Wednesday, 8 April 2026

 


*ఈశావాస్య ఉపనిషత్* భావం

ఇది  top no. 1 ఉపనిషత్

ఇది అతి చిన్న ఉపనిషత్ 

ఇది 18 శ్లోకాల ఉపనిషత్తు 

ఇది ఆత్మ జ్ఞాన దీపిక


​1 *ఓం ఈశావాస్యమిదమ్ సర్వం*

 దైవమే అంతటా  ఉంది

పరుల ధనం ఆశించకు


​2 *కుర్వన్నేవేహ కర్మాణి..*

ప్రతిఫలం కోరక కర్మ చేయాలి

అట్టివారు కర్మ బందీలు కారు

​3 *అసుర్యా నామ తే లోకా..*

సుఖం కోసం  బతికేవారు 

చీకటి లోకాలకు చేరెదరు

​4 *అనేజదేకం మనసో జవీయో*..

ఆత్మ మసస్సు కన్నా వేగం కలది

ఆత్మ కదలనిది ముందు ఉండేది

 ​5 *తదేజతి తన్నైజతి*

అతి దూరంగా అతి దగ్గరా ఉంది

అన్నిటి లోపలా  బయటా ఉంది

​6 *యస్తు సర్వాణి భూతాన్యే*

 అన్నిటిలో తన ఆత్మనే చూసేవారు

వారు ఎవరినీ అసహ్యించుకోరు

​7‌ *యస్మిన్ సర్వాణి భూతాని*

 అన్నిటిలో  ఆత్మ  ఉందని తెలిసిన

 జ్ఞానికి మోహం దుఃఖం నశించును

​8 *స పర్యగాచ్చుక్రమకాయమవ్రణం*

ఆత్మ నిర్మలం  ,దేహం దోషం లేనిది

ఆత్మ సర్వ వ్యాప్తం స్వయంప్రకాశం 

​9 *అంధమ్ తమః ప్రవిశంతి*

 లౌకికం  ఆధ్యాత్మికం తెలియాలి 

చీకటిని  ఇంకా చీకటిని దాటాలి

​10 *అన్యదేవాహుర్విద్యయా*

కర్మలతో  ఒక ఫలితం కలుగును

జ్ఞానంతో వేరే ఫలితం కలుగును 

​11 *విద్యంచ అవిద్యంచ...*

కర్మఫలం జ్ఞానఫలం తెలియాలి

కర్మ ఫలంతో మరణం దాటాలి

జ్ఞానంతో అమరత్వం చేరాలి 

​12 *అంధం తమః ప్రవిశంతి*

 *యేఽసంభూతిముపాసతే*

నశించే దానినే పూజించిన చీకటి 

నశించని దానినే పూజంచినా చీకటే   

​13 *అన్యదేవాహుః సంభవాత్*

ఆకారం నిరాకారం దైవాల పూజలు

వేరు వేరు ఫలితాలు కలిగించును 

​14 *సంభూతించ వినాశంచ*

 దైవాన్నీ  ప్రకృతినీ  పూజించేవారు 

మరణం దాటెదరు మోక్షం చేరెదరు

​15 *హిరణ్మయేన పాత్రేణ*... 

సత్యం పై బంగారు మూత ఉంది 

సూర్యదేవా మూతను తొలగించు

సూర్యదేవా  సత్యాన్ని చూపించు.

​16 *పూషన్నేకర్షే యమ సూర్య*... 

సూర్యా నీ కిరణాల అడ్డం తొలగించు

నీలో  కళ్యాణ రూపం నాకు చూపించు

 నేనే నీలో ఉన్న ఆ పురుషుడను

​17 *వాయురనిలమమృతమథేదం*

నా ప్రాణం గాలిలో కలిసి పోవాలి

నా శరీరం బూడిద అయిపోవాలి

 మనసా నీ కర్మలు గుర్తు ఉండాలి

​18 *అగ్నే నయ సుపథా రాయే*

అగ్ని దేవా ఉత్తమ దారిలో నడిపించు

మాలోని దోషాలు పాపాలు తొలగించు

అగ్ని దేవా నీకు మా నమస్కారములు

*సండే స్టోరీ* 

*తాతగారి ఇల్లు* 

🏠


రచన : వి. శ్రీనివాస్ రాయ్


“పెద్దబాబు, భోజనం అయ్యిందా, పిల్లలు ఏమి చేస్తున్నారు” అంటూ ఇండియా నుంచి ఫోన్ చేసిన నాన్న  సంభాషణ కొనసాగించారు………


“రాతకోతలు ముగించుకుంటే పని మొదలు పెట్టుకుంటాను అని బిల్డర్ ఒకటే ఫోన్ చేస్తున్నాడు. పిల్లలతో మాట్లాడి చెబుతానన్నాను. రెండేళ్లు నుంచి అడుగుతున్నాడు కదా. నీ తమ్ముడు ఒప్పుకున్నాడు కానీ నువ్వు ఎందుకో సుముఖంగా లేవు. నీకు ఇష్టం లేకుండా ఆస్తుల విషయంలో ఏ నిర్ణయం నేను తీసుకోను. ఇందాక ఫోన్ చేసి చివరగా కొంచెం  పెంచి మన వాటాకు 25 ఫ్లాట్స్ తో పాటు చేతికి 1.75 పైకం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇంతకంటే ఇవ్వలేనని లేకపోతే వేరే ప్రాజెక్ట్ మొదలు పెట్టుకుంటాను అని ఖరాకండిగా చెప్పేశాడు”.


“ఇంత పెద్ద ఇంట్లో  మీ అమ్మ నేను మాత్రమే ఉంటున్నాం. ఎప్పుడో మీరంతా వస్తే తప్ప సందడి ఉండటం లేదు. వయస్సు ఫై పడిన వాళ్ళ ఇళ్లకు ఆహ్వానం లేకుండా వచ్చే బంధువులు  బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు అవే మాకు తోడుగా ఉంటున్నాయి. మీ అమ్మ ఒక్కతే  పనులు 

చేసుకోలేకపోతోంది. సరైన పనోళ్ళు దొరికి చావట్లేదు. 


అది కాకుండా ఇప్పుడు వున్న మార్కెట్ పరిస్థితుల్లో ఇది చాలా మంచి ఆఫర్ అని మీ బుల్లి బాబాయ్ కూడా అన్నాడు. ఇల్లు సంగతి తేల్చేసి, ఎవరది వాళ్లకు సర్దేస్తే  నాకు మనశాంతిగా ఉంటుంది. 


ఊర్లో పొలాలు, మిగతా స్థలాలు సంగతి మీరు ఇక్కడకు వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.” అని అంటే “వచ్చే వారం సిడ్నీలో కాన్ఫరెన్స్ వుంది నాన్న, దాని తర్వాత సెలవులు చూసుకొని మేము ఇండియా వస్తాము. తమ్ముడితో మాట్లాడి మీకు వివరాలు తెలియచేస్తాను” అని చెప్పి ముగించాను. 


మా ఊరు శివారులో నాన్న చిన్నప్పుడు తాతగారు ముప్పావు ఎకరంలో కట్టిన ఇల్లు “శ్రీ శ్రీనివాస నిలయం”. ఊరు అన్నివైపులు పెరగటం తో నడిబొడ్డు లోకి వచ్చేసింది. అపార్టుమెంట్ కల్చర్ కి అలవాటు పడుతున్న ప్రజానీకమ్ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఓ బిల్డర్ ప్రతిపాదన నిమిత్తం నా ఆమోద ముద్ర కోసం జరిగిన సంభాషణ సారాంశం.



ఈ రోజు ఇంటి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఆసన్నమైంది. 


అక్కడే పుట్టాను, అక్కడే ప్రాకాను, అక్కడే పెరిగాను,  పద్ధతులు నేర్పిన చోటు, పరివర్తన తెలుసుకున్న స్థలం. అక్కడే తాతగారు నన్ను ఎత్తుకొని తిరిగారు. నాయనమ్మ గోరు ముద్దులు తినిపించడానికి మేడమీదకి తీసుకువెళ్లేది. జేజమ్మ, జేజతాత  అక్కడికి రావటం నాకు లీలాగా గుర్తు వుంది.


నేను చదువుకునే రోజుల్లలో  అన్ని వర్గాలకు, వర్ణాలకు చెందిన వాళ్ళు నా మిత్ర వర్గంలో వుండేవాళ్ళు. మా ఇంటి వెనకాల స్థలాన్ని  తాతగారు ఖాళీగా ఉంచేయడంతో మాకు ఆడుకోడానికి బయటకు వెళ్ళవలసిన అవసరం లేకుండాపోయింది. గోళీలు ఆడుకుంటూ గొడవలు పడేవాళ్ళం. క్రికెట్ ఆటలో కొట్టుకునేవాళ్ళం.  వయస్సు పెరిగే కొద్దీ ఆటలకు స్వస్తి పలికి సాయంకాలం వేళ స్నేహితులతో పిట్టగోడమీద కూర్చుని నాయన్నమ్మ చేసే పకోడీలు, బజ్జిలు తింటూ కాలం గడిపేవాళ్ళం. 


సంధ్య సమయాన  అటుగా ట్యూషన్ కు వెళ్లే రాగిణి, ప్రీతిలను చూడడానికి పోటీ పడేవాళ్ళం. 


ఓసారి నాకు ఒంట్లో బాగోపోయిన వేళ, నన్ను ప్రాణప్రదంగా చూసుకొనే రాణి అత్తయ్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మరోసారి మార్కులు తక్కువ వస్తే నన్ను కొట్టబోయిన నాన్నను సముదాయించిన  కోటేశ్వరరావు మావయ్య. 


ఈలాంటి సంఘటనలు మదిలో పదిలంగా మిగిలిపోయినవి. ఆప్యాయతలకు ఆ నాల్గు గోడలే మూగ సాక్ష్యాలు. వాటిని కూల్చేయడానికి నేను ఒప్పుకోవాలా? వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేకపోవచ్చు కానీ వారు మిగిల్చిన తీపి గుర్తులు, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు  ఎలా తుడిపేయడానికి అంగీకరించను?


ఇక్కడ తాతగారి గురించి ప్రస్తావించాలి. వారి కృషి, కష్టార్జితం వల్లనే మేమంతా  ఈ స్థాయిలో వున్నాం. 


తన తండ్రి ఇచ్చిన కొద్దిపాటి ఆస్తిని, తాతగారు ఆత్మస్థెర్యం, మనోనిబ్బరం, దృడసంకల్పం అంకితభావలతో  అభివృద్ధి చేసి అనతి కాలంలోనే ఒక రైస్ మిల్, అడితి, వ్యవసాయం అంటూ వివిధ వ్యాపారాలు చేయటంతో పురప్రముఖులలో ఒక్కరిగా పేరు గడించారు. వారి ఇద్దరి కొడుకులు కూడా ఆయన ఆశయాలు కోసం పాటుపడటం, అడుగుజాడలలో నడవటంతో వాళ్ళు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.


ఎటువంటి పరిస్థితిలోను ఆవేశం పడటం, అసభ్య పదాలు వాడటం నేను ఎప్పుడూ చూడలేదు. 


తాతగారి ఇంటి పరిసర ప్రాంతాల కోసం రిక్షా, ఆటో ఎక్కేవాళ్ళకి  మా ఇల్లు ఒక “ల్యాండ్ మార్క్”. 

“శ్రీ శ్రీనివాస నిలయం”, “ముందు”, “వెనక” “దగ్గర” అని చెప్పి భేరం ఆడేవాళ్లు. 


నీతి వాక్యాలు, జీవిత సత్యాలు , ధర్మ సూక్తులు వల్లించడానికి పట్టాలు పట్టుకోనక్కర్లేదని, సంఘం, సమాజం అనే విశ్వవిద్యాలయం లో “జీవితం" అనే డిగ్రీ చదివితే చాలని చెప్పడానికి తాతగారే ఉదాహరణ. 


భౌగోళికగా భాగ్యనగరం, వైజాగ్, మద్రాసు లకు మధ్యలో మా ఊరు ఉండటంతో తాతగారి ఇంటికి బంధువర్గం, మిత్రవర్గం  తాకిడి కొంచం ఎక్కువగానే ఉండేది.


తాతగారి ప్రస్తావన వస్తే  గౌరవం, నాన్న ఊసు ఎత్తితే మర్యాద, ఇంటి పేరు పలికితే చిరునవ్వుతో పలకరించే వాళ్లే ఇప్పటిదాకా నాకు ఎదురయ్యారు. 

ఈ గౌరవమర్యాదలకు పునాదే మా ఇల్లు. 


ఆ పెద్దల వలన పొందే అటువంటీ  గౌరవమర్యాదలు ముందు, వాళ్ళ ద్వారా సంక్రమించే  కోట్ల ఆస్తి విలువ చాలా తక్కువ అనేదే నా అభిప్రాయం.


ఆ ఇంటి స్థానంలో  నా వాటాకు రాబోయే పిచ్చికగూళ్ళు  లాంటి ఓ డజన్  ఫ్లాట్స్, మరో ఎనభై ఐదు లకరాలు కోసం  వాళ్ళందరి స్మృతులు దూరం చేసుకోనా? అటువంటి వాటిని నా జీవితకాలంలో చాలానే సంపాదించగలను అనే నమ్మకం వుంది, కానీ ఎన్ని జన్మలు ఎత్తితే  నా ఆత్మీయుల ప్రేమను  సొంతం చేసుకోగలను? ఆ అనుభవాలు ఆస్వాదించగలను?


బరువు దించుకుందామని నాన్న, తనకు 

వచ్చే వాటాతో అమెరికాలోనే ఆస్తులు పెంచుకుందామనుకునే తమ్ముడి అభిప్రాయాల మీద, నా “వీటో పవర్” వాడటం సరైన పద్ధతి  కాదు అనిపించింది.


తమ్ముడితో  సంప్రదించి ఇండియా ప్రయాణానికి అన్ని సిద్ధం చేశాను. ఆ వార్తతో నా పిల్లలు, వాళ్ళ నాయనమ్మ చేసే రొయ్యల వేపుడు, ఉలవచారు, గుత్తివంకాయి కూర గుర్తుకు వచ్చి ఎగిరి గంతువేశారు. నా సతీమణి అయితే తన వాళ్లను చూడవచ్చు అనే ఆనందం లో వుంది. ఇండియా వెళుతున్నానని సంతోషం నాలో ఏ కోశాన కలగటం లేదు.


చివరిసారిగా తాత గారి ఇల్లు చూడడానికి 

అయిష్టంగానే కుటుంబ సమేతంగా  ఇండియాకి బయలుదేరాను. 


మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్ లో పిల్లలు హడావిడిగా తిరుగుతున్నారు. నా సతీమణి తన మేనల్లుడికి  ఏదో కొందామని వెళ్ళింది. ”రేయ్, బావా, ఏంటి ఎక్కడిదాకా” అనే శబ్దంతో ఉల్లిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను. ఎదురుగా నాతో చదువుకున్న నా దూరపు చుట్టం కొండయ్య దర్శనంమిచ్చాడు . 

“మన ఊరు వెళుతున్నాను. “నీ సంగతి ఏమిటి” అన్నాను. “నేను సింగపూర్ లో నాలుగైదు రోజులు ఆఫీస్ పని చూసుకొని నేను కూడా ఊరు వస్తున్నాను. నా ఆస్తి విషయాలు తేల్చుకోడానికి”

అన్నాడు తెచ్చిపెట్టుకొన్న కోపంతో. “ఆస్తులు ఏంటి? తేల్చుకోవటం ఏంటి? నీవు ఒక్కడివే కదరా ధర్మరావు మావయ్యకి కొడుకువి? ఇంకా గొడవ ఏమిటి” అన్నాను ఆశ్చర్యంగా “ఏమిలేదురా వున్న ఆస్తి అమ్మేసి నాకు ఇచ్చేయమంటున్నాను. ఇక్కడ వ్యాపారంలో పెడితే అక్కడకన్నా ఎక్కువే వస్తుంది కదా, వాళ్ళకి నెలనెలా ఇక్కడినుంచే నేను పంపిస్తాను అంటే నాన్న వినటం లేదు. ఎప్పటికయినా  నాకు రావలసిందేగా బావా” అన్నాడు కొండయ్య. “కాదురా ఆయన ఆస్తి తన ఇష్టం” అనే లోపలే “గాడిద గుడ్డు ఏమి కాదు, వాళ్ళ నాన్న నలభై ఎకరాలు ఇస్తే ఇప్పుడు నాల్గు ఎకరాలు పూర్తిగా లేవు. అన్ని తేల్చుకుందామనే వెళుతున్నాను. ఇక్కడినుంచే లాయర్ తో మాట్లాడాను. ఈసారి అమ్మడానికి నాన్న ఒప్పుకోపోతే కోర్టులో  కేసు వేస్తాను. ఇది మా తాత ఆస్తి కదా నాకే వస్తుంది అన్నాడు లాయర్. ఎప్పటినుంచో  అడుగుతున్నాను. ఈసారి ఆటోఇటో తేల్చుకోవలసిందే” అన్నాడు, వాడిలో వున్నా విషాన్ని బయటకు చిమ్ముతూ.


 “ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు. రంగమ్మ అత్త వైద్యానికి, నీ చదువుకి ఖర్చులు అయ్యివుంటాయి కదరా, పైపెచ్చు నువ్వు  ఇక్కడ వ్యాపారంలో పోగొడితే మావయ్య కదా కొంత పొలం అమ్మి నీ అప్పులు తీర్చారు” అని నాకు తెలిసిన విషయాలు బయట పెట్టా “ఈసారి మంచి వ్యాపారం రా. ఓన్లీ లాభాలే.” అన్నాడు పోయిన సారి చెప్పినంత నమ్మకంగానే. చిన్నప్పటి నుంచి వాడు ఏమీ  మారలేదు. విఫల ప్రయత్నం చేసేవాళ్ళందరూ కొండకు వెంట్రుక వేస్తే వీడు మాత్రం ఆకాశానికి వేస్తాడు. నా కంటే రెండేళ్లు ముందే ఆస్ట్రేలియా వచ్చాడు. సంపాదించింది మాత్రం లేదు. ఎటువంటి మనిషి కడుపున ఎటువంటీ వాడు పుట్టాడో. ఇది అంతా మావయ్య కర్మ. “నువ్వు తీసుకునే నిర్ణయం అయితే  నాకు సరిగ్గా అనిపించట్లా ఓసారి ఆలోచించుకో” అన్నాను. చివరి ప్రయత్నంగా “అలాగే చెబుతావు  బాబు,  మీదంతా కడుపు నిండిన వ్యవహారాలు” అంటూ  కదిలాడు. వాడు అన్న మాటకి కోపం రాలేదు, ధర్మరావు మావయ్య మీద జాలి వేసింది. తాతగారి సమకాలికులు నాగభూషణం తాతగారి కొడుకే ధర్మారావు మావయ్య. 


ఎన్నిసార్లు నష్టాలు వచ్చినా  తనకు తెలిసిన వ్యవసాయాన్ని మాత్రం వదల్లేదు  ధర్మరావు మావయ్య. ఓసారి పక్కన వున్న వాళ్ళు, మరోసారి ప్రకృతి మార్చి మార్చి  మోసం చేశారు.


మంచితనాన్ని మైక్రోస్కోపులో మాత్రమే చూసే ఈ సమాజంలో ధర్మారావు మావయ్య ఒక అసమర్ధుడుగా ముద్రవేయ్యబడ్డారు . ఎదుటివాళ్ళ మాట నమ్మడటం ఆయన అలవాటు. మోసపోవడం పరిపాటి. సంపాదనే సమర్ధతకు కొలమానంగా ఉన్న ఈ రోజులలో, అందరూ ధర్మరావు మావయ్యను చేతకాని మనిషి లాగానే చూశారు. ఒక్క ఐదు నిముషాలు ఆయనతో గడిపితే చాలు, తన మంచితనం, అమాయకత్వంతో కూడిన మాటలు, కల్మషం లేని పలకరింపులతో ఎదుటి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. తన ఇంటికి  ఎవరైనా వస్తే ఆయన అతిధి మర్యాదలతో చేసే హడావిడి కొంతమందికి చాదస్తంగా అనిపిస్తుంది.

ఈ సందిగ్ధాలు, సందేహాలకు కారణం ఎవ్వరు? ఎవ్వరిని నిందించాలి? ఎవ్వరిని అభినందించాలి?

సాధించేది ఏమిటి? పోగొట్టుకొనేది ఎంత? 

ప్రేమించే మనసులు, ఆదరించే మనుషులు, అందివచ్చిన అవకాశాలను కాదని ఎదో సాధించాలని, ఎంతో సంపాదించాలని ఆశయాలు, ఆశలతో  అక్కడ పెరిగి, ఇక్కడ ఎదిగిన  మా తరం అందరికి ఈ మానసిక సంఘర్షణ ఓ శిక్ష లాంటిదే. 

చుట్టాల, చుట్టూ వున్నవాళ్ల పిల్లలు విదేశాలు వెళ్లారని తమ  పిల్లలను కూడా పంపించడానికి ఎంత ఖర్చు అయినా వెనకాడలేదు. 

విమానాశ్రయానికి కార్ పంపించారు నాన్న. 

ఇంటి  విషయం ఆలోచించి మానసికంగా, ప్రయాణం చేసి శారీరకంగా అలసిపోయిన నేను,  వెళ్లిన వెంటనే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాను. ఇంక అక్కడ ఎన్నో రోజులు గడిపానని బాధతో. 

ప్రొద్దున్నే లేచేసరికి నాన్న, నాకోసం  అన్నట్టు ఎదురుచూస్తున్నారు ”పెద్దబాబు, ఇంటి ప్రతిపాదన నీకు సమ్మతమే కదా? ఇష్టం లేకపోతే చెప్పు,ఇప్పటికైనా అతనికి వద్దు అని చెబుదాం” అన్నారు 

“అదేమి లేదు నాన్న, మీరు చెప్పినట్టే కానిఇచ్చేయండి” అన్నాను, కొంచెం ముభావంగా అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ. “అయితే సాయంకాలం అతను డాక్యూమెంట్స్, నగదుతో వస్తాడు ఈ రోజు ముహూర్తం చాలా  బాగుంది” అన్నారు నాన్న. 


కాలకృత్యాలు తీర్చుకొని అలా బయటకు వెళ్ళాను. ఊరు చాలా మారిపోయింది. అద్దె సైకిల్ ఇచ్చే ఆంటోనీ కొట్టు లేదు. బాజీ సోడా షాప్ స్థానంలో “ఫాస్ట్ ఫుడ్ సెంటర్” వచ్చింది. బుచ్చిబాబు మెడికల్ స్టోర్ కనపడలేదు. వేదరాజ్, రామమహల్, థియేటర్లు షాపింగ్ కాంప్లెక్స్ గా  రూపాంతరం చెందాయి. 

“బాబు, బాగున్నారా? ఊరులోకి ఎప్పుడు వచ్చారు” అని పలకరించాడు  ఎదురుగా రిక్షా తొక్కుకుంటూ వస్తున్న వ్యక్తి. “నువ్వా, ఎలావున్నావు ఇస్మాయిల్ . నన్ను గుర్తుపట్టావా” అని ఆశ్చర్యంగా అడిగాను

”అదేమిటీ బాబు, ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని  స్కూలుకి  ఇదే రిక్షాలో తీసుకువెళ్లాను. ఎలా 

మరచిపోతాను బాబు రండి ఎక్కండి ఇంటి దగ్గర దింపుతాను” అన్నాడు  సీట్ సరిచేస్తూ. “మీ అబ్బాయి ఏమి చేస్తున్నాడు” అని అడిగేతే “వాడు కూడా కొత్త బస్టాండ్ దగ్గరలో రిక్షా తోలుతున్నాడు. చదువుకోరా అని నెత్తినోరు బాదుకున్న విని చావలేదు వెధవ గున్న. నాతో రిక్షా తొక్కిన పైడినాయుడు గాడి కొడుకు చక్కగా చదువుకొని పెద్ద ఉద్యోగంలో చేరాడు” అన్నాడు దీనంగా. “బాబు, మీరు ఉండే దేశంలో రిక్షాలు గట్రా ఉంటాయా?” అని అడిగాడు. “ లేదు, అక్కడ ఆటోలే వుండవు” అనడంతో “ఏమి లేదు బాబు, అవకాశం ఉంటే,  మావాడిని అక్కడికి తీసుకువెళ్ళడానికి ఏదియైన  సహాయం చేస్తారేమోనని” అన్నాడు అమాయకంగా. 

“లేదు ఇస్మాయిల్, అక్కడికి రావాలంటే ఇప్పుడు వున్న పరిస్థితిలో చాలా కష్టం” అనే లోపలే ఇల్లు రావడంతో దిగి ఐదు వందల నోట్ బలవంతంగా తన జోబులో పెట్టాను.  

లోపలికి వస్తూవుంటే అమ్మ “పెద్దబాబు, నువ్వు వచ్చావని తెలిసి జోగులూ వచ్చాడు” అంది నవ్వుతూ. చిన్నప్పుడు స్కూల్ యూనిఫారంలు ఇస్త్రికి తీసుకువెళ్లి ఎప్పుడు ఆలస్యంగా తెచ్చే “ఇస్త్రీ జోగులు” గుర్తుకు వచ్చాడు.”ఎలా వున్నావు? కన్నకమ్మ ఏమిచేస్తుంది?“ అని అడిగాను కుర్చీలో కూర్చుంటూ. ” ఇంకెక్కడ కనకమ్మ బాబు, పోయినేడు కరోనా దానిని తీసుకు పోయింది. 

ఉన్న ఒక్క కొడుకు తాగుడికి బానిస అయ్యి తన ఏడాది కూతురిని మా చేతిలో పెట్టి పోయాడు. అప్పటినుంచి తనకి అన్ని మేముఅయ్యి పెంచాం. ముసలిది పోతే  నా మనవరాలికి చివరిచూపు కూడా దక్కలేదు.” అన్నాడు వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ. అమ్మ ఓదార్పుగా “భాధ పడకు జోగులు, ఆ దిక్కుమాలిన రోగం ఎవరిని వదిలిపెట్టలేదు” అంది. “మనవరాలు కష్టపడి చదివి సింగపూర్ లో పిల్లాపాపలతో సుఖంగా ఉంది. ఆ రోజులల్లో  తాతగారు దాని చదువు కోసం బొల్లుడు సాయం చేశారు. పరాయి మతంవాడిని ఎవ్వరినో ప్రేమించాను అని పంచాయతీ పెడితే ఆ మహానుభావుడే అబ్బాయివాళ్ళతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించారు. అయన చేసిన పుణ్యాలు మిమ్ములను ఎప్పుడు కాపాడతానే ఉంటాయి బాబు,  మీ అబ్బాయిగారిని చూస్తూఉంటే ఆచ్చు తాతగారిని చూసినట్టే వుంది. చిన్న కోరిక బాబు, 

ఓ సారి మీ పిల్లల బట్టలు ఇవ్వండి ఇస్త్రీ చేసి తీసుకువస్తా. ఆలా చేస్తే మీ కుటుంబం లో నాల్గో తరానికి కూడా సేవ చేసినట్టు అవుతుంది” అన్నాడు ఎంతో విశ్వాసంగా “అయితే రేపు వచ్చి తీసుకువెళ్ళు జోగులు, మేము రెండు వారాలే ఉంటాం, ఈ లోపలే తీసుకువచ్చేయ్, నా చిన్నప్పుడు చేసినట్టు ఆలస్యం చెయ్యమకే” అన్నాను నవ్వుతూ. 

వెళుతున్న జోగులును చూస్తూ ”చాలా ఆత్మభిమానం గల వ్యక్తి. మామయ్య గారి  దగ్గర తప్పితే ఎవరి నుంచి సాయం ఆశించే వాడు కాదు. ఎనభై ఏడూ ఏళ్ళు వచ్చిన ఈ రోజుకి ఇస్త్రీ చేసి సంపాదిస్తున్నాడు. మనవరాలు దగ్గర నుండి పైసా కూడా తీసుకోడు.”అంది అమ్మ. 

నలిగిన బట్టలు వేసుకున్న జోగులును చూస్తే  

జాలి వేసింది. రిక్షా తొక్కేవాడు  రిక్షా ఎక్కే స్థాయికి, ఇస్త్రీ చేసేవాడు ఇస్త్రీ బట్టలు వేసుకునే స్ధితికి  చేరుకోలేక పోతున్నారు. తప్పు ఎక్కడ వుంది? పొరపాటు ఎక్కడ జరుగుతుంది?  ఆలోచించే సమయం, తీరిక, ఓపిక నాతో సహా ఎవరికీ లేదు. 

మా జిల్లాకి వైద్య, విద్యా  కేంద్రంగా వుండే మా ఊర్లో, నాయనమ్మ, తాతగార్ల చుట్టాల  పిల్లలు ఎప్పుడూ  నలుగురైదుగురు  చదువుకోడానికి మా ఇంటి ముందు గదిలో వుండేవారు. అలా దరిదాపుల్లో పాతిక మంది పైన మన ఇంట్లో ఉండి డిగ్రీ పూర్తి చేశారని తాతగారు చెప్పినట్టు గుర్తు. బంధువులలో ఆర్ధిక స్తోమత లేని వాళ్లకు తాతగారు సంబంధాలు చూసి ఖాళీ స్థలంలో తన సొంత ఖర్చుతో పెళ్లిళ్లు చాలానే చేశారని చెప్పుకునే వారు. ఆ ఇల్లు ఎన్నో 

పెళ్లిచూపులకి, తాంబూలాల కార్యక్రమాలకి వేదిక. అలాగే వైద్యం నిమిత్తం మా ఊరు వచ్చే బంధువర్గానికి తాతగారు పూర్తి సహాయ సహకారాలు అందించేవారు. తాతగారు  చేసిన మంచి పనులకు అయన బ్రతికిన ఎనభై ఏళ్ళే కాకుండా ఓ నాలుగైదు  తరాల గుర్తు పెట్టుకునేటట్టు  మరో వందేళ్లు జీవిస్తారు. 

తాతగారి మాట అంటే మా బంధువర్గాలలో  తిరుగు ఉండేది కాదు. వ్యాపార భాగస్వాముల మధ్య ఆర్థిక లావాదేవీలలో గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తే తాతగారు సామరస్యంగా సమస్యకు పరిష్కారం చూపేవారు. అలాంటి  సంఘటన ఒకటి నాన్న అప్పుడపుడు  చెబుతుండేవారు. 

ఓసారి కొత్తగా పెళ్ళయినా ఓ జంట చిన్న మాట పట్టింపుతో గొడవ పెద్దది చేసుకొని ముందు పోలీస్ స్టేషనుకి  వెళ్లడమా లేక లాయర్ ను  కలవడమా  అనుకోని, చివరికి ఆ రెండు చోట్లు కాదనుకొని వాళ్ళ సంబంధం కుదిర్చిన తాతగారి దగ్గరికి వస్తే ఆయన వాళ్లతో మాట్లాడి పంపించారట. బయటకు వచ్చిన  ఆ జంట, సినిమాకు వెళ్లి మల్లెపూవులు క్కోనుకొని  ఇంటికి వెళదామా లేక హోటల్లో భోజనం చేసి మల్లెపూవులు క్కోనుకొని  ఇంటికి వెళ్ళాలా అనే సందిగ్ధంలో పడ్డారట. కొసమెరుపు, ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి యూస్ ల

అలా ఆ ఇంటి వంక చూస్తూవుంటే నాకు ఒక కళాశాల, ఒక కల్యాణ మండపం, ఒక ఆసుపత్రి, 

ఒక న్యాయస్థానo, అంతకు మించి ఒక శాంతికి నిలయంలా కనబడుతుంది . 

సాయంకాలం బిల్డర్ వచ్చి సంతకాల వ్యవహారం పూర్తి చేశారు. ఆ కార్యక్రమం అయిన  తర్వాత నా మనస్సు లో వున్న ఓ అభ్యర్ధనను బయట పెట్టాను. “శ్రీ శ్రీనివాస నిలయం”  స్థానం లో వచ్చే కట్టడానికి తాతగారి పేరు పెట్టాలనే ప్రతిపాదనకు అతను సంతోషంగా ఒప్పుకున్నారు. 

ఆరోజు రాత్రే నాన్న, తమ్ముడిని నన్ను కూర్చోబెట్టి 

ఆస్తి పంపకాలు చేసేశారు. 

త్వరలో నా  పాత జ్ఞాపకాలను సమాధులు చేసే  

కొత్త పునాదులతో పనులు మొదలవుతాయి. 

“శ్రీ శ్రీనివాస నిలయం” చోటులో వచ్చే ఆరేడు అంతస్థుల భవనాలు  నా ఆస్తుల సంఖ్య పెంచొచ్చు కానీ నా గుర్తులు కాదు.  

చరిత్రలో అందరి జీవితాలు, అన్ని సంఘటనలు, 

అన్ని  ప్రదేశాలకి చోటు దక్కకపోవచ్చు. వాటిని అనుభవించిన, ఆస్వాదించిన వాళ్ళ మనస్సులోనే  ఆ జ్ఞాపకాలు, అనుభూతుల, గుర్తులు పదిలంగ 

꧁🙏🙏

 **అమ్మకానికి ఓ అమ్మా* *నాన్న**

         నిజం. మీరు చదివినది సరిగ్గానే చదివారు. ఆశ్చర్య పోవలసిన విషయము లేదు. ఇది ఒక న్యూస్ పేపర్లో మొదటి పేజీలో ముద్రింప బడినది. ఈ వార్త ఒక కొడుకు తన తల్లి తండ్రిని పదివేల రూపాయలకు అమ్ము తాను.. కొనే వాళ్ళు ఎవరైనా కొనవచ్చును... నా తండ్రి  కీళ్ల వ్యాధి తో బాధపడు చున్నాడు. నా తల్లి కనీసం లేచి తన పనులు కూడా తాను చేసుకోవడానికి వీలు లేనంతగా జబ్బులతో ఉన్నది ఆమెకు అన్ని మంచం పైనే చేయాలి. ఎవరైనా వారిని కొన తలచు కుంటే ఈ క్రింది అడ్రస్ వారిని కలువ వలెను. పదివేల రూపాయలు ముందుగానే చెల్లించాలి. ఆ తర్వాతనే వారిని చూపబడును.... నచ్చలేదు అని వెళ్లడానికి వీలు లేదు. చూసిన తర్వాత కొని తీరాలి.... అని న్యూస్ పేపర్ లో ఒక వార్త. ఆది ఆ మహా నగరంలో పెద్ద కలకలం నేర్పిన వార్త. అది చదివిన వారు, ఒక్కొక్కరు ఒక్కో విమర్శన చేసిన వారే తప్ప ముందుకు వచ్చిన వారు లేరు. 

       రమేష్ ఒక చిన్న గుమాస్తా. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్  ఆస్తి పరుడు ఏమీ కాదు. ఈ వార్త చదివి, రమేష్ అతని భార్య రెండు రోజులు మదన పడి, తర్జనభర్జనలు చేసి, తెలిసిన వారందరి వద్ద, చే బదులుగా డబ్బు పుట్టించు కొని ఆ అడ్రస్సు ను వెతుకుతూ వెళ్ళారు. 

        ఆ అడ్రస్ ఆ నగరంలోనే ప్రసిద్దమైన ధనికులు ఉన్న ప్రాంతం. రాపిడో ఆటోలో వెళ్ళగా, ఆటో అతను ఆ ఇంటి ముందు....కాదు.. కాదు... ఆ ఇంద్ర భవనం ముందు ఆపాడు. రమేష్, అతని భార్య ఆ భవనాన్ని చూచి మొదట ఖంగు తిన్నారు. కానీ ఆ అమ్మే అతను అవుట్ హౌస్ లో అద్దెకు ఏమైనా ఉన్నాడేమో, లేకపోతే మాప్ తప్పు చూపదు కదా! అని దిగి అక్కడి గేటు లో ఉన్న వాచ్ మాన్ ను అడుగగా అతను అడ్రస్ ను నిర్ధారించి, వారు వచ్చిన కారణం అడిగి తెలుసుకుని, పది వేలు  వారి వద్ద తీసుకొని,  అమిత గౌరవంగా వారిని పిలుచు కొని ఆ భవనం లోనికి వెళ్ళ సాగాడు.

      రమేష్, అతని భార్య, పిల్లలు,  కలలో కూడా ఊహించని రాజ ప్రసాదం ఆ భవనం.  ఏమి జరుగుతూ ఉన్నదో ఏమో అర్థం కావడం లేదు, ఆ దంపతులకు. వాచ్ మాన్ వారిని అక్కడ సోఫాలో కూర్చో పెట్టి లోనికి వెళ్ళాడు. 

       వాచ్ మాన్ వెంట ఒక 70 సంవత్సరాల వృద్ధుడు అతి ఖరీదు అయిన దుస్తులతో, బంగారు చేతి కర్రతో హుందాగా, ఒక చేతిలో  డబ్బుతో వచ్చాడు. ఆ డబ్బు రమేష్ వాచ్ మాన్ కు ఇచ్చిన పదులు, ఇరవైలు, యాభైలు, వందల నోట్లు.  రమేష్, అతని భార్య అప్రయత్నంగా లేచి వినయంగా నమస్కరించారు.

      ఆయన రాగానే.... రమేష్ తడబడుతూ తాను వచ్చిన విషయం తెలిపాడు. 

       ఆయన రమేష్ దంపతులను, ముద్దులొలికే పిల్లలను ఆప్యాయంగా చూస్తున్నాడు. కళ్ళల్లో ధారగా కన్నీళ్లు ప్రవహిస్తోంది.వాచ్ మాన్ కు సైగ చేశారు. వాచ్ మాన్ తల వూపి లోనికి పోయి, రాజమాత లాంటి ఒక వృద్దురాలిని వీల్ చైర్ లో తీసుకొని వచ్చాడు. ఇంతలో ఆయన నాయనా! కుమారా! నీవు తెచ్చిన డబ్బు చూడంగానే నీ ఆర్థిక స్థితి తెలిసి పోయింది. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద బరువు, నీ భుజాలు పైకి ఎందుకు ఎత్త కొనతలచావు చెప్పు అని అడిగాడు.

       అందుకు రమేష్, సార్! నేను ఒక చిన్న గుమాస్తా ను. నాకు నెలకు పదివేల రూపాయలు సంపాదన. నేను ఎందుకు అమ్మకానికి ఉన్న తల్లి తండ్రిని కొనాలి అని అను అనుకొన్నాను అంటే నాకు, నా భార్యకు తల్లి తండ్రి లేరు. మేము ఇరువురు అనాథలు, తల్లి తండ్రి ప్రేమలు ఎరుగని వారము. ప్రపంచంలో అన్నీ దొరుకుతాయి. కొనవచ్చు. తల్లి తండ్రి దొరికితే చాలు, ఎలా ఉన్నా మాకు తల్లి తండ్రి అంటూ కావాలి. అని కలలుకనే వారం., ఒక పూట తిని మరో పూట పస్తులు ఉన్నా, ఆ తల్లి తండ్రి ఎలా ఉన్నా ఫర్వాలేదని వచ్చాము, మాకు వారిని చూపించు తారా! అని అడిగాడు.

        ఆ పెద్దాయన గొంతు సవరించుకొని, ఇలా చెప్పటం మొదలు పెట్టాడు. ఆయన గొంతు ఏదో పద్మశ్రీ అవార్డ్ పొందినంత సంతోషంగా ఉంది.

      నాయనా! రమేష్! ఈ ప్రకటన ఇచ్చినది నేనే. నాకు తల్లి తండ్రి లేరు అమ్మకానికి. 

నా పెళ్లి అయిన ఒక సం.ము  లోనే మానాన్న అమ్మా శాశ్వితంగా  మమ్ములను వదిలి పోయారు.

          నేను ఆర్థికంగా అంచెలంచెలు పెరిగి ఈ నాటికి వంద కోట్లు సంపాదించాను. కానీ నా ఒక్కగానొక్క కొడుకు, అమెరికాలో ఉంటూ వచ్చి పోతూ ఉండేవాడు. అలా గత సంవత్సరం వచ్చి వెళుతూ ఉండగా, విమానం సముద్రం లో కూలి పోయింది. వాడి శవం కూడా మాకు దక్క లేదు. విషయం తెలిసిన బంధువులు (రాబందులు) నా ఇంట్లో వాలి పోయారు. మా కోసం కాదు, ఈ ఆస్తి కోసం. ఆది నేను గ్రహించాను. నాతదనంతరం ఈ ఆస్తి వారికెవరికీ దక్కరాదు. ఒక ఉత్తముడు, దయా గుణం కలవాడు,, ప్రేమ అభిమానం తెలిసిన నీ లాంటి వాడికి దక్కాలని నేను ఈ ప్లాన్ వేసాను. 

        భగవంతుడు నా మొర విన్నాడు. నాపై దయతో మిమ్ములను పంపాడు. మీరివురు మా ఇద్దరికి కొడుకు, కోడలు  కా గలరా! మీ పిల్లలు ఇరువురికి నా ఆస్తి యావత్తూ వ్రాసి ఇస్తాను, మమ్మల్ని వారికి తాతా, నానమ్మ ను చేస్తారా? చెప్పండి అని అన్నారు.

     ఇంకొక మాట కూడా అన్నారు.   తల్లి తండ్రిని కొనడానికి మీరు ఇచ్చినది పది వేలు కాదు. వారిపై  మీరు  విలువ కట్టలేని ప్రేమ, ఆప్యాయత, సంఖ్యలలో చెప్పలేనన్ని మిలియన్ల రూపాయలు చెల్లించి నారు. దాని ముందు ఈ వంద కోట్ల రూపాయల ఆస్తి ఒక  ఆవగింజంత. జీవితంలో మేము ఇంతవరకు ఎన్నడూ పొలేని అనుబంధం, ఆప్యాయత, ప్రేమను పొంద పోతూ ఉన్నామని, పొంగి పొతున్నాము...అని అంటూ ఇరువురు ఈ ఇరువురిని తమ తమ  కౌగిలిలో బంధించి నారు.

*మాగాయ ఆవకాయ మధ్య గల భేదము ఏమిటని అడిగారు*. 

మహాత్ములు ఇలా చెప్పారు

 *మాగాయ:-*

భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ "తొక్కలే" అని వదిలించుకుని....

అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...

పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి... 

సిద్ధిని పొందిన ఋషిలా  ముక్కలు  ఎండి స్థిరత్వాన్ని పొందాక...

బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం  

నరుల పట్ల  కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా...

 బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని... 

అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా,  తను విడిచి వెళ్లిన ఊటలోకి మళ్ళీ తానే దూకి,

మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు

ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...

ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి   విశేషాలతో విరాజిల్లినట్లుగానే...

నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...

'మానవసేవే మాధవసేవ' అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ!

  *ఆవకాయ:-*

"సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా" అనుకునే వివాహితునిలా...తొక్క  టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,

"సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు" అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...

ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, నూనె, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని, 

బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు  నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా... 

తనతోపాటు  శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...

"నేను నేనుగానే ఉండి,   ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను"  అని....

చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ.

******

8-04-2026

No comments:

Post a Comment