లుతారు. తల్లిప్రేమకు తులన లేదు — అది వెలుగులా మన జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. 🌸
******
కలువ కౌగిలి గమ్యమార్పగు కాల మాయలతీరుగన్
కలత చెందక కామి తార్ధము కావ్య రీతినచక్కగన్
తులువ మాటలు గొప్పగున్నను తూచ బుద్ధి సుశాంతిగన్
తులము పుత్తడి మేర సఖ్యత పూజ్య భావము మేలుగన్
******
[22/04, 4:44 am] . Mallapragada: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 22/04
పాదాది.. న్యస్తాక్షరి....... క, ళా, వ, తి .
🙏🙏🙏🙏🙏🙏🙏
[22/04, 4:52 am] . Mallapragada: కళలు చూప మగువ గుణగమ్య మహిమ
ళాలి లోల చిత్త వయసు లహరి కళ
వలదనియు వాంఛలు వరుసగా కలుపు
తిష్ఠు సంపద సద్గతి తెప్పు బ్రతుకు॥
సరళ భావం:
జీవితం ఒక అందమైన స్త్రీలా కళలతో మెరిసిపోతుంది.
యౌవనంలో మనసు చంచలంగా ఉంటుంది.
కోరికలు వరుసగా వస్తుంటాయి.
వాటిని సరిగ్గా నడిపితే జీవితం సద్గతికి చేరుతుంది.
*****
కళను మెచ్చుతు నిచ్చెను గౌరవపుక
ళా రతనమను బిరుదును లామ రమకు
వరముగ తలవ వదనము వంత పాడ
తిష్ట వేసెను మనమున తీపి గురుతు!
పరాశరం శ్రీనివాసాచార్యులు నరసరావుపేట.
****
క, ళా, వ, తి పాదాది న్యస్తాక్షరి నాయత్నం
తే. గీ.
కవిత రాయగా పలువురు కవులు నిను భ
ళా యనుచు పొగడగ కల్గు నంత పేర్మి
వసుధ యందున వేరుగా వలయు నేమి
తిరము గా నున్న కీర్తియే వరము కాద
సరస్వతి నాగరాజన్
******
22/4/26నాటి న్యక్తాక్షరి
క. ళా వ. తి
కళలు ప్రజల కొరకు కనిమెచ్చి యనను "భ
ళా"యనచును మురియు నంత మంది
వసుధ జనులు మెచ్చు వల్లెయనుచు
తిమిర మెల్ల పారు దిక్కులెంట
కాళిదాసుసుబ్బయ్య నెల్లూరు
*****
దిట్టకవి శ్రీనివాసాచార్యులు 9441745525 పాదాది న్యస్తాక్షరికి పూరణ
-------------
కయ్య మప్పుడు మంచిది కాదు భువి,క
ళామతల్లిని సేవింప క్షేమ మగును,
వదరుబోతుతో మాటాడవలదు సతము,
తిప్పతీగయె తీర్చును తిప్ప లెన్నొ.
(తేటగీతి)
*******
దత్తపది..“ఇల్లు–వాకిలి-పాడి -పంట
ఇల్లు ఇహలోక సౌఖ్యమై ఇమ్మడిగను
వాకిలి వెలుగు వాత్సల్య వనరులుగను
పాడి పశువులతో జీవి పావనంబు
పంటల పరిమళంబగు భాగ్యసీమ॥
భావం:
ఇల్లు జీవనానికి ఆనంద నిలయం
వాకిలి ప్రేమ, ఆతిథ్యానికి ద్వారం
పాడి జీవనాన్ని పవిత్రంగా నిలబెడుతుంది
పంటలు భూమి ఇచ్చే నిజమైన సంపద
*****
ప్రపంచ ధరిత్రీ దినోత్సవ సందర్భంగా రచన మల్లాప్రగడ రామకృష్ణ
🎵 పల్లవి:
అమ్మా అవని… ఆర్తి వినవే మా మాట
నీ ఒడిలోనే మా జీవన గీత
పచ్చని చెట్లతో పూజిస్తాం నిన్ను
నీ ఋణం తీర్చే మమతే మా పథం॥
🎶 చరణం – 1:
బీడు నేల గుండెలో భారమంత మోసి
గరళ రసాయనాల్ని దిగమింగి నీవు
క్షామాల్ని సైతం చిరునవ్వుతో ఎత్తి
కన్నతల్లిలా మమ్మల్ని కాపాడితివి॥
🎶 చరణం – 2:
కాలుష్య కోరకలలో చిక్కి విలపించి
జలచర జీవాలు గగ్గోలు పెడగా
కారుచిచ్చు వేడిని భరిస్తూ నీవు
కన్నీరు జార్చే నేలతల్లి అయ్యావు॥
🎶 చరణం – 3:
బీడువారిన నీ ఒడిలో చినుకులు జాలువారగా
తడి ముద్దుతో మురిసే మాతృమూర్తి
సెగల పొరల్లో పుడమి చైతన్యం మొలకెత్తి
జీవరహస్యం నీవే చూపితివి॥
🎶 చరణం – 4:
చినుకు చినుకు చుంబనంతో విత్తనం చిగురించి
పురిటి నొప్పులలో అంకురం పుట్టగా
పచ్చని చేలలో జోలపాడే వేళ
ధరణి మాతకు అలంకారమవుతాం॥
🎶 చరణం – 5 (ముగింపు):
ఎంత వింత ఈ అఖండ సృష్టి కార్యం
ఎంత గొప్ప నీ ఆలింగనం అమ్మా
పచ్చని చెట్లు నాటి సేవచేసి
నీ ఋణం తీర్చుదాం మాతా అవని॥
🌿 ప్రత్యేకత:
పల్లవి ప్రతి చరణం తర్వాత పాడితే భావం గాఢంగా చేరుతుంది
********
పల్లవి:
నాది కాదు తప్పు… నాది కాదు!
నన్ను నమ్ము రా నాది కాదు!!
నాది కాదు తప్పు… నాది కాదు!
ఎవరిది చెప్పు రా నాది కాదు!!
చరణం – 1 (అవ్వ–మనవడు):
నవ్వ యేల నీవు బువ్వ వండుట లేదు?
తీరునాక యెలా తినగ నేనెట్లు?
అవ్వ రాగమహిమ చూప రవ్వ వెలుగు
వడ్లు నమ్మలేదు వ్యాపారి సంతలో
నాది కాదు తప్పు… నాది కాదు!!
చరణం – 2 (వ్యాపారి):
అమ్మ లేదు నేల వ్యాపారి వడ్లను
వంట యెలా చేయ వడ్లు లేక?
పంపలేదు రైతు వడ్లను నాకింక
నమ్మ కంబుగా వ్యాపారి నటనకాదు
నాది కాదు తప్పు… నాది కాదు!!
🎶 చరణం – 3 (రైతు):
నేలసేవ చేయు నేర్చిన రైతన్న
వడ్లు నేల నించి రాలేదు
పంట పండలేదు ఎట్ల లభ్యమవు?
కష్ట పడ్డ కడుపు గనగ లేను
నాది కాదు తప్పు… నాది కాదు!!
చరణం – 4 (వాన):
వడ్లు పంట యేల పండుట లేదయ్యా?
భూమిలోన ప్రజకు పోషణ యెలా?
వాన పడుటలేదు వత్సరముల నుండీ
కాల మాయ యేమి కనుల తీరు
నాది కాదు తప్పు… నాది కాదు!!
చరణం – 5 (మేఘం–గాలి):
మిన్నులోన తిరిగె మేఘరాజమూ
చినుకు జల్లు నేలపై చిందలేదు
గాలి వీయలేదు చాల రోజుల నుండీ
మింగ మెతుకులేదు మేలు యేది
నాది కాదు తప్పు… నాది కాదు!!
చరణం – 6 (వాయు–ప్రకృతి):
ఏల వాయుదేవా వీయకుండితివి?
పృథ్విలోన జీవం నిలుచునా?
వసుధలోన వృక్షవాటికలే లేవు
సృష్టి ధర్మ మిదియు శృతి లయలగు
నాది కాదు తప్పు… నాది కాదు!!
చరణం – 7 (ముగింపు – మనిషి):
వృక్షజాతి నేల వృద్ధి చేయలేదు
నేలతల్లి నీవు నిస్సహాయమై
మనుజులే నేడు వనములు నశింపజేసి
కలి మహిమయు ఆశ కాల మాయ
నాది కాదు తప్పు… నాది కాదు!!
*****
నేటి 22/04/ గీతం
☕ తేనీటి పాట ☕
తేనీటి తియ్యని మాధుర్యమే
తలపుల్ని తడిమే స్నేహమే
ఉదయమున లేస్తే ఊపిరిలా
మనసున్ మేల్కొలిపే మంత్రమే ॥
ఒక చుక్కలో ఉత్సాహమే
ఒక కప్పులో ఆనందమే
స్నేహితులతో కూర్చుని తాగితే
సరదాల సిరుల సంద్రమే ॥
అతిథి వచ్చిన వేళలో
ఆప్యాయత పూసే ఆచారమే
చల్లని మాటలతో కలిసినపుడు
చిరునవ్వుల చాయే తేనీటే ॥
పని మధ్యలో అలసటొస్తే
పలుకరించే శక్తి నీవే
చుక్క చుక్కగా చైతన్యమిచ్చే
చిరకాల సఖి తేనీటే ॥
మితిమీరితే మాయగదా
మితిలోనే మాధుర్యమది
అలవాటు అయినా జాగ్రత్తగా
ఆనందమే నీవు తేనీటే ॥
లోకమంతా లీనమైన
లాలిత్య రాగమై నిలిచే
తేనీటి ఘన ప్రశస్తియే
మన జీవిత గీతమై వినిపించె ॥ ☕🎶
*****
నేటి 21/04 గీతం
బాలాత్రిపురసుందరి ఉయ్యాలా పాట
జగత్తారిణి ఉయ్యాలో
జ్ఞాన వికాసిని ఉయ్యాలో
బాలత్రిపుర దేవి ఉయ్యాలో
బంగారు మాయమ్మఉయ్యాలో
కరుణ చూపే తల్లి ఉయ్యాలో
కరుణామయి ఉయ్యాలో
అందాల మా తల్లి ఉయ్యాలో
ఎన్నెన్నో రూపాలు ఉయ్యాలో!!
!! ఉయ్యాలో !!
లోకాన్ని భయపెట్టే ఉయ్యాలో
రాక్షస పుత్రులు ఉయ్యాలో
భండాసుర పుత్రులను ఉయ్యాలో
అంతా అందించావు ఉయ్యాలో
రాక్షసుల నుండి ఉయ్యాలో
విముక్తి కలిగించి ఉయ్యాలో
అభయ హస్తం మిచ్చిఉయ్యాలో
ఆదుకున్న వమ్మ ఉయ్యాలో!!
!!ఉయ్యాలో!!
మూల దేవతవు ఉయ్యాలో
నీవే ఓయమ్మ ఉయ్యాలో
త్రిగుణాల మాయమ్మ ఉయ్యాలో
త్రిపుర సుందరి దేవి ఉయ్యాలో
శివుని లో మీరు ఉయ్యాలో
అర్ధ భాగమమ్మ ఉయ్యాలో
మంగళ గౌరీ ఉయ్యాలో
ఓంకార రూపిని ఉయ్యాలో!!
!!ఉయ్యాలో!!
విశ్వశాంతికి ఉయ్యాలో
విజేత నీవమ్మా ఉయ్యాలో
తెలుగు నేల పైన ఉయ్యాలో
అమ్మోరు నీవమ్మా ఉయ్యాలో
భక్తులను కాచేటీ ఉయ్యాలో
భద్రకాళి వమ్మ ఉయ్యాలో
సూర్య బింబమ మొలే ఉయ్యాలో
మెరిసేటి నా తల్లి ఉయ్యాలో!!
!!ఉయ్యాలో!!
*******
అక్షయ తృతీయ సందర్భముగా ప్రాంజలి ప్రభ రోజుకొక గీతం.. పాడండి, మీ అభిప్రాయాలు తెలపండి... మీ మల్లాప్రగడ శ్రీదేవీ రామకృష్ణ
🎶 ప్రాంజలి ప్రభ — కలియుగ మాయ (పాట రూపం)
పల్లవి:
కలియుగ మాయలో మాటలే మిగిలెను
అవసర బంధమే నేటి జీవనము
ఏ ఎండకో గొడుగు పట్టే మనసులు
నిజమైన ప్రేమ ఎక్కడో మాయమైపోయెను ॥
చరణం 1:
సొమ్ములులేని వాడిని చేరరు ఎవరూ
అధికారంలేని వాడిని చూసరు ఎవరూ
ఎండిన వృక్షమునకు పక్షులే రావు
లాభం లేని చోటు మనుషులే ఉండరు ॥
చరణం 2:
కష్టంలో దొరికిన దానమును మరిచెడు
సుఖమొచ్చిన వెంటనే మారెడు మనసు
అమ్మ ప్రేమను మరిచెడు పెరిగిన బిడ్డ
నాన్న ఇచ్చిన దానిని గాలిలో కలిపెడు ॥
చరణం 3:
అవసరానికే స్నేహమని చెప్పెడు
అవసరమైతే తోడుండడు వెనుకడుగు వేయెడు
కోరికలతో కట్టిన ఈ బంధములన్నీ
తీరిన వెంటనే చెల్లాచెదురైపోయెడు ॥
చరణం 4:
చదివిన విద్యను తిట్టెడు కాలమిది
ఉపాధి రాలేదని నిందించే లోకం
మాటలతో బ్రతికే మానవ జాతి
నిజం కన్నా నటన నేర్చుకున్న కాలం ॥
ముగింపు (ముక్తాయింపు):
అవసరమే ప్రేమై మారిన ఈ లోకంలో
ఆత్మసత్యమే నిలిచే నిత్య దీపము ॥
🌿****
No comments:
Post a Comment