ప్రతిరోజు
మాతృభాష, మాతృభూమి, మాతృశ్రీ మరువద్దు
🌹🌹🌹🌹🌹🌹తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*మాతృశ్రీ *..ఇచ్ఛా.. చందస్సు, లో పద్యం, కవిత, చిన్న కధ
- 25/04
*బలుకు , బలుపు, కలు పు, మలుపు*
🙏🙏🙏🙏🙏🙏🙏
బలుకు మాతృవాక్యముసూత్ర మధురతగను
బలుపు నమ్మక ధైర్యము బాట చూపు
కలుపు ప్రేమకలయికలో కళలు తీరు
మలుపు జీవి మాతృకృపగా మంగళమగు
తల్లి మాటలు మధురమైన సూత్రాలుగా మారుతాయి.
ఆమె నమ్మకం ధైర్యంగా మనకు దారి చూపుతుంది.
ప్రేమతో మనుషులను కలిపితే జీవితం సౌందర్యంతో నిండుతుంది.
జీవితంలోని మలుపులు తల్లి కృపతో శుభంగా మారుతాయి.
*******
బలుకులతీరుణ బ్రతుకగు
బలుపుల మాయల వలపుకు బలిగాయగుటన్
కలుపు కొను విధము నిజమగు
సలిలమె యుత్సాహపరచి సంతోషమిడన్
మాటలు జాగ్రత్తగా ఉండాలి, మాయల ఆకర్షణలకు లోనుకాకూడదు, మంచి సంబంధాలు పెంచుకోవాలి, ఉత్సాహంతో జీవిస్తే సంతోషం లభిస్తుంది.
*******
బలుకు పద్య మొకటి భాషకీ ర్తినిచాటి
బలుపు చూపు తున్న యాంగ్ల భాష
కలుపుతీసికలిసికదముతొక్కిన ప్రతి
మలుపు మాతృ భాష మనుగడౌను
బోర భారతీదేవి విశాఖపట్నం
*******
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 25/04
పాదాది.. న్యస్తాక్షరి.......స, హ, న, ము
🙏🙏🙏🙏🙏🙏🙏
న్యస్తాక్షరి స...హ..న...ము.
సత్య ,ధర్మము లన్నియు సన్న గిల్లె
హవ్య వాహను డిప్పుడె హద్దు మీరె
నరుల మధ్యన పెరిగెను నలత లెన్నొ
ముదము నంతను కోపము ముట్ట డించె!
పరాశరం శ్రీనివాసాచార్యులు నరసరావుపేట.
8978757855.
******
సత్యమాడమదికిసంతోషమేకల్గ
హరియు మెచ్చి వరము లిచ్చు చుండు
నరుల కెల్ల నెపుడు నందకుమారుడు
ముక్తి పథము చూపి బ్రోచు నతడు
డా బల్లూరి ఉమాదేవి
*****
సత్యము తెల్పనీకళలు సర్వము శాంతిగ నిత్యసత్యమున్
హత్యము దుష్టకల్పనల హానిని యాపుచు సర్వ మోహమున్
నత్యు సమాలతీరుగను నాణుడి తత్త్వము కాల నిర్ణయమ్
ముత్యము తీరు జీవనము ముద్దుల మాయల మర్మమేయగున్
నత్యు అనగా నాట్యము
******
" స హ న ము "
ఉ:
స'త్తువ నీయు ప్రార్థనము సర్వము మేలగు మానవాళికిన్
హ'త్తుగడన్ విచిత్రముగ హాయిని గూర్చుగ సత్తు మంత్రమై
న'త్తడి కోర్కెలెల్లయును నాదను భావన చేతనే గదా
ము'త్తపు యాశలేలనిక ముద్దుఁ పఠింపుము శాంతి మంత్రమున్
డా.మీ.మి*
******:
దిట్టకవి శ్రీనివాసాచార్యులు 9441745525
పాదాది న్యస్తాక్షరికి పూరణ
------------
సహనమున భూమి కెవ్వరు సాటీ రారు,
హస్తభూషణ మీనాడు పుస్తకంబు,
నరుని జన్మయె శ్రేష్ఠంబు ధరణి లోన,
ముదితలను గౌరవింఛిన పదిల మగును.
(తేటగీతి)
******
సరయు పాపము చెప్పలేకయు సాధు బుద్ధిగ గర్వమున్
హరిని గొల్వగ ధర్మమేయగునాడి తత్త్వము శాంతిగన్
నరుల మార్గము మాయ మర్మము నమ్మ బల్కు లమధ్యగన్
మురళి మోహన రూపమోక్షముసూత్రమేయగు తీరుగన్
***::*
సదరు భక్తిని నిల్పితెల్పగ సంస్కృతీసహనంబుగన్
బదము లల్లియు భారతీకృతి భాగ్యసీమసయోగ్యతన్
బదులు సఖ్యత పద్యకావ్యము భాసిరీతినివ్రాసినట్టిగన్
చదువతగ్గ యశంబుగాయగు జాతిలక్ష్యమునెంచగన్
******
25/4/26 న్యస్తాక్షరి
స. హ. న. ము.
సత్య భాషణంబు సత్కీర్తి కలిగించు
హరుని సేవనంబు హరియించు నార్తిని
నలువ వ్రాయుచుండు నరుని నుదుటిపైన
ముర హరుండు బ్రోచి ముక్తి నొసగు
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు
******
న్యస్తాక్షరి. *స హ న ము*
-----------------------------------------
ఆ. వె.
స)కల పాపములను సర్వమయుడు తాను
హ)రి హరించుచుండు ననవరతము
న)రహరినిదలంచి నరులు భవ్యపదవి
ము)క్తినొందు చుంద్రు ముదముగలుగ!!
మాచర్ల మల్లేశం.
******
న్యస్తాక్షరి (స, హ, న, ము)
పద్యము:
సత్యమున్ నిలిచిన సద్గుణ మార్గమున్ సాగున్ జీవితం
హృదయమున్ హితముగా హరిస్మరణంబు హారమై నిలున్
నిత్యమున్ నవచైతన్య భావముతో నడచున్ మనుజుడు
ముక్తికై మనసున్ మలినములు మర్చి మాధవున్ చేరున్ ॥
సరళ భావం:
సత్యం, సద్గుణాలతో జీవితం నడిస్తే
హృదయంలో భగవంతుని స్మరణ ఉంటే
నిత్యం కొత్త ఉత్సాహంతో జీవిస్తే
మనసులోని మలినాలను తొలగించి
ముక్తిని పొందగలుగుతాడు.
మీరు కూడా ఇదే న్యస్తాక్షరితో మీ స్వరచన పంపితే, దానిపై మనం కలిసి భావ విశ్లేషణ చేయవచ్చు.
***
[[24/04, 5:05 am] Mallapragada Sridevi: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 24/04
పాదాది.. న్యస్తాక్షరి.......దై, వ, బ, లం.
🙏🙏🙏🙏🙏🙏🙏
[24/04, 5:14 am] Mallapragada Sridevi: దైవమున్ పూజ ధరణిలో ధైర్య దీప్తి
వనరు విశ్వాసమే జీవి వాక్కు తీరు
బలమె సత్సంగనమ్మక భావ శుద్ధి
లంబ లాలిత్య జీవితం లహరి గాను
భావం:
ఈ భూమిపై దైవపూజ మనసుకు ధైర్యాన్ని, వెలుగును ఇస్తుంది.
మనిషి మాటల్లోనూ, ప్రవర్తనలోనూ విశ్వాసమే ప్రధాన ఆధారం.
సత్సంగం (మంచి వారి సహవాసం) మనకు నిజమైన బలం ఇచ్చి, మనసును పవిత్రం చేస్తుంది.
ఈ అన్ని కలిసినప్పుడు జీవితం లాలిత్యంగా, ఆనంద తరంగాలుగా సాఫీగా సాగుతుంది.
**++
దైవమన్న యిలను తల్లియే తెలుసుకో,
వద్దు నెవరి తోడ వాదులాట
బడికి వెళ్ళి చదువు భక్తి తోడనుపిల్ల
లంత మెలగ వలయు లక్షణంగ
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు
******
దిట్టకవి శ్రీనివాసాచార్యులు 9441745525 పాదాది న్యస్తాక్షరికి పూరణ
------------
దైవమును నమ్మవలయును తప్పకుండ,
వడ్డికాసులవాడెపో వరదు డనగ,
బలము కన్న నరయ బుద్ధిబలము మిన్న,
లంకపట్నము రావణు రాజధాని.
(తేటగీతి)
*****
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 23/04
పాదాది.. న్యస్తాక్షరి....... చ, క్ర, తీ, ర్ధం
🙏🙏🙏🙏🙏🙏🙏
చలువరాతి విగ్రహ మది చల్లచేయ
క్రమము గావిలువలు పెంచ క్రాంతి నివ్వ
తీపి బహుమానజీవన తీర్పుగా ర
ర్ధంబు కృపతోన రంజిల్లు రంగ మేను
మనిషి మొదట శిల వంటివాడై ఉంటాడు. గురువు కృపతో, క్రమశిక్షణతో విలువలు పెంపొందుతాయి. ఆ మార్పు జీవితానికి తీపి ఫలితాన్ని ఇస్తుంది. చివరకు జీవనార్థం గ్రహించి, జీవితం ఆనందంతో కళకళలాడుతుంది.
******
చిత్రమైన జగంబిది చిత్తశుద్ధి
క్రతువులందు కర్మఫలము కృపతో ను
తీర్థములు యాత్ర తీరగు తీవ్ర బ్రతుక
ర్ధంగ తెలిసిన జీవన ధన్య భువన
ఈ జగత్తు అనేక చిత్రవిచిత్రాలతో నిండి ఉంది. అందులో మనిషికి ప్రధానమైనది చిత్తశుద్ధి. యజ్ఞాలు, క్రతువులు వంటి కర్మలు చేసినా, వాటి ఫలితం దేవకృపతోనే సిద్ధిస్తుంది. తీర్థయాత్రలు చేసినా, అసలు తీర్థం బయట కాదు — మన అంతరంగంలో తత్వబోధ కలిగినప్పుడే నిజమైన పవిత్రత పొందుతుంది.
చివరగా, ఈ జీవన సత్యాన్ని (అర్థాన్ని) గ్రహించినవాడి జీవితం ధన్యమవుతుంది; అటువంటి జీవనమే భువనంలో శ్రేష్ఠమైనది.
*****
****
దిట్టకవి శ్రీనివాసాచార్యులు
చక్రము గొని చంపె చక్రి సైంధవుని,వ
క్రపథమున cజనుట సుఖమ్ము గాదు,
తీగ ప్రాకుచుండు వేగ మొప్పంగ,తీ
ర్థంపు సేవనమ్ము రక్ష యగును.
******
చందమామలోని చల్లని వెన్నెల
క్రమము గల్గువాని కార్యదీక్ష
తీయ దనము నిచ్చు తేనెయు కనగతీ
ర్థంబు గాదె మదిన తరచి చూడ
కాళిదాసు సుబ్బయ నెల్లూరు
*గళము , కలము, తలము న లము*,
గళము గానము గౌరవంబది గమ్య విద్యల తీరుగన్
కలము రేఖల తత్త్వభావము కామ్య బుద్ధి జీవమున్
తలము సేవలు తల్లిదండ్రుల తన్మయ భావ భాగ్యమున్
నలము జీవన నమ్మకంబగు నిత్యసత్య సుసంపదన్॥
భావం
గళం ద్వారా గౌరవం వ్యక్తమవుతుంది
కలం ద్వారా తత్త్వం వెలుగుతుంది
తల వంచి తల్లిదండ్రుల సేవ చేయడం జీవన భాగ్యం
ఇవన్నీ కలిసే నిజమైన సుసంపన్నమైన జీవితం
******
గళము కామ్యకర్మలుగాను కాంక్ష విడిచి
కాలము యోగియారూఢుడు కావ్య చరిత
తలము యింద్రియ విషయమై తత్వమహిమ
నలము త్యాగి సంగరహిత నమ్మ బతుకు
కాంక్షలను విడిచి, యోగ స్థితితో జీవిస్తూ, ఇంద్రియాలను అధిగమించి, త్యాగం మరియు అనాసక్తితో నడిస్తే జీవితం ఒక సార్థకమైన కావ్యంగా మారుతుంది.
*****
గళమువిప్పవయ్యగతగతి మార్చగ
కలముపదునుపెట్టగకులకుళ్ళు
తలమునుండితీసితరిమికొట్టగవచ్చు
స్థలమునుంచబోకుసంకోచముకెపుడు
బోర భారతీదేవి విశాఖపట్నం
21/04, 7:35 pm] . Mallapragada: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 21/04
పాదాది.. న్యస్తాక్షరి........సం, కీ, ర్త, న.
🙏🙏🙏🙏🙏🙏🙏
సంపద విలువ కనుగొను సమత మమత
కీర్తి హృదయ సత్య కరుణ చిత్త మహి మ
ర్త సుమ సక్యతా సంసార రమ్య చరిత
నమ్మకం జీవన ఫలము నయన మాయ
🌿 భావం:
సంపదకు నిజమైన విలువ సమతా, మమతలలోనే తెలుస్తుంది. కీర్తి హృదయంలో సత్యం, కరుణతో కూడిన చిత్తశుద్ధి వల్ల పుడుతుంది. సఖ్యత, సౌమ్యతలతో సంసారం రమ్యంగా మారుతుంది. నమ్మకం జీవితం యొక్క అసలు ఫలితం; అది మనసుకు అమృతమయమైన ఆనంద మాయ.
*****
సంభవం సహాయ సమర లక్ష్యముగాను
కీలక మను శక్తి చిత్త బల న
ర్తనము ఆత్మ ఘోష తనివితీరా కళ
నమ్మ బలుకు తనము నరము మలుపు
🌿 భావ వివరణ:
జీవితంలో జరిగే ప్రతి సంభవం (సంఘటన) ఒక సమరంలాంటిది—అది మన లక్ష్యాన్ని సాధించేందుకు సహాయకారిగా మారుతుంది. ఈ ప్రయాణంలో కీలకమైన శక్తి మన చిత్తబలం (మనసు ధైర్యం, స్థిరత్వం).
మన అంతరంగంలో ఉద్భవించే ఆత్మఘోష (లోపలి స్వరం) ఒక నర్తనంలా, ఒక కళలా వ్యక్తమవుతూ మనసుకు తృప్తిని ఇస్తుంది.
చివరగా, మనిషి జీవితాన్ని మలుపు తిప్పేది నమ్మకం—మనలోని విశ్వాసమే మన స్వభావాన్ని, మన గమ్యాన్ని మార్చగల శక్తి.
*****
సంత దున్నల దుర్నీతి సాహు తరము
కీడు మేకల తృప్తియే కీర్తిగా వ
ర్తన లు ముడిచాయి చరితగా తనువు తపన
నటన తెలుసుకో తెలివితో నమ్మ బలుకు
భావం:
సమాజంలో దుర్నీతులు (అన్యాయాలు) పెరిగి, వాటిని నడిపించే వారు సాహువుల్లా (పెద్దల వలె) ప్రవర్తిస్తున్నారు. చెడు పనులనే తృప్తిగా భావించి, వాటినే కీర్తిగా ప్రచారం చేస్తున్నారు.
అలాంటి ప్రవర్తనలు క్రమంగా చరిత్రగా ముడిపడుతూ, మనిషి తన శరీరానికీ, మనసుకీ తపనను కలిగిస్తున్నాయి. జీవితం ఒక నాటకంలా మారింది—అందులోని నటనను, వాస్తవాన్ని తెలివితో గ్రహించాలి.
చివరగా, మనం నమ్మే మాటలు, ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి; అవే మన బలం అవుతాయి.
*******
సంభవించును విజయంబు శక్తివలన
కీర్తి సంపద బలుకుగా గెలుపు ఋజువ
ర్తనము సమకూరు యిలలోన తప్పకుండ
నరుడు తెలియంగ వలయును నాణ్యమెరిగి
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు
[21/04, 7:45 pm] . Mallapragada: ప్రతిరోజు
మాతృభాష, మాతృభూమి, మాతృశ్రీ మరువద్దు
🌹🌹🌹🌹🌹🌹తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*మాతృశ్రీ *..ఇచ్ఛా.. చందస్సు, లో పద్యం, కవిత, చిన్న కధ
- 21/04
*నలుపు , తెలుపు ,మలుపు, తలపు*
🙏🙏🙏🙏🙏🙏🙏
గురుభ్యో నమః 🙏
మాతృశ్రీ – నలుపు, తెలుపు, మలుపు, తలపు లతో కవిత
మలుపుల జలకళలతో మార్గము మసకబారగా
వచ్చిన వేళలో మనసు మలుపున్ దిగులై నిలిచె
మారిన దారిలో మర్మము కలలై వెలిసె
ప్రతి అడుగులో మలుపు మార్పుల సారమై నిలిచె
నలుపుగా చీకటి నరుని కోరిక తీర్చగా
నెలవంక నక్షత్రాల మెరుపులందు నవ్వగా
వెన్నెల సౌరభమున్ వింతగా మనసు తడిమె
నళినీ తీరున మనసు మన్నన పొంది వికసె
తలపు తాకిన క్షణమే ధైర్య దీపమెలిగె
తలపు మాధుర్యమందు జీవితం నవమై వికసె
తలపు ప్రతి నిమిషమున ప్రేమసుధగా నిలిచె
తెలుపు తల్లి హృదయ దీపమై వెలుగున్ నింపగా
తెలిసిన మార్గమందు సత్య సుగంధమై నిలిచె
ధైర్య జ్యోతిగా స్వచ్ఛత విరజిల్లగా
తెలుపు గుణమే జీవితం తీర్చు తీయని తారక ॥
🌿 సారం:
జీవితంలోని మలుపులు మార్పుల్ని నేర్పుతాయి; నలుపు చీకటిలోనూ అందం ఉంది; తలపులు ధైర్యాన్ని నింపుతాయి; తెలుపు సత్యం, స్వచ్ఛతతో జీవితం ప్రకాశిస్తుంది.
*****
నలుపు నానుడి కాదు మానస నాడి సుందర రూపముణ్
తెలుపు విద్యలు యెన్ని యున్నను తీక్షణా ఫలతీరుగన్
మలుపు లున్నను సాగు గమ్యము మాయ మచ్చలుగా యగున్
తలపు లెన్నన శంకటంబులు తప్పు నొప్పులుగానగన్
🌿 భావం:
“నలుపు” అంటే కేవలం చెడు లేదా నింద కాదు; అది మనసులోని అంతర్భాగం—మానస నాడిలా సున్నితమైనది, ఒక సుందర రూపాన్ని కూడా దాల్చగలదు.
“తెలుపు” అంటే విద్య, జ్ఞానం ఉన్నా—అది వెంటనే ఫలితమివ్వదు; తక్షణ ఫలితం అనేది సులభం కాదు.
జీవితంలో ఎన్ని “మలుపులు” వచ్చినా, మన గమ్యం మాత్రం కొనసాగుతుంది; కానీ ఆ మార్పులు కొన్ని మాయల మచ్చల్లా అనిపించవచ్చు.
మనసులో ఎన్ని “తలపులు” (ఆలోచనలు, ఆశలు) ఉన్నా, అవి కొన్నిసార్లు శంకలు, కష్టాలు, తప్పులు, నొప్పులకూ కారణమవుతాయి.
*****
ఆ/వె/.నలుపు తెలుపు లన్ని మలుపులో తలపులే
యనుభవముల లోని యలల కలలే
విలువ లన్ని దెలిసి కలిసి మెలిసి సాగ
మనుజ జీవనమ్ము మహిని నిలుచు !
బయ్యారపు మల్లేశ్వరరావు
*****
నలుపు శుభము కాద నకునలుపేలేని
తెలుపువిలువలేదుతలచిచూడ
మలుపుతిప్పినట్టిమనుజుడైనాకాని
తలపులదుపుతప్పితప్పటడుగువేయు
బోర భారతీదేవి విశాఖపట్నం
*****
No comments:
Post a Comment