తత్వ బోధ -
నయన మనోహర
కలువల అపరంజి మణి !
మనసును దోచే,
నవ నవోన్మష రక్తి స్వరూపిణి !
కోరికలు తీర్చి,
యశస్సును పెంచే, యసశ్విణి !
మనోధైర్యం,
తేజస్సును వృద్ధి పరిచే, తేజస్విణి !
ధర్మశాస్త్రములు తెలిపి,
ఆదు కొనే అంతర్వా ణి !
కొన్ని విషయాలు తెలిసుకోనుటకు,
సహాయపడే అన్వేషిణి !
మనసును మెప్పించిన,
వారి కోర్కెలు తీర్చిన, అభిలాషిణి !
అంతరాత్మను ప్రభోదించి,
అవసరమునకు సలహాఇచ్చె, ఆత్మజ్ఞాణి !
ఆస్తిని, అదాయమును,
పెంచి ఆహారమును అన్దిమ్చ్, అన్నప్రదాయిణి !
పురాణములు, వేదములు అనర్గాలముగా
వర్ణించి చెప్పే, అవృత్తిణి !
ఇంటిని, సభను, పిల్లలను,
హుందాగా తీర్చి దిద్దన, అస్థాణి !
కామాందులకు, దుర్మార్గులకు,
దుష్టులకు, చిక్కిన ఆహుతిణి !
పరిమళాలు వెదజల్లి,
మనస్సును ఉల్లాసపరిచే, ఇష్ట ఘంధిణి !
రౌద్రరసమును చూపి,
శత్రువుల గుండెలలో ఉండే, ఉగ్రరూపిణి !
మనో భిష్టమును నెరవేర్చి,
ఉచ్చాహమును పెంచే, ఉజ్వల రాణి !
తెలివితో తెలియనివి
తెలియపరిచే ఉపన్యాసిణి !
ఉపవాసములు ఉండి
ఉపాయములు తెలియపరిచే ఉపచారిణి !
భర్త దుర్వసనములు లోనైతే
వ్యసనములను మాన్పిమ్చే ఉపాధ్యాయిణి !
ఉరొభాధను భరించి ఉష్ణమును పెంచి
ఉన్మాదునికి ఊరట కలిగించే విలాసిణి !
బలము, ధెర్యము,
మనోనిగ్రహ శక్తి పెంచే తేజస్సుగల ఓజస్వి ణి !
అనారోగ్య భర్తను ఆరోగ్య్యవంతునిగా
మార్చుటకు శ్రమించే ఔషదణి !
నవనీత హృదయ వేణి ,
మంజుల మధుర వాణి !
* ప్రేమ (2012 lo vraasinadi)
ప్రేమను పొందటానికి
నిర్మలమైన మనస్సును పొందాలనేదె తొలి ప్రేమ !
అనుకున్నది సాధించుటకు
మురిపములు అందిమ్చి పొందే కపట ప్రేమ !
ఇతర్లు తమ ధర్మం పాటించకపోతే,
ధర్మమార్గంలో నడి పేందుకు ఆగ్రహిమ్చే ప్రేమ !
కల్లబొల్లి మాటలను నమ్మక
వాస్తవ దృష్టిని గ్రహించి పొందేది వాస్తవ ప్రేమ !
భార్య్య భర్తల మద్య ఉండేది, అందరూ
బాగుండాలని చెప్పేదే సృష్టి కర్త ప్రేమ !
ఆకర్షణకు లొంగి, విశ్వాసముతో ఏకంగా మారి
పెద్దలను ఎదిరించే ప్రేమ !
కన్నపిల్లలు తిట్టినా, కొట్టినా, చీద రించు కొన్న,
తప్పు పిల్లలది కాదని కన్నతల్లి ప్రేమ !
అందాలు వెదజల్లి, మనసును,
ధనమును దోచి, రోగమును పంచే కపట ప్రేమ !
84 లక్షల జీవరాసులలొ ప్రేమలేని ప్రాణి లేదు,
అన్నింటిలో ఉంటుంది ప్రేమ !
కొండగాలి విచే చోట, పూల పరిమళాలు
వెదజల్లే చోట ఉంటుంది ప్రేమ !
అలల తుంపర్లు వెదజల్లే చోట,
చిరుజల్లుల్లో తడిసిన ఉంటుంది ప్రేమ !
కిరణాలు విస్తరిమ్చినచోట, ఇంటిని చక్కగ్గా
అలంకరించిన చోట ఉంటుంది ప్రేమ !
మమతలు కలసి మనసైన చోట,
పేగు భంధం కలసిన చోట ఉంటుంది ప్రేమ !
ప్రేమించటము కన్న ప్రేమించ
బడటం అసలైన నిజమైన ప్రేమ.
--((*))--
*లీల
ప్రకృతి పరవశించే వేళ,
యువజంట తన్మయత్వం పొందే లీల !
పున్నమి వెన్నల వేళ,
పరవసించి పరువాలు పంచుకొనే లీల !
మల్లెపూల పరిమళాల వేళ,
కోరికలు సద్విని యొగంచేసికొనే లీల !
సూర్యో దయం శుభవేళ,
వ్యాయామము చేస్తే ఆరోగ్యం మార్పు లీల !
అమృతఘడియల వేళ,
ఆరాధ్య దైవాణ్ని ప్రార్ధిస్తే మనసుకు ప్రశాంతి లీల !
పరుల దోషము నెంచు వేళ,
నీచ గుణము లేకుండు లీల !
అదేపనిగా ప్రతి విషయంలో శుభవేళ,
మనుష్యుల మానత్వం గమనించే లీల !
దురభిమానము, ద్రోహము, మానె వేళ
మనస్సు ప్రశాంతత కల్పించే లీల !
ప్రతిఒక్కరిలొ అభిజనమదం,
విద్యామదం,ధనమదం లేకుండు లీల !
ఆనాడు పొందరు, ఈనాడు పొందు తున్నారు
శ్రీకృష్ణ పరమాత్ముని లీల.!
లీలను గురించి వర్ణించటం
నా తరము కాదు ఈ వేళ.!
--((*))__
* భాద
మనుష్యులు మర మనుష్యులుగా,
మార నవసరము లేదు !
మనుష్యులు ఎవ్వరికి బానిసలుగా,
బ్రతక నవసరము లేదు !
మన బ్రతుకు మరొకరికి ఇబ్బందిగా,
ఉండ నవసరము లేదు !
భాద పడవద్దు, బ్రతుకు
ఒక నరకము అనుకో వలదు !
ఇల్లాలు పంచే సుఖం, కష్టం
ఎనాటికి మరువ వలదు !
అవసరాలకు మించిన
ధనమున్న బాధే సుఖములేదు !
ఒక అభద్ధాన్ని నమ్మించటానికి
ప్రయత్నం చేసి భాద పడ వలదు !
భాద తెలుసుకోకుండా వ్య ర్ధముగా,
అతిగా మాట్లాడ వలదు !
సత్యం పలుకుతూఉండి ,
భాదలోకూడా అసత్యం పలకకూదదు !
భాదతో పరుగులు తీసే వాళ్లకు,
ప్రశాంతత ఉండదు !
ప్రేమలేని చోట, భాదవ్యక్తముచేసిన
ఫలితము ఉండదు !
కోపము వచ్చినవారికి,
ఎదుటివారి భాదపడుతారని తెలీదు !
భాదను భరించి తగిన మందు
తీసుకోని ఉండుట తెలీదు !
--((*))--
13. తెలుపు
కలువపూలు తెలుపు,
కమలములు తెలుపు,
కల్పవృక్షం తెలుపు !
కసేరుక తెలుపు,
కళానిధి తెలుపు,
కామ ధెనువు తెలుపు !
కనికరము తెలుపు,
కర్తవ్యం తెలుపు,
కర్పూరం తెలుపు, !
కళ దేతుం తెలుపు,
కళ త్రం తెలుపు,
కల్యాణం తెలుపు, !
కాదమ్బరీ తెలుపు,
కామేశ్వరీ తెలుపు,
కారుణ్యం తెలుపు, !
కళ్ళు తెలుపు,
కుతూహలమ్ తెలుపు,
కిరణం తెలుపు, !
అన్నం తెలుపు ,
అన్నపూర్ణ తెలుపు,
ఆనందం తెలుపు, !
ఉప్పు తెలుపు ,
ఉమ్మి తెలుపు ,
ఉషోదయం తెలుపు, !
మనసు తెలుపు
మమత తెలుపు
సుఖ బాధ తెలుపు
--((*))--
*వద్దు
వద్దు అనే మాట ఎప్పటికీ
ఎప్పుడు ఎవరితో అనవద్దు
అనువుకానిచోట అధికులమని,
సంబరపడవద్దు !
ఎవ్వరూ అబధ్ధపుమాటలు
మాటలు అనవద్దు, వినవద్దు !
అధరామృతము కోసం
హమేషా ఆరాట పడవద్దు !
మాట నమ్మి అగ్నిజ్వాలలు
కుటుంబములో రగిలించ వద్దు !
తప్పుచేస్తే అగ్ని హృదయాన్ని
దాహిస్తున్దని, మరువవద్దు !
అనా వృష్టి ఏర్పడినప్పుడు,
దుక్కి దున్న వద్దు !
కుటుంబములో అనుమానము
అనేది చొరబడ నీయ వద్దు !
గాది క్రింద పందికుక్కులు ఉన్న,
నీవు గగుర్పాటు పడవద్దు !
ప్రేమతో వెన్నలను చూపు ,
వెన్నముద్ దకోరుతాడనుకోవద్దు !
చిరుతలా తొందరపడి పరిగెత్తవద్దు,
ఎవిషయానికి కంగారు పడవద్దు !
అందరిలో మంచివాడని
అనిపించుకోవటం కద్దు !
దేశం నాకేమిచ్చింది అనవద్దు
దేశం కోసం నేను ఏమి చేయాలనేదే హద్దు
--((*))--
*. పత్స తోరణం
సూర్యుని ఒక్క ధర్మం తాపం,
జలము ఒక్క ధర్మం రసం !
అగ్ని ఒక్క ధర్మం దహనం,
జీవుని ఒక్క దర్మం ఆత్మజ్ఞానం !
కుటుంబములో సత్యం,న్యాయం,
ధర్మం, మార్గమే సంసారం !
మతములో ఉన్న సమస్త ధర్మాలకు
అందరం భద్దులం !
ఎక్కడ ధర్మం ఉంటుందో,
అక్కడ తేజస్సు విస్తారం !
ఎక్కడ తేజస్సు విస్తారంగా ఉంటుందో,
అక్కడ నిత్య భక్తి మయం !
ఎక్కడ భక్తి ఉంటుందో,
అక్కడ లక్ష్మి దేవి స్థిరనివాసం !
ఎక్కడ సత్సాంగత్యమ్ ఉంటుందో,
అక్కడ ఉత్తమ గుణాల సంగమం !
ఎక్కడ ఉత్తమ గుణం ఉంటుందో
అక్కడ భగవంతుని సాక్షాత్కారం !
ఎక్కడ భగవంతుని సాక్షాత్కారం ఉంటుందో,
అక్కడ ప్రతి ఒక్కరికి బ్రహ్మా జ్ఞానం !
ఎక్కడ బ్రహ్మా జ్ఞానం పంచ బడుతుందో,
అక్కడ నిత్య కళ్యాణం !
ఎక్కడ నిత్య కళ్యాణం ఉంటుందో,
అక్కడ పత్స తోరణం !
ప్రతి ఇంట నిత్య కళ్యాణం గా
(అంటే సుఖ శాంతులతో ) పత్స తోరణంగా ఉండాలనేదే
(అంటే సహాయ సహకారాలు అందిస్తూ
దేశ సేవకు సహకరిస్తూ ఉండాలనేదే )
ప్రతిఒక్కరు జీవించాలనేది
నిత్యకల్యాణం - పత్స తోరణం .
నందమూరి తారకరామారావుగారి 21 వర్ధంతి కి ప్రాంజలి ఘటిస్తూ శ్రద్ధాంజలి తెలియపరుస్తున్నాను
తెలుగును వెలుగుకు తెచ్చిన మహనీయుని ప్రతిఒక్కరు గుర్తు తెచ్చుకుంటూ ఆ మహా పురుషుడు నాటిన మొక్క ఫలాలను ప్రపంచ తెలుగు ప్రజలందరూ పంచుకుంటూ స్నేహ,ధర్మమార్గమున నడచి దేశ సేవకు సహకరించ గలరని నేనొక ఒకనాటి అభిమానిగా గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
తెలుగు తేజస్సు
ఆజానుబాహుడు,
సంస్కారవంతుడు, అందాల నటుడు !
దివ్యాంశ సంభూతుడు,
అందరికి వెలుగును చూపినవాడు !
అభిమానుల ఆరాధ్యుడు,
విశ్వ విఖ్యాత నటనాసార్వభౌముడు !
ఆరుకోట్ల ప్రజల హృదయాలను
దోచుకొన్న యుగ పురుషుడు !
నిరాడంబరత్వముతో
ప్రజలే దేవుళ్ళుగా నమ్మిన మహానటుడు !
బ్రహ్మ ముఖ ప్రజ్ఞావంతుడు,
నటనతో చరిత్ర సృష్టిమ్చిన వాడు !
తెలుగు ఆత్మగౌరవాన్ని
ప్రపంచదేశాల దాక విస్తరిమ్చినవాడు !
నాయకుడుగా, ప్రతినాయకుడుగా,
మనుషుల్లో దేవుడైనాడు !
తెలుగు తనం ఉట్టిపడిన
తేజస్సుగల నటనా కారణజన్ముడు !
నవరసాలు నటనా చాతుర్యంతో
అభిమానులకు నటనా ధీశుడు !
అభిమానుల హృదయములో
ఉన్న నందమూరి తారక రాముడు !
--((*))--
*. నాలోకం
దు:ఖాన్ని భరించి, అందరికి సుఖాన్ని
పంచి మంచి బోధిస్తూ ఉన్నాను !
దుఖిమ్చే వారిని ఒదార్చలేను,
సంతోషాన్ని అందరికి పంచుతాను !
సుర్యుడులా తిరుగలేను,
కొందరి భాదల విముక్తికోసం తిరుగుతాను !
చెంద్రుడిలా వెన్నల కురిపించలేను,
సంసారములో వెన్నలను నింపుతాను !
గాలి తాకిడికి ఎగిరే ఆకులా ఉంటాను,
భందాలకు చిక్కక పయనిస్తాను !
పరమపద సోపాన మవుతాను,
కష్టములు వచ్చినా కక్కి ఉంటాను !
విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రవహించే
నదిలా సమస్యలను పరిష్కరిస్తాను !
రోగానికి మందులా,హృదయానికి తగిలిన
గాయాన్నితొలగిమ్చుతాను !
నానిరంతర పయనము ఆపేవారెవరు,
నన్ను అర్ధంచేసుకోనేవారి కోసం నేను !
నావాగ్మయం ఏటో నాకే తెలియదు
బంధాలను బాగు చేయటమే జీవితమా
ఒక మనిషిగా స్వేశ్చ సుఖము
పంచి శాంతి పొందే హక్కు లేదా
ఒక బానిస బ్రతుకుగా ఉండటమే జీవితమా
మీరే మంటారు ? కర్మ సుకృతం అనకండి
సహన దేవత స్త్రీ అని గమనిస్తే చాలు
ఇది నిజమో అబద్దమో మిరే చెప్పండి ?
--((*))--
No comments:
Post a Comment